
నివా బూపా ‘రైజ్’ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ
మధ్యతరగతి వర్గాల ఆదాయాలు, జీవన విధానాలకు అనుగుణంగా ఉండేలా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నివా బూపా ‘రైజ్’ పేరిట ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. స్వయం ఉపాధి పొందుతున్నవారు, చిన్న వ్యాపారాలు చేసే వారు, స్థిరంగా నెలవారీ ఆదాయం ఉండని వర్గాలకు కూడా ఉపయోగపడే విధంగా అందుబాటు ప్రీమియంలతో ఇది ఉంటుంది. ఫ్లెక్సీ–పే బెనిఫిట్ ఫీచరుతో కస్టమర్లు ముందుగా ప్రీమియంలో 20 శాతమే చెల్లించి పాలసీ తీసుకుని, మిగతా మొత్తాన్ని పాలసీ వ్యవధిలో చెల్లించవచ్చు. ఎంత త్వరగా చెల్లించేస్తే అంత ఎక్కువగా డిస్కౌంటు పొందవచ్చు. ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా చికిత్స పొందినా స్మార్ట్ క్యాష్ బెనిఫిట్‌తో, చికిత్సానంతర వ్యయాల కోసం నిర్దిష్ట మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రీమియంలో 50 శాతం మొత్తానికి సరిపడేంతగా సమ్ ఇన్సూ్జర్డ్‌ను పెంచే రిటర్న్ బెనిఫిట్, 16 ప్రాంతీయ భాషల్లో డాక్టర్లతో డిజిటల్ కన్సల్టేషన్లు తదితర ప్రయోజనాలను కూడా దీనితో పొందవచ్చు.
ఇదీ చదవండి: చైనా ఆర్మీలోకి ‘డీప్‌సీక్’!
టాటా ఏఐఏ ట్యాక్స్ బొనాంజా కన్జంప్షన్ ఫండ్
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా రెండు ఫండ్స్‌ను ఆవిష్కరించింది. ట్యాక్స్ బొనాంజా కన్జంప్షన్ ఫండ్, ట్యాక్స్ బొనాంజా కన్జంప్షన్ పెన్షన్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఇందులో మొదటిది సంపద సృష్టికి అలాగే ఆర్థిక భద్రతకు తోడ్పడుతుంది. రెండోది, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ రెండు న్యూ ఫండ్ ఆఫర్లు మార్చి 31తో ముగుస్తాయి. యూనిట్ ధర రూ.10గా ఉంటుంది. పెరుగుతున్న వినియోగం వల్ల లబ్ధి పొందే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే ప్రయోజనాలను మదుపరులకు అందించే విధంగా ఈ ఫండ్స్ ఉంటాయి. ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, రిటైల్..ఈ–కామర్స్, ఆటోమొబైల్స్.. ప్రీమియం ఉత్పత్తుల రంగాల సంస్థల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment