insurance
-
ఎల్ఐసీకి ఎలాంటి అనుచిత లబ్ధి అందడం లేదు
న్యూఢిల్లీ: భారత బీమా మార్కెట్లో ఎల్ఐసీ అసమంజసమైన పోటీ ప్రయోజనం పొందుతోందంటూ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) చేసిన ఆరోపణలను ప్రభుత్వరంగ బీమా సంస్థ తోసిపుచ్చింది. గత 25 ఏళ్లుగా పోటీతో కూడిన మార్కెట్లో 24 ప్రైవేటు బీమా కంపెనీల మాదిరే ఎల్ఐసీ సైతం కార్యకలాపాలు నిర్వహిస్తుస్తోందని స్పష్టం చేసింది. యూఎస్టీఆర్ అభిప్రాయాలు భారత బీమా నియంత్రణలు, ఎల్ఐసీ పనితీరు గురించి సమగ్రంగా అర్థం చేసుకోకుండా చేసినవిగా భావిస్తున్నట్టు పేర్కొంది. ఐఆర్డీఏఐ, సెబీ నియంత్రణల పరిధిలో పనిచేస్తూ ప్రభుత్వం నుంచి కానీ, లేదా ఏ ఇతర నియంత్రణ సంస్థ నుంచి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం పొందలేదని వివరించింది. భారత్‌లో ఆర్థిక సేవల విస్తృతికి, పాలసీదారుల ప్రయోజనం విషయంలో ఎల్ఐసీ చేసిన కృషిపై మరింత తటస్థ, వాస్తవిక ప్రశంసను తాము కోరుకుంటున్నట్టు పేర్కొంది. హామీని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు.. ‘‘ప్రైవేటు బీమా సంస్థల కంటే చాలా మంది కస్టమర్లు ఎల్ఐసీ పాలసీలనే ఎంపిక చేసుకుంటున్నారు. తద్వారా ఎల్ఐసీకి అనుచిత పోటీ ప్రయోజనం లభిస్తోంది’’అని అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ అయిన యూఎస్టీఆర్ తన తాజా నివేదికలో విమర్శించడం గమనార్హం. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన పాలన, సేవలు, కస్టమర్ల విశ్వాసాన్ని కొనసాగించేందుకు ఎల్ఐసీ కట్టుబడి ఉన్నట్టు సంస్థ ఎండీ, సీఈవో సిద్ధార్థ మహంతి ప్రకటించారు. 1956లో ఎల్ఐసీని ఏర్పాటు చేసినప్పు డు ప్రభుత్వం కలి్పంచిన హామీ అన్నది.. జాతీయీకరణ ఆరంభ కాలంలో ప్రజా విశ్వాసాన్ని పొందడం కోసమే. అంతేకానీ దీన్ని ఎప్పుడూ మార్కెటింగ్ సాధనంగా ఎల్ఐసీ ఉపయోగించుకుని ప్రయోజనం పొందలేదని ఎల్ఐసీ తెలిపింది. -
బీమా పేరుతో వైఎస్సార్సీపీ కుటుంబానికి ‘దేశం’ టోకరా!
కె. కోటపాడు (అనకాపల్లి జిల్లా): బీమా పేరుతో వైఎస్సార్సీపీ కుటుంబాలను, కార్యకర్తలను మోసం చేసే పథక రచనకు తెలుగుదేశం శ్రీకారం చుట్టినట్లు కనబడుతోంది. పార్టీ ఎంపీటీసీ లేని సమయంలో ఆ నాయకుని ఇంటికే వెళ్లి, ఆయన తల్లి, భార్యకు టోకరా వేసి టీడీపీ సభ్యత్వం అంటగట్టిన వైనం అనకాపల్లి జిల్లా, కె. కోటపాడు మండలం, కొరువాడలో చోటుచేసుకుంది.విషయం తెలిసిన సదరు మహిళలు దేశం సభ్యత్వ పత్రాలను చించి వేయడంతో పచ్చనేతల బండారం బట్టబయలైంది. సీహెచ్ కార్తీక్ అనే వ్యక్తి, కొరువాడ ఎంపీటీసీ చీపురపల్లి అచ్చిబాబు ఇంట్లో లేని సమయంలో ఆయన ఇంటికి వెళ్లాడు. ‘రూ.100 చెల్లిస్తే, రూ.5,00,000 బీమా’అంటూ అచ్చిబాబు తల్లి చిన్న, భార్య లక్ష్మిలకు నమ్మబలికాడు. చెరో రూ.వంద, ఆధార్, ఫొటోలు తీసుకుని వెళ్లిపోయాడు. తర్వాత ఆన్లైన్లో తమ తెలుగుదేశం సభ్యత్వ పత్రాలు వైరల్ అవడంతో జరిగింది అర్థం చేసుకుని వైఎస్సార్సీపీ నాయకుడి కుటుంబం అవాక్కయ్యింది. దీనిపై అచ్చిబాబు గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డౌన్లోడ్ చేసుకున్న టీడీపీ సభ్యత్వ పత్రాలను అచ్చిబాబు తల్లి, భార్య చించివేశారు. -
బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ప్రభుత్వరంగ బీమా సంస్థ టైఅప్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం కింద బ్యాంక్ ఇఫ్ ఇండియా కస్టమర్లకు న్యూ ఇండియా అష్యూరెన్స్ బీమా ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది.న్యూ ఇండియాకు చెందిన హెల్త్ ఇన్సూరెన్స్, మోటారు, వ్యక్తిగత ప్రమాద, హోమ్, వాణిజ్య ఇన్సూరెన్స్ ఉత్పత్తులను బీవోఐ కస్టమర్లు సులభంగా పొందొచ్చు. సమగ్రమైన బీమా ఉత్పత్తులను అందించేందుకు ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుందని బ్యాంక్ ఇఫ్ ఇండియా ఎండీ, సీఈవో రజనీష్ కర్ణాటక్ తెలిపారు.ఈ ఒప్పందంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బీమా ఉత్పత్తులు చేరువ అవుతాయని, నాణ్యమైన సేవలు, రక్షణ అందుతాయని న్యూ ఇండియా అష్యూరెన్స్ చైర్మన్, ఎండీ గిరిజా సుబ్రమణ్యం పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా 5,200 శాఖలున్నాయి. -
నివా బూపా పాలసీ.. టాటా ఏఐఏ అప్డేట్స్
నివా బూపా ‘రైజ్’ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మధ్యతరగతి వర్గాల ఆదాయాలు, జీవన విధానాలకు అనుగుణంగా ఉండేలా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నివా బూపా ‘రైజ్’ పేరిట ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. స్వయం ఉపాధి పొందుతున్నవారు, చిన్న వ్యాపారాలు చేసే వారు, స్థిరంగా నెలవారీ ఆదాయం ఉండని వర్గాలకు కూడా ఉపయోగపడే విధంగా అందుబాటు ప్రీమియంలతో ఇది ఉంటుంది. ఫ్లెక్సీ–పే బెనిఫిట్ ఫీచరుతో కస్టమర్లు ముందుగా ప్రీమియంలో 20 శాతమే చెల్లించి పాలసీ తీసుకుని, మిగతా మొత్తాన్ని పాలసీ వ్యవధిలో చెల్లించవచ్చు. ఎంత త్వరగా చెల్లించేస్తే అంత ఎక్కువగా డిస్కౌంటు పొందవచ్చు. ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా చికిత్స పొందినా స్మార్ట్ క్యాష్ బెనిఫిట్‌తో, చికిత్సానంతర వ్యయాల కోసం నిర్దిష్ట మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రీమియంలో 50 శాతం మొత్తానికి సరిపడేంతగా సమ్ ఇన్సూ్జర్డ్ను పెంచే రిటర్న్ బెనిఫిట్, 16 ప్రాంతీయ భాషల్లో డాక్టర్లతో డిజిటల్ కన్సల్టేషన్లు తదితర ప్రయోజనాలను కూడా దీనితో పొందవచ్చు. ఇదీ చదవండి: చైనా ఆర్మీలోకి ‘డీప్‌సీక్’!టాటా ఏఐఏ ట్యాక్స్ బొనాంజా కన్జంప్షన్ ఫండ్టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా రెండు ఫండ్స్‌ను ఆవిష్కరించింది. ట్యాక్స్ బొనాంజా కన్జంప్షన్ ఫండ్, ట్యాక్స్ బొనాంజా కన్జంప్షన్ పెన్షన్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఇందులో మొదటిది సంపద సృష్టికి అలాగే ఆర్థిక భద్రతకు తోడ్పడుతుంది. రెండోది, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ రెండు న్యూ ఫండ్ ఆఫర్లు మార్చి 31తో ముగుస్తాయి. యూనిట్ ధర రూ.10గా ఉంటుంది. పెరుగుతున్న వినియోగం వల్ల లబ్ధి పొందే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే ప్రయోజనాలను మదుపరులకు అందించే విధంగా ఈ ఫండ్స్ ఉంటాయి. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, రిటైల్..ఈ–కామర్స్, ఆటోమొబైల్స్.. ప్రీమియం ఉత్పత్తుల రంగాల సంస్థల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. -
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు రూ.104.77 కోట్ల డిమాండ్ నోటీసులు
రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఆర్ఈఎల్) అనుబంధ సంస్థ అయిన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.104.77 కోట్ల డిమాండ్ నోటీసులు పంపించింది. 2020-21, 2021-22 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఈ నోటీసులు అందుకున్నట్లు సోమవారం సంస్థ తెలిపింది. ముంబైలోని సెంట్రల్ సర్కిల్ 6(2)లోని ఆదాయపు పన్ను అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి ఈ నోటీసు పంపినట్లు ఆర్ఈఎల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.ట్యాక్స్ కన్సల్టెంట్ల సలహా మేరకు కేర్ హెల్త్ నిర్ణీత గడువులోగా ఈ ఉత్తర్వులపై ఫోరమ్ ముందు అప్పీల్ దాఖలు చేస్తుందని ఆర్ఈఎల్ స్పష్టం చేసింది. ఈ డిమాండ్ నోటీసులకు దారితీసిన కచ్చితమైన లెక్కలు లేదా వివాదాల వెనుక ఉన్న వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ ఆర్డర్‌ను అంతిమంగా అంగీకరించే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. నిర్ణీత గడువులోగా ఈ నోటీసుపై అప్పీల్ దాఖలు చేస్తామని కంపెనీ ప్రకటించడంతో ఇది నిర్ధారణ అవుతుంది.ఇదీ చదవండి: ‘బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నా’హెల్త్ ఇన్సూరెన్స్ డొమైన్లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రముఖంగా సేవలందిస్తోంది. రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పన్ను డిమాండ్‌ను సవాలు చేస్తూ తీసుకున్న నిర్ణయం దాని ఆర్థిక, చట్టపరమైన విధానాలపై విశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ నోటీసుపై కంపెనీ ప్రతిస్పందనను పరిశ్రమ వాటాదారులు, రెగ్యులేటర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. -
EPFO: ఫ్రీగా రూ.7 లక్షల ఇన్సూరెన్స్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. దేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ పథకాల నిర్వహణ బాధ్యతను చూస్తుంది. అంతేకాకుండా ఈపీఎఫ్ఓలో చేరిన ఉద్యోగులకు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకం కింద రూ.7 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ అందిస్తోంది. ఇందుకోసం ఉద్యోగులు ప్రీమియం కూడా చెల్లించాల్సిన పని లేదు. ఇది విలువైన ఆర్థిక రక్షణ అయినప్పటికీ చాలా మంది ఉద్యోగులకు దీని గురించి తెలియదు.ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952 కింద ఈడీఎల్ఐ స్కీమ్ పనిచేస్తుంది. ఇది సంఘటిత రంగంలోని ఉద్యోగులకు జీవిత బీమా కవరేజీని నిర్ధారిస్తుంది. బీమా ప్రీమియం నామమాత్రంగా ఉంటుంది. ప్రతి ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ .75 ఛార్జీ ఉంటుంది. ఇది కూడా ఉద్యోగి చెల్లించనక్కర లేదు. వారు పనిచేసే యాజమాన్యాలే దీన్ని భరిస్తాయి.ఈడీఎల్ఐ స్కీమ్ ప్రత్యేకతలుఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో మరణిస్తే, అతని చట్టబద్ధమైన నామినీ లేదా వారసులు బీమా సొమ్మును పొందడానికి అర్హులు. ప్రస్తుతం ఈ పథకం కింద కనీస రూ .2.5 లక్షలు, గరిష్టంగా రూ .7 లక్షలు మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు. గత 12 నెలల్లో ఉద్యోగి సగటు నెలవారీ జీతం ఆధారంగా తుది మొత్తాన్ని లెక్కిస్తారు.ఈపీఎఫ్ సభ్యులందరూ ఆటోమేటిక్‌గా ఈడీఎల్ఐ పథకానికి అర్హులవుతారు. మొత్తం ప్రీమియంను యాజమాన్యం భరిస్తుంది కాబట్టి ఉద్యోగులు ఎటువంటి అదనపు కంట్రిబ్యూషన్లు చేయాల్సిన అవసరం లేదు. ప్రీమియంను ఉద్యోగి ప్రాథమిక నెలవారీ వేతనంలో 0.5 శాతంగా లెక్కిస్తారు. ముఖ్యంగా, ఈ బీమా కవరేజీ స్వతంత్రంగా ఉంటుంది. అంటే ఉద్యోగి కలిగి ఉన్న ఇతర వ్యక్తిగత బీమా పాలసీలతో ఎటువంటి సంబంధం లేకుండా ఇది అమలవుతుంది.గతంలో ఈడీఎల్ఐ స్కీమ్ కింద గరిష్టంగా రూ.6 లక్షల బీమా చెల్లింపు ఉండేది. అయితే 2024 ఏప్రిల్‌లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ మొత్తాన్ని సవరించి, కనీస చెల్లింపును రూ .2.5 లక్షలకు, గరిష్టంగా రూ .7 లక్షలకు పెంచింది. ఉద్యోగుల అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పెంపు లక్ష్యం.క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?ఈడీఎల్ఐ స్కీమ్ కింద బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి, నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు ఫారం 5ఐఎఫ్‌తో పాటు ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, నామినేషన్ రుజువు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి. పూర్తి చేసిన క్లెయిమ్ ఫారమ్, సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు సంబంధిత ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాలి. -
మహిళలకూ కావాలి సమగ్ర బీమా
సంరక్షకులుగా, కుమార్తెలుగా, మాతృమూర్తులుగా తమ కుటుంబాల సంక్షేమం కోసం మహిళలు సమాజంలో ఎంతో కీలకమైన, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుంటారు. అయితే ఈ బాధ్యతలను నిర్వర్తించడంలో వారు సాధారణంగానే తమ సొంత ఆర్థిక, వైద్య భద్రత విషయాలను అంతగా పట్టించుకోరు. అందుకే చాలా మంది మహిళలకు తగినంత బీమా భద్రత లేకపోవడమో లేదా పూర్తిగా తమ జీవిత భాగస్వామి లేదా బంధువు బీమాపైనో ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటోంది. జీవిత కాలం ఎక్కువగా ఉండటం, కెరియర్లో అంతరాయాలు, భారీ ఆరోగ్య సంరక్షణ ఖర్చుల్లాంటి ప్రత్యేక ఆరోగ్య, ఆర్థిక సవాళ్లెన్నో మహిళలకు ఉంటాయి. అందుకే వారి స్వాతంత్య్రానికి, స్థిరత్వానికి తగినంత బీమా రక్షణ ఉండటం ఎంతో అవసరం.కీలకంగా బీమా ..సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కాలం జీవించినప్పటికీ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిమితుల కారణంగా సుదీర్ఘ కాలం పాటు మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం ఉండకపోవచ్చు. సమగ్రమైన బీమా కవరేజీ ఉంటే సముచితమైన ఆరోగ్య సంరక్షణ పొందడానికి అవకాశాలు గణనీయంగా మెరుగుపడగలవు. 2023, 2024 మధ్య కాలంలో చూస్తే 15 నుంచి 49 ఏళ్ల వరకు వయస్సున్న మహిళల్లో 30 శాతం మందికి ఎటువంటి ఆరోగ్య బీమా గానీ ఆర్థిక రక్షణ కవచం గానీ లేదని వెల్లడైంది. ఇలా చాలా మంది మహిళలు తమ సొంత అవసరాలను పక్కన పెట్టి కుటుంబ అవసరాలకే ప్రాధాన్యమిస్తుంటారు. ఆర్థిక పరిమితుల వల్ల నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతుంటారు.మెటర్నిటీ, కుటుంబ భద్రతప్రసవానికి పూర్వ పరీక్షలు, ప్రసవ వ్యయాలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువుల వైద్య అవసరాలకు అవసరమైన కీలక ఆర్థిక సహాయాన్ని మెటర్నిటీ ఇన్సూరెన్స్ అందిస్తుంది. పిల్లల కోసం సన్నద్ధమవుతున్న యువ జంటలకు ఇలాంటి పాలసీలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. శిశుజననం, సంబంధిత ఖర్చుల విషయంలో ఆర్థికంగా సన్నద్ధంగా ఉండేందుకు ఇవి సహాయకరంగా ఉంటాయి. చాలా మంది మహిళలు సాధారణంగా ఉద్యోగాలు చేసే సంస్థ ఇచ్చే బీమాపైనో లేదా జీవిత భాగస్వామి బీమాపైనో ఆధారపడుతుంటారు. కానీ సొంతంగా పాలసీ ఉంటే మరింత ఆర్థిక భద్రత ఉంటుంది. కెరియర్ మార్పుల వల్ల లేదా జీవితంలో మార్పుల వల్ల కవరేజీపై ప్రభావం పడే పరిస్థితుల్లో ఇదెంతో అండగా ఉంటుంది.రిటైర్మెంట్, దీర్ఘకాలిక సంరక్షణ ప్రణాళికమహిళలు సాధారణంగా పెద్ద వయస్సులోని బంధువుల బాగోగులను చూసుకునే సంరక్షకుల పాత్రను కూడా పోషిస్తూ ఉంటారు. ఇది భావోద్వేగాలపరంగా, ఆర్థికంగా భారంగా ఉండొచ్చు. దీర్ఘకాలిక సంరక్షణ బీమా అనేది వైద్య వ్యయాలను, ఆర్థిక ఒత్తిళ్లను అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. సంరక్షకులు అలాగే వారిపై ఆధారపడిన వారికి కూడా మెరుగైన సహాయం లభించేలా తోడ్పడుతుంది. అంతేగాకుండా, జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ త ర్వాత కూడా స్థిరమైన, మెరుగైన జీవితాన్ని సాగించేలా మహిళలు పెన్షన్ ప్లాన్లు లేదా యాన్యుటీ ఆధారిత బీమా పాలసీలను తప్పక పరిశీలించాలి.వైకల్యం, ఆదాయ భద్రతపిల్లల సంరక్షణ కోసం కావచ్చు లేదా వయస్సు పైబడుతున్న తల్లిదండ్రుల సంరక్షణ కోసం కావచ్చు చాలా మంది మహిళలకు కెరియర్లో అంతరాయాలు ఏర్పడుతుంటాయి. దీనితో వారు పని చేసే కంపెనీల నుంచి బీమా ప్రయోజనాలు పరిమితంగానే ఉండొచ్చు. అలాగే దీర్ఘకాలిక పొదుపు కూడా తగ్గుతుంది. అనారోగ్యం లేదా ప్రమాదం బారిన పడి పని చేసే పరిస్థితి లేనప్పుడు కూడా స్థిరమైన ఆదాయం లభించేలా డిజేబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఆర్థిక భద్రతను అందిస్తుంది. జీవితపు అనిశ్చితుల్లోనూ ఆర్థిక భద్రత ఉండేందుకు ఈ రక్షణ ఉపయోగపడుతుంది.స్థిరమైన భవిష్యత్తుకు రక్షణ కవచంమహిళలు తమ ఆర్థిక స్వతంత్రత, ఆరోగ్య సంరక్షణ భద్రతకు తప్పక ప్రాధాన్యమివ్వాలి. వీలైనంత ముందుగా సమగ్ర బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, అనూహ్య ఆర్థిక కష్టాల నుంచి రక్షణను, దీర్ఘకాలికంగా స్థిరత్వాన్ని పొందేందుకు వీలవుతుంది. క్రియాశీలకమైన చర్యలు తీసుకోవడం ద్వారా అనుకోని సవాళ్ల నుంచి మహిళలు తమను, తమ కుటుంబాలను రక్షించుకోవచ్చు.స్వతంత్రంగా నిర్ణయాలుతొలినాళ్లలోనే బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మహిళలు ఆర్థిక ప్రణాళికల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. చిన్న వయస్సులోనే బీమా తీసుకోవడం వల్ల ప్రీమియంల భారం తక్కువగా ఉంటుంది. అలాగే ప్రీ–ఎగ్జిస్టింగ్ కండీషన్స్‌కి సంబంధించిన ఎక్స్‌క్లూజన్స్ కూడా తగ్గుతాయి. యుక్తవయస్సులోని చాలా యువతులకు తమ తల్లిదండ్రుల హెల్త్ ఇన్సూరెన్స్‌తో కవరేజీ లభిస్తుంది. అయితే, స్వతంత్ర పాలసీకి మారడం వల్ల, డిపెండెంట్ కవరేజీ వయో పరిమితిని దాటిన తర్వాత కూడా నిరంతరాయ కవరేజీ, అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.ఇదీ చదవండి: ఈటీఎఫ్‌లు–ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం?స్మార్ట్ ఆర్థిక ప్రణాళికఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ, 80డీ కింద జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఆ రకంగా చూస్తే ఇవి ఆర్థికంగా స్మార్ట్ పెట్టుబడి సాధనాలుగా కూడా ఉంటాయి. వీలైనంత ముందుగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టిన మహిళలకు తక్కువ ప్రీమియంలతో ఎక్కువ కవరేజీ, తద్వారా దీర్ఘకాలం పాటు ఆర్థిక భద్రత ప్రయోజనాలు లభిస్తాయి. మెటర్నిటీ కేర్, డెలివరీ, ఫెర్టిలిటీ చికిత్సలు సహా మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన ఆరోగ్యసంరక్షణ అవసరాలను తీర్చే విధంగా బీమా పాలసీలు ఉంటాయి. మూడేళ్ల పాటు లైఫ్ కవరేజీ సహా సరోగేట్ తల్లులకు పూర్తి కవరేజీ ఉండాలని బీమా రంగ నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) నిర్దేశిస్తోంది.-అమితాబ్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ -
ఆరోగ్యశ్రీ దళారీకి దాఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు సంజీవని వంటి ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) పథకాన్ని బీమా పేరిట దళారుల చేతుల్లో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత కొద్ది నెలలుగా వైద్య సేవ ట్రస్ట్‌లో బీమా ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)ని ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు రూ.2.5 లక్షల కవరేజీతో ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాన్ని రెండు జోన్లుగా విభజించి బీమాకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం కిందకు వస్తున్నాయి. ఈ కుటుంబాలను సగంగా విభజించి శ్రీసత్యసాయి నుంచి గుంటూరు వరకూ ఒక జోన్, ఎన్టీఆర్ నుంచి శ్రీకాకుళం వరకూ మరో జోన్ కింద పరిగణించనున్నారని తెలిసింది.ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని కూటమి హామీ ఇచ్చింది. అధికారం చేతికొచ్చాక సూపర్ సిక్స్‌ల తరహాలోనే బీమా హామీకీ తిలోదకాలిచ్చింది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కాకుండా కేవలం ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోని కుటుంబాలకే రూ.2.5 లక్షల మేర బీమా కల్పించనుంది.బీమా.. ఒక విఫలయత్నం దేశంలోనే మొదటిసారిగా రూ.25 లక్షల వరకూ కవరేజీతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని గత వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసింది. అప్పటి వరకూ రూ.5 లక్షల వరకూ ఉన్న కవరేజీని రూ.25 లక్షలకు పెంచారు. అంతేకాకుండా 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వంలో 1,059 ప్రొసీజర్లతో మొక్కుబడిగా అమలైన పథకాన్ని ఏకంగా 3,257 ప్రొసీజర్లతో బలోపేతం చేశారు. తెల్లరేషన్ కార్డుదారులతో పాటు, రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 90 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ భరోసా లభించింది. అలాంటి పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దళారుల చేతుల్లో పెట్టాలని నిర్ణయించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బీమా విధానం విఫలమై తిరిగి ఏపీ తరహా ట్రస్ట్ విధానంలోకి మారారు. ఇప్పటికే పలు చోట్ల విఫలమైన ఒక విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తెచ్చి కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బీమా సంస్థ బాధ్యత వహించదనే షరతు అసంబద్ధం
బీమా చేసిన వ్యక్తి ఆవరణలో కాకుండా మరెక్కడైనా వాహనాన్ని ఉపయోగించి ప్రమాదం జరిగితే బీమా(Insurance) సంస్థ బాధ్యత వహించదనే పాలసీ షరతు అసంబద్ధమని సుప్రీంకోర్టు(Supreme Court) ఇటీవల వ్యాఖ్యానించింది. ఇన్సూరెన్స్ చేసిన వాహనం క్రేన్ కావడంతో కోర్టు తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. నిర్మాణ ప్రదేశాల్లోనే క్రేన్లను ఉపయోగిస్తారని తెలియజేస్తూ, ఈ పరిస్థితిని ఇరు పక్షాలు వివిధ స్థాయుల్లో పరిష్కరించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.పాలసీదారుడు తన టాటా హిటాచీ హెవీ డ్యూటీ క్రేన్‌కు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ బీమా తీసుకున్నాడు. 2007లో జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ వద్ద పనులు నిర్వహిస్తుంటే క్రేన్ ప్రమాదానికి గురైంది. దాంతో పాలసీ క్లెయిమ్ చేయాలని అర్జీ పెట్టుకున్నాడు. కానీ కంపెనీ తన పాలసీను తిరస్కరించింది. అందుకు పాలసీ షరతులను కారణంగా చూపింది. ప్రమాదం వల్ల నష్టం జరిగినప్పటికీ బీమా చేసిన వ్యక్తి ఆవరణ వెలుపల వాహనాన్ని ఉపయోగించినట్లయితే బీమా సంస్థ బాధ్యత వహించదనే షరతును ఉటంకిస్తూ క్లెయిమ్‌ను తిరస్కరించింది. దాంతో పాలసీదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇటీవల ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఇలాంటి షరతు సహేతుకం కాదని, ముఖ్యంగా క్రేన్లను సాధారణంగా కార్యాలయ ఆవరణలో కాకుండా నిర్మాణ ప్రదేశాల్లోనే ఉపయోగిస్తారని వివరించింది. పాలసీ కొనుగోలు, రెన్యువల్ సమయంలో ఈ షరతును పరిష్కరించకపోవడంపై కోర్టు ఇరు పక్షాలపై అసహనం వ్యక్తి చేసింది. బీమా కంపెనీలు పాలసీదారులకు స్పష్టమైన, న్యాయమైన నిబంధనలు కల్పించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. పాలసీదారుకు వెంటనే క్లెయిమ్ మొత్తాన్ని సెటిల్ చేయాలని బీమా కంపెనీని ఆదేశించింది.ఇదీ చదవండి: ఎఫ్ఐఐల తీరుపై ఉదయ్‌కోటక్ స్పందనఈ తీర్పు బీమా పరిశ్రమలో అనుసరిస్తున్న కొన్ని షరతులను సడలించేలా చర్యలు తీసుకునేందుకు కీలకంగా మారిందని కొందరు భావిస్తున్నారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించడం, బీమా పాలసీల్లో పారదర్శకతను పెంపొందించడంలో సుప్రీంకోర్టు నిబద్ధతను ఈ తీర్పు హైలైట్ చేస్తోంది. -
ఐఎఫ్ఎస్సీలో కార్యకలాపాలకు ఊతం..
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్లో (ఐఎఫ్ఎస్సీ) కార్యకలాపాలకు ఊతమిచ్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. షిప్ లీజింగ్ యూనిట్లు, అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటు చేసే బీమా ఆఫీసులు, ట్రెజరీ కార్యాలయాలకు ప్రయోజనాలను కల్పించే ప్రణాళికలు వీటిలో ఉన్నాయి. పలు పన్ను మినహాయింపుల గడువును 2030 మార్చి వరకు వరకు పొడిగించారు. వాస్తవానికి కొన్ని మినహాయింపులు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముగిసిపోనున్నాయి. మరోవైపు, ఐఎఫ్ఎస్సీలోని ట్రెజరీ సెంటర్లకు సంబంధించి డివిడెండ్ నిర్వచనం క్రమబద్ధీకరణ, ఫండ్ మేనేజర్లకు సరళతరమైన విధానాలను కూడా బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది. అంతర్జాతీయంగా ఆర్థిక సేవల రంగంలో భారత్ పురోగమించేందుకు ఇవి దోహదపడగలవని గిఫ్ట్ సిటీ ఎండీ తపన్ రే తెలిపారు. పన్ను ప్రయోజనాల గడువు పొడిగించడం వల్ల ఇన్వెస్టర్లకు దీర్ఘకాలికంగా ఒక స్పష్టత లభిస్తుందని ధృవ అడ్వైజర్స్ పార్ట్నర్ ఆదిత్య హన్స్ చెప్పారు. -
బీమా రంగంపై ఆపోహలు.. వాస్తవాలు
లక్షలాది మంది పౌరులను, అనేక వ్యాపారాలను రక్షిస్తున్న బీమా పరిశ్రమ తరచూ విమర్శలను ఎదుర్కొంటుందని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఛైర్మన్, బజాజ్ అలియన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ తపన్ సింఘాల్ తెలిపారు. చాలామంది బీమా కంపెనీలు కేవలం లాభాల కోసమేననే తప్పుడు అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. ఈ రంగంపై ఉన్న అపోహలు, వాస్తవాలపై ప్రజలకు అవగాహన ఉండాలని పేర్కొన్నారు. తపన్ సింఘాల్ బీమా రంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ కొన్ని గణాంకాలను తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఐఆర్డీఏఐ వార్షిక నివేదిక ప్రకారం, గత ఏడాది జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ రూ.1.72 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్‌లను పరిష్కరించింది. ఇందులో రూ.80,000 కోట్లకు పైగా ఆరోగ్య బీమాకు చెల్లించిందే. క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 80% కంటే ఎక్కువే. తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్‌ల్లో 20% తరచుగా మోసపూరితమైన లేదా ఆమోదయోగ్యం కాని విధంగా ఉంటున్నాయి. వైద్య ఖర్చుల కోసం బీమాపై ఆధారపడడం కంటే పొదుపు చేసి దాంతో వైద్య ఖర్చులు భరించవచ్చనే దోరణి కొందరిలో ఉంది. అయితే, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం ఆరోగ్య బీమా ఉన్నా పాలసీదారులు సుమారు 60% ఆరోగ్యానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే బీమా లేకపోతే ఈ సంఖ్య 100%కు పెరుగుతుంది. ఏటా పెరుగుతున్న వైద్య ఖర్చుల వల్ల ఆరోగ్య సమస్యలున్న చాలా కుటుంబాలు పేదరికంలోని నెట్టివేయబడుతున్నాయి. ప్రస్తుతం దేశ జనాభాలో సుమారు 7% మంది ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా ఏటా పేదరికంలోకి జారుతున్నారు. అదే బీమా లేకపోతే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.మోటార్ పరిశ్రమబీమా ఆధారిత ప్రమాద రక్షణ క్లెయిమ్ చెల్లింపులు సుమారు రూ.55,000 కోట్లు నిలిచిపోవడంతో మోటార్ బీమా విభాగం కుదేలవుతుంది. దాంతో ప్రమాదాల ఆర్థిక భారం పూర్తిగా వాహన యజమానులపై పడుతుంది. ఇది ఆర్థిక అస్థిరత పెరగడానికి, వాహన అమ్మకాలు తగ్గడానికి దారితీస్తుంది. మోటార్ థర్డ్ పార్టీ క్లెయిమ్‌లను కవర్ చేయడంలో బీమా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ఐఆర్డీఏఐ వార్షిక నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో మోటార్ బీమా విభాగంగా థర్డ్ పార్టీ క్లెయిమ్‌ల్లో రూ.27,000 కోట్లకు పైగా సెటిల్ చేశారు.సాంఘిక సంక్షేమ పథకాలుఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి-జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) కింద 2024 నవంబర్ 30 నాటికి దాదాపు 36 కోట్ల మంది లబ్ధిదారులను ధృవీకరించారు. ఈ ప్రభుత్వ పథకం సుమారు 55 కోట్ల మంది లబ్ధిదారులకు ఆసుపత్రిలో చేరడానికి ఏటా రూ.5 లక్షల ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. బీమా పరిశ్రమ మద్దతు లేకుండా హైబ్రిడ్ నమూనా(ఇన్సూరెన్స్+నగదు చెల్లింపు)ను అవలంబించే రాష్ట్రాల్లో ఈ పథకం అంత ప్రభావవంతంగా ఉండదు. ఈ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.ప్రకృతి విపత్తులువరదలు, తుపాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు విపరీతమైన మానవ, ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. ఈ సమయాల్లో బీమా కీలకమైన రికవరీ మెకానిజంగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2021-22 నుంచి 2025-26 వరకు జాతీయ విపత్తు నివారణ నిధి (ఎన్డీఎంఎఫ్)కు రూ.13,693 కోట్లు, రాష్ట్ర విపత్తు నివారణ నిధికి (ఎస్డీఎంఎఫ్) రూ.32,030.60 కోట్లు కేటాయించింది. ప్రతి ప్రకృతి విపత్తు తర్వాత ప్రభుత్వం నష్టపరిహారం కోసం భారీగా ఖర్చు చేస్తుంది. మరింత పటిష్ఠమైన బీమా కార్యక్రమాలు అమల్లోకి వస్తే ఈ నిధులను అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలకు మళ్లించవచ్చు.వ్యవసాయంభారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) వంటి పథకాలు గత ఎనిమిదేళ్లలో రూ.1.64 లక్షల కోట్ల క్లెయిమ్‌లను అందించాయి. ఈ చెల్లింపులు రైతులకు ఆర్థిక ఉపశమనం కలిగించాయి. రైతు ఆత్మహత్యలు తగ్గడానికి దోహదం చేశాయి. దేశ ఆహార భద్రతకు రైతులు తమ వంతు సహకారాన్ని అందించేందుకు బీమా దోహదపడుతుంది.రూ.1.73 లక్షల కోట్ల మోసపూరిత క్లెయిమ్లుమోసపూరిత క్లెయిమ్‌ల వల్ల బీమా పరిశ్రమకు ఏటా కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యను నిత్యం ప్రత్యేక యంత్రాగాల ద్వారా పర్యవేక్షిస్తున్నా ఫ్రాడ్ క్లెయిమ్‌ల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఐదేళ్లలో మొత్తం బీమా పరిశ్రమలో సుమారు 3.01 లక్షల మోసపూరిత కేసులను గుర్తించారు. వీటి విలువ రూ.1.73 లక్షల కోట్లని తేలింది. భారతీయ జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ ఈ మోసాల వల్ల ఏటా సుమారు రూ.30,000 కోట్లు నష్టపోతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.అపోహలు వీడాలి..బీమా సంస్థలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయని కొందరి అభిప్రాయం. ఇవి కేవలం లాభాల కోసమే ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. అయితే బీమా కంపెనీలకు లాభాలు వచ్చినా భవిష్యత్తులో క్లెయిమ్‌లకు భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ సగటు క్లెయిమ్ నిష్పత్తి 80 శాతం కంటే ఎక్కువే. కంపెనీల రాబడితో లెక్కిస్తే క్లెయిమ్ నిష్పత్తి 115% వద్ద ఉంది. అంటే ప్రీమియంల ద్వారా సమకూరిన ప్రతి రూ.100కు పరిశ్రమ రూ.115 చెల్లిస్తుంది. సరళంగా చెప్పాలంటే బీమా సంస్థలు క్లెయిమ్ చెల్లింపులు, నిర్వహణ ఖర్చులపై డబ్బును కోల్పోతున్నాయి.లక్షల మందికి ఉపాధిప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న బీమా పరిశ్రమ జీవనోపాధికి తోడ్పడుతోంది. ఈ పరిశ్రమలో లాభాపేక్ష లేదని చెప్పలేం. కానీ, అదే సమయంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. బ్రోకర్లు, టీపీఏ(థర్డ్‌పార్టీ ఏజెంట్లు)లు, ఇన్సూరెన్స్ రంగంలోని నిపుణులు ఈ పరిశ్రమ విలువను పెంచుతూ ఆర్థిక, ఉపాధి వృద్ధికి మూలస్తంభంగా నిలుస్తున్నారు.ఇదీ చదవండి: భారత్‌లోకి స్టార్‌లింక్.. లైన్ క్లియర్..?వ్యవస్థను దిగజార్చకూడదు..బీమా కంపెనీలు లాభాలు సంపాదించినంత మాత్రాన అవి వినియోగదారులను మోసం చేస్తున్నాయనే అభిప్రాయాలుండడం సరైందికాదు. మోసపూరిత క్లెయిమ్‌లు చేస్తూ సంస్థలను, వ్యవస్థను దిగజార్చకూడదని నిపుణులు కోరుతున్నారు. ఈ పరిశ్రమపై అవగాహన ఉన్నవారు మరింత ఎక్కువ మందిని బీమా తీసుకునేలా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. -
మహిళకూ ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్
భారతీయ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్నారు. ఆర్థికాంశాల్లో నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్(Term life insurance) ఆవశ్యకత పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బీమా సాధనం గురించి తెలుసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది నిర్దిష్ట ప్రీమియం చెల్లిస్తే, నిర్దిష్ట జీవిత బీమా కవరేజీని అందించే ప్యూర్ ప్రొటెక్షన్ పథకం. దురదృష్టవశాత్తు పాలసీదారు కన్నుమూసిన పక్షంలో సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని వారి నామినీకి బీమా సంస్థ చెల్లిస్తుంది. మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ ప్రీమియంకే ఎక్కువ కవరేజీని అందించడం టర్మ్ ప్లాన్ల ప్రత్యేకత.ఉదాహరణకు 30 ఏళ్ల నేహా వార్షికంగా రూ.9,646 ప్రీమియంతో 30 ఏళ్ల వ్యవధికి రూ.1 కోటి సమ్ అష్యూర్డ్(Sum Assured)కి పాలసీ తీసుకున్నారనుకుందాం. ఒకవేళ దురదృష్టవశాత్తు నేహా మరణించిన పక్షంలో ఆమె నామినీకి రూ.1 కోటి బీమా మొత్తం లభిస్తుంది. ఇలా నేహా తీసుకున్న టర్మ్ పాలసీ అనేది ఆమె కుటుంబసభ్యులకు ఆర్థికంగా తోడ్పాటునిస్తుంది. అయితే, ఈ టర్మ్ పాలసీని ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది. ఉదాహరణకు నేహా గనుక టర్మ్ పాలసీని తీసుకోవడం ఒక పదేళ్లు వాయిదా వేశారనుకోండి .. అప్పుడు అదే లైఫ్ కవరేజీకి ఆమె ఏకంగా రూ.15,900 వార్షిక ప్రీమియం కట్టాల్సి వస్తుంది. పైగా పాలసీ వ్యవధి కూడా 20 ఏళ్లకే పరిమితమవుతుంది. మొత్తం మీద ఆమె తక్కువ కాలవ్యవధికి వర్తించే పాలసీకి ఏటా రూ.6,000 చొప్పున కట్టాల్సి వస్తుంది. అదే ముందుగా తీసుకుని ఉంటే, ఈ అదనపు మొత్తాన్ని మరో చోట ఇన్వెస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. యాడ్–ఆన్‌తో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగత జీవిత పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా మరికాస్త ప్రీమియం చెల్లించడం ద్వారా మరిన్ని అదనపు ప్రయోజనాలను అందించేందుకు యాడ్–ఆన్ రైడర్లు ఉపయోగపడగలవు. క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ఇది ఇటు ఆరోగ్యం అటు జీవిత బీమా ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కొన్ని జీవిత బీమా కంపెనీలు 32 తీవ్ర అనారోగ్యాలకు కూడా కవరేజీని అందిస్తున్నాయి. మహిళలకు ప్రత్యేకమైన బ్రెస్ట్, సరి్వకల్, ఒవేరియన్ క్యాన్సర్లు, గుండె.. మెదడు.. కిడ్నీ సంబంధ సమస్యలు మొదలైనవి ఈ జాబితాలో ఉంటున్నాయి. 30 ఏళ్ల వయస్సు గల మహిళ, 30 ఏళ్ల కాలవ్యవధికి కేవలం నెలకు రూ. 977 చెల్లించడం ద్వారా రూ. 50 లక్షల వరకు ప్రయోజనాలను పొందేందుకు ఈ యాడ్–ఆన్‌ను తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఉన్నట్లు తేలిందంటే, చికిత్స కోసం నిధుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా, బీమా సంస్థ ఏకమొత్తంగా చెల్లిస్తుంది. ప్రస్తుతం కీమోథెరపీ వ్యయం దాదాపు రూ. 25 లక్షల వరకు ఉంటోంది. ఇలా వైద్య చికిత్స వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ యాడ్–ఆన్ ఎంతో ఉపయోగకరంగా ఉండగలదు.ప్రీమియం వెయివర్ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేని విధంగా జీవితం ఉంటుంది. కాబట్టి పాలసీదారు ప్రమాదవశాత్తూ శాశ్వత వైకల్యానికి గురై ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ యాడ్–ఆన్ బెనిఫిట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మటుకు బీమా సంస్థలు అదనంగా తీసుకోకుండా, పాలసీ అంతర్గతంగానే ఈ ఫీచరును అందిస్తున్నాయి. ఒకవేళ మీరు తీసుకున్న పాలసీలో ఇది లేకపోతే, కొంత అదనపు ప్రీమియం చెల్లించైనా తీసుకోవడం శ్రేయస్కరం.యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సంస్థ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు 11.9 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ యాడ్–ఆన్ ప్రయోజకరంగా ఉండగలదు. నెలకు కేవలం రూ.302 మేర అదనంగా ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.50 లక్షల లైఫ్ కవరేజీకి నేహాలాంటి వారు ఈ యాడ్–ఆన్ బెనిఫిట్‌ను తీసుకోవచ్చు. ఉదాహరణకు, రూ.1 కోటి కవరేజీ గల బేస్ పాలసీని, రూ.50 లక్షల యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్‌ను తీసుకుంటే, ప్రమాదవశాత్తు మరణించిన పక్షంలో మొత్తం రూ.1.50 కోట్ల క్లెయిమ్ లభిస్తుంది.కుటుంబానికి ఆర్థికంగా దన్నుగా నిలుస్తున్న వారికి దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగి, ఆదాయానికి అంతరాయం ఏర్పడినా, కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పిస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్. క్లెయిమ్‌ల విషయంలో మెరుగైన ట్రాక్ రికార్డు ఉన్న బీమా సంస్థ నుంచి దీన్ని కొనుగోలు చేయడం మంచిది. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 2024 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ మధ్య కాలంలో మొత్తం పరిశ్రమలో అత్యుత్తమంగా 99.3 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని నమోదు చేసింది. అలాగే, నాన్–ఇన్వెస్టిగేటెడ్ డెత్ క్లెయిమ్‌లను సగటున 1.2 రోజుల వ్యవధిలోనే సెటిల్ చేసింది.– ఎలిజబెత్ రాయ్, హెడ్ (ప్రోడక్ట్ మేనేజ్మెంట్), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ -
ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత జీవితబీమా
ఉద్యోగులకు సామాజిక భద్రతా కల్పించేందుకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) స్కీమ్ 1976లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) నిర్వహించే ఈ పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో సభ్యులుగా ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈపీఎఫ్‌లో వాటాదారులైన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తారు.ఈడీఎల్ఐ స్కీమ్ వివరాలుఅర్హతలు: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఇతర నిబంధనల చట్టం 1952 కింద నమోదైన అన్ని సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. నెలకు రూ.15,000 వరకు మూల వేతనం ఉన్న ఉద్యోగులు ఈ స్కీమ్‌లో డిఫాల్ట్‌గా చేరతారు.యాజమాన్యం వాటా: ఉద్యోగి నెలవారీ వేతనంలో 0.5% యజమానులు ఈడీఎల్ఐ పథకానికి విరాళంగా ఇస్తారు. గరిష్ట వేతన పరిమితి రూ.15,000 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈడీఎల్ఐలో ఉద్యోగి నుంచి ఎలాంటి కంట్రిబ్యూషన్ అవసరం లేదు.బీమా కవరేజీ: సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణిస్తే, రిజిస్టర్డ్ నామినీకి ఏకమొత్తంలో బీమా డబ్బులు అందుతాయి. గత 12 నెలల్లో ఉద్యోగి తీసుకున్న సగటు నెలవారీ వేతనానికి 30 రెట్లు, నెలకు గరిష్టంగా రూ.15,000కు లోబడి ఈ బెనిఫిట్‌ను లెక్కిస్తారు.ప్రయోజనాలు: కనీస హామీ ప్రయోజనం రూ.2.5 లక్షలు, గరిష్ట ప్రయోజనం రూ.7 లక్షలుగా ఉంది. ఇది నెలవారీ గరిష్టవేతన పరిమితిపై ఆధారపడుతుంది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ఈడీఎల్ఐ(EDLI) పథకంలో ఉద్యోగి వేతనంలో 0.5 శాతం వాటాను యాజమాన్యం జమచేయాలి. అయితే దీని కంటే మెరుగైన ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy)లు ఏవైనా ఉంటే యజమానులు తమ ఉద్యోగుల కోసం గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇది ఈడీఎల్ఐ స్కీమ్ ద్వారా అందించబడే కవరేజీకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.ఇదీ చదవండి: కూతురి కోసం మంచి పథకంఎలా క్లెయిమ్ చేయాలి?ఉద్యోగి మరణిస్తే నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు ఆ డబ్బులు చెందుతాయి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు క్లెయిమ్ ఫారాన్ని ఈపీఎఫ్ఓకు సమర్పించాలి. క్లెయిమ్ మొత్తం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అందుకోసం నామినీ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయం నుంచి ఫారం 5 ఐఎఫ్ (ఇన్సూరెన్స్ ఫండ్) పొందాలి. మరణించిన ఉద్యోగి పీఎఫ్ ఖాతా నంబర్, మరణించిన తేదీ, నామినీ వివరాలతో సహా అవసరమైన అన్ని వివరాలను ఫారంతో నింపి కార్యాలయంలో అందించాలి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లను జతచేయాలి. -
బీమా పరిశ్రమకు ధీమా
భారత జీడీపీ 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడిస్(Moody's) అంచనా వేసింది. 2025–26లో 6.6 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ బలమైన విస్తరణతో బీమా రంగం ప్రయోజనం పొందనున్నట్టు పేర్కొంది. హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance)కు పెరుగుతున్న డిమాండ్‌తో బీమా కంపెనీలు ప్రీమియంలో స్థిరమైన వృద్ధిని చూడనున్నాయని వివరించింది. అధిక ప్రీమియం ఆదాయం, పెరుగుతున్న ప్రీమియం ధరలు, ప్రభుత్వ సంస్కరణలతో బీమా రంగం లాభదాయకత మెరుగుపడనున్నట్టు అంచనా వేసింది.‘భారత ప్రైవేటు బీమా కంపెనీలు తమ వినియోగదారుల బేస్‌ను పటిష్టం చేసుకోవడం కొనసాగనుంది. కాకపోతే అండర్‌రైటింగ్ ఎక్స్పోజర్, నియంత్రణపరమైన మార్పులతో వాటి క్యాపిటల్ అడెక్వెసీపై ఒత్తిళ్లు కొనసాగనున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ 2024–25లో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం. ముందటి సంవత్సరంలో వృద్ధి 8.2 శాతం కంటే కొంత తక్కువ. భారత తలసరి ఆదాయం–కొనుగోలు శక్తి సమానత్వం సైతం వృద్ధి చెందుతోంది. 11 శాతం వృద్ధితో 2024 మార్చి నాటికి ఇది 10,233 డాలర్లకు చేరింది’ అని మూడిస్ పేర్కొంది. భారత జాతీయ గణాంక కార్యాలయం (NSO) 2024–25 సంవత్సరానికి జీడీపీ 6.4 శాతం వృద్ధి సాధిస్తుందన్న అంచనా కంటే మూడిస్ అంచనాలు బలంగా ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: మరిన్ని సంస్థలకు పీఎల్ఐ ప్రోత్సాహకాలుభారీ అవకాశాలు..అధిక సగటు ఆదాయం, వినియోగదారుల రిస్క్ ధోరణి బీమాకు, ముఖ్యంగా ఆరోగ్య బీమాకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు మూడిస్ పేర్కొంది. 2024 మొదటి ఎనిమిది నెలల్లో బీమా ప్రీమియం ఆదాయం 16 శాతం పెరిగినట్టు తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రీమియంలో 8 శాతం వృద్ధిని అధిగమించినట్టు వివరించింది. ‘భారత్‌లో బీమా విస్తరణ రేటు (జీడీపీలో బీమా ప్రీమియంల వాటా) 2024 మార్చి నాటికి 3.7 శాతంగానే ఉంది. యూకే 9.7 శాతం, యూఎస్ 11.9 శాతంతో పోల్చి చూస్తే చాలా తక్కువ. అందుకే భారత బీమా రంగం బలమైన విస్తరణకు పుష్కల అవకాశాలున్నాయి’ అని పేర్కొంది. -
15 వరకు వరికి బీమా గడువు పెంపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటల బీమా పథకం నత్తనడకన సాగుతోంది. స్వచ్ఛందంగా రైతులే నమోదు చేసుకోవాల్సి ఉన్న బీమా పథకంపై వారికి అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభు త్వం ఘోరంగా విఫలమైంది. మరోవైపు బీమా ప్రీమియం కూడా అధికంగా ఉండటంతో రైతులు ఈ పథకంలో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. వాస్తవానికి వరితో సహా అన్ని పంటలకు ప్రీమియం గడువు డిసెంబర్ 31నే ముగిసింది. అయితే వరికి మాత్రమే ప్రీమియం గడువును పెంచేందుకు బీమా కంపెనీలు ముందుకొచ్చాయి. జనవరి 15 వరకు ప్రీమియం చెల్లింపునకు అవకాశం కల్పించాయి. నోటిఫై చేసిన జీడి పంటకు గతేడాది నవంబర్ 22తో, ఇటీవల కొత్తగా నోటిఫై చేసిన మామిడితో సహా అన్ని పంటలకు డిసెంబర్ 31తో బీమా ప్రీమియం చెల్లించడానికి గడువు ముగిసింది. ఈసారి 7.46 లక్షల మందే.. నోటిఫై చేసిన పంటల సాగు లక్ష్యం 60.55 లక్షల ఎ కరాలు కాగా ఇప్పటి వరకు అతికష్టమ్మీద 9.75 లక్షల ఎకరాల్లో సాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. గతేడాది 43.82 లక్షలమంది రైతులకు బీమా రక్షణ లభించగా, ఈ ఏడాది రబీలో పంటలు సాగు చేసిన రైతుల్లో కేవలం 7.46 లక్షల మంది రైతులు మాత్రమే బీమా కవరేజ్ పొందగలిగారు.నమోదు చేసుకోవడం ఓ ప్రహసనం..పంటల బీమాలో స్వచ్ఛంద నమోదు రైతులకు తలనొప్పిగా మారింది. బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులు ముందుగా తాము సాగు చేసే పంటల వివరాలను జాతీయ పంటల బీమా పోర్టల్ (ఎన్సీఐసీ)లో నమోదు చేయాలి. రుణం తీసుకునేటప్పుడు బ్యాంకు వాళ్లే ప్రీమియం వసూలు చేసి సదరు బీమా కంపెనీకి చెల్లిస్తారు. ఒకవేళ బీమా వద్దనుకుంటే రాతపూర్వకంగా బ్యాంకుకు వెల్లడిస్తే సరిపోతుంది. బ్యాంకుల నుంచి రుణం పొందని రైతులు తమ వాటా ప్రీమియంను ఆన్లైన్లో చెల్లించి, ధ్రువీకరణ పత్రాలతో సచివాలయాలు/ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు/పోస్టాఫీస్‌లు/కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఎన్సీఐసీ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. కౌలు రైతులకైతే సీసీఆర్సీ కార్డులు తప్పనిసరి. రైతులు సాగు చేసిన పంటలను ధ్రువీకరిస్తూ రైతు సేవా కేంద్రాల సిబ్బంది జారీ చేసే ఏరియా షోన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఆధార్ సీడింగ్ బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో ప్రీమియం చెల్లింపు, ఎన్సీఐసీ పోర్టల్‌లో గడువులోగా అప్లోడ్ చేయడం రైతులకు కత్తి మీదసాములా మారింది. బీమా లేకపోయినా పర్వాలేదు.. పనులు మానుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగలేకపోతున్నామంటూ రైతులు వాపోతున్నారు. -
మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమా
ప్రస్తుతం మానసిక ఆరోగ్యాన్ని(Mental health) పరిరక్షించుకోవడమనేది సవాలుగా మారుతోంది. శారీరక ఆరోగ్యం(Health)తో సమానంగా దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలపై అవగాహన పెరుగుతుండటంతో వీటిని సైతం ఇప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా గుర్తిస్తున్నారు. అయితే, ఇందుకు అవసరమైన సహాయాన్ని పొందడానికి మాత్రం ఆర్థిక సమస్యలు అడ్డంకిగా ఉంటున్నాయి. ఆరోగ్య బీమా సంస్థలు తమ పథకాల్లో మానసిక ఆరోగ్య కవరేజీని చేర్చడం ప్రారంభించాయి. దీనితో కౌన్సిలింగ్, థెరపీ, ప్రివెంటివ్ కేర్ వంటి ముఖ్యమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీర్ఘకాలంలో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయకరంగా ఉంటున్నాయి. ఆరోగ్య బీమా(health insurance) ప్లాన్ ఎంపిక చేసుకునేటప్పుడు, అది అందించే కవరేజీ, ప్రయోజనాల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. అలా పరిశీలించతగిన కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే..సమగ్ర కవరేజీకౌన్సిలింగ్, థెరపీ సెషన్లు వంటి మానసిక ఆరోగ్య సేవలను కవర్ చేసేవిగా పథకాలు ఉండాలి. సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులను కలిసే అవకాశాన్ని కల్పించాలి. టెలిమెడిసిన్ వంటి సౌకర్యాలు కూడా ఉండాలి. దీంతో దూరప్రాంతాల్లో ఉన్నవారు కూడా డాక్టర్లతో ఆన్లైన్లో సంప్రదించేందుకు వీలవుతుంది. అదనంగా, ఔట్‌పేషంట్ డిపార్ట్మెంట్ (ఓపేడీ) కవరేజీ ఉంటే ఆసుపత్రిలో చేరే అవసరం లేకుండా డాక్టర్‌ను సందర్శించవచ్చు, ఇది సమయంతో పాటు డబ్బును కూడా ఆదా చేస్తుంది.వెల్నెస్ ప్రోగ్రాంలుఅనేక బీమా కంపెనీలు ఇప్పుడు తమ పథకాలలో వెల్నెస్ ప్రోగ్రాంలను చేరుస్తున్నాయి. ఇవి మైండ్‌ఫుల్‌నెస్ సెషన్లు, ఒత్తిడిని అధిగమించేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహించడం లేదా ఫిట్నెస్పరమైన ప్రోత్సాహకాలను అందించడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చేవిగా ఉంటున్నాయి. ఉచిత యోగా తరగతులు, జిమ్ మెంబర్‌షిప్‌లు లేదా వెల్నెస్ యాప్(Wellness App)లకు యాక్సెస్ వంటి ప్రయోజనాలను కూడా కొన్ని పథకాలు అందిస్తున్నాయి. హోమ్ హెల్త్‌కేర్ సేవలుదీర్ఘకాలిక సమస్యలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నవారికి క్లినిక్‌లకు ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి హోమ్ హెల్త్‌కేర్ ప్రయోజనాలు ఉన్న పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇంటి వద్దే సంరక్షణ సేవలను సౌకర్యవంతంగా అందుకునేందుకు ఈ పాలసీలు సహాయపడతాయి. ఇన్సెంటివ్‌లు, రివార్డులుకొన్ని బీమా పథకాలు ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తూ రివార్డులు అందిస్తాయి. ఉదాహరణకు, మీరు రెగ్యులర్ హెల్త్ చెక్–అప్స్ చేయడం లేదా ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా రెన్యువల్‌పై డిస్కౌంట్ పొందవచ్చు. కొన్ని పథకాలు వాకింగ్ లేదా వ్యాయామం మొదలైన వాటికి పాయింట్లు అందిస్తాయి. వీటిని తరువాత రిడీమ్ చేసుకోవచ్చు.వెల్నెస్ ప్రోగ్రాంలుఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు తోడ్పడే వెల్నెస్ ప్రోగ్రాంలు, ప్రివెంటివ్ కేర్లాంటివి అందించే పాలసీ(Policy)లను ఎంచుకోవాలి. డిస్కౌంట్లు, రివార్డులు మొదలైనవి ఇచ్చే పాలసీల వల్ల బీమా వ్యయం తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా అలవడతాయి. డబ్బూ ఆదా అవుతుంది. ఇక టెలిమెడిసిన్, హోమ్ హెల్త్‌కేర్ ఫీచర్లు సత్వరం సేవలను పొందడాన్ని సులభతరం చేస్తాయి.ఇదీ చదవండి: ఫండ్స్ కటాఫ్ సమయం ఎప్పుడు?మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడనేది మరింత పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. చికిత్స చేయకపోవడం వల్ల పలు రకాల పరిస్థితులు రోజువారీ జీవితానికి అడ్డంకులుగా మారతాయి. సంబంధాలను నాశనం చేస్తాయి. అలాగే, ఇతర ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి. డాక్టర్లను పదే పదే కలవాల్సి రావడం వల్ల, అలాగే ఎమర్జెన్సీ కవరేజీ అవసరాల వల్ల ఆర్థికంగా కూడా ఇది మరిన్ని ఖర్చులకు దారి తీస్తుంది. కాబట్టి తగినంత కవరేజీ ఉండే పాలసీని ఎంచుకోవడం వల్ల భావోద్వేగాలపరంగానూ, ఆర్థికంగాను సవాళ్లను అధిగమించేందుకు సహాయకరంగా ఉంటుంది. -
ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉచిత పంటల బీమాను దూరం చేసిన కూటమి సర్కారు... ప్రీమియం భారం భరించలేక రైతుల గగ్గోలు
-
రూ.399 కడితే.. ₹10 లక్షల బీమా: ఇదిగో ఫుల్ డీటెయిల్స్
జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో.. ఎవ్వరూ ఊహించలేరు. కానీ ఊహకందని ప్రమాదం జరిగినప్పుడు ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కార్పొరేట్ సంస్థలు, ఐపీపీబీ (ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్).. 'గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్' ప్లాన్స్ ప్రవేశపెట్టింది. వీటికి సంబందించిన పూర్తి వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఐపీపీబీ రూ.399 ప్లాన్ఈ ప్లాన్ కింది మీరు ఏడాదికి రూ.399 చెల్లిస్తే.. ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ప్రమాదంలో కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోయినా.. రూ.10 లక్షల భీమా సౌకర్యం పొందవచ్చు.ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదం వల్ల హాస్పిటల్లో చేరితే యాక్సిడెంటల్ మెడికల్ ఖర్చులు కోసం రూ.60,000 లేదా ప్రమాదవశాత్తు వైద్య ఖర్చుల కోసం రూ.30,000 అందిస్తారు. అంతే కాకుండా హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి కుటుంబ ప్రయోజనం కింద రవాణా ఖర్చుల కోసం రూ.25,000 లభిస్తుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే అంత్యక్రియల కోసం మరో రూ.5,000 అందుతాయి. ఈ ప్లాన్ కింద ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ప్రయోజనాలు లభిస్తాయి.ఐపీపీబీ రూ.299 ప్లాన్ఈ ప్లాన్ ఎంచుకునే పాలసీదారు సంవత్సరానికి రూ.299 చెల్లించి.. 10 లక్షల రూపాయల ప్రమాద భీమా పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ప్రమాదంలో కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోయినా.. రూ.10 లక్షల భీమా లభిస్తుంది.ఈ ప్లాన్ ఎంచుకునే పాలసీదారుకు రూ.399 ప్లాన్‌లో లభించే దాదాపు అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. కానీ ఎడ్యుకేషన్ బెనిఫీట్స్.. హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు రూ.1,000 చొప్పున లభించే ప్రయోజనాలు అందవు.ఇదీ చదవండి: బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులుదీనికి అర్హులు ఎవరంటే..18 నుంచి 65 సంవత్సరాల వయసున్న ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు.గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ దేనిని కవర్ చేయదంటే..ఆత్మహత్య చేసుకున్నా, మిలటరీ సర్విసెస్‌లో ఉంటూ మరణించినా, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి కన్నుమూసినా, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఎయిడ్స్ వంటి వాటివల్ల చనిపోయినా.. ప్రమాదకరమైన క్రీడల్లో మృత్యువాత పడినా ఈ ఇన్సూరెన్స్ లభించదు. -
మనం లేకపోయినా మన వాళ్లతో ఉన్నట్లే!
జీవితం క్షణ భంగురం. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా పెద్దగా పట్టించుకోం. అప్పటిదాకా వస్తే చూసుకుందాంలే అనుకుంటాం. పరిస్థితులు సహకరించకో, ఉదాసీనతో, నిర్లక్ష్యమో..కారణం ఏదైనా కావొచ్చు. భవిష్యత్ ప్రణాలికల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ‘పోయినవాడు బాగానే పోయాడు.. మాకు ఏం మిగిల్చాడు గనుక..’ అని ఉన్నవాళ్లు తిట్టుకోకూడదంటే కొంచెం ముందుచూపుతో వ్యవహరిస్తే చాలు. కుటుంబ పెద్దని దురదృష్టం పలకరించినా..ఆ కుటుంబం మాత్రం సురక్షితంగా ఉండాలంటే ఒక టర్మ్ పాలసీని తీసుకోవాలి. ఈ పాలసీ చేసే మేలు అంతాఇంతా కాదు. అదెలాగో తెలుసుకుందాం.చిన్న వయసులోనే ఈ పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియంతో అధిక ప్రయోజనాన్ని పొందవచ్చు. నెలవారీ లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లించవచ్చు.టర్మ్ ఇన్సూరెన్సు పరమార్థం ఏమిటంటే సాధారణంగా ఏ వ్యక్తి అయితే ప్రీమియం కడతాడో ఆ వ్యక్తి మరణానంతరం ఆర్థిక భరోసానిస్తుంది. ఒకేసారి బీమా మొత్తాన్ని సదరు కుటుంబం అందుకోవచ్చు లేదంటే..దఫాలవారీగా కూడా తీసుకోవచ్చు.సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. అప్పటి నుంచి మొదలుకొని 99 ఏళ్ల వరకు పాలసీలను తీసుకునే అవకాశం ఉంటుంది.ఒకేసారి బీమా మొత్తంపాలసీ చేసిన వ్యక్తి మరణానంతరం వారి నామినీ/ ప్రయోజనదారుకు ఒకేసారి బీమా మొత్తం (సమ్అష్యుర్డ్) చెల్లిస్తారు. ఇందుకు ఏడాదికోసారి ప్రీమియం చెల్లించే ఆప్షన్ ఎంచుకోవాలి.ఉదా: x అనే వ్యక్తి రూ.ఒక కోటి టర్మ్ పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. నెలకు రూ.10,000 దాకా ప్రీమియం చెల్లిస్తున్నాడు. పాలసీ కాలవ్యవధి 35 ఏళ్లుగా భావిద్దాం. ఈ వ్యవధిలోనే పాలసీ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తు కన్నుమూస్తే అతని కుటుంబం ఒకేసారి రూ.కోటి పొందగలుగుతుంది.దఫాల వారీగా కావాలంటే...ఆర్థిక పరమైన అంశాలపై పూర్తి అవగాహన ఉండే కుటుంబాలు తక్కువే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విషయానికొస్తే ఇది మరింత తక్కువ ఉంటుంది. కోటి రూపాయలకు ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయినప్పుడు ఒకేసారి ఆ మొత్తం అందుకునే కుటుంబాలు అంత పెద్ద మొత్తాన్ని ఏం చేయాలో సరైన అవగాహన ఉండదు. ఒక్కోసారి ఆ సొమ్ము పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉంటుంది. లేదా విచ్చలవిడిగా ఆ సొమ్ముని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇలాంటి టర్మ్ పాలసీ తీసుకున్న ప్రయోజనం నెరవేరదు. అలా జరగకుండా ఉండాలంటే దఫాలవారీ చెల్లింపు పద్ధతిని ఆశ్రయించడం మేలు. ఈ పద్ధతిలో సదరు నామినీకి ఇన్సూరెన్సు కంపెనీ విడతల వారీగా సొమ్ము చెల్లిస్తుంది. అయితే పాలసీ తీసుకునే వ్యక్తికి తన కుటుంబం గురించి పూర్తి అవగాహన ఉంటుంది. తన భార్య, పిల్లలు, వారి చదువులు, పెద్దవాళ్ల అవసరాలు.. ఇలా ప్రతి అంశాన్నీ దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. తన పిల్లలు పెద్ద చదువుల్లోకి వచ్చే సరికి ఇంతకావాలి.. తన పిల్లల పెళ్లిళ్ల ఖర్చుకు ఇంత అవసరమవుతుంది.. అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా నామినీకి ఏయే సమయాల్లో ఎంతెంత చెల్లించాలో పేర్కొనవచ్చు.నెలవారీ చెల్లింపులుపాలసీదారు నెలవారీ చెల్లింపుల ఆప్షన్ ఎంచుకుంటే తదనుగుణంగానే నెలకింత చొప్పున నామినీకి బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఒకేసారి రూ.ఒక కోటి మొత్తం వద్దనుకుంటే నెలకు కొంత వచ్చేటట్లు ఆప్షన్ ఎంచుకోవాలి. దాంతో సదరు బీమా కంపెనీ ఆ మొత్తాన్ని నెలకు రూ.50,000 చొప్పున 15 ఏళ్లపాటు చెల్లిస్తుంది.ఏడాదికోసారి చెల్లించేలా..నెలకోసారి కాకుండా ఏడాదికోసారి ప్రయోజనాన్ని పొందే అవకాశం కూడా ఉంది. దీని ప్రకారం ఏడాదికి రూ.6 లక్షలచొప్పున 15 ఏళ్లపాటు నామినీకి చెల్లిస్తారు.మరో పద్ధతిఈ పద్ధతి ప్రకారం నామినీకి సమ్ అష్యుర్డ్ (రూ.కోటి అనుకుందాం) మొత్తంలో 50-70% పాలసీదారు చనిపోయిన వెంటనే చెల్లిస్తారు. మిగతా మొత్తాన్ని కుటుంబ అవసరాలకు ఉపయోగపడే విధంగా నెలకింత చొప్పున చెల్లిస్తూ వస్తారు.అధిక ప్రయోజనం ఇచ్చే మరో విధానంఈ ఆప్షన్లో ముందుగా నామినీకి కొంత మొత్తం చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని 10-20 శాతం వార్షిక వృద్ధిని లెక్కగట్టి నెలవారీ చెల్లింపుల్లో అందిస్తారు. పెరిగే ఖర్చులను తట్టుకోవడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది.ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!టర్మ్ ఇన్సూరెన్సు అనేది ప్రతి కుటుంబానికి కచ్చితంగా అవసరమయ్యే ఒక సురక్ష సాధనమని చెప్పొచ్చు. కానీ దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని జీవితాలకు ఈ పాలసీ భరోసాను ఇస్తుందని మాత్రం ఎవరూ గ్రహించరు. మీ కుటుంబంలో ఆర్థిక పరమైన అవగాహన ఉండి, వచ్చే సొమ్ములు సరైన మార్గంలోనే సద్వినియోగం అవుతాయన్న నమ్మకం ఉన్నప్పుడు ఏకమొత్తం (లమ్సమ్) పొందే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. లేదంటే నెలవారీ, వార్షిక ప్రాతిపదికన చెల్లింపులను సెలక్ట్ చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికి తదనంతరం కుటుంబం ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడకూడదంటే మాత్రం కచ్చితంగా టర్మ్ పాలసీ వెంటనే తీసుకోవాలి.- బెహరా శ్రీనివాసరావు, పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు -
పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?
జీవిత బీమా అనగానే.. డబ్బు వృథా, అనవసరంగా ప్రీమియం చెల్లించాలనే ధోరణి ఉంది. దీన్ని గ్రహించిన కంపెనీలు వినియోగదారులు చెల్లించే ప్రీమియంపై రాబడి వచ్చేలా ఎండోమెంట్ పాలసీలను తీసుకొచ్చారు. అయితే ఇందుకు భారీగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఒకవైపు బీమా కవరేజీ.. మరోవైపు రాబడి ఉంటుంది. ఇదే ఎక్కువ మందిని ఆకర్షించే అంశం. బ్యాంక్ డిపాజిట్లో మాదిరిగా, లేదంటే అంతకంటే ఎక్కువ రాబడి బీమా పాలసీలో వస్తుందని నమ్ముతుంటారు. దీనికి అదనంగా బీమా రక్షణ ఉంటుందన్న కారణంతో దీనివైపే మొగ్గు చూపిస్తుంటారు. రాబడి ఇవ్వని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అర్థం చేసుకుని తీసుకునే వారు మొత్తం మీద తక్కువ. కానీ, సంప్రదాయ బీమా పాలసీల్లో రాబడి విషయమై ఎక్కువ మందిలో ఉండే అంచనా సరైంది కాదని, కొన్నిసార్లు సగటు ద్రవ్యోల్బణం కంటే కూడా ఎండోమెంట్ పాలసీల్లో వచ్చే రాబడి తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. బీమా సంస్థలు, ఏజెంట్లు మార్కెటింగ్‌లో భాగంగా సంప్రదాయ బీమా పాలసీలను ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాన్ని చేస్తుంటారు. కానీ, బీమా రక్షణా? లేక రాబడా? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ అంశాలను వివరించే కథనం ఇది..బీమా, పొదుపుతో కూడిన ప్లాన్లుసంప్రదాయ బీమా పాలసీలు రెండు రకాల ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంటాయి. మరణించినప్పుడు పరిహారాన్ని చెల్లిస్తాయి. పాలసీ కాలం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీదారు ఏదైనా కారణంతో దురదృష్టవశాత్తూ పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీదారు జీవించి ఉంటే చివర్లో అన్ని ప్రయోజనాలనూ కలిపి బీమా సంస్థ చెల్లిస్తుంది. బీమా ప్లాన్ బ్రోచర్లో ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు ప్రముఖ సంస్థకు చెందిన ఓ ప్లాన్ పరిశీలిస్తే.. ఇది పొదుపు, బీమాతో కూడిన ప్లాన్. 15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం చెల్లించక్కర్లేదు. 5 ఏళ్లు తగ్గించి మిగిలిన కాలానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి పాలసీని రూ.15 లక్షల సమ్ అష్యూరెన్స్పై (బీమా రక్షణ/కవరేజీ) తీసుకుంటే అప్పుడు ఏటా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.80వేలు. ఇలా 15 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. జీవించి ఉంటే రెండు రూపాల్లో ఈ ప్లాన్ ప్రయోజనాలను అందిస్తుంది.ద్రవ్యోల్బణాన్ని అధిగమిస్తున్నాయా..?55 ఏళ్ల వరకు జీవించి ఉంటే అప్పుడు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్ పొందొచ్చు. గ్యారంటీడ్ అడిషన్ అనేది ప్రతి రూ.1,000పై సుమారు రూ.50 చొప్పున వస్తుంది. మొత్తం మీద 20 ఏళ్ల కాలంలో ప్రీమియం రూపేణా రూ.12 లక్షలు చెల్లిస్తారు. అంటే రూ.10 లక్షల కవరేజీ కోసం అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నారు. జీవించి ఉంటే 20 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం రూ.20 లక్షలు. అంటే రాబడి రూ.8 లక్షలే. అది కూడా 20 ఏళ్ల కాలానికి. ఇందులో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (రాబడి రేటు) 4 శాతమే. ఇదనే కాదు.. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు అన్నింటిలోనూ దాదాపు ఇదే స్థాయిలో రాబడి ఉంటుంది. ఒకవేళ 30–40 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఈ రాబడి రేటు 4.5–5 శాతం మధ్య ఉంటుంది. కానీ, మన దేశంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండడాన్ని గమనించొచ్చు. ద్రవ్యోల్బణం రేటు, అంతకంటే తక్కువ రాబడి రేటు ఏదైనా.. నికరంగా అది మనకు రాబడిని ఇచ్చినట్టు కాదని అర్థం చేసుకోవాలి.మరణిస్తే చెల్లింపులు ఇలా..ఒకవేళ ప్లాన్ కాల వ్యవధిలో పాలసీదారు మరణించినట్టయితే, సమ్ అష్యూరెన్స్తోపాటు అప్పటి వరకు సమకూరిన గ్యారంటీడ్ అడిషన్స్ చెల్లిస్తారు. బేసిక్ సమ్ అష్యూరెన్స్పై 125 శాతం, వార్షికంగా చెల్లించే ప్రీమియానికి ఏడు రెట్లు, లేదంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు 105 శాతం.. వీటిల్లో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఉదాహరణకు 35 ఏళ్ల వయసులో తీసుకుని 50 ఏళ్ల సమయంలో మరణం సంభవించినట్టయితే రూ.20 లక్షలు పరిహారంగా ముడుతుంది.ప్రత్యామ్నాయం..బీమా, పెట్టుబడి ఈ రెండింటినీ కలిపి చూడొద్దని నిపుణులు తరచూ చెబుతుంటారు. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల అటు సరైన బీమా రక్షణ, ఇటు సరైన రాబడి పొందలేని పరిస్థితికి సంప్రదాయ బీమా పాలసీలు అచ్చమైన ఉదాహరణ. అలా కాకుండా ప్యూర్ లైప్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ తీసుకుని, మరోవైపు మెరుగైన రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. పైఉదాహరణ ఆధారంగా బీమా, పెట్టుబడిని వేరు చేస్తే వచ్చే ప్రయోజనం ఏ మేరకు ఉంటుందో చూద్దాం.35 ఏళ్ల వయసున్న వ్యక్తి 25 ఏళ్ల కాలానికి అంటే 60 ఏళ్లు వచ్చే వరకు (రిటైర్మెంట్ వయసు/బాధ్యతలు ముగిసే సగటు వయసు) రూ.50 లక్షల సమ్ అష్యూరెన్స్‌తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.10వేలు అనుకుందాం. ఎక్కువ కంపెనీల్లో ప్రీమియం రూ.7,400 నుంచి 9,800 మధ్య ఉంది. పొగతాగడం, మద్యపానం, అనారోగ్య సమస్యలు లేని వారికి ఈ ప్రీమియం అని అర్థం చేసుకోవాలి. పైన చెప్పుకున్న ప్లాన్‌లో ఏటా చెల్లించే ప్రీమియం రూ.80వేలు. కానీ బీమా రక్షణ రూ.10 లక్షలే. ఈ ప్రీమియంలో కేవలం 12 శాతం చెల్లించడం ద్వారా టర్మ్ ప్లాన్‌లో రూ.50 లక్షల బీమా కవరేజీని, అది కూడా 25 ఏళ్ల కాలానికి పొందొచ్చు. కేవలం 12 శాతం ప్రీమియానికే ఐదు రెట్లు అధిక బీమా రక్షణ తీసుకోవడం మెరుగైన నిర్ణయం అనిపించుకుంటుంది. అప్పుడు మిగిలిన రూ.70వేలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.పైప్లాన్లో ప్రీమియం చెల్లింపు 15 ఏళ్లే కనుక దాన్నే పరిగణనలోకి తీసుకుని చూద్దాం. 12 శాతం రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్ పథకంలో ఏడాదికోసారి రూ.70వేల చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే 15 ఏళ్ల చివరికి రూ.29.22 లక్షలు సమకూరుతుంది. ఇందులో అసలు రూ.10.5 లక్షలు అయితే, రాబడి రూ.18.72 లక్షలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో దీర్ఘకాలానికి వార్షిక రాబడి 12 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ 10 శాతం రాబడి ఆధారంగా అంచనా వేసుకున్నా.. 15 ఏళ్లలో రూ.24.46 లక్షలు సమకూరుతుంది. విడిగా బీమా ప్లాన్, పెట్టుబడి ప్లాన్ ఎంపిక చేసుకోవడం వల్ల మెరుగైన కవరేజీకితోడు, మెరుగైన సంపద సృష్టి సాధ్యపడుతుందని ఈఉదాహరణ తెలియజేస్తోంది.కాంపౌండింగ్ ఉండదు..విడిగా ఇన్వెస్ట్ చేసుకుంటే కాంపౌండింగ్ ఉంటుంది. అంటే రాబడిపై రాబడి తోడవుతుంది. కానీ, సంప్రదాయ బీమా ప్లాన్లలో చెల్లించే గ్యారంటీడ్ అడిషన్స్, రివర్షనరీ బోనస్, సింపుల్ అడిషన్స్ మొత్తంపై కాంపౌండింగ్ ఉండదు. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బాండ్లను తీసుకుంటే, మొదటి ఏడాది రాబడిపై తర్వాతి కాలంలో రాబడి జమ అవుతుంది. ఇలా కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. పైకి కనిపించదు కానీ, సంపద సృష్టిలో కాంపౌండింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడి రేటు ముందే చెబుతారు. అదే, సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి రేటు ముందు చెప్పరు. సమ్ అష్యూరెన్స్తోపాటు ఇతర ప్రయోజనాలు చెల్లించే విధంగా ప్లాన్ ఉంటుంది.ఇందులో నికర రాబడి ఏ మేరకు అన్నది అర్థం చేసుకోవడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. సమ్ అష్యూరెన్స్కే హామీ ఉంటుంది. ఇతర చెల్లింపులకు హామీ ఉండదు. బీమా సంస్థ పనితీరు (అది చేసే పెట్టుబడులపై రాబడులు)పైనే ఆధారపడి ఉంటాయని అర్థం చేసుకోవాలి. అందుకే అన్నింటికంటే కుటుంబానికి మెరుగైన జీవిత బీమా రక్షణ కల్పించుకోవడం ముందుగా చేయాలి. రాబడి కోసం దీర్ఘకాలంలో ఈక్విటీలే మెరుగైన సాధనమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, ఇంకా ఆర్థిక వెసులుబాటు ఉంటే అప్పుడు మీకు నచ్చిన ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.గ్యారంటీడ్.. పార్టిసిపేటింగ్బీమా సంస్థలు సంప్రదాయ పాలసీలను ఆకర్షణీయంగా చూపించేందుకు బోనస్‌లను ప్రకటిస్తుంటాయి. బీమా సంస్థ పనితీరుపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ బీమా ప్లాన్లు సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ మెచ్యూరిటీ బోనస్, లాయల్టీ అడిషన్ అనే వాటిని ఆఫర్ చేస్తుంటాయి. ఇవన్నీ బీమా సంస్థ వద్ద మిగులు నిల్వలపైనే ఆధారపడి ఉంటాయనే షరతు విధిస్తారు. మిగులు ఉంటే అప్పుడు సింపుల్ రివర్షనరీ బోనస్‌ను చెల్లిస్తారు. కొన్ని ప్లాన్లలో సింపుల్ రివర్షనరీ బోనస్ అని కాకుండా, పాలసీ కాల వ్యవధి ముగింపు సమయంలో లాయల్టీ అడిషన్స్ పేరుతో వీటిని చెల్లిస్తారు.ఇదీ చదవండి: ఏటీఎం నుంచే పీఎఫ్ నిధుల డ్రాఇదే తరహా సంప్రదాయ ప్లాన్లు కొన్ని చివర్లో అడిషనల్ బోనస్ చెల్లింపునకు హామీ ఇస్తాయి. పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్ తీసుకుంటే కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉన్న సందర్భంలో సమ్ అష్యూరెన్స్‌కు అదనంగా ఏదో ఒక రూపంలో చెల్లింపు ఉంటుంది. అదే నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ తీసుకుంటే జీవించి ఉంటే చివర్లో ఏమీ రాదు. టర్మ్ ఇన్సూరెన్స్‌ను నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌గా పేర్కొంటారు. ఇప్పుడు ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వస్తున్నాయి. కనుక ఇక్కడ పొరపాటు పడొద్దు. ప్రీమియం వెనక్కి రాని టర్మ్ ప్లాన్ ప్రీమియంతో పోలిస్తే, చివర్లో ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్ ప్రీమియం అధికంగా ఉంటుంది. -
బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐ
బీమా పాలసీలను విక్రయించేందుకు ఏదో ఒక సంస్థ మీదో లేదా బ్యాంకులపైనో అధికంగా ఆధారపడకూదని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) బీమా కంపెనీలకు సూచించింది. ఇందుకు ప్రత్యామ్నాయాలను వెతకాలని తెలిపింది. పాలసీలను విక్రయించేందుకు ఇతర అనువైన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలని పేర్కొంది.బీమా కంపెనీలు వాటి మాతృ సంస్థలుగా ఉన్న బ్యాంకుల ద్వారానే దాదాపు 90 శాతం పాలసీలను విక్రయిస్తున్నాయని బీమా నియంత్రణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్ని అరికట్టేందుకు ఐఆర్డీఏఐ మార్కెట్ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. సమీప భవిష్యత్తులో పాలసీల విక్రయానికి సంబంధించి కొత్త నిబంధనలతో ముసాయిదాను తీసుకురావాలని ఐఆర్డీఏఐ యోచిస్తోంది. ఇప్పటివరకు అధికంగా బ్యాంకుల ద్వారానే పాలసీలు విక్రయిస్తున్నందున ఒక్కసారిగా ఈ విధానంలో మార్పు రాదని, అందుకు కొంత సమయం పడుతుందని ఒక అధికారి తెలిపారు. పాలసీల విక్రయానికి సంబంధించి ఐఆర్డీఏఐ నిబంధనలు తీసుకురాబోతున్న నేపథ్యంలో కంపెనీలు ఇతర పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్‌పై రూ.5 తగ్గింపు!బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు తమ కస్టమర్లకు మోసపూరిత బీమా పాలసీలను అంటగడుతున్నట్లు ఇప్పటికే బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్డీఏఐ గుర్తించింది. ఇలా మోసపూరితంగా పాలసీలు విక్రయించకూడదని ఐఆర్డీఏఐ ఛైర్మన్ దేబాశీస్ పాండా గతంలో స్పష్టం చేశారు. బ్యాంకర్లు తమ ప్రధాన వ్యాపారంపైనే దృష్టి సారించాలన్నారు. దేశంలో అందరికీ బీమాను చేరువ చేయడంలో బ్యాంకులు కీలకపాత్రే పోషిస్తున్నప్పటికీ, బలవంతంగా మోసపూరిత పాలసీలను అంటగడుతున్నట్లు చెప్పారు. -
బీమా ప్రీమియం వసూళ్లు ఎలా ఉన్నాయంటే..
బీమా ప్రీమియం వసూళ్లు నవంబర్ నెలలో తగ్గినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ గణాంకాలు వెల్లడించింది. 2023 నవంబర్‌లో వసూలైన రూ.26,494 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో బీమా ప్రీమియం రూ.25,306 కోట్లుగా నమోదైంది. గతంలో పోలిస్తే ఇది 4.5% తక్కువగా ఉంది. బీమా రంగంలో ప్రముఖంగా సేవలందిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రీమియం వసూళ్లు ఈసారి తగ్గుముఖం పట్టాయి. దానివల్లే ఈ పరిస్థితి నెలకొందని కౌన్సిల్ అభిప్రాయపడింది.ఎల్ఐసీ ప్రీమియం తగ్గుముఖం పడుతుంటే ప్రైవేట్ సంస్థల ప్రీమియంలో మాత్రం గతంలో కంటే 31 శాతం వృద్ధి కనబడింది. నవంబర్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ రూ.3,222 కోట్లు, మ్యాక్స్ లైఫ్ రూ.748.76 కోట్లు, హెచ్డీఎఫ్సీ లైఫ్ రూ.2,159 కోట్లు, ఎస్బీఐ లైఫ్ రూ.2,381 కోట్ల వరకు ప్రీమియం వసూలు చేశాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీవిత బీమా ప్రీమియం వసూళ్లలో 16% వృద్ధి కనిపించింది. ఎల్ఐసీ కూడా అదే మొత్తంలో వృద్ధి నమోదు చేసింది.ఇదీ చదవండి: తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు!జీవిత బీమా సాధనాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతో కీలకమైంది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీనిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వారు, సంపాదించే శక్తి కలిగిన వారు టర్మ్ ఇన్సూరెన్స్‌తో తమవారికి తగినంత రక్షణ కల్పించుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో ఇప్పటికీ చాలా మందికి టర్మ్ బీమా ప్లాన్లు లేవు. ఏదైనా జరగరానిది జరిగితే కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆసరాగా ఇవ్వగలిగేది టర్మ్ ఇన్సూరెన్స్ అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ దీన్ని తీసుకోని వారు నిపుణుల సలహాతో మంచి పాలసీను ఎంచుకోవాలి. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు?
బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించడంతోపాటు బీమా కంపెనీల్లో విదేశీ పెట్టుబడులను పెంచకూడదని ప్రచార కార్యక్రమాలు సాగనున్నాయి. ఈమేరకు దేశవ్యాప్తంగా జీవిత బీమా ఉద్యోగుల సంఘం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను కలిసి తమ డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని కోరబోతున్నట్లు ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వి.నరసింహన్ పేర్కొన్నారు.బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు, బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐ పెట్టుబడుల పరిమితులను కట్టడి చేయాలనే డిమాండ్‌తోపాటు కొత్త కార్మిక విధానాల (న్యూ లేబర్ కోడ్) ఉపసంహరణకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు నరసింహన్ చెప్పారు. 2010 తర్వాత నియమితులైన ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానం అమలవుతోంది. దాంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఆ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం వర్తింపజేయాలనే డిమాండ్లను కూడా లేవనెత్తనున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: జీడీపీ మందగమనంబీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తే ఆ మేరకు ప్రీమియం రేట్లు దిగొస్తాయి. ఇది కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనాన్ని కల్పించనుంది. జీఎస్టీకి ముందు బీమా పాలసీల ప్రీమియంపై 12% సర్వీస్ ట్యాక్స్ వసూలు చేసేవారు. ప్రస్తుతం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ప్రీమియంపై ట్యాక్స్ మినహాయించాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం వరకు ఎఫ్డీఐకు అనుమతి ఉంది. దీన్ని 100 శాతానికి పెంచే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే దేశీయ బీమా రంగంపై విదేశీ ఇన్వెస్టర్ల విధానాలు అమలవుతాయి. దాంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆరోగ్య బీమా.. పాలసీ సంస్థ మారుతున్నారా?
మారుతున్న ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతోంది. ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది ఆరోగ్య బీమాను ఎంచుకుంటున్నారు. అయితే ఎప్పుడో తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ ప్రస్తుతం మారుతున్న విధానాలకు అనుగుణంగా లేకపోవచ్చు. మార్కెట్లో పోటీ నెలకొని ఇతర కంపెనీలు తక్కువ ప్రీమియంతో మరింత మెరుగైనా సదుపాయాలుండే పాలసీని అందిస్తుండవచ్చు. అలాంటి సందర్భంలో పాలసీను రద్దు చేసుకోకుండా ‘పోర్టబిలిటీ’ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీనివల్ల పాలసీను వేరే కంపెనీకి మార్చుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య పోటీని పెంచడానికి, పాలసీదారులకు మెరుగైన సేవలను అందించడానికి భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ‘పోర్టబిలిటీ’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే వెయిటింగ్ పీరియడ్‌ను పరిగణనలోకి తీసుకుని ఆరోగ్య బీమా పాలసీని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవచ్చు.ప్రస్తుత పాలసీ నిబంధనలు, షరతులు మీ అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు పోర్ట్‌కు ప్రయత్నించాలి.పాలసీ చెల్లించే విలువ తక్కువగా ఉంటూ, ప్రీమియం అధికంగా ఉన్నప్పుడు పోర్ట్‌ను పరిశీలించవచ్చు. అయితే అందులో అధిక క్లెయిమ్ ఇచ్చే సంస్థలను ఎంచుకుంటే ఉత్తమం.స్థానిక ఆసుపత్రులు బీమా సంస్థ నెట్వర్క్ కవరేజ్ జాబితాలో లేనప్పుడు ఈ విధానాన్ని పరిశీలించాలి.ప్రస్తుతం పాలసీ ఉన్న బీమా సంస్థను మార్చుకోవాలని నిర్ణయించుకుంటే పాలసీ రెన్యువల్ చేయడానికి 45 రోజుల ముందే అవసరమైన చర్యలు ప్రారంభించాలి.ప్రస్తుతం చాలా సంస్థలు రెన్యువల్‌కు ఒక రోజు ముందు, పాలసీ గడువు ముగిసిన 15-30 రోజుల వరకూ పోర్ట్ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి.పోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను పూర్తి చేయడమే మేలు.తీరా పాలసీ పునరుద్ధరణ గడువు ముగిసిన తర్వాత కొత్త సంస్థ పాలసీని ఇవ్వలేమంటే ఇబ్బందులు ఎదురవుతాయి.గమనించాల్సినవి..పాలసీని పోర్ట్ పెట్టాలనుకున్నప్పుడు ప్రధానంగా బీమా మొత్తంపై సరైన అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకు మీకు ఒక బీమా సంస్థలో రూ.5లక్షల పాలసీ ఉందనుకుందాం. బోనస్‌తో కలిపి ఈ మొత్తం రూ.7.50లక్షలు అయ్యింది. కొత్త బీమా సంస్థకు మారి, రూ.10 లక్షల పాలసీ తీసుకున్నారనుకుందాం. అప్పుడు కొత్త సంస్థ రూ.7.5 లక్షల వరకే పాత పాలసీగా భావిస్తుంది. మిగతా రూ.2.5 లక్షలను కొత్త పాలసీగానే పరిగణిస్తుంది. ఈ మొత్తానికి సంస్థ నిబంధనల మేరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీనికి ఇతర షరతులూ వర్తిస్తాయి.ఇదీ చదవండి: 13 ఏళ్లలో రూ.75 లక్షలు సమకూరే ప్లాన్వివరాలు అన్నీ తెలపాలి..కొత్త సంస్థకు మారేటప్పుడు ఇప్పటికే ఉన్న పాలసీలో మీరు చేసిన క్లెయిమ్ వివరాలు స్పష్టంగా చెప్పాలి. ఆరోగ్యం, ఇప్పటికే తీసుకున్న చికిత్సల గురించీ వివరించాలి. పాలసీ ఇవ్వరు అనే ఆలోచనతో చాలామంది ఇవన్నీ చెప్పరు. కానీ, పాలసీ వచ్చిన తర్వాత ఇవి బయటపడితే పరిహారం లభించదు. -
ఇన్సూర్టెక్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు
న్యూఢిల్లీ: భారత ఇన్సూర్టెక్ రంగానికి గణనీయమైన వృద్ధి అవకాశాలున్నాయని ఒక నివేదిక తెలిపింది. గడిచిన కొన్నేళ్లలో ఈ రంగం 2.5 బిలియన్ డాలర్లు సమీకరించగా.. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తాయని అంచనా వేసింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), ఇండియా ఇన్సూర్టెక్ అసోసియేషన్ (ఐఐఏ) ఈ నివేదికను రూపొందించాయి.‘‘ప్రస్తుతం భారత్‌లో 150 ఇన్సూర్టెక్ కంపెనీలు (బీమా రంగ టెక్నాలజీ సంస్థలు) ఉన్నాయి. ఇందులో 10 యూనికార్న్‌లు, సూనికార్న్లు, 45కు పైగా మినీకార్న్లు ఉండగా, గడిచిన ఐదేళ్లలో ఆదాయం 12 రెట్లు పెరిగి 750 మిలియన్ డాలర్లకు చేరింది. మొత్తం మీద ఈ రంగంలోకి వచ్చిన నిధులు 2.5 బిలియన్ డాలర్లు. దీంతో మొత్తం ఎకోసిస్టమ్ విలువ 13.6 బిలియన్ డాలర్లను అధిగమించింది’’అని ఈ నివేదిక వివరించింది. డిమాండ్, పంపిణీపై ఇన్సూర్టెక్లు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని, అండర్ రైటింగ్ (రిస్క్‌ల మదింపు), క్లెయిమ్‌లు, సేవల్లో ఆవిష్కరణలకు గణనీయమైన అవకాశాలున్నట్టు ఈ నివేదిక అభిప్రాయపడింది. అపార అవకాశాలు.. గడిచిన ఐదేళ్లలో భారత ఇన్సూర్టెక్ రంగం ఆదాయం 12 రెట్లు పెరిగినప్పటికీ.. భవిష్యత్తులో మరింతగా వృద్ధి చెందే అవకాశాలున్నట్టు బీసీజీ, ఐఐఏ నివేదిక వెల్లడించింది. ‘‘అండర్ రైటింగ్, క్లెయిమ్‌లలో డేటా, టెక్నాలజీ సామర్థ్యాల ను వినియోగించుకునేందుకు ఇన్సూర్టెక్ కంపెనీలకు అపార అవకాశాలున్నాయి’’ అని బీసీజీలో ఇండియా ఇన్సూరెన్స్ ప్రాక్టీస్ లీడ్, ఈ నివేదికకు సహ రచయితగా వ్యవహరించిన పల్లవి మలాని తెలిపారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో ఇన్సూరెన్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.ఇన్సూరెన్స్ పరంగా చెప్పుకోతగ్గ పురోగతి సాధించినప్పటికీ.. హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణ ఇప్పటికీ ఎంతో ప్రాధాన్య అంశంగా ఉందన్నారు. 45 శాతం వైద్య చికిత్సల వ్యయాలను జేబుల నుంచే వ్యయం చేయాల్సి వస్తున్నట్టు వివరించారు. దీంతో 2047 నాటికి నూరు శాతం ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సాధించడంతోపాటు, జేబు నుంచి చేసే వ్యయాలను 10 శాతం లోపునకు పరిమితం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ నివేదిక సూచించింది. ఇక అంతర్జాతీయంగా ఇన్సూర్టెక్ రంగంలోకి నిధుల రాక తగ్గినట్టు, ఆసియా పసిఫిక్ ప్రాంతం ఈ విషయంలో బలంగా నిలబడినట్టు ఈ నివేదిక తెలిపింది. -
‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?
మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతో అనారోగ్యాలు పెరుగుతున్నాయి. దాంతో వైద్య ఖర్చులు అధికమవుతున్నాయి. అందుకు అనుగుణంగా ఆరోగ్య బీమా తీసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో వైద్య ఖర్చులకు బీమా మొత్తం సరిపోకపోవచ్చు. కాబట్టి కొంత ‘ఆరోగ్య నిధి’ని సైతం ప్రత్యేకంగా సమకూర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్య బీమా సరిపోనట్లయితే అత్యవసర నిధిని ఉపయోగించాల్సి రావొచ్చు. దాంతోపాటు అప్పు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆర్థికంగా ఆదుకునేందుకు ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పటివరకు చేసిన పొదుపు, పెట్టుబడులు కరిగిపోకుండా ఇది రక్షిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రత్యేక అనారోగ్య పరిస్థితులున్నవారు ఈ నిధిని తప్పకుండా సిద్ధం చేసుకోవాలి.ఈ నిధి ఎందుకంటే..ఆరోగ్య బీమా పాలసీలో కేవలం వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు మాత్రమే అందిస్తారు. కానీ వైద్యేతర ఖర్చులు పాలసీదారులే భరించాలి. ఒకేవేళ పాలసీ తీసుకునే సందర్భంలో కో-పే(కొంత పాలసీ కంపెనీ, ఇంకొంత పాలసీదారు చెల్లించే విధానం) ఎంచుకుంటే మాత్రం వైద్య ఖర్చుల్లో కొంత పాలసీదారు చెల్లించాల్సి ఉంటుంది. వైద్యం పూర్తవ్వకముందు, వైద్య పూర్తయిన తర్వాత అయ్యే ఖర్చులను పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నిధిని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.చిన్నపాటి ఖర్చుల కోసం..అత్యవసర పరిస్థితులకు ఆరోగ్య బీమా సరిపోతుంది. అయినప్పటికీ కొద్ది మొత్తంలో వైద్య నిధిని ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు రూ.15వేల లోపు వైద్య బిల్లులు అయితే దానికోసం ఆరోగ్య బీమాను వినియోగించకపోవడమే మేలు. ఒకవేళ క్లెయిమ్ చేస్తే పాలసీ రిన్యువల్ సమయంలో వచ్చే అదనపు బోనస్ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది. అలాగని అప్పుచేసి ఆ ఖర్చులు భరించాలని కాదు. అందుకే ఇలాంటి ఖర్చుల కోసం సొంతంగా ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: ఒళ్లో వేసుకుంటే ఫోన్ ఛార్జింగ్!ఎంత ఉండాలంటే..ఈ నిధి ఎంత మొత్తం అవసరం అనేదానికి కచ్చితమైన అంచనాలేం లేవు. మీ జీవినశైలి, మీరున్న ప్రాంతంలో ఖర్చులు, నెలవారీ మిగులుపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులు సొంతంగా భరించాలి. కాబట్టి అందుకు అనుగుణంగా ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి, ఈ నిధిని సొంతంగా నిర్ణయించుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీలో కో-పే లేకపోతే రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు అత్యవసర ఆరోగ్య నిధి ఉంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. -
మభ్యపెట్టి అంటగట్టొద్దు
బ్యాంకులో డబ్బు డిపాజిట్, విత్‌డ్రా, క్రెడిట్ కార్డులు, లోన్లు జారీ.. వంటి కార్యకలాపాలు సాగిస్తుంటారు. దాంతోపాటు వివిధ బీమా పాలసీలు కూడా విక్రయిస్తారు. అయితే కొన్ని బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు తమ కస్టమర్లకు మోసపూరిత బీమా పాలసీలను అంటగడుతున్నట్లు బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్డీఏఐ గుర్తించింది. ఇలా మోసపూరితంగా పాలసీలు విక్రయించకూడదని ఐఆర్డీఏఐ ఛైర్మన్ దేబాశీస్ పాండా తెలిపారు.ఈ సందర్భంగా పాండా మాట్లాడుతూ..‘బ్యాంకర్లు తమ ప్రధాన వ్యాపారంపైనే దృష్టి సారించాలి. మోసపూరిత బీమా పాలసీలు విక్రయించకూడదు. దేశంలో అందరికీ బీమాను చేరువ చేయడంలో బ్యాంకస్యూరెన్స్ (బ్యాంక్ శాఖల ద్వారా బీమా పాలసీలు విక్రయించే) మార్గం చాలా ఉపయోగపడుతోంది. అయితే దీన్ని కస్టమర్లకు అందించడంలో అప్రమత్తంగా ఉండాలి. చాలా జాగ్రత్త వహించాలి. మోసపూరిత పాలసీలను అంటగట్టకూడదు. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకర్ల పాత్ర కీలకం. బీమా పాలసీలను అమ్మడాన్ని ప్రాధాన్యతగా తీసుకోకూడదు’ అని చెప్పారు.ఇదీ చదవండి: నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలుప్రస్తుతం మార్కెట్లో చాలా బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని పాలసీలు విక్రయించినందుకు సిబ్బందికి ఇన్సెంటివ్‌లు ప్రకటిస్తున్నారు. దాంతో కస్టమర్లకు అధిక ప్రయోజనాలు చేకూర్చని పాలసీలను, నిబంధనలు సరిగా తెలియజేయకుండా మోసపూరితంగా అంటగడుతున్నారు. దాంతో ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ బ్యాంకులకు కొన్ని సూచనలు చేశారు. తాజాగా ఐఆర్డీఏఐ ఛైర్మన్ దీనిపై స్పందించారు. -
వడ్డీ రేట్లు భారమే..
ముంబై: ప్రస్తుత వడ్డీ రేట్లను ప్రజలు భారంగా భావిస్తున్నారని, కనుక వాటిని అందుబాటు స్థాయికి తీసుకురావాలంటూ బ్యాంక్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎస్బీఐ నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సులో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుతం భారతీయ పరిశ్రమలు కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందంటూ.. వడ్డీ రేట్లను తగ్గించడం వికసిత్ భారత్ ఆకాంక్షను సాధించడంలో సాయపడుతుందన్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని, ఈ విషయంలో ఆహారపరమైన ద్రవ్యోల్బణాన్ని అవరోధంగా చూడడం సరికాదంటూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం వ్యాఖ్యానించడం తెలిసిందే. అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరడంతో ఆర్బీఐ ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గించకపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. సామాన్యులపై ద్రవ్యోల్బణ భారం: ద్రవ్యోల్బణానికి ప్రధానంగా మూడు లేదా నాలుగు కమోడిటీలు కారణమవుతున్నాయని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. మిగిలిన ప్రధాన ఐటమ్స్ అన్నీ కూడా మూడు లేదా నాలుగు శాతం ద్రవ్యోల్బణం స్థాయిలోనే ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం సూచీ లేదా ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆహార ధరలను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా అన్న చర్చలోకి తాను వెళ్లాలనుకోవడం లేదన్నారు. ద్రవ్యోల్బణం ఎంతో సంక్లిష్టమైనదని, సామాన్యులపై భారం మోపుతుందంటూ.. సరఫరా వైపు చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. వృద్ధి మందగమనంపై ఆందోళనలు అక్కర్లేదన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు బలంగా ఉన్నట్టు కొన్ని సంకేతాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. బ్యాంక్‌లు ప్రధానంగా రుణ వితరణ కార్యకలాపాలకే పరిమితం కావాలని, బీమా తదితర ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో కస్టమర్లకు అంటగట్టొద్దని, ఇది రుణాలను భారంగా మారుస్తుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంపై ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడంలో ఇది చాలా కీలకమని సీతారామన్ స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈలకు 2025–26లో రూ.6.12 లక్షల కోట్లు, 2026–27లో రూ.7 లక్షల కోట్ల మేర రుణ వితరణ లక్ష్యాలను నిర్దేశించినట్టు ఆమె తెలిపారు. అనైతిక విధానాలను అరికట్టండి: దాస్ముంబై: సరైన కేవైసీ ధ్రువీకరణ లేకుండా ఖాతాలు తెరవడం, అబద్ధాలు చెప్పి ఉత్పత్తులను అంటగట్టడం వంటి అనైతిక విధానాలకు అడ్డుకట్ట వేసే దిశగా బ్యాంకులు గట్టి చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఇందుకోసం అంతర్గత గవర్నెన్స్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు. తమ పోర్ట్‌ఫోలియోలను క్రియాశీలకంగా సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పారు. పరిశ్రమల్లో విప్లవాత్మకమైన మార్పుల వల్ల తలెత్తే ముప్పులు.. సవాళ్లను ముందస్తుగా గుర్తించి, నివారించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్ల సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా దాస్ ఈ విషయాలు తెలిపారు. -
వార్షిక వేతనం రూ.5 లక్షలు.. రూ.కోటి పాలసీ ఇస్తారా?
నా వయసు 27 ఏళ్లు. నేను ఏటా రూ.5 లక్షలు సంపాదిస్తున్నాను. నాకు బీమా కంపెనీలు రూ.కోటి టర్మ్ పాలసీ ఇస్తాయా? రూ.5 లక్షల ఆరోగ్య బీమా కూడా తీసుకోవాలనుకుంటున్నాను సరిపోతుందా? - ఆకాశ్మీ వయసును పరిగణలోకి తీసుకుంటే బీమా సంస్థలు సాధారణంగా వార్షికాదాయానికి 20-25 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ వార్షికాదాయం రూ.5 లక్షలు కాబట్టి, మీకు రూ.కోటి పాలసీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఒకే కంపెనీ మీకు రూ.కోటి టర్మ్ పాలసీ జారీ చేయకపోతే మంచి చెల్లింపుల రికార్డున్న రెండు కంపెనీల నుంచి రూ.50 లక్షల చొప్పున పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకునేప్పుడు ఎలాంటి దాపరికాలు లేకుండా మీ ఆరోగ్య వివరాలు కచ్చితంగా తెలియజేయాలి.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్!ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రి పాలైతే లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. మీ వయసులోని వారికి తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందించే ఆరోగ్య బీమా కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఎలాంటి కో-పే(పాలసీదారులు కొంత, కంపెనీ కొంత చెల్లించే విధానం) లేకుండా, పూర్తిగా కంపెనీయే క్లెయిమ్ చెల్లించే పాలసీను ఎంచుకోవాలి. ప్రస్తుతం వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. రూ.5 లక్షలు ప్రస్తుతం సరిపోతాయని మీరు భావిస్తున్నా. భవిష్యత్తులో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి, మీరు రూ.10 లక్షలకు తగ్గకుండా పాలసీ తీసుకోవడం ఉత్తమం. -
నెలకో రూ.లక్ష.. రిటైర్మెంట్ ప్లాన్ ఇలా..
చాలా మందికి రిటైర్డ్ జీవితానికి సంబంధించి కొన్ని ఆలోచనలు ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత కొందరు సముద్రానికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడితే మరికొందరు ప్రశాంతంగా ఏ కొండ ప్రాంతంలోనో లేదా ఊళ్లోనో ఉండాలనుకుంటారు. మన దేశంలో రిటైర్మెంట్ పరిస్థితులు నాటకీయంగా మారుతున్నాయి.పదవీ విరమణ అంటే పరిమితమైన అవసరాలతో ప్రశాంతమైన జీవనమనే రోజులు పోతున్నాయి. నేటి రిటైరీలు ఉద్యోగానంతరం కూడా జీవితాన్ని చురుగ్గా సాగించాలనుకుంటున్నారు. ప్రయాణాలు, హాబీలు, సోషల్ ఎంగేజ్మెంట్ మొదలైన వాటితో సందడిగా గడపాలనుకుంటున్నారు. అయితే, పటిష్టమైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడుకున్న పెట్టుబడులు పెట్టడం ద్వారానే ఈ కల సాకారం కాగలదు. చాలా మందికి తాము సరైన ప్రణాళికనే వేసుకున్నామా, తాము దాచుకుంటున్నది రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు సరిపోతుందా అనే సందేహాలు ఉంటాయి.ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానాల కారణంగా ప్రస్తుతం మనిషి జీవితకాలం మరింతగా పెరుగుతోంది. కాబట్టి ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకో రూ. 1 లక్ష (ఏడాదికి రూ. 12 లక్షలు) అవసరమవుతాయని, 60 ఏళ్ల తర్వాత మరో 15 ఏళ్ల పాటు జీవిస్తారనుకుంటే మొత్తం రూ. 1.8 కోట్లు (రూ. 12 లక్షలు గీ 15) అవసరమవుతాయి. 85 ఏళ్ల వరకు జీవిస్తే రూ. 3 కోట్లు అవసరమవుతాయి. ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఇలా అదనపు సంవత్సరాల కోసం ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక వనరుల సమీకరణకు కృషిరిటైర్మెంట్ తర్వాత కూడా జీవితం నిశ్చింతగా సా గేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు అన్ని అవకాశాలను పరిశీలించండి. వాస్తవ గణాంకాలను పరిగణన లోకి తీసుకోండి. మీ నెలవారీ జీవన వ్యయాలను లెక్కేయండి. ముందుగా చెప్పినట్లు జీ విత కాలం 85 ఏళ్లనుకుంటే, 60 ఏళ్ల వ్యక్తికి అప్పటివరకు అయ్యే జీ వన వ్యయాల కోసం రూ. 3 కోట్ల వర కు ని ధి అవసరమవుతుంది. వార్షిక ద్రవ్యోల్బణానికి సమాన స్థాయిలో రాబడులు ఉంటాయన్న అంచనా లతో ఈ మేరకు లెక్క వేశాం. మీ ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని లెక్క వేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. దేశీయంగా పెరుగుతున్న హెల్త్‌కేర్ ఖర్చులను ఒకసారి చూద్దాం. హెల్త్‌కేర్ ద్రవ్యోల్బణం సుమారు 14 శాతంగా ఉంటోంది. కొత్త టెక్నాలజీలు, చికిత్సల వల్ల బిల్లుల భారం మరింతగా పెరుగుతుంది. వైద్య చికిత్సల ఖర్చులు పెరిగే కొద్దీ ఎమర్జెన్సీల కోసం మరింత నిధిని పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. పెరిగే ఖర్చులను తట్టుకునేందుకు మీరేం చేయాల్సి ఉంటుందంటే..పెద్ద మొత్తంలో కవరేజీ ఉండేలా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలిబేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను పరిమాణాన్ని పెంచుకునేందుకు టాప్–అప్ తీసుకోవాలిమేజర్ అనారోగ్యం బైటపడినప్పుడు ఏకమొత్తంగా డబ్బునందించే క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్‌ను పరిశీలించాలిజీవితకాలానికి మించే రిటైర్మెంట్ ఫండ్‌ను సమకూర్చుకోవాలంటే ఏం చేయాలంటే.. 1. భారీ రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం: పొదుపు చేయాలి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. 2. ఆర్థిక సాధనాలు ఉపయోగించుకోవాలి: మీ రిటైర్మెంట్ ఫండ్‌ను పెంచుకునేందుకు జీవిత బీమా సాధనాలను పరిశీలించండి. ఏ ఆర్థిక ప్రణాళికైనా, ముఖ్యంగా రిటైర్మెంట్లాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు మొదలైనవి విజయవంతం కావాలంటే జీవిత బీమా, ఆరోగ్య బీమా కవరేజీలు తగినంతగా ఉండటం ముఖ్యం. 3. పన్ను ప్రయోజనాలు: బీమా పథకాలు సాధారణంగా పన్నులపరమైన ప్రయోజనాలు కల్పించేవిగా ఉంటాయి. -
బీమా విస్తరణకు టెల్కోల సాయం
ముంబై: దేశంలో బీమాను అందరికీ చేర్చేందుకు టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ సీఈవో, ఎండీ సిద్ధార్థ మొహంతి అన్నారు. ‘ఏజెంట్లు, బ్రోకర్లు, బ్యాంక్–ఇన్సూరెన్స్‌తో సహా ప్రస్తుత ఛానెల్‌లు ప్రభావవంతంగా ఉన్నాయి. విస్తారమైన, మారుమూల గ్రామీణ మార్కెట్‌కు బీమాను విస్తరించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో పరిమితులు ఉన్నాయి. భవిష్యత్తులో సంప్రదాయేతర విధానాలను అమలు పర్చాల్సిందే. అందరికీ బీమాను చేర్చాలంటే పంపిణీ, మార్కెటింగ్ అంశాలను పునరాలోచించాలి. టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ వంటి సంప్రదాయేతర కంపెనీల సహకారంతోనే బీమా పాలసీలను పెద్ద ఎత్తున జారీ చేసేందుకు వీలవుతుంది. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకూ విస్తరించాయి. వీటితో భాగస్వామ్యం చేయడం ద్వారా సరసమైన, అందుబాటులో ఉండే కవరేజ్ అందరికీ లభిస్తుంది. కొత్త విధానాన్ని అనుసరించడం వల్ల వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి బీమా సంస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తాయి. 100 కోట్ల మందికిపైగా బీమా చేర్చడం అంత సులువు కాదు. గ్రామీణ, తక్కువ–ఆదాయ వర్గాలను చేరుకోవడానికి డిజిటల్ టెక్నాలజీ కీలకం. ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్, ఆటోమేషన్ వంటి సాంకేతికతలు, ప్లాట్‌ఫామ్‌లు మొత్తం బీమా రంగాన్ని విప్లవాత్మకంగా, మరింత కస్టమర్–ఫ్రెండ్లీగా మారుస్తున్నాయి’ అని సీఐఐ సదస్సులో వివరించారు. -
పాలసీదారుల డేటా లీక్..! ఐటీ సిస్టమ్‌ల ఆడిట్
పాలసీదారుల డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ బీమా కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలని సూచించింది. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తామని వివరించింది.ఐఆర్డీఏఐ ప్రకటనలోని వివరాల ప్రకారం..‘డేటా ఉల్లంఘనలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. పాలసీదారుల ప్రయోజనాలు కాపాడేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోంది. బీమా తీసుకున్నవారి డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో రెండు సంస్థలకు(పేర్లు వెల్లడించలేదు) చెందిన ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలి. ఇందుకు స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలి. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి ఐఆర్డీఏఐ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది’ అని తెలిపింది.ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..రెండు సంస్థల పేర్లను ఐఆర్డీఏఐ వెల్లడించకపోయినప్పటికీ ఆ జాబితాలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. డేటా లీకేజీ జరిగిన మాట వాస్తవమేనని ఆ కంపెనీ ఇటీవలే వెల్లడించడం ఇందుకు కారణం. ఇక డేటా ఉల్లంఘన బారిన పడిన రెండో సంస్థ పేరు తెలియరాలేదు. ఇదిలాఉండగా, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలిసింది. -
EPFO: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్‌పై మరింత ప్రయోజనం
ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులందరికీ బీమా ప్రయోజనాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మెరుగుపరిచిన ఈ పథకం రూ. 7 లక్షల వరకు జీవిత బీమా రక్షణను అందిస్తుంది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 28 నుండి వర్తింపులోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.1976లో ప్రారంభమైన ఈ పథకం ఈపీఎఫ్ఓ సభ్యులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణగా నిలుస్తోంది. ఈ స్కీమ్ కింద కనీసంగా రూ. 1.5 లక్షలు, గరిష్టంగా రూ. 6 లక్షల బీమా కవరేజీని 2018లో ప్రవేశపెట్టారు. ఇది 2021 ఏప్రిల్ వరకు కొనసాగింది. మళ్లీ 2021 ఏప్రిల్ 28 నుంచి పొడిగిస్తూ కనీస బీమా ప్రయోజనాన్ని రూ. 2.5 లక్షలకు, గరిష్ట కవరేజీని రూ.7 లక్షలకు పెంచారు.ఇదీ చదవండి: బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్..అంతేకాకుండా ఈ లబ్ధి పొందేలంటే చివరి 12 నెలలు ఒకే సంస్థలో పనిచేసి ఉండాలన్న నిబంధనను కూడా ప్రభుత్వం సడలించింది. వేర్వేరు కంపెనీల్లో పనిచేసి ఉన్నా సరిపోతుంది. ఈ పథకం చెల్లుబాటు ఈ ఏడాది ఏప్రిల్ 27తో ముగియగా ఈ ప్రయోజనాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల వెల్లడించారు. ఈ చొరవ ఇప్పుడు 6 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులకు రూ. 7 లక్షల వరకు జీవిత బీమాను అందిస్తుంది. -
పెళ్లి చేసే కుటుంబాలకు ధీమా.. వివాహ బీమా
పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. దీన్ని తరాలు గుర్తిండిపోయేలా వైభవంగా జరపాలనుకుంటారు. పెళ్లి బట్టల షాపింగ్ నుంచి వధువు అత్తారింట్లో కాలుమోపే వరకు రూ.లక్షలు ఖర్చు చేస్తారు. మొన్నామధ్య అనంత్ అంబానీ పెళ్లికి ముఖేశ్ అంబానీ కుంటుంబం కోట్లల్లో ఖర్చు చేసినట్లు వార్తలొచ్చాయి. పెళ్లిలో ఎలాంటి అవాంతరం జరగకుండా ఉండాలని అందరం కోరుకుంటాం. కానీ ఏదైనా ప్రమాదం జరిగి ఆస్తి నష్టం కలిగి, బంధువులు గాయాలపాలైతే..పెళ్లి చేస్తున్న కుటుంబ సభ్యులకు తీరని వ్యథగా మారుతుంది. అలాంటి వారికోసం చాలా బీమా కంపెనీలు వివాహ బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినా ఈ బీమా ఆర్థికంగా ఆదుకుంటుంది.వివాహ వేడుక స్థాయి, సర్వీసులను బట్టి బీమా కంపెనీలు ప్రీమియం నిర్ణయిస్తున్నాయి. భారీ కార్యక్రమం, విస్తృతమైన సర్వీసులకు కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. సందర్భాన్ని బట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవరేజీ వివిధ రకాలుగా ఉంటుంది.లయబిలిటీ కవరేజీ..పాలసీదార్ల వల్ల ఇతరులకు ఏదైనా హాని, ఆస్తి నష్టంలాంటిది జరిగితే ఈ కవరేజీ వర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏవైనా లీగల్ ఖర్చులు, చెల్లింపులు చేయాల్సి వస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే మాత్రం కవరేజీ వర్తించదని గుర్తుంచుకోవాలి. ఈ తరహా కవరేజీ థర్డ్ పార్టీకి చెల్లించాల్సిన నష్టపరిహారానికి మాత్రమే పరిమితమవుతుంది. దీనితో పాలసీదార్లకు ప్రత్యేకంగా పరిహారమేమీ లభించదు.ఏదైనా కారణాల వల్ల పెళ్లి రద్దైనా లేదా వాయిదా పడినా క్యాన్స్లేషన్ కవరేజీ ఉపయోగపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. విలువైన వస్తువులు పాడైనా దాని కోసం ప్రత్యేకంగా కవరేజీ అందిస్తున్నారు. పేరొందిన బీమా కంపెనీలతో పాటు ప్రత్యేకంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను అందించే సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పాలసీని తీసుకునేటప్పుడు తమ నిర్దిష్ట అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ఎంత వరకు కవరేజీ వస్తుంది, క్లెయిమ్‌ల ప్రక్రియ ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి బీమా సంస్థలను కనుక్కోవాలి.ఇదీ చదవండి: స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్..కంపెనీలకు నష్టం!వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో యాడ్–ఆన్లు, రైడర్లు కూడా ఉంటున్నాయి. దుస్తులు మొదలుకుని హనీమూన్ వరకు ఇవి కవరేజీనిస్తాయి. ఉదాహరణకు పెళ్లి దుస్తులు దెబ్బతిన్నా లేక తీసుకొస్తుండగా దారిలో పోయినా.. ‘అటైర్ కవరేజీ’ రైడర్లాంటిది ఆదుకుంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే.. వివాహ వేడుక స్థాయి, ప్రాంతం, తీసుకోబోయే కవరేజీ వంటి అంశాలన్నీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. అయితే ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ మించిపోయినా, ఇతరత్రా మనసు మార్చుకుని వేరే ప్రణాళికలు వేసుకున్నా కవరేజీపైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి పాలసీపరంగా దేనికి కవరేజీ ఉంటుంది, దేనికి మినహాయింపు ఉంటుంది వంటి అంశాలను ముందుగా క్షుణ్నంగా తెలుసుకోవాలి. -
విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..
దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల అక్టోబర్ 14న వివిధ నగరాల నుంచి గరిష్ఠంగా 4,84,263 మంది విమానాల్లో ప్రయాణం సాగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన 4,71,751 రికార్డుతో పోలిస్తే ఇది 2.6 శాతం అధికం. విహార యాత్రల కోసం విదేశాలకు వెళ్లేప్పుడు ఎన్ని రోజులు వెళ్లాలి.. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. మరి, వెళ్లినచోట ఏదైనా అనారోగ్య పరిస్థితి ఎదురైతే..వెంటతీసుకెళ్లిన సామాగ్రి పోగొట్టుకుంటే.. కంగారు పడకండి.. అలాంటి వారికోసమే చాలా కంపెనీలు ప్రయాణబీమా అందిస్తున్నాయి. దానికి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం.ఆరోగ్య అత్యవసర పరిస్థితి కోసం..నిత్యం వేలసంఖ్యలో విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు విదేశాలకు వెళ్తూంటారు. వారికి వెళ్లినచోట ఎప్పుడైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి రావొచ్చు. అలాంటి వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రయాణ బీమా పాలసీలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల చికిత్సలు కవర్ అయ్యేలా ఉండే బీమా పాలసీను ఎంచుకోవాలి. ఎలాంటి షరతులూ, నిబంధనలు లేకుండా పూర్తి వైద్య ఖర్చులను చెల్లించే పాలసీను తీసుకువాలి.విభిన్న దేశాలు.. ఒకే పాలసీ..ఒకసారి బీమా తీసుకుంటే చాలా ప్రయాణాలకు ఉపయోగపడే పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి ముఖ్యంగా వ్యాపారవేత్తలకు సరిపోతాయి. ఒకటికి మించి దేశాలకు ప్రయాణించే వారు ఆయా దేశాలన్నింటిలోనూ పాలసీ అమలయ్యేలా ఒకే పాలసీని ఎంచుకోవచ్చు. అమెరికాలో ఏడు రోజులపాటు పర్యటించాలనుకుంటే బీమా ప్రీమియం కంపెనీను అనుసరించి దాదాపు రూ.800-రూ.900 వరకు ఉంటుంది.ఇదీ చదవండి: ఎక్కేద్దాం... ఎగిరిపోదాం! విమాన ప్రయాణికుల జోరుసామాగ్రి అందకపోయినా ధీమాగా..ఒకటి కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించేవారు నిత్యం సామాగ్రి వెంట తీసుకెళ్లాలంటే కష్టం. కాబట్టి ఇతరదేశంలోని చిరునామాలో తమ సామగ్రి చేరేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక్కోసారి ఆ సామగ్రి చేరడం ఆలస్యం అవుతుంది. దాంతో వారు ఇబ్బందులు పడకుండా బీమా సంస్థ పరిహారం ఇచ్చేలా పాలసీలున్నాయి. మొదటిసారి విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు సామాగ్రి అందకపోతే ఆర్థికంగా ఎంతో నష్టపోతారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణ బీమా వారికి పరిహారం అందిస్తుంది. -
రూ.9 చెల్లిస్తే.. రూ.25000 ప్రయోజనం: ఫోన్‌పేలో కొత్త ప్లాన్
దీపావళి సమీపిస్తోంది. ఈ పండుగ ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఆదమరిస్తో అంత విషాదాన్ని నింపేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మొబైల్ పేమెంట్స్ యాప్ 'ఫోన్‌పే' బాణసంచా సంబంధిత ప్రమాదాలు జరిగినప్పుడు ఉపశమనం కల్పించడానికి ఫైర్‌క్రాకర్ బీమా ప్లాన్ తీసుకువచ్చింది.ఫోన్‌పే పరిచయం చేసిన ఈ కొత్త ఫైర్‌క్రాకర్ బీమా ప్లాన్ కేవలం తొమ్మిది రూపాయలకే అందుబాటులో ఉంది. దీని ద్వారా 10 రోజుల పాటు రూ. 25,000 వరకు కవరేజి లభిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు.. బాధితులు ఆసుపత్రిలో చేరడం లేదా మరణం సంభవిస్తే దానికయ్యే ఖర్చుల నుంచి ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఈ బీమా ఉపయోగపడుతుంది.ఫైర్‌క్రాకర్ బీమా ప్లాన్ కవరేజ్ అక్టోబర్ 25 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బీమా కోసం ఫోన్‌పే యాప్‌లోనే అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం వినియోగదారుకు మాత్రమే కాకుండా.. జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలతో సహా గరిష్టంగా నలుగురు కుటుంబ సభ్యులకు కవరేజి లభిస్తుంది.ఇదీ చదవండి: 'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'ఫైర్‌క్రాకర్ బీమా కోసం ఎలా అప్లై చేయాలంటే➤ఫోన్‌పే యాప్‌లోని బీమా విభాగాన్ని సెలక్ట్ చేసుకున్న తరువాత, అక్కడే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ కనిపిస్తుంది.➤ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ ఎంచుకున్న తరువాత ప్లాన్ వివరాలు చూడవచ్చు. ఇక్కడే బీమా మొత్తం రూ. 25000, ప్రీమియం రూ. 9 ఉండటం చూడవచ్చు.➤కింద కనిపించే కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తరువాత పాలసీ పీరియడ్ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఉన్నట్లు కనిపిస్తుంది. దాని కిందనే పాలసీదారు వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. అన్నీ పూర్తయిన తరువాత తొమ్మిది రూపాయలు చెల్లించాలి. ఇలా సులభంగా ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవచ్చు. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటు
బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్టీను సరళీకరించేందుకు మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ రేటుకు సంబంధించి 13 మందితో కూడిన ఈ మంత్రుల సంఘం సూచనలిస్తుంది. అక్టోబర్ 30న ఈ కమిటీ తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.జీఎస్టీ మండలి ఏర్పాటు చేసిన ఈ కమిటీకి బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ ఛౌధ్రి నేతృత్వం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, గోవా, మేఘాలయ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల మంత్రుల సంఘం సిఫారసులు అందించనుంది. గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని తెలిపారు. ఈమేరకు ఆర్థికమంత్రికి లేఖ సైతం పంపించారు. అంతకుముందే బీమా ప్రీమియంపై జీఎస్టీ సరళీకరించాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉంది. దాంతో త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. అందులో భాగంగానే తాజాగా మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసి నివేదిక కోరుతున్నారు.ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్ ఆరోపణలునవంబర్లో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో దీన్ని 5 శాతానికి తగ్గించాలనే డిమాండ్ ఉంది. మరి కొన్నింటిలో ప్రీమియంపై పూర్తిగా జీఎస్టీను ఎత్తివేయాలని కోరుతున్నారు. -
సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే..
ఇప్పటివరకు మనుషులకు, జంతువులకు, వ్యాపారాలకు, వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకోవడం గురించి వినే ఉంటారు. ఇప్పుడు కొన్ని సంస్థలు ఏకంగా సైబర్ మోసాలకు కూడా ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. దీనికోసం రోజుకు కేవలం మూడు రూపాయలు మాత్రమే వెచ్చించాల్సి ఉంటుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..టెక్నాలజీ రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న తరుణంలో సైబర్ మోసాలు కూడా అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. సైబర్ మోసాల భారీగా పడి నష్టపోయిన ప్రజలు చాలామందే ఉన్నట్లు గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఈ నష్టాలను భర్తీ చేయడానికి చిన్న ఇన్సూరెన్స్ ప్లాన్లను కూడా కొన్ని సంస్థలు తీసుకురావడం జరిగింది.ఐడెంటిటీ చోరీ, డబ్బు పోగొట్టుకోవడం, ఫిషింగ్, ఈ-మెయిల్ స్పూపింగ్, సైబర్ స్టాకింగ్ మొదలం వాటికి ఇన్సూరెన్స్ లభిస్తుంది. అయితే ఇవన్నీ చిన్న మొత్తంలో కవరేజికి పనికొస్తాయి. ఈ రిస్క్ కవరేజీలు రోజుకు మూడు రూపాయల వద్ద లభిస్తున్నాయి. భారీ మొత్తంలో జీవిత భీమా, వెహికల్స్ ఇన్సూరెన్స్ మాదిరిగా లభించదు.ఇదీ చదవండి: ఈ-సిమ్ పేరుతో మోసం.. రూ.27 లక్షలు మాయం సైబర్ నేరగాళ్లు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. ఇందులో నకిలీ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, టెక్స్ట్ మెసేజస్, ఫ్రాడ్ కాల్స్, పేస్ మార్పింగ్, ఓటీపీ వంటివి ఎన్నో ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే.. నేరగాళ్లు ప్రజలను దోచుకోవాడానికి అన్ని విధాలా ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాయలో పడితే.. భారీ నష్టాలను చవి చూడాలి ఉంటుంది. కాబట్టి ఈ భారీ నుంచు కొంత ఉపసమయం పొందటానికి ఈ ఇన్సూరెన్స్ ఉపయోగోపడుతుంది. -
ధీమాగా బీమా.. ఇలా!
'ఇన్సూరెన్స్'.. ఈ పదం మన నిత్యజీవితంలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ రోజుల్లో మనుషులకు, జంతువులకు, వాహనాలకు ఇన్సూరెన్స్ చాలా అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు అనేక ఆఫర్లను అందిస్తూనే ఉన్నాయి. అయితే మీరు వాహనాలను కొనుగోలు చేసినప్పుడు.. దానికి ఇన్సూరెన్స్ పొందాలనుకున్నప్పుడు, తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఈ కథనంలో చూసేద్దాం..బీమా కవరేజ్వాహనాలను ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఆ పాలసీ అందించే కవరేజ్ గురించి తెలుసుకోవాలి. భారతదేశంలో మోటారు బీమా పాలసీ రెండు ప్రధాన రకాల కవరేజీలను అందిస్తుంది. అవి థర్డ్-పార్టీ లయబిలిటీ, సమగ్ర కవరేజ్ (Comprehensive Coverage).కొత్త కారును కొనుగోలు చేసే సమయంలోనే కారు డీలర్ ద్వారా థర్డ్-పార్టీ బీమా అందిస్తారు. ఇది ఒక బేసిక్ ఇన్సూరెన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే.. శారీరక గాయాలు, వైకల్యం, మూడో వ్యక్తి యొక్క వాహనం లేదా ఆస్తికి సంభవించే నష్టాలను మాత్రమే ఇది భర్తీ చేస్తుంది. థర్డ్-పార్టీ బీమా పాలసీ నిబంధనల ప్రకారం, మీ వాహనానికి జరిగిన నష్టానికి ఈ కవరేజి ద్వారా క్లెయిమ్ చేసుకోలేరు.ఇక సమగ్ర కవరేజ్ విషయానికి వస్తే.. రోడ్డు ప్రమాదం వంటి ఏదైనా ఊహించని సంఘటనల్లో కారుకు సంభవించే నష్టాలకు ఇది భర్తీ చేస్తుంది. కాబట్టి మోటారు బీమా పాలసీని ఎంచుకునే ముందు మీకు కావలసిన కవరేజీ గురించి తెలుసుకుని ఎంచుకోవాలి.ప్రీమియం & ఐడీవీబీమా పాలసీని ఎంచుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా ప్రీమియం లేదా ఐడీవీ (Insured Declared Value) గురించి కూడా తెలుసుకోవాలి. మీ కారు ఏదైనా రిపేరుకు మించి లేదా ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పాడైపోయినప్పుడు ప్రీమియం కవరేజీ నష్టాన్ని భర్తీ చేస్తుంది.ఐడీవీ విషయానికి వస్తే.. దీనిని ఎంచుకునే ముందు మీరు కారు ప్రస్తుత మార్కెట్ విలువను అంచనా వేసుకోవాలి. కారు బీమా పాలసీని ఆన్లైన్లో సరిపోల్చేటప్పుడు, కారు మార్కెట్ విలువకు దగ్గరగా ఉండే IDVని ఎంచుకోవచ్చు. అనుకోని ప్రమాదంలో మొత్తం కారు ధ్వంసమైనప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు ఈ కవరేజీ పనికొస్తుంది.యాడ్ ఆన్ కవర్స్మెరుగైన కవరేజ్ కోసం యాడ్-ఆన్‌లను కొనుగోలు చేయవచ్చు. సమగ్ర మోటారు బీమా పాలసీలో కవర్ చేయని కొన్ని నష్టాలను దీని ద్వారా కవర్ చేసుకోవచ్చు.ఉదాహరణకు.. ప్రమాదం సమయంలో కారు టైర్లకు డ్యామేజ్ జరిగితే.. ఆ నష్టాన్ని సాధారణ బీమా ద్వారా భర్తీ చేసుకోలేరు. కానీ ఈ యాడ్ ఆన్ కవర్స్ కొనుగోలు చేసి ఉంటే.. ఆ నష్టాన్ని కూడా భర్తీ చేసుకోవచ్చు. కొత్త కారును కలిగి ఉన్నప్పుడు టైర్ కవర్, ఇంజిన్ కవర్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్, ఇన్వాయిస్ కవర్ వంటి వాటికోసం యాడ్ ఆన్ కవర్స్ ఎంచుకోవాలి.నో క్లెయిమ్ బోనస్నో క్లెయిమ్ బోనస్ (NCB) అనేది ఒక సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయనందుకు బీమా కంపెనీలు అందించే రివార్డ్. మీరు కారు ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేసినప్పుడు ప్రీమియంపై తగ్గింపు రూపంలో రివార్డ్ పొందవచ్చు. వరుసగా 5 సంవత్సరాలు క్లెయిమ్ చేయని పక్షంలో.. మీరు మీ రెన్యూవల్ ప్రీమియంపై50 శాతం వరకు NCB తగ్గింపును పొందవచ్చు.ఇదీ చదవండి: కారు ప్రమాదానికి గురైందా? ఇన్సూరెన్స్ ఇలా క్లెయిమ్ చేసుకోండిఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలిఇన్సూరెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్యాష్‌లెస్ క్లెయిమ్.. రెండు రీయింబర్స్మెంట్ క్లెయిమ్. ఇందులో క్యాష్‌లెస్ క్లెయిమ్ అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే కారుకు ప్రమాదం జరిగితే.. దాన్ని రిపేర్ చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చు సదరు కంపెనీ భరిస్తుంది.రీయింబర్స్మెంట్ క్లెయిమ్ అయితే.. ముందుగా కారును రిపేర్ చేసుకుని, ఆ తరువాత బిల్స్‌ను కంపెనీలకు చూపించి క్లెయిమ్ చేసుకోవాలి ఉంటుంది. ఆ బిల్స్ అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరిస్తే.. మీ డబ్బు మీకు వస్తుంది. ఇలాంటి విషయాలను ముందుగానే తెలుసుకుని మీ అవసరాలకు సరిపోయే బీమా పాలసీని ఎంచుకోవచ్చు. -
వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?
షోరూమ్‌లో కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే తప్పకుండా బీమా తీసుకోవాల్సిందే. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ఇది అందరికీ వర్తిస్తుంది. సాధారణంగా లాంగ్‌టర్మ్ బీమా ఎంచుకుంటే ఐదేళ్లు బీమా వెసులుబాటు ఉంటుంది. అయితే బీమా అయిపోయాక చాలామంది దాన్ని తిరిగి రెన్యువల్ చేయడం లేదు. తొలి పాలసీ గడువు ముగిసిన తర్వాత భారత్‌లో కేవలం 19 శాతం టూ వీలర్ యజమానులు మాత్రమే బీమా రెన్యువల్ చేయిస్తున్నారు. వాహనం తీసుకున్న కొత్తలో అనివార్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీమా తీసుకోవాల్సిందే. కానీ బీమా సమయం పూర్తయిన తర్వాత కూడా వాహనదారులు ఇన్సూరెన్స్ చేయించాలి.మార్కెట్లో ఆప్లైన్తోపాటు ఆన్లైన్లో చాలా వెబ్పోర్టళ్ల ద్వారా టూవీలర్ బీమాను రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే బీమా తీసుకునేప్పుడు గమనించాల్సిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల బీమాలున్నాయి. మొదటిది థర్డ్ పార్టీ బీమా, రెండోది సమగ్ర బీమా. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు వాహనాన్ని నడిపే వ్యక్తికి కాకుండా ఇతరులకు ఏదైన జరిగితే పరిహారం ఇచ్చేలా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. శారీరక గాయాలు, ఆస్తి నష్టం, మరణం.. వంటివి ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. సొంత వాహనానికి జరిగే నష్టం మాత్రం దీనిలోకి రాదు.విస్తృత బీమావిస్తృత బీమా ప్రయోజనాలు దీని పరిధిలోకి వస్తాయి. ప్రమాదం, దొంగతనం, వరదలు, అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, థర్డ్ పార్టీకి వాటిల్లిన నష్టాన్నీ ఇది భర్తీ చేస్తుంది.ఇవి తెలుసుకోండి..కవరేజీ: బీమా పాలసీ ఎంచుకునేప్పుడు మొత్తం ఎంత కవరేజీ అవసరమో తెలుసుకోవాలి. నిత్యం వాహనాన్ని ఉపయోగిస్తుంటే దాని విలువ ఆధారంగా కవరేజీని అంచనా వేయాలి. థర్డ్-పార్టీ చేయించినప్పటికీ.. సమగ్ర బీమా ఉండటమే మేలు. ఏదైనా అనుకోని ప్రమాదం వాటిల్లినా పూర్తి భద్రత ఉంటుంది.ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ: వాహనం తీవ్రంగా దెబ్బతిన్నా లేదా దొంగతనానికి గురైనా కంపెనీలు అత్యధికంగా చెల్లించే పరిహారమే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ (ఐడీవీ). వాహనాన్ని కొనుగోలు చేసి చాలా రోజులైతే క్రమంగా దాని విలువ తగ్గిపోతోంది. ఐడీవీ మార్కెట్లో వాహన ప్రస్తుత ధరను తెలియజేస్తుంది.బీమా కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియా(సీఎస్ఆర్) తెలుసుకోవాలి. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు.కొన్ని కంపెనీలు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం కొంత మొత్తంలో బీమా తీసుకునే సమయంలోనే వసూలు చేస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగి వాహనం రోడ్డుపై నిలిచిపోతే దాన్ని సర్వీస్ సెంటర్ వరకు భద్రంగా చేరవేసేందుకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్ఆన్ ఉపయోగపడుతుంది.బీమా రెన్యువల్ చేసిన ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే తర్వాత సంవత్సరం కట్టే ప్రీమియంకు కొన్ని కంపెనీలు రాయితీలు ఇస్తుంటాయి.ఇదీ చదవండి: ఉక్కు ఉత్పత్తుల దిగుమతి సుంకం పెంపుఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహన రిపేర్ల కోసం ఎలాంటి నగదు చెల్లించకుండా ఉండే పాలసీను ఎంచుకోవాలి. పాలసీ నెట్వర్క్ గ్యారేజీల్లో ఉచితంగానే రిపేర్ చేస్తారు. మీరు ఉంటున్న ప్రదేశాల్లో బీమా కంపెనీ నెట్వర్క్ గ్యారేజీలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. -
70 ఏళ్లుపైబడినవాళ్లకు ఆయుష్మాన్ భారత్ అమలు
న్యూఢిల్లీ, సాక్షి: దేశంలో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు సైతం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్భారత్ వర్తింపజేస్తూ నిర్ణయం. ఈ నిర్ణయంలో గొప్ప మానవతా దృక్పథంతో కూడుకున్నది: మంత్రి అశ్వినీ వైష్ణవ్తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది కలుగుతుంది: మంత్రి అశ్వినీ వైష్ణవ్వీరంతా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కుతుంది: మంత్రి అశ్వినీ వైష్ణవ్ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా (AB PMJAY) పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో కేంద్రం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందుతాయి.కేబినెట్ నిర్ణయాలుపీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ పథకానికి ఆమోదం.. రూ.10,900 కోట్ల కేటాయింపు.. ఈవీలపై సబ్సిడీ కొనసాగింపు.. 88,500 ప్రదేశాల్లో ఛార్జింగ్‌ల ఏర్పాట్లు జలవిద్యుత్ ప్రాజెక్టులకు రూ.12,461 కోట్ల కేటాయింపు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన.. రూ. 70,125 కోట్ల రూపాయల కేటాయింపునకు ఆమోదం.. 25,000 గ్రామాలను కలిపేలా రోడ్ల నిర్మాణం పీఎం ఈ -బస్ సేవా పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. రూ. 3,435 కోట్ల రూపాయలతో 38వేల ఈ -బస్ ల ఏర్పాటు వాతావరణ శాఖ టెక్నాలజీ(మిషన్ మౌసమ్) కోసం రూ.2 వేల కోట్ల కేటాయింపు -
మంచి డైనమిక్ బాండ్ ఫండ్స్ ఏవంటే..
జీవిత బీమా విషయానికొస్తే మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి ఎంపిక ఉత్తమం? – జితేంద్రజీవిత బీమా పాలసీ కొనుగోలు చేయాలన్న మీ నిర్ణయం అభినందనీయం. ఆర్థికంగా తమపై ఆధారపడిన వారుంటే తప్పకుండా దీన్ని తీసుకోవాలి. తమకు ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు కుటుంబ అవసరాలను ఆదుకుంటుంది. మనీబ్యాక్, యులిప్, పెన్షన్ ప్లాన్లు ఇవన్నీ హైబ్రిడ్ బీమా ఉత్పత్తుఉలు. ఇవి జీవిత బీమాతోపాటు పెట్టుబడుల ప్రయోజనాన్ని ఆఫర్ చేస్తుంటాయి. దీంతో చూడానికి ఆకర్షణీయంగా అనిపిస్తాయే కానీ, వాస్తవంలో కాదు. ఎందుకంటే ఈ తరహా పాలసీలు తగినంత జీవిత బీమా రక్షణను ఇవ్వవు.భారీ రక్షణ కోరుకుంటే ప్రీమియం చాలా ఖరీదుగా మారుతుంది. ఇక ఈ ప్లాన్లలో పెట్టుబడులపై రాబడులు చాలా తక్కువ. కనుక బీమా, పెట్టుబడులను వేర్వేరుగా నిర్వహించుకోవడం మంచిది. పెట్టుబడుల కోసం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవాలి. జీవిత బీమా కోసం అచ్చమైన టర్మ్ ప్లాన్‌ను పరిశీలించాలి.హైబ్రిడ్ ప్లాన్లతో పోల్చి చూస్తే టర్మ్ ప్లాన్ల ప్రీమియం ఎంతో అందుబాటులో ఉంటుంది. 35 ఏళ్ల ఆరోగ్యవంతుడైన పురుషుడికి రూ.కోటి కవరేజీకి ఏటా చెల్లించాల్సిన ప్రీమియం రూ.15,000. చాలా మంది బీమా పాలసీని ఏజెంట్ లేదా బ్రోకర్ ద్వారా తీసుకుంటుంటారు. దీంతో వారు తమకు అధిక కమీషన్ లభించే హైబ్రిడ్ ప్లాన్లను అంటగడుతుంటారు.అచ్చమైన టర్మ్ ప్లాన్‌లో జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనం రాదు. అలాంటివి టర్మ్ ప్లాన్లు అని సులభంగా గుర్తించొచ్చు. కేవలం పాలసీదారు మరణించిన సందర్భంలోనే ఈ ప్లాన్ల కింద పరిహారం అందుతుంది. కానీ, హైబ్రిడ్ ప్లాన్లు జీవించి ఉన్నా కానీ, చివర్లో కొంత మొత్తాన్ని వెనక్కిస్తాయి. ఇందుకోసం అవి అధిక ప్రీమియం వసూలు చేస్తాయి. మంచి డైనమిక్ బాండ్ ఫండ్స్ ఏవి? – వినయడెట్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ స్వల్పకాల అవసరాలకు ఉద్దేశించిన నిధులను లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రక్షణ ఉంటుంది. అస్థిరతలు లేకుండా ఊహించతగిన ఆదాయం కోసం షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ ఎంపిక చేసుకోవాలి. చాలా మంది ఇన్వెస్టర్లకు షార్డ్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి సురక్షితమైనవి. స్థిరత్వంతోపాటు నిలకడైన రాబడులు అందిస్తాయి.డైనమిక్ బాండ్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటే.. ముందుగా ఆ విభాగంలోని పథకాల పనితీరు వివిధ వడ్డీ రేట్ల సైకిల్స్‌లో ఎలా ఉందన్నది విశ్లేషించండి. సంబంధిత ఫండ్ పోర్ట్‌ఫోలియోలోని డెట్ పత్రాల క్రెడిట్ నాణ్యతను కూడా పరిశీలించాలి. నిర్వహణ ఆస్తుల పరంగా టాప్–10 డైనమిక్ బాండ్ ఫండ్స్‌లో ఐసీఐసీఐ, కోటక్, ఎస్బీఐ పథకాలు మెరుగ్గా ఉన్నాయి. హెచ్ఎస్బీసీ ఇండియా ఎక్స్పోర్ట్ ఆపర్చూనిటీస్ ఫండ్హెచ్ఎస్బీసీ మ్యుచువల్ ఫండ్ కొత్తగా హెచ్ఎస్బీసీ ఇండియా ఎక్స్పోర్ట్ ఆపర్చూనిటీస్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 19తో ముగుస్తుంది. ఉత్పత్తులు లేదా సర్వీసుల ఎగుమతుల వల్ల లబ్ధి పొందే సంస్థల షేర్లు, అలాగే ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో తయారీ, ఆటోమొబైల్స్, పారిశ్రామికోత్పత్తులు, ఫార్మా, రసాయనాలు, టెక్స్టైల్స్, నిర్మాణం మొదలైన విభాగాల్లో పెట్టుబడులు పెడుతుంది. వ్యాపార ఫండమెంటల్స్, పరిశ్రమ స్వరూపం, వేల్యుయేషన్, ఆర్థిక బలా లు వంటి అంశాల ప్రాతిపదికన షేర్ల ఎంపిక ఉంటుందని సంస్థ సీఐవో–ఈక్విటీ వేణుగోపాల్ మంగత్ తెలిపారు. కోటక్ నిఫ్టీ ఇండియా టూరిజం ఇండెక్స్ ఫండ్కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా కోటక్ నిఫ్టీ ఇండియా టూ రిజం ఇండెక్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఇది సెప్టెంబర్ 16తో ముగుస్తుంది. నిఫ్టీ500లో ట్రావెల్, టూరిజం థీమ్ ఉన్న షేర్లను ఎంచుకుని ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ను బట్టి ఇండెక్స్‌లోని ఒక్కో స్టాక్‌కి వెయి టేజీ ఉంటుంది. పర్యాటక రంగానికి చోదక విభాగాలు ఇందులో ఉంటాయి. విహారయాత్రలు, వ్యాపార సంబంధ ప్రయాణాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు లబ్ధి పొందవచ్చని సంస్థ ఎండీ నీలేశ్ షా తెలిపారు. యూటీఐ నుంచి రెండు ఇండెక్స్ ఫండ్ ఆఫర్లుయూటీఐ ఫండ్ 2 ఇండెక్స్ ఫండ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూటీఐ నిఫ్టీ ప్రైవేటు బ్యాంక్ ఇండెక్స్ ఫండ్, యూటీఐ నిఫ్టీ200 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్ ఆఫర్లను (ఎన్ఎఫ్వో) ప్రారంభించింది. ఇండెక్స్ ఫండ్ నిర్వ హణలో తమకున్న విస్తృతమైన అనుభవంతో తక్కువ వ్యయాలతో కూడిన అత్యధిక నాణ్యమైన పెట్టుబడుల ఆప్షన్లు అందిస్తున్నట్టు ఫండ్ పేర్కొంది. యూటీఐ నిఫ్టీ 200 క్వాలిటీ 30 ఇండెక్స్ఫండ్ అన్నది ఇదే సూచీలోని స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. ఈ 2 పథకాల ఎన్‌ఎఫ్‌వోలు 16న ముగుస్తాయి. కనీసం రూ.5,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎంట్రీ, ఎగ్జిట్ లోడ్ లేదు.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..
జీవనశైలిలో మార్పు, విభిన్న ఆహార అలవాట్లతో అనారోగ్యబారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య బీమా ఉందనే ధీమాతో ఆసుపత్రిలో చేరిన కొందరి క్లెయిమ్‌లను కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. అయితే బీమా తీసుకునే సమయంలోనే పాలసీదారులు చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల ఇలా క్లెయిమ్ అందడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలు ఆరోగ్య బీమా క్లెయిమ్ ఎలాంటి పరిస్థితుల్లో తిరస్కరిస్తారు.. అలా కంపెనీలు క్లెయిమ్‌లు తిరస్కరించకూడదంటే ఏం చేయాలనే వివరాలు తెలుసుకుందాం.బీమా పాలసీ డాక్యుమెంట్లు గతంలో సామాన్యులకు అర్థంకాని కఠిన పదాలతో ఉండేవి. కానీ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) పాలసీ పత్రాలు సరళమైన భాషలో ఉండాలని ఆదేశించింది. దాంతో ప్రస్తుతం అన్ని కంపెనీలు అందరికీ అర్థమయ్యే విధంగా పాలసీ పత్రాలను వెల్లడిస్తున్నాయి. అన్ని కంపెనీలు ఐఆర్డీఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పాలసీ జారీ చేస్తుంటాయి. అయితే వాటిని సరిగా అర్థం చేసుకుని బీమా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా కింది అంశాలపై అవగాహన ఉండాలి.ఆరోగ్య సమాచారం సరిగా తెలపడంపాలసీ తీసుకునేప్పుడు ఆరోగ్య విషయాలు స్పష్టంగా తెలియజేయాలి. ఒకవేళ గతంలో ఏదైనా సర్జరీలు, అనారోగ్య సమస్యలుంటే తప్పకుండా కంపెనీలకు ముందుగానే చెప్పాలి. దానివల్ల స్వల్పంగా ప్రీమియం పెరుగుతుంది. కానీ భవిష్యత్తులో పాలసీ క్లెయిమ్ కాకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలున్నా ముందుగానే తెలియజేయడం ఉత్తమం.వెయిటింగ్ పీరియడ్పాలసీ తీసుకున్న వెంటనే కొన్ని రకాల జబ్బులకు కంపెనీలు వైద్య ఖర్చులు అందించవు. అలాంటి వ్యాధులకు బీమా వర్తించాలంటే కొన్ని రోజులు వేచి ఉండాలి. అయితే కంపెనీలకు బట్టి ఈ వ్యాధులు మారుతుంటాయి. మీకు ఇప్పటికే కొన్ని జబ్బులుండి వాటికి వైద్యం చేయించుకోవాలనుకుంటే మాత్రం అన్ని వివరాలు తెలుసుకోవాలి.సరైన ధ్రువపత్రాలతో రీయింబర్స్మెంట్బీమా కంపెనీలకు చెందిన నెట్వర్క్ ఆసుపత్రులు అందుబాటులో లేనివారు ఇతర హాస్పటల్లో వైద్యం చేయించుకుంటారు. తర్వాత బీమా కంపెనీకి బిల్లులు సమర్పించి తిరిగి డబ్బు పొందుతారు. అయితే అందుకు సరైన ధ్రువపత్రాలు అవసరం. వైద్యం పూర్తయ్యాక ఆసుపత్రి నుంచి అవసరమైన పత్రాలు, బిల్లులు, ఆరోగ్య నివేదికలు తీసుకొని నిబంధనల ప్రకారం రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.ఇదీ చదవండి: అడ్మిషన్ తిరస్కరించిన కాలేజీకే ముఖ్య అతిథిగా..క్లెయిమ్‌ను తిరస్కరించకుండా ఏ జాగ్రత్తలు పాటించాలంటే..బీమా పాలసీ తీసుకునేముందే అన్ని నిబంధనలు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు దారితీసే సందర్భాల గురించి అవగాహన కలిగి ఉండాలి. పాలసీ కొనుగోలు సమయంలోనే అన్ని అంశాలను పరిశీలించాలి.బీమా సంస్థ నియమాలను తప్పకుండా అనుసరించాలి. పైన తెలిపిన విధంగా ఆరోగ్య విషయాల వెల్లడిలో పొరపాటు చేయకూడదు. ప్రతిపాలసీకు కొన్ని షరతులు, మినహాయింపులు, పరిమితులుంటాయి. వాటిపై పూర్తిగా అవగాహన ఉండాలి.ఏదైనా ప్రమాదం జరిగితే పాలసీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనే చేరాలి. అత్యవసరం అయితే తప్పా ఇతర హాస్పటల్స్లోకి వెళ్లకూడదు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరితే డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కోపే(కొంత బీమా కంపెనీ, ఇంకొంత పాలసీదారులు చెల్లించాలి) ఎంచుకుంటే మాత్రం నిబంధనల ప్రకారం కొంత పాలసీదారులు చెల్లించాలి.కొన్నిసార్లు చికిత్స కోసం వెళ్లిన ఆసుపత్రిని బీమా సంస్థ నిషేధిత జాబితాలో పెట్టొచ్చు. ఆ సందర్భంలో పరిహారం చెల్లించదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలను తెలుసుకోవాలి. కంపెనీ వెబ్సైట్లో వాటిని అప్డేట్ చేస్తుంటారు.బీమా క్లెయిమ్ చేసుకునే విధానంలో ఎదైనా సందేహాలుంటే కంపెనీలను సంప్రదించాలి. బీమా సంస్థలు పాలసీదారులకు ఆసుపత్రులను ఎంపిక చేసుకోవడంతోపాటు, ఇతర అంశాలపైనా సహాయం చేస్తాయి. -
Bihar: డ్యూటీలో మరణిస్తే రూ. 2.30 కోట్లు
బీహార్ పోలీసులు ఇకపై ఉచిత జీవిత బీమా ప్రయోజనం పొందనున్నారు. తాజాగా బీహార్ పోలీసు విభాగం బ్యాంక్ ఆఫ్ బరోడాతో అవగాహన ఒప్పుందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ మేరకు పోలీసు సిబ్బంది ఎవరైనా విధి నిర్వహణలో చనిపోతే, వారి కుటుంబానికి రూ.2.30 కోట్ల వరకు బీమా ప్రయోజనం అందుతుందని బీహార్ పోలీసులు తెలిపారు.బ్యాంక్ ఆఫ్ బరోడాతో బీహార్ పోలీసులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దరిమిలా పోలీసు విభాగానికి చెందిన అదనపు డైరెక్టర్ జనరల్ (హెడ్‌క్వార్టర్స్) జెఎస్ గంగ్వార్ మాట్లాడుతూ తమ సిబ్బంది కోసం ఉచిత జీవిత బీమా ప్రయోజనం కల్పించామన్నారు. దీనిలో సహజ మరణమైతే రూ.20 లక్షల వరకు అందజేస్తారన్నారు. డ్యూటీలో ఉండగా ప్రమాదవశాత్తు మరణించిన సిబ్బందికి బీమా ప్రయోజనం రూ.2.30 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఎవరైనా ఉద్యోగి డ్యూటీలో ఉన్నప్పుడు విమాన ప్రమాదంలో మరణిస్తే, వారి కుటుంబానికి రూ. 1.50 కోట్ల అదనపు బీమా ప్రయోజనం లభిస్తుందన్నారు.ఏదైనా ప్రమాదంలో ఉద్యోగి వికలాంగునిగా మారితే రూ.1.50 కోట్ల వరకు బీమా ప్రయోజనం పొందుతారన్నారు. బీహార్ పోలీస్ విభాగంలో పదవీ విరమణ పొందిన సిబ్బందికి కూడా ప్రత్యేక ప్యాకేజీని అందించనున్నట్లు గాంగ్వార్ తెలిపారు. బీమా నిబంధనలలో సిబ్బంది కుమార్తెల వివాహం, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే పిల్లల ఉన్నత చదువులకు ఆర్థిక సాయం కూడా ఉంటుందన్నారు. -
కారు ప్రమాదానికి గురైందా? ఇన్సూరెన్స్ ఇలా క్లెయిమ్ చేసుకోండి
ఒకప్పుడు ఇంటికో వాహనం ఉండేది. ఇప్పుడు మనిషికో వాహనం అన్నట్టుగా వెహికల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వాహనాలను వినియోగించే ప్రతి ఒక్కరూ భీమా / ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇది ప్రమాదం జరిగినప్పుడు నష్టాన్ని కొంత వరకు భర్తీ చేస్తుంది. కాబట్టి అది కొత్త కారు అయినా.. పాత కారు అయినా ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి.చట్టప్రకారం కూడా మీ కారుకు భీమా ఉండాల్సిందే. చాలా మంది తమ వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ.. వాటిని ఎలా క్లెయిమ్ చేయాలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.ఇన్సూరెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో ఒకటి క్యాష్‌లెస్ క్లెయిమ్.. రెండు రీయింబర్స్మెంట్ క్లెయిమ్. ఇందులో క్యాష్‌లెస్ క్లెయిమ్ అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే కారుకు ప్రమాదం జరిగితే.. దాన్ని రిపేర్ చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చు సదరు కంపెనీ భరిస్తుంది. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ అయితే.. ముందుగా కారును రిపేర్ చేసుకుని, ఆ తరువాత బిల్స్‌ను కంపెనీలకు చూపించి క్లెయిమ్ చేసుకోవాలి ఉంటుంది. ఆ బిల్స్ అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరిస్తే.. మీ డబ్బు మీకు వస్తుంది.క్యాష్‌లెస్ క్లెయిమ్ కింద జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే.. కారు ప్రమాదానికి గురైన వెంటనే ఇన్సురెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఆ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఆ తరువాత ఇన్సూరెన్స్ సంస్థ కారును ఏదైనా గ్యారేజిలో జరిగిన నష్టాన్ని లేదా ప్రమాదాన్ని అంచనా వేసి ఖర్చు ఎంతవుతుందో లెక్కిస్తారు. అయితే ఇన్సురెన్స్ కంపెనీలకు తెలియకుండా కారును రిపేర్ షాపుకు లేదా గ్యారేజీకి తీసుకెళ్లకూడదు.కారును గ్యారేజీ సిబ్బంది రిపేర్ చేసిన తరువాత.. రిపేర్ చేయడానికి అయిన ఖర్చును నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా గ్యారేజికే చెల్లిస్తుంది. ఒకవేళా కారును రిపేర్ చేయడానికి వీలుకానప్పుడు కారు విలువ మొత్తాన్ని సంస్థ కారు యజమానికి చెల్లిస్తుంది.ఇక రెండోది.. రీయింబర్స్మెంట్ క్లెయిమ్. దీని కింద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే.. ముందుగా కారు ప్రమాదానికి గురైన 24 గంటలలోపు ఫోన్ చేసి లేదా ఆన్లైన్లో చెప్పే అవకాశం ఉంటే తెలియజేయాలి. ఆ తరువాత క్లెయిమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ తరువాత ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. సంస్థకు సమాచారం అందించిన తరువాత మీ వాహనాన్ని మీకు నచ్చిన గ్యారేజికి తీసుకెళ్లి రిపేర్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: నష్టం జరిగింది.. రూ.50 కోట్లు ఇవ్వండి: రిమీ సేన్కారు రిపేర్ పూర్తయిన తరువాత.. దానికైన ఖర్చు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ ఇన్సూరెన్స్ సంస్థకు అందించాలి. వాటన్నింటినీ కంపెనీ పరిశీలించి కారు యజమానికి డబ్బు చెల్లిస్తుంది. -
బీమా కంపెనీలపై 12 శాతం పెనాల్టీ!
పంటల బీమా చెల్లించడంలో సంస్థలు ఆలస్యం చేస్తే 12 శాతం పెనాల్టీ విధిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో పంటల బీమా కోసం 3.51 కోట్ల దరఖాస్తులు రాగా, ఇప్పుడు వాటి సంఖ్య 8.69 కోట్లకు పెరిగిందన్నారు. రైతులు రూ.32,404 కోట్ల ప్రీమియం చెల్లించి మొత్తం రూ.2.71 లక్షల కోట్ల బీమా పొందారని తెలిపారు.ఈ మేరకు లోక్‌సభలో మంత్రి మాట్లాడుతూ..‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై ) కింద రైతులకు చెల్లించాల్సిన బీమా ఆలస్యం చేస్తే కంపెనీలపై 12 శాతం పెనాల్టీ విధిస్తాం. ఇది నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. పంటల బీమాకు సంబంధించి రాష్ట్రాల ప్రీమియం విడుదలలో జాప్యం జరుగుతోంది. బీమా చెల్లింపుల్లో జాప్యం జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే తన వాటాను విడుదల చేస్తుంది. గత ప్రభుత్వంలో పంటల బీమా కోసం 3.51 కోట్ల దరఖాస్తులు రాగా, ఇప్పుడు అది 8.69 కోట్లకు పెరిగింది. రైతులు రూ.32,404 కోట్ల ప్రీమియం చెల్లించి మొత్తం రూ.2.71 లక్షల కోట్లకు బీమా పొందారు. సహజ కారణాల వల్ల నష్టపోయిన పంటలను ఈ పథకం కవర్ చేస్తోంది. 2023లో 5.01 లక్షల హెక్టార్ల పంట భూమి ఈ బీమా పరిధిలోకి వచ్చింది. అది 2024లో 5.98 లక్షల హెక్టార్లకు విస్తరించింది. దీని ద్వారా 3.57 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: టీవీ ఛానెల్ ప్రసారాలకు కొత్త ఓటీటీ -
కెప్టెన్ అన్షుమాన్ సింగ్ పెన్షన్, పీఎఫ్‌పై వివాదం.. స్పందించిన ఆర్మీ
అమర వీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీర్తి చక్ర అవార్డు బహుకరించిన సంగతి తెలిసిందే. గతేడాది జూలైలో సియాచిన్ గ్లేసియర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరుడైన 26వ బెటాలియన్ పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన అన్షుమాన్ సింగ్‌కు.. మరణానంతరం రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్రను ప్రకటించింది.జూలై 5న ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ అవార్డును స్వీకరించారు. కొంత ఎక్స్ గ్రేషియాను అందించారు. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని అందించింది. కాగా అయితే పెళ్లైన అయిదు నెలలకే అన్షుమాన్ మరణించడం, వారి ప్రేమ, పెళ్లి, భవిష్యత్తు గురించి ఎంతో బాధతో ఆమె మాట్లాడిన మాటలు అందర్ని కంటతడి పెట్టించాయి. ఈ వీడియోను రక్షణశాఖ సోషల్ మీడియాలో షేర్ చేసిందిఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇటీవల అన్షుమాన్ తల్లిదండ్రులు రవి ప్రతాప్ సింగ్, మంజు సింగ్.. కోడలిపై మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. కోడలు అవార్డు, ఎక్స్ గ్రేషియా తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఎక్స్ గ్రేషియాను నెక్ట్స్ ఆఫ్ ది కిన్ (తదుపరి కటుంబ సభ్యులు)రూల్ ప్రకారం కోడలు, ఆమె కుటుంబీకులు తీసుకున్నారని చెబుతున్నారు. బిడ్డను కోల్పోయిన తమకు గోడ మీద ఫోటో తప్ప ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నిబంధనలను సవరించాలని కోరుతున్నారు.కాగా వ్యక్తి సైన్యంలో చేరినప్పుడు.. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ (ఏజీఐఎఫ్), ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) , ఇతర స్థిరాస్తుల నుంచి బీమా పొందడం కోసం తమ తల్లిదండ్రులు, సంరక్షులు పేర్లు NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నమోదు చేస్తారు. అయితే వీటన్నింటికీ ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. కానీ పెన్షన్ కోసం ఒకే నామినీ ఉంటారు. జవాను పెళ్లి అయిన తర్వాత ఆర్మీ నిబంధన ప్రకారం..తల్లిదండ్రులకు బదులుగా జీవిత భాగస్వామిని NOKకేగా పేర్కొంటారు. ‘నా కొడుక్కి వచ్చిన అవార్డును కోడలు తీసుకెళ్లింది. ఆమె మాతో ఉండటం లేదు. మేము కొడుకునే కాదు, అవార్డును కూడా కోల్పోయాం. కోడలు మాతో జీవించాలనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొడుక్కి వచ్చిన అవార్డుపై మాకూ అధికారం లేదా?‘ అని వాపోయారు. అయితే అత్తమామల ఆరోపణలపై సింగ్ భార్య స్మృతి సింగ్ ఇప్పటివరకు ఏ విధంగానూ స్పందించలేదు.అయితే కోడలు స్మృతి సింగ్‌పై దివంగత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు నేపథ్యంలో ఆర్మీ స్పందించింది. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ ద్వారా వచ్చి రూ.1 కోటి eర్థిక సాయం.. సింగ్ భార్య, తల్లిదండ్రులకు 50-50 శాతం విభజించనున్నట్లు ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే పీఎఫ్, పెన్షన్ మాత్రం భార్యకే చెందుతుందని తెలిపాయి. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన రూ. 50 లక్షల సహాయంలో రూ. 35 లక్షలు అతని భార్యకు, రూ. 15 లక్షలు అతని తల్లిదండ్రులకు అందించనున్నట్లు పేర్కొన్నాయి.Amid allegations made by the parents of late Captain Anshuman Singh against their daughter-in-law Smriti Singh, Army sources clarified that the AGIF of ₹1 crore was split between his wife and parents while the pension goes directly to the spouse. @dperi84 reports.… pic.twitter.com/UCJocN2TBA— The Hindu (@the_hindu) July 14, 2024 వీలునామాలో సింగ్ భార్య నామినేట్ అయినందునా ఆమెకు కొన్ని ఎక్కువ ప్రయోజనాలు అందనున్నాయి. అంతేగాక కెప్టెన్ సింగ్ తండ్రి ఆర్మీలో రిటైర్డ్ జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ కావడంతో ఆయనకు స్వయంగా పెన్షన్ పొందున్నారు. మాజీ అధికారిగా ఇతర ప్రయోజనాలను కూడా అందుకుంటున్నారు. అయితే ఆర్మీ పాలసీ ప్రకారం ఒక అధికారి వివాహం చేసుకున్న తర్వాత, అతని భార్య పెన్షన్ కోసం నామినీ అవుతుందని ఆర్మీ వర్గాలు వివరించాయి.అయితే సింగ్ తల్లిదండ్రుల ఆరోపణలపై పలువురు అధికారులు స్పందించారు. నామినీ అనేది ఖచ్చితంగా అధికారి ఎంపిక అని. అందులో జీవిత భాగస్వామి పాత్ర లేదని పేర్కొన్నారు. అయితే తల్లిదండ్రులు పూర్తిగా కుమారుడిపై ఆధారపడిన సమయంలో ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ సమస్యలను ఆర్మీ యూనిట్ పరిష్కరిస్తుందని తెలిపారు. -
కొత్తగా ‘160’ సిరీస్ ఫోన్ నంబర్లు.. ఎవరికంటే..
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల ‘160’ సిరీస్ నంబర్లను ప్రవేశపెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఉన్న సంస్థలు మొదటి దశలో సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం '160' ఫోన్ నంబర్ సిరీస్‌కు మారుతున్నట్లు ట్రాయ్ తెలిపింది.అంటే ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు, ఇతర సంస్థల నుంచి సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ '160'తో మొదలయ్యే ఫోన్ నంబర్ల నుంచి వస్తాయి. మోసగాళ్ల నుంచి వచ్చే మోసపూరిత కాల్స్‌ను వినియోగదారులు సులభంగా గుర్తించడంలో సహాయపడటానికి ట్రాయ్ ఈ చర్య తీసుకుంది.ట్రాయ్ అధికారులు, ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 25కు పైగా బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు, అంతర్జాతీయ బ్యాంకులు, టెల్కోలు సహా ఇతర ఆర్థిక సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ప్రమోషనల్ అవసరాల కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న 140 సిరీస్ కార్యకలాపాలను డీఎల్టీ (డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ)కి మార్చడంపై ఈ సమావేశంలో చర్చించినట్లు, డిజిటల్ సమ్మతిని కూడా అమలు చేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది.సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం 160 సిరీస్, మార్కెటింగ్ కోసం 140 సిరీస్‌ను అమలు చేయడంతో.. 10 అంకెల నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ పై గణనీయమైన నియంత్రణ ఉంటుందని ట్రాయ్ తెలిపింది. ప్రస్తుతం కంపెనీలకు చెందిన 10 అంకెల స్పామ్ నంబర్లలో చాలా వరకు కృత్రిమ మేధను ఉపయోగించి టెల్కోలు నేరుగా బ్లాక్ చేస్తున్నాయి. -
ఎల్ఐసీ పాలసీ దారులకు ముఖ్యగమనిక
లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ (ఎల్ఐసీ) పాలసీ దారులకు ముఖ్యగమనిక. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ధన్ వృద్దిని విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ఎల్ఐసీ ప్రకటించింది.ఈ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ .. పాలసీ పాలసీదారులకు రక్షణ, సేవింగ్స్‌ను అందిస్తుంది. పాలసీ వ్యవధిలో జీవిత బీమా పొందిన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తికి మెచ్యూరిటీ తేదీలో హామీ ఇవ్వబడిన మొత్తం మొత్తాన్ని కూడా అందించేది.ఈతరుణంలో ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ ఫిబ్రవరి 2, 2024న పునఃప్రారంభించబడింది. ఏప్రిల్ 1, 2024 న ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ ప్రత్యేకతుల • సింగిల్ ప్రీమియం ప్లాన్• పాలసీ టర్మ్, డెత్ కవర్ని ఎంపిక చేసుకోవచ్చు. • పాలసీ వ్యవధిలోపు పాలసీ దారులకు హామీ ఇచ్చినట్లు ప్రయోజనాలను అందిస్తుంది. •ఎక్కువ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉన్న పాలసీలకు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. • మరణం లేదా మెచ్యూరిటీపై లంప్సమ్ బెనిఫిట్• మెచ్యూరిటీపై ఇన్స్టాల్మెంట్, సెటిల్మెంట్లో డెత్ బెనిఫిట్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు.• పాలసీకి లోన్ అందుబాటులో ఉందిఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ టర్మ్• ఎల్ఐసీ ధన్ వృద్ధి 10, 15 లేదా 18 సంవత్సరాల కాలవ్యవధికి అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన కాలాన్ని బట్టి కనీస ప్రవేశ వయస్సు 90 రోజుల నుండి 8 సంవత్సరాల వరకు ఉంటుంది. • ఎల్ఐసీ ధన్ వృద్ధి ప్లాన్ బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీ రిటర్న్• పాలసీ కనీస ప్రాథమిక బీమా మొత్తం రూ. 1,25,000. • జీవిత బీమా పాలసీ వ్యవధిలో రిస్క్ ప్రారంభ తేదీ తర్వాత కానీ నిర్ణీత గడువు తేదీకి ముందు పాలసీదారులు మరణిస్తే.. నిబంధనల ప్రకారం ప్రయోజనాలు సంబంధిత పాలసీ దారుడి కుటుంబానికి అందుతాయి. -
ఇన్సూరెన్స్ సేవల్లోకి ప్రముఖ సంస్థ
ప్రముఖ ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అప్‌స్టాక్స్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. తమ కొత్త బిజినెస్‌ను టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ప్రారంభిస్తున్నామని కంపెనీ వర్గాలు చెప్పాయి. త్వరలో హెల్త్, మోటార్, ట్రావెల్ సెగ్మెంట్లలో బీమా ఉత్పత్తులు మొదలుపెడుతామని కంపెనీ తెలిపింది.అప్‌స్టాక్స్‌తో మొదటి భాగస్వామిగా హెచ్డీఎఫ్సీ లైఫ్ జతైనట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా అప్‌స్టాక్స్ కోఫౌండర్ కవితా సుబ్రమణియన్ మాట్లాడుతూ..‘మా కంపెనీను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ ప్లాట్‌ఫామ్ సురక్షితంగా, వేగంగా పనిచేస్తోంది. వినియోగదారుల సంపదను సమర్థంగా నిర్వహించడంలో భాగంగా బీమా సేవలు ప్రారంభించాం. కొత్త బిజినెస్ మోడల్ వల్ల సంస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’ అని అన్నారు.అప్‌స్టాక్స్ ఇప్పటికే స్టాక్ క్రయవిక్రయాలు, ఐపీఓలు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లు, కమోడిటీలు, కరెన్సీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పీర్-టు-పీర్ లెండింగ్, ప్రభుత్వ బాండ్లు, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు సహా అనేక రకాల సేవలందిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.1,000 కోట్లకు చేరినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కస్టమర్లకు సంబంధించి పది రెట్లు వృద్ధి నమోదు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.ఫోన్‌పే వంటి ఫిన్‌టెక్ కంపెనీలు సైతం బీమా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్‌స్టాక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో మార్కెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2023, ఏప్రిల్ 24న వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్‌లో రూ.426 కోట్లు పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. -
బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ సర్క్యులర్ జారీ
బీమా కంపెనీలు వాటికి నిర్దేశించిన రంగాల్లో తప్పనిసరిగా కనీస వ్యాపారం చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. 2047 నాటికి అందరికీ బీమా అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.బీమా కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో, సామాజిక రంగంలో, మోటారు థర్డ్ పార్టీకి సంబంధించి కనీస లక్ష్యాలు చేరుకోవాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఈ ఆదేశాలు జీవిత బీమా సంస్థలతోపాటు నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలకు వర్తిస్తాయని పేర్కొంది. ఆయా కంపెనీలు తప్పనిసరిగా వాటికి కేటాయించిన రంగాల్లో కనీస వ్యాపారాన్ని చేయాలని చెప్పింది.ఇదీ చదవండి: గోల్డ్‌ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖతో సంప్రదించి గతంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు గ్రామ పంచాయతీలను కేటాయించింది. గ్రామీణరంగ బాధ్యతలను నెరవేర్చాలని ఆదేశించింది. ఆయా కంపెనీలు పంచాయతీల పరిధిలో బీమాలేని వారికి అవగాహన కల్పించి బీమా తీసుకునేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. సామాజిక రంగంలో, మోటార్ థర్డ్ పార్టీ బీమా చేసుకునేలా సంస్థలు బాధ్యత వహించి తమకు నిర్దేశించిన కనీస టార్గెట్‌ను పూర్తి చేయాలి. ప్రస్తుతం దేశంలో ఐదు స్వతంత్ర ఆరోగ్య బీమా కంపెనీలు, 40 సాధారణ బీమా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. -
ఒక్కనెలలోనే రూ.12వేలకోట్ల ప్రీమియం వసూలు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఒక్కనెలలోనే రూ.12,384 కోట్ల ప్రీమియం వసూలు చేసింది. 2014 తర్వాత నెలవారీ అధిక ప్రీమియం వసూలైనట్లు తెలిసింది.2024 ఏప్రిల్ నెలకుగాను ఎల్ఐసీ సంస్థ రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు తెలిపింది. గత ఏడాది ఏప్రిల్‌లో వసూలైన రూ.5,810.10 కోట్ల ప్రీమియంతో పోలిస్తే ఇది 113.14% అధికంగా నమోదైంది. ఎల్ఐసీ వ్యక్తిగత ప్రీమియం విభాగంలో రూ.3,175.47 కోట్లను వసూలు చేసినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పేర్కొంది. 2023 ఇదే కాలంలోని రూ.2,537.02 కోట్లతో పోలిస్తే ఇది 25.17% ఎక్కువ. గ్రూప్ పాలసీల ప్రీమియం వసూళ్లు రూ.9,141.34 కోట్లుగా ఉన్నాయి. గత ఏప్రిల్‌లో రూ.3,239.72 కోట్లతో పోలిస్తే ఇది 182.16% అధికంగా ఉంది. ఎల్ఐసీ పాలసీదారుల నమ్మకాన్ని సంపాదించిందని అందువల్లే ఇలా పెద్ద మొత్తంలో ప్రీమియం వసూలైనట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. -
బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలోని 1.40 కోట్లకుపైగా కుటుంబాలకు ఆపద్బాంధవి. దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని కార్పొరేట్ ఆస్పత్రులకు వెళితే చేతి నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందుతోంది. ఏదైనా శస్త్ర చికిత్స జరిగినా డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాక విశ్రాంత సమయంలో సైతం ప్రభుత్వం ఆరోగ్య ఆసరా ద్వారా భృతి కూడా ఇస్తోంది. వెరసి పేద, మధ్య తరగతి కుటుంబాలకు కష్టకాలంలో ఈ పథకం కొండంత అండగా నిలుస్తోంది. ఇంతటి గొప్ప పథకంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శీతకన్ను వేశారు. నాడు వైఎస్సార్‌కు, నేడు సీఎం జగన్‌కు ఎంతో మంచి పేరు తెచ్చిన ఈ పథకాన్ని ఏదోరకంగా కనుమరుగు చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో 2014–19 మధ్య ఈ పథకానికి పూర్తిగా ప్రాధాన్యం తగ్గించారు. ప్రొసీజర్లు, నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను పెంచకుండా అధికారం లోంచి దిగిపోయేనాటికి అంపశయ్య పైకి ఎక్కించారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఈ పథకానికి ఊపిరిలూదారు. దీంతో బాబుకు మింగుడు పడలేదు. ఇలా అయితే లాభం లేదనుకుని పెద్ద స్కెచ్చే వేశారు. బీమా పేరుతో మాయ చేసి, మేనిఫెస్టోలో ఆరోగ్యశ్రీ ప్రస్తావనే లేకుండా చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల టీడీపీ, జనసేన పారీ్టలు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. వైద్యం, ఆరోగ్యం అంటూ నాలుగు అంశాలను పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగ్గా అమలు పరుస్తామని గానీ, పేద ప్రజలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు (క్యాష్ లెస్ ట్రీట్మెంట్), రోగ నిర్ధారణ పరీక్షల సౌకర్యం కల్పిస్తామని ఎక్కడా ప్రస్తావించలేదు. దీన్నిబట్టి బాబు వస్తే ఆరోగ్యశ్రీ పథకం కనుమరుగవుతుందనడానికి టీడీపీ మేనిఫెస్టో ఒక సంకేతం అని రాజకీయ విశ్లేషకులు, వైద్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. ట్రస్ట్‌లో ఎంప్యానెల్డ్ అయిన ఆస్పత్రుల్లో పేదలు, మధ్యతరగతి కుటుంబాల వారు చేతి నుంచి నగదు చెల్లించకుండానే పూర్తి స్థాయిలో చికిత్సలు పొందుతున్నారు. కాగా, టీడీపీ తాజా హామీని గమనించినట్లయితే వాళ్లు అధికారంలోకి వస్తే.. ట్రస్ట్ స్థానంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏజెన్సీలను ప్రవేశపెట్టనున్నారని ఇట్టే తెలుస్తోంది. ఇప్పటి వరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభు త్వమే నేరుగా పథకాన్ని అమలు చేయడంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నా యి. అదే ఇన్సూరెన్స్ ఏజెన్సీల చేతుల్లోకి వెళితే వారి లాభాపేక్ష వల్ల ప్రజలకు వైద్య సేవల కల్పన ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో సందేహమే లేదు. ట్రస్ట్ అయితే అందులో ఎంప్యానెల్డ్ అయిన ఆస్పత్రులు ఏ ప్రొసీజర్స్‌కు అయి నా నిర్ధే శించిన రేట్స్ ప్రకారమే వైద్య సేవలు అందిస్తాయి. అంతకు మించి ప్రజల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డానికి వీలుండదు. అలా వసూళ్లకు పాల్పడితే జిల్లా స్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ట్రస్ట్ సీఈవో ఆధ్వర్యంలో ఆస్పత్రులపై చర్యలు తీసుకునే ఒక వ్యవస్థ ఉంటుంది. అదే ప్రైవే ట్ ఇన్సూరెన్స్ ఏజెన్సీలు వస్తే ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ పోతుంది. ఇష్టారాజ్యంగా బిల్లులు వేసి ప్రజల నుంచి అదనపు వసూళ్లు చేస్తాయి. లేదంటే ఆస్పత్రి నుంచి బయటకు పంపించేస్తాయి. ఆరోగ్యశ్రీ ప్రస్తావనే లేని 2024 టీడీపీ మేనిఫెస్టో ∗ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా ∗ ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు ∗ అన్ని మండలాల్లో జనరిక్ ఔషధ కేంద్రాలు ∗ బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు జనరిక్ మందులు 2024 వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ∗ రాష్ట్రంలో ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలతో పాటు, మరో 12 కళాశాలల నిర్మాణం పూర్తి చేసి ఐదేళ్లలో అందుబాటులోకి తేవడం.తద్వారా 2,550 ఎంబీబీఎస్, 2,737 పీజీ మెడికల్ సీట్లు సమకూర్చడం.∗ కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు తేవడం ద్వారా అందుబాటులోకి 1,020 నర్సింగ్ సీట్లు. ∗ హృద్రోగ బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో మూడు వైద్య హబ్‌ల ఏర్పాటు. ∗ క్యాన్సర్ వైద్యాన్ని మరింత బలోపేతం చేసేలా గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు.∗ గడచిన ఐదేళ్లలో మాదిరిగానే వచ్చే ఐదేళ్లలోనూ ప్రజారోగ్య రంగానికి ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గకుండా చర్యలు. వైద్య రంగ అభివృద్ధిని కొనసాగిస్తాం. పై రెండు మేనిఫెస్టోలు గమనిస్తే ప్రజారోగ్యం పట్ల ఏ నాయకుడికి ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది. మూడు సార్లు సీఎంగా పనిచేశా.. విజనరీనని చెప్పుకునే నాయకుడు ప్రజారోగ్యం పట్ల ఉజ్జాయింపుగా నాలుగంటే నాలుగే హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సీఎం జగన్ మాత్రం ప్రజారోగ్యం విషయంలో గడచిన ఐదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ప్రజారోగ్యం విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకున్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఆ ఒరవడిని అదే విధంగా కొనసాగిస్తూ వచ్చే ఐదేళ్లలోను ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తానని తన మేనిఫెస్టోలో ప్రకటించారు. సాక్షి, అమరావతి: వైద్య, విద్యా రంగాలను ప్రైవేట్ పరం చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఇందులో భాగంగానే తొలి నుంచీ ఆయన ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ‘ఆరోగ్యశ్రీలో వ్యాధులన్నింటినీ చేర్చి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్స, ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తాం’ అని టీడీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక తూతూ మంత్రంగా ప్రొసీజర్లను పెంచి చేతులు దులుపుకున్నారు.2007లో వైఎస్సార్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రారంభిస్తే, చంద్రబాబు ప్రభుత్వం పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చి, కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి. వివిధ అనారోగ్య బాధితులకు చికిత్సలు అందించడానికి ఆస్పత్రుల నుంచి ట్రస్టుకు అభ్యర్థనలు వచ్చినా వాటిని రోజుల తరబడి పెండింగ్‌లో ఉంచేవారు.దీంతో చేసేదేమీ లేక చికిత్సలు చేయించుకోవడానికి ప్రజలు అప్పులపాలైన దుస్థితి. ఈ ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి సీఎం జగన్ ప్రజలకు అండగా నిలిచారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షల్లోపు వార్షికాదాయ కుటుంబాలను పథకం పరిధిలోకి తెచ్చి, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి రక్షగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు.1,059గా ఉన్న ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచారు. తద్వారా ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచిత చికిత్సల కోసం రూ.13,421 కోట్లు వెచ్చించారు. ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్ల మేర శస్త్ర చికిత్సలు చేయించుకున్న 24.59 లక్షల మందికి సాయం చేశారు.జగన్, బాబు పాలన మధ్య ఎంతో తేడా! అంశం: కొత్త వైద్య కళాశాలలు జగన్ పాలన: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు. ఇందుకోసం ఏకంగా రూ.8,480 కోట్లు వెచ్చిస్తున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు కల్పించారు. ఈ విద్యా సంవత్సరం మరో ఐదు, వచ్చే విద్యా సంవత్సరం మిగిలిన ఏడు కళాశాలలు ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు. బాబు పాలన: టీడీపీ అధికారంలో ఉండగా ఏ రోజు ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు పాటుపడింది లేదు. వైద్య విద్యను వ్యాపారం చేసి తన వాళ్ల జేబులు నింపడానికే పాటుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 16 ప్రైవేట్ వైద్య కళాశాలలకు బాబు పాలనలో అనుమతులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. అంశం : గ్రామీణ ప్రజల ఆరోగ్యం జగన్ పాలన: పీహెచ్సీ వైద్యులనే గ్రామాలకు పంపి ప్రజలకు వైద్య సేవలు అందించారు. మంచానికే పరిమితం అయిన రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి, వారి ఆరోగ్యాలపై వాకబు చేశారు. 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. వీటిల్లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లను నియమించారు. తద్వారా 12 రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలతో పాటు, 105 రకాల మందులను అందుబాటులో ఉంచి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వీటికి తోడు విలేజ్ క్లినిక్స్‌లో టెలీ మెడిసిన్ సౌకర్యం ఉండటంతో స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ సైతం ఇక్కడే లభిస్తుండటంతో పట్టణాలు, నగరాల్లోని పెద్దాస్పత్రులకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉండటం లేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఇళ్ల వద్దకు మందుల డోర్ డెలివరీ ప్రారంభించింది. బాబు పాలన: పల్లె ప్రజలకు సుస్తీ చేస్తే పట్టణాలు, నగరాలకు పరుగులు తీయాల్సిందే. ఫ్యామిలీ డాక్టర్ వంటి కార్యక్రమం ఉండేది కాదు. విలేజ్ క్లినిక్ వ్యవస్థ ఊసే లేదు. పీహెచ్‌సీలకు వెళితే అక్కడ డాక్టర్లు ఉంటారో లేదో తెలియని దుస్థితి. దీంతో చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, వ్యయప్రయాసలకోర్చి పరుగు తీయాల్సిన పరిస్థితి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందుల పంపిణీ, క్రమం తప్పకుండా వారి ఆరోగ్యంపై వాకబు చేసే వ్యవస్థ లేక, ప్రజలు జబ్బు ముదిరి అప్పులపాలయ్యేవారు. అంశం : ఇంటింటా ఆరోగ్య సర్వే జగన్ పాలన: అందరి ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షను ప్రవేశపెట్టింది. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి, వైద్య పరీక్షలు నిర్వహించి వివిధ అనారోగ్య బాధితులను గుర్తించారు. వారికి పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ సురక్ష శిబిరాలు నిర్వహించి స్పెషలిస్టు వైద్యులతో ఉచితంగా వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు తరలించి, ఉచితంగా చికిత్స చేయించారు. బాబు పాలన: ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమం నిర్వహించిందే లేదు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని వాకబు చేసి, వాటి పరిష్కారానికి కనీసం ఆలోచించిన పాపాన పోలేదు. అంశం: ఆస్పత్రుల్లో నాడు–నేడు జగన్ పాలన: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే నాడు–నేడు కార్యక్రమంల ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మార్చేశారు. రూ.16,880 కోట్లతో ఆస్పత్రుల భవనాలకు మరమ్మతులు, పాతవాటి స్థానంలో కొత్తవాటి నిర్మాణం, 17 కొత్త వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రుల్లో వనరులను సమకూర్చారు. దీంతో 640 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్‌క్వాష్), 42 ఆస్పత్రులకు ముస్కాన్, 2022–23లో 3,161 ఆస్పత్రులకు కాయకల్ప గుర్తింపుతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది.కేరళ సైతం ఈ అంశాల్లో ఏపీ కన్నా ఎంతో వెనుకబడి ఉంది. ఆస్పత్రుల్లో ఏ ఒక్క వైద్య, సిబ్బంది పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ఐదేళ్లలో 54 వేల మేర పోస్టులు భర్తీ చేసి రికార్డు సృష్టించారు. 108 వ్యవస్థకు ఊపిరిలూదుతూ రూ.136 కోట్లతో 768 అంబులెన్స్‌లు సమకూర్చి సేవలు విస్తరించారు. ఫ్యామిలీ డాక్టర్ అమలు కోసం రూ.166 కోట్లతో 104 వాహనాలు సమకూర్చారు. మొత్తం 936 వాహనాలు సేవలందిస్తున్నాయి. బాబు పాలన: రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసేలా టీడీపీ జమానాలో ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందులు, సర్జికల్స్, ఇతర వనరులకు తీవ్ర కొరత ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగానే బాబు వ్యవహరించారు. 2014–19 మధ్య గుంటూరు జీజీహెచ్‌లో ఎలుకలు కొరికి శిశువు మృతి చెందడం బాబు పాలనలో దిగజారిన ప్రభుత్వ వైద్య రంగ దుస్థితికి నిదర్శనం. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన అనంతరం గుణపాఠంతో ఆస్పత్రులను బలోపేతం చేసేలా అడుగులు వేయలేదు. ఐదేళ్ల బాబు పాలనలో కేవలం 4 వేల మేర పోస్టులను మాత్రమే వైద్య శాఖలో భర్తీ చేశారు. బాబు పాలనలో 108, 104 వ్యవస్థలు కూనరిల్లాయి. ఎవరు కావాలో ఆలోచించండి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని ఇంతగా నిర్వీర్యం చేసిన నేత ఒక్క చంద్రబాబు తప్ప దేశంలో మరొకరుండరు. సింగపూర్, యూకే ప్రపంచ స్థాయి రాజధాని అంటూ బాబు బాకాలు ఊదిన అమరావతికి కూత వేటు దూరంలోని గుంటూరు జీజీహెచ్‌లోనే అప్పట్లో శిశువును ఎలుకలు కొరికి చంపేశాయి. 2019లో అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ ప్రభుత్వాస్పత్రులను సంస్కరించారు. వైద్య రంగానికి ఊపిరిలూదారు. పెద్దాస్పత్రులను ఐదేళ్లలో అవయవాలు మార్పిడి చేసే స్థాయికి తీసుకెళ్లారు.ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, విలేజ్ క్లినిక్స్ వంటి వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే సర్కార్ వైద్యాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని దిగజార్చిన బాబు, ఆ వైద్య రంగానికి ఊపిరిలూదిన వైఎస్ జగన్.. ఈ ఇద్దరిలో ఎవరు కావాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సముచిత నిర్ణయం తీసుకోకపోతే వైద్యానికి డబ్బు కోసం ఆస్తులు తాకట్టుపెట్టాలి. ఆస్తులు లేని వారు తల తాకట్టు పెట్టే పరిస్థితులు వస్తాయని గుర్తుంచుకోవాలి. -
పిల్లలతో రైలు ప్రయాణం మరింత భారం!
వేసవి సెలవుల్లో పిల్లలతో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీపై మరింత భారం పడనుంది. భారతీయ రైల్వే ప్రయాణ టిక్కెట్లపై ఐచ్ఛిక బీమా నిబంధనలలో పలు మార్పులు చేసింది. ఇకపై రైలు ప్రయాణంలో పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే వారికి ఐచ్ఛిక బీమా ప్రయోజనం లభ్యకాదు.ఐఆర్సీటీసీ తెలిపిన వివరాల ప్రకారం ఇకపై పిల్లలకు పూర్తి టిక్కెట్ తీసుకుంటేనే బీమా సౌకర్యంలోని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మరోవైపు ఐఆర్సీటీసీ ప్రత్యామ్నాయ బీమా ప్రీమియంను కూడా పెంచింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఒక్కో ప్రయాణికుడి ప్రీమియం 45 పైసలకు పెంచింది. గతంలో ఇది 35 పైసలు ఉండేది.ఐచ్ఛిక బీమా పథకం అందించే ప్రయోజనం ఈ-టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైల్వే టికెట్ కౌంటర్ నుండి కొనుగోలు చేసే టిక్కెట్లపై ఈ బీమా పథకం వర్తించదు. ఆన్లైన్ లేదా ఈ-టికెట్‌ను కొనుగోలు చేసిన వారికే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు వారు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటున్నారా లేదా అనేది ఎంచుకోవాలి. ప్రయాణీకుడు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటే, అతను ఆ ఎంపికపై క్లిక్ చేయాలి. అప్పుడు రైల్వే ప్రయాణీకుడి మొబైల్, ఈ-మెయిల్‌కు బీమా కంపెనీ నుండి సందేశం వస్తుంది.ఈ బీమా పథకం కింద రైల్వే ప్రయాణీకులు మరణిస్తే రూ.10 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, గాయాలపాలైతే చికిత్స కోసం కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. రైల్వే ప్యాసింజర్ ఐచ్ఛిక బీమా పథకాన్ని భారతీయ రైల్వే సెప్టెంబర్ 2016లో ప్రారంభించింది. -
ఏప్రిల్ నుంచి జరిగే మార్పులివే..
ఏప్రిల్ 1నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్తగా ఆర్థిక సంస్థలు అమలు చేయబోయే నిబంధనలు ఈ నెల నుంచే వర్తించనున్నాయి. ఎన్పీఎస్ లాగిన్‌తోపాటు క్రెడిట్ కార్డులకు రివార్డులు, బీమా రంగంలో ఈ-ఇన్సూరెన్స్, ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు తదితర నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఖాతాల లాగిన్ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని పూర్తిగా పునర్‌వ్వవస్థీకరించింది. దీని ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2-ఫ్యాక్టర్ ఆధార్ అథెంటికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలోని నిబంధనల ప్రకారం ఎన్పీఎస్లోని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ)లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు 2024 మార్చి 15న పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ జారీ చేసింది. ఎస్బీఐ డెబిట్ కార్డు ఛార్జీలు పెంపు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు (ఎస్బీఐ) తన ఖాతాదారుల డెబిట్ కార్డు ఛార్జీలు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్లాసిక్ డెబిట్ కార్డులు, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఫీజు రూ.125 నుంచి రూ.200లకు పెంచింది. యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్ నిర్వహణ చార్జీలు రూ.175 నుంచి రూ.250లకు, ప్లాటినం డెబిట్ కార్డు చార్జీ రూ.250 నుంచి రూ.325, ప్లాటినం బిజినెస్ కార్డు ఫీజు రూ.350 నుంచి రూ.425లకు పెంచింది. ఫ్రీలాంజ్ యాక్సెస్.. ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల సాయంతో విమానాశ్రయాల్లో ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందడానికి కీలక నిబంధనలో మార్పులు తెచ్చాయి. క్రెడిట్ కార్డుదారులు త్రైమాసికంలో చేసిన ఖర్చును బట్టి ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఆఫర్ వర్తించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు దారులు రూ.35 వేలు, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.10వేలు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.50 వేలు ఖర్చు చేయాలి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డులకు ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు ఏప్రిల్ 20 నుంచి అమలవుతాయి. ఇదీ చదవండి: ఈ నెలలో బ్యాంకులు పని చేసేది 16 రోజులే..! పాలసీ డిజిటలైజేషన్ ఇన్సూరెన్స్ పాలసీకి డిజిటలైజేషన్ తప్పనిసరి చేశారు. ఇక నుంచి అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్య, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందించాలి. ఈ నిబంధన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. -
ఏప్రిల్ నుంచి జరిగే మార్పులివే..
ఏప్రిల్ 1నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్తగా ఆర్థిక సంస్థలు అమలు చేయబోయే నిబంధనలు ఈ నెల నుంచే వర్తించనున్నాయి. ఎన్పీఎస్ లాగిన్‌తోపాటు క్రెడిట్ కార్డులకు రివార్డులు, బీమా రంగంలో ఈ-ఇన్సూరెన్స్, ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు తదితర నిబంధనలు అమల్లోకి రానున్నాయి.ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఖాతాల లాగిన్ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని పూర్తిగా పునర్‌వ్వవస్థీకరించింది. దీని ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2-ఫ్యాక్టర్ ఆధార్ అథెంటికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలోని నిబంధనల ప్రకారం ఎన్పీఎస్లోని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ)లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు 2024 మార్చి 15న పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ జారీ చేసింది.ఎస్బీఐ డెబిట్ కార్డు ఛార్జీలు పెంపుదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు (ఎస్బీఐ) తన ఖాతాదారుల డెబిట్ కార్డు ఛార్జీలు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్లాసిక్ డెబిట్ కార్డులు, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఫీజు రూ.125 నుంచి రూ.200లకు పెంచింది. యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్ నిర్వహణ చార్జీలు రూ.175 నుంచి రూ.250లకు, ప్లాటినం డెబిట్ కార్డు చార్జీ రూ.250 నుంచి రూ.325, ప్లాటినం బిజినెస్ కార్డు ఫీజు రూ.350 నుంచి రూ.425లకు పెంచింది.ఫ్రీలాంజ్ యాక్సెస్..ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల సాయంతో విమానాశ్రయాల్లో ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందడానికి కీలక నిబంధనలో మార్పులు తెచ్చాయి. క్రెడిట్ కార్డుదారులు త్రైమాసికంలో చేసిన ఖర్చును బట్టి ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఆఫర్ వర్తించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు దారులు రూ.35 వేలు, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.10వేలు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.50 వేలు ఖర్చు చేయాలి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డులకు ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు ఏప్రిల్ 20 నుంచి అమలవుతాయి.పాలసీ డిజిటలైజేషన్ఇన్సూరెన్స్ పాలసీకి డిజిటలైజేషన్ తప్పనిసరి చేశారు. ఇక నుంచి అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్య, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందించాలి. ఈ నిబంధన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. -
ప్రపంచంలోనే పటిష్టమైన బీమా బ్రాండ్.. ఎల్ఐసీ
న్యూఢిల్లీ: దేశీ బీమా దిగ్గజం ఎల్ఐసీ ప్రపంచంలోనే అ త్యంత పటిష్టమైన బీమా సంస్థగా నిల్చింది. 2024 సంవత్సరానికి సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం స్థిరంగా 9.8 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో, 88.3 బ్రాండ్ పటిష్టత సూచీ స్కోరుతో, ట్రిపుల్ ఏ రేటింగ్‌తో ఎల్ఐసీ అగ్రస్థానంలో ఉంది. క్యాథే లైఫ్ ఇన్సూరెన్స్ రెండో స్థానంలో ఉంది. ఈ సంస్థ బ్రాండ్ విలువ 9% పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఎన్‌ఆర్‌ఎంఏ ఇన్సూరెన్స్ 1.3 బిలియన్ డాలర్ల విలువతో (82% వృద్ధి) మూడో స్థానంలో ఉన్నట్లు బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ తెలిపింది. మరోవైపు, విలువపరంగా చూస్తే చైనా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. 33.6 బిలియన్ డాలర్లతో పింగ్ ఆన్ సంస్థ అగ్రస్థానంలో ఉండగా, చైనా లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే సీపీఐసీ వరుసగా 3వ, 5వ స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
ఆర్థిక సన్నద్ధతలో దక్షిణాది టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సన్నద్ధతలో దక్షిణాది రాష్ట్రాలు ముందుంటున్నాయి. పట్టణవాసుల్లో ప్రతి పది మందిలో ఎనిమిది మందికి బీమా రక్షణ ఉంటోంది. బీమాపై అవగాహన, జీవిత బీమా పాలసీ కలిగి ఉండటం, ఆర్థిక భద్రతను మెరుగుపర్చుకోవడంపై ఇక్కడి వారు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. దీనికి సంబంధించి బీమా సంస్థ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మార్కెటింగ్ డేటా కాంతార్ నిర్వహించిన 6వ విడత ఇండియా ప్రొటెక్షన్ కోషంట్ (ఐపీక్యూ) సర్వేలో దక్షిణాది 49 పాయింట్లు దక్కించుకుంది. దీని ప్రకారం 44 పీక్యూతో దక్షిణాది మెట్రోల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో ప్రశాంత్ త్రిపాఠి తెలిపారు. దక్షిణ భారతంలో ప్రతి నలుగురిలో ఒకరికి అధిక ప్రీమియం అనేది టర్మ్ ప్లాన్ కొనుగోలుకు అవరోధంగా ఉంటోందని పేర్కొన్నారు. దక్షిణాది వారు రిటైర్మెంట్ ప్లానింగ్‌కి మరింతగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌వాసులు ఆరోగ్యకరమైన అలవాట్ల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో పాటు పిల్లల భవిష్యత్‌పైనా ప్రధానంగా ఫోకస్ పెడుతున్నట్లు వివరించింది. 25 నగరాల వ్యాప్తంగా 4,700 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. -
అట్లాంటా గ్యాస్ స్టేషన్ దోపిడీ.. ఇంటి దొంగల పనే!
అట్లాంటాలోని బుఫోర్డ్ హైవేలోగల గ్యాస్ స్టేషన్లో గత జనవరి 21న జరిగిన సాయుధ దోపిడీని దులుత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఛేదించింది. వివరాల్లోకి వెళితే గ్యాస్ స్టేషన్ నిర్వాహకుడు, క్యాషియర్ రాజ్ పటేల్.. నలుపు రంగు దుస్తులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని, ఐదువేల డాలర్లు దొంగిలించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్యాస్ స్టేషన్‌లోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ సోషల్ మీడియాలో ప్రసారం అయినప్పుడు ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్ పటేల్‌ను ఆ గుర్తు తెలియని వ్యక్తి కొట్టగానే అతను వెంటనే కింద పడిపోయినట్లు వీడియోలో కనిపించింది. రాజ్ పటేల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతనితో పాటు అదే గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్న కర్టిస్లను విచారించారు. దీనిలో వారు డబ్బు కోసం కుట్ర పన్నారని తేలడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పటేల్ ఈ దోపిడీకి సంబంధించి చెబుతున్నదానిలో పోలీసులకు పలు అనుమానాలు తలెత్తాయి. రాజ్ పటేల్ విచారణ అధికారులతో గుర్తు తెలియని వ్యక్తి తన ముఖంపై కత్తితో దాడి చేశాడని చెప్పాడు. అయితే పోలీసులకు రాజ్ పటేల్ ముఖంపై ఎలాంటి గుర్తులు కనిపించలేదు. సెక్యూరిటీ ఫుటేజ్‌లో కర్టిస్.. రాజ్ పటేల్‌ను మెల్లగా కొట్టినప్పటికీ అతను వెంటనే పడిపోవడం పోలీసులలో అనుమానాలను పెంచింది. తనపై దాడిచేశాక ఆ గుర్తు తెలియని వ్యక్తి బయటపడేందుకు గ్యాస్ స్గేషన్లోని మరో తలుపును ఉపయోగించాడని రాజ్ పటేల్ పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ అధికారి అదే తలుపు నుండి బయటకు వెళ్లి అక్కడ పరిశీలించాడు. కర్టిస్ ఆ గదిలో పనిచేసేవాడని పటేల్ పోలీసులకు తెలిపాడు. అయితే కర్టిస్ తాను ఈ దాడి జరిగిన సమయంలో ఎవరినీ చూడలేదని పోలీసు అధికారులకు చెప్పాడు. వీడియో ఫుటేజీలో ఆ గుర్తు తెలియని వ్యక్తి సైడ్ డోర్ నుండి బయటకు వెళ్లి, అక్కడున్న చెత్తకుప్ప దగ్గర రెండుసార్లు బట్టలు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో పోలీసులు కర్టిస్‌ను అదుపులోకి తీసుకుని, ఆ గది కీని అడిగారు. అతను కీని బయటకు తీసే సమయంలో అతని జేబులో నుండి విలువైన బిల్లులు పడిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. కర్టిస్ గ్యాస్ స్టేషన్లో ఉద్యోగి అని, ఈ దోపిడీకి పాల్పడింది అతనేనని పటేల్ పోలీసుల ముందు ఆరోపించాడు. పోలీసుల విచారణలో కర్టిస్ తాను నగదు దొంగిలించినట్లు అంగీకరించాడు. అయితే ఇదంతా రాజ్ పటేల్ చేసిన ప్లాన్ అని, తాను దొంగిలించిన నగదు తీసుకుంటే, రాజ్ పటేల్ బీమా సొమ్ము తీసుకోవాలని ప్లాన్ చేశాడని కర్టిస్ పోలీసులకు తెలిపాడు. -
గురివింద ప్రయాసే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను మసకబార్చడమే లక్ష్యంగా పొరుగు రాష్ట్రం నుంచి రాళ్లేస్తున్న రాజ గురివింద ప్రవాసాంధ్రులకు బీమా రక్షణ కరువైందంటూ కన్నీళ్లు పెట్టారు! చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో బీమా క్లెయిమ్‌గా నలుగురు బాధిత కుటుంబాలకు చెల్లించిన మొత్తం రెండంటే రెండు లక్షల లోపే ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక 28 లక్షల మందికి రూ.42 లక్షలకుపైగా క్లెయిమ్ పరిహారం అందచేసింది. మరో రూ.25 లక్షల మొత్తానికి సంబంధించిన క్లెయిమ్‌లు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ప్రవాసుల భద్రత, డబ్బు విషయంలో వెనుకాడే ప్రభుత్వమైతే సొంత ఖర్చులతో విపత్తు వేళ ఆగమేఘాలపై వారిని స్వస్థలాలకు తరలిస్తుందా? బీమా ప్రీమియం స్వల్ప మొత్తంలోనే రూ.ఐదారు వందలు లోపే ఉంటుంది. అయితే ప్రవాసాంధ్రుల్లో చాలా మంది విదేశాల్లో తాము పని చేస్తున్న చోట్ల బీమా కవరేజీని పొందుతున్నందున ప్రవాసాంధ్ర బీమా భరోసాను తీసుకోవడంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే అనే రీతిలో రోత కథనాలను అచ్చేసి రామోజీ పైశాచిక ఆనందాన్ని పొందడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 2.5 లక్షల మందికి ఏపీ ఎన్ఆర్టీఎస్ సేవలు ఏపీ ఎన్ఆర్టీఎస్ గత నాలుగేళ్లలో 2,55,000 మంది ప్రవాసాంధ్రులకు వివిధ సేవలతో సాయాన్ని అందించింది. 24/7 ద్వారా ప్రవాసాంధ్రులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవాసాంధ్రుల బీమా పథకం క్లెయిమ్ కింద కేవలం నలుగురికి రూ.2 లక్షల లోపే అందించగా ఇప్పుడు గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం 28 మందికి పరిహారంగా రూ.42,05,604 చెల్లించింది. రూ.25,53,700 విలువైన మరో పది క్లెయిమ్‌లు పురోగతిలో ఉన్నాయి. బీమానే కాకుండా అంబులెన్సు, ఎక్స్‌గ్రేషియా, రీ పాట్రియేషన్ ద్వారా అధిక సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందారు. అనారోగ్య బాధితులతోపాటు మృతుల భౌతిక కాయాలను విమానాశ్రయాల నుంచి స్వస్థలాలకు తరలించేందుకు 1,077 అంబులెన్సులను ప్రభుత్వం సమకూర్చింది. ఇందుకోసం రూ.1.93 కోట్లకు పైగా వెచ్చించింది. ప్రమాదవశాత్తు విదేశాల్లో మరణించిన 489 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.2.44 కోట్లకుపైగా చెల్లించింది. వివిధ కారణాలతో విదేశాల్లో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న 4,622 మందిని రీపాట్రియేషన్తో స్వస్థలాలకు క్షేమంగా తరలించింది. – వెంకట్ మేడపాటి, ఏపీ ఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ ♦ దాదాపు 20 లక్షల మంది ప్రవాసాంధ్రుల్లో గత సర్కారు కేవలం 16,713 మందికి (ఒక్క శాతం) మాత్రమే బీమా కల్పిస్తే అది చాలా గొప్పంటూ డప్పు కొట్టిన రామోజీకి కరోనా విపత్తులో వేల మంది ప్రవాసులను ఏపీ ఎన్ఆర్టీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా మాతృభూమికి తరలించిన విషయం తెలుసా? ఉక్రెయిన్ యుద్థం లాంటి సందర్భాల్లో ప్రభుత్వం సత్వరమే స్పందించి డబ్బుకు వెనుకాడకుండా ప్రవాసులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచి్చంది. ఇమ్మిగ్రేషన్ అధికారులతో సంప్రదించి 50 వేల మంది వలస కార్మికులను రాష్ట్రానికి క్షేమంగా తరలించింది. ♦ బీమా రక్షణ అనేది స్వచ్ఛందం. అవగాహన కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అవసరమైన వారు ముందుకొచ్చి తీసుకుంటారు. అమెరికా, కెనడా, యూకే, ఐరోపా, ఆస్ట్రేలియా తదితర చోట్ల తాము పని చేస్తున్న సంస్థల్లో బీమా ప్రయోజనాలు అందుతున్నందున ప్రవాసులు ప్రభుత్వ పథకంలో చేరడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. మరి ఇది కూడా ప్రభుత్వ తప్పిదమేనా రామోజీ? ♦కోవిడ్ విపత్తు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సమయంలో లక్షల మంది ప్రవాసాంధ్రులు వెనక్కి వచ్చేశారు. బీమా సౌకర్యం లేని వారిని గుర్తించి పథకం ప్రయోజనాలు వివరిస్తూ అందులో చేర్చేందుకు ఏపీ ఎన్ఆర్టీఎస్ పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. తద్వారా గత ప్రభుత్వ హయాం కంటే మెరుగ్గా 33,596 మందికిపైగా బీమా ప్రయోజనాన్ని పొందారు. విదేశాలకు వలస వెళ్లే కార్మికులకు మూడేళ్లకు కేవలం రూ.550 ప్రీమియం అంటే రోజుకు సుమారు 50 పైసలకే అందిస్తున్నా అది కూడా భారమే అంటూ రాగాలు తీయడం వారిని అవమానించడం కాదా? ♦ ఎలా చూసినా గత సర్కారు రెండేళ్లలో ప్రవాసాంధ్రులకు అందించిన ప్రయోజనం కంటే గత నాలుగేళ్లుగా చేకూరిన లబ్ధి 10 రెట్లు అధికంగా ఉంది. -
పిల్లల కోసం ఎల్ఐసీ కొత్త స్కీమ్.. ఎన్నో బెనిఫిట్స్
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ పిల్లల కోసం అమృత్ బాల్ పేరిట ఓ కొత్త పాలసీని పరిచయం చేసింది. పిల్లల ఉన్నత విద్య, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత, సేవింగ్స్, జీవిత బీమా, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్ఐసీ అధికారికంగా వెల్లడించింది. ఈ పాలసీ మెచ్యూరిటీ కనీస వయస్సు 18 ఏండ్లు. గరిష్ఠం 25 సంవత్సరాలు. షార్ట్ ప్రీమియం పేమెంట్ టర్మ్ 5, 6 లేదా 7 ఏండ్లు. కనీస పాలసీ టర్మ్ కోసం లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ 10 ఏండ్లు చెల్లించాలి. ఇక సింగిల్ ప్రీమియం పేమెంట్ కోసం 5 ఏండ్లు. మినిమం సమ్ అష్యూర్డ్ రూ.2 లక్షలు. గరిష్ఠ బేసిక్ సమ్ అష్యూర్డ్ కోసం పరిమితి లేదు. షరతులకు లోబడి పాలసీ వ్యవధిలో రుణ సదుపాయం లభిస్తుంది. హై బేసిక్ సమ్ అష్యూర్డ్, ఆన్లైన్ సేల్ కింద పూర్తయిన ప్రతిపాదనకు రిబేటు. మెచ్యూరిటీ మొత్తాన్ని పొందేందుకు 5, 10 లేదా 15 ఏండ్ల వాయిదాల్లో సెటిల్మెంట్ ఆప్షన్లు. మెచ్యూరిటీ తేదీ, మెచ్యూరిటీ సమ్ అష్యూర్డ్లపై పాలసీ వ్యవధిలో గ్యారంటీడ్ అడిషన్స్ ఉంటాయి. పూర్తి సమాచారం కోసం ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. -
పాలసీదారుల కోసం ‘బీమా సుగం’
న్యూఢిల్లీ: బీమా ఉత్పత్తులకు సంబంధించి అన్ని రకాల సేవలు అందించే ‘బీమా సుగం’ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఏర్పాటును బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ముసాయిదాను విడుదల చేస్తూ, మార్చి 4 నాటికి దీనిపై అభిప్రాయాలు తెలిజేయాలని కోరింది. పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ, వారి సాధికారత కోసం ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ (ఆన్లైన్ వేదిక)ను ప్రతిపాదిస్తున్నట్టు ఐఆర్డీఏఐ ప్రకటించింది. దేశంలో బీమా వ్యాప్తికి (మరింత మందికి చేరువ), లభ్యత, అందుబాటు ధరల కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. కస్టమర్లు, బీమా సంస్థలు, మధ్యవర్తులు లేదా బీమా ఇంటర్మీడియరీలు, ఏజెంట్లకు ఇది ఏకీకృత పరిష్కారంగా ఉంటుందని పేర్కొంది. పారదర్శకతను, సమర్థతను, బీమా వ్యాల్యూ చైన్ వ్యాప్తంగా సహకారానికి, టెక్నాలజీ ఆవిష్కరణలకు, బీమా సార్వత్రీకరణకు, 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యం సాకారానికి తోడ్పడుతుందని వివరించింది. ఇది లాభాపేక్ష రహిత సంస్థగా పనిచేయనుంది. బీమా సుగంపై ఎవరికీ నియంత్రిత వాటా ఉండదని, జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు వాటాదారులుగా ఉంటాయని ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. -
భేదాలు చూడని ప్రేమకు భరోసానిచ్చే బహుమతి
కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకొనే వేడుక ఏదైనా ఉందంటే అది ఒక్క ‘వేలంటైన్స్ డే’నే అని చెప్పాలి. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమ ధనిక, పేద తేడాను చూడదు. అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ ఓ పండగే అయినా ఏటా ఫిబ్రవరి 14న మాత్రం ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకొంటారు. తమ ప్రియమైన జీవిత భాగస్వామికి తన మనసులోని ప్రేమను చాటుతూ వారికి మంచి బహుమతి ఇవ్వాలని చాలామంది చూస్తుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో ఆలోచన. ఎవరి అభిరుచి, బడ్జెట్‌కి తగినట్లు బహుమతి ఎంచుకుంటూ ఉంటారు. పుష్పగుచ్చం, చాక్లెట్స్, బంగారం ఇలా అనేక బహుమతులు ఇస్తుంటారు. ఈసారి ఇందుకు భిన్నంగా వారి ఆర్థిక జీవితానికి, భవిష్యత్‌కు భరోసానిచ్చే ఈ బహుమతులు ఇచ్చి చూడండి. తప్పకుండా వారు సర్ప్రైజ్ అవుతారు. డిపాజిట్లు, పెట్టుబడుల రూపంలో.. పెట్టుబడులు మీ జీవిత భాగస్వామికి గొప్ప బహుమతి అవుతాయి. వారి భవిష్యత్ లక్ష్యాలు చేరుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, పీపీఎఫ్ ఇలా పెట్టుబడులకు అనేక మార్గాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా విలువైన బహుమతి కొనాలనుకుని మీ వద్ద సరిపడా డబ్బు లేకపోతే.. ఎప్పుడు వారికి ఆ బహుమతి ఇస్తే వారికి ఉపయోగపడుతుందో చూడండి. ఒకటి రెండేళ్లు సమయం ఉంటే రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరిచి, కాలపరిమితి ఏర్పాటు చేసుకుని, ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని జమచేయండి. మొదటి నెల మొత్తాన్ని జమ చేసి దానికి సంబంధించిన వివరాలు వారికి తెలియజేసి బహుమతి ఇవ్వండి. దీర్ఘకాలం పాటు నెలవారీ సిప్ విధానం ద్వారా పెట్టుబడులు ప్రారంభించి బహుమతి ఇవ్వొచ్చు. లేదా మీ జీవిత భాగస్వామికి ఇష్టమైన సంస్థల షేర్లను కొనుగోలు చేసి బహుమతి ఇవ్వొచ్చు. జీవిత, ఆరోగ్య బీమాతో.. మీ జీవిత భాగస్వామి, పిల్లల భవిష్యత్‌కు బీమా భరోసా కల్పించొచ్చు. జీవిత (టర్మ్ ప్లాన్), ఆరోగ్య బీమాలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో అనుకోని సంఘటనలు జరిగితే ఈ పాలసీలు మీ జీవిత భాగస్వామికి అండగా ఉంటాయి. దీంతో భవిష్యత్‌కు భరోసానిచ్చే అతిపెద్ద బహుమతి వారికి ఇస్తున్నట్లే అవుతుంది. ఎమర్జెన్సీ కోసం క్రెడిట్ లైన్.. అన్ని అత్యవసర సమయాల్లోనూ మీరు మీ జీవిత భాగస్వామి పక్కన ఉండలేకపోవచ్చు. కానీ ఫ్లెక్సీపేతో వ్యక్తిగత క్రెడిట్ లైన్‌ను అందించవచ్చు. స్వల్పకాలిక, చిన్న చిన్న అత్యవసరాల కోసం ఇది వారికి ఉపయోగపడుతుంది. ప్రతిసారీ రుణం కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా అత్యవసరాలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది వారికి ఉపయోగపడే బహుమతి అవుతుంది. బంగారం పథకాలతో.. భారతీయులకు బంగారం పట్ల మమకారం ఎక్కువ. ఇందులో భావోద్వేగాలు నిండి ఉంటాయి. బంగారం బహమతి ఇస్తే మీ ప్రియమైన వారి ఆనందానికి అవధులు ఉండవు. అయితే, బంగారాన్ని ఆభరణాల రూపంలో కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్ల రూపంలో గానీ, గోల్డ్ ఈటీఎఫ్ రూపంలో గానీ, డిజిటల్‌గా గానీ అందించడం వల్ల ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇదీ చదవండి: 'వాలెంటైన్స్ డే' రోజు షాకివ్వనున్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్! ఈ ప్రేమికుల రోజున మీకు ప్రియమైన భార్య, పిల్లల భవిష్యత్‌ను సురక్షితం చేసే బహుమతులు వారికి అందించండి. మీ కుటుంబ సభ్యులకు పొదుపు, పెట్టుబడులు, బ్యాంకులు అందించే సేవలు, క్రెడిట్ కార్డులు, బీమా ఇలా అన్ని ఆర్థిక విషయాల పట్ల అవగాహన కల్పించండి. పొదుపు చేయడం పిల్లలకు అలవాటు చేయండి. మీరు చేసే పొదుపు అలవాట్లు, ఆర్థిక విషయాల గురించి నేర్పించే పాఠాలే భవిష్యత్‌లో వారికి గొప్ప బహుమతులు అవుతాయి. -
ఇన్సూరెన్స్ సొమ్ము కోసం... శవపేటికలోని మృతదేహం అపహరణ
రంగంపేట/రాజమహేంద్రవరం రూరల్: అప్పుల పాలైన ధాన్యం వ్యాపారి ఇన్సూరెన్స్ సొమ్ము కోసం తాను మృతిచెందినట్లు శవపేటికలో ఉన్న మృతదేహాన్ని తీసుకువచ్చి పెట్రోలు పోసి కాల్చి నమ్మించేందుకు చేసిన ప్రయత్నం పోలీసుల విచారణలో బెడిసికొట్టింది. చివరకు ధాన్యం వ్యాపారితో పాటు, అతనికి సహకరించిన ముగ్గురు కటకటాల పాలయ్యారు. రంగంపేట మండలం పాతవీరంపాలెం గ్రామశివారు కేతమల్లు వెంకటేశ్వరరావు(పూసయ్య) జీడిమామిడితోటలో ఈ నెల 26వ తేదీన కాలిన మృతదేహం ఉండడంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు రంగంపేట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహం వెంకటేశ్వరరావుదిగా భావించి పోస్టుమార్టం కోసం అనపర్తి ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు భార్య అతని మృతదేహంపై పడి తీవ్రంగా ఆవేదన చెందుతున్న విషయం తెలుసుకున్నాడు. దీంతో అతను వెంటనే భార్యకు ఫోన్ చేసి ఎవరో బాడీని తగులబెట్టి తనను కొట్టి తుప్పల్లో పడవేశారని చెప్పాడు. వెంకటేశ్వరరావు బతికి ఉండడంతో కాలిన మృతదేహం ఎవరిదో తెలుసుకునేందుకు రాజమహేంద్రవరం తూర్పు మండల డీఎస్పీ కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో అనపర్తి సీఐ పి.శివగణేష్, రంగంపేట ఎస్సై పి.విజయకుమార్ దర్యాప్తు చేపట్టారు. దీంతో నిందితుడు అసలు విషయాన్ని బయట పెట్టాడు. వీరంపాలెం గ్రామానికి చెందిన కేతమళ్ల వెంకటేశ్వరరావు(పోసియ్య)కు అప్పులు ఎక్కువగా ఉండడంతో తన పేరుపై ఉన్న రూ. కోటి ఇన్సూరెన్న్స్ను క్లయిమ్ చేసుకొనేందుకు ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్‌ను అమలు చేసేందుకు హుకుంపేట గ్రామానికి చెందిన వందే శ్రీను, తలారి సుబ్బారావు, మోరంపూడికి చెందిన సిరాచిన్నాలతో వెంకటేశ్వరరావును వినియోగించాడు. ఒక శవాన్ని తీసుకొచ్చి తన పొలంలో కాల్చేయాలని నిర్ణయించాడు. ఆ ముగ్గురితో రూ.రెండు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారు ఈ నెల 25వ తేదీ రాత్రి పాతబొమ్మూరులోని క్రైస్తవ శ్మశాన వాటికలో ఒక శవాన్ని తవ్వి బయటకు తీశారు. సదరు మృతదేహాన్ని శ్రీను కారులో వేసుకొని రాత్రి ఒంటి గంట ప్రాంతంలో పాత వీరంపాలెం వెళ్లి వెంకటేశ్వరరావుకు తెలిపాడు. ఇద్దరూ కలిసి శవాన్ని తగులబెట్టి అక్కడనుంచి పరారయ్యారు. ఈ నెల 26వ తేదీన వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆ కాలిపోయిన బాడీ వెంకటేశ్వరరావుది అని భావించి శవాన్ని అనపర్తి హాస్పిటల్‌కు తరలించారు, అనంతరం గ్రామంలో తన భార్య, పిల్లలు కుటుంబ సభ్యులు బాధపడుతున్నారని శ్రీను ద్వారా తెలిసి, ఎవరో బాడీని తగులబెట్టి తనని కొట్టి తుప్పల్లో పడేసారని డ్రామా మొదలెట్టాడు. చివరకు పోలీసులు వెంకటేశ్వరరావు, అతనికి సహకరించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో మొత్తం డ్రామా బయటపడింది. ఆ మృతదేహం నెల్లి విజయరాజుది పాతబొమ్మూరు క్రైస్తవ శ్మశానవాటికలో తస్కరించిన మృతదేహం బొమ్మూరు గ్రామానికి చెందిన ఓఎన్జీసీ ఉద్యోగి నెల్లి విజయరాజుదిగా పోలీసులు గుర్తించారు. నెల్లివిజయరాజు అనారోగ్యంతో ఈనెల 23వ తేదీన మృతిచెందారు. ఈ నెల 24న ఖననం చేశారు. 29న అతని జ్ఞాపకార్థకూడిక నిర్వహించారు. అయితే మంగళవారం రంగంపేట పోలీసులు నిందితులను తీసుకుని పాతబొమ్మూరు శ్మశానవాటిక వద్దకు వెళ్లే వరకు గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు నెల్లి విజయరాజు మృతదేహాన్ని తీసుకువెళ్లి పెట్రోలుతో దహనం చేశారన్న విషయం తెలియలేదు. పోలీసులు విజయరాజు ఖననం చేసిన చోట తవ్వించి చూడగా అందులో మృతదేహం కనిపించలేదు. అనపర్తి హాస్పిటల్లో ఉన్న మృతదేహం విజయరాజుదిగా ఆయన కుటుంబసభ్యులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పాతబొమ్మూరులోని శ్మశానవాటికకు తీసుకువచ్చి ఖననం చేశారు. -
రొయ్యకు బీమా.. రైతుకు ధీమా
సాక్షి, భీమవరం: ఆక్వా రైతుకు అడుగడుగునా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీమా సదుపాయంతో సాగులో వారికి ధీమా కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో బీమా పాలసీ కల్పనకు ఇప్పటికే రాష్ట్రాన్ని కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. బీమా పాలసీలపై రైతులకు అవగాహన కల్పించి, వారి అభిప్రాయాలు తీసుకునేందుకు ఆలిండియా ప్రాన్ ఫెడరేషన్, స్టేట్ ప్రాన్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. అందులో భాగంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి 200 మందికి పైగా ఆక్వా రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. ఓరియంటల్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై వారు అందించే పాలసీల వివరాలను రైతులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సాగు కాలం, ప్రీమియం రేట్లు, సైక్లోన్ జోన్, నాన్ సైక్లోన్ జోన్లలో పాలసీ కవరేజీ వివరాల గురించి అవగాహన కల్పించారు. రైతులు తమ ఎంపిక ప్రకారం 135 రోజుల నుంచి 180 రోజుల వరకు ప్రాథమిక కవర్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట నష్టాన్ని కవర్ చేసుకోవచ్చునని తెలిపారు. పాలసీలపై రైతులు లేవనెత్తిన సందేహాలను బీమా సంస్థల ప్రతినిధులు నివృత్తి చేశారు. వ్యాధులు, వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులు, మార్కెట్ సమస్యలు, ఇతర సవాళ్లను ఆక్వా రైతులు అధిగమించేందుకు ప్రభుత్వం బీమా పాలసీ తెచ్చిందని ఫిషరీస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అంజలి ఈ సందర్భంగా తెలిపారు. ఫిషరీస్ జేడీ మాధవీలత, డిప్యూటీ డైరెక్టర్ ఆనందరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్వీఎస్వీ ప్రసాద్, నేషనల్ ప్రాన్ ఫార్మర్స్ అధ్యక్షుడు ఐపీఆర్ మోహనరావు, ఏపీ ప్రాన్ ఫార్మర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీకేఎఫ్ సుబ్బరాజు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మల్ల రాంబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా ఆక్వా ఫార్మర్స్ అధ్యక్షుడు నాగభూషణం, వత్సవాయి కుమార్‌రాజా తదితరులు పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాల కోసమే బీమా ఈ సదస్సులో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ ఆక్వా రైతుల ప్రయోజనాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఏదోక పాలసీని తెచ్చి రైతులపై రుద్దకుండా వారి సూచన మేరకు ప్రయోజనకరమైన పాలసీ తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తోందన్నారు. ఫిబ్రవరి 10 నాటికి సదస్సులు పూర్తి చేసి పాలసీలపై రైతుల నుంచి వచ్చిన సూచనలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు ఆక్వా రైతులకు పెట్టిన రూ. 340 కోట్ల విద్యుత్ బకాయిలను వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. అప్సడా ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో రైతులకు మూడు లక్షలకు పైగా సబ్సిడీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో బ్రూడల్ స్టాక్ మెయింటెనెన్స్ సెంటర్ (బీఎంసీ) ఏర్పాటులో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం బంగారుపేటలో రూ. 36 కోట్లతో బీఎంసీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఆగస్టు నాటికి ప్రారంభించే విధంగా సీఎం జగన్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారని రఘురాం తెలిపారు. -
ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.కోటి సాయం
సాక్షి, హైదరాబాద్: ► సిద్దిపేట నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఫెయిల్ కావటంతో ప్రయాణికులను మరో బస్సులోకి ఎక్కించారు. కండక్టర్ బస్సు ముందు నిలబడి ఆ వివరాలను రిపోర్టులో రాస్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఆగి ఉన్న బస్సును ఢీకొంది.. దీంతో బస్సు దూసుకొచ్చి ముందు నిలబడిన కండక్టర్‌ను ఢీకొనటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవలే ఆయన కుటుంబానికి ప్రమాద సాయంగా రూ.40 లక్షలు అందాయి. ► మెహిదీపట్నంకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ చిన్న కారణంతో గతంలో ఆర్టీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని సర్వీసు నుంచి తొలగించింది. దానిపై ఆ డ్రైవర్ లేబర్ కోర్టును ఆశ్రయించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో అతను దుర్మరణం చెందాడు. సర్వీసులో లేకపోవటంతో ఆర్టీసీ నుంచి ఎలాంటి సాయం అందలేదు. దీంతో ఆ కుటుంబం పరిస్థితి దీనంగా మారింది. చిన్న పిల్లలను చదివించేందుకు ఆయన భార్య ఇళ్లల్లో పాచి పనులు చేయాల్సి వచ్చింది. ఆ దీనావస్థకు చలించి కొందరు జోక్యం చేసుకోవటంతో చివరకు ఆ ఉద్యోగి కుటుంబానికి కూడా రూ.40 లక్షల ప్రమాద బీమా సాయం అందింది. ఇలా అనుకోని ప్రమాదం చోటు చేసుకుని.. సంపాదించే కుటుంబ పెద్ద చనిపోతే అల్పాదాయ కుటుంబాలు ఆర్థికంగా ఎదు ర్కొనే ఇబ్బందులు వర్ణనాతీతం. ఆస్తులు లేని కుటుంబాలు, సంపాదించే ఇతర వ్యక్తులు లేని కుటుంబాలు రోడ్డున పడటమే. ఇలాంటి సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు వారి ఖాతాలున్న బ్యాంకు శుభవార్త చెప్పింది. ప్రమాదవశాత్తూ చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగి కుటుంబాలకు ఇకపై ఏకంగా రూ.కోటి సాయం అందనుంది. ఆ ఉద్యోగి పేరుతో రూపే కార్డు ఉంటే మరో రూ.15 లక్షలు అందుతుంది. వెరసి, రూ.1.15 కోట్లు అందటం ద్వారా ఆ కుటుంబానికి ఆర్ధికంగా వెసులుబాటు కలగబోతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇది అమలు కానుంది. ఖాతాలు యూబీఐలోకి రావడంతో.. ఆర్టీసీ ఉద్యోగులకు పెద్దగా ఊరటనిచ్చే ప్రమాద బీమా లేదు. సంస్థ పరంగా అందే సాయం కూడా నామమాత్రమే. ఇలాంటి తరుణంలో, సూపర్ సేవింగ్ శాలరీ ఖాతా ద్వారా యూబీఐ పెద్ద వెసులుబాటు కల్పించింది. గతంలో ఆర్టీసీ జీతాల ఖాతాలు మరో బ్యాంకులో ఉండేవి. ఏడాదిన్నర క్రితం ఎండీ సజ్జనార్ వాటిని యూబీఐలోకి మార్చారు. ఆ సమయంలో ప్రమాద బీమా కింద ఆర్థిక సాయం అందే వెసులుబాటు గురించి చెప్పిన బ్యాంకు అధికారులు, ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాలను సూపర్ సేవింగ్ సాలరీ ఖాతాలుగా మార్చాలని సూచించారు. ఆ వెంటనే ప్రమాద బీమా కింద రూ.40 లక్షలు పొందే వీలు కల్పించింది. దాదాపు ఏడాదిగా అది అమలవుతోంది. ఈ సమయంలో దాదాపు 20 మంది ఆర్టీసీ ఉద్యోగులుకు ప్రమాదాల బారిన పడి మృతి చెందారు. వీరి కుటుంబాలకు దశలవారీగా ప్రమాద బీమా కింద రూ.40 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని బ్యాంకు అందజేసింది. ఏదైనా సంస్థలో పనిచేస్తూ, ప్రతినెలా ఠంచన్‌గా జీతం అందే వారికి ఈ ఖాతా పొందే వీలును బ్యాంకు కల్పిస్తోంది. బ్యాంకుల మధ్య పోటీతో పెంపు బ్యాంకుల మధ్య నెలకొన్న పోటీ వాతావరణం నేపథ్యంలో, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.కోటికి పెంచుతూ ఆ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో 47 వేల మంది వరకు ఉద్యోగులున్నారు. ప్రతినెలా రూ.220 కోట్ల వరకు వారి జీతాల పద్దు ఉంటుంది. నిత్యం ఆర్టీసీకి రూ.14 కోట్ల వరకు టికెట్ల రూపంలో ఆదాయం (మహిళలకు అందించే జీరో టికెట్ల మొత్తం కాకుండా) ఉంటుంది. ఇవన్నీ ఆ బ్యాంకులోనే డిపాజిట్ అవుతాయి. ఇది పెద్ద మొత్తం కావటంతో సంస్థను ఆకట్టుకునేందుకు ఆ బ్యాంకు ఈ ప్రమాద బీమా మొత్తాన్ని పెంచింది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది. ఇక బ్యాంకు అందించే రూపే కార్డు ఉన్న వారికి అదనంగా మరో రూ.15 లక్షలు కూడా అందుతుంది. ఇప్పటికీ అవగాహన లేని ఉద్యోగులెందరో.. ఈ ప్రమాద బీమా గురించి దాదాపు ఉద్యోగులందరికి తెలిసినా, అది వర్తించాలంటే ఏం చేయాలన్న విషయంలో కొందరికి ఇప్పటికీ అవగాహన లేదు. తమ ఖాతాలను సూపర్ సేవింగ్స్ సాలరీ ఖాతాగా మార్చాలంటూ ప్రతి ఉద్యోగి సంబంధిత బ్యాంకు బ్రాంచీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ, ఆ ఖాతాలోకి మారని ఉద్యోగులెందరో ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ప్రమాదవశాత్తూ చనిపోతే వారికి ఈ పథకం వర్తించదు. దాదాపు ఏడాదిగా ఆ బ్యాంకు ప్రమాద బీమా వసతిని అమలు చేస్తున్నా, ఉద్యోగులకు అవగాహన కల్పించటంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారు. ఇక రూపే కార్డు తీసుకోవాలని, దాన్ని ప్రతి 45 రోజుల్లోపు ఒకసారన్నా కచ్చితంగా వాడాలన్న నిబంధన గురించి కూడా అవగాహన లేదు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఈడీ కృష్ణకాంత్ చర్యలు ప్రారంభించారు. ఈ పథకం వివరాలు, ఉద్యోగులు అనుసరించాల్సిన విషయాలను తెలియ చెప్తూ ఫ్లెక్సీలు రూపొందించి అన్ని డిపోలకు పంపుతున్నారు. -
నెట్‌వర్క్‌లోలేని ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్ ట్రీట్మెంట్.. కానీ..
ప్రైవేటు ఆస్పత్రుల్లో నెట్‌వర్క్‌లోలేని హాస్పటల్స్‌లో కూడా ఇవ్వాళ్టి నుంచి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఈమేరకు కీలక నిర్ణయం వెలువడింది. ఆరోగ్య బీమా తీసుకున్న వారు అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈరోజు నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లు ‘ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’ తెలిపింది. బీమా తీసుకుని ఏదైనా సమస్యతో ఆసుపత్రిలో చేరిన వారికి ఇకపై ఇబ్బందులు తొలగనున్నాయి. ఇప్పటివరకు నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరితేనే ఎలాంటి డబ్బు చెల్లించకుండా వైద్యం పూర్తయ్యేది. అయితే ఈరోజు నుంచి నెట్వర్క్ ఆసుపత్రులతోపాటు ఆ జాబితాలో లేని హాస్పటల్స్‌లో చేరినా ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. నెట్వర్క్ హాస్పిటల్ జాబితాలో లేని ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ సదుపాయం వినియోగించుకోవాలంటే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకు రెండు రోజుల ముందు అంటే 48 గంటల ముందే సదరు వైద్యం గురించి తెలియజేయాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ఎమర్జెన్సీ సందర్భాల్లో నెట్‌వర్క్‌లోలేని ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోపు కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ షరతులు, నిబంధనల ఆధారంగా క్లెయిం వర్తిస్తుందని కౌన్సిల్ వివరించింది. ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నెట్వర్క్ హాస్పిటల్స్‌లో మాత్రమే క్యాష్‌లెస్‌కు అనుమతి ఉండేది. క్యాష్‌లెస్ సదుపాయం లేనిచోట వైద్యానికి అయ్యే ఖర్చును పాలసీదారులే చెల్లించాలి. తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి. దాంతో ట్రీట్మెంట్ అయిన ఖర్చు పూర్తిగా ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు. ఫలితంగా పాలసీదారులు కొంత నష్టపోయే అవకాశం ఉండేది. దాంతోపాటు ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండడం, రిఫండ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉండేవి. ఇదీ చదవండి: దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం! ప్రస్తుతం 63 శాతం మంది క్యాష్‌లెస్ సదుపాయం ఎంచుకుంటుంటే.. మిగిలినవారు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని కౌన్సిల్ ఎండీ, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓ తపన్ సింఘాల్ తెలిపారు. క్లెయిం ప్రక్రియను సులభతరం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. -
LIC Jeevan Dhara II Policy: ఎల్ఐసీ 'జీవన్ ధార 2' పాలసీ లాంఛ్..అదిరిపోయే బెన్ఫిట్స్!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జీవన్ ధార 2 పేరుతో యాన్యుటీ ప్లాన్‌ను లాంఛ్ చేసింది. జనవరి 22, 2024 నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి రానుంది. ఇక పాలసీని పొందేందుకు కనీస వయస్సు 20 సంవత్సరాలు ఉండాలి. వ్యవధిని బట్టి పాలసీలోకి ప్రవేశించే గరిష్ట వయస్సు (65/70/80 సంవత్సరాలు) మారుతుంటుంది. అధికారిక ప్రకటన ప్రకారం.. యాన్యుటీ ప్రారంభం నుండి రెగ్యులర్ ఇన్ కమ్ పొందవచ్చు. జీవన్ ధార 2 పథకం వివరాలు ►పాలసీ కట్టే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ వర్తిస్తుంది. ►ఒకేసారి డిపాజిట్ చేసి (యాన్యుటీని) ప్రతినెలా కొంత మొత్తాన్ని ఆదాయం రూపంలో పొందవచ్చు. దీనిని మూడు, ఆరు నెలలు, ఏడాదికి ఇలా చెల్లించుకోవచ్చు. ►యాన్యుటైజేషన్ లేదా ఇన్స్టాల్మెంట్ల రూపంలో డెత్ క్లెయిమ్ రాబడిని ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది. ► తీసుకునే ప్రీమియంను బట్టి పాలసీ దారులకు ప్రయోజనాలు అదే స్థాయిలో ఉంటాయి. ► రెగ్యులర్ ప్రీమియం- వాయిదా కాలం 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు, ► సింగిల్ ప్రీమియం- వాయిదా కాలం 1 సంవత్సరం నుండి 15 సంవత్సరాల వరకు, ►యాన్యుటీ టాప్-అప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ►ఈ ఎల్ఐసీ జీవన్ ధార 2 పాలసీపై లోన్ తీసుకోవచ్చు. ►పాలసీదారుడు మరణిస్తే ఏకమొత్తంగా పరిహారం పొందవచ్చు. లేదా వాయిదా పద్ధతుల్లోనూ పరిహారం తీసుకోవచ్చు. -
నేటి నుంచి రాబోతున్న కీలక మార్పులు ఇవే..
ప్రతి ఏడాది మునుపటి సంవత్సరం కంటే భిన్నంగా ఉంటుంది. 2024 కూడా అంతే. 2023తో పోలిస్తే కొన్ని మార్పులు సహజం. ఇవన్నీ అందరి జీవితాలపై ఎంతోకొంత ప్రభావం చూపుతాయి. ఆర్థిక అవగాహనతో సమాజంలో మరింత ఉన్నతంగా ఎదిగేందుకు దోహదం చేస్తాయి. అయితే జనవరి 1, 2024 నుంచి వచ్చే కొన్ని ప్రధాన మార్పుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. పెరిగిన కార్ల ధరలు టాటా మోటార్స్, మారుతీ, హ్యుందాయ్, మహీంద్రా వంటి చాలా ఆటో కంపెనీలు జనవరి 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతామని ప్రకటించాయి. అధిక ఇన్పుట్ ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలియజేశాయి. ధరల పెంపు దాదాపు 2-3 శాతం ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే కొన్ని మోడళ్లకు అధిక ధరల పెంపు ఉండవచ్చని ఆటోమొబైల్ నిపుణులు అంటున్నారు. యూపీఐ ఐడీలు రద్దు ఆన్లైన్ పేమెంట్ యాప్‌లైన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌లలోని యూపీఐ ఖాతాను ఒక సంవత్సరం పాటు ఉపయోగించకుంటే, ఇక నుంచి అది పనిచేయదు. ఇలాంటి ఐడీలను జనవరి ఒకటో తేదీ నుంచే డీయాక్టివేట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీని గురించి ఈ ఏడాది నవంబర్ ఏడో తేదీన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఒక ప్రకటన జారీ చేసింది. లావాదేవీలు నిర్వహించని కస్టమర్ల ఫోన్ నంబర్లతో మోసాలు జరగకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. కావాలంటే వాటిని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొంది. సులభమైన భాషలో బీమా వివరాలు 2024 జనవరి 1 నుంచి ఆరోగ్య బీమా పాలసీదారుల కోసం రివైజ్డ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్లను (సీఐఎస్) విడుదల చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవెలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఇన్సూరెన్స్ సంస్థలను ఆదేశించింది. కస్టమర్లు పాలసీలోని ముఖ్య విషయాలను సులభంగా అర్థం చేసుకునేలా చేయడం దీని లక్ష్యం. సులభమైన భాషలో అన్నింటినీ వివరించాలని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. జనవరి 31 లాస్ట్ డేట్! డిజిటల్ కేవైసీ ఇకపై మొబైల్ కనెక్షన్ల కోసం సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసే విధానం మారుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఆదేశాల ప్రకారం.. కస్టమర్లకు సిమ్ కార్డ్‌లను విక్రయించే ముందు వారి ఫిజికల్ వెరిఫికేషన్‌ను దశలవారీగా తొలగించాలని టెలికమ్యూనికేషన్ కంపెనీలను ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేవైసీ వెరిఫికేషన్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. కస్టమర్లు తమ ఫొటో గుర్తింపు రుజువును చూపించి, డిజిటల్‌గా వెరిఫికేషన్ చేయించుకోవాలి. సిమ్ కార్డ్ మోసాలను అరికట్టడానికి ఈ చర్య ఒక మార్గమని డాట్ వివరించింది. -
రూ.7.83లక్షల కోట్లకు చేరిన జీవిత బీమా ప్రీమియం
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరంలో జీవిత, సాధారణ బీమా సంస్థలు మెరుగైన వృద్ధిని చూపించాయి. జీవిత బీమా ప్రీమియం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం పెరిగి రూ.7.83 లక్షల కోట్లకు చేరుకుంది. సాధారణ బీమా సంస్థల ప్రీమియం ఆదాయం సైతం 16.4 శాతం వృద్ధితో రూ.2.57 లక్షల కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి (ఐఆర్డీఏఐ) సంస్థ విడుదల చేసింది. ప్రైవేటు జీవిత బీమా సంస్థల ఆదాయం 16.34 శాతం పెరగ్గా, ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల (ఎల్ఐసీ) ఆదాయం 10.90 శాతం వృద్ధి చెందింది. మొత్తం ప్రీమియంలో రెన్యువల్ (పాత పాలసీల పునరుద్ధరణ) ప్రీమియం 52.56 శాతం వాటాను ఆక్రమించింది. మిగిలిన 47.44 శాతం ప్రీమియం నూతన పాలసీల రూపంలో సమకూరింది. రెన్యువల్ ప్రీమియం 8.88 శాతమే పెరగ్గా.. నూతన పాలసీ ప్రీమియం ఆదాయం 17.90 శాతం వృద్ధి చెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 285 లక్షల పాలసీలు 2022–23లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు 284.70 లక్షల నూతన పాలసీలను జారీ చేశాయి. ఇందులో ప్రభుత్వరంగ బీమా సంస్థలు జారీ చేసినవి 204.29 లక్షలుగా (71.75 శాతం) ఉన్నాయి. ప్రైవేటు జీవిత బీమా సంస్థలు 80.42 లక్షల పాలసీలను (28.25 శాతం) జారీ చేశాయి. జీవిత బీమా సంస్థల పన్ను అనంతరం లాభం ఐదు రెట్లు పెరిగి రూ.42,788 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.7,751 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల లాభం 800 శాతం పెరిగితే, ప్రైవేటు జీవిత బీమా సంస్థల లాభం 72.36 శాతం వృద్ధిని చూసింది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ (సాధారణ బీమా) రంగం మొత్తం రూ.257 లక్షల కోట్ల స్థూల ప్రీమియాన్ని అండర్ రైటింగ్ చేసింది. 27 ప్రైవేటు రంగ బీమా సంస్థలు (స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు సహా) రూ.1.58 లక్షల కోట్ల ప్రీమియాన్ని అండర్రైట్ చేశాయి. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 38.42 శాతం వాటా కలిగి ఉంటే, ప్రైవేటు సాధారణ బీమా సంస్థల వాటా 61.58 శాతంగా ఉంది. మొత్తం వ్యయాల్లో కమీషన్ (మధ్యవర్తులకు), నిర్వహణ వ్యయాలు ఎక్కువగా ఉంటున్నాయి. నాన్ లైఫ్ బీమా సంస్థల అండర్‌రైటింగ్ నష్టాలు రూ.32,797 కోట్లకు పెరిగిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.31,810 కోట్లుగా ఉన్నాయి. వార్షికంగా నష్టాలు 3 శాతం పెరిగాయి. స్విస్ ఆర్ఈ సిగ్నా నివేదిక ప్రకారం మన దేశంలో జీవిత బీమా విస్తరణ 2022–23లో 3 శాతానికి తగ్గింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 3.2 శాతంగా ఉంది. -
అత్యంత కస్టమైజ్డ్ పాలసీలకు ఆదరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారితో జీవిత బీమాపై అభిప్రాయం మారిందని, ఏదో పెట్టుబడి సాధనంగా కాకుండా కీలకమైన రిస్క్ కవరేజీ సాధనంగా చూసే ధోరణి పెరిగిందని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ (బీఏఎల్‌ఐసీ) చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ (సీఏవో) సమీర్ జోషి తెలిపారు. ప్రజలు టర్మ్ ప్లాన్ల వైపు మొగ్గు చూపడం పెరిగిందని చెప్పారు. అలాగే, చెల్లింపుల్లో వెసులుబాటు, ఆన్లైన్ లావాదేవీలు, అదనపు కవరేజీ, వినూత్న ఉత్పత్తులు మొదలైన అత్యంత కస్టమైజ్డ్ ఆప్షన్లను కోరుకుంటున్నారని ఆయన వివరించారు. కంపెనీలు కూడా దానికి అనుగుణంగా సత్వరం తమ సర్వీసులు, ఉత్పత్తుల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నాయని జోషి చెప్పారు. తాము ప్రవేశపెట్టిన ఏస్, డయాబెటిక్ టర్మ్ ప్లాన్ మొదలైనవి ఈ కోవకి చెందినవేనని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. దక్షిణాదిపై మరింత దృష్టి .. ఇతరత్రా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మొదలైనవి .. అలాగే గోవా, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో బీమా విస్తృతి ఎక్కువగా ఉందని ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది. ఈ ప్రాంతాల్లో బీమా విస్తృతిని మరింత పెంచడంపై దృష్టి పెడుతున్నాం. కీలక ఆర్థిక సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నాం. ప్రవాస భారతీయ కస్టమర్లలో చాలా మంది ఈ ప్రాంతాలకు చెందినవారే కావడంతో వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్లు, సర్వీసులను తీర్చిదిద్దుతున్నాం. లక్ష కోట్లు దాటిన ఏయూఎం.. బజాజ్ అలయంజ్ లైఫ్ అతి తక్కువ కాలంలోనే దిగ్గజ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 56,085 కోట్లుగా ఉన్న మా ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటింది. మాపై కస్టమర్ల నమ్మకానికి ఇది నిదర్శనం. సరళమైన, వినూత్నమైన, కస్టమర్ ఆధారిత సాధనాలు, సమర్ధమంతమైన పంపిణీ వ్యవస్థ మొదలైనవి ఇందుకు తోడ్పడ్డాయి. పాలసీల వృద్ధిపరంగా పరిశ్రమ కన్నా అధికంగా 23 శాతం వృద్ధి సాధిస్తున్నాం. మాకు 1.40 లక్షల మంది ఏజెంట్లు, 60 పైచిలుకు ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం, 505 శాఖల పటిష్టమైన నెట్వర్క్ ఉంది. మొత్తం మీద సహాయకరమైన నియంత్రణ వ్యవస్థ, ప్రభావవంతమైన మార్పులతో 2023 మా సంస్థతో పాటు ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగానికి సానుకూలంగా గడిచింది. వృద్ధి లక్ష్యాలు.. వినూత్న ఉత్పత్తులు, సమగ్ర సేవలతో కొత్త ఏడాదిలో మరింత మంది కస్టమర్లకు చేరువై జీవిత బీమా రంగంలో మా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్దేశించుకున్నాం. కొత్త పాలసీల విషయంలో పరిశ్రమకు రెట్టింపు స్థాయి వృద్ధి సాధించడం, వేగంగా ఎదుగుతున్న టాప్ సంస్థల్లో ఒకటిగా కొనసాగడాన్ని లక్ష్యాలుగా పెట్టుకున్నాం. మా నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడతాం. పరిశ్రమపరంగా చూస్తే 2032 నాటికి భారత ఇన్సూరెన్స్ మార్కెట్ ప్రపంచంలోనే ఆరో పెద్ద మార్కెట్‌గా ఎదుగుతుందని స్విస్ రీ సంస్థ ఒక నివేదికలో అంచనా వేసింది. పరిశ్రమ వృద్ధి గతిని తీర్చిదిద్దడంలో నియంత్రణ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది. బీమా సుగమ్, బీమా వాహక్, బీమా విస్తార్ వంటివి దేశవ్యాప్తంగా కోట్ల మందికి బీమాను అందుబాటులోకి తేవడం ద్వారా ‘2047 నాటికి అందరికీ బీమా కల్పించడం’ అనే ఐఆర్డీఏఐ లక్ష్య సాధనలో తోడ్పడగలవు. అలాగే పాలసీలను క్రమబద్ధీకరించడం, ప్రక్రియలను .. సర్వీసులను మెరుగుపర్చడం వంటి చర్యల ద్వారా బీమాను సరళతరం చేయడంపై పరిశ్రమ మరింతగా దృష్టి పెట్టనుంది. -
5 లక్షల ప్రమాద బీమా.. 10 లక్షల ఉచిత వైద్యం
సాక్షి, హైదరాబాద్: ఉబర్, ఓలా, జొమాటో, స్విగ్గీ, అర్బన్ కంపెనీ లాంటి యాప్ ఆధారిత సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, బాయ్‌లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ కోసం వెళ్లినప్పుడు కుక్క తరమడంతో కంగారులో భవనం పైనుంచి పడి మరణించిన ఓ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్యాబ్ సంస్థలు నిర్వహిస్తున్న తరహాలో ఓ యాప్‌ను టీ–హబ్ ద్వారా సిద్ధం చేసి అవకాశం ఉన్న వారికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించినప్పుడు నవంబర్ 27న కొందరు ఫుడ్ డెలివరీ బాయ్‌లతో భేటీ కావడం తెలిసిందే. అప్పుడు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న రాహుల్... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆయా సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తిని ఈ మేరకు ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఓలా, ఉబర్ ద్వారా పనిచేసే ఆటో డ్రైవర్లతోపాటు క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్‌ల సమస్యలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న బాయ్‌లతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఆయా సంస్థల్లో పనిచేస్తూ రక్షణ లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నామని వెల్లడించారు. అసంఘటిత రంగ కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని... ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్తాన్‌లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అంతకంటే మెరుగైన విధంగా చట్టం తయారీకి బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. కార్మికుల సంక్షేమంపై దృష్టిపెట్టని సంస్థలపై చర్యలు.. ‘సంస్థలు కూడా లాభాపేక్ష మాత్రమే చూడకుండా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. సిబ్బంది సంక్షేమాన్ని విస్మరించే ఎంత పెద్ద సంస్థలపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోం. నాలుగు నెలల క్రితం ఓ స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనం పైనుంచి పడి మృతి చెందాడు. అప్పటి ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందుతుందేమోనని చూశా. కానీ ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవత్వంతో వ్యవహరించాలి. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి మృతుని కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజాపాలన గ్రామసభల్లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్‌లకు సీఎం సూచించారు. డిజిటల్, మాన్యువల్ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, మాధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆటోవాలాలు ఆందోళన పడొద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని ఆటోవాలాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆటోవాలాలతోనూ త్వరలో చర్చించి వారికి ఇబ్బంది లేని రీతిలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్యాబ్, ఫుడ్ డెలివరీ బాయ్స్‌తో సమావేశం అనంతరం పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం వల్ల ఆటోవాలాల ఉపాధి పడిపోదని, బస్సులు దిగాక ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రయాణికులు మళ్లీ ఆటోలనే కదా ఆశ్రయించాల్సిందని అన్నారు. -
Insurance: బీమా కూడా లేకుండా కోట్ల మంది!
ముంబై: బీమా విస్తరణకు ప్రభుత్వం, బీమా రంగ అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఎంతో కృషి చేస్తున్నప్పటికీ, దేశ జనాభాలో 95 శాతం మందికి బీమా రక్షణ లేదని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ ఓ నివేదికలో తెలిపింది. ఈ నివేదికను ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా ఆవిష్కరించారు. యూపీఐ, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్ల విస్తరణకు దోహదపడిన చర్యలను అనుసరించాలని బీమా పరిశ్రమకు ఆయన సూచించారు. ఈ నివేదికలో పేర్కొన్నట్టు అధిక రిస్క్ ఉన్న ప్రాంతాల్లో విపత్తుల ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి నూరేళ్లు పూర్తి చేసుకునే నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని చేరువ చేసేందుకు ఇది అవసరమన్నారు. దేశ జనాభా 144 కోట్లలో 95 శాతం మందికి బీమా కవరేజీ లేని విషయాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ప్రకృతి విప్తతులు పెరిగిపోయిన క్రమంలో బీమా కవరేజీ ప్రాధాన్యాన్ని ఈ నివేదిక ఎత్తి చూపించింది. రుణానికి బీమా లింక్ దిగువ, మధ్యాదాయ వర్గాల్లో 84 శాతం మంది, తీర ప్రాంతాలు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 77 శాతం మందికి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లేదని ఈ నివేదిక తెలిపింది. బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలని తన నివేదికలో నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ సూచించింది. నిజానికి బీమా తీసుకున్న వారిలోనూ కవరేజీ సమగ్రంగా లేని అంశాన్ని ప్రస్తావించింది. ఇదీ చదవండి: LIC Credit Card: ఎల్ఐసీ నుంచి క్రెడిట్ కార్డు.. భలే బెనిఫిట్స్! జీవిత బీమా రక్షణలో 87 శాతం అంతరం (వాస్తవ కవరేజీ–తీసుకున్న దానికి మధ్య) ఉందని, ఇది గణనీయమైన వ్యాపార అవకాశాలు వీలు కల్పిస్తుందని తెలిపింది. అలాగే, 73 శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ లేదని వెల్లడించింది. ప్రభుత్వం, ఎన్జీవోలు, పరిశ్రమ కలసి సూక్ష్మ ఆరోగ్య బీమా పథకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. యాన్యుటీ, పెన్షన్ ప్లాన్లలో కవరేజీ అంతరం 93 శాతంగా ఉందని తెలిపింది. -
2047 నాటికి భారతీయులందరికీ జీవిత బీమా.. త్వరలో ప్లాన్ విడుదల
న్యూఢిల్లీ: దేశంలో 2047 నాటికి ప్రతి ఒక్కరికీ బీమాను చేరువ చేయాలన్న లక్ష్యం సాధనలో ఎల్ఐసీ కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ చైర్మన్ సిద్థార్థ మహంతి ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను గ్రామీణ ప్రాంతాల వారి కోసం రూపొందించిన ప్లాన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు చెప్పారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన ప్రతి ఒక్కరికీ బీమా రక్షణ ఎలా కలి్పంచాలన్న దానిపై మా దృష్టి ఉంటుంది. రానున్న రోజుల్లో మా మొత్తం వ్యాపారంలో గ్రామీణ ప్రాంతాల వాటా పెరగనుంది’’అని మహంతి పేర్కొన్నారు. జీవిత, ఆరోగ్య, ఆస్తుల బీమాతో కూడిన బీమా విస్తార్ ఉత్పత్తిని ప్రతిపాదించినందుకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ సగటుతో చూస్తే మన దేశంలో బీమా కవరేజీ చాలా తక్కువగా ఉండడం గమనార్హం. మరోవైపు డిజిటల్‌గా మారే ‘డైవ్’ ప్రాజెక్ట్‌ను ఎల్ఐసీ చేపట్టింది. దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కన్సల్టెంట్‌ను కూడా నియమించుకుంది. మా భాగస్వాములు, కస్టమర్లు, మధ్యవర్తులు, మార్కెటింగ్ చేసే వారికి అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలన్నదే డైవ్ ప్రాజెక్ట్ ధ్యేయమని మహంతి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలుత కస్టమర్లను డిజిటల్ మార్గాల ద్వారా సొంతం చేసుకోవడంపై ఎల్ఐసీ దృష్టి సారించనుంది. అనంతరం ఇతర విభాగాల్లో డిజిటల్ పరివర్తనం ఉంటుందని మహంతి చెప్పారు. ‘‘కస్టమర్లు కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. ఇంటి నుంచే మొబైల్ ద్వారా కావాల్సిన సేవలను పొందొచ్చు’’అని ప్రకటించారు. -
జనవరి 1 నుంచి బీమాలో కొత్త రూల్స్ - తెలుసుకోవాల్సిందే!
న్యూఢిల్లీ: బీమా సంస్థలు పాలసీలోని కనీస సదుపాయాల గురించి పాలసీదారులకు తప్పకుండా తెలియజేయాలి. పాలసీకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పాలసీహోల్డర్లకు ఇకపై సులువుగా అర్థమయ్యేలా ఇవ్వాల్సిందేనని బీమా కంపెనీలకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్డీఏఐ సూచించింది. ఈ నూతన నిబంధన 2024, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ), పాలసీలో వేటికి కవరేజీ ఉంటుంది, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్, క్లెయిమ్ ఎలా చేయాలి తదితర వివరాలను తప్పకుండా వెల్లడించాలి. అలాగే, ఫిర్యాదుల ప్రక్రియ గురించీ చెప్పాలి. ఈ మేరకు కస్టమర్ సమాచార పత్రాన్ని (సీఐసీ) బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) సవరించింది. దీనివల్ల పాలసీదారులు నియమ నిబంధనలు, షరతుల గురించి సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ విషయంలో పాలసీ డాక్యుమెంట్ది కీలక పాత్ర అని పేర్కొంది. కాబట్టి పాలసీకి సంబంధించి ప్రాథమిక వివరాలు, అవసరమైన సమాచారాన్ని సులువైన పదాల్లో చెప్పాల్సిన అవసరం ఉందని సర్క్యులర్‌లో తెలిపింది. బీమా సంస్థకు, పాలసీ హోల్డర్‌కు మధ్య వివరాల విషయంలో అస్పష్టత మూలంగానే అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌ను సవరిస్తున్నట్లు ఐఆర్డీఏఐ చెప్పింది. సవరించిన సీఐఎస్ ప్రకారం.. బీమా ప్రొడక్ట్/ పాలసీ, పాలసీ నంబర్, ఇన్సురెన్స్ టైప్, సమ్ అష్యూర్డ్ వంటి ప్రాథమిక సమాచారం ఇవ్వాలి. అలాగే, హాస్పటల్ ఖర్చులు, పాలసీలో కవర్ కానివి, వెయిటింగ్ పీరియడ్, కవరేజీ పరిమితులు, క్లెయిమ్ ప్రొసీజర్, గ్రీవెన్స్/ కంప్లయింట్స్ వివరాలు వంటివీ పొందుపరచాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. ఒకవేళ పాలసీ హోల్డర్ కోరితే సదరు వివరాలు స్థానిక భాషలోనూ అందుబాటులో ఉంచాలని సూచించింది. సవరించిన సీఐసీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
సైబర్ బీమాకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయంగా సైబర్ బీమాకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఏటా 27–30% వృద్ధి చెందనుంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం భారత్‌లో సైబర్ బీమా మార్కెట్ పరిమాణం 50–60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.500 కోట్లు) స్థాయిలో ఉంది. గత మూడేళ్లుగా 27–30% మేర చక్రగతిన వృద్ధి చెందుతోంది. ‘సైబర్ ఇన్సూరెన్స్ అవసరంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 3–5 ఏళ్లలో ఇదే స్థాయి వృద్ధి కొనసాగే అవకాశం ఉంది‘ అని నివేదికలో పేర్కొంది. ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో పాటు సరఫరా వ్యవస్థ, రిటైల్, ఫైనాన్స్ వంటి డిజిటైజేషన్ అధికంగా ఉండే విభాగాలు సైబర్ క్రిమినల్స్‌కు లక్ష్యాలుగా ఉంటున్నట్లు తెలిపింది. కాబట్టి, మిగతా రంగాలతో పోలిస్తే సైబర్ బీమాను తీసుకోవడంలో ఈ విభాగాలు ముందుంటాయని పేర్కొంది. పలువురు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ల (సీఐఎస్వో)తో నిర్వహించిన సర్వే ఆధారంగా డెలాయిట్ ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్లో ఒడిదుడుకులు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ వచ్చే దశాబ్ద కాలంలో సైబర్ బీమా గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ (రిస్క్ అడ్వైజరీ) ఆనంద్ వెంకట్రామన్ తెలిపారు. విక్రేతలు, కొనుగోలుదారుల అవసరాల మేరకు పాలసీలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► రాబోయే మూడేళ్లలో డిజిటల్ మౌలిక సదుపాయాలకు రక్షణ కలి్పంచుకునేందుకు సర్వేలో పాల్గొన్న సీఐఎస్‌వోల్లో 70% మంది మరింత ఎక్కువ వ్యయం చేయడానికి మొగ్గు చూపారు. ► గణనీయంగా వినియోగదారుల డేటాబేస్లు ఉన్న కొన్ని పెద్ద కంపెనీలు తమ డిజిటల్ ఇన్ఫ్రా బడ్జెట్లను పెంచుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతను మెరుగుపర్చుకునేందుకు మరింత ఇన్వెస్ట్ చేయడానికి బదులు బీమా కవరేజీని పెంచుకోవడంపై ఆసక్తిగా ఉన్నట్లు 60 శాతం సంస్థలు పేర్కొన్నాయి. ► దేశీయంగా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ వృద్ధి గతి ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉండనుంది. కంపెనీలు డిజిటల్ పరిపక్వతను సాధించే వేగం, డిజిటైజేషన్ .. కఠినతరమైన సైబర్ చట్టాల అమలుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు, సంప్రదాయేతర సంస్థలైన టెక్నాలజీ కంపెనీల్లాంటివి కూడా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి ప్రవేశించడం వీటిలో ఉండనున్నాయి. ► సైబర్ బీమాను ఒక వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూసే ధోరణి పెరగాలి. డిజిటైజేషన్ వేగవంతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తగు స్థాయిలో సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకోవడం తప్పనిసరి అనేది కంపెనీలు గుర్తించాలి. ► సమగ్ర రిసు్కల నిర్వహణలో సైబర్ రిసు్కలు ప్రధానమైనవని గుర్తించి బోర్డులు, సీఈవోలు సైబర్‌సెక్యూరిటీ విషయంలో తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ► బీమా పాలసీలను సరళతరం చేయడంతో పాటు వివిధ కవరేజీల గురించి కొనుగోలుదార్లలో అవగాహన పెంచేందుకు బీమా కంపెనీలు కృషి చేయాలి. ► పౌరుల గోప్యతకు భంగం వాటిల్లకుండా పటిష్టమైన డేటా రక్షణ వ్యవస్థను నిర్వహించడంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషించాలి. -
మెరైన్ బీమాపై శ్రీరామ్ జనరల్ ఫోకస్
చెన్నై: బీమా సంస్థ శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ వాహనయేతర బీమా విభాగాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా మెరైన్, అగ్ని ప్రమాదాలు మొదలైన వాటికి సంబంధించిన బీమా పాలసీలను ప్రవేశపెడుతోంది. కంపెనీ చీఫ్ అండర్‌రైటింగ్ ఆఫీసర్ శశికాంత్ దహూజా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తమ వ్యాపారంలో మోటార్ ఇన్సూరెన్స్ వాటా సుమారు 92 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. డైవర్సిఫికేషన్ ప్రణాళికల్లో భాగంగా ఫైర్, మెరైన్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో కొత్త బీమా పాలసీలను ప్రవేశపెట్టనున్నట్లు శశికాంత్ చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లలో వాహనయేతర వ్యాపారాన్ని 15 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇది 7–8 శాతంగా ఉంది. కేవలం ఒక విభాగంపై ఎక్కువగా ఆధారపడకూడదనే వ్యాపార వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం 37% పెరిగి రూ.98 కోట్లకు చేరింది. ఈ ఏడాది వ్యాపారం 30% మేర వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నట్లు శశికాంత్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల బీమా పాలసీల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో రూ.82 కోట్ల విలువైన పాలసీలను విక్రయించామన్నారు. ఈ ఏడాది వీటి విక్రయాలు రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 3,780 మంది ఉద్యోగులు ఉన్నారని, ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా 700 మందిని నియమించుకోనున్నామని శశికాంత్ తెలిపారు. -
‘ఉపాధి’కి ఇంధనం..
మీలో ఒకడిగా.. ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్’! ఇవన్నీ ఎవరో చెబితేనో.. ఎవరో ఉద్యమాలు చేస్తేనో తీసుకొచ్చినవి కావు. నా 3,648 కి.మీ. పాదయాత్రలో మీ సమస్యలను కళ్లారా చూశా. మీలో ఒకడిగా నాలుగేళ్లుగా మీ సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ‘వాయిస్ ఆఫ్ ది పీపుల్..’ అంటారు. మీ బిడ్డ పాలనలో ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్’ అంటే... తమ కష్టాన్ని చెప్పుకోలేని, తన ఆర్తిని వినిపించలేని పేదల గొంతుకై వాళ్ల తరపున నిలబడుతున్న ప్రభుత్వం మనది. కాబట్టే అట్టడుగున ఉన్న పేదవాడు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా వాచా కర్మణా మీ బిడ్డ నమ్మాడు కాబట్టి ఆ దిశగా నాలుగేళ్లలో అడుగులు పడ్డాయి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: ఆటోలు, టాక్సీలను నడిపే డ్రైవర్ సోదరులు స్వయం ఉపాధి పొందడమే కాకుండా రోజూ లక్షలమంది ప్రయాణికులకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సొంతంగా ఆటోలు, టాక్సీలు కలిగి ఉండి వాటిని నడిపే వారికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్తోపాటు ఇతర ఖర్చుల కోసం ఏడాదికి రూ.పది వేల దాకా ఖర్చవుతోందన్నారు. అంత మొత్తం భరించేందుకు ఇబ్బందిపడే పరిస్థితుల్లో ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకే ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందించేందుకు ‘వైఎస్ఆర్ వాహనమిత్ర’ పథకాన్ని తెచ్చినట్లు తెలిపారు. వరుసగా ఐదో ఏడాది ఈ పథకం ద్వారా మంచి చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం విజయవాడలోని విద్యాధరపురంలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.275.93 కోట్ల వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత ఆర్ధిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. ఐదేళ్లలో రూ.1,301.89 కోట్లు.. ఆటోలు, ట్యాక్సీలు నడుపుకొంటున్న నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల చేతుల్లో నేరుగా రూ.10 వేలు పెడుతున్నాం. ఈ డబ్బు ఎలా వాడతారు? దేనికి వినియోగిస్తారన్నది నేను అడగను. కానీ మీ అందరికి సవినయంగా ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా. మీ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోండి. మీ వాహనంలో ప్రయాణికులు ఉన్నారని, మీకూ కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎంతోమందికి సేవలందిస్తున్న మీకు ప్రభుత్వం తోడుగా నిలబడుతుంది. ఒక్క ఏడాది కూడా ఈ పథకాన్ని ఆపకుండా ఐదేళ్లలో ఐదు విడతల్లో ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున సహాయం చేయడం ద్వారా ఒక్క వైఎస్సార్ వాహన మిత్ర ద్వారానే ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లను నేరుగా అందించాం. గడప వద్దకే సంక్షేమం ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలు, రేషన్ కార్డుల దగ్గర నుంచి పెన్షన్ల దాకా, జనన, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలన్నీ ఇంటివద్దకే తీసుకొచ్చి అందిస్తున్నాం. మీ అవసరాలు ఏమిటో జల్లెడ పట్టి మరీ తెలుసుకుని నవరత్నాల్లోని ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా గడపవద్దకే చేర్చుతున్నాం. నా పేద అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల పిల్లలు గొప్పగా చదవాలన్న ఆరాటంతో మన గ్రామంలోని ప్రభుత్వ బడికే ఇంగ్లిష్ మీడియం చదువులను తెచ్చాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా వలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. మీ గ్రామానికే విలేజ్ క్లినిక్ తీసుకొచ్చి మీకు అందుబాటులో ఉంచాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పరిచయం చేయడంతోపాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో బీపీ, షుగర్, హెచ్‌బీ, కఫం టెస్టులను నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని తపన పడుతున్నాం. గ్రామ, వార్డు స్ధాయిలోనే మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో దిశ యాప్ ఉండేలా చూస్తున్నాం. విత్తనాల నుంచి విక్రయాల దాకా రైతన్నలకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తూ ఆర్బీకేలను తీసుకొచ్చాం. రైతన్నలు.. నేతన్నలు.. గంగపుత్రులు రాష్ట్రంలో 52.39 లక్షల మంది రైతన్నల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన ప్రభుత్వంగా వారికి తోడుగా నిలబడుతున్నాం. ఒక్క వైఎస్ఆర్ రైతుభరోసా కోసమే రూ.30,985 కోట్లు ఖర్చు చేశాం. పంటలు వేసే సమయానికి పెట్టుబడి ఖర్చుల కింద రైతన్నల చేతుల్లో డబ్బులు పెట్టాం. ఇలాంటి మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో మరొకటి లేదని అన్నదాతలకు తెలుసు. వేట నిషేధ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార సోదరులకు అండగా నిలుస్తూ మత్స్యకార భరోసా ద్వారా 2.43 లక్షల కుటుంబాలకు ఐదేళ్లలో ఏకంగా రూ.538 కోట్లు అందించాం. మగ్గం కదిలితే తప్ప బతుకు బండి నడవని 82 వేల చేనేత కుటుంబాలకు ఐదేళ్లలో ఒక్క నేతన్న నేస్తం పథకం ద్వారానే రూ.982 కోట్లు అందించి అండగా నిలిచాం. తోడు అందిస్తూ.. చేదోడుగా నిలుస్తూ రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో రోడ్డు పక్కనే, పుట్‌ఫాత్‌ల మీద విక్రయాలు సాగించే చిరువ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు, జగనన్న చేదోడు పథకాలను అమలు చేస్తున్నాం. వాళ్లు వ్యాపారాలు ఎలా చేసుకుంటున్నారు...? అందుకు పెట్టుబడి ఎక్కడ నుంచి వస్తుంది? ఆ పెట్టుబడి కోసం ఎంతెంత వడ్డీకి డబ్బులు తెస్తున్నారో గతంలో ఎవరూ పట్టించుకోలేదు.అలాంటి 15.87 లక్షల మంది చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటివరకు వడ్డీలేని రుణాల రూపంలో రూ.2956 కోట్లు అందించాం. రజక సోదరులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కోసం జగనన్న చేదోడు పథకం తీసుకొచ్చి 3.30 లక్షల మందికి ఇప్పటివరకు రూ.927 కోట్లు సాయం అందించాం. అమ్మ ఒడి.. విద్యా దీవెన.. వసతి దీవెన అక్కచెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా మీ బిడ్డ జగనన్న అమ్మఒడి పథకాన్ని తెచ్చాడు. 52 నెలల్లో 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అమ్మఒడి కోసం రూ.26 వేల కోట్లు విడుదల చేశాం. 26.99 లక్షల మంది తల్లులకు వారి పిల్లల పెద్ద చదువుల కోసం విద్యా దీవెన ద్వారా అందించిన సహాయం రూ.11,317 కోట్లు. జగనన్న వసతి దీవెన బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులు చెల్లిస్తున్నాం. ఏడాదికి రూ.20 వేలు వరకు అందిస్తూ జగనన్న వసతి దీవెన కోసం రూ.4,275 కోట్లు వెచ్చించాం. అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ... చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు మోసపోయారు. మాట ప్రకారం వారిని ఆదుకుంటూ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తెచ్చి 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,178 కోట్లు ఇచ్చాం. లేదంటే చంద్రబాబు మోసాలతో 18 శాతం ఉన్న ఎన్పీఏలు, అవుట్ స్టాండింగ్ లోన్స్ 50 శాతం దాటేవి. అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నావడ్డీ కూడా వర్తింపచేసి దాదాపు రూ.5 వేల కోట్లు ఇచ్చి తోడుగా నిలబడ్డాం. 26.40 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రూ.14,129 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా 3.58 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు రూ.2,029 కోట్లు సాయం అందించాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4.39 లక్షల మంది ఓసీ నిరుపేద అక్కచెల్లెమ్మలకు అందించిన సహాయం రూ.1,257 కోట్లు. 30.76 లక్షలమంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్ధలాలిచ్చాం. ఇప్పటికే 21.32 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. తమకు ఇంతగా మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే మరొకటి లేదని నా అక్కచెల్లెమ్మలకు తెలుసు. ఇవన్నీ ఎవరో అడిగితేనో, ఎవరో ఉద్యమాలు చేస్తేనో వచ్చినవి కావు. ఇవన్నీ కూడా మీ బిడ్డ.. మీలో ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. మీ కష్టాలు, సుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. ఇది మీ ప్రభుత్వం కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో మంత్రులు పి.విశ్వరూప్, జోగి రమేశ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, వసంత కృష్ణ ప్రసాద్, రక్షణనిధి, కైలే అనిల్ కుమార్లతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి జగనన్న అవసరం నేను విజయవాడలో 15 ఏళ్లుగా సీఎన్జీ ఆటో నడుపుతున్నాను. గతంలో ఇక్కడ 4 సీఎన్జీ స్టేషన్లు మాత్రమే ఉండడంతో గ్యాస్ కోసం రోజంతా పడిగాపులు పడేవాళ్లం. ఆటోలకు ఇన్సూరెన్స్‌లు, ఫిట్ నెస్‌లు చేయించుకోవడానికి కూడా కుదిరేది కాదు. పాదయాత్రలో మా స మస్యలు మీకు చెప్పగానే సానుకూలంగా స్పందించారు. మీరు సీఎం అవ్వగానే వాహనమిత్ర పథకం ద్వారా మాకు సాయం చేస్తున్నారు.ఈ విడతతో కలిపి నాకు రూ.50,000 వచ్చాయి. మీ చొరవతో విజయ వా డలో ఉన్న సీఎన్జీ స్టేషన్లు 4 నుంచి 15 అయ్యాయి. కోవిడ్ వల్ల రవాణా రంగం కుదేలైపోతే మానవత్వంతో మాకు 5 నెలల ముందే వాహనమిత్ర సాయం అందించా రు. నా తల్లి 2 నెలలు గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే వలంటీర్ వచ్చి పెన్షన్ ఇచ్చారు. మా అమ్మ చనిపోయే వరకు రూ. 81 వేలు వచ్చాయి. నా కూతురుకి అమ్మ ఒడి సాయం అందింది. నా కుమారుడికి వసతిదీవెన ద్వారా రూ.20 వేలు, ఇంజినీరింగ్ చదువుకు రూ.2,20,320 వచ్చాయి. మొత్తం నా కుటుంబానికి రూ.3,85,300 లబ్ధి కలిగింది. నా ఆటోకు ఇంధనం ఎంత అవసరమో... ఈ రాష్ట్రానికి జగనన్న కూడా అంతే అవసరం. – వినోద్, ఆటో డ్రైవర్, వాహనమిత్ర లబ్ధిదారుడు, విజయవాడ -
మీరు బ్యాంకులో డబ్బుల్ని డిపాజిట్ చేస్తున్నారా?.. మీకొక విషయం తెలుసా?
మీరు డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారా? చేస్తే మంచిదే. అయితే కొన్ని సందర్భాలలో ఈ బ్యాంకు డిపాజిట్లు అంత శ్రేయస్సకరం కాదు. ఎందుకంటే ఒక వేళ మీరు డిపాజిట్ చేసిన బ్యాంకుకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తి దివాళా తీస్తే? ఇదిగో ఇలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు బ్యాంకు డిపాజిటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఆర్బీఐ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను అందిస్తుంది. ఆ పథకం గురించి మీకు తెలుసా? భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) అన్ని బ్యాంకు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ అందించే డిపాజిట్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ను అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా కొత్త మొత్తాన్ని బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశారు. ఒకవేళ ఆ బ్యాంకు ఏదైనా సంక్షోభంలో చిక్కుకున్నా, రూ.5లక్షల వరకు డిపాజిట్‌ను ఖాతాదారులు తిరిగి పొందే వీలుంది. అర్హులైన ఖాతాదారులకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారింటీ కార్పొరేషన్(DICGC) యాక్ట్ ప్రకారం దివాలా లేదా నష్టాల్లో ఉన్న బ్యాంకుల డిపాజిటర్లు తమ డబ్బుని విత్‌డ్రా చేసుకునేందుకు అప్లై చేసుకున్న 90 రోజుల్లో తిరిగి ఇవ్వబడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
చిన్న సంస్థలకు బీమాతో భరోసా - లాంబార్డ్ ఈడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద సంస్థలతో పోలిస్తే లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) ఎదుర్కొనే సవాళ్లు విభిన్నంగా ఉంటాయని ఐసీఐసీఐ లాంబార్డ్ ఈడీ సంజీవ్ మంత్రి తెలిపారు. ప్రకృతిపరమైన లేదా వ్యాపారపరమైన విపత్తులు ఎలాంటి వాటినైనా ఎదుర్కొనేందుకు పెద్ద సంస్థలకు తగిన ఆర్థిక వనరులు ఉంటాయని.. కానీ స్వల్ప మార్జిన్లతో పని చేసే చిన్న సంస్థలకు వాటిని ఎదుర్కొనేంత ఆర్థిక సామర్థ్యాలు పెద్దగా ఉండవని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే వాటికి బీమా ఉపయోగపడుతుందన్నారు. ఒక్కో ఎంఎస్ఎంఈ రిస్కులు ఒక్కో రకంగా ఉంటాయి కాబట్టి తమకు అనువైన, తగినంత కవరేజీ ఇచ్చే పాలసీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. దీన్ని వ్యయంగా గాకుండా భరోసాగా పరిగణించాలని పేర్కొన్నారు. దేశీయంగా 6.2 కోట్ల పైచిలుకు వ్యాపార సంస్థలు ఉన్నప్పటికీ ఎస్ఎంఈ బీమా తీసుకున్న వాటి సంఖ్య 3 శాతం కన్నా తక్కువే ఉంటుందని ఆయన చెప్పారు. బీమా ప్రయోజనాలపై అవగాహన తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని మంత్రి వివరించారు. దీనితో ఈ అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ మొదలుకుని కారు, ఫోన్ల వరకూ అన్నింటినీ ఇన్సూర్ చేయించుకోవచ్చని అర్థమైతే చిన్న సంస్థలు.. బీమాను ఒక వ్యయంగా కాకుండా రిస్కులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే సాధనంగా చూడటం మొదలుపెడతాయని మంత్రి చెప్పారు. టెక్నాలజీతో సెటిల్మెంట్ వేగవంతం.. ఇక, ఎస్ఎంఈల విశిష్ట అవసరాలను గుర్తించి తాము కృత్రిమ మేథ, బిగ్ డేటా అనలిటిక్స్ వంటివి ఉపయోగించి క్లెయిమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రూ. 5 లక్షల వరకు ప్రాపర్టీ, మెరైన్ క్లెయిమ్‌లను పది రోజుల్లోపే ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈల బీమా అవసరాల కోసం డిజిటల్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రూప్ హెల్త్, లయబిలిటీ, ఇంజినీరింగ్ ఇన్సూరెన్స్ వంటి పలు పాలసీలు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. -
ఇల్లు లేకపోయినా హోమ్ ఇన్సూరెన్స్! ఎందుకు.. ఏంటి ప్రయోజనం?
వేగవంతమైన పట్టణీకరణ, అభివృద్ధి చెందుతున్న జీవనశైలి కారణంగా భారతదేశంలో అద్దె ఇళ్ల భావన ఎక్కువైంది. దేశంలో చాలామంది అద్దె ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. అద్దె ఇళ్లతో అనేక రకాల సౌలభ్యాలు ఉంటాయి. ఇంటి యజమానులతో పోలిస్తే అద్దెకు ఉండే వారికి బాధ్యతలు తక్కువగా ఉన్నప్పటికీ.. వారితో అద్దెకు ఉంటున్నవారికీ ఓ బాధ్యత ఉంది. అదే హోమ్ ఇన్సూరెన్స్. అదేంటి హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి ఓనర్‌కు సంబంధించింది కదా.. దీంతో అద్దెకు ఉంటున్నవారికి పనేంటి అనుకోవద్దు.. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి యజమానికి ఎంత అవసరమో.. అద్దెకుంటున్నవారికీ అంతే అవసరం. అది ఎందుకు.. ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. వస్తువుల రక్షణ ఇళ్లలో అద్దెకుండేవారు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ముఖ్యమైన కారణం ఇది. ఈ హోమ్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత వస్తువులు అంటే టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నీచర్, దుస్తులతోపాటు ఇతర విలువైన వస్తువులకు రక్షణ కల్పిస్తుంది. ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు, అగ్నిప్రమాదం, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దెబ్బతిన్న లేదా చోరీకి గురైన వస్తువులకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కొత్తవాటిని కొనుగోలు లేదా మరమ్మతుకు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. ఆస్తుల డ్యామేజీ కవరేజ్ వస్తువుల రక్షణతోపాటు ఇంటి ఆస్తుల రక్షణను ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అద్దెదారు అనుకోకుండా ఇంటి ఆస్తిని పాడు చేసినట్లయితే, అంటే కిచెన్‌లో మంటలు ఏర్పడి ఇంటికి సంబంధించిన వస్తువులు దెబ్బతింటే ఆ నష్టాన్ని ఓనర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. ఇలాంటి ప్రమాదాల్లో గాయపడిన ఇంట్లోకి వారికి బీమా వర్తిస్తుంది. తాత్కాలిక జీవన వ్యయాలు అగ్నిప్రమాదం లేదా వరదలు వంటివి సంభవించినప్పుడు ఇళ్లను ఖాళీ చేసి తాత్కాలికంగా వేరొక చోట ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో హోటళ్లలో ఉండటానికి, భోజనం, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను ఈ హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. క్లిష్టమైన సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇది చాలా తోడ్పాటు అందిస్తుంది. అందుబాటులోనే ప్రీమియం హోమ్ ఇన్సూరెన్స్‌పై భారతదేశంలో చాలా అపోహలు ఉన్నాయి. ప్రీమియం ఎక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ అందుబాటు ప్రీమియంతోనే ఈ ఇన్సూరెన్స్ పొందవచ్చు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు తలెత్తే ఆర్థిక నష్టాలతో పోల్చినప్పుడు అది సహేతుకంగానే ఉంటుంది. అద్దెదారుల నిర్దిష్ట అవసరాలు, ఆర్థిక పరిమితుల ప్రకారం దేశంలో అనేక కంపెనీలు ఈ రెంటర్స్ హోమ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. -
కౌలు రైతులకూ భరోసా
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని ప్రభుత్వం సంకలి్పంచింది. గడచిన నాలుగేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది కౌలు కార్డులు (పంట హక్కు సాగు పత్రాలు–సీసీఆర్సీ) జారీ చేసింది. అర్హులైన ప్రతి కౌలు రైతుకూ పంట రుణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నిర్వహించిన ప్రత్యేక మేళాల్లో రికార్డు స్థాయిలో కౌలుదారులకు సీసీఆర్సీలు జారీ చేసింది. గతంలో కౌలు రైతులకు సంక్షేమ ఫలాలు అందేవి కాదు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నప్పటికీ ఆంక్షల పేరిట బ్యాంకులు మొండిచేయి చూపడంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.3, రూ.5 వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసేవారు. కౌలు, వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో తీసుకొచి్చన పంట సాగుదారుల హక్కుపత్రాల (సీసీఆర్సీ) చట్టం కింద 11 నెలల కాల పరిమితితో కౌలు కార్డులు జారీ చేస్తున్నారు. సీసీఆర్సీల ద్వారా సంక్షేమ ఫలాలు సీసీఆర్సీల ద్వారా నాలుగేళ్లుగా పంట రుణాలతో పాటు అన్ని రకాల సంక్షేమ ఫలాలను కౌలు రైతులకు ప్రభుత్వం అందిస్తోంది. 2019–20 సీజన్లో 2,72,720 మందికి, 2020–21లో 4,14,770 మందికి, 2021–22 సీజన్లో 5,24,203 మందికి, 2022–23లో 5,49,513 మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసింది. నాలుగేళ్లలో 9 లక్షల మంది కౌలుదారులకు రూ.6,668.64 కోట్ల పంట రుణాలు మంజూరు చేసింది. 3.92 లక్షల మంది కౌలుదారులకు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.529.07 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. పంటలు దెబ్బతిన్న 2.34 లక్షల మంది కౌలుదారులకు రూ.246.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీతో పాటు 1.73 లక్షల మందికి రూ.487.14 కోట్ల ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించింది. రికార్డు స్థాయిలో సీసీఆర్సీలు జారీ 2023–24లో కనీసం 8.81 లక్షల మందికి సీసీఆర్సీల జారీ చేయాలనే లక్ష్యంతో ఆర్బీకేల ద్వారా సీసీఆర్సీ మేళాలు నిర్వహించారు. ఈ మేళాల ద్వారా రికార్డు స్థాయిలో 7,77,417 మందికి సీసీఆర్సీలు జారీ చేశామని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 4,51,545 మంది ఉండగా.. ఇతర వర్గాలకు చెందిన 3,25,872 మంది ఉన్నారు. ఈ ఏడాది కూడా రైతు భరోసా సాయం అందించేందుకు సీసీఆర్సీలు పొందిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారి వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. సెప్టెంబర్‌లో వీరికి వైఎస్సార్ రైతు భరోసా కింద తొలి విడత సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కనీసం రూ.4 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు వేస్తున్నా. ఈ ఏడాది మినుము, వరి వేశా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు. గతేడాది రైతు భరోసా కింద రూ.13,500 జమయ్యాయి. ఈ ఏడాది కూడా కౌలుకార్డు తీసుకున్నా. రైతు భరోసా పోర్టల్‌లో అప్లోడ్ చేశామని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. – కంపమళ్ల రమీజ, రుద్రవరం, కర్నూలు జిల్లా కౌలు కార్డు ద్వారా రూ.లక్ష రుణం తీసుకున్నా నేను రెండెకరాలు కౌలుకు చేస్తున్నా. ఈ ఏడాది వరి, మొక్కజొన్న వేశాను. కౌలు కార్డు కోసందరఖాస్తు చేశా. ఎలాంటి సిఫార్సులు లేకుండా సీసీఆర్సీ కార్డు ఇచ్చారు. ఈ కార్డు ద్వారా రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. రైతు భరోసా సాయం కోసం అప్లోడ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. – వీరంకి గోపీకృష్ణ, మోరంపూడి, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా -
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా మారింది
-
ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!
ఇటీవల జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ ప్రయాణీకులకు బీమా సౌకర్యాన్ని డీఫాల్ట్‌గా అందివ్వనుంది. తాజా నిర్ణయంతో వెబ్సైట్/యాప్‌లో టికెట్ బుక్ చేసుకొనే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం బీమా ఆప్షన్ పక్కనున్న టిక్ బాక్స్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక నుంచి ఈ ఆప్షన్‌ను ఐఆర్సీటీసీ డిఫాల్ట్‌గా ఇస్తోంది. అంటే ఐఆర్సీటీసీ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అనేది ఆటోమెటిక్‌గానే వస్తుంది. ఒకవేళ బీమా ప్రయోజనాలను వద్దనుకున్నవారు మాత్రం ఆ టిక్ మార్క్‌ను తొలగించుకునే సౌలభ్యం కూడా ఉంది. కానీ ప్రతి ప్రయాణీకులు దీన్ని వినియోగించుకోవడమే చాలా అవసరం. ఐఆర్సీటీసీ పోర్టల్‌లో తమ రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఇప్పుడు ఆటోమేటిక్‌గా రూ. 10 లక్షల బీమా సౌకర్యం లభిస్తుందని బీమా పరిశ్రమలోని సీనియర్ అధికారి పేర్కొన్నారని ఐఏఎన్ రిపోర్ట్ చేసింది. అయితే దీనిపై ఐఆర్సీటీసీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ఇందుకోసం భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డిఎఐ)ఐఆర్సీటీసీకి మాత్రం వెసులుబాటు ఇచ్చింది. రైల్వే బీమాను ఎంచుకున్న ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం లభిస్తుంది. రైలు ప్రమాదంలో మరణించినా, లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడితే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్‌ను రైల్వే శాఖ అందిస్తుంది. ఒకవేళ తీవ్రంగా గాయపడి పాక్షిక అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు బీమా లభిస్తుంది. అలాగే గాయపడిన వైద్యఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల వరకు అందిస్తారు. అయితే బీమా పాలసీని ఎంచుకున్న ప్రయాణికులు నామినీ వివరాలను జత చేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పటివరకు రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సమయంలో రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ క్లిక్ చేసి నపుడు బీమా సౌకర్యం అందించే సౌకర్యం ఉండేది. ఈ రూ. 10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ఐఆర్సీటీసీ కేవలం 35 పైసలు మాత్రమే చార్జ్ చేసేది. ఈ బీమా కింద ప్రయాణికులు తమ రైలు ప్రయాణంలో విలువైన వస్తువులు, లగేజీని పోగొట్టుకుంటే పరిహారం లభించే సౌకర్య అందుబాటులోఉండేదన్న సంగతి తెలిసిందే. -
పీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ పొరపాటు చేస్తే రూ.7 లక్షలు పోయినట్లే!
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మూడు పథకాల్ని ఖాతాదారులకు అందిస్తుంది. వాటిలో ఒకటి ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ స్కీమ్ 1995 (ఈపీఎస్), ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, వీటిలో ఈడీఎల్ఐ పథకంలో భాగంగా ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతాదారుడు మరణిస్తే సదరు ఉద్యోగి నామినీకి రూ.7 లక్షల వరకు ప్రయోజనాల్ని అందిస్తుంది. ఇవి పొందాలంటే ఈ- నామినేషన్ తప్పనిసరి. ఎంప్లాయీ బెనిఫిట్స్ ప్రాక్టీస్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ డైరెక్టర్, ఆనంద్ రాఠీ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అమ్జద్ ఖాన్ మాట్లాడుతూ, ఉద్యోగి దురదృష్టవశాత్తు మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు బీమా రక్షణగా ఈపీఎఫ్ అందించే ప్రయోజనాల్లో ఇది ఒకటి. ఉద్యోగుల కోసం 1976లో ప్రారంభించిన ఈ పథకం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ 1952 కింద కవర్ చేయబడిన అన్ని సంస్థలు డిఫాల్ట్‌గా ఈడీఎల్ఐ ప్రయోజనాల కోసం నమోదు చేసుకుంటాయని అన్నారు. ఇక, ఈపీఎస్, ఈపీఎఫ్ స్కీమ్‌లలో ఉద్యోగి కొంత మొత్తాన్ని చెల్లిస్తుండగా.. ఈడీఎల్ఐలో మాత్రం ఉద్యోగి తరుపున యాజమాన్యం చెల్లిస్తుంది. ఈ ప్రయోజనాన్ని ఉద్యోగులు పొందాలంటే ఏదైనా సంస్థలో ఏడాది పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఏడాదిలోపు ఉద్యోగులు ఈ స్కీమ్‌లో అనర్హులు. మరింత సమాచారం కోసం సంబంధిత ఈపీఎఫ్‌వో కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. క్లెయిమ్ ప్రాసెస్ : ఉద్యోగి అకాల మరణంతో నామినీలు తప్పనిసరిగా పీఎఫ్ , పెన్షన్ విత్ డ్రాయిల్, ఈడీఎల్ఐలను క్లెయిమ్ ఫారమ్ ద్వారా క్లెయిమ్ చేయాలి. నామినీ తప్పనిసరిగా ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, వారసత్వ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. తప్పని సరిగా బ్లాంక్ చెక్‌లు సైతం అందుబాటులో ఉంచుకోవాలి. చదవండి : ఆకాశంలో ఉండగా.. ఎయిరిండియా విమానంలో కలకలం -
ఒకే పాలసీలో జీవిత, ఆరోగ్య బీమా ప్రయోజనాలు: అదేంటో తెలుసా?
ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి ‘ఐషీల్డ్’ పేరిట కొత్త బీమా పాలసీని ప్రవేశపెట్టాయి. ఇటు ఆరోగ్య బీమా, అటు జీవిత బీమా ప్రయోజనాలు ఉండేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దాయి. వైద్య చికిత్సల వ్యయాలకు కవరేజీ ఇస్తూనే పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణించిన పక్షంలో కుటుంబానికి పెద్ద మొత్తంలో సమ్ అష్యూర్డ్‌ను అందించేలా ఈ పాలసీ ఉంటుందని ఐసీఐసీఐ లాంబార్డ్ ఈడీ సంజీవ్ మంత్రి తెలిపారు. (కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్) చికిత్స వ్యయాల భారం పడినా, ఇంటిపెద్దకు ఏదైనా జరిగినా కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ఈ సమగ్రమైన బీమా పథకం తోడ్పడగలదని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ చీఫ్ డి్రస్టిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పాల్టా వివరించారు. హాస్పిటలైజేషన్, డే–కేర్ ట్రీట్మెంట్ మొదలైన వాటికి ఆరోగ్య బీమా భాగం ఉపయోగపడనుండగా, జీవిత బీమా భాగంతో.. 85 ఏళ్ల వయస్సు వరకూ లైఫ్ కవరేజీ ఉంటుంది. (792 బిలియన్ డాలర్లకు యాప్ ఎకానమీ ) -
చిన్న సంస్థల కోసం వినూత్న బీమా పథకాలు
ముంబై: జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ తాజాగా చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) కోసం మూడు వినూత్న బీమా పథకాలను ప్రవేశపెట్టింది. ఎంఎస్ఎంఈ సురక్షా కవచ్ పాలసీ, ప్రాపర్టీ ఆల్ రిస్క్ (పీఏఆర్) పాలసీ, ఐ–సెలెక్ట్ లయబిలిటీ పాలసీ వీటిలో ఉన్నాయి. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా వీటిని ప్రవేశపెట్టినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి తెలిపారు. సురక్షా కవచ్ పాలసీ.. విపత్తుల నుంచి వాటిల్లే ఆస్తి నష్టాన్ని భర్తీ చేస్తుందని, ప్రమాదాల వల్ల జరిగే ఆస్తి నష్టాల కోసం పీఏఆర్ కవరేజీ ఉపయోగపడుతుందని వివరించారు. ఆభరణాల వంటి విలువైన వాటికి ఐ–సెలెక్ట్ లయబిలిటీతో అదనపు కవరేజీ పొందవచ్చని పేర్కొన్నారు. -
సైబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? రూ. కోటి వరకూ కవరేజీ..
డిజిటల్ పరికరాల్లో వ్యక్తిగత డేటాను భద్రపర్చుకోవడం, వాటి ద్వారా షేర్ చేసుకోవడం, సేకరించడం వంటి ధోరణులు గణనీయంగా పెరిగాయి. దీంతో బడా కార్పొరేట్లు మొదలుకుని సాధారణ వ్యక్తుల వరకూ అందరూ ఆన్లైన్ మోసాలు, గుర్తింపు చోరీ, మాల్‌వేల్ బారిన పడే ముప్పులూ పెరుగుతున్నాయి. ఫలితంగా బోలెడంత నష్టపోవాల్సి కూడా వస్తోంది. ఇలాంటి వాటి నుంచి సరైన సాఫ్ట్వేర్ కొంత రక్షణ కల్పిస్తుండగా, మరి కొంత భరోసానిచ్చేదే సైబర్ బీమా. 18 ఏళ్లు పైబడిన వారు దీన్ని తీసుకోవచ్చు. ఇండివిడ్యుయల్ సైబర్ పాలసీల కింద కవరేజీ రూ. 1 లక్ష మొదలుకుని రూ. 1 కోటి వరకూ ఉంటోంది. ఈ పాలసీని తీసుకునే ముందు అర్థం చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే.. క్యూఆర్ కోడ్ వల్ల జరిగే క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు మోసాలు, మనీ ట్రాన్స్ఫర్ స్కాముల సందర్భాల్లోనూ రిటైల్ కస్టమరుకు రక్షణ లభించగలదు. ‘బ్యాంకు ఖాతా, క్రెడిట్..డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తున్నాం, ఐడెంటిటీని ధృవీకరించడానికి లింక్‌పై క్లిక్ చేయండి‘ అంటూ మోసపూరిత మెయిల్స్ వస్తుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆర్థిక నష్టం వాటిల్లితే పాలసీ ద్వారా దాన్ని భర్తీ చేసుకోవచ్చు. గుర్తింపు చోరీ కవరేజీ: కంప్యూటర్లో భద్రపర్చిన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం, చెరిపివేయడం, మార్చేయడం వంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. థర్డ్ పార్టీపై కేసు వేస్తే ప్రాసిక్యూషన్‌కు అయ్యే వ్యయాలకు కవరేజీ కల్పిస్తుంది. మాల్వేర్ కవర్: ఎస్ఎంఎస్, ఫైల్ ట్రాన్స్ఫర్, లేదా ఇతరత్రా ఇంటర్నెట్ .. డిజిటల్ మాధ్యమాల ద్వారా మీ కంప్యూటర్ లేదా డిజిటల్ డివైజ్‌లోకి డౌన్లోడ్ చేసుకున్న కంప్యూటర్ ప్రోగ్రాంతో మాల్వేర్ వంటిదేమేనా చొరబడి, నష్టం వాటిల్లితే ఇది భర్తీ చేస్తుంది. ఫిషింగ్ కవర్: నమ్మకంగా కనిపిస్తూనే .. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా యూజర్ నేమ్స్, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డుల వివరాలను (కొన్ని సందర్భాల్లో పరోక్షంగా డబ్బు) చోరీ చేసే యత్నాల వల్ల వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు, ప్రాసిక్యూషన్ ఖర్చులకు ఫిషింగ్ కవరేజీ ఉపయోగపడుతుంది. థర్డ్ పార్టీ ద్వారా ప్రైవసీ, డేటా ఉల్లంఘన: మీ వ్యక్తిగత డేటాను థర్డ్ పార్టీ అనధికారికంగా బైటపెట్టినా లేదా థర్డ్ పార్టీ కంప్యూటర్ సిస్టమ్‌లో భద్రపర్చిన మీ వ్యక్తిగత డేటాకు అనధికారికంగా యాక్సెస్ పొందినా లేదా ఉపయోగించినా, తత్ఫలితంగా వాటిల్లే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఈ కవరేజీ పని చేస్తుంది. కౌన్సిలింగ్ సర్వీసులు: పైన పేర్కొన్న ఏ కారణాల వల్లనైనా పాలసీదారు ఒత్తిడి, ఆందోళనకు లోనై అక్రెడిటెడ్ సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ వద్ద చికిత్స పొందితే దానికి అయ్యే వ్యయాలను భర్తీ చేసుకోవచ్చు. మాల్వేర్ దాడి జరిగిన సందర్భంలో కంప్యూటర్ సాఫ్ట్వేర్, డేటాను రీస్టోర్ చేసేందుకు అయ్యే ఖర్చులకు సైబర్ బీమా కవరేజీ లభిస్తుంది. పాలసీదారు ఒకవేళ డేటా నష్టానికి థర్డ్ పార్టీ సర్వీస్ / సర్వీస్ ప్రొవైడర్‌పై దావా వేయదల్చుకుంటే అందుకయ్యే లీగల్ ఖర్చులకు కంపెనీ కవరేజీ ఇస్తుంది. వీటికి తోడు, బీమా పాలసీ కింద కౌన్సిలింగ్ సర్వీసులు, సైబర్ దోపిడీ నష్టాలు, కోర్టుకు వెళ్లేందుకయ్యే ఖర్చులు మొదలైనవి కూడా కవర్ అవుతాయి. ఇలా సైబర్ బీమాతో పలు ప్రయోజనాలు ఉన్నాయి. సైబర్ ప్లాన్ తీసుకోవడంతో పాటు మీ డిజిటల్ జీవితాన్ని భద్రంగా ఉంచుకునేందుకు మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవడం కూడా కీలకం. ముఖ్యమైన డేటాను బ్యాకప్ తీసుకోండి. సమర్ధమంతమైన యాంటీ–వైరస్ సాఫ్ట్వేర్, ఫైర్వాల్స్పై కొంత ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ఆన్లైన్లో వ్యాపార లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్త వహించాలి. సైబర్ ఎక్స్టార్షన్ కవర్: ప్రైవసీ, డేటా ఉల్లంఘన లేదా సైబర్ దాడి ముప్పులకు దీని ద్వారా కవరేజీ పొందవచ్చు. ఐటీ కన్సల్టెంట్ సర్వీసులు: వాటిల్లిన నష్టాన్ని రుజువు చేసేందుకు ఐటీ కన్సల్టెంట్ సహాయం తీసుకుంటే దానికయ్యే వ్యయాలను కూడా బీమా కంపెనీ చెల్లిస్తుంది. సోషల్ మీడియా కవర్: బాధిత వ్యక్తికి చెందిన సోషల్ మీడియా ఖాతా నుంచి వారి ఐడెంటిటీని చోరీ చేస్తుంటారు. ఇలాంటి సైబర్ దాడులప్పుడు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ ఖర్చులను పాలసీ భర్తీ చేస్తుంది. సైబర్ స్టాకింగ్ కవర్: మిమ్మల్ని వేధించడానికో లేదా భయపెట్టేందుకో డిజిటల్ మాధ్యమం ద్వారా ఎవరైనా పదే పదే వెంటబడుతూ ఉంటే, దాని వల్ల వాటిల్లే నష్టాల భర్తీకి ఈ కవరేజీ ఉపయుక్తంగా ఉంటుంది. -
సేల్స్, టెక్నాలజీ ఉద్యోగులకు డిమాండ్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగంలో సేల్స్, టెక్నాలజీ సంబంధ ఉద్యోగులకు భారీగా డిమాండ్ నెలకొంది. టెక్నాలజీకి సంబంధించి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సైబర్‌సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు.. సేల్స్‌లో కస్టమర్లతో మాట్లాడాల్సిన సిబ్బందికి డిమాండ్ నెలకొందని సియెల్ హెచ్ఆర్ సర్వీసెస్ ఒక అధ్యయన నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 15 నుంచి మే 15 వరకు, 11 లక్షల పైచిలుకు ఉద్యోగులు ఉన్న 60 బీఎఫ్‌ఎస్‌ఐల మానవ వనరుల ఎగ్జిక్యూటివ్‌లతో నిర్వహించిన సర్వే ఆధారంగా సియెల్ దీన్ని రూపొందించింది. ఇందుకోసం పోర్టల్స్‌లో 33,774 జాబ్ పోస్టింగ్స్‌ను విశ్లేíÙంచింది. నివేదిక ప్రకారం .. కరోనా మహమ్మారి నేపథ్యంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. దీంతో కొన్ని రకాల ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► బీఎఫ్ఎస్ఐ రంగంలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 18 శాతమే ఉంది. 10 శాతం మహిళలు మాత్రమే నాయకత్వ స్థానాల్లో ఉంటున్నారు. ► ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీతో పని ప్రదేశాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆర్థిక రంగం కూడా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మారుతున్నాయి. దీంతో టెక్నాలజీ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా టెక్నాలజీ–డేటా గవర్నెన్స్ స్పెషలిస్ట్, ట్రెజరీ హెడ్, ప్రోడక్ట్ హెడ్, ప్రీమియం బ్యాంకింగ్–రిలేషన్షిప్ హెడ్ వంటి కొత్త హోదాలు పుట్టుకొస్తున్నాయి. ► మొత్తం బీఎఫ్ఎస్ఐ జాబ్ పోస్టింగ్స్‌లో ముంబై వాటా అత్యధికంగా 20 శాతంగా ఉంది. పోస్టింగ్స్‌లో 19 శాతం వాటాతో బెంగళూరు రెండో స్థానంలో నిలి్చంది. ఇక పుణె (13 శాతం), హైదరాబాద్ (8 శాతం), చెన్నై (8 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► కృత్రిమ మేథ, మెషిన్ లెరి్నంగ్, బ్లాక్‌చెయిన్, రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్ వంటి కొత్త సాంకేతికతల్లో నైపుణ్యాలు ఉన్న వారికి భారీగా డిమాండ్ నెలకొంది. ► మహిళలకు ప్రాతినిధ్యం కలి్పంచడంలో అట్టడుగున ఉన్న అయిదు రంగాల్లో బీఎఫ్ఎస్ఐ కూడా ఒకటి. పరిశ్రమలో లింగ సమానత్వాన్ని, వైవిధ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. ► ఉద్యోగార్థుల్లో టెక్నాలజీ అనుభవం, కొత్త ఆవిష్కరణల సామర్థ్యం, మారే పరిస్థితులకు అలవాటుపడటం వంటి నైపుణ్యాలను బీఎఫ్ఎస్ఐ సంస్థలు పరిశీలిస్తున్నాయి. -
టీసీఎస్‌కు భారీ ఎదురుదెబ్బ: బిగ్ డీల్ నుంచి ట్రాన్సామెరికా ఔట్!
సాక్షి, ముంబై: భారతీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ భారీ డీల్ నుంచి తప్పుకుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. టీసీఎస్ లాంటి థర్డ్-పార్టీ ఐటీ సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ఇన్సోర్సింగ్పై ఎక్కువగా దృష్టి పెట్టాలని ట్రాన్సామెరికా యోచిస్తోందని తెలుస్తోంది. ట్రాన్సామెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో 10 సంవత్సరాల ఒప్పందం ప్రస్తుత పరిస్థితులు, సంబంధిత వ్యాపార ప్రాధాన్యతల రీత్యా గడువులోపే ముగిసిందని ధృవీకరించింది. 10 ఏళ్ల డీల్ విలువ 2 బిలియన్ డాలర్లు. ఈ డీల్‌కు ముగింపునకు ట్రాన్సామెరికా, టీసీఎస్ పరస్పరం అంగీకరించాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) తాజా నివేదికల ప్రకారం రానున్న 24-30 నెలల్లో ఈ ట్రాన్సిషన్ ప్రక్రియ పూర్తి చేయనుంది. కాంట్రాక్ట్ పదేళ్లలో ఎనిమిదేళ్లు పూర్తి చేస్తుందని, దీనిపై తమపై ఆర్థిక ప్రభావం తక్కువేనని టీసీఎస్ వెల్లడించింది. కాగా టీసీఎస్ సీఈవోగా రాజేష్ గోపీనాథన్ రాజీనామా తరువాత జూన్ 1న బాధ్యతలు స్వీకరించిన కె. కృతివాసన్‌కి ఇది పెద్ద సవాలేనని విశ్లేషకులు భావిస్తున్నారు. (అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి!) ట్రాన్సామెరికా అనేది శాన్-ఫ్రాన్సిస్కో-ఆధారిత ఆర్థిక సేవల సంస్థ. 2018, జనవరిలో కుదుర్చుకున్న ట్రాన్సామెరికా డీల్ కంపెనీ అతిపెద్ద కాంట్రాక్టులలో ఒకటిగా నిలిచింది. కాగ్నిజెంట్‌తో సహా ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ సేవలు పోటీ పడగా టీసీఎస్ ఈ డీల్‌ను సొంతం చేసుకుంది. -
అప్పటికల్లా అందరికీ బీమా! మూడంచెల విధానం.. యూపీఐ తరహా విప్లవం
న్యూఢిల్లీ: దేశంలో 2047 నాటికి బీమాను అందరికీ చేరువ చేసేందుకు.. లభ్యత, పొందడం, అందుబాటు అనే మూడంచెల విధానాన్ని అనుసరిస్తున్నట్టు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్ దేవాశిష్ పాండా తెలిపారు. 2047 నాటికి స్వాతంత్య్రం సిద్ధించి నూరేళ్లు అవుతున్నందున అప్పటికీ, బీమాను అందరికీ చేరువ చేయాలని ఐఆర్డీఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి గడిచిన ఏడాది కాలంలో పలు చర్యలు కూడా తీసుకుంది. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పాండా ఈ అంశంపై మాట్లాడారు. ‘‘బీమా రంగంలో యూపీఐ తరహా విప్లవాన్ని తీసుకొచ్చేందుకు లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిళ్లతో కలసి పనిచేస్తున్నాం. ఇందుకు సంబంధించి ఓ ఊహాత్మక కార్యాచరణ గురించి ఆలోచించాం’’అని పాండా తెలిపారు. దేశంలో బీమా వ్యాప్తి తక్కువగా ఉండడం, పెద్ద మార్కెట్ కావడంతో ఈ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నట్టు చెప్పారు. -
మీ బ్యాంక్ అకౌంట్లో రూ. 456 ఉండేలా చూసుకోండి! లేదంటే..
మన దేశంలో చాలా మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వం అందించే బీమా పథకాలను వినియోగించుకుంటున్నారు. దేశ ప్రజలందరినీ బీమా పరిధిలోకి తీసుకురావాలన్న సదుద్దేశ్యంతో కేంద్రం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) అనే పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలకు వినియోగించుకునే వారు ప్రతి సంవత్సరం కొంత మొత్తంలో డబ్బు చెల్లించాలి ఉంటుంది. కొంతమంది వినియోగదారులు ఈ స్కీమ్ కింద అమౌంట్ చెల్లించడానికి వారి బ్యాంక్ అకౌంట్ లింక్ యాడ్ చేసి ఉంటారు. కావున దీని ద్వారా సమయానికి అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతుంది. అయితే ఆ సమయానికి ఖాతాలో సరైన అమౌంట్ ఉండేలా చూసుకోవాలి. ఈ స్కీమ్స్ ఉపయోగించుకునే వారు మే 31 లోపు తప్పకుండా ఖాతలో రూ. 456 ఉండేలా చూసుకోవాలి. పీఎమ్‌జేజేబీవై అనేది వన్ ఇయర్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ స్కీమ్ కింద రూ. 2 లక్షల వరకు బీమా లభిస్తుంది. ప్రతి ఏడాది దీన్ని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 18 నుంచి 50 సంవత్సరాల వయసున్న వారు చేరవచ్చు. పాలసీ తీసుకున్న వారు మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల వరకు భీమా లభిస్తుంది. ఈ కవరేజ్ జూన్ 1 నుంచి మే 31 స్కీమ్ కవరేజ్ లభిస్తుంది. ఇక ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. అంటే ప్రమాదవ శాత్తు పాలసీదారుడు చనిపోతే వారి కుటుంబాలకు నిర్దిష్ట అమౌంట్ వస్తుంది. ఒక వేళా ప్రమాదంలో అంగవైకల్యం సంభవించినా కూడా పాలసీ డబ్బులు లభిస్తాయి. ఈ స్కీమ్‌లో చేరిన వారు ఏడాదికి కేవలం రూ. 20 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: రోజుకి రూ. 22.7 లక్షలు.. భారత్‌లో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓ) బ్యాంకులు మే 25 నుంచి మే 31 వరకు ప్రతి ఏడాది ఈ పాలసీ డబ్బులను కట్ చేసుకుంటూ ఉంటుంది. కావున ఈ రెండు స్కీమ్స్ కలుపుకుని బ్యాంక్ నుంచి రూ. 456 కట్ చేసుకుంటారు. కాబట్టి మే 31 నాటికి తప్పకుండా ఖాతాలో రూ. 456 ఉండేట్లు చూసుకోవాలి. (ఇదీ చదవండి: ఏఐ టెక్నాలజీపై సంచలన వ్యాఖ్యలు చేసిన గూగుల్ మాజీ సీఈఓ..) కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టారు. అయితే కేంద్రం ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని పెంచడం కూడా జరిగింది. గతంలో పీఎంజేజేబీ స్కీమ్ కోసం ప్రీమియం రూ. 330 మాత్రమే ఉండేది, అది ఇప్పుడు రూ. 436 కి పెరిగింది. అదే సమయంలో పీఎంఎస్బీ ప్రీమియం రూ. 12 నుంచి రూ. 20 కి పెంచారు. ఈ కొత్త ధరలు 2022 జూన్ 01 నుంచి అమలులోకి వచ్చాయి. -
ఇన్సూరెన్స్ పాలసీలపై పెరిగిన అవగాహన.. రూ.3 లక్షల కోట్ల బీమా రంగ ఆదాయం
న్యూఢిల్లీ: బీమా పరిశ్రమ స్థూల ప్రీమియం ఆదాయం 2025 మార్చి నాటికి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఇది రూ.2.4 లక్షల కోట్లుగా ఉంది. ప్రైవేటు బీమా సంస్థల కంబైన్డ్ రేషియో మెరుగుపడుతుందని, రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌వోఈ) 2023–24లో 11.2–12.8 శాతానికి, 2024–25లో 12.5–13.9 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. ప్రభుత్వరంగ బీమా సంస్థలు కంబైన్డ్ రేషియో అధికంగా ఉంటుందని, దీంతో వాటి నష్టాలు కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 2024 మార్చి నాటికి సాల్వెన్సీ రేషియో (1.5 రెట్లు) చేరుకునేందుకు వీలుగా వాటికి రూ.17,500 కోట్ల నిధుల అవసరం అవుతాయని అంచనా వేసింది. పరిశ్రమ స్థూల ప్రీమియం ఆదాయం 2022–23లో వార్షికంగా చూస్తే 17.2 శాతం వృద్ధితో రూ.2.4 లక్షల కోట్లకు చేరుకున్న విషయాన్ని ప్రస్తావించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2022–23లో నికరంగా రూ.35,000 కోట్ల మేర పెరిగినట్టు పేర్కొంది. హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెరగడంతో ఈ విభాగం మెరుగైన వృద్ధిని చూసిందని, వృద్ధి చెందిన స్థూల ప్రీమియం ఆదాయంలో 50 శాతం వాటా హెల్త్ ఇన్సూరెన్స్ నుంచే వచ్చినట్టు వివరించింది. కరోనా సమయంలో లాక్డౌన్లతో దెబ్బతిన్న మోటారు బీమా విభాగం సైతం పుంజుకున్నట్టు ఇక్రా తెలిపింది. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు సాధారణ స్థితికి చేరినట్టు పేర్కొంది. వేతన సవరణ, అందుకు సంబంధించిన బకాయిల చెల్లింపులతో ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు నష్టాలు పెరిగినట్టు వివరించింది. -
ఐపీపీబీ ఖాతాదారులకు బజాజ్ అలియాంజ్ బీమా
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాదారులకు బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ఇండియాపోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు ప్రత్యేకం. చిన్న మొత్తంలో ప్రీమియం చెల్లించడం ద్వారా బీమా రక్షణ పొందొచ్చని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. పాలసీదారు మరణించిన సందర్భంలో తక్షణమే పరిహారంతోపాటు, 5, 7, 10 ఏళ్లపాటు కుటుంబ అవసరాలకు నెలవారీ చెల్లించే సదుపాయాలు ఇందులో ఉన్నట్టు పేర్కొంది. -
ఏప్రిల్‌లో నియామకాలు తగ్గాయ్
ముంబై: దేశవ్యాప్తంగా 2023 ఏప్రిల్‌లో వైట్–కాలర్ జాబ్స్‌కు డిమాండ్ తగ్గిందని నౌకరీ.కామ్ నివేదిక తెలిపింది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం ఉద్యోగాల కోసం ప్రకటనలు గత నెలలో 5 శాతం తగ్గి 2,715 నమోదయ్యాయి. ఐటీ రంగంలో దిద్దుబాటు ఇందుకు కారణమని నివేదిక తెలిపింది. ఈ పరిశ్రమలో నియామకాలు 27 శాతం క్షీణించాయి. బీపీవో విభాగంలో 18 శాతం, ఎడ్టెక్ 21, రిటైల్‌లో 23 శాతం తగ్గాయి. ‘టెక్నాలజీయేతర రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల్లో నియామకాలు చురుకుగా ఉన్నాయి. మెట్రో నగరాల్లో కొత్తగా గృహ, వాణిజ్య భవనాల నిర్మాణం అధికం కావడంతో రియల్టీలో రిక్రూట్మెంట్ 21 శాతం పెరిగింది. దీంతో టెండర్ మేనేజర్, కన్స్ట్రక్షన్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ దూసుకెళ్లింది. వీరి నియామకాలు కోల్‌కతలో 28 శాతం, పుణే 22, హైదరాబాద్‌లో 19 శాతం అధికం అయ్యాయి. 16 ఏళ్లకుపైబడి నైపుణ్యం ఉన్న సీనియర్లకు డిమాండ్ 30 శాతం ఎక్కువగా ఉంది. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు, 4–7 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుల డిమాండ్ క్షీణించింది. నియామకాలు చమురు, సహజవాయువు రంగాల్లో 20 శాతం, బీమా 13, బ్యాంకింగ్ 11 శాతం వృద్ధి చెందాయి. వాహన పరిశ్రమలో 4 శాతం, ఫార్మా రంగంలో ఇది 3 శాతంగా ఉంది. మెట్రోయేతర నగరాల్లో అహ్మదాబాద్ 28 శాతం వృద్ధితో ముందంజలో ఉంది. ఈ నగరాల్లో బ్యాంకింగ్, వాహన, బీమా రంగాలు ప్రధాన పాత్ర పోషించాయి’ అని నివేదిక వివరించింది. -
karnataka assembly elections 2023: మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా: రాహుల్
ఉడుపి/మంగళూరు: కాంగ్రెస్ నేత రాహుల్ కర్ణాటక మత్స్యకారులపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా కల్పిస్తామని, లీటర్ డీజిల్‌పై రూ.25 చొప్పున రాయితీ ఇస్తామని, రోజుకు 500 లీటర్ల డీజిల్‌కు ఈ రాయితీ వర్తిస్తుందని, మత్స్యకార మహిళలకు రూ.లక్ష వడ్డీ లేని రుణం అందజేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గురువారం ఉడుపి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మత్స్యకారులతో సమావేశమయ్యారు. కేవలం హామీలు ఇవ్వడం కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచే వాటిని అమలు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం కాదని అన్నారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే మహిళలకు ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాహుల్ హమీ ఇచ్చారు. -
ఎల్ఐసీ ప్రీమియంలో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం, ప్రభుత్వరంగ ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 17 శాతం వృద్ధితో రూ.2.32 లక్షల కోట్లకు చేరింది. 2021–22 సంవత్సరానికి ప్రీమియం ఆదాయం రూ.1.99 లక్షల కోట్లుగా ఉంది. ప్రీమియం వసూలు పరంగా చూస్తే జీవిత బీమా మార్కెట్లో 2023 మార్చి నాటికి 62.58 మార్కెట్ వాటా కలిగి ఉన్నట్టు ఎల్ఐసీ తెలిపింది. లిస్టెడ్ జీవిత బీమా కంపెనీల్లో ప్రీమియం వృద్ధి పరంగా ఎల్ఐసీ రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ 18.83 శాతం మేర ప్రీమియం ఆదాయంలో వృద్ధిని చూపించి మొదటి స్థానంలో ఉంటే, ఎస్బీఐ లైఫ్ ప్రీమియం ఆదాయం 16.22 శాతం పెరిగి మూడో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం ఆదాయం 12.55 శాతం మేర పెరిగింది. ఎల్ఐసీకి సంబంధించి ఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం పాలసీల ప్రీమియం ఆదాయం 3.30 శాతం పెరగ్గా, ఇండివిడ్యువల్ నాన్ సింగిల్ ప్రీమియం ఆదాయం 10 శాతం, గ్రూప్ సింగిల్ ప్రీమియం ఆదాయం 21.76 శాతం, చొప్పున పెరిగాయి. -
ఇన్సూరెన్స్ దేఖోలో చేరిన కుల్దీప్ త్రివేది
హైదరాబాద్: ఇన్సూరెన్స్ దేఖో సంస్థ ఐఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కుల్దీప్ త్రివేది, ఆయన బృందాన్ని నియమించుకుంది. బీమా పంపిణీలో కుల్దీప్ త్రివేదికి 25 ఏళ్ల అనుభవం ఉంది. బీమా పంపిణీ వెంచర్లలో ఆయనకు ఎంతో ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. త్రివేది, ఆయన బృందం ఇన్సూరెన్స్ దేఖో పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతోపాటు కీలకమైన పశ్చిమ భారత్ మార్కెట్లో సేవల విస్తరణపై దృష్టి పెడుతుందని కంపెనీ ప్రకటించింది. ఇన్సూర్టెక్ సంస్థ అయిన ఇన్సూరెన్స్ దేఖో ఇటీవలే 150 మిలియన్ డాలర్లను సమీకరించడం గమనార్హం. ఈ సంస్థ దేశవ్యాప్తంగా తన సేవలను మరింత విస్తరించడంపై దృష్టి సారించింది. -
ఇన్సూరెన్స్‌దేఖో చేతికి వేరక్
న్యూఢిల్లీ: దేశీ బీమారంగ స్టార్టప్ ఇన్సూరెన్స్‌దేఖో తాజాగా ముంబై సంస్థ వేరక్ను కొనుగోలు చేసింది. ఎస్ఎంఈ ఇన్సూరెన్స్ పంపిణీ సంస్థ వేరక్ను సొంతం చేసుకున్నట్లు ఇన్సూరెన్స్‌దేఖో వ్యవస్థాపకుడు, సీఈవో అంకిత్ అగర్వాల్ వెల్లడించారు. వేరక్ ప్రారంభమైనప్పటినుంచి పటిష్టంగా ఎదుగుతున్నట్లు, కొత్త విభాగం మైక్రోబిజినెస్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో విస్తరించినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. తద్వారా తొలిసారి చిన్న వర్తకులను బీమా పరిధిలోకి తీసుకువస్తున్నట్లు తెలియజేశారు. ప్రతీ నెలా ప్రీమియంలో 30 శాతం నెలవారీ వృద్ధిని సాధిస్తున్నట్లు వెల్లడించారు. -
బీమా డబ్బులు కోసం ప్రియుడితో కలిసి ప్లాన్.. భర్త ఇంట్లోకి రాగానే
రాంచీ: పెళ్లి మండపంలో వధూవరులు జీవితాంతం ఒకరికొకరు తోడు ఉంటామని ప్రమాణం చేస్తారు. అయితే కొంత కాలం ప్రయాణం తర్వాత కొన్ని జంటల మధ్య ఏం జరుగుతుందో ఏమో గానీ ఈ ప్రమాణాలను గాలికి వదిలేసి వారి దాంపత్య జీవితానికి ఫుల్స్టాప్ పెడుతున్నారు. ఇంకొందరు మరో అడుగు మందుకేసి తమ భాగస్వాములను హతమారుస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు చూస్తునే ఉన్నాం. తాజాగా బీమా సొమ్ము కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఇక్కడ మరో విషాదం ఏంటంటే.. ఈ దంపతులకు ఆరుగురు పిల్లలు. తండ్రి మరణం, తల్లికి జైలు శిక్ష.. ఇప్పుడికి ఆ పిల్లలు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మరియం సురిన్ అనే మహిళ ఇటీవల ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో తన భర్త నుంచి విడిపోయి తన ప్రియడితో కలిసి జీవించాలని అనుకుంది. అయితే వారిద్దరికీ బతకడానికి డబ్బుకు లోటు ఉండకూడదని భావించింది. ఈ క్రమంలో ఆ మహిళ తన ప్రియుడితో కలిసి దారుణమైన కుట్ర పన్నింది. భర్త వాసిల్ సూరిన్ మరణిస్తే అతని పేరు మీద బీమా సొమ్ము రూ.20 లక్షలు తనకే దక్కుతుందని భావించింది. ప్లాన్ ప్రకారం తన భార్త ఇంట్లోకి రాగానే తలుపులు అన్నీ మూసేసింది. తనకీ ఏమాత్రం అనుమానం రాకుండా వినయం నటిస్తూ అతన్ని మాటల్లోకి దింపింది. ఈ క్రమంలో రాడ్‌తో భర్తని కొట్టి చంపింది. ఈ హత్యను ప్రమాదవశాత్తు జరిగిందని ఆ మహిళ నమ్మించాలని ప్రయత్నించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు నుంచి మరియం సురిన్ చెప్పే మాటలపై అనుమానం వచ్చింది. చివరికి ఈ ఘటన జరిగిన 72 గంటల్లోనే నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. -
కేంద్రం పన్నుపోటు.. ఇన్సూరెన్స్ కంపెనీల అంచనాలు తలకిందులు
న్యూఢిల్లీ: అధిక ప్రీమియం కలిగిన జీవిత బీమా ఉత్పత్తులకు ఏమంత డిమాండ్ కనిపించలేదు. ఏప్రిల్ 1 నుంచి తీసుకునే జీవిత బీమా పాలసీల వార్షిక ప్రీమియం రూ.5,00,000కు మించి ఉంటే పన్ను చెల్లించాలంటూ నిబంధనలను బడ్జెట్లో ప్రకటించడం తెలిసిందే. కాకపోతే మార్చి 31 వరకు కొనుగోలు చేసే పాలసీలకు ఈ నిబంధన వర్తించదు. దీంతో అధిక ప్రీమియం ప్లాన్లను మార్చి ఆఖరులోపు కంపెనీలు పెద్ద ఎత్తున విక్రయిస్తాయని నిపుణులు భావించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. అనుకున్న విధంగా వీటి విక్రయాలు ఏమీ పెరగలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రూ.5,00,000కు పైగా ప్రీమియం చెల్లించే ప్లాన్లకు సంబంధించి గడువు తీరిన తర్వాత అందే మొత్తం కూడా పన్ను పరిధిలోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో భాగంగా ప్రకటించారు. అధిక పన్ను పరిధిలోని వారు ఈ ప్లాన్లను తీసుకోవడం ద్వారా ఆ మేరకు పన్ను ప్రయోజనం పొందే అవకాశం సెక్షన్ 10(10డి) కింద ఉంది. బడ్జెట్లో ప్రకటన తర్వాత చాలా బ్రోకరేజీ సంస్థలు అధిక ప్రీమియంతో కూడిన నాన్ పార్టిసిపేటరీ గ్యారంటీడ్ ఉత్పత్తులకు ఫిబ్రవరి, మార్చిలో అనూహ్య డిమాండ్ ఉంటుందనే అంచనాను వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ అవకాశం లేనందున చాలా మంది ముందుకు వస్తారని భావించాయి. సాధారణ అమ్మకాలే.. ఫిబ్రవరి నెలలో అధిక ప్రీమియం బీమా ఉత్పత్తుల అమ్మకాలు పెద్దగా పెరగలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్చిలో పెద్ద ఎత్తున అమ్ముడుపోవచ్చని బీమా కంపెనీలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదం జరిగితే.. పరిహారం ఎలా వస్తుంది? ఎవరు అర్హులు
జగిత్యాల జోన్: అజాగ్రత, నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తు.. ఇలా కారణాలు ఏవైనా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతకంటే వేగంగా ఈ సంఖ్య పెరుగుతోంది. అయితే, సరైన ధ్రువీకరణ పత్రాలు లేక బాధితులకు పరి హారం అందడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా లేకపోవడం ఇందుకు కారణమవుతోంది. జిల్లాలో 2022 సంవత్సరంలో 450 వరకు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒక్క జగిత్యాల జిల్లాలోనే జరిగిన యాక్సిడెంట్లను పరిశీలిస్తే.. 200 మంది మరణించగా, 150 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఇక క్షతగాత్రుల సంఖ్య వందల్లో ఉంటుంది. మరణించిన లేదా గాయపడ్డ వారిలో కుటుంబ పెద్ద ఉంటే, బాధిత కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. బాధితుల్లో పేదలు, మధ్యతరగతివారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జగిత్యాల మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రమేశ్ తన పని నిమిత్తం ఇటీవల జగిత్యాలకు వచ్చాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టడడంతో చేయి విరిగింది. డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఆటోకు ఇన్సూరెన్సు లేదు. పెద్దమనుషులు జోక్యం చేసుకుని బాధితుడికి ఆటో డ్రైవర్ నుంచి రూ.10వేల పరిహారం ఇప్పించారు. డ్రైవర్‌కు లైసెన్స్, ఆటోకు బీమా సౌకర్యం ఉంటే బాధితుడు కోర్టులో కేసు వేసే అవకాశం ఉండేది. తద్వారా పరిహారం అధికంగా వచ్చి ఉండేది. బీమా లేమి బాధితులకు శాపం.. ● ద్విచక్ర వాహనం నుంచి భారీ వాహనాల వరకు మోటారు వాహన చట్టం ప్రకారం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలి. ● కానీ, చాలా ప్రమాదాలకు కారణమైన వాహనాలకు బీమా సౌకర్యం ఉండడంలేదు. ● దీంతో బాధితులు, వారి కుటుంబాలకు సంస్థల నుంచి పరిహారం అందడం లేదు. ● వాహనాలు నడిపే వారిలో చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండటం లేదు. ● వాహనాలు నడపడంలో అనుభవం లేక తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ● ప్రమాదం జరిగిన సమయంలో పోలీసు, రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేసే వరకే పరిమితమవుతున్నారు. ● పోలీసులు అడపాదడపా వాహనాలు తనిఖీలు చేస్తూ నిబంధనలు అతిక్రమిస్తే రూ.500– రూ.1,000 వరకు జరిమానా విధిస్తున్నారు. ● వాహనం నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి ఇన్సూరెన్స్ లేలకుంటే జరిగే నష్టంపై అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు. బాధితుల వేదనలు వర్ణణాతీతం.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాల బాధలు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. ఇంటిపెద్ద చనిపోయి ఆ కుటుంబం రోడ్డున పడుతుంటే.. గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు అప్పులు చేయక తప్పడంలేదు. బాధితులు కూడా నెలల తరబడి మంచానికే పరిమితం కావడం ఆ కుటుంబాల్లో మానసిక సమస్యలకు కారణమవుతోంది. పరిహారం కోసం కోర్టులో కేసు వేయడం, గెలవడం బాధిత కుటుంబాలకు సవాల్‌గానే మారుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చుతున్నారు. కానీ, కేసు ఎప్పుడు ముగుస్తుందో, ఎప్పుడు పరిహారం వస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. పరిహారం కోసం కేసు వేయాల్సిందే.. ● ప్రమాద బాధితులు తమకు జరిగిన నష్టంపై పరిహారం కోరుతూ కోర్టులో కేసులు దాఖలు చేస్తేనే ఎక్కువ పరిహారం వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. ● పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. డ్రైవర్, వాహన యజమాని, బీమా సంస్థకు నోటీసులు జారీ చేస్తుంది. ● అయితే, కోర్టు వరకు వచ్చిన చాలా కేసుల్లో డ్రైవర్‌కు లైసెన్స్, వాహనాలకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండటం లేదు. ● బాధితులకు పరిహారం చెల్లించాలని కోర్టు వాహన యజమానులకు ఆదేశాలు జారీ చేస్తున్నా.. యజమాని పరిహారం చెల్లించే స్థితిలో ఉన్నా.. బాధితుడికి పరిహారం అందడం లేదు. ● డ్రైవర్‌కు లైసెన్స్ లేకుండా, వాహనానికి ఇన్సూరెన్స్ ఉన్నా.. ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం ఇవ్వడం లేదు. ● దీంతో, పెద్దమనుషులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను ‘ఎంతోకొంత’కు రాజీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఎంతో కొంత మొత్తానికి ఒప్పందాలు చేసుకుంటున్నారు. రూ.10 వేలే ఇచ్చారు ఏడాది క్రితం పెగడపల్లి వెశ్తుండగా ఒకరు ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. కాలు విరిగింది. రెండు నెలలు ఇంటివద్దే ఉన్న. ఇప్పటికీ నడవడం రావడంలేదు. మోటర్‌సైకిల్‌కు ఇన్సూరెన్స్‌లేదు. డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఆ వ్యక్తి కాళ్లావేళ్లా పడి రూ.10వేలు నా చేతిలో పెట్టిండు. నేను ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటే రూ.60వేల వరకు ఖర్చు వచ్చింది. – రాజిరెడ్డి, రఘురాములకోట, జగిత్యాల రూరల్ ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే పరిహారం వాహనం, డ్రైవర్‌కు సరైన ధ్రువీకరణ పత్రాలు లేక రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందడంలేదు. వాహనాలు, వాహనదారులు తగిన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి. – డబ్బు లక్ష్మారెడ్డి, అడ్వకేట్, జగిత్యాల ముమ్మరంగా వాహనాల తనిఖీ జిల్లాలో వాహనాల తనీఖీ ముమ్మరంగా చేపట్టాం. వీలైనంత వరకు రోడ్డు ప్రమాదాలు నియంత్రిస్తున్నాం. ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేని వాహనదారులకు జరిమానా విధిస్తున్నాం. నష్టంపై అవగాహన కల్పిస్తున్నాం. – భాస్కర్, ఎస్పీ -
ఐటీ ఆదాయాలకు సవాళ్లు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ రంగంలో సవాళ్లు మొదలైనవి దేశీ ఐటీ కంపెనీల ఆదాయాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రతికూలంగా పరిణమించవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి దాదాపు 20 శాతంగా ఉండనుండగా .. 2024 ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం స్థాయికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ‘అమెరికా, యూరప్ వంటి కీలక మార్కెట్లలో.. ముఖ్యంగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) విభాగంలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఇవి దేశీ ఐటీ సేవల కంపెనీల ఆదాయాల వృద్ధిపై ప్రభావం చూపనున్నాయి’ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం తర్వాత బీఎఫ్ఎస్ఐ సెగ్మెంట్లో కొంత ఒత్తిడి నెలకొందని పేర్కొన్నారు. ఫలితంగా ఈ విభాగం ఆదాయ వృద్ధి సింగిల్ డిజిట్ మధ్య స్థాయికి పడిపోవచ్చని వివరించారు. అయితే, తయారీ రంగంలో 12–14 శాతం, ఇతర సెగ్మెంట్లలో 9–11 శాతం వృద్ధి నమోదు కావచ్చని.. తత్ఫలితంగా బీఎఫ్ఎస్ఐ విభాగంలో క్షీణత ప్రభావం కొంత తగ్గవచ్చని వివరించారు. దాదాపు రూ. 10.2 లక్షల కోట్ల భారతీయ ఐటీ రంగంలో 71 శాతం వాటా ఉన్న 17 కంపెనీల డేటాను విశ్లేషించి క్రిసిల్ ఈ నివేదిక రూపొందించింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► క్లయింట్లు ఐటీపై ఇష్టారీతిగా ఖర్చు చేయకుండా, ప్రతి రూపాయికి గరిష్టమైన ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి డీల్స్నే కుదుర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. దీనితో పాటు డిజిటల్ సొల్యూషన్స్, క్లౌడ్, ఆటోమేషన్ సామరŠాధ్యలు మొదలైనవి డిమాండ్‌కి దన్నుగా ఉండనున్నాయి. ► ఐటీ రంగం ఆదాయాల్లో బీఎఫ్ఎస్ఐ వాటా 30 శాతం వరకు ఉంటోంది. తలో 15 శాతం వాటాతో రిటైల్, కన్జూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ విభాగాలు ఉంటున్నాయి. మిగతా వాటా లైఫ్ సైన్సెస్ .. హెల్త్‌కేర్, తయారీ, టెక్నాలజీ.. సర్వీసెస్, కమ్యూనికేషన్.. మీడియా మొదలైన వాటిది ఉంటోంది. ► ఐటీ సంస్థలు కొత్తగా నియామకాలు .. ఉద్యోగులపై వ్యయాలను తగ్గించుకోనుండటంతో 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభదాయకత స్వల్పంగా 0.50–0.60 శాతం మెరుగుపడి 23 శాతంగా ఉండొచ్చు. ► ఉద్యోగులపై వ్యయాలు పెరగడం వల్ల 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 1.50–1.75 శాతం మందగించి దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 22–22.5 శాతానికి తగ్గవచ్చు. ► అట్రిషన్‌లు (ఉద్యోగుల వలసలు) ఇటీవల కొద్ది త్రైమాసికాలుగా తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత తగ్గవచ్చు. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ ఉద్యోగులను సమర్ధంగా ఉపయోగించుకోవడం, సిబ్బందికి శిక్షణనిస్తుండటం, రూపాయి క్షీణత ప్రయోజనాలు మొదలైన సానుకూల అంశాల కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 0.50–60 శాతం మెరుగుపడి 23 శాతానికి చేరవచ్చు. అయినప్పటికీ కరోనా పూర్వం 2016–20 ఆర్థిక సంవత్సరాల మధ్య నమోదైన సగటు 24 శాతానికన్నా ఇంకా దిగువనే ఉండొచ్చు. ► దేశీ ఐటీ కంపెనీల రుణ నాణ్యత స్థిరంగానే ఉంది. రూపాయి మారకం విలువ గణనీయంగా పెరగడం, మాంద్యం ధోరణులు ఒక్కసారిగా ముంచుకురావడం వంటి రిస్కులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. -
ఏ ఆసుపత్రిలో అయినా క్యాష్ లెస్ ట్రీట్మెంట్.. ఐసీఐసీఐ లాంబార్డ్ ఆఫర్
ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తన హెల్త్ పాలసీదారులకు మంచి ఆఫర్‌ను ప్రకటించింది. పాలసీదారులు నగదు రహిత వైద్యాన్ని ఏ ఆస్పత్రి నుంచి అయినా పొందొచ్చని.. నాన్ ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్‌లోనూ ఈ సేవలు వినియోగించుకోవచ్చని సూచించింది. పరిశ్రమలో ఈ తరహా ఆఫర్ మొదటిదిగా పేర్కొంది. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ గోల్డెన్ కార్డ్: ప్రీమియం కస్టమర్లకు అదిరిపోయే ప్రయోజనాలు వైద్యం కోసం కస్టమర్లు తమ పాకెట్ నుంచి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘ఐఎల్ టేక్ కేర్’ యాప్ నుంచి ఈ నూతన సదుపాయాన్ని పొందొచ్చని ప్రకటించింది. నగదు రహిత వైద్యాన్ని హాస్పిటళ్లు అందించడంపై ఆధారపడి ఉంటుందని, ఆస్పత్రిలో చేరడానికి 24 గంటల ముందే పాలసీదారులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. తాము సూచించిన హాస్పిటల్ లేదంటే సమీపంలోని హాస్పిటల్‌కు వెళ్లొచ్చని సూచించింది. ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం! -
లైఫ్ స్టయిల్ పాలసీలకు అయిదు కారణాలు
అలవాట్లు, అభిరుచులు, ఇష్టాఇష్టాలను బట్టి ప్రతి ఒక్కరికీ ఒకో జీవన విధానం...అంటే లైఫ్ స్టయిల్ ఉంటుంది. విలువైనదిగా పరిగణించే లైఫ్ స్టయిల్‌ను కాపాడుకునేందుకు అంతా ప్రయత్నిస్తుంటాము. బీమా సాధనం దీనికి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇష్టపడేవి చేజారకుండా నివారించలేకపోయినా.. అలాంటి సందర్భాల్లో వాటిల్లే నష్టాన్ని ఎంతో కొంత మేర భర్తీ చేసుకునేందుకు ఇది ఉపయోగకరంగా ఉండగలదు. మిగతా పాలసీలకు భిన్నమైన లైఫ్ స్టయిల్ బీమాను ఎంచుకోవడానికి ప్రధానంగా అయిదు కారణాలు ఉన్నాయి. ► మానసిక, శారీరక ఆరోగ్యానికి రక్షణ కోసం: ఒత్తిళ్లు, ఆందోళనలతో కూడుకున్న ప్రస్తుత ప్రపంచంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్నీ కాపాడుకోవడం చాలా కీలకంగా ఉంటోంది. సమగ్రమైన హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు సహాయపడుతుంది. ప్రస్తుతం టెలీ కౌన్సిలింగ్, మానసిక.. శారీరక ఆరోగ్యంపై వెబినార్లు, వెల్నెస్ సెంటర్స్ .. డయాగ్నాస్టిక్ సెంటర్లకు వోచర్లు, తరచూ హెల్త్ చెకప్‌లు మొదలైన వాటికి కూడా బీమా కంపెనీలు కవరేజీనిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటిస్తే రెన్యువల్ సమయంలో ప్రీమియంపై డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు కూడా ఇస్తున్నాయి. ► సైబర్ క్రైమ్ నుంచి రక్షణ కోసం: కరోనా మహమ్మారి ప్రబలినప్పటి నుంచి సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసగాళ్ల వల్ల వాటిల్లే నష్టాల నుంచి వ్యక్తిగత సైబర్ రిస్క్ పాలసీలు కాపాడగలవు. వ్యక్తిగత డేటా లేదా ప్రైవసీకి భంగం కలగడం, ఈ–మెయిల్ ఫిషింగ్, మొదలైన వాటి నుంచి రక్షణనివ్వగలవు. ► రిస్కీ క్రీడల్లో గాయాల బారిన పడితే రక్షణ: మీకు ఎంతో ఇష్టమైన క్రీడలు ఆడేటప్పుడు గాయాలబారిన పడితే రక్షణ కల్పించే విధమైన పాలసీలు ఉన్నాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్, ఎన్డ్యురెన్స్ స్పోర్ట్స్ వంటి రిస్కీ హాబీలు ఉన్న వారికీ స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ కవరేజీని బీమా కంపెనీలు ఇస్తున్నాయి. క్రీడలపరంగా వివిధ రకాల గాయాలకు చికిత్స, ఫిజియోథెరపీ మొదలుకుని ప్రమాదవశాత్తూ ఏదైనా అనుకోనిది జరిగితే యాక్సిడెంటల్ డెత్ కవరేజీ వరకూ పలు అంశాలకు కవరేజీ ఉంటోంది. ప్రమాదాల బారిన పడినప్పుడు తలెత్తే వైద్య ఖర్చులు, విరిగిన ఎముకలకు చికిత్స వ్యయాలు, సాహస క్రీడలపరమైన బెనిఫిట్, ఎయిర్ అంబులెన్స్ కవరేజీ లాంటివి అదనంగా తీసుకోవచ్చు. ► పెంపుడు జంతువులకు బీమా: జంతువులను పెంచుకోవడమంటే చాలా బాధ్యతతోను, ఖర్చుతోనూ కూడుకున్న వ్యవహారం. వాటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఉండాలి. వెటర్నరీ ఫీజులు, వైద్యం ఖర్చులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో సమగ్రమైన పెట్ కవరేజీ ఉంటే శస్త్రచికిత్సలు .. హాస్పిటలైజేషన్ వ్యయాలు, థర్డ్ పార్టీ లయబిలిటీ మొదలైన భారాలను తగ్గించుకోవచ్చు. ► వివాహ శుభకార్యానికీ కవరేజీ: ప్రస్తుతం పెళ్లిళ్లంటే చాలా ఖర్చుతో కూడుకున్నవిగా మారిపోయాయి. అనుకోనిది ఏదైనా జరిగితే చేసిన ఖర్చంతా వృధాగా పోయే రిస్కులు ఉంటు న్నాయి. అయితే, వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌తో పెళ్లిళ్లలో ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్నా, విలువైనవి పోయినా కవరేజీని పొందవచ్చు. అంతే కాదు, ఊహించని పరిస్థితుల వల్ల వివాహం రద్దయినా లేదా వాయిదా పడినా అప్పటి వరకూ చేసిన ఖర్చులను నష్టపోకుండా లైఫ్‌స్టయిల్ కవరేజీ కాపాడుతుంది. -
లవ్ బ్రేకప్‌కి ఓ ఇన్సూరెన్స్..మోసపోయిన వాళ్లు క్లయిమ్ చేసుకోవచ్చంట?
కోవిడ్-19తో ప్రపంచ వ్యాప్తంగా ఇన్సూరెన్స్ రంగం గణనీయమైన వృద్దిని సాధించింది. ఆపత్కాలంలో ఆర్ధిక చేయూత అందించేందుకు భీమా రంగ సంస్థలు ఇన్సూరెన్స్ పథకాల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. వాటిల్లో హోమ్ ఇన్సూరెన్స్, మోటార్స్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా రకరకాల ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి. కానీ లవ్‌లో బ్రేకప్ అయితే ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ‘హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్’ అనే పథకం ఉంది. ఆ స్కీమ్ గురించి మీకు తెలుసా? అవును! ప్రేమికుడు, ప్రేమికురాలు కొన్ని అన్వేక కారణాలతో విడిపోతున్న ఘటనలు చూసే ఉంటాం. ఇలా విడిపోయిన తర్వాత డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆదుకునేందుకు పలు ఇన్సూరెన్స్ సంస్థలు పథకాల్ని అందిస్తున్నాయి. వాటిల్లో ఈ హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఒకటి. ఇటీవల ప్రతీక్ ఆర్యన్ అనే ట్విటర్ యూజర్ ప్రేమలో ఉన్నప్పుడు తన ప్రియురాలితో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందంలో భాగంగా.. ప్రేమించుకునే సమయంలో పొరపాటున విడిపోతే.. ఎవరికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండేలా ‘హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్’ పేరుతో ప్రేమలో మోసపోయిన వాళ్లు డబ్బులు తీసుకోవాలనే నిబంధన పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రతీక్ అతని ప్రియురాలు కలిసి ఓ బ్యాంక్‌లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు. ప్రతి నెల ఆ అకౌంట్లో రూ.1000 డిపాజిట్ చేశారు. ఈ తరుణంలో ప్రియురాలు తనని మోసం చేయడంతో రూ.25వేలు నగదు పొందినట్లు ప్రతీక్ ట్వీట్లో తెలిపారు. I got Rs 25000 because my girlfriend cheated on me .When Our relationship started we deposited a monthly Rs 500 each into a joint account during relationship and made a policy that whoever gets cheated on ,will walk away with all money. That is Heartbreak Insurance Fund ( HIF ). — Prateekaaryan (@Prateek_Aaryan) March 15, 2023 ప్రతీక్ ట్వీట్లపై ఈ తరహా ఇన్సూరెన్స్‌లు ఉన్నాయా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ గురించి పూర్తి వివరాలు చెబితే తాము సైతం పాలసీలు తీసుకుంటామని రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. లోరెంజో చాన్ ఏం చెబుతున్నారంటే ప్రేమ విఫలమై డిప్రెషన్, అనారోగ్య సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు తలెత్తే వారిని ఆదుకునేందుకు పయనీర్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు ప్రేమలో విఫలమైన వారి కోసం ఇన్సూరెన్స్ స్కీంలను అందిస్తున్నాయి. ఈ పాలసీలు తీసుకున్న వాళ్లు ప్రేమలో విఫలమైన తర్వాత క్లయిమ్ చేసుకొని నగదు పొందే అవకాశం కల్పిస్తున్నాయి. అలా లబ్ధి పొందాలంటే తాము విధించిన నిబంధనలు లోబడి ఇన్సూరెన్స్ తీసుకోవాలని పయనీర్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రెసిడెంట్ లోరెంజో చాన్ తెలిపారు. You may not be able to save your family and loved ones from a heartbreak but you can help them start the healing process. Get insured through Heartbreak PH 💜https://t.co/GFH6OkKVxi — Pioneer Insurance (@PioneerPH) February 14, 2020 చదవండి👉 ఎస్బీఐ అకౌంట్ బ్రాంచ్ మారాలనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని -
ఆరోగ్యానికి వారధి
‘అనుభవాలే పాఠాలు అవుతాయి’ అనే మాటను అనేకసార్లు విని ఉన్నాం మనం.మరి అనుభవాలే అంకురాలు (స్టార్టప్) అవుతాయా?‘వై నాట్!’ అంటున్నారు మయాంక్ కాలే (27), అమృత్‌సింగ్ (27)మూడు పదుల వయసు దాటకుండానే హెల్త్‌కేర్ అండ్ ఇన్సూటెక్ స్టార్టప్ ‘లూప్’తో ఘన విజయం సాధించి సత్తా చాటారు.స్టార్టప్‌కు సామాజిక కోణం జత చేసి విజయవంతం అయ్యారు... యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్(యూఎస్)లో చదువుకునే రోజుల్లో చదువును మధ్యలోనే ఆపేయాలని మయాంక్, అమృత్‌లు నిర్ణయించుకున్నప్పుడు వారి వారి తల్లిదండ్రులకు ఎంతమాత్రం నచ్చలేదు.‘ఇంతకీ ఏంచేయాలనుకుంటున్నారు?’ అని అడిగారు.తమ భవిష్యత్ చిత్రపట్టాన్ని రంగుల్లో చూపారు మయాంక్, అమృత్‌లు.వారి వారి తల్లిదండ్రులకు నచ్చిందో లేదో తెలియదుగానీ ‘ముందు చదువు పూర్తి చేయండి. ఆతరువాత ఆలోచిద్దాం’ అన్నారు. ఇప్పుడు చిన్న ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి మనం..మయాంక్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు తండ్రికి గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. దీంతో ఒక్కగానొక్క కొడుకైన మయాంక్ ఆఘమేఘాల మీద ఇండియాకు వచ్చాడు. తండ్రి సమస్య సర్జరీ వరకు వెళ్లింది.ఇంటికి, హాస్పిటల్స్‌కు వెళ్లే క్రమంలో మయాంక్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో అతడికి గట్టిగా బోధపడిన సత్యం ఏమిటంటే ‘ప్రైమరీ కేర్’కు ప్రా ధాన్యం ఇస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడుగానీ చాలామంది హాస్పిటల్స్‌కు వెళ్లడం లేదు. ఇది తన దృష్టిలో నిలిచిపోయింది. యూనివర్సిటీకి తిరిగి వెళ్లిన తరువాత అమృత్‌తో కలిసి పేషెంట్ల హెల్త్‌కేర్‌కు సంబంధించి డిజిటల్ హెల్త్‌కేర్ రికార్డ్లను క్రియేట్ చేసే సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశాడు. దీన్ని మహారాష్ట్రలోని గడ్చిరోలి గ్రామీణ్రపాంతాలలో విజయవంతంగా ప్రయోగించారు.ఈ విజయం వారిలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.చదువులు పూర్తయిన తరువాత ఇండియాకు వచ్చారు మయాంక్, అమృత్. గత విజయం ఇచ్చిన ఉత్సాహంతో రకరకాల అప్లికేషన్లను డెవలప్ చేయడంప్రా రంభించారు.మన జనాభాలో అతి కొద్దిమందికి మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా చాలామందిలో ‘మెడికల్ ఎడ్యుకేషన్’ ఉండడం లేదు. దీనివల్ల వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్లి లేని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వర్క్‌ప్లేస్ ఇన్సూరెన్సులు పెరుగుతున్నాయి. అయితే వ్యక్తిగత (రిటైల్) ఇన్సూరెన్స్‌లు తగ్గాయి. దీనికి కారణం ఎవరిని సంప్రదించాలి? ఎలాంటి పాలసీలు తీసుకోవాలి... మొదలైన విషయాలపై అవగాహన లేకపోవడం... ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని పుణె కేంద్రంగా హెల్త్‌కేర్ అండ్ ఇన్సూటెక్ స్టార్టప్ ‘లూప్’కు శ్రీకారం చుట్టారు మయాంక్, అమృత్‌సింగ్.‘లూప్’ ద్వారా వైద్య విషయాలపై అవగాహనతో పాటు, ప్రైమరీ కేర్ (్రపాథమిక ఆరోగ్య సంరక్షణ)కు సంబంధించి డాక్టర్‌తో యాక్సెస్, ఫ్రీ కన్సల్టెషన్లు, ఆన్లైన్ యోగా సెషన్స్... మొదలైన ప్రయోజనాలు ఉన్నాయి. కంపెనీలకు, ఇన్సూరెన్స్ప్రొవైడర్లకు మధ్య ‘లూప్’ సంధానకర్తగా వ్యవహరిస్తోంది.దిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె...మొదలైన పట్టణాలలో ఎన్నో కంపెనీలతో కలిసి పనిచేస్తోంది లూప్.‘మయాంక్, అమృత్లకు భారతీయ ఆరోగ్య వ్యవస్థపై మంచి అవగాహన ఉంది. అందుబాటులో ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో లూప్ భవిష్యత్‌లో ఎంతోమందికి సహాయంగా నిలవనుంది’ అంటున్నాడు గురుగ్రామ్‌కు చెందిన వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ ‘ఎలివేషన్ క్యాపిటల్’ భాగస్వామి ఖందూజ. ప్రస్తుతం ఉద్యోగుల హెల్త్–చెకప్‌కు ఉద్దేశించిన ఫిజికల్ ‘లూప్–క్లీనిక్’లపై ట్రయల్స్ చేస్తున్నారు.‘లూప్’ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది.మయాంక్ (కో–ఫౌండర్ అండ్ సీఈఓ, లూప్), అమృత్ (కో–ఫౌండర్, లూప్)ల లక్ష్యం ఫలించింది అని చెప్పడానికి ఇది చాలు కదా! ఇంటికి, హాస్పిటల్స్‌కు వెళ్లే క్రమంలో మయాంక్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో అతడికి గట్టిగా బోధపడిన సత్యం ఏమిటంటే ‘ప్రైమరీ కేర్’కుప్రా ధాన్యం ఇస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. -
మానసిక, శారీరక వైకల్యం ఉన్న వారికి బీమా
న్యూఢిల్లీ: సాధారణ, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు వైకల్యం ఉన్న వారు, హెచ్ఐవీ బాధితులు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా బీమా ఉత్పత్తులను తీసుకు రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. ఐఆర్డీఏఐ హెల్త్ ఇన్సూరెన్స్ మార్గదర్శకాలకు (2016) అనుగుణంగా ఈ ఉత్పత్తుల ప్రీమియం ధరలను నిర్ణయించాలని తన తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ తరహా వ్యక్తులకు సంబంధించి పాలసీల క్లెయిమ్‌లు తిరస్కరించకుండా బోర్డు స్థాయిలో ఆమోదం పొందిన అండర్‌రైటింగ్ పాలసీని అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆదేశించింది. ఏడాది కాల వ్యవధితో బీమా ఉత్పత్తి ఉండాలని, దాన్ని ఏటా పునరుద్ధరించుకునే అవకాశం కల్పించాలని కోరింది. -
విశ్రాంత జీవనం.. హాయిగా..!
ప్రజల ఆయుర్ధాయం పెరుగుతోంది. గతంలో మాదిరి కాకుండా నేటి యువత ప్రైవేటు రంగంలోనే ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. లేదంటే సొంత వ్యాపారాలు, ఇతర స్వయం ఉపాధి మార్గాలతో స్థిరపడుతున్నారు. జీవించి ఉన్నంత కాలం ఉద్యోగ, వ్యాపారాలు నిర్వహించలేం. ఉద్యోగంలో అయితే 58 ఏళ్లకు దిగిపోవాల్సిందే. స్వయం ఉపాధిలోని వారికి వయో పరిమితి లేదు. అయినా కానీ ఏదో ఒక రోజు చేస్తున్న పనికి విరామం పలకాల్సిందే. శారీరక, ఆరోగ్య పరమైన మార్పులు మునుపటి మాదిరిగా పనిచేయనీయవు. కనుక వృద్ధాప్యంలో పనికి విరామం పలికిన తర్వాత జీవన అవసరాలను తీర్చుకోవడం ఎలా అన్నది ముందే ఆలోచించాలి. దీనివల్ల విశ్రాంత రోజుల్లో ప్రశాంతమైన జీవనానికి అవకాశం లభిస్తుంది. ఈ అంశంపై ‘మనీ పాత్శాల’ వ్యవస్థాపకులు వివేక్ లా ఏం చెబుతున్నారో చూద్దాం... రిటైర్మెంట్ అనేది తప్పనిసరి దీర్ఘకాల ప్రణాళిక. అంతేకాదు, జీవితంలో ఖరీదైన లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత మరో 20–30 ఏళ్లు జీవించాల్సి రావడం, అందుకు కావాల్సినంత నిధిని సమకూర్చుకోవడం చిన్న విషయం కాదు. దీనికి డబ్బు విలువను హరించే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొనే స్థాయిలో రిటైర్మెంట్ కోసం కేటాయింపులు చేసుకోవాలి. చేస్తున్న పనికే రిటైర్మెంట్ కానీ, మన జీవన అవసరాలకు కాదు. ఉద్యోగం/వ్యాపారం ఆగిపోయినా, మన జీవన అవసరాలను తీర్చే ఆదాయం ఆగిపోకూడదని అనుకుంటే అందుకు ముందు నుంచి తగిన ఏర్పాట్లు ఉండాలి. ఆర్జన ఆరంభించిన వెంటనే రిటర్మెంట్ ప్రణాళిక మొదలు పెట్టాలి. నిజానికి చాలా మంది యువత దీని ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదు. దీంతో రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎంతో మందికి సవాలుగా మారుతోంది. వాయిదా సరికాదు.. రిటైర్మెంట్ ఆలస్యం చేసిన కొద్దీ లక్ష్యం భారంగా మారుతుంది. పెట్టుబడి ఎంత ముందుగా ప్రారంభిస్తే కాంపౌండింగ్ ప్రయోజనంతో దీర్ఘకాలంలో అది మంచి నిధిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పెట్టుబడి ఎన్నో రెట్లు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయసు నుంచే ప్రతి నెలా రూ.5,000 చొప్పున 60 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేస్తే.. 35 ఏళ్ల కాలంలో ఎంత సమకూరుతుంది? 12% కాంపౌండింగ్ రాబడి అంచనా ప్రకారం రూ.3.24 కోట్లు సమకూరుతుంది. కేవలం నెలకు రూ.5వేలు అంత పెద్ద నిధిగా మారిందంటే అదే కాంపౌండింగ్ మహిమ. ఒకవేళ ఈ పెట్టుడిని ఒక ఏడాది ఆలస్యంగా మొదలు పెట్టారని అనుకుందాం. అంటే 26 ఏళ్లకు ఇన్వెస్ట్మెంట్ మొదలైతే రూ.37 లక్షలు తక్కువ మొత్తం సమకూరుతుంది. ఏడాది ఆలస్యం చేయడం వల్ల ఏర్పడిన నష్టం రూ.37 లక్షలు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడని, అన్నింటికంటే ముందు ఆరంభించే పెట్టుబడి ప్రణాళిక రిటైర్మెంట్ ఫండ్ కావాలి. ఉపసంహరించుకునే దశ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే, రిటైర్మెంట్ తర్వాత సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతీ నెలా నిర్ణయించుకున్న మేర బ్యాంకు ఖాతాకు జమ అవుతుంటుంది. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లోనే ఉంచడం వల్ల రాబడులతో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణ నష్టం నుంచి రిటైర్మెంట్ ఫండ్ విలువను కాపాడుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక రిటైర్మెంట్ నాటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై పన్ను భారం ఉండదు. అయితే ఈ మొత్తాన్ని తిరిగి మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడే మిగిలిన 30 ఏళ్ల జీవన అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి వృద్ధిని చేసుకోవచ్చు. ప్రణాళిక విషయంలో ఆర్థిక నిపుణుడి సేవలు తప్పకుండా తీసుకోవాలి. రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునే విషయంలో భయం, ఊహాజనిత, ఉద్రేకాలకు అవకాశం ఇవ్వకుండా, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. గృహ రుణం ఇంకా తీర్చాల్సి ఉన్నా లేదా తమపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నా.. రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కొన్ని రకాల రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. గృహ రుణం తీరేంత వరకు, తమ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడే కాలానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ 45–55 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుని ప్రపంచమంతా తిరిగి రావాలి? ఇది కొందరి లక్ష్యం కావచ్చు. కానీ, 60 ఏళ్లు వచ్చే నాటికి అయినా దీన్ని సాధించగలిగారా? అని ప్రశ్నిస్తే.. ఎక్కువ మంది నుంచి లేదన్నదే సమాధానం వస్తుంది. సంపాదన మొదలైన నాటి నుంచే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, మనలో చాలా మంది ఆర్జించే మొత్తం చెప్పుకోతగ్గ గొప్పగా ఉండదు. దీంతో పరిమిత ఆర్జన, అవసరాల నడుమ.. రిటైర్మెంట్ 60 ఏళ్లప్పుడు కదా, తర్వాత చూద్దాంలే? అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. యుక్త వయసు, ఆరోగ్యం సహకరిస్తున్న రోజుల్లోనే అలా అనుకుంటే.. వృద్ధాప్యానికి చేరువ అవుతున్న సమయంలో రిటైర్మెంట్ ఫండ్ వంటి భారీ లక్ష్యం ఎలా సాధ్యపడుతుంది? ఒక్కసారి ఆలోచించాలి. పిల్లల విద్య, వారి వివాహం, ఇతర బాధ్యతలతో రిటైర్మెంట్కు ముందు వరకు చాలా మంది తీరిక లేకుండా ఉంటారు. కనుక ఏ లక్ష్యాన్నీ నిర్లక్ష్యం చేయడానికి, వాయిదా వేయడానికి లేదు. 25–30 ఏళ్ల కెరీర్లో రోజువారీ అవసరాల్లో ఎలాంటి రాజీ పడకుండా, రిటైర్మెంట్కు కావాల్సినంత నిధిని సమకూర్చుకోవడం ఎలా? ఆర్థిక ప్రణాళిక ఇందుకు మార్గం చూపుతుంది. జీవితంలో ఏవి కావాలని కోరుకుంటున్నారు? అందుకోసం ఏం చేయాలి, ఎలా చేయాలనేది? ఆర్థిక ప్రణాళిక స్పష్టం చేస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం. కారణాలు ఏవైనా, రిటైర్మెంట్ నాటికి కావాల్సినంత నిధి సమకూర్చుకోలేకపోతే తిరిగి మునుపటి మాదిరి యువకుల్లా పనిచేయడం సాధ్యపడదు? అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. ఉదాహరణకు మీరు 60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటారని అనుకుంటే, 90 ఏళ్ల వరకు జీవించి ఉండేట్టు అయితే కనీసం 30 ఏళ్ల అవసరాలకు సరిపడా నిధి అవసరమవుతుంది. ఇది చాలా పెద్ద లక్ష్యమే అనడంలో సందేహం లేదు. ఆరోగ్య సంరక్షణ అవసరాలు, పిల్లల విద్య, వారి వివాహాలు, వృద్ధాప్యంలో జీవన అవసరాలు, ద్రవ్యోల్బణం వల్ల పెరిగిపోయే జీవన వ్యయాలను విస్మరించడానికి లేదు. ఉదాహరణకు రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా అవసరాలు తీర్చుకునేందుకు రూ.3 లక్షలు కావాలని అనుకుంటే.. ఏటా 7 శాతం ద్రవ్యోల్బణం అంచనా ఆధారంగా రూ.10 కోట్ల నిధిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 35 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్మెంట్ ఆరంభించారని అనుకుంటే.. 60 ఏళ్ల వయసు వచ్చే నాటికి మీ చేతిలో 25 ఏళ్లు మిగిలి ఉంటుంది. ఇందుకు గాను ప్రతి నెలా రూ.55,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏటా 12% చొప్పున వృద్ధిని చూస్తుందనుకుంటే 60 ఏళ్ల నాటికి రూ.10 కోట్లు సమకూరుతుంది. అందుకే మొదటి నెల వేతనం నుంచే రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవడానికి తొలి అడుగు పడాలి. తల్లిదండ్రులు లేదా తాతలు ప్రభుత్వరంగంలో ఉద్యోగులుగా పనిచేసి రిటైర్మెంట్ అవ్వడంతో, వారికి పెన్షన్ సదుపాయం ఉండేది. కానీ మన పరిస్థితి అలా కాదు. గ్యారంటీడ్ పెన్షన్ అనేది లేదు. ఎవరికి వారే సొంతంగా నిధిని సమకూర్చుకుని, దానిపై ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడంతో మన దేశంలో సగటు ద్రవ్యోల్బణం 4–6 శాతం మధ్యలో ఉంటుందని అంచనా. అంటే నేడు పాకెట్లో ఉన్న రూ.1000 విలువ ఏడాది తర్వాత రూ.96కు తగ్గుతుంది. ఇలా తరిగిపోయే విలువకు తగిన రక్షణగా అదనపు పెట్టుబడి అవసరం ఉంటుంది. మిగులు లేదని చెప్పుకోవద్దు.. రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి వెసులుబాటు లేదని కొందరు చెబుతుంటారు. తర్వాత వీలు చూసుకుని మొదలు పెడదామని, అనుకుంటూ ఉంటుంటారు. కానీ, విలువైన సమయాన్ని వృధా చేసిన తర్వాత ప్రతి నెలా ఎంత మొత్తం పొదుపు చేసినా అది గణనీయమైన వృద్ధిని చూడడానికి కావల్సిందన వ్యవధి ఉండదు. ఇంతకుముందు చెప్పుకున్న ఉదాహరణలోనే 25 ఏళ్లకు కాకుండా, తీరిగ్గా 45 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెటు మొదలు పెట్టారని అనుకుందాం. ప్రతి నెలా రూ.50,000 చొప్పున అక్కడి నుంచి 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే.. 12 శాతం కాంపౌండింగ్ రాబడి చొప్పున 2.5 కోట్లు సమకూరుతుంది. 25 ఏళ్ల వయసులో ఆరంభించడం వల్ల కేవలం ప్రతి నెలా రూ.5వేలతోనే రిటైర్మెంట్ నాటికి రూ.3.24 కోట్లు సమకూరుతుంటే.. 20 ఏళ్లు ఆలస్యంగా మొదలు పెట్టడం వల్ల ప్రతి నెలా రూ.50వేల చొప్పున పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అప్పటికీ సమకూరే మొత్తం కేవలం రూ.2.5 కోట్లు కావడాన్ని గమనించాలి. సమకూర్చుకునేది ఎలా? రిటైర్మెంట్ ప్రణాళికలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి రిటైర్మెంట్ సమయం వచ్చేంత వరకు కావాల్సిన నిధిని సమకూర్చుకోవడం. రిటైర్మెంట్ తర్వాత ఆ నిధి నుంచి ప్రతి నెలా రాబడి పొందడం రెండోది అవుతుంది. 25–30 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది కనుక, పెట్టుబడులకు ఈక్విటీలను మెరుగైన మార్గంగా చూడాలి. దీర్ఘకాలంలో ఈక్విటీలను మించి కాంపౌండెడ్ రాబడులను ఇచ్చిన మెరుగైన సాధనం మరొకటి లేదనే చెప్పుకోవాలి. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఎన్‌పీఎస్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్థిక సలహాదారు సూచనలను తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. నిపుణుల సాయంతో రాబడుల అంచనాలు, కాల వ్యవధి ఆధారంగా పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్కు సమయం దగ్గర పడుతుండగా, ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకుని, డెట్‌కు మళ్లించుకోవడంలో ఆర్థిక సలహాదారు సాయపడతారు. తద్వారా మీ లక్ష్యాలు నెరవేరతాయి. ఉపసంహరించుకునే దశ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే, రిటైర్మెంట్ తర్వాత సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతీ నెలా నిర్ణయించుకున్న మేర బ్యాంకు ఖాతాకు జమ అవుతుంటుంది. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లోనే ఉంచడం వల్ల రాబడులతో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణ నష్టం నుంచి రిటైర్మెంట్ ఫండ్ విలువను కాపాడుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక రిటైర్మెంట్ నాటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై పన్ను భారం ఉండదు. అయితే ఈ మొత్తాన్ని తిరిగి మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడే మిగిలిన 30 ఏళ్ల జీవన అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి వృద్ధిని చేసుకోవచ్చు. ప్రణాళిక విషయంలో ఆర్థిక నిపుణుడి సేవలు తప్పకుండా తీసుకోవాలి. రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునే విషయంలో భయం, ఊహాజనిత, ఉద్రేకాలకు అవకాశం ఇవ్వకుండా, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. గృహ రుణం ఇంకా తీర్చాల్సి ఉన్నా లేదా తమపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నా.. రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కొన్ని రకాల రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. గృహ రుణం తీరేంత వరకు, తమ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడే కాలానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. -
Insurance Fraud Survey 2023: బీమాలో పెరుగుతున్న మోసాలు
న్యూఢిల్లీ: బీమా సంబంధిత మోసాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని బీమా సంస్థలు భావిస్తున్నాయి. ఈ విధమైన మోసాల రిస్క్ నేపథ్యంలో.. చురుకైన రిస్క్ నిర్వహణ విధానం అవసరమని అవి భావిస్తున్నట్టు డెలాయిట్ సర్వే నివేదిక వెల్లడించింది. జీవిత బీమా, ఆరోగ్య బీమాలో మోసాలు పెరిగిపోవడాన్ని బీమా సంస్థలు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. డిజిటైజేషన్ పెరిగిపోవడం, కరోనా తర్వాత మారుమూల ప్రాంతాల నుంచి పనిచేస్తుండడం, నియంత్రణలు బలహీనపడడం వంటివి మోసాలు పెరిగిపోవడానికి కారణాలుగా డెలాయిట్ ‘ఇన్సూరెన్స్ ఫ్రాడ్ సర్వే 2023’ నివేదిక వెల్లడించింది. మోసాలు భారీగా పెరిగిపోయాయని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది బీమా కంపెనీల ప్రతినిధులు చెప్పగా, మోస్తరుగా ఉన్నట్టు 10 శాతం మంది తెలిపారు. 2020 జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు. బీమా సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగుల అభిప్రాయాలను డెలాయిట్ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలు బీమా రంగంలో వేగం, మెరుగైన కస్టమర్ అనుభవం, సులభ వినియోగానికి సాయపడినట్టు డెలాయిట్ తెలిపింది. అదే సమయంలో రిస్క్‌లు సైతం పెరిగినట్టు పేర్కొంది. డేటా చోరీ, థర్డ్ పార్టీల కుమ్మక్కు, బీమా ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయించడం అన్నవి బీమా రంగానికి ఆందోళనకర అంశాలుగా ప్రస్తావించింది. ఈ మోసాలను అధిగమించేందుకు వ్యూహాత్మక జోక్యం, బీమా కార్యకలాపాల నిర్వహణపై ఉన్నతస్థాయి మేనేజ్మెంట్ దృష్టి సారించడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసమని సూచించింది. తిరిగి ఆవిష్కరించుకోవాలి.. ‘‘భారత బీమా రంగం డిజిటల్ విప్లవం ఆరంభ దశలో ఉంది. వేగవంతమైన వ్యాపార కార్యకలాపాలు, కస్టమర్లను సొంతం చేసుకోవడం, టెక్నాలజీతో కూడిన అనుభవాన్ని అందించేందుకు ఇతర రంగాల మాదిరే బీమా పరిశ్రమ సైతం తనను తాను తిరిగి ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’’అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లీడర్ సంజయ్ దత్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ కంపెనీ బోర్డ్, యజమాన్యానికి మోసాల నివారణ ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు 40 శాతం జీవిత బీమా, ఆరోగ్య బీమా కంపెనీల ప్రతినిధులు ఈ సర్వేలో తెలిపారు. మిగిలిన బీమా కంపెనీల ప్రతినిధులు సైతం తమ ప్రాధాన్య అంశాల్లో మోసాల నివారణ కూడా ఒకటిగా పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పటిష్టమైన మోసాల నివారణ కార్యాచరణ అవసరమని ఈ సర్వే నివేదిక ప్రస్తావించింది. -
టర్మ్ పాలసీల్లో పట్టణ ప్రజలు మెరుగు
న్యూఢిల్లీ: టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో మెట్రోలతో పోలిస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ప్రజలు వివేకాన్ని ప్రదర్శిస్తున్నారు. జైపూర్, పాట్నా, పుణె తదితర పట్టణాల్లో ఎక్కువ మంది ప్రజలు అచ్చమైన బీమా ఉత్పత్తిగా పరిగణించే టర్మ్ ప్లాన్లను తీసుకుంటున్నట్టు మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన ‘ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్ సర్వే’లో తెలిసింది. ఇక్కడ ఏజెంట్ల ద్వారా టర్మ్ ప్లాన్లను ఎక్కువ మంది తీసుకుంటుంటే, అదే సమయంలో ఆన్లైన్ చానళ్లపైనా గణనీయమైన సంఖ్యలో కొనుగోలు చేస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 25 పట్టణాల్లో 3,500 మంది ప్రజల అభిప్రాయాలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. జీవిత బీమా ఉత్పత్తుల పట్ల విజ్ఞానం పట్టణ ప్రజల్లో 2019లో 39గా ఉంటే, అది తాజా సర్వేలో 57కు పెరిగింది. జీవిత బీమా ఉత్పత్తులను కలిగి ఉన్న వారిలోనూ 8 శాతం వృద్ధి కనిపించింది. 73 శాతానికి చేరింది. టర్మ్ ఇన్సూరెన్స్ విలువను అర్థం చేసుకోవడం మొదలైందని, మరింత మందికి దీన్ని చేరువ చేసేందుకు జీవిత బీమా పరిశ్రమ కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
ఎగాన్ లైఫ్ ఐ టర్మ్ ప్లాన్.. స్వయం ఉపాధిలోని వారికి ప్రత్యేకం
హైదరాబాద్: స్వయం ఉపాధిలోని వారిని దృష్టిలో ఉంచుకుని ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘ఐటర్మ్ ప్రైమ్ ఇన్సూరెన్స్’ ప్లాన్‌ను విడుదల చేసింది. వీరికి 10 శాతం ప్రీమియం తగ్గింపు ఇవ్వనుంది. 5 శాతం ఆన్లైన్ డిస్కౌంట్‌కు మరో 5 శాతం ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ తగ్గింపు మొదటి ఏడాది ప్రీమియంకే పరిమితం. కనీసం రూ.25 లక్షల సమ్ అష్యూర్డ్‌ను ఈ ప్లాన్ కింద పొందొచ్చని, గరిష్ట పరిమితి లేదని ఏగాన్ లైఫ్ ప్రకటించింది. ఏగాన్ లైఫ్ వెబ్ పోర్టల్ నుంచి, తన భాగస్వాముల నుంచి కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదని, అప్లోడ్ కూడా చేయనవసరం లేదని, దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లో చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో ‘స్పెషల్ ఎగ్జిట్ వ్యాల్యూ’ ఆప్షన్ ఉందని, పాలసీదారు 55 ఏళ్ల వయసుకురాగానే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం అంతా వెనక్కి వస్తుందని పేర్కొంది. 99.03 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పరిశ్రమలో మెరుగైన స్థానంలో ఉన్నట్టు ప్రకటించింది. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ కవర్లను జోడించుకోవచ్చని తెలిపింది. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
అంతర్వేది రథం దగ్ధం కేసులో రూ.84 లక్షల బీమా పరిహారం
కాకినాడ లీగల్: అంతర్వేది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథం అగ్నికి ఆహుతి అయిన కేసులో రూ.84 లక్షల బీమా పరిహారం ఇవ్వాలని కాకినాడ వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రఘుపతి వసంతకుమార్, సభ్యులు చక్కా సుశీ, చాగంటి నాగేశ్వరరావు తీర్పు చెప్పారు. ప్రమాదవశాత్తు రథం దగ్ధమైన కేసులో అంతర్వేది శ్రీలక్ష్మీనారాయణ దేవస్థానం తరఫున ఎగ్జిక్యూటివ్ అధికారులు కాకినాడ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. రూ.84 లక్షల పరిహారం, నష్టాల కింద రూ.15 లక్షలను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాలని కోరారు. రథం ఘటన ప్రమాదం కాదంటూ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ తరఫు న్యాయవాది వాదించారు. కాకినాడ కోర్టు పరధిలోకి ఈ కేసు రాదన్నారు. దీనిపై ఎండోమెంట్ ప్యానల్ న్యాయవాది జీవీ కృష్ణప్రకాష్ వాదిస్తూ భగవంతుడు సర్వాంతర్యామి అని, కాకినాడలో ఎండోమెంట్ కార్యాలయం ఉందని, అందువల్ల కేసును కాకినాడ కోర్టులోనే విచారించాలన్నారు. వాదోపవాదనల అనంతరం రూ.84 లక్షల పరిహారంతో పాటు రూ.30 వేలు ఖర్చుల కింద 45 రోజుల్లోపు బీమా కంపెనీ చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. హెచ్ఆర్సీకి 9 నుంచి సంక్రాంతి సెలవులు కర్నూలు(సెంట్రల్): స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్(హెచ్ఆర్సీకి)కి ఈ నెల 9 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం కమిషన్ కార్యదర్శి ఎస్.వెంకటరమణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పాత కేసుల వాయిదా, విచారణ, అత్యవసర కేసుల నిమిత్తం వెకేషన్ కోర్టులను నిర్వహిస్తారు. 9, 10, 11 తేదీల్లో కమిషన్ చైర్మన్ ఎం.సీతారామమూర్తి, 12, 13 తేదీల్లో కమిషన్ జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వెకేషన్ కోర్టు నడుస్తుంది. 14, 15, 16 తేదీల్లో పూర్తి సెలవు ఉండగా.. 17వ తేదీన కమిషన్ నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెకేషన్ కోర్టు ఉంటుంది. 18వ తేదీ నుంచి యధాతథంగా హెచ్ఆర్సీ కార్యకలాపాలు జరుగుతాయి. ఇదీ చదవండి: TDP Drama: ఛీ..ఛీ.. మరీ ఇంత అన్యాయమా! -
ఉన్నట్టుండి చేస్తున్న ఉద్యోగం పోతే ఎలా?
ఆర్థిక మాంద్యం భయాలు మరో విడత కంపెనీలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలుగా పిలుచుకునే గూగుల్, ఫేస్ బుక్, అమెజాన్ అనే కాదు.. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఐటీ, ఇతర రంగాల్లోని కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. భారత్‌లో అమెజాన్, ట్విట్టర్ ఇప్పటికే కొంత మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగానికి భద్రత తక్కువే. పని చేయించుకునే సంస్థలు, ప్రతికూల పరిస్థితుల్లో నిర్దాక్షిణ్యంగా సాగనంపుతాయి. కనుక ఎవరికి వారు తమవంతుగా భద్రత కల్పించుకోవాల్సిందే. ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైతే ఎలా నెగ్గుకురావాలో ప్రణాళిక ఉండాలి. అందుకు ముందు నుంచే సన్నద్ధమై, దానికంటూ ఓ బడ్జెట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నిశ్చింతగా ఉండగలరు. ఉపాధి కోల్పోయినప్పుడు మన ముందున్న మార్గాలేంటి? ముందస్తు సన్నాహేలేంటన్నది తెలియజేసే కథనమే ఇది. వ్యయాలపై నియంత్రణ కనీసం మీ వద్ద 3–4 నెలల అవసరాలు, రుణ ఈఎంఐల చెల్లింపులకు సరిపడా ఉంటే ఏమాత్రం ఆందోళన అక్కర్లేదు. అప్పుడు ఉన్న వనరులను జాగ్రత్తగా వినియోగించుకునే ప్రణాళిక ఉంటే సరిపోతుంది. అంత మేర లేకపోతే అప్పుడు ప్రత్యామ్నాయాలను చూడాలి. మన ఆర్జన ఆగినా, రుణానికి చెల్లింపులు చేస్తూనే ఉండాలి. నెలవారీ ఇంటి అద్దె, మొబైల్, డిష్ బిల్లుల విషయంలో రాజీపడలేరు. కనుక ఇతర వ్యయాలపై నియంత్రణ ఒక్కటే మార్గం. అందుబాటులో ఉన్న వనరులు ఎన్ని, దాంతో ఎన్ని నెలలు నెట్టుకురావచ్చన్న అంచనాకు రావాలి. బయట రెస్టారెంట్లలో తినడాలు, పర్యటనలు, సెలవుల్లో ఊర్లకు వెళ్లడాన్ని వాయిదా వేసుకోవాలి. వ్యక్తిగత వాహనాన్ని ఇంట్లోనే పెట్టేసి ప్రజా రవాణాను వినియోగించుకోవచ్చు. వారాంతపు పార్టీలకు విరామం పలకాలి. సినిమాల కోసం థియేటర్లకు వెళ్లడం మానేయాలి. మరీ కష్టంగా ఉంటే పెట్టుబడులను సైతం నిలిపివేసుకోక తప్పదు. పెట్టుబడుల ఉపసంహరణ – రుణ మార్గం ఉద్యోగం పోయిందని చెప్పి కంగారుగా పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసుకోవద్దు. సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారు ముందుగా రెండు నెలల అవసరాలకు సరిపడా వెనక్కి తీసుకోవాలి. బ్యాంకులో ఎఫ్డీ ఉంటే దాన్ని రద్దు చేసుకోవడం తప్పేమీ కాదు. ఆర్జన ఉండి, నెలవారీ చెల్లింపులు చేయగలిగినప్పుడే రుణాలు తీసుకోవడం సరైనది అవుతుంది. ఆర్జన నిలిచిపోయిన సమయాల్లో కొత్తగా రుణం తీసుకోకుండా ఉండడమే మెరుగైన మార్గం అవుతుంది. కానీ, పొదుపు లేనప్పుడు, మరో మార్గం లేకపోతే చివరిగా రుణాన్ని తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో బంగారంపై తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది. దీనిపై నెలవారీగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. వీటి గడువు ఏడాది, రెండేళ్లు ఉంటుంది. గడువు ముగిసిన రోజున అసలు చెల్లించడం లేదంటే తిరిగి అంతే కాలానికి రెన్యువల్ చేసుకోవచ్చు. జీవిత బీమా పాలసీపైనా రుణ సదుపాయం పొందొచ్చు. దీనిపైనా వడ్డీ రేటు తక్కువే. ఒక నెలపాటు ఉపాధి లేని వారు ఈపీఎఫ్ నిధి నుంచి 75 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. తిరిగి ఉద్యోగం లభించిన తర్వాత పాత ఖాతాను కొత్త సంస్థకు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. పాత నిబంధనల ప్రకారం అయితే రెండు నెలల పాటు ఉపాధి లేకుండా ఉంటే ఈపీఎఫ్ నిధి నుంచి మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించే వారు. అందుబాటులోని మార్గాల్లో తమకు ఏది అనుకూలమైనదో నిర్ణయించుకుని ముందుకు వెళ్లాలి. బీమా రక్షణ అవసరం జాబ్ లాస్ ఇన్సూరెన్స్ అంటూ ఒకటి ఉందని మెజారిటీ ఉద్యోగులకు తెలియని విషయం. కేవలం కొన్ని కంపెనీలే వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో చాలా పరిమితులు ఉంటాయి. రుణ చెల్లింపుల బాధ్యతలు ఎక్కువగా ఉన్న వారికి ఇవి అనుకూలం. ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన సందర్భాల్లో మూడు నెలల ఈఎంఐలకు సరిపడా చెల్లింపులు చేస్తాయి. ఇలా చెల్లించే మొత్తం అప్పటి వరకు పొందిన నెలవారీ వేతనంలో 50 శాతం మించకుండా ఉంటుంది. ఈ పాలసీ వార్షిక ప్రీమియం తాము పొందే వేతనంలో 5 శాతంలోపు ఉంటేనే తీసుకోవాలి. అంతకుమించి ప్రీమియం ఉంటే అది లాభదాయకం కాదు. ఇతర పాలసీలకు అనుబంధంగాం వీటిని బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ప్రమాదం కారణంగా శాశ్వత, పాక్షిక అంగవైకల్యానికి గురై ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడిన సందర్భాల్లోనూ ఇవి చెల్లింపులు చేస్తాయి. ఈ విషయంలో జాగ్రత్త జాబ్ లాస్ ఇన్సూరెన్స్‌లో ఉన్న ప్రధాన ప్రతిబంధకం.. కంపెనీ తొలగించిన సందర్భాల్లోనే వీటి కింద పరిహారం లభిస్తుంది. ఈ ప్లాన్లు ఆదరణకు నోచుకోకపోవడానికి ఇదే ముఖ్య కారణమని చెప్పుకోవాలి. కానీ, స్వచ్చందంగా ఉద్యోగం మానేసే వారు ముందుగానే సన్నద్ధమై ఆ పనిచేయవచ్చు. ఉన్నట్టుండి కంపెనీ తొలగించినప్పుడే కదా బీమా అవసరం ఏర్పడేది. మురో ముఖ్యమైన అంశం.. పనితీరు బాగాలేదని చెప్పి తొలగించినట్టయితే పరిహారానికి అర్హత లభించదు. కంపెనీల మధ్య విలీనం, కొనుగోలు కారణంగా తప్పించినప్పుడు కూడా బీమా కంపెనీలు పరిహారాన్ని తిరస్కరిస్తున్నాయి. పాలసీ తీసుకునే ముందు షరతులు, నియమ, నిబంధనలు, మినహాయింపులు అన్నీ చదివి తెలుసుకోవాలి. కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించిందనే దానికి ఆధారంగా ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా, పరిహారం లభిస్తుందా? అన్నది కనుక్కోవాలి. కాంట్రాక్టు ఉద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారికి ఈ పాలసీలు ఇవ్వరు. ఆయా అంశాల్లో నిపుణుల సూచనలు అవసరం. ఈఎస్ఐసీ బీమా.. సంఘటిత రంగంలో పనిచేస్తూ, ఈఎస్ఐసీ కిందకు వచ్చే వారికి రాజీవ్ గాంధీ శ్రామిక్ కల్యాణ్ యోజన (ఆర్జీఎస్కేవై) పథకం ఒకటి ఉంది. దీని కింద ఉపాధిని కోల్పోయిన వారికి రెండేళ్లపాటు పరిహారం లభిస్తుంది. అప్పటి వరకు పొందిన వేతనంలో 50 శాతం ఏడాది పాటు, 13వ నెల నుంచి 24వ నెల వరకు 25 శాతం చొప్పున చెల్లిస్తారు. అదే కాలంలో ఈఎస్ఐ హాస్పిటల్స్, డిస్పెన్సరీల్లో ఉచిత వైద్య సదుపాయాలు కూడా లభిస్తాయి. తన తప్పిదం లేకుండా ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన వారు 30 రోజుల్లోపు దీనికి దరఖాస్తు చేసుకోవాలి. రూ.21వేల వేతనంలోపు వారికే ఈఎస్ఐ సదుపాయం పరిమితం. ఇంతకుమించి వేతనం ఉన్న వారు ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందే. వీటిని మిస్ కాకూడదు కష్టకాలంలో రుణ ఈఎంఐలను చెల్లించకపోతే, అది వ్యక్తిగత రుణ చరిత్రలో పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. భవిష్యత్తులో రుణం లభించడం కష్టంగా మారుతుంది. ఒకవేళ వచ్చినా, అధిక రుణ రేటును చెల్లించాల్సి రావచ్చు. అందుకుని ఈఎంఐ చెల్లింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపివేయకూడదు. అలాగే, బీమా పాలసీల ప్రీమియం చెల్లింపుల్లోనూ విఫలం కావద్దు. ఒకవేళ పెట్టుబడులకు సంబంధించి ఆటోడెబిట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటే వాటిని వెంటనే నిలిపివేయడం సరైనది. ఇదీ ఒక అవకాశమే ఉపాధి లేనప్పుడు చేతిలో బోలెడంత సమయం ఉంటుంది. దీన్ని ఒక అవకాశంగా తీసుకుని, తమ నైపుణ్యాలను మరింత పెంచుకునే మార్గాలను చూడొచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మరింత వేతనంతో కూడిన అవకాశాలను సొంతం చేసుకోవడమే కాకుండా, ఇతరులతో పోలిస్తే మెరుగైన వృద్ధిని చూడగలరు. ఆర్జన ఆగిందని చెప్పి, ఆందోళనతో ఉండిపోకూడదు. అవకాశాలను వెతుక్కోవాలి. అప్పటి వరకు తాము పనిచేస్తున్న రంగంలోని పని పరిస్థితులు నచ్చని వారికి.. ఉద్యోగం కోల్పోయినప్పుడు ఇతర నైపుణ్యాలతో వేరే రంగంలోని ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. అత్యవసర నిధి ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత ఉండదు. ఊహించని విధంగా ఎప్పుడైనా ఉద్యోగం కోల్పోయినా.. లేదా నచ్చక మానేసినా అత్యవసర నిధి ఆదుకుంటుంది. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక సలహాదారులు తరచూ సూచించేంది ముందు చూపుతోనే. దీన్ని ఆచరణలో పెట్టిన వారు నిశ్చితంగా ఉండొచ్చు. ప్రతికూల పరిస్థితులను సులభంగా అధిగమించొచ్చు. అత్యవసర నిధిని లిక్విడ్ ఫండ్స్ లేదంటే బ్యాంకు ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అత్యవసర నిధి ఆరు నెలలు లేదా ఏడాది అవసరాలకు సరిపడా ఉండాలన్నది కేవలం ఒక సాధారణ సూత్రమే. ఆర్థిక బాధ్యతలు అందరికీ ఒకే విధంగా ఉండవు. ఎంత కాలం అవసరాలకు సరిపడా సమకూర్చుకోవాలన్నది వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను బట్టే ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం కోల్పోయిన సమయంలో అత్యవసర నిధిని వివేకంగా ఖర్చు చేయడం కూడా అవసరం. ఎందుకంటే తిరిగి మళ్లీ ఉద్యోగం సంపాదించి, కుదురుకోవడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేం. ఇలా ఖర్చు చేసిన మేర, తిరిగి ఉద్యోగం పొందిన తర్వాత సమకూర్చుకోవడం అంతే ముఖ్యం. ఆదాయ మార్గాలు ఉద్యోగం కోల్పోయినప్పుడు సహజంగా తిరిగి ఉపాధి కోసం అన్వేషణ మొదల పెడుతుంటారు. మరో ఉపాధి లభించేంత వరకు రోజులు వృథా కాకుండా, తాత్కాలిక పనిలో అయినా కుదరడం మంచి నిర్ణయం అవుతుంది. దీనివల్ల కుటుంబ వ్యయాలకు ఎంతో కొంత సమకూర్చుకోవచ్చు. ఈ కామర్స్, రిటైల్ రంగంలో తాత్కాలిక ఉపాధి అవకాశాలను పొందొచ్చు. నైపుణ్యాలు ఉండి, తక్కువ వేతనానికి పనిచేస్తానంటే ఆర్థిక సంక్షోభ సమయాల్లో కొన్ని కంపెనీలు ఉపాధి కల్పిస్తుంటాయి. అలాంటివి మార్గాలను అన్వేషించొచ్చు. తక్కువ వేతనానికి ఎందుకు చేరాలి? మంచి ఉద్యోగమే చూసుకుందాం! అని కాకుండా, మంచి ఉద్యోగ ఆఫర్‌ను గుర్తించేంత వరకు ఇలాంటి సంస్థల్లో చేరిపోవచ్చు. తమ నైపుణ్యాలకు అనుగుణంగా ఏదో ఒక తాత్కాలిక ఉపాధి పొందడం నేడు అంత కష్టమైన పనికాదు. హెల్త్ ఇన్సూరెన్స్ ముందే అనుకున్నట్టు ప్రైవేటు రంగంలో ఎప్పుడైనా ఉద్యోగం పోవచ్చు. మెరుగైన వేతనం, పని పరిస్థితుల కోసం సంస్థను మార్చొచ్చు. ఇలా తరచూ కంపెనీలను మార్చే వారికి ఆయా సంస్థలు అందించే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌పైనే ఆధారపడడం అంత సురక్షితం అనిపించుకోదు. సంస్థను బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు, కవరేజీ భిన్నంగా ఉంటాయి. కొన్ని సంస్థలు అసలు హెల్త్ ఇన్సూరెన్స్నే ఆఫర్ చేయడం లేదు. ఒక ఉద్యోగి వ్యక్తిగత ఆరోగ్య అవసరాల గురించి కంపెనీలకు అవగాహన ఉండదు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా దీర్ఘకాల వ్యాధులు, జీవనశైలి వ్యాధులు ఉండొచ్చు. లేదంటే తమ కుటుంబంలో ఈ విధమైన వ్యాధుల చరిత్ర ఉండొచ్చు. అలాంటి వారి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాలు ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. కనుక కంపెనీలు అందించే గ్రూప్ హెల్త్ ప్లాన్‌తో సంబంధం లేకుండా.. ప్రతి ఉద్యోగి అవివాహితులు అయితే ఇండివిడ్యువల్, పెళ్లయిన వారు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవాలి. ఇలా తీసుకునే ప్లాన్ తమ అవసరాలు అన్నింటినీ తీర్చే విధంగా జాగ్రత్తపడాలి. -
స్వరా ఫైనాన్స్ కస్టమర్లకు నివాబూపా కవరేజీ
న్యూఢిల్లీ: స్వరా ఫైనాన్స్‌తో నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఒప్పందం చేసుకుంది. దీనికింద స్వరా ఫైనాన్స్ నుంచి రుణాలు తీసుకునే వారికి ‘ఎక్స్‌ప్రెస్ హెల్త్ – సీరియస్ ఇల్నెస్ ప్లాన్ బెనిఫిట్’ను ఆఫర్ చేయనుంది. ఈ ప్లాన్ ఏడాది, రెండేళ్ల కాలానికి లభిస్తుంది. స్వర ఫైనాన్స్ రుణ గ్రహీతలు ఈ ప్లాన్ తీసుకుని, ఏదైనా అనారోగ్యంతో ఐదు రోజులు, అంతకుమించి ఎక్కువ కాలానికి హాస్పిటల్లో చేరినప్పుడు.. మూడు ఈఎంఐలను నివా బూపా చెల్లిస్తుంది. నేడు గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం మందికి ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదని.. ఈ అంతరం పూడ్చేందుకు స్వరా ఫైనాన్స్‌తో కలసి ఈ పాŠల్న్తో ముందుకు వచ్చామని నివాబూపా తెలిపింది. బ్యాంకుల పరిధిలో లేని కస్టమర్లకు స్వరా ఫైనాన్స్ రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తుంటుంది. చదవండి: ముకేశ్ అంబానీ రిలయన్స్ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు.. ఆదాయం, లాభాలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలుసా? -
సీనియర్ సిటిజన్ల కోసం బజాజ్ నుంచి సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్స్
హైదరాబాద్: ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ బజాజ్ అలయాంజ్ తాజాగా సీనియర్ సిటిజన్ల కోసం ’రెస్పెక్ట్ సీనియర్ కేర్’ రైడర్‌ను ప్రవేశపెట్టింది. మూడు ప్లాన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. దీనికి ప్రీమియం రూ. 700 నుంచి రూ. 7,500 వరకూ (జీఎస్టీ కాకుండా) ఉంటుందని సంస్థ తెలిపింది. ప్లాన్‌ను బట్టి ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్ సర్వీస్, స్మార్ట్ వాచ్ ఫాల్ డిటెక్షన్, ఫిజియోథెరపి.. నర్సింగ్ కేర్ తహా హోమ్ కేర్ సర్వీసులు, మెడికల్ టెలీ–కన్సల్టేషన్ సర్వీసులు మొదలైనవి ఈ రైడర్‌తో పొందవచ్చని కంపెనీ ఎండీ తపన్ సింఘెల్ తెలిపారు. 50 ఏళ్లు పైబడి, కంపెనీ అందించే బేస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న వారు ఈ రైడర్‌ను ఎంచుకోవచ్చు. -
‘ఈ–శ్రమ’లో 78.47 లక్షల మంది
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తొలిసారిగా అసంఘటిత రంగ కార్మికుల వివరాలను ఈ–శ్రమ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది. దీనిద్వారా వారికి సామాజిక భద్రత పథకాలను వర్తింప చేయడంతో పాటు ప్రమాద బీమాను అమలు చేయనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 38 కోట్ల మంది అసంఘటిత కార్మికుల డేటాను ఈ–శ్రమ పోర్టల్ ద్వారా సేకరించాలని నిర్ణయించగా ఇప్పటివరకు 28.48 కోట్ల మంది వివరాలను నమోదు చేశారు. ఈ–శ్రమ పోర్టల్ ద్వారా వ్యక్తిగతంగా కూడా కార్మికులు వివరాలను నమోదు చేసుకోవచ్చు. సచివాలయాల ద్వారా నమోదు అసంఘటిత రంగ కార్మికులను ఈ–శ్రమ పోర్టల్‌లో నమోదు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది. గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా నిర్మాణ కార్మికులు, చేతివృత్తిదారులు, చిరువ్యాపారులతో పాటు వ్యవసాయ, వలస కూలీల వివరాలను ఈ–శ్రమ పోర్టల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 78,47,859 మంది ఈ–శ్రమ పోర్టల్‌లో నమోదు అయ్యారు. అత్యధికంగా వ్యవసాయ రంగంలో 53,38,805 మంది, నిర్మాణ రంగంలో 5,66,680 మంది కార్మికులు నమోదు అయ్యారు. వీరిలో మహిళా కార్మికులే అధికం. 55.83 శాతం మహిళా కార్మికులు, 44.16 శాతం పురుష కార్మికులు నమోదయ్యారు. ఈ–శ్రమ పోర్టల్‌లో వివరాల నమోదు పురోగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి గురువారం కలెక్టర్లతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 150.93 లక్షల మంది అసంఘటిత కార్మికులను ఈ–శ్రమ పోర్టల్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 7.16 లక్షల మంది, అత్యల్పంగా ఎన్టీఆర్ జిల్లాలో 20,893 మంది కార్మికులు ఈ–శ్రమ పోర్టల్‌లో నమోదయ్యారు. వివరాల నమోదు అనంతరం అసంఘటిత కార్మికులకు ఈ–శ్రమ కార్డు జారీ చేస్తారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు బీమా కింద అందజేస్తారు. ప్రమాదంలో పూర్తి వైకల్యం బారినపడితే రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేస్తారు. దీంతో పాటు వివిధ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలను వర్తింప చేస్తారు. ఆయా రంగాల్లో కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. -
న్యూ ఇండియా అష్యూరెన్స్ నుంచి డ్రోన్లకు బీమా..
ముంబై: డ్రోన్లకు కూడా బీమా కవరేజీ అందించేలా న్యూ ఇండియా అష్యూరెన్స్ (ఎన్ఐఏ) కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. తద్వారా ఎన్ఐఏ ఈ తరహా పాలసీలను అందించే తొలి ప్రభుత్వ రంగ బీమా సంస్థగా నిల్చింది. పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌ల నుంచి సోలో ఫ్లయింగ్ గ్లైడర్లు మొదలైన వాటికి ఈ పథకం వర్తిస్తుంది. డ్రోన్ ఓనర్లు, ఆపరేటర్లు, తయారీ సంస్థలకు కవరేజీ అందించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 15 యాడ్ ఆన్ కవర్స్ కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా ఏఐజీ జనరల్ తదితర సంస్థలు డ్రోన్ పాలసీలను అందిస్తున్నాయి. -
సుందరం ఫైనాన్స్ నుంచి కేర్ హెల్త్
చెన్నై: ఎన్బీఎఫ్సీ దిగ్గజం సుందరం ఫైనాన్స్ తమ కస్టమర్లకు ప్రత్యేకించిన ఆరోగ్య బీమా ప్రొడక్టులను అందించనుంది. ఇందుకు వీలుగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందంపై సంతకాలు చేసింది. కంపెనీకి గల విస్తారమైన నెట్వర్క్ ద్వారా కేర్ హెల్త్‌కు సంబంధించిన కొత్త తరహా బీమా సొల్యూషన్లను కస్టమర్లకు ఆఫర్ చేయనుంది. రిటైల్, గ్రూప్ విభాగాల్లో ఆరోగ్య బీమా ప్రొడక్టులను విక్రయించనుంది. టెక్నాలజీ ఆధారంగా కంపెనీ ఇప్పటికే సమకూరుస్తున్న సేవలకుతోడు కస్టమర్ల ప్రాధాన్యతకు అనుగుణమైన ఆరోగ్య బీమా ప్రొడక్టులను సైతం అందించనున్నట్లు సుందరం ఫైనాన్స్ పేర్కొంది. వెరసి వివిధ బీమా అవసరాలకు తగిన సొల్యూషన్స్‌ను ఒకే చోట సమకూర్చనున్నట్లు తెలియజేసింది. -
టాటా ఏఐఏ లైఫ్ పాలసీదారులకు కొత్త పథకం
ముంబై: టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తన యులిప్ పాలసీదారుల కోసం ‘ఎమర్జింగ్ అపార్చునిటీస్ ఫండ్’ అనే నూతన పతకాన్ని (ఎన్ఎఫ్వో) ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. మధ్య స్థాయి కంపెనీలు, భవిష్యత్తులో గణనీయమైన వృద్ధిని చూపించే కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుందని ప్రకటించింది. యులిప్ హోల్డర్లు ఈ నూతన ఫండ్ ఆఫర్ కోసం ఈ నెల 30వరకు తమ ఆప్షన్ ఇచ్చుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
బీమాలో భారీ సంస్కరణలు
న్యూఢిల్లీ: బీమా రంగంలో కీలకమైన సంస్కరణకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా కొత్త సంస్థల ప్రవేశ నిబంధనలను సడలించింది. సాల్వెన్సీ రేషియోను సైతం తగ్గించింది. దీంతో ప్రస్తు్తత బీమా సంస్థలకు అదనంగా రూ.3,500 కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి. బీమా సేవలను మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతో ఐఆర్డీఏఐ శుక్రవారం నాటి బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది. బీమా కంపెనీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేటు ఈక్విటీ సంస్థలను (పీఈ) అనుమతించింది. సబ్సి డరీలు బీమా సంస్థలకు ప్రమోటర్లుగా మారేందుకు ఓకే చెప్పింది. 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు ఐఆర్డీఏఐ ప్రకటించింది. కీలక నిర్ణయాలు.. ► బీమా రంగంలో సులభతరమైన వ్యాపార విధానాలకు వీలుగా, కొత్త సంస్థల రాకను ప్రోత్సహించేందుకు రిజిస్ట్రేషన్ నిబంధనలను సవరించనున్నట్టు ఐఆర్డీఏఐ తెలిపింది. ► కార్పొరేట్ ఏజెంట్లు ఇక మీదట గరిష్టంగా 9 బీమా సంస్థలతో టైఅప్ పెట్టుకోవచ్చు. ఈ పరిమితి ప్రస్తుతం 3గానే ఉంది. ఇన్సూరెన్స్‌ను మార్కెటింగ్ చేసే ఒక్కో సంస్థ గరిష్టంగా ఆరు బీమా సంస్థలతో ఒప్పందాలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి 2గా ఉంది. ► సాధారణ బీమా సంస్థలు తమ నిధులను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు గాను, క్రాప్ ఇన్సూరెన్స్ సాల్వెన్సీ రేషియోను 0.70 శాతం నుంచి 0.50 శాతానికి తగ్గించింది. దీనివల్ల కంపెనీలకు రూ.1,460 కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయి. ► ఇక జీవిత బీమా కంపెనీలకు సంబంధించి యూనిట్ లింక్డ్ ప్లాన్ల (యులిప్‌లు) సాల్వెన్సీ రేషియోను 0.80% నుంచి 0.60% చేసింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సాల్వెన్సీ రేషియోను 0.10% నుంచి 0.05% చేసింది. దీనివల్ల జీవిత బీమా కంపెనీలకు రూ.2,000 కోట్లు అందుబాటులోకి వస్తాయి. ► బీమా కంపెనీ చెల్లించిన మూలధనంలో ఒక ఇన్వెస్టర్ 25%, ఇన్వెస్టర్లు ఉమ్మడిగా 50% వాటా కలిగి ఉంటే ‘ఇన్వెస్టర్లు’గా పరిగణించనుంది. అంతకుమించితే ప్రమోటర్లుగా పరిగణిస్తారు. ఇప్పటి వరకు ఒక ఇన్వెస్టర్‌కు 10%, ఇన్వెస్టర్ల సమూహానికి 25% పరిమితి ఉంది. ► ప్రమోటర్లు 26 శాతం వరకు వాటాను తగ్గించుకునేందుకు కొత్త నిబంధన తీసుకొచ్చింది. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
ఇవి తెలుసుకుంటే.. మెడికల్ బిల్లుల భారం తగ్గించుకోవచ్చు!
కుమార్ ప్రైవేటు ఉద్యోగి. ఇటీవలే కడుపులో తీవ్రమైన నొప్పితో హాస్పిటల్ లో చేరాడు. పరిశీలించిన వైద్యులు పేగు సంబంధిత ఇన్ఫెక్షన్గా తేల్చారు. మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయగా, మొత్తం బిల్లు రూ.80వేలు వచ్చింది. నిజానికి కుమార్‌కు రూ.5 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ ఉంది. దాంతో అతడు నిశ్చింతగా ఉన్నాడు. కానీ, అయిన బిల్లులో బీమా కంపెనీ చెల్లించింది కేవలం రూ.49,000. మిగిలిన రూ.31,000 తను జేబు నుంచి చెల్లించాల్సి వచ్చింది. బీమా సంస్థ అంత మొత్తం ఎందుకు తగ్గించిందన్నది అతడికి అంతుబట్టలేదు. ఇది కుమార్ ఒక్కడికే ఎదురైన పరిస్థితి అనుకోవద్దు. వైద్య చికిత్సల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తమ సొంత ఖజానా నుంచి చెల్లించుకోవాల్సిన సందర్భాలు బోలెడు. నీతి ఆయోగ్ 2021 నివేదిక ప్రకారం.. దేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం చేస్తున్న మొత్తం వ్యయాల్లో 63 శాతాన్ని ప్రజలు సొంతంగా భరిస్తున్నారు. ప్రపంచదేశాల్లోనే ఇది ఎక్కువ. దీని వెనుక ఎన్నో కారణాలున్నాయి. ఆరోగ్య బీమా పాలసీ ఉన్నా ఇలా మన జేబు నుంచి చెల్లించుకోవాల్సిన పరిస్థితులను తగ్గించుకోవాలంటే ఏం చేయాలో చెప్పే కథనమిది... అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నదే లేకపో వడం, ఉన్నా సమగ్ర కవరేజీతో తీసుకోకపోవడం కూడా క్లెయిమ్ సమయంలో పాలసీదారులపై అదనపు భారం పడేలా చేస్తోంది. చికిత్సలో భాగంగా ఉపయోగించే కొన్ని రకాల వస్తువులు, సేవలకు హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి మినహాయింపు ఉన్న విషయాన్ని నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్, ప్రొడక్ట్స్ క్లెయిమ్ డైరెక్టర్ డాక్టర్ బబతోష్ మిశ్రా గుర్తు చేశారు. ‘‘చాలా మంది సమగ్రమైన కవరేజీని ఎంపిక చేసుకోవడం లేదు. కరోనా సంక్షోభం తర్వాత పెరిగిపోయిన ద్రవ్యోల్బణ ప్రభావంతో, ఎక్కువ రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే కవరేజీ చాలడం లేదు. దాంతో మిగిలిన మొత్తాన్ని పాలసీదారులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది’’ అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగం హెడ్ భాస్కర్ నెరుర్కర్ పేర్కొన్నారు. ఔట్ పేషెంట్ రూపంలో పొందే వైద్య సేవలకు చాలా ప్లాన్లలో కవరేజీ ఉండదు. కో–పే, సబ్ లిమిట్ తదితర షరతులు క్లెయిమ్ సమయంలో పాలసీదారులపై చెల్లింపుల భారానికి కారణమవుతాయి. అందుకుని పాల సీ కవరేజీ విషయంలో కొన్ని ముందస్తు జా గ్రత్తలు తప్పనిసరి. దీనికితోడు పాలసీదారులు తమపై భారం తగ్గించుకునేందుకు అందుబాటు లోని ఇతర మార్గాలను గుర్తించడమే పరిష్కారం. బయటి ల్యాబ్‌లు ఔట్ పేషెంట్‌గా వైద్య చికిత్సలకు వెళ్లినప్పుడు హాస్పిటల్‌కు సంబంధించిన ల్యాబ్‌లలో కాకుండా, బయటి డయాగ్నోస్టిక్స్‌లో టెస్ట్‌లు చేయించుకోవడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు. హాస్పిటల్ అనుబంధ కేంద్రాల్లో రక్త పరీక్షలు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ తదితర రేడియో ఇమేజింగ్ సేవల చార్జీలు ఎంతో అధికంగా ఉంటుంటాయి. ప్రైవేటులోనూ హెల్త్ స్టార్టప్‌ల రూపంలో ఎన్నో కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. హెల్తియన్స్, థైరోకేర్ ఇలా చాలానే ఉన్నాయి. వైద్యులు పరీక్షలు సూచించినప్పుడు తక్కువ చార్జీలున్న వాటికి (న మ్మకమైన సంస్థలకే పరిమితం) వెళ్లొచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ పరీక్షలు చేయించుకోవచ్చు. హాస్పి టల్ చార్జీలతో పోలిస్తే 40–50 శాతం తక్కువకే ఎన్నో సంస్థలు ఈ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. జనరిక్ మందులు వైద్యుల సూచించిన మందులను, హాస్పిటల్ వద్దనున్న ఫార్మసీల్లోనే తీసుకోవాలని లేదు. ఆ ప్రిస్కిప్షన్‌తో నేరుగా జనరిక్ ఫార్మసీ స్టోర్‌కు వెళ్లి వాటికి ప్రత్యామ్నాయాలను తీసుకోవచ్చు. కంపెనీ ఏదైనా, లోపల అదే మందు ఉంటే చాలు. బ్రాండెడ్ ఔషధాల పేర్లకు బదులు, ఫార్మా ఇంగ్రేడియంట్ పేర్లతోనే రోగులకు మందులు సూచించాలని జాతీయ వైద్య మండలి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. కనుక బ్రాండెడ్ ఔషధాలకు జనరిక్ మందులు మంచి ప్రత్యామ్నాయం. ఫార్మా కంపెనీలు తమ బ్రాండ్లను సిఫారసు చేయాలంటూ వైద్యులను కోరుతుంటాయి. ఇందుకోసం సిబ్బంది, వైద్యులకు ప్రయోజనాల రూపంలో చాలా ఖర్చు చేస్తుంటాయి. దీంతో బ్రాండెడ్ ఔషధాల ధరలు అధికంగా ఉంటాయి. జనరిక్ మందులకు ఈ బెడద లేదు. బ్రాండెడ్‌తో పోలిస్తే 80 శాతం చౌకగా లభిస్తాయి. ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన కేంద్రాలు కూడా దేశవ్యాప్తంగా జనరిక్ ఔషధాలను విక్రయిస్తున్నాయి. తగినంత కవరేజీ ఒకరి అవసరాలకు తీర్చే, సరిపడా కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంతో ముఖ్యమని మెడి అసిస్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నిఖిల్ చోప్రా సూచించారు. ఏ పట్టణంలో నివసిస్తున్నారు? వయసు? కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు? కుటుంబ ఆరోగ్య చరిత్ర అంశాల ఆధారంగా కవరేజీ ఎంతన్నది నిర్ణయించుకోవాలి. పెళ్లయి, పిల్లలతో మెట్రోల్లో నివసించే వారు కుటుంబం మొత్తానికి మెరుగైన కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవాలి. కనీసం రూ.5–10 లక్షలకు బేస్ ప్లాన్ తీసుకుని, దీనికి రూ.20–25 లక్షలతో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. వైద్య ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో సమ్ అష్యూరెన్స్ (కవరేజీ) చాలుతుందా? లేదా? అన్నది మధ్య మధ్యలో సమీక్షించుకుంటూ ఉండాలి. తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సమగ్రంగా ఉండాలి. మెడికల్, నాన్ మెడికల్ ఖర్చులతోపాటు, ఇంట్లో ఉండి తీసుకునే చికిత్సలకు చెల్లింపులు చేసేలా ఉంటే మంచిది. అలాగే, బీమా సంస్థ హాస్పిటల్స్ నెట్వర్క్ పెద్దగా ఉండాలి. అప్పుడు నగదు రహిత చికిత్సలు పొందడానికి వీలుంటుంది. ప్రమాద మరణం, ప్రమాదంలో వైకల్యానికి కవరేజీనిచ్చే రైడర్‌ను జోడించుకోవాలి. కుటుంబంలో గుండె జబ్బులు, కేన్సర్ తదితర వ్యాధుల రిస్క్ ఉంటే, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌ను సైతం తీసుకోవాలి. ఓపీడీ/డేకేర్ ఇండెమ్నిటీ ప్లాన్లలో బీమా సంస్థలు హాస్పిటల్లో చేరినప్పుడు అయ్యే వ్యయాలకే చెల్లింపులు చేస్తుంటాయి. అలాగే, డేకేర్ ట్రీట్మెంట్లకు కూడా చెల్లింపులు చేస్తాయి. అంటే హాస్పిటల్లో చేరకుండా, చికిత్స తీసుకుని అదే రోజు వెళ్లిపోయే వీలున్నవి. ఇవి కాకుండా, వైద్యం కోసం ప్రజలు చేస్తున్న ఖర్చులో సగం ఔట్ పేషెంట్ రూపంలో (హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేకుండా) సేవలపైనే ఉంటున్నట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ తెలిపారు. డాక్టర్ కన్సల్టేషన్ చార్జీలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాలకు చేస్తున్న వ్యయాలకు బీమా ప్లాన్లలో కవరేజీ ఉండడం లేదు. అందుకుని ఓపీడీ కవరేజీనిచ్చే బీమా ప్లాన్ తీసుకోవాలని భత్వాల్ సూచించారు. ‘‘మీ బీమా ప్లాన్ ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) వ్యయాలకు కవరేజీ ఇవ్వకపోతే, అప్పుడు హాస్పిటల్స్‌కు వెళ్లొద్దు. క్లినిక్‌లకు వెళ్లండి. ఎందుకంటే హాస్పిటల్స్ అయితే చార్జీలపై 18 శాతం జీఎస్టీ కూడా విధిస్తాయి’’అని మిశ్రా వివరించారు. బీమా ప్లాన్‌లో రీస్టోరేషన్ సదుపాయం కూడా ఉండాలి. ఒక పాలసీ సంవత్సరంలో కవరేజీ మొత్తం ఖర్చయిపోతే, తిరిగి మరోసారి హాస్పిటల్లో చేరాల్సి వస్తే అప్పుడు ఈ రీస్టోరేషన్ (నూరు శాతం కవరేజీని పునరుద్ధరించేవి) సాయపడుతుంది. హాస్పిటల్లో చేరినప్పుడు డైలీ క్యాష్ బెనిఫిట్‌ను కొన్ని పాలసీలు ఇస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్నప్పుడు కవరేజీ పరిధిలోకి రాని వాటి కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేసుకోవచ్చు. ఇప్పటికే ప్లాన్ తీసుకుని, అందులో ఈ ఫీచర్లు లేకపోతే పోర్టింగ్ ద్వారా అన్ని ఫీచర్లు ఉన్న ప్లాన్‌కు మారిపోవడం మంచి మార్గం. క్యాష్‌లెస్ ఆస్పత్రులు బీమా కంపెనీ నెట్వర్క్ పరిధిలోని ఆస్పత్రికి వెళ్లడం ద్వారా తమపై పడే వ్యయాలను పాలసీదారులు తగ్గించుకోవచ్చు. బీమా సంస్థలకు దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఆస్పత్రులతో భాగ స్వామ్యం ఉంటుంది. వాటిలో చేరితే పాలసీదారులకు తక్కువ చార్జీలు అమలవుతాయి. దీనివల్ల అటు బీమా సంస్థకు, పాలసీదారుకు ప్రయోజనం ఉంటుంది. నగదు రహిత వైద్య సేవలతోపాటు, పాలసీదారు తన వంతుగా చెల్లింపులు చేయాల్సి వస్తే వాటిపైనా తక్కువ చార్జీలు పడతాయి. కన్జ్యూమబుల్స్ చార్జీలు విధించవు. లేదా చాలా పరిమితంగా వేస్తాయి. నెట్వర్క్ హాస్పిటల్స్‌కే పాలసీదారులు వెళ్లేలా చూడడం కోసం.. కొన్ని బీమాకంపెనీలు నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటే కో–పేమెంట్ (బిల్లులో కొంత మొత్తం పాలసీదారు చెల్లించేలా) షరతు విధిస్తున్నాయి. హాస్పిటల్ రూమ్ పాలసీదారుడు హాస్పిటల్లో చేరినప్పుడు వైద్యేతర ఖర్చులకు (నాన్ మెడికల్) బీమా కంపెనీలు చెల్లింపులు చేయవు. రోగి రూమ్‌లో ఉన్నప్పుడు ఇచ్చే టిష్యూ, హ్యాండ్ వాష్, టూత్‌పేస్ట్ తదితర ఉత్పత్తులతోపాటు, హౌస్ కీపింగ్ చార్జీలు పాలసీలో కవర్ కావు. అలాగే, హాస్పిటల్లో చేరేందుకు రిజిస్ట్రేషన్ చార్జీలు, పోషకాహార నిపుణుడి చార్జీలు, కాటన్, బ్యాండేజ్‌లు, డిస్పోజబుల్కు బీమా సంస్థల చెల్లింపులు చేయవు. అయితే, వీటికి సైతం చెల్లింపులు చేసే ఆప్షన్‌ను బీమా సంస్థలు కొన్ని అందిస్తున్నాయి. ఇందుకోసం కొంత అదనపు ప్రీమియం వసూలు చేస్తా యి. హాస్పిటల్లో అన్ని చార్జీలు రూమ్ విభాగం ఆధారంగానే ఉంటాయని నివాబూపాకు చెందిన బబతోష్ మిశ్రా తెలిపారు. డాక్టర్ ఫీజులు, ఐసీయూ అడ్మిషన్ చార్జీలు, ఆహారం, ఇతర సేవలకు చార్జీలను రూమ్ కేటగిరీ ఆధారంగానే విధిస్తారు. సింగిల్ రూమ్‌కు బదులు ట్విన్ షేరింగ్ ఎంపిక చేసుకుంటే, అప్పుడు పాలసీదారు తాను సొంతంగా చెల్లించాల్సిన చార్జీలు చాలా వరకు తగ్గుతాయి. ఒకవేళ పాలసీలో సింగిల్ ఏసీ ప్రైవేటు రూమ్ అనే నిబంధన ఉంటే, దీనికంటే ఎగువ కేటగిరీ అయిన డీలక్స్ రూమ్‌లో చేరి చికిత్స పొందినప్పుడు, చార్జీలు కూడా అధికంగా పడతాయి. అప్పుడు పాలసీదారు జేబు నుంచి చెల్లించే మొత్తం పెరిగిపోతుంది. కో–పే, డిడక్టబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కో–పేమెంట్ లేదా డిడక్టబుల్ ఆప్షన్లతో తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. కానీ, చికిత్సలు అవసరమైనప్పుడు పాలసీదారు తన వంతు వాటాగా చెల్లించే మొత్తం ఎక్కువగా ఉంటుంది. కో–పే లేదా డిడక్టబుల్ అన్నవి నిర్ణీత మొత్తం దాటినప్పుడు అమల్లోకి వచ్చేవి. అందుకని తక్కువ కో–పే/డిడక్టబుల్ ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాలి. ప్రీమియం భారం లేదనుకుంటే, కో–పే లేని ప్లాన్‌కు వెళ్లాలి. రైడర్లు ఎప్పుడో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని, అందులో అన్ని రకాల ఫీచర్లు లేకపోతే.. అలాంటి అన్ని సదుపాయాలను ఆఫర్ చేస్తున్న బీమా కంపెనీకి పోర్ట్ ద్వారా మారిపోవాలి. పోర్టింగ్‌తో వేరే కంపెనీకి మారే ఉద్దేశ్యం లేకపోతే అప్పుడు అదనపు కవరేజీలను ఆఫర్ చేసే రైడర్లు తీసుకోవడం ద్వారా, చికిత్సలు అవసరమైనప్పుడు తమపై పడే భారాన్ని తగ్గించుకోవచ్చు. అన్ని యాడాన్లు అందరికీ ఉద్దేశించినవి కావు. అవసరమైన రైడర్లను జోడించుకోవచ్చు. ప్రస్తుత ప్లాన్‌లో రూమ్ రెంట్‌కు పరిమితులు ఉంటే, అప్పుడు రూమ్‌రెంట్ వేవర్ రైడర్ తీసుకోవాలి. డైలీ క్యాష్, కన్జ్యూమబుల్స్ కవరేజీలను కూడా ఎంపిక చేసుకోవాలి. డిస్కౌంట్స్ హాస్పిటల్స్ డిజిటల్ సేవలపై తగ్గింపులను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని ఆన్లైన్లో అపాయింట్మెంట్పై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి. డిస్కౌంట్‌తో కూడిన హెల్త్‌కార్డ్‌లను ఆఫర్ చేసేవీ ఉన్నాయి. ఫార్మసీ బిల్లులపైనా తగ్గింపు ఇస్తున్నాయి. ఇలాంటివి తెలుసుకుని వాటిని పొందడం ద్వారా ఖర్చుల భారం తగ్గించుకోవచ్చు. చదవండి: రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయానికి.. -
ఇన్సూరెన్స్ రంగంలో ‘బీమా సుగమ్’ గేమ్ చేంజర్
న్యూఢిల్లీ: బీమా సుగమ్ అన్నది బీమా రంగం స్వరూపాన్నే మార్చేస్తుందని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్ దేవాశిష్ పాండా అన్నారు. బీమా పాలసీల విక్రయం, కొనుగోలు, రెన్యువల్ (పునరుద్ధరణ), క్లెయిమ్‌ల పరిష్కారం సహా అన్ని రకాల సేవలను అందించే ఏకీకృత ప్లాట్‌ఫామ్‌గా ఉంటుందన్నారు. దేశంలో బీమా వ్యాప్తి విస్తరణకు ఈ టెక్నాలజీ పోర్టల్ సాయంగా నిలుస్తుందన్నారు. కస్టమర్లకు సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందన్నారు. యూపీఐ విప్లవం వంటిది... బీమా రంగానికి బీమా సుగమ్ అన్నది యూపీఐ విప్లవం వంటిదని వ్యాఖ్యానించారు. బీమా కంపెనీలు ఈ ప్లాట్ఫామ్లో భాగం కావాలని పిలుపునిచ్చారు. బీమా ఏజెంట్లు, వెబ్ అగ్రిగేటర్లు సహా అన్ని రకాల మధ్యవర్తులకూ ఈ పోర్టల్ యాక్సెస్ ఉంటుందని చెప్పారు. పాలసీదారులు ఈ పోర్టల్ నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. బీమాకు సంబంధించి దీన్నొక షాపింగ్ మాల్గా పాండా అభివర్ణించారు. -
కౌలు రైతులకు బీమా, రుణాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణలో కౌలు రైతులకు బీమా, రుణ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదని.. తాము అధికారంలోకి వస్తే రైతులందరికీ నష్టపరిహారం అందిస్తామన్నారు. అలాగే ధరణి పోర్టల్ వల్ల సన్న, చిన్నకారు రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తాము అంతకంటే మెరుగైన విధానాన్ని తీసుకొచ్చి అన్ని వర్గాలకు మేలు చేసేలా చూస్తామని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా గురువారం మక్తల్ మండలం బొందలకుంట లో మధ్యాహ్న భోజన సమయంలో రాహుల్‌గాంధీ రైతులు, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్, పరిగికి చెందిన అన్నదాతలతో సుమారు 45 నిమిషాలపాటు ముచ్చటించారు. మహిళా రైతుల ఆవేదన విని చలించిన రాహుల్.. వారి పిల్లలను ఆప్యాయంగా పలకరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో.. అప్పుల బాధతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పరిగికి చెందిన మహిళా కౌలు రైతు మంజుల చెబుతున్న క్రమంలో రాహుల్ చలించిపోయారు. ఎంత మంది పిల్లలు.. ఎలా జీవిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. తనకు ముగ్గురు పిల్లలని.. ఇంకా రూ. 7 లక్షల అప్పు ఉందని ఆమె చెప్పారు. ఆమె బాధలు విని కొద్దిసేపు మౌనంగా ఉన్న రాహుల్... కౌలు రైతుల సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపితే బాగుంటుందో రైతు స్వరాజ్య వేదిక నేతలతో చర్చించారు. ఆ తర్వాత రైతాంగ సమస్యలు, పరిష్కార మార్గాలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్‌కు సూచిందచారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వారు వెల్లడించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీలు బలరాం నాయక్, అద్దంకి దయాకర్, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, శుక్రవారం చేనేత, పోడు భూములను సేద్యం చేసుకుంటున్న వారి సమస్యలను రాహుల్ తెలుసుకోనున్నారు. మా వద్ద మ్యాజిక్ బుల్లెట్లు లేవు రైతు సమస్యల పరిష్కారానికి మా వద్ద మ్యా జిక్ బుల్లెట్లు ఏమీ లేవు. వారి సమస్యల పరి ష్కారానికి సమగ్ర విధానం రూపొందిస్తాం. రైతు పక్షపాత విధానాలతో వారి సంక్షేమం కో సం చిత్తశుద్ధితో పనిచేస్తాం. – రాహుల్ గాంధీ -
జీవిత బీమా ప్రీమియంలో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు సెప్టెంబర్ నెలకు మంచి పనితీరు చూపించాయి. నూతన పాలసీల ద్వారా ప్రీమియం (న్యూ బిజినెస్ ప్రీమియం) 17 శాతం పెరిగి రూ.36,366 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే నెలకు ప్రీమియం ఆదాయం రూ.31,001 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగ ఎల్ఐసీ నూతన ప్రీమియం ఆదాయంలో మంచి వృద్ధిని చూపించింది. 35 శాతం అధికంగా రూ.24,991 కోట్ల ప్రీమియం ఆదాయం సంపాదించింది. 2021 సెప్టెంబర్‌లో ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.18,520 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ నెల గణాంకాలను ఐఆర్డీఏఐ విడుదల చేసింది. ఇక 23 ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీలు ఉమ్మడిగా రూ.11,375 కోట్ల నూతన ప్రీమియం ఆదాయం సంపాదించాయి. 2021 సెప్టెంబర్ నెలకు ఇవే సంస్థలు సంపాదించిన కొత్త పాలసీల ప్రీమియం రూ.12,481 కోట్లతో పోలిస్తే 9 శాతం క్షీణించింది. ఎస్బీఐ లైఫ్ ప్రీమియం ఆదాయం 15 శాతం తగ్గి రూ.2,471 కోట్లుగా ఉంటే, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఆదాయం 22 శాతం తగ్గి రూ.2,166 కోట్లకు పరిమితమైంది. బజాజ్ అలియాంజ్ ఆదాయం కూడా 38 శాతం తగ్గి రూ.670 కోట్లుగా నమోదైంది. -
కొంపముంచుతున్న ఇన్సూరెన్స్ మోసాలు.. చెక్ పెట్టండిలా
గత ఆర్థిక సంవత్సరపు (2021–22) ఎకనమిక్ సర్వే ప్రకారం దేశీయంగా జీవిత బీమా పాలసీల విస్తృతి 2.82 శాతం (2019లో) నుంచి 2020లో 3.20 శాతానికి పెరిగింది. గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన అనిశ్చితి భయాల కారణంగా ఆర్థిక భద్రత కోసం జీవిత బీమా ప్రాధాన్యాన్ని గుర్తించడం పెరిగింది. అయితే, డిజిటలీకరణ నేపథ్యంలో బీమా సంబంధ మోసాల సంఖ్య కూడా పెరుగుతోంది. డేటా అంతా ఆన్లైన్లో దొరుకుతుండటంతో అమాయక కస్టమర్లను స్కామర్లు సులభంగా మోసం చేయడానికి ఆస్కారం ఉంటోంది. వీటిని అరికట్టేందుకు పరిశ్రమ తన వంతు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల మోసాలు, వాటిని ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేదే ఈ కథనం. ఫోన్ మోసాలు: కస్టమర్లను తప్పుదోవ పట్టించి వారిని మోసగించేందుకు స్కామర్లు ఎక్కువగా ఉపయోగించే విధానం ఇది. మోసగాళ్లు తమను తాము ఇన్సూరెన్స్ ఏజంట్లుగా పరిచయం చేసుకుని, వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకుని, తప్పుడు జీవిత బీమా ప్లాన్లను అంటగడుతూ ఉంటారు. ఈ–మెయిల్ మోసాలు: ప్రీమియంలు కట్టకపోవడం వల్ల పాలసీ ల్యాప్స్ అయిపోయిందంటూ కస్టమరుకు ఈమెయిల్స్ వస్తుంటాయి. మెయిల్లో ఇచ్చిన లింకును క్లిక్ చేసి, పేమెంట్ చేయడం ద్వారా పాలసీని పునరుద్ధరించుకోవాలని సూచిస్తాయి. నకిలీ వెబ్సైట్లు: కొందరు మరో అడుగు ముందుకేసి ఏకంగా నకిలీ వెబ్సైట్లను సృష్టించి కస్టమర్లను బురిడీ కొట్టిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి వెబ్సైట్లు ఎలాంటి పేపర్ వర్క్, డాక్యుమెంటేషన్, కేవైసీ, హెల్త్ చెక్ లాంటివి ఏమీ అవసరం లేకుండానే పాలసీ ఇచ్చేస్తామని చెబుతుంటాయి. మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో సైన్ అప్ చేస్తే చాలని ఊరిస్తాయి. తద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను తస్కరిస్తాయి. లబ్ధిదారులకు చెల్లింపులు: ఈ రకం స్కాముల్లో .. ఎవరో దూరపు చుట్టం పాలసీకి సంబంధించి లబ్ధిదారు మీరేనంటూ ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. ఆ మొత్తాన్ని పొందేందుకు నామమాత్రంగా ముందు కొంత డౌన్‌పేమెంట్ లేదా ప్రాసెసింగ్ ఫీజు కింద కొంత డబ్బు కట్టాలని వాటిలో ఉంటుంది. కట్టారో అంతే సంగతులు. ఓటీపీమోసాలు: ఇలాంటి కేసుల్లో.. మోసగాళ్లు తమను తాము ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులుగా పరిచయం చేసుకుని, మీ ఫోన్‌కి వచ్చిన ఓటీపీని చెప్పాలని అడుగుతారు. అలాగే, నకిలీ యాప్‌లు, మాల్వేర్ లింకులను పంపి వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంటూ సూచించవచ్చు. అనధికారిక వ్యక్తులు పాలసీలను విక్రయించడం: కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు సిసలైనవిగా అనిపించినప్పటికీ వాటికి ఐఆర్డీఏఐ అనుమతులు ఉండకపోవచ్చు. అలాంటి సంస్థలు అక్రమమైనవి. వాటి నుంచి పాలసీలు తీసుకుంటే మోసపోతారు. తప్పుడు పాలసీలు అంటగట్టడం: మొత్తం ఖర్చుల గురించి మీకు పూర్తిగా వివరించకుండా బీమా పాలసీని అంటగట్టడం ఈ కోవకి వస్తుంది. అంతే గాకుండా పాలసీలో ఆఫర్ చేస్తున్న దానికి మించి మీకు మరిన్ని ప్రయోజనాలు వచ్చేలా చేస్తామంటూ తప్పుడు హామీలు కూడా ఇవ్వొచ్చు. ఇలా చేయండి .. కస్టమర్లు ఇలాంటి మోసాల బారిన పడకుండా బీమా కంపెనీలు తమ వంతు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.అయినప్పటికీ కస్టమర్లు కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, సురక్షితంగా ఉండవచ్చు. అవేమిటంటే.. ► పుట్టినతేదీ, బ్యాంకు ఖాతా, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఫోన్లో చెప్పొద్దు. ► గుర్తు తెలియని వారి దగ్గర్నుంచి వచ్చే ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్‌లో పేమెంట్ లింకులపై క్లిక్ చేయొద్దు. ►మరీ అతిశయమైన ఆఫర్లు ఇచ్చే నకిలి వెబ్సైట్లు, ఇన్సూరెన్స్ పాలసీలకు దూరంగా ఉండాలి. బీమా కంపెనీ వెబ్సైట్లో మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలు సమర్పించే ముందు అది సురక్షితమై న, సిసలైన పోర్టలేనా అని ధృవీకరించుకోవాలి. ►మీ క్లెయిమ్‌ను సెటిల్ చేసేందుకు లేదా లబ్ధిదారులకు చెల్లింపులు జరిపేందుకు బీమా కంపెనీలు ఎటువంటి డౌన్‌పేమెంట్ లేదా ప్రాసెసింగ్ ఫీజులను కోరవు అని గుర్తుంచుకోండి. ►మీ ఫోన్‌కి వచ్చే ఓటీపీలను థర్డ్ పార్టీలు లేదా గుర్తు తెలియని వారికి చెప్పకండి. ►సంతకాలు లేదా చెల్లింపులు చేసే ముందు పాలసీ పత్రాలను క్షుణ్నంగా చదువుకోండి. ►బీమా ఏజెంట్లు అసలైన వారేనా కాదా అనేది ధృవీకరించుకునేందుకు వారి ఐడీ ప్రూఫ్‌లను పరిశీలించండి. ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నా కూడా ఏదైనా జరిగితే సత్వరం ఐఆర్డీఏఐ దృష్టికి కూడా తీసుకు వెళ్లడం శ్రేయస్కరం. అనిల్ పి.ఎం., హెడ్ (లీగల్ అండ్ కాంప్లయెన్స్ విభాగం), బజాజ్ అలయంజ్ లైఫ్ -
హెచ్డీఎఫ్సీ ఎర్గోతో నర్చర్ ఒప్పందం
అగ్రిటెక్ స్టార్టప్ ‘నర్చర్డాట్ఫార్మ్’ హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తన ప్లాట్‌ఫామ్ పరిధిలోని 23 లక్షల మంది రైతులకు బీమా ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. ‘‘పంటల సాగు కాలంలో రైతులు ఎన్నో రిస్క్‌లు ఎదుర్కొంటుంటారు. వాతావరణంలో అనూహ్య మార్పులు పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తాయి. రైతుల సహజ పనితీరు దృష్ట్యా వారి ఆరోగ్యానికి రిస్క్ ఉంటుంది. పంట ఉత్పత్తుల ధరలు కూడా అస్థిరతలకు గురవుతుంటాయి. ఫలితంగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. అయినా కానీ, ఖరీదైన ప్రీమియంను చూసి ఎక్కువ మంది రైతులు బీమాను ఎంపిక చేసుకోరు. వారికి మా ప్లాట్‌ఫామ్ ద్వారా బీమా పరిష్కారాలను అందించనున్నాం’’అని నూర్చర్ తెలిపింది. చదవండి: Airtel 5g: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదంట! -
రిలయన్స్ సాధారణ బీమాపై కన్ను
న్యూఢిల్లీ: రుణ పరిష్కార ప్రణాళికల్లో ఉన్న రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కొనుగోలుకి ప్రయివేట్ రంగ కంపెనీలు పిరమల్ గ్రూప్, జ్యూరిక్ ఇన్సూరెన్స్ ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు వీలుగా రెండు సంస్థలూ భాగస్వామ్య ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ) ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రుణ భారంతో కుదేలైన రిలయన్స్ క్యాపిటల్ దివాలా చట్ట(ఐబీసీ) చర్యలను ఎదుర్కొంటోంది. దీనిలో భాగంగా సాధారణ బీమా అనుబంధ సంస్థ విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పిరమల్, జ్యూరిక్ విడిగా నాన్‌బైండింగ్ బిడ్స్ దాఖలు చేశాయి. రెండు సంస్థలూ ఏర్పాటు చేయనున్న ఎస్పీవీలో చెరి సగం(50 శాతం చొప్పున) వాటాలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ కోసం విడిగా బిడ్‌ను వేసినట్లు జ్యూరిక్ వెల్లడించింది. రిలయన్స్ సాధారణ బీమా బిజినెస్ విలువను పిరమల్ రూ. 3,600 కోట్లు, జ్యూరిక్ రూ. 3,700 కోట్లుగా మదింపు చేశా యి. అయితే అసలు విలువ రూ. 9,450 కోట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క రిలయన్స్ క్యాపిటల్ రుణ పరిష్కార ప్రణాళికను పర్యవేక్షిస్తున్న పాలనాధికారి, సీవోసీ బిడ్స్ దాఖలు గడువును అక్టోబర్ 30వరకూ పొడిగించాయి. -
ఐసీఐసీఐ లాంబార్డ్ నుంచి 14 పాలసీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ దిగ్గజం ఐసీఐసీఐ లాంబార్డ్ 14 పాలసీలను ఆవిష్కరించింది. వీటిలో కొన్ని కొత్తవి కాగా, మరికొన్ని అప్‌గ్రేడ్ చేసినవి ఉన్నాయి. అయిదు హెల్త్ పాలసీలు, 4 వాహన బీమా, మిగతావి కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన పాలసీలు ఉన్నాయి. కరోనా అనంతర పరిస్థితుల్లో కస్టమర్ల ఆలోచనా ధోరణులు, అవసరాలు మారాయని తదనుగుణంగా తాజా పాలసీలను రూపొందించామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య బీమాకు సంబంధించి హెల్త్ బూస్టర్, బీఫిట్, సీనియర్ సిటిజన్స్ కోసం గోల్డెన్ షీల్డ్ తదితర పాలసీలు ప్రవేశపెట్టినట్లు సంస్థ డిప్యుటీ వైస్ ప్రెసిడెంట్లు అమిత్ ఆనంద్, సుబ్రతో బెనర్జీ, సుధీర్ నాయుడు వివరించారు. డ్రోన్లకు, సైబర్ నేరాల నుంచి రక్షణ కల్పించేలా రిటైల్ సైబర్ లయబిలిటీ పాలసీలు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వారు పేర్కొన్నారు. -
6వ అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరించనున్న భారత్!
న్యూఢిల్లీ: భారత్ వచ్చే పదేళ్లలో ఆరో అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరిస్తుందని ‘స్విస్ రీ ఇనిస్టిట్యూట్’ అంచనా వేసింది. నియంత్రణ సంస్థ నుంచి మద్దతు, ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ఇందుకు చేదోడుగా నిలుస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. ఆరో అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరించేందుకు భారత్.. వచ్చే పదేళ్ల కాలం పాటు ఏటా 14 శాతం మేర బీమా ప్రీమియంలో వృద్ధి నమోదు కావాలని సూచించింది. ప్రస్తుతం బీమా ప్రీమియం పరంగా భారత్ ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. భారత జీవిత బీమా రంగం 2022లో 6.6 శాతం మేర, 2023 నుంచి 7.1 శాతం మేర వృద్ధిని సాధిస్తుందని స్విస్‌రీ అంచనా వేసింది. మొత్తం జీవిత బీమా ప్రీమియం 2022లో మొదటిసారి 100 బిలియన్ డాలర్లు దాటుతుందని తెలిపింది. జీవితేతర బీమా మారెŠక్ట్ గురించి చర్చిస్తూ.. 2021లో 5.8 శాతం మేర ప్రీమియంలో వృద్ధి నమోదైనట్టు, 2022లో 4.5 శాతం వృద్ధికి పరిమితం కావచ్చని పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణాన్ని ఇందుకు కారణంగా పేర్కొంది. 2023–2032 మధ్య ఏటా 8 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేసింది. ముఖ్యంగా కరోనా మమమ్మారి ప్రవేశం తర్వాత వ్యవస్థీకృత మార్పు జీవితేతర బీమా (ఆరోగ్య బీమా)లో చోటు చేసుకున్నట్టు తెలిపింది. కరోనా వల్ల రిస్క్‌పై అవగాహన ఏర్పడి, హెల్త్ ఇన్సూరెన్స్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగినట్టు వివరించింది. 2022లో భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని స్విస్ రీ ఇనిస్టిట్యూట్ అంచనా వేసింది. -
గణపతి మండపానికి రూ. 316 కోట్ల బీమా
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ అత్యంత సంపన్న గణేశ్ మండల్‌గా పేరుగాంచింది. నగరంలో గత 68 ఏళ్లుగా మండపాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈసారి తమ మండపానికి రూ.316.4 కోట్ల బీమా చేయించినట్లు జీఎస్బీ సేవా మండల్ చైర్మన్ విజయ్ కామత్ చెప్పారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రి వేడుకల్లో మండపాన్ని దర్శించే ప్రతి భక్తుడూ బీమా పరిధిలోకి వస్తాడని తెలిపారు. మొత్తం బీమాలో రూ.31.97 కోట్లు బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు, సామగ్రికి వర్తిస్తుందన్నారు. రూ.263 కోట్ల బీమా మండపానికి, వాలంటీర్లకు, పూజారులకు, వంటవాళ్లకు, పాదరక్షల స్టాల్ కార్మికులకు, పార్కింగ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులకు వర్తిస్తుందని వివరించారు. అగ్నిప్రమాదం, భూకంపం సంభవిస్తే పరిహారం పొందడానికి గాను ఫర్నిచర్, కంప్యూటర్లు, సీసీటీవీ కెమెరాలు, స్కానర్లకు రూ.కోటితో ఇన్సూరెన్స్ చేయించామన్నారు. విఘ్న వినాయకుడి ఆశీస్సులు పొందడానికి వచ్చే ప్రతి భక్తుడికి భద్రత కల్పించాలన్నదే తమ ఉద్దేశమని విజయ్ కామత్ వివరించారు. -
పాలసీదారులకు ఎల్ఐసీ బంపరాఫర్!
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగంలోని దిగ్గజ సంస్థ ఎల్ఐసీ రద్దయిన పాలసీల (ల్యాప్స్డ్) పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆగస్ట్ 17న ఇది మొదలవుతుందని.. అక్టోబర్ 21 వరకు కొనసాగుతుందని తెలిపింది. యూలిప్ పాలసీలు కాకుండా, ఇతర అన్ని జీవిత బీమా పాలసీల పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని.. ఆలస్యపు రుసుంలో ఆకర్షణీయ తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. చివరిగా ప్రీమియం చెల్లించి మానేసిన నాటి నుంచి ఐదేళ్లు దాటకపోతే వాటిని పునరుద్ధరించుకోవచ్చని తెలిపింది. సూక్ష్మ బీమా పాలసీల పునరుద్ధరణపై ఆలస్యపు రుసుంను నూరు శాతం మాఫీ చేస్తున్నట్టు పేర్కొంది. ఊహించని పరిస్థితుల వల్ల పాలసీల ప్రీమియం చెల్లించలేకపోయిన వారి కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఎల్ఐసీ తెలిపింది. -
ఏబీ హెల్త్‌లో ‘అబుధాబి’ పెట్టుబడి
ముంబై: ఆదిత్య బిర్లా(ఏబీ) గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(ఏఐడీఏ) 10 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 665 కోట్లు వెచ్చించనుంది. ఇందుకు ఏబీ హెల్త్ ఇన్సూరెన్స్ బోర్డుతోపాటు లిస్టెడ్ మాతృ సంస్థ ఏబీ క్యాపిటల్ అనుమతించాయి. తద్వారా ఆరోగ్య బీమా రంగ సంస్థ విలువను రూ. 6,650 కోట్లుగా మదింపు చేసినట్లు ఏబీ క్యాపిటల్ పేర్కొంది. ఏబీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆదిత్య బిర్లా గ్రూప్, దక్షిణాఫ్రికా సంస్థ మొమెంటమ్ మెట్రోపాలిటన్ హోల్డింగ్స్ సంయుక్తం (జేవీ)గా ఏర్పాటు చేశాయి. డీల్‌కు దేశీ బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) అనుమతించవలసి ఉంది. వాటా విక్రయం తదుపరి జేవీలో ఏబీసీఎల్కు 45.91 శాతం, మొమెంటమ్ మెట్రోకు 44.10 శాతం చొప్పున వాటాలు ఉంటాయి. ఆరోగ్య బీమాపట్ల అవగాహన పెరగడం, వృద్ధిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కారణంగా దేశీ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం భారీగా విస్తరించేందుకు వీలున్నట్లు ఏఐడీఏ పేర్కొంది. ఇక తాము అనుసరిస్తున్న ప్రత్యేక బిజినెస్ విధానాల పటిష్టతను అడియా పెట్టుబడులు సూచిస్తున్నట్లు ఏబీసీఎల్ తెలియజేసింది. హెల్త్ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయ వార్తల నేపథ్యంలో ఏబీ క్యాపిటల్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం లాభంతో రూ. 111 వద్ద ముగిసింది. చదవండి: బంఫర్ ఆఫర్: 15 వరకు ఏ మెట్రోస్టేషన్‌కైనా రూ.30 -
ప్రభుత్వ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరల్ని పెంచాల్సిందే.. పోటీ పడాల్సిందే!
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు జూలై మాసంలో వ్యాపార పరంగా మంచి వృద్ధిని చూశాయి. నూతన పాలసీల రూపంలో ప్రీమియం ఆదాయం 91 శాతం పెరిగి రూ.39,079 కోట్లు వసూలైంది. 2021 జూలైలో ఎల్ఐసీ సహా 24 జీవిత బీమా సంస్థలు నూతన పాలసీల రూపంలో సంపాదించిన ప్రీమియం ఆదాయం రూ.20,435 కోట్లుగా ఉండడం గమనించాలి. ఈ ఏడాది జూలైలో ఎల్ఐసీ నూతన పాలసీ ప్రీమియం రెండు రెట్లకు పైగా వృద్ధి చెందింది. గతేడాది జూలైలో రూ.12,031 కోట్ల ఆదాయం వసూలు కాగా, ఈ ఏడాది ఇదే నెలలో రూ.29,117 కోట్లకు దూసుకుపోయింది. 19 శాతం పెరిగిన ప్రీమియం ఆదాయం జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసీ వాటా 68.6 శాతంగా ఉంది. మిగిలిన 23 ప్రైవేటు జీవిత బీమా సంస్థలకు నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 19 శాతం పెరిగి రూ.9,962 కోట్లుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో 24 జీవిత బీమా సంస్థలకు కొత్త పాలసీల రూపంలో వచ్చిన ప్రీమియం ఆదాయం రూ.1,12,753 కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.73,160 కోట్లుగా ఉంది. ఒక్క ఎల్ఐసీ వరకే చూస్తే ఈ నాలుగు నెలల్లో నూతన ప్రీమియం ఆదాయం 62 శాతం వృద్ధితో రూ.77,318 కోట్లు వసూలైంది. ప్రీమియం పెంచాల్సిందే.. పోటీ పడాల్సిందే! ప్రభుత్వరంగంలోని నాలుగు సాధారణ బీమా సంస్థలు.. ప్రైవేటు సంస్థలతో పోటీ పడాలంటే ప్రీమియం పెంచాల్సిందేనని, వాటి ఐటీ వ్యవస్థలను మెరుగుపరుచుకోక తప్పదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో ప్రస్తావించింది. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 2016–17 నుంచి 2020–21 మధ్య.. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ రూ.26,334 కోట్లు నష్టపోయినట్టు తెలిపింది. ఈ సంస్థలకు ఆరోగ్య బీమా రెండో అతిపెద్ద వ్యాపారంగా ఉందంటూ.. సంబంధిత ఐదు సంవత్సరాల్లో రూ.1,16,551 కోట్ల స్థూల ప్రీమియం ఆదాయం వచ్చినట్టు పేర్కొంది. ఆరోగ్య బీమా మార్కెట్లో ఇవి క్రమంగా తమ వాటాను ప్రైవేటు సంస్థలకు కోల్పోతున్నట్టు ప్రస్తావించింది. బీమా వ్యాపారానికి సంబంధించి నిర్ధేశిత అండర్ రైటింగ్ (క్లెయిమ్‌లకు సంబంధించి) నిబంధనలను ఇవి అనుసరించడం లేదని కాగ్ గుర్తించింది. ‘‘స్టాండలోన్ గ్రూప్ పాలసీలకు కంబైన్డ్ రేషియో 95 శాతం మించకూడదు. క్రాస్ సబ్సిడీ ఉన్న గ్రూపు పాలసీలకు 100 శాతం మించకూడదు. కానీ, గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌ల కంబైన్డ్ రేషియో 125–165 శాతం మధ్య ఉంది. ఈ సంస్థల్లోని ఐటీ వ్యవస్థల నుంచి సరైన తనిఖీలు, నియంత్రణలు లోపించాయి’’అని వెల్లడించింది. -
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో... డిపాజిట్ భద్రమేనా?
బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్.. ఇప్పటికీ సామాన్య, మధ్య తరగతి ఆదాయ వర్గాల వారికి విశ్వసనీయమైన సాధనం. సమీపంలోని బ్యాంకు శాఖలో డిపాజిట్ చేసుకోవడం, అవసరం ఏర్పడినప్పుడు వెళ్లి తీసుకోవడం సౌకర్యాన్నిచ్చే అంశం. బ్యాంకులో డిపాజిట్ అయితే ఎక్కడికీ పోదు? అన్న నమ్మకం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఎఫ్డీలపై అధిక వడ్డీ రేటును కొన్ని బ్యాంకులు ఆఫర్ చేయడం గమనించే ఉంటారు. ఈ విషయంలో వాణిజ్య బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీ) కొంచెం అధిక రేటును ఆఫర్ చేస్తుంటాయి. మరి అధిక రాబడి కోసం ఈ సాధనాలను ఎంపిక చేసుకోవడం ఎంత వరకు సురక్షితం అన్న ప్రశ్న రావచ్చు. అలాగని, అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయంటే ఏదో సందేహించాల్సిందే? అని భావించడం కూడా సరికాదు. ఎందుకు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయన్నది ఇక్కడ గమనించాలి. ఆర్బీఐ నియంత్రణల పరిధిలో పనిచేసే బ్యాంకులు ఏవైనా, వాటిల్లో డిపాజిట్ చేసే విషయంలో సందేహించక్కర్లేదు. డిపాజిట్‌పై ఇన్సూరెన్స్ అమల్లో ఉందా? అన్నది విచారించుకోవాలి. అంతేకాదు, డిపాజిట్‌కు ముందు ముఖ్యమైన అంశాలు కొన్నింటిని విశ్లేషించుకోవాలి. అప్పుడే రాబడితోపాటు, భరోసా ఉండేలా చూసుకోవచ్చు. రిస్క్–రాబడి.. చాలా వరకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీలు) ఏడాది కాల ఎఫ్డీలపై 7–7.25% రాబడిని ఆఫర్ చేస్తున్నాయి. పెద్ద బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు కంటే కనీసం ఒక శాతం ఎక్కువ. వడ్డీ రేటు వ్యత్యాసం అన్నది ఎస్ఎఫ్బీలు, ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య 1.5–2% వరకు ఉంది. అందుకే కొందరు ఇన్వెస్టర్లకు ఎస్ఎఫ్బీలు ఆఫర్ చేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ రేటు ఆకర్షణీయంగా అనిపించొచ్చు. రేటు ఆకర్షణీయంగానే ఉన్నా, భద్రత విషయంలో సందేహంతో వెనుకాడాల్సిన అవసరం లేదు. అన్ని ఇతర షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల మాదిరే, ఎస్ఎఫ్బీలు సైతం ఆర్బీఐ నియంత్రణల పరిధిలోనే పనిచేస్తాయి. కనుక ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వారికి కూడా.. రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కవరేజీ ఉంటుంది. పెద్ద వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే ఎస్‌ఎఫ్‌బీల వ్యాపార నమూనా అధిక రిస్క్ తో ఉంటుంది. అందుకనే అవి డిపాజిట్లపై కాస్తంత అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఎస్ఎఫ్బీలు తమ మొత్తం రుణాల్లో 75 శాతాన్ని ప్రాధాన్య రంగాలకు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయం, ఎస్ఎంఎంఈలు ప్రాధాన్య రంగాల కిందకు వస్తాయి. అలాగే, ఎస్‌ఎఫ్‌బీల రుణ పుస్తకంలో 50 శాతం రుణాలు.. ఒక్కోటీ రూ.25 లక్షలు, అంతకులోపే ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. దీని కారణంగా ఎస్‌ఎఫ్‌బీల రుణాల్లో అన్సెక్యూర్డ్ రుణాలు 50–75 శాతం వరకు ఉంటాయి. కానీ, పెద్ద వాణిజ్య బ్యాంకుల్లో అన్సెక్యూర్డ్ రుణాలు మొత్తం రుణాల్లో 30 శాతం కంటే తక్కువే ఉంటాయి. ఎటువంటి హామీ/తనఖా లేని రుణాలు అన్సెక్యూర్డ్ కిందకు వస్తాయి. అందుకనే ఎస్‌ఎఫ్‌బీల వ్యాపారంలో రిస్క్ ఎక్కువ. కనుక ఎస్ఎఫ్బీలు రుణాల రిస్క్‌ను బ్యాలన్స్ చేసుకునేందుకు.. వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే 1.5–2.5% అధిక రేటుపై రుణాలు మంజూరు చేస్తుంటాయి. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణ రేటు 6.9 % నుంచి మొదలవుతోంది. అదే ఎస్ఎఫ్బీల్లో ఈ రేటు 8.5% నుంచి ఉంటోంది. ఇలా రుణాలపై అధిక రేటును ఎస్ఎఫ్బీలు వసూలు చేస్తుంటాయి. డిపాజిట్లపై మెరుగైన రేటును ఆఫర్ చేయడానికి ఇది కూడా ఒక కారణమే. ఇక ఎస్ఎఫ్బీలు మొదలై 5–6 ఏళ్లే అవుతోంది. కనుక డిపాజిట్ల సమీకరణ దశలోనే అవి ఇంకా ఉన్నాయి. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడం, అధిక డిపాజిట్ బేస్ వచ్చే వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ రేటును ఆఫర్ చేయడం సహజంగానే చూడాలి. ఎంత వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు..? మీకు సమీపంలోని ఎస్ఎఫ్బీ శాఖకు వెళ్లి డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ సంస్థలు ఇంకా పూర్తి స్థాయి టెక్నాలజీ వనరులను సమకూర్చుకోలేదు. కనుక నేరుగా వెళ్లి ఎఫ్డీ చేసుకోవడం మంచిదే. అత్యవసరాల్లో తిరిగి డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవడం ఆలస్యం కాకుండా ఉంటుంది. ఇక ఎంత మొత్తం వరకు డిపాజిట్ చేసుకోవచ్చు? అన్న సందేహం రావచ్చు. ఒక వ్యక్తి తన పొదుపు నిధులు మొత్తాన్ని ఒకే బ్యాంకు శాఖలో డిపాజిట్ చేసుకోవడం సూచనీయం కాదు. పైగా ఎస్ఎఫ్బీలో డిపాజిట్ చేసుకోవడానికి ముందు బ్యాంకు కార్యకలాపాలు ఎలా కొనసాగుతున్నాయో? ఒక అంచనాకు రావాలి. నమ్మకం ఏర్పడిన తర్వాతే డిపాజిట్‌కు వెళ్లాలి. అధిక రాబడుల కోసం మిగులు నిధుల వరకే డిపాజిట్‌కు పరిమితం కావాలి. డిపాజిట్ మొత్తానికి భద్రత కోరుకునేట్టు అయితే.. అప్పుడు ఒక బ్యాంకు పరిధిలోలో రూ.5 లక్షలకు మించి డిపాజిట్ చేయవద్దు. ఎందుకంటే డీఐసీజీసీ కింద బ్యాంకు సంక్షోభం పాలైతే ఒక బ్యాంకు పరిధిలో ఒక డిపాజిట్ దారుకు గరిష్టంగా వచ్చేది రూ.5 లక్షలకే పరిమితం. అందుకుని రూ.5 లక్షల చొప్పున వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్చేసుకోవాలి. దీర్ఘకాలానికి కాకుండా 1–3 ఏళ్ల వరకు డిపాజిట్ చేసుకుని, కాల వ్యవధి ముగిసిన తర్వాత రెన్యువల్ చేసుకోవడం మంచిది. ఆయా అంశాలపై ఒక నిర్ణయానికి ముందు వీటిపై సమగ్ర సమచారం పొందాలి. నిపుణులను సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవాలి. బ్యాంకు ఎంపిక ఎలా? స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఆర్థిక సామర్థ్యాన్ని తెలుసుకోవాలంటే వాటి అధికారిక వెబ్ సైట్ల నుంచి గణాంకాలు పొందొచ్చు. బ్యాంకు సామర్థ్యం ఏపాటిదో అవగాహన తెచ్చుకునేందుకు వాటి స్థూల మొండిబాకీలు (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్–ఎన్పీఏలు) ఏ స్థాయిలో ఉన్నాయి? బ్యాంకు రుణ పుస్తకం, డిపాజిట్ల బేస్ గత మూడేళ్ల కాలంతో పోలిస్తే, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉందన్నది చూడాలి. నికర వడ్డీ ఆదాయం, మార్జిన్లు మెరుగుపడ్డాయా లేక క్షీణించాయా? గమనించాలి. ఎస్ఎఫ్బీలు చిన్న గా (పరిమాణం పరంగా) ఉన్నందున వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే అవి అధిక వృద్ధిని నమోదు చేయగలవు. రుణాలు, డిపాజిట్లలో 25–35% వరకు, నికర వడ్డీ ఆదాయంలో 20–25% వృద్ధి ఉందంటే సానుకూలంగా చూడొచ్చు. ఎస్‌ఎఫ్‌బీలలో ఏయూ ఎస్ఎఫ్బీ మినహా మిగిలినవి సూక్ష్మ రుణ కార్యకలాపాలనే ఎక్కు వగా నిర్వహిస్తున్నాయి. దీంతో కరోనా సమయంలో వీటికి ఎక్కువ షాక్‌లు తగిలాయి. వాటి ఎన్పీఏలు ఐదేళ్ల సగటును మించి పోయాయి. వ్యాపార కార్యకలాపాలు తిరిగి గాడిన పడిన తర్వాత ఇవి తగ్గుముఖం పట్టడం సహజం. ఎస్ఎఫ్బీలు అన్నీ కూడా తగినన్ని నిధులతో ఉన్నందున ఆందోళన అనవసరం. -
అగ్రి బీమా ఉత్పత్తులకూ అదే వెసులుబాటు!
న్యూఢిల్లీ: సాధారణ బీమా విభాగంలో భాగమైన అగ్రి బీమా ఉత్పత్తుల ఆవిష్కరణకూ ముందస్తు అనుమతి అవసరం లేదని బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను సైతం ముందస్తు అనుమతి లేకుండా మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సాధారణ బీమా కంపెనీలను ఐఆర్డీఏఐ అనుమతించడం తెలిసిందే. తాజాగా ఈ వెసులుబాటు సాగు బీమా ఉత్పత్తులకూ కల్పించింది. మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత, ఆయా ఉత్పత్తులకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే (యూజ్ అండ్ ఫైల్) చాలని తెలిపింది. దేశంలో బీమా కవరేజీ విస్తరణకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ విభాగంలోని అవసరాలకు అనుగుణంగా పరిశ్రమ సకాలంలో వినూత్నమైన ఉత్పత్తులను రూపొందించి, ప్రవేశపెట్టేందుకు తమ తాజా ఆదేశాలు వీలు కల్పిస్తాయని తెలిపింది. -
మనిషికో వంద.. టీడీపీ దందా
కుప్పం/డి.హీరేహాళ్ (రాయదుర్గం): రాష్ట్రంలో నానాటికీ క్షీణించిపోతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ప్రజలెవ్వరూ ముందుకు రావడంలేదు. దీంతో ఆ పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. బీమా పేరుతో ప్రతి మనిషి నుంచి బలవంతంగా వంద రూపాయలు వసూలు చేసి, సభ్యత్వ రశీదు ఇస్తున్నారు. దీంతో ప్రజలు వారిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభ్యత్వ నమోదుకు కొన్ని చోట్ల వ్యక్తిగత బీమా అని, మరికొన్ని చోట్ల పంటల బీమా అంటూ గ్రామీణులను మోసం చేస్తున్నారు. చివరకు ఆ పార్టీ అధినేత సొంత నియోజకవర్గం కుప్పంలోనూ సభ్యత్వాలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో బీమా పేరుతో మాయమాటలు చెప్పారు. వంద రూపాయలు చెల్లించి టీడీపీ సభ్యత్వం తీసుకుంటే ప్రమాదవశాత్తు గాయపడిన వారికి బీమా, వైద్య ఖర్చులు, మరణించిన వారి కుటుంబానికి రూ. 5 లక్షలు వస్తుందని చెబుతున్నారు. వద్దన్న వారికి కూడా బలవంతంగా రశీదులు రాసి, డబ్బు వసూలు చేస్తున్నారు. ఇదే విధానంలో రామకుప్పం మండలం పెద్దూరు గ్రామంలో రాత్రి పూట ఇన్సూరెన్స్ పేరుతో సభ్యత్వ నమోదుకు దిగిన టీడీపీ నేతలను స్థానికులు, సర్పంచ్ భర్త గోవిందప్ప అడ్డుకున్నారు. వద్దంటున్నా, బలవంతంగా రశీదులు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. దీంతో ఆ నేతలు మెల్లగా జారుకున్నారు. ఇప్పటికీ పలు గ్రామాల్లో ఇదేవిధంగా మాయమాటలతో ప్రజలకు బలవంతంగా సభ్యత్వం రశీదులు ఇస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సభ్యత్వ నమోదుకు వచ్చిన టీడీపీ నాయకుడితో స్థానికుల వాగ్వాదం అనంతపురం జిల్లాలోనూ.. అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం కల్యంలో మిర్చి పంటకు బీమా ఇప్పిస్తామంటూ రైతుల నుంచి బుధవారం రాత్రి అక్రమ వసూళ్లకు తెగబడి అడ్డంగా దొరికిపోయారు. రాయదుర్గం పట్టణానికి చెందిన కొంత మంది టీడీపీ నాయకులు గ్రామంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. మనిషికో రూ.వంద చెల్లిస్తే మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుతో మాట్లాడి ఇన్సూ్యరెన్స్ వచ్చేలా చేస్తామని నమ్మబలికారు. టీడీపీకి సభ్యత్వం చేస్తే పంటల బీమా ఎలా ఇప్పిస్తారని రైతులు నిలదీశారు. దీంతో గ్రామంలో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో టీడీపీ నాయకులు అబ్దుల్ గఫూర్, పరమేశ్వర, గంగన్న, ధనుంజయ, రుద్రప్ప, ఓబన్న, జావిద్ అక్కడి నుంచి జారుకున్నారు. కృష్ణ అనే టీడీపీ నాయకుడు మాత్రం పట్టుబడ్డాడు. అతన్ని పోలీసులు హెచ్చరించి వదిలేశారు. -
అన్నదాతలకు అండగా నిలుస్తోన్న జగన్ సర్కారు
-
కారులో శృంగారం.. రూ.40.83 కోట్ల నష్టపరిహారం! ఎందుకంటే?
సవాలక్ష కారణాలు చెప్పి బీమా ఎగ్గొట్టే ఇన్సెరెన్సు కంపెనీలు ఓ వైపు ఉంటే కట్టిన ప్రతీ పైసాకు అవసరంలో లెక్కకట్టి బీమా చెల్లించే సంస్థలు మరికొన్ని కొన్ని ఉంటాయి. కానీ అమెరికాలో ఇటీవల ఓ బీమా సంస్థ నష్టపరిహారంగా చెల్లించిన విధానం నఃభూతో నఃభవిష్యత్ అన్నట్టుగా నిలిచింది. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రానికి చెందిన మహిళ ఓ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంది. 2017లో ఓ రోజు అతనికి చెందిన కారులో ఆ మహిళ తన పార్ట్నర్తో శృంగారంలో పాల్గొంది. అయితే ఈ వ్యక్తికి హ్యుమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) అనే సుఖవ్యాధి ఉంది. ఆ కారులో జరిగిన శృంగారం కారణంగా సదరు మహిళకు ఆ సుఖవ్యాధి సంక్రమించింది. ఈ వ్యాధి కనుక ముదిరితే క్యాన్సర్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉంది. కారులో కాబట్టి కారులో జరిగిన శృంగారం కారణంగానే తనకు ప్రమాదకర సుఖవ్యాధి సంక్రమించినందున తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. ఇప్పటి వరకు జరిగిన నష్టం, భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని తనకు ఏకంగా రూ.77.36 కోట్లు ( 9.9 మిలియన్ డాలర్లు) పరిహారం చెల్లించాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. డ్యామెజెస్ అండ్ ఇంజ్యూరీస్ సుదీర్ఘ కాలం ఈ కేసును విచారించిన న్యాయస్థానం కారు ఇన్సెరెన్సుకు సంబంధించి డ్యామెజెస్ అండ్ ఇంజ్యూరీస్ క్లాజ్ ఆధారంగా బాధితురాలికి రూ.40.83 కోట్లు (5.2 మిలియన్ డాలర్లు) పరిహారంగా ఇవ్వాలంటూ తీర్పు ఇచ్చారు. సదరు వ్యక్తి తనకు సుఖరోగం ఉన్న విషయం దాచిపెట్టి ఉద్దేశ పూర్వకంగా కారులో ఆ తప్పుకు పాల్పడినట్టు కోర్టు భావించింది. దీంతో బాధితురాలి పక్షాన నిలబడి.. కారులో ప్రయాణిస్తుండగా దాని యజమాని వల్ల జరిగిన ప్రమాదంగా పరిగణిస్తూ... డ్యామెజెస్ అండ్ ఇంజ్యూరీస్ క్లాజ్ బీమా చెల్లించాలంటూ తీర్పు వెలువరిచింది. అందుకేనా ? మిసోరీ కోర్టు తీర్పుపై భిన్నరకాలైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చిత్రమైన డ్యామేజెస్కి పరిహారం ఇవ్వాల్సి రావడం వల్లే కారు ఇన్సెరెన్సులు ఇంతగా పెరిగాయి అంటూ ఎలాన్ మస్క్ సైతం ఈ తీర్పుపై స్పందించాడు. మరి ఇన్సెరెన్సు కంపెనీ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: 40 ఏళ్ల తర్వాత అమెరికాలో గడ్డు రోజులు -
కేంద్రం కీలక నిర్ణయం, కొత్త వాహన కొనుగోలు దారులకు షాక్!
మీరు కొత్త బైక్, కార్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే జూన్ 1 నుంచి ప్రస్తుతం ఉన్న ధర కంటే కాస్త ఎక్కువ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చే నెల నుంచి కేంద్ర రవాణా శాఖ థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ధరల్ని పెంచుతున్నట్లు తెలుస్తోంది.దీంతో వాహనాల కొనుగోళ్లు వాహనదారులకు మరింత భారం కానున్నాయి. ►అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..2019 -2020లో ప్రైవేట్ కార్ ఇంజిన్ కెపాసిటీ 1000సీసీ ఉంటే థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ప్రీమియం ధర రూ.2,072 ఉండగా ఇప్పుడు రూ.2,094కు చేరింది. ►కార్ ఇంజిన్ కెపాసిటీ 1000సీసీ, 1500సీసీ మధ్య ఉంటే ఇన్స్యూరెన్స్ ప్రీమియం ధర రూ.3,221 నుంచి రూ.3,416కి చేరింది ►అదే కార్ 1500సీసీ దాటితే ప్రీమియం ధర రూ.7,890 నుంచి రూ.7,897కి పెరిగింది. ►అదే సమయంలో టూవీలర్ ఇంజిన్ కెపాసిటీ 150 సీసీ నుండి 350సీసీ ఉంటే 150సీసీ ప్రీమియం ధర రూ.1,366 ఉండగా 350సీసీ ప్రీమియం ధర రూ.2,804గా ఉంది. ►ఇక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై 7.5శాతం డిస్కౌంట్ ఇచ్చిన కేంద్రం.. ఎలక్ట్రిక్ కార్ 30కేడబ్ల్యూ ఉంటే ప్రీమియం రూ.1,780, 65కేడ్ల్యూ ఉంటే ప్రీమియం ధర రూ.2,904గా నిర్ణయించింది. ►కమర్షియల్ వెహికల్స్ 12,000కేహెచ్ బరువు. కానీ 20,000కేజీ బరువు మించకుండా ఉంటే సవరించిన ప్రీమియం రూ. 35,313 అవుతుంది. 40,000 కిలోల కంటే ఎక్కువ కమర్షియల్ వాహనాలను రవాణా చేసే వస్తువుల విషయంలో ప్రీమియం 2019-20లో రూ. 41,561 నుండి రూ.44,242కి పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది -
అగ్ని ప్రమాదాలకు ప్రత్యామ్నాయ బీమా
న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదాలు, విపత్తుల వల్ల కలిగే నష్టాలకు బీమా కవరేజీని.. చిన్న నివాసాలు, చిన్న వ్యాపార సంస్థలకు ఆఫర్ చేసే విషయంలో వినూత్న పాలసీల రూపకల్పనకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) అనుమతించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. నివాసాలు, సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థలకు ప్రామాణిక బీమా ఉత్పత్తులకు సంబంధించి ఈ మార్గదర్శకాలు అమలవుతాయి. భారత్ గృహ రక్ష, భారత్ సూక్ష్మ ఉదయం సురక్ష, భారత్ లఘు ఉదయం సురక్షా స్థానంలో స్టాండర్ బీమా ఉత్పత్తులను బీమా సంస్థలు ఆఫర్ చేయాల్సి ఉంటుంది. చదవండి: లైఫ్‌కి ఇన్సురెన్స్ ఉండాలంతే! -
లైఫ్‌కి ఇన్సురెన్స్ ఉండాలంతే! గణాంకాలు అదిరిపోతున్నాయ్!!
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలకు కొత్త పాలసీల రూపంలో వచ్చిన ప్రీమియం ఆదాయం (నూతన వ్యాపార ఆదాయం) ఏప్రిల్‌లో మంచి వృద్ధిని చూసింది. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 84 శాతం పెరిగి రూ.17,940 కోట్లకు చేరింది. 24 జీవిత బీమా కంపెనీలు ఉమ్మడిగా 2021 ఏప్రిల్‌లో వసూలు చేసిన నూతన పాలసీల ప్రీమియం రూ.9,739 కోట్లుగా ఉంది. అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీకి నూతన పాలసీల రూపంలో ఏప్రిల్‌లో రూ.11,716 కోట్లు ప్రీమియం ఆదాయం కింద వచ్చింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.4,857 కోట్లతో పోలిస్తే 141 శాతం వృద్ధి చెందింది. ఈ వివరాలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) విడుదల చేసింది. జీవిత బీమా మార్కెట్లో 65.31 శాతం వాటా ఎల్ఐసీ చేతుల్లోనే ఉంది. మిగిలిన 23 ప్రైవేటు బీమా సంస్థల పరిధిలో ఉన్న వాటా 34.69 శాతంగా ఉంది. ఎల్ఐసీ కాకుండా మిగిలిన జీవిత బీమా కంపెనీలకు ఏప్రిల్ నెలలో కొత్త పాలసీల జారీ ద్వారా వచ్చిన ప్రీమియం ఆదాయం 27% పెరిగి రూ.6,223 కోట్లుగా నమోదైంది. ఎల్ఐసీ తర్వాత ప్రీమియం ఆదాయంలో స్టార్ యూనియన్ దైచీ లైఫ్ 122 శాతం, టాటా ఏఐఏ లైఫ్ 107 శాతం వృద్ధి చూపించాయి. ఏప్రిల్ చివరికి 24 జీవిత బీమా సంస్థల పరిధిలోని మొత్తం పాలసీల సంఖ్య 13,21,098కు చేరింది. ఇందులో ఎల్ఐసీ పాలసీలు 9,13,141గా ఉన్నాయి. చదవండి: ఎల్ఐసీ ఐపీవో సక్సెస్ -
insurance: ప్రీమియం తక్కువ.. రక్షణ ఎక్కువ
రోజుకు ఒక దోశ కోసం చేసే ఖర్చు.. పావు లీటర్ పెట్రోల్‌కు అయ్యే వ్యయం.. 30–50 రూపాయలు నావి కావంటూ వచ్చిన ఆదాయం నుంచి పక్కన పెడితే కుటుంబానికి చక్కటి రక్షణ కల్పించుకోవచ్చు. కానీ, మనం సామాన్యులం. జీవితానికి రక్షణ ఇచ్చే బీమా విషయంలోనూ పిసినారి తనం ప్రదర్శిస్తుం టాం. అనుకోనిది జరిగితే.. విధి ఎదురు తిరిగితే అప్పుడు మన కుటుంబం పడే కష్టాలను చూడ్డానికి మనం ఉండం. నిండు మనసుతో ప్రేమించే మనవారి కోసం ఒక్క టర్మ్ ప్లాన్ రక్షణగా ఇవ్వలేమా? అది లేకుండా వారి పట్ల ఎంత ప్రేమ చూపించినా తామరాకుపై నీటిబొట్టు చందమే అవుతుంది..! టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది స్వచ్ఛమైన, సూటైన బీమా ప్లాన్. ఇందులో ఎటువంటి గందరగోళం ఉండదు. అందుకే దీన్ని ప్రొటెక్షన్ ప్లాన్ అంటారు. జీవితానికి రక్షణ కల్పించేది. కుటుంబానికి ఆధారమైన ప్రతి వ్యక్తి ఈ ఒక్క బీమా ప్లాన్ తీసుకుంటే చాలు. పాలసీదారు వయసు, ఆరోగ్య చరిత్ర, ఎంచుకున్న కాలం (ఏ వయసు వరకు బీమా కావాలి) ఈ అంశాల ఆధారంగా ప్రీమియం ఏటా ఎంత కట్టాలన్నది బీమా కంపెనీ నిర్ణయిస్తుంది. ఏటా ఆ మేరకు చెల్లిస్తూ వెళ్లాలి. పాలసీ కాలవ్యవధి ముగిసేలోపు ఎప్పుడైనా పాలసీదారు ఏ కారణం వల్లనైనా మరణిస్తే.. అతని కుటుంబ సభ్యులు పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు పరిశీలన అనంతరం బీమా సంస్థ పరిహారాన్ని నామినీకి లేదంటే వారసులకు చెల్లిస్తుంది. మరి పాలసీ కాలవ్యవధి ముగిసేవరకు నిక్షేపంగా జీవించి ఉంటే? ఉదాహరణకు 75 ఏళ్ల వయసు వచ్చే వరకు రక్షణను ఎంపిక చేసుకున్నారనుకోండి? అప్పటికీ పాలసీదారు జీవించి ఉన్నారనుకుందాం. టర్మ్ ప్లాన్ కనుక రూపాయి కూడా తిరిగి రాదు. పాలసీ ముగిసిపోతుంది. అన్నేళ్లపాటు వేల రూపాయలు కడితే రూపాయి తిరిగి రాదా..? కొందరికి ఇది అస్సలు నచ్చదు. అందుకే వారు మాకొద్దు టర్మ్ పాలసీ అంటుంటారు. ఇక్కడ కావాల్సింది కుటుంబానికి రక్షణ, రాబడి కాదు. రాబడుల కోసం వేరే మార్గాలున్నాయి. ఒకవేల కాలవ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే.. అప్పటి వరకు కట్టినదంతా మరణించిన కుటుంబాలకు పరిహారంగా వెళ్లిందనుకుంటే ఆ సంతృప్తి వేరు. కనుక బీమా రక్షణ కోరుకునే వారు ముందుగా తీసుకోవాల్సింది టర్మ్ ప్లాన్. దీనికంటే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రీమియం ధరల పరిస్థితి ఇదీ... టర్మ్ ప్లాన్ల విషయంలో బీమా సంస్థల మధ్య ఆరోగ్యకర పోటీయే నడుస్తోంది. కరోనా రాకతో బీమా క్లెయిమ్‌లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. చెల్లింపుల భారంతో రీఇన్సూరెన్స్ సంస్థలు (బీమా సంస్థల పాలసీలపై బీమా ఇచ్చేవి) ప్రీమియంను గత ఆరు నెలల్లో పెంచేశాయి. కొన్ని బీమా కంపెనీలు పెరిగిన రీఇన్సూరెన్స్ రేట్ల మేర తమ పాలసీలపైనా అమలు చేశాయి. కొన్ని కంపెనీలు మాత్రం మార్కెట్ పెంచుకునేందుకు పాత ప్రీమియం ధరలనే కొనసాగిస్తున్నాయి. పాలసీ ప్రీమియం రేటు అనేది దరఖాస్తుదారుల వయసు, హెల్త్ రిస్క్, ఎంపిక చేసుకున్న కవరేజీ, కాలవ్యవధి అంశాల ఆధారంగా మారిపోతుంటుంది. పాలసీ తీసుకోవడాన్ని వాయిదా వేస్తే.. వయసు పెరుగుదల ఫలితంగా ప్రీమియం కూడా అధికమవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తితో పోలిస్తే 35 ఏళ్ల వ్యక్తికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 22 శాతం అధిక ప్రీమియం వసూలు చేస్తోంది. జీవనశైలి అలవాట్లు ప్రీమియం ధరలను ప్రభావితం చేసే అంశాల్లో కీలకమైనవి. ఉదాహరణకు పొగతాగడం, గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం, మద్యం సేవించడం ఇవి ప్రీమియంను భారీగా పెంచే అంశాలు. పొగతాగే అలవాటు ఉందని వెల్లడిస్తే ఆరోగ్యవంతులతో పోలిస్తే ప్రీమియం 20 అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విద్యార్హతలు కూడా ప్రీమియంను 34 శాతం మేర ప్రభావితం చేస్తున్నాయి. అందుకునే ఇలాంటి అలవాట్లు, ఆరోగ్య సమస్యలు ఏవి ఉన్నా కానీ నిజాయితీగా వెల్లడించడమే మంచిది. ప్రీమియం పెరిగినా వెల్లడించడం మానొద్దు. ఎందుకంటే భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు గురి కాకూడదంటే వెల్లడించాలి. ఇక ప్రీమియం తక్కువగా ఉండాలంటే ఉన్న ఏకైక మార్గం చాలా చిన్న వయసులో తీసుకోవడమే. అప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఎంపిక చేసుకున్న కవరేజీ (బీమా రక్షణ రూపాయిల్లో) కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తుంది. బీమా కవరేజీ అన్నది అన్ని వయసులకు ఒకటే కాకుండా.. మధ్య వయసు నుంచి బాధ్యతలు పెరిగి వృద్ధాప్యానికి చేరువ అయ్యే క్రమంలో తగ్గిపోతాయి. కనుక కవరేజీ కూడా ఏటేటా కొంత శాతం చొప్పున మొదటి 15–20 ఏళ్లు పెరుగుతూ వెళ్లి.. ఆ తర్వాత తగ్గుతూ ఉండేలా ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తాయి. పరిహారం ఏక మొత్తంలో కావాలా? లేక సగం పరిహారం చెల్లించి మిగిలినది ప్రతీ నెలా నిర్ణీత కాలం వరకు చెల్లించేలా ఎంపిక చేసుకోవాలా? ఇది కూడా ప్రీమియంపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు ఇండియా ఫస్ట్ లైఫ్ రూ.కోటి కవరేజీని పాలసీ ముగింపు సమయానికి 2 కోట్లకు వెళ్లే ఆప్షన్ ఇస్తోంది. సాధారణ పాలసీతో పోలిస్తే ప్రీమియం 50 శాతం ఎక్కువ. 100 ఏళ్ల వయసు వచ్చే వరకు కవరేజీ ఎంపిక చేసుకున్నా.. ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కట్టిన ప్రీమియం కాలవ్యవధి ముగిసిన తర్వాత చెల్లించే టర్మ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటి ప్రీమియం కూడా 50–100 శాతం వరకు అధికంగా ఉంటోంది. కానీ, ప్రీమియం వెనక్కి వచ్చే టర్మ్ ప్లాన్ లాభసాటి కానేకాదు. దీన్ని ఎంపిక చేసుకోవద్దు. దీనికి బదులు సాధారణ పాలసీ ఎంపిక చేసుకుని ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. టర్మ్ ప్లాన్ అన్నది తమపై ఆధారపడిన వారి భవిష్యత్తు ఆర్థిక రక్షణ కోసమే. 70 ఏళ్లు వచ్చే సరికి ఈ బాధ్యతలు దాదాపుగా ముగిసిపోతాయి. కనుక 100 ఏళ్లకు టర్మ్ ప్లాన్ ఉపయోగం లేని ఆప్షనే. పాలసీకి అనుబంధాలు.. యాడ్ ఆన్స్ పేరుతో పలు రైడర్లు టర్మ్ పాలసీకి అనుబంధంగా తీసుకోవచ్చు. వీటితో కవరేజీ విస్తృతి పెరుగుతుంది అంతే. ఉదాహరణకు క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఒకటి. తీవ్ర అనారోగ్యాల్లో ఏవైనా నిర్ధారణ అయితే ఏక మొత్తంలో ఈ కవరేజీ కింద పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు రూ.5 లక్షల క్రిటికల్ ఇల్నెస్ కవర్ కోసం ఏటా రూ.2,000 ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. ఇలాంటి రైడర్లు అన్నవి పాలసీదారులు తమ అవసరాలను విశ్లేషించుకుని తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్‌నెస్‌లు ఏవన్నవి ప్రతి బీమా సంస్థ ఓ జాబితాను నిర్వహిస్తుంటుంది. అందులో ఉన్న వాటికే కవరేజీ వస్తుంది. ఇందులోనూ ఇండెమ్నిటీ, బెనిఫిట్ అని ఉన్నాయి. ఆస్పత్రిలో చేరితేనే పరిహారం ఇచ్చేవి ఇండెమ్నిటీ. బెనిఫిట్ ప్లాన్ అన్నది నిర్ధారణ అయిన వెంటనే ఏక మొత్తంలో చెల్లించేది. యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్‌మెంబర్‌మెంట్ రైడర్ కూడా టర్మ్ ప్లాన్‌తో తీసుకోవచ్చు. ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే బీమాకు అదనంగా, ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర అదనపు పరిహారాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం కారణంగా వైకల్యం పాలైనా పరిహారం చెల్లిస్తుంది ఈ రైడర్. పాలసీ డాక్యుమెంట్లో వైకల్యాన్ని తెలిపే వివరాలు ఉంటాయి. ఈ యాడ్ ఆన్ ప్రీమియం రూ.2,000లోపే ఉంటుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ అయితే సమగ్ర ప్రమాద బీమా రూ.కోటి కవరేజీకి రూ.6,000 వరకు చార్జ్ చేస్తోంది. పిల్లలు, భార్య రక్షణకు సంబంధించి యాడ్ఆన్స్ కూడా ఉన్నాయి. పాలసీదారు మరణిస్తే వీటి కింద ప్రత్యేక పరిహారం మంజూరవుతుంది. అప్పుడు పిల్లల విద్య, జీవిత భాగస్వామి పోషణ అవసరాలకు పరిహారం వినియోగమవుతుంది. దంపతుల్లో భార్య కూడా ఉద్యోగం చేస్తున్నట్టయితే తమ అవసరాలకు అనుగుణంగా విడిగా టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఒకవేళ గృహిణి అయితే టర్మ్ ప్లాన్ రాదు. అలాంటప్పుడు జాయింట్ టర్మ్ ప్లాన్ తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. బజాజ్ అలియాంజ్, పీఎన్బీ మెట్‌లైఫ్, ఎడెల్వీజ్ టోకియో లైఫ్ తదితర సంస్థలు జాయింట్ టర్మ్ ప్లాన్ అందిస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్‌మెంబర్‌మెంట్ రైడర్లు హెల్త్ ప్లాన్ అనుబంధంగా కూడా లభిస్తాయి. బీమా సంస్థ పాలసీ కంటే ముందు చూసేది బీమా కంపెనీ గురించే. అవసరమైన సందర్భంలో పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా కంపెనీపై ఉంటుంది. ఆ బాధ్యతల్లో బీమా సంస్థ ఏ మేరకు నిజాయితీగా ఉంటుందన్నది చూడాలి. క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎటువంటి సమస్యల్లేకుండా సాఫీగా జరిగిపోవాలి. ఏ సంస్థ ఆర్థిక పరిస్థితి అయినా వచ్చే రెండు సంత్సరాల తర్వాతి కాలం గురించి విశ్లేషించడం అంత సులభం కాదని నిపుణులే అంటుంటారు. అందుకుని అప్పటి వరకు ఆ బీమా కంపెనీ పూర్వపు చరిత్రే ప్రామాణికం అవుతుంది. ఎల్ఐసీ ప్రభుత్వరంగ బీమా సంస్థ. అంతేకాదు ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. కనుక దీర్ఘకాలంలో ఎల్ఐసీకి వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు. ఇక ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు బీమా కంపెనీలు ఎస్బీఐ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్, ఇండియా ఫస్ట్ (బీవోబీ, యూనియన్ బ్యాంకు),కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ (కెనరా బ్యాంకు) విషయంలోనూ దీర్ఘకాలానికి సంబంధించి అంత ఆందోళన అక్కర్లేదు. బ్యాంకింగ్ అనుభవంతో అవి అండర్‌రైటింగ్ నైపుణ్యాలు ప్రదర్శంచగలవు. ప్రముఖ ప్రైవేటు బీమా కంపెనీలు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, కోటక్ మహీంద్రా సైతం వాటి బ్యాంకింగ్ అనుభవాలపై ఆధారపడగలవు. దేశీ బీమా సంస్థల్లో ఎక్కువ కంపెనీలు విదేశీ భాగస్వామ్య సంస్థలతో కలసే బీమా వ్యాపారం నిర్వహిస్తున్నాయి. బీమా సంస్థ నిర్వహణలోని ఆస్తులు, విదేశీ భాగస్వామితో ఎంత కాలం నుంచి వ్యాపారం చేస్తోంది? సేవల నాణ్యత ఇలాంటి అంశాలన్నింటినీ తరచి చూడాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పాలసీ నిబంధనలకు బీమా సంస్థ ఎంత నిజాయతీగా కట్టుబడి ఉంటుందన్న దానిపైనే బీమా పరిహారం చెల్లింపులన్నవి ఆధారపడి ఉంటాయి. దీనికి ప్రామాణిక కొలమానమే క్లెయిమ్ చెల్లింపుల రేషియో. ఒకవేళ ఎక్కువ క్లెయిమ్‌లను తిరస్కరించినట్టయితే ఆ సంస్థ అండర్‌రైటింగ్ ప్రమాణాల నాణ్యతను సందేహించాల్సిందే. ఎం దుకంటే పాలసీదారు రిస్క్‌ను బీమా సంస్థ ముందే సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైనట్టుగానే చూడాలి. అందుకే క్లెయిమ్ చెల్లింపుల చరిత్ర బీమా సంస్థ నిజాయితీకి దర్పణం పడుతుంది. క్లెయిమ్‌ల పరిష్కార రేషియో అంటే.. మరణ పరిహారం కోరుతూ బీమా సంస్థకు వచ్చిన మొత్తం అభ్యర్థనల్లో ఎన్నింటిని ఆమోదించిందన్నది తెలిపే నిష్పత్తి. సాధారణంగా ఇది 94 శాతం నుంచి 98 శాతం మధ్యలో ఉంటోంది. ఎన్నింటిని తిరస్కరించింది? ఎన్నింటిని పెండింగ్‌లో పెట్టిందన్నది కూడా చూడాలి. వ్యక్తుల స్థాయిలో క్లెయిమ్ తిరస్కరణ రేటు గతంలో సగటున 0.6 శాతంగా ఉంటే, అది 5.5 శాతానికి పెరిగిపోయింది. గతంతో పోలిస్తే తిరస్కరణ రేటు పెరిగినట్టు తెలుస్తోంది. బీమా సంస్థల మధ్య ఇది భిన్నంగా ఉంటుంది. కరోనా సమయంలో క్లెయిమ్‌లకు సంబంధించి ప్రమాణాలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) కఠినతరం చేసింది. దీంతో ఎల్ఐసీ సగటు చెల్లింపుల రేషియో 2018–19లో 97.8 శాతంగా ఉంటే, 2020–21 నాటికి 98.6 శాతానికి మెరుగుపడింది. ఇదే కాలంలో ప్రైవేటు బీమా సంస్థల సగటు చెల్లింపుల రేషియో 96.6 శాతం నుంచి 97 శాతానికి పుంజుకుంది. క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ అన్నది ప్రీమియం ధరలపై ప్రభావం చూపించదు. పాలసీదారులు క్లెయిమ్‌ల పరిష్కార నిష్పత్తికి అదనంగా.. క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియ ఎంత సులభంగా ఉందన్నది విచారించుకోవాలి. ఆన్లైన్లో ఇందుకు సంబంధించి యూజర్ల రివ్యూలు లభిస్తాయి. జీవితానికి విలువ కట్టగలమా..? బీమాకు సంబంధించి జీవిత విలువ అనేది ముఖ్యం. అప్పుడే ఎంత విలువకు బీమా కవరేజీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోగలం. పాలసీ తీసుకునే వారి భవిష్యత్తు ఆదాయ సామర్థ్యాన్ని అంచనా వేసి, ఆ విలువకు సరిపడా బీమా రక్షణ (సమ్ అష్యూర్డ్) కల్పించుకోవాలి. బీమా సంస్థల ఆన్లైన్ పోర్టళ్లలో కొటేషన్ చూసుకునే సమయంలో మనం చెప్పిన ఆదాయాన్ని బట్టి అర్హత మేరకు గరిష్ట బీమా కవరేజీని చూపిస్తున్నాయి. కాకపోతే ఎవరికి వారు వారి వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని నిర్ణయించుకోవాలి. వ్యక్తి వార్షిక జీవన అవసరాలు ఎంతో చూడాలి. అప్పటికే రుణ బాధ్యతలు (గృహ రుణం, వ్యక్తిగత రుణం, వ్యాపార రుణం, విద్యా రుణం ఇలా ఏవైనా) ఉంటే వాటిని కలుపుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని విస్మరించకూడదు. ఇలా వచ్చిన మొత్తానికి కనీసం 6 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ముడి పెట్టి, సరైన కవరేజీపై నిర్ణయానికి రావాలి. అంతేకానీ, రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి ఇలాంటి కవరేజీల్లో ప్రీమియంను బట్టి ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం సరైన రక్షణ అనిపించుకోదు. -
జరిమానా వేశారని బండినే తగలబెట్టాడు
జోగిపేట (ఆందోల్): ద్విచక్ర వాహనానికి ఇన్సూరెన్స్ లేదని పోలీసులు ఫైన్ వేసినందుకు తన బైకునే తగలబెట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన శనివారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అన్నా సాగర్ కట్టపై జరిగింది. జోగిపేట పోలీసులు అన్నాసాగర్ కట్టపై వాహనాల తనిఖీ చేపట్టారు. వాహ నాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి జరిమానా వేస్తున్నారు. జోగిపేట వైపు వెళ్తున్న బైక్‌ను ఆపి డాక్యుమెంట్లు తనిఖీ చేసి ఇన్సూరెన్స్ లేకపోవడంతో పోలీసులు రూ.1,100 ఫైన్ వేశారు. రశీదు తీసుకున్న వాహనదారుడు అక్కడే 2, 3 సార్లు చక్కర్లు కొట్టి కట్టపై కల్వర్టు వద్ద బైక్ (స్లె్పండర్)ను నిలిపి పెట్రోల్ పైపును బయటకు తీసి వాహనానికి నిప్పంటించాడు. అక్కడే ఉన్న పోలీసులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం వాహనదారుడిని పోలీసు వాహనంలో స్టేషన్‌కు తరలించారు. అతన్ని చౌటకూరు మండలం శివ్వంపేట గ్రామానికి చెందిన పాండుగా గుర్తించారు. -
ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు బీమా ప్లాన్
న్యూఢిల్లీ: పిల్లల మానసిక ఆరోగ్యం కోసం పని చేసే మామ్స్బిలీఫ్ సంస్థ ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల కోసం (ఆటిజం, డౌన్స్ సిండ్రోమ్, నేర్చుకోలేకపోవడం తదితర) బీమా ప్లాన్‌ను తీసుకొచి్చంది. ‘మామ్స్ బిలీఫ్ కేర్–ఆది్వక్ చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్’ను కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో గురువారం ఆవిష్కరించింది. ప్రత్యేక అవసరాలతోపాటు, శ్రద్ధ అవసరమైన చిన్నారుల చికిత్సా వ్యయాలకు రూ.1.5–4 లక్షల మధ్య కవరేజీనిస్తుంది. ఈ ప్లాన్‌లో రూ.1.5 లక్షల కవరేజీకి ప్రీమియం సుమారు రూ.22,000గా ఉంది. ‘‘ఎదుగుదలకు సంబంధించి సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల అభివృద్ధే మా డీఎన్ఏ. 0–15 ఏళ్ల మధ్యనున్న ఉన్నవారి కోసం ప్రతి నెలా 30,000 సెషన్లు నిర్వహిస్తున్నాం’’ అని మామ్స్ బిలీఫ్ సీఈవో నితిన్ బిండ్లిష్ తెలిపారు. -
కుదిరిన ఒప్పందం.. సింగరేణి ఉద్యోగులకు 40 లక్షల బీమా
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉన్న ప్రతీ సింగరేణి ఉద్యోగికి రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేశారు. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సింగరేణి కాలరీస్ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఎస్బీఐలో ఖాతాలున్న 35వేల మంది ఉద్యోగులకు ప్రయో జనం చేకూరనుంది. ఈ ఒప్పందం వచ్చే నెల 4 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సింగ రేణి డైరెక్టర్లు బలరామ్, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ సమక్షంలో ఇరు సంస్థల ఉన్నతా ధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ సూచనల మేరకు బలరామ్ ఈ చారిత్రక ఒప్పందంలో కీలక పాత్ర పోషించారన్నారు. (చదవండి: ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ) -
రోజూ తప్పు చేస్తూనే.. 70 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు..!
లండన్: ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రత్యేకంగా గురించి చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే చలాన్లు ఇంటికే వచ్చేస్తున్న రోజులు. చలానా మనకు వచ్చే కొన్ని సందర్భాల్లో మనం ఫలానా చోట ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించామా అనుకోవడం ఒక్కటే మనవంతు అవుతుంది. కాకపోతే ఒక వ్యక్తి మోటర్ వెహికల్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 70 ఏళ్లు తిరిగేశాడు. అది కూడా బ్రిటన్‌లో. తాజాగా నాటింగ్‌హామ్‌లో సదరు వ్యక్తి పోలీసులకు పట్టుబడటంతో అసలు విషయం తెలిసింది. తాను 70 ఏళ్లుగా లైసెన్స్, కారుకు బీమా లేకుండా తిరుగుతున్నానని అతనే వెల్లడించాడు. ఇన్నాళ్లూ తన కారును ఏ ట్రాఫిక్ పోలీసు ఆపలేదని, అందుకు తనకు వాటి అవసరం లేకుండా పోయిందని తన మాటల ద్వారానే వ్యక్తపరిచాడు. 1938లో జన్మించిన ఈ కారు డ్రైవర్ తనకు 12 ఏళ్ల నుంచి లైసెన్స్ లేదా ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాడని పోలీసులకు చెప్పాడు. ఇన్నాళ్ల తన కెరీర్లో తనను ఎప్పుడూ పోలీసులు అడ్డుకోలేదని చెప్పాడు. ఆ వ్యక్తి నడిపి కారు కూడా ఎప్పుడూ యాక్సిడెంట్ కూడా కాలేదట. దాంతోనే సుదీర్ఘకాలం ఇలా రోడ్డుపై హాయిగా తిరిగేశాడు. అతనికి 12 ఏళ్ల వయసు నుంచే కారుకు బీమా లేకుండా లైసెన్స్ లేకుండా తిరుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై బుల్‌వెల్, రైజ్పార్క్ హైబరీ వేల్ పోలీసులు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఆ సమయంలో ఆ వ్యక్తి ఓ పాత తుప్పు పట్టిన కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా గుర్తించారు. వెంటనే ఆ కారు నడిపే వ్యక్తిని అడ్డుకున్నారు. తర్వాత విషయం తెలిసి నోరెళ్ల బెట్టారు పోలీసులు. -
గ్రామ వలంటీర్లకు ప్రమాద బీమా
రాజానగరం: ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సకాలంలో చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ వలంటీర్లకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కంపూడి రాజా సొంత డబ్బుతో ప్రమాద బీమా కల్పించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ రాజానగరంలో శనివారం ప్రారంభించారు. వలంటీర్లకు బీమా బాండ్లు అందజేశారు. నియోజకవర్గంలోని సీతానగరం మండలం వంగలపూడి గ్రామ వలంటీర్ కోడెల్లి నీలారాణి గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అటువంటి దుస్థితి మరో వలంటీర్ కుటుంబానికి ఎదురు కాకూడదనే ఆలోచనతో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ ప్రమాద బీమా పథకానికి అంకురార్పణ చేశారు. ఈ పథకం ద్వారా సీతానగరం, కోరుకొండ, రాజానగరం మండలాల్లో 1,475 మంది గ్రామ వలంటీర్లకు ప్రమాద బీమా కల్పిస్తున్నారు. ఇందుకుగాను బీమా కంపెనీకి చెల్లించాల్సిన ప్రీమియాన్ని జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ చెల్లిస్తుంది. వలంటీర్లకు మనోధైర్యాన్ని అందించడంలో ఈ ప్రమాద బీమా పథకం అత్యుత్తమంగా నిలుస్తుందని కలెక్టర్ కొనియాడారు. పథకం ద్వారా ప్రమాదవశాత్తు్త మరణించినా లేదా అంగవైకల్యం ఏర్పడినా వలంటీర్లకు రూ.లక్ష పరిహారం అందుతుంది. అవయవాన్ని కోల్పోతే రూ.50 వేల పరిహారం ఇస్తారు. -
బీమా కంపెనీల ఆఫర్.. పెళ్లి క్యాన్సిల్ అయితే రూ.10 లక్షలు!
మన దేశంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహం.. అంటే రెండు మనుషులే కాదు ఇరు కుటుంబాల కలయిక. పెళ్లి అనేది జన్మ జన్మల బంధం అని అంటారు. అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు(మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్) అని అంటారు. అయితే, అలాంటి పెళ్లిళ్లు కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల వాయిదా లేదా రద్దు కావడం జరగుతుంటాయి. కేవలం గత రెండేళ్ల కాలంలో కరోనా కారణంగా అనేక పెళ్లిళ్లు వాయిదా పడిన సంఘటనలు, రద్దు అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కరోనా మహమ్మారి మరో రూపం ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా వివాహాలు రద్దయితే అటు ఆడపెళ్లి వారికి, ఇటు మగపెళ్లి వారికి చాలా ఆర్థిక నష్టం చేకూరుతుంది. అయితే ఇకపై ఆర్థికంగా నష్టపోకుండా ఉండటానికి పెళ్లిళ్లపైనా కూడా పలు కంపెనీలు బీమాను అందిస్తున్నాయి. ఈ మేరకు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పేరుతో పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? వివాహ బీమా అంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల వివాహం రద్దు అయిన, ఏదైనా ఇతర నష్టం జరిగిన భీమా కంపెనీలు డబ్బులు చెలిస్తాయి. అయితే, కొన్ని నిబందనలను మాత్రం తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. వివాహ బీమా అనేది స్థూలంగా నాలుగు కేటగిరీల కింద వర్తిస్తుంది. లయబులిటీస్ కవరేజ్: పెళ్లి వేడుక సమయంలో జరిగే ప్రమాదాల వల్ల తృతీయపక్షాల ఆస్తులకు ఏమైనా నష్టం జరిగితే ఈ భీమా కవర్ చేస్తుంది. క్యాన్సిలేషన్ కవరేజ్: అనివార్య కారణాల వల్ల హఠాత్తుగా పెళ్లి రద్దు కావడం వల్ల జరిగే నష్టాన్ని ఇది భర్తీ చేస్తుంది. ఆస్తుల నష్టం: పెళ్లి వేడుకల సమయంలో యజమాని ఆస్తులకు ఏదైనా నష్టం కలిగితే ఇది వర్తిస్తుంది. వ్యక్తిగత ప్రమాదం: కొన్ని సార్లు పెళ్ళికి అని బయలుదేరుతున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రి పాలైన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురులకు ఎదురయ్యే ఖర్చులకు ఈ బీమా వర్తిస్తుంది. బీమా ప్రీమియం ఎంత? పెళ్లి అనివార్య కారణం వల్ల ఆగిపోయినప్పుడు లభించే వివాహ బీమా అనేది మీరు ఎంత బీమా చేశారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి బీమా ప్రీమియం అనేది మీకు ఇచ్చే హామీ మొత్తంలో 0.7 శాతం నుంచి 2 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు రూ.10 లక్షల వివాహ బీమా కావాలంటే, అప్పుడు మీరు రూ.7,500 నుంచి 15,000 ప్రీమియం చెల్లించాలి. (చదవండి: అయ్యో! అదృష్టం తలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయిందే) -
అనారోగ్యంతో భర్త మృతి.. భార్య ఖాతాలో బీమా డబ్బులు పడటంతో అత్త మామ దారుణం..
సాక్షి,శివమొగ్గ(బెంగళూరు): ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన కోడలిపై అత్త, మామ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దారుణ ఘటన శనివారం శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా హోళెనల్కెర గ్రామంలో చోటుచేసుకుంది. రిహానా బాను మంటల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు... తడగ గ్రామానికి చెందిన రిహానాబానుకు ఏడేళ్ల క్రితం ఇమ్రాన్ అలీకి ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఏడాది క్రితం ఇమ్రాన్ క్యాన్సర్‌తో మృతి చెందాడు. అప్పటి నుంచి రిహానా తన ఇద్దరు పిల్లలతో వేరుగా ఉంటోంది. రెండు రోజుల క్రితం భర్తకు చెందిన ఇన్సూరెన్స్ నగదు రూ .2 లక్షలు వచ్చాయి. నగదు ఆమె ఖాతాలో పడింది. ఈ విషయం తెలుసుకున్న అత్త, మామ కోడలు ఉంటున్న ఇంటికి వచ్చారు. డబ్బుల కోసం గొడవ పడ్డారు. డబ్బులు ఇచ్చేది లేదని చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వారు కోడలిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. తీవ్ర గాయాలతో రిహానా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి..