రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలో సూపర్‌ యాప్‌ | Indian Railways To Launch Super APP By December End, Check Out Advantages Of This App | Sakshi
Sakshi News home page

రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలో సూపర్‌ యాప్‌

Published Tue, Nov 5 2024 6:55 AM | Last Updated on Tue, Nov 5 2024 9:12 AM

Railways Super APP Launch by December end

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల ఇబ్బందులను దూరం చేసేందుకు భారతీయ రైల్వే త్వరలో ఒక సూపర్ యాప్‌ను విడుదల చేయనుంది. ఈ సూపర్ యాప్ డిసెంబర్ 2024 చివరి నాటికి  అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ సాయంతో ప్రయాణికులు టికెట్ బుకింగ్, రైలు రాకపోకల సమాచారం, ఆహారం, రైలు రన్నింగ్ స్థితి తదితర వివరాలను అత్యంత సులభంగా తెలుసుకోవచ్చు.

త్వరలో అందుబాటులోకి రానున్న భారతీయ రైల్వేల సూపర్ యాప్ ఇప్పటికే ఉన్న ఐఆర్‌సీటీసీ యాప్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ సూపర్ యాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్‌, పాస్‌లను కొనుగోలు చేయవచ్చు. రైల్వే టైమ్‌టేబుల్‌ను కూడా చూడవచ్చు. ఈ యాప్‌ను రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెంటర్ అభివృద్ధి చేస్తోంది.

ప్రస్తుతం ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా విమాన టిక్కెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు. రైలులో ఆహారాన్ని కూడా ఆర్డర్ చేయవచ్చు. అయితే భారతీయ రైల్వే మరో కొత్త యాప్‌ను ప్రవేశపెట్టడం ద్వారా  ప్రయాణికులకు మరింత చేరువకానుంది.

ఇది కూడా చదవండి: సగం సీట్లు ‘ఇతరులకే’..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement