ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు అమెరికా ఫెడరల్ కోర్ట్ భారీ షాకిచ్చింది. 69 బిలియన్ డాలర్లకు గేమింగ్ దిగ్గజం యాక్టివిజన్ బ్లిజార్డ్ (Blizzard)ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో అమెరికా ఫెడరల్ కోర్ట్ బిలియన్ డాలర్ల భారీ కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడాన్ని దీర్ఘకాలిక నిషేధం విధించాలనిఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) పెడరల్ కోర్ట్‌ను కోరింది. ఆ మరుసటి రోజు జరిగిన విచారణలో అమెరికా ఫెడరల్ జడ్జ్ ఎడ్వర్డ్ దవిలా గేమింగ్ సంస్థ క్రయ, విక్రయాలు లేకుండా ఆదేశాలు జారీ చేసినట్ల తీర్పులో తెలిపారు. ఇదే అంశంపై శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు జూన్ 22, జూన్ 23న విచారణ జరపనుంది.
ఇక బ్లిజార్డ్ కొనుగోలు దేశ (యూఎస్) యాంటీట్రస్ట్ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదంటే విరుద్దంగా ఉన్నాయని నిర్ధారించనుంది. అప్పుటి వరకు కంపెనీ కొనుగోలుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాత్కలిక కొనుగోళ్లకు వాయిదా వేస్తున్నట్లు రెగ్యులేటర్ ఫైలింగ్‌లో పేర్కొంది.
ప్రపంచంలోనే అతిపెద్ద గేమింగ్ సంస్థగా
చైనా టెన్సెంట్, జపాన్ ప్లేస్టేషన్ తయారీదారు సోనీ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద గేమింగ్ సంస్థగా అవతరించేలా మైక్రోసాఫ్ట్ గత ఏడాది ప్రారంభంలో బ్లిజార్డ్ కొనుగోలు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ కొనుగోళ్లపై యూరోపియన్ యూనియన్ అంగీకరించింది. కానీ ఈ విక్రయం క్లౌడ్ గేమింగ్‌లో పోటీని నిరోధిస్తుందని భావించిన బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) వ్యతిరేకించింది.
కొనుగోలును నిలిపివేస్తూ
ఈ తరుణంలో ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ వీడియో గేమ్ సిరీస్‌ను విడుదల చేసేలా యాక్టివిజన్ పేరెంట్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో జరిపిన లావాదేవీలు జరగకుండా ఆపాలని, ఈ లావాదేవీలు వీడియో గేమ్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని అణిచివేస్తుందనే ఆందోళనపై ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌లో దావా నమోదైంది. తాజాగా, ఫెడరల్ కోర్ట్ సైతం యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం గేమింగ్ పరిశ్రమలో చర్చాంశనీయంగా మారింది.
మైక్రోసాఫ్ట్ ఏం చెబుతోంది?
ఎఫ్‌టీసీ నిబంధనలకు అనుగుణంగా యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అంతేకాదు కాల్ ఆఫ్ డ్యూటీ తరహా వీడియో గేమ్ సిరీస్‌లను రాబోయే 10 ఏళ్లలో సోనీతో పాటు ఇతర ప్రత్యర్ధి సంస్థలకు అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ డీల్ ద్వారా గేమర్స్, గేమింగ్ కంపెనీలకు లాభదాయకంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ వాదిస్తోంది.
ఇదీ చదవండి : భారత్‌లో తగ్గిన నిరుద్యోగం, ఎంతమేర తగ్గిందంటే?
Comments
Please login to add a commentAdd a comment