ముంబై: సొంత అభిప్రాయాలతో కూడిన వార్తలు ప్రమాదకరమైనవని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ హెచ్చరించారు. ఆరోగ్యవంతమైన పజ్రాస్వామ్యానికి నిర్భయమైన, స్వతంత్య్రమైన పత్రికా వ్యవస్థ అవసరమని, అయితే వార్తలను ఊహలతో నింపడం వ్యవస్థకు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. సొంత ఆలోచనలను వార్తాకథనాల్లోకి చొప్పించడం కూడదని, స్వీయ అభిప్రాయాలను నిజ నివేదికలకు దూరంగా ఉంచాలని జర్నలిస్టులకు సూచించారు. రెడ్ ఇంక్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అవార్డు పొందిన విజేతలను ఆయన అభినందించారు. స్వీయ భావాలు వార్తలను ప్రభావితం చేయకుండా పనిచేయాలని, ఒకరకంగా జర్నలిస్టులు సైతం న్యాయమూర్తులేనని ఆయన అన్నారు. నిజాలను మాత్రమే రిపోర్టు చేయాలని కోరారు. జడ్జిలను విలన్లుగా చూపడం వంటి విషయాలపై పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, జాతీయ ప్రయోజనాల కోసం అంతా కలిసిపనిచేయాలని కోరారు. 2020 జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు మరణానంతరం సిద్ధిఖీని ఎంపిక చేశారు. అఫ్గాన్‌లో రిపోర్టింగ్ చేస్తూ సిద్ధిఖీ తాలిబన్ కాల్పుల్లో మరణించారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు రమణ నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment