kottu satyanarayana
-
భక్తులు భారీగా వస్తారని తెలిసినా.. ఎందుకు ఇలా చేశారు
-
‘చంద్రబాబు విధ్వంసం.. పురందేశ్వరికి కనబడలేదా?’
సాక్షి, తాడేపల్లి: పురందేశ్వరి (Purandeswari) కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారంటూ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu Satyanarayana) మండిపడ్డారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, చంద్రబాబు వలన హైందవ ధర్మానికి కల్గిన నష్టాల గురించి ఆమె ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు.చంద్రబాబు వలన గోదావరి పుష్కరాలలో 29 మంది హిందూ భక్తులు చనిపోయినా ఆమె పట్టించుకోలేదు. విజయవాడలో చంద్రబాబు 50 ఆలయాలను కూల్చేసినా ఆమెకి కనపడలేదు. కానీ వైఎస్ జగన్ పాలనపై మాత్రం అనవసర ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆలయాలను నిర్మించారు. ఆలయాల్లో ఉన్న అర్చకులకు వేతనాలను పెంచారు. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేసింది కూడా జగనే. వంశపారంపర్య హక్కులను జగన్ తీసుకువచ్చారు’’ అని కొట్టు సత్యనారాయణ వివరించారు.కాణిపాకం, కాళహస్తి, శ్రీశైలం, అమరావతి, ద్రాక్షారామం, కనకదుర్గమ్మ గుడి, సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం, వాడపల్లి, అంతర్వేది, అయినవల్లి.. ఇలా అనేక ఆలయాల్లో అభివృద్ధి చేశారు. విజయవాడ గుడికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 49 ఆలయాల్లో ఏకకాలంలో కుంభాభిషేకాన్ని జగన్ నిర్వహించారు. కంచి పీఠాధిపతి సైతం దీన్ని మెచ్చుకున్నారు. శ్రీ వాణి ట్రస్టు ద్వారా 3 వేల ఆలయాలను కొత్తగా జగన్ హయాంలో నిర్మించారు. ఇలా చేసిన అనేక మంచి కార్యక్రమాలు పురందేశ్వరికి కనపడలేదు.ఇదీ చదవండి: సీజ్ ద షిప్.. సర్వం లాస్!కేవలం చంద్రబాబు దగ్గర మార్కులు పొందటానికే గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైందవ శంఖారావంలో రాజకీయాలు మాట్లాడటం పురంధేశ్వరికే చెల్లింది. చంద్రబాబు కోసమే ఆమె పని చేస్తున్నారు. సెక్షన్ 83 ని సవరణ చేసి ఆలయ భూముల లీజులు వసూలు చేయటం, అన్యాక్రాంతమైన భూములను కాపాడారు. ఈ చట్ట సవరణను ఇతర రాష్ట్రాలు సైతం అనుసరించాయి. తిరుమల లడ్డూని అనవసరం వివాదం చేశారు.దీని వలన హిందూ సమాజానికి ఏమైనా మేలు జరిగిందా?. హైందవ శంఖారావంలో పీఠాధిపతులు చెప్పినవన్నీ జగన్ చేసి చూపించారు. దాన్ని కొనసాగేలా ఇప్పటి ప్రభుత్వం చూడాలి. అంతేతప్ప ప్రత్యర్థులపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’’ అని కొట్టు సత్యనారాయణ హితవు పలికారు. -
సినిమా డైలాగులకు తప్ప దేనికి పనికిరాడు.. చంద్రబాబుకు బుద్ధి రావాలని దేవుడ్ని కోరుకున్న
-
పవన్, బాబును ఏకిపారేసిన కొట్టు సత్యనారాయణ
-
బాబూ.. ప్రధాని మోదీ మాటలు గుర్తున్నాయా?: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి: కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టిందన్నారు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా నడుస్తుందని ఆరోపించారు. అలాగే, బుడమేరు మునగడానికి కారణం కూటమి నేతలు కాదా? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం 67వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 67వేల కోట్లు ఏ పథకాలకు ఖర్చుపెట్టారు?.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు సార్లు కరెంట్ బిల్లులు పెంచారు. రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం 67వేల కోట్లు భారం మోపారు. సోలార్ పవర్ 2400 మెగావాట్స్ వైఎస్సార్సీపీ హయాంలో 2.49 రూపాయలకు కొంటే, టీడీపీ హయాంలో 5.90 రూపాయలకు కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉచిత ఇసుక పేరుతో 750 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా నడుస్తుంది.అమరావతికి కొత్త కళ అంటున్నారు. 2014 నుంచి కూడా చంద్రబాబు గ్రాఫిక్ పాలిటిక్స్ చేస్తున్నారు. బుడమేరు మునగడానికి కారణం మీరు కాదా?. బుడమేరు బాధితులకు భారీగా విరాళాలు సేకరించారు.. అవి ఎవరికి ఖర్చుపెట్టారు?. బుడమేరులో డ్రామా నాయుడు చేసిన పనుల్లో అప్పుడే లికేజ్ మొదలయ్యాయి. పోలవరంలో అవినీతి జరిగింది అనడానికి సిగ్గు ఉందా?. ప్రధాని మోదీనినే చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు పోలవరాన్ని ఏటీంఎంలా వాడుకున్నారని కామెంట్స్ చేశారు. ప్రధాని మాటలను కూటమి నేతలు మర్చిపోయారా?.మొన్నటి వరకు అమరావతి, తిరుపతి లడ్డు, పోలవరం పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేశారు.. ఇప్పుడు కొత్తగా సీజ్ ది షిప్ అని మొదలుపెట్టారు. అక్కడ రెండు షిప్‌లు ఉంటే ఒక్కటే సీజ్ చేయడానికి కారణం ఏంటి?. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ పోర్టుకి వెళ్తే నన్నే రానివ్వలేదు అనడానికి సిగ్గుపడాలి. తాడేపల్లిగూడెంలో మూడు లారీల పీడీఎస్ బియ్యం సీజ్ చేస్తే వాటిని ఎవరు వదిలేశారు?. రైతులకు ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు.. రైతులను ఆదుకోలేదు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. 30వేల మంది ఆడపిల్లలు కనిపించడంలేదన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎంత మంది ఆడపిల్లలను కనిపెట్టారు?. తాడేపల్లిగూడెంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి పట్టణంలో ఐదు హత్యలు జరిగాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కోడి పందాలు, పేకాట క్లబ్‌లు నడుపుతున్నారు. పోలవరం గట్లపై ఉన్న ఎర్ర కంకరను కూటమి నాయకులు దోచుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయంలో రైతులు ఆనందంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలను డైవర్షన్ చేయడానికి అనేక రకాల కొత్త వేషాలు వేస్తున్నారు. ప్రజలను అన్ని విషయాల త్వరలోనే తెలుస్తాయి’ అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రజలు చెప్పుతో కొట్టే రోజు దగ్గరలో ఉంది
-
‘సూపర్ సిక్స్’ హామీలకు ఎంత ఖర్చు చేశావ్ బాబూ?’
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఐదు నెలల్లో రూ. 59 వేల కోట్లు అప్పులు తెచ్చిన కూటమి ప్రభుత్వం.. సూపర్ సిక్స్ హామీలకు ఎంత ఖర్చు చేసిందంటూ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. ఆదివారం ఆయన తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐదు నెలల పాలనలోనే ప్రజలు తిరస్కరించే స్థితికి వచ్చారని దుయ్యబట్టారు.‘‘ప్రజలు ఓటు వేశారంటే.. ఆంబోతుకి అచ్చేసి వదిలేసినట్లు కాదు. అధికారం వస్తే ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించడం కాదు. స్థానిక ఎమ్మెల్యే అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు. ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతుంటే దానికి స్థానిక ఎమ్మెల్యే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాడేపల్లిగూడెంలో లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకున్నవా? మీ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల కాలంలో పట్టణంలో నాలుగు హత్యలు జరిగాయి. నేరుగా బెల్టు షాపులు గురించి మీ ఎల్లో మీడియాలొనే రాస్తున్నారు.. మాట్లాడే ముందు సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలి’’ అని కొట్టు సత్యనారాయణ హితవు పలికారు.‘‘రోడ్లు, గుంతలు గురించి మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లలో ఎన్ని రోడ్లు వేశారు?. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నవాబ్‌పాలెం నుంచి నిడదవోలు, చిలకంపాడు లాకుల నుండి వెంకట్రామన్నగూడెం వరకు రూ. 45 కోట్ల నిధులతో నాలుగు లైన్స్ రోడ్లు వేశాం కనబడట్లేదా?. వైఎస్ జగన్ కుటుంబం గురించి మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడాలి. చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడగలవా?’’ అంటూ కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.‘‘ప్రస్తుత ఎమ్మెల్యే ఇక్కడ మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నపుడు శారదా గ్రంథాలయం విషయంలో ఏం జరిగిందో అందరికి తెలుసు. అప్పడు నువ్వు డబ్బుల కోసం ఆపిన శారదా గ్రంథాలయం ప్రాంతంలో పెట్టిన వ్యాపారాన్ని నువ్వే ఇప్పుడు ప్రారంభోత్సవం చేశావ్. ప్రభాత థియేటర్ వెనకాల చేసిన సెటిల్మెంట్లో ఎంత తీసుకున్నావ్? ఎల్ఈడి లైట్లు పేరు మీద ఎంత నొక్కేసావ్?’’ అంటూ కొట్టు సత్యనారాయణ నిలదీశారు.‘‘నా కుమారులు గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. తిరుపతి దర్శనాలలో అవినీతి జరగకూడదని వారికి అప్పగించాను. 2018లో దారిలో అమ్మేస్తున్న పీడిఎస్ బియ్యం లారీలు పట్టుకుని పెద్దాపురం పోలీస్ స్టేషన్లో పెడితే దాని కాంట్రాక్టు పేరు మార్చుకోలేదా? నిన్న కాక మొన్న మీకు సంబంధించిన వాళ్ల పీడీఎస్ బియ్యం లారీలు పట్టుకుంటే ఎమ్మెల్యే తన కొడుకు ద్వారా సెటిల్మెంట్ చేయించారు. కంగారు పడకు ప్రజల చేతుల్లో చెప్పు దెబ్బలు తినే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఒక సలహా ఇస్తున్నా గోతులు పూడిపించాను అని చెప్పడం మానేసి రోడ్ల నిర్మాణానికి ఎంత శాంక్షన్ చేశారో చెప్పాలి’’ అని కొట్ట సత్యనారాయణ అన్నారు. -
చంద్రబాబుపై కొట్టు సత్యనారాయణ కామెంట్స్
-
మోసం అనే పదానికి బాబు బ్రాండ్ అంబాసిడర్: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి: ప్రజలను మోసం చేయడం అనే పదానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని సెటైర్లు వేశారు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. రాష్ట్ర పరిపాలనా చేతకాక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో వరద బాధితుల కోసం ప్రజలు కదిలి వస్తే ఒక్క రూపాయి కూడా బాధితులకు ఇవ్వలేదని మండిపడ్డారు.మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలను మభ్యపెట్టి లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. బాదుడే బాదుడు అనే కార్యక్రమంతో ఇంటి ఇంటికి తిరిగి పెరిగిన రేట్లుపై లేనిపోని కథలు అల్లారు. మరి నిత్యవసర వస్తువులు, పెట్రోలు మీద పెరిగిన రేట్లు తగ్గించే ప్రయత్నం ఎందుకు చేయలేదు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 55వేల కోట్లు అప్పులు చేశారు. చేసిన అప్పులు ఎక్కడికి వెళ్లాయి. కరెంట్ చార్జీలు పెంచమని అన్న మీరు ఇప్పుడు సామాన్య ప్రజలపై ఎలా భారం మోపారు. ఇసుక రేట్లు భారీగా పెంచేసి ప్రజలకు మరింత కఠినతరం చేశారు. ఇసుక కొరత వల్ల భవన కార్మికులకు పని దొరక్కపోవడంతో రోడ్డున పడ్డారు. రూ.99కే నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పి భారీ రేట్లతో మద్యం అమ్మకాలు చేస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్టు షాపులు దర్శనం ఇస్తుంటే మన రాష్ట్రం ఎక్కడ పోతుందని భయమేస్తుంది.40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్. కుట్రలు కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. వరద బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో వచ్చిన కొన్ని వేల కోట్ల రూపాయలు సాయం చేస్తే ఒక్క రూపాయి ప్రజలకు పంచిన పాపన పోలేదు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిపోయిందో చెప్పాలి. అగ్గిపెట్టలు, కొవ్వొత్తులకు 23కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్పడం సిగ్గు చేటు. చంద్రబాబుకి దేవుడు మీద విశ్వాసం లేదు, తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని పచ్చి అబద్ధాలు చెప్పాడు. దీనికి తోడు ఎల్లో మీడియాలో విష ప్రచారం చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు.. చంద్రబాబుకు మొట్టికాయలు వేసింది. పాలన చేతకాక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు.షర్మిలతో చేయి కలిపి వైఎస్ జగన్ కుటుంబాన్ని చంద్రబాబు విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ బలంగా ఉండడంతో ఎలాగైనా బలహీనం చేసేందుకు షర్మిలతో ఆస్తి పంపకాలు నాటకాలు మొదలు పెట్టాడు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ నిర్వీర్యం చేస్తున్నారు. నిమ్మల రామానాయుడు మంత్రిలాగా వ్యవహరించడం లేదు.. డ్రామా ఆర్టిస్టులా ప్రవర్తిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై కనీస అవగాహన లేకుండా మంత్రి మాట్లాడం హాస్యాస్పదం.ఆనాడు ప్రత్యేక హోదా గాలికి వదిలేసి పోలవరం డ్రామాలు ఆడారు. పోలవరం పూర్తి అయితే కోటి ఎకరాలు ఆయకట్టు బాగుపడుతుందని వైఎస్సార్ వేసిన ఆశయం వైఎస్ జగన్ 80 శాతం పూర్తి చేశారు. ప్రజలు సూపర్ సిక్స్ నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. కూటమి అధికారంలోకి వచ్చినా సూపర్ సిక్స్ ఎక్కడా లేదు. అమ్మఒడిని తల్లికి వందనం అని పేరు పెట్టి చేతులు దులుపుకున్నారు. పేద విద్యార్థుల కోసం ఏడు మెడికల్ కాలేజీలు కడితే వాటిని నిర్వీర్యం చేసి విద్యార్థుల గొంతు కోశారు. రైతులను కూడా కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేందుకు వైఎస్సార్సీపీ పలు కార్యక్రమాలతో ముందుకు వస్తుందని స్పష్టం చేశారు. -
సెంటిమెంట్ మీద కొట్టావ్..
-
నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి: కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు మాజీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. అలాగే, బూట్లు వేసుకుని దేవుడిని పూజించే సంస్కారం చంద్రబాబుది అంటూ ఘాటు విమర్శలు చేశారు. చేతకాని కూటమి పాలనను ప్రజలు నిలదీస్తారని ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలకు తెరలేపారా? అంటూ ప్రశ్నించారు.మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం పశ్చిమ గోదావరిలో మీడియాతో మాట్లాడుతూ..‘గత రెండు మూడు రోజులుగా నీచాతినీచమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తానే అని చెప్పుకునే విధంగా సీఎం చంద్రబాబు ఆ కలియుగ దైవాన్ని అడ్డుపెట్టుకున్నాడు. వంద రోజుల పరిపాలన గురించి మాట్లాడకూడదని డైవర్షన్‌గా నీచ రాజకీయాలు చేస్తున్నారు. పవిత్రమైన తిరుపతి ప్రసాదంపై ఎంతో దారుణంగా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఆ వేంకటేశ్వరస్వామి సహించడు. తిరుపతిలో ఏ వస్తువు కొనాలన్నా టెండర్ ప్రకారం పూర్తిగా తనిఖీలు అయ్యాకే అనుమతి ఇస్తారు. నిజంగా జూలై 22న రిపోర్ట్ వస్తే ఇంతకాలం ఎందుకు తొక్కి ఉంచారు. నీ చేతకాని 100రోజుల పరిపాలన ప్రజలు నిలదీస్తారని ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలకు తెరలేపారా?. ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిరం కట్టి తిరుపతిలో అడ్మినిస్ట్రేషన్ నచ్చి వారిని అయోధ్యకు తీసుకెళ్లారు. తిరుపతి వంటి అడ్మినిస్ట్రేషన్ అయోధ్యలో తీసుకురావాలని చూశారు. అటువంటి తిరుపతిలో తప్పు జరిగిందని చెప్పడం ఎంత దారుణం. కోట్లాది మంది హిందూ భక్తులు మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు. బూట్లు వేసుకుని దేవుడిని పూజించే సంస్కారం చంద్రబాబుది. నీ హయాంలో జరిగిన తప్పు ఎవరి మీదకి నెట్టేస్తున్నావ్. ఇదంతా వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు. తగిన మూల్యం చెల్లించక తప్పదు. హాథిరామ్ మఠం దేవాదాయ శాఖ భూములను కాజేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తున్నారు. గత ఐదేళ్లలో దేవాలయాలు చాలా బాగా నడిచాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాలను అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది. సీజీఎఫ్ నిధుల ద్వారా 600 కోట్లతో పురాతన దేవాలయాలు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 4100 పైగా దేవాలయాలను అభివృద్ధి చేశాం. మేము దేవాలయాలను ఇంత అభివృద్ధి చేస్తే చంద్రబాబు దేవాదాయ శాఖలో రివ్యూ చేసి గత ప్రభుత్వంలో జరుగుతున్న దేవాలయాల పనులను ఆపేయమని ఆదేశాలు జారీచేశారు. ఇదంతా చూస్తూ బీజేపీ నాయకులు ఎందుకు నిలదీయడంలేదు. కూటమి భాగస్వాములు ఏం చేస్తున్నారు.సూపర్ సిక్స్ అన్నారు ఏమైపోయింది. ఒక ప్రాంతంలో వచ్చిన వరదను కూడా మీరు ఎదుర్కోలేక పోయారు. దేశ రాజకీయాల్లో ఎక్కడ కూడా చంద్రబాబు లాంటి నీచమైన నాయకుడు ఉండడు. ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకుని లెంపలు వేసుకుని చేసిన తప్పు ఒప్పుకో. మన రాష్ట్రానికే తలమానికంగా నిలిచే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మీదే నిందలు వేయడం అత్యంత బాధాకరం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: దేవుడి మీద రాజకీయం చంద్రబాబుకే చెల్లింది: ఎమ్మెల్సీ బొత్స -
టీడీపీ తల్లికి వందనంపై కొట్టు సత్యనారాయణ సెటైర్లు
-
చంద్రబాబుపై కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
-
ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం: కొట్టు సత్యనారాయణ
పశ్చిమగోదావరి: ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేయాలని చూసే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. 2019లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చారని తెలిపారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘‘రెండేళ్లు కరోనాతో పోరాడాం. ఐదేళ్లు పూర్తి స్థాయిలో పదవికి న్యాయం చేసి ప్రజలకు మేలు చేశాం. కార్పొరేట్ విద్య ద్వారా దోచుకుంటున్న తరుణంలో దానికి ధీటుగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకొచ్చాం. ప్రజలు సంక్షేమ పథకాలు ద్వారా సంతృప్తితో ఉన్నారని అనుకున్నాం. కానీ ప్రలోభాలకు గురి అవుతారని అనుకోలేదు...సంక్షేమ పథకాలు ద్వారా ఏడాదికి 70 వేల కోట్లు ఇచ్చేస్తూ ప్రభుత్వాన్ని అప్పుల పాలు అయిపోతుందని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంతకుమించి హామీలు ఇచ్చారు. వాలంటీర్లను నానా మాటలు అని మేము వస్తే 10వేలు ఇస్తామని ప్రలోభ పెట్టారు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో గెలిచిన వ్యక్తి గత ఎన్నికల్లో నా మీద 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంత మాత్రాన ఏమి అయిపోలేదు. ప్రజల కోసం మేమెప్పుడు పోరాడుతూనే ఉంటాం. ..2019లో ప్రతిపక్షం నుండి అధికారంలోకి వచ్చినా మేము విర్రవీగాలేదు, దాడులు చేయలేదు, కక్ష సాధింపు చర్యలు చేయలేదు. మాధవరంలో వైఎస్సార్సీపీ నాయకుడు నోరు లేని మూగజీవలు కోసం నిల్వ పెట్టుకున్న గడ్డివాములను జనసేన కార్యకర్తలు పెట్రోల్ పోసి నిప్పటించారు. ఎన్నికల కౌంటింగ్ తరువాత స్పష్టమైన మెజారిటీ కూటమి సాధించింది. రాజ్యాంగం మీద మాకు విశ్వాసం ఉంది’’ అని అన్నారు.చదవండి: అధికారుల వల్లే నాడు టీడీపీ ఓడిపోయిందని చంద్రబాబు చెప్పగలరా? -
టీడీపీ నేతలపై కొట్టు సత్యనారాయణ ఫైర్
-
రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్
-
‘పవన్‌పై ప్రజలకు చాలా అనుమానాలున్నాయ్’
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి వారిని హక్కుదారులను చేయాలని చూస్తే కోర్టులకు వెళ్లి చంద్రబాబు అడ్డుకున్నాడంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈనాడు రామోజీరావు దుర్మార్గమైన వార్తలు రాస్తున్నాడని.. 50 ఏళ్ల సామ్రాజ్యం అనుకునే ఈనాడు తన సామ్రాజ్యాన్ని తానే కొల్లగొట్టుకుంటుందని దుయ్యబట్టారు. జెండా సభకు జనం రాకపోతే అది కప్పిపుచ్చుకునేందుకే జెండా సభకు వచ్చిన వారికి పెన్షన్లు ఇవ్వడం లేదని విషపు రాతలు రాస్తున్నారు. సేవా భావంతో పనిచేసే వాలంటీర్లు పై దుర్మార్గంగా మాట్లాడటం సరికాదు. వాలంటీర్ల వ్యవస్థ తీసేస్తే నష్టపోయేది ప్రజలే. చంద్రబాబు లాంటి తన్నే దున్నపోతు వెనుక ఎవరు వెళ్లే పరిస్థితి లేదు’’ అని మంత్రి అన్నారు. చంద్రబాబు రాసిచ్చింది చదివే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ ఊగిపోతూ మాట్లాడుతున్నాడో ప్రజలకు చాలా అనుమానాలున్నాయి. ఇటీవల కొంతమంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారు చేస్తున్నట్లు.. ఏ మాఫియా వీరికి ఏమేమి సప్లై చేస్తారో మాకు తెలియదు. పవన్ కల్యాణ్ ఉన్మాదంతోనే మాట్లాడారు. జెండా సభలో పవన్ మాట్లాడిన తీరు చూసి అసహ్యించుకుంటున్నారు. 24 సీట్లు వల్ల కాపులకు ఒరిగేదేమీ లేదు. పవన్ కల్యాణ్ డబ్బులకు అమ్ముడు పోయాడని అనుకుంటున్నారు. పవన్ తీరు చూసి కాపులు సిగ్గుపడుతున్నారు. ఒక్కొక్కరుగా జనసేనను వీడుతున్న పరిస్థితి. పవన్‌పై కాపు సామాజిక వర్గానికి నమ్మకం పోయింది. పవన్ కల్యాణ్‌ను నమ్ముకుంటే నట్టేట మునిగిపోతాం అని కాపు సామాజిక వర్గానికి అర్థమైంది’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఇదీ చదవండి: 'వ్యూహం' సినిమా రివ్యూ -
పవన్ వ్యాఖ్యలను ప్రజలు హర్షించరు
-
ఆలయ దర్శనం.. ఆధ్యాత్మిక పరవశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ, పర్యాటక శాఖ సంయుక్తంగా భక్తులకు వ్యయప్రయాసలు లేనివిధంగా ఆలయ దర్శనాలు కల్పించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో 20 ప్రముఖ, చారిత్రక ఆలయాలను అనుసంధానం చేస్తూ 18 సర్క్యూట్లను రూపొందించింది. స్పెషల్ దర్శనంతో పాటు భోజన, వసతి, రవాణా సౌకర్యాలతో కూడిన ఒకటి/రెండు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వేర్వేరుగా ఆధ్యాత్మిక సర్క్యూట్ల ప్రయాణాలను గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. నచ్చిన ప్యాకేజీల్లో నిత్య దర్శనం పిల్గ్రిమ్ పాత్‌వేస్‌కు చెందిన ‘బుక్ మై దర్శన్’ వెబ్సైట్ ద్వారా ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహించనుంది. గతంలో సీజన్ల వారీగా నడిచే ప్యాకేజీ టూర్లను ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో సాధారణ ప్యాకేజీలో పాటు కో బ్రాండింగ్ ఏజెన్సీ అయిన బుక్ మై దర్శన్ ద్వారా భక్తులు కోరుకున్న (కస్టమైజ్డ్ సర్వీసు) ఆలయాల దర్శనాలకు, పర్యటనలకు, గైడ్, భోజన వసతుల (బ్యాకెండ్ సర్వీసుల)ను కల్పిస్తోంది. ఏపీటీడీసీ బస్సులతో పాటు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీటీడీసీకి చెందిన 21 బస్సులు, మరో రెండు వాహనాలు పర్యాటక సేవలు అందిస్తున్నాయి. వీటిలో 15 బస్సులు తిరుపతిలో, మరో 8 వాహనాలు విశాఖపట్నంలో నడుస్తున్నాయి. తాజాగా ఆధ్యాత్మిక సర్క్యూట్లను నిర్వహించేందుకు ట్రాన్స్‌పోర్టు, మార్కెటింగ్ సేవలను ‘బుక్ మై దర్శన్’ అందించేలా అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుత ప్యాకేజీల ద్వారా రోజుకు 1,500 నుంచి 2వేల మంది వరకు మాత్రమే పర్యాటకులు నమోదవుతున్నారు. ఈ సంఖ్యను 5వేల వరకు పెంచాలని ఏపీటీడీసీ యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులను పెంచుతోంది. తొలి దశల్లో 18 సర్క్యూట్లను ప్రతిపాదించగా.. రెండో దశలో మరో 7 సర్క్యూట్లను తీసుకురానుంది. తిరుపతిలో బ్యాక్ ఎండ్ సర్వీసుల కింద ప్రతి పర్యాటకుడికి ఆర్ఎఫ్ఐబీ ట్యాగ్లు వేసి పక్కాగా దర్శనం కల్పించేలా సాంకేతిక వ్యవస్థను వినియోగించనుంది. ఒక రోజు ప్యాకేజీ ధరలు ఇలా (పెద్దలు/చిన్నారులు) ♦ విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, సూర్యలంక బీచ్ (రూ.970/రూ.780) ♦ హైదరాబాద్, శ్రీశైలం (రూ.1,960/రూ.1,570) ♦ కర్నూలు, శ్రీశైలం (రూ.1,560/రూ.1,250) ♦ విశాఖపట్నం సిటీ టూర్ (రూ.940/రూ.750) ♦ కర్నూలు, మంత్రాలయం (రూ.1,320/రూ.1,060) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకాకుళం, రామబాణం (రూ.1,650/రూ.1,320) ♦ విజయవాడ, అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పిఠాపురం (రూ.1,470/రూ.1,180) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకూర్మం (రూ.1,560/రూ.1,250) ♦ రాజమహేంద్రవరం, ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం(రూ.1,470/రూ.1,180) ♦ విజయవాడ, ద్వారకా తిరుమల, మద్ది ఆంజనేయస్వామి (రూ.1,610/రూ.1,290) ♦కడప, గండి, కదిరి, లేపాక్షి (రూ.1,840/1,470) 2 రోజుల ప్యాకేజీల ధరలు ఇలా ♦ కర్నూలు, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ (రూ.3,220/రూ.2,560) ♦ కర్నూలు, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, శ్రీశైలం, యాగంటి, మహానంది (రూ.4,670/రూ.3,740) ♦ విశాఖపట్నం, అరకు (రూ.3,070/రూ.2,460) ♦ కడప, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,460/రూ.3,570) ♦ కడప, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,520/రూ.3,610) -
4,500 కొత్త ఆలయాల్ని నిర్మించాం
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో 4,500 కొత్త ఆలయాల్ని నిర్మించిందని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో దేవుడి ఆస్తుల రక్షణతోపాటు ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన వసతులు కల్పించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తక్కువగా ఉండే చిన్న గుళ్లలో సైతం నిత్యం ధూపదీప నైవేద్య కార్యక్రమాలు కొనసాగేలా.. డీడీఎన్ఎస్ పథకం పేరుతో అర్చకులకు తగిన ఆరి్థక సహాయం చేస్తోందన్నారు. 19 డీసీ, 22 ఏసీ పోస్టుల పదోన్నతి ఇటీవల కాలంలో ఆలయాల వార్షిక ఆదాయం ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల స్థాయిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ మేరకు దేవదాయ శాఖలో కొత్తగా మంజూరు చేసిన డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు పదోన్నతులు కల్పిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్లుగా పనిచేస్తున్న 19 మందికి డిప్యూటీ కమిషనర్లుగానూ.. వివిధ ఆలయాల్లో గ్రేడ్–1 ఈవోలుగా, ఏఈవోలుగా, కార్యాలయాల్లో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న మరో 22 మందికి అసిస్టెంట్ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించారు. -
900 వందల దేవాలయాలను బాగుచేశాం.. మంత్రి కొట్టు కీలక కామెంట్స్
-
రూ.1,400 కోట్లతో ఆలయాల అభివృద్ధి
తొండంగి: రాష్ట్రంలో రూ.1,400 కోట్లతో ముఖ్య దేవాలయాలను అభివృద్ధి చేశామని రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై రూ.25 కోట్లతో నిర్మించిన శివసదన్, యాత్రికుల విశ్రాంతి భవనాలు, ఘాట్ రోడ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవాలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అన్నవరం కొండపై భక్తుల సౌకర్యాల కల్పనలో భాగంగా 138 గదులతో శివసదన్ నిర్మించినట్లు తెలిపారు. శ్రీసత్యన్నారాయణ యాత్ర నివాస్, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు సీఆర్వో కార్యాలయం వెనుక ఆదిశంకర మార్గ్, సత్యగిరి వైజంక్షన్ వద్ద హరిహర మార్గ్, వనదుర్గ మార్గ్‌లను పూర్తి చేసినట్లు చెప్పారు. రాజమహేంద్రవరానికి చెందిన దాత రాజామణి సుమారు రూ.2 కోట్లతో భక్తుల కోసం రత్నగిరి విశ్రాంతి భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. వైకుంఠ ఏకా దశి నాడు శంఖు చక్రాలు ప్రారంభించాలని ఆలయ ఈవోకు ఆదేశాలు ఇచ్చామన్నారు. -
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్..
-
దుర్గగుడి అభివృద్ధి పనులకు 7న సీఎం జగన్ శంకుస్థాపన
పెంటపాడు: విజయవాడలోని శ్రీ కనకదుర్గ, మల్లేశ్వరస్వామివార్ల ఆలయ అభివృద్ధి పనులకు డిసెంబర్ 7న సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. గురువారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ దుర్గమ్మ గుడిని రూ.225 కోట్లతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. డిసెంబర్ 8న రూ.125 కోట్లతో శ్రీశైలం క్షేత్రంలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతాయని వెల్లడించారు. రూ.60 కోట్లతో సింహాచల క్షేత్రం, రూ.80 కోట్లతో అన్నవరం క్షేత్రం, రూ.70 కోట్లతో ద్వారకాతిరుమల క్షేత్రంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. చదవండి: విశాఖ నుంచి పాలనకు కీలక అడుగు -
దీపావళి వేడుకల్లో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ