award function
-
మహారాష్ట్రలో విషాదం.. ప్రాణాలు తీసిన అవార్డుల ఫంక్షన్
ముంబై: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర భూషణ్ పురస్కార ప్రదానోత్సవంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖార్‌గఢ్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. తీవ్రమైన ఎండలో గంటల తరబడి కూర్చున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు గురై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం.. నవీ ముంబయిలో ఆదివారం మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించగా.. వేలాది మంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ వేడుక మధ్యాహ్నం 1 గంట వరకూ కొనసాగింది. మైదానం జనంతో కిక్కిరిసిపోగా.. ఈవెంట్‌ను చూసేందుకు ఆడియో, వీడియో సౌకర్యాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. కానీ, ఎండ నుంచి రక్షణ కల్పించేలా షెడ్లుగానీ, టెంట్లుగానీ వేయలేదు. ఈ క్రమంలో మండుటెండలో గంటల కొద్దీ కూర్చువడంతో సొమ్మసిల్లిపోయారు. ఇక, వీఐపీలు కూర్చునే వేదిక వరకూ మాత్రమే టెంట్లు, షెడ్లు వేశారు. దీంతో, మిగిలిన వారు వడదెబ్బకు గురై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 600 మందికిపైగా జనం అస్వస్థతకు గురయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటన విషయం తెలియడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నవీ ముంబైకి చేరుకున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని, వడదెబ్బ బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ అవార్డుల కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్ అలియాస్ అప్పాసాహెబ్ ధర్మాధికారికి ఈ అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ తదితరులు హాజరయ్యారు. -
సందడిగా సినీ అవార్డుల ప్రదానం
వెండితెర, బుల్లితెర కళాకారులకు ప్రోత్సాహక అవార్డుల ప్రదానం శనివారం సాయంత్రం స్థానిక వడపళని, కుమరన్ కాలనీలోని శిఖరం హాలులో జరిగింది. మహా ఫైన్ ఆర్ట్స్ అనురాధ, యునైటెడ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఇండియా నిర్వాహకుడు కలైమామణి డాక్టర్ నెల్లై సుందరరాజన్ నిర్వహించిన ఈ వేడుకలో హైకోర్టు న్యాయమూర్తి ఎస్.కె.కృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పలువురిని అవార్డులు అందజేశారు. నటి స్మృతి వెంకట్, అనుకృష్ణ, గాయత్రి రెమ, నటుడు ఇమాన్ అన్నాన్ని, అరుణ్‌కుమార్, సన్ టీవీ న్యూస్‌రీడర్ కంకణి శేఖర్, డాక్టర్ పెనజీర్ తదితరులు అవార్డులను అందుకున్నారు. భాగ్యరాజ్ ఇంజినీరింగ్ కాలేజీ డైరక్టర్ మాలిని జయచంద్రన్, చైర్మన్ భాస్కర్ తదితరులు హాజరయ్యారు. -
వార్తల్లో అభిప్రాయాలను జొప్పించొద్దు: సీజేఐ
ముంబై: సొంత అభిప్రాయాలతో కూడిన వార్తలు ప్రమాదకరమైనవని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హెచ్చరించారు. ఆరోగ్యవంతమైన పజ్రాస్వామ్యానికి నిర్భయమైన, స్వతంత్య్రమైన పత్రికా వ్యవస్థ అవసరమని, అయితే వార్తలను ఊహలతో నింపడం వ్యవస్థకు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. సొంత ఆలోచనలను వార్తాకథనాల్లోకి చొప్పించడం కూడదని, స్వీయ అభిప్రాయాలను నిజ నివేదికలకు దూరంగా ఉంచాలని జర్నలిస్టులకు సూచించారు. రెడ్ ఇంక్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అవార్డు పొందిన విజేతలను ఆయన అభినందించారు. స్వీయ భావాలు వార్తలను ప్రభావితం చేయకుండా పనిచేయాలని, ఒకరకంగా జర్నలిస్టులు సైతం న్యాయమూర్తులేనని ఆయన అన్నారు. నిజాలను మాత్రమే రిపోర్టు చేయాలని కోరారు. జడ్జిలను విలన్లుగా చూపడం వంటి విషయాలపై పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, జాతీయ ప్రయోజనాల కోసం అంతా కలిసిపనిచేయాలని కోరారు. 2020 జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు మరణానంతరం సిద్ధిఖీని ఎంపిక చేశారు. అఫ్గాన్‌లో రిపోర్టింగ్ చేస్తూ సిద్ధిఖీ తాలిబన్ కాల్పుల్లో మరణించారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు రమణ నివాళులర్పించారు. -
ముద్దు వీడియోపై నటి ప్రీతి జింటా రియాక్షన్
ముంబై : ఓ అవార్డు ఫంక్షన్లో నటి ప్రీతి జింటాను హీరో రితేష్ దేశ్‌ముఖ్ ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన భర్త రితేష్..తన కళ్ల ముందే నటి ప్రీతి జింటా చేతులకు ముద్దు పెట్టుకోవడంతో తెగ ఫీల్ అవుతుంటుంది. రితీష్- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్‌గా చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంటుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై జెనీలియా ఇటీవలె మరో వీడియోను రిలీజ్ చేసింది. ఆ ఫంక్షన్ అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ రితేష్‌ను చితకబాదుతూ ఓ ఫన్నీ వీడియోను రూపొందించింది. దీనిపై నటి ప్రీతి జింటా స్పందించారు. 'చాలా ఫన్నీగా ఉంది..రితేష్- జెనీలియా మీరు ఇలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు తీయండి. లవ్ యూ బోత్' అంటూ కామెంట్ చేసింది. ఇక జెనీలియా- రితేష్‌ల వీడియోపై నటులు టైగర్ ష్రాఫ్, మాధురి దీక్షిత్, సంజయ్ కపూర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) సామాన్యులకూనా, సెలబ్రిటీలకైనా తన ముందే భర్త మరో మహిళతో క్లోజ్‌గా ఉంటే తట్టుకోలేరు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్లోనే ఎలాంటి కంట్రవర్సీలు లేకుండా హ్యాపీగా సాగిపోతున్న జంటల్లో రితేష్- జెనీలియా ముందు వరుసలో ఉంటారు. ఓ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరు 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పటికప్పుడు క్రేజీ వీడియోలతో ఆకట్టుకునే ఈ జంటకు బాలీవుడ్లో మోస్ట్ లవబుల్ కపుల్స్‌గా పేరుంది. చదవండి : వైరల్ : నటిని ముద్దుపెట్టుకున్న బాలీవుడ్ హీరో హీరో కార్తీక్‌కు కరోనా..టెన్షన్లో కియారా అద్వానీ -
నటిని ముద్దుపెట్టుకున్నహీరో ...జెనీలియా ఎక్స్ప్రెషన్స్
-
నటి ప్రీతికి హీరో ముద్దులు..చిర్రెత్తిన భార్య ఏం చేసిందంటే..
ముంబై : భర్త తన ముందే వేరే మహిళతో క్లోజ్‌గా ఉంటే ఏ భార్యకైనా కోపం వస్తుంది. దీనికి సినిమా స్టార్స్ కూడా అతీతం కాదు. ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉన్నా, భర్త తన కళ్లముందే మరో నటితో సన్నిహితంగా ఉంటే ఈర్వ్స, చిరాకు, కోపం..ఇలా అన్నీ వస్తాయి. హీరోయిన్ జెనీలియాకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ అవార్డు ఫంక్షన్లో జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్..నటి ప్రీతి జింటాను కలిశారు. ఈ సందర్భంగా రితేష్..ప్రీతి చేతులకు ఫ్రెండ్లీగా ముద్దు పెట్టాడు. ఇది చూసి పక్కనే ఉన్న జెనీలియా చాలా అసౌకర్యానికి ఫీల్ అవుతుంటుంది. మీ సంభాషణ ఎప్పుడు ముగిస్తారురా బాబు..అన్నట్లు ఇద్దరినీ చాలా జలస్‌గా చూస్తుంటుంది. నిజానికి ఇది 2019లో ఐఫా అవార్డుల సందర్భంగా జరిగిన సన్నివేశం. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఈ వీడియో బయటికొచ్చొంది. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రితీష్- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్‌గా చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంటుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీనిపై పలు స్పూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన జెనీలియా..ఈ ఫంక్షన్ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటూ మరో వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఇంటికి రాగానే జెనీలియా..భర్త రితీష్‌ను కొడుతున్నట్లు ఫన్నీగా ఓ వీడియోను చేసింది. దీన్ని రితేష్- ప్రీతి జింటాలకు సైతం ట్యాగ్ చేసింది. ఈ ఫన్నీ వీడియోపై టైగర్ ష్రాప్, ప్రీతి జింటా సహా పలువురు ప్రముఖులు స్పందిచారు. కాగా జెనీలియా-రితేష్ దేశ్‌ముఖ్ 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కెరీర్లో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా..సోషల్ మీడియాలో మాత్రం క్రేజీ వీడియాలు చేస్తూ ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. చదవండి :జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ నటుడు, పిక్స్ వైరల్ -
నా కోసం కూడా అవార్డు కొనాలి కదా!
బాలీవుడ్లో సినిమా అవార్డులను ప్రతిభ ఆధారంగా కాకుండా డబ్బులిచ్చి కొనుక్కుంటారన్నా ఆరోపణల్ని 'గల్లీబాయ్' ఫేం నటుడు విజయ్ వర్మ ఖండించారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ''గల్లీబాయ్ చిత్రానికి గానూ ఈ ఏడాది 13 ఫిల్మఫేర్ అవార్డులు దక్కాయి. దీనిపై కొద్దిమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చిత్ర బృందం డబ్బులిచ్చి అవార్డులు కొనుగోలు చేసి ఉంటే మరి నాకోసం కూడా ఓ అవార్డును కొనుగోలు చేయాలి కదా? మరి నాకెందుకు అవార్డు రాలేదు? వివిధ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో నేను నామినేట్ అయినటప్పటికీ ఇప్పటి వరకు ఒక్క అవార్డు కూడా దక్కలేదు. ఒకవేళ నిజంగానే గల్లీబాయ్ బృందం డబ్బులిచ్చి అవార్డులు కొని ఉంటే ఉత్తమ సహాయ నటుడి పాత్రకు నాకు కూడా అవార్డు దక్కి ఉండేది కదా? మరి 13 అవార్డులు కొన్నప్పుడు నాకోసం కొనకుండా ఉంటారా? వాళ్లు నాతో చాలా ప్రాజెక్టులు చేశారు. మరి ఈ స్నేహంతోనైనా అవార్డు కొని ఉండేవారు కదా'' అంటూ ప్రశ్నించారు. కేవలం ఒక్కరు మాత్రమే గల్లీబాయ్ సినిమా అవార్డులకు సంబంధించి తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నార్నారు. అవార్డులపై చేస్తోన్న ఆరోపణలు నిరాధారణమైనవంటూ కొట్టిపారేశారు. చిత్ర యూనిటల్కు తాను అండగా ఉంటానని తెలిపారు. (దానికంటే అవార్డు పెద్దది కాదు) గల్లీబాయ్ చిత్రంలో డ్రగ్ పెడ్లర్‌గా విజయ్ అద్భుతమైన నటనకు పలు ప్రశంసలు దక్కాయి. ఇక బాలీవుడ్లో బందుప్రీతి (నెపోటిజం )పై వస్తోన్న విమర్శలపై స్పందించడానికి ఇష్టపడలేదు. కానీ ఒక సమస్యను అడ్రస్ చేసినప్పుడు దాన్ని నిజంగా పరిష్కరించాలన్న ఉద్దేశం ఉండాలే కానీ ఒకరిపై ఒకరు బురద చల్లాలనుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. గల్లీ బాయ్ చిత్రానికి ఈ ఏడాది 13 అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. ఉత్తమ దర్శకుడిగా జోయా, ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్, ఉత్తమ నటిగా ఆలియా భట్ సహా వివిధ అవార్డులు దక్కాయి. సుశాంత్ మరణానంతరం బాలీవుడ్లో ఎప్పటినుంచో ఉన్న నెపోటిజంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో పాటు అవార్డులు అంశంలోనూ పక్షపాత దోరణి ఉంటుందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. (సుశాంత్ కెరీర్‌ను బాలీవుడ్ మాఫియా నాశనం చేసింది) View this post on Instagram #1YearOfGullyBoy This film gave me new wings to fly. Thank u @zoieakhtar and thank u #GullyBoy #gratitude #vadevadewowwow A post shared by Vijay Varma (@itsvijayvarma) on Feb 13, 2020 at 11:01pm PST -
‘సుశాంత్‌కు క్యాంప్‌లు అవసరం లేదు’
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిభ, బంధుప్రీతి వంటి అంశాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. ఇండస్ట్రీ సుశాంత్‌ను పట్టించుకోలేదని.. అతడిని నిర్లక్ష్యం చేసిందని.. ఆ బాధ తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ ఆప్త మిత్రురాలు రోహిణి అయ్యర్ చేసిన సోషల్ మీడయా పోస్టింగ్ తెగ వైరలవుతోంది. సుశాంత్ మరణాన్ని కొందరు తమ ఎజెండాగా మార్చుకుని.. ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. సుశాంత్ మరణాన్ని ఇలాంటి పోస్టింగులతో తక్కువ చేయవద్దని కోరారు. తన స్నేహితుడు డబ్బు, కీర్తి గురించి పట్టించుకోలేదని.. స్టార్స్‌తో గడపాలని కోరుకోలేదన్నారు. తనకు ఎలాంటి క్యాంప్‌లు అవసరం లేదని.. తన సొంత రాజ్యం తనకు ఉందని ఆమె తెలిపారు. ‘మీ అభిప్రాయాలతో, మీ గుర్తింపుతో అతడికి పని లేదు. తనతో కాంటాక్ట్‌లో లేకున్నా అతడి గురించి పోస్టింగులు చేసినా ఎప్పడు పట్టించుకోలేదు. నకిలీ స్నేహితులు, ఫోన్ కాల్స్‌ను అతడు అసహ్యించుకునేవాడు. మీ పార్టీలను అతడు తిరస్కరించేవాడు. అతనెప్పుడు బయటివాడే.. మీలో ఒకడు కావాలని అతను ఎప్పుడు ఆశించలేదు. 100 కోట్ల క్లబ్బు గురించి అతడు పట్టించుకోలేదు. ఎలాంటి కేటగిరిల గురించి అతడికి పట్టింపు లేదు. అవార్డ్ ఫంక్షన్లంటే అతడికి విసుగు. తనను ఉత్తమ నటుడిగా ప్రకటించే లోపే బోర్ కొట్టి ఓ ఫంక్షన్ నుంచి బయటకు వెళ్లాడు. సినిమాలు కాకుండా అతడికి చాలా ఆసక్తులు ఉన్నాయి. ఆస్ట్రానమీ, సైన్స్ అంటే తనకు చాలా ఇష్టం. తను చారిటీల్లో, సైన్స్ ప్రాజెక్ట్స్‌లో, కొత్త ఆవిష్కరణల్లో పెట్టుబడి పెట్టాడు. దయచేసి అతడిని అర్థం చేసుకోవాడనికి ప్రయత్నించకండి. మీ ఎంజెడా కోసం అతడి ప్రతిభను తగ్గించకండి’ అని కోరారు. (సుశాంత్ మామూ బతికే ఉన్నాడు!) అంతేకాక ‘కోట్ల విలువైన చెక్కులను అతను తిరిగి ఇవ్వడం నేను చూశాను. అతని వరకు పనిలో నాణ్యత చాలా ముఖ్యం. ఫోన్ ఆఫ్ చేసి చేపలు పట్టడానికి, వ్యవసాయం చేయడానికి కూడా వెళ్లేవాడు. అన్ని నియమాలను అతిక్రమించగల తెగువ అతని సొంతం. తనో వజ్రం, ప్లాస్టిక్‌ను మాత్రమే ఉపయోగించే పరిశ్రమ ఆ వజ్రాన్ని గుర్తించలేదు. మీరు కూడా అతడిని గుర్తించలేదు.. ఎందుకంటే మీరూ ప్లాస్టిక్‌నే వాడతారు. కనుక నేను కోరిది ఒక్కటే. ప్రతి ఒక్కరు వాస్తవంగా అతడు ఏంటో గుర్తించుకోవాలని కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీ అభిప్రాయాలను అతడు అస్సలు పట్టించుకోడు. నా వరకు అతడి వారసత్వాన్ని కాపాడటం చాలా ముఖ్యం. మరోసారి రికార్డులను సరి చూసుకోండి’ అని రాసుకొచ్చారు రోహిణి అయ్యర్.(సుశాంత్ చావును అవమానిస్తున్నారు: హీరో) -
అయ్యో ! రణ్వీర్ ఎంత పని జరిగే..
-
స్టార్స్ తళుకులు..ఫ్యాషన్ మెరుపులు
ఫ్యామిలీ వేడుకల నుంచి ఫ్యాషన్ ఈవెంట్ల దాకా.. అవార్డ్ ఫంక్షన్ల నుంచి ఆడియో లాంచ్‌ల దాకా.. అన్నింటా తారల తళుకుబెళుకులే. నగరంలో జరిగే పబ్లిక్ ఈవెంట్స్‌లో సినిమా తారలు కనపడడం ఇప్పుడు సర్వసాధారణమైంది. అదే సమయంలో సదరు ఫంక్షన్లలో వీరి స్పెషల్ లుక్ మాత్రం తరచుగా టాక్ ఆఫ్ ది సిటీగా మారుతోంది. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఓ అవార్డ్‌ల వేడుకలో తారల స్పెషల్ లుక్ మరోసారి సిటీ ఫ్యాషన్‌కు హాట్ టాపిక్ అయింది. నిన్నా మొన్నటి దాకా అవుటాఫ్ సినిమా లుక్‌లో సమంత టాప్ ఇన్ టౌన్ కాగా.. ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పుడు యువ తారలు పోటీపడుతున్నారు. ఒకప్పుడు సినిమా తారలు బయట కనపడడం చాలా అరుదు. అరకొరగా కనపడినా.. హెవీ మేకప్, విభిన్న రకాల కాస్ట్యూమ్స్ వేసిన భారాన్ని తగ్గించుకోవడానికి అన్నట్టుగా చాలా సింపుల్‌గా కనిపించడానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది.. సినిమాల్లో కనపడ్డానికన్నా బయట మరింత స్పెషల్‌గా ఉండాలన్నట్టు అందాల తారలు పోటీపడుతున్నారు. బయట కెమెరా కళ్లను తిప్పుకోనివ్వకుండా అద్భుతమైన డ్రెస్సింగ్ స్టైల్స్‌తో అదరగొడుతున్నారు. బాలీవుడ్ టు టాలీవుడ్ గతంతో పోలిస్తే టాలీవుడ్లో యువ తారలు ఇప్పుడు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. పబ్లిక్ లుక్ విషయంలో నవయువ టాలీవుడ్‌కి బాలీవుడ్ ఆదర్శంగా మారింది. ముంబయిలో జరిగే పబ్లిక్ ఈవెంట్స్‌లో తారలు బాగా పాల్గొంటారు. అంతేకాదు.. ఆ ఈవెంట్స్ కోసం స్పెషల్ డిజైన్స్‌ను సెలక్ట్ చేసుకుంటారు. సదరు ఈవెంట్స్‌లో వారు ధరించిన దుస్తులు, యాక్సెసరీస్ వంటివి పత్రికలు, మేగ్జైన్స్లో ఫ్యాషన్ పండితుల సమీక్షకు నోచుకుంటున్నాయి. దీంతో అక్కడ తారలు మరింత కేర్‌ఫుల్‌గా తమని తాము తీర్చిదిద్దుకోక తప్పడం లేదు. సాధారణంగా సినిమాల్లో పాత్ర, సన్నివేశం డిమాండ్ చేసిన మేరకు దుస్తులు ధరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా తమదైన స్టైల్ స్టేట్మెంట్ ఇదీ అని చెప్పుకునేందుకు గాని నచ్చిన పర్సనల్ స్టైల్‌ని చూపించేందుకు గాని పెద్దగా ఆస్కారం ఉండదు. దాంతో ఫ్యాషన్ విషయంలో తమదైన అభిరుచిని వ్యక్తపరచేందుకు తారలు పబ్లిక్ ఈవెంట్స్‌ను ఓ అవకాశంగా మార్చుకుంటున్నారు. పోటాపోటీ.. ఎవరికి వారేసాటి.. టాలీవుడ్ హీరోయిన్లలో సమంత పబ్లిక్ స్టైల్స్‌లో చాలా కాలం టాప్ ప్లేస్‌లో కొనసాగారు. విభిన్న రకాల దుస్తులు, యాక్సెసరీస్‌తో నార్త్ ఇండియన్ స్టార్స్‌కు దీటుగా వేడుకల్లో కనిపించేవారామె. ‘ఈవెంట్స్‌కి గెస్ట్‌గా వెళ్లినప్పుడు శామ్స్ (సమంత) డిఫరెంట్ లుక్‌తో కనపడాలనుకుంటుంది. ప్రత్యేక శ్రధ్ధతో లుక్‌ని తీర్చిదిద్దుకుంటుంది. అందుకే సినిమాలను మించి ఈవెంట్స్‌లో ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది’ అన్నారు సమంతకు వ్యక్తిగత స్టైలిస్ట్ నీరజ కోన. అయితే పెళ్లికి కాస్త ముందు నుంచే ఆమె బయట ఈవెంట్స్‌లో పాల్గొనడం తగ్గింది. ఈ క్రమంలో ఇప్పుడు పలువురు యువతారలు సమంతనే స్ఫూర్తిగా తీసుకుంటూ ఈవెంట్స్‌కి గ్లామర్ అద్దుతున్నారు. వీరి అవుట్ లుక్ పుణ్యమాని సిటీ డిజైనర్ల సత్తాకు చెప్పుకోదగ్గ పరీక్ష ఎదురవుతోంది. మరో విశేషం ఏమిటంటే.. సిటీలో సినిమా కాస్ట్యూమ్ డిజైనర్స్, సినిమా రంగానికి అవతల ఫ్యాషన్ రంగంలో పేరొందిన డిజైనర్స్ వేర్వేరు కావడంతో.. ఈ ఈవెంట్స్ పుణ్యమాని సిటీ డిజైనర్స్‌కు సినిమాస్టార్స్తో కలిసి పనిచేసే అవకాశం బాగా పెరిగింది. -
16 ఏళ్ల వ్రతాన్ని వదిలేసిన ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ 16 ఏళ్లుగా తాను పెట్టుకున్న వ్రతాన్ని వదిలేశారు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆయన అవార్డుల కార్యక్రమాలకు వేటికీ వెళ్లలేదు. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి ఒక అవార్డు అందుకున్న మిస్టర్ పెర్ఫెక్షనిస్టు.. దాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేతుల మీదుగా అందుకోవడం మరో విశేషం. తన తండ్రి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ 75వ వర్ధంతిని పురస్కరించుకుని ఇచ్చే అవార్డుల కార్యక్రమానికి రావాల్సిందిగా ఆమిర్‌ను స్వయంగా నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఆహ్వానించారు. లతాజీ ఆహ్వానాన్ని కాదనలేని ఆమిర్.. ఈ కార్యక్రమానికి వచ్చి అవార్డు తీసుకున్నాడు. దంగల్ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్సుకు గాను ఆమిర్‌కు విశేష పురస్కారం ఇచ్చారు. ఇంతకుముందు లగాన్ సినిమా ఆస్కార్ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేట్ అయినప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్లిన ఆమిర్.. ఆ తర్వాత ఇప్పటివరకు ఏ అవార్డు ఫంక్షన్‌కూ హాజరు కాలేదు. ప్రస్తుతం 'సీక్రెట్ సూపర్‌స్టార్', 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమాలలో ఆమిర్ నటిస్తున్నాడు. -
ఐఫా రిహార్సల్స్ సందడి
-
అందుకే వాళ్లకు దూరంగా ఉంటున్నా!
నయనతార సినిమాల్లో తప్ప, బయట ఫంక్షన్లలోనూ ఇతర వేడుకల్లోనూ ఎక్కడా కనబడరు. ఏడాదికి మహా అయితే ఒకటి రెండు సార్లు ఏదైనా అవార్డు ఫంక్షన్లోనో, ఆడియో ఫంక్షన్లోనో మెరుస్తారు. అంతకు మించి పబ్లిక్‌గా ఆమె దర్శనాలు ఉండవు. ఆమెకు స్నేహితులు కూడా చాలా చాలా తక్కువ. ఇంత పెద్ద సినీ ప్రపంచంలో తక్కువ మంది స్నేహితులు ఉండటమేంటి? నయనతారకు ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం ఉండదా?... ఈ విషయం గురించి ఓ సందర్భంలో నయనతార మాట్లాడుతూ -‘‘స్నేహితులు ఉండాలని అందరికీ ఉంటుంది. స్నేహం చేయడం నాకిష్టమే. కానీ, కొంతమంది స్నేహితుల కారణంగా బాధపడ్డాను. నా ముందు ఒకలా.. నా వెనకాల మరోలా మాట్లాడేవాళ్లు. అలాంటి స్నేహితుల అవసరం లేదనిపించింది. అందుకే వాళ్లకు దూరంగా ఉంటున్నాను. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. నిజాయతీగా వ్యవహరిస్తాను. నాతో స్నేహం చేసేవాళ్లు కూడా అలానే ఉండాలని ఆశిస్తాను. లేకపోతే బాధపడిపోతాను. చివరకు వాళ్లతో స్నేహాన్ని వదిలేసుకుంటాను’’ అన్నారు. ముక్కుసూటిగా మాట్లాడటం ఒక విధంగా వరం.. మరో విధంగా శాపం అని కూడా నయనతార అన్నారు. ‘‘నాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా ఉండేవాళ్లు నన్ను ఇష్టపడతారు. లేనివాళ్లు తిట్టుకుంటారు. అందుకే, ముక్కుసూటితనం వరం.. శాపం.. అంటున్నా’’ అని పేర్కొన్నారామె. -
చానళ్ల పాత్ర ప్రశంసనీయం
సాక్షి, సిటీబ్యూరో: పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రసారం చేసి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే బాధ్యతను తెలుగు టీవీ చానళ్లు తీసుకోవడం ప్రశంసనీయమని సినీ నటి మంచులక్ష్మి అన్నారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్‌లో గురువారం సాయంత్రం ఏడో యూనిసెఫ్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. గౌరవ అతిథిగా హాజరైన మంచులక్ష్మి మాట్లాడుతూ...పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, సంరక్షణ తదితర అంశాలపై టెలివిజన్ చానళ్లు కథనాలు ప్రసారం చేసి పిల్లల సమస్యల గొంతుకగా మారడం అభినందనీయమన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, గోపాల కృష్ణ గోఖలే అవార్డు గ్రహీత ఎస్.ఉమాపతి మాట్లాడుతూ... టీవీ చానళ్లలో ప్రసారమైన పిల్లల సమస్యల కథనాలు బాగున్నాయని, అయితే వీటికి న్యాయ సంబంధమైన అభిప్రాయాలు కూడా చొప్పిస్తే అర్థవంతంగా ఉంటుందన్నారు. అవార్డులు అందుకున్న చానళ్లివే.. ఐ న్యూస్ (స్ఫూర్తిదాయకం ఇంటర్ బాలిక-అనూష శీర్షికతో కథనం), టీవీ9(పసి వయస్సులో ప్రాణాంతక చక్కెర వ్యాధి), వీ6(సమస్యల మండటం గట్టు కథనం), జెమినీ న్యూస్(అమ్మానాన్న దూరమైతే..), ఈటీవీ ఏపీ(డిటెన్షన్ అవసరమా, అనర్థమా..?పై చర్చ, ర్యాగిం గ్ రాక్షసిపై కథనం), హెచ్ఎంటీవీ(దేవరకొండ అమ్మాయిలు), వనిత టీవీ(అక్షరధామం...హతునూర్ మండలం అనే కథనం), 10 టీవీ(మాతాశిశు మరణాలపై కథనం)లకు అవార్డులు దక్కాయి. ఏపీ, తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల యూనిసెఫ్ ఆఫీస్ చీఫ్ ఫీల్డ్ రూత్ లియోనో, సీఎంఎస్ డెరైక్టర్ పీఎన్ వసంతి పాల్గొన్నారు. -
కోట్స్ = కొండంత ఆత్మ విశ్వాసం
‘‘శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. విజయపు విశ్వాసాన్ని కేవలం శ్రమ మాత్రమే ఇస్తుంది’’ అనే వివేకానందుడి స్ఫూర్తిని ఎంతమంది షేర్ చేస్తున్నారో... కాస్తంత సరదాగా... కొంచెం సీరియస్‌నెస్‌తో ఊరడింపునిచ్చే కోట్స్‌ను షేర్ చేసుకునే వారు కూడా అంతేమంది ఉన్నారు. హితబోధకు భిన్నంగా విజయపు విశ్వాసాన్ని ఇచ్చే నయా వేదాంతం పట్ల యువత ఎంతో ఆసక్తి కనపరుస్తోంది. ‘‘ఈ వాక్యం నా కోసమే చెప్పింది.. నా లైఫ్ స్టైల్‌తో కనెక్ట్ అవుతోంది’’ అనుకుంటే చాలు టక్కున షేర్ చేసుకోవడమే! ‘‘శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. విజయపు విశ్వాసాన్ని కేవలం శ్రమ మాత్రమే ఇస్తుంది’’ అనే వివేకానందుడి స్ఫూర్తిని ఎంతమంది షేర్ చేస్తున్నారో... కాస్తంత సరదాగా... కొంచెం సీరియస్‌నెస్‌తో ఊరడింపునిచ్చే కోట్స్‌ను షేర్ చేసుకునే వారు కూడా అంతే మంది ఉన్నారు. ఫేస్బుక్లో నడుస్తున్న ఈ కోట్స్ ట్రెండ్ గురించి! ‘‘నేను అనేకసార్లు ఎగ్జామ్స్‌లో ఫెయిలయ్యాను. నా స్నేహితుడు అన్నింటిలోనూ పాసయ్యాడు. అతడు ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌లో ఒక ఉద్యోగి. నేను మైక్రోసాఫ్ట్ ఓనర్‌ను...’’ అతి విశ్వాసం ధ్వనిస్తోందా? లేక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందా? స్ఫూర్తిని పంచుతోందా? అంటే చెప్పలేం కానీ నేటి యువతకు బాగా నచ్చిన వాక్యమిది. ఫేస్బుక్లో బాగా షేర్ అవుతుండటమే ఇందుకు రుజువు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌కు ఆపాదించబడిన ఈ కామెంట్ ఎందరో యువకులకు స్ఫూర్తిని ఇస్తోంది. తమ జీవితంలో ఎదుర్కొన్న పెద్ద ఫెయిల్యూర్ల తర్వాతే గొప్పవాళ్లంతా అద్భుతమైన సక్సెస్‌లను సాధించారు అనే విషయాన్ని పై కామెంట్ చెప్పకనే చెబుతోంది. ‘‘అపజయాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉన్నవాళ్లే గొప్ప విజయాన్ని సాధించగలరు. గుర్తుంచుకోండి... ఫెయిల్యూర్ ఒక సంఘటన మాత్రమే. ఒక వ్యక్తి కాదు’’ రాబర్ట్ కెన్నడీ కోట్ ఇది. ఈ మాటలు... అపజయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్నీ, గొప్పవిజయాన్ని సాధించవచ్చుననే విశ్వాసాన్నీ ఇస్తోంది. ‘‘నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది... పరాజయాన్ని ఆస్వాదించలేకపోతే, విజయానందాన్ని పొందలేరని. విమర్శలు ఎదుర్కొనకపోతే పొగడ్తలకు అర్హురాలివి కాదు’’ అని ఒక అవార్డ్ ఫంక్షన్లో ప్రఖ్యాత హాలీవుడ్ నటి హాలీబెర్రీ చెప్పిన వాక్యమిది. హాలీబెర్రీని ఎంతమంది ఇష్టపడుతున్నారో, ఆమె చెప్పిన ఈ మాటను కూడా అంతే ఇష్టపడుతున్నారు. అందులోని స్ఫూర్తిని గ్రహిస్తున్నారు. ‘‘ఎవరైనా ఫెయిల్ అయ్యారంటే వారిని నేను నమ్ముతాను. అభినందిస్తాను. అయితే తిరిగి ప్రయత్నించకపోవడాన్ని మాత్రం సమర్థించను’’ అంటున్నాడు ప్రఖ్యాత బాస్కెట్‌బాల్ ప్లేయర్ మైఖేల్ జోర్డాన్. ఇలా చెప్పు కుంటూపోతే ఎన్నో కోట్స్... కొండంత ధైర్యాన్ని ఇచ్చేవి! - జీవన్‌రెడ్డి.బి