ముద్దు వీడియోపై నటి ప్రీతి జింటా రియాక్షన్‌ | Preity Zinta Reacts To Jealous Genelias Video About Riteish Deshmukh | Sakshi
Sakshi News home page

ప్రీతికి కిస్‌ ఇచ్చిన రితేష్‌.. వీడియో షేర్‌ చేసిన జెనీలియా‌

Published Tue, Mar 23 2021 12:42 PM | Last Updated on Tue, Mar 23 2021 4:37 PM

Preity Zinta Reacts To Jealous Genelias Video About Riteish Deshmukh - Sakshi

ముంబై : ఓ అవార్డు ఫంక్షన్‌లో నటి ప్రీతి జింటాను హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. తన భర్త రితేష్‌..తన కళ్ల ముందే నటి ప్రీతి జింటా చేతుల‌కు ముద్దు పెట్టుకోవడంతో తెగ ఫీల్‌ అవుతుంటుంది. రితీష్‌- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్‌గా చూస్తున్న ఎక్స్‌ప్రెషన్స్‌ వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంటుంది. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

దీనిపై జెనీలియా ఇటీవలె మరో వీడియోను రిలీజ్‌ చేసింది. ఆ ఫంక్షన్‌ అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ రితేష్‌ను చితకబాదుతూ ఓ ఫన్నీ వీడియోను రూపొందించింది. దీనిపై నటి ప్రీతి జింటా స్పందించారు. 'చాలా ఫన్నీగా ఉంది..రితేష్‌- జెనీలియా మీరు ఇలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు తీయండి. లవ్‌ యూ బోత్'‌ అంటూ  కామెంట్‌ చేసింది. ఇక జెనీలియా- రితేష్‌ల వీడియోపై నటులు టైగర్‌ ష్రాఫ్‌, మాధురి దీక్షిత్, సంజయ్ కపూర్  సహా పలువురు ప్రముఖులు స్పందించారు.

సామాన్యులకూనా, సెలబ్రిటీలకైనా తన ముందే భర్త మరో మహిళతో క్లోజ్‌గా ఉంటే తట్టుకోలేరు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌లోనే ఎలాంటి కంట్రవర్సీలు లేకుండా హ్యాపీగా సాగిపోతున్న జంటల్లో రితేష్‌- జెనీలియా ముందు వరుసలో ఉంటారు. ఓ షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డ వీరు 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి రాయస్‌, రాహిల్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పటికప్పుడు క్రేజీ వీడియోలతో ఆకట్టుకునే ఈ జంటకు బాలీవుడ్‌లో మోస్ట్‌ లవబుల్‌ కపుల్స్‌గా పేరుంది. 

చదవండి : వైరల్‌ : నటిని ముద్దుపెట్టుకున్న బాలీవుడ్‌ హీరో
హీరో కార్తీక్‌కు కరోనా..టెన్షన్‌లో కియారా అద్వానీ


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement