Realme UI 2.0 Update: Realme C3 Released New Android 11 Based Update in India, Check Here Specification - Sakshi
Sakshi News home page

ఈ రియల్‌మీ బడ్జెట్ ఫోన్ వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే

Published Wed, Aug 11 2021 1:19 PM | Last Updated on Wed, Aug 11 2021 1:43 PM

 Realme C3 is getting a stable version of the Android 11-based Realme update in India - Sakshi

మీరు రియల్‌ మీ సీ3 స్మార్ట్‌ ఫోన్‌ను వినియోగిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.ఈ ఫోన్‌కు లేటెస్ట్‌గా ఆండ్రాయిడ్‌ 11 స్టేబుల్‌ వెర్షన్‌ విడుదలైంది.చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ రియల్‌ మీ సీ3ని 2020 ఫిబ్రవరి 14న విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన సీ2 కి హ్యూజ్‌ రెస్పాన్స్‌ రావడంతో సీ3ని అందుబాటులోకి తెచ్చింది.



అయితే ఈ ఫోన్‌కు సంబంధించి బీటా వెర్షన్‌ జులైలో విడుదల చేసినా లేటెస్ట్‌గా ఆ ఫోన్‌ స్టేబుల్‌ వెర్షన్‌ను రియల్‌ మీ ప్రతినిధులు విడుదల చేశారు.ఈ అప్‌డేట్‌ ద్వారా ఫోన్‌లో టెక్నికల్‌ సమస్యలతో పాటు కేటగిరి, సిస్టమ్‌, ఈజీ మొబైల్‌ ఇంటర్‌ ఫేస్‌ ఆప్టిమైజేషన్‌,సెక్యూరిటీ ప్రైవసీ, గేమ్స్‌ ఇలా ఒక్కటేమిటీ రియల్‌ సీ3 వెర్షన్‌ పూర్తిగా మారిపోతుంది.

   

రియల్‌మీ సీ3 స్పెసిఫికేషన్లు
రియల్ మీ సీ3 స్మార్ట్ ఫోన్‌ 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే, 89.8 పర్సెంట్‌ తో స్క్రీన్ టు బాడీ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో అందుబాటులోకి రాగా  మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్.. ఆండ్రాయిడ్ 10 రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.


ఈ స్మార్ట్ ఫోన్ వెనక భాగంలో 12 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. దీంతో పాటు  హెచ్ డీఆర్, నైట్ స్కేప్, క్రోమా బూస్ట్, స్లో మో, పొర్ ట్రెయిట్ మోడ్ ఫీచర్‌ తో పాటు  హెచ్ డీఆర్, ఏఐ బ్యూటిఫికేషన్, పనోరమిక్ వ్యూ, టైమ్ ల్యాప్స్ ఫీచర్లు ఉన్న 5 మెగా పిక్సెల్  సెల్ఫీల కెమెరా సౌకర్యం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement