
సాక్షి, ముంబై: షిర్డీకి వచ్చే భక్తులు ఇకపై రైలు టికెట్ల రిజర్వేషన్‌తోపాటు దర్శనం పాస్ రిజర్వేషన్లు చేసుకోవచ్చు. ఈనెల 26వ తేదీ నుంచి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు షిర్డీ సాయిబాబా ట్రస్ట్ సంస్ట్ అధ్యక్షుడు తెలిపారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో షిర్డీ కోసం టికెట్ బుక్ చేసే సమయంలోనే అక్కడ షిర్డీ సాయి సంస్థాన్‌కు చెందిన ఆన్‌లైన్ సర్వీసెస్ ఆన్‌లైన్.సాయి.ఆర్గ్.ఇన్ అనే వెబ్ సైట్‌లింక్ కన్పిస్తుందన్నారు. దీని ద్వారా దర్శనం పాస్ తీసుకోవచ్చన్నారు. సాయినగర్ షిర్డీ, కోపర్‌గావ్, నాగర్‌సోల్, మన్మాడ్, నాసిక్ వంటి రైల్వేస్టేషన్‌ల కోసం టికెట్లు రిజర్వేషన్‌న్‌చేయించుకునే వారికి ఇది అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment