dangerous
-
హెచ్ఎంపీవీ వైరస్ అంత ప్రమాదకరమైనదేమీ కాదు
సుల్తాన్‌బజార్: హ్యూమన్ మెటాప్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) వైరస్ ఒక ఫ్లూ వంటిదని, సాధారణ నియమాలు పాటిస్తే తగ్గిపోతుందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్రనాయక్ పేర్కొన్నారు. ఈ వైరస్ చిన్నపాటి లక్షణాలతో వచ్చే వైరస్ అన్నారు. దానిని నియంత్రిస్తే ఎలాంటి ప్రమాదం లేదన్నారు. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపే ఒక రకమైన వైరస్ అన్నారు. హెచ్ఎంపీవీని మొదట 2001లోనే గుర్తించారని, ఇదేమీ కొత్త వైరస్ కాదన్నారు. అధిక జనాభా ఉన్న ప్రాంతాలలో ఇది సోకుతుందని.. మన రాష్ట్రంలో ఈ లక్షణాలు ఏమీ లేవన్నారు. హెచ్ఎంటీవీ లక్షణాలు తేలికపాటి జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల వరకు ఉంటాయని రవీంద్ర నాయక్ పేర్కొన్నారు. జ్వరం, దగ్గు, ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, శ్వాసలో ఇబ్బందుల్లాంటి సాధారణ లక్షణాలు ఉంటాయని ఆయన వివరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. హెచ్ఎంపీవీని గుర్తించడానికి పీసీఆర్ పరీక్ష, యాంటిజెన్ డిటెక్షన్, సిరాలజికల్ పరీక్షలు చేయవచ్చన్నారు. దీని నివారణ కోసం తరచుగా చేతులు కడుక్కోవడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలును ఉపయోగించడం, అస్వస్థతగా ఉన్న వారి నుంచి దూరంగా ఉండడం లాంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ కాలంలో అన్ని వసతులు సౌకర్యాలతో సమర్థంగా ఉందన్నారు. ఈ వ్యాధి అంత ప్రమాదకరమైనది కాదని, చలికాలంలో వచ్చే చిన్నపాటి ప్లూగా ఉంటుందని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దని రవీంద్ర నాయక్ సూచించారు. -
మరి చైనా వైరస్ సార్!
-
ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్లు.. కరోనాకు ముందే..
చైనాలో పుట్టిన హ్యూమన్ మెటా నిమో వైరస్(హెచ్ఎంపీవీ) ఇప్పుడు భారత్‌ను తాకింది. కరోనాను మరచిపోకముందే హెచ్ఎంపీవీ కేసులు భారత్‌లో నమోదవుతుండటంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వైరస్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ వైరస్‌కు ముందే ప్రపంచంలో ఎన్నోవైరస్‌లు ఉన్నాయి. అవి వివిధ కాలాల్లో జనాలను వణికించాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు ఆ వైరస్ల కట్టడికి పలు చర్యలు చేపట్టాయి.ప్రపంచంలో దాదాపు 3 లక్షల 20 వేల రకాల వైరస్‌లున్నాయి. ఈ వైరస్లలో అత్యంత ప్రమాదకరమైనవి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కరోనా వైరస్ కంటే ముందు ఏఏ వైరస్లు ప్రపంచాన్ని వణికించాయనే విషయానికొస్తే..రోటా వైరస్రోటా వైరస్‌ను చైల్డ్ కిల్లర్ వైరస్(Child killer virus) అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పిల్లల ప్రాణాలను హరిస్తోంది. ఇది నవజాత శిశువులు, 6 నుండి 8 ఏళ్ల వయసు గల పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.స్మాల్ పాక్స్దీనిని మశూచి అని అంటారు. ప్రపంచంలోని ఇతర వైరస్‌లకు మించి 30 నుండి 50 కోట్ల మంది మరణాలకు ఇది కారణంగా నిలిచింది. ఈ వైరస్ పునరుత్పత్తి సంఖ్య 3.5 నుండి 6 మధ్య ఉంటుంది. అంటే ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి మూడు నుంచి ఆరుగురికి తిరిగి వైరస్ సోకుతుంది. ఈ వైరస్ మరణాల రేటు(Mortality rate) 90 శాతం. అయితే టీకా ద్వారా, ఈ వైరస్‌ను సమూలంగా నిర్మూలించారు.తట్టుదీనిని మీజిల్స్ అని కూడా అంటారు. ఇది గత 150 ఏళ్లలో దాదాపు 20 కోట్ల మంది ప్రాణాలను బలిగొంది. గతంలో ఈ వ్యాధి ప్రతి ఏటా సుమారు 2 లక్షల మందిని బలితీసుకుంది. అయితే ఈ వైరస్‌ను వ్యాక్సినేషన్ ద్వారా నియంత్రించారు. మీజిల్స్ వైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి ఈ వైరస్ 18 మందికి సోకే అవకాశముంది.డెంగ్యూదోమల వల్ల డెంగ్యూ వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను ప్రపంచంలోని 110 దేశాలలో కనుగొన్నారు. ఇది ప్రతి సంవత్సరం సుమారు 10 కోట్ల మందికి సోకుతోంది. వారిలో 20 వేల మంది మరణిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతుంటారు.ఎల్లో ఫీవర్(Yellow fever)ఈ వైరస్ సోకిన బాధితుడు తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. బాధితుని ముక్కు, కళ్ళు, నోటి నుంచి రక్తస్రావం జరుగుతుంది. ఈ స్థితికి చేరుకున్న రోగులలో 50 శాతం మంది 7 నుండి 10 రోజుల్లో ప్రాణాలు కోల్పోతారు. ఇప్పటి వరకూ ఎల్లోఫీవర్ ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మందికి సోకింది. ఈ వైరస్ కారణంగా 30 వేల మంది మృతిచెందారు.ఫ్లూ (ఇన్ఫ్లుఎంజా)ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ఫ్లూ కారణంగా మరణిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన స్పానిష్ ఫ్లూ 10 కోట్ల మందిని బలితీసుకుంది.రేబిస్పురాతన కాలం నుండి రాబిస్‌ను ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణిస్తున్నారు. గబ్బిలం లేదా కుక్క కాటు వల్ల రేబిస్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది మరణిస్తున్నారు. రేబిస్ మరణాలు ఎక్కువగా ఆఫ్రికా, ఆగ్నేయాసియాలలో సంభవిస్తున్నాయి.హెపటైటిస్-బీ అండ్ సీహెపటైటిస్ బీ వల్ల ఏటా 7 లక్షల మంది మృతిచెందుతున్నారు. ప్రస్తుతం ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఒకటిగా నిలిచింది. ఈ వైరస్ తొలుత శరీరంలోని కాలేయంపై దాడి చేస్తుంది. దీనికి తగిన చికిత్స అందుబాటులో లేదు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది హెపటైటిస్ సీ కారణంగా మరణిస్తున్నారు.ఎబోలా- మార్బర్గ్ వైరస్ఎబోలా- మార్బర్గ్ వైరస్లు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లుగా గుర్తించారు. ఈ వైరస్ల నియంత్రణకు ఇంకా చికిత్స గానీ, వ్యాక్సిన్‌ను గానీ అభివృద్ధి చేయలేదు. అయితే ఈ వైరస్ల మరణాల రేటు 90 శాతం వరకు ఉంది. ఈ రెండు వైరస్ల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. వీటి బారిన పడిన బాధితుడు రక్తస్రావ జ్వరం, అవయవ వైఫల్యం లాంటి సమస్యలను ఎదుర్కొంటాడు.హెచ్ఐవీ, ఎయిడ్స్నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది హెచ్ఐవి వైరస్‌తో బాధపడుతున్నారు. ఒక అంచనా ప్రకారం గత 30 ఏళ్లలో ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మంది ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2.5 కోట్ల మంది ఎయిడ్స్ కారణంగా మృతిచెందారు.ఇది కూడా చదవండి: ‘చొరబాట్ల’కు మూడు రూట్లు.. వివిధ రేట్లు.. ఏజెంట్ల మాయాజాలం ఇదే -
ప్రపంచ విషపూరిత నదుల్లో 23వ స్థానంలో మూసీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ విషపూరిత నదుల్లో హైదరాబాద్‌లోని మూసీ 23వ స్థానంలో ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మూసీ చుట్టుపక్కల ఉన్న బోర్ వాటర్ కూడా కలుíÙతమైందని, అందుకే దాని పక్కన ఉన్న ప్రజలను తరలించాలని ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. సోమవారం గాం«దీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూసీ పక్కన ఉంటున్న వాళ్ల శరీరంలో హెవీ మెటల్స్ ఉన్నట్లు తేలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పక్కన తాను నివాసం ఉన్నానని, ఆ బాధలు ఏంటో తనకు తెలుసునని స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పా? అని ప్రశ్నించారు. మూసీ, హైడ్రాపై కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ చేయలేని పనిని సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారన్నారు. కేటీఆర్ ఫామ్‌హౌస్ కట్టుకొని హాయిగా ఉండొచ్చునని, ఇటలీ నుంచి వచ్చే నీళ్లు కేటీఆర్ తాగుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు శనిలాగా దాపురించారని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. -
రీల్స్ పిచ్చి.. బావి అంచున కూర్చొని పిల్లాడితో మహిళ వేషాలు
యువతతోపాటు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో రీల్స్పిచ్చి రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో పాపులర్ కావాలని వింత చేష్టలతో రెచ్చిపోతున్నారు. అడ్డదిడ్డమైన ప్రయత్నాలు చేసి ప్రాణాలను సైతం ప్రమాదంలో నెట్టేస్తున్నారు. తాజాగా ఓ మహిళ సైతం రీల్స్ కోసం తన ప్రాణాలే కాకుండా తన బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టింది.బావి అంచున ప్రమాదకరంగా కూర్చొన్న మహిళ.. ఒక చేతితో పిల్లాడిని పట్టుకొని రీల్ చేసింది. పాటకు అనుగుణంగా డ్యాన్స్ కదలికల కోసం బాలుడిని నిర్లక్ష్యంగా పలుమార్లు చేతులు మార్చింది. బావిలోకి ప్రమాదకరంగా వేలాడిన ఆ బాలుడు ఆమెను గట్టిగా పట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. అతడి శరీరం బావి పైన గాలిలో వేలాడుతూ ఉంది.ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. పిల్లవాడి రిస్క్ గురించి పట్టించుకోని ఆ మహిళ రీల్ పిచ్చిపై నెటిజన్లు మండిపడున్నారు. పిల్లవాడి గురించి పట్టించుకోని ఆమె రీల్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీల్ వ్యామోహంలో బాలుడి ప్రాణాలను పణంగా పెట్టిందని ఆరోపించారు.Family court in custody case: Only mother can love child more. Even more than father.Le mother:#ParentalAlienation pic.twitter.com/mc1kl5ziFj— Raw and Real Man (@RawAndRealMan) September 18, 2024 -
వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్‌కు మించి బ్యాక్టీరియా
వంట చేయడం ఒక ఎత్తయితే...అంట్ల గిన్నెలను తోమడం, కడగడం అంతకు రెండింతలు. శుభ్రంగా తోమాలి. ఎలాంటి మరకలు లేకుండా కడగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఆరోగ్యానికి చేటే. మన ఇంటిల్లు ఎంత శుభ్రంగా ఉంటే మన ఇంటికి, ఒంటికీ అంత మంచిది. కానీ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే వంట గిన్నెల్ని శుభ్రం చేసే స్క్రబ్బర్, స్పాంజ్‌ల కారణంగా ప్రాణాంతక వ్యాధులు సోకవచ్చని తాజా పరిశోధనలో తేలింది. ప్రస్తుతం కాలంలో వంట పాత్రల్ని శుభ్రం చేసేందుకు ఎక్కువగా స్టీల్ స్క్రబ్బర్‌ని, లేదా స్పాంజ్‌ని వాడుతూ ఉంటాం కదా. ఈ డిష్ స్క్రబ్బింగ్ స్పాంజ్ హానికరమైన బాక్టీరియాకు హాట్‌స్పాట్ అంటే నమ్ముతారా? ఇది టాయిలెట్ బౌల్ కంటే ఎక్కువ ప్రమాదాలను కలిగిస్తుందని తాజా స్టడీ తేల్చింది. కిచెన్ స్పాంజ్లు ఎందుకు ప్రమాదకరం?డ్యూక్ యూనివర్శిటీకి చెందిన బయోమెడికల్ ఇంజనీర్లు స్పాంజ్లు తేమతో కూడిన నిర్మాణం కారణంగా సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని అందిస్తాయని ధృవీకరించారు. ఒక చిన్న క్యూబిక్ సెంటీమీటర్ స్క్రబ్బర్లో 54 బిలియన్ల బ్యాక్టీరియా ఉంటుంది. 5 శాతం వరకు సాల్మొనెల్లాను కలిగి ఉండవచ్చు. దీంతో తేలికపాటి గ్యాస్ట్రోఎంటెరిటిస్ మాత్రమే కాకుండా మెనింజైటిస్, న్యుమోనియా, అధిక జ్వరాలు, బ్లడీ డయేరియా, ప్రాణాంతక బ్లడ్ పాయిజిన్లాంటి తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఉన్నాయి. ఫుడ్ పాయిజనింగ్తో ఆహార సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. వీటికి చికిత్స చేయకపోతే ప్రాణాంతక సమస్యలు వస్తాయి. అంతేకాదు అందులో ఉండే రకరకాల బ్యాక్టీరియాలతో కిడ్నీ సంబంధిత సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఈ స్పాంజ్‌లలో వృద్ధి చెందే ఈ-కొలి కారణంగా మూత్రపిండ వైఫల్య ప్రమాదం కూడా ఉంది. దీన్నే హిమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ అంటారు. ఇది ఆహార కాలుష్యం వల్ల వస్తుంది. స్టెఫిలోకాకస్ అనేది స్పాంజ్‌లలో కనిపించే మరొక వ్యాధికారకం. చర్మ వ్యాధులకు, ఇంపెటిగో, సెల్యులైటిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు కారణమవుతుంది. పరిష్కారం ఏమిటి? ఏం చేయాలి. పాత్రలను శుభ్రం చేసే స్పాంజ్లు,స్క్రబ్బర్లు తరచుగా మారుస్తూ ఉండాలి. అలాగే ఏరోజుకారోజు శుభ్రంగా క్లీన్ చేయాలి. తడి లేకుండా బాగా పిండేసి, తర్వాత వాటిని గాలిలో ఆరనివ్వాలి. మాంసం కంటైనర్లు, ఇతర పాత్రలు..ఇలా అన్నింటికి ఒకటే కాకుండా వేరు వేరువస్తువులను శుభ్రం చేయడానికి వేరు వేరు స్పాంజిని ఉపయోగించాలి. బాక్టీరియా ప్రమాదాన్ని నివారించేందుకు స్పాంజ్‌లను తడిపి రెండు నిమిషాలు మైక్రోవేవ్‌లో ఉంచాలి.డిష్ గ్లోవ్స్ ధరించడం వల్ల కలుషితమైన స్పాంజ్లతో వచ్చే చర్మ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించు కోవచ్చు. స్పాంజ్లకు ప్రత్యామ్నాయాలుప్లాస్టిక్ స్పాంజ్‌లను తరచుగా వాడి పారేయడం పర్యావరణ అనుకూలమైనది కాదు, కాబట్టి సెల్యులోజ్ ఆధారిత స్పాంజ్ లాంటి ప్రత్యామ్నాయాలుఎంచుకోవాలని పరిశోధకులు సూచించారు. స్పాంజ్‌లను ఉపయోగించడంలో అసౌకర్యంగా ఉన్నవారు, స్క్రబ్ బ్రష్‌లు, సిలికాన్ బ్రష్‌లు, సింగిల్ యూజ్ మెటల్ స్క్రబ్బీలు, డిష్వాషర్లు లాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలింటున్నారు. -
ప్రమాదకరంగా మారనున్న జలపాతాలు
ఉత్తరాఖండ్... దేశంలోనే అత్యంత అందమైన రాష్ట్రంగా పేరొందింది. ఇక్కడి ప్రకృతి రమణీయత ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకుల మదిని పులకింపజేస్తాయి. వేసవిలో ఇక్కడికి వచ్చి, జలపాతాల్లో జలకాలాటలు ఆడినవారు వర్షాకాలంలో వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రుతుపవనాలు ఉత్తరాఖండ్‌ను తాకాయి. వేసవిలో ఎండ వేడిమి నుండి తప్పించుకునేందుకు ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్, దాని పరిసర ప్రాంతాలకు వచ్చి, ఇక్కడి జలపాతాలలో స్నానం చేసినవారు ఇకపై ఈ జలపాతాలకు దూరంగా ఉండాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి.ఉత్తరాఖండ్‌లోని ధోకనే జలపాతం నైనిటాల్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వారు ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. అయితే వర్షాకాలంలో ఇక్కడ నీరు అత్యధిక స్థాయిలో జాలువారుతుంది. అలాంటప్పుడు ఇక్కడ స్నానం చేయకూడదు. ఒడ్డున కూర్చుని స్నానం చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.ఉడ్‌ల్యాండ్ జలపాతం నైనిటాల్-కలాధుంగి రోడ్డులో ఉంది. స్థానికులు దీనిని మిల్కీ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. వర్షాకాలంలో ఇక్కడ నీటి ప్రవాహం వేగంగా ఉంటుంది. ఈ జలపాతం ఒక వాలులో ఉన్నందున పర్యాటకులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జలపాతం కిందకు వెళ్లడం అత్యంత ప్రమాదకరమని స్థానికులు చెబుతుంటారు.జిమ్ కార్బెట్ జలపాతం కలదుంగి-రామ్‌నగర్ రహదారిలో ఉంది. ఈ జలపాతం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ స్నానం చేయడం నిషిద్ధం. వర్షాకాలంలో ఇక్కడ నీటి పరిమాణం మరింతగా పెరుగుతుంది. జలపాతం సమీపంలోకి వెళ్లడం ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.భాలుగాడ్ జలపాతం నైనిటాల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని అడవుల మధ్య అందమైన పర్వత మార్గాల్లో ట్రెక్కింగ్ ద్వారా ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. వేసవిలో ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఈ జలపాతం ఎంత అందంగా కనిపిస్తుందో అంతే ప్రమాదకరంగా మారుతుంది. వర్షాకాలంలో ఈ జలపాతంలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది. ఈ జలపాతంలో స్నానానికి దూరంగా ఉండటం ఉత్తమం.దట్టమైన అడవుల మధ్య హిడెన్ జలపాతం ఉంది. వేసవిలో ఇక్కడికి పర్యాటకులు తరలివస్తుంటారు. వర్షాకాలంలో ఈ జలపాతం అసాధారణ నీటిమట్టంతో ప్రమాదకరంగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు. అందుకే వర్షాకాలంలో ఇటువైపు రాకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. -
ఇదేంటో తెలుసా? దీనిని తాకితే.. ప్రాణాలకే?
చేపలను చాలామంది ఇష్టంగా తింటారు. అలాగని అన్ని చేపలూ తినడానికి పనికొచ్చేవి కాదు. చేపల్లో కొన్ని రకాలు విషపూరితమైనవి కూడా ఉంటాయి. ప్రపంచంలోని విషపూరితమైన చేపల్లోకెల్లా అత్యంత విషపూరితమైన చేప ‘స్టోన్‌ఫిష్’. ఇది ఎక్కువగా సముద్రం అడుగున ఉంటుంది. చూడటానికి అచ్చంగా రాయిలా కనిపిస్తుంది.సముద్రగర్భంలో డైవింగ్ చేసేవారికి తప్ప ఒడ్డున ఉన్నవారికి ఇది కనిపించడం చాలా అరుదు. డైవింగ్ చేసేవారు దీనిని చూస్తే చేప అనుకోరు. సముద్రం అడుగున ఉండే ఎన్నో రాళ్లలో ఇది కూడా ఒక రాయేనని పొరబడుతుంటారు. పొరపాటున దీనిపైన అడుగు వేసినా, తాకినా ప్రమాదం తప్పదు. స్కార్పియన్‌ఫిష్ జాతికి చెందినది ఈ స్టోన్‌ఫిష్.ఇది ఎక్కువగా భారత్, చైనా, ఫిలిప్పీన్స్, పాపువా న్యూగినీ, ఆస్ట్రేలియా పరిధిలోని సముద్ర జలాల్లో కనిపిస్తుంది. దీని కాటు అత్యంత విషపూరితమైనది. ఇది కాటు వేస్తే గంటల తరబడి నొప్పితో విలవిలలాడాల్సి వస్తుంది. దీని కాటుకు విరుగుడు మందు కూడా ఇంతవరకు లేదు. ఒక్కోసారి దీని కాటు మనుషుల ప్రాణాలు కూడా తీస్తుంది.ఈ సంగతి గురించి మీకు తెలుసా?‘మర్డర్’ అంటే హత్య అనే అర్థమే అందరికీ తెలుసు. అయితే, కాకుల గుంపును కూడా ‘మర్డర్’ అనే అంటారు.ఇవి చదవండి: ఇదేం చేప కాదు.. నీటిలో దిగితే దానికంటే తక్కువేం కాదు! -
ఐఫోన్ ఫింగర్ అంటే ఏంటీ? ఇది ప్రమాదకరమా..?
స్మార్ట్ ఫోన్ అడిక్షన్తో పలు సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పిల్లలను వాటికి అడిక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు కూడా. కానీ ఇప్పుడు ఏకంగా వాటి వాడకం వల్లే వేళ్ల సంబంధ సమస్యలొస్తున్నాయంటూ పలువురు ఊదరగొడుతున్నారు. నిపుణులు మాత్రం అది సాధారణ సమస్య అని కొట్టిపారేస్తున్నారు. ఈస్మార్ట్ ఫోన్లను అలా ఉపయోగిస్తేనే సమస్యలు వస్తాయంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు వైద్యులు. మరీ ఇంతకీ ఏంటీ ఐఫోన్ ఫింగర్..ఐఫోన్ ఫింగర్ అంటే..ఐఫోన్ ఫింగర్"ని "స్మార్ట్‌ఫోన్ పింకీ" అని కూడా అంటారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు పెద్దపెద్ద సైజుల్లో వస్తున్నాయి. వాటిని అరచేతిలో పట్టుకునేటప్పుడు ఫోన్ కింద చిటికెన వేలుతో నొక్కి పట్టుకోవడం సహజం. కానీ అలా గంటల తరబడి చిటికెన వేలు మీద భారం పడటం వల్ల, వేలు వంకరపోతోందని ఆందోళన చేస్తున్నారు కొందరూ. దీన్నే 'స్మార్ట్ ఫోన్ పింకీ' లేదా 'ఐఫోన్ ఫింగర్' అని అంటారు. ఈ ఆపిల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నప్పుడు భారం చిటికెన వేలుపై పడటంతో ఉంగరం వేలుకి దీనికి గ్యాప్ రావడం లేదా వంకరపోవడం వంటివి జరుగుతున్నాయని పలువురు టెక్ ఔత్సా హికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇది సాధారణ సమస్యే అని కొట్టిపారేస్తున్నారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌కి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పీటర్ ఎవాన్స్ చిటికెన వేళ్ల మధ్య గ్యాప్‌లు, వంకరపోవడానికి అదే కారణమని చెప్పలేమని అన్నారు. దీన్ని సాధారణ పింకీ అనాటమీ(చిటికెన వేలు సమస్య)గా చెబుతున్నారు. అలాగే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఏప్రిల్ హిబ్బెలర్, రోలినాకు చెందిన హ్యాండ్ సర్జన్ డాక్టర్లిద్దరు సదరు సర్జన్ డాక్టర్ ఎవాన్స్ మాటలతో ఏకీభవించారు. ఐఫోన్, స్మార్ట్ పోన్ల వల్లే ఇది వస్తుందని అధికారిక నిర్థారణ కాలేదని అన్నారు. కానీ వారంతా ఫోన్‌కు సంబంధించిన కొన్ని అనారోగ్య పరిస్థితుల గురించి హెచ్చరించారు. అవేంటంటే..ఫోన్ సంబంధిత వైద్య పరిస్థితులుస్మార్ట్ వాడకం వల్ల "స్మార్ట్‌ఫోన్ ఎల్బో" వస్తుందని అన్నారు. వైద్యపరంగా దీన్ని క్యూబిటల్ టన్నెల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. టక్స్ట్ టైప్ చేయడానికి ఎక్కువ వ్యవధిలో మోచేతిని 90 డిగ్రీలకు మించి వంచితే ఇది వస్తుందని వివరించారు. బహుశా ఇదే చిటికెన వేలుపై వస్తున్న మార్పులకు సంకేతాలు కూడా కాడొచ్చని అన్నారు. అందువల్లే నరాలు దెబ్బ తిని ఇలా చిటికెన వేలు వంకరపోవడం లేదా గ్యాప్ రావడం జరగుతుండవచ్చు అని అన్నారు. విపరీతంగా బొటనవేలుతో టెక్స్టింగ్ చేసేవాళ్లు మెడ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని స్మార్ట్ ఫోన్ వినియోగదారులను కోరారు. రోజంతా బొటనవేలుతో స్వైపింగ్, టైప్ చేయడం వంటివి చేస్తే ఈ సమస్యలు అధికమవుతాయని, పైగా అంతర్గతంగా ఆర్థరైటిస్ వంటి సమస్యలను తీవ్రతరం చేసి బొటనవేలు స్నాయువులలో కొత్త సమస్యలను కలిగిస్తుందని తెలిపారు. ఇక్కడ మనిషి తల బరువు కనీసం 10 నుంచి 12 పౌండ్లు వరకు ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ చూసేందుకు ఎప్పుడైతే తలను వంచుతామో అప్పుడు ఆ భారం అంతా మెడ కండరాలపై పడుతుంది. ఈ అదనపు ఒత్తిడి కండరాల నొప్పికి దారితీసి ఆర్థరైటీస్ వంటి సమస్యల్లో పెడుతుందని వివరించారు సర్జన్ ఎవాన్స్. (చదవండి: ఆశకు స్ఫూర్తి ఆమె'!..ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు నుంచి విమానం కూలినా..!) -
అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం ఏది?
కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో పలువురు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్లాన్ చేసుకుంటున్నారు. అందమైన పర్యాటక ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రకృతిని చూడాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం కూడా ఉంది. అయితే అది ఎక్కడ ఉంది? ఎందుకు ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉంది? అంటార్కిటికా ఖండం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతంగా పేరొందింది. దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ఈ ఖండంలో బలమైన మంచు గాలులు వీస్తాయి. అంటార్కిటికాలో దాదాపు రెండు కిలోమీటర్ల మందపాటి మంచు పలక విస్తరించి ఉంది. రక్తాన్ని గడ్డకట్టే చలి వాతావరణం ఉన్నప్పటికీ, ఈ ఖండంలో సందర్శించదగిన అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉండే ఏకైక ప్రదేశం అంటార్కిటికా. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం అనే రెండు సీజన్లు మాత్రమే ఉంటాయి. అంటార్కిటికా ఖండంలో వేసవి కాలంలో ఆరు నెలల పాటు పగటి వెలుతురు ఉంటుంది. అయితే చలికాలంలో ఆరు నెలల పాటు ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తుంది. అంటార్కిటికా ఖండంలోని ఎత్తైన శిఖరం పేరు విన్సన్ రేంజ్. దాదాపు 4,892 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శిఖరాన్ని విన్సన్ మాసిఫ్ అని కూడా పిలుస్తారు. పద్మశ్రీ డాక్టర్ అరుణిమ సిన్హా ఈ పర్వత శిఖరంపై భారత జెండాను ఎగురవేశారు. ఈ శిఖరం పర్వతారోహకులను అమితంగా ఆకర్షిస్తుంది. అంటార్కిటికాలో సౌత్ షెట్లాండ్ ద్వీపం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. సౌత్ షెట్లాండ్ దీవుల్లోని పరిశోధనా కేంద్రాలకు వివిధ దేశాల నుంచి పరిశోధకులు వస్తుంటారు. ఈ ఖండంలో డ్రేక్ పాసేజ్, ఫాక్లాండ్ దీవులు, దక్షిణ జార్జియా వంటి అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రయాణించడాన్ని పర్యాటకులు సాహసంగా పరిగణిస్తారు. అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడానికి వేసవి కాలం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. -
గ్రీన్ టీ మంచిదని తాగేస్తున్నారా?
ఇటీవల కాలంలో ఆరోగ్య స్ప్రుహ బాగా ఎక్కువయ్యంది. అందులో భాగంగా పాల ఉత్పత్తులకు సంబంధించిన కాఫీ, టీలను దూరంగ ఉంచుతున్నారు. మంచి ఫిట్నెస్ కోసం అని గ్రీన్ టీ, లెమన్ టీ వంటి వాటిని తెగ సేవించేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఇలా మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రమాదని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అదేంటీ గ్రీన్‌టీ చెడు కొలస్ట్రాల్‌ని కరిగించేస్తుంది కదా! మరీ ఇదేంటి అని సందేహిస్తున్నారా?. ఐతే ఇలా ఎందుకన్నారో సవివరంగా తెలుసుకోండి.! ఎదురయ్యే దుష్పలితాలు.. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా, అధికంగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే దీనిలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి, అవి వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఫలితంగా కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర దినచర్యకు అంతరాయం ఏర్పడి అది నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలకు దారితీయొచ్చు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్ నొప్పికి కారణమవుతుంది. గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలు కూడా పెరుగుతాయి. మితిమీరిన గ్రీన్ టీ మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల మీ రక్తపోటు కూడా తగ్గిపోతుంది రోజూ 6 కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం తగ్గిపోతుంది. ఇది కడుపులో ఎసిడిటీ సమస్యను పెంచి కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దారితీస్తుంది. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే. అనుసరించే ముందు వీ వ్యక్తిగత వైద్యులను సంప్రదించి పాటించటం ఉత్తమం. (చదవండి: ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా బాస్మతి రైస్!) -
Supreme Court Of India: బుజ్జగింపు రాజకీయాలకు దారి తీస్తుంది
న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు నిర్ణయించడం ప్రమాదకరమైన బుజ్జగింపు రాజకీయాలకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీలు, ఎస్టీల్లో ఉప వర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్రాలకు ఉంటుందా అనే అంశంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..అత్యంత వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ప్రయోజనాలను అందజేసే క్రమంలో రాష్ట్రాలు ఇతరులను వదిలేయరాదని తెలిపింది. ఎస్సీలు, ఎస్టీలు సజాతీయ సమూహాలు అయినందున వీరిలో వెనుకబడిన, బలహీన కులాలకు కోటా కోసం వారిని మళ్లీ వర్గీకరించలేమంటూ 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. -
Kerala CM Pinarayi Vijayan: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం
న్యూఢిల్లీ: కేంద్రం పెత్తందారీ పోకడలు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ కేరళలోని వామపక్ష కూటమి(ఎల్డీఎఫ్) గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టింది. కేంద్రం తీరుతో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సమస్యలతోపాటు, పరిపాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఇబ్బందికరంగా మారిందని విజయన్ చెప్పారు. రుణాలను, గ్రాంట్లను సరిగా ఇవ్వడం లేదన్నారు. తమది రాజకీయ పోరాటమెలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాలకు సమాన గౌరవాన్ని, న్యాయమైన వాటాను ఇవ్వాలన్న పోరాటానికి ఇది ఆరంభమని విజయన్‌తో పాటు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కార్యక్రమంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, రాజ్యసభ సభ్యుడు సిబల్, డీఎంకే నేతలు పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న అన్ని రకాల ఆర్థిక సమస్యలకు కేంద్రమే కారణమన్న ఎల్డీఎఫ్ వాదనను తాము అంగీకరించడం లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. -
‘బట్’ అనే మాట ఉంది చూశారూ.. బహు కంత్రీది.. కానీ!
మనిషి మనసులోని భావాలను తెలుసుకోవడానికి భాషే మార్గం. ఆ భాషను సక్రమంగా, తెలివిగా ఉపయోగించేవాళ్లు, ఉపయోగించగలిగేవాళ్లు ఉన్నత స్థానాలకు చేరతారు. ఉపయోగించలేని వాళ్లు మామూలు మనుషులుగా మిగిలిపోతారు. భాషలో కొన్ని వేల, లక్షల పదాలుంటాయి. వాటిలో ఒక ప్రమాదకరమైన పదం ‘కానీ’. అదేంటీ... ‘కానీ’ అనే పదం ఎలా ప్రమాదకరం? అనే డౌట్ మీకు రావచ్చు. ' ఇంట్రస్టింగ్ కథనం మీకోసం.... ‘‘కానీ’’ ఒక కంత్రీ పదం.../ మీరు తెలివైనవారు, కానీ... ♦ మీ డ్రెస్ బాగుంది, కానీ (but)... ♦ మీరు బాగా పాడుతున్నారు, కానీ (but)... ♦ మీ హెయిర్ స్టైల్ బాగుంది, కానీ (but)... ♦ ఒక ఫ్రెండ్ గా మీరంటే చాలా ఇష్టం... కానీ (but)... ♦ మీ సెన్స్ ఆఫ్ హ్యూమరంటే ఇష్టం.. కానీ (but)... ♦ చంపడం, చంపించడం తప్పే... కానీ (but)... ఇలా ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు మీరెలా ఫీలవుతారు? ఆ సమయంలో మీ మనసులో ఏమనిపిస్తుంది? ఈ విషయంపై మీరెప్పుడూ పెద్దగా ఆలోచించి ఉండరు. కానీ ఆ ‘కానీ’ అనే ఒక్క పదం ఆ వ్యక్తి ఇంటెన్షన్ ను పట్టిస్తుంది. అతను లేదా ఆమె నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పకనే చెప్పేస్తుంది. ‘కానీ’ ఒక లాండ్ మైన్... ‘కానీ’' అనే పదం ఒక లాంగ్వేజ్ ల్యాండ్ మైన్ లాంటిది. ఎందుకంటే... ఈ పదం దానికి ముందు ఉన్న వాక్యాన్ని తిరస్కరిస్తుంది. ఆ వాక్యంలో అతి ముఖ్యమైన విషయం ఆ తర్వాత వస్తుందనీ, దాన్ని అంగీకరించాలనీ చెప్తుంది. ఉదాహరణకు... ‘‘మీ డ్రెస్ బాగుంది, కానీ రెడ్ అయితే ఇంకా బాగుండేది..’’ అని ఎవరైనా చెప్పారంటే, మీ మనసు డ్రెస్ బాగుందనే విషయాన్ని తిరస్కరిస్తుంది, రెడ్ అయితే బాగుంటుందనే విషయాన్నే అంగీకరిస్తుంది. అంటే... మీ డ్రెస్ బాగుంది అని చెప్పడం అబద్ధమన్నమాట. ఆ మాట చెప్పలేక, బాగుందని చెప్పి, 'కానీ' అని సన్నాయి నొక్కులు నొక్కుతారన్నమాట. అలా తమకు కావాల్సిన, తమకు నచ్చిన అభిప్రాయాన్ని మీ మనసుపై రుద్దుతారన్నమాట. మీరు, మీ మనసు ఆ మోసాన్ని గ్రహించలేరు. అలా 'కానీ' అనే ఈ చిన్న పదం దుర్వినియోగమవుతుంది. ఎవరెలా వాడతారంటే... అనుభవజ్ఞులైన కార్పొరేట్ మేనేజర్లు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చినప్పటికీ, ఆపై 'కానీ' జోడించడం ద్వారా ప్రభావాన్ని దెబ్బతీస్తారు. ♦ మొత్తం మీద మీ పనితీరు బాగుంది, కానీ మీరు టైం పాటించాలి. ♦ మీరు ఆ ప్రాజెక్ట్ బాగా హేండిల్ చేశారు, కానీ కొంచెం స్పీడ్ పెంచాలి. కపుల్స్ తమ జీవిత భాగస్వాములను ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పి, ఆపై 'కానీ' అనడంతో మొత్తం నాశనం చేస్తారు. ♦ ఇలా నీతో ఉండటం చాలా బాగుంది, కానీ నువ్వు శుభ్రంగా కనిపించాలి. ♦ నువ్వన్నా, నీ మాటలన్నా నాకు చాలా ఇష్టం, కానీ చాలా ఎక్కువ మాట్లాడతావు. తల్లిదండ్రులు వారి 'BUTs' ను నిర్లక్ష్యంగా ఉపయోగించడం వల్ల పిల్లల్లో ప్రతికూల స్పందనల్ని ప్రేరేపిస్తారు. ♦ నీ చేతిరాత బాగుంది, కానీ ఇంకా మార్కులు రావాలి. ♦ నీ స్పెల్లింగ్ బాగుంది, కానీ చేతిరాత బాగోలేదు. ఇలా వారు మెచ్చుకుంటున్నా, ‘కానీ’ మొత్తం అర్థాన్ని మార్చేస్తుంది. మీ మనసు ఆ 'కానీ..' ముందు ఉన్న ప్రశంసను తిరస్కరించి, దాని తర్వాత ఉన్న నెగెటివ్ నే స్వీకరిస్తుంది. 'అయితే' అనే పదం కూడా దాదాపు ఇలాంటి ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తుంది. మరేం చెయ్యాలి? 'కానీ'ని 'అలాగే' అనే పదంతో భర్తీ చేయండి! ఇలా ఒక వారం రోజులు మీరు ప్రయత్నిస్తే... 'కానీ' బారినుంచి తప్పించుకోవచ్చు. ♦ ‘‘ఉద్యోగంలో మీ పనితీరు చాలా బాగుంది, కానీ మీరు టీమ్ తో కలిసిపోవాలని కోరుకుంటున్నాను...’’ అనే వాక్యానికి బదులుగా ‘‘ఉద్యోగంలో మీ పనితీరు చాలా బాగుంది, అలాగే మీరు టీమ్ తో కలిసిపోవాలని ఉండాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పండి. ♦ ‘‘మీరు చెప్పే చాలా విషయాలతో అంగీకరిస్తున్నాను, కానీ ఈ ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలించమని కోరుతున్నా’’ అని చెప్పడానికి బదులుగా ‘‘మీరు చెప్పే చాలా విషయాలతో అంగీకరిస్తున్నాను, అలాగే ఈ ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలించమని కోరుతున్నా’’ అని చెప్పండి. అయితే ఈ 'అలాగే' వాడకంతో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు దీన్ని ఎక్కువగా నొక్కిచెప్పినా, దానిని ఉపయోగించటానికి ముందు, తరువాత పాజ్ చేసినా, ఇది 'కానీ'లాంటి దుష్ప్రభావాన్నే చూపిస్తుంది. ‘కానీ’ ఉపయోగించాల్సిన పద్ధతి వాస్తవానికి, 'కానీ' అనే పదం ఎదుటి వ్యక్తి ఆలోచనను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటే దాన్ని ఉపయోగించడంలో తప్పేమీ లేదు. అందువల్ల నెగెటివ్ విషయం స్థానంలో పాజిటివ్ ప్రత్యామ్నాయాన్ని నొక్కి చెప్పేటప్పుడు ఉపయోగించండి. ఉదాహరణకు... ♦ ‘‘మనం ఈ ప్రాజెక్టులో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటున్నాము, కానీ మనం విజయం సాధించగలమని నాకు తెలుసు.’’ ♦ ‘‘మనం పూర్తిగా ఫెయిలయ్యాం, కానీ మన తప్పుల నుండి నేర్చుకొని ముందుకు సాగాలి.’’ ఇలా చెప్పినప్పుడు మనసు ఆ వాక్యాల్లోని మొదటి భాగాన్నిన తిరస్కరించి, ‘కానీ’ తర్వాతి భాగాన్ని స్వీకరిస్తుంది. మీరు చెప్పాలనుకున్నది నేరుగా వారి మనసును చేరుతుంది. కాబట్టి మీ 'కానీ' ఎక్కడుందో, ఎలా ఉపయోగిస్తున్నారో గమనించుకోండి. 'కానీ' ఉపయోగం గురించి బాగా తెలుసుకోవడం ద్వారా, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా, 'అలాగే' తో భర్తీ చేయడం ద్వారా మీరు కోరుకున్న ఫలితాలు సాధించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. -సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 -
చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే!
ప్రపంచంలో ఎక్కడైనా చాయ్ తాగాలంటే జేబులో డబ్బులుంటే సరిపోతుంది. చైనాలోని హువాషాన్ టీహౌస్‌లో చాయ్ తాగాలంటే మాత్రం జేబులో డబ్బులే కాదు, తగినంత గుండెధైర్యం, సాహసం కూడా ఉండాలి. ఎందుకంటే, ఇక్కడ చాయ్ తాగాలంటే, కొండ ఎక్కాల్సిందే! చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లో ఉన్న హువా పర్వతం మీదకు వెళ్లే దారి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కొండ దారుల్లో ఒకటిగా పేరుమోసింది. ఈ కొండ మీద ఉన్న హువాషాన్ ఆలయానికి అనుబంధంగా చాయ్ హోటల్ ఉంది. తావో మతస్థులకు ఇది పవిత్ర ఆలయం. భక్తితో పాటు ధైర్యసాహసాలు ఉన్న తావో మతస్థులు ఈ కొండపైకెక్కి, ఇక్కడ వేడి వేడి చాయ్ సేవించి, సేదదీరుతుంటారు. సముద్ర మట్టానికి 2,154 మీటర్ల ఎత్తున ఉన్న పర్వత శిఖరం మీద వెలసిన ఈ చాయ్ హోటల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న హోటల్‌గా ప్రసిద్ధి పొందింది. (చదవండి: దెయ్యాలు కట్టిన గుడి కాకన్మఠ్ టెంపుల్ !..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..!) -
13 అడుగుల గిరినాగు అలజడి
ఎస్.కోట పట్టణంలోని ఇండియన్ ఆయిల్ బంక్ సమీపంలో రాత్రి 7.30 గంటల సమయంలో సుమారు 13 అడుగుల పొడవు ఉన్న గిరినాగు హల్చల్ చేసింది. దీనిని స్థానికులు గుర్తించి స్నేక్‌క్యాచర్ వానపల్లి రామలింగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. ఆయన చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాటిపూడి రిజర్వాయర్ అటవీప్రాంతంలో పామును విడిచిపెడతానని స్నేక్‌క్యాచర్ తెలిపాడు. -
భూకంపం ఎన్ని రకాలు? ఏది అత్యంత ప్రమాదకరం?
మీకు తెలుసా? భూమిపై వేర్వేరు చోట్ల రోజూ కనీసం 55 భూకంపాలు సంభవిస్తూంటాయని! ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవమే. భూమి పొరల్లో నిత్యం జరిగే కదలికలు ఒక దశ దాటినప్పుడు పుట్టే భూకంపం విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణమవుతోంది. నేపాల్ శనివారం తెల్లవారుజామున 6.4 తీవ్రతతో ఏర్పడ్డ భూకంపం కూడా వందల మందిని బలితీసుకుంది. ఈ నేపధ్యంలో భూకంపం అంటే ఏమిటి? ఇవి ఎన్ని రకాలు? ఆసక్తికరమైన ఈ వివరాలు మీ కోసం... మన భూమి మొత్తం మూడు పొరలుగా ఉంటుందని..పై భాగాన్ని క్రస్ట్, రెండో పొరను మాంటెల్.. మధ్యభాగంలోని భాగాన్ని కోర్ అంటారని భౌగోళిక శాస్త్రం చెబుతుంది. క్రస్ట్ భాగానికి వస్తే.. ఇది జిగ్సా పజిల్ మాదిరిగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఈ ముక్కలనే మనం టెక్టానిక్ ప్లేట్లు అంటాం. పైగా ఈ ముక్కలు చాలా నెమ్మదిగా కదులుతూంటాయి కూడా. ఈ కదలికల కారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ టెక్టానిక్ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొంటూంటాయి. కొన్నిసార్లు ఒక ప్లే ఇంకోదాని కిందకు జరిగిపోతూంటాయి. ఈ క్రమంలో అక్కడ పేరుకుపోయిన ఒత్తిడి అకస్మాత్తుగా విడుదలైతే దాన్ని మనం భూకంపం అని పిలుస్తాం. స్థూలంగా ఈ భూకంపాలు నాలుగు రకాలు... భూమి పైపొరలు కదిలితే... భూమి పైపొర క్రస్ట్‌లోని టెక్టానిక్ ప్లేట్ల ఒరిపిడి కారణంగా వచ్చేవి ఇవి. ఈ పలకలు కదిలే సమయంలో కొన్నిసార్లు ఒకదానికిందకు ఒకటి వెళ్లిపోతాయి. లేదా దూరంగా జరుగుతాయి. ఇంకొన్నిసార్లు దగ్గరకు వస్తూంటాయి. ప్లేట్లు వేగంగా కదిలినప్పుడు ఒకదానితో ఒకటి ఢీకొని ప్రెషర్ విడుదలవుతుంది. అంటే భూకంపం వస్తుందన్నమాట. వీటిని టెక్టానిక్ భూకంపాలని పిలుస్తారు. భూకంపాలు చాలా వరకు ఈ రకమైనే. సాధారణ భూకంపాలు అని కూడా అంటారు. టెక్టోనిక్ ప్లేట్ల కదలిక ఎక్కువ వేగం ఉంటే వచ్చే భూకంపం క్షణాల్లో ఎంతటి నగరాన్నయినా ధ్వంసం చేస్తుంది. జనావాసాలు లేని, సముద్రాల్లో వచ్చే భూకంపాలతో నష్టం తక్కువ. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న చోట్ల వస్తే మాత్రం ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. అగ్నిపర్వత ప్రాంతాల్లో ఒత్తిడి తీవ్రమైతే... అగ్నిపర్వతాలకూ టెక్టానిక్ ప్లేట్లకూ మధ్య కొంత సంబంధం ఉంది. టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దుల వద్ద అంటే రెండు ప్లేట్లు కలుసుకునే చోట భూమి లోపలి పొరల్లో ఉండే లావా వంటి పదార్థం బయటకు వచ్చే మార్గాలీ అగ్ని పర్వతాలు. భూమ్మీద ఉన్న అత్యధిక శాతం అగ్ని పర్వతాలు ప్లేట్ల సరిహద్దుల్లోనే ఉన్నాయి. టెక్టానిక్ ప్లేట్లు కదులుతూ ఉంటాయని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా... ఆ కదలికల కారణంగా అగ్నిపర్వతాల దిగువన కూడా ఒత్తిడి, రాపిడి పెరిగిపోతుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు భూమి పై పొర (క్రస్ట్) చిరిగిపోయి లోపలి లావా, కరిగిన రాయి పైకి ఎగజిమ్ముతుంది. దాన్నే మనం అగ్నిపర్వత భూకంపం అని పిలుస్తాం. 18వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు భూకంపాలకు అగ్నిపర్వతాలు ప్రధాన కారణమని అనుకునేవారు. కానీ ఇది సరికాదని నిరూపించడానికి, శాస్త్రవేత్తలు ప్రయత్నించి అసలు విషయం తెలుసుకున్నారు. అగ్నిపర్వతం పేలినప్పుడు భూమి లోపలి భాగంలో శూన్యత ఏర్పడుతుందని, ఈ శూన్యతను పూరించడానికి, అంతర్గత శిలలు లోనికి జారుతాయని తెలిపారు. అప్పుడు భూకంపం ఏర్పడుతుందని తేల్చారు. అయితే సాంకేతిక అభివృద్ధి ఈ భావన నిరాధారమని నిరూపించింది. హిమాలయ ప్రాంతంలో గత వందేళ్లలో అగ్నిపర్వత విస్ఫోటన సంకేతాలు లేనప్పటికీ ఈ ప్రాంతంలో భూకంపాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇది అగ్ని పర్వతాల కారణంగా భూకంపాలు సంభవిస్తాయనే వాదనను తోసిపుచ్చింది. అయితే అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల సంభవించే భూకంప ప్రభావిత ప్రాంతం చాలా పరిమితంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు గమనించారు. కుప్పకూలినా... భూకంపమే! భూమిలోపలి నిర్మాణాలు (గుహలు, గనులు సొరంగాలు) కుప్పకూలినప్పుడు పుట్టే భూకంపాలు ఇవి. వీటి తీవ్రత తక్కువే. ప్రభావం కూడా తక్కువ ప్రాంతంలో కనిపిస్తుంది. కొలాప్స్ భూకంపాలు చాలా వరకూ మానవ చర్యల ఫలితంగానే వస్తూంటాయి. 2010లో కోపియాపో గనుల వద్ద, 2019లో రిడ్జ్‌క్రెస్ట్ (కాలిఫోర్నియా, అమెరికా) ఇలాంటి భూకంపాలు నమోదయ్యాయి. అణ్వస్త్ర, రసాయన ఆయుధాల పేలుళ్లు కూడా భూకంపాలకు కారణమవుతాయి. భారీ స్థాయి గని పేలుళ్లు కూడా! వీటిని పేలుళ్లకు సంబంధించిన భూకంపాలు ఇంగ్లీషులో చెప్పాలంటే ఎక్స్ప్లోషన్ ఎర్త్‌క్వేక్స్ అని పిలుస్తారు. వీటితో విధ్వంసం తక్కువ. కాకపోతే ప్రకపంపలు చాలా దూరం ప్రయాణించగలవు. 1945లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషిమాపై అణుబాంబు పడినప్పుడు, లెబనాన్‌లో 2020లో జరిగిన పేలుడు ఓ మోస్తరు స్థాయిలో భూకంపాలు పుట్టించాయి. ఇది కూడా చదవండి: నేపాల్‌లో భారీ భూకంపం.. 128 మంది మృతి -
భూమిపై అత్యంత విషపూరిత జంతువులు ఫోటో గ్యాలరీ
-
అడవిలో ఉండాల్సినవి.. ఇంట్లో పెంచుకుంటున్నారు
-
ఈ బుజ్జి పక్షులు ఎంత ప్రమాదకరమో తెలుసా..?
-
అయ్బాబోయ్... ఇదేం డాన్సండీ!
ఖాళీ గ్యాస్ సిలిండర్ అయినా సరే, నెత్తి మీద పెట్టుకోవడం కష్టం. అలాంటింది డ్యాన్స్ చేయాలాంటే ‘అయ్ బాబోయ్’ అంటాం. దుర్గ అనే ఈ మహిళ మాత్రం ‘అయామ్ ఓకే’ అంటూ నెత్తి మీద గ్యాస్‌బండ పెట్టుకొని చిన్న స్టీలు బిందె ఎక్కి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో 23 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘ఇలాంటి డేంజరస్ స్టంట్లు చేయవద్దు’ అంటూ నెటిజనులు ఆమెను హెచ్చరించారు. కొందరు మాత్రం ఆమె ‘బ్యాలెన్సింగ్ స్కిల్స్’కు భేష్ అన్నారు. ‘ఈ డేంజరస్ డ్యాన్స్‌ను పొరపాటున కూడా అనుకరించవద్దు’ అంటూ కొందరు హెచ్చరిక కామెంట్లు పెట్టారు. -
స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..
మంచి కండలు తిరిగే బాడీ కావాలని ఎవరికి ఉండుదు. యువకులు దీని గురించి జిమ్ సెంటర్లలో గంటల తరబడి నానా హైరానా పడుతుంటారు. కండలు తిరిగిన దేహదారుఢ్యం రావాలంటే టైం పడుతుంది. అందులో ఎలాంటి డౌంట్ లేదు. కానీ కొందరూ ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా కండల వంటి దేహం కోసం పక్కదారుల్లో ప్రయాణిస్తారు. అందుకోసం స్టెరాయిడ్స్‌ను వాడతారు. ముందు బాగానే ఉన్నా రానురాను దాని దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. సినితారలు దగ్గర నుంచి కాలేజ్ కుర్రాళ్ల వరకు కండలు తిరిగే దేహం కోసం స్టెరాయిడ్లు వాడి లేనిపోని అనారోగ్య సమస్యల బారిన పడిన ఉదంతాలు కోకొల్లలు. ఈ స్టెరాయిడ్స్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించే ఈ కథనం. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ సైతం తాను కూడా ఈ స్టెరాయిడ్లు వాడానని, ఏమాత్రం సంకోచించకుండా చెప్పడమే కాకుండా వాడొద్దని హెచ్చరిస్తున్నాడు. తాను 'జానే తు యా జానే' సినిమాలోని ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ దీని గురించి వివరించాడు. తాను సన్నగా ఉండటంతో అందరూ ఎగతాళి చేసేవారని, బాడీ బిల్డర్లాగా దేహాన్ని తయారుచేయమని ఒత్తిడి చేసేవారేని చెప్పుకొచ్చాడు. కానీ తాను ఎంత తిన్న.. సన్నగా కనబడే బాడీ తత్వం కారణంగా లావు అవ్వడం కష్టంగా ఉండేది. మొదట్లో ఎస్ సైజు దుస్తులే తనకు చాలా లూజ్‌గా ఉండేవని చెప్పుకొచ్చాడు. అంతేగాదు తన తొలి సినిమా జానే తులో సన్నగా కనిపంచకుండా ఉండటం కోసం రెండు షర్ట్లు వేసుకుని నటించినట్లు తెలిపాడు ఆ తర్వాత బాడీ పెంచడం కోసం స్టెరాయిడ్లు వాడి తన దుస్తుల సైజుని పెంచానని నిర్మొహమాటంగా చెప్పాడు. దీని వల్ల తాను చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను వాడటం లేదని, కేవలం సహజసిద్ధమైన వాల్నట్స్, పసుపు వంటి వాటినే తీసుకుంటున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపాడు. స్టెరాయిడ్స్ అంటే.. అనాబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్లు(ఏఏఎస్) లేదా కండరాలను పెంచడానికి ఉపయోగించే టెస్టోస్టెరాన్ సింథటిక్ రూపం. నిపుణుల అభిప్రాయం ప్రకారం..స్టెరాయిడ్స్ శరీరంలోని కండరాలు, వెంట్రుకలు, కుదుళ్లు, ఎముకలు, కాలేయం,మూత్రపిండాలు వంటి వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి. మగవాళ్లలో ఉండే హార్మోన్ అయినా ఇది మహిళల్లో కూడా 15-70 ఎన్జీ/డీఎల్ వరకు ఉంటాయి. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. ఎదురయ్యే దుష్పరిణామాలు.. వ్యాయమం చేయక్కర్లే కుండా మంచి దేహ సౌష్టవం రావడం కోసం వాడినప్పడు ఇది శరీరంలో రక్తపోటు తోపాటు గుండె ఎడమ జఠరిక పరిమాణాన్ని పెంచుతుంది. ఫలితంగా గుండె జబ్బులు బారిన పడి ఆకస్మిక మరణాల సంభవించే అవకాశం ఉంది. ఇది దూకుడుగా ప్రవర్తించేలా లేదా ఉద్రేకతను పెంచుతుంది. కాలేయానికి హాని కలిగించొచ్చు నిరంతరంగా ఉపయోగించడం వల్ల హైపోగోనాడిజమ్కు కారణమవుతుంది. వృషణాల పనితీరు తగ్గిపోయాల చేసి చివరకు వంధ్యత్వానికి దారితీస్తుంది. ఇది నెమ్మదిగా స్పెర్మ్ కౌంట్‌ని తగ్గించేస్తుంది. ఫలితంగా పిల్లలను కనే సామర్థ్యం తగ్గిపోతుంది. View this post on Instagram A post shared by Imran Khan (@imrankhan) (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా) -
ఆ వ్యాధి క్యాన్సర్ కంటే ప్రాణాంతకం! చికిత్స కూడా లేదు!
క్యాన్సర్ అంటే అందరూ హడలిపోతారు. అలాంటిది దానికి మించి ప్రాణాంతకమైన మరొక వ్యాధా అని నోరెళ్లబెట్టకండి. ఎందుకంటే కనీసం క్యాన్సర్‌కి స్టేజ్‌లను బట్టి చికిత్స దొరకుతుంది. ఇదొచ్చిదంటే బతకడం కష్టం. పైగా చికిత్స చేయడం కూడా కష్టం. ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స కూడా లేదంట. క్యాన్సర్ కంటే ఈ వ్యాధి వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వ్యాధి ఏంటి? ఎందువల్ల వస్తుంది?.. తదితరాల గురించే ఈ కథనం.! ఇవాళ ప్రపంచ సెప్సిస్ దినోత్సవం. ఇది క్యాన్సర్ కంటే ప్రాణాంతకమైంది. ప్రతి ఏడాది సెప్టంబర్ 19 సెప్సిస్ దినోత్సవాన్ని జరుపుతూ..ఆ వ్యాధి ప్రజల్లో అవగాహన కల్సిస్తున్నారు అధికారులు. అసలు సెప్సిస్ అంటే ఏంటీ.. ఎలా ప్రాణాంతకం అంటే..ఇది ఏమి ఇన్ఫెక్షన్ కాదు. శరీరలో కలిగే ప్రాణాంతక పరిస్థితిని సెప్సిస్ అంటారు. అధిక రోగనిరోధక ప్రతిస్పందన, బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్లు ఈ సెప్టిక్ షాక్‌కి కారణం కావొచ్చు. రక్తంలో, ఎముకల్లో, పిత్తాశయం, కాలేయం, ఉదరకుహరం, అపెండిక్స్, ఊపిరితిత్తుల్లో న్యూమోనియా, తదితర భాగాలు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సెప్సిస్ షాక్‌కి కారణం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మెదడు, వెన్నుపాము ఇన్ఫెక్షన్లు కూడా సెప్సిస్ ప్రమాదానికి కారణం కావొచ్చని చెబుతున్నారు. లక్షణాలు తీవ్ర జ్వరం అధిక రక్తపోటు హృదయ స్పందనల్లో క్రమరాహిత్యం శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు హృదయ స్పందనలలో క్రమరాహిత్యం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మూత్రవిసర్జనలో ఇబ్బందులు మానసిక స్థితిలో ఆకస్మిక మార్పులు వ్యాధి సోకిన ప్రాంతాల్లో చర్మం రంగు మారడం ప్లేట్లెట్ కౌంట్‌లో తగ్గుదల చెప్పలేనంత చలి స్పృహ కోల్పోవడం ఎలాంటి వారు ఈ వ్యాధిబారిన పడతారంటే.. 65 ఏళ్లు పైబడిన పెద్దలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధి, క్యాన్సర్, మూత్రపిండాలు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సెప్సిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కొన్నివిపత్కర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులు, పరిమిత వనురులు ఉన్న ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉంటుంది. ఇంతవరకు అధికా ఆదాయ దేశాల్లోని ఆస్పత్రుల్లో ఈ కేసులు వచ్చినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఇది లెక్కలేనన్ని మరణాలకు దారి తీసినట్లు పేర్కొంది. సెప్సిస్ కారణంగా వచ్చే సమస్యలు... తగిన సమయంలో చికిత్స తీసుకోనట్లయితే మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె, మెదడు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. రక్తగడ్డకట్టడం, అవయవాలు, వేళ్లు, కాలివేళ్లు చచ్చుపడిపోయి ప్రాణాంతకంగా మారే ప్రమాదం లేకపోలేదు. నిర్ధారణ దీని కారణంగా గడ్డకట్టే సమస్యల, అసాధారణంగా కాలేయం, మూత్రపిండాల పనితీరు ఉండటం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, రక్తంలో ఆమ్లత్వం పెరిగిపోవటం తదితరాలను బట్టి ఈ వ్యాధిని గుర్తిస్తారు వైద్యులు. చికిత్స: రోగుల వైద్య చరిత్ర ఆధారంగా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభంలో మాత్రం యాంటీబయాటిక్స్ని ఇస్తారు. రోగి పరిస్థితి విషమంగా ఉంటే వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈ వ్యాధి సోకిన కణజాలాన్ని తీసేయాల్సి ఉంటుందని వైద్యుల చెబుతున్నారు. ముందుగా ఈ వ్యాధిని గుర్తిస్తే మందులతో నయం చేయొచ్చని అంటున్నారు. ఈ వ్యాధి పూర్తి స్థాయిలో ఎలాంటి చికిత్స లేదని వెల్లడించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వ్యక్తిగ శుభ్రత పాటించాలి. అలాగే ఆహారాన్ని స్వీకరించటంలో నిర్లక్ష ధోరణి పనికిరాదు. నిల్వ ఆహారం కలుషితమైనవి తీసుకోకూడదు. ముఖ్యంగా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వ్యాధి వచ్చినప్పుడైనా రోగులు ఇలాంటి పరిశుభ్రతను పాటించినా సులభంగా బయటపడే అవకాశాలు మెండుగా ఉంటాయి. క్యాన్సర్ కంటే సెప్సిస్ ఎందుకు ప్రమాదకరం? ఈ వ్యాధి వేగవంతంగా ఇతర అవయవాలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కారణంగా అన్ని అవయవాలు ప్రభావితమవుతాయి. శరీరం పని తీరు సామర్థ్యం క్షీణిస్తుంది. రోగ నిర్థారణ ఆలస్యం కారణంగా మరణాలు సంభవించే రేటు 30% నుంచి 50% ఉంటుంది. సంక్రమణకు కారణమయ్యే బ్యాక్టీరియాలను గుర్తించి త్వరితగతిన యాంటీబయోటిక్ మందులు ఇవ్వడంపై వ్యాధి తగ్గుదల ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు ఇతర సాధారణ అనారోగ్యాల మాదిరిగా ఉండటంతో అంత సులభంగా వైద్యులు గుర్తించడంలో విఫలమవుతుంటారు. అందువల్ల ఈ కేసులు ఎక్కువగా ప్రాణాంతకంగా మారినట్లు నివేదికలు పేర్కొన్నాయి. మరొకటి ఆ వ్యాధికి తగ్గ స్థాయిలో యాంటీ బయోటిక్స్ మోతాదు ఇవ్వాల్సి ఉంటుంది. సెప్సిస్ ఇప్పటికి క్యాన్సర్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలికి వ్యాధులతో పోల్చితే తీవ్రమైన వ్యాధిగా ప్రపంచ ఆరోగ్యానకి సవాలు విసురుతోంది. మరణాలు సంభవించకుండా ఉండేలా వినూత్న రీతిలో వ్యాధికారక వేగాన్ని తగ్గించి నయం చేసేలా చికిత్స విధానాలు అభివృద్ధి చేయాల్సి ఉంది. (చదవండి: క్యాన్సర్ రోగులకు ఉపయోగపడే సౌకర్యాల వేర్!) -
చట్టానికి ఎవ్వరు చుట్టం కాదు: పండుగాయల రత్నాకర్
సాక్షి, అమరావతి: పాప భీతి, నైతిక విలువలు ఏమాత్రం లేని వ్యక్తి రాజకీయాల్లో ఉండడం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి బాబే ఉదాహరణ అని ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ అన్నారు. బాబు 45 ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చిందే సులువుగా సంపాదించుకోవడం కోసం, అక్రమంగా ప్రజల డబ్బును దోచుకుని తన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసంమేనని ఆయన అన్నారు. ప్రజలపై, ప్రజాధనం పై ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు. అధికారం, డబ్బు, వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని తప్పుడు పనులు చేయడం, సొంతమనుషులకు దోచిపెట్టడం ఇవే చంద్రబాబు లక్ష్యాలని విమర్శించారు. 'స్కిల్ డెవెలప్ మెంట్ స్కాం జరిగిన తీరు రాష్ట్రమే సిగ్గుపడేలా ఉంది. 2014లో ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు యువతను నమ్మించి నిలువునా మోసం చేశాడు. అంతటితో ఆగకుండా యువతకు నైపుణ్యాన్ని అందించి సుశిక్షితులు చేసే పేరుతో రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. బాధ్యత మర్చిపోయి నైతిక విలువలు గాలికొదిలి ఇలాంటి దారుణమైన దోపిడీకి చంద్రబాబు పాల్పడ్డాడు.' అని రత్నాకర్ వెల్లడించారు. No more StayBN ….#SkillDevelopmentScam #CorruptionKingCBN #ScamsterChandrababu pic.twitter.com/1maEQJi1ho — Kadapa Rathnakar (@KadapaRathnakar) September 9, 2023 'ప్రజల కళ్లుగప్పి అవినీతి చేద్దామనుకున్న బాబు ఇవాళ అడ్డంగా దొరికిపోయి దబాయిస్తున్నాడు. చట్టం చంద్రబాబుకు చుట్టం కాదు. తప్పు చేస్తే చట్టం ఎంతటివారినైనా ఉపేక్షించదు. ప్రజాధనం ఇష్టమొచ్చినట్టు దోపిడీ చేస్తుంటే చట్టం చూస్తూ ఊరుకోదు. అందులో భాగంగానే ఈ రోజు బాబు అరెస్ట్ జరిగింది. ప్రభుత్వానికి కక్ష సాధించాలని ఉంటె ఎప్పుడో అరెస్ట్ అయ్యేవాడు. చంద్రబాబు అవినీతి చేసాడని రుజువయ్యాకే సీఐడీ అరెస్ట్ చేసింది.' అని రత్నాకర్ పేర్కొన్నారు. బాబు బరితెగించి చేసిన అవినీతి ఇది: 'ఏమాత్రం నియమనిబంధనలు పాటించకుండా, చట్టానికి భయపడకుండా బాబు బరితెగించాడు. సీమెన్స్ సంస్థకు తెలియకుండా ఆ సంస్థ పేరు వాడుకున్నారు. రూ. 3,350 కోట్ల ప్రాజెక్టులో 90% డబ్బు ప్రైవేట్ సంస్థ గ్రాంట్ ఇస్తుందన్నారు. ఎక్కడైనా ప్రైవేట్ సంస్థ 90% గ్రాంట్ ఇస్తుందా ? డీపీఆర్ లేకుండా ప్రాజెక్టుకు ఒకే చేశారు. తేదీలు లేకుండా ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఎంవోయూ కుదుర్చుకునే సమయానికి 90% గ్రాంట్ నిబంధన ఎత్తేశారు. షెల్ కంపెనీల ద్వారా చట్టం తన చుట్టం, వ్యవస్థలను మేనేజ్ చేయగలమన్న ధీమాతోనే బాబు దిగజారి ప్రవర్తించాడు. బాబుకు ఈ కేసులో కఠినమైన శిక్ష పడకతప్పదు.' అని రత్నాకర్ చెప్పారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన చంద్రబాబు: '2014- 2019 వరకు బాబు అవినీతికి అడ్డుఅదుపూ లేకుండా పోయింది. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అడుగడుగునా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. రాజధాని లక్షకోట్ల కుంభకోణం, పోలవరం దోపిడీ, నీరు-చెట్టు, జన్మభూమి కమిటీల లంచాలు, చంద్రన్న కానుకల పేరుతొ దోపిడీ, ఎన్నికలకు 6 నెలల ముందు అన్నా క్యాంటీన్ల నిర్మాణానికి ఇష్టమొచ్చిన రేటుకు కాంట్రాక్టులు.. ఇలా బాబు పాలన అవినీతిమయంగా సాగింది.' అని రత్నాకర్ చెప్పారు. 'దోపిడీయే ఏకైక లక్ష్యంగా రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసాడు. 75 ఏళ్ళ చరిత్రలో ఇలాంటి చెత్తపాలన మరెక్కడా జరగలేదు. ఆ ఐదేళ్లు ప్రజలను వేధించి తాను మాత్రం జేబులు నింపుకున్నాడు. బాబు పాలనపై విసుగెత్తిన రాష్ట్రప్రజలు సరైన సమయంలో బాబుకు గుణపాఠం చెప్పారు. బాబు అవినీతికి సరైన శిక్షగా 23 సీట్లకు పరిమితం చేశారు. 2024లో బాబుకు 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితిలేదని జాతీయ సర్వేలే చెబుతున్నాయి. బాబుకు చట్టం ఎన్ని సంవత్సరాలు శిక్ష వేస్తుందో తెలియదు గానీ.. రాష్ట్ర ప్రజలు మాత్రం బాబుకు జీవితకాలం శిక్ష వేశారు.' అని పండుగాయల రత్నాకర్ అన్నారు. ఇదీ చదవండి: ఏమో.. తెలియదు.. గుర్తు లేదు.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు -
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దీవి! అడుగుపెట్టారో అంతే..!
మయాన్మార్‌లోని రామ్రీ దీవిలో అడుగుపెట్టాలంటే ఇప్పటికీ జనాలకు హడలే! ఆ దీవిలో ఎక్కడపడితే అక్కడ గుంపులు గుంపులుగా మొసళ్లు సంచరిస్తుంటాయి. ఉప్పునీటిలో బతికే ఈ మొసళ్లకు చిక్కితే వాటికి పలారమైపోవడం తప్ప బతికి బట్టకట్టడం అసాధ్యం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దీవుల్లో ఒకటిగా పేరుమోసిన ఈ రామ్రీ దీవికి ఒక చరిత్ర ఉంది. రెండో ప్రపంచయుద్ధ కాలంలో ఇక్కడ మోహరించిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ బలగాలపై దాడి చేసేందుకు జపాన్ సైన్యం ఈ దీవికి చేరుకునే ప్రయత్నం చేసినప్పుడు వందలాది మంది జపాన్ సైనికులు ఈ దీవిలోని మొసళ్లకు పలారమైపోయారు. యుద్ధ సమయంలో అత్యధికులు జంతు దాడిలో మరణించిన సంఘటనగా ఇది గిన్నిస్‌బుక్‌లో చోటు పొందింది. (చదవండి: అక్కడ అడుగుపెడితే ప్రమాదమే!)