IRCTC: రైల్వే ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో మార్పులు | IRCTC Online Ticket Booking Website Now Fully Updated | Sakshi
Sakshi News home page

IRCTC: రైల్వే ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో మార్పులు

Published Mon, Jan 29 2024 4:19 PM | Last Updated on Mon, Jan 29 2024 4:36 PM

IRCTC Online Ticket Booking Website Now Fully Updated - Sakshi

దేశంలో ఎక్కువ మంది ప్రయాణించే సాధనం రైల్వేలు. చాలా మంది ఆన్‌లైన్‌లో ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారిక ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరికొన్ని మార్పులు చేసింది. 

ప్రయాణికులు రైలు టిక్కెట్‌లను సులభంగా, దుర్వినియోగానికి గురి కాకుండా బుక్‌ చేసుకోవడానికి వీలుగా ఐఆర్‌సీటీసీ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం.. ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసే ప్రయాణికులు ముందుగా వారి ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది.

 

ఇలా ధ్రువీకరించాలి..

  • మొదటగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లో వెరిఫికేషన్‌  విండోకు లాగిన్ చేయండి
  • తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి.
  • హోమ్ పేజీలో అవసరమైన సమాచారాన్ని అందించిన తర్వాత వెరిఫై బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి మీ మొబైల్ నంబర్‌ని ధ్రువీకరించండి
  • ఇక ఈమెయిల్ వెరిఫికేషన్‌ పూర్తి చేయడానికి ముందుగా మీ ఈమెయిల్ ఐడీకి వచ్చిన కోడ్‌ను నమోదు చేయండి.
  • ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ రైలు టిక్కెట్ బుకింగ్‌లు చేయగలుగుతారు.

కేంద్ర బడ్జెట్‌ 2024ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్‌లో రైల్వేలకు కేటాయింపులు, కొత్త రైళ్లు, రైలు మార్గాలు, ఇతర అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement