మన దేశంలో ఎక్కడికైనా ప్రయాణించాలంటే.. భారతీయ రైల్వే అత్యంత చౌకైన.. ఉత్తమ మార్గం. రోజూ లక్షలమంది రైలు ద్వారానే ప్రయాణిస్తున్నారు. అయితే మనం కొన్ని సార్లు సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు.. ముందుగానే బుక్ చేసుకుంటే ప్రయాణం సులభంగా ఉంటుంది. గతంలో ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలంటే.. తప్పకుండా రైల్వే స్టేషన్ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఇంట్లో కూర్చునే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఈ కథనంలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఉత్తమైన యాప్స్ గురించి తెలుసుకుందాం.
ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ (IRCTC Rail Connect)
ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్.. అనేది ఇండియన్ రైల్వే అధికారిక యాప్. దీని ద్వారా టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్ వంటివి చేసుకోవచ్చు, పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. కోచ్ వివరాలు, బెర్త్ నెంబర్ వంటి వాటిని ఎంచుకోవడం ద్వారా ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.
ఐఆర్‌సీటీసీ యూటీఎస్ (IRCTC UTS)
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే.. యూటీఎస్ (అన్ రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్ తీసుకువచ్చింది. దీని ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. జనరల్ టికెట్స్, మంత్లీ సీజనల్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. లోకల్ ట్రైన్‌లలో ప్రయాణించేవారికి ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కన్ఫర్మ్ టికెట్ (Confirmtkt)
ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారికి ఈ 'కన్ఫర్మ్ టికెట్' యాప్ ఓ మంచి ఎంపిక. ఈ యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రమే కాదు, చెల్లింపులు కూడా చాలా సులభంగా ఉంటాయి. ఇందులో తత్కాల్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు.
ఇక్సిగో (Ixigo)
ఈ యాప్ ద్వారా ట్రైన్ టికెట్స్ మాత్రమే కాకుండా.. విమానాలు, హోటళ్లను కూడా బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా ట్రైన్ ట్రాకింగ్, లైవ్ అప్డేట్స్ వంటివి కూడా తెలుసుకోవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ట్రైన్ రియల్ స్టేటస్ తీసుకోవడానికి ఈ యాప్ సహకరిస్తుంది.
ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటి
మేక్‌మైట్రిప్ (Makemytrip)
ప్రస్తుతం మేక్‌మైట్రిప్ అనేది చాలా పాపులర్ యాప్. ఇందులో ట్రిప్ గ్యారెంటీ అనే ఫీచర్ ఉండటం వల్ల.. కన్ఫర్మ్‌గా టికెట్ బుక్ అవుతుంది. టికెట్ క్యాన్సిల్ అయితే మీ డబ్బుతో పాటు.. ఇతర ఉపయోగకరం కూపన్లు వంటివి కూడా లభిస్తాయి. ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్‌లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గ యాప్ అనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment