Sikandar Movie
-
నీ అభిమానం తగలెయ్య.. ఏకంగా రూ.1.72 లక్షల విలువైన టికెట్లు దానం
ఈసారి ఉగాది, రంజాన్ పండగలు వెంటవెంటనే వచ్చాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు సినిమాలు పోటాపోటీగా రిలీజవుతున్నాయి. ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్, (Mad Square) రాబిన్‌హుడ్ (Robinhood), ఎల్2: ఎంపురాన్ (L2:Empuraan), వీర ధీర శూరన్ (Veera Dheera Sooran: Part 2) చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడిక భారీ బడ్జెట్ సినిమా విడుదలకు సమయం ఆసన్నమైంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, బాక్సాఫీస్ క్వీన్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం సికందర్ (Sikandar Movie). ఈ మూవీ మార్చి 30న విడుదల కానుంది. లక్షన్నర ఖర్చు పెట్టి మరీ..ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సల్మాన్ (Salman Khan) వీరాభిమాని, రాజస్థాన్ వాసి కుల్దీప్ కస్వాన్ ఏకంగా 800 టికెట్లు కొనుగోలు చేశాడు. అది కూడా ఐకానిక్ గైటీ గెలాక్సీ థియేటర్లో! ఈ టికెట్ల కోసం అతడు ఏకంగా లక్షన్నర ఖర్చు చేశాడు. దీని గురించి కుల్దీప్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ కోసం నేనెప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఆయన పుట్టినరోజు నాడు నిరుపేదలకు అన్నదానం చేస్తాను. అభిమానం కాదు పిచ్చి!ఇప్పుడాయన సినిమా వస్తోంది కాబట్టి టికెట్లు పంచాలనుకున్నాను. అందుకోసం 800 టికెట్లు కొనుగోలు చేశాను. ఇందుకుగానూ రూ.1.72 లక్షలు ఖర్చు పెట్టాను. వీటిని అందరికీ పంచేస్తాను అన్నాడు. అన్నట్లుగానే ఆ 800 టికెట్లను ఉచితంగా ఇచ్చేశాడు. ఇది చూసిన జనాలు.. దీన్ని అభిమానం అనరు, పిచ్చి అంటారు అని కామెంట్లు చేస్తున్నారు.సినిమాసికందర్ సినిమా విషయానికి వస్తే.. ఈ యాక్షన్ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో సాజిద్ నదియావాలా నిర్మించాడు. కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మాన్ జోషి, ప్రతీక్ బాబర్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రీతమ్ సంగీతం అందించగా, సంతోష్ నారాయణన్ బీజీఎమ్ అందించాడు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) చదవండి: నన్ను క్షమించండి.. తప్పట్లేదు: మంచు విష్ణు -
సల్మాన్ చేతికి 'రామ్ జన్మభూమి' వాచ్.. రేటు ఎంతంటే?
సల్మాన్ ఖాన్ (Salman Khan) కొత్త సినిమా సికిందర్.. ఈద్ (రంజాన్) సందర్భంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. నార్త్ లో ఓకే కానీ దక్షిణాదిలో పెద్దగా హైప్ లేదు. మరోవైపు సౌత్ ఆడియెన్స్ తమ సినిమాల్ని చూడట్లేదంటూ సల్మాన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)ఇలా సికిందర్ (Sikandar Movie) చిత్రంపై కాస్తంత నెగిటివిటీ నడుస్తోంది. దీన్ని న్యూట్రలైజ్ చేసేందుకో ఏమో గానీ సల్మాన్.. రామ్ జన్మభూమి వాచ్ (Ram Janmabhoomi Watch) ధరించాడు. జాకబ్ & కో కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వాచీలో రాముడు, అయోధ్య రామమందిరం బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వాచ్ ధర ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సల్మాన్ చేతికి ధరించిన రామ్ జన్మభూమి ఎడిషన్ వాచ్ ఖరీదు దాదాపు రూ.34 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సికిందర్ మూవీలో రష్మిక హీరోయిన్ కాగా.. ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై సల్మాన్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. మరి ఏం ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: వెండితెరకు డొక్కా సీతమ్మ జీవితం)See you in theatres this Eid! pic.twitter.com/XlC2xFkIQ0— Salman Khan (@BeingSalmanKhan) March 27, 2025 -
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్స్‌పై 'సల్మాన్ ఖాన్' రియాక్షన్
తనకు వస్తున్న హత్య బెదిరింపుల గురించి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) స్పందించారు. తను నటించిన కొత్త సినిమా సికిందర్ (Sikandar) ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొంత కాలంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi ) నుంచి చంపేస్తామని సల్మాన్‌కు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇంటి ముందు వారు కాల్పులు కూడా జరిపారు. ఎదోరోజు ఆయనపై తప్పకుండా పగ తీర్చుకుంటామని వారు గట్టిగానే హెచ్చిరించారు. అయితే, తాజాగా ఈ బెదిరింపులపై సల్మాన్ స్పందించారు.సినిమా షూటింగ్స్ వల్ల ఎప్పుడూ కూడా సల్మాన్ చాలా ప్రయాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయనకు ప్రభుత్వం కూడా గట్టిగానే భద్రత కల్పించింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలపై ఆయన ఇలా స్పందించారు. 'నేను ఎక్కువగా దేవుడిని నమ్ముతాను. నా జీవితం ఆయన చేతుల్లోనే ఉంది. ఆయుష్షు ఎంత వరకు ఆ దేవుడు ఇచ్చాడో అంత వరకు మాత్రమే జీవిస్తాను. ఇదంతా దేవుడి ఇష్టం. గట్టి భద్రత కల్పించారు. ఒక్కోసారి ఇది కూడా పెను సవాలుగా అనిపిస్తుంది. ఏదేమైనా ఆందోళనగా ఉన్నప్పటికీ మన చేతిలో ఏమీ ఉండదు.' అని ఆయన అన్నారు.సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో సికిందర్ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) తెరకెక్కించారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. రంజాన్, ఉగాది సందర్భంగా మార్చి 30న థియేటర్స్‌లోకి రానుంది. 2023లో విడుదలైన ‘టైగర్ 3’ తర్వాత సల్మాన్ నటించిన సినిమా ఇదే కావడంతో ఆయన ఫ్యాన్స్ సికిందర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తోన్న తరుణంలో సికిందర్ పబ్లిక్ ఈవెంట్స్‌లలో ఆయన పాల్గొనడం లేదు. -
సల్మాన్ కొత్త సినిమాకు ఘోరమైన పరిస్థితి!
ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. టీజర్, ట్రైలర్ ని బట్టి సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తున్నారు. అక్కడున్నది స్టార్ హీరో అయినా, అనామక హీరో అన్నది పట్టించుకోవట్లేదు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త మూవీకి సరిగ్గా ఇలాంటి సమస్యే ఎదురైంది.(ఇదీ చదవండి: రష్మిక ఆస్తి ఎన్ని కోట్లు? ఏమేం ఉన్నాయి?)సల్మాన్ ఖాన్ కి చాన్నాళ్లుగా సరైన హిట్ లేదు. దీంతో తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తో కలిసి సికిందర్ తీశాడు. రష్మిక హీరోయిన్. కొన్నిరోజుల క్రితం టీజర్, ట్రైలర్ రిలీజయ్యాయి. కానీ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దక్షిణాది సినిమాల కాపీ అనే కామెంట్స్ వినిపించాయి. ఆ ప్రభావం ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ పై పడింది.సల్మాన్ కొత్త సినిమా ఈద్ (రంజాన్)కి రావడం ఆనవాయితీ. అందుకు తగ్గట్లే ఈ సారి పండగకు సికిందర్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా బుకింగ్స్ ఓపెన్ చేశారు. దాదాపు 24 గంటలు గడిచింది గానీ ఇప్పటివరకు రూ.1.91 కోట్ల మేర మాత్రమే టికెక్స్ బుక్ అయినట్లు తెలుస్తోంది. ఈ ట్రెండ్ ఇలానే ఉంటే మాత్రం రిలీజ్ రోజుకి రూ6-10 కోట్ల మాత్రమే వసూళ్లు రావొచ్చేమో అనిపిస్తోంది. మరి సికిందర్ రిలీజై ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: నన్ను తీసేసి యాడ్ లో ఓ కుక్కని పెట్టుకున్నారు.. హర్టయిన శోభిత) -
ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన కాజల్.. చాన్నాళ్లకు మళ్లీ ఇలా (ఫొటోలు)
-
మీకు.. సమస్య ఎందుకు ?
సల్మాన్ ఖాన్ , రష్మికా మందన్నా జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మించిన హిందీ చిత్రం ‘సికందర్’. ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈవెంట్లో సల్మాన్ ఖాన్ , రష్మికా మందన్నాల మధ్య 31 సంవత్సరాల వయసు వ్యత్యాసం విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ–‘‘నాకు, హీరోయిన్ కు (రష్మికా మందన్నాను చూస్తూ..) మధ్య ఏ సమస్య లేదు. హీరోయిన్ తండ్రికీ ఏ ఇబ్బంది లేదు.మరి.. మీకు సమస్య ఎందుకు భాయ్? (ఆడియన్స్, నెటిజన్లను ఉద్దేశిస్తూ కావొచ్చు). భవిష్యత్‌లో హీరోయిన్ కు వివాహం జరిగి, ఆమెకు ఓ కుమార్తె జన్మించి, ఆ అమ్మాయి కూడా ఇండస్ట్రీలో స్టార్ అయితే తనతోనూ కలిసి నటిస్తాను. వాళ్ల అమ్మ అనుమతి తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
సల్మాన్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సికందర్. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, సల్మాన్ ఫిల్మ్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సాజిద్ నదియావాలా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే మేకర్స్ సికందర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సల్మాన్ ఖాన్ ఫైట్స్, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ యాక్షన్ మూవీలో సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతమందించారు. -
సల్మాన్ ఖాన్ సికందర్ మూవీ భం భం భోలే సాంగ్.. (ఫోటోలు)
-
సినిమా, సినిమాకి తగ్గుతున్న సల్మాన్ ఖాన్ క్రేజ్
-
సల్మాన్ 'సికందర్' టీజర్ చూశారా?
-
సల్మాన్ ఖాన్ యాక్షన్ చిత్రం.. టీజర్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'సికందర్'. ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్ సరసన పుష్ప భామ రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ గతేడాది సింగం ఎగైన్, బేబీ జాన్ చిత్రాల్లోనూ కనిపించారు. అయితే అంతకుముందు 2023లో టైగర్-3 మూవీతో ప్రేక్షకులను అలరించాడు సల్మాన్ ఖాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ విఫలం కావడంతో సికందర్పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం ఈద్ కానుకగా మార్చి 28న థియేటర్లలోకి రానుంది. Jo dilon par karta hai raj woh aaj kehlata hai Sikandarhttps://t.co/Bn5NdtKN2z #SajidNadiadwala’s #Sikandar Directed by @ARMurugadoss @iamRashmika #Sathyaraj @TheSharmanJoshi @MsKajalAggarwal @prateikbabbar #AnjiniDhawan @jatinsarna #AyanKhan @DOP_Tirru…— Salman Khan (@BeingSalmanKhan) February 27, 2025 -
బ్యాక్ టు షూట్
‘బ్యాక్ టు షూట్’ అంటూ దాదాపు నెల రోజుల తర్వాత రష్మికా మందన్నా(Rashmika Mandanna) షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టారు. గత నెల జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆమె కాలికి గాయం అయిన విషయం తెలిసిందే. దాంతో కొన్ని వారాలు ఆమె షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చారు. గాయం తగ్గిపోవడంతో షూట్‌కి రెడీ అయ్యారు.సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్న హిందీ చిత్రం ‘సికందర్’(Sikandar) షూట్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ సినిమాకి సంబంధించి నైట్ షూట్ జరుగుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ‘సికందర్’ కాకుండా హిందీలో ‘థామా’, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘కుబేర’, తెలుగు చిత్రం ‘గర్ల్ ఫ్రెండ్’ వంటివి రష్మిక సైన్ చేశారు. నెల రోజుల బ్రేక్ తీసుకున్నారు కాబట్టి ఇక ఈ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంటారు. -
వీల్‌ఛైర్‌లో రష్మిక మందన్న.. వీడియో వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొద్దిరోజు క్రితం గాయపడిన విషయం తెలిసిందే. తన కొత్త సినిమా కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తన కాలికి గాయం అయింది. చికిత్స పొందిన తర్వాత ఆమె హైదరాబాద్ విమానాశ్రయంలో వీల్‌ఛైర్‌లో కనిపించింది అందరినీ షాక్‌కు గురిచేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ ‘ఛావా’లో రష్మిక ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమం కోసం ఆమె ముంబై వెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప2’తో శ్రీవల్లిగా థియేటర్లలో దుమ్మరేపిన రష్మిక మందన్న(Rashmika Mandan) ఇలా గాయంతో ఇబ్బంది పడుతూ కనిపించడంతో.. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.కొత్త సంవత్సరంలో ఇలా జరగడంతో రష్మిక తీవ్ర నిరాశ చెందారు. పాన్ ఇండియా రేంజ్లో టాప్ హీరోయిన్గా ఉన్న ఆమె చేతిలో నాలుగు చిత్రాలకు పైగా ఆమె చేతిలో ఉన్నాయి. గాయం కారణంగా షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆమె తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో ఆమె కొద్దిరోజుల క్రితం ఇలా పంచుకున్నారు. 'నాకు హ్యాపీ న్యూ ఇయర్ ఇలా మొదలైంది. జిమ్‌లో శిక్షణ తీసుకుంటూ ఉండగా నేను గాయపడ్డాను. (ఇదీ చదవండి: చనిపోయిన తర్వాత నా ఫోటోలు పెట్టకండి.. కన్నీళ్లతో గ్లామర్ క్వీన్ రిక్వెస్ట్)దీంతో కొన్ని వారాలు, నెలలు పాటు రెస్ట్‌లో ఉండాలి. పూర్తిగా కోలుకునేందుకు ఎన్నిరోజులు పడుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఇక నుంచి పూర్తిగా రెస్ట్ మోడ్‌లోనే ఉండాల్సి వస్తుంది. అంతా బాగాయ్యాక నేను మళ్లీ 'సికందర్ (Sikandar), కుబేర(Kubera), థామ(Thama)' సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటానని అనిపిస్తోంది. నా వల్ల సినిమా ఆలస్యం అవుతుంది. అందుకు దర్శకులు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను.' అని పేర్కొంది. 'ఛావా' (Chhaava) ప్రమోషన్స్‌లతో రష్మిక బిజీగా ఉంది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రానుంది. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ సినిమాపై ఫ్యాన్స్లలో భారీ అంచనాలు ఉన్నాయి.It's painful to see @iamRashmika like this. But at the same time, I'm also happy to see that she hasn't given up. She's showing her fans that she's a fighter, strong and unstoppable. That's why we call her our inspiration. Proud of you #RashmikaMandanna. Your strength &… pic.twitter.com/WVWjdDz2XC— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) January 22, 2025 -
‘‘మోస్ట్ అవైటెడ్ మూవీ’’లో ప్రభాస్ సినిమాలకి టాప్ ప్లేస్
ఒక ఏడాదిలో విడుదలైన సినిమాల నుంచి ప్రేక్షకాదరణను అనుసరించి టాప్ హిట్స్, టాప్ ఫ్లాప్స్ అంటూ జాబితాలు ప్రకటించడం మామూలే. అయితే ఇప్పుడిప్పుడే కొత్త ఏడాదిలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాలను కూడా గుర్తించి జాబితాలు ప్రకటించడం ట్రెండీగా మారింది. సినిమాలకు సంబంధించి రేటింగ్ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండిబి). ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా 2025లో మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను తాజాగా ప్రకటించింది. సినిమాలు, టీవీ షోలు ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబి పేజ్‌కి ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకులున్నారు. తమ వీక్షకుల ద్వారా ఈ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం అత్యధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వాటిలో నెం.1గా నిలిచింది సికందర్.ఐఎండిబి విడుదల చేసిన 2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్‌ను పరిశీలిస్తే...1. సికందర్, 2. టాక్సిక్,3. కూలీ,4. హౌస్ ఫుల్ 5. బాఘీ, 6.రాజా సాబ్, 7. వార్ 2 8. ఎల్2: ఎంపురాన్ 9. దేవా 10. చావా 11. కన్నప్ప 12. రెట్రో 13. థగ్ లైఫ్ 14. జాట్ 15. స్కై ఫోర్స్ 16. సితారే జమీన్ పర్ 17. థామా 18. కాంతారా ఏ లెజెండ్: చాప్టర్ 1 , 19. ఆల్ఫా 20. తండెల్ఈ జాబితాలోని 20 టైటిల్స్ లో 11 హిందీ సినిమాలు, మూడు తమిళ, తెలుగు, రెండు కన్నడ, ఒకటి మలయాళ సినిమా కావడం గమనార్హం. హౌస్ ఫుల్ 5 (నెం.4), కన్నప్ప (నెం.11), స్కై ఫోర్స్ (నెం.15) వంటి మూడు చిత్రాల్లో అక్షయ్ కుమార్ నటించగా, రష్మిక మందన్న3 సినిమాలు సికందర్ (నెం.1), చావా (నెం.10), థమా (నెం.17)లలో, మోహన్ లాల్, ప్రభాస్, పూజా హెగ్డే, కియారా అద్వానీ లు రెండేసి చిత్రాల్లో నటిస్తున్నారు.నెంబర్ వన్ కావడం సంతోషంగా ఉంది...మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్‌లో నెం.1 గా నిలిచినందుకు సికందర్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘2025 ఐఎండిబి మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో సికందర్ అగ్రస్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అతని ఎనర్జీ, అంకితభావం సికందర్ సినిమాను మాటల్లో వర్ణించలేని విధంగా తీర్చిదిద్దాయి. అందుకు సహకరించిన నిర్మాత సాజిద్ నదియాడ్ వాలాకు ధన్యవాదాలు. సికిందర్ లో ప్రతి సన్నివేశం చెరగని ముద్ర వేసేలా తీర్చిదిద్దాం. ప్రేక్షకులతో ఎప్పటికీ నిలిచిపోయేలా ప్రతి క్షణాన్ని డిజైన్ చేయడం కోసం నేను మనస్పూర్తిగా పనిచేశాను’’ అంటూ చెప్పారు. -
గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటానో ఆ దేవుడికే తెలియాలి: రష్మిక
‘పుష్ప2’తో శ్రీవల్లిగా థియేటర్లలో దుమ్మరేపిన రష్మిక మందన్న(Rashmika Mandan) ఆసుపత్రిలో చేరింది. తన కాలికి గాయం కావడంతో చికిత్స పొందుతున్నారు. కొత్త సంవత్సరంలో ఇలా జరగడంతో ఆమె తీవ్ర నిరాశ చెందారు. పాన్ ఇండియా రేంజ్లో టాప్ హీరోయిన్గా ఉన్న ఆమె చేతిలో నాలుగు చిత్రాలకు పైగా ఆమె చేతిలో ఉన్నాయి. గాయం కారణంగా షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆమె తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో ఆమె పంచుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ ట్విటర్ రివ్యూ)కొత్త సినిమాల కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తూ గాయపడినట్లు రష్మిక మందన్న ఇలా తెలిపారు. 'నాకు హ్యాపీ న్యూ ఇయర్ ఇలా మొదలైంది. జిమ్‌లో శిక్షణ తీసుకుంటూ ఉండగా నేను గాయపడ్డాను. దీంతో కొన్ని వారాలు, నెలలు పాటు రెస్ట్‌లో ఉండాలి. పూర్తిగా కోలుకునేందుకు ఎన్నిరోజులు పడుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఇక నుంచి పూర్తిగా రెస్ట్ మోడ్‌లోనే ఉండాల్సి వస్తుంది. అంతా బాగాయ్యాక నేను మళ్లీ 'సికందర్ (Sikandar), కుబేర(Kubera), థామ(Thama)' సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటానని అనిపిస్తోంది. నా వల్ల సినిమా ఆలస్యం అవుతుంది. అందుకు దర్శకులు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. షూటింగ్లో పాల్గొనేందుకు నా కాళ్లు సహకరించినప్పుడు తప్పకుండా వచ్చేస్తాను. నేను కూడా త్వరగా కోలుకునేందుకు వర్కౌట్స్ చేస్తాను' అని ఆమె అన్నారు.సికిందర్‌కు బ్రేకులు పడనున్నాయా..?సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సికందర్’. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ ప్రాజెక్ట్‌లో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నారు. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2025 రంజాన్ కానుకగా మార్చి 2న విడుదల కానున్నట్లు వార్తలు వచ్చాయి. యానిమల్, పుష్ప వంటి చిత్రాలతో రష్మికకు బాలీవుడ్లో క్రేజ్ పెరిగింది. ఇప్పుడు సికందర్ మూవీ ఆమెకు మరింత పాపులరాటిని తీసుకురావచ్చని చెప్పవచ్చు. అయితే, ఆమె గాయం కారణంగా ఈ చిత్రం రంజాన్‌కు విడుదల అవుతుందా అనే సందేహాలు వస్తున్నాయి.జూన్‌లో కుబేర కష్టమేజూన్లో థియేటర్స్‌లోకి ‘కుబేర’ వస్తారని అందరూ అనుకున్నారు. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్–ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుందనే ప్రచారం సాగింది. కానీ జూన్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అయితే, రష్మిక మందన్నకు గాయం కావడంతో జూన్‌లో విడుదల కష్టమేనని తెలుస్తోంది.ఈ సినిమా చిత్రకరణ కోసం రష్మిక గాయపడ్డారా..?హీరోయిన్ రష్మికా మందన్నా కెరీర్లో రానున్న తొలి హారర్ మూవీ ‘థామా’. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. హారర్ మూవీ ‘ముంజ్య’తో హిట్ కొట్టిన దర్శకుడు ఆదిత్యా సర్పోత్తా ఈ సినిమాకు దర్శకుడు. ‘బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాది విడుదలైంది. రీసెంట్గా ‘థామా’ చిత్రీకరణ కోసం ఢిల్లీ బయలుదేరినట్లుగా తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఈ సినిమా కోసం కసరత్తులు చేస్తున్న క్రమంలోనే ఆమె గాయపడినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
బాలీవుడ్లో దూసుకెళ్తున్నా రష్మిక.. 2025లో మూడు సినిమాలు!
హీరోయిన్ రష్మికా మందన్నా(Rashmika Mandanna ) కెరీర్లో రానున్న తొలి హారర్ మూవీ ‘థామా’. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. హారర్ మూవీ ‘వంజ్య’తో హిట్ కొట్టిన దర్శకుడు ఆదిత్యా సర్పోత్తా ఈ సినిమాకు దర్శకుడు. ‘బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాది విడుదలైంది. తొలి షెడ్యూల్‌ను ముంబైలో జరిపారు. సెకండ్ షెడ్యూల్‌ను గతేడాది డిసెంబరు చివరి వారంలో ఢిల్లీలో ప్రారంభించారు. న్యూ ఇయర్ బ్రేక్ తీసుకుని, మళ్లీ ఈ వారంలో ‘థామా’ చిత్రీకరణను ప్రారంభిస్తున్నారు. ‘థామా’ చిత్రీకరణ కోసం ఢిల్లీ బయలుదేరినట్లుగా తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు ఆయుష్మాన్ ఖురానా. అలాగే న్యూ ఇయర్ వేడుకలను పూర్తి చేసుకున్న రష్మికా మందన్నా కూడా ఢిల్లీలో జరిగే ‘థామా’ షెడ్యూల్లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పాల్గొననున్నారని బాలీవుడ్ సమాచారం. జనవరి మూడో వారం వరకు ‘థామా’ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందట. ఈ ఢిల్లీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ నెక్ట్స్ షెడ్యూల్ ఊటీలో జరగనుందని బీ టౌన్ టాక్. ఇక ‘థామా’ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్‌తో ‘సికందర్’, విక్కీ కౌశల్‌తో ‘ఛావా’ చిత్రాలు చేస్తున్నారు రష్మికా మందన్నా. ‘సికందర్’ సినిమా ఈ ఏడాది ఈద్‌కి, ‘ఛావా’ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానున్నాయి. ఇలా హిందీలో రష్మికా మందన్నా నటించిన చిత్రాలు ఈ ఏడాది మూడు రిలీజ్ కానున్నాయి. -
సల్మాన్ ఖాన్, మురుగదాస్ యాక్షన్ టీజర్ విడుదల
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సికందర్’. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు కానుకగా ఆ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ ప్రాజెక్ట్‌లో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనుంది. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2025 రంజాన్ కానుకగా విడుదల కానుంది. యానిమల్, పుష్ప వంటి చిత్రాలతో రష్మికకు బాలీవుడ్లో క్రేజ్ పెరిగింది. ఇప్పుడు సికందర్ మూవీ ఆమెకు మరింత పాపులరాటిని తీసుకురావచ్చని చెప్పవచ్చు. -
పాటతో పండగ
ముంబైలోని ధారావిలో గల మురికివాడలో జరిగిన ఓ పండగకు హాజరయ్యారు సల్మాన్ ఖాన్, రష్మికా మందన్నా. ఆ పండగలో భాగంగా అక్కడి రెండు వందల మందితో కలిసి డ్యాన్స్ చేశారు. సల్మాన్ ఖాన్, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న ‘సికందర్’కి సంబంధించి ప్రచారంలో ఉన్న వార్త ఇది. కథలో భాగంగా ధారావిలో జరిగే పండగకి ఈ ఇద్దరూ వెళతారట. అప్పుడు వచ్చేపాటను చిత్రదర్శకుడు మురుగదాస్ భారీగా చిత్రీకరించారని సమాచారం. జోష్‌గా సాగే ఈపాటకు సల్మాన్, రష్మికా అదిరి΄ోయే లెవల్లో స్టెప్పులు వేశారట.మురికివాడలకు సంబంధించిన సెట్‌ని ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో వేయించి, ఈపాటను చిత్రీకరించారని భోగట్టా. ఇక ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్న కాజల్ అగర్వాల్ ‘సికందర్’ సెట్స్‌లో అడుగుపెట్టారు. ‘సికందర్ డే 1’ అంటూ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా స్పష్టం చేశారు కాజల్. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
సికందర్‌కు సాయం
‘సికందర్’కు సాయం చేయనున్నారట హీరోయిన్ కాజల్ అగర్వాల్. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సినిమా ‘సికందర్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ . సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కాజల్ కూడా ఓ కీలకపాత్రలో నటించనున్నారట. త్వరలోనే ‘సికందర్’ షూటింగ్లో ఆమెపాల్గొంటారని బాలీవుడ్ టాక్. కథ రీత్యా ఈ చిత్రంలో సల్మాన్ కు సాయం చేసేపాత్రలో కాజల్ నటిస్తారట. మరి.. ‘సికందర్’లో కాజల్ భాగమైనట్లేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. ముంబైలోని ఓ స్టూడియోలో నిర్మించిన భారీ సెట్లో ప్రస్తుతం ‘సికందర్’ చిత్రీకరణ జరుగుతోంది. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. -
అదిరి పోయే ఫైట్స్ చేసేందుకు రెడీ అవుతున్న ‘సికందర్’
ముంబైలో అదిరి పోయే ఫైట్స్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు సికందర్. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సికందర్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నారు. ఇందులో సికందర్‌గా కనిపించనున్నారు సల్మాన్ ఖాన్. కాగా ఈ మూవీ చిత్రీకరణ ఈ నెల 18 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. తొలుత యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేలా సన్నాహాలు చేస్తున్నారు ఏఆర్ మురుగదాస్. ముంబై షెడ్యూల్ తర్వాత విదేశాల్లో ఓ భారీ షెడ్యూల్‌ను జరపాలని ప్లాన్ చేస్తోందట యూనిట్. సాజిద్ నడియాడ్ వాలా నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా విడుదల కానుంది. -
సికందర్‌కు విలన్ గా
సల్మాన్ ఖాన్ కు విలన్ గా నటుడు సత్యరాజ్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘సికందర్’ అనే ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నారు. జూన్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరిగేలా యూనిట్ సన్నాహాలు చేస్తోందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ రోల్‌కు సత్యరాజ్‌ను తీసుకున్నారట మురుగదాస్.ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్ టాక్. సాజిద్ నడియాడ్వాలా నిర్మించనున్న ‘సికందర్’ వచ్చే ఏడాది రంజాన్‌కి విడుదల కానుంది. ఇదిలా ఉంటే రజనీకాంత్ కూలీ మూవీలో అతడి స్నేహితుడి పాత్రలో సత్యరాజ్ నటించనున్నారని కోలీవుడ్ టాక్. 1986లో వచ్చిన ‘మిస్టర్ భరత్’ సినిమాలో రజనీకాంత్, సత్యరాజ్ చివరిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మళ్లీ 38 సంవత్సరాల తర్వాత ‘కూలీ’ సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటారా? వేచి చూడాలి. -
సికందర్‌తో జోడీ
సికందర్‌తో జోడీ కట్టారు హీరోయిన్ రష్మికా మందన్నా. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సికందర్’. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నా నటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.‘‘కొంతకాలంగా నా నెక్ట్స్ మూవీ ఏంటని అడుగుతున్నారు. ‘సికందర్’లో నటించనున్నాను. ఈ విషయాన్ని సర్ప్రైజ్గా ఫీలవుతారని అనుకుంటున్నాను. ‘సికందర్’లో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని రష్మికా మందన్నా పేర్కొన్నారు. ఇది ఆమె కెరీర్లో 25వ చిత్రమని తెలుస్తోంది. ఇక ‘సికందర్’ వచ్చే ఏడాది రంజాన్‌కి రిలీజ్ కానుంది. -
'సికిందర్' ఓపెనింగ్స్ అదుర్స్!
చెన్నై: సూర్య హీరోగా నటించిన తమిళ సినిమా అంజాన్(తెలుగులో సికిందర్) బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రెండు రోజుల్లోనే రూ.15.03 కోట్లు వసూలు చేయడం విశేషం. అయితే ముందుగా తీసుకున్న టిక్కెట్ల కారణంగా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని విశ్లేషకులు తెలిపారు. అడ్వాన్స్డ్ బుకింగ్ టిక్కెట్లే సినిమాను కాపాడాయని అంటున్నారు. స్వాతంత్ర్యదినోత్సవం రోజున విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశ కలిగించింది. తమిళనాడతో పాటు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా విడుదలయింది. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య సరసన సమంత హీరోయిన్ గా నటించింది.