marketplaces
-
పాలసీదారుల కోసం ‘బీమా సుగం’
న్యూఢిల్లీ: బీమా ఉత్పత్తులకు సంబంధించి అన్ని రకాల సేవలు అందించే ‘బీమా సుగం’ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఏర్పాటును బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ముసాయిదాను విడుదల చేస్తూ, మార్చి 4 నాటికి దీనిపై అభిప్రాయాలు తెలిజేయాలని కోరింది. పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ, వారి సాధికారత కోసం ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ (ఆన్లైన్ వేదిక)ను ప్రతిపాదిస్తున్నట్టు ఐఆర్డీఏఐ ప్రకటించింది. దేశంలో బీమా వ్యాప్తికి (మరింత మందికి చేరువ), లభ్యత, అందుబాటు ధరల కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. కస్టమర్లు, బీమా సంస్థలు, మధ్యవర్తులు లేదా బీమా ఇంటర్మీడియరీలు, ఏజెంట్లకు ఇది ఏకీకృత పరిష్కారంగా ఉంటుందని పేర్కొంది. పారదర్శకతను, సమర్థతను, బీమా వ్యాల్యూ చైన్ వ్యాప్తంగా సహకారానికి, టెక్నాలజీ ఆవిష్కరణలకు, బీమా సార్వత్రీకరణకు, 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యం సాకారానికి తోడ్పడుతుందని వివరించింది. ఇది లాభాపేక్ష రహిత సంస్థగా పనిచేయనుంది. బీమా సుగంపై ఎవరికీ నియంత్రిత వాటా ఉండదని, జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు వాటాదారులుగా ఉంటాయని ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. -
బీమా సుగమ్.. వీలైనంత త్వరలో
ముంబై: బీమా సుగమ్ పేరుతో ఆన్లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఆగస్ట్ నాటికి ఇది వస్తుందనుకోగా, అంతకంటే ఎక్కువ సమయం తీసుకోనుందని తాజా సమాచారం. దీన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దే పనిలో బీమా రంగ అభివృద్ధి నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) ఉంది. బీమా సుగంతో దేశంలో బీమా సేవల విస్తరణ పెరుగుతుందని, క్లెయిమ్‌ల ప్రక్రియ మరింత సులభంగా మారుతుందని భావిస్తున్నారు. బీమా సుగమ్ ప్రారంభమైతే బీమా కంపెనీలు దీని ద్వారా తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు పాలసీల కొనుగోలు, క్లెయిమ్‌లు సహా అన్ని రకాల సేవలను ఒకే వేదికగా పొందొచ్చు. శుక్రవారం ముంబైలో ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏబీఏఐ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీమా సుగం ఎంతో క్లిష్టమైన ప్రాజెక్ట్ అని, కస్టమర్‌కు అన్ని రకాల ఎంపికలను ఒకే వేదికంగా అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఎలాంటి సమస్యల్లేని విధంగా ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడంపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. హెల్త్ క్లెయిమ్స్ ఎక్సే్ఛంజ్ ఏర్పాటుపైనా ఐఆర్డీఏఐ దృష్టి పెట్టింది. దీన్ని వేగంగా తీసుకొచ్చేందుకు సాధారణ బీమా సంస్థల సీఈవోలతో మాట్లాడినట్టు పాండా తెలిపారు. సమయం ఆదా బీమా సుగమ్‌తో సమయం ఆదా అవుతుందని పాండా చెప్పారు. బీమా సంస్థలకు క్లెయిమ్‌ల ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. పాలసీదారులు, ఆస్పత్రులు ఆన్లైన్లోనే క్లెయిమ్ పురోగతిని ట్రాక్ చేసుకోవచ్చని చెప్పారు. -
రైతులకు తీపికబురు.. ముడిసరుకుల కోసం ఆన్లైన్ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్!
బెంగళూరు: వ్యవసాయ రంగ టెక్నాలజీ స్టార్టప్ ‘నర్చర్.ఫార్మ్’ కొత్తగా ఒక ఆన్లైన్ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌ను ‘నర్చర్.రిటైల్’ పేరుతో ఆవిష్కరించింది. దేశంలో అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందే వ్యవసాయ ముడి సరుకుల మార్కెట్ ప్లాట్‌ఫామ్‌గా దీన్ని తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని సంస్థ ప్రకటించింది. తయారీదారులు, రిటైలర్లు, డీలర్ల మధ్య డిజిటల్ అనుసంధానత కల్పిస్తుందని పేర్కొంది. నర్చర్ రిటైల్ అనే యాప్ రెండు తెలుగు రాష్ట్రాలు సహా 13 రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకొచి్చనట్టు తెలిపింది. రిటైల్ విక్రయదారులు, పంపిణీదారులు.. పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, నూట్రిషన్, బయోలాజికల్ ఉత్పత్తులు, సాగు ఎక్విప్మెంట్, విత్తనాలు, పశు దాణాను నేరుగా తయారీదారుల నుంచి కొనుగోలు చేసుకోవడానికి తమ ప్లాట్‌ఫామ్ వీలు కల్పిస్తుందని సంస్థ ప్రకటించింది. (చదవండి: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట తీవ్ర విషాదం) -
రెగ్యులేటరీ బాడీ కావాలంటున్న ఈ-కామర్స్
న్యూఢిల్లీ : టెలికాం, ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్ల మాదిరిగా తమకు ఓ రెగ్యులేటరీ బాడీ కావాలంటున్నారు ఆన్ లైన్ సెల్లర్స్. ఆన్ లైన్ మార్కెట్ ప్లాట్ ఫామ్ లో జరుగుతున్న నిర్వహణ లోపాలను ఈ రెగ్యులేటరీతో అరికట్టవచ్చని పేర్కొంటున్నారు. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ కు రెగ్యులేటరీ బాడీ ఏర్పాటుచేయాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాకు ఆల్ ఇండియా ఆన్ వెండర్స్ అసోసియేషన్(ఏఐఓవీఏ) ఓ వినతి పత్రం సమర్పించింది. ఈ రెగ్యులేటరీ ఏర్పాటుతో పన్నుల పరంగా వచ్చే ఇబ్బందులను కూడా తొలగించాలని అభ్యర్థించారు. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఆఫర్ చేసే కమిషన్ చార్జీలపై కూడా పన్నులు చెల్లించాల్సి వస్తుందని, దాంతో పాటు వాల్యు యాడెడ్ టాక్స్, సర్వీసు టాక్స్ ల కింద కొరియర్ చార్జీలను వసూలుచేస్తున్నారని, వీటినుంచి ఉపశమనం కలిగించాలని సెల్లర్స్ అసోసియేషన్ లేఖలో పేర్కొంది. అమ్మకాల వాల్యుమ్ పైనా, ఖర్చులపైనా వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్నామని, అవి అమ్మక ధరల్లో దాదాపు 25 నుంచి 30 శాతం ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వం ఈ పన్నులను తగ్గిస్తే, ఉత్పత్తులపై కూడా ధరలు తగ్గుతాయని ఆన్ లైన్ వెండర్స్ అసోసియేషన్ ఓ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 1000 మధ్యస్త, ఎగువస్థాయి అమ్మకపు ప్రతినిధులు ఈ విషయంపై జయంత్ సిన్హాకు ఫిర్యాదుచేశారు. మార్కెట్ ప్లేస్ ఎగ్జిక్యూటివ్ లు నిర్వహణపూరితంగా ఉందని, పరస్పర సంప్రదింపులతో తమకు న్యాయం జరగడం లేదని చెప్పారు. టెలికాం, ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్స్ కు ఉన్నట్టు తమకు కూడా ఓ ఆన్ లైన్ రెగ్యులేటరీ కావాలని కోరారు.