బెంగళూరు: వ్యవసాయ రంగ టెక్నాలజీ స్టార్టప్ ‘నర్చర్.ఫార్మ్’ కొత్తగా ఒక ఆన్‌లైన్ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌ను ‘నర్చర్.రిటైల్’ పేరుతో ఆవిష్కరించింది. దేశంలో అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందే వ్యవసాయ ముడి సరుకుల మార్కెట్ ప్లాట్‌ఫామ్‌గా దీన్ని తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని సంస్థ ప్రకటించింది. తయారీదారులు, రిటైలర్లు, డీలర్ల మధ్య డిజిటల్ అనుసంధానత కల్పిస్తుందని పేర్కొంది.
నర్చర్ రిటైల్ అనే యాప్ రెండు తెలుగు రాష్ట్రాలు సహా 13 రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకొచి్చనట్టు తెలిపింది. రిటైల్ విక్రయదారులు, పంపిణీదారులు.. పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, నూట్రిషన్, బయోలాజికల్ ఉత్పత్తులు, సాగు ఎక్విప్‌మెంట్, విత్తనాలు, పశు దాణాను నేరుగా తయారీదారుల నుంచి కొనుగోలు చేసుకోవడానికి తమ ప్లాట్‌ఫామ్ వీలు కల్పిస్తుందని సంస్థ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment