Advance booking
-
ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లో కీలక మార్పు
రైల్వే ప్రయాణం చేయాలంటే చాలామంది ముందుగా టికెట్స్ బుక్ చేస్తారు. ఇప్పటి వరకు 120 రోజులు ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును ఇండియన్ రైల్వే కల్పించింది. అయితే ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ 120 రోజులను 60 రోజులకు కుదించింది. అంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు రెండు నెలల ముందు మాత్రమే బుక్ చేసుకోగలరు.ఐఆర్సీటీసీ కొత్త నిబంధనలు 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అంతే కాకుండా అక్టోబర్ 31 వరకు బుక్ చేసుకునే వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి. నవంబర్ 1 నుంచి అడ్వాన్స్ బుక్ చేసుకోవాలనుకునేవారికి మాత్రమే ఈ కొత్త నియమం వర్తిస్తుంది.ఇదీ చదవండి: లులు గ్రూప్ అధినేత మంచి మనసు.. ప్రశంసిస్తున్న నెటిజన్లుతాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి ట్రైన్ అడ్వాన్స్ బుకింగ్‌లలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇందులో అడ్వాన్డ్ బుకింగ్ వ్యవధి తక్కువగానే ఉంది. విదేశీ పర్యాటకులకు 365 రోజుల పరిమితి విషయంలో కూడా ఎలాంటి మార్పు ఉండదని ఐఆర్సీటీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
రజినీకాంత్ వెట్టైయాన్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో బిగ్ షాక్!
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ఇప్పటివరకు తమిళ వర్షన్ కేవలం రూ.10.2 కోట్ల మేర టికెట్స్ బుకింగ్స్ మాత్రమే పూర్తయ్యాయి. తెలుగులో అయితే ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం రూ.74 లక్షలు మాత్రమే వసూళ్లు రానున్నాయి. హిందీలో మరింత దారుణంగా రూ.93 వేల అడ్వాన్స్ బుకింగ్ బిజినెస్ జరిగింది. ఓవరాల్‌గా చూస్తే ఇండియా వ్యాప్తంగా రూ.11 కోట్ల వరకు ముందస్తు టికెట్ బుకింగ్స్ అయినట్లు తెలుస్తోంది.అడ్వాన్స్ బుకింగ్స్‌లో వెట్టైయాన్‌కు క్రేజ్ తగ్గడంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. ట్విటర్లో ఏకంగా వెట్టైయాన్ డిజాస్టర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై నెట్టింట తెగ చర్చ మొదలైంది. అసలే ఈ మూవీ కోసం సూర్య నటించిన కంగువా చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా జరగకపోవడంపై ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మొదటి రోజు వంద కోట్ల రాబట్టడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
Devara Day 1 Advance Booking: 60కోట్లు కొల్లగొట్టిన దేవర
-
రిలీజ్‌కు ముందే రికార్డులు.. ఇండియన్-2ను అధిగమించిన విజయ్ చిత్రం!
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.తాజాగా అడ్వాన్స్ బుకింగ్‌లతో కమల్ హాసన్'ఇండియన్- 2' మూవీని అధిగమించి కొత్త రికార్డు సృష్టించింది. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్‌తో రూ. 12.82 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. అంతకుముదు ఇండియన్-2 మూవీకి ముందస్తు బుకింగ్స్ ద్వారా రూ. 11.20 కోట్లు మాత్రమే వచ్చాయి. విడుదలకు ఇంకా ఒకరోజు సమయం ఉడండంతో మరిన్ని రికార్డులు కొల్లగొట్టే అవకాశముంది. కేవలం బాక్సాఫీస్ వద్ద ప్రీ టికెట్ బుకింగ్స్‌తోనే రూ.20 కోట్లకు పైగా బిజినెస్ జరగవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి రోజే అత్యధిక వసూళ్లతో ది గోట్ కోలీవుడ్‌లో రికార్డ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. విజయ్ చివరిసారిగా లియో చిత్రంలో నటించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. -
దేవుడి సేవలన్నింటికీ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్
సాక్షి, అమరావతి: కుటుంబ సమేతంగా అన్నవరం వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలని అనుకుంటున్నవారు ఇంతకు ముందులా ఎక్కువగా హైరానా పడాల్సిన పనిలేదు. 10–15 రోజుల ముందే వ్రతం టికెట్‌ను ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లాలనుకునే వారు నెలరోజుల ముందే ఆన్లైన్లో డబ్బులు చెల్లించి ఆలయం వద్ద దేవదాయశాఖ గదులను బుక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో దేవదాయశాఖ పరిధిలో పలు ఆలయాల్లో వివిధ రకాల పూజలు, దర్శన టికెట్లతోపాటు ఆయా ఆలయాల వద్ద నివాసిత గదుల బుకింగ్ వంటివన్నీ ఇప్పుడు ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చింది. పూజలు, దర్శనం టికెట్లు, వసతి గదులను ఆలయం వద్దకు వెళ్లి మాత్రమే తీసుకోవాల్సిన ఇబ్బందులు తొలిగిపోయాయి. తాము వెళ్లే తేదీని ముందే నిర్ణయించుకున్న భక్తులు ఇంటివద్ద నుంచే ముందుగానే సేవా టికెట్లను, గదులను బుక్ చేసుకోవచ్చు. తమ పరిధిలోని ప్రముఖ ఆలయాలన్నింటిలో ఈ తరహా సేవలన్నీ ఉమ్మడిగా ఒకచోట ఆన్లైన్లో పొందేందుకు దేవదాయ శాఖ కొత్తగా https://www.aptemples.ap.gov.in వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో కొన్ని ఆలయాల్లో కొన్ని రకాల సేవలకు మాత్రమే దేవదాయశాఖ ప్రత్యేక వెబ్‌పోర్టల్ నిర్వహించగా.. ఇప్పుడు మొదటి దశలో 175 ప్రముఖ ఆలయాలన్నింటిలో అన్ని రకాల సేవలను ఈ కొత్త వెబ్‌పోర్టల్ ద్వారా భక్తులు ముందస్తుగా పొందేందుకు వీలు కల్పించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, మహానంది, విశాఖపట్నం శ్రీకనకమహాలక్ష్మి, అంతర్వేది, అరసవెల్లి, మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి, మురమళ్ల వీరేశ్వరస్వామి, వాడపల్లి వేంకటేశ్వరస్వామి, కసాపురం నెక్కింటి ఆంజనేయస్వామి.. మొత్తం 16 ఆలయాల్లో స్వామి సేవలు, దర్శన టికెట్లు, గదుల కేటాయింపు వంటివన్నీ ముందస్తుగానే ఆన్లైన్లో పొందేందుకు అందుబాటులోకి ఉంచింది. అడ్వాన్స్ బుకింగ్ గడువు వివిధ ఆలయాల్లో అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి వివిధ రకాలుగా నిర్ణయించారు. మొదటి దశలో మొత్తం 175 పెద్ద ఆలయాల్లో, తర్వాత దశలో ఓ మోస్తరు ఆలయాల్లోనూ ఈ తరహా ముందస్తు ఆన్లైన్ సేవలు ఈ వెబ్‌పోర్టల్ ద్వారానే అందుబాటులోకి తీసుకురానున్నట్లు దేవదాయశాఖ అధికారులు తెలిపారు. -
Uber Ride: 90 రోజుల ముందే ఉబర్ రైడ్ బుక్ చేసుకోండి!
ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ కంపెనీ 'ఉబర్' (Uber) వినియోగదారుల కోసం మరో గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. ఇది తప్పకుండా ప్రయాణికులకు ఉపయోగపడుతుంది. ఇకపై ఉబర్ సర్వీస్ కోసం 90 రోజులకు ముందే బుక్ చేసుకోవచ్చు. తద్వారా ప్రయాణికులకు ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన టెన్షన్ దూరమవుతుంది. (ఇదీ చదవండి: Reset SBI ATM PIN: ఇంటినుంచే ఏటీఎమ్ పిన్ మార్చుకోండి) ఎయిర్ పోర్ట్‌కి వెళ్లేవారు లేదా వచ్చేవారికి ఇప్పటికే ప్రధాన ఎయిర్ పోర్టులలో ఉబర్ ట్యాక్సీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక పికప్ పాయింట్స్, పార్కింగ్ ఏరియాలను కలిగి ఉండటం వల్ల వినియోగదారుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ప్రయాణం పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మూడు నెలలకు ముందే (90 రోజులు) బుక్ చేసుకునే సదుపాయం కల్పించడం వల్ల మరింత ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి. కేవలం ఎయిర్ పోర్ట్ ప్రయాణాలకు మాత్రమే కాకుండా, ఇతర ప్రయాణాలకు కూడా ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా బుక్ చేసుకుంటే ఉబర్ డ్రైవర్లు కూడా ముందుగానే బుకింగ్ ప్లాన్ సిద్ధం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. మనదేశంలో కొన్ని ఎయిర్ పోర్టులలో ఉబర్ సర్వీస్ మరింత సులువుగా ఉంటుంది. దీని ద్వారా స్టెప్ బై స్టెప్ గైడెన్స్‌ను ఒక యాప్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతానికి అలాంటి సదుపాయం దేశంలోని 13 ప్రధాన విమానాశ్రయాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. -
అమెరికాలో తారక్ అభిమాని అరాచకం.. అన్ని టికెట్స్ కొనేశాడు
టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ ఇప్పుడు థియేరట్స్‌లో సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. ఇందులో భాగంగా మోస్ట్ అవైటెడ్ సినిమాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాల కోసం ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. మార్చి 11న రాధేశ్యామ్ విడుదల అవుతుండగా, మార్చి 25న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. ఒకే నెలలో రెండు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికాలో ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఊహించినట్లుగానే గంటల వ్యవధిలోనే టికెట్లు అమ్ముడయ్యాయి. తాజాగా అమెరికా డల్లాస్ నగరంలోని గెలాక్సీ థియేటర్లోఎన్టీఆర్ అభిమాని ఒకరు ఏకంగా 75టికెట్లను కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్‌గా మారింది. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటిస్తున్నారు. డివివి ఎంటర్టైనమెంట్స్ పతాకం పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. USA🇺🇸 premier show tickets in Dallas Galaxy spaces theatre 12:30 show on 24th Ntr fan bought 75 tickets#ManOfMassesNTR #RRRMovie #JrNTR #RamCharan pic.twitter.com/GWCY7Rw8EJ — Filmy Tweets (@praveen_5654) March 5, 2022 -
ఆర్టీసీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కేంద్రాల్లో నగదు రహిత సేవలు
సాక్షి, హైదరాబాద్: దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటును తెలంగాణ ఆర్టీసీ కల్పించింది. నగదు రహిత, స్పర్శ రహిత లావాదేవీలను రేతిఫైల్, జేబీఎస్, సీబీఎస్, కేపీహెచ్‌బీ కేంద్రాల్లో పొందవచ్చని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వి.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కేంద్రాలు ఉదయం 6.30 నుంచి రాత్రి 8.15 గంటల వరకు పని చేస్తాయన్నారు. క్యూఆర్ కోడ్, యూపీఐ యాప్‌ల ద్వారా స్మార్ట్ ఫోన్లతో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకుని బస్‌పాస్‌ల మొత్తాలను చెల్లించవచ్చని తెలిపారు. (చదవండి: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు) -
సెలెరియోలో సరికొత్త టెక్నాలజీ.. బుకింగ్స్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెలెరియో కొత్త వర్షన్ ముందస్తు బుకింగ్స్ ప్రారంభించింది. వినియోగదార్లు రూ.11,000 చెల్లించి ఈ వాహనాన్ని బుక్ చేయవచ్చు. స్టార్ట్–స్టాప్ టెక్నాలజీతో తదుపరి తరం కె–సిరీస్ ఇంజన్ పొందుపరిచారు. ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీతో ఇప్పటికే ఈ కారు ఆదరణ చూరగొందని కంపెనీ తెలిపింది. భారత్‌లో అత్యంత ఇంధన సామర్థ్యం గల పెట్రోల్ కారుగా సెలెరియో నిలవనుందని మారుతి సుజుకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సి.వి.రమణ్ తెలిపారు. -
ఎలక్ట్రిక్ వాహన ప్రయాణం భళా!
ఓలా అంటే స్పానిష్ భాషలో ‘హలో’ అని అర్థం. క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లకు హలో చెబుతోంది. ఒక దశాబ్దం కంటే స్వల్పకాల వ్యవధిలోనే ఓలా తన వ్యాపారాన్ని వినూత్న రీతిలో విస్తరించింది. (అద్దంలో నా ముఖం చూసుకోవడం మానేశాను..) ఓలాను 2010లో నెలకొల్పారు. 2012లో దాని క్రియాశీల క్యాబ్ సేవలు ప్రారంభమైనాయి. మార్కెట్లోకి ప్రవేశించే సమయంలో, ప్రయాణీకులకు మూడు ఉచిత రైడ్లను అందించింది. ఈ తరహా ఉచిత వ్యూహం భారతీయ మధ్యతరగతిని టాక్సీల వైపు ఆకర్షించింది. రవాణాలో సౌలభ్యం, ప్రయాణీకులకు భద్రత, సకాలంలో గమ్యానికి చేర్చడం, ధర అంచనాలను సులభతరం చేసే సాంకేతిక పరిజ్ఞానంతో అతి స్వల్పకాలంలోనే ప్రయాణీకుల నమ్మ కాన్ని గెలుచుకుంది. ఓలా యాప్‌పై ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్‌గా అద్భుతమైన నిబద్ధతను చూపి, కారు ఎక్కాలనే అనేకమంది భారతీయుల వాంఛను నెరవేర్చింది. అలాగే దేశవ్యాప్తంగా ఉపాధిని సృష్టిం చింది. 2018 నాటికి, సంస్థకు పది లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు. వారి ప్రోత్సాహకాలు వినియోగ దారుల రేటింగ్, ఫీడ్‌బ్యాక్‌పై నిర్ణయమయ్యేవి. ఇంతేకాకుండా కొంత డిపాజిట్ మొత్తాన్ని డ్రైవర్ల నుండి సేకరించి, వారికి క్యాబ్స్‌ని ఫైనాన్స్ రూపంలో కట్టబెట్టింది. ఈ తరహా మోడల్లో డ్రైవర్లకు వాహనాలను ఏర్పాటు చేయడం రిస్క్‌తో కూడుకున్నది. అయినప్పటికీ, సాహసం చేసి బీమాలో తన ఉనికిని చాటుకుంది. మరో వైపు ప్రారంభ ఫిన్‌టెక్ సంస్థగా ఓలా మనీని ఉపయోగించి, వివిధ ఆర్థికసేవలను నిర్వహించింది. కృత్రిమ మేధస్సు సాయంతో విని యోగదారుల అసాధారణమైన ప్రవర్తనా మార్పులను గమనిస్తూ, మెరుగైన సేవలు అందిస్తోంది. అయితే తదుపరి ఊబర్‌తో పోటీ మూలంగా ధరల యుద్ధం, క్యాబ్ వాహనాల పెరుగుదల, ప్రోత్సాహ కాలలో కోత, ఇంకా డ్రైవర్లకు సంబంధించిన సమస్య లతో కష్టాలను మూటగట్టుకుంది. కరోనా మహ మ్మారి, లాక్డౌన్లు సంస్థను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. గత్యంతరం లేక కొంతమంది పూర్తికాల ఉద్యోగులను తొలగించింది. మహమ్మారి కారణంగా భద్రత కోసం వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగి, క్యాబ్‌లు, ఆటోలవైపు వినియోగదారులు ముఖం చాటేయడంతో మరింత నష్టం వాటిల్లింది. (చదవండి: ఈ విద్యావిధానం దేశానికే ఆదర్శం) అయితే తన తదుపరి ఎత్తుగడగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరిస్తూ ఆటోమోటివ్ రంగంలోకి ప్రవేశించింది. తద్వారా పర్యావరణ పరిరక్షణ, సమర్థత, ఉపాధి కల్పనకు పూనుకుంటోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిజర్వ్ చేసుకోవడానికి ప్రారంభ ధరను రూ. 499గా నిర్ణయించింది. ఈ బుకింగ్ ధర ఒక సాధారణ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌కు సమానం. ఇది ఆటోమోటివ్ రంగంలో ఓలా తెచ్చిన విప్లవాత్మక మార్పు. సగటున నెలవారీగా కోటి మంది వినియోగదారులు గనుక 499 చెల్లిస్తే, అడ్వాన్సుల రూపంలో వడ్డీ లేని డబ్బు అందుతుంది. దీనివలన భారీగా రుణభారం తగ్గుతుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమలో సింహభాగం రుణాలుగా ఉంటుంది. కస్టమర్ డిపాజిట్ల రూపంలో ఓలా దీనికి స్వస్తి పలుకుతోంది. ఒక్క కారు కూడా సొంతంగా లేకుండానే ఓలా క్యాబ్స్ విజయవంతమైంది. దీనికి విరుద్ధంగా, ఎలక్ట్రిక్ స్కూటర్లను ఓలా తయారు చేస్తుండటం మూలాన వాటిని సరుకుగా చూపాల్సి ఉంటుంది. ఇది ఓలా వ్యాపార నిర్వహణ మోడల్లో చాలా పెద్ద మార్పు. ఇంకా, టెక్నాలజీ రంగం నుండి తయారీ రంగానికి మారుతుండటం దేశంలో మొదటిసారిగా ఓలా చేస్తున్న సాహసం. ట్యాక్సీ వ్యాపారంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు లేరు. కానీ ఇప్పుడు వారు ఈ కొత్త నమూనాలో పెద్ద శ్రామిక శక్తిని కలిగి ఉంటారు. ఓలా ట్యాక్సీ ప్రారంభంలో పెద్దగా పోటీ ఎదుర్కో లేదు. దానివల్ల ఫస్ట్–మూవర్ ప్రయోజనాన్ని పొందింది. కానీ ఇప్పుడు హీరో, బజాజ్, హోండా, ఇంక అనేక అభివృద్ధి చెందుతున్న సంస్థలతో పోటీ పడాలి. ఏదేమైనా, భారత ప్రజలు ఇంధనం కోసం తక్కువ ఖర్చు చేయాలని అనుకుంటున్న తరుణంలో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనేక భారతీయ కంపెనీలు తయారీ రంగం నుండి టెక్నాలజీ వైపునకు మారాయి. దీనికి భిన్నంగా ఓలా తన బ్రాండ్‌ని, టెక్నాలజీని పణంగా పెట్టి ధైర్యంగా ఆటోమోబైల్ దిగ్గజ సంస్థలకు సవాల్ విసురుతోంది. ఒక దశాబ్దం క్రితం టాటా నానో ఫలితాన్ని దేశం చవిచూసింది. ఇప్పుడు ఓలా తన హైటెక్ ఫీచర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఆటోమోటివ్ పరిశ్రమకు అఘాతం కలిగించే సాహసం చేస్తోంది. ఈ స్కూటర్ విజయవంతమైతే గనుక భారీ ఉపాధి సృష్టి జరుగుతుంది, ఎగుమతులు పెరుగుతాయి, పర్యావరణ పరిరక్షణలో సాయపడుతుంది, ఇంధనం ఆదా అవుతుంది. అంతేకాకుండా భారతీయ సిలికాన్ వ్యాలీని నిర్మించడానికి దేశంలోని యువ పారిశ్రామికవేత్తలలో కావాల్సిన ఉత్సాహాన్ని నింపుతుంది. 75వ భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు ప్రత్యేకమైనవి. ఒలింపిక్స్‌లో బంగారు, వెండి, కాంస్య పతకాలతో మువ్వన్నెల జెండాను క్రీడాకారులు రెప రెపలాడించిన రోజే, ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. మున్ముందు బ్రాండ్ విలువ పరంగా ఓలా తదుపరి కోలాగా మారే అవకాశం ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. - డాక్టర్ మైలవరం చంద్రశేఖర్ గౌడ్ వ్యాసకర్త సహాయ ఆచార్యులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, హైదరాబాద్ -
ప్లీజ్.. ఒక్క టిక్కెట్!
ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్, రైల్వేస్‌కు సంక్రాంతి కళ వచ్చేసింది. దూర ప్రాంతాలకు టికెట్లన్నీ అడ్వాన్స్‌గా బుక్ అయిపోవడంతో పండుగకు ఇంటి వెళ్లాలనుకునే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్లీజ్.. ఒక్క టికెట్! అని బతిమలాడుకోవాల్సి వస్తోంది. ఇదే అదనుగా టికెట్ ధరలను అమాంతం పెంచేస్తున్నారు. ఆర్టీసీ ‘స్పెషల్’ పేరుతో అదనపు చార్జీ వసూలు చేస్తుంటే, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల టికెట్ ధరలు మూడింతలకు పెరిగాయి. మేమేమైనా తక్కువా అన్నట్లుగా రైల్వేస్ కూడా ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచేయడంతో ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారు. ఎస్వీఎన్కాలనీ / పాత గుంటూరు : తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ ముఖ్యమైనది. ఉద్యోగ, వ్యాపార, ఇతరత్రా అవసరాల రీత్యా దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు సొంతూరు వెళ్లాలని అనుకునే పండుగ. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో టికెట్లన్నీ ముందుగానే రిజర్వ్ అయిపోయాయి. ఇప్పటికిప్పుడు టికెట్ కొనుక్కుని వెళ్లాలనుకునే వారి జేబులు ఖాళీ అవుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ చెబుతున్న ధరలు విని సగటు ప్రయాణికుడు బేజారవుతున్నాడు. ఇదే అదనుగా ఆర్టీసీ కూడా స్పెషల్ సర్వీస్ పేరుతో బస్సులు నడుపుతూ అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. రైల్వే శాఖ కూడా పండగ రోజుల్లో ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచేసింది. ఆగని దోపిడీ.... జిల్లా ఆర్టీసీ అధికారులు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు 350, హైదరాబాద్ నుంచి వచ్చేందుకు 330 బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే, బెంగళూరు నుంచి గుంటూరుకు వచ్చేందుకు 40, వెళ్లేందుకు 45 బస్సులు వేశారు. చెన్నై నుంచి గుంటూరుకు వచ్చేందుకు 60, వెళ్లేందుకు 70 బస్సులను ఏర్పాటు చేశారు. అయితే, వీటిలో టికెట్లు ఇప్పటికే రిజర్వేషన్ అయిపోయాయి. కొన్నింట్లో మాత్రమే నామమాత్రంగా అందుబాటులో ఉన్నాయి. తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాలకు తక్కువ సంఖ్యలో బస్సులు ఉండటంతో ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా ధరలు విపరీతంగా పెంచేశారు. అలాగే, పండగ సీజన్లో రీజియన్‌లోని 13 డిపోల నుంచి దాదాపు 448 ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఇవి చాలకపోవడంతో సిటీ సర్వీసులను ఎక్స్‌ప్రెస్, లగ్జరీ సర్వీసులుగా మార్చేసి నడిపేందుకు సిద్ధమయ్యారు. వీటిలో చార్జీలు అదనం అని వేరే చెప్పక్కర్లేదు. రైళ్లదీ అదే తీరు.. సంక్రాంతి పండుగకు 6 రోజులపాటు వరుస సెలవులు రావడంతో రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దూర ప్రాంతాలు వెళ్లే రైళ్ల టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. కొన్నింట్లో వెయింటింగ్ లిస్టు 200 వరకు ఉంటే, మరికొన్నింట్లో ఏకంగా రిగ్రెట్ అని వస్తోంది. సికింద్రాబాద్ నుంచి కాకినాడ వరకు రెండు సువిధ సూపర్‌ఫాస్ట్ రైళ్లు, రెండు ప్రీమియం రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితోపాటు మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇదే అదనుగా డైనమిక్ ఫేర్ పేరుతో మూడు రెట్లు చార్జీ వసూలు చేస్తున్నారు. ఈ ధరలు సమయాన్ని బట్టీ మారిపోతుండటం గమనార్హం. సందట్లో సడేమియా అన్నట్లు రైలు టికెట్లు బుక్ చేసే ప్రయివేటు ఏజెన్సీల దోపిడీ సైతం పెరిగిపోయింది. ఇక రిజర్వేషన్ లేని ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఏ రైలులోనూ ఖాళీ దొరకకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. పనిలో పనిగా ఫ్లాట్పాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచి రైల్వే శాఖ అదనపు ఆదాయం కోసం ప్రయాణికులపై భారం వేసింది. -
24 గంటలూ షోలే.. షోలు
అత్యాశవాసి.. సారీ అజ్ఞాతవాసికి ఇప్పుడు జై సింహ తోడయ్యాడు. ఒకరేమో అధికార పార్టీకి మిత్రసేనుడిగా సుపరిచితుడు.. ఇంకొకరేమో ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే.. అందునా.. స్వయానా సీఎం చంద్రబాబుకు బావమరిది, మంత్రి లోకేష్‌కు మామ.. ఇంకేం.. మిత్రసేనుడి సినిమాకు ఇచ్చినట్లే.. బంధుజనుడి సిన్మాకూ ఉదారంగా అదనపు షోలకు అనుమతులిచ్చేశారు. ఐదు రోజులపాటు ఏకధాటిగా సదరు సిన్మా ఆడించేసుకోవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేసేసింది. థియేటర్లు ఫుల్ అయినా.. కాకున్నా పోటీపడి వరుసగా ఏడు షోలు ఆడించడం వల్ల కలెక్షన్ల దందా ఏమో గానీ.. ఏమాత్రం రెస్ట్ లేకుండా పని చేస్తున్న థియేటర్ల సిబ్బంది మాత్రం చెప్పుకోలేని ‘హింస’ అనుభవిస్తున్నారు. పండుగపూట ఇంటిపట్టున ఉండనివ్వకుండా అదనపు షోలతో సేవ చేయించుకున్నందుకు తగిన ఆర్థిక ప్రతిఫలం విషయాన్ని మాత్రం అటు సర్కారు గానీ.. ఇటు యాజమాన్యాలు గానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పవన్ స్టార్ అజ్ఞాతవాసి మాదిరిగానే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన జైసింహ సినిమాకు కూడా సర్కారు ఇష్టారాజ్యంగా ఏడు షోలకు అనుమతినిచ్చేసింది. ఏదో ఒక్క రిలీజ్ రోజు కాకుండా ఏకంగా ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు ఐదు రోజుల పాటు 24 గంటలూ బొమ్మ ఆడించుకోవచ్చని సర్కారు తెర ఎత్తేయడం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే అజ్ఞాతవాసికి వరుసగా వారంరోజుల పాటు ఏడు షోలకు అనుమతివ్వడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇక సినిమా టికెట్ల రేట్లు కూడా ఇష్టారాజ్యంగా పెంచడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఈ రెండు సినిమాలు ఆడే థియేటర్లలో టికెట్ల రేట్లు ఏకంగా రూ.200కి పెంచేశారు. సినిమా టాక్ ఎలా ఉన్నా కేవలం పండుగ రోజుల్లో దండుకునే పర్వానికి తెర లేపేందుకే 24గంటలూ షోలకు అనుమతిచ్చారన్నది నిర్వివాదాంశం. నాలుగు షోలకే జనం లేరట!.. ఏకంగా ప్రభుత్వం నుంచి జీవో తెప్పించుకుని ఏడు షోలు వేసుకున్నా చూసే వాడే లేకుంటే?!.. ప్రస్తుతం అజ్ఞాతవాసికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. సినిమాపై డివైడ్ టాక్‌తో మామాలుగా నాలుగు షోలకే హాలు నిండే పరిస్థితి లేదంటున్నారు. హైప్ క్రియేట్ చేసి భారీ అంచనాలతో రిలీజ్ చేసినా మొదటిరోజు తప్ప ఆ తర్వాత ఏడు షోలకూ టికెట్లు తెగట్లేదని ధియేటర్ల సిబ్బంది చెబుతున్నారు. విశాఖ నగరంలోని చాలా థియేటర్లలో ఇదే పరిస్థితి కాగా.. పెందుర్తిలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గురువారం సాయంత్రం పెందుర్తిలోని ఓ ధియేటర్లో టికెట్లు తెగక సినిమా ప్రదర్శనే నిలిపివేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. థియేటర్ల సిబ్బంది గోడు వినేదెవరు?.. ఏడు షోలతో ఆయా సినిమాలు కలెక్షన్లు కొల్లగొట్టడం(?) ఏమో గానీ ధియేటర్ల ఉద్యోగులు, సిబ్బంది మాత్రం అల్లాడిపోతున్నారు. సాధారణంగా రోజుకి నాలుగు షోలు ఆడే థియేటర్లో ఒకేసారి ఏడు షోలు ఆడిస్తున్నా.. సిబ్బందిని మాత్రం యాజమాన్యాలు పెంచలేదు. పోనీ కనీసం వారి వేతనాలు కూడా పెంచలేదని తెలుస్తోంది. కేవలం వారం రోజులేగా పనిభారం.. అన్న భావనలో ధియేటర్ల యజమానులు ఉన్నారు. అదనపు షోలకు ఉదారంగా అనుమతులిచ్చిన ప్రభుత్వం సైతం సిబ్బంది పనిభారం, అదనపు వేతనాల చెల్లింపు విషయాన్ని పట్టించుకోలేదు. కలెక్షన్లు ‘ఫుల్లు’ గా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఇప్పటికైతే ఒక సినిమా పరిస్థితి తేలిపోయింది. రెండో రోజు నుంచే కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. కేవలం పండుగ మూడురోజుల కలెక్షన్లపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక బాలకృష్ణ సినిమా ఫలితం నేడు తేలనుంది. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా... ఏడు షోల దెబ్బకు రాత్రనక, పగలనక సిబ్బంది పనిభారంతో ‘హింస’ పడుతున్నారన్నది వాస్తవం. అడ్వాన్స్ బుకింగ్ నిలిపివేత పెందుర్తి: అజ్ఞాతవాసి ఇచ్చిన షాక్‌తో పెందుర్తిలోని లక్ష్మికాంత్ థియేటర్ యాజమాన్యం జైసింహా సినిమా అడ్వాన్స్ బుకింగ్ నిలుపుదల చేసింది. అజ్ఞాతవాసి కోసం రెండు రోజుల ముందుగా బుధ, గురువారాల ఆటలకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారు థియేటర్ వాళ్లకే టికెట్లు తిరిగి ఇచ్చేశారు. తిరిగి డబ్బులు కూడా అడగలేదు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకున్నారు. కొందరైతే హాల్ ముందే రూ.200 టికెట్‌ను రూ.20, రూ.30కి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో శుక్రవారం విడుదల అయిన జైసింహా పరిస్థితి కూడా ఇదే అయితే ప్రేక్షకులు తమ థియేటర్‌కు ఏ హాని తలపెడతారో అన్న భయంతో యాజమాన్యం జైసింహాకు అడ్వాన్స్ బుకింగ్‌ను పూర్తిగా రద్దు చేసింది. శుక్రవారం ఉదయమే కౌంటర్లో టికెట్లు అమ్మేందుకు సన్నద్ధమయ్యారు. ప్రస్తుత కాలంలో థియేటర్లు అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేయడం ఎక్కడా లేదు. మరోవైపు గురువారం సాయంత్రం లక్ష్మికాంత్ హాల్లో ప్రేక్షకులు రాకపోవడంతో రెండు స్క్రీన్లలో ఆటలు రద్దు చేశారు. రెండు స్క్రీన్లకు కలిపి పది మంది మాత్రమే వచ్చారు. ఈ థియేటర్ ప్రారంభం నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా కలెక్షన్లు లేక ఆటను రద్దు చేయడం ఇదే ప్రథమం. -
యాదాద్రిలో అడ్వాన్సు బుకింగ్
తిరుమల తరహాలో సాఫ్ట్వేర్ రూపొందించనున్న వైటీడీఏ ► వ్యర్థ జలాల శుద్ధికి భారీ ప్లాంట్ ►సీఎం సూచనలతో ప్రణాళికలు సాక్షి, హైదరాబాద్: అడుగడుగునా ఆధ్యాత్మిక భావన కలిగించే నిర్మాణాలు, ఆధునిక హంగుల మేళవింపుతో దేశంలోనే గొప్ప క్షేత్రంగా యాదాద్రి రూపుదిద్దుకోనుంది. భవిష్యత్తులో తిరుమల తరహాలో దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దర్శనం విషయంలో ఎవరూ నిరాశ చెందకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ముఖ్యంగా తిరుమల వెంకన్న దర్శన సమయాన్ని కొన్ని రోజుల ముందుగానే బుక్ చేసుకుంటున్న తరహాలోనే యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి దర్శనానికీ అడ్వాన్స బుకింగ్స వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. తిరుమలలో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించి తదనుగుణంగా సాఫ్ట్వేర్ రూపొందించాలని నిర్ణరుుంచారు. అలాగే ఆలయానికి దిగువన 40 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నారు. కొండపైకి వాహనాలు అనుమతించొద్దని ఇప్పటికే నిర్ణయించినప్పటికీ కొన్ని నిర్మాణాలకు సంబంధించిన సెల్లార్ ప్రాంతంలో వీఐపీల కార్ల పార్కింగ్ ఏర్పాటుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సెల్లార్ స్థలం ఖాళీగా ఉంటున్నందున అందులో 2 వేల కార్లు పార్క్ చేయగలిగేలా మల్టీలెవల్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడి నుంచి దేవాలయానికి చేరుకోవటానికి ప్రత్యేకంగా ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తారు. దిగువన మరో 35 ఎకరాల స్థలాన్ని బస్ డిపో, పోలీసు, ఫైర్స్టేషన్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఫుడ్ కోర్టుల కోసం కేటాయించారు. ఆలయానికి చేరువలో పూలతోట కోసం 25 ఎకరాలు కేటాయించారు. కల్యాణమండపం, ప్రవచన వేదికలు, భారీ సంఖ్యలో భక్తులు కూర్చోవటానికి ఏర్పాట్లు కోసం 50 ఎకరాలు కేటాయించారు. గుట్టపై నుంచి దిగువకు వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేసి వెలుపలికి పంపేలా ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం భారీ నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. భక్తుల వసతి కోసం 100 చొప్పున నాన్ఏసీ, ఏసీ, ఉచిత గదులను, భారీ డార్మిటరీని నిర్మించనున్నారు. కాటేజీల నిర్మాణం కోసం దాతలు ముందుకొస్తున్నందున ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. మరోవైపు యాదాద్రిలో 108 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించిన నేపథ్యంలో భారీ విగ్రహాల తయారీలో ప్రసిద్ధి చెందిన చైనాలో అధికారులు పర్యటించి అక్కడి విగ్రహాల ఏర్పాటును పరిశీలించనున్నారు. -
శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు అక్టోబర్2 నుంచి..
నవంబరు 16-30 మధ్య సేవా టికెట్ల బుకింగ్‌కు టీటీడీ అనుమతి సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 12,904 టికెట్ల కోటాను అక్టోబరు 2వ తేదీ ఉదయం 11 గంటల నుంచి భక్తులకు అందుబాటులో ఉంచేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. నవంబరు 16 నుంచి 30వ తేదీ వరకు ఆలయంలో జరిగే సేవల కోసం భక్తులు ముందస్తుగా రిజర్వు చేసుకునేందుకు టీటీడీ అనుమతిచ్చింది. ఈ కోటా కింద అర్చన-50, తోమాల 50, సుప్రభాతం -1,741, అష్టదళపాద పద్మారాధన-40, విశేషపూజ-498, నిజపాద దర్శనం-580, కల్యాణోత్సవం-4,200, వసంతోత్సవం 2,160, ఆర్జిత బ్రహ్మోత్సవం-1,260, సహస్రదీపాలంకరణసేవ-1,625, ఊంజల్‌సేవ 700 టికెట్లు ఉన్నాయి. ఆసక్తి కలిగిన భక్తులు www.ttdsevaonline.com టీటీడీ వెబ్సైట్ ద్వారా టికెట్లు రిజర్వు చేసుకోవచ్చు. వన్‌టైమ్ పాస్వర్డ్ పద్ధతిలో ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. -
‘బ్లాక్’బలి
‘రిలీజ్ రోజు సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్పా..’ సగటు తెలుగు ప్రేక్షకుడి మనసులో మాట ఇది. ఆ కిక్కు కావాలంటే ముందు టికెట్ దొరకాలి..! అదంత ఈజీ ఏం కాదు.. సాహసం సేయాలి మరి...! అయినా రెడీ., అదే అభిమానం అంటే..! ఈ క్రేజ్‌నే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మక చిత్రంగా‘బాహుబలి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టికెట్ల కోసం అభిమానుల ఎదురుచూపులు ఫలించలేదు. యాభై శాతం టికెట్లు బ్లాక్‌కు తరలడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. నగరంపాలెం(గుంటూరు) : జిల్లావ్యాప్తంగా ‘బాహుబలి’ సందడి నెలకొంది. గుంటూరు నగరంలో శుక్రవారం 16 థియేటర్లలో ఈ చి త్రాన్ని ప్రదర్శించనున్నారు. ఇం దుకు గురువారం ఉదయం 8.30 గంటలకు పోలీసుల పర్యవేక్షణలో అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు ఇచ్చారు. అయితే 11 గంటటకే 4 ఆటలు, అన్ని క్లాసుల టికె ట్లు అయిపోయినట్లు బోర్డుపెట్టారు. తెల్లవారుజాము నుంచి టికెట్ కోసం క్యూలో నిలుచున్న వారికి ఒక్కో టికెట్ అందింది. క్యూలైన్ల్లో ఉన్నవారికి 40 శాతం అందించి, మిగిలినవి సిఫార్సులు, అధిక ధరలకు అమ్మకానికి యాజమాన్యాలు సిద్ధమయినట్లు సమాచారం. అధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు టికెట్ల పంపిణీ బాధ్యత స్థానిక సీఐలకు అప్పగించనట్లు తెలుస్తోంది. తొలుత ఈ బాధ్యతను తీసుకోడానికి సీఐ అంగీకరించకపోవడం.. తర్వాత మంత్రి ఆదేశాల మేరకు ఆ పనిని చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. సినిమా సంబంధించి పెట్టిన పెట్టుబడి సాధ్యమైనంత మొదటి రోజే సంపాదించేందుకు అనధికార బెనిఫిట్ షో లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆన్‌లైన్‌లోనూ అందని టికెట్లు.. అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తూ థియేటర్ల యజమానులు రకరకాల పద్ధతులు అవలంబిస్తుంటే.. ఆన్‌లైన్‌లోనూ బుకింగ్ దొరక డం లేదు. గుంటూరు నగరంలో పది థియేటర్లకు టికెట్ దాదాగా పేరున్న జస్ట్ టికెట్స్ సైట్లో ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. సినిమాతో సంబంధం లేకుండా ఈ థియేటర్లలో బుకింగ్ చేసుకోవచ్చు. మంగళవారం సాయంత్రానికి ఆరు థియేటర్లలో 14వ తేదీ వరకు పూర్తి బుకింగ్‌తో కనిపిసుతన్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టికెట్ల కోసం కంప్యూటర్ల ముందు కూర్చున్నా ఫలితం లేదని అభిమానులు వాపోతున్నారు. ఆన్లైన్ సేవలు కలెక్షన్ లేని సినిమాలకే తప్ప క్రేజ్ ఉన్న సినిమాకు కాదని అభిప్రాయపడుతున్నారు. దళారులను ఏర్పాటు చేసి.. మాచర్లటౌన్ : బాహుబలి చిత్రానికి వచ్చిన క్రేజ్‌ను సినిమా థియేటర్ క్యాష్ చేసుకుంటున్నారు. పట్టణంలోని రెండు థియేటర్లలో పోటాపోటీగా టికెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బాల్కనీ, కుర్చీ, బెంచీలతో సంబంధం లేకుండా అన్ని తరగతుల టికెట్ ధర రూ.200గా నిర్ణయించి ముందుగానే టికెట్లను అమ్ముకున్నారు. వీరు విక్రయించే టికెట్లపై ఎక్కడా ధరను ప్రచురించటం లేదు. రెండు థియేటర్ల నిర్వాహకులు సిండికేట్ అయి సగం టికెట్లు మిగిల్చి వాటిని అమ్మేందుకు కొంతమంది దళారులను నియమించినట్లు తెలిసింది. -
బాహుబలి ఫీవర్
సినిమా చూపిస్తున్న ‘బాహుబలి’ - సినిమా థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం - ఒకరోజు ముందుగానే టికెట్ల కోసం పడిగాపులు - అడ్వాన్స్ బుకింగ్‌లో ధరలకు రెక్కలు - జిల్లాలో 62 థియేటర్లు ఉంటే 58 థియేటర్లలో నేడు విడుదల - అడ్వాన్స్ బుకింగ్‌లో అత్యధిక ధరలు - ప్రేక్షకుల జేబులకు భారీగా చిల్లులు - బంద్ ఎఫెక్ట్‌తో ‘ఆందోళన’ వనపర్తిటౌన్: మూడేళ్ల నుంచి ఊరించి ప్రేక్షకుల్లో భారీ అంచనాలతో వస్తున్న బాహుబలి సినిమా విడుదలకు ముందే థియేటర్ యజమానులకు కాసుల వర్షం కురిపిస్తోంది. జిల్లాలో మొత్తం 62థియేటర్లు ఉంటే శుక్రవారం 58 థియేటర్లలో బాహుబలి విడుదల కానుంది. వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, ఆమనగల్లు, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో గత వారం రోజులుగా అడ్వాన్స్ బుకింగ్ పేర్లతో టికెట్ రేట్లను రెట్టింపు చేసేశారు. రూ.10లు ఉండే లోక్లాస్ టికెట్ నుంచి రూ.50లు ఉండే ఫస్ట్‌క్లాస్ టికెట్లను రూ.60 నుంచి రూ.200వరకు పెంచి అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చేశారు. కొన్ని థియేటర్లలో ఏ క్లాసైనా రూ.100లకు అమ్ముతున్నారు. బాహాటంగా టికెట్ ధరలను పెంచిన థియేటర్ యజమానులు తినుబండారాలు, శీతల పానీయాలు సైతం పెంచి, ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టి కాసులు దండుకునేందుకు సిద్ధమయ్యారు. మహబూబ్‌నగర్‌లో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక షోలు ప్రారంభమవుతుండగా, వనపర్తి, జడ్చర్లలో తెల్లవారుజాము నుంచి ఆటలు మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 50వేలకు పైగా టికెట్లు అమ్మినట్లు థియేటర్ నిర్వాహకులు చెబుతున్నారు. ఒకట్రెండు థియేటర్లలో తప్పా.. మిగిలిన వాటిలో సీట్ల పరిమితికి మించి టికెట్ల అమ్మకాలు చేపట్టారు. మరోవైపు ప్రతి మూడు, ఆరు నెలలకొకసారి అధికారులు తప్పకుండా థియేటర్లను తనిఖీ చేయాల్సి ఉన్నా.. జిల్లాలో ఎక్కడా ఆ పనిచేసినట్లు కనిపించడం లేదు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టవద్దని కేంద్రానికి లేఖ రాసిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి నిరసనగా జిల్లా టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వడంతో సినిమా థియేటర్ యజమానులు ఆందోళనలో పడ్డారు. థియేటర్లకు వచ్చే నేతలకు ఎలాగైనా సర్దిచెప్పాలని కొందరు భావిస్తుంటే, మరికొందరు వారిని మచ్చిక చేసుకునేందుకు రంగంలోకి దిగారు. అయితే జిల్లాలో బంద్ ఎఫెక్ట్ బాహుబలిపై ఎంత ప్రభావం చూపుతుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. రాత్రి నుంచి థియేటర్లోనే... టీఆర్ఎస్ పార్టీ బంద్ ఇచ్చిన నేపథ్యంలో ఎలాగైన తొలి షో చూడాలనే ఆశతో అభిమానులు గురువారం రాత్రి ఎనిమిది గంటల నుంచే థియేటర్ల వద్దకు చేరుకున్నారు. వనపర్తిలోని శ్రీరామా థియేటర్ వద్ద గురువారం సెకండ్‌షో సైతం వేయనీయకుండా దాదాపు వెయ్యి మంది అభిమానులు థియేటర్లోకి దూసుకెళ్లి సీట్లలో కూర్చున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మొ దటి ఆట చూసే వెళ్తామని అభి మానులు తేల్చిచెప్పారు. అంతకు ముందు థియేటర్ వద్ద వేరే ప్రాం తం నుంచి వచ్చిన అభిమానుల కోసం థియేటర్ వద్ద భోజనాల ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిం చగా, ఒకేసారి వెయ్యి మంది రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించారు. -
చౌక బేరం.. ఆదాయం దూరం!
ప్రయాణికులు పెరిగినా ఆదాయం తగ్గుతోంది * విమానయాన సంస్థల విచిత్ర పరిస్థితి చౌక చార్జీలకే విమానయానం అని ఊరిస్తూ ప్రయాణికుల్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు భలే ఊరిస్తున్నాయి. అందరినీ విమానమెక్కేలా చేస్తున్నాయి. చిత్రమేంటంటే ప్రయాణికుల్ని పెంచుకోవటంలో సక్సెస్ అవుతున్నా... దానికి అనుగుణంగా ఆదాయాని పెంచుకోవటంలో మాత్రం ఫెయిలవుతున్నాయి. దీనిక్కారణం కూడా చౌక ఛార్జీలే. అంటే... చౌక ఛార్జీలు ప్రయాణికుల్ని తెస్తున్నాయి కానీ ఆదాయాన్ని కాదన్నమాట. జనవరి-ఏప్రిల్ మధ్య నమోదైన గణాంకాలే దీనికి నిదర్శనం. గతేడాదితో పోలిస్తే విమాన ఛార్జీలు 20-25 శాతం తగ్గడంతో ప్రతి ప్రయాణికుడిపై ఎయిర్‌లైన్స్‌కి వచ్చే ఆదాయాలు ఆ మేరకు తగ్గాయి మరి. జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో విమాన ప్రయాణికుల సంఖ్య 20 శాతం పెరిగింది. చార్జీలు తగ్గడంతో దేశీయ రూట్లలో ప్రయాణించిన వారే ఇందులో అత్యధికంగా ఉన్నారు. 2014 తొలి త్రైమాసికంతో పోలిస్తే 2015 క్యూ1లో ప్యాసింజర్ ఆక్యుపెన్సీ చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగింది. గతేడాది క్యూ1లో వృద్ధి 71 శాతంగా ఉండగా ఈసారి ఇది 82 శాతంగా నమోదైంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. ఈ వ్యవధిలో ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, జపాన్, రష్యా, అమెరికా వంటి దేశాలతో పోల్చినా కూడా ఇది అత్యధిక పెరుగుదల. ప్రయాణికుల సంఖ్యతో పాటు ఎయిర్‌లైన్స్ నిర్వహణ ఆదాయాలు కూడా పెరిగాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో జెట్ ఎయిర్వేస్ నిర్వహణ ఆదాయం 10.9 శాతం పెరగ్గా.. ప్రతి ప్రయాణికుడిపై సగటున వచ్చే స్థూల ఆదాయం మాత్రం 11.7% క్షీణించి రూ.7,562కి తగ్గింది. ప్రస్తుతానికి చార్జీలు తక్కువగానే ఉన్నప్పటికీ.. క్రూడ్ ధరలు గానీ పెరిగిన పక్షంలో ఇవి మళ్లీ పెరిగే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు. అయితే రాబోయే 1-2 నెలల్లో ఇది జరగకపోవచ్చని వారు పేర్కొన్నారు. పెరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్‌లు .. గతేడాదితో పోలిస్తే అప్పటికప్పుడు ప్రయాణాలకు అమ్మే టికెట్ చార్జీలూ కూడా తగ్గాయి. 30-60 రోజుల ముందుగా బుక్ చేసుకుంటే టికె ట్లు చౌకగా లభిస్తున్నందున అడ్వాన్స్ బుకింగ్స్ పెరుగుతున్నాయి. సాధారణంగా 1-3 నెలల ముందే ప్రయాణికులు ట్రిప్స్‌ను ప్లానింగ్ చేసుకుని, టికెట్లను బుక్ చేసుకుంటున్నారని తమ సర్వేలో తేలినట్లు యాత్రా డాట్‌కామ్ వర్గాలు తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్‌లో టికెట్లు చౌకగా లభిస్తుండటమూ ఇందుకు కారణమన్నాయి. రిటైల్ రేట్ల వైపు కార్పొరేట్ల మొగ్గు... సాధారణంగానే కార్పొరేట్ బుకింగ్ కింద పెద్ద ఎత్తున డిస్కౌంట్లు పొందే కంపెనీలు కూడా ప్రస్తుతం రిటైల్ రేట్లకు టికెట్లు కొనుక్కునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. కార్పొరేట్లకు ఆఫర్ చేసే రేటు కన్నా కూడా ఇవి చౌకగా లభిస్తుండటమే ఇందుకు కారణం. గత జనవరి-ఏప్రిల్ మధ్య కాలంతో పోలిస్తే ఈసారి ఢిల్లీ-కోల్‌కతా రూట్లో కార్పొరేట్ ట్రావెల్ విభాగం బుకింగ్స్ 31 శాతం పెరగ్గా, ఢిల్లీ-పుణె రూట్లో 28 శాతం పెరిగినట్లు ఒక ట్రావెల్ కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. పుణె, అహ్మదాబాద్, నాగ్‌పూర్, ఇండోర్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల నుంచి మెట్రోలకు వచ్చి, వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని యాత్రాడాట్‌కామ్ వర్గాలు పేర్కొన్నాయి. దీనివల్ల కార్పొరేట్ ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ, ఆ విభాగం అమ్మకాల ఆదాయం మాత్రం తగ్గాయి. మరోవైపు ట్రాఫిక్‌కి అనుగుణంగా ఎయిర్‌లైన్స్ కూడా ప్రధాన నగరాల మధ్య సర్వీసులను పెంచుతున్నాయి. ముంబై-ఢిల్లీ, ఢిల్లీ-బెంగళూరు సహా పలు మెట్రో రూట్లలో ఈ ధోరణి కనిపిస్తోంది. ముంబై-ఢిల్లీ రూట్లో విస్తార అయిదు ఫ్లయిట్స్‌ను ప్రారంభించగా, ఢిల్లీ నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా రూట్లలో జెట్ ఎయిర్వేస్ మరిన్ని ఫ్లయిట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
విశేష సేవలకూ ఇక అడ్వాన్స్ బుకింగ్
లక్కీడిప్ ద్వారా కేటాయింపు జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఎల్లుండి సేవా టికెట్ల కోసం రేపటి నుంచి బుకింగ్ సాక్షి, తిరుమల: అరుదైన ఆర్జిత సేవల్లో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని సామాన్య భక్తులకూ కల్పించనున్నట్టు టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఇందులో భాగంగా లక్కీడిప్ (లాటరీ) పద్ధతి అమలు చేస్తామని ఆయన గురువారం విలేకరులకు వివరించారు. ఈనెల 17వ తేదీన జరిగే సేవలకోసం 16వ తేదీ నుంచి బుకింగ్ ప్రారంభిస్తామన్నారు. గతంలో టీటీడీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ప్రకారం కొందరు బల్క్ బుకింగ్ (అధికమొత్తం)లో పొందిన తోమాల, అర్చన, అభిషేకం, మేల్‌ఛాట్ వస్త్రం వంటి అరుదైన సేవా టికెట్లలో కొన్నింటిని రద్దు చేశామని, ఆ టికెట్లను కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతి ద్వారా సామాన్య భక్తులకు కేటాయిస్తున్నామని తెలిపారు. -
ముహూర్తం కుదిరింది..పెళ్లిబాజా మోగింది
మార్గశిర మాసం.. మంచి ముహూర్తాలు తెచ్చింది. జిల్లాకు పెళ్లి కళ వచ్చింది. బంధుమిత్రుల రాకతో కోలాహలం పెరిగింది. కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. షాపింగ్ మాల్స్ సందడిగా మారాయి. ఆకాశాన్ని పందిరిగా మార్చి.. భూలోకాన్ని పీఠగా వేసి వధూవరులు కొత్త జీవితం ప్రారంభించేందుకు శుభ ఘడియలు మొదలయ్యాయి. మూఢాల కారణంగా ఈ ఏడాది భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక మాసాల్లో వివాహాలు జరగలేదు. మార్గశిర మాసం తర్వాత మళ్లీ మూఢం ఉండడం.. ఈ మాసంలో కూడా వివాహ వేడుకలకు ముహూర్తాలు తక్కువగా ఉండడంతో ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి బాజాలు వినిపిస్తున్నాయి. - నల్లగొండ కల్చరల్ ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మరుపురాని ఘట్టం. మూడు ముళ్లు, ఏడడుగులతో ఏకమయ్యే అపూర్వమైన సుదినం. ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. వివాహానికి సుముహూర్తమే కొండంత బలం. దివ్యమైన ముహూర్తం లేకపోతే వివాహం జరిగే అవకాశాలు తక్కువే. భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక మాసాల్లో మంచి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు జరగలేదు. ఈ తరుణలంలో మార్గశిర మాసం పెళ్లిముహూర్తాలను మోసుకొచ్చింది. ఈ నెల 8, 12, 13, 17, 18 తేదీల్లో శుభ ముహూర్తాలున్నాయి. వీటిల్లో 13, 18 తేదీలు పెళ్లిళ్లకు అత్యంత బలమైన ముహూర్తాలని పురోహితు లు చెబుతున్నారు. ఈ నెల 18 దాటితే వచ్చే జనవరి 22వ తేదీ వరకు ఆగాల్సిందేనన్నారు. అడ్వాన్స్ బుకింగ్.. అదరగొడుతున్న రేట్లు సంప్రదాయ పెళ్లిళ్లకు పురోహితుడు తప్పనిసరి. ఒక్కసారిగా ము హూర్తాలు వచ్చి పడడం తో పురోహితులకు గిరాకీ పెరిగింది. పెళ్లి తంతును బట్టి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. సన్నాయి..బ్యాండ్ మేళం లేనిదే పెళ్లికి పూర్తి కళ సంతరించుకోదు. ముహూర్తాలు లేని రోజుల్లో పూటగడవడమే కష్టం కావడంతో వారు కూడా ఒక్కో పెళ్లికి రూ.8వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఉన్న ఫంక్షన్‌హాళ్లు నెల రోజుల మందుగానే బుక్కయ్యాయి. సీజన్లోనే పని మాకు సీజన్లోనే పని.. మిగతా రోజులన్నీ ఖాళీ. కానీ పెళ్ళీళ్ల సీజన్ వచ్చిం దంటే చాలు... పూలు అమ్మెటోళ్లంతా కూడబలుక్కొని రేట్లను ఒక్కసారిగా డబుల్ చేస్తారు. దీంతో ఎన్ని ఫంక్షన్లకు పనిచేసినా గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. - గణేష్, డెకరేషన్ డిజైనర్ ముహూర్తాలు ఒకేసారి రావటంతో ఇబ్బంది చాలా రోజుల తరువాత శుభ ఘడియలు వచ్చాయి. అవి కూడా ఏడు రోజులే ఉన్నాయి. పురోహితులు తక్కువ, వివాహాలు ఎక్కువ.. దీంతో ఒక రోజు లో రెండు, మూడు పెళ్లీలు జరిపించాల్సి రావడం కొంత ఇబ్బందిగా ఉంది. - పురోహితుడు -
బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు
సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండ ముస్తాబైంది. అక్టోబర్ 5 నుంచి 13 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రూ. 3 కోట్లతో ఆలయ పురవీధుల్లో గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మించారు. ఆలయ గోపురాలకు రంగులు, విద్యుద్దీపాల అలంకరణలు, నాలుగు మాడ వీధుల్లో రంగవల్లులు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో అన్ని రకాల ఆర్జిత సేవలు, అడ్వాన్స్ బుకింగ్ నిలిపివేశారు. గురువారం నుంచి 16వ తేదీ వరకు వికలాంగులు, వృద్ధుల మహా ద్వార ప్రవేశం రద్దు చేశారు. కల్యాణవేదిక వద్ద పుష్ప, ఫొటో ప్రదర్శన శాలను ముస్తాబు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. ఏర్పాట్లపై వారు బుధవారం విస్తృతంగా ఇతర అధికారులతో చర్చించారు. బ్రహ్మోత్సవాలకు భద్రతలో భాగంగా మొత్తం 460 సీసీ కెమెరాలు పనిచేయనున్నారుు. ఆక్టోపస్ కమాండోలు, ఏఆర్ కమాండోలు, ఎస్పీఎఫ్ సిబ్బం ది, 3వేల మంది పోలీసులు, 156 మంది బాంబ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఐజీ సురేష్ భగవత్, ఇతర అధికారులు రెండు రోజులుగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ తిరుమలలో బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 13 కంపార్ట్మెంట్లలో వేచిఉన్న కాలిబాట భక్తులకు 5 గంటలుగా దర్శన సమయం నిర్ణయించారు. భక్తుల రద్దీ పెరగటంతో రూ. 300 టికెట్ల దర్శనం సాయంత్రం వరకు అనుమతించి తరువాత నిలిపివేశారు. గదులకు డిమాండ్ పెరిగింది. 5న తిరుమలకు సీఎం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఈ నెల 5న తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.