రైల్వే ప్రయాణం చేయాలంటే చాలామంది ముందుగా టికెట్స్ బుక్ చేస్తారు. ఇప్పటి వరకు 120 రోజులు ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును ఇండియన్ రైల్వే కల్పించింది. అయితే ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ 120 రోజులను 60 రోజులకు కుదించింది. అంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు రెండు నెలల ముందు మాత్రమే బుక్ చేసుకోగలరు.
ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధనలు 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అంతే కాకుండా అక్టోబర్ 31 వరకు బుక్ చేసుకునే వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి. నవంబర్ 1 నుంచి అడ్వాన్స్ బుక్ చేసుకోవాలనుకునేవారికి మాత్రమే ఈ కొత్త నియమం వర్తిస్తుంది.
ఇదీ చదవండి: లులు గ్రూప్ అధినేత మంచి మనసు.. ప్రశంసిస్తున్న నెటిజన్లు
తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి ట్రైన్ అడ్వాన్స్ బుకింగ్‌లలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇందులో అడ్వాన్డ్ బుకింగ్ వ్యవధి తక్కువగానే ఉంది. విదేశీ పర్యాటకులకు 365 రోజుల పరిమితి విషయంలో కూడా ఎలాంటి మార్పు ఉండదని ఐఆర్‌సీటీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment