Preity zinta
-
ముంబైలో బాలీవుడ్ ప్రముఖులపై ఇన్ని దాడులు జరిగాయా!
బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై జరగిన దాడితో చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎంతో సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇంతటి ఘోరం జరగడంతో వారు ఆశ్చర్యపోతున్నారు. గ్యాంగ్‌స్టర్స్‌తో ఒకప్పుడు నిండిపోయిన ముంబైలో కొన్నేళ్ల తర్వాత ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయితే, గతంలో కూడా ఇలాంటి దాడులో బాలీవుడ్ నటీనటులపై జరిగాయి.పంజాబ్‌ను ఓ ఊపు ఊపిన సింగర్ చమ్కీలాపై తూటాల వర్షంభారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా.. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్‌జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్‌జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం.క్యాసెట్ కింగ్‌పై కాల్పులు‘క్యాసెట్ కింగ్’ అని పిలిచే టీ-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్‌ను 1997 ఆగస్టు 12న దుండగులు కాల్చి చంపారు. ఆ సమయంలో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సబర్బన్ అంధేరీలోని శివాలయాన్ని ప్రతిరోజూ రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) దర్శించుకునేవారు. ఈ హత్య కేసులో చాలా మందిని అరెస్ట్ చేసి విచారించారు. గుల్హన్ కుమార్ హత్య కేసులో ప్రముఖ సంగీత దర్శకుడు నదీంను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. గుల్హన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆయనను విచారించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.బుల్లెట్ల గాయాలతోనే ఆసుపత్రికి వెళ్లిన స్టార్ హీరో తండ్రి2000వ సంవత్సరం రోషన్ కుటుంబానికి చేదు గుర్తులనే మిగిల్చింది. హృతిక్ రోషన్ తొలి చిత్రం కహో నా.. ప్యార్ హై అతనికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. అయితే కొద్ది రోజులకే వారికి పెద్ద ప్రమాదమే ఎదురైంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్‌పై ముంబైలోని అతని కార్యాలయం వెలుపల అండర్ వరల్డ్‌తో సంబంధం ఉన్న కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో అతనికి రెండు బుల్లెట్లు తగిలినప్పటికీ ఎంతో వీరోచితంగా తన కారులోనే డ్రైవింగ్ చేసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాడు. అలా ప్రాణాలతో ఆయన బటయపడ్డాడు.షారూఖ్ ఖాన్‌కు పలుమార్లు హెచ్చరికలుబాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్‌ను చంపేస్తామంటూ ఇప్పటికే పలు బెదిరింపులు వచ్చాయి. 1990ల్లో షారుక్‌ను అండర్‌వరల్డ్ టార్గెట్ చేసింది. గ్యాంగ్‌స్టర్ అబూసలేం అనేకసార్లు షారుఖ్‌కు వార్నింగ్స్ ఇచ్చాడు. కానీ, ఖాన్ మాత్రం చాలా ధైర్యంగా వారికి వ్యతిరేకంగా పోరాడారు. సల్మాన్ ఖాన్‌కు ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో హెచ్చరికలు రావడం తెలిసిందే. అలాంటి హెచ్చరికే వారి నుంచి షారుఖ్ ఖాన్‌కు కూడా గతంలో వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వకుంటే షారుఖ్‌ను చంపేస్తామంటూ బాంద్రా పోలీసుల సెల్‌ఫోన్‌కు మెసేజీ వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే లాయర్ పేరుతో ఉన్న ఫోన్ నుంచి ఆ మెసేజీ వచ్చినట్లు గుర్తించారు.ప్రీతీజింటా ధైర్యం2001 సమయంలో అండర్వరల్డ్కు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి ప్రీతీజింటా కోర్టులో సాక్ష్యం చెప్పింది. ఆ సమయంలో తను నటించిన 'చోరీచోరీ చుప్కే చుప్కే' సినిమాకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఆమె ఎదుర్కొంది. ఈ సినిమాకు పెట్టుబడులు పెట్టిన నిర్మాత నజీమ్ రిజ్వీతో పాటు ఫైనాన్షియర్ భరత్ షా అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ నుంచి వచ్చిన డబ్బుతో సినిమా తీసినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసు విచారణ సమయంలో రూ.50లక్షల కోసం తనను డిమాండు చేస్తూ బెదిరింపులు వచ్చాయని కోర్టులో ఆమె చెప్పారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాకేష్ రోషన్, మహేష్ మంజ్రేకర్ వంటి వారితో సహా ఇతర బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి. కానీ, ప్రీతీ మాత్రమే కోర్టుకు తెలిపింది. అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆ సినిమా ప్రొడ్యూసర్ నసీం రిజ్వీ, ఫైనాన్సర్ భరత్ షాలు జైలుకెళ్లారు. -
'ఆ దేవుడి దయతో బతికిపోయాం'.. విషాదంపై హీరోయిన్ ట్వీట్
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా విచారం వ్యక్తం చేసింది. అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని తన కలలో కూడా ఊహించలేదని అన్నారు. మా పొరుగువారంతా ఇలా బాధపడతారని అనుకోలేదంటూ ట్వీట్ చేశారు ప్రీతి జింటా. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.ప్రీతి జింటా తన ట్వీట్లో రాస్తూ.' లాస్ ఎంజిల్స్‌లో మా చుట్టూ ఉన్న వారిని మంటలు నాశనం చేసే రోజు వస్తుందని నేను ఊహించలేదు. నేను బతికుండగా ఇలాంటి విషాదం చూస్తానని అనుకోలేదు. నా స్నేహితులు, కుటుంబాలు ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. మన చుట్టూ ఉన్నవారికి జరిగిన విధ్వంసం చూసి నా హృదయ బరువెక్కింది. అక్కడి విధ్వంసం చూస్తుంటే ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఇలాంటి విషాదం సమయంలో మేమ సురక్షితంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ మంటల్లో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. గాలి త్వరలోనే తగ్గి మంటలు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నా. ప్రాణాలను, ఆస్తిని కాపాడటానికి సహాయం చేస్తున్న అగ్నిమాపక శాఖ, అగ్నిమాపక సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ సురక్షితంగా ఉండండి' అని పోస్ట్ చేశారు.కాగా.. అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చుతో వేల ఇళ్లు మంటల్లో బూడిదయ్యాయి. ఈ మంటలు దాదాపు వెయ్యి ఎకరాలకు వ్యాపించాయి. ఈ ప్రకృతి విపత్తుతో దాదాపు లక్షకు పైగా నిరాశ్రయులయ్యారు. ఈ విషాద ఘటనలో దాదాపు 13 మంది మరణించగా.. 12,000 కంటే ఎక్కువ ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.కాగా.. నటి ప్రీతి జింటా అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో తన భర్త జీన్ గూడెనఫ్‌తో కలిసి అక్కడే నివసిస్తున్నారు. వీరిద్దరికి ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. 2016లో అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్‌ను ప్రీతి జింటా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు జీన్‌తో రిలేషన్లో ఉన్న ఆమె.. 2016 ఫిబ్రవరి 29న రహస్య వివాహం చేసుకుంది. సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. తాజాగా అమెరికాలో వీరు నివసిస్తున్న లాస్ ఎంజిల్స్లోనే కార్చిచ్చు ఘటన జరగడంతో ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేస్తోంది.కాగా.. ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనుంది. సన్నీడియోల్ హీరోగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్‌ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 'లాహోర్ 1947'లో ప్రీతీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్‌హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిసిన రోజు నుంచి ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. I never thought I would live to see a day where fires would ravage neighbourhoods around us in La, friends & families either evacuated or put on high alert, ash descending from smoggy skies like snow & fear & uncertainty about what will happen if the wind does not calm down with…— Preity G Zinta (@realpreityzinta) January 11, 2025 -
సొట్ట బుగ్గల సుందరి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
స్టార్ హీరోయిన్గా బాలీవుడ్‌ను ఏలిన అందాల తార ప్రీతి జింటా(Preity Zinta). యాపిల్బ్యూటీగా, డింపుల్ గర్ల్‌గా పాపులర్ అయిన నటి. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. అంతేగాదు బాలీవుడ్లో మంచి సినిమాలతో సక్సెస్‌ని అందుకున్న అగ్రనటి. ఆమె టాలీవుడ్లో కూడా ప్రిన్స్ మహేష్ బాబు, విక్టరీ వెంటేష్ల సరసన నటించి బ్యూటీఫుల్ హిరోయిన్‌గా మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి పంజాబ్‌కింగ్స్ కో ఓనర్‌గా వ్యవహరిస్తూ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తళుక్కుమని.. అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఓ మంచి సినిమాతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఆమెకు దగ్గరదగ్గరగా 50 ఏళ్లు ఉంటాయి. అయినా ఇప్పటకీ అంతే అందం, గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. అంత అందం వెనుకున్న సీక్రెట్ ఏంటంటే..ఏవయసులోనైనా అంతే అందంగా, గ్లామర్‌గా ఉండొచ్చు అనేందుకు ప్రేరణ ప్రీతి జింటా(Preity Zinta). ఈ ఏడాది ప్రారంభంలో వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వన్నె తరగని అందం రహస్యం గురించి షేర్ చేసుకుంది. తాను క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతానని చెప్పారు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తానని, అలాగే తీసుకునే ఆహారంపై కూడా దృష్టిపెడతానని తెలిపారు. తాను పైలేట్స్(Pilates)కి అభిమానిని అని చెప్పారు. వర్కౌట్(workouts)ల విషయంలో రాజీ ప్రసక్తే లేదంటోంది ప్రీతి. బాడీని మంచి ఆకృతిలో ఉంచేవి పైలెట్స్ అని, అందుకే ఇది చేయడం అంటే మహా ఇష్టం అంటోంది. ఇది తన కండరాలను బలోపేతం చేస్తుందని చెబుతోంది. దీంతోపాటు నిద్ర కూడా చాలా ముఖ్యం అంటోంది. పనికంటే తగిన నిద్ర ఉంటేనే రోంతా యాక్టివ్‌గా ఉండగలం. పైగా ఆరోగ్యం బాగుటుందని నమ్మకంగా చెబుతోంది. నోటిని అదుపులో పెట్టుకున్నవాళ్లు కచ్చితంగా అందంగా ఉంటారని చెబుతోంది. ఏ పదార్థం పడితే అది ఇష్టంతో డైట్‌ని బ్రేక్ చేయకూడదని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కేలరీలు తీసుకోవడంలో సరైన స్ప్రుహ ఉండాలంటోంది. రోజూ మొతంలో సరైన ఆహారం తీసుకోవాంటే ఈ నాలుగు చిట్కాల(Tips)ను తప్పనిసరిగా పాటించమని చెబుతోంది. అవేంటంటే..హడావిడిగా, నుంచొని అస్సలు తొనొద్దు. ఆకలిపై శ్రద్ధ పెట్టి నిధానంగా తినవల్సినంత మేర తినాలి. మైండ్‌ఫుల్‌గా తినాలి. ఒకవేళ మూడ్ బాగోకపోయినా సరే ఆహారం చూడగానే మనసు ఆటోమెటిగ్గా మారాలి ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన రావాలి. నెమ్మదిగానే తినాలి. ముఖ్యంగా బాగా నమిలి తినాలి. ఇలా చేస్తే అతిగా తినడాన్ని నిరోధించగలుగుతాం వారానికి ఒక్కసారైనా ఒంటరిగా తినండి. ఎందుకంటే ఇతరులతో కలిసి తినడం వల్ల తెలియకుండా వారితో ప్రభావితమై ఎక్కువగా తినే అవకాశం ఉంటుందట. అందుకని అప్పడప్పుడూ ఇలా ప్లాన్ చేస్తే డైట్ అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. పైగా ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటాం అని చెబుతోంది అందాల భామ ప్రీతి జింటా. View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) (చదవండి: దటీజ్ మధురిమ బైద్య..! మైండ్‌బ్లాక్ అయ్యే గెలుపు..) -
సల్మాన్‌తో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి జింటా
ఆన్‌స్క్రీన్ జంటల్ని జనాలెంతగానో ఇష్టపడతారు. రియల్ లైఫ్‌లోనూ ఆ హీరోహీరోయిన్లు జంటగా ఉంటే బాగుంటుందని ఆశపడతారు. కొందరైతే వారి మధ్య స్నేహాన్ని కూడా ప్రేమ అని ప్రచారం చేస్తుంటారు. అలా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), హీరోయిన్ ప్రీతి జింటా కూడా లవ్‌లో ఉన్నారని అప్పట్లో బోలెడు రూమర్స్ వచ్చాయి. ఇన్నాళ్లకు దానిపై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్.ఎంతో ప్రేమిస్తున్నా..డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ బర్త్‌డే సందర్భంగా ప్రీతి జింటా (Preity Zinta) సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. హ్యాపీ బర్త్‌డే సల్మాన్. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. మిగతాదంతా మనం కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. మనిద్దరం మరోసారి ఫోటోలు దిగాలి. లేదంటే ఇదిగో ఇలా పాతవే పోస్ట్ చేస్తూ ఉంటాను అంటూ సల్మాన్‌తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్.. మీరిద్దరూ ప్రేమించుకున్నారా? అని అడిగాడు. హీరోతో లవ్?అందుకు ప్రీతి జింటా.. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. అతడు తనకు క్లోజ్ ఫ్రెండ్ అని తెలిపింది. అలాగే తన భర్తకు కూడా మంచి స్నేహితుడని, తనకు కుటుంబసభ్యుడిలాంటివాడని చెప్పింది. మీరెంత ఊహించుకున్నా ఇదే నిజం అని రిప్లై ఇచ్చింది. కాగా సల్మాన్- ప్రీతిజింటా.. హర్ దిల్ జో ప్యార్ కరేగా, చోరీ చోరీ చుప్కే చుప్కే, దిల్నే జిసే ఆప్నా కహా, జాన్ ఎ మన్, హీరోస్, ఇష్క్ ఇన్ పారిస్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ప్రీతి తెలుగులో ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాల్లో హీరోయిన్గా మెరిసింది. Happy Burrday @BeingSalmanKhan 🎂Just wanna say I love you the mostest 🥳 Rest will tell you when I speak to you ….. and yes we need more photos otherwise I will keep posting the same old ones ! Ting 💕 pic.twitter.com/XLVHxTIFY6— Preity G Zinta (@realpreityzinta) December 27, 2024 No not at all ! He is family & my closest friend and my husband’s friend too .. just in case you were wondering 🤣🤣 Sorry ! Couldn’t resist 👼— Preity G Zinta (@realpreityzinta) December 28, 2024 చదవండి: గేమ్ ఛేంజర్ టీమ్‌కు అభిమాని వార్నింగ్.. 'ఆ పని చేయకపోతే చస్తా!' -
ఇటు కావ్యా మారన్, ప్రీతి జింటా.. అటు నీతా అంబానీ, జూహీ చావ్లా.. వేరే లెవల్! (ఫొటోలు)
-
తగ్గేదేలే!.. అతడి కోసం.. పోటీ పడ్డ కావ్యా- ప్రీతి.. ట్విస్ట్ అదిరింది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 తొలిరోజు మెగా వేలం విజయవంతంగా ముగిసింది. ఆక్షనీర్ మల్లికా సాగర్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆదివారం నాటి వేలంపాటను సమర్థవంతంగా పూర్తి చేశారు. ఇక మొదటి రోజు ఫ్రాంఛైజీలు మొత్తంగా 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరికోసం తమ పర్సుల నుంచి ఓవరాల్‌గా రూ. 467.95 కోట్లు ఖర్చు చేశాయి.ప్రత్యేక ఆకర్షణగా ఆ ముగ్గురుఇదిలా ఉంటే.. ఎప్పటిలాగానే ఈసారీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్, ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో తమ వ్యూహాలను అమలు చేసే క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలకు గట్టిపోటీనిచ్చారు.అందుకు కారణం మాత్రం కావ్యానే!ఈ నేపథ్యంలో కావ్యా మారన్- ప్రీతి జింటా ఓ ఆటగాడి కోసం తగ్గేదేలే అన్నట్లు పోటాపోటీగా ధర పెంచుతూ పోవడం హైలైట్‌గా నిలిచింది. అయితే, ఆఖరికి కావ్యా తప్పుకోగా.. సదరు ప్లేయర్ ప్రీతి జట్టు పంజాబ్‌కు సొంతమయ్యాడు. కానీ.. పంజాబ్ ఇందుకోసం భారీ ధరను చెల్లించాల్సి వచ్చింది. అందుకు కారణం మాత్రం కావ్యానే!ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరా అంటారా?.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్. నిజానికి ఈ పేస్ బౌలర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బిడ్ వేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ సైతం రంగంలోకి దిగాయి.రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారాఅయితే, ఊహించని రీతిలో రేసులోకి ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ అర్ష్‌దీప్ ధరను ఏకంగా రూ. 15.75 కోట్లకు పెంచింది. దీంతో మిగతా ఫ్రాంఛైజీలు పోటీ నుంచి తప్పుకోగా.. ఆక్షనీర్ మల్లికా సాగర్.. పంజాబ్ తమ పాత ఆటగాడి కోసం రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించుకుంటుందేమో అడిగారు.ఇందుకు సమ్మతించిన పంజాబ్ అర్ష్‌దీప్‌నకు అంతే మొత్తం చెల్లిస్తామని చెప్పింది. అయినా కావ్యా మారన్ వెనక్కి తగ్గలేదు. ఏకంగా రెండున్నర కోట్ల మేర పెంచింది. అయితే, పంజాబ్ మాత్రం అర్ష్‌దీప్‌ను వదులుకోలేకపోయింది. ఫలితంగా ఫైనల్‌గా సన్‌రైజర్స్ వేసిన బిడ్‌కు సమానంగా రూ. 18 కోట్లు చెల్లించి అర్ష్‌దీప్‌ను సొంతం చేసుకుంది.క్యాష్ రిచ్ లీగ్‌లో రూ. 18 కోట్ల భారీ ధరఫలితంగా అర్ష్‌దీప్‌నకు వేలంలో సరైన విలువ, తగిన జట్టు లభించాయి. వరుసగా ఆరు సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్‌కే అతడు వచ్చే సీజన్లో ఆడనున్నాడు. అంతేకాదు.. క్యాష్ రిచ్ లీగ్‌లో రూ. 18 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన భారత తొలి ఆటగాడిగా అర్ష్‌దీప్ నిలిచాడు. ఏదేమైనా కావ్యా.. ప్రీతితో పోటీపడటం వల్ల అర్ష్‌దీప్‌పై కోట్ల వర్షం కురిసిన మాట వాస్తవం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఐపీఎల్ 2025 తొలి రోజు వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..! -
పిల్లల కోసం ఆ ట్రీట్మెంట్.. విపరీతమైన బాధ అనుభవించా : ప్రీతి జింటా
సినీ తారల జీవితం బయటకు చూడడానికి అద్దాల మేడలా కనిపిస్తుంది. ఒక్కసారి లోపలికి తొంగి చూస్తే కనిపించేదంతా ఊహించడానికి కష్టంగా ఉంటుంది. తెరపై పండించే వినోదం వెనుక ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. బయటకు చెప్పుకోలేని సమస్యలు తారలను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయి. అయితే ఇవేవి తమ అభిమానులకు తెలియజేయకుండా..తమ నటనతో వారిని అలరిస్తూ ఉంటారు. బాలీవుడ్ నటి ప్రీతీ జింటా కూడా నిజ జీవితంలో చాలా కష్టాలు పడినా.. వెండితెరపై మాత్రం మహారాణిలా నవ్వుతూ కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయట. తాజాగా ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న కష్ట సమయం గురించి వెల్లడిస్తూ..తల్లి అయ్యేందుకు పడిని బాధలను షేర్ చేసుకుంది. ‘అందరి జీవితాల్లో లాగే నా లైఫ్‌లో కూడా మంచి రోజులతో పాటు చెడ్డ రోజులు కూడా ఉన్నాయి. నిజ జీవితంలో సంతోషంగా ఉండేందుకు చాలా సార్లు కష్టపడ్డాను. ముఖ్యంగా పిల్లల కోసం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పడు చాలా బాధను అనుభవించాను. కొన్నిసార్లు తల గోడకు కొట్టుకొని ఏడవాలనిపించేది. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండేదాన్ని. కానీ ఆ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది. దీంతో చివరకు సరోగసి ద్వారా తల్లినయ్యాను’ అని ప్రీతిజింటా చెప్పుకొచ్చింది. 2016లో అమెరికాకు చెందిన జీన్‌ను ప్రీతి జింటా వివాహం చేసుకుంది. 2021లో సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది. సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న ‘లాహోర్: 1947’లో ప్రీతి కీలక పాత్రను పోషిస్తోంది. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ తన బ్యానర్లో నిర్మిస్తున్నాడు. -
పంజాబ్ కింగ్స్‌లో విభేదాలు.. కోర్టు మెట్లెక్కిన ప్రీతి జింటా?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ ఫాంచైజీలో ముసలం చోటు చేసుకుంది. ఆ జట్టు యజమానుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలో బాలీవుడ్ నటి ప్రీతి జింటా, పారిశ్రామిక వేత్తలు మోహిత్ బర్మన్, నెస్ వాడియాలు ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. ఇందులో అత్యధికంగా 48 శాతంతో బర్మన్ వాటాను కలిగి ఉన్నాడు. అదేవిధంగా ప్రీతీ జింటాకు 23 శాతం, నెస్ వాడియాకు 23 శాతం, మిగతా వాటా కరన్ పాల్ అనే వ్యాపారవేత్తకు ఉంది. అయితే అత్యధిక వాటా కలిగిన బర్మన్.. తన షేర్లను ఇతర భాగస్వాములకు తెలియకుండా అమ్మేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన వాటాలోని 11.5 శాతం కొత్త వ్యక్తికి విక్రయించేందుకు బర్మన్ డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే తన సహయాజమని అయిన బర్మన్ షేర్లను విక్రయించకుండా అడ్డుకోవాలని ప్రీతీ జింటా చండీగఢ్ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. అయితే ఈ కేసుపై ఆగస్టు 20న హైకోర్టులో విచారణ జరగనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా అంతర్గత ఒప్పందాల ప్రకారం.. ఫ్రాంఛైజీలోని వాటాదారుల్లో ఎవరైన తమ షేర్‌ను విక్రయించాలని భావిస్తే తొలుత ఇతర యజమానులకు సమాచారం అందాల్సిందే. అయితే బర్మన్ ఈ ఒప్పందాన్ని ఇప్పుడు ఉల్లంఘించడంతో ప్రీతా జింటా కోర్టు మెట్లు ఎక్కినట్లు వినికిడి. కాగా ఈ విషయంపై పంజాబ్ కింగ్స్ ప్రతినిథులు నుంచి మాత్రం ఎటువంటి ఆధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ వార్తలను మోహిత్ బర్మన్ మాత్రం కొట్టిపారేశాడు. "తన షేర్లను విక్రయించే ఆలోచన లేదు" అని క్రిక్‌బజ్‌తో బర్మన్ పేర్కొన్నాడు. -
25 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న రాజకుమారుడు మూవీ..
-
నా జీవితంలో ఈ సినిమా చాలా ప్రత్యేకం: ప్రీతీ జింటా
ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనుంది. సన్నీడియోల్ హీరోగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్‌ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాలోని ప్రీతీ జింటా పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఆమె ఈ విషయాన్ని చెబుతూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది.'లాహోర్ 1947'లో ప్రీతీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఆరేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నడంతో ఆమె ఇలా చెప్పింది. 'ఈ సినిమాలో నా పాత్రకు సంబంధించి నా షూటింగ్ ముగిసింది. నా జీవితంలో చాలా సినిమాల్లో నటించాను అయితే, ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఇప్పటి వరకు నేను నటించిన ప్రాజెక్టుల కన్నా కఠినమైన సినిమా ఇదే. లాహోర్‌లో 1947లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అభిమానులందరికీ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.' అని ఆమె తెలిపింది.ఈ సంగతి ఇలా ఉంచితే... 2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్‌హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిసిన రోజు నుంచి ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
Cannes 2024: సన్నజాజి తీగలా సొట్ట బుగ్గల సుందరి (ఫొటోలు)
-
కేన్స్ రెడ్‌కార్పెట్‌పై సంప్రదాయ చీరలో మెరిసిన ప్రీతి జింటా!
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకలో వివిధ రకాల సెలబ్రిటీలు, ప్రముఖులు విభిన్నమైన డిజైనర్‌వేర్ దుస్తులతో సందడి చేశారు. కానీ అస్సాం నటి, వ్యాపారవేత్త భారతీయ సంప్రదాయ చీరలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. వీరి సరసన బాలీవుడ్ నటి, ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టు ఓనర్ ప్రీతీ జింటా కూడా చేరింది ఆమె కూడా దేశీ ష్యాషన్ రూట్‌నే సెలక్ట్ చేసుకుంది. చాలా విరామం తర్వాత ఈ 77 ఫ్రాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై మెరిసింది. ఆమె ఈ చీరలుక్లో లేత గులాబీలా అందంగా కనిపించింది. డిజైనర్ సీమా గుజ్రాల్ చేతిలో రూపుదిద్దుకున్న ఓండ్రే పింక్ సీక్విన్ జార్జెట్ చీరలో అద్భుతంగా కనిపించింప్రీతి. ఈ చీరపై చక్కటి ముత్యాలు, సీక్విన్, బీడ్‌వర్క్ ఉన్నాయి. ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో జత చేయబడింది. ఈ చీర ధర ఏకంగా రూ. 118,000/. ఈ వేడుకలో ప్రీతి జంటా తన అభిమానులకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చింది. ఈ స్టైలిష్ మిలీనియల్ చీరకు తగ్గట్టుగా స్లీవ్‌లెస్ వి నెక్ బ్లౌజ్ మంచి లుక్ తెచ్చిపెట్టింది ఆమెకు. వాటన్నింటకీ అనుగుణంగా కర్లీ హెయిర్‌ని వదులుగా ఉంచడం ఓ డిఫెరెంట్ లుక్ తెప్పించింది ప్రీతికి. అంతేగాదు ఆమె ఈ కేన్స్‌లో ఇంతలా సింప్లిసిటీగా రెడీ అయ్యి రావడం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేసినా..ఆమె స్టన్నింగ్ లుక్ అందర్నీ చూపుతిప్పుకోనివ్వ లేదు. ఇద వేడుకలో మరో డిజైన డ్రెస్‌లో కూడా కనిపించింది. ఈ ఈవెంట్లో తొలి ప్రదర్శనలో పెళ్లి కూతురు మాదిరి నైరా బ్రైడల్ గౌనులో మెరిసింది. దీని ధర ఏకంగా రూ. 5,57,600/-. ఇక ప్రీతీ కేన్స్ వేడుకలో మాట్లాడుతూ..ఇది అద్భుతమైనది. ఈ కేన్స్ వేడుకలతో తనకు విడదీయలేని సంబంధం ఉందన్నారు. తాను మళ్లీ మూవీస్‌లోకి రీ ఇంట్రీ ఇచ్చానని, ఇది తనకు సినీ జీవితంలో సెకండ్ లైఫ్ అని అన్నారు. అందువల్లే తాను సంతోష్‌తో కలిసి లాహోర్ 1947లో నటించానని చెప్పుకొచ్చారు. ఈ అద్భుతమైన ప్రతిష్టాత్మకమైన అవార్డను రాజ్‌కుమార్ సంతోష్‌కి అందించే అవకాశం తరకు లభించడంతో ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు కాదు, తొలి ఆసియా వ్యక్తి కాబట్టి నేను చాలా గొప్పగా భావిస్తున్నానని అన్నారు ప్రీతి. కాగా, బాలువుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సరసన ప్రీతి జింటా నటించిన తొలి చిత్రం దిల్ సే(1998) మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు రాజ్‌కుమార్ సంతోష్. ప్రేక్షకుల ముందుకు రానున్న పీరియాడికల్ డ్రామా లాహోర్ 1947 కోసం రాజ్‌కుమార్ సంతోషితో మరోసారి కలిసి పనిచేశారు.(చదవండి: ‘మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్!..కరెంట్‌తో పనిలేదు..!) -
నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్‌కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!
దిల్ చాహ్త హై సినిమాలో హీరో సైఫ్ అలీ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించి క్లిక్కయింది నటి సుచిత్ర పిళ్లై. హిందీలో పలు సినిమాలు చేసిన ఈమె మొదట హాలీవుడ్ చిత్రాల్లో మెరిసింది. ఈమె గతంలో పవన్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. తర్వాత లార్స్ జెల్డ్సెన్ను రెండో పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిళ్ల గురించి ప్రస్తావించింది.ప్రేమించిన మూడు రోజులకే'ఓ పెళ్లిలో పవన్ మాలిక్‌ను కలిశాను. అక్కడే ఇద్దరం ప్రేమించుకున్నాం.. మూడు రోజుల్లోనే ఇంటికి వచ్చి అందరికీ తన గురించి చెప్పి ఒప్పించాడు. అలా ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. 20 ఏళ్ల వయసులోనే వైవాహిక బంధంలో అడుగుపెట్టాను. తనతో కలిసి లండన్‌లోనే ఉండేదాన్ని. ఎంత త్వరగా పెళ్లి చేసుకున్నామో అంతే త్వరగా విడిపోయాం. ఏడాది తిరిగేసరికి మా మధ్య గ్యాప్ వచ్చింది. పైకి మాత్రం బాగున్నట్లు కనిపించాం. పెళ్లయిన ఏడేళ్లకు విడాకులు తీసుకున్నాం.వేరేవాళ్ల ప్రియుడిని ఎత్తుకుపోతానా?నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చాక ఆండ్రూ కోయిన్ను ప్రేమించాను. అతడికి అప్పటికే మోడల్ అచ్ల సచ్దేవ్తో బ్రేకప్ జరిగింది. దానికి నన్ను బాధ్యురాలిని చేశారు. వారి బ్రేకప్‌కు, నాకు సంబంధమే లేదు. అలాగే 2005లో లార్స్ జెల్డ్సెన్తో నా రెండో పెళ్లి జరిగింది. అప్పుడు నాపై బాయ్‌ఫ్రెండ్ స్నాచర్ అని ట్యాగ్ వేశారు. ఎవరినీ విడగొట్టలేదులార్స్ నాకు పరిచయమయ్యే సమయానికే అతడు, హీరోయిన్ ప్రీతిజింటా ప్రేమించుకున్నారు, బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. నేను వారిద్దరి మధ్యలోకి వెళ్లలేదు. అప్పటికే వాళ్లు ఏదో కారణంతో విడిపోయారు. ఆ తర్వాతే నాకు అతడు పరిచయమయ్యాడు, ప్రేమించుకున్నాం. అంతేకానీ నేనెవరినీ విడగొట్టలేదు' అని చెప్పుకొచ్చింది.చదవండి: ఒక్కరోజు కాంప్రమైజ్ అయితే స్టార్ హీరో మూవీలో ఛాన్స్.. ఫస్ట్‌లో.. -
RCB Vs PBKS: సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్‌లో ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో పంజాబ్ అభిమానులతో పాటు ఆ జట్టు మేనేజ్మెంట్కు సైతం భంగపాటు తప్పలేదు. అయితే, జట్టు పరాభవం నేపథ్యంలోనూ పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.కోహ్లి వికెట్ పడగానే కాగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను ఆర్సీబీ 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో విరాట్ కోహ్లిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 7 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేశాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రిలీ రొసోవ్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఈ ఆర్సీబీ ఓపెనర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ కోహ్లి వికెట్‌ను సెలబ్రేట్ చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో నిరాశకు లోనైనా ప్రీతి జింటా హుందాగా వ్యవహరించింది.సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్‌ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న సమయంలో.. మ్యాచ్‌ను తాము లాగేసుకున్నందుకు ప్రీతి జింటాకు సారీ చెప్పాడు. ఇందుకు బదులుగా కోహ్లితో కరచాలనం చేస్తూ... ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా నవ్వులు చిందించిందామె.ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకాను ప్రీతి జింటాతో పోలుస్తూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. సంజీవ్ గోయెంకాకు చురకలుమ్యాచ్ ఓడటమే కాదు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినా ప్రీతి ఆ బాధ బయటకు తెలియకుండా నవ్వుతూ కవర్ చేసిందని.. ఆమెను చూసి గోయెంకా చాలా నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓటమి నేపథ్యంలో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు బహిరంగంగానే చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్Preity Zinta with Virat Kohli at the post match presentation ceremony. ❤️ pic.twitter.com/z1G2L1IIr8— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024Virat Kohli said Sorry to Preity Zinta when he met with her in post match award presentation & Preity Zinta smiles.- King Kohli winning the hearts of everyone, He's a pure soul. ❤️🐐 pic.twitter.com/2h2JFnZsyz— Tanuj Singh (@ImTanujSingh) May 10, 2024 -
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
చెన్నై సూపర్ కింగ్స్‌పై జైత్రయాత్రను కొనసాగించాలనుకున్న పంజాబ్ కింగ్స్‌కు భంగపాటు ఎదురైంది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 28 పరుగుల తేడాతో సామ్ కరన్ బృందాన్ని చిత్తు చేసింది.తద్వారా ఐపీఎల్లో వరుసగా ఆరోసారి సీఎస్కేపై గెలుపొందాలని భావించిన పంజాబ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాటింగ్ మెరుపులతో పాటు.. స్పిన్ మాయాజాలంతో గైక్వాడ్ సేనకు ఈ విజయాన్ని అందించాడు.ఫలితంగా 2021 నుంచి చెన్నైపై పంజాబ్ కొనసాగిస్తున్న ఆధిపత్యానికి గండిపడింది. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడం మాత్రం నిరాశను కలిగించింది.ఐపీఎల్-2024లో మూడో మ్యాచ్ నుంచి బ్యాటింగ్ మొదలుపెట్టిన తలా.. పంజాబ్‌తో పోరుకు ముందు ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వింటేజ్ ధోనిని గుర్తు చేస్తూ పరుగుల విధ్వంసం సృష్టించాడు.కానీ ధర్మశాల మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు.ఈ నేపథ్యంలో పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్‌తో పాటు ఫ్రాంఛైజీ సహ యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ధోని బౌల్డ్ కాగానే సీఎస్కే ఫ్యాన్స్ అంతా సైలెంట్ అయిపోగా.. ప్రీతి జింటా అయితే సీట్లో నుంచి లేచి నిలబడి మరీ ధోని వికెట్‌ను సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.The reactions say it all! #IPLonJioCinema #TATAIPL #PBKSvCSK pic.twitter.com/owCucgYN8d— JioCinema (@JioCinema) May 5, 2024కాగా సీఎస్కేతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(21 బంతుల్లో 32), వన్‌డౌన్ బ్యాటర్ డారిల్ మిచెల్(19 బంతుల్లో 30)తో పాటు రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43) రాణించారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ను జడ్డూ దెబ్బ కొట్టాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్(30), సామ్ కరన్(7), అశుతోశ్ శర్మ(3) రూపంలో కీలక వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు కూడా రాణించడంతో సీఎస్కే పంజాబ్‌ను 139 పరుగులకే పరిమితం చేసి.. ‘కింగ్స్’ పోరులో తామే ‘సూపర్’ అనిపించుకుంది.Full highlight of MS DHONI's greatest knock, 0(1). pic.twitter.com/FrlDKHKE5H— bitch (@TheJinxyyy) May 5, 2024 -
ప్రీతి ఈజ్ బ్యాక్
ఆరేళ్ల తర్వాత సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టారు బాలీవుడ్ నటి ప్రీతీ జింటా. సన్నీడియోల్ హీరోగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్‌ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర సరిహద్దులోని లొకేషన్స్ లో ఈ సినిమా నైట్ షూట్ జరుగుతోందని సమాచారం. తాజాగా ఈ సినిమాలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించి, చిత్రీకరణలో పాల్గొన్నట్లు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు ప్రీతీ జింటా.ఈ సంగతి ఇలా ఉంచితే... 2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్‌హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తుండటంతో ఆమె అభిమానులు ‘ప్రీతి ఈజ్ బ్యాక్’, ‘ప్రీతి రిటర్న్స్’ అంటూ పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. -
బ్యూటిఫుల్ పిక్ స్టోరీ చెప్పిన సొట్టబుగ్గల సుందరి: ఫోటో వైరల్
స్టార్ హీరోయిన్గా బాలీవుడ్‌ను ఏలిన అందాల తార ప్రీతి జింటా. యాపిల్బ్యూటీగా, డింపుల్ గర్ల్‌గా పాపులర్ అయిన ప్రీతి తాజాగా ఒక ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. హిమాచల్‌లోని సిమ్లాలో పుట్టిన ప్రీతి వెండి తెర మీద చెరగని సంతకం. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. 1998లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సందర్బంగా తీసిన ఒక ఫోటోను, దానికి సంబంధించిన జ్ఞాపకాలను ట్వీట్ చేసింది.( మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!) ‘‘దిల్ సే సెట్లో తొలి రోజు ఈ ఫోటో తీశారు. మణిరత్నం, షారూఖ్ ఖాన్‌తో కలిసి వర్క్ చేస్తుందకు చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఇంతలో మణిసార్ నన్ను చూడగానే మొహం కడుక్కుని రమ్మని, నవ్వుతూ మర్యాదగా అడిగారు. అయితే సార్... నా మేకప్ పోతుంది సార్ అని చెప్పా. నాకు కావలసింది అదే.. వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రా అని చెప్పారు అంతే మర్యాదగా. తమాషా చేస్తున్నారా అనుకున్నా మొదట. కానీ కాదని ఈ ఫోటో చూసిన తర్వాత అర్థం అయింది. ఫోటోగ్రఫీ డైరెక్టర్ సంతోష్ శివన్ గారు నిజంగా మనసు పెట్టి (దిల్సే) తీసిన ఫోటో. ప్రెష్‌గా, ప్రశాంత ముఖంతో అద్భుతమైన ఫోటో ఇది. ఆయనకు ధన్యవాదాలు’’ అంటూ తన మొమోరీస్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ ట్వీట్ 10లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. (ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్‌బర్డ్స్) This picture was taken on the first day on the set of Dil Se. I was so excited to be working with Mani Ratnam sir & Shah Rukh Khan. When Mani sir saw me he smiled and politely asked me to wash my face…. But sir… my make up will come off, I said smiling …. That’s exactly what I… pic.twitter.com/Lrr6CpSMFA — Preity G Zinta (@realpreityzinta) February 8, 2024 కాగా 1975 జనవరి 31న పుట్టిన ప్రీతి జింటా హిందీతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో అనేక సూపర్‌హిట్ మూవీలతోపాటు టాలీవుడ్లో కూడా తనదైన ముద్రను వేసుకుంది. ప్రేమంటే ఇదేరాతో టాలీవుడ్లోకి ప్రవేశించి, ప్రిన్స్ మహేష్‌బాబు సరసన 1999లో రొమాంటిక్ కామెడీ రాజ కుమారుడులో నటించి టాలీవుడ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. 2016 ఫిబ్రవరి 29న వ్యాపారవేత్త జీన్ గూడెనఫ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైనా నటిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. ఈ జంటకు ఇద్దరు(ట్విన్స్) పిల్లలు ఉన్నారు. -
IPL 2024: పొరపాటు పడ్డ ప్రీతి జింటా.. ఒకరి బదుల ఇంకొకరి కొనుగోలు..!
దుబాయ్‌లోని కోలోకోలా ఎరీనా వేదికగా నిన్న (డిసెంబర్ 19) జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా పొరపాటున ఓ ఆటగాడు అనుకుని మరో ఆటగాడిని కొనుగోలు చేసింది. అయితే, వెంటనే తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. వేలం నిర్వహకులు సదరు ఆటగాడిని పంజాబ్ కింగ్స్‌కు లాక్ చేసేసినట్లు ప్రకటించారు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కసారి ఆటగాడు ఫ్రాంచైజీకి లాక్ చేయబడితే తిరిగి అతన్ని వేలానికి విడిచిపెట్టడానికి వీలు ఉండదు. ఏం జరిగిందంటే.. నిన్న జరిగిన ఐపీఎల్ 2024 వేలం సందర్భంగా 32 ఏళ్ల ఛత్తీస్‌ఘడ్ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్ పేరు వేలానికి వచ్చింది. ప్రీతి జింటా, నెస్ వాడియాలతో కూడిన పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ పొరపాటున ఓ శశాంక్ సింగ్ అనుకుని మరో శశాంక్ సింగ్‌ను కొనుగోలు చేసింది. శశాంక్‌ను పంజాబ్ అతని కనీస ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది. శశాంక్ కోసం మరే ఇతర ఫ్రాంచైజీలు పోటీపడలేదు. అయితే శశాంక్‌ను తాము సొంతం చేసుకున్నట్లు దృవీకరించబడిన తర్వాత పంజాబ్ యాజమాన్యం పొరబడ్డామని తెలుసుకుంది. Fantastic scenes here as the notoriously inept Punjab Kings manage to not only purchase a player they didn’t want, (Shashank Singh), they also admit to this in front of literally everyone. Singh we can guess is sat at home wondering whether to show up in March. #IPLAuction #pbks pic.twitter.com/PtLQv9t07H — Punjab Kings UK🇬🇧👑 (@PunjabKingsUK) December 19, 2023 అయితే అప్పటికే సమయం మించి పోవడంతో చేసేదేమీ లేక సర్దుకుపోయింది. తాము పొరబడ్డామని తెలుసుకున్న క్షణంలో పంజాబ్ కో ఓనర్ పడ్డ ఆందోళన నెట్టింట వైరలవుతుంది. ఓ శశాంక్ అనుకుని మరో శశాంక్‌ను సొంతం చేసుకున్నామని ప్రీతి జింటా బాధపడుతున్న వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది. కాగా, పంజాబ్ పొరపాటున సొంతం చేసుకున్న శశాంక్ సింగ్ ట్రాక్ రికార్డు మరీ అంత తీసి పారేయడానికి వీల్లేదు. అతను 55 టీ20ల్లో 724 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. శశాంక్‌ను 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలానికి విడిచి పెట్టింది. 2023 సీజన్ వేలంలో శశాంక్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. నిన్నటి వేలంలో పంజాబ్ చేసిన పొరపాటే మరో ఫ్రాంచైజీ కూడా చేయబోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓ ఆటగాడు అనుకుని మరో ఆటగాడి కోసం వేలంలో ప్రయత్నించింది. అయితే వారు తప్పు తెలుసుకుని డ్రాప్ అయిపోయారు. -
కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొన్న ప్రీతి జింటా!
ప్రముఖ నటి 'ప్రీతి జింటా' (Preity Zinta) ముంబైలోని బాంద్రాలో ఓ ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు 'రియల్టీ ప్లాట్‌ఫామ్ ఇండెక్స్‌టాప్.కామ్' ద్వారా తెలిసింది. ఈ అపార్ట్మెంట్ ధర ఎంత? ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రీతి జింటా ముంబైలోని పాష్ బాంద్రాలో సుమారు 1,474 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అపార్ట్‌మెంట్‌ను రూ. 17.01 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 23న జరిగినట్లు తెలుస్తోంది. కీస్టోన్ రియల్టర్స్ లిమిటెడ్ దీనిని విక్రయించినట్లు, దీని కోసం నటి రూ. 85.07 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు సమాచారం. ప్రీతి జింటా మొత్తం ఆస్తుల విలువ ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు వంటి తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిదోచిన ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఈమె మొత్తం ఆస్తుల విలువ 15 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 110 కోట్లు. ముంబై రియల్ ఎస్టేట్ ముంబై రియల్ ఎస్టేట్ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఇక్కడ స్థలాలను కొనుగోలు చేశారు. ఇటీవల బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, అతని భార్య షబానా బాజ్‌పేయి ముంబైలోని ఓషివారా ప్రాంతంలో రూ. 32.94 కోట్లతో 7,620 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో నాలుగు ఆఫిస్ యూనిట్లను కొనుగోలు చేశారు. ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాను మించి.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి గురించి ఆసక్తికర విషయాలు! సినీ నటులు అమితాబ్ బచ్చన్ , కార్తీక్ ఆర్యన్ గతంలో ముంబై, దాని పరిసర ప్రాంతాలలో స్థలాలను కొనుగోలు చేశారు. ఎక్కువ మంది నివాస స్థలాల కంటే ఎక్కువ అద్దె రాబడి కోసం కమర్షియల్ ఆస్తుల మీద పెట్టుబడులు పెడుతున్నారు. -
పిల్లలూ తల్లులూ చల్లని వారే!
దృశ్యం:1 ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తీ మేరీ జోనాస్ కోసం ఇంట్లో ‘ప్లే డేట్’ నిర్వహించింది. ఈ ఆటల కార్యక్రమానికి ప్రీతీ జింటా పిల్లలు జే, గియాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘ఇన్క్రెడిబుల్ వీకెండ్’ కాప్షన్‌తో ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ పిల్లల ఆటల ఫొటోలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. ‘మంచి ఐడియా దొరికింది. మా చిన్నారి కోసం ఇలాంటి కార్యక్రమం త్వరలో మా ఇంట్లో ఏర్పాటు చేయనున్నాను’ అని ఒక నెటిజన్ స్పందించారు. దృశ్యం: 2 అమ్మ గురించి చెప్పడానికి ఎన్నో మాటలు అక్కర్లేదు. ‘అమ్మా’ అనే పిలుపులోనే ఎన్నో వినిపిస్తాయి. తల్లి ఒమ్న కురియన్ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే మై ఎవ్రీ థింగ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలియజేసింది నయనతార. తన సర్వస్వం అయిన తల్లి గురించి ఎన్నో సందర్భాల్లో నయన్ చెప్పింది. ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగు పెట్టింది. తన కుమారులు ఉయిర్, ఉలాగ్‌లతో ఉన్న ఫస్ట్ పోస్ట్ 2.6 మిలియన్ల లైక్‌లను దక్కించుకుంది. -
ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్
ప్రముఖ గాయని, చిత్రకారిణి, నటి సుచిత్రా కృష్ణమూర్తి చాలాకాలం తర్వాత మరోసారి తన విడాకుల గురించి ప్రస్తావించింది. 1999లో దర్శకుడు శేఖర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె 2007లో అతడికి విడాకులిచ్చింది. అయితే పెళ్లికి ముందు వరకు నటిగానూ మంచి క్రేజ్ అందుకున్న ఆమె వివాహం తర్వాత నటించకూడదని శేఖర్ పెట్టిన కండీషన్ వల్ల నటనకు దూరైంది. తనకంటే 30 ఏళ్లు పెద్దవాడు, అందులోనూ అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకోవడంతో ఇంట్లో ఎవరూ ఒప్పుకోకపోయినా వాళ్లను ఎదిరించి మరీ శేఖర్‌తో ఏడడుగులు వేసింది. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. కానీ అతడి ప్రేమలో నిజాయితీ లేదంటూ శేఖర్‌కు విడాకులిచ్చేసి తన దారి తాను చూసుకుంది. ఈ విషయాలన్నీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆమె హీరోయిన్ ప్రీతిజింటాపై మరోసారి నిప్పులు చెరిగింది. తన విడాకులకు కారణం ప్రీతినే అని వెల్లడించిన సుచిత్రా.. ఇప్పటికీ తనను క్షమించేది లేదని చెప్పుకొచ్చింది. భార్యాభర్తల మధ్యలో ప్రీతి దూరడం వల్లే తమ వైవాహిక జీవితం తెరపడిందని గతంలో కూడా హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ రోజుల్లోనే ఈ ఆరోపణలను ప్రీతి ధీటుగా తిప్పికొట్టింది. 'నేనిప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోయిన్ను. కనీసం నువ్వు సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం లేదు. కేవలం ఇంట్లో ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోయావు. సుచిత్రా.. నువ్వు నాతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడకు. నీ మానసిక స్థితి సరిగా లేనట్లుంది.. ముందు వెళ్లి ఏదైనా మంచి సైకియాట్రిస్ట్‌కు చూపించుకో' అని కౌంటర్ ఇచ్చింది. సదరు వ్యాఖ్యలను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి గుర్తు చేయగా.. సుచిత్ర స్పందిస్తూ.. 'తన మాటలను నేను పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. ఒక గృహిణిగా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. 20 ఏళ్లు తల్లిగా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఎవరెన్ని మాట్లాడినా సత్యానికే బలం ఉంటుంది. చివరకు అదే నిలబడుతుంది. ఇప్పటికీ నేను ఆమెను క్షమించను. అసలు తను ఉందా? లేదా? అన్నది కూడా పట్టించుకోను' అని చెప్పుకొచ్చింది. (చదవండి: ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు.. పవన్ 'బ్రో'పై థమన్ సీరియస్ కామెంట్స్) -
ట్రాక్‌లో పడాలంటే ఆలు పరోటాలు చేయాల్సిందేనా!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శుక్రవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 56 పరుగులు తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 258 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని చేధించే క్రమంలో పంజాబ్ పోరాటం 201 పరుగుల వద్ద ముగిసింది. అయితే పంజాబ్ తరపున 33 బంతుల్లో 66 పరుగులు చేసిన అథర్వ తైదే మాత్రం ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలి ఎడిషన్ నుంచి ఉన్న పంజాబ్ కింగ్స్(కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) టైటిల్ కోరిక మాత్రం నెరవేరలేదు. మరి ఈసారైనా పంజాబ్ కింగ్స్ టైటిల్ కొట్టి ప్రీతి జింటా కోరిక నెరవేరుస్తుందేమో చూడాలి. తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రీతి గతంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పింది. తమ జట్టు ప్లేయర్ల కోసం 120 పరోటాలు చేసినట్లు గుర్తు చేసింది. స్టార్ స్పోర్ట్స్ యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. అబ్బాయిలు ఇంతలా తినంటారన్న విషయం తనకు అప్పుడే తెలిసిందని పేర్కొంది. 2009లో ఐపీఎల్ సౌతాఫ్రికాలో జరిగింది. అక్కడ తమ ప్లేయర్లకు మంచి పరోటాలు దొరకలేదని, పరోటాలు చేయడం మీకు నేర్పిస్తానని ప్రీతి అన్నారు. అయితే తమకు ఆలూ పరోటాలు కావాలని ప్లేయర్లు అడిగారని, వచ్చే మ్యాచ్ గెలిస్తే పరోటాలు చేసి ఇస్తానని ప్రీతి హామీ ఇచ్చింది. ఇక పంజాబీ జట్టు ఆ మ్యాచ్‌ను నెగ్గింది. దీంతో ప్రీతి స్వయంగా 120 పరోటాలు చేసిన ప్లేయర్లకు ఇచ్చింది. ప్రీతి ఇచ్చిన సమాధానం విన్న హర్భజన్.. ఇర్ఫాన్ పఠాన్ ఒక్కడే 20 పరోటాలు తిన్నట్లు చెప్పాడు. చివర్లో మా జట్టు ట్రాక్‌లో పడాలంటే మళ్లీ ఆలు పరోటాలు చేయాలేమో అని ప్రీతి జింటా అనడంతో నవ్వులు విరపూశాయి. 🚨 Star Sports Exclusive 🚨 Throwback to when @realpreityzinta discovered that her @PunjabKingsIPL side have an appetite for more than just winning! 🤣 Tune-in to #PBKSvLSG at #IPLonStar Today | Pre-show at 6:30 PM & LIVE action at 7:30 PM | Star Sports Network#BetterTogether pic.twitter.com/XpeYglFUSf — Star Sports (@StarSportsIndia) April 28, 2023 చదవండి: పంజాబ్ ఓడినా తాను గెలిచాడు.. ఎవరీ అథర్వ తైదే? -
ప్రీతి జింటాతో షమీ ముచ్చట.. ఫోటో వైరల్
పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటాకు ఈ ఏడాదైనా తన కల నెరవేరుతుందేమో చూడాలి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్న పంజాబ్ కింగ్స్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌గా ఐపీఎల్లో తమ ప్రస్థానం ఆరంభించి 2014లో ఫైనల్ మెట్టుపై బోల్తా పడింది. అంతే అప్పటి నుంచి ఇప్పటివరకు మరోసారి ఫైనల్ మెట్టు ఎక్కలేదు. ఇక కింగ్స్ పంజాబ్ అని పేరును మార్చుకున్న తర్వాత కూడా జట్టుకు కలిసిరావడం లేదు. అందుకే ఈసారి శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంచుకొని ఈ సీజన్లో రెండు వరుస విజయాలు నమోదు చేసింది. అయితే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం ఓటమి పాలైంది. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఓడింది. ఈ సంగతి పక్కనబెడితే మ్యాచ్ ముగిశాకా ప్రీతి జింటా.. గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ షమీతో ముచ్చటించడం ఆసక్తిగా మారింది. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకున్నారు. వీరిద్దరు నవ్వుతున్న ఫోటోను కెమెరామన్ క్లిక్‌మనిపించాడు. గుజరాత్ టైటాన్స్ ఈ ఫోటోను షేర్ చేస్తూ పాత స్నేహితుడిని కలిసిన ఆనందం అనుకుంటా అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక మహ్మద్ షమీ 2019 నుంచి 2021 వరకు పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు పంజాబ్ కింగ్స్‌కు మెయిన్ బౌలర్‌గా వ్యవహరించాడు. POV: 𝘞𝘩𝘦𝘯 𝘺𝘰𝘶 𝘳𝘶𝘯 𝘪𝘯𝘵𝘰 𝘢𝘯 𝘰𝘭𝘥 𝘧𝘳𝘪𝘦𝘯𝘥! 😃#PBKSvGT | #TATAIPL 2023 | @MdShami11 @realpreityzinta pic.twitter.com/VKqAl36bH0 — Gujarat Titans (@gujarat_titans) April 13, 2023 చదవండి: కేకేఆర్ వద్దన్నోడిని ఎస్ఆర్హెచ్ హత్తుకుంది.. ప్రతీకారం తీర్చుకునేనా? -
గిల్ క్లీన్ బౌల్డ్.. ప్రీతీ జింటా రియాక్షన్ సూపర్! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలూండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(67) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కాగా గుజరాత్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 7 పరుగులు అవసరమవ్వగా.. ధావన్ సామ్ కర్రాన్ చేతికి బంతిని ఇచ్చాడు. తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీసి గిల్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. అయితే కర్రాన్ వేసిన అద్భుత బంతికి గిల్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ఒక్క సారిగా పంజాబ్ డగౌట్ మొత్తం సంబరాల్లో మునిగి తేలిపోయింది. ముఖ్యంగా స్టాండ్స్ నుంచి మ్యాచ్‌ను వీక్షిస్తున్న పంజాబ్ సహ యాజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా అనందానికి అవధులు లేకుండా పోయాయి. గిల్ ఔటైన వెంటనే ప్రీతి జింటా.. బాలీవుడ్ నటులు అర్బాజ్ ఖాన్, సోనూ సూద్‌లతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకుంది. అయితే ఆమె ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తర్వాతి రెండు బంతులు తర్వాత తెవాటియా ఫోరు బాది పంజాబ్‌కు ఓటమి మిగిలించాడు. కాగా ప్రీతి జింటా రియాక్షన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2023: ఏంటి హార్దిక్.. ఎంత కెప్టెన్ అయితే? మరీ చెత్త బ్యాటింగ్! A last-over finish yet AGAIN! 👌 👌 It's the @gujarat_titans who hold their nerve against the spirited @PunjabKingsIPL ! 👏👏 Scorecard ▶️ https://t.co/RkqkycoCcd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/jYOqN5GBtK — IndianPremierLeague (@IPL) April 13, 2023 #TATAIPL2023#PBKSvsGT #SamKaran #RahulTewatia #Miller #SumanGill #PreityZinta #SonuSud pic.twitter.com/hdqpIjVkPB — सुर्गीव विश्वकर्मा (@Sugreev96733097) April 13, 2023 -
మేడమ్ ప్లీజ్ అంటూ భిక్షమడిగిన దివ్యాంగుడు.. పట్టించుకోని హీరోయిన్
బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ ప్రీతి జింటా ఏరికోరి తలనొప్పులు తెచ్చుకుంది. ఎయిర్‌పోర్టుకు వెళ్లే బిజీలో ఉన్న ప్రీతి అక్కడ భిక్షాటన చేస్తున్న వ్యక్తిని పట్టించుకోకుండా తన దారిన తను వెళ్లిపోయింది. అతడేమో ఎంతో కొంత డబ్బు ఇవ్వకపోతుందా అన్న ఆశతో హీరోయిన్ కారు వైపే వీల్‌చైర్ తోసుకుంటూ వెళ్లాడు. ప్లీజ్ మేడమ్ ప్లీజ్ అంటూ ఆర్తిగా అభ్యర్థించాడు. అది గమనించని ప్రీతి కారులో రయ్యిమని ముందుకు దూసుకుపోయింది. అయినా సరే ఆమె కారును అందుకుందామని ప్రయత్నించిన దివ్యాంగుడి ప్రయత్నం వృధా అయింది. ఇది చూసిన జనాలు ప్రీతిని తిట్టిపోస్తున్నారు. రూ.100 కోట్లు ఉన్న నువ్వు కనీసం వంద రూపాయలు కూడా ఇవ్వలేవా? కొంచెమైనా సిగ్గనిపించడం లేదా? అని తిట్టిపోస్తున్నారు. 'పాపం, ఎంతో ఆశపడ్డ అతడికి తోచినంత ఇవ్వాల్సింది, ఏమీ ఇవ్వకుండా వెళ్లిపోయినందుకు అతడు ఎంత బాధపడి ఉంటాడో' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా 1998లో మణిరత్నం డైరెక్ట్ చేసిన 'దిల్ సే' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ప్రీతి జింటా. ఈ చిత్రంతో ఉత్తమ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. అదే ఏడాది 'ప్రేమంటే ఇదేరా' చిత్రంతో టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ మరుసటి ఏడాది మహేశ్‌బాబుతో 'రాజకుమారుడు'లో నటించింది. హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఆమె బుల్లితెరపై ప్రసారమైన పలు షోలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. ఇకపోతే ప్రీతి జింటా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ సహ యజమానురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)