
ఏలూరు జిల్లా: గతేడాది ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు.. ఒక్కొక్కటిగా కాల గర్భంలో కలిపేసే యత్నాలే జరుగుతున్నాయి. అప్పుడు ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలని ఉద్దేశంతో మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి మాత్రం డొంక తిరుగుడు మాటలు చెబుతున్నారు. ప్రజలు తమకు ఏదో చేస్తారని ఓటేస్తే.. మరి చంద్రబాబేమో వింత వ్యాఖ్యలు చేస్తున్నారు.
‘‘అప్పులు పుట్టడం లేదు’’ అపి ప్రజలకు చెబుతున్నారు. అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్లూ.. కానీ గల్లా పెట్టె ఖాళీ అయిపోయింది’ అంటూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజవర్గం అగిరపల్ల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ అప్పు తేవాలన్నా.. ఇచ్చేవాడులేడు.. అప్పులు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. పరపతి ఉంటే.. డబ్బులు తిరిగి ఇస్తారనే నమ్మకం ఉంటే అప్పులు ఇస్తారు.. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు చంద్రబాబు.
అసలు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా.. అని ఒకవైపు జనం అనుకుంటుంటే, బాబు గారు మాత్రం తాను పథకాల్ని అమలు చేయలేనని పరోక్షంగా జనాలకు చెప్పేస్తున్నారు చంద్రబాబు.