ఆండ్రాయిడ్‌ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లు | Google announced to release Android 15 beta 2 at the Google i/o 2024 | Sakshi
Sakshi News home page

ఆండ్రాయిడ్‌ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లు

May 20 2024 3:28 PM | Updated on May 20 2024 4:06 PM

Google announced to release Android 15 beta 2 at the Google i/o 2024

ఆల్ఫాబెట్‌ ఇంక్‌ ఇటీవల నిర్వహించిన గూగుల్‌ I/O 2024 సదస్సులో ఆండ్రాయిడ్‌ 15 బీటా 2ను పీచర్లను ప్రకటించింది. ఈ ఫీచర్లు ఇప్పటికే పిక్సెల్‌ మొబైల్‌ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. పిక్సెల్‌ ఫోన్‌ను గూగుల్‌ ప్రత్యేకంగా తయారుచేస్తోంది. దాంతో కొత్త ఫీచర్లు తమ వినియోగదారులకు ఇప్పటికే అందుబాటులో ఉంచింది.

గూగుల్‌ ప్రకటించిన ఈ ఫీచర్లను త్వరలో ఆండ్రాయిడ్‌ వాడుతున్న ఇతర కంపెనీ ఫోన్లలోనూ ప్రవేశపెట్టనున్నారు. డెవలపర్‌ ప్రివ్యూ లేదా బీటా వెర్షన్లలో పాల్గొంటున్న వారికి ఆటోమేటిక్‌గా బీటా 2 అప్‌డేట్‌ లభిస్తుందని కంపెనీ తెలిపింది.

ఆండ్రాయిడ్‌ 15 బీటా 2లో కొన్ని ఫీచర్లు..

  • ఆండ్రాయిడ్‌ 15 బీటా 2లో ప్రైవేట్‌ స్పేస్‌ సౌకర్యం అందిస్తున్నారు. దీనివల్ల ప్రత్యేక ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసి కావాల్సిన యాప్‌లను విడిగా సేవ్‌ చేసుకోవచ్చు. ప్రొఫైల్‌ లాక్‌ చేసినప్పుడు అవి కనిపించవు.

  • ప్రైవేట్‌ స్పేస్‌లోని యాప్‌లన్నీ లాంఛర్‌లోని ప్రత్యేక కంటైనర్‌లో ఉంటాయి. రీసెంట్ యాప్స్‌, నోటిఫికేషన్స్‌, సెటింగ్స్‌లోనూ కనిపించవు.

  • ఫీచర్‌ యాప్‌ పెయిర్స్‌ అనే కొత్త ఫీచర్‌తో స్ప్లిట్‌ స్క్రీన్‌ మోడ్‌లో ఒకేసారి రెండు యాప్‌లను లాంఛ్‌ చేయొచ్చు. తరచూ ఉపయోగించే యాప్‌లను వెంటవెంటనే ఓపెన్‌ చేయొచ్చు.

ఇదీ చదవండి: పాలసీదారులను మోసం చేస్తున్న బీమా ప్లాట్‌ఫామ్‌లు

  • హెల్త్‌ కనెక్ట్‌ ఫీచర్‌లో స్కిన్‌ టెంపరేచర్‌, ట్రైనింగ్‌ ప్లాన్స్‌ అనే విభాగాలు చేర్చారు. దాంతో యూజర్లు తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement