పశ్చిమగోదావరి: ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేయాలని చూసే నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. 2019లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చారని తెలిపారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
‘‘రెండేళ్లు కరోనాతో పోరాడాం. ఐదేళ్లు పూర్తి స్థాయిలో పదవికి న్యాయం చేసి ప్రజలకు మేలు చేశాం. కార్పొరేట్ విద్య ద్వారా దోచుకుంటున్న తరుణంలో దానికి ధీటుగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకొచ్చాం. ప్రజలు సంక్షేమ పథకాలు ద్వారా సంతృప్తితో ఉన్నారని అనుకున్నాం. కానీ ప్రలోభాలకు గురి అవుతారని అనుకోలేదు.
..సంక్షేమ పథకాలు ద్వారా ఏడాదికి 70 వేల కోట్లు ఇచ్చేస్తూ ప్రభుత్వాన్ని అప్పుల పాలు అయిపోతుందని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంతకుమించి హామీలు ఇచ్చారు. వాలంటీర్లను నానా మాటలు అని మేము వస్తే 10వేలు ఇస్తామని ప్రలోభ పెట్టారు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో గెలిచిన వ్యక్తి గత ఎన్నికల్లో నా మీద 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంత మాత్రాన ఏమి అయిపోలేదు. ప్రజల కోసం మేమెప్పుడు పోరాడుతూనే ఉంటాం.
..2019లో ప్రతిపక్షం నుండి అధికారంలోకి వచ్చినా మేము విర్రవీగాలేదు, దాడులు చేయలేదు, కక్ష సాధింపు చర్యలు చేయలేదు. మాధవరంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు నోరు లేని మూగజీవలు కోసం నిల్వ పెట్టుకున్న గడ్డివాములను జనసేన కార్యకర్తలు పెట్రోల్ పోసి నిప్పటించారు. ఎన్నికల కౌంటింగ్ తరువాత స్పష్టమైన మెజారిటీ కూటమి సాధించింది. రాజ్యాంగం మీద మాకు విశ్వాసం ఉంది’’ అని అన్నారు.
చదవండి: అధికారుల వల్లే నాడు టీడీపీ ఓడిపోయిందని చంద్రబాబు చెప్పగలరా?
Comments
Please login to add a commentAdd a comment