ఏలూరు, సాక్షి: ఏపీ బీజేపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. రాష్ట్రంలో.. అందునా కూటమిలో పార్టీ పరిస్థితిపై మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత అంబికా కృష్ణ(Ambika Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో భాగమైనప్పటికీ బీజేపీని మిగతా పార్టీల పెద్దలు పట్టించకోవడం లేదని, ఎక్కడ చూసినా టీడీపీ, జనసేన జెండాలే కనిపిస్తున్నాయిన ఆగ్రహం వ్యక్తం చేశారాయన.
‘‘కూటమి ప్రభుత్వంలో బీజేపీ(BJP) ప్రతీ కార్యకర్త బాధపడుతున్నారు. తమకు సరైన గుర్తింపు లేదనుకుంటున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తేనే 164సీట్లు వచ్చాయి. మేమందరం తిరిగితేనే కదా కూటమి గెలిచింది. కానీ, ఇప్పుడు ఎక్కడా జనసేన, టీడీపీ జెండాలు కనబడుతున్నాయి తప్ప బీజేపీ జెండాలు కనబడటం లేదు.
ప్రభుత్వ కార్యక్రమాలకు ఏపీ బీజేపీ నేతలకు ఆహ్వానించడం లేదు. ఆఖరికి.. రోడ్లు ఓపెనింగ్ కార్యక్రమాలు జరిగిన పిలవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ సైతం మెమరాండం ఇచ్చాము.. కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వ వ్యవహార శైలితో బీజేపీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. మోదీ పథకాలు డబ్బు ద్వారానే రాష్ట్రం నడుస్తోంది. ప్రధానిమోడీ ఇచ్చే డబ్బులు వాడుకుంటూ బీజేపీ నేతలను కార్యక్రమాలకు ఎందుకు పిలవరు.?.. అని అంబికా కృష్ణ నిలదీశారు.
తాజాగా ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. సమీక్షా సమావేశంలో బీజేపీ నేతలకు కీలక సూచనలు చేశారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ఇది జరిగి మూడు రోజులు కాకముందే.. ఈ వ్యాఖ్యలు తెరపైకి రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment