updated
-
IRCTC: రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు
దేశంలో ఎక్కువ మంది ప్రయాణించే సాధనం రైల్వేలు. చాలా మంది ఆన్లైన్లో ట్రైన్ టికెట్లు బుక్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారిక ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరికొన్ని మార్పులు చేసింది. ప్రయాణికులు రైలు టిక్కెట్లను సులభంగా, దుర్వినియోగానికి గురి కాకుండా బుక్ చేసుకోవడానికి వీలుగా ఐఆర్సీటీసీ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం.. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసే ప్రయాణికులు ముందుగా వారి ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇలా ధ్రువీకరించాలి.. మొదటగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో వెరిఫికేషన్ విండోకు లాగిన్ చేయండి తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి. హోమ్ పేజీలో అవసరమైన సమాచారాన్ని అందించిన తర్వాత వెరిఫై బటన్‌పై క్లిక్ చేయండి. మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి మీ మొబైల్ నంబర్ని ధ్రువీకరించండి ఇక ఈమెయిల్ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి ముందుగా మీ ఈమెయిల్ ఐడీకి వచ్చిన కోడ్‌ను నమోదు చేయండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్లైన్ రైలు టిక్కెట్ బుకింగ్‌లు చేయగలుగుతారు. కేంద్ర బడ్జెట్ 2024ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్లో రైల్వేలకు కేటాయింపులు, కొత్త రైళ్లు, రైలు మార్గాలు, ఇతర అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
సుప్రీం కోర్టు తీర్పు.. ఈపీఎఫ్ఓ మార్పులు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ ‘తరచూ అడిగే ప్రశ్నావళి’ (FAQ)లో మార్పులు చేసింది. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి అధిక పెన్షన్ అమలుపై సవరించిన ఎఫ్ఏక్యూ సెట్‌ను విడుదల చేసింది. పెన్షన్ బకాయిలను చందాదారులకు చెల్లిస్తారా లేదా అధిక చందా డిమాండ్‌కు సర్దుబాటు చేస్తారా అన్న ప్రశ్నకు సవరించిన ఎఫ్‌ఏక్యూలలో ఈపీఎఫ్ఓ బదులిచ్చింది. పెన్షన్ బకాయిలను ప్రస్తుత పద్ధతిలోనే టీడీఎస్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను నియామళిని అనుసరించి చెల్లించనున్నట్లు పేర్కొంది. మరోవైపు పింఛను లెక్కింపు సూత్రాన్ని, అలాగే ఉద్యోగుల పింఛను పథకం-1995 కింద అధిక పింఛను కోసం ఉమ్మడి దరఖాస్తు సందర్భంలో అవసరమైన ధ్రువపత్రాల జాబితాను ఈపీఎఫ్‌వో నూతన ఎఫ్‌ఏక్యూలలో మరోసారి స్పష్టం చేసింది. అధిక పెన్షన్‌కు సంబంధించిన వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేయడానికి గత జూన్‌లో కూడా ఈపీఎఫ్ఓ ఇలాంటి ఎఫ్ఏక్యూ సెట్‌ను జారీ చేసింది. ఇదీ చదవండి: విశాఖ నుంచి బ్యాంకాక్‌కి నేరుగా ఫ్లైట్ సర్వీస్ అయితే అధిక పెన్షన్‌ను ఈపీఎఫ్ఓ ఎప్పటి నుంచి అమలు చేస్తుందనేదానిపై స్పష్టత లేదు. ఈ అధిక పెన్షన్ ప్రక్రియ ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన దశలో ఉంది. వచ్చే జనవరి నాటికి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా అధిక పెన్షన్ కోసం 17.49 లక్షల దరఖాస్తులు వచ్చాయి. -
అప్డేటెడ్ ఐటీఆర్‌ల రూపంలో రూ.400 కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల సవరణకు అనుమతించడం వల్ల.. కొత్తగా 5 లక్షల సవరించిన (అప్డేటెడ్) రిటర్నులు దాఖలు కావడంతోపాటు, రూ.400 కోట్ల అదనపు పన్ను ఆదాయం కేంద్రానికి వచ్చింది. ఫైనాన్స్ యాక్ట్, 2022లో సవరించిన రిటర్నుల క్లాజును ప్రవేశపెట్టడం తెలిసిందే. దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఒకసారి రిటర్నులు సమర్పించిన అసెస్మెంట్ ఏడాది నుంచి, రెండేళ్లలోపు సవరణలు దాఖలు చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఐటీఆర్–యు పత్రం ఈ ఏడాది మే నెలలో అందుబాటులోకి వచ్చింది. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏదైనా ఆదాయం వెల్లడించకపోయి ఉంటే, ఈ నూతన ఫామ్ రూపంలో సవరణలు దాఖలు చేసుకునే అవకాశం లభించింది. దీంతో 5 లక్షల మంది ఐటీఆర్–యు దాఖలు చేసి రూ.400 కోట్ల పన్ను చెల్లించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. నిబంధనల అమలు సులభతరం అయిందని, కార్పొరేట్లు సైతం సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చన్నారు. ‘‘ఒక కంపెనీ సవరించిన రిటర్నులు సమర్పించి రూ.కోటి పన్ను చెల్లించింది. స్వచ్ఛందంగా నిబం«దనలను అనుసరిస్తున్న వారు పెరుగుతున్నారు. ప్రజలు పన్ను చెల్లించి స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటున్నారు’’అని ఆ అధికారి వాస్తవ పరిస్థితి వివరించారు. సవరణ రిటర్నుల్లో, గతంలో పేర్కొనని ఆదాయ వివరాలు వెల్లడిస్తున్నట్టు అయితే అందుకు కారణాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
భారతీయులకు యూకే తీపి కబురు
-
ఈ రియల్మీ బడ్జెట్ ఫోన్ వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే
మీరు రియల్ మీ సీ3 స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.ఈ ఫోన్‌కు లేటెస్ట్గా ఆండ్రాయిడ్ 11 స్టేబుల్ వెర్షన్ విడుదలైంది.చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్ మీ సీ3ని 2020 ఫిబ్రవరి 14న విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన సీ2 కి హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో సీ3ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించి బీటా వెర్షన్ జులైలో విడుదల చేసినా లేటెస్ట్గా ఆ ఫోన్ స్టేబుల్ వెర్షన్‌ను రియల్ మీ ప్రతినిధులు విడుదల చేశారు.ఈ అప్డేట్ ద్వారా ఫోన్లో టెక్నికల్ సమస్యలతో పాటు కేటగిరి, సిస్టమ్, ఈజీ మొబైల్ ఇంటర్ ఫేస్ ఆప్టిమైజేషన్,సెక్యూరిటీ ప్రైవసీ, గేమ్స్ ఇలా ఒక్కటేమిటీ రియల్ సీ3 వెర్షన్ పూర్తిగా మారిపోతుంది. రియల్మీ సీ3 స్పెసిఫికేషన్లు రియల్ మీ సీ3 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే, 89.8 పర్సెంట్ తో స్క్రీన్ టు బాడీ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో అందుబాటులోకి రాగా మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్.. ఆండ్రాయిడ్ 10 రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనక భాగంలో 12 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. దీంతో పాటు హెచ్ డీఆర్, నైట్ స్కేప్, క్రోమా బూస్ట్, స్లో మో, పొర్ ట్రెయిట్ మోడ్ ఫీచర్ తో పాటు హెచ్ డీఆర్, ఏఐ బ్యూటిఫికేషన్, పనోరమిక్ వ్యూ, టైమ్ ల్యాప్స్ ఫీచర్లు ఉన్న 5 మెగా పిక్సెల్ సెల్ఫీల కెమెరా సౌకర్యం ఉంది. -
సరికొత్త ఫీచర్లతో హీరో మాస్ట్రో ఎడ్జ్ 125...!
ప్రముఖ మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ దేశవ్యాప్తంగా తన 125సీసీ మోడళ్లను పెంచాలని యోచిస్తోంది. ఇటీవల గ్లామర్ బైక్‌కు అప్డేట్ తెచ్చిన కొన్ని రోజులకే స్కూటీ డివిజన్లో మాస్ట్రో ఎడ్జ్ 125ను అప్డేట్ చేస్తూ సరికొత్త ఫీచర్లతో మాస్ట్రో ఎడ్జ్ 125 బైక్‌ను హీరో మోటార్ కార్ప్ రిలీజ్ చేసింది. ఈ బైక్‌ను సరికొత్తగా రెండు రకాల కలర్ వేరియంట్లతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. కస్లమర్లకు ప్రిస్మాటిక్ ఎల్లో, ప్రిస్మాటిక్ పర్పుల్ కలర్ వేరియంట్స్ రూపంలో న్యూ మాస్ట్రో ఎడ్జ్ కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. న్యూ మాస్ట్రో ఎడ్జ్ 125 బైక్ బ్లూటూత్ కనెక్టివిటీని, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టర్న్-బై- టర్న్ నావిగేషన్, డిజిటల్ స్పీడో మీటర్, కాల్ ఆలర్ట్‌తో రానుంది. మాస్ట్రో ఎడ్జ్ 125 డ్రమ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 72,250, డిస్క్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 76,500, కనెక్టెడ్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 79,750గా నిర్ణయించారు. ఈ ధరలు ఢిల్లీ నగరంలో అందుబాటులో ఉంటాయి. మాస్ట్రో ఎడ్జ్ 125 'ఎక్స్సెన్స్ టెక్నాలజీ'తో 124.6 సిసి బిఎస్ 6 కంప్లైంట్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మోటారుతో రానుంది. ఇంజన్ 9బీహెచ్పీ సామర్థ్యంతో 7,000 ఆర్‌పీఎమ్‌ను అందిస్తోంది. 5,500 ఆర్పీఎమ్ వద్ద గరిష్టంగా 10.4ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది.టీవీఎస్ ఎన్‌టార్క్ 125, సుజుకి యాక్సెస్ 125, హోండా గ్రాజియా 125 అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 బైక్‌లకు పోటిగా నిలవనుంది. -
త్వరలోనే వాట్సాప్ ‘డార్క్‌మోడ్’
శాన్ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్ యాజమాన్యంలో నడుస్తున్న వాట్సాప్ ఎప్పటి నుంచో ఊరిస్తున్న డార్క్‌మోడ్ ఫీచర్ విడుదలకు సిద్ధమైంది. కొందరు యూజర్లు ఇప్పటికే దానిని వాడారు కూడా. వాట్సాప్ డార్క్‌మోడ్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఇప్పటికే సిద్ధమైందని, ఐఓఎస్ వెర్షన్ తుదిరూపు దిద్దుకుంటోందని బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్ వెబ్సైట్ తెలిపింది. డార్క్‌మోడ్ అంటే..సాధారణంగా ఇంటర్నెట్ సమాచారమంతా తెలుపు బ్యాక్‌గ్రౌండ్ నల్లని అక్షరాల్లో ఉంటుంది. దీనికి భిన్నంగా నలుపు బ్యాక్ గ్రౌండ్‌తో తెలుపు రంగులో అక్షరాలు కనిపిస్తాయి. దీనివల్ల కళ్లకు తక్కువ శ్రమ కలుగుతుందని, రాత్రి వేళల్లో యాప్‌ను ఉపయోగించే వారికి సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. -
వాట్సాప్‌లో గోప్యతకు మరో ఫీచర్
న్యూఢిల్లీ: యూజర్ల వివరాల గోప్యతకు సంబంధించి మెసేజింగ్ యాప్.. వాట్సాప్ కొత్త అప్డేట్ ప్రవేశపెట్టింది. దీనితో యూజరు అనుమతించిన వారు తప్ప మిగతావారెవరు సదరు యూజరు అనుమతి లేకుండా వారి పేర్లను గ్రూప్స్‌లో చేర్చే వీలుండదు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం యాప్‌లో ఉన్న ’నోబడీ’ ఆప్షన్ స్థానంలో ’మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ అనే ఆప్షన్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. దీనితో గ్రూప్స్‌లో తనను చేర్చేందుకు ఎవరెవరికి అనుమతి ఇవ్వొచ్చు, ఎవరికి ఇవ్వొద్దు అన్నది యూజరే నిర్ణయించుకోవచ్చని సంస్థ తెలిపింది. యూజరును నేరుగా గ్రూప్‌లో చేర్చేందుకు తమకు అనుమతి లేకపోతే వ్యక్తిగత చాటింగ్ ద్వారా గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లు .. వారికి ప్రైవేటుగా ఆహ్వానం పంపాల్సి ఉంటుంది. దీనిపై యూజరు నిర్ణయం తీసుకోవచ్చు. పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పెగాసస్ స్పైవేర్ ద్వారా నిఘా పెట్టేందుకు దరిమిలా.. యూజర్ల వివరాల గోప్యత ప్రశ్నార్థకంగా మారిందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాట్సాప్ కొత్త ఫీచర్ ప్రాధాన్యం సంతరించుకుంది. -
గుడ్ న్యూస్: వాట్సాప్ గ్రూప్ కాలింగ్ అప్డేట్
సాక్షి, న్యూఢిల్లీ: రోజుకొక కొత్త ఫీచర్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప తాజాగా మరో ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే లాంచ్ చేసిన గ్రూప్ కాలింగ్ ఫీచర్లో లోపాలను సవరించి సరికొత్తగా దీన్ని తిరిగి లాంచ్ చేసింది. ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురుతో సంభాషించేలా కొత్త గ్రూప్కాలింగ్ బటన్ అప్డేట్ చేసింది. గతంలో తీసుకొచ్చిన గ్రూప్ కాలింగ్ బటన్ ఒకరికంటే ఎక్కువమందికి ఒకేసారి కాల్స్ చేయడంలో (వాయిస్, వీడియో) వైఫల్యం చెందింది. ఈ లోపాన్ని సవరించిన వాట్సాప్ సరికొత్తగా ఈ ఫీచర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తోంది. గతంలోలా కాకుండా నార్మల్ కాల్ తరువాత మిగిలిన వారిని గ్రూప్కాలింగ్లోకి ఆహ్వనించడం కాకుండా డైరెక్టుగా ముగ్గురుతో మాట్లాడవచ్చని కంపెనీ తెలిపింది. ఈ సదుపాయం 2.18.110.17 బీటా వెర్షన్లో అమల్లోకి ఉందని, వచ్చే నెలనుంచి అందరికీ అందుబాటులో వస్తుందని వెల్లడించింది. కాగా ఒక పార్టిసిపెంట్ను సెలక్ట్ చేసుకుని, అనంతరం టాప్‌రైట్ కార్నర్లో కనిపించే యాడ్ పార్టిసిపెంట్ బటన్ క్లిక్ చేసి రెండవ పార్టిసిపెంట్ను సెలక్ట్ చేసుకోవాలి. ఇలా మరింతమంది పార్టిసిపెంట్స్‌ను గ్రూప్వాయిస్ కాల్లోయాడ్ చేసుకునే అవకాశాన్ని గతంలో కల్పించింది. అయితే ఇది అంతగా ఆకట్టుకోలేకపోవడంతో తాజా అప్డేట్ను జోడించింది. -
ఆండ్రాయిడ్ పీ అప్డేట్తో నోకియా ఫోన్లు?
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్ఎండీ గ్లోబల్ భాగస్వామ్యంతో మార్కెట్లో రీ ఎంట్రీ ఇచ్చిన నోకియా స్మార్ట్ఫోన్లు మరో అడుగు ముందుకు వేశాయి. 2018 ఆగస్టునుంచి లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్‌డేటెట్ వెర్షన్‌తో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. రాబోయే అన్ని నోకియా ఫోన్లు ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ ‘పి’ తో రాబోతున్నాయని హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించినట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఈ అప్డేట్కు సంబంధించిన ఈ మెయిల్ సంభాషణ లీక్ అయింది. అలాగే నోకియా ప్రతినిధికూడా అనధికారికంగా ఈ అప్డేట్ను దృవీకరించినట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు కొత్త ఆపరేటింగ్ సిస్టం గురించి ఎటువంటి సమాచారం లేకపోయినా ఆగస్టుమాసంలో ఆడ్రాయిడ్ పితో రాబోతుందన్న పుకార్లు భారీగా షికారు చేస్తున్నాయి. 2017లో నోకియా స్మార్ట్ ఫోన్లను తిరిగి మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో నోకియా 2, నోకియా 3, నోకియా 5 స్మార్ట్ఫోన్లను మార్కెట్ లో లాంచ్ చేసింది. -
కేటీఎం సూపర్ స్పోర్ట్స్ బైక్స్ లాంచ్
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్ 2017 సంవత్సరంలో అప్ గ్రేడ్ చేసిన సూపర్ స్పోర్ట్స్ బైక్స్ ను భారత మార్కెట్లో గురువారం ప్రవేశపెట్టింది. ఆర్సి200 , ఆర్సి390 అప్ గ్రేటెడ్ వెర్షన్ మోటార్ బైక్స్ ను బజాజ్ ఆటో లాంచ్ చేసింది. ఆర్సి200 ధరను 1.71 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఆర్సి390 రూ.2.25 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించింది. 2017 కు చెందిన ఆర్సి390 మోడల్ లో మెకానికల్‌గా మార్పులు చేయగా, ఆర్సి200 వేరియంట్ ఎలాంటి మార్పులు లేకుండా మునుపటి సాంకేతిక అంశాలతో విడుదల చేసింది. ఈ రెండు వాహనాలను యూరో-4 ఉద్గార నియమాలను పాటిస్తూ లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజీన్, 6 స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో అందుబాటులోకి తీసుకొచ్చింది. సాంకేతికంగా 2017 కెటిఎమ్ ఆర్సి390 మోటార్ బైక్ లో వైర్ థొరెటల్, స్లిప్పర్ క్లచ్ , 320ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ద్వారా రైడ్ వంటి కొత్త ఫీచర్స్ ను జత చేసింది. ఇంజిన్ టార్క్ ను 44బీహెచ్ పీ, 35ఎన్ ఎం, గత సంవత్సరం నమూనా మోటార్ బైక్ లాగే ఉంచింది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ప్లేస్ మెంట్ లో మార్పులు చేసింది. ఆఫ్ ఆన్ చేసుకునే యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, రైడ్ బై వైర్ టెక్నాలజీతోపాటు ముందు వైపున 320ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ అమర్చింది. దీంతోపాటు న్యూ గ్రాఫిక్స్ తో కొత్తగా డిజైన్ చేసింది. ఆర్సి200 లో కాస్మోటిక్ మార్పులు తప్ప అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ సహా మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేవు. 199సీసీ లో యూనిట్ లో మాత్రం 25బిహెచ్పి ,19.2 టార్క్ కలిగి ఉంది. -
జనగణనకు అధికారగణం సన్నాహాలు
65,522 మంది ఎన్యూమరేటర్లు.. రూ.5.97 కోట్ల ఖర్చు హైదరాబాద్: వచ్చే నెలలో చేపట్టే జాతీయ జనాభా లెక్కలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. గతంలో జనగణన చేపట్టిన తరహాలోనే ఇంటింటి సర్వే నిర్వహించనుంది. జాతీయ జనాభా గణనను అప్డేట్ చేయటంతోపాటు ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నందున ఈ సర్వేను సమర్థవంతంగా చేపట్టాలని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సర్వే మార్గదర్శకాలను వివరించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే ఎన్యూమరేటర్లుగా ఎంపిక చేయాలని, ప్రైవేటు ఉద్యోగులను తీసుకోవద్దని ఆదేశించారు. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15లోగా సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 75,776 ఎన్యూమరేషన్ బ్లాకులను గుర్తించి ంది. మొత్తం 65,522 మంది ఎన్యూమరేటర్లను ఈ సర్వేకు వినియోగించనుంది. సర్వే నిర్వహణకు పది జిల్లాల పరిధిలో మొత్తం రూ.5.97 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. పంట కోత ప్రయోగాలు: కరువు మండలాలను ప్రకటించేందుకు ప్రతి మండలంలో పంట కోత ప్రయోగాలను సక్రమంగా నిర్వహించాలని ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు బీపీ ఆచార్య సూచించారు. జిల్లాకు 30 ఫిల్మ్‌లు: నవంబర్ 14 నుంచి 20 వరకు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని బీపీ ఆచార్య కలెక్టర్లను కోరారు. ప్రతి జిల్లాకు 30 ఫిల్మ్‌లు పంపిస్తున్నామని, వీటిని జిల్లా కేంద్రంలో ఉచితం గా ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలన్నారు. -
అంతా టూ లేట్... ఇదేనా స్మార్ట్
భూములు, ఆస్తులకు పాత మార్కెట్ ధరలే కొనసాగింపు ధరలు అప్డేట్ చేయని రిజిస్ట్రేషన్ల శాఖ అయోమయంలో రియల్ వ్యాపారులు స్మార్ట్ వార్డు, స్మార్ట్ సిటీ.. స్మార్ట్ పాలన.. అంతా స్మార్ట్. పాలకులు ఏమి మాట్లాడినా స్మార్ట్ గురించే. ఈ-ఆఫీస్, ఈ-పోస్, ట్యాబ్లెట్ల వాడకం ఇలా పాలన అంతా ఆన్లైన్లోనే. మరి ఎంతో ముఖ్యమైన సమాచారం మాత్రం సంబంధిత వెబ్సైట్లలో అప్డేట్ కావడం లేదు. ఇదీ మన స్మార్ట్ సార్ల తీరు. గాంధీనగర్: ప్రభుత్వం స్మార్ట్పాలనకు తెరతీసింది. ఈ- ఆఫీస్ పేరుతో ఓ వైపు పేపర్ వాడకానికి స్వస్తి పలుకుతున్నారు. వీఆర్వో స్థాయినుంచి ఉన్నతాధికారుల వరకు ట్యాబ్‌లు అందిస్తోంది. పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేసి మొబైల్లోనే భూముల వివరాలు తెలుసుకునే విధంగా ‘మీ భూమి పోర్టల్‌ను రూపొందించింది. చివరికి భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు డాక్యుమెంట్ రైటర్స్‌పై ఆధారపడకుండా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టింది. ఇంటి వద్దనుంచే ప్రభుత్వ సేవలన్నీ పొందవచ్చని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేదని ప్రజలు సంబరపడ్డారు. కాని కొన్ని వెబ్సైట్లలో సమాచారం చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. నిరంతరం మార్పులు జరుగుతున్నప్పటికీ పాత డేటా ఆప్డేట్ చేయకుండా అలానే కొనసాగిస్తున్నారు. ఆ కోవకు చెందిందే రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్. ప్రభుత్వం భూములు, ఆస్తుల మార్కెట్ ధరలను అమాంతం పెంచేసింది. రాజధాని నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో అరవై నుంచి వంద శాతం వరకూ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ధరలను పెంచి అమలు చేస్తున్న ప్రభుత్వం అధికారక వెబ్సైట్లో మాత్రం పాత మార్కెట్ ధరలను కొనసాగిస్తోంది. వెబ్సైట్లో భూ ముల మార్కెట్ ధరలు అప్డేట్ చేయలేదు. 1 ఏప్రిల్, 2013న పెంచిన ధరలే ఇప్పటికీ ఉన్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను, డాక్యుమెంట్ రైటర్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. భూముల కొనుగోలుదారులు మండలాలు,గ్రామాల వారి మార్కెట్ ధరలు, సర్వే నంబర్వారీ మార్కెట్ ధర ఎంత? అనే వివరాలను తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్‌పై ఆధారపడతారు. ఉదాహరణకు వీరులుపాడు మండలంలోని జయంతి గ్రామంలో గతంలో ఎకరం మార్కెట్ ధర రూ. 2.50లక్షలుగా ఉంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి మార్కెట్ ధర రూ. 5లక్షలు అయింది. వైబ్సైట్లో మాత్రం మార్కెట్ ధర రూ. 2.50లక్షలుగానే ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీ, స్టాంప్‌డ్యూటీ ఎంత చెల్లించాలో వెబ్‌సైట్‌లోని మార్కెట్ ధరల క్యాలిక్యులేటర్ వినియోగిస్తే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు వివరాలు వస్తాయి. ధరలు మార్చకపోవడం క్యాలిక్యులేటర్ వినియోగించిన వారికి పాత ధరల ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీల వివరాలు అందుబాటులోకి వస్తున్నాయి. వైబ్‌సైట్‌ను నేషనల్ ఇన్‌ఫార్మటిక్ సెంటర్ వారు డిజైన్ చేసి డెవలప్ చేస్తారు. ధరలు పెరిగి పదిరోజులు కావస్తున్నా కొత్త ధరలు అందుబాటులోకి రాలేదు. పట్టణాల్లో సమస్య తీవ్రం పట్టణ ప్రాంత వ్యాపారులు వైబ్‌సైట్ అప్డేట్ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణాల్లో వీధి వీధికి మార్కెట్ ధరలలో వ్యత్యాసం ఉం టుంది. ఒకే వీధిలో డోర్ నంబర్ల వారీగా ధరల్లో తేడాలున్నాయి. పెరిగిన మార్కెట్ ధరల వివరాలను సకాలంలో అప్డేట్ చేయకపోవడంతో వ్యాపారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వెబ్‌సైట్‌ను అప్డేట్ చేసి సమాచారం అందించాలని వ్యాపారులు కోరుతున్నారు.