
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు కేఎస్ఎన్ కాలనీ వద్ద రూ. 22 కోట్ల 44 లక్షల రూపాయల నిధులతో 30 గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి అప్పటి మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న(బుధవారం) రాత్రి సమయంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు జేసీబీతో శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.
ధ్వంసం అయిన శిలాఫలకాన్ని మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ. పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ.. శిలాఫలకాన్ని జేసీబీతో కూల్చడం హేయమైన చర్య అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పి, అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? అంటూ ప్రశ్నించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను శిక్షించాలని.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కొట్టు సత్యనారాయణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment