ఆండ్రాయిడ్ యాప్స్‌ను మొబైళ్లతోపాటు పర్సనల్ కంప్యూటర్లలో కూడా చాలామంది వినియోగిస్తుంటారు. అలాంటి వారికి ఇది బ్యాడ్ న్యూస్. విండోస్ 11 పీసీ వినియోగదారులు ఇకపై వచ్చే ఏడాది నుంచి ఆండ్రాయిడ్ యాప్స్‌ను వినియోగించలేరని మైక్రోసాఫ్ట్ కంపెనీ తెలిపింది.
ఆండ్రాయిడ్ సబ్ సిస్టమ్‌కు మైక్రోసాఫ్ట్ తన సపోర్ట్‌ను నిలిపివేయనుంది. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 2025 మార్చి 5 నుంచి ఆండ్రాయిడ్ యాప్స్‌ను వినియోగించడం కుదరదు. ఈ మేరకు తన సపోర్ట్ డాక్యుమెంట్‌లో తెలియజేసింది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా విండోస్ సబ్‌సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్‌పై ఆధారపడి పనిచేస్తున్న అప్లికేషన్లు, గేమ్స్ ఎంతమాత్రం పనిచేయవు. అంతేకాదు 2024 మార్చి 5 తర్వాత కొత్త యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయడం కూడా కుదరదు. ఒకవేళ ఇప్పటికే డౌన్‌లోడ్ చేసి యాప్స్‌ను వినియోగిస్తున్నట్లయితే కటాఫ్ డేట్ వరకు మాత్రమే వినియోగించుకోవడానికి వీలుంటుందని తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి: ‘మీ పేరు మార్చుకుంటే దావా వెనక్కి తీసుకుంటా’
గతంలో మొబైల్ యాప్స్‌ను విండోస్ 11 పీసీల్లో వినియోగించడం సాధ్యమయ్యేది కాదు. 2021లో మైక్రోసాఫ్ట్ అమెజాన్ యాప్‌స్టోర్ ఒప్పందం కుదుర్చుకుని వీటిని పీసీల్లో వినియోగించేలా ఏర్పాటు చేశాయి. దీంతో అమెజాన్ యాప్ స్టోర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అందులోని పాపులర్ ఆండ్రాయిడ్ యాప్స్‌ను, గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment