
ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. టీజర్, ట్రైలర్ ని బట్టి సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తున్నారు. అక్కడున్నది స్టార్ హీరో అయినా, అనామక హీరో అన్నది పట్టించుకోవట్లేదు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త మూవీకి సరిగ్గా ఇలాంటి సమస్యే ఎదురైంది.
(ఇదీ చదవండి: రష్మిక ఆస్తి ఎన్ని కోట్లు? ఏమేం ఉన్నాయి?)
సల్మాన్ ఖాన్ కి చాన్నాళ్లుగా సరైన హిట్ లేదు. దీంతో తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తో కలిసి సికిందర్ తీశాడు. రష్మిక హీరోయిన్. కొన్నిరోజుల క్రితం టీజర్, ట్రైలర్ రిలీజయ్యాయి. కానీ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దక్షిణాది సినిమాల కాపీ అనే కామెంట్స్ వినిపించాయి. ఆ ప్రభావం ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ పై పడింది.
సల్మాన్ కొత్త సినిమా ఈద్ (రంజాన్)కి రావడం ఆనవాయితీ. అందుకు తగ్గట్లే ఈ సారి పండగకు సికిందర్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా బుకింగ్స్ ఓపెన్ చేశారు. దాదాపు 24 గంటలు గడిచింది గానీ ఇప్పటివరకు రూ.1.91 కోట్ల మేర మాత్రమే టికెక్స్ బుక్ అయినట్లు తెలుస్తోంది. ఈ ట్రెండ్ ఇలానే ఉంటే మాత్రం రిలీజ్ రోజుకి రూ6-10 కోట్ల మాత్రమే వసూళ్లు రావొచ్చేమో అనిపిస్తోంది. మరి సికిందర్ రిలీజై ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: నన్ను తీసేసి యాడ్ లో ఓ కుక్కని పెట్టుకున్నారు.. హర్టయిన శోభిత)