Rail services
-
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల ఇబ్బందులను దూరం చేసేందుకు భారతీయ రైల్వే త్వరలో ఒక సూపర్ యాప్‌ను విడుదల చేయనుంది. ఈ సూపర్ యాప్ డిసెంబర్ 2024 చివరి నాటికి అందుబాటులోకి రానుంది. ఈ యాప్ సాయంతో ప్రయాణికులు టికెట్ బుకింగ్, రైలు రాకపోకల సమాచారం, ఆహారం, రైలు రన్నింగ్ స్థితి తదితర వివరాలను అత్యంత సులభంగా తెలుసుకోవచ్చు.త్వరలో అందుబాటులోకి రానున్న భారతీయ రైల్వేల సూపర్ యాప్ ఇప్పటికే ఉన్న ఐఆర్సీటీసీ యాప్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ సూపర్ యాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్, పాస్‌లను కొనుగోలు చేయవచ్చు. రైల్వే టైమ్‌టేబుల్‌ను కూడా చూడవచ్చు. ఈ యాప్‌ను రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెంటర్ అభివృద్ధి చేస్తోంది.ప్రస్తుతం ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా విమాన టిక్కెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు. రైలులో ఆహారాన్ని కూడా ఆర్డర్ చేయవచ్చు. అయితే భారతీయ రైల్వే మరో కొత్త యాప్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులకు మరింత చేరువకానుంది.ఇది కూడా చదవండి: సగం సీట్లు ‘ఇతరులకే’..! -
ఇక రైల్వే టికెట్ బుకింగ్ మరింత ఈజీ
న్యూఢిల్లీ, సాక్షి: ఆన్లైన్లో రైల్వే టికెట్ల బుకింగ్ మరింత ఈజీకానుంది. ఇందుకు వీలుగా ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించింది. యాప్‌ను సైతం అప్‌గ్రేడ్ చేసింది. ఈ మార్పులన్నీ 2021 జనవరి 1 నుంచీ అమల్లోకిరానున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గురువారం అప్‌గ్రేడ్ చేసిన ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్‌లకు పచ్చజెండా ఊపారు. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను 6 కోట్లమందికిపైగా వినియోగిస్తున్నారు. రోజుకి సగటున 8 లక్షలకుపైగా టికెట్లు బుక్ అవుతున్నాయి. రిజర్వ్డ్ టికెట్లలో 83 శాతం ఆన్లైన్ ద్వారానే బుక్ కావడం విశేషం! ఐఆర్సీటీసీ అందించిన వివరాల ప్రకారం.. చదవండి: (నెలకు రూ. 500లోపు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్) - యూజర్లు లాగిన్ అయ్యాక టికెట్లతోపాటే భోజనం, వసతి గదుల(రిటైరింగ్ రూమ్స్) వంటివి బుక్ చేసుకునేందుకు వీలుంటుంది. టికెట్ కోసం నింపిన యూజర్ల వివరాలతో ఒకే దఫాలో(వన్‌స్టాప్ సొల్యూషన్) వీటన్నిటినీ బుక్ చేసుకోవచ్చు. - బుకింగ్ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యూజర్ వెదుకుతున్న స్టేషన్లు లేదా ప్రయాణికుల వివరాలను వేగంగా అందిస్తుంది. - యూజర్ అకౌంట్స్ పేజీలో రిఫండ్ స్టేటస్‌ను అత్యంత సులభంగా పరిశీలించవచ్చు. గతంలో ఈ వివరాలను తెలుసుకోవడం కష్టమయ్యేది. - రెగ్యులర్ లేదా ఫేవరెట్ ప్రయాణాలను ఎంపిక చేసుకోవడం ద్వారా వివరాలను ఆటోమాటిక్‌గా ఎంటర్ చేసుకోవచ్చు. - ట్రయిన్ సెర్చ్, సెలక్షన్‌కు సంబంధించి అన్ని వివరాలూ ఇకపై ఒకే పేజీలో కనిపించనున్నాయి. - వెదుకుతున్న రైళ్ల వివరాలు, అన్ని తరగతుల సీట్ల లభ్యత, ధరలు వంటివి ఒకే చోట దర్శనమివ్వనున్నాయి. పేజీని స్ర్కోల్ చేయడం ద్వారా బుక్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. గతంలో ఒక్కో క్లిక్‌తో ఒక్కో ట్రయిన్ వివరాలను మాత్రమే తెలుసుకునేందుకు వీలుండేది. - బ్యాకెండ్‌లో క్యాచ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడంతో సీట్ల అందుబాటు సమాచారంలో మరింత వేగంగా లోడింగ్‌కు అవకాశముంటుంది. - వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు సంబంధించి సీటు ఖరారయ్యే(కన్ఫర్మేషన్) అవకాశాలను సైతం సూచిస్తుంది. గతంలో ఈ ఆప్షన్‌ను ప్రత్యేకంగా వెదకవలసి వచ్చేది. - ఇతర తేదీలలో సీట్ల లభ్యత వివరాలు సైతం పేజీలో ప్రత్యక్షం కానున్నాయి. - టికెట్ బుకింగ్ సమయంలో చెల్లింపుల పేజీలో ప్రయాణ వివరాలు డిస్ప్లే కానున్నాయి. టైపింగ్ తప్పులుంటే వెంటనే సరిదిద్దుకోవచ్చు. క్యాప్చాల వినియోగంతో సైబర్ సెక్యూరిటీకి వీలుంది. -
ఎంపీ తలారి లేఖకు స్పందించిన కేంద్రం
సాక్షి, అమరావతి: రాయలసీమకు ప్రత్యేకించి అనంతపురం నుంచి పండ్లు, కూరగాయల ఎగుమతికి కిసాన్ రైలు నడపాలన్న పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య వినతికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తలారి వినతిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రైల్వే బోర్డు.. దక్షిణ మధ్య రైల్వే వాణిజ్య విభాగం ముఖ్య అధికారిని ఆదేశించింది. రైల్వే అధికారులు సోమవారం అనంతపురం వెళ్లి ఉద్యాన శాఖాధికారులతో చర్చలు జరిపి సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ నుంచి కిసాన్ రైలు అనంతపురం–ఢిల్లీ మధ్య నడవనుంది. (టీడీపీ ఇన్చార్జ్పై కలెక్టర్ సీరియస్) ► అనంతపురం జిల్లా నుంచి పండ్లు, కూరగాయలు ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని మార్కెట్లకు రవాణా అవుతుంటాయి. ► రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీ చేరాలంటే ఐదారు రోజులు పడుతుంది. దీంతో చాలా ఉత్పత్తులు చెడిపోతున్నాయి. ► అనంత ఎంపీ రంగయ్య.. సీఎం జగన్ సూచనతో కిసాన్ రైలును కేటాయించాలని ఇటీవల ప్రధాని, రైల్వే మంత్రికి లేఖ రాశారు. -
కరోనా నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పుడప్పుడే కరోనా వైరస్ తగ్గేలా లేకపోవడంతో భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే సర్వీసులపై నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ, ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. అయితే లాక్ డౌన్ సమయంలో తీసుకువచ్చిన 230 ప్రత్యేక రైళ్లను మాత్రం నడపనున్నట్లు స్పష్టం చేసింది.. రైళ్ల రాకపోకలపై గతంలో విధించిన నిషేధం ఆగస్టు 12తో పూర్తి కానున్న విషయం తెలిసిందే. ఇదిలా వుండగా దేశంలో ఇప్పటివరకు 22,15,074 కేసులు నమోదవగా 44,386 మంది మరణించారు. కినోవా రైతులకు కిసాన్ రైళ్లు.. పంటను తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో రవాణా చేసేందుక వీలుగా కేంద్రం కిసాన్ రైలు సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని దేవ్లాలీ నుంచి బిహార్‌లోని దాణాపూర్ వరకు బయలు దేరిన తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ క్రమంలో అబోహర్ నుంచి బెంగుళూరు, కోల్‌కతాలకు కిసాన్ రెళ్లను నడిపి కినోవా రైతులకు చేయూతనందించాలని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ సోమవారం రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో కినోవా పంట లక్ష ఎకరాల్లో పండిస్తున్నారని లేఖలో తెలిపారు. (కిసాన్ రైలుతో రైతులకు ఎంతో మేలు) వీటి ఉత్పత్తిని దక్షిణ, తూర్పు రాష్ట్రాలకు సరఫరా చేయడం వల్ల కినోవాకు విస్తృతమైన మార్కెట్ లభిస్తుందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌కు దీన్ని పెద్ద మొత్తంలోనే ఉత్పత్తి చేస్తున్నప్పటికీ బెంగళూరు, కోల్‌కతాలో దీనికి మంచి మార్కెట్ ఉందని ఆమె తెలిపారు. త్వరగా పాడైపోయే గుణం ఉన్న ఈ పండు ఉత్పత్తి చేసిన దాంట్లో కేవలం 35 నుంచి 40 శాతం మాత్రమే వినియోగదారునికి చేరుతుందని వెల్లడించారు. రవాణాకు ఎక్కువ సమయం పట్టడం, అధిక ఉష్ణోగ్రత వల్ల మిగిలి పండంతా పాడవుతుందని దాని వల్ల రైతులు నష్టపోతున్నారని ఆమె పేర్కొన్నారు. కిసాన్ రైళ్లను కినోవా రైతులకు కేటాయిస్తే వారు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ తెలిపారు. (రైల్వే శాఖ కీలక నిర్ణయం) -
రైలు బండి.. షరతులు ఇవేనండీ
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ నుంచి ఊరట కల్పి స్తూ పరిమిత మార్గాల్లో రైలు ప్రయాణానికి పచ్చజెండా ఊపిన కేంద్రం ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బుకింగ్ ప్రొటోకాల్‌పై రైల్వే శాఖ పలు మార్గదర్శకాలు జారీచేసింది. ‘తొలుత 15 మార్గాల్లో 15 జతల (30 రానుపోను ప్రయాణాలు) రైళ్లను ప్రారంభిస్తున్నాం. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఇతర రెగ్యులర్ ప్యాసింజర్ సర్వీసెస్, మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబ్ అర్బన్ సర్వీసులు ఎలాంటి సేవలు అందించవు’ అని పేర్కొంది. మార్గదర్శకాలివీ... ► ప్రస్తుతం పనిచేయనున్న ప్రత్యేక రైళ్లలో ఏసీ తరగతులే ఉంటాయి. ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లే ఉంటాయి. ► రాజధాని రైళ్లలో రెగ్యులర్ టైమ్ టేబుల్ ప్రకారం ఉండే చార్జీలు ఈ స్పెషల్ ట్రైన్లకు వర్తిస్తాయి. కేటరింగ్ చార్జీలు ఉండవు. ► ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారానే బుకింగ్ చేసుకునే వీలుంది. ► టికెట్ల బుకింగ్‌కు కౌంటర్లు ఉండవు. రైల్వే, ఐఆర్సీటీసీ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవడానికి వీలు లేదు. ► రిజర్వేషన్ గరిష్టంగా తదుపరి ఏడు రోజులలోపు ప్రయాణానికి మాత్రమే. ► కన్ఫర్మ్డ్ టికెట్లను మాత్రమే అనుమతిస్తారు. ఆర్ఏసీ, వెయిటింగ్ టికెట్‌ను అనుమతించరు. ► కరెంట్ బుకింగ్, తత్కాల్ బుకింగ్, ప్రీమియం తత్కాల్ బుకింగ్ అనుమతించరు. అన్ రిజర్వ్డ్ టికెట్లు(యూటీఎస్) అనుమతించరు.. భోజన వసతి లేదు ► ప్రయాణ చార్జీల్లో క్యాటరింగ్ చార్జీలు ఉండవు. æ ప్రీ పెయిడ్ మీల్ బుకింగ్ (భోజనం కోసం ముందస్తు చెల్లింపు), ఈ–క్యాటరింగ్ వెసులుబాటు ఉండదు. ► పరిమితమైన ఆహార పదార్థాలు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (నీటి సీసాలు) చెల్లింపు పద్ధతిలో అందించేందుకు ఐఆర్సీటీసీ ఏర్పాట్లు చేస్తుంది. బుకింగ్వేళ దీనికి సంబంధించిన సమాచారం తెలుస్తుంది. ► పొడిగా ఉండే ఆహారం, తినడానికి సిద్ధంగా ఉండే ఆహారం (రెడీ టూ ఈట్), నీటి సీసాలు చెల్లింపు పద్ధతిలో ప్రయాణంలో అందుబాటులో ఉంటాయి.. ► ప్రయాణికులందరినీ తప్పనిసరిగా స్క్రీనిం గ్ చేస్తారు. కోవిడ్ లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. ► రైల్లో ఎలాంటి బ్లాంకెట్లు, లినెన్ క్లాత్, కర్టెయిన్లు అందుబాటులో ఉండవు. అందువల్ల కోచ్‌లలో ఏసీ కూడా ఇందుకు అనుగుణంగా మెయింటేన్ చేస్తారు. ► బెడ్‌షీట్‌ను ప్రయాణికులు ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు. ► ప్లాట్‌ఫామ్‌లలో ఎలాంటి స్టాళ్లు, బూత్‌లు తెరిచి ఉండవు. వెండర్ల అమ్మకాలు కూడా ఉండవు. ► రైల్వే స్టేషన్లకు చేరేందుకైనా, స్టేషన్ల నుంచి ఇంటికి వెళ్లేందుకైనా ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే ఆయా వాహనాల డ్రైవర్లకు సహా వెసులుబాటు ఉంటుంది. ► ప్రతి ప్రయాణికుడు ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. క్యాన్సలేషన్ ఇలా.. ► టికెట్ రద్దు (క్యాన్సలేషన్) చేసుకోవాలనుకుంటే రైలు బయలుదేరే షెడ్యూలు సమయం కంటే 24 గంటల ముందు అనుమతిస్తారు. ► 24 గంటల కంటే తక్కువ సమయం ఉంటే టికెట్ రద్దుకు అనుమతించరు. ► క్యాన్సలేషన్ చార్జీగా టికెట్ ధరలో 50 శాతం విధిస్తారు. ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► రైలు ఎక్కేటప్పుడు, రైలు ప్రయాణంలో తప్పనిసరిగా మాస్క్ లేదా ఫేస్ కవర్ ధరించాలి. ► షెడ్యూలు సమయం కంటే 90 నిమిషాలు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలి. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. ► ప్రయాణికులు స్టేషన్లలో, రైళ్లలో భౌతిక దూరం పాటించాలి. ► గమ్యం చేరాక ప్రయాణికులు ఆయా రాష్ట్రాలు విధించిన ఆరోగ్య నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. -
కృష్ణపట్నం పోర్టు నుంచి కొత్త రైలు సర్వీసులు
ఐసీడీ బెంగళూరుకు వారానికి 2 సర్వీసులు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంటెయినర్ కార్పొరేషన్‌తో (కాన్కార్) కలసి కృష్ణపట్నం పోర్టు కంపెనీ (కేపీసీఎల్) కొత్త రైలు సర్వీసులు ప్రారంభించింది. కృష్ణపట్నం పోర్టు నుంచి ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో (ఐసీడీ) బెంగళూరు మధ్య వారానికి రెండుసార్లు ఈ సర్వీసులుంటాయి. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఎగుమతి, దిగుమతిదారులకు సురక్షితమైన ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించినట్లు కేపీసీఎల్ సీఈవో అనిల్ యెండ్లూరి తెలిపారు. దీనివల్ల సరుకు రవాణా సమయం 48 గంటలకు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. రోడ్డు మార్గంలో బరువుపరమైన నియంత్రణ సమస్యలు ఎదుర్కొనే భారీ కార్గోల రవాణాకు ఈ సర్వీసులు తోడ్పడగలవని అనిల్ చెప్పారు. ఎగుమతులకు ఉద్దేశించిన వస్తూత్పత్తులు బెంగళూరు నుంచి ప్రతి మంగళ, శుక్రవారం ఈ రైలు సర్వీస్ ద్వారా పోర్టుకు చేరతాయి. అలాగే దిగుమతైనవి ప్రతి బుధ, శనివారం పోర్టు నుంచి బయలుదేరి ఐసీడీ బెంగళూరుకు చేరతాయి. -
రేపటి నుంచి మినీరైలు సేవలు
సాక్షి, ముంబై: గత నాలుగు నెలలుగా నేరల్-మాథేరాన్ మధ్య నిలిచిపోయిన మినీ రైలుసేవలను బుధవారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రకటనతో పర్యాటకుల్లో ఆనందం వెల్లువిరిసింది. నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో కొండపైగల మాథేరాన్ పర్యాటక ప్రాంతానికి నిత్యం వందలాది, సెలవు రోజుల్లో వేలాది మంది వెళ్తుంటారు. ఈ రైలు మార్గం దాదాపు 80 శాతం కొండ అంచుల మీదుగా సాగుతుంది. దీంతో వర్షా కాలంలో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఏటా జూన్ 15 నుంచి ఆక్టోబరు మొదటి లేదా రెండోవారం వరకు ఈ రైలు సేవలను నిలిపివేస్తారు. ఈ నాలుగు నెలల కాలంలో రైల్వే మార్గంపై ఉన్న వంతెనలు, ట్రాక్‌లకు, ప్రమాదకర మలుపుల వద్ద మరమ్మతులు నిర్వహిస్తారు. బోగీలు, ఇంజిన్లను మరమ్మతుల నిమిత్తం రైల్వే వర్క్ షాపులకు తరలిస్తారు. ప్రస్తుతం వర్షాకాలం దాదాపు పూర్తికావడంతో రైళ్ల సేవలు పునరుద్ధరించేందుకు మార్గం సుగమమైంది. దీంతో బుధవారం నుంచి సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. -
రైల్వే శాఖకు సమైక్య సెగ
ఒంగోలు, న్యూస్‌లైన్: రైల్వే శాఖకు సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం విద్యుత్ శాఖ సిబ్బంది సమ్మెలోకి దిగారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి పలు రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. సోమవారమూ మరి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఆదివారం ఉదయం 5.35 గంటలకు రైల్వేకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైల్వే అధికారులు ఐదు నిముషాల్లోనే మరో గ్రిడ్‌తో అనుసంధానం చేశారు. ఆగిన రైళ్లు తిరిగి కదలడానికి అరగంటకుపైగా సమయం పట్టింది. ప్రారంభంలోనే అరగంట ఆలస్యంగా బయల్దేరిన పినాకిని(విజయవాడ- చెన్నై) ఎక్స్‌ప్రెస్ చీరాల సమీపానికి వచ్చేసరికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయంగా ఒక డీజిల్ ఇంజన్‌ను తెప్పించి దాదాపు గంటన్నర ఆలస్యంగా రైలును నడిపారు. రద్దయిన రైళ్లు ఇవే.. ముందస్తుగా గూడ్సు వాహనాలను నిలిపివేయాలని రైల్వే శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు పలు ప్యాసింజర్ రైళ్లును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా లోడు తగ్గకపోవడంతో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ రద్దు చేశారు. ప్రయాణికుల రద్దీ పెరిగిపోవడంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు పలు చోట్ల స్టాపింగ్ కల్పించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఒంగోలుకు చేరుకోగానే కేవలం విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుందని ప్రకటించారు. అయితే కొన్ని రైళ్లు రద్దవడంతో ప్రయాణికుల ఇబ్బందులను ఒంగోలు స్టేషన్ మేనేజర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ చీరాల, బాపట్ల, తెనాలి స్టేషన్లలో ఆగుతుందని ప్రకటించి ప్రయాణికులు ఎక్కేందుకు వీలుగా పది నిమిషాల వరకు ఒంగోలు స్టేషన్లో ఆపారు. కోరమాండల్తోపాటు నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లు మూడు గంటలు ఆలస్యంగా నడిచాయి. సమైక్య ఉద్యమ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో అదనపు బలగాలు మోహరించాయి. ప్రయాణికుల తీవ్ర అవస్థలు ఒక్కసారిగా పలు రైళ్ల సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమ్మె నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితమవడంతో ఎక్కువ మంది రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. ఆదివారం రైళ్ల సర్వీసులు కూడా రద్దవడంతో ముందస్తుగా బుక్ చేసుకున్న వారు, చంటి పిల్లలతో వచ్చిన వారు, వృద్ధులు అవస్థలు ఎదుర్కొన్నారు.