సల్మాన్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్‌.. ట్రైలర్‌ వచ్చేసింది | Salman Khan and Rashmika SIKANDAR Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

SIKANDAR Official Trailer: సల్మాన్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్‌.. ట్రైలర్‌ వచ్చేసింది

Published Sun, Mar 23 2025 6:43 PM | Last Updated on Sun, Mar 23 2025 6:43 PM

Salman Khan and Rashmika SIKANDAR Official Trailer Out Now

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌, పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సికందర్. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, సల్మాన్ ఫిల్మ్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై  సాజిద్‌ నదియావాలా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలోనే మేకర్స్ సికందర్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్‌ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో సల్మాన్ ఖాన్ ఫైట్స్, డైలాగ్స్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ యాక్షన్‌ మూవీలో సత్యరాజ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతమందించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement