సికందర్‌తో జోడీ | Rashmika Mandanna paired opposite Salman Khan in Sikandar | Sakshi
Sakshi News home page

సికందర్‌తో జోడీ

May 10 2024 4:36 AM | Updated on May 10 2024 4:36 AM

Rashmika Mandanna paired opposite Salman Khan in Sikandar

సికందర్‌తో జోడీ కట్టారు హీరోయిన్‌ రష్మికా మందన్నా. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘సికందర్‌’. సాజిద్‌ నడియాడ్‌ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికా మందన్నా నటించనున్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది.

‘‘కొంతకాలంగా నా నెక్ట్స్‌ మూవీ ఏంటని అడుగుతున్నారు. ‘సికందర్‌’లో నటించనున్నాను. ఈ విషయాన్ని సర్‌ప్రైజ్‌గా ఫీలవుతారని అనుకుంటున్నాను. ‘సికందర్‌’లో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని రష్మికా మందన్నా పేర్కొన్నారు. ఇది ఆమె కెరీర్‌లో 25వ చిత్రమని తెలుస్తోంది. ఇక ‘సికందర్‌’ వచ్చే ఏడాది రంజాన్‌కి రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement