న్యూఢిల్లీ: బీమా ఉత్పత్తులకు సంబంధించి అన్ని రకాల సేవలు అందించే ‘బీమా సుగం’ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఏర్పాటును బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ముసాయిదాను విడుదల చేస్తూ, మార్చి 4 నాటికి దీనిపై అభిప్రాయాలు తెలిజేయాలని కోరింది.
పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ, వారి సాధికారత కోసం ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ (ఆన్‌లైన్ వేదిక)ను ప్రతిపాదిస్తున్నట్టు ఐఆర్‌డీఏఐ ప్రకటించింది. దేశంలో బీమా వ్యాప్తికి (మరింత మందికి చేరువ), లభ్యత, అందుబాటు ధరల కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.
కస్టమర్లు, బీమా సంస్థలు, మధ్యవర్తులు లేదా బీమా ఇంటర్‌మీడియరీలు, ఏజెంట్లకు ఇది ఏకీకృత పరిష్కారంగా ఉంటుందని పేర్కొంది. పారదర్శకతను, సమర్థతను, బీమా వ్యాల్యూ చైన్ వ్యాప్తంగా సహకారానికి, టెక్నాలజీ ఆవిష్కరణలకు, బీమా సార్వత్రీకరణకు, 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యం సాకారానికి తోడ్పడుతుందని వివరించింది. ఇది లాభాపేక్ష రహిత సంస్థగా పనిచేయనుంది. బీమా సుగంపై ఎవరికీ నియంత్రిత వాటా ఉండదని, జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు వాటాదారులుగా ఉంటాయని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment