శాన్‌ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్ యాజమాన్యంలో నడుస్తున్న వాట్సాప్ ఎప్పటి నుంచో ఊరిస్తున్న డార్క్‌మోడ్ ఫీచర్ విడుదలకు సిద్ధమైంది. కొందరు యూజర్లు ఇప్పటికే దానిని వాడారు కూడా. వాట్సాప్ డార్క్‌మోడ్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఇప్పటికే సిద్ధమైందని, ఐఓఎస్ వెర్షన్ తుదిరూపు దిద్దుకుంటోందని బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్ వెబ్‌సైట్ తెలిపింది. డార్క్‌మోడ్ అంటే..సాధారణంగా ఇంటర్నెట్ సమాచారమంతా తెలుపు బ్యాక్‌గ్రౌండ్ నల్లని అక్షరాల్లో ఉంటుంది. దీనికి భిన్నంగా నలుపు బ్యాక్ గ్రౌండ్‌తో తెలుపు రంగులో అక్షరాలు కనిపిస్తాయి. దీనివల్ల కళ్లకు తక్కువ శ్రమ కలుగుతుందని, రాత్రి వేళల్లో యాప్‌ను ఉపయోగించే వారికి సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment