Android Mobile Application
-
పేటీఎం కొత్త ఫీచర్.. యాప్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు..
పేటీఎం తన వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీసు అందించేందుకు సిద్ధమైంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘రిసీవ్ మనీ క్యూఆర్ విడ్జెట్’ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ పేటీఎం క్యూఆర్ కోడ్‌ను నేరుగా తమ స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీన్‌పై డిస్ ప్లే చేసుకోవచ్చు. ప్రతిసారి యాప్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇన్స్టంట్ పేమెంట్ కనెక్షన్‌కు వీలు కల్పించింది.లావాదేవీలను సరళతరం చేయడంలో భాగంగా గతంలో ఐఓఎస్ యూజర్లకు ఈ క్యూఆర్ విడ్జెట్‌ను పేటీఎం అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ సర్వీసును ఆండ్రాయిడ్‌కు విస్తరించినట్లు ప్రకటించింది. ఇది చిన్న వ్యాపారాలు, దుకాణదారులు.. వంటివారికి నిరాటంకంగా చెల్లింపులను స్వీకరించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ సర్వీసు ద్వారా పేటీఎం చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.రియల్ టైమ్ అలర్ట్లుయూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు పేటీఎం ప్రత్యేకమైన కాయిన్ డ్రాప్ సౌండ్ నోటిఫికేషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ రియల్ టైమ్ అలర్ట్ యూజర్ అందుకున్న చెల్లింపుల ధ్రువీకరణను నిర్ధారిస్తుంది. వినియోగదారులు యాప్‌ను తనిఖీ చేయకుండానే లావాదేవీల గురించి తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచర్ డిజిటల్ చెల్లింపుల్లో నమ్మకాన్ని, పారదర్శకతను పెంచుతుందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: బడ్జెట్లో మాకేంటి? ఎవరెవరు ఏం కోరుకుంటున్నారంటే..క్యూఆర్ విడ్జెట్‌ను ఎలా యాడ్ చేయాలంటే..ఆండ్రాయిడ్ ఫోన్లో సులభంగానే హోమ్ స్క్రీన్‌పై క్యూఆర్ విడ్జెట్‌ను సెటప్ చేసుకోవచ్చు.పేటీఎం యాప్ ఓపెన్ చేయండి.ఎగువ ఎడమవైపు ఉన్న ప్రొఫైల్ ఐకాన్ మీద ప్రెస్ చేయాలి.క్యూఆర్ కోడ్ దిగువన ‘యాడ్ క్యూఆర్ టు హోమ్ స్క్రీన్’ ఆప్షన్ ఎంచుకోండి.దాన్ని కన్ఫర్మ్ చేయాలి. వెంటనే విడ్జెట్ హోమ్ స్క్రీన్‌పై వస్తుంది.పేటీఎం యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ విడ్జెట్ ద్వారా చెల్లింపులు స్వీకరించవచ్చు. -
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండిలా..
ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ప్రస్తుతం చాలా ప్రకటనల్లో క్యూఆర్ కోడ్‌ను గమనిస్తుంటాం. ఆ కోడ్‌ను స్కాన్(Scan) చేస్తే నేరుగా సదురు ప్రకటన వివరాలు తెలుసుకోవచ్చు. పూర్తి సమాచారాన్ని ఫిజికల్‌గా ప్రకటనల్లో ఇవ్వడం కొన్నిసార్లు కుదరకపోవచ్చు. దాంతో చాలా కంపెనీలు క్యూఆర్(QR Code) కోడ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేవలం కంపెనీ ఉత్పత్తుల వివరాలే కాకుండా విద్య, వైద్యం, పరిశ్రమలు, బీమా రంగం.. ఇలా ఏ విభాగంలో చూసినా క్యూఆర్ కోడ్‌తో సమాచారాన్ని తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏదైనా డివైజ్ల్ ఉన్న క్యూఆర్‌ను లేదా ఫేన్పే, జీపే వంటి లావాదేవీలకు సంబంధించిన క్యూఆర్‌ను స్కాన్ చేయడం సులువే. కానీ మీకు ఎవరైనా సాఫ్ట్‌కాపీ(Soft Copy) పంపించి అందులో క్యూఆర్ కోడ్ సమాచారం తెలుసుకోవాలంటే ఏం చేస్తారు.. మీకు వచ్చిన క్యూఆర్‌ను తిరిగి వేరే ఫోన్‌కు పంపించి అందులోనుంచి మీ డివైజ్‌లో స్కాన్ చేస్తారు కదా. ఇది అన్నివేళలా కుదరకపోవచ్చు. అలాంటి సమయంలో సులువుగా క్యూఆర్ స్కాన్ చేసే మార్గం ఉంది.గూగుల్ లెన్స్ఫోన్ స్క్రీన్ నుంచి నేరుగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడానికి గూగుల్ లెన్స్‌ను వినియోగించడం సులువైన మార్గం. దీన్ని గూగుల్ సదుపాయం ఉన్న ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో ఉపయోగించవచ్చు.ఎలా ఉపయోగించాలంటే..ఫోన్లోని క్యూఆర్ కోడ్‌ను స్క్రీన్‌షాట్(Screen Shot) తీసుకోవాలి.గూగుల్ ఫోటోలు లేదా గూగుల్(Google) యాప్‌ను ఓపెన్ చేయాలి.సెర్చ్ బటన్ పక్కన లెన్స్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే గ్యాలరీకి యాక్సెస్ అడుగుతుంది.ఫోటోలకు యాక్సెస్ ఇచ్చి అప్పటికే స్క్రీన్‌షాట్ తీసుకున్న క్యూఆర్ కోడ్‌ను సెలక్ట్ చేసుకోవాలి.గూగుల్ లెన్స్(Google Lens)లోని కృత్రిమమేధ మీరు సెలక్ట్ చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నేరుగా అందులోని సమాచారాన్ని రీడైరెక్ట్ చేస్తుంది.వేరే ఫోన్ అవసరం లేకుండానే నేరుగా సాఫ్ట్‌కాపీ లేదా స్క్రీన్‌షాట్ తీసిన క్యూఆర్ వివరాలు తెలుసుకునేందుకు ఇలా ప్రయత్నించవచ్చు.ఇదీ చదవండి: భలే ఛాన్స్.. తగ్గిన బంగారం ధర! తులం ఎంతంటే..ప్రస్తుతం చాలా ఫోన్ తయారీ కంపెనీలు వాటి కెమెరాలు లేదా గ్యాలరీ యాప్‌ల్లోనే నేరుగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. అంటే గూగుల్ లెన్స్ అవసరం కూడా లేకుండానే నేరుగా కెమెరా ఆన్ చేసి క్యూఆర్‌ను స్కాన్ చేయవచ్చు. -
ఫోన్ మారితే ఉబర్ ఛార్జ్ మారుతోంది - ఫోటోలు వైరల్
ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఎక్కడికెళ్లాలన్నా వెహికల్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నాము. అయితే క్యాబ్ లేదా ఆటో ఛార్జీలు మాత్రం మనం బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ ఫోన్లను బట్టి మారుతూ ఉంటాయి. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక ట్వీట్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. రెండు వేరువేరు మొబైల్ ఫోన్లలో రెండు వేర్వేరు ధరలను చూడవచ్చు. నిజానికి పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ రెండూ ఒకటే. చేరుకోవడానికి పట్టే సమయం కూడా ఒకటే. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే.. ఉబెర్ (Uber) ఆటో రైడ్‌కు రూ.290.79 చూపించింది. యాపిల్ ఐఫోన్లో (Apple iPhone) అదే రైడ్‌కు రూ.342.47 చూపించింది.దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. నా కుమార్తె ఆండ్రాయిడ్ ఫోన్లో కంటే.. నా యాపిల్ ఐఫోన్లో రైడ్ ధర ఎక్కువగా చూపిస్తోందని 'సుధీర్' అనే ఎక్స్ (Twitter) యూజర్ పేర్కొన్నాడు. బుక్ చేసుకునే టైమ్, దూరం, డిమాండ్ వంటి వాటిని బట్టి ధరలలో మార్పు ఉంటుంది. కానీ బుక్ చేసుకునే మొబైల్ ఫోన్‌ను బట్టి ఛార్జీలు ఉండవని ఉబర్ వెల్లడించింది.Same pickup point, destination & time but 2 different phones get 2 different rates. It happens with me as I always get higher rates on my Uber as compared to my daughter’s phone. So most of the time, I request her to book my Uber. Does this happen with you also? What is the hack? pic.twitter.com/bFqMT0zZpW— SUDHIR (@seriousfunnyguy) December 23, 2024మొబైల్ ఛార్జ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రేటుగతంలో ఉబర్ క్యాబ్స్ మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్, ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు ఒక పరిశోధన ద్వారా వెల్లడైంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. డెర్నియర్ హ్యూర్ బ్రస్సెల్స్‌లోని వారి ఆఫీస్ నుంచి సిటీ సెంటర్లోకి వెళ్లడానికి రెండు ఐఫోన్ మొబైల్స్ ద్వారా టాక్సీ బుక్ చేసింది.ఒక ఐఫోన్లో 84 శాతం ఛార్జ్ ఉన్నప్పుడు 16.6 యూరోలు (రూ.1,498), 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 17.56 యూరోలు (రూ.1,585) చూపించింది. మొబైల్ ఛార్జ్‌లో ఉన్న తేడా ట్రిప్ ఛార్జ్‌పై ప్రభావం చూపిస్తుందని ఈ విధంగా నిరూపించింది. బ్యాటరీ లెవెల్స్ ఎలా ఉన్నా ధరల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, మొబైల్ ఛార్జ్‌కి ధరలకు ఎటువంటి సంబంధం లేదని ఉబెర్ తిరస్కరించింది.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!ఈ కామర్స్ సైట్లలో..సాధారణంగా ఒక ప్రొడక్ట్ విలువ ఒక్కో యాప్‌లో.. ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ ఒకే యాప్‌లో ఒక ప్రొడక్ట్ ధర రెండు ఫోన్లలో వేరువేరు చూపిస్తే? ఇదెలా సాధ్యం, ఎక్కడైనా జరుగుతుందా.. అనుకోవచ్చు. కానీ సౌరభ్ శర్మ అనే ఐఓఎస్ యూజర్.. ఐఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఓ చిన్న క్యాబిన్ సూట్‌కేస్ కొనుగోలు చేయాలని చూసారు. అయితే దాని ధర రూ.4,799 అని చూపిస్తోంది. అదే ఉత్పత్తిని ఆండ్రాయిడ్ యాప్‌లో చూస్తే.. దాని ధర 4,119 రూపాయలుగా చూపిస్తోంది. ఈ రెండింటినీ సౌరభ్ స్క్రీన్ షాట్ తీసి, తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.Android vs iOS - different prices on @Flipkart App??same @my_mokobara cabin suitcase costs 4119₹ on FK Android App vs 4799₹ on iOS App.Apple charges 30% commission on subscriptions etc, so different pricing for iOS makes sense there.But for ecommerce? Very shady & unfair. pic.twitter.com/YmIq8nhuXO— Saurabh Sharma (@randomusements) October 30, 2024 -
జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సప్ జనవరి 1, 2025వ తేదీ నుంచి కొన్ని ఫోన్లలో పని చేయదని మెటా ప్రకటించింది. ఇప్పటికీ చాలామంది వినియోగదారులు ఆండ్రాయిడ్ పాత వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపింది. దాంతో వాట్సప్ అప్డేట్లు విడుదల చేసినప్పుడు ఆయా డివైజ్‌ల్లో పని చేయడం లేదని పేర్కొంది. వినియోగదారులకు మెరుగైన సర్వీసు, భద్రతను అందించేందుకు కంపెనీ అందిస్తున్న అప్డేట్లను పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వారు అందుకోలేకపోతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. భవిష్యత్తులో భద్రత కారణాల వల్ల కొన్ని ఫోన్లలో వాట్సప్‌ను నిలిపేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1, 2025 నుంచి వాట్సాప్ పని చేయని డివైజ్‌ల లిస్ట్‌కు ప్రకటించింది.సాంసంగ్: గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్ 2, గెలాక్సీ ఏస్ 3, గెలాక్సీ ఎస్4 మినీమోటరోలా: మోటో జి (1వ జనరేషన్), రేజర్ హెచ్డీ, మోటో ఈ 2014హెచ్‌టీసీ: వన్ ఎక్స్, వన్ ఎక్స్+, డిజైర్ 500, డిజైర్ 601ఎల్జీ: ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, జీ 2 మినీ, ఎల్ 90సోనీ: ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా ఎస్పీ, ఎక్స్‌పీరియా టీ, ఎక్స్‌పీరియా వీయాపిల్ ఓఎస్‌లోనూ..ఆండ్రాయిడ్‌తోపాటు యాపిల్ ఓఎస్ ఇన్స్టాల్ అయిన కొన్ని పరికరాల్లోనూ వాట్సప్ పని చేయదని మెటా తెలిపింది. అయితే అందుకు మే 5 వరకు గడువు ఉందని పేర్కొంది. జనవరి నుంచి ఐదు నెలల నోటీస్ పీరియడ్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఐఓఎస్ 15.1 వర్షన్ కంటే ముందున్న ఓఎస్‌లు వాడుతున్న డివైజ్‌ల్లో వాట్సప్ పనిచేయదని కంపెనీ తెలిపింది. కంపెనీ వివరాల ప్రకారం ప్రధానంగా ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ వాడుతున్న వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: అప్పుడు పరీక్షలో ఫెయిల్.. గూగుల్‌లో జాబ్: జీతం తెలిస్తే..అప్డేట్లు ఎందుకు అవసరం అంటే..ఆన్లైన్ యాప్‌లు నిత్యం కొత్త అప్డేట్లు తీసుకొస్తుంటాయి. కొన్ని అప్డేట్లు వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీసు అందించేలా ఉంటే, మరికొన్ని భద్రత పరమైనవి ఉంటాయి. పాత డివైజ్‌ల్లోని హార్డ్‌వేర్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేయవు. దాంతో కొత్తగా వస్తున్న యాప్ అప్డేట్లు పాత ఓఎస్‌ల్లో పని చేయవు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏదైనా అప్డేట్లు వస్తున్నప్పుడు అందుకు వీలుగా ఓఎస్‌లు, డివైజ్‌ల్లోని యాప్‌లను అప్డేట్ చేసుకోవడమే మేలని కొందరు సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌పై మండిపడ్డ యూజర్: ఇంత అన్యాయమా అంటూ..
సాధారణంగా ఒక ప్రొడక్ట్ విలువ ఒక్కో యాప్‌లో.. ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ ఒకే యాప్‌లో ఒక ప్రొడక్ట్ ధర రెండు ఫోన్లలో వేరువేరు చూపిస్తే? ఇదెలా సాధ్యం, ఎక్కడైనా జరుగుతుందా.. అనుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.సౌరభ్ శర్మ అనే ఐఓఎస్ యూజర్.. ఐఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఓ చిన్న క్యాబిన్ సూట్‌కేస్ కొనుగోలు చేయాలని చూసారు. అయితే దాని ధర రూ.4,799 అని చూపిస్తోంది. అదే ఉత్పత్తిని ఆండ్రాయిడ్ యాప్‌లో చూస్తే.. దాని ధర 4,119 రూపాయలుగా చూపిస్తోంది. ఈ రెండింటినీ సౌరభ్ స్క్రీన్ షాట్ తీసి, తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.ఆండ్రాయిడ్ vs ఐఓఎస్.. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో వివిధ ధరలు అంటూ ఫోటోలను పోస్ట్ చేశారు. ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా నో కాస్ట్ ఈఎంఐలో కూడా వ్యత్యాసం కనిపిస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ నెలకు రూ. 1373 నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఐఓఎస్ యూజర్ నో కాస్ట్ ఈఎంఐ రూ. 1600 నుంచి ప్రారంభమవుతోందని ఇక్కడా చూడవచ్చు. ఇది చాలా అన్యాయమని సౌరభ్ శర్మ వెల్లడించారు.సౌరభ్ శర్మ.. ధరల వ్యత్యాసం గురించి ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సపోర్ట్‌తో కూడా సంబంధించారు. ''విక్రయదారు వివిధ అంశాల ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. కాబట్టి ధరలలో మార్పు జరగవచ్చు. దయచేసి చింతించకండి. అమ్మకందారులు మీకు గొప్ప డీల్స్, డిస్కౌంట్లను అందించడానికి ఎల్లప్పుడూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. హ్యాపీ షాపింగ్'' అంటూ వెల్లడించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా దీనిపైన స్పందిస్తూ ఇలాంటి అనుభవాలు తమకు కూడా ఎదురైనట్లు చెప్పుకొచ్చారు.Android vs iOS - different prices on @Flipkart App??same @my_mokobara cabin suitcase costs 4119₹ on FK Android App vs 4799₹ on iOS App.Apple charges 30% commission on subscriptions etc, so different pricing for iOS makes sense there.But for ecommerce? Very shady & unfair. pic.twitter.com/YmIq8nhuXO— Saurabh Sharma (@randomusements) October 30, 2024 -
ప్రమాదంలో ఆండ్రాయిడ్ యూజర్లు.. కేంద్రం హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్. కోట్ల మంది యూజర్లు గూగుల్ యాజమాన్యంలోని ఓఎస్ మీద ఆధారపడుతున్నారు. శాంసంగ్ గెలాక్సీ, గూగుల్ పిక్సెల్, వన్ ప్లస్, వివో వంటి చాలా కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లలో ఆండ్రాయిడ్ ఓఎస్‌ను అమలు చేస్తున్నాయి.స్మార్ట్ఫోన్ల వినియోగం భారీగా పెరగడంతో బ్యాంకింగ్, లొకేషన్ వంటి ఇతర సమాచారాల కోసం దీని మీదనే ఆధారపడుతున్నారు. ఇవన్నీ స్మార్ట్‌ఫోన్‌లోనే నిక్షిప్తమై ఉంటాయి. ఈ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి గూగుల్ ఎప్పటికప్పుడు ఓఎస్‌ను అప్డేట్ చేస్తూ ఉంటుంది. కానీ యూజర్లు ఓఎస్‌ను అప్డేట్ చేయకుండా అలాగే వినియోగిస్తూ ఉంటారు. అప్డేట్ చేయకుండా ఉపయోగించడం వల్ల స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్స్ 12, 12ఎల్, 13, 14 యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఓఎస్‌లో అనేక లోపాలున్నాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెల్లడించింది. ఓఎస్ అప్డేట్ చేయకపోవడం వల్ల మోసగాళ్ళు మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేను విశ్వసిస్తున్నాను.. భారత్ సాధిస్తుందిCERT-In ప్రకారం.. ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్లు, కెర్నల్, ఆర్మ్ కాంపోనెంట్, ఇమాజినేషన్ టెక్నాలజీస్ కాంపోనెంట్స్, యూనిసో కాంపోనెంట్లు, క్వాల్కామ్ కాంపోనెంట్లు, క్వాల్కామ్ క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్లలో లోపాలున్నాయని తెలుస్తోంది. కాబట్టి ఓఎస్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. లేకుండా మీ సమాచారం మొత్తాన్ని ఇతరులు హ్యాక్ చేసి తెలుసుకోగలరు. -
మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే..
మనం నిత్యం వాడుతున్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వేసవికాలంలో వేడిగా అవడం, చార్జింగ్ త్వరగా అయిపోవడం లాంటి సమస్యలు సాధారణమే.. అలాగే అవే ఫోన్లు వర్షాకాలంలో, చలికాలంలో కూడా చాలా వేడిగా ఉంటే అది మాత్రం తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే. ఫోన్ పేలుళ్లు సంభవించడానికి కారణం కూడా ఈ ఓవర్ హీటే.ఈ ప్రమాదాలు నివారణకై.. గూగుల్ తన కోట్లాది ఆండ్రాయిడ్ యూజర్లకోసం కొత్త అడాప్టివ్ థర్మల్ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్ కు 'కవచం' లాగా పనిచేస్తుంది. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం, వీడియోగానీ, ఫోటోస్ గానీ తీయటం, చార్జింగ్ పెట్టి మరిచపోవటంలాంటివాటితో ఫోన్ బ్యాటరీ వేడెక్కి పేలడం, మంటలు రావడం జరుగుతూంటాయి.ఇలాంటి సమస్యలనుంచి బయటపడడానకి గూగుల్ కొత్త సేఫ్టీ ఫీచర్‌పై కసరత్తు చేస్తోంది. ఫోన్ వేడెక్కడం ప్రారంభించిన వెంటనే ఈ ఫీచర్ వినియోగదారులకు వెంటవెంటనే నోటిఫికేషన్లను పంపడంతోపాటు అలర్ట్ మెసేజ్ లు కూడా పంపిస్తుంది.ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. ఈ గూగుల్ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ల కోసం ఈ ఫీచర్ తీసుకురానుంది. కంపెనీ ఈ సేఫ్టీ ఫీచర్‌కి 'అడాప్టివ్ థర్మల్' అని పేరు పెట్టింది. అలాగే బ్యాటరీ ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే, ఈ గూగుల్ ఫీచర్ ప్రీ-ఎమర్జెన్సీ హెచ్చరికను జారీ చేయడంతో.. వినియోగదారు ఆ సమయాననికి ఫోన్ వాడటం నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో ఫోన్ బ్యాటరీ చల్లగవడానికి సమయం లభిస్తుంది. ఫోన్ పనితీరు మందగించదు.గూగుల్ కంటే ముందు ఐఫోన్ లో ఈ రకమైన ఫీచర్ ఉంది. బ్యాటరీ హీట్ నుంచి రక్షణగా ఇలాంటి హెచ్చరిక మెసేజ్ లు కూడా మీరు పొంది ఉంటారు. ఇకపై గూగుల్ పిక్సెల్ ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాలలో ఈ పీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. తర్వాత దీనిని ఇతర స్మార్ట్ఫోన్లకు కూడా విడుదల చేయవచ్చు.ఇవి చదవండి: జిమ్మూలేదూ, ఫ్యాన్సీ ఫుడ్డూ లేదు..కానీ ఇలా అయ్యాడట! -
ఆండ్రాయిడ్ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లు
ఆల్ఫాబెట్ ఇంక్ ఇటీవల నిర్వహించిన గూగుల్ I/O 2024 సదస్సులో ఆండ్రాయిడ్ 15 బీటా 2ను పీచర్లను ప్రకటించింది. ఈ ఫీచర్లు ఇప్పటికే పిక్సెల్ మొబైల్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. పిక్సెల్ ఫోన్‌ను గూగుల్ ప్రత్యేకంగా తయారుచేస్తోంది. దాంతో కొత్త ఫీచర్లు తమ వినియోగదారులకు ఇప్పటికే అందుబాటులో ఉంచింది.గూగుల్ ప్రకటించిన ఈ ఫీచర్లను త్వరలో ఆండ్రాయిడ్ వాడుతున్న ఇతర కంపెనీ ఫోన్లలోనూ ప్రవేశపెట్టనున్నారు. డెవలపర్ ప్రివ్యూ లేదా బీటా వెర్షన్లలో పాల్గొంటున్న వారికి ఆటోమేటిక్‌గా బీటా 2 అప్డేట్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.ఆండ్రాయిడ్ 15 బీటా 2లో కొన్ని ఫీచర్లు..ఆండ్రాయిడ్ 15 బీటా 2లో ప్రైవేట్ స్పేస్ సౌకర్యం అందిస్తున్నారు. దీనివల్ల ప్రత్యేక ప్రొఫైల్‌ను క్రియేట్ చేసి కావాల్సిన యాప్‌లను విడిగా సేవ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ లాక్ చేసినప్పుడు అవి కనిపించవు.ప్రైవేట్ స్పేస్‌లోని యాప్‌లన్నీ లాంఛర్లోని ప్రత్యేక కంటైనర్‌లో ఉంటాయి. రీసెంట్ యాప్స్, నోటిఫికేషన్స్, సెటింగ్స్‌లోనూ కనిపించవు.ఫీచర్ యాప్ పెయిర్స్ అనే కొత్త ఫీచర్‌తో స్ప్లిట్ స్క్రీన్ మోడ్‌లో ఒకేసారి రెండు యాప్‌లను లాంఛ్ చేయొచ్చు. తరచూ ఉపయోగించే యాప్‌లను వెంటవెంటనే ఓపెన్ చేయొచ్చు.ఇదీ చదవండి: పాలసీదారులను మోసం చేస్తున్న బీమా ప్లాట్ఫామ్లుహెల్త్ కనెక్ట్ ఫీచర్లో స్కిన్ టెంపరేచర్, ట్రైనింగ్ ప్లాన్స్ అనే విభాగాలు చేర్చారు. దాంతో యూజర్లు తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంది. -
ఇకపై ఆండ్రాయిడ్ యాప్స్‌ను వాడలేరు!
ఆండ్రాయిడ్ యాప్స్‌ను మొబైళ్లతోపాటు పర్సనల్ కంప్యూటర్లలో కూడా చాలామంది వినియోగిస్తుంటారు. అలాంటి వారికి ఇది బ్యాడ్ న్యూస్. విండోస్ 11 పీసీ వినియోగదారులు ఇకపై వచ్చే ఏడాది నుంచి ఆండ్రాయిడ్ యాప్స్‌ను వినియోగించలేరని మైక్రోసాఫ్ట్ కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ సబ్ సిస్టమ్‌కు మైక్రోసాఫ్ట్ తన సపోర్ట్‌ను నిలిపివేయనుంది. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 2025 మార్చి 5 నుంచి ఆండ్రాయిడ్ యాప్స్‌ను వినియోగించడం కుదరదు. ఈ మేరకు తన సపోర్ట్ డాక్యుమెంట్లో తెలియజేసింది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా విండోస్ సబ్‌సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్‌పై ఆధారపడి పనిచేస్తున్న అప్లికేషన్లు, గేమ్స్ ఎంతమాత్రం పనిచేయవు. అంతేకాదు 2024 మార్చి 5 తర్వాత కొత్త యాప్స్‌ను డౌన్లోడ్ చేయడం కూడా కుదరదు. ఒకవేళ ఇప్పటికే డౌన్లోడ్ చేసి యాప్స్‌ను వినియోగిస్తున్నట్లయితే కటాఫ్ డేట్ వరకు మాత్రమే వినియోగించుకోవడానికి వీలుంటుందని తేల్చి చెప్పింది. ఇదీ చదవండి: ‘మీ పేరు మార్చుకుంటే దావా వెనక్కి తీసుకుంటా’ గతంలో మొబైల్ యాప్స్‌ను విండోస్ 11 పీసీల్లో వినియోగించడం సాధ్యమయ్యేది కాదు. 2021లో మైక్రోసాఫ్ట్ అమెజాన్ యాప్‌స్టోర్ ఒప్పందం కుదుర్చుకుని వీటిని పీసీల్లో వినియోగించేలా ఏర్పాటు చేశాయి. దీంతో అమెజాన్ యాప్ స్టోర్‌ను డౌన్లోడ్ చేసుకుని, అందులోని పాపులర్ ఆండ్రాయిడ్ యాప్స్‌ను, గేమ్స్‌ను డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. -
‘గూగుల్ గుత్తాధిపత్యం’.. యాప్‌ల తొలగింపు.. పునరుద్ధరణ
సర్వీస్ ఫీజుల వివాదంతో ప్లే స్టోర్ నుంచి గూగుల్ పది భారతీయ మొబైల్ యాప్‌లను తొలగించిన విషయం తెలిసిందే. దాంతో పలు అంకుర సంస్థలకు చెందిన యాజమాన్యాలతో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమావేశమయ్యారు. గూగుల్, ప్లేస్టోర్ నుంచి తొలగించిన మొబైల్ యాప్‌లకు చెందిన యాజమాన్యాలతో కేంద్ర మంత్రులు సోమవారం పలు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఎటువంటి పరిష్కారం లభించలేదని తెలుస్తోంది. యాప్‌ల విషయంలో గూగుల్ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని భారత కంపెనీలు ఆరోపిస్తున్నాయి. గూగుల్ కారణంగా సమస్యలను లేవనెత్తిన సంస్థలు, ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కోరాయి. ఇన్-యాప్ చెల్లింపులపై గూగుల్ 11-26 శాతం ఫీజు వసూలు చేస్తుండటంతో ఈ వివాదం మొదలైంది. యాంటీ కాంపిటీషన్ సంస్థ సీసీఐ ఇంతకు ముందు 15-30 శాతం బిల్లింగ్ వ్యవస్థను తొలగించింది. కంపెనీలకు సుప్రీంకోర్టు ఉపశమనం ఇవ్వకపోవడంతో ఫీజు రద్దుచేస్తున్న సంస్థలను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. అనంతరం ప్రభుత్వ జోక్యంతో పునరుద్ధరించింది. సమావేశ వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. భారత యాప్ డెవలపర్స్ సంఘం అలయన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ (ఏడీఐఎఫ్)తో చంద్రశేఖర్ వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఇదీ చదవండి: మెరైన్ రోబో తయారుచేసిన ఐఐటీ పరిశోధకులు.. ఉపయోగాలివే.. తొలగించిన యాప్‌లలో మాట్రిమోనీ.కామ్, షాదీ.కామ్, ఇన్ఫోఎడ్జ్, అన్అకాడమీ, ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్, స్టేజ్, కుటుంబ్, టెస్ట్‌బుక్ ఉన్నాయి. దీంతో భారతీయ స్టార్టప్‌లు యుఎస్ టెక్ దిగ్గజం చేస్తున్న అన్యాయమైన విధానాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మాట్రిమొని.కమ్, భారత్ మాట్రిమొని, జోడి వంటి యాప్స్ వ్యవస్థాపకుడు 'మురుగవేల్ జానకిరామన్' గూగుల్ చర్యపై గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. -
యాపిల్, గూగుల్ ప్లేస్టోర్‌కు పోటీగా ఫోన్‌పే యాప్ స్టోర్..? ప్రత్యేకతలివే..
భారత డిజిటల్ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే తెరతీసింది. తాజాగా ఫోన్‌పే ఇండస్ యాప్‌స్టోర్‌ను దిల్లీ వేదికగా బుధవారం ఆవిష్కరించింది. 45 విభాగాల్లో 2 లక్షలకుపైగా యాప్స్, గేమ్స్‌ను ఈ యాప్‌స్టోర్‌లో పొందుపరిచింది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా 12 భాషల్లో వినియోగదారులు తమకు కావాల్సిన యాప్స్‌ను ఇందులో సర్చ్ చేయవచ్చు. ఇన్-యాప్ కొనుగోళ్లపై గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్స్టోర్లు 15-30% వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. అయితే డెవలపర్లు 2025 ఏప్రిల్ 1 వరకు యాప్ లిస్టింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇన్–యాప్ బిల్లింగ్ కోసం తమకు నచ్చిన థర్డ్‌పార్టీ పేమెంట్ గేట్‌వేను ఎంచుకునే వెసులుబాటును తీసుకొచ్చారు. ఫోన్‌పే యాప్ లేదా ఇండస్యాప్స్టోర్.కామ్ నుంచి ఇండస్ యాప్‌స్టోర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘మొబైల్ యాప్ మార్కెట్లో మరింత పోటీకి ఈ యాప్‌స్టోర్ నాంది పలికింది. ఇది మరింత శక్తివంతమైన భారతీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతుంది’ అని ఫోన్‌పే సీఈవో, ఫౌండర్ సమీర్ నిగమ్ తెలిపారు. ఇదీ చదవండి: పూర్తి మహిళా సిబ్బందితో కార్యకలాపాలు.. ఎక్కడో తెలుసా.. ఇ-మెయిల్ ఖాతాతో సంబంధం లేకుండా మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యే విధానాన్ని ఈ యాప్ స్టోర్ తీసుకొచ్చింది. ఇప్పటికే నోకియా, లావా వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2023లో మొబైల్ యాప్‌లపై 1.19 లక్షల కోట్ల గంటలను భారతీయులు గడిపినట్లు కొన్ని సర్వేల ద్వారా తెలిసింది. 2021లో నమోదైన 95,400 కోట్ల గంటలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. యాప్‌ల డౌన్లోడ్ల విషయంలో ప్రపంచంలోనే మనదేశం అతిపెద్ద మార్కెట్ కావడం విశేషం. -
ఆండ్రాయిడ్ ఫోన్లలో భూకంప హెచ్చరికలు!
న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు వారు ఉంటున్న ప్రాంతంలో సంభవించబోయే భూకంపానికి సంబంధించిన తక్షణ సమాచారాన్ని అలర్ట్‌ల రూపంలో గూగుల్ అందించనుంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్లలో త్వరలో ‘ఎర్త్‌క్వేక్ అలర్ట్’ సందేశ సేవలను ప్రారంభించనుంది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ), జాతీయ భూకంప కేంద్రాల సమన్వయంతో కొత్తగా ‘ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ సిస్టమ్’ను భారత్‌లో మొదలుపెట్టనుంది. ‘యూజర్లు ఉంటున్న ప్రాంతంలో ఒకచోట భూకంపం వస్తే దానికి పసిగట్టి వెంటనే ఆ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాల ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అందరికీ అలర్ట్‌లు మెరుపువేగంతో వెళతాయి’ అని గూగుల్ బుధవారం ఒక బ్లాగ్‌లో పేర్కొంది. ఆండ్రాయిడ్ 5, ఆపై అప్డేటెడ్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఇన్స్టాల్ అయిన ఫోన్లలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలు
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ పేర్కొంది. ఆండ్రాయిడ్– 13 సహా పలు వెర్షన్లు వైరస్ల బారిన పడే ప్రమాదం చాలా ఉందని ఆందోళన వెలిబు చ్చింది. వాటి వినియోగంలో జాగ్రత్తగా ఉండాలంటూ యూజర్లకు సోమవారం ’అతి తీవ్ర’ హెచ్చరిక లు జారీ చేసింది. లేదంటే మొబైల్స్ తదితరాల్లో సున్నిత సమాచారం హాకర్ల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని వివరించింది. ఆండ్రాయిడ్ 10, 11, 12, 12ఎల్, 13 వెర్షన్లలో వీటిని ప్రధానంగా గమనించినట్టు చెప్పింది. వీటివల్ల ఫ్రేంవర్క్, ఆండ్రాయిడ్ రన్ టైం, సిస్టం కంపోనెంట్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్స్, కెర్నల్, ఆర్మ్ కంపోనెంట్స్, మీడియా టీ కంపోనెంట్, కలోకాం క్లోజ్డ్ సోర్స్ కంపోనెంట్స్ వంటివాటి పనితీరు లోపభూయిష్టంగా మారుతుందని వివరించింది. అప్డేషన్ ఇలా... ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్ల భద్రత కోసం లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్‌కు తక్షణం అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్‌పై క్లిక్ చేయాలి..సిస్టమ్ అప్ డేట్స్‌పై క్లిక్ చేయండి. అప్డేట్స్ ఉంటే డౌన్ లోడ్ చేసుకోండి. -
ఈ మొబైల్ ఉంటే ఇంట్లో థియేటర్ ఉన్నట్టే.. ధర ఎంత ఉండొచ్చంటే?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇంట్లోనే మనకు నచ్చిన స్క్రీన్ సైజులో థియేటర్ క్వాలిటీతో వీడియోలు, సినిమాలు వీక్షించొచ్చు. వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ‘ప్రొజెక్టర్ మోడ్ స్మార్ట్ ఫోన్ల’తో డిజిటల్ రంగం మరింత స్మార్ట్ కానుంది. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే ఇంట్లో గోడలు.. నేల.. కార్యాలయం.. కార్లు.. విహార యాత్రలకు వెళితే ఆరు బయటి ప్రాంతాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ సెల్‌ఫోన్‌లోని ప్రొజెక్టర్ ద్వారా వీడియోలు చూడొచ్చు. సెల్ఫోన్లో ప్రొజెక్టర్ ఇన్‌బిల్డ్ చేసి చైనా, జపాన్, అమెరికా, సౌత్ కొరియాకు చెందిన పలు కంపెనీలు వీటిని రూపొందించాయి. లినోవా, అక్యుమెన్, మోటో–జెడ్, మోవి, శాంసంగ్ బీమ్–2 మోడల్స్ పేరుతో ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లోకి విడుదలయ్యాయి. త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. థియేటర్ క్వాలిటీతో.. ఈ ఫోన్లలో ఇంటిగ్రేటెడ్ లేజర్ ప్రొజెక్టర్ ఉంటుంది. లినోవా కంపెనీ తొలుత దీన్ని రూపొందించగా.. ఆ తర్వాత ఇతర కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పుడు మార్కెట్లో ఈ ఫోన్ల ధర రూ.35 వేల నుంచి రూ.1.80 లక్షల వరకూ పలుకుతున్నాయి. ఫోన్, ప్రొజెక్టర్ క్వాలిటీ ఆధారంగా వీటి ధరలు ఉన్నాయి. 50 నుంచి 200 ఇంచుల స్క్రీన్ వరకూ మనం వీడియోలో ప్రొజెక్ట్ చేయొచ్చు. ఇందులో హెచ్డీ, ఫుల్ హెచ్డీ, 4కే క్వాలిటీతో వీడియోలు చూడొచ్చు. హోమ్ థియేటర్‌ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి డీటీఎస్ సౌండ్‌తో పూర్తిగా థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌తో వీడియోలు చూడొచ్చు. వీడియో ప్రజెంటేషన్‌కు ప్రొజెక్టర్ల అవసరం లేకుండా ఇలాంటి సెల్‌ఫోన్‌తో ప్రజెంటేషన్ చేయొచ్చు. -
ఫోన్లో ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఆ ‘యాప్’ వాడితే ఇక అంతే సంగతులు
రైల్వే ప్రయాణికుల్ని ఐఆర్సీటీసీ అప్రమత్తం చేసింది. irctcconnect.apk పేరుతో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవద్దని సలహా ఇచ్చింది. ఇండియన్ రైల్వే పేరుతో ఓ ఫేక్ యాప్ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్, టెలిగ్రాంలలో ప్రత్యక్షమైంది. దీంతో అప్రమత్తమైన ఐఆర్సీటీసీ అధికారులు.. సర్క్యులేట్ అవుతున్న ఏపీకే ఫైల్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవద్దని తెలిపారు. సైబర్ నేరస్తులు ఈజీ మనీ కోసం అడ్డదార్లు తొక్కుతున్నారని, వినియోగదారులు వ్యక్తిగత యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ బ్యాంకింగ్ వివరాల్ని సేకరించి వాటి ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్లు సూచించింది. కాబట్టి యూజర్లు ఇలాంటి యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ యాప్స్‌నే డౌన్లోడ్ చేసుకోండి ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లు, యాప్స్‌ను పోలి ఉండేలా సైబర్ నేరస్తులు ఫేక్ వెబ్సైట్లు, యాప్స్‌ను తయారు చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం కలగకుండా ఈ యాప్‌తో కూడిన మోసపూరిత లింక్ (ఫిషింగ్ అటాక్)లను ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునేవారికి సెండ్ చేస్తున్నారు. పొరపాటున ఆ లింక్స్‌ను క్లిక్ చేస్తే ..ఫిషింగ్ దాడికి గురైన బాధితుల నుండి యూపీఐ వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ సమాచారంతో సహా సున్నితమైన నెట్ బ్యాంకింగ్ వివరాల్ని దొంగిలిస్తున్నారు. ఇక నేరస్తులు ఐఆర్సీటీసీ పేరుతో షేర్ చేస్తున్న లింక్‌లతో యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవద్దని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఐఆర్సీటీసీ అఫిషియల్, ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ వంటి మొబైల్ యాప్స్‌ను గూగుల్, యాపిల్ ప్లేస్టోర్ల నుంచి మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. -
Google vs CCI: గూగుల్‌కు మరో ఎదురుదెబ్బ..కానీ..!
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ( సీసీఐ) విధించిన జరిమానాను సమర్ధించింది. ఆండ్రాయిడ్ మార్కెట్లో దాని ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిన ఆరోపణలపై గూగుల్‌పై విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాను సమర్థించింది. ఈ పెనాల్టీ మెుత్తాన్ని చెల్లించేందుకు ట్రైబ్యూనల్ గూగుల్‌కు 30 రోజుల పాటు గడువిచ్చింది. అయితే ఈ తీర్పుపై గూగుల్ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు. (ఇదీ చదవండి: Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?) అయితే మరో భారీ ఊరట కూడా లభించింది.ఎన్సీఎల్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్, సభ్యుడు (టెక్నికల్) డాక్టర్ అలోక్ శ్రీవాస్తవతో కూడిన బెంచ్ సీసీఐ జారీ చేసిన నాలుగు కీలక ఆదేశాలను పక్కన పెట్టింది. సీసీఐ ఆర్డర్‌లోని 617.3, 617.9, 617.10 617.7 పేరాల్లో జారీ చేసిన ఆదేశాలను కోర్టు పక్కన పెట్టింది. అలాగే ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులను(OEM) 11 అప్లికేషన్ల మొత్తం Google సూట్‌ను ప్రీ ఇన్స్టాల్ చేయమని గూగుల్ కోరడం అన్యాయమని ఎన్సీఎల్ఏటీ స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ఫోర్క్‌లను అభివృద్ధి చేయడం, పంపిణీ చేయడం నుంచి OEMలను నిషేధించే యాంటీ ఫ్రాగ్మెంటేషన్ అగ్రిమెంట్ షరతులను తప్పుపట్టింది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) మరోవైపు కంపెనీ ఒప్పందాల కార్యాచరణతో పోటీ యాప్‌లను ముందే ఇన్స్టాల్ చేయకుండా నిరోధించ లేదని పేర్కొంది. మార్కెట్లో ఆధిపత్యం పొందడమంటే ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడం కాదని, వినియోగదారుల్లో గూగుల్ ప్రజాదరణ పొందడమని గూగుల్ వాదిస్తోంది. సీనియర్ న్యాయవాది అరుణ్ కథ్పాలియా Google LLC తరపున వాదించారు. -
వాట్సాప్ చాటింగ్ ఇకపై మరింత సరదాగా
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ త్వరలో ఆండ్రాయిడ్ కోసం కొన్ని బీటా టెస్టర్లకు 21 కొత్త ఎమోజీలను విడుదల చేయనుంది. WABetaInfo నివేదిక ప్రకారం, వాట్సాప్ వినియోగదారులు కొత్తగా రానున్న 21 ఎమోజీలను తాజా యూనికోడ్ 15.0 నుండి పంపడానికి వేరే కీబోర్డ్‌ని డౌన్లోడ్ చేసి ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటిని వాట్సాప్ కీబోర్డ్ నుండి నేరుగా ఉపయోగించవచ్చు. గతంలో ఈ 21 కొత్త ఎమోజీలు డెవలప్మెంట్లో ఉండటం వల్ల, వాట్సాప్ కీబోర్డ్‌లో కనిపించలేదు. అయితే ప్రత్యామ్నాయంగా కీబోర్డ్‌ని ఉపయోగించడం ద్వారా వాటిని పంపించుకోవడం సాధ్యమయ్యేది. బీటా టెస్టింగ్ వినియోగదారులు ఇప్పుడు అధికారిక వాట్సాప్ కీబోర్డ్ నుండి కొత్త ఎమోజీలను యాక్సెస్ చేయవచ్చు. వాట్సాప్ అకౌంట్‌కి కూడా ఈ బీటా ఫీచర్లు వచ్చే అవకాశాలను పెంచుకోవడానికి, లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను కూడా డెవెలప్ చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ బీటాలో అభివృద్ధి దశలో ఉంది. (ఇదీ చదవండి: కొత్త కారు కొనేవారికి శుభవార్త.. మారుతి కార్లపై అదిరిపోయే ఆఫర్స్) ఇంకో వైపు వాట్సాప్ "సైలెన్స్ అన్నోన్ కాలర్స్" అనే కొత్త ఫీచర్ మీద కూడా పని చేస్తోందని డబ్ల్యూఏబీటాఇన్ఫో నివేదిక తెలిపింది. ఈ ఫీచర్ మీ కాల్ లిస్ట్‌లో లేని కొత్త నంబర్స్ నుంచి వచ్చే కాల్స్‌ని సైలెంట్ మోడ్‌లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా త్వరలోనే అందుబాటులో రానుంది. -
యాప్.. ట్రాప్.. అత్యధిక యాప్‌లతో వ్యక్తిగత గోప్యతకు భంగం!
విజయనగరానికి చెందిన రమేశ్ కొన్ని రోజుల క్రితం తమ బంధువుల గృహప్రవేశం కోసం హైదరాబాద్‌లోని కోకాపేటకు వెళ్లారు. అక్కడ కాలక్షేపం కోసం ఫోన్లో ఫేస్బుక్ చూడసాగారు. అంతే.. హైదరాబాద్‌లోని కోకాపేట, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ ప్రకటనలు వరుసగా వచ్చేస్తున్నాయి. ఏనాడూ తన ఫేస్బుక్లో కనిపించని ఈ ప్రకటనలను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. తాను హైదరాబాద్ వచ్చిన విషయం, కోకాపేట ప్రాంతంలో ఉన్న విషయం తనకు సంబంధం లేని వారికి తెలిసిపోయిందని గుర్తించారు. లోన్‌యాప్ కంపెనీల ఆగడాలు మరీ దుర్మార్గం. అప్పు తీసుకున్న వ్యక్తి ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు అన్నీ ఆ కంపెనీలు తీసుకుంటాయి. అత్యధిక వడ్డీలు వేసి ఇచ్చిన రుణానికి నాలుగు, ఐదింతలు ఎక్కువ డిమాండ్ చేస్తాయి. అడిగినంత చెల్లించకపోతే ఫోన్ నుంచి తీసుకున్న రుణ గ్రహీత ఫొటోలను మార్ఫింగ్ చేసి, కాంటాక్ట్ నంబర్లలో ఉన్న బంధువులు, మిత్రులకు పంపించి వేధిస్తుంటాయి. సాక్షి, అమరావతి: మన ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు, ఇతర సమాచారం తెలియాల్సింది మనకు ఒక్కరికే కదా! బయటకు ఎలా వెళ్తోంది? ఇదెలా సాధ్యం అంటే.. మొబైల్ యాప్‌లే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తుల ప్రమేయం లేకుండానే వారి కదలికలు, లావాదేవీలు, ఇతర సమాచారం మొత్తం గుర్తుతెలియని వ్యవస్థలకు యాప్‌ల ద్వారా చేరిపోతున్నాయి. మన అవసరాల కోసం స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొనే ఈ యాప్‌లతో సౌలభ్యం ఎంతుందో.. వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం కూడా అంతే ఉంది. వ్యక్తులు ఉన్న ప్రదేశం, వారి కదలికలు, సామాజిక మాధ్యమాల్లో చూసే వివిధ అంశాలు.. ఇలా అన్నీ యాప్‌లు నిరంతరం పరిశీలిస్తూనే ఉంటాయి. ఫోన్ కాంటాక్ట్ నంబర్లు, ఫోన్లోని ఫొటోలతోపాటు చివరికి వేలి ముద్రలు, ఎస్ఎంఎస్లు వేరెవరికో వెళ్లిపోతుంటాయి. అప్రమత్తతే శ్రీరామరక్ష.. ► యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే ముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ► మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు వివిధ అనుమతులు అడుగుతుంది. వాటిని నిశితంగా చదివిన తరువాతే అనుమతించాలి. డౌన్లోడ్ చేసుకునే తొందర్లో నిబంధనలను చదవకుండా అనుమతిస్తే తరువాత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ► మనమున్న ప్రదేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న యాప్‌లకే లొకేషన్ యాక్సెస్ ఇవ్వాలి. యాప్ వినియోగించేటప్పుడు మాత్రమే యాక్సెస్ అనుమతించేలా చూసుకోవాలి ► ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ ప్రవేశపెట్టే యాప్‌లకు అన్నింటినీ యాక్సెస్ ఇవ్వాలి. అది అత్యవసర సమయాల్లో పోలీసులు మనకు సహకరించేందుకు ఉపయోగపడుతుంది ► నిషేధిత సంస్థలు, అనుమతి లేని ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ సంస్థల యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్ లోడ్ చేసుకోకూడదు ► ఎస్ఎంఎస్లు, వాట్సాప్ సందేశాలు చదివేందుకు, వేలిముద్రను తెలుసుకునేందుకు యాప్‌లకు అనుమతించకూడదు ఆండ్రాయిడ్ యాప్‌లు.. ► 75 శాతం ఇండియన్ ఆండ్రాయిడ్ యాప్‌లతో ఆ ఫోన్ యజమాని ఉన్న ప్రదేశం తెలిసిపోతోంది ► 59 శాతం యాప్‌లు వాటిని ఉపయోగించని సమయంలో కూడా మనం ఉన్న ప్రదేశాన్ని వెల్లడిస్తున్నాయి ► 57 శాతం యాప్‌లు ఫోన్లోని మైక్రోఫోన్‌ను వాడుకుంటున్నాయి ► 76 % యాప్‌లకు కెమెరా యాక్సెస్ ఉంది ► 43 శాతం యాప్‌లతో ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లు తెలిసిపోతాయి ► 32 శాతం యాప్‌లతో ఫోన్‌కు వచ్చిన ఎస్ఎంఎస్లు కూడా తెలుసుకోవచ్చు ► 25 శాతం యాప్‌లతో ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు వేసే వేలిముద్ర తెలిసిపోతుంది ఐవోఎస్ యాప్‌లు... ► 83 శాతం ఐవోఎస్ యాప్‌లతో మీరు ఉన్న ప్రదేశం తెలిసిపోతుంది ► 81 శాతం యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు కెమెరాతో యాక్సెస్ లభిస్తుంది ► 90 శాతం యాప్‌లతో ఫోన్ గేలరీలో ఉన్న ఫొటోలు బట్టబయలైపోతాయి ► 64 శాతం యాప్‌లతో ఫోన్లోని మైక్రోఫోన్‌తో యాక్సెస్ వస్తుంది ► 49 శాతం యాప్‌లతో ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లు తెలిసిపోతాయి ► 36 శాతం యాప్‌లతో ఫోన్లోని క్యాలండర్‌తో యాక్సెస్ లభిస్తుంది. అర్కా సంస్థ అధ్యయనం.. ప్రముఖ ప్రైవసీ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాం అర్కా కంపెనీ ‘స్టేట్ ఆఫ్ డాటా ప్రైవసీ’ పేరిట నిర్వహించిన సర్వేలో ఆందోళన కలిగించే ఇటువంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. అర్కా సంస్థ 200 మొబైల్ యాప్‌లు, వెబ్సైట్లను అధ్యయనం చేసింది. వాటిలో మన దేశంలోని 25 రంగాలకు చెందిన 100 యాప్‌లు, వెబ్సైట్లు ఉన్నాయి. అమెరికాకు చెందినవి 76, యూరోపియన్ యూనియన్లకు చెందినవి 24 ఉన్నాయి. పిల్లలకు సంబంధించిన 30 యాప్‌ల గురించి కూడా ఈ సంస్థ ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. ఆ యాప్‌లను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనం ఇచ్చే అనుమతులు, ట్రాకర్లు, కుకీలతో వ్యక్తిగత సమాచారం ఇతర సంస్థలకు చేరిపోతున్నాయి. వ్యక్తిగత గోప్యతకు అత్యధికంగా గూగుల్ కంపెనీ భంగం కలిగిస్తోందని ఈ నివేదిక వెల్లడించింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ యాప్‌లకు సంబంధించి ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో ప్రధాన అంశాలను వెల్లడించింది. -
వార్నింగ్: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి
మొబైల్ వినియోగదారులకు అలర్ట్. స్మార్ట్ఫోన్లలో మాల్వేర్ మరోసారి కలకలం రేపుతోంది. ఈ సారి ఏకంగా రెండు వందలకు పైగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ప్రమాదకరంగా గుర్తించారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. ఈ యాప్స్ మీ పరికరాన్ని సులభంగా కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ పొంది అందులో డబ్బులు కూడా మాయం చేస్తాయి. థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ (DES), నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) సంస్థలు ఈ ప్రమాదకరమైన యాప్‌లను గుర్తించాయి. వీటిని తొలగించేందుకు ఈ రెండు సంస్థలు ఇప్పటికే గూగుల్ (Google) యాపిల్ (Apple)ని సంప్రదించాయి. యాపిల్ తన కఠినమైన భద్రతా చర్యలతో తన iOSలో ఈ ప్రమాదాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. కానీ గూగుల్ ఈ ప్రమాదాన్ని ఎలా నివారిస్తుందన్నదే సమస్యగా మారింది. ఈ యాప్స్ అన్నింటినీ తొలగించాలని థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ కోరింది. ఈ యాప్స్ ద్వారా హ్యాకర్లు మీ మొబైల్‌ను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. తద్వారా మీ మెసేజెస్ చదవడం, బ్యాంకింగ్ లావాదేవీలపై నిఘా పెట్టడం, వ్యక్తిగత వివరాలు సేకరించడం, ఏటీఎం పిన్, కార్డ్ వివరాలను తెలుసుకోవడం లాంటివి జరగొచ్చు. ఒకవేళ మీ డివైజ్‌లో ఈ యాప్‌లను ఇన్స్టాల్ చేసుంటే మీ బ్యాటరీ డ్రెయిన్ లేదా పరికరం పనితీరు మందగించడం లాంటివి మార్పులును గమనిస్తారు. కనుక మీ స్మార్ట్‌ఫోన్ పనితీరులో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే అవసరం లేని యాప్స్ డిలిట్ చేయండి ఉత్తమం. లేదంటే డేటా బ్యాకప్ చేసి మొబైల్‌ను పూర్తిగా రీసెట్ చేయండి. -
బిగ్ అలర్ట్.. డెడ్‌లైన్ దగ్గరకొచ్చింది, ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్!
వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. జనవరి 1, 2023 నుంచి పలు స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. ఎందుకంటే.. వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా యూజర్ ఇంటర్ఫేస్ను మెరుగుపరచడంతో పాటు బగ్‌లను ఫిక్స్ చేసేందుకు ప్రతి వారం యాప్ అప్డేట్లను విడుదల చేస్తుంది. మెటా యాజమాన్యంలోని ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లేదా వెబ్‌కు అనుగుణంగా తాజా సిస్టమ్ సాఫ్ట్వేర్లకు సపోర్ట్‌లను అందించేందకు వాటికి అనుగుణంగా అప్డేట్లను లాంచ్ చేస్తుంది. ఈ కారణంగా, ప్రతి సంవత్సరం కొత్త అప్డేట్లపై దృష్టి పెట్టేందుకు పాత ఆపరేటింగ్ వెర్షన్లకు తన సపోర్ట్‌ని నిలిపివేస్తుంది. ఇదే తరహాలో ఈ సంవత్సరం కూడా, కొన్ని ఆండ్రాయిడ్, ఐఫోన్ మోడల్‌లతో సహా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పని చేస్తున్న దాదాపు 49 స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది వాట్సాప్. ఈ మోడల్లో పని చేయదు.. ఇలా చేయాల్సిందే! పాత ఐఫోన్ మోడల్లో పని చేయదు. కనుక ఈ మోడల్‌ను ఉపయెగిస్తున్న వారు తమ హ్యాండ్సెట్లను iOS 12 లేదా కొత్తదానికి అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆండ్రాయిడ్ వాడుతున్న వినియోగదారులు వాట్సాప్ ఉపయోగించాలంటే Android OS 4.1 లేదా తర్వాత వెర్షన్‌లోకి మారాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్, భద్రతాపరమైన లోపాల వల్ల యూజర్లు ఈ మార్పును సహకరించాలని వాట్సాప్ కోరింది. నివేదిక ప్రకారం iOS 11, Android OS 4.. అంతకంటే పాత ఓఎస్ మొబైల్ ఫోన్ లకు డిసెంబర్ 31 తర్వాత వాట్సాప్ తన సపోర్ట్‌ను ఆపివేయనుంది. గడువు ముగిసిన హ్యాండ్సెట్ల జాబితాలో Apple, Samsung, LG, Huawei, ఇతర కంపెనీలకు చెందిన 49 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఆ జాబితాలో ఉన్న ఫోన్లు ఇవే.. ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ, చదవండి: అలర్ట్: ఆధార్ కార్డ్ వినియోగంపై కీలక మార్గదర్శకాలు విడుదల! -
మస్క్‌తో తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, ఏం జరిగిందంటే?
న్యూఢిల్లీ: ట్విటర్ టేకోవర్ తరువాత కొత్తబాస్, బిలియనీర్ ఎలాన్ మస్క్ వరుసగా ఉద్యోగులను తొలగించడం ఆందోళనకు దారి తీస్తోంది. ఇప్పటికే సీఈవో సహా కీలక ఎగ్జిక్యూటివ్‌లతో పాటు వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మస్క్ తాజాగా ఒక ఉద్యోగిపై పబ్లిగ్గానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆండ్రాయిడ్ యాప్‌పై వాదన నేపథ్యంలోఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్ ఎరిక్ ఫ్రోన్హోఫెర్ అనే ఉద్యోగిపై వేటు వేశారు ఎలాన్ మస్క్. ట్విటర్లో ఆండ్రాయిడ్‌లో ట్విటర్ ఎందుకు స్లో అయింది, దాని పరిష్కరించడానికి మీరు ఏమి చేసారు? అనే దానిపై మొదలైన వాదన వరుస ట్వీట్లలో మరింత వేడి పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఆగ్రహానిక గురైన మస్క్ హి ఈజ్ఫైర్డ్ అంటూ ట్వీట్ చేశారు. సిస్టమ్ లాక్ అయిన పిక్‌ను షేర్ చేసిన, ఎరిక్ తన తొలగింపును ధృవీకరించారు. దీంతో తనను బహిరంగంగా విమర్శించే కంపెనీ ఇంజనీర్లను తొలగించే పనిలో ఉన్న మస్క్ తన కోపాన్ని ప్రదర్శించారంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ వ్యవహారంలో బాస్‌తో ప్రయివేటుగా మాట్లాడి ఉండి ఉండాల్సింది.. ఇలా పబ్లిక్‌గా బాస్‌తో వాదించడం తగదు అంటూ 20 ఏళ్ల అనుభవం ఉన్న మరో యాప్ డెవలవర్ ట్వీట్ చేశారు. అంతకు ముందు ట్విటర్లో దాదాపు పదేళ్లపాటు సేవలందించిన మరో ఇంజనీర్ బెన్ లీబ్ని కూడా మస్క్ ఇదే విధంగా తొలగించారు. 🫡 https://t.co/YpaQysrIv0 — Eric Frohnhoefer @ 🏡 (@EricFrohnhoefer) November 14, 2022 Unbelievable exchange. Can I write this up as a teaching case for my management classroom? pic.twitter.com/lYteE7d4N8 — Sandy Piderit (@SandyPideritPhD) November 14, 2022 కాగా చాలా దేశాల్లో ట్విటర్ నెట్ వర్క్స్‌లో కావడంపై మస్క్ యూజర్లకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ యాప్ స్లో అయినందుకు, ముఖ్యంగా కొన్ని దేశాలలో వినియోగదారులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. ట్విటర్ కొనుగోలు తరువాత సంస్థలో సగం మంది ఉద్యోగులను తొలగించారు. ఆ తరువాత ఇటీవల మొత్తం 5,500 కాంట్రాక్టు ఉద్యోగుల్లో దాదాపు 4,400 మందిని ఎలాంటి ముదస్తు నోటీసు లేకుండానే నిలిపివేశారు. How to be the ultimate professional and still utterly destroy someone, a masterclass by @EricFrohnhoefer pic.twitter.com/mgUHJ0xLbH — Dan Kim (@dankim) November 14, 2022 -
భారీ షాక్.. దీపావళి తర్వాత ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్!
మీరు పాత ఐఫోన్‌ని(iPhone) ఉపయోగిస్తున్నారా లేదా మీ ఫోన్ ఐఓఎస్(iOS) పాత వెర్షన్లో రన్ అవుతుందా?అయితే మీ ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేయాలి లేదా iOS లేటెస్ట్ వెర్షన్‌లోకి అప్డేట్ చేసుకోవాలి. ఇలా చేయకుంటే ఆ ఫోన్లలో ఇకపై వాట్సాప్ సేవలను వినియోగించడం కుదరుదు. ఎందుకంటే ఈ దీపావళి తర్వాత నుంచి కొన్ని ఐఫోన్లలో వాట్సాప్ పని చేయదు. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. అక్టోబర్ 24 నుంచి ఐఫోన్5, ఐఫోన్ 5సీ మొబైల్స్‌తో పాటు ios 10, ios 11తో పని చేస్తున్న ఐఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ఫోన్లను ios 12, లేదా ఆపైన వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆండ్రాయిడ్ వెర్షన్ 4.1 లేదా అంతకంటే తక్కువ వెర్షర్ ఓఎస్‌లు(os) మీద పని చేస్తున్న మొబైల్స్‌లోనూ వాట్సాప్ సేవలు ఉండవు. iPhoneని ఎలా అప్‌గ్రేడ్ చేయాలి iOS 10, iOS 11 అనేవి ఐఫోన్ల పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు. ఐఫోన్ ఇంకా అప్డేట్ కాకపోతే వెంటనే అప్డేట్ చేయడం మంచిది. సెట్టింగ్‌లు > జనరల్‌కి నావిగేట్ చేయండి. ఇక్కడ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్‌ని ఎంచుకుని, ఆపై సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడానికి లేటెస్ట్ iOS వెర్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. కాగా ఆపిల్ గతంలో.. కొన్ని పాత iPhoneలలో వాట్సాప్ యాప్ పని చేయదని తెలిపింది. వాట్సాప్ ప్రకారం, మెసేజింగ్ యాప్ అక్టోబరు 24 నుంచి iOS 10, iOS 11 పరికరాల్లో పనిచేయదు. ఈ మేరకు పేర్కొన్న ఫోన్లను వాడుతున్న వినియోగదారులకు హెచ్చరికలు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే చదవండి: ఐటీ కంపెనీల ముందు పెను సవాళ్లు.. వచ్చే 12 నెలల్లో భారీ షాక్! -
గూగుల్‌కు సీసీఐ రూ. 1,338 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ వ్యవస్థకు సంబంధించి వివిధ మార్కెట్లలో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న అభియోగాలపై టెక్ దిగ్గజం గూగుల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ. 1,338 కోట్ల జరిమానా విధించింది. అంతే కాకుండా అనుచిత వ్యాపార విధానాలు అమలు చేయడాన్ని మానుకోవాలని ఆదేశించింది. నిర్దిష్ట వ్యవధిలోగా తన తీరును మార్చుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మూడేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం సీసీఐ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను స్మార్ట్ఫోన్లలో ఉపయోగించే మొబైల్ తయారీ సంస్థలు (ఓఈఎం) .. గూగుల్ మొబైల్ సూట్‌ను (జీఎంఎస్) కూడా పొందుపర్చేలా తప్పనిసరిగా నిర్దిష్ట ఒప్పందం కుదుర్చుకోవాలని గూగుల్ షరతు విధిస్తోందన్న ఆరోపణ కూడా ఈ ఫిర్యాదుల్లో ఉంది. దీనితో పాటు మరికొన్ని అభియోగాలపై లోతుగా విచారణ జరపాలంటూ 2019 ఏప్రిల్‌లో సీసీఐ ఆదేశించింది. అక్టోబర్ 25న పదవీ విరమణ చేస్తున్న సీసీఐ చైర్పర్సన్ అశోక్ కుమార్ గుప్తా తాజాగా తుది ఉత్తర్వులు ఇచ్చారు. అన్ఇన్స్టాల్ చేసే ఆప్షన్ లేకుండా జీఎంఎస్ను తప్పనిసరిగా ప్రీ–ఇన్స్టాల్ చేయాలనడం డివైజ్‌ల తయారీదారులకు అసమంజస షరతు విధించడమే అవుతుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే, స్మార్ట్ డివైజ్‌లలో ప్రీ–ఇన్స్టాల్డ్ యాప్స్‌ను ఎక్కడ ఉంచాలనే విషయంలోనూ ఓఈఎంలపై ఒత్తిడి తేకూడదని స్పష్టం చేశారు. -
అరచేతిలో 87 రకాల సేవలు.. ఈ యాప్ ఉంటే మీ వెంట పోలీస్ ఉన్నట్టే!
దొండపర్తి(విశాఖ దక్షిణ): ఈ యాప్ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఎటువంటి ప్రమాదం, సమస్య వచ్చినా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే క్షణాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసే అద్బుతమైన అవకాశం ఇందులో ఉంది. అదే ‘ఏపీ పోలీస్ సేవ’యాప్. అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ యాప్ రూపొందించారు. ఈ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే.. పోలీస్‌స్టేషన్ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఇంటి దగ్గర నుంచే పొందవచ్చు. అందుకే మొబైల్లో ఈ యాప్ ఉంటే.. మన వెంట పోలీస్ ఉన్నట్టే! ఆరు విభాగాల్లో 87 రకాల పోలీస్ సేవలు పోలీస్ స్టేషన్లో ప్రజలకు అందే సేవలను ఆరు విభాగాలుగా విభజించారు. శాంతిభద్రతలు. ఎన్ఫోర్స్మెంట్, పబ్లిక్ సేవలు, రహదారి భద్రత, ప్రజా సమాచారం, పబ్లిక్ అవుట్ రీచ్ ఇలా ఆరు విభాగాల్లో పోలీస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. శాంతి భద్రతలు నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ స్థితిగతులు, దొంగతనాలపై ఫిర్యాదులు, రికవరీలు, తప్పిపోయిన కేసులు, దొరికిన వారు, గుర్తు తెలియని మృతదేహాలు, అరెస్ట్ వివరాలు, అపహరణకు గురైన వాహనాల వివరాలను పొందవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ ఇంటి పర్యవేక్షణ, ఈ–బీట్, ఈ–చలానా స్టేటస్‌లను తెలుసుకోవచ్చు. పబ్లిక్ సేవలు నేరాలపై ఫిర్యాదులు, సేవలకు సంబంధించిన దరఖాస్తులు, ఎన్వోసీలు, వెరిఫికేషన్లు, లైసెన్స్‌లు, అనుమతులు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు. రహదారి భద్రత బ్లాక్ స్పాట్లు, ప్రమాదాల మ్యాపింగ్, రోడ్డు భద్రతా గుర్తులు, బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాలు, ఆస్పత్రులు, మందుల దుకాణాల వివరాలను తెలుసుకోవచ్చు. ప్రజా సమాచారం పోలీస్ డిక్షనరీ, సమీప పోలీస్ స్టేషన్ల వివరాలు, టోల్ ఫ్రీ నంబర్లు, వెబ్సైట్ల వివరాలు, న్యాయ సమాచారం, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. పబ్లిక్ అవుట్ రీచ్ సైబర్ భద్రత, సోషల్ మీడియా, కమ్యూనిటీ పోలీసింగ్, స్పందన వెబ్సైట్, ఫ్యాక్ట్ చెక్ సేవలు, తదితరవన్నీ పొందుపర్చారు. ఎక్కడ ఉన్నా.. ఫిర్యాదు చేసుకోవచ్చు.. పోలీస్ సేవ యాప్ ద్వారా ఉన్న చోట నుంచే వేధింపులు, నేరాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, పోలీస్ సేవల్లో లోపాలపై ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే ఐడీ నంబర్‌తో సహా ఫిర్యాదుదారుడి మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. అలాగే సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారనే విషయాన్ని కూడా మెసేజ్‌లో తెలియజేస్తారు. పిటిషన్ ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని సైతం ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసలుబాటును కలి్పంచారు. ఎఫ్ఎస్ఐఆర్ నమోదు నుంచీ.. ఏదైనా కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి నిందితులను కోర్టులో హాజరుపరచడం విచారణ, సాక్షులు, కేసులో ట్రయల్స్, ఇలా మొత్తం 24 దశల్లో కేసు సమగ్ర సమాచారం మెసేజ్ రూపంలో తెలుస్తుంటాయి. ఎఫ్ఐఆర్ కోసం స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. యాప్ ద్వారా సులభంగా ఎఫ్ఐఆర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ–చలానా వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పెండింగ్‌లో ఉన్న చలానాలను పరిశీలించి చెల్లించవచ్చు. మహిళ భద్రతకు ప్రాధాన్యం పోలీస్ సేవ యాప్‌లో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చారు. సేఫ్టీ సేవ ద్వారా 12 రకాల సేవలను అందుబాటులో ఉంచారు. దిశ, సైబర్ మిత్ర యాప్, వన్ స్టాప్ సెంటర్, ఏపీ స్టేట్ ఉమెన్ కమిషన్, ఉమెన్ ప్రొటెక్షన్ తదితర 12 మాడ్యూళ్లను అనుసంధానం చేశారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘పోలీస్ సేవ’యాప్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో సైబర్ నేరాలకు సంబంధించినవి ఎక్కువగా ఉంటున్నాయి. ఫిర్యాదులపై తక్షణం స్పందించి సమస్యలు పరిష్కరిస్తున్నాం. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ‘పోలీస్ సేవ’ను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే దిశ యాప్‌ను తప్పకుండా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. తద్వారా క్షణాల్లో పోలీసు సాయం పొందుతారు. – సి.హెచ్.శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్ -
అకౌంట్లో డబ్బులు కొట్టేసే యాప్స్: తక్షణమే డిలీట్ చేయండి!
సాక్షి, న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ యూజర్లు జాగ్రత్త! యూజర్ల బ్యాంకు ఖాతాలనుంచి నగదును తస్కరించే యాప్‌లపై తాజాగా హెచ్చరిక జారీ అయింది. ఖాతాలో డబ్బులు, బ్యాంకింగ్ సమాచారం, పిన్లు, పాస్వర్డ్లు సహా ఇతర డేటాను దొంగిలించే లక్ష్యంతో మాల్వేర్ యాప్‌లను ట్రెండ్ మైక్రో భద్రతా పరిశోధన గుర్తించింది. తక్షణమే అన్ఇన్స్టాల్ చేయాలని హెచ్చరించింది. ఇలాంటి 17 ఆండ్రాయిడ్ యాప్‌లను సంస్థ గుర్తించింది. ఇవి మొబైల్ ఫోన్లోని టెక్స్ట్ సందేశాలను కూడా అడ్డుకుంటాయని, అలాగే మరింత ప్రమాదకరమైన మాల్వేర్ బారిన పడేలా చేస్తాయని హెచ్చరించింది. గూగుల్ ప్లేస్టోర్ సేఫ్టీ మెజర్స్‌ను అధిగమిస్తాయని యాప్‌లు డ్రాపర్-యాజ్-ఎ-సర్వీస్ (DaaS) మోడల్‌కు దారితీస్తాయని పేర్కొంది. అందుకే వాటిని డ్రాపర్ యాప్‌లు అంటారని ట్రెండ్ మైక్రోలోని భద్రతా పరిశోధకులు తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్‌లో గత ఏడాది ట్రెండ్ మైక్రో కొత్త డా డ్రాపర్ వెర్షన్‌ను కనుగొంది. వీటిని ప్లేస్టోర్ నుంచి తొలగించినప్పటికీ, ఆండ్రాయిడ్ ఫోన్లలో మిగిలి ఉండే అవకాశం ఉంది కనుక తక్షణమే తొలగించాలని సూచించింది. డ్రాపర్ యాప్‌ల జాబితా కాల్ రికార్డర్ APK రూస్టర్ VPN సూపర్ క్లీనర్- హైపర్ & స్మార్ట్ డాక్యుమెంట్ స్కానర్ - పీడీఎఫ్ క్రియేటర్ యూనివర్సల్ సేవర్ ప్రో ఈగిల్ ఫోటో ఎడిటర్ కాల్ రికార్డర్ ప్రో+ అదనపు క్లీనర్ క్రిప్టో యుటిల్స్ ఫిక్స్ క్లీనర్ యూనివర్సల్ సేవర్ ప్రో లక్కీ క్లీనర్ జస్ట్ ఇన్: వీడియో మోషన్ డాక్యుమెంట్ స్కానర్ ప్రో కాంకర్ డార్క్నెస్ సింప్లీ క్లీనర్ Unicc QR స్కానర్ కాపీ క్యాట్ యాప్‌లను నిషేధించేలా గూగుల్ కొత్త విధానాన్ని తీసుకురానుందని సమాచారం. ఇతర యాప్‌ల నుండి లోగోలు, డిజైన్లు లేదా టైటిల్స్‌ను క్లోన్ చేసే యాప్‌లపై ఆగస్టు 31 నుండి నిషేధం అమలు కానుంది. వినియోగదారు డేటాను ట్రాక్ చేసే, క్లిక్ ద్వారా ప్రకటనలకు దారి మళ్లించే వీపీఎన్ఎస్ సర్వీస్ ఇందులో భాగం. అంతేకాదు మొబైల్ గేమ్స్‌లో ఫుల్ పేజీప్రకటనలపై, 15 సెకన్ల తర్వాత కూడా క్లోజ్ కాని యాడ్స్ డెవలపర్లపై ఆంక్షలు సెప్టెంబర్ 30 నుంచి అమలు కానున్నాయి. స్క్రీన్ లోడింగ్ సమయంలో/గేమ్ ముందు లేదా తరువాతి లెవల్ ప్రారంభించే ముందు కనిపించే ప్రకటనల్ని గూగుల్ నిరోధిస్తుందని నివేదిక పేర్కొంది. అయితే, గేమ్‌లో రివార్డ్‌లను అన్‌లాక్ చేసే ప్రకటనలకు ఇది వర్తించదట. -
గూగుల్ షాకింగ్ నిర్ణయం..ఇకపై ట్రూకాలర్‌లో ఈ ఫీచర్ పనిచేయదు..!
ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రైవసీను దెబ్బతీస్తున్నాయనే కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్స్ యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు గూగుల్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కొత్త రూల్‌ను తెరపైకి రావడంతో కాలర్ వేరిఫికేషన్ ప్లాట్‌ఫాం ట్రూకాలర్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ యాప్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను అందించబోమని ట్రూకాలర్ ప్రకటించింది. ఈ ఫీచర్‌ను మే 11 నుంచి నిలిపివేస్తామని ట్రూకాలర్ పేర్కొంది. మే 11 నుంచి యాక్సెసిబిలిటీ ఏపీఐకి థర్డ్-పార్టీ అప్లికేషన్ల యాక్సెస్‌ని నియంత్రిస్తూ గూగుల్ ప్లే స్టోర్ పాలసీని అప్డేట్ చేసినట్లు గూగుల్ ప్రకటించిన వెంటనే ట్రూకాలర్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో థర్డ్ పార్టీ యాప్స్‌నుపయోగించి కాల్స్‌ను రికార్డింగ్ చేయలేరు. ట్రూకాలర్ యాప్ యూజర్లకు కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను అందరికీ ఉచితంగా అందిస్తోంది, గూగుల్ యాక్సెసిబిలిటీ ఏపీఐని ఉపయోగించి కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసింది. అయితే, గూగుల్ అప్డేట్ చేసిన డెవలపర్ ప్రోగ్రామ్ విధానాల ప్రకారం...ఇకపై కాల్ రికార్డింగ్‌ను అందించలేమని ట్రూకాలర్ పేర్కొంది. ఇదిలా ఉండగా స్మార్ట్‌ఫోన్స్‌లో ముందుగా ఇన్స్టాల్ చేసిన యాప్స్‌తో, గూగుల్ డయలర్‌తో ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేయవచ్చునని గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు మరింత గోప్యతను అందించడానికి, కాల్ రికార్డింగ్ చట్టాలకు అనుగుణంగా గూగుల్ ఈ మార్పును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బిగ్ షాక్.. గూగుల్ కీలక నిర్ణయం -
ఫ్లిప్‌కార్ట్ కొత్త ఆఫర్: మీ పాత ఫోన్ అమ్మండి..కొత్త ఫోన్ కొనుగోలు చేయండి!!
దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు సువార్ణావకాశం కల్పించింది. సేల్ బ్యాక్ ప్రోగ్రామ్ ద్వారా పాత ఫోన్ అమ్మి కొత్త ఫోన్‌ను కొనుగోలు లేదా ఇతర కొత్త ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది. వాలంటైన్స్ డే సందర్భంగా సేల్ బ్యాక్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ యంత్ర అనే రీకామర్స్ సంస్థను కొనుగోలు చేసింది.ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఆ సంస్థ సాయంతో యూజర్లనుంచి పాత ఫోన్లను కలెక్ట్ చేస్తుంది. ఇందులో యూజర్లు చేయాల్సిందల్లా ఒక్కటే పాత ఫోన్ అమ్మాలనుకుంటే యంత్ర వెబ్ సైట్లోకి వెళ్లి ఫోన్లకు సంబంధించిన పలు ప్రశ్నలు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాధానాల అనంతరం 48గంటల్లో ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంటికే వచ్చి ఫోన్‌ను కలెక్ట్ చేసుకుంటారు. ఫోన్‌ను ఎగ్జిక్యూటివ్ రిసీవ్ చేసుకున్న తర్వాత కస్టమర్‌కు ఫ్లిప్‌కార్ట్ ఈవోచర్ను పంపిస్తుంది. ఆ ఈవోచర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఫోన్ తీసుకోవచ్చు. లేదా ఇతర ప్రొడక్ట్స్ ఏవైనా కొనుగోలు చేయొచ్చు. దేశవ్యాప్తంగా 1700 పిన్‌కోడ్స్ ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేయనుంది. ప్రస్తుతానికి స్మార్ట్ఫోన్లను ఏ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ అయినా సరే.. దేశంలో ఎక్కడున్నా సరే.. తమ ఫోన్‌ను అమ్ముకునే చాన్స్‌ను ఫ్లిప్‌కార్ట్ లో అమ్మే అవకాశం కల్పిస్తుంది. త్వరలోనే ఇతర వస్తువులను కూడా కస్టమర్లు అమ్ముకునే సౌకర్యాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పించనుంది. -
2021 భారత్‌లో నిలిచిన బెస్ట్ యాప్స్ ఇవే..!
Google Best Android Apps, Games of 2021 in India: స్మార్ట్‌ఫోన్..! ఏ ముహుర్తాన వచ్చిందో కానీ...అది లేకుండా బతకలేకపోయే రోజులు వచ్చాయి. లేవడంతోనే వాట్సాప్, ఫేస్బుక్, జీ మెయిల్ ఇలా రకరకాల యాప్స్‌కు వచ్చే నోటిఫికేషన్స్‌ను చూసుకోవడం మన దినచర్యగా మారిపోయింది. మనకు ఉపయోగపడే యాప్స్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకుంటూ వాటి సేవలను పొందుతాం. మనం వాడుతున్న యాప్స్‌లో బెస్ట్ యాప్ ఏదంటే చెప్పడం కాస్త కష్టం. కాగా ప్రతి ఏడాది అత్యంత ఆదరణను పొందిన యాప్స్ లిస్ట్‌ను గూగుల్ ప్లే స్టోర్ రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా ఆయా కేటగిరీలో బెస్ట్ యాప్స్‌గా నిలిచిన వాటికి అవార్డులను కూడా అందజేస్తుంది. 2021గాను ఇండియాలో బెస్ట్ యాప్స్ లిస్ట్‌ను గూగుల్ ప్లే స్టోర్ రిలీజ్ చేసింది. 2021గాను భారత్‌లో బెస్ట్ యాప్‌గా ‘బిట్‌క్లాస్’ నిలిచిందని గూగుల్ ప్రకటించింది. బెస్ట్ గేమ్ కేటగిరీలో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ అంతేకాకుండా గేమ్స్, ఫన్, వ్యక్తిగత వృద్ధి, రోజువారి అవసరాలను తీర్చే కేటగిరీలో బెస్ట్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ ప్రకటించింది. వినోదాన్ని పంచే బెస్ట్ యాప్స్ ఫ్రంట్‌రో క్లబ్‌హౌస్: సోషల్ ఆడియో యాప్ హాట్స్టెప్ రోజువారి అవసరాలకోసం వాడే బెస్ట్ యాప్స్ సోర్టిజీ - వంటకాలు, మీల్ ప్లానర్ & కిరాణా జాబితాలు అందిస్తోంది. సర్వ - యోగా & ధ్యానం ట్రూకాలర్ పర్సనల్గ్రోత్ ఉత్తమ యాప్‌లు బిట్‌క్లాస్ (Bitclass) ఎంబైబ్: లెర్నింగ్ అవుట్‌కమ్స్ యాప్ ఏవాల్వ్: ధ్యానాలు, స్వీయ సంరక్షణ & బ్రీతింగ్ థెరపీ యాప్ బెస్ట్ కాంపిటిటీవ్ గేమింగ్ యాప్స్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సమ్మనర్స్ వార్: లాస్ట్ సెంచూరియా మార్వెల్ ఫ్యూచర్ రివల్యూషన్ పోకీమాన్ యునైట్ సస్పెక్ట్: మిస్టరీ మాన్షన్ చదవండి: సగం మైక్రోసాఫ్ట్ షేర్లు అమ్మేసుకున్న సత్య నాదెళ్ల, కారణం ఏంటంటే.. -
ఈ ఫీచర్‌తో మీ ఫోన్లో డేటా ఎవరి చేతుల్లోకి వెళుతుందో తెలుసుకోవచ్చు
స్మార్ట్ ఫోన్.. కొందరికి అవసరం.. మరికొందరి వ్యసనం. ఆ వ్యసనాన్ని క్యాష్ చేసుకునేందుకు యాప్స్ వెలుగులోకి వస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని యాప్స్ యూజర్ల అవసరాల్ని తీర్చేలా ఉన్నా..మరికొన్ని మాత్రం అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదార్లు తొక్కుతున్నాయి. వివిధ మార్గాల ద్వారా యూజర్ల ఫోన్లలో చొరబడుతున్నాయి. ఫ్రీగిఫ్ట్‌లు, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ పేరుతో యూజర్ల ఆశలకు గాలం వేస్తున్నాయి. దీంతో టెక్నాలజీపై అవగాహన లేని యూజర్లు యాప్స్ వలలో చిక్కుకుంటున్నారు. వ్యక్తిగత వివరాల్ని అందిస్తున్నారు. ఆ వివరాల్ని ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నాయి..అలాంటి డేంజర్ యాప్స్‌కు చెక్ పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సూపర్ ఫీచర్‌ను వెలుగులోకి తెచ్చింది. ప్రస్తుతం ఆ ఫీచర్ బీటా వెర్షన్లో ఉండగా.. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. 96శాతం యాక్యురేట్ రిజల్ట్ సెర్చ్ ఇంజిన్ "డక్ డక్ గో" త్వరలో ఫీచర్‌ను విడుదల చేయనుంది. ' యాప్ ట్రాకింగ్ ప్రొటెక్షన్ ఫర్ ఆండ్రాయిడ్' పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ మీ స్మార్ట్ ఫోన్లో మీకు తెలియకుండా ఏమైనా యాప్స్, సోషల్ మీడియా నెట్ వర్క్‌లు ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర్ సెర్చ్ ఇంజిన్ సంస్థలు ఏం చేస్తున్నాయో ఇట్టే కనిపెట్టేస్తుంది. మీ ఫోన్లో ఆ యాప్స్‌ను వినియోగించకపోయినా నిరంతరం ట్రాక్ చేస్తుంది. ఇటీవల డక్ డక్ గో' కొన్ని యాప్స్‌ను ట్రాకింగ్ చేసింది. ట్రాకింగ్‌లో థర్డ్ యాప్స్ నిర్వాహకులు 87 శాతం డేటాను గూగుల్‌కి , 68శాతం డేటా ఫేస్‌బుక్‌కు పంపించినట్లు గుర్తించింది. యాపిల్ సైతం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ యాప్స్ మన డేటా కలెక్ట్ చేస్తున్నాయా? లేదా అనే విషయాల్ని వెలుగులోకి తెచ్చేందుకు ఎలాంటి యాప్స్ అందుబాటులోకి రాలేదు. అదే సమయంలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు సంబంధించిన గాడ్జెట్స్‌ను థర్డ్ పార్టీ యాప్స్ ట్రాక్ చేయొచ్చా' అనే అంశంపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్లు ఒప్పుకుంటేనే థర్డ్ పార్టీ యాప్స్ ట్రాక్ చేస్తాయి. అయితే యాపిల్ ఫీచర్‌పై యూజర్లు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది థర్డ్ పార్టీ యాప్స్ వద్దు' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. చదవండి: పాపం జుకర్ బెర్గ్: వేల కోట్ల నష్టం..పేరు మార్చినా..! జాతకం మారలేదు..! -
ఇంటర్ నెట్‌తో పనిలేదు..వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్, డెస్క్‌టాప్‌లో ఇకపై..
వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్. త్వరలో ఆండ్రాయిడ్, ఐఫోన్లతో పనిలేకుండా డెస్క్‌టాప్‌లలో ఈజీగా వాట్సాప్ వెబ్ లాగిన్ అవ్వొచ్చు. ఈ మల్టీ డివైజ్ ఫీచర్ ఆప్షన్ బీటా వెర్షన్లో ఉండగా, త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఆన్‌లైన్‌తో పనిలేదు వాట్సాప్ వెబ్ లాగిన్ అవ్వాలంటే వాట్సాప్ ఆఫ్‌లైన్‌లో ఉంటే సరిపోతుంది. ఆన్లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ సదుపాయం వినియోగించుకోవాలంటే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే మీ పీసీని లాగౌట్ చేసే వరకు వాట్సాప్ వెబ్‌ను వినియోగించుకోవచ్చు.ఈ ఫీచర్ విండోస్ 10, విండోస్ 11,మాక్ ఓఎస్‌లలో వాట్సాప్ వెబ్ మెరుగ్గా పనిచేయనుందని వాట్సాప్ తెలిపింది. బీటా వెర్షన్ అందుబాటులో ఉంది ప్రస్తుతం వాట్సాప్ వెబ్‌పై వర్క్ చేస్తుండగా..పర్సనల్ కంప్యూటర్లలో క్యూఆర్‌కోడ్ స్కాన్ చేస్తే డెరెక్ట్‌గా వాట్సాప్ వెబ్ ఓపెన్ అవుతుంది. అలా మన పీసీలో ఒక్కసారి వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయిన తర్వాత మీరు లాగౌట్ చేయకపోతే 14 రోజుల పాటు అలాగే ఉంటుంది. 14రోజుల తరువాత క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. కాగా, గతంలో వాట్సాప్ మల్టీడివైజ్ ఆప్షన్ బీటావెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను వినియోగించుకోవాలంటే ముందుగా వినియోగదారులు బీటాను సెలక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. డైరెక్ట్‌గా ఫోన్, ల్యాప్‌ట్యాప్ ఇలా నాలుగు రకాల డివైజ్‌లలో ఒకే సారి వాట్సాప్‌ను వినియోగించుకోవచ్చు. చదవండి: 'జియో' కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్..! -
అలెర్ట్: మీరు ఆ ఫోన్లు వాడుతుంటే ఇకపై వాట్సాప్ పనిచేయదు
త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి ఆపిల్ ఫోన్ల వరకు వాట్సాప్ పనిచేయడం ఆగిపోనుంది. ముఖ్యంగా నవంబర్ 1నుంచి ఆయా టెక్ సంస్థలు తయారు చేసిన 43 స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు. సుమారు 2బిలియన్లకు పైగా వినియోగదారులున్న వాట్సాప్ కొత్త కొత్త మార్పులు చేస్తుంది. ఫీచర్లను యాడ్ చేస్తుంది. అయితే వాట్సాప్ తెస్తున్న కొత్త అప్డేట్ లకు స్మార్ట్ ఫోన్లు సపోర్ట్ చేయడం లేదు. ఆ ఫోన్లలో వాట్సాప్ వినియోగం, లేదంటే వాట్సాప్ ఫీచర్లు పనిచేయాలంటే భారీ ఖర్చు చేయాల్సి ఉంది. అందుకే సపోర్ట్ చేయని ఫోన్లలో యాప్ సేవల్ని నిలిపివేసేందుకు వాట్సాప్ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ OS 4.1..దానికంటే పై వెర్షన్, అలాగే iOS 10 అంతకంటే పెద్ద వెర్షన్ స్మార్ట్‌ఫోన్ ఉన్న వారు మాత్రమే వాట్సాప్‌ను ఉపయోగించడం సాధ్యం అవుతుంది. ఇక వాట్సాప్ పని చేయని ఫోన్ల జాబితాలో మీ ఫోన్లు ఉన్నాయేమో చెక్ చేసుకోవడం మంచిది. ఐ ఫోన్: ఐఫోన్ 6 ఎస్ ఐఫోన్ 6 ఎస్ ప్లస్ ఆపిల్ ఐ ఫోన్ ఎస్ఈ హువావే ఎస్సేండ్ G740 ఎస్సేండ్ D క్వాడ్ XL ఎస్సేండ్ మాటే ఎస్సేండ్ P1 S ఎస్సేండ్ D2 ఎస్సేండ్ D1 క్వాడ్ XL. శామ్ సంగ్: శామ్సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్ గెలాక్సీ SII గెలాక్సీ ట్రెండ్ II గెలాక్సీ ఎస్ 3 మినీ గెలాక్సీ కోర్ గెలాక్సీ Xcover 2 గెలాక్సీ ఏస్ 2 ఎల్జీ.. ఎల్జీ లూసిడ్ 2 ఆప్టిమస్ L5 డ్యూయల్ ఆప్టిమస్ L4 II డ్యూయల్ ఆప్టిమస్ F3Q ఆప్టిమస్ F7 ఆప్టిమస్ F5 ఆప్టిమస్ L3 II డ్యూయల్ ఆప్టిమస్ F5 ఆప్టిమస్ L5 ఆప్టిమస్ L5 II ఆప్టిమస్ L3 II ఆప్టిమస్ L7 ఆప్టిమస్ L7 II డ్యూయల్ ఆప్టిమస్ L7 II ఆప్టిమస్ F6 ఆప్టిమస్ F3 ఆప్టిమస్ L4 II ఆప్టిమస్ L2 II ఆప్టిమస్ నైట్రో హెచ్డీ,4X హెచ్డీ జెడ్డీటీ జెడ్‌టీఈ గ్రాండ్ S ఫ్లెక్స్ గ్రాండ్ X క్వాడ్ V987 జెడ్‌టీఈ V956 గ్రాండ్ మెమో -
జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి
కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపిన గణాంకాల ప్రకారం..కోవిడ్-19 వల్ల 600 శాతం సైబర్ క్రైమ్ పెరిగినట్లు తెలిపింది. ముఖ్యంగా కంప్యూటర్ వైరస్, ట్రోజన్స్, స్పైవేర్, రాన్సమ్ వేర్, యాడ్వేర్, వార్మ్స్, ఫైల్ లెస్ మాల్వేర్ల సాయంతో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా హైబ్రిడ్ దాడులకు పాల్పడేందుకు ప్రత్యేకంగా మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. అందులోనూ మనం తరుచూ వినియోగించే స్మార్ట్ ఫోన్లపై వైరస్ దాడులు పెరిగిపోతున్నట్లు హెచ్చరించింది. వైరస్ దాడుల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి? సైబర్ నేరస్తులు స్మార్ట్ ఫోన్లు, లేదంటే ఐఫోన్లపై ప్రత్యేకంగా తయారు చేసిన వైరస్‌లను మెయిల్స్ సాయంతో లేదంటే ఆఫర్లు ఇస్తామంటూ పాప్ ఆప్ యాడ్స్‌ను ఫోన్‌కి సెండ్ చేస్తుంటారు. ఆ సమయంలో ఫోన్ వినియోగదారులు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఏదైనా యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే ముందే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మంచిదా? లేదంటే దాడులకు పాల్పడే అవకాశం ఉందా అని తెలుసుకోవాలి. అందుకోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకునే సమయంలో సంబంధిత యాప్ వివరాలు, రివ్యూలు చెక్ చేయాలి. వైరస్ దాడి చేసినట్లు ఎలా గుర్తించాలి? ♦మీ స్మార్ట్‌ఫోన్‌లో వైరస్‌లను గుర్తించే సులభమైన మార్గం ఇదే. మీరు ఒకవేళ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే..వెంటనే కట్ అవ్వడం, మీ స్మార్ట్‌ఫోన్‌కు గుర్తు తెలియని టెక్స్ట్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ రావడం, మీ అనుమతి లేకుండా యాప్స్‌ను కొనుగోలు చేయడం. ♦ కంటిన్యూగా మీ ఫోన్ కు యాడ్స్ వస్తున్నా యాడ్ వేర్ మీ ఫోన్‌ను అటాక్ చేసినట్లు గుర్తించాలి. ♦ మాల్వేర్, ట్రోజన్ మీ స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగించి స్పామ్ టెక్స్ట్ మెసేజ్‌లను మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి సెండ్ చేస్తుంటాయి. దీని అర్ధం మీ కాంటాక్ట్ ఫోల్డర్లోకి గుర్తు తెలియని వైరస్ దాడి చేసినట్లు గుర్తించాలి. ♦ మీ స్మార్ట్‌ఫోన్ పనితీరు బాగా తగ్గిపోతుంది. ♦వైరస్లు, మాల్వేర్లు మీ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త యాప్‌లను కూడా డౌన్లోడ్ చేస్తుంటాయి. ♦ ఈ యాప్‌లు, మెసేజ్‌ల వల్ల మీ డేటా అంతా అయిపోయింది. ♦ బ్యాటరీ లైఫ్ టైమ్ తగ్గిపోతుంటాయి. పై తరహా ఇబ్బందులు ఎదురవుతుంటే మీ ఫోన్లో వైరస్ దాడి చేసినట్లేనని గుర్తించాలి. ఒకవేళ అదే జరిగితే మీ ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా కాపీ చేసుకొని..వైరస్ తొలగించే ప్రయత్నం చేయండి. ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండండి. చదవండి: మార్కెట్లో మరో బడ్జెట్ ఫోన్, ఫీచర్లు మాత్రం అదుర్స్ -
మీ ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్ పోయిందా? ఇదిగో ఇలా చేయండి
ఎన్నైనా చెప్పండి.. కొత్త వస్తువు కొన్న రోజు క్లౌడ్9లో దర్జాగా సింహాసనం వేసుకొని కూర్చున్నట్లుగా ఉంటుంది. ఈ ప్రపంచానికి ఏ సమస్య లేనట్లుగా ఉంటుంది. ఎన్నైనా చెప్పండీ.. ప్రేమతో కొన్న వస్తువును పోగొట్టుకున్న రోజు.. సింహాసనం నుంచి ఎవరో పాతాళంలోకి తోసినట్లుగా ఉంటుంది. విధి విలన్‌గా మారి అదేపనిగా వికటాట్టహాసం చేస్తున్నట్లుగా ఉంటుంది. మరేం ఫరవాలేదు మిత్రమా.. పోయిన మీ గ్యాడ్జెట్స్ జాడ కనిపెట్టడానికి అదుగో.. అవి రెడీగా ఉన్నాయి, అవేమిటో తెలుసుకుందాం.. ‘ఎప్పుడూ ఇంత ఖరీదైన వస్తువు కొని ఎరగను. ఇప్పుడు యాపిల్ వాచ్ కొన్నాను. కొని వారం కూడా కాలేదు. పోగొట్టుకున్నాను. నా మతిమరుపుతో ఛస్తున్నాననుకో’ కిలోమీటరు పొడవునా నిట్టుర్చాడు రమేష్. ‘ఫైండ్ మై ఫీచర్ యూజ్ చేయలేదా?’ అని అడిగాడు సురేష్. కేవలం యాపిల్ వాచ్ మాత్రమే కాదు.. ఐఫోన్, ఐప్యాడ్, ఐప్యాడ్ టచ్.. యాపిల్ యూజర్లు తాము కోల్పోయిన డివైజ్, పర్సనల్ ఐటమ్స్ ను ‘ఫైండ్ మై’ యాప్‌తో కనుగొనవచ్చు.(చదవండి: ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. మొబైల్ కొంటె రూ.6000 క్యాష్‌బ్యాక్!) యాపిల్ పరికరం అయితే ఇలా చేయండి వ్యూ లొకేషన్ ప్లే ఏ సౌండ్ మార్క్ యాజ్ లాస్ట్ (లాస్ట్ మోడ్) రిమోట్ ఎరాజ్ నోటిఫై వెన్ ఫౌండ్ నోటిఫై వెన్ లెఫ్ట్ బిహైండ్ ఇక గూగుల్ దగ్గరకు వద్దాం.. యాపిల్ ఎయిర్‌ట్యాగ్ లాంటి డివైజ్ ట్రాకర్స్ గూగుల్‌లో లేనప్పటికీ ‘ఫైండ్ మై డివైజ్’ పోర్టల్ లేదా ‘ఫైండ్ మై డివైజ్’ యాప్‌తో మిస్ అయిన డివైజ్‌ల ‘లొకేషన్’ను ట్రాక్ చేయవచ్చు. రింగ్, రికవర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. ‘రింగ్’తో సైలెంట్లో ఉంటే రింగ్ చేయవచ్చు. ‘రికవర్’తో లాకింగ్ చేయవచ్చు. ‘ఫైండ్ మై డివైజ్’తో గూగుల్ ఎకౌంట్‌తో లింకైన పిక్సెల్ బడ్స్, ఇయర్ బడ్స్, వోఎస్ స్మార్ట్‌వాచ్‌లను కూడా ట్రాక్ చేయవచ్చు. పోయిన గ్యాడ్జెట్స్ ఆచూకీ తెలుసుకోవడానికి శాంసంగ్‌లో స్మార్ట్‌ట్యాగ్(బ్లూటూత్), స్మార్ట్‌ట్యాగ్ ప్లస్ (బ్లూటూత్ అండ్ ఆల్ట్రావైడ్బాండ్)లు ఉన్నాయి.(చదవండి: ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్) యాపిల్, గూగుల్, శాంసంగ్‌తో సంబంధం లేకుండా ఎన్నో కంపెనీలు ట్రాకింగ్ యాప్‌ల వ్యాపారంలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘టైల్’ ఈ యాప్‌లో సైజ్, సామర్థ్యాలను బట్టీ రకరకాల ట్రాకర్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదా: ప్రో-పవర్ఫుల్ ట్రాకర్, మెట్-వర్స్టైల్, స్లిమ్-థిన్ ట్రాకర్ దూరంలో ఉన్నాసరే, దగ్గర్లో ఉన్నా సరే, ‘ఫైండ్ యువర్ థింగ్స్-ఫైండ్ యువర్ ఫోన్’ అని పిలుపునిస్తుంది టైల్. యూజర్ ప్రైవసీ, సెక్యూరిటీలకు భంగం కలిగించమనీ, డాటాను మార్కెట్ అవసరాల కోసం ఉపయోగించమని చెబుతుంది టైల్. ‘పోగొట్టుకున్న చోటే వెదకాలి’ అంటారు. ‘ఎక్కడ పోగొట్టుకున్నానో నాకెలా తెలుస్తుంది!’ అనే ధర్మసందేహాన్ని తీర్చడానికి డిజిటల్ ప్రపంచంలో ఎన్నో ఫీచర్స్, యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిచయం చేసుకుంటే సరిపోతుంది. -
Google: ఆండ్రాయిడ్ 12 ఎప్పుడంటే..
Android 12 update: ఆండ్రాయిడ్ 12 అప్డేట్పై గూగుల్ కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. నవంబర్ రెండో వారంలోపు లేటెస్ట్ వెర్షన్‌ను యూజర్ల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈలోపే ఆండ్రాయిడ్ అప్డేట్(లేటెస్ట్)కు సంబంధించిన కోడ్‌ను ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లో అప్లోడ్ చేసింది. మరికొన్ని వారాల్లో రాబోతున్న గూగుల్ పిక్సెల్ ఫోన్లతో లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్డేట్ను అందించబోతోంది గూగుల్. ఆ తర్వాత శామ్సంగ్, వన్‌ప్లస్, ఒప్పో, రియల్మీ, టెన్కో, వివో, షియోమీ డివైజ్‌లకు ఇవ్వనుంది. పూర్తిస్థాయిలో ఆండ్రాయిడ్ సంబంధిత ఫోన్లకు 12-వెర్షన్ ఈ ఏడాది చివరిలోపు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ 12 బేటా వెర్షన్ ద్వారా(పిక్సెల్ డివైస్లతోనే) ఫీడ్‌బ్యాక్ తీసుకున్న గూగుల్.. ఆండ్రాయిడ్ 12 సోర్స్‌ను ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టు(AOSP)లో ఉంచేసింది. చదవండి: ఇంటర్నెట్తో ఇక చాలా కష్టం! ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో పాటు ప్రైవసీ డ్యాష్‌బోర్డ్, డైనమిక్ బిల్ట్ లాక్ స్క్రీన్, డైనమిక్ స్క్రీన్ లైటింగ్‌తో పాటు కెమెరా ఎఫెక్ట్స్, ఫొటోల ఎడిటింగ్ ఎఫెక్ట్ అనుభవాల్ని అందించబోతోంది నయా వెర్షన్. ఇక ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను అక్టోబర్ 27-28 తేదీల్లో జరగబోయే ఆండ్రాయిడ్ డేవ్ సమ్మిట్‌లో తెలియజేయనున్నారు. 2010 నుంచి ఆండ్రాయిడ్‌లో ఒక్కో వెర్షన్‌ను రిలీజ్ చేస్తూ వస్తున్న గూగుల్.. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో 11 వెర్షన్‌ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఐఫోన్లలో ఐవోఎస్ 15 వెర్షన్లు నడుస్తోంది. గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..! ఐతే బీ కేర్‌ఫుల్...! ఈ 26 యాప్స్ ఇవి చాలా డేంజర్.. చెక్ చేస్కోండి! -
సరికొత్త మోసం.. ఈ లింక్ అస్సలు క్లిక్ చేయకండి!
ఫ్లూబోట్ మాల్వేర్ మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారుల ఫోన్లకు సంక్రమిస్తుంది. ఇప్పుడు వినియోగదారుల పరికరాల్లోకి ప్రవేశించడానికి మాల్వేర్ ఒక కొత్త మార్గాన్ని కనుగొంది. ఒక నెల క్రితం భద్రతా సంస్థ ట్రెండ్ మైక్రో, న్యూజీలాండ్ కు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ) ప్రమాదకరమైన ఫ్లూబోట్ మాల్ వేర్ మరో కొత్త పద్దతిలో తిరిగి వచ్చినట్లు వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. మొబైల్ యూజర్లను ఆకర్షించడం కోసం పార్శిల్ పేరుతో ఓ టెక్ట్స్ మెసేజ్ వస్తోంది. యూజర్లు లింక్ పై క్లిక్ చేసిన తర్వాత వారికి మరో పెద్ద సందేశం వస్తుంది. మీ మొబైల్/కంప్యూటరుకి ప్రమాదకరమైన ఫ్లూబోట్ మాల్వేర్ సోకినట్లు ఒక హెచ్చరిక చేస్తుంది. వాస్తవానికి, ఇది గూగుల్ క్రోమ్ ప్రమాదకరమైన సేఫ్ బ్రౌజింగ్ సందేశాన్ని తెలిపే రెడ్ హెచ్చరిక స్క్రీన్'తో పోలి ఉంటుంది. "ఫ్లూబోట్ మాల్వేర్ తొలగించడం కోసం ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ ఇన్ స్టాల్ చేయండి" అని సందేశం రూపంలో ఇక్కడ క్లిక్ చేయండి చూపిస్తుంది. ఫ్లూబోట్ మాల్ వేర్ మాల్వేర్ తొలగించడం కోసం నిజమైన సెక్యూరిటీ అప్డేట్ చేయడానికి బదులుగా వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లో ఫ్లూబోట్ వైరస్ డౌన్ లోడ్ చేస్తారు. సెక్యూరిటీ అప్ డేట్ పేరుతో మీ మొబైల్స్ లో ప్రవేశించిన తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, యాప్ ఆధారిత బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్, ఈ-మెయిల్, ట్విట్టర్ ఈ డేటా మొత్తాన్ని మాల్వేర్ ప్రయోగించిన సైబర్ నేరగాడికి ఫ్లూబోట్ అందిస్తుంది. అలాగే, మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ ద్వారా ఇతర వ్యక్తులకు పంపుతుంది. (చదవండి: డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు డౌన్లోడ్ చేశారా..?) We’ve broken down some details on the FluBot text scam currently infecting Android phones. Please share this with your friends and family and help us stop the spread. https://t.co/zoz8G9o8i0 — CERT NZ (@CERTNZ) October 1, 2021 ఫ్లూబాట్ నుంచి రక్షణ ఇలా.. ఇంతటి ఇబ్బందికరమైన ఫ్లూబాట్ మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడం కోసం మీ స్క్రీన్ పై వచ్చే పాప్ అప్ క్లిక్ చేయవద్దు. ఏ ఇతర లింక్స్ ద్వారా వచ్చే యాప్‌లు సురక్షితం కావు. తెలిసిన వ్యక్తే కదా పంపించాడు అనుకుని ఎప్పుడూ లింక్స్ ఓపెన్ చేయకూడదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున డౌన్లోడ్ చేసి ఉంటే వెంటనే మొబైల్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది. -
వివాదాస్పదంగా గూగుల్ భారీ డీల్
ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్ పోటీలో నిలబడేందుకు గూగుల్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో థర్డ్ పార్టీ యాప్‌లకు చోటు లేకుండా చేయడం.. తద్వారా ఫోన్ కంపెనీలకు భారీగా ముట్టజెప్పడం చేస్తూ వస్తోంది. తాజాగా మరోసారి కాంట్రాక్ట్ చేయాలనుకునే ప్రయత్నం మరింత వివాదానికి దారితీసింది. 2019లో గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్‌ను లాంఛ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ప్రకారం.. స్మార్ట్ ఫోన్ తయారీదారులు గనుక థర్డ్ పార్టీ యాప్ స్టోర్లను అనుమతించనట్లయితే(ప్రీ ఇన్స్టాల్ టైంలో వేరే ప్లేస్టోర్లకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం).. వల్ల గూగుల్ ఆ కంపెనీలకు కొంత రెవెన్యూను అందజేస్తుంది. ఈ ప్రోగ్రాంతోనే ప్లేస్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ డివైజ్‌లలో ఓ వెలుగు వెలుగుతోంది గూగుల్. అయితే తాజాగా ఆ డీల్‌ను మరోసారి తెర మీదకు తెచ్చింది. చదవండి:గూగుల్ ఫొటోస్.. ఇది తెలుసుకోండి ఈసారి థర్డ్ పార్టీ యాప్ స్టోర్లతో పాటు, ఏపీకే ఇన్స్టాల్స్ యాప్స్‌ను సైతం ఇన్స్టాల్ చేయకూడదని కండిషన్స్ పెట్టింది గూగుల్. అప్పుడు కేవలం ఫోన్ల మార్కెట్‌ప్లేస్‌లో గూగుల్‌ప్లేస్టోర్ మాత్రమే కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఎపిక్ గేమ్స్‌తో గూగుల్‌కు వివాదం మొదలైంది. సీక్రెట్‌గా ఫోన్ కంపెనీలతో గూగుల్ చేసుకుంటున్న ఒప్పందం నైతిక విలువలకు విరుద్ధమని కోర్టుకు ఎక్కింది ఎపిక్ గేమ్స్. ఇక గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా మొత్తం రెవెన్యూ నుంచి 12 శాతం వాటా తీసుకుంటాయి కంపెనీలు. ఇది ఆల్రెడీ అందుకుంటున్న 8 శాతం ఆదాయం కంటే అదనం. original equipment manufacturer (OEM)లో భాగంగా.. ఒప్పో, వీవో, వన్‌ఫ్లస్ 70 శాతం, సోనీ, జియోమీ 50, 40 శాతం గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్ భాగం అయ్యాయి. -
బీజీఎంఐ నుంచి మరో అప్డేట్, హింట్ ఇచ్చేసిందిగా..!
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(BGMI) ఐఓఎస్ వెర్షన్లను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ గేమ్ డిజైన్ సంస్థ క్రాఫ్టన్ హింట్ ఇచ్చింది.కరోనా కారణంగా ఇంటికే పరిమితం కావడం, ఆన్ లైన్ క్లాసుల కారణంగా గాడ్జెట్స్‌ల వినియోగం పెరగడంతో బీజీఎంఐ గేమ్ ఆడేవారి సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఆ యూజర్ల సంఖ్యను మరింత పెంచేందుకు ఐఓఎస్ వెర్షన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు బీజీఎంఐ డిజైన్ సంస్థ క్రాఫ్టన్ ప్రటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 2న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా విడుదలైన వారం వ్యవధిలోనే ఈ గేమ్‌ను 30 మిలియన్ల మంది గేమింగ్ లవర్స్ డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు వారి సంఖ్య 48మిలియన్ల డౌన్లోడ్లను దాటగా..49, 50 మిలియన్ల డౌన్ లోడ్సే టార్గెట్‌గా ఐఓఎస్ వెర్షన్‌ను ఆగస్ట్ 20న విడుదల చేసేలా హింట్ ఇచ్చినట్లు ఇన్సైడర్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఉన్న ఈ గేమ్ ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులోకి తీసుకొని రావడంతో పాటు యూజర్లకు ప్రత్యేకంగా రివార్డ్‌లను ప్రకటించింది. క్రాఫ్టన్ నిర్వహించనున్న ఈవెంట్లో ఆండ్రాయిడ్ యూజర్లు పాల్గొని ఈ రివార్డ్‌లను సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.48 మిలియన్ల డౌన్లోడ్లకు చేరుకున్న తర్వాత క్రాఫ్టన్ సప్లై కూపన్ క్రేట్ స్క్రాప్ ఎక్స్3, 49 మిలియన్ డౌన్లోడ్లతో క్లాసిక్ కూపన్ క్రేట్ స్క్రాప్ ఎక్స్3 రివార్డ్, 50 మిలియన్ డౌన్లోడ్లను చేరుకున్న తర్వాత క్రాఫ్టన్ పర్మినెంట్ గెలాక్సీ మెసెంజర్ సెట్ ఎక్స్ 1 రివార్డ్ ను అందించనుంది. ఈ రివార్డులు ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులో ఉండనున్నాయి. -
ఈ రియల్మీ బడ్జెట్ ఫోన్ వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే
మీరు రియల్ మీ సీ3 స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.ఈ ఫోన్‌కు లేటెస్ట్గా ఆండ్రాయిడ్ 11 స్టేబుల్ వెర్షన్ విడుదలైంది.చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్ మీ సీ3ని 2020 ఫిబ్రవరి 14న విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన సీ2 కి హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో సీ3ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించి బీటా వెర్షన్ జులైలో విడుదల చేసినా లేటెస్ట్గా ఆ ఫోన్ స్టేబుల్ వెర్షన్‌ను రియల్ మీ ప్రతినిధులు విడుదల చేశారు.ఈ అప్డేట్ ద్వారా ఫోన్లో టెక్నికల్ సమస్యలతో పాటు కేటగిరి, సిస్టమ్, ఈజీ మొబైల్ ఇంటర్ ఫేస్ ఆప్టిమైజేషన్,సెక్యూరిటీ ప్రైవసీ, గేమ్స్ ఇలా ఒక్కటేమిటీ రియల్ సీ3 వెర్షన్ పూర్తిగా మారిపోతుంది. రియల్మీ సీ3 స్పెసిఫికేషన్లు రియల్ మీ సీ3 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే, 89.8 పర్సెంట్ తో స్క్రీన్ టు బాడీ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో అందుబాటులోకి రాగా మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్.. ఆండ్రాయిడ్ 10 రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనక భాగంలో 12 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. దీంతో పాటు హెచ్ డీఆర్, నైట్ స్కేప్, క్రోమా బూస్ట్, స్లో మో, పొర్ ట్రెయిట్ మోడ్ ఫీచర్ తో పాటు హెచ్ డీఆర్, ఏఐ బ్యూటిఫికేషన్, పనోరమిక్ వ్యూ, టైమ్ ల్యాప్స్ ఫీచర్లు ఉన్న 5 మెగా పిక్సెల్ సెల్ఫీల కెమెరా సౌకర్యం ఉంది. -
ప్రపంచ జనాభాను మించి... యూట్యూబ్ వరల్డ్ రికార్డ్ !
ప్రపంచంలో అత్యధికమంది డౌన్లోడ్ చేసుకున్న యాప్‌గా యూట్యూబ్ రికార్డు సృష్టించింది. టెక్నాలజీ ప్రపంచంలో మిగిలిన యాప్‌లను వెనక్కి నెట్టి ఇప్పుడప్పుడే ఎవ్వరీ అందనంత ఎత్తులో నిల్చుంది. 1000 కోట్లు ప్రస్తుతం ప్రపంచ జనాభా 790 కోట్లు, అయితే ఇప్పటి వరకు యూ ట్యూబ్ ఏకంగా వెయ్యి కోట్లసార్లు డౌన్లోడ్ అయ్యింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ప్లే స్టోర్‌లో ప్రస్తుతానికి 20.89 లక్షల యాప్‌లు ఉన్నాయి. వీటన్నింటీని వెనక్కి నెట్టి ప్రథమ స్థానంలో యూట్యూబ్ నిలిచింది. ఈ ఏడాది ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌పై కొత్తగా 300 కోట్ల యాక్టివేషన్లు వచ్చాయి. దీంతో యూట్యూబ్ వరల్డ్ రికార్డు సాధించగలిగింది. ఏకంగా ప్రపంచ జనాభాను మించి యూట్యూబ్ యాప్ వెయ్యి కోట్ల సార్లు డౌన్లోడ్ అయ్యింది. తర్వాత స్థానం ప్లే స్టోర్‌కి సంబంధించి యూట్యూబ్ తర్వాత స్థానంలో 700 కోట్ల డౌన్లోడ్లలతో ఫేస్బుక్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వాట్సప్ 600 కోట్లు, ఫేస్బుక్ మెసేంజర్ 500 కోట్లు, ఇన్స్టాగ్రామ్ 300 కోట్ల సార్లు ఆండ్రాయిడ్ యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. టిక్‌టాక్ సైతం ఇక సంచలనాలకు కేంద్ర బిందువైన టిక్‌టాక్ 200 కోట్లు, సబ్వే సర్ఫర్ వంద కోట్లకు పైగా డౌన్లోడ్లు సాధించాయి. ఫేస్బుక్ లైట్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ యాప్‌లు రెండు వందల కోట్ల దగ్గరగా డౌన్లోడ్ అయ్యాయి. -
జోకర్‌తో నవ్వాలనుకుంటే అది ఏడిపిస్తోంది
'పెగసెస్' ప్రకంపనలు ప్రపంచదేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మంటలు చల్లారక ముందే ఇప్పుడు 'జోకర్' మాల్వేర్ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జోకర్ ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన మాల్వేర్. మనకు తెలిసిన జోకర్ నవ్విస్తే..ఈ జోకర్ మాత్రం ఫోన్లలో చొరబడి ఏడిపిస్తుంది. 2017లో తొలిసారిగా గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఇదే మాల్వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీని దెబ్బకు ఇటీవల కాలంలో ప్లేస్టోర్ నుంచి 1800యాప్ లను గూగుల్ తొలగించింది. ఈ ఏడాది జూన్ నెలలో జోకర్ దెబ్బకు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. మాల్వేర్ దాడి జరిగిందనే అనుమానంతో పది యాప్ లను తొలగించారు. తాజాగా ఈ మాల్వేర్ కెమెరా, ఫొటో, ట్రాన్సలేషన్ యాప్స్, ఎడిటింగ్ తో పాటు ప్రాసెసింగ్, మెసెంజర్, గేమింగ్ యాప్ లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నట్లు తేలింది. వాటి సాయంతో ఒకరి ఫోన్లోనుంచి మరొకరి ఫోన్లలోకి ప్రవేశిస్తోందని తేలింది. దీని ప్రభావం ఒక్క గూగుల్ ప్లేస్టోర్ లోనే కాకుండా ఇతర థర్డ్ పార్టీ యాప్ లపై దాడి చేస్తున్నట్లు ఇంక్రీన్స్ సీఈఓ నయ్యర్ తెలిపారు. డాక్టర్ వెబర్ వివరాల ప్రకారం... తొలిసారి ఈ మాల్వేర్ను ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే కు చెందిన యాప్ గ్యాలరీలో గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ యాప్ గ్యాలరీ సాయంతో ప్రమాదకరమైన మాల్వేర్ ను పంపిస్తుంది. ఇలా సుమారు 538,000 మంది వినియోగదారుల ఫోన్లలోకి చొరబడినట్లు సమాచారం. చదవండి: భారత్ ఎకానమీ చెక్కు చెదర్లేదు -
తల్లిదండ్రులారా జాగ్రత్త, మీ పిల్లల ఫోన్లపై కన్నేయండి
రవి (పేరు మార్చం) కాలేజీ విద్యార్ధి. క్లాస్‌లో ఫస్ట్. ఇలాంటి విద్యార్ధి సడన్ గా కాలేజీకి వెళ్లకుండా, చదువులో వెనకబడిపోయాడు. తల్లిదండ్రుల్ని కేర్ చేయడం లేదు. దురలవాట్లకు అలవాటు పడ్డాడు. 24 గంటలు ఫోన్లోనే గడిపేవాడు. దీంతో కొడుకు రవి భవిష్యత్‌పై తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తన స్నేహితుల్ని, కాలేజీలో ఆరా తీశారు. కానీ కొడుకు గురించి ఎవరు నెగిటీవ్‌గా చెప్పలేదు. పైగా మంచోడు. బాగా చదువుతాడంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. అప్పుడే తల్లిదండ్రులకు కొడుకు రవి ఫోన్‌ను చెక్ చేసేందుకు ప్రయత్నించారు. ఓ రోజు మరిచిపోయి రవి తన ఆండ్రాఫోన్ను ఇంట్లో పెట్టి వెళ్లగా అతని ఫోన్‌ను చెక్ చేసేందుకు ప్రయత్నించారు. ఫోన్ లాక్ ఉండడంతో తనకు తెలిసిన స్నేహితుడి ద్వారా ఆ ఫోన్ లాక్ ఓపెన్ చేయించాడు రవి తండ్రి. ఫోన్లాక్ తో రవి ఇలా తయారవ్వడానికి కారణం ప్రేమేనని తేలింది. కొడుకు ప్రేమించిన అమ్మాయికి పెళ్లైపోయిందని, అది తట్టుకోలేక రవి మనోవేధనకు గురైనట్లు అతని తల్లిదండ్రులు గుర్తించారు. అనంతరం కొడుక్కి కౌన్సెలింగ్ ఇప్పించి మామూలు మనిషిని చేశారు. ఇలాంటి ఘటనలు ఒక్క రవి ఇంట్లోనే కాదు..అందరి ఇళ్లల్లో సాధారణం. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వినియోగించే టీనేజర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఫోన్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ, వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని అంటున్నారు. అయితే ఇప్పుడు మనం..లాక్ ఉన్నా పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు వాళ్ల ఫోన్ లో ఉన్న డేటాను చూడొచ్చు. అన్నీ ఆండ్రాయిడ్ ఫోన్లకు లాక్ అంటే పాస్వర్డ్, ప్యాట్రాన్ ను ఉపయోగిస్తూ ఉంటారు. ఫోన్లో ఉండే అప్లికేషన్లకు కూడా లాక్ వేస్తారు. ముఖ్యంగా గ్యాలరీలోని ఫోటోలకు. ఇలా ఉండే వారి ఫోన్లో ఫోటోలు, ఇతర డేటాను మనం చూడొచ్చు. దీనికి ఒక చిట్కా ఉంది.ప్రతి ఆండ్రాయిడ్ ఫోనలలో క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది. కాబట్టి గ్యాలరీ లాక్ ఉన్న ఫోన్ లో క్రోమ్ ఓపెన్ చేసి,URL స్థానం లో file:///sdcard/ అని టైపు చేస్తే సరి. ఆ సంబంధిత ఫోన్లో ఉన్న ఎస్డీ లోని ఫోటోలన్నీ బ్రౌజర్ ద్వారా చూసేయొచ్చు. ఇందులో డీసీఐఎంను ఓపెన్ చేయోచ్చు. చదవండి : Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? గుర్తించండిలా?! -
భలే ఫీచర్స్.. ట్రూకాలర్‌లో ఒకేసారి 8 మందితో కాన్ఫరెన్స్ కాల్
సాక్షివెబ్‌డెస్క్: ప్రముఖ యాప్ ట్రూలర్ కాలర్ వినియోగదారులకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా అప్ డేట్ చేసిన ఫీచర్లతో ఒకే సారి 8మందితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడే అవకాశం లభించింది. దీంతో పాటు మరికొన్ని అప్ డేట్ గురించి తెలుసుకుందాం. వాయిస్ కాల్స్ ట్రూ కాలర్ వినియోగదారులు అంతర్జాతీయ స్థాయిలో ఒకేసారి ఎనిమిది మంది మాట్లాడే అవకాశం ఉంది. స్పామ్ వినియోగదారులను గుర్తిస్తుంది. గ్రూప్ కాల్ సభ్యులను కాంటాక్ట్ లో యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా మాట్లాడుకోవచ్చు. ఇతర వినియోగదారులను మరొక కాల్లో లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ పంపిస్తుంది. స్పామ్ ఎస్ఎంస్ స్పామ్ కాల్స్‌ను గుర్తించటన్లుగా స్పామ్ మెసేజ్ లను ఫిల్టర్ చేస్తుంది. ఇప్పటికే ఓటీపీలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, చెల్లింపు రిమైండర్లు మెసేజ్‌లను హైలైట్ చేస్తుండగా, తాజాగా ఈ ఫీచర్ ను అప్ డేట్ చేసి అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ వల్ల ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. స్మార్ట్ ఎస్ఎంఎస్ ప్రస్తుతం భారత్, కెన్యా, నైజీరియా, దక్షిణాఫ్రికాలో సౌలభ్యంగా ఉంది. ఇది త్వరలో యుఎస్, స్వీడన్, మలేషియా, ఇండోనేషియా, ఈజిప్ట్లకు విస్తరించబడుతుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇన్ బాక్స్ క్లియర్ ఓటీపీలు,స్పామ్ మెసేజెస్, ఓల్డ్ మెసేజ్ లను హైలెట్ చేస్తుంది. వాటి అవసరం లేదనుకుంటే ఒకే క్లిక్‌తో వాటిని తొలగించడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది. దీంతో మెసేజ్ ఫోల్డర్ లో ఓల్డ్ మేసేజ్ లు కాకుండా లేటెస్ట్ మెసేజ్ లు మనకు హైలెట్ అవుతాయి. -
Joker Malware Android: జోకర్ మళ్లొచ్చాడు.. తస్మాత్ జాగ్రత్త!
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు హెచ్చరిక. ఖతర్నాక్ మాల్వేర్ ‘జోకర్’ మళ్లీ వచ్చేశాడు. దేశంలో ఇప్పటికే ఏడు లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ జోకర్ మాల్వేర్తో లింకులు ఉన్న యాప్స్(సురక్షితం కానీ) ను డౌన్లోడ్ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని మహరాష్ట్ర పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు. ముంబై: జోకర్ మాల్వేర్.. మొదటిసారి 2017లో గూగుల్‌లో దర్శనమిచ్చాడు. ఇది చాలా ప్రమాదకరమైన మాల్వేర్ అని.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు మూడేళ్లపాటు శ్రమించామని పోయినేడాది గూగుల్ ప్రకటించుకుంది. కానీ, కిందటి ఏడాది జులైలో గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ జోకర్ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన గూగుల్.. కొన్ని అనుమానాస్పద యాప్‌ల్ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయినప్పటికీ జోకర్ భయం పూర్తిగా తొలగిపోలేదు. ఇక ఇప్పుడు జోకర్ మాల్వేర్ గురించి ఫిర్యాదులు తమ దృష్టికి రావడంతో మహారాష్ట్ర పోలీసులు దేశవ్యాప్తంగా ఒక అలర్ట్ జారీ చేయడం విశేషం. ఏం చేయాలంటే.. యాప్‌లకు(అవసరం లేనివాటికి) ఎస్సెమ్మెస్ యాక్సెస్ పర్మిషన్ను తొలగించాలి. అవసరం లేని సర్వీసులు, సబ్స్క్రిప్షన్ల నుంచి బయటకు వచ్చేయాలి. ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను, నెట్‌బ్యాంకింగ్ సమాచారాన్ని ఫోన్లో దాచిపెట్టుకోకపోవడం మంచిది. క్రెడిట్ కార్డు బిల్లులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం.. తెలియకుండా జరిగిన కొనుగోళ్లపై దృష్టి సారించడం. అనవసరమైన యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకోకపోవడం. రివ్యూల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే యాప్స్ అయినా సరే.. అనుమానంగా అనిపిస్తే తొలగించడం. యాంటీ వైరస్‌ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవడం. 2020లో 11 ‘జోకర్’ అనుమానిత యాప్స్‌ను ప్లే స్టోర్‌లో గుర్తించారు. ఈ ఏడాది ఆ సంఖ్య 22కి పైనే ఉంది. మొండి జోకర్ జోకర్ అనేది ఒక మొండి మాల్వేర్. యూజర్‌కు తెలియకుండానే రెప్పపాటులో డబ్బులు మాయం చేయడంలో దిట్ట. ఆండ్రాయిడ్ యూజర్‌పై యాడ్స్ రూపంలో ఈ మాల్వేర్ దాడి చేస్తుంది. మెసేజ్‌లు, ఓటీపీ, పాస్వర్డ్లు, పేమెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతుంది. ఒకవేళ ట్రాన్జాక్షన్ అయినట్లు యూజర్‌కు మెసేజ్ వచ్చినా.. అప్పటికే ఆలస్యం జరిగిపోయి ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి, యాడ్లను క్లిక్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. -
ఆండ్రాయిడ్ యూజర్స్‌కి శుభవార్త
గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్స్‌కి శుభవార్త తెలిపింది. గూగుల్ తన రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్(ఆర్సిఎస్) ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్‌లోని మెసేజెస్ యాప్‌లో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉందని తెలిపింది. రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్‌ను గూగుల్ మెసేజెస్ యాప్‌లో పాత తరం ఎస్సెమ్మెస్ స్థానంలో తీసుకొస్తున్నట్లు తెలిపింది. గూగుల్ తన మెసేజెస్ యాప్‌లో ఆర్సిఎస్ స్టాండర్డ్ తీసుకురావడం కోసం కొంతకాలంగా అభివృద్ధి చేస్తుంది. ఆర్సిఎస్ ద్వారా వినియోగదారులు మెరుగైన కమ్యూనికేషన్ అనుభూతిని పొందుతారని తెలిపింది. దీని ద్వారా గ్రూప్ ఛాట్‌తో పాటు, ఎమోజీలు, ఎక్కువ క్వాలిటీ కలిగిన ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ తరహాలోనే ఇందులో కూడా ఆన్లైన్ స్టేటస్, టైపింగ్, రీడ్ ఇండికేటర్స్ ఉంటాయి. (చదవండి: వచ్చే ఏడాది తొలి బడ్జెట్ 5జీ ఫోన్) దీనిలో వాట్సాప్‌లో లాగే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ తీసుకొస్తామని గూగుల్ ప్రకటించింది. దాని వల్ల ఇతరులెవరు మెసేజ్‌లను చదవలేరు. కేవలం మీరు, మీతో మాట్లాడే వ్యక్తి మాత్రమే వాటిని చదవగలరు. ప్రస్తుతం పరీక్షలో దశలో ఉన్న ఈ ఫీచర్‌ను 2021 ప్రథమార్ధంలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ తెలిపింది. కొన్నేళ్లుగా కొత్త ఫీచర్స్ లేకపోవడంతో ఎక్కువ మంది యూజర్స్ మెసేజింగ్ కోసం వాట్సాప్‌తో పాటు ఇతర యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. వాటికి దీటుగా ఈ ఆర్సీఎస్ సేవలను గూగుల్ తీసుకొచ్చింది. (చదవండి: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్) -
మళ్లీ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలోకి మైక్రోసాఫ్ట్
వాషింగ్టన్ : దాదాపు 4ఏళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలోకి తిరిగి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త డ్యూయల్ స్క్రీన్ ఆండ్రాయిడ్ డివైజ్ సర్ఫేస్ డ్యూయో కోసం కంపెనీ బుధవారం ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు 1,399 డాలర్లు ఉండొచ్చు. ఈ స్మార్‌ఫోన్ 5.6అంగుళాల డిప్లేను, 4.8 మిల్లిమీటర్ల మందాన్ని కలిగి ఉండొచ్చు. సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదల కావచ్చనే అంచనాలున్నాయి. స్మార్ట్ ఫోన్ అధిక ధరను కలిగి ఉన్నప్పటికీ.., వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. అయితే కరోనా ఎఫ్టెక్తో అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీ పతననాన్ని చవిచూడటం, నిరుద్యోగం రెండంకెల క్షీణత చూస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ స్మార్ట్ఫోన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టడం పట్ల మార్కెట్ వర్గాలు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. -
‘రిమూవ్ చైనా యాప్స్’కు
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ నుంచి చైనా గేమ్స్, ఇతర సాఫ్ట్‌వేర్‌ను తొలగించేందుకు ఉపయోగపడే దేశీ మొబైల్ యాప్ ’రిమూవ్ చైనా యాప్స్’కు గూగుల్ షాకిచ్చింది. తమ విధానాలకు విరుద్ధంగా ఉందంటూ ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. యూజర్లు తమ ఫోన్లలో ఇన్స్టాల్ అయిన చైనా యాప్స్‌ను ప్రధానంగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడేది. ఆయా యాప్స్‌ను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సూచించేది. భారత్‌తో సరిహద్దుల్లో చైనా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యాప్ ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనితో పాటు చైనాకు చెందిన టిక్–టాక్ యాప్‌నకు ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన భారతీయ యాప్ ’మిత్రో’ను కూడా గూగుల్ ఇటీవలే ఇదే కారణాలతో తొలగించింది. ఈ రెండు యాప్‌లను లక్షల సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. రిమూవ్ చైనా యాప్స్ యాప్‌ను వన్ టచ్ యాప్ల్యాబ్స్ రూపొందించింది. -
ప్లే స్టోర్‌లో టిక్‌టాక్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌కు ప్లే స్టోర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. కొత్త యాప్ మిట్రాన్ గుగూల్ ప్లేస్టోర్ రేటింగ్‌లో టిక్‌టాక్‌ను అధిగమించింది. ఇప్పటి వరకు గుగూల్ ప్లే స్టోర్ రేటింగ్‌లో టిక్‌టాక్, యూట్యూబ్‌లు మాత్రమే పోటీ పడేవి. తాజా నివేదిక ప్రకారం గుగూల్ రేటింగ్‌లో టిక్‌టాక్, యూట్యూబ్‌లను మిట్రాన్ యాప్ అధిగమించి 4.7 రేటింగ్‌తో ట్రేండింగ్లో ఉంది. అంతేగాక ప్లే స్టోర్‌లో యూజర్లు టిక్‌టాక్‌కు తక్కువ రేటింగ్, నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో టిక్‌టాక్ ప్లే స్టోర్ రేటింగ్ 1కి పడిపోయింది. ప్రస్తుతం టిక్‌టాక్‌కు ప్లేస్టొర్‌లో 1.4 రేటింగ్‌తో ఉంది. మిట్రాన్ యాప్ ప్లే స్టోర్‌లో 5 మిలియన్లకు పైగా డౌన్లోడ్లను కలిగి 4.7 రేటింగ్‌తో ప్లే స్టోర్‌లో దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే 5 మిలియన్లకు పైగా యూజర్లను పొంది 4.7 రేటింగ్‌తో మిట్రాన్ ట్రేండింగ్ యాప్‌ల జాబితాలో చేరిపోయింది. (ప్రత్యర్థులకు గుబులు: దూసుకొచ్చిన జియో మార్ట్) మిట్రాన్ ఎలా పని చేస్తుందంటే.. మిట్రాన్ కూడా టిక్‌టాక్ మాదిరిగానే దాని శ్రేణి సాధనాలతో (రేంజ్ ఆఫ్ టూల్స్) పనిచేస్తుంది. దీనిలో ఫిల్టర్ ఆప్షన్ ద్వారా షాట్ వీడియోలను ఎడిట్ చేసి వాటిని ఈ వీడియో ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేయోచ్చు. అంతేగాక టిక్‌టాక్ మాదిరిగానే, మిట్రాన్ వినియోగదారులకు వారివద్ద ఉన్న మల్టీమీడియా కంటెంట్‌కు వైడ్ లైబ్రరీని పొందే యాక్సెస్ కూడా ఉంది. ఇక మీరు ఈ యాప్‌లో కొత్తగా వీడియోలు క్రియోట్ చేయడంతో పాటు పాపులర్ మ్యూజిక్ క్లిప్స్ లేదా మూవీ డైలాగ్‌లను సింక్రనైజ్ చేయోచ్చు. (యాప్‌లో వివరాలు 30రోజుల్లో డిలీట్) మిట్రాన్ అన్ని ఫోన్లలో పనిచేస్తుందా? ఇది ప్రస్తుతానికి ఆన్‌డ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. ఇది గుగూల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అంతేగాక ఈయాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో కనీస స్పేస్ ఉన్న సరిపోతుంది. ఎందుకంటే ఇది 8 ఎంబీ పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంది. అదే విధంగా ఆన్‌డ్రాయిడ్ 5.0 కలిగిన ఏ డివైస్‌లోనైనా ఈయాప్ డౌన్లోడ్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు దీనికి ఐఓఎస్(ios) యాక్సెస్‌కు అనమతి లేదు. ఐఓఎస్ యాక్సెస్‌ను స్టోర్‌లో ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై కూడా ఎలాంటి సమాచారం లేదు. -
సరికొత్త ఫీచర్.. వాట్సాప్ అప్డేట్ చేసుకోండి!
కాలిఫోర్నియా: కొద్ది నెలలుగా యూజర్లను ఊరిస్తున్న వాట్సాప్ డార్క్‌మోడ్ ఫీచర్ వచ్చేసింది. రాత్రి వేళల్లో వాట్సాప్ వినియోగించే యూజర్ల కళ్లకు శ్రమ తగ్గించేందుకు ఈ ఫీచర్ తీసుకొచ్చినట్టు కంపెనీ అధికారులు వెల్లడించారు. ఈ వారం ఆరంభంలోనే డార్క్ మోడ్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రాగా.. భారత యూజర్లకు మాత్రం నేటి (శనివారం) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 40 కోట్ల మంది యూజర్లు డార్క్‌మోడ్‌ను యాక్టివేట్ చేసుకోనున్నారు. ఆండ్రాయిడ్ 10, ఐఓఎస్ 13లో మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది. ప్రత్యేక డార్క్ గ్రే కలర్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న యాప్ తక్కువ లైటింగ్‌ను వెదజల్లుతుంది. రీడబిలిటీ, సమాచార సోపానక్రమం ప్రధానంగా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ అధికారులు తెలిపారు. (చదవండి: వాట్సాప్ చాట్ బ్యాక్ అప్ ఇక సేఫ్..) ఇలా డార్క్‌మోడ్ యాక్టివేట్ చేయండి డార్క్‌మోడ్ అంటే..సాధారణంగా ఇంటర్నెట్ సమాచారమంతా తెలుపు బ్యాక్‌గ్రౌండ్ నల్లని అక్షరాల్లో ఉంటుంది. దీనికి భిన్నంగా నలుపు బ్యాక్ గ్రౌండ్‌తో తెలుపు రంగులో అక్షరాలు కనిపిస్తాయి. దీనివల్ల కళ్లకు తక్కువ శ్రమ కలుగుతుంది. రాత్రి వేళల్లో యాప్‌ను ఉపయోగించే వారికి సౌకర్యంగా ఉంటుంది. వాట్సాప్ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ నుంచి చాట్స్‌లోకి వెళ్లి థీమ్‌లోకి వెళ్లండి. డార్క్ మోడ్‌ను సెలక్ట్ చేసుకోండి. (చదవండి: వాట్సాప్‌లో ఈ రహస్య ఫీచర్ తెలుసా?) -
లైన్ అక్కర్లేదు..ఆన్లైన్ చాలు!
సీతంపేట: ఓ వైపు ప్లాట్‌ఫారంపై రైలు ఉంటుంది. ఇటు చాంతాడంత క్యూ ఉంటుంది. నిత్యం రైళ్లలో ప్రయాణించే వారికి లైన్లో నించుని టికెట్ తీసుకోవడం ప్రహసనమే. దీంతో పాటు ప్లాట్‌ఫాం తీసుకోవడం కూడా కష్టమవుతూ ఉంటుంది. చిన్నపాటి దూరానికి రైళ్లను ఆశ్రయించే వారి సంఖ్య జిల్లాలో ఎక్కువగా ఉంది. రద్దీగా ఉండే స్టేషన్లలో అప్పటికప్పుడు వీరికి టికె ట్ తీసుకోవడం కష్టమైన పనే. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అరచేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా స్టేషన్‌కు 15 మీటర్ల నుంచి ఐదు కిలోమీట ర్ల లోపు దూరంలో ఉండి సాధారణ టికెట్, ప్లాట్‌ఫాం టికెట్ కొనుగోలు చేసేందుకు యూటీఎస్ యాప్‌ను రూపొందించింది. నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం, సాధారణ టికెట్ కొనుగోలు చేయాలంటే రైలు సమయాన్ని బట్టి యుద్ధం చేయాల్సిందే. టికెట్ కొనే సమయానికి రైలు వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ ఇబ్బందిని తొలగించేందుకు రైల్వేశాఖ ఈ యాప్‌ను సిద్ధం చేసింది. వాస్తవానికి ఇప్పటి వరకు ఆన్లైన్ టి కెట్ విధానం రిజర్వేషన్ ప్రయాణానికి మాత్ర మే పరిమితం. ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని ఇకపై జనరల్ టికెట్‌కూ విస్తరించారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే అధికారుల ఆధ్వర్యంలో ఆన్లైన్ టికెట్ సిస్టమ్ (యూటీఎస్) యాప్‌ను అందుబాటులో ఉంచారు. ఈ–టికెట్ వినియోగం ద్వారా పేపరు రహిత రైలు టికెట్ విధానం అమల్లోకి రానుంది. ఈ యాప్ ద్వారా జీపీఎస్ అనుసంధానం ఉన్న అన్ని మొబైల్స్ నుంచి ప్రతి ఒక్కరూ క్షణాల్లో జనరల్, ప్లాట్‌ఫాం సీజన్ టికెట్లు పొందే వెసులు బాటు రైల్వే అధికారులు కల్పించారు. ఈ యాప్ ద్వారా టికెట్ పొందే విధానంలో కొన్ని నిబందనలు/షరతులను మా త్రం ప్రయాణికులు తప్పక పాటించాల్సి ఉంటుంది. అన్ని రైళ్లకూ జనరల్ టికెట్ ఈ యాప్ ఉపయోగించి పాసింజర్, ఫాస్ట్ పాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ తదితర రై ళ్లలో క్షణాల్లో జనరల్ టిక్కెట్లు బుక్ చేసు కోవచ్చు. ఒక వేళ పెద్దలకు ఎవరికైనా టికెట్ బుక్ చేస్తే వారి వద్ద సెల్‌ఫోన్ లేకుంటే బుకింగ్ ఐడీ నంబర్, మొబైల్ నంబర్ చెబితే కౌంటర్ వద్ద టికెట్ పొందే అవకాశం ఉంది. ప్రత్యేకతలు రైల్వే బుకింగ్ కౌంటర్ వద్ద చాంతాడంత క్యూలో నిల్చుని అవస్థలు పడే అవసరం లేకుండా ఇంటి నుంచి బయల్దేరి రైల్వేస్టేషన్‌కు చేరే లోపే స్మార్ట్ ఫోన్ ద్వారా యూటీఎస్ యాప్ నుంచి టికెట్ పొందవచ్చు. ఈ యాప్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిదిలోని ఏ యూటీఎస్ స్టేషన్ నుంచైనా సీజన్, ప్లాట్ఫారం, జనరల్ టిక్కెట్లు పొందవచ్చు. ఒకేసారి నాలుగు టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. షో టికెట్ ఆప్షన్ ద్వారా టీసీకి వివరాలను చూపించి ప్రయాణం చేయవచ్చు. యాప్ డౌన్లోడింగ్ ఇలా.. 4 ఈ యాప్‌ను ఉచితంగా ఆండ్రాయిడ్ విండోస్, ఐఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి యూటీఎస్ అనే ఆంగ్ల అక్షరాలను టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. 4 మొబైల్ నంబర్, ఓ పాస్‌వర్డ్‌ను వ్యక్తిగత వివరాలతో ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్, స్టూడెంట్ ఐడీ తదితర కార్డులకు సంబంధించిన ఏదో ఒక నంబర్‌ను ఈ యాప్‌లో నమోదు చేసుకుని ఇన్స్టాల్ చేయాలి. నిబంధనలు.. ఏ ప్రయాణ టిక్కెట్లను రైలు ఎక్కేందుకు 3 గంటల ముందుగా బుక్ చేసుకోవాలి. అంటే టికెట్ బుక్ చేసిన 3 గంటల్లోపు ప్ర యాణం చేయాల్సి ఉంటుంది. ముందుగా టికెట్ బుక్ చేద్దామంటే ఈ యాప్ పనిచేయదు. అలాగే టికెట్ బుక్ చేసిన సమయానికి మూడు గంటలు దాటితే టికెట్ పనిచేయదన్నమాట. ఏ రైల్వే స్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే టికెట్ బుక్ చేసుకునేందుకు యాప్ ఉపయోగపడుతుంది. దూరాన్ని జీపీఎస్ ద్వారా లెక్కిస్తుంది. ఏ ఫ్లాట్ ఫాం టికెట్ తీసుకోవాలంటే స్టేషన్‌కు 15 మీటర్ల దూరం నుంచి 2 కిలోమీ టర్ల లోపు దూరంలో ఉన్న ప్రయాణికులు మాత్రమే అర్హులు. ఏ పేపర్ టికెట్ కావాలంటే బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లి మొబైల్ నంబర్, బుకింగ్ ఐడీని చూపించి పొందవచ్చును. ఈ సమయంలో ప్రయాణికుడి ఐడీ కార్డు తప్పనిసరిగా టీసీకి చూపాల్సి ఉంటుంది. -
గూగుల్ అసిస్టెంట్‌లో అద్భుతమైన ఫీచర్!
టెక్ దిగ్గజం గుగూల్ మరో అద్భుతమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇక నుంచి గూగుల్ అసిస్టెంట్‌లో ఇంటర్ప్రెటర్ (దుబాసీ) మోడ్ అందరికీ అందుబాటులో రానుంది. ఈ రియల్ టైమ్ ట్రాన్సలేషన్ ఫీచర్‌ను వాడుకొని ప్రపంచంలోని దాదాపు 44 భాషల్లో మాట్లాడవచ్చు. మన దేశానికి చెందిన బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్, తెలుగు, ఉర్దూ తదితర తొమ్మిది భాషల్లో ఈ ఫీచర్ పనిచేస్తోంది. ఈ ఫీచర్ తెరిచి మనకు వచ్చిన భాషలో మాట్లాడితే చాలు.. అది వెంటనే మనకు కావాల్సిన భాషలో అనువాదం చేసి పెడుతోంది. విదేశీ పర్యటనకు, పక్క రాష్ట్రాలకు వెళితే.. అక్కడి భాష తెలియనివారికి ఈ ఫీచర్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త భాషలు నేర్చుకునేవారికి ఈ ఫీచర్ ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉండనుంది. మొదట 2019 జనవరిలో కన్జుమర్ ఎలక్ట్రానిక్ షో (సీఈఎస్)లో ఇంటర్ప్రెటర్ మోడ్ గురించి మొదట పరిచయం చేసిన గూగుల్.. తమ కంపెనీకి చెందిన గూగుల్ హోమ్ డివైజెస్, స్మార్ట్ డిస్ప్లేలలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ స్మార్ టెక్నాలజీని అన్ని స్మార్ట్ఫోన్లలో అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఇక ఫీచర్ పనిచేస్తుంది. అండ్రాయిడ్ ఫోన్లలో బైడిఫాల్ట్‌గా గూగుల్ అసిస్టెంట్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఐఫోన్లలో కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. గూగుల్ అసిస్టెంట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని.. ఈ ఫీచర్‌ను ఐఫోన్లో కూడా ఎంచక్కా వాడుకోవచ్చు. ఈ దుబాసీని వాడటం ఎలా? గుగూల్ అసిస్టెంట్ ఇంటర్‌ప్రెటెర్ మోడ్‌ను వాడటం చాలా సులువు. మీ స్మార్ట్ఫోన్లలోని గూగుల్ అసిస్టెంట్‌ను తెరిచి.. ఇంటర్‌ప్రిటెర్ మోడ్‌ను డైరెక్ట్‌గా వాడొచ్చు. ‘ఓకే గూగుల్ లేదా హే గూగుల్’ అనే వాయిస్ కమాండ్‌తో గూగుల్ అసిస్టెంట్‌ను తెరవచ్చు. లేదా అండ్రాయిడ్ ఫోన్లలో పవర్ బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతోంది. - "Hey Google, be my Tamil translator" or "Hey Google, help me English From Telugu" వంటి కమాండ్స్‌తో డైరెక్ట్‌గా ఇంటర్‌ప్రిటెర్ మోడ్ ఓపెన్ అవుతోంది. మీకు ఏ భాష రాకుంటే.. ఆ భాషలో ఇంటర్‌ప్రెటెర్ మోడ్‌ను ఓపెన్ చేసి సంభాషించడమే. మీకు వచ్చిన భాషలో మాట్లాడితే.. కావాల్సిన భాషలోకి గూగుల్ అసిస్టెంట్ అనువాదం చేసి ఇస్తుంది. కొత్త కొత్త భాషలు నేర్చుకోవాలనుకునే వారికి ఇదెంతో పనికొచ్చే ఫీచర్ అని చెప్పవచ్చు. -
వాట్సాప్ కీలక నిర్ణయం
శాన్ఫ్రాన్సిస్కో: మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)తో పాటు ఐవోఎస్ 7 వాడే ఐఫోన్లకు 2020, ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని కంపెనీ తెలిపింది. దీనివల్ల పాత ఓఎస్‌లు ఉన్న మొబైల్ ఫోన్లలో కొత్త అకౌంట్లను తెరవలేరనీ, పాత అకౌంట్లను యాక్సెస్ చేయలేరని వెల్లడించింది. ‘2019, డిసెంబర్ 31 తర్వాత విండోస్ ఓఎస్ ఉన్న యూజర్లు వాట్సాప్‌ను వాడలేరు. ఈ ఏడాది జూలై 1 నుంచి మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో వాట్సాప్ అందుబాటులో ఉండదు’ అని పేర్కొంది. ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 8 అంతకన్నా అప్డేటెడ్ వెర్షన్లు వాడాలని సూచించింది. వాట్సాప్ ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ల ఫోన్ల కోసం 2.199.177 బీటా వెర్షన్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ద్వారా చాటింగ్ చేస్తూనే పీఐపీ మోడ్‌లో వీడియోలను వీక్షించొచ్చు. అయితే బీటా వెర్షన్లో పీఐపీ మోడ్ ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. -
మరో వివాదంలో ఫేస్బుక్
-
ప్రాంతీయ భాషల్లో ‘షేర్’చాట్!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాంతీయ భాషలో పరస్పర అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు వాటిని ఇతరులతో షేర్ చేయడం కోసం వచ్చిన భారతీయ యాప్ ‘షేర్‌చాట్’ ఎంతో ఆదరణ పొందుతోంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, సెలబ్రటీలు ఇంగ్లీషు భాషలో తప్ప ఇతర ప్రాంతీయ భాషల్లో ముచ్చటించుకోవడానికి దీన్నే ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ ఇంగ్లీషు భాషలో ముచ్చటించుకోవాలన్న ఇందులో కుదరదు. ఎందుకంటే ఇందులో ఇంగ్లీషు లేదు. మిగతా భారత్‌లోని 14 ప్రాంతీయ భాషలు ఉన్నాయి. ఇంగ్లీషులో ముచ్చటించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో గ్లోబల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీషు రాకుండా కేవలం ప్రాంతీయ భాష మాత్రమే వచ్చిన ప్రజల సౌకర్యార్థం ఈ యాప్‌ను తీసుకొచ్చారు. ప్రాంతీయ భాషలతోపాటు ఇందులో కూడా ఇంగ్లీషు భాషను పెట్టినట్లయితే ప్రాంతీయ భాషను చిన్న చూపు చూసినట్లు అవుతుంది. ఆంగ్ల భాషకున్న ఆదరణ కారణంగా ఆ భాష అంతగా రాకపోయినా ఆంగ్లంలో ముచ్చటించేందుకు కొంత మంది ప్రయత్నించవచ్చు. కొంత కూడా ఆ భాషరాని వారు ఇబ్బంది పడవచ్చు. అందుకని 2015, అక్టోబర్ నెలలో ఈ ‘షేర్‌చాట్’ను తీసుకొచ్చారు. గత 18 నెలల కాలంలోనే దీని యూజర్ల సంఖ్య 20 ఇంతలు పెరిగి, రెండున్నర కోట్లకు చేరుకుందని నిర్వాహకులు తెలిపారు. ముందుగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలే ఉపయోగించిన ఈ చాట్‌ను ఇప్పుడు సెలబ్రీటలతోపాటు వివిధ వర్గాల ప్రజలను ఉపయోగిస్తున్నారని వారు చెప్పారు. మూడు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమత్రులు....చత్తీస్ గఢ్ రమన్ సింగ్, మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌవాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు చురుగ్గా ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ పార్లమెంట్ సభ్యులు, భోజ్‌పూరి పాటల గాయకుడు మనోజ్ తివారీ కూడా ఈ షేర్‌చాట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ యాప్‌ను ఉపయోగించడంలో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూకుడును పెంచారు. కాంగ్రెస్ పార్టీగానీ, ఆ పార్టీ నాయకులుగానీ ఈ యాప్‌ను అంతగా ఉపయోగించడం లేదు. చైనా వెంచర్ క్యాపిటర్ ‘షన్వీ కాపిటల్’ ద్యారా ఈ యాప్ గత నెలలో దాదాపు 720 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. 2021 వరకు దాదాపు 53 కోట్ల మంది భారతీయులు ఆన్లైన్పైకి వస్తారని గూగుల్ నిర్వహించిన ఓ సర్వే తెలియజేస్తోంది. -
అమెజాన్ ఇండియా సరికొత్త ప్రయోగం
న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్‌కు గట్టి పోటీగా... దేశీయ కస్టమర్లను మరింత ఆకట్టుకోవడానికి అమెజాన్ చేయని ప్రయత్నాలు లేవు. తాజాగా అమెజాన్ ఇండియా మరో కొత్త ప్రయోగం చేసింది. హిందీ లాంగ్వేజ్ సపోర్టుతో తన వెబ్‌సైట్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. తన ఆండ్రాయిడ్ యాప్, మొబైల్ సైట్ యూజర్లకు ఈ లాంగ్వేజ్ సపోర్టు ఇవ్వనుంది. హిందీ లాంగ్వేజ్ సపోర్టును అమెజాన్ తన వెబ్సైట్లో తీసుకురావడం దేశీయ మార్కెట్ ప్రాధాన్యతను తెలియజేస్తుందని ఈ-కామర్స్ మార్కెట్ వర్గాలు చెప్పాయి. దేశీయంగా మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా అమెజాన్ హిందీ లాంగ్వేజ్ సపోర్టును తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి అమెజాన్ ఇండియా కస్టమర్లు హిందీలోనే ప్రొడక్ట్ సమాచారాన్ని, డీల్స్‌ను, డిస్కౌంట్లను తెలుసుకోవచ్చు. ఆర్డర్లను ప్లేస్ చేసుకోవడం, ఆర్డర్లకు చెల్లించడం, అకౌంట్ సమాచారాన్ని మేనేజ్ చేయడం, ఆర్డర్లను ట్రాక్ చేయడం, ఆర్డర్ హిస్టరీ ప్రతి ఒక్కటీ హిందీ భాషలోనే చేపట్టుకోవచ్చు. అమెజాన్ ఇండియా ఆండ్రాయిడ్ యాప్, మొబైల్ వెబ్సైట్లలో ఈ కొత్త లాంగ్వేజ్ ఆప్షన్‌ను, ఎడమవైపు ఉన్న మెనూ బార్లో చూడవచ్చు. దీని కోసం కొత్తగా అమెజాన్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సినవసరం లేదు. సర్వర్ సైడే దీన్ని అప్డేట్ చేయనున్నారు. ఇంగ్లీష్ లోంచి హిందీలోకి మారే ఆప్షన్‌ను లాంగ్వేజ్ బటన్ కల్పిస్తోంది. ప్రస్తుతం టాప్ ప్రొడక్ట్‌ల సమాచారం, ముఖ్యమైన షాపింగ్ సమాచారం మాత్రమే హిందీలో లభ్యమవుతున్నాయి. అయితే సెర్చ్ ఫీచర్, డెలివరీ అడ్రస్‌కు మాత్రం ఇంగ్లీష్ అవసరం. మరిన్ని షాపింగ్ ఫీచర్లను హిందీలో అందించేందుకు అమెజాన్ సిద్దమవుతోంది. ఒక్కసారి మీరు ఎక్కువగా సెర్చ్ చేసే లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత, అది సేవ్ అయి, తర్వాత అమెజాన్ ఇండియా సైట్లోకి వెళ్లేటప్పుడు అదే లాంగ్వేజ్‌లో సైట్ దర్శనమిస్తుంది. మరిన్ని లాంగ్వేజ్ల సపోర్టును కూడా అమెజాన్ త్వరలో ప్రవేశపెట్టబోతుంది. సుమారు 50 శాతం మంది కస్టమర్లు ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలో షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కంపెనీ గుర్తించింది. వీరి కోసమే హిందీ లాంగ్వేజ్ సపోర్టును అమెజాన్ ఇండియా ప్రవేశపెట్టింది. -
లావా.. జెడ్60ఎస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీ కంపెనీ లావా తాజాగా జెడ్60ఎస్ మోడల్‌ను విడుదల చేసింది. 2.5డీ కర్వ్‌తో 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ 8.1 ఓరియో, 1.5 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, ఇరువైపులా 5 ఎంపీ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో రూపొందించారు. ఫోన్ 8.5 మిల్లీమీటర్ల మందం ఉంది. ఫొటోల్లో స్పష్టత కోసం కెమెరాకు షార్ప్ క్లిక్ టెక్నాలజీని వాడారు. మోడల్ ధర రూ.4,949గా నిర్ణయించారు. నవంబర్ 15లోగా ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొంటే వన్ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ వర్తిస్తుంది. జెడ్60 సక్సెస్ కావడంతో జెడ్60ఎస్‌కు రూపకల్పన చేశామని లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ గౌరవ్ నిగమ్ ఈ సందర్భంగా తెలిపారు. -
వైఎస్సార్సీపీ రూపొందించిన `సేవ్ అవర్ ఏపీ` మొబైల్ అప్లికేషన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ` సేవ్ అవర్ ఏపీ` పేరుతో కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది. ఈ మొబైల్ అప్లికేషన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ నేత భూమా శోభానాగిరెడ్డి విడుదల చేశారు. ఈ అప్లికేషన్‌తో సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపేందుకు ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ అప్లికేషన్‌ను పొందలంటే గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.