Indian Railways: IRCTC e-ticketing Website And App Launched, Check Updated Features - Sakshi
Sakshi News home page

ఇక రైల్వే టికెట్‌ బుకింగ్‌ మరింత ఈజీ

Published Thu, Dec 31 2020 3:39 PM | Last Updated on Thu, Dec 31 2020 8:27 PM

IRCTC revamped website and mobile app - Sakshi

న్యూఢిల్లీ, సాక్షి: ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్ల బుకింగ్‌ మరింత ఈజీకానుంది. ఇందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించింది. యాప్‌ను సైతం అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ మార్పులన్నీ 2021 జనవరి 1 నుంచీ అమల్లోకిరానున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ గురువారం అప్‌గ్రేడ్‌ చేసిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, యాప్‌లకు పచ్చజెండా ఊపారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను 6 కోట్లమందికిపైగా వినియోగిస్తున్నారు. రోజుకి సగటున 8 లక్షలకుపైగా టికెట్లు బుక్‌ అవుతున్నాయి. రిజర్వ్‌డ్‌ టికెట్లలో 83 శాతం ఆన్‌లైన్‌ ద్వారానే బుక్‌ కావడం విశేషం! ఐఆర్‌సీటీసీ అందించిన వివరాల ప్రకారం..  చదవండి: (నెలకు రూ. 500లోపు బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌)

- యూజర్లు లాగిన్‌ అయ్యాక టికెట్లతోపాటే భోజనం, వసతి గదుల(రిటైరింగ్‌ రూమ్స్‌) వంటివి బుక్‌ చేసుకునేందుకు వీలుంటుంది. టికెట్‌ కోసం నింపిన యూజర్ల వివరాలతో ఒకే దఫాలో(వన్‌స్టాప్‌ సొల్యూషన్‌) వీటన్నిటినీ బుక్‌ చేసుకోవచ్చు. 
- బుకింగ్ సమయంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా యూజర్‌ వెదుకుతున్న స్టేషన్లు లేదా ప్రయాణికుల వివరాలను వేగంగా అందిస్తుంది.
- యూజర్‌ అకౌంట్స్‌ పేజీలో రిఫండ్‌ స్టేటస్‌ను అత్యంత సులభంగా పరిశీలించవచ్చు. గతంలో ఈ వివరాలను తెలుసుకోవడం కష్టమయ్యేది. 
- రెగ్యులర్‌ లేదా ఫేవరెట్‌ ప్రయాణాలను ఎంపిక చేసుకోవడం ద్వారా వివరాలను ఆటోమాటిక్‌గా ఎంటర్‌ చేసుకోవచ్చు.
- ట్రయిన్‌ సెర్చ్‌, సెలక్షన్‌కు సంబంధించి అన్ని వివరాలూ ఇకపై ఒకే పేజీలో కనిపించనున్నాయి.  
- వెదుకుతున్న రైళ్ల వివరాలు, అన్ని తరగతుల సీట్ల లభ్యత, ధరలు వంటివి ఒకే చోట దర్శనమివ్వనున్నాయి. పేజీని స్ర్కోల్‌ చేయడం ద్వారా బుక్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. గతంలో ఒక్కో క్లిక్‌తో ఒక్కో ట్రయిన్‌ వివరాలను మాత్రమే తెలుసుకునేందుకు వీలుండేది.
- బ్యాకెండ్‌లో క్యాచ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడంతో సీట్ల అందుబాటు సమాచారంలో మరింత వేగంగా లోడింగ్‌కు అవకాశముంటుంది. 
- వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లకు సంబంధించి సీటు ఖరారయ్యే(కన్ఫర్మేషన్‌) అవకాశాలను సైతం సూచిస్తుంది. గతంలో ఈ ఆప్షన్‌ను ప్రత్యేకంగా వెదకవలసి వచ్చేది.
- ఇతర తేదీలలో సీట్ల లభ్యత వివరాలు సైతం పేజీలో ప్రత్యక్షం కానున్నాయి.
- టికెట్‌ బుకింగ్‌ సమయంలో చెల్లింపుల పేజీలో ప్రయాణ వివరాలు డిస్‌ప్లే కానున్నాయి. టైపింగ్‌ తప్పులుంటే వెంటనే సరిదిద్దుకోవచ్చు. క్యాప్చాల వినియోగంతో సైబర్‌ సెక్యూరిటీకి వీలుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement