
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. తన ఖాతాలో వరుసగా డిజాస్టర్లు పడుతున్నాయి. అతడు నటించిన లేటెస్ట్ మూవీ సికందర్ (Sikandar Movie) కూడా బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్ర పోషించింది.
కాజల్ సీన్ డిలీట్
అయితే సినిమాలో కాజల్ (Kajal Aggarwal) సీన్ డిలీట్ చేశారంటూ నెట్టింట గగ్గోలు వినిపిస్తోంది. ఈ మేరకు ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఏముందంటే.. అత్తింట్లో కాజల్ చనిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను ఎలాగోలా కాపాడతారు. అయితే ఆమె మామ మాత్రం.. చనిపోవడానికి మా ఇల్లే దొరికిందా? అని నిందిస్తారు. ఈ చావేదో పుట్టింట్లో చావు అని శాపనార్థాలు పెడతారు. అప్పుడే అటుగా వెళ్తున్న సల్మాన్ ఇదంతా చూస్తాడు. పెద్ద డైలాగ్ చెప్తాడు. ఆడవారికి కావాల్సింది డబ్బు కాదని, మనమిచ్చే సపోర్ట్ అని చెప్పుకుంటూ పోతాడు.
ఇంత చెత్త ఎడిటింగా?
ఈ సీన్‌ను ఎక్స్ (ట్విటర్)లో చూసిన అభిమానులు.. 'అదేంటి? ఈ సన్నివేశం సినిమాలో లేదా? అందుకే డిజాస్టర్ అయింది, ఇది ఉండుంటే సినిమాకు ప్లస్సయ్యేది..', 'ఫస్ట్ డే సినిమా చూసినప్పుడు ఈ సన్నివేశాన్ని అలాగే ఉంచినట్లు గుర్తు.. ఇప్పుడు దాన్ని లేపేశారా?', 'జనాలు కచ్చితంగా చూడాల్సిన ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని కట్ చేసి పడేస్తే ఎలా? ఇంత చెత్త ఎడిటింగ్ ఎందుకు?' అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సికందర్ సినిమా విషయానికి వస్తే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 21 రోజుల్లో రూ.110 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది.
Why was this scene cut from the Film by Editing??@BeingSalmanKhan that was a great and important scene for people to see... WHY THIS BAD EDITING??#Sikandar pic.twitter.com/FpV6zdRwR6
— Ldpe414 (@ldpe414) April 20, 2025
చదవండి: బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి