
జింతాక చితా చితా...
బాలీవుడ్‌లో మరోసారి వెలిగిపోవాలని కలలు కంటోందట ప్రీతి జింటా...
గాసిప్
బాలీవుడ్‌లో మరోసారి వెలిగిపోవాలని కలలు కంటోందట ప్రీతి జింటా.
కాలం కలిసొస్తే... సూపర్‌స్టార్‌లు సల్మాన్, న్‌షారుక్‌ఖాల సరసన నటించాలని కూడా ఆశిస్తోందట.
తన ఆశ నెరవేర్చుకోవడానికి ఈ సొట్టబుగ్గల సుందరి తాజాగా పొగడ్తల మంత్రం జపిస్తోంది.
సల్మాన్‌ఖాన్‌ను ఎలా పొగిడిందో చూడండి...
‘‘నేను భయపడే ఏకైక హీరో సల్మాన్. అతడి ముందు నటించాలంటే చాలా భయంగా ఉంటుంది. ఎందుకో మాత్రం తెలియదు. బహుశా అది గౌరవంతో కూడిన భయం కావచ్చు. అతనితో కలిసి నటించడం ఎంత అదృష్టమో!’’
ఇక షారుక్‌ను ఇలా పొగుడుతోంది....
‘‘భావోద్వేగాలతో ఏడిపించడంలో షారుక్‌లాంటి హీరోని నేనింత వరకు చూడలేదు. ఆయన నటనలో పడి ఎన్నిసార్లు ఏడ్చానో. గొప్ప నటుడు షారుక్’’.
‘పనిలో పనిగా అమీర్‌ఖాన్‌ను కూడా పొగడక పోయావా!’ అన్నారట ఎవరో వ్యంగ్యంగా. బాలీవుడ్‌లో 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రీతి జింటా ఈ వ్యంగ్య బాణాలేవీ పట్టించుకునే మూడ్‌లో లేదు.
చిన్నా చితకా సినిమాలు, టీవి కార్యక్రమాల్లో నటించడం కంటే అగ్రహీరోల సరసన నటించడం ద్వారా పూర్వపు పాపులారిటీ సంపాదించాలనేది ఆమె ప్లాన్ కావచ్చు.
అందుకేనేమో సూపర్ స్టార్‌లతో మళ్లీ కలిసి నటించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగానే ఉంది. ఆమె ప్రయత్నాలు ఓకే అయితే మాత్రం... అభిమానులు జింతాక చితా చితే!