west godavari district
-
సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు?
సాక్షి, భీమవరం/ఉండి/కాళ్ల: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ను మహిళా లోకం నిలదీసింది. సూపర్ సిక్స్ హామీలన్నీ ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పాలని మహిళల నుంచి ప్రశ్నల వర్షం కురవడంతో లోకేశ్ కంగుతిన్నారు. ఎన్నికల్లో చెప్పినట్టుగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలనెలా రూ.1,500, ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఎప్పటినుంచి ఇస్తారో చెప్పాలని మహిళలు కోరారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఎప్పటి నుంచి అమలు చేస్తారు సార్’ అని స్థానిక మహిళలు లోకేశ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉండిలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో పలు ప్రారంబోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేశ్‌కు వినతులు ఇచ్చేందుకు వచ్చిన స్థానిక మహిళలను పోలీసులు అడ్డుకుని బయటే ఉంచేశారు. వారు గేటు బయటి నుంచి లోకేశ్‌ను పిలవగా.. ఆయన వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు? సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఒకరి తర్వాత ఒకరు ప్రశి్నస్తూ లోకేశ్‌కు చుక్కలు చూపించారు. లోకేశ్ బదులిస్తూ.. ‘పింఛన్ పెంచాం. గోతులు పూడుస్తున్నాం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. త్వరలో చేస్తాం’ అన్నారు. కానీ.. ఎప్పటి నుంచి ఆయా పథకాలను అమలు చేస్తామనే విషయాన్ని స్పష్టం చేయకుండా సమాధానం దాటవేశారు. వినతులు తీసుకోకుండానే.. దివ్యాంగురాలైన తన కుమార్తెకు పింఛన్ ఇప్పించాలని ఒక మహిళ వినతిపత్రం అందజేయగా.. మిగిలిన మహిళల నుంచి వినతులు తీసుకోకుండానే లోకేశ్ అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు. వినతిపత్రాలు ఇచ్చేవారు డిప్యూటీ స్పీకర్ కార్యాలయానికి వచ్చి అందజేయాలని కూటమి నాయకులు సూచించడంతో మంత్రి లోకేశ్‌కు వినతులు ఇచ్చేందుకు అప్పటివరకు పడిగాపులు కాసిన జనం ఉసూరుమంటూ వెనుదిరిగారు. మీడియాపై ఆంక్షలు ఉండిలోని జెడ్పీ హైస్కూల్లో దాతల సాయంతో ఆధునికీకరించిన అభివృద్ధి పనుల ప్రారంబోత్సవం, కాళ్ల మండలం పెదఅమిరంలో రతన్ టాటా విగ్రహావిష్కరణ, భీమవరంలో ఎస్ఆర్కేఆర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం, పితృవియోగంతో ఉన్న కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను పరామర్శించేందుకు సోమవారం రాష్ట్ర మంత్రి లోకేశ్ జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటన ఆద్యంతం మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఫొటోలు, వీడియోలు తీయకుండా అడ్డుకున్నారు.లేని షటిల్, టెన్నిస్ కోర్టులు ప్రారంభించిన మంత్రి నిర్మాణాలు ఏమీ చేయకుండానే నేలపై సున్నం వేసి, నెట్లు కట్టి షటిల్ కోర్టులంటూ మంత్రి లోకేశ్‌తో ప్రారంభింపజేయడం, ఆయన ప్రారంభించడం అందరినీ ఆశ్చర్యపరించింది. మంత్రి పర్యటన సందర్భంగా పాఠశాలలోని ప్లే గ్రౌండ్ అభివృద్ధి పేరిట కాలువలోంచి తీసిన మట్టితెచ్చి వేశారని స్థానికులు తెలిపారు. హైస్కూల్లో ప్రారంభోత్సవాల అనంతరం లోకేశ్, డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు, టీడీపీ ముఖ్య నేతలు కొంతసేపు ప్రధానోపాధ్యాయుని గదిలోనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా కిటికీ తలుపులు కూడా మూసివేశారు. ఎంఈవో జ్యోతిని కూడా పోలీసులు, లోకేశ్ సెక్యూరిటీ లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారంతా బయటే ఉండిపోయారు. -
విస్తుగొలిపే ఘటన: పార్శిల్లో మృతదేహం
ఉండి: పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్‌బాడీ పార్శిల్‌గా రావడం తీవ్ర కలకలం రేపింది. ఓ మహిళకు వచ్చిన పార్శిల్‌ను తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించింది. దీంతో గుండె జారినంత పనైన సదరు మహిళ.. ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో పాటు పోలీసులకు సమాచారం అందించింది.ఉండి మండలం యండగండికి చెందిన తులసి సాగి అనే మహిళకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. అయితే ఆ ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయంలో భాగంగా రాజమండ్రి(రాజమహేంద్రవరం) క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువుల్ని పార్శిల్ ద్వారి ఆ సంస్థ పంపిస్తోంది. దీనిలో భాగంగా తొలి విడతో టైల్స్ పంపించగా, రెండో విడతలో విద్యుత్ సామాగ్రి పంపిస్తున్నామని చెప్పారు. అయితే ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. రెండో విడతలో రావాల్సిన విద్యుత్ సామాగ్రి స్థానంలో ఒక మృతదేహం పార్శిల్‌గా వచ్చింది.ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చిన ఆ పార్శిల్‌ను ఓపెన్ చేసి చూడగా అందులో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. దాంతో పాటు కోటి రూపాయలకు పైగా తమకు చెల్లించాలనే లెటర్ కూడా ఆ పార్శిల్లో ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పార్శిల్ ప్యాకింగ్ దగ్గర్నుంచి పార్శిల్ తీసుకొచ్చిన వ్యక్తి వరకూ అందర్నీ పిలిచి ఆరా తీస్తున్నారు. -
లైంగిక దాడి ముద్దాయికి 25 ఏళ్ల శిక్ష
విశాఖ–లీగల్: వావి వరసలు మరిచి వరుసకు కూతురయ్యే చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన సవతి తండ్రికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నగరంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది గురువారం తీర్పునిచ్చారు. జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధించారు. ప్రభుత్వం రూ.4 లక్షలు బాలికకు పరిహారంగా చెల్లించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీఆర్ మూర్తి అందించిన వివరాలు.పశ్చిమగోదావరి జిల్లా రాజఒమ్మంగి మండలం పాక గ్రామానికి చెందిన కుర్ర ఇమాన్యుయేల్ ప్రస్తుతం ఏఎస్ఆర్ జిల్లా లోతుగడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో ఉంటున్నాడు. వృత్తి రీత్యా అతడు చర్చి ఫాదర్. బాధితురాలి తల్లి నందినికి ఆయన రెండో భర్త. నిందితుడు రోజూ కొంతమందితో అడవిలోని మోదుగ ఆకులు ఏరించి, పట్టణ ప్రాంతాలకు విక్రయించేవా డు. 2021 ఆగస్టు 26 మధ్యాహ్నం 12 గంటల సమయంలో అడవిలోని ఒక నిర్జన ప్రదేశంలో నందిని కుమార్తెపై అతి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు. -
తవ్వుకో.. దోచుకో!
టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక అందిస్తున్నామని గొప్పులు చెప్పుకోవడం తప్పించి ఆచరణలో ఇది అమలు కావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నడిపూడి ర్యాంపులో నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా అక్రమ ఇసుక తవ్వకాలతో టీడీపీ నేత ఒకరు పేట్రేగిపోతున్నారు. ఒక్క వారం రోజుల్లోనే రూ.50 లక్షలకుపైగా విలువైన ఇసుకను తరలించేశారు. టీడీపీ నేతకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతో అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.తవ్వకాలకు అనుమతి లేని రీచ్‌లో భారీ ఎత్తున టీడీపీ నేత ఇసుక కొల్లగొడుతున్నా అధికారులు కిమ్మనడం లేదు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు తూట్లు పొడుస్తూ నదీగర్భంలో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి నరసాపురం రూరల్ బియ్యపుతిప్ప వద్ద సముద్రంలో కలిసే వరకు వశిష్ట గోదావరిలో ఆరు ఓపెన్ రీచ్‌లు, ఐదు డిసిల్టేషన్ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వేవారు. సముద్రపు పోటుతో ఆయా ర్యాంపుల్లోని ఇసుకలో ఉప్పునీటి సాంద్రత పెరిగింది.దీంతో నిర్మాణ పనులకు అనుకూలంగా లేకపోవడం, తీర ప్రాంత పరిరక్షణలో భాగంగా ఈ ర్యాంపులు సీఆర్‌జెడ్ పరిధిలోకి వెళ్లడంతో ఈ రీచ్‌లు మూతపడ్డాయి. ఇసుక కొరత నేపథ్యంలో వీటిని తెరిచేందుకు అధికార యంత్రాంగం పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. వీటిని తెరిచే వీలులేకపోవడంతో జిల్లా అవసరాల నిమిత్తం తూర్పుగోదావరి జిల్లాలోని తీపర్రు, ఔరంగాబాద్ ర్యాంపులను ప్రభుత్వం కేటాయించింది. – సాక్షి, భీమవరంచక్రం తిప్పిన శాండ్ కింగ్..తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక తవ్వకాలకు పేరొందిన టీడీపీ నేత కన్ను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇసుక ర్యాంపులపైనా పడింది. జట్టు కార్మికుల ప్రాబల్యం తక్కువగా ఉండటం, బాట అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో తన అక్రమ తవ్వకాలకు ఆయన నడిపూడి ర్యాంపును ఎంచుకున్నారు. సాధారణంగా ర్యాంపు తెరవాలంటే నీటిపారుదల, గనులు, కాలుష్యం, రెవెన్యూ తదితర శాఖల అనుమతులు తప్పనిసరి. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మార్గదర్శకాలను అనుసరించి తీర ప్రాంతం కోతకు గురికాకుండా ఇసుక మేట వేసిన చోట పరిమిత అడుగుల లోతులో జట్టు కార్మికులతో తవ్వకాలు చేయించాలి. పగటిపూట మాత్రమే తవ్వకాలు, లోడింగ్ చేయాలి. అయితే ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తూ సదరు శాండ్ కింగ్ చక్రం తిప్పారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో నడిపూడి ర్యాంపులో అనధికార తవ్వకాలకు తెరలేపారు. పొక్లెయిన్లతో నదీగర్భంలో రెండు మూడు మీటర్ల లోతున ఇసుకను పైకి తోడి రాత్రివేళల్లో లోడింగ్ చేస్తున్నారు. నిర్మాణ పనులకు అనువు కాదని మూసివేసిన ర్యాంపులో వారం రోజులుగా యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.అదనపు చార్జీల రూపంలో భారీ వసూళ్లు..ఇతర ర్యాంపుల కంటే తక్కువ ధరకు ఇసుక లోడింగ్ చేస్తుండడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి లారీలు నడిపూడి ర్యాంపు వద్ద బారులు తీరుతున్నాయి. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని పలు ర్యాంపుల్లో ఐదు యూనిట్ల లోడింగ్‌కు ప్రభుత్వ నిర్ణీత ధరతో పాటు అదనపు చార్జీల రూపంలో రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు టీడీపీ నేత దండుకుంటున్నారు. ఈ అనధికార ర్యాంపులో రూ.2,500కే ఐదు యూనిట్ల ఇసుక లోడింగ్ చేస్తుండడంతో లారీలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ర్యాంపు వద్ద నుంచి సిద్ధాంతం వంతెన వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర లారీలు లోడింగ్ కోసం వేచి ఉంటున్నాయి. రోజూ 200కు పైగా లారీలు ఇసుక కోసం వస్తున్నాయి.వీటి నుంచి రూ.6.50 లక్షలు – రూ.8 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత వారం రోజుల వ్యవధిలో దాదాపు రూ.అర కోటికి పైగా దండుకోగా ర్యాంపు నిర్వహణ ఖర్చులు పోను మిగిలిన మొత్తం టీడీపీ అగ్రనాయకత్వానికి చేరుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అక్రమ తవ్వకాల్లో తమకు వాటా ఇవ్వకుండా మొత్తం పొరుగు జిల్లా నేత దోచుకుపోతున్నారని స్థానిక కూటమి నేతలు గుర్రుగా ఉన్నారు. అధికారులకు అందుతున్న ఫిర్యాదుల్లో పేర్లు లేకుండా టీడీపీ నాయకులే చేస్తున్నవే ఎక్కువగా ఉంటున్నట్టు సమాచారం. -
ఈ భవంతి.. వందేళ్ల గంధర్వ మహల్! ఇక్కడ?
ఈ భవంతి.. జైపూర్ హవా మహల్‌ని గుర్తుకు తెస్తోంది కదూ! ఇది గంధర్వ మహల్.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంటలో ఉంది! ప్రస్తుతం ఇందులో నివసిస్తున్న మూడోతరం.. ఇటీవలే దీని వందేళ్ల వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ మహల్‌ని చూపించడానికి సందర్భం అదే!ఆచంటకు చెందిన జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు చిన్నతనం నుంచీ కోటలు చూస్తూ పెరగడంతో సొంతూళ్లో అటువంటి కట్టడాన్ని నిర్మించాలని భావించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి కోటలను క్షుణ్ణంగా పరిశీలించి, 1918లో.. ఈ గంధర్వ మహల్‌కు శంకుస్థాపన చేశారు. ఆరేళ్లపాటు కొనసాగిన దీని నిర్మాణం 1924 నాటికి పూర్తయింది. సుమారు ఎకరం విస్తీర్ణంలో కొలువై ఉన్న ఈ మహల్ కోసం అప్పట్లోనే సుమారు పది లక్షల రూపాయల వరకు వెచ్చించినట్టు జమీందారు కుటుంబ సభ్యులు చెప్పారు.ప్రత్యేకతలెన్నో.. మహల్ కోసం బర్మా నుంచి టేకు, బెల్జియం నుంచి అద్దాలు, లండన్ నుంచి ఇనుప గడ్డర్లను తెప్పించారు. రవాణా సదుపాయం అంతగాలేని ఆ రోజుల్లో జలరవాణా ద్వారా వాటిని తీసుకువచ్చారు. ఈ కట్టడానికి ఇనుప ఊచల ఊసు లేకుండా డంగు సున్నాన్నే వాడారు. ఈ మహల్లోకి అడుగుపెడితే మైసూర్ మహారాజా ప్యాలస్, గోల్కొండ కోటను చూసిన అనుభూతి కలుగుతుంది. 1885, లండన్ ఎగ్జిబిషన్లో రజత పతకం గెలిచిన పియానో ఈ మహల్లో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికీ ఆ పియానో స్వరాలను పలికిస్తుంది. విశాలమైన హాల్లో బెల్జియం నుంచి తెప్పించిన నిలువెత్తు అద్దాలు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. విద్యుత్ సౌకర్యం లేని ఆ రోజుల్లోనే విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల విద్యుత్ దీపాలను జనరేటర్ సాయంతో వెలిగించేవారని, ఆ వెలుగుల్లో మహల్‌ను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారని స్థానికులు చెబుతారు. ఈ మహల్ కట్టిన పదేళ్లకు గానీ ఆచంటకు విద్యుత్‌సదుపాయం రాలేదట.ముఖ్యమంత్రులు బసచేశారు..ఈ గంధర్వ మహల్ ఎందరో ప్రముఖులకు విడిదిగా విరాజిల్లింది. మాజీ ముఖ్యమంత్రులు మర్రిచెన్నారెడ్డి, ఎన్టీ రామారావుతో పాటు ఎంతో మంది మాజీ మంత్రులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ భవంతిలోనే బసచేసేవారు. ఈ మేడలో మొత్తం నాలుగు అంతస్తులు, 12 గదులున్నాయి. గొడవర్తి నాగేశ్వరరావు అనంతరం మూడు తరాలకు ఇది నివాసంగా ఉంది. నాలుగోతరం వారిలో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారని జమీందారు కుటుంబ సభ్యుల్లో ఒకరైన గొడవర్తి వెంకటేశ్వరస్వామి తెలిపారు. ఈ భవంతి కట్టాక రెండు పర్యాయాలు రంగులు వేయగా, వందేళ్లు పూర్తయిన సందర్భంగా రూ. 40 లక్షల వ్యయంతో మరమ్మతులు చేయించి రంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శతదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరో 30 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా మరమ్మతులు చేయించామని వెంకటేశ్వరస్వామి చెప్పారు. గంధర్వ మహల్లో సినిమా షూటింగ్‌లకు అవకాశం ఇవ్వాలని ఎంతోమంది సినీరంగ ప్రముఖులు కోరినప్పటికీ జమీందారు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తమ తాతగారి వారసత్వ సంపదగా వస్తున్న ఈ మహల్‌ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. – విజయ్‌కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం -
ఐపీఎస్‌కు ఎంపికైన ఏలూరు ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన గణేశ్న భాను శ్రీలక్ష్మి అన్నపూర్ణ ప్రత్యూష ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రత్యూష గత ఏప్రిల్‌లో విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 198 ర్యాంకు సాధించగా.. తాజాగా ఐపీఎస్ శిక్షణకు రావాలంటూ ఉత్తర్వులు అందాయి. గతంలో గ్రూప్–1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఐపీఎస్‌కు ఎంపికవడంతో ఆగస్టు 26 నుంచి ముస్సోరీలో జరగనున్న శిక్షణకు హాజరుకావాల్సి ఉంది. సిసలికి చెందిన గణేశ్న వెంకట రామాంజనేయులు, ఉషా దంపతుల కుమార్తె ప్రత్యూష మొదట నుంచి చదువుపై ఆసక్తితో ఉన్నత శిఖరాలు అందుకోవాలని కష్టపడి చదివింది. ఏడాది ఆగస్టులో విడుదలైన గ్రూప్–1 పరీక్షా ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. అనంతరం ఏలూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా ట్రైనింగ్‌లో ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. -
ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం: కొట్టు సత్యనారాయణ
పశ్చిమగోదావరి: ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేయాలని చూసే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. 2019లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చారని తెలిపారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘‘రెండేళ్లు కరోనాతో పోరాడాం. ఐదేళ్లు పూర్తి స్థాయిలో పదవికి న్యాయం చేసి ప్రజలకు మేలు చేశాం. కార్పొరేట్ విద్య ద్వారా దోచుకుంటున్న తరుణంలో దానికి ధీటుగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకొచ్చాం. ప్రజలు సంక్షేమ పథకాలు ద్వారా సంతృప్తితో ఉన్నారని అనుకున్నాం. కానీ ప్రలోభాలకు గురి అవుతారని అనుకోలేదు...సంక్షేమ పథకాలు ద్వారా ఏడాదికి 70 వేల కోట్లు ఇచ్చేస్తూ ప్రభుత్వాన్ని అప్పుల పాలు అయిపోతుందని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంతకుమించి హామీలు ఇచ్చారు. వాలంటీర్లను నానా మాటలు అని మేము వస్తే 10వేలు ఇస్తామని ప్రలోభ పెట్టారు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో గెలిచిన వ్యక్తి గత ఎన్నికల్లో నా మీద 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంత మాత్రాన ఏమి అయిపోలేదు. ప్రజల కోసం మేమెప్పుడు పోరాడుతూనే ఉంటాం. ..2019లో ప్రతిపక్షం నుండి అధికారంలోకి వచ్చినా మేము విర్రవీగాలేదు, దాడులు చేయలేదు, కక్ష సాధింపు చర్యలు చేయలేదు. మాధవరంలో వైఎస్సార్సీపీ నాయకుడు నోరు లేని మూగజీవలు కోసం నిల్వ పెట్టుకున్న గడ్డివాములను జనసేన కార్యకర్తలు పెట్రోల్ పోసి నిప్పటించారు. ఎన్నికల కౌంటింగ్ తరువాత స్పష్టమైన మెజారిటీ కూటమి సాధించింది. రాజ్యాంగం మీద మాకు విశ్వాసం ఉంది’’ అని అన్నారు.చదవండి: అధికారుల వల్లే నాడు టీడీపీ ఓడిపోయిందని చంద్రబాబు చెప్పగలరా? -
చంద్రబాబు ఒక శాడిస్ట్: మంత్రి కారుమూరి
పశ్చిమ గోదావరి: ప్రజలు బాధపడితే చంద్రబాబు ఆనందపడతారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు మండిపడ్డారు. చంద్రబాబును ఒక శాడిస్ట్‌గా వర్ణించించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు.‘ప్రజలు బాధపడితే చంద్రబాబు ఆనందపడతారు. చంద్రబాబు పాదం కూడా అంతే ఆయన ఉన్నంతకాలం వర్షాలు పాడేవి కాదు.. పంటలు పండేవి కాదు. కొనసాగుతున్న పథకాలకు డబ్బులు వేయద్దని ఈసీ చెప్పిందంటే.. చంద్రబాబు ఎంత కసరత్తు చేశాడో?. ఈసీ కూడా పక్షపాతి ధోరణిలో వ్యవహరిస్తోంది. గతంలో చంద్రబాబు ఎలక్షన్ ముందు పసుపు కుంకుమలు అంటూ పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తే అప్పుడు ఎందుకు ఆమోదించింది.తెలంగాణాలో అడ్డురాని సంక్షేమం ఇక్కడే ఎందుకు అడ్డు వచ్చింది. రైతులకు ఇప్పుడు అందించే సాయిం ఖరీఫ్ పంటల పెట్టుబడులకు మేలు చేస్తుంది. బడి విద్యార్థులు నూతన విద్యా సంవత్సరానికి ఇబ్బందులు పడతారు. ఈసీ మరొక్కసారి పునః పరిశీలన చేయాలి’అని కారుమూరి అన్నారు. -
ఐరాసలో జగన్ విజన్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పక్షపాతం, పైరవీలకు, అవినీతికి తావులేకుండా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లే విప్లవాత్మక పాలనా సంస్కరణలతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమెరికాలోని ఐక్యరాజ్య సమితి వేదికపై మరోసారి ఆవిష్కృతమయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించడం.. మహిళా సాధికారిత కోసం ఆయా దేశాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలపై ఐరాస ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన సదస్సుకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కునుకు హేమకుమారి హాజరయ్యారు. ఈమెతోపాటు త్రిపురకు చెందిన జెడ్పీ చైర్పర్సన్ సుప్రియ దాస్ దత్తా, రాజస్థాన్‌కు చెందిన మరో సర్పంచ్ నీరూ యాదవ్‌లు ‘లోకలైజింగ్ ది ఎస్డీజీ–‘విమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా లీడ్ ది వే’ పేరుతో జరిగిన సదస్సులో మహిళా సాధికారిత కోసం భారత్‌లో జరుగుతున్న కార్యక్రమాలపై వీరు తమ ప్రజంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా కుసుమ హేమకుమారి ఏపీలో మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించే దిశగా సీఎం జగన్ అమలుచేసిన వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రస్తావించారు. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న మహిళల అప్పు మొత్తం రూ.25,570.79 కోట్లను నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆయా మహిళలకు అందజేసిందని చెప్పారు. దీంతోపాటు పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించే వారికి వారి వడ్డీ డబ్బులను ప్రభుత్వమే భరించే సున్నావడ్డీ పథకాన్ని కూడా ఆమె ఈ అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించారు.పేద మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేలా..ఇక సొంతంగా వ్యాపార అవకాశాలు మెరుగుపరుచుకోవడం ద్వారా పేద మహిళలు తమ కలలను సాకారం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు.. మహిళలు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా విద్యాదీవెన వంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సైతం లక్పతీ దీదీ లాంటి కార్యక్రమాలు చేపట్టిందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో తమ గ్రామంలో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు హేమకుమారి వివరించారు.అలాగే, పౌష్టికాహరంపై గర్భిణీలకు అవగాహన కలిగిస్తూ, ప్రభుత్వమే వారికి పోషకాçహారం అందిస్తూ మాతా, శిశు మరణాల నివారణకు చేపట్టిన కార్యక్రమాలను ఆమె చెప్పారు. ఆర్నెల్ల క్రితం 2023 సెప్టెంబరులో ఇదే వేదికపై జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో మన రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వ పాఠశాలల పేద పిల్లలు హాజరైన విషయం తెలిసిందే. వీరు కూడా రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వ బడుల బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు.‘స్థానిక’ ప్రభుత్వాల్లో 46 శాతం మంది మహిళలే.. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లా డుతూ.. భారత్‌లో స్థానిక ప్రభుత్వాల స్థాయిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 46 శాతం మంది మహిళలేనని తెలిపారు. అలాగే, దేశంలో బాల్య వివాహాలను నిరోధించడం, విద్యను ప్రోత్సహించడం, ఆర్థికంగా నిలదక్కుకోవడం.. జీవనోపాధి అవకాశాలు కల్పించడం.. పర్యావరణ సుస్థిరత.. క్రీడలు వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రభుత్వాల స్థాయిలో కూడా మహిళలు, బాలికలకు సాధికారత కల్పించే కార్యక్రమాలను త్రిపుర, రాజస్థాన్ నుంచి హాజరైన ప్రతినిధులు వివరించారు. -
పోటెత్తిన ‘పశ్చిమ’
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొత్త పండుగ శోభను సంతరించుకుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 16వ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆయనను చూడటానికి జనసంద్రం పోటెత్తింది. ఊరూవాడా వెల్లువలా ప్రజలు తరలివచ్చారు. అక్కచెల్లెమ్మలు దిష్టితీసి హారతులు పట్టారు. హత్యాయత్నం నుంచి బయటపడి తమ వద్దకు వచ్చిన సీఎం జగన్‌ను చూడటానికి అభిమాన సంద్రం ప్రవాహంలా పోటెత్తింది. తనను చూడటానికి వచ్చిన అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను, చిన్నారులను బస్సు దిగి సీఎం ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఓవైపు మళ్లీ నువ్వే అధికారంలోకి వస్తావంటూ అవ్వాతాతల ఆశీర్వచనాలు, మరోవైపు మా ఓట్లు మీకే అంటూ అక్కచెల్లెమ్మల ప్రేమానురాగాలు, ఇంకోవైపు మేమున్నామన్నా అంటూ యువకుల ఉత్సాహం మధ్య బస్సు యాత్ర ఆద్యంతం సంబరంలా సాగింది. జననేతకు జన నీరాజనం సోమవారం గుడివాడ బహిరంగ సభ ముగించుకుని ఏలూరు జిల్లా నారాయణపురం చేరుకుని రాత్రి బస చేసిన సీఎం వైఎస్ జగన్‌ను మంగళవారం ఉదయం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ.. వారి యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నుంచి పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. నారాయణపురం శివారు ప్రాంతానికి చెందిన ఉండ్రాజవరపు భుజంగరావు, గీతారాణి దంపతులు సీఎం బస్సు వద్దకు వచ్చారు. తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయాలని సీఎం జగన్‌ను కోరగా ఆయన వెంటనే బస్సు నుంచి బయటకు వచ్చి బాలుడితో అక్షరాలు దిద్దించారు. తమ అభిమాన నేతతో తమ బిడ్డకు అక్షరాభ్యాసం చేయించడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇది ఎన్నటికీ మరువలేమని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తనపై అభిమానంతో ఓ చెల్లెమ్మ వేసిన పెన్సిల్ స్కెచ్‌పై సీఎం జగన్ సంతకం చేశారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సుయాత్ర నారాయణపురం నుంచి ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. రాచూరు చేరుకున్న సీఎం జగన్‌కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అవ్వాతాతలు, అన్నా ఎలా ఉన్నావంటూ అక్కచెల్లెమ్మలు సీఎం వైఎస్ జగన్‌ను ఆప్యాయంగా పలకరించారు. ‘మీరంతా నాకు అండగా ఉండగా నాకేం కాదమ్మా’ అంటూ వారికి ధైర్యం చెప్పి ఆయన ముందుకు కదిలారు. తర్వాత సీతారామపురం చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు భారీగా తరలివచ్చిన ప్రజలు జేజేలు పలికారు. అక్కచెల్లెమ్మలు గుమ్మడికాయలతో దిష్టితీసి హారతులు పట్టారు. దారిపొడవునా మేమంతా సిద్దమంటూ బారులు తీరి ప్రజలు స్వాగతం చెప్పారు. తర్వాత సీఎం జగన్ గాం«దీనగర్ మీదుగా నిడమర్రు చేరుకున్నారు. అక్కడ అడుగడుగునా అక్కచెల్లెమ్మలు నీరాజనాలు పలికారు. తన కోసం వేచి చూస్తున్నవారిని పలకరిస్తూ సీఎం ముందుకు సాగారు. భువనపల్లి మీదుగా సాగిన సీఎం జగన్ బస్సుయాత్రకు గణపవరంలో జనం పోటెత్తారు. స్థానికులు అఖండ స్వాగతం పలికారు. గణపవరం సెంటర్లో తన కోసం ఎదురుచూస్తున్న అశేష జనవాహినికి ముఖ్యమంత్రి జగన్ బస్సుపైకి ఎక్కి అభివాదం చేశారు. ఓవైపు ఎండ మండుతున్నా ప్రజలెవరూ లెక్క చేయలేదు. ప్రవాహంలా కదిలిన జనం బస్సుయాత్రను అనుసరించారు. పాములపర్రు, ఆరేడుల్లో సీఎంకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడి నుంచి ఉండి చేరుకునేసరికి భారీ ఎత్తున ప్రజలు, పార్టీ నేతలు ఎదురొచ్చి జన నేతకు ఘనస్వాగతం పలికారు. చిమ్మచీకట్లోనూ అభిమాన వెలుగు చీకటి పడినప్పటికీ సీఎం జగన్‌పై ప్రజాభిమానం ఏమాత్రం సడలలేదు. భీమవరం నుంచి గొల్లలకోడేరు వచ్చే వరకూ ప్రజలు జగన్ రాక కోసం వేచి చూశారు. వారి వద్దకు చేరుకున్న జగన్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అక్కడి నుంచి గరగపర్రు, యండగండి, సాగుపాడు, కేశవరం, అప్పన్నపేట మీదుగా పిప్పర చేరుకున్న జననేత బస్సుయాత్రకు అపూర్వ స్వాగతం లభించింది. బాణసంచా వెలుగులు, డప్పు వాయిద్యాలతో పిప్పర గ్రామమంతా తరలివచ్చి జగన్‌కు జై కొట్టింది. అగ్రహారం, చిలకంపాడు, ముదునూరు, కాశిపాడు దాటి చింతపల్లి నుంచి రావిపాడు చేరుకుంది. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా తణుకు మండలంలోని దువ్వ గ్రామానికి చేరుకున్న జగన్‌కు అపూర్వ స్వాగతం లభించింది. పొద్దుపోయినా తమ అభిమాన నాయకుడి కోసం పల్లెలు ఎదురుచూశాయి. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ రాత్రి 10.09 గంటలకు తేతలి శివారులోని రాత్రి బస ప్రాంతానికి జగన్ చేరుకున్నారు. అక్కడికి సైతం వచ్చిన అభిమానులు జగన్‌ను చూసి జగనన్నా మళ్లీ నువ్వే సీఎం అంటూ నినాదాలు చేశారు. వారికి అభివాదం చేస్తూ 16వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రను సీఎం జగన్ ముగించారు. భీమవరం జనసంద్రం ఉండి నుంచి భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ వద్ద బహిరంగ సభకు సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ రోడ్ షో ద్వారా చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సభ జరగాల్సి ఉండగా జనాభిమానం వెల్లువెత్తడంతో గంటన్నర ఆలస్యమైంది. అప్పటికే భీమవరం జనసంద్రమైంది. రోడ్లన్నీ జనజాతరను తలపించాయి. డప్పులు, డీజేలు మోగిస్తూ అభిమానులు వీధుల్లో ఆనందతాండవం చేశారు. సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. ర్యాంప్‌పై నడుస్తూ జనసంద్రానికి సీఎం జగన్ అభివాదం చేశారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ ‘ఈ మధ్య కోపం ఎక్కువై చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారు.. నాకేదో అయిపోవాలని కోరుకుంటున్నారు’ అని మండిపడ్డారు. ‘అలాగే భార్యల్ని మార్చినట్టు నియోజకవర్గాలను మార్చేస్తున్న దత్తపుత్రుడికి బీపీ పెరిగిపోతోంది’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు. దీంతో సభలో ఉన్నవారి నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సాయంత్రం 6.23 గంటలకు సభ ముగియగానే సీఎం వైఎస్ జగన్ భీమవరం మీదుగా తిరిగి రోడ్ షో కొనసాగించారు. చీకటి పడినప్పటికీ గొల్లలకోడేరులో ప్రజలు తమ అభిమాన నేత రాకకోసం వేచి చూశారు. వారి వద్దకు చేరుకున్న సీఎం జగన్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. జన ప్రవాహం భారీగా రావడం వల్ల యాత్ర ఆలస్యమవుతుండటంతో బస ప్రదేశాన్ని అప్పటికప్పుడు మార్చాల్సి వచ్చింది. ముందుగా నిర్ణయించిన తూర్పుగోదావరి జిల్లా ఈతకోట నుంచి తణుకు వద్ద తేతలి గ్రామ శివారులో జాతీయ రహదారిని ఆనుకుని బసను ఏర్పాటు చేశారు. తరలివచ్చిన ఊళ్లకు ఊళ్లు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చూడటానికి.. యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఊళ్లకు ఊళ్లే తరలివచ్చాయి. అన్నా..మిమ్మల్ని గెలిపించుకోవడానికి మేమంతా సిద్ధమంటూ యువత నినదించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా స్థానిక నేతలు ప్రత్యేకంగా టెంట్లు, కుర్చీలు వేశారు. అలాగే అడుగడుగునా అన్నదానాలు, మజ్జిగ పంపిణీ చేపట్టారు. జనసంద్రం తరలిరావడంతో బస్సుయాత్ర నిదానంగా ముందుకు సాగింది. అందరినీ పలకరిస్తూ షెడ్యూల్ కంటే ఆలస్యంగా మేమంతా సిద్ధం బస్సుయాత్ర కొనసాగింది. దీంతో ఉండి శివారులో మ.3.53 గంటలకు మధ్యాహ్న విరామ ప్రాంతానికి సీఎం జగన్ వెళ్లారు. ఉండి నియోజకవర్గం కోలమూరు గ్రామంలో మండుటెండను సైతం లెక్కచేయకుండా నాలుగు నెలల బాలింత చంటి బిడ్డతో సీఎం జగన్‌ను చూడాలని వేచి చూసింది. గుర్తు పట్టి.. బస్సు ఎక్కించుకుని.. ద్వారకా తిరుమల: రహదారి పక్కన నిలబడి సీఎం వైఎస్ జగన్‌కు అభివాదం చేస్తున్న ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చెలికాని రాజబాబుకు ఊహించని అనుభవం ఎదురైంది. జనసంద్రంలో రాజబాబును చూసి గుర్తు పట్టిన సీఎం వైఎస్ జగన్ బస్సు ఆపించి మరీ అందులో ఆయనను ఎక్కించుకుని తన వెంట తీసుకెళ్లడం పార్టీ శ్రేణులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నారాయణపురం నుంచి భీమవరానికి వెళుతున్న సీఎం వైఎస్ జగన్‌కు నిడమర్రు వద్ద రాజబాబు అభివాదం చేశారు. ప్రజల్లో ఉన్న రాజబాబును గుర్తు పట్టిన సీఎం జగన్ వెంటనే బస్సు ఆపించి, అందులో ఆయనను ఎక్కించుకున్నారు. ఉండి వరకు సీఎంతోపాటు బస్సులో వెళ్లానని.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను ఆయనకు వివరించానని రాజబాబు తెలిపారు. ఎంతో మంది నాయకుల మధ్యలో ఉన్నా తనను జగనన్న గుర్తుపట్టి, ఉన్నఫళంగా రోడ్డుపై బస్సు ఆపి, ఎక్కించుకుని తీసుకెళ్లడం ఒకింత తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. పార్టీ కోసం కష్టపడే ఏ ఒక్కరినీ జగనన్న మరచిపోరని చెప్పడానికి తనకు ఎదురైన అనుభవమే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ దుర్మార్గులకు మనసనేది ఉందా? సీఎం వైఎస్ జగన్ నుదుటన గాయాన్ని చూసి చలించిపోయిన ప్రజలు బస్సు యాత్రలో దారిపొడవునా ఆప్యాయతానురాగాలు సాక్షి, భీమవరం: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 16వ రోజు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చూడటానికి ఊరూవాడా తరలివచ్చింది. ఈ సందర్భంగా ఆయన నుదుటన గాయాన్ని చూసినవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు మంచి చేస్తున్న మనిషిని మట్టుబెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో ఆ దుర్మార్గులకంటూ మండిపడ్డారు. దెబ్బ తగిలినప్పుడు బాధతో ఎంత విలవిలలాడాడో బిడ్డ అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. గాయం త్వరగా నయం కావాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం జాగ్రత్త బాబు అంటూ అవ్వాతాతలు సీఎం జగన్‌పై ఆప్యాయత చూపారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో దారిపొడవునా ఇవే దృశ్యాలు కనిపించాయి. ఆయనకు ఏమన్నా అయితే మేమేమైపోవాలి.. సీఎం వైఎస్ జగన్ వల్ల మేం చాలా లబ్ధిపొందాం. ఆయన చేసిన సహాయానికి మేము రుణం తీర్చుకుంటాం. ఆయన మాలాంటి పేదలకు చేస్తున్న సేవల్ని అడ్డుకునేందుకు కుట్రపన్ని హత్యాయత్నం చేశారు. ఆయనకు ఏమైనా అయితే మేమేమైపోవాలి? – ఎం.పావని, గణపవరం ఎంత విలవిలలాడిపోయారో? జగన్ సర్ నుదుటన దెబ్బ చూడలేకపోయాం. ఆ దెబ్బ తగలినప్పుడు ఆయన ఎంత విలవిల్లాడిపోయారో. పేదలకు మంచి చేస్తున్న ఆయనపై హత్యాయత్నం చేయడానికి దుర్మార్గులకు మనసెలా వచ్చిందో అర్థం కావడం లేదు. దేవుని దయ, ప్రజల ఆశీస్సులు జగన్ సర్‌పై నిండా ఉన్నాయి. ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరు. పేదలకు మంచి చేస్తున్న ఆయనకు అంతా మంచే జరుగుతుంది. – కొణిదెల అలంకారం, మందలపర్రు చాలా బాధనిపించింది.. పేదల కోసం పాటుపడుతున్న సీఎం జగన్‌పై హత్యాయత్నం చేయడం దారుణం. నాకు చాలా బాధనిపించింది. గాయంతో నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. ఆయనను చూడాలన్న ఆశతో చుట్టుపక్కల వారి సాయంతో వచ్చాను. సొంత సోదరుడి మాదిరి ప్రజలకు మంచి చేస్తున్న జగన్‌పై దుర్మార్గులు దాడి చేయడం చాలా నీచమైన పని. – పత్తివాడ జయలక్ష్మి, నిడమర్రు ముఖంపై దెబ్బ చూసి తల్లడిల్లిపోయా.. జగన్ బాబు ముఖంపై దెబ్బ చూసి తల్లడిల్లిపోయాను. అంత దెబ్బ ఎలా తట్టుకున్నాడో. జగన్ బాబుకు మంచి జరగాలని దేవుడికి తైలాభిషేకం చేయించాను. ఆయనపై హత్యాయత్నం చేసినవారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలి. – కర్తాకి రాజ్యం, క్రొవ్విడి -
Ganapavaram Bus Yatra: వైఎస్ జగన్ బస్సుయాత్ర: గోదారంత అభిమానం (ఫొటోలు)
-
Memantha Siddham Photos: పశ్చిమగోదావరిలో జగనన్న అనంతమైన జనాభిమానం (ఫొటోలు)
-
మేమంతా సిద్ధం: సీఎం జగన్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం (ఫొటోలు)
-
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విప్, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమక్షంలో మంగళవారం పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల, శనగపాడు, కొళ్లికూళ్ల గ్రామాలకు చెందిన టీడీపీ, బీజేపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. అదేవిధంగా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామ వైఎస్సార్సీపీ మాజీ అధ్యక్షుడు ఆనంగి శ్రీనివారావు యాదవ్ ఇటీవల టీడీపీలో చేరారు. ఆయన తిరిగి ఉదయభాను సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. – సాక్షి నెట్వర్క్ ► విజయవాడ 11వ డివిజన్‌కు చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు 100మందికి పైగా వైఎస్సార్సీపీలో చేరారు. వారికి వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ► పల్నాడు జిల్లా వినుకొండలో కొప్పుకొండ గ్రామ పంచాయతీ బ్రహ్మయ్య పాకాలు గ్రామానికి చెందిన 50 కుటుంబాలవారు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ► కృష్ణాజిల్లా కోడూరు మండలంలోని ఉల్లిపాలెం గ్రామానికి చెందిన 20 కుటుంబాలవారు వైఎస్సార్సీపీలో చేరారు. జనసేనకు చెందిన వీరందరికీ అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ► పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీపాలెం నార్త్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో మెట్రేవు ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు బర్రి రమేష్ తన అనుచరులు సుమారు 25 మందితో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. ► పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో అత్తిలికి చెందిన తూర్పు కాపు సంఘ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీలో చేరినవారిలో తూర్పు కాపు సంఘ నాయకులు, అత్తిలి రెండో వార్డు మాజీ సభ్యుడు ముల్లు సత్యనారాయణ, కిలాడి అప్పన్న, రెడ్డి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్, మండలంలోని గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ► ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన 40 కుటుంబాలవారు టీడీపీ, జనసేన పారీ్టలను వీడి దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. -
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
తణుకు అర్బన్/మొగల్తూరు/కైకలూరు/ భీమవరం/పెనుగొండ/పాలకొల్లు అర్బన్/పోలవరం రూరల్/బు చ్చిరెడ్డిపాళెం రూరల్: ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో సోమవారం తణుకు 27వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ మెర్ల అనంతలక్ష్మి పద్మావతి, ఆమె కుటుంబ సభ్యులు మెర్ల వెంకట్రావు, మెర్ల రాంబాబు తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. అదేవిధంగా టీడీపీకి చెందిన 80మంది కాపు నాయకులు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి కారుమూరి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ నాయకుడు నమ్మి వాసు, మహిళా నాయకురాలు తిరునాల శకుంతల ఆధ్వర్యాన టీడీపీ నాయకులు వర్థినీడి సూర్యచంద్రరావు, ఉజ్జిన సిద్ధయ్య, వీర్ని సూర్యప్రకాశరావు, వారి కుటుంబ సభ్యులతోపాటు ఏరపాటి రమణమ్మ, పాలాటి లక్ష్మి తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. వారిని మంత్రి కారుమూరి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ► పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం చింతరేవు ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు తిరుమాని ఏడుకొండలు తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. వారికి నరసాపురం ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసాదరాజు పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహా్వనించారు. ► ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండల ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన మండల గౌరవ అధ్యక్షుడు పోకల దేవేంద్ర గోపాలకృష్ణ, మండల కార్యదర్శి నాగదేశి గణేష్‌బాబు, నాయకులు నర్రా ప్రభు, కారుమంచి యుగంధర్, ముదినేపల్లి మండల టీడీపీ నాయకులు అల్లాడి సతీష్‌బాబు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి కైకలూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహా్వనించారు. ► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామానికి చెందిన సుమారు వంద మంది టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ► పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం తూర్పుపాలెంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో ములపర్రు గ్రామానికి చెందిన కాపు సంఘ నాయకులు, మారెమ్మ గద్దెకు చెందిన శెట్టి బలిజ నాయకులు భారీగా వైఎస్సార్సీపీలో చేరారు. ► పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వాలమర్రులో సర్పంచ్ గంటా సత్యనారాయణ, ఉప సర్పంచ్ దాసరి రమేష్ నాయకత్వంలో దళిత యువకులు సరిపల్లి సుదీప్, సరెళ్ల నివాస్, సరిపల్లి రమేష్, దాయం ఏసురత్నం, సబ్బితి భరత్‌కుమార్, సరెళ్ల శివాజీతోపాటు 30కుటుంబాలవారు పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ► ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసం పంచాయతీ పరిధిలోని బంగారంపేటతోపాటు పోలవరానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు దత్తి దేవి, కొవి్వడి పోశయ్య, కోటాబత్తుల రాంబాబు తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. పెనుబల్లి గ్రామ టీడీపీ ఉప సర్పంచ్ గుమ్మ భాస్కర్ తన అనుచరులు 200 మందితో, కోవూరు నగర పంచాయతీకి చెందిన గిలకా కల్యాణ్, కనపరెడ్డి వేణు తమ అనుచరులు 200 మందితో కలిసి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పంచేడు గ్రామానికి చెందిన గారితోటి విజయ్, బి.కామేశ్వరరావు కూడా ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. -
పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
పెనుగొండ/దెందులూరు/భీమవరం/ఏలూరు (టూటౌన్)/పాలకోడేరు: పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. పెనుగొండ మండలం తూర్పుపాలెంలో బీజేపీ, సీపీఎం నేతలకు మాజీ మంత్రి రంగనాథరాజు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. 2019లో ఆచంట నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏడిద కోదండ చక్రపాణి, సీపీఎం నేత గుర్రాల సత్యనారాయణతో పాటు పలువురు పార్టీలో చేరారు. గుర్రాల సత్యనారాయణ పెనుగొండ పట్టణ కార్యదర్శి గాను, రైతు సంఘ నాయకుడు గాను వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ దెందులూరు మండల అధ్యక్షుడు కంచర్ల గంగాధరరావు, గౌడ సంఘం అధ్యక్షుడు బెజవాడ సత్తిబాబు, ఆ పార్టీ నేతలు దంపనబోయిన రామచంద్రరావు, కొల్లేటి శంకర్ తదితరులు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరవాసరం మండలం మత్స్యపురి, భీమవరం పట్టణంలోని 2,36 వార్డులకు చెందిన జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఏలూరు 29వ డివిజన్ కుమ్మరి రేవుకు చెందిన 50 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆళ్ల నాని, కార్పొరేటర్ సన్నీ, వైఎస్సార్సీపీ నేత యలమర్తి సతీష్ ల సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరంతా కుమ్మరి రేవు ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్తలు పెద్ది రమణమ్మ, ఉద్దడం రవళి ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చారు. పాలకోడేరు మండలం శృంగవృక్షంకి చెందిన 60 మందికి పైగా టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఉండి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నరసింహరాజు సమక్షంలో పార్టీలో చేరారు. -
‘టీడీపీ అధినేతల కుతంత్రమా?’.. పవన్‌కు హరిరామ జోగయ్య లేఖ
పశ్చిమ గోదావరి: జనసేన బాగు గూర్చి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గురించి తాను ఇచ్చే సలహాలు ఆయనకు నచ్చినట్టు లేవంటూ కాపు సంక్షేమసేన అధ్యక్షుడు హరి రామ జోగయ్య అన్నారు. ఆయన శుక్రవారం మరోసారి పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. ‘ఈ విషయం బహిరంగసభలో నా పేరు పెట్టి మీరు అనకపోయినా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలు చూస్తే అలానే అనిపిస్తోంది. ఎల్లో మీడియా ఈ ప్రయత్నం ముఖ్యంగా మీకు, నాకు మధ్య తగువులు పెడ్తున్నట్లుగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ మరింత ఒంటరిగా చేస్తూ చంద్రబాబుకు మరింత దాసోహం అనిపించేటట్లు చేయాలనే కృత్తిమ చర్యలా అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ లేకుండా టీడీపీ నెగ్గటం అసాధ్యం. ...గతంలో తనకున్న పదవులు సైతం వదులుకొని చిరంజీవికి సపోర్ట్ చేసిన వ్యక్తి హరిరామ జోగయ్య. వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాతనైనా మీకు అధికారంలో సముచితమైన స్థానం ఇస్తాడని ముఖ్యమంత్రి పదవి చేపట్టటంలో భాగస్వామిని చేస్తాడని ఎవరు నమ్ముతారు?. ఎన్నికలైన తర్వాత జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి తన కొడుకు నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తాడనే భయం జనసైనికులు అందరిలో ఉన్నమాట నిజం. ఎన్నికలు ముందే మీకు అధికారంలో రావటంతో పాటు, మీ స్థానం ఏమిటో తేల్చాలని జనసైనికుల తరపున నేను డిమాండు చేయటంలో తప్పేమిటి?. సముచితమైన నా సలహాలను వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ కోవర్టుగా నాకు ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఎల్లో మీడియాను కానీ, జనసేన పార్టీలోని కొంతమంది మీ సలహాదారులను కానీ ఏమనాలి?. వారు తెలుగుదేశం కోవర్టులుగా చెప్పవచ్చా. ...పవన్ కళ్యాణ్‌ను ప్యాకేజి వీరుడుగా జనంలో నమ్మింపచేసి, నిర్వీర్యం చేసి దానివల్ల లబ్ది పొందాలనేది ఈ తెలుగుదేశం అధినేతల కుతంత్రమా?. జరుగుతున్న ఈ పరిణామాలపై మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకుని మీరు ప్రవర్తించటం, జనసేన మంచికోరి ఎంతైనా మంచిది. మీకు యిష్టమైనా, యిష్టం లేకపోయినా మీ వెంటనే ఉండి మిమ్మల్ని కాపడుకోవటం నా విధిగా భావిస్తున్నాను’ అని హరిరామ జోగయ్య లేఖలో స్పష్టం చేశారు. -
నైపుణ్య శిక్షణ కేంద్రాలతో సత్ఫలితాలు
నరసాపురం రూరల్: నైపుణ్యంతో దేశం నవనిర్మాణ కల్పన జరుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని పెదమైనవానిలంక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చేతి వృత్తిదారులకు ఆర్థిక భరోసా, భవిష్యత్తును కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన పథకమే పీఎం విశ్వకర్మ యోజన అని నిర్మలాసీతారామన్ చెప్పారు. ఈ పథకం రిజిస్ట్రేన్లలో ఏపీ దేశంలో మొదటి స్థానంలోను, పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలోను నిలిచిందన్నారు. తాను ‘సన్సద్ ఆదర్శ గ్రామ యోజన’లో భాగంగా పీఎం లంక గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. మూడేళ్లుగా గ్రామాభివృద్ధికోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. గ్రామంలో డిజిటల్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందులో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ గ్రామంలోని డిజిటల్ భవనంలో వేలాది మందికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించడం మంచి పరిణామం అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఈ గ్రామాభివృద్దికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఎంతగానో సహకరించారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, ఆరి్ధకశాఖ కార్యదర్శి సత్యనారాయణ, స్కిల్ డెవలప్మెంట్ కార్యదర్శి సురే‹Ùకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘మా ప్రభుత్వానికి రైతు శ్రేయస్సే ముఖ్యం’
సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): రైతు శ్రేయస్సే తమ ప్రభుత్వానికి ముఖ్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరోసారి స్పష్టం చేశారు. తుపాను కారణంగా దెబ్బతిన్న రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈరోజు(శనివారం) తణుకు పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి కారుమూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను నష్ట నివారణ చర్యలపై ఈ సమీక్షా సమావేశం నిర్వహించగా, రైతులు, నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ‘మిచాంగ్ తుపాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నేను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చాలా చోట్ల పర్యటించి చూశాను. అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి రైతులను ఆదుకునే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. రైతులకు వెంటనే సబ్సిడీ అందించే విధంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఏ ఒక్క రైతు నష్టపోకూడదు.. ఇబ్బంది పడకూడదు అని సీఎం జగన్ ఆదేశాలివ్వడం జరిగింది. తుపాను సమయంలో అధికారులంతా చాలా బాగా కష్టపడ్డారు. రంగుమారిన, మొక్క వచ్చిన ధాన్యాన్ని కూడా కొనే విధంగా సీఎం జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాం. రైతు శ్రేయస్సే మా ప్రభుత్వానికి ముఖ్యం’ అని తెలిపారు. -
మెట్ట రైతుకు మంచి రోజులు
కొమ్ముగూడెం, కృష్ణాపురం, బంగారుగూడెం గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి బోణం గణేష్ : ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌లో ఏమాత్రం లోటు రాకూడదు. రైతన్నలకు ఇచ్చే కరెంట్‌కు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగు చేయడం లేదా కొత్తది ఇవ్వడం జరగాలి. ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదు. సర్వీసు కూడా అడిగిన వెంటనే మంజూరు చేయాలి. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు’ అని అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రత్యేకంగా పూర్తిగా బోరు నీటిపైనే ఆధారపడి సాగు చేసే మెట్ట ప్రాంత రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముగూడెం, కృష్ణాపురం, బంగారుగూడెం గ్రామాల్లో రైతుల వ్యవసాయ క్షేత్రాలు కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా 2 విడతల్లో ఇచ్చేవారు. అది కూడా వేళకాని వేళల్లో వచ్చేది. గతంలో కరెంట్ కోసం రైతన్నలు రాత్రిపూట పొలాల్లో జాగారం చేయాల్సిన దుస్థితి. ఫీడర్లు సరిపడా లేకపోవడం వల్ల వ్యవసాయ మోటార్లు తరచూ కాలిపోయేవి. ఏపీలో ఉన్న 6,663 ఫీడర్లలో కేవలం 3,854 మాత్రమే వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అందుబాటులో ఉండేవి. ఒక్కో ట్రాన్స్ఫార్మర్పై నాలుగైదు సర్విసులు ఉండటం వల్ల ఏ సమస్య వచ్చినా అన్నిటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. మరమ్మతులకు నెలల తరబడి సమయం పట్టడంతో కళ్లెదుటే పంటలు ఎండిపోయేవి. పెట్టుబడులు కూడా వెనక్కి రాక అన్నదాతలు అఘాయిత్యాలకు పాల్పడ్డ దుస్థితి గతంలో నెలకొంది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.1,700 కోట్లను ఖర్చు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 19.92 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 6,605 ఫీడర్లు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉంది. విద్యుత్ ప్రమాదాలు, సరఫరా నష్టాలకు ప్రధానంగా ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు బలంగా లేకపోవడం, ఓవర్ లోడ్ కారణం. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణంతోపాటు ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యం పెంపు, పవర్ కెపాసిటర్ల ఏర్పాటు, పాత లైన్ల మరమ్మతులతో సమస్యలు తొలగిపోయాయి. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి వ్యవసాయ సర్వీసుకీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి కరెంట్ అందిస్తున్నారు. ప్రభుత్వానిదే భారమంతా.. తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు) పరిధిలో వ్యవసాయ ఫీడర్లు ఏటా 15,700 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. ఇది ఏపీలో ఏటా వినియోగించే 64 నుంచి 66 వేల మిలియన్ యూనిట్ల వినియోగంలో నాలుగింట ఒక వంతు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, బ్రేకర్ల జీవిత కాలం 25 ఏళ్లుగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిర్థారించింది. కాల పరిమితి తీరిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలి. లేదంటే యూనిట్‌కు రూ.8 చొప్పున నష్టాలు పెరుగుతాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి నాలుగైదు సర్విసులకు విద్యుత్ సరఫరా చేయడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు త్వరగా పాడవుతున్నాయి. ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటి మరమ్మతులకు రూ.102 కోట్లు ఖర్చవుతోంది. దీన్ని అధిగమించేందుకు హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (హెచ్‌వీడీఎస్), రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) ద్వారా ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ, ఫీడర్లను వేరు చేయడం లాంటి చర్యలు చేపట్టారు. బోరు దగ్గరకు 180 మీటర్ల వరకు ఉచితంగా విద్యుత్ లైన్లను సమకూరుస్తున్నారు. సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్లర్లు, లైన్ల సామర్థ్యం పెంచుతున్నారు. ఈ ప్రక్రియకు ఒక్కో వ్యవసాయ సర్విసుకు అయ్యే దాదాపు రూ.1.20 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రైతులకు ఏ కష్టం రాకుండా.. వ్యవసాయ రంగం అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు పంపిణీ వ్యవస్థను పటిష్టం చేశారు. ఏపీలో మొత్తం 2,12,517 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. వేలాది కి.మీ. పొడవున కొత్త లైన్లు నిర్మించాం. – కె.విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తడిచిన పొలమే తడిచి.. మా ప్రాంతంలో అంతా కరెంట్‌పై ఆధారపడే వ్యవసాయం జరుగుతుంది. గతంలో హెచ్‌టీ, ఎల్టీ లైన్లు ఒకే స్థంభం మీద ఉండటంతో చిన్న గాలికే కలిసిపోయి ట్రాన్స్ఫార్మర్, మోటార్ కాలిపోయేవి. రోజుకి 7 గంటలు అది కూడా 2,3 మూడు సార్లు కరెంట్ ఇవ్వడంతో తడిచిన పొలాలే తడిచి అవస్థలు ఎదుర్కొన్నాం. ఈ ప్రభుత్వం పగటిపూట 9 గంటలు కరెంటిస్తుంది. – రామకృష్ణ, ఉద్యాన రైతు, కొమ్ముగూడెం -
తణుకులో కదం తొక్కిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, భీమవరం/తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదం తొక్కారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో తాము సాధించిన సాధికారతను ఎలు గెత్తి చాటారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో వేల్పూరు రోడ్డులో యాత్ర ప్రారంభమై నరేంద్ర సెంటర్ వరకు సాగింది. బస్సు యాత్రకు నియోజకవర్గం, పరిసర ప్రాంతాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి బాణసంచా, పూలవర్షంతో బ్రహ్మరథం పట్టారు. తణుకు సెంటర్లో వేలాది జనం సమక్షంలో జరిగిన సభలో మంత్రులు, నేతలు ప్రసంగించారు. రామోజీకి ఎందుకింత కడుపుమంట? : మంత్రి జోగి రమేష్ బడుగు, బలహీన వర్గాలు సాధించిన సామాజిక సా«దికారతను ఓ వేడుకలా నిర్వహిస్తూ చేపట్టిన సాధికార బస్సు యాత్రలపై రామోజీరావుకు ఎందుకింత కడుపు మంట అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడుతూ.. సభ మొదలవ్వడానికి కొన్ని గంటల ముందు ఖాళీ కుర్చీల ఫొటోలు తీసి, సభ అయిపోయి జనాలు వెళ్లాక ఖాళీ కుర్చీ ఫొటోలు తీసి జనాలు రాలేదంటూ రామోజీరావు, రాధాకృష్ణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై అక్కసుతో విషపు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. వెనుక బడిన వర్గాల వారిని చట్ట సభలకు పంపించి వారిని ధైర్యంగా నిలబడేలా చేసింది సీఎంజగన్ మాత్రమేనన్నారు. పేదవాడికి చదువు, వైద్యం అందించిన ఘనత జగన్‌కు దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. సీఎం జగన్ అందించిన సంక్షేమంలో 80 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దకిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రూపాయి అవినీతికి తావు లేకుండా లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేశారన్నారు. గత ప్రభుత్వాలు అన్నీ కలిపి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, ఒక్క జగన్ హయాంలోనే 2.70 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, వీటిలో 76 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చాయని తెలిపారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ద్వారానే సాధ్యమైందన్నారు. ఈ సమవేశంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీలు మార్గాని భరత్, నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్‌పై దేశవ్యాప్తంగా నమ్మకం: అలీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలుకు సూచనగా ఇప్పు డు చేస్తున్నవి యాత్రలు మాత్రమేనని, 2024లో జాతర జరగబోతోందని, ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా) అలీ చెప్పారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో మోత మోగించిన సీఎం జగన్.. ఈ సారి 175కి 175 నియోజకవర్గా లనూ కైవసం చేసుకుంటారని తెలిపారు. సీఎం జగన్‌పై అందరికీ అపార నమ్మకం ఉందన్నారు. ఆ నమ్మకంతోనే వైజాగ్ సమ్మిట్‌కు అదాని, అంబానీలతో సహా దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చి ఏపీలో పరిశ్రమలు ఏర్పా టు చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల ప్రతి కుటుంబంలో ఒక్క ఉద్యోగం వచ్చినా ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకుంటుందని, ఇదంతా సీఎం సుపరిపాలనతోనే సాధ్యమైందన్నారు. -
బడుగులకు ఆత్మగౌరవం విలువ చూపించిన జగన్
నరసాపురం: సమాజంలో బడుగు వర్గాలకు అత్మగౌరవం కల్పించి, ఆ విలువ చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సమాజంలో రాజసంతో జీవించే స్థితికి తెచ్చారని తెలిపారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎన్నో అన్యాయాలకు, అవమానాలకు గురయ్యారని మంత్రి అప్పలరాజు చెప్పారు. అడుగడుగునా ఆయన ప్రదర్శించిన కుల అహంకారాన్ని, అధికార మదాన్ని వెనుకబడిన కులాలవారు, దళితులు ఎప్పటికీ మరచిపోలేరని అన్నారు. సీఎం వైఎస్ జగన్ అన్ని కులాలు, అన్ని వర్గాలను ఒకేలా చూస్తున్నారని, అనేక కార్యక్రమాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి పాటు పడుతున్నారని చెప్పారు. ఓ మత్స్యకారుడిని మంత్రిని చేశారని, మరో మత్స్యకారుడు మోపిదేవి వెంకటరమణను పార్లమెంటుకు పంపారని తెలిపారు. ఆలయాల పాలక మండలిలో నాయీ బ్రాహ్మణుడిని డైరెక్టర్‌గా పెట్టాలని నిబంధన పెట్టి ఆ సామాజికవర్గం గౌరవం పెంచారన్నారు. ఇది నిజమైన సామాజిక సాధికారత అని చెప్పారు. అన్ని జిల్లాల్లో హార్బర్లు నిర్మిస్తున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో కాపులే నష్టపోయారు: మంత్రి వేణుగోపాలకృష్ణ చంద్రబాబు హయాంలో కాపులే ఎక్కువగా నష్టపోయారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. ఇప్పుడు కాపులు పవన్ భ్రమలో పడి ఇంకా నష్టపోవడానికి సిద్ధంగా లేరన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా బలోపేతం కావడానికి, సమాజంలో ముందడుగు వేయడానికి సీఎం జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. బడుగుల పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత మెరుగుపరిచారని చెప్పారు. ఓ కల్లుగీత కార్మికుడి కొడుకు చెట్టు ఎక్కకుండా, విదేశాల్లో ఉద్యోగం కోసం విమానం ఎక్కుతున్నాడంటే కారణం వైఎస్ కుటుంబమేనని తెలిపారు. అదే చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని సగానికి తగ్గించారని, ఆయన కులం వారి కాలేజీల్లో ఫీజులు అడ్డగోలుగా పెంచుకోవడానికి అనుమతులిచ్చారని చెప్పారు. దళితులు, బీసీలపై జగన్‌ది నిజమైన చిత్తశుద్ధి: పినిపే మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ దళితులు, బీసీలు, మైనార్టీల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది నిజమైన చిత్తశుద్ధి అని చెప్పారు. కేబినెట్లో, నామినేటెడ్ పోస్టుల్లో దళితులు, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఈ ప్రాధాన్యం చంద్రబాబు పాలనలో కనిపించలేదని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. అవినీతి లేని పాలన: మోపిదేవి సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల ద్వారా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా, అవినీతి అన్నది లేకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తూ సీఎం వైఎస్ జగన్ జనరంజక పాలన అందిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. బీసీలు వెనుకబడిన వర్గాలు కాదని, సమాజానికి వెన్నెముక లాంటివారని చెప్పడమే కాకుండా, బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న సీఎం జగన్ అని తెలిపారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కాకపోతే చంద్రబాబు పాలన నాటి రోజులు తప్పవని చెప్పారు. నీ పిల్లలను మొగల్తూరులో తెలుగు మీడియం చదివించు పవన్ : పేర్ని నాని సీఎం వైఎస్ జగన్ పేదలు, బడుగు వర్గాల కోసం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెగ బాధపడిపోయారని, ఆయన పిల్లలను సొంతూరు మొగల్తూరులో తెలుగు మీడియం స్కూల్లో చదివించవచ్చు కదా అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన చర్యలు మరెవరూ చేపట్టలేరని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ విజయం ఖాయమన్నారు. ఆశలు నిజం చేసిన నాయకుడు జగన్ : ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ఉన్నతంగా జీవించాలన్న అట్టడుగు వర్గాల కలలను నిజం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ అని ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. నరసాపురం నియోజకవర్గంలో రూ.5 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామని, రూ.1,500 కోట్లు సంక్షేమానికి ఖర్చు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, వంక రవీంద్రనాథ్, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నర్సింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల తదితరులు పాల్గొన్నారు. -
‘యువగళం ముసుగులో ఉన్నది రౌడీ షీటర్లే’
తణుకు: భీమవరంలో దాడులకు ఉసిగొల్పిన నారా లోకేష్‌పై కేసు పెట్టాలంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. అసాంఘిక శక్తులను తన చుట్టూ పెట్టుకుని లోకేష్ దాడులకు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి కారుమూరి. తణుకు పట్టణంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నిర్వహించిన ప్రెస్మీట్లో చంద్రబాబు, నారా లోకేశ్‌ల అరాచకాల్ని ఎండగట్టారు. ‘ఐటీ నోటీసుల ఫ్రస్టేషన్లో.. ప్రజలపైనే తండ్రీకొడుకుల దాడులు. ప్రశాంతమైన భీమవరంలో ఇలాంటి విధ్వంసమా..?, తండ్రి పుంగనూరులో...తనయుడు భీమవరంలో..!, దౌర్జన్యాలు, దాడులకు దిగుతుంటే చూస్తూ ఊరుకోవాలా?, ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. యువగళం ముసుగులో ఉన్న ఎర్రదండు- రౌడీషీటర్లే.నీ పాదయాత్ర ద్వారా ఏం సందేశం ఇస్తున్నావ్ లోకేశ్..?, రెచ్చగొట్టి ప్రజలపై, పోలీసులపై దాడులు చేయిస్తావా..? ,లోకేశ్ ధోరణి మొదటి నుంచి రెచ్చగొట్టే విధంగానే ఉంది. మా పార్టీ నైజం ఇదే అని మీరు ప్రజలకు చెప్తున్నారా?, సిగ్గు, శరం, లజ్జ అన్నీ వదిలేసి కుట్రలకు తెరలేపుతున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంకా ఏం మాట్లాడారంటే: వ్యూహాత్మకంగా విధ్వంసానికి కుట్ర నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో విధ్వంసం సృష్టించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాడు. యువగళం వాలంటీర్ల ముసుగులో ఎర్రదండు పేరుతో.. రౌడీషీటర్లు భీమవరంలో విధ్వంసం సృష్టించారు. వ్యూహాత్మకంగా కర్రలు, రాడ్లతో గొడవలు సృష్టిస్తున్నారు. నూజివీడు, నిడపనీడులోనూ ఇలానే దాడులకు పాల్పడితే వారిని అరెస్ట్ చేశారు. భీమవరంలోకి ఆయన పాదయాత్ర రాగానే మరిన్ని గొడవలకు రూపకల్పన చేశారు. అక్కడ మా పార్టీ పెట్టిన ఫ్లెక్సీలను చించివేసి, కావాలని వివాదాలు సృష్టించాడు. స్థానిక ఎమ్మెల్యే..టీడీపీవారు చింపిన ప్లెక్సీ స్థానంలోనే మరొక ప్లెక్సీ కూడా పెట్టుకున్నాడు. లోకేశ్ తన ప్రసంగంలో దుర్భాషలాడుతూ, స్థానిక ఎమ్మెల్యేపై బూతులు తిడుతూ రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాడు. అతను అసలు చదువుకున్నాడో లేదో కూడా అర్ధం కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడాడు. అతనే ఆ ఫ్లెక్సీలను చూపించుకుంటూ తన పక్కన ఉన్న వాలంటీర్లను రెచ్చగొట్టాడు. రెడ్ బనియన్లు వేసుకున్న వారు యువగళం వాలంటీర్ల ముసుగులో ఉన్నవారంతా రౌడీలే. కర్రలు, రాళ్లతో ప్రజలన భ్రయబ్రాంతులకు గురిచేశారు. భీమవరంలో ఇళ్లలోకి వెళ్లి మరీ టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. మొదటి నుంచీ లోకేష్ ధోరణి అదే..: లోకేశ్ ధోరణి మొదటి నుంచి రెచ్చగొట్టే ధోరణిలోనే మాట్లాడుతున్నాడు. మీరెన్ని కేసులు పెట్టించుకుంటే అంతటి పెద్ద పదవులు ఇస్తానంటూ ఆ పార్టీ కార్యకర్తలకు లోకేశ్ బహిరంగంగానే ఆఫర్ ఇస్తూ వస్తున్నాడు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ రెచ్చి పోతూ, దాడులు చేస్తూ, దౌర్జన్యంగా స్వైరవిహారం చేశారు. పోలీసులను కూడా గాయపరిచారు. వారిలో ఐదారు మంది గాయపడితే ఒకరికి సీరియస్‌గా ఉంది. మొన్న తండ్రి పుంగనూరులో...నేడు తనయుడు భీమవరంలో విధ్వంస కాండ సృష్టించారు. అసలు మీ యాత్ర ఉద్దేశం ఏంటి..? రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? తండ్రీ కొడుకులు ఇద్దరూ ఫ్రస్టేషన్లో ఉన్నారు. ఐటీ నోటీసులతో మీరు దొరికిపోయారు. మీరు దోపిడీ చేసిన డబ్బు ఎలా తీసుకువచ్చారో స్పష్టంగా లెక్కలతో సహా బయటపడింది. టిడ్కో ఇళ్ల పేరుమీద వందలాది కోట్ల రూపాయలు ఇతర దేశాల నుంచి డొల్ల కంపెనీల ద్వారా తెప్పించుకున్న తీరు కూడా బయట పడింది. నేరుగా ఐటీ శాఖ నోటీసులు పంపితే.. దానిలో రూ.118 కోట్లు చంద్రబాబుకు ముడుపులు అందాయని తేల్చింది. లోకేశ్‌కు కూడా ఆ స్కాంలో భాగస్వామ్యం ఉందని తెలిసే సరికి ప్రజలను భయబ్రాంతులను చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇతనేదో పెద్ద పోటుగాడిలా ఫ్లెక్సీలను చూపిస్తూ దాడికి ఉసిగొల్పాడు. మీ నైజం, మీ పార్టీ నైజం ఇదేనని ప్రజలకు చెప్తున్నారా?: ఇలాంటి దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేసి ప్రజల మన్ననలు పొందాలనుకుంటున్నారా..? మీ నైజం, మీ పార్టీ నైజం ఇదే అని మీరు ప్రజలకు చెప్తున్నారా? ఈ రోజు 50 మందిని అరెస్టు చేశారు. ప్రతి ఒక్కరూ మీ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్నారు. సిగ్గు, శరం, లజ్జ అన్నీ వదిలేసి...ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియక ఇలా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. చేసిన వాగ్ధానాలన్నీ చెత్తబుట్టలో పడేశాడు. మళ్లీ ఎన్నికలు రాగానే కల్లబోల్లి మాటలు చెప్తూ లబ్ధిపొందాలని చూస్తూనే ఉంటాడు. గత ఎన్నికల్లో 650 వాగ్ధానాలు చేసి తన మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తీసేసిన ఘనుడు చంద్రబాబు. జగన్ గారి నాయకత్వంలో.. మన రాష్ట్ర జీఎస్డీపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్ర ప్రగతిని పెంచుతూ ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్. పేదరికాన్ని 6 శాతానికి తగ్గించిన నాయకుడు జగన్ గారు. మీరెన్ని యాత్రలు చేసినా జగన్ గారిలా ఒక్క మంచి పథకం పేరు చెప్పగలిగే సత్తా మీకు లేదు. జగన్ పెట్టిన పథకాలు నేను చేయలేకపోయాను అని ప్రజలకు చెప్పలేక ఇవన్నీ చేస్తున్నాడు. విద్య, ఆరోగ్య రంగాలను మరింతగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్. సంక్షేమ పథకాలతో నిన్నటి వరకూ పప్పు బెల్లాల్లా పంచేస్తున్నాడు.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న ఇదే పెద్ద మనిషి... ఇప్పుడు అవే స్కీంలు పెంచి ఇస్తానంటూ ముందుకు వస్తున్నాడు. చిన్నవాడైన ఇన్ని కార్యక్రమాలు క్యాలెండర్ పెట్టి మరీ పంపిణీ చేస్తున్నాడని బాబుకు అక్కసుగా ఉంది. ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు ఐటీ నోటీసుల ఫ్రస్టేషన్ ను తండ్రీ కొడుకులు ప్రజల మీద చూపిస్తున్నారు. ఈ దుర్మార్గాలు ఇక సాగవు. మీ నాన్న, మీ తాతను వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు మీరిద్దరూ ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారు. ప్రజలే తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. అసలు మీ పాదయాత్రలో కర్రలు, రాళ్లు ఎందుకొచ్చాయి..? ఫ్లెక్సీలను చింపి తగలబెట్టిస్తారా..? ఇక సహించే ప్రసక్తే ఉండదు...పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తారు. అలాంటి జిల్లాలో మీరు అలజడులు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారు. మీరు వేరే ప్రాంతాల నుంచి రౌడీ మూకలను తీసుకొచ్చి దాడులు చేయిస్తే సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం.. టీడీపీ దాడులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. దాడికి పాల్పడ్డ వారిమీద, ప్రోత్సహించిన వారిపైన కూడా కేసులు పెట్టాలి. వాళ్లంతా యువగళం పేరుతో రెడ్ టీషర్టులు వేసుకున్న రౌడీషీటర్లు. తనతో పాటు అసాంఘిక శక్తులను తిప్పుకుంటూ ఇలాంటి చర్యలకు లోకేష్ పాల్పడుతున్నాడు -
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం
-
ఏసీబీ వలలో భీమవరం మున్సిపల్ కమిషనర్.. రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు
పశ్చిమ గోదావరి : కోట్లలో అక్రమాస్తులు కూడబెట్టిన భీమవరం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు గుర్తింపు - చెత్త సేకరణ మొదలు, కారుణ్య నియామకాల వరకు అంతా అవినీతే - వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకున్న శివరామకృష్ణ - అక్రమ సంపాదనతో విదేశీ పర్యటనలు చేసినట్లు ఏసీబీ గుర్తింపు - శివరామకృష్ణ ఇళ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు - ఇవాళ కూడా కొనసాగనున్న సోదాలు -
నిద్ర రావడంలేదని మీటింగ్ పెట్టిన చంద్రబాబు..!
-
అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షం
-
పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో YSRCP విజయం
-
‘ఎఫ్డీఆర్’తో రోడ్ల ఛిద్రానికి చెక్.. ఆ టెక్నాలజీ అంటే ఏమిటో తెలుసా?
ఆకివీడు(పశ్చిమగోదావరి జిల్లా): రాష్ట్రంలో ప్రగతి బాటలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పటిష్టమైన రహదారుల నిర్మాణమే లక్ష్యంగా సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తోంది. మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తున్నా.. వర్షాలు పడినా, వరదలు వచ్చినా కొద్దిరోజులకే ఛిద్రం కావడం, గుంతలు పడటంతో పాటు రహదారులు కోతకు గురవుతున్నాయి. ఇటువంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా ఎఫ్డీఆర్ (ఫుల్ డెప్త్ రిక్లమేషన్) టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి రోడ్లను గుర్తించి, వాటిలో అత్యవసరమైన రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. దీనిలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆర్అండ్బీ శాఖ రాష్ట్ర రహదారులుగా ఉన్న ఆరు రోడ్లు, జిల్లాలోని మేజర్ రోడ్లు ఏడింటిని మొత్తంగా 13 రహదారులను ఎంపిక చేసి రూ.130 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సుమారు 140 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించేందుకు ప్రభుత్వ అనుమతి, సాంకేతిక అనుమతి పొందాల్సి ఉంది. అనుమతులు వచ్చిన తర్వాత టెండర్లు పిలిచి ఆయా రోడ్లను కొత్త సాంకేతిక పద్ధతిలో నిర్మించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు ఆర్అండ్బీ, జిల్లాపరిషత్, రాష్ట్ర రోడ్లు పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రోడ్లను మరింత నాణ్యంగా నిర్మించనుంది. నూతన టెక్నాలజీతో నిర్మించనున్న కాళీపట్నం–భీమవరం రహదారి ఎఫ్డీఆర్ టెక్నాలజీ అంటే.. ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) టెక్నాలజీ ద్వారా రోడ్లు పటిష్టంగా ఉండటంతో పాటు గుంతలు పడటం, కోతకు గురికావడం వంటివి ఉండవని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డును సుమారు 250 మిల్లీమీటర్ల నుంచి 300 మిల్లీమీటర్ల లోతులో తవ్వి వచ్చిన మెటీరియల్‌ను మరాడిస్తారు. దీనికి ప్రత్యేక కెమికల్, సిమెంట్ కలిపి తవ్విన ప్రాంతంలోనే మెషీన్ ద్వారా చల్లుకుంటూ సీపుట్ రోలర్‌తో రోలింగ్ చేస్తారు. అనంతరం రెండు, మూడు అంగుళాల తారు రోడ్డు నిర్మిస్తారు. ఇలా నిర్మించిన రోడ్లపై మూడు రోజుల తర్వాత సాధారణ వాహనాలను, ఏడు రోజుల తర్వాత భారీ వాహనాలను రాకపోకలకు అనుమతిస్తారు. ఈ రోడ్లు 15 ఏళ్లపాటు నాణ్యంగా ఉంటాయి. అలాగే ఎఫ్డీఆర్ టెక్నాలజీ పర్యావరణ హితమైనది కూడా కావడం విశేషం మూడు వంతెనలు ఉమ్మడి జిల్లాలో ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.26 కోట్ల వ్యయంతో మూడు భారీ వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. గణపవరం, నారాయణపురం, గుండుగొలనులో బ్రిడ్జిల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. చురుగ్గా నిర్మాణాలు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఉమ్మడి జిల్లాలో మొదటి దశలో రూ.130 కోట్ల వ్యయంతో 13 రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సాంకేతిక అనుమతి వచ్చిన తర్వాత టెండర్లు పిలుస్తారు. ఉమ్మడి జిల్లాలో వంతెనల నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చురుగ్గా సాగుతున్నాయి. – జీవీ భాస్కరరావు, ఎస్ఈ, ఆర్అండ్బీ శాఖ, ఏలూరు జిల్లా పశ్చిమలో 55 కిలోమీటర్ల మేర.. పశ్చిమగోదావరిలో నూతన సాంకేతికతతో 55.853 కిలోమీట ర్ల మేర రోడ్లు నిర్మించనున్నాం. కాళీపట్నం–భీమవరం (15.953 కిలోమీటర్లు), నవాబుపాలెం–దండగర్ర (7.340 కిలోమీటర్లు), వేల్పూరు–రామేశ్వరం (11.100 కిలోమీటర్లు), అత్తిలి–అలంపురం (10.260 కిలోమీటర్లు), ఉరదాళ్లపాలెం–దువ్వ (11.200 కిలోమీటర్లు) రోడ్లను అభివృద్ధి చేయనున్నాం. –ఎస్.లోకేశ్వరరావు, ఆర్అండ్బీ ఇంజనీరింగ్ అధికారి, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం ఎంపిక చేసిన రహదారులు ఏలూరు జిల్లా : చేబ్రోలు–దేవరపల్లి, పొంగుటూరు–యర్నగూడెం, వడలి–తాడినాడ, నూజివీడు– గన్నవరం, వడ్లమన్నాడ–పెదలంక (స్టేట్æ హైవే), గుండుగొలను–కోరుకొల్లు, పొంగుటూరు–లక్కవరం, ఉప్పుటేరు–కలిదిండి (మేజర్ జిల్లా రోడ్లు). పశ్చిమగోదావరి జిల్లా : కాళీపట్నం–భీమవరం (స్టేట్ హైవే), ఉరదాళ్లపాలెం–దువ్వ, వేల్పూరు–రామేశ్వరం, నవాబుపాలెం–దండగర్ర, అత్తిలి–అలంపురం (మేజర్ జిల్లా రోడ్లు) -
పాతపాటి సర్రాజు భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళి
-
ఇంటర్ పరీక్షలకు వేళాయె
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. మూడేళ్లుగా ఇంటర్ పరీక్షలు పలు కారణాలతో వాయిదా పడటం, అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవడం, కరోనా సమయంలో రద్దు చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అయితే ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం ఈనెల 15 నుంచి పరీక్షలు జరుగనున్నాయి. పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా ఏలూరులోని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షాణాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. నైతికత, మానవ విలువలపై పరీక్షలు ఇంటర్ పరీక్షల్లో భాగంగా ముందుగా ఈనెల 15న నైతికత, మానవ విలువలు అనే సబ్జెక్టుపై పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్ష ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. అలాగే ఈనెల 17న పర్యావరణ విద్య అనే సబ్జెక్టుపై పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు పూర్వ పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఏలూరు జిల్లాలో 96 కేంద్రాల్లో 12,785 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 113 కేంద్రాల్లో 15,966 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 41 కేంద్రాల్లో 5,372 మంది మొత్తంగా 34,123 మంది హాజరుకానున్నారు. ప్రాక్టికల్స్‌కు సర్వం సిద్ధం పరీక్షల్లో భాగంగా ముందుగా ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈనెల 20 నుంచి వీరికి ప్రాక్టికల్స్ ప్రారంభమై వచ్చేనెల 7వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు నాన్ జంబ్లింగ్ విధానంలో పరీక్షలు రాయవచ్చు. మొత్తంగా 8,417 మంది విద్యార్థులు హాజరయ్యే పరీక్షల కోసం 76 కేంద్రాలను సిద్ధం చేశారు. అలాగే జనరల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఈనెల 26న ప్రారంభం కానున్నాయి. 147 కేంద్రాల్లో 24,227 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వచ్చేనెల 15 నుంచి.. ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు వచ్చేనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 73,521 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే సీసీ కెమెరాలన్నింటినీ ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాగే ప్రతి కేంద్రాన్నీ సెల్ఫోన్రహిత జోన్‌గా ప్రకటించారు. ఎవరూ కేంద్రాలకు సెల్‌ఫోన్ తీసుకురాకూడదనే నిబంధన విధించారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా.. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయ్యేలా అధ్యాపకులకు సూచనలిచ్చాం. కళాశాలల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడానికి ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం. విద్యార్థులు కళాశాలలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడటం, వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించడం వంటివి చేస్తున్నాం. – కె.చంద్రశేఖరబాబు, ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, ఏలూరు -
మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలి
తణుకు అర్బన్(ప.గో. జిల్లా): 2024 ఎన్నికల్లో మళ్లీ జగనన్న ప్రభుత్వమే విజయం సాధించాలనే లక్ష్యంతో బైక్ యాత్ర చేస్తున్నానని విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగుడు మాడెం అప్పారావు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కళ్లేపల్లి గ్రామానికి చెందిన అప్పారావు ఈనెల 4న ఇచ్చాపురం నుంచి విజయవాడకు బైక్ యాత్ర ప్రారంభించారు. శుక్రవారం తణుకు మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ మంచి సంకల్పంతో ప్రారంభించిన బైక్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆర్థికసాయం అందచేశారు. కార్యక్రమంలో కె.ఇల్లింద్రపర్రు సొసైటీ అధ్యక్షులు మల్లిరెడ్డి నాగార్జున, వైఎస్సార్సీపీ పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి పాల్గొన్నారు. -
‘గడపగడపకూ’ అభివృద్ధి
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): స్థానిక సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు ప్రభుత్వం సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం (జీజీఎంపీ) పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు గడపగడపకు కార్యక్రమంలో భాగంగా వారి దృష్టికి వచ్చిన మౌలిక వసతుల సమస్యలను గుర్తించి ఆయా పనులకు తీర్మానం చేయించి జీజీఎంపీ పనుల్లో నిధులు మంజూరు చేయించి త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏఏ పనులంటే.. సచివాలయ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20 లక్షలతో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, పారిశుద్ధ్య, లైటింగ్ తదితర పనులు చేపడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అత్యవసరమైన పనులకు ముందుగా ప్రాధాన్యమిస్తూ నిధులను వెచ్చిస్తున్నారు. 22.05 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు జిల్లావ్యాప్తంగా జీజీఎంపీ నిధులతో 22.05 కిలోమీటర్లు మేర సీసీ రోడ్లు మంజూరు చేయగా ఇప్పటివరకు 8.02 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. సీసీ రోడ్లకు సంబంధించి మొత్తం 414 పనులు చేపట్టగా 95 పనులు పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా 1,035 పనులు జిల్లాలో ఇప్పటివరకూ 1,035 పనులు మంజూరు చేయగా 837 పనులు జరుగుతున్నాయి. సుమారు 100 పనులు పూర్తయ్యాయి. మరో 158 పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలోని 19 మండలాలు, 6 మున్సిపాలిటీల్లో పనులు 80 నుంచి 90 శాతం మేర పురోగతిలో ఉన్నాయి. జీజీఎంపీ నిధులు మైనర్ పంచాయతీలకు వరంలా మారాయి. ఆయా నిధులతో మౌలిక వసతులు కల్పించడంతో గ్రామంలో సమస్యలు పరిష్కారమవుతున్నాయి. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శాఖల వారీగా పనులు ఇలా.. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 466 పనులు మంజూరు కాగా 424 పనులు చేపట్టారు. 42 పనులు చేపట్టాల్సి ఉంది. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా 172 పనులు మంజూరు కాగా 158 పనులు చేపట్టారు. 14 పనులు చేపట్టాల్సి ఉంది. విద్యుత్ శాఖ ద్వారా 5 పనులు మంజూరు కాగా 3 పనులు చేపట్టారు. 2 పనులు చేపట్టాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో 392 పనులు మంజూరు కాగా 184 పనులు జరుగుతున్నాయి. 108 పనులు చేపట్టాల్సి ఉంది. రోడ్డు, డ్రెయిన్ నిర్మాణం ప్రభుత్వం మా గ్రామ సచివాలయానికి రూ.20 లక్షలు మంజూరు చేసింది. గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి జీజీఎంపీ నిధులతో సీసీ రోడ్డు, డ్రెయిన్, కల్వర్ట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. మూడు పనులు జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – వీరవల్లి శ్రీనివాస్, సర్పంచ్, తోకలపూడి జిల్లావ్యాప్తంగా పనులు జిల్లావ్యాప్తంగా జీజీఎంపీ పనులు జరుగుతున్నాయి. సీసీ, గ్రావెల్ రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టాం. కలెక్టర్ ఆదేశాలు, సలహాల మేరకు వేగంగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో సుమారు 100 పనులు పూర్తికాగా 837 పనులు సాగుతున్నాయి. వీటిని వేగంగా పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నాం. – కేఎస్ఎస్ శ్రీనివాస్, జిల్లా పంచాయతీరాజ్ ఈఈ, భీమవరం -
దివ్యాంగులకు బంగారు భవిత
కైకలూరు (ఏలూరు జిల్లా): దివ్యాంగుల జీవితాల్లో భవిత కేంద్రాలు చిరుదివ్వెలు వెలిగిస్తున్నాయి. విధి వంచించిన విభిన్న ప్రతిభావంతుల్లో మార్పు తీసుకువస్తున్నాయి. కేంద్రాల్లోని ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్లు(ఐఈఆర్టీ) తల్లిదండ్రులకంటే మిన్నగా చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. అడుగుతీసి అడుగువేయలేని స్థితిలో చేరిన దివ్యాంగులకు నడక నేర్పి విద్యాబుద్ధులు అందిస్తున్నారు. ప్రత్యేకావసరాల పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా ఆధునిక పరికరాలు అందిస్తోంది. దీంతో తమ బిడ్డల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. 744 మంది చిన్నారులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 49 భవిత కేంద్రాల్లో 744 మంది దివ్యాంగులు సేవలు అందుకుంటున్నారు. 68 మంది ఐఈఆర్టీలు వీరి ఆలనాపాలనా చూస్తున్నారు. వీరితో పాటు మరో 40 మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. బుద్ధిమాంధ్యం, మాట్లాడటంలో లోపం, పాక్షిక, పూర్తి అంధత్వం, వినికిడి, అభ్యాసనా లోపాలు, స్థిరత్వం లేమితో బాధపడుతున్న పదహారేళ్లలోపు విద్యార్థులకు భవిత కేంద్రాలు విశేష సేవలు అందిస్తున్నాయి. వైద్య నిర్ధారణ శిబిరాలు ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కోసం వైద్య నిర్ధారణ శిబిరాలు ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం, కై కలూరులో పూర్తికాగా నూజివీడులో నిర్వహించాల్సి ఉంది. మొత్తం 240 మంది దివ్యాంగులను శిబిరాల ద్వారా గుర్తించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరంలో జరగ్గా, 7న తణుకు, 10న పాలకొల్లులో ఉచిత శిబిరాలు నిర్వహించనున్నారు. శిబిరాల్లో గుర్తించిన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అలింకో కంపెనీ నుంచి హియిరింగ్ ఎయిడ్స్, కాలిపర్స్, వీల్‌చైర్స్, రోలెటర్స్, హ్యాండ్ స్టిక్స్, సీపీ చైర్ వంటి పరికరాలను ఉచితంగా అందించనున్నారు. సేవలకు వందనం భవిత కేంద్రాల్లో ప్రత్యేకావసరాల గల చిన్నారులకు ఐఈఆర్టీలు, ఆయాలు ఎనలేని సేవలు అందిస్తున్నారు. ప్రతి వారం ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. దృష్టిలోపం కలిగిన వారికి బ్రెయిలీ లిపిలో బోధిస్తున్నారు. చెవిటి, మూగ వంటి సమస్యలు ఉన్నవారికి స్పీచ్ థెరపీ అందిస్తున్నారు. నడక సరిగా రాని పిల్లల కోసం స్టెప్బర్, వాకింగ్బార్లు అందు బాటులో ఉన్నాయి. మనోవికాసం వృద్ధి చెందేలా గణిత భావనలు గుర్తుండేలా పూసల చట్రాలు, ఆట వస్తువులు ఉన్నాయి. బుద్ధిమాంధ్యం కలిగిన వారికి ఎంఆర్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. స్పీచ్ థెరపీతో మాటలు ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు హకీమా. పుట్టుకతో మూగ, వినికిడి లోపం. 12 ఏళ్ల హకీమా ఆరేళ్ల క్రితం కైకలూరు భవిత కేంద్రంలో చేరింది. స్పీచ్ థెరపీలో చిన్నారికి ఐఈఆర్టీ జి.వెంకటలక్ష్మి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధగా హకీమాను రోజూ కేంద్రానికి తీసుకొస్తున్నారు. దీంతో బాలిక అక్షరాలను అర్థం చేసుకుంటోంది. ప్రస్తుతం ఉర్దూ పాఠశాలలో చదువుకుంటోంది. త్వరలో శస్త్రచికిత్సలు ప్రభుత్వం ప్రత్యేకావసరాల చిన్నారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. సహాయకులకు అలవెన్సు లు, రవాణా ఖర్చులు అంది స్తున్నాం. బుద్ధిమాంద్యం కలిగిన వారికి ఉచితంగా ఇచ్చే సీపీ చైర్ విలువ రూ.35 వేలు ఉంటుంది. నాడు–నేడు పథకంలో ప్రభుత్వం భవిత కేంద్రాలను తీర్చిదిద్దుతోంది. గ్రహణంమొర్రి, గ్రహణశూల, కండరాలలోపంతో బాధపడే వారికి త్వరలో శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. – బి.భాస్కరరాజు, ఐఈఆర్టీ జిల్లా కో–ఆర్డినేటర్, ఏలూరు భవిత కేంద్రాల వివరాలు ఏలూరు ‘పశ్చిమ’ కేంద్రాలు 29 20 చిన్నారులు 484 280 ఐఈఆర్టీలు 38 27 ఫిజియో- థెరపిస్టులు 9 7 ఆయాలు 20 20 -
West Godavari: 5.50 లక్షల ఎకరాల భూమి రీ సర్వే
ఆకివీడు(ప.గో. జిల్లా): జగనన్న సంపూర్ణ భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో రీ సర్వే చేసేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పి.ప్రశాంతి చెప్పారు. మండలంలోని చినమిల్లిపాడు శివారు కొత్త చెరువు ప్రాంతంలో గ్రౌండ్ కంట్రోల్ పాయింట్(సర్వే రాయి)ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపూర్ణ భూహక్కు రీ సర్వే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని చెప్పారు. సరిహద్దు వివాదాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ముందుగా రీ సర్వే పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఆకివీడు, కాళ్ల మండలాల్లో డ్రోన్ సర్వేను వేగవంతం చేయాలన్నారు. ముందుగా ఆకివీడు మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల జిల్లా అధికారి కె.జాషువాను ఆదేశించారు. ఆకివీడు మండలంలో 15 గ్రామాల్లో 2,9971.29 ఎకరాల భూమి రీ సర్వే చేయాల్సి ఉందని, దానిలో ఇంతవరకూ మూడు గ్రామాల్లో 492.46 ఎకరాల భూమి రీ సర్వే చేయించామని కలెక్టర్ చెప్పారు. కాళ్ల మండలంలో 13 గ్రామాల్లో 3,6561.69 ఎకరాలు రీ సర్వే చేయాల్సి ఉండగా 2 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందన్నారు. గ్రామాల్లో సర్వే చేస్తున్న సమయానికి ముందుగా గ్రామస్తులందరికీ సర్వే గురించి తెలియజేయాలని కలెక్టర్ సర్వే అధికారులను ఆదేశించారు. పీహెచ్సీ వైద్యులపై ఆగ్రహం మండలంలోని పెదకాపవరం గ్రామంలో పీహెచ్‌సీని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్ సెలవులో ఉండటం, ఇన్చార్జి డాక్టర్ విధులకు రాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరు డాక్టర్లు సెలవులో ఉంటే ఓపీ ఎవరు చూస్తారని ప్రశ్నించారు. ప్రతీ రోజూ రోగులు ఎంత మంది వస్తున్నారు, డెలివరీ కేసులు ఎన్ని వస్తున్నాయి, వాటిలో ఫ్రీ డెలివరీ కేసులెన్ని అని సిబ్బందిని ప్రశ్నించారు. ఫ్యామిలీ డాక్టర్ సేవల్ని గ్రామాల్లో విస్తరింపజేయాలని కలెక్టర్ హెచ్చరించారు. తొలుత గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాడు–నేడు పనుల్ని పరిశీలించారు. ఫేస్–2లో పాఠశాలలో జరగుతున్న పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. స్కూల్లోని ల్యాబ్‌ను పరిశీలించి, ఇటీవల పంపిణీ చేసిన ట్యాబ్‌లను ఏవిధంగా ఉపయోగిస్తున్నారని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కఠారి జయలక్ష్మీ, సర్పంచ్‌లు ఊసల బేబీ స్నేతు, ఎన్.రామరాజు, డీఈఓ వెంకటరమణ, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీకర్, ఎంఈఓ రవీంద్ర, హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మమతల కోవెలలు.. మండువా లోగిళ్లు
ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు దర్పణంలా.. మమతానురాగాలకు కోవెలలుగా మండువా లోగిళ్లు నిలుస్తున్నాయి.. వందేళ్లు దాటినా నేటికీ చెక్కుచెదరకుండా ఠీవిగా దర్శనమిస్తున్నాయి.. అలనాటి దర్పాన్ని, హుందాతనాన్ని చాటుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.. ఉభయగోదావరి జిల్లాల్లోని డెల్టా ప్రాంతాల్లో మండువా లోగిళ్లు అత్యధికంగా ఉన్నాయి. పశ్చిమగోదావరితో పాటు కోనసీమ ప్రాంతాల్లో 200కు పైగా కనిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు నియోజకవర్గ పరిధిలోని రేలంగి, సమీప గ్రామాలతోపాటు ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర, పోడూరు, ఆచంట, పాలకొల్లు నియో జకవర్గ పరిధిలోని యలమంచిలి, వేడంగి, భీమవరం నియోజకవర్గ పరిధిలోని వీరవాసరం తదితర మండలాల్లోని అనేక గ్రామాల్లో మండువా లోగిళ్లు దర్శనమిస్తున్నాయి. నేటికీ అనేక సినిమాలు ఇక్కడి మండువా లోగిళ్లలోనే షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. పోడూరులో 1916 నాటి మండువా నాణ్యతలో మేటిగా.. పూర్వం సంపన్నులు, ఉమ్మడి కుటుంబాల వారు ఎక్కువగా మండువా లోగిళ్లను నిర్మించుకునేవారు. అప్పట్లో 300 గజాల స్థలంలో ఇలాంటి ఇళ్లు నిర్మించడానికి రూ.30 వేలు, వెయ్యి గజాల్లో నిర్మించడానికి రూ.70 వేల వరకు ఖర్చయ్యేదని చెబుతారు. ప్రధానంగా పాటిమట్టి, గానుగ సున్నంతో 3, 4 అడుగుల వెడల్పు గోడలతో ఎంతో విశాలంగా, పటిష్టంగా వీటిని నిర్మించేవారు. వీటికి పెంకులతో కూడిన పైకప్పులు వేసేవారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే విశాలమైన హాలునే మండువా అనేవారు. ఆ హాలు చుట్టూ 3 వైపులా ఉమ్మడి కుటుంబాలు ఉండేలా గదులను పోర్షన్లుగా నిర్మించేవారు. ప్రతి పోర్షన్‌కు పైన నాణ్యమైన కలపతో చేసిన మిద్దెలు అత్యంత విశాలంగా ఉంటాయి. ఈ మిద్దెలను స్టోర్ రూమ్‌లుగా వాడేవారు. అలాగే వరదలు, తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు.. బందిపోటు దొంగల భయం ఉన్నపుడు నివసించేందుకు వీలుగా వీటిని ముందుచూపుతో నిర్మించేవారని ఇప్పటి పెద్దలు చెబుతుంటారు. వేడంగిలో సుమారు 150 ఏళ్ల నాటి మండువా లోగిలి గాలి, వెలుతురు, చల్లదనం పుష్కలం ఈ ఇళ్లల్లో గాలి, వెలుతురు పుష్కలంగా ఉండేలా కిటికీలు ఎక్కువగా పెట్టేవారు. అలాగే మండువా హాలులో పైకప్పును నాలుగైదు అడుగుల మేర చతురస్రాకారంలో ఖాళీగా ఉంచేవారు. ఇంటికి ఉండే కిటికీల నుంచే కాకుండా ఈ ఖాళీ ప్రదేశం నుంచి సూర్యరశ్మి, గాలి, వెలుతురు పుష్కలంగా వస్తుంది. ఇక్కడ నుంచి వర్షం నీరు నేరుగా కింద పడుతుంది. కొంతమంది వర్షం నీరు బయటకు వెళ్లేలా పైపును అమర్చేవారు. అవసరాన్ని బట్టి కొన్ని ఇళ్లను రెండు మండువాలతో నిర్మించేవారు. పూర్వం నిర్మించిన ఈ మండువా లోగిళ్లకు ఎక్కువగా బర్మా టేకు, బర్మా మద్ది (నల్లమద్ది)ని వినియోగించేవారు. ప్రధాన ద్వారాలు భారీగా ఉండటంతోపాటు ప్రధాన ద్వారంపై, నిలువు స్థంభాలపై ఎంతో అందమైన, ఆకర్షణీయమైన కళాత్మక రూపాలు చెక్కించేవారు. ఈ మండువా లోగిళ్లకు ఇవే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. పెంకుటి పైకప్పుతో ఉండడం వల్ల వేసవికాలంలో కూడా ఈ ఇళ్లు చల్లదనంతో ఉంటాయి. నిర్వహణ ఖర్చు అధికమే.. ప్రస్తుతం మండువా ఇళ్లను పరిరక్షించడం భారీ ఖర్చుతో కూడుకున్నప్పటికీ 5, 6 తరాలకు చిహ్నాలుగా ఉన్న ఇళ్లను కుటుంబీకులు పరిరక్షించుకుంటున్నారు. ప్రధానంగా కలప చెద పట్టకుండా నాలుగు లేదా ఐదేళ్లకు ఒకసారి స్ప్రే చేయించడం, కిటికీలు, తలుపులు, మిద్దె పైకప్పులను తరుచూ శుభ్రం చేయించడం, నాలుగేళ్లకు ఒకసారి పెంకులను అవసరమైన మేరకు మార్చడం చేస్తున్నారు. మాది ఏడో తరం ఈ ఇల్లు దాదాపు 125 ఏళ్ల క్రితం నిర్మించారు. మాది 7వ తరం. ఇప్పటికీ మా ఇల్లు పటిష్టంగానే ఉంది. చిన్న, చిన్న మరమ్మతులు చేయించాం. నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నా పూర్వీకులు ఇచ్చిన ఇల్లు కావడంతో పాడవకుండా రక్షించుకుంటున్నాం – చేకూరి సుబ్బరాజు, పోడూరు 120 ఏళ్ల క్రితం ఇల్లు మాది మా ఇల్లు నిర్మించి సుమారు 120 ఏళ్లవుతోంది. మా మనవలతో లెక్కేస్తే 8వ తరం ఇంట్లో ఉంటున్నట్లు. ఇంకో 50 ఏళ్లయినా అలాగే ఉంటుంది. పెంకుటిల్లు కావడంతో ముఖ్యంగా పెంకు నిలబడే రిఫర్ దెబ్బతినకుండా చూసుకోవాలి. 3, 4 ఏళ్లకు ఒకసారి అవసరమైన మరమ్మతులు చేయిస్తాం. – ఆర్ఎస్ రాజు, పోడూరు -
‘పశ్చిమ’ కలెక్టర్ ప్రశాంతికి పురస్కారం
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): జిల్లా కలెక్టర్ ప్రశాంతికి రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాకేంద్రంలో బుధవారం జరిగిన 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేతులమీదుగా కలెక్టర్ పి.ప్రశాంతి రాష్ట్రస్థాయి బెస్ట్ ఎలక్ట్రోలర్ ప్రాక్టీస్ అవార్డును అందుకున్నారు. ఓటరు చైతన్య కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడం, అత్యధిక ఓటర్ల నమోదు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపునకు సంబంధించి రాష్ట్రంలో ముగ్గురు కలెక్టర్లకు అవార్డులు ప్రకటించగా వారిలో ప్రశాంతి ఒకరు. అవార్డు అందుకున్న కలెక్టర్ ప్రశాంతికి జిల్లా ఉద్యోగులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. -
AP: దేశంలో పెద్ద మంచినీటి సరస్సు మన రాష్ట్రంలోనే.. ప్రత్యేకతలివే!
అరుదైన చేపలకు జన్మస్థలం... వలస పక్షులకు ఆవాసం... మూడున్నర లక్షల మందికి నివాసం...పెద్దింట్లమ్మ కొలువు దీరిన పుణ్యక్షేత్రం... మన కొల్లేరు. 901 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి దేశంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సుగా... జీవవైవిధ్యానికి జలతారుగా కొల్లేరు ప్రత్యేకతను సంతరించుకుంది. ఉప్పునీటిని, మురుగునీటిని తనలో ఇముడ్చుకుని... తనను నమ్మి వచ్చిన పక్షులు, మనుషులు... ఒకటేమిటి సకలజీవరాశులను అక్కున చేర్చుకుని స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందిస్తోంది. ఘన చరిత్రకు ఆనవాళ్లు.. మూడో శతాబ్దం నుంచి ఈ సరస్సు పురాతన గ్రంధాల్లో ఉంది. కొల్లేరుపై పట్టు కోసం పూర్వం రాజుల మధ్య యుద్ధాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్.. వెంగీ నగరంతోపాటు కొల్లేరును దర్శించినట్టు పలు గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఇక కొల్లేరును నూజివీడు జమీందార్లు తమకు విశ్వాసంగా ఉండే ‘కామదాన’ కుటుంబానికి దానం ఇచ్చినట్టు చెబుతారు. సరస్సులో ఊళ్లు ఎలా వెలిశాయంటే.. వరుస యుద్ధాల కారణంగా 17వ శతాబ్దంలో ఒడిశాలో తీవ్ర కరువు ఏర్పడింది. దీంతో అక్కడి వడ్డెర కులాలకు చెందిన పలు కుటుంబాలు జీవనాధారం వెదుక్కుంటూ వలస వెళ్లాయి. ఆ క్రమంలో సుమారు 10 కుటుంబాలు కొల్లేరు ప్రాంతానికి వచ్చాయి. సరస్సు మధ్యలో మట్టి దిబ్బలపై గుడిసెలు వేసుకుని చేపలను వేటాడి తింటూ జీవనం గడిపేవారు. ఆ తర్వాత పచ్చి, ఎండు చేపల విక్రయం ద్వారా జీవనోపాధి పొందారు. క్రమంగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పక్క గ్రామాల దురాక్రమణ నుంచి తమను కాపాడుకోవడానికి పలు సందర్భాల్లో కత్తులు, బరిసెలతో గ్రామాల మధ్య హోరాహోరీ యుద్ధాలు జరిగేవి. సుమారు 30 ఏళ్ల క్రితం ప్రత్తికోళ్లలంక, పందిరిపల్లిగూడెం గ్రామాల మధ్య సరిహద్దు విషయమై రెండు పర్యాయాలు జరిగిన పోరులో సుమారు 15 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇటువంటి కొట్లాటలు ఎన్నో కొల్లేరులో జరిగాయి. తొలినాళ్లలో రవాణాకు తాటిదోనెలను వాడేవారు. ఆ తర్వాత నాటు పడవలు, లాంచీలు వినియోగించేవారు. ఇప్పుడు రోడ్లు అభివృద్ధి చెందడంతో వాహనాలు ఉపయోగిస్తున్నారు. కొల్లేరుపై ఆధారపడి జీవించే ప్రజలు చేపలను వేటాడి విక్రయిస్తుంటారు. పర్యాటకంతో కొత్త అందాలు కొల్లేరును పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కొల్లేరులో కొలువైన పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయం, రోడ్లు, వంతెనల అభివృద్ధి, అటపాక పక్షుల కేంద్రాన్ని తీర్చిదిద్దడం, ఉప్పుటేరుపై అక్విడక్ట్‌ల నిర్మాణం వంటి అనేక పనులు వేగంగా జరుగుతున్నాయి. కొల్లేరులో అతిథి గృహాలు, రిసార్టులు, బోట్ షికారు వంటివి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. వలస పక్షులకు పుట్టిల్లు.. ► సైబీరియా, ఆ్రస్టేలియా, నైజీరియా వంటి అనేక దేశాల నుంచి ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో వలస పక్షులు ఇక్కడికి వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. ► గతంలో వలస పక్షులకు తోడు స్థానిక పక్షులన్నీ కలిపి 189 రకాలు కొల్లేరుపై ఆధారపడి జీవించేవి. ఇప్పుడు సుమారు 73 రకాల పక్షులున్నట్టు లెక్కతేల్చారు. ► కైకలూరు సమీపంలోని అటపాక పక్షుల విహార కేంద్రం వద్ద శీతాకాలంలో పెలికాన్, పెయింటెడ్ సాŠట్క్ వంటి విదేశీ పక్షులు సందడి చేస్తుంటాయి. ► కొల్లేరులో దాదాపు 140 రకాల చేప జాతులు ఉన్నట్టు అంచనా. ► అరుదైన నల్ల జాతి చేపలు ఇక్కడే పురుడుపోసుకున్నాయి. ► మార్పు, కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ, ఇసుక దొందులు వంటి చేపలు ఇక్కడ పుట్టినవే. కొల్లేరు విస్తరణ ఇలా.. ► ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న తొమ్మిది మండలాల్లో 77,138 ఎకరాల్లో విస్తరించింది. ► సుమారు 901 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో 122 గ్రామాలున్నాయి. వాటిలో సుమారు మూడున్నర లక్షల మంది జీవిస్తున్నారు. ► అతిపెద్ద మంచినీటి (చిత్తడి నేలల) సరస్సుగా 1971లో ఇరాన్‌లోని రాంసార్ సదస్సు తీర్మానించింది. ► 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు ఈ సరస్సులోకి చేరుతుంది. ► ఉప్పుటేరు ద్వారా కొల్లేటి నీరు సముద్రంలో కలుస్తుంది. -
రేషన్ బియ్యం ఇక పూర్తి ఉచితం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రేషన్ బియ్యాన్ని ఇక పూర్తి ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకూ కిలోకి రూపాయి తీసుకునేవారు. ఇక నుంచి పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇప్పటికే సంక్షేమ పథకాలతో భరోసా ఇస్తున్న సర్కారు నూతన సంవత్సరం నుంచి జిల్లాలో ఉచిత రేషన్ అమలు చేయనుంది. ప్రతి నెల 16,474 మెట్రిక్ టన్నులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున రేషన్ బియ్యాన్ని అందిస్తూ కిలో ఒక్క రూపాయికే ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇక నుంచి నూతన సంవత్సరంలో సంవత్సరం పాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేషన్ వాహనాలు ద్వారా అందించే పంచదార, కందిపప్పుకు మాత్రమే డబ్బులు తీసుకోనున్నారు. కేజీ కందిపప్పుకు రూ.67, అరకిలో పంచదారకు రూ.17 తీసుకోవాలని, బియ్యం మాత్రం ఉచితంగానే అందించాలని ఆదేశించింది. ఈఏఏవై కార్డుదారులకు కేజీ పంచదార రూ.13.50కే అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. నూతన సంవత్సర కానుకగా.. నూతన సంవత్సర కానుకగా అందించే ఈ బియ్యం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏలూరు జిల్లాలో 6,42,526 కార్డులకు గాను 17,87,981 మందికి అందిస్తారు. అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో 5,36,423 కార్డులకు గాను 15,06,921 మంది ప్రజలకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,474 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతి నెల ఉచితంగా ఆయా కార్డుదారులకు అందిస్తున్నారు. ఏలూరు జిల్లాలో 1,164 రేషన్ దుకాణాల ద్వారా 408 రేషన్ వాహనాలు, అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో 1011 రేషన్ దుకాణాల ద్వారా 343 రేషన్ వాహనాలు కార్డుదారుల ఇంటి వద్దకే బియ్యాన్ని తీసుకువెళ్ళి ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పేద ప్రజల్లో ఆనందం ప్రభుత్వం ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ సరఫరా చేయడంతో పాటు నూతనంగా అందించే రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందించడం పట్ల పేదలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమపై భారం పడకుండా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతూ వరుసలో నిలబడి రేషన్ డీలర్ ఇచ్చే బియ్యం కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని, ప్రస్తుతం తమకు ఆ బాధలు తప్పాయంటున్నారు. ఇంటికి తీసుకువచ్చి అందించే బియ్యాన్ని సైతం ఉచితంగా ఇవ్వడం పట్ల కార్డుదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి ఉచితంగా అందిస్తాం ప్రభుత్వ నిర్ణయంతో కార్డుదారులకు బియ్యం ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇతర సరుకులకు సొమ్ములు చెల్లించాలి. ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా కార్డుదారులకు బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. మిగిలిన సరుకులకు సొమ్ములు చెల్లించాల్సి ఉంది. – పీ.అరుణ్‌బాబు, జాయింట్ కలెక్టర్, ఏలూరు జిల్లా ఇప్పటికే వాహనాల ద్వారా సరఫరా ఇప్పటికే రేషన్ దుకాణాల నుంచి వాహనాల ద్వారా ప్రజల వద్దకే వెళ్ళి రేషన్ అందిస్తున్నాం. ఈ నేపధ్యంలో నూతనంగా ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు బియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంవత్సరం పాటు ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ సాగుతుంది. – ఈ.మురళీ, జాయింట్ కలెక్టర్, పశ్చిమగోదావరి జిల్లా -
జూదాలపై ఉక్కుపాదం
సాక్షి, భీమవరం: సంక్రాంతి పండగ రోజుల్లో జూదాలను అరికట్టడంతో పోలీసులు విజయం సాధించారు. భోగి పండగ రోజున అక్కడక్కడా కోడి పందేలతోపాటు జూదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో ఉక్కుపాదం మోపారు. ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా్లవ్యాప్తంగా గుండాట, పేకాట, కోడిపందేలు వంటి జూదాలపై 650 చోట్ల దాడులు చేసి 1,608 మందిపై కేసులు నమోదు చేసి వారి నుంచి సుమారు రూ.22.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి నుంచి జూదాలు నిర్వహించే ప్రాంతాల్లో దాడులు చేసి షామి యా లను ధ్వంసం చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. సంక్రాంతి పండగ మూడు రోజులు సంప్రదాయం పేరుతో కోడి పందేల శిబిరాల వద్ద గుండాట, పేకాట విచ్చలవిడిగా నిర్వహించడం సర్వసాధారణం. పండగలో జూదాల్లో పెద్ద మొత్తంలో సొ మ్ములు పొగొట్టుకుని పేద, మధ్యతరగతి వర్గాలు రోడ్డున పడుతున్న సంఘటనలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఈ ఏడాది జిల్లాలో ఎక్కడా జూదాలకు అవకాశం లేదని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్, ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ముందుగానే హెచ్చరించారు. దీనిలో భాగంగా దాదాపు నెల రోజుల ముందు నుంచే గ్రామాలు, పట్టణాల్లో పోలీసులు సమావేశాలు నిర్వహించి జూదాల వల్ల కలిగే అనర్థాలను వివరించడంతోపాటు నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో జూదాలు నిర్వహించిన ప్రాంతాల్లో హెచ్చరికగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. పందేల మాటున.. సంక్రాంతికి సంప్రదాయంగా కోడిపందేలు నిర్వహించడం పరిపాటి. అయితే కొ న్నిచోట్ల పందేలతో పాటు గుండాట, పేకాట వంటి జూదాలు నిర్వహిస్తుంటారు. బరుల వద్ద భారీ షామియానాలు ఏర్పాటుచేసి జూదగాళ్లకు కుర్చీలు వంటి సౌకర్యాలు కల్పించి పెద్ద మొత్తంలో జూదాలు నిర్వహిస్తారు. ఇందుకు జూదాలు నిర్వహించే వారు పెద్ద మొత్తంలో బరి నిర్వాహకులకు సొమ్ములు ఇస్తుంటారు. ఈ ఏడాది కొన్నిచోట్ల వేలం పాటలు ని ర్వహించి మరీ జూదాలకు స్థలాలను దక్కించుకున్నారు. వీరవాసరం మండలంలోని కోడిపందేల శిబి రం వద్ద జూదాల నిర్వహణకు రూ.48 లక్షలు ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శనివారం రాత్రి నుంచే కట్టడి భోగి పండగ రోజున కోడి పందేలతోపాటు విచ్చిల విడిగా జూదాలు ప్రారంభించడమేగాక శిబిరాల వద్ద భయం లేదని పోలీసులకు పెద్ద మొత్తంలో ముడుపులు ఇచ్చామంటూ నిర్వాహకులు ప్రచారం చేసుకున్నారు. జూదాల నిర్వహణ, ముడుపుల ప్రచారం జిల్లా ఎస్పీల దృష్టికి వెళ్లడంతో పోలీసు శాఖ దాడులు ప్రారంభించింది. శిబిరాల వద్ద షామియాలను తొలగించి జూదాల నిర్వహణకు ఉపయోగించే గుండాట బోర్డులు, బల్లలు వంటి సామగ్రిని, నగదును స్వాధీనం చేసుకున్నారు. జూదాల నిర్వాహకులపై కేసులు కూడా నమోదుచేశారు. దీంతో ఆది, సోమవారాలు జూదాల నిర్వహించిన దాఖలాలు కనిపించలేదు. అసాంఘిక కార్యకలాపాలను సహించం పండగల పేరుతో అ సాంఘిక కార్యకలా పాలను చేపడితే సహించం. సంక్రాంతి పండగను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో గుండాట, పేకాట, కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరాలపై దాడులు చేసి 142 మందిపై కేసులు నమోదు చేసి వారి నుంచి రూ.4,77,190 నగదు స్వాధీనం చేసుకు న్నాం. ప్రజలు కూడా సహకరించి ఎక్కడైనా జూదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇస్తే మరింత కట్టుదిట్టంగా అరికడతాం. – యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం ఏలూరు జిల్లాలో.. ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో పేకాట, గుండాల, కోడిపందేలపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. పేకాట శిబిరాలపై 142 చోట్ల దాడులు చేసి 408 మందిపై కేసులు నమోదు చేసి రూ.12,30,405 నగదు స్వాధీ నం చేసుకున్నారు. అలాగే గుండాటలపై 179 చోట్ల దాడులు చేసి 388 మందిపై కేసులు నమోదు చేసి రూ.2,30,480 నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడిపందేలపై 285 చోట్ల దాడులు చేసి 670 మందిపై కేసులు నమోదు చేసి రూ.3,32,370 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 323 కోడిపుంజులు, 353 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. -
Hyderabad: సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం..
భీమవరం (ప్రకాశంచౌక్): సంక్రాంతికి నగరం మొత్తం పల్లెబాట పట్టింది. దీంతో హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చే జనాల్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన పండగ ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి జిల్లాల్లోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం డిపోలకు నడుస్తాయి. ఈ నెల 10 నుంచి హైదరాబాద్ నుంచి ప్రయాణికుల సంఖ్య పెరిగింది. హైదారాబాద్ నుంచి జిల్లాకు ఏర్పాటు చేసిన ఆర్టీసి బస్సులు దాదాపు కిక్కిరిసి ఉంటున్నాయి. 105 ప్రత్యేక బస్సులు ఏర్పాటు హైదారాబాద్ నుంచి జిల్లాలో పలు ప్రాంతాలకు పండుగకు వచ్చే ప్రయాణికులను తీసుకురావడానికి ఆర్టీసీ 105 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు నడుపుతోంది. గతేడాది మాదిరిగానే సాధారణ ధరలకే ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. సూపర్ లగ్జరీ టిక్కెట్ రూ.750, ఇంద్ర రూ.950, అల్ట్రా రూ.710 చొప్పున వసూలు చేస్తున్నారు. రిజర్వేషన్ కూడా 90 శాతం మేర పూర్తయ్యింది. బస్సుల సంఖ్య పెంచుతాం సంక్రాంతి పండుగకు ముందు, తర్వాత కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నాం. పండగకు ముందు 105, పండగ తర్వాత తిరుగు ప్రయాణానికి 84 ప్రత్యేక బస్సులు తిప్పుతాం. ప్రయాణికుల రద్దీ మేరకు బస్సుల సంఖ్య పెంచుతాం. «టిక్కెట్ చార్జీ పెంచకుండా సాధారణ చార్జీలకే సర్వీసులు నడుపుతున్నాం. ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. పండగకు ప్రజలు ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. – ఏ.వీరయ్య చౌదరి, ప్రజా రవాణా అధికారి, భీమవరం -
కోడిపందేల కట్టడికి పటిష్ట చర్యలు..‘బరి’తెగిస్తే ఖబడ్దార్
సాక్షి, భీమవరం(ప.గో. జిల్లా): సంక్రాంతి పండగకు సంప్రదా యం పేరుతో జరిగే కోడిపందేల కట్టడికి పోలీసుశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పండగ మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందేలు, జూదాలను అడ్డుకోవడంపై జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు గత 15 రోజులుగా జిల్లావ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పందేలకు బరులు ఏర్పాటుచేసే ప్రాంతాలను పరిశీలించడంతో పాటు నిర్వాహకులతో మాట్లాడటం, జూదాలు నిర్వహించిన వారిని ముందుస్తు బైండోవర్ చేయడం, కోడి కత్తులు తయారీ, కట్టేవారిపై ప్రత్యేక నిఘా పెట్టి అదుపులోనికి తీసుకుని కేసులు నమోదు చేయడం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్), పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో పందేల వల్ల కలిగే అనర్థాలను విస్తృతంగా ప్రచారం చేయడం వంటి చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు సుమారు 2,100 కేసులు నమోదుచేసి కత్తులు తయారుచేసేవారిని 155 మంది గుర్తించి 50 కత్తులను సీజ్ చేశారు. గ్రామస్తుల సహకారంతో కట్టడి సంక్రాంతి జూదాలను కట్టడి చేయడానికి పోలీసుశాఖ గ్రామస్థాయి కమిటీల సమన్వయంతో పనిచేస్తోంది. ప్రతి గ్రామంలో వలంటీర్లు, సచివాలయ పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండటంతో ముందుస్తుగా బరులను సిద్ధం చేస్తున్న ప్రాంతాలపై సమాచారం సేకరిస్తున్నారు. గతంలో పందేలు వేసిన బరుల స్థల యజమానులకు ముందస్తు నోటీసులిచ్చి పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. విస్తృత తనిఖీలు గ్రామాల్లో పందేలు నిర్వహించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పందేలను సిద్ధం చేస్తున్న బరులను, పందేలకు అనువుగా ఉన్న స్థలాలను ట్రాక్టర్లతో దున్నించి ధ్వంసం చేయిస్తున్నారు. అలాగే గతంలో పందేలు నిర్వహించిన జూదరులను హెచ్చరించడంతో పాటు అనర్థాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక నిఘా ఏటా జిల్లావ్యాప్తంగా మూడు రోజులుపాటు కోడి పందేలు జరుగుతున్నాయి. ప్రధానంగా భీమవరం, కాళ్ల, యలమంచిలి, మొగల్తూరు, పెంటపాడు, త ణుకు, పెనుగొండ, అత్తిలి, వీరవాసరం, పాలకొల్లు, పోడూరు, ఆకివీడు మండలాల్లో భారీ పందేలు జరుగుతుండటంతో పోలీసు అ«ధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. కఠిన చర్యలు సంక్రాంతికి సంప్రదాయం పేరుతో కోడిపందేలు, జూదాలు ని ర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సుమారు 2 వేల మందికి పైగా కేసులు నమోదు చేశాం. జూదాల వల్ల కలిగే అనర్థాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. పండగలకు ఆనందంగా చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. – యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం -
Bhimavaram: మావుళ్ళమ్మ వార్షికోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
భీమవరం(పశ్చిమ గోదావరి జిల్లా): మావుళ్లమ్మ అమ్మవారి 59 వార్షిక మహోత్సవాలను ఈ నెల 13 తేదీ నుంచి వచ్చే నెల 10 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థాన సహకారంతో అమ్మవారి వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే అమ్మవారి అలంకరణ పనులు పూర్తి చేశారు. 14 రోజుల పాటు అమ్మవారి మూల విరాట్ దర్శనం నిలుపుదల చేసి అమ్మవారిని అలంకరించారు. అమ్మవారి ఆలయం వద్ద జాతర మహోత్సవాల ఏర్పాట్లలో భాగంగా ఆలయం వద్ద చలువ పందిళ్లు, భారీ సెట్టింగ్స్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు నెల రోజులపాటు ఉత్సవాలు మావుళ్లమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలు నెల రోజులపాటు నిర్వహిస్తారు. ఈనెల రోజుల్లో ప్రతీ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి ఉత్సవాల చివరి 9 రోజులపాటు అలంకరణలు చేస్తారు. ప్రతీరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకూ జానపద నృత్యాలు, భరత నాట్యాలు, హరికథ, బుర్రకథ, పలు కళా ప్రదర్శనలు, భక్తి కార్యక్రమాలు, సినీ సంగీత విభావరి ఏర్పాటు చేస్తారు. నెల రోజుల పాటు సాంఘిక, పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తారు. రూ.90 లక్షల వ్యయంతో నిర్వహణ నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది నిర్వహించే అమ్మవారి మహోత్సవాలకు సుమారు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలు ఖర్చు చేస్తారు. గత రెండేళ్లు కరోనా కారణంగా అమ్మవారి ఉత్సవాలు సాధారణంగానే నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడడంతో ఈ ఏడాది సుమారు రూ.90 లక్షలు ఖర్చు చేసి వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా తరలి రానున్న భక్తులు ఉత్సవాలను తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. నెల రోజులపాటు ఆలయం వద్ద సందడి నెలకొంటుంది. సంక్రాంతి పండుగకు వచ్చే జనంతో పాటు భీమవరం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీగా జనం తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన కళాప్రదర్శనను, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే లైటింగ్, సెట్టింగ్స్, విద్యుత్ అలంకరణలను తిలకిస్తారు. అమ్మవారి ఉత్సవాలు నిర్వహించే నెలరోజుల పాటు రోజుకు సుమారు 7 నుంచి 8 వేల మంది భక్తులకు అన్నదానం చేస్తారు. ఇక అమ్మవారి ఉత్సవాల ముగింపు రోజున సుమారు లక్ష మందికి అమ్మవారి ప్రసాదాన్ని భోజన రూపంలో అందిస్తారు. 58 ఏళ్లుగా ఉత్సవాల నిర్వహణ గత 58 ఏళ్లుగా నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థాన సహకారంతో విజయవంతంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో నెల రోజులపాటు నిర్వహించే ఏకైక ఉత్సవాలుగా మావుళ్లమ్మవారి ఉత్సవాలు ప్రసిద్ది చెందాయి. ఉత్సవాల్లో సినీ నటులను ఘనంగా సువర్ణ కంఠాభరణం, హస్త కంకణంతో సత్కరిస్తారు. (క్లిక్ చేయండి: ఆమె ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే) -
ప్రజారోగ్యంతో చెలగాటం.. చేపలకు మేతగా కుళ్లిన కోళ్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కుళ్లిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, పాడైపోయిన అన్నం ఇవి కొల్లేరు ప్రాంత ఫంగస్ చేపల సాగు కోసం చెరువుల్లో వేస్తున్న ఆహారం. ఈ చేపలను మనం తింటే ఏమవుతుంది. వ్యర్థ పదార్థాలను సైతం వృథా కానివ్వకుండా చేపలకు మేతగా వేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఏలూరు జిల్లా పరిధిలో ఇటీవల పట్టుబడుతున్న వ్యర్థ పదార్థాల వాహనాల కేసులు ఇందుకు నిదర్శనంగా మారాయి. ఈ ఏడాది నవంబరు 14న కలెక్టరు వి.ప్రసన్న వెంకటేష్ వ్యర్థాల నివారణకు మండల స్థాయిలో టాస్క్ఫోర్సు కమిటీల పర్యవేక్షణకు జీవో విడుదల చేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 2,50,045 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు విస్తరించింది. వ్యాధులకు తట్టుకుని, ఎలాంటి మేతనైనా జీర్ణం చేసుకునే గుణాలు కలిగిన ఫంగస్ చేపల సాగు దాదాపు 12,000 ఎకరాల్లో జరుగుతోంది. సాధారణంగా చేపల పెంపకానికి డీవోబి, వేరుశెనగ చెక్క, పిల్లెట్లు మేతగా ఉపయోగిస్తారు. పిల్లెట్లతో ఫంగస్ చేపలు త్వరగా బరువు పెరగవు. పైగా ఖర్చు ఎక్కువ. అందుకే వాటి స్థానంలో కోళ్ల వ్యర్థాలు, కుళ్ళిన కోడిగుడ్లు చెరువులో వేస్తున్నారు. టాస్క్ఫోర్సు కమిటీలు రాష్ట్ర చేపల రైతుల సంఘం ఫిర్యాదుతో 2016లో అప్పటి మత్స్యశాఖ కమిషనరు చేపల చెరువుల్లో కోడి వ్యర్థాల మేతను నిషేధిస్తూ జీవో నెంబరు 56 ద్వారా కఠిన నిబంధనలు విధించారు. అప్పట్లో నిషేధిత క్యాట్ ఫిష్ సాగు చేసేవారు. ఆ సాగును కేంద్రం నిషేధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యర్థాలను ఫంగస్ సాగులో వేస్తున్నారు. ఫంగస్ సాగు చేసే అందరి రైతులు వ్యర్థాలను వేయడం లేదు. ఈ ఏడాది నవంబరులో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిషేధిత జీవోను పటిష్టంగా అమలు చేయాలని ఆయా శాఖాలకు ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దారు, వీఆర్ఓ, వెహికల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, మత్స్య అభివృద్ధి అధికారి(ఎఫ్‌డీవో)లతో టాస్క్ఫోర్సు కమిటీని ఏర్పాటు చేశారు. పట్టుబడిన వ్యర్థాలను నాశనం చేయడం, వాహన డ్రైవర్ల లైసెన్సు రద్దు, వ్యర్థాలతో సాగు చేస్తున్న చెరువుల ఆక్వాకల్చర్ రిజిస్ట్రేషన్లు రద్దు వంటి చర్యలను టాస్క్ఫోర్సు చేస్తోంది. అక్రమ రవాణా ఇలా.. వ్యర్థాల అక్రమ రవాణాకు వేస్ట్ఫుడ్ మాఫియా బరితెగిస్తుంది. తెలంగాణ, విజయవాడ, గుడివాడ, ఏలూరు వంటి పలు ప్రాంతాల్లో చికెన్ షాపుల నుంచి కిలో రూ.ఐదు చొప్పున వ్యర్థాలను కొనుగోలు చేసి వాటిని పెంపకందారులకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఆయా దుకాణాల వద్ద డ్రమ్ములను ఏర్పాటు చేసి ఒక్కొక్కటి సేకరించి వ్యాన్లలో చెరువుల వద్దకు తరలిస్తున్నారు. హోటల్స్ నుంచి మిగిలిన అన్నం, కూరలను సేకరిస్తున్నారు. ఈ దందా రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. జిల్లాలో పెదపాడు, ఉంగుటూరు, మండవల్లి, కైకలూరు మండలాల్లో కోడి వ్యర్థాలను ఫంగస్ సాగులో ఉపయోగిస్తున్నారు. మండవల్లి మండలం నుచ్చుమిల్లి, కైకలూరు మండలం కొట్టాడ గ్రామాల్లో కోడి వ్యర్థాల వినియోగంపై కేసులు నమోదయ్యాయి. కఠిన చర్యలు తప్పవు కోడి వ్యర్థ్యాలను చెరువుల్లో ఉపయోగించడం వల్ల నీరు, నేల కలుషితమవుతాయి. ఇలాంటి చేపల సాగు మొత్తం ఆక్వాకల్చర్ పేరును పాడుచేస్తోంది. కొట్టాడ గ్రామంలో 12 క్వింటాల కోడి వ్యర్థాల వ్యాన్‌ను పట్టుకున్నాం. చెరువు యజమాని, వాహనదారుడిపై కేసులు నమోదు చేశాం. – ఎన్.భవిత, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు ప్రజారోగ్యానికి ముప్పు కుళ్లిన వ్యర్థాలతో సాగు చేసిన చేపలను మనుషులు తింటే ఆరోగ్యం పాడవుతోంది. ముఖ్యంగా దీని ప్రభావం మెదడుపై పడుతోంది. నరాల వ్యాధులు వస్తాయి. ఉదర కోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. చేపలకు మేతగా పెట్టిన వ్యర్థాల్లో కలుషిత రసాయనాలు శరీరంలోకి చేరుతాయి. ఇవి ఎంతో ప్రమాదకరం. – బి.శంకర్, కొల్లేటికోట పీహెచ్సీ డాక్టరు, కైకలూరు మండలం -
సంక్షేమ వారధులుపై ‘ఈనాడు’ విషపు రాతలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వలంటీర్లు ప్రతి ఇంట్లో తలలో నాలికలా మారారు. గతంలో పెన్షన్ నుంచి ఏ చిన్నపాటి ప్రభుత్వ సేవలు అవసరం ఉన్నా తహసీల్దార్ లేదా మండల కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ముంగిళ్లలోకే సేవలందించేలా రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్, సచివాలయ వ్యవస్థలకు శ్రీకారం చుట్టింది. పెన్షన్ మొదలు ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుడి ఇంటికే చేరేలా సరికొత్త విధానాన్ని అమలుచేస్తూ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. అలాంటి వలంటీర్ వ్యవస్థపై ఈనాడు మీడియా విషంచిమ్మింది. వ్యవస్థను నిర్వీ ర్యం చేసేలా, ప్రజలను మభ్యపెట్టేలా రాసిన కథనంపై వలంటీర్లు మండిపడుతున్నారు. గురువారం తణుకులో వలంటీర్లు ‘ఈనాడు’కు వ్యతిరేకంగా నిరసన ధర్నా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో 20,749 మంది.. ఉమ్మడి పశ్చిమగోదావరిలో 20,749 మంది వలంటీర్లు సేవలందిస్తున్నారు. వీరిలో 16,330 మంది గ్రామీణ, 4,419 మంది పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరు నిర్దేశించిన విధులే కాకుండా విపత్తులు, పెనుప్రమాదాల్లో స్వచ్ఛందంగా సేవలందిస్తూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పెన్షన్ మొదలు సర్వేల వరకు అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. సంక్షేమ పథకాలకు పూర్తి బాధ్యత వహించడంతో పాటు అర్హత ఉండి పథకాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలా పూర్తి చేయాలనేది వివరిస్తూ లబ్ధిదారుల ఇంటి వద్దనే ఆన్లైన్ చేస్తున్నారు. దీంతో ప్రజలకు పౌరసేవలు సులభతరమయ్యాయి. వరదల్లో కీలక సేవలు ఈ ఏడాది జూలై రెండో వారంలో జిల్లాలో గోదావరి ఉధృతికి పలు మండలాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలందించారు. దీంతో వరద సాయం, నష్టపరిహారం, పునరావాస కేంద్రాల తరలింపు ప్రక్రియలు సులభంగా జరిగిపోయాయి. వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, యలమంచిలి, నరసాపురం మండలాల్లో దాదాపు 750 మందికిపైగా వలంటీర్లు ఆహార ప్యాకెట్ల పంపిణీ, పునరావాస కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏడాది పొడవునా వలంటీర్ల సేవలను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం సేవా మిత్ర పురస్కారం పేరుతో రూ.10 వేల చొప్పున నగదు పురస్కారం అందిస్తోంది. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సేవా రత్న (రూ.15 వేలు), సేవా వజ్ర (రూ.20 వేలు) పురస్కారాలతో ప్రోత్సహిస్తోంది. రామోజీరావు క్షమాపణ చెప్పాలి తణుకు అర్బన్: వలంటీర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఈటీవీలో కథనాన్ని ప్రసారం చేశారంటూ గురువారం తణుకులో వలంటీర్లు నిరసనకు దిగా రు. ఎంతో సేవాదృక్పథంతో సేవ చేస్తున్న తమపై అసత్యా కథనాలు ప్రసారం చేస్తున్న ఈనాడు రామోజీరావు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గౌరవ వేతనంతో పనిచేస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ వారికి అందాల్సిన ప్రతి లబ్ధిని గుమ్మంలోకే చేరుస్తున్న తమపై అభాండాలు మోపుతారా అంటూ ఈటీవీకి వ్యతిరేకంగా గళమెత్తారు. కోవిడ్ సమయంలో గాలి ద్వారా కూడా వైరస్ సోకుతుందనే ప్రచారం ఉన్నప్పటికీ ప్రాణాలకు తెగించి రెడ్‌జోన్‌లో బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకులు అందించామని, వ్యాక్సిన్లు వేయించేందుకు తీసుకువెళ్లామని, సూర్యోదయం కాకుండానే అవ్వాతాతలకు పింఛను సొమ్ము అందచేసినందుకా తమను వేగులుగా చిత్రీకరిస్తున్నారంటూ వలంటీర్లు ఉన్నమట్ల ప్రదీప్, అధికారి చిన్నారి, ఇమ్మిడి సూరిబాబు, తణుకు జగదీష్‌లు రామోజీరావుకు ప్రశ్నలు సంధించారు. మానవత్వంతో పనిచేస్తున్న తమపై నిందలు మోపుతారా అంటూ దుయ్యబట్టారు. ప్రేమాభిమానాలు పొందుతూ.. నేను 2019 నుంచి వలంటీర్‌గా సేవలు అందిస్తున్నా. నాకు కేటాయించిన 50 కుటుంబాల లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా అందించడంతో వారి ప్రేమాభిమానాలను పొందాను. నా సర్వీసులో సేవా రత్న అవార్డు అందుకున్నా. వలంటీర్‌గా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. సొంత గ్రామంలో ప్రజలకు సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నా. –ఎం.దేవి ప్రసన్న, దెయ్యాలతిప్ప, భీమవరం మండలం సంతృప్తికరంగా విధులు వలంటీర్ విధులు సంతృప్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో రెడ్‌జోన్‌లో ఉంటూ బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకులు అందించడం, వ్యాక్సిన్లు వేయించడం వంటి సేవలు చేశాను. గౌరవ వేతనం రూ.5 వేలే అయినా ఆ సేవలో ఎంతో సంతోషం పొందుతున్నా. నా పరిధిలోని 50 కుటుంబాల వారు నన్ను సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. – ఉన్నమట్ల ప్రదీప్, 12వ వార్డు, తణుకు దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం పక్క రాష్ట్రాలు కూడా వలంటీరు వ్యవస్థను ఏర్పాటుచేయాలనుకుంటున్న సమయంలో ఈటీవీలో వలంటీర్లను వేగులుగా వర్ణిస్తూ దు ష్ప్రచారం చేయడాన్ని మేమంతా ఖండిస్తు న్నాం. వలంటీరు వ్యవస్థను నిర్వీర్యం చే యాలనే దురుద్దేశంతోనే అసత్య ప్రచారాలకు తెరతీశారు. దీనికి బాధ్యత వహిస్తూ రామోజీరావు తక్షణమే వలంటీర్లందరికీ క్షమాపణ చెప్పాలి. – అధికారి చిన్నారి, తణుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో విశేష సేవలు ఈమె పేరు కరటం రమ్య. స్వగ్రామం వేలేరుపాడు మండలంలోని చిన్నబుర్రతోగు. గతంలో కూలి పనికి వెళ్లేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్ ఉద్యోగం వచ్చింది. పెద్దబుర్రతోగు గ్రామ వలంటీర్‌గా పనిచేస్తోంది. గత జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వచ్చిన గోదావరి వరదల సమయంలో ‡ఈమె పరి«ధిలోని శివకాశీపురం, భూదేవిపేట, బండలబోరు, రామవరం, మేడేపల్లి పునరావాస కేంద్రాల్లో నిత్యావసర సరుకులు అందించడంలో కీలకంగా పనిచేసింది. బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి.. ఇతడి పేరు బందం లక్ష్మణ్‌రావు. స్వగ్రామం వేలేరుపాడు మండలంలోని పూచిరాల కాలనీ. గ్రామంలో వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. గత జూన్ నెలాఖరున రేపాకగొమ్ము గ్రామాన్ని గోదావరి వరద చుట్టుముట్టింది. ఇక్కడ 450 కుటుంబాలు ఉన్నాయి. రెండు నెలలపాటు వరద గ్రామాన్ని అతలాకుతలం చేసింది. ఈ సమయంలో గ్రామాన్ని ఖాళీ చేయించడంలో కీలకంగా వ్యవహరించాడు. బోటులో గ్రామస్తులను పల్లపు ప్రాంతాలకు తరలించడంలో తన వంతు కృషి చేసి మన్ననలు పొందాడు. -
స్వగృహప్రాప్తిరస్తు.. నిర్మాణం శరవేగం
సాక్షి, భీమవరం(ప.గో. జిల్లా): పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. త్వరితగతిన గృహాలు నిర్మించేందుకు అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తోంది. అలాగే సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేని లబ్ధిదారులకు ఆప్షన్–3లో భాగంగా కాంట్రాక్టర్లతో నిర్మించి ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, హౌసింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ మేరకు జిల్లాలో భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, తణుకు పట్టణాల్లో సుమారు 15 వేల గృహనిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు కాంట్రాక్టర్లతో లబ్ధిదారులు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చొరవతో.. జిల్లాలో పేదలకు ప్రభుత్వం 77,688 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటికే పలువురు సొంతంగా నిర్మాణాలు ప్రారంభించారు. పలువురు గృహప్రవేశాలు కూడా చేసుకున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేయగా డ్వాక్రా మహిళలకు బ్యాంకుల నుంచి రూ.35 వేలు రుణం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే వ్యవసాయ కార్మికులు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి ఇంటి నిర్మాణం కష్టం కావడంతో కాంట్రాక్టర్లు, తాపీమేస్త్రీలను పురమాయించి నిర్మాణాలు చేపట్టేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేస్తున్నారు. నిబంధనల మేరకు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం కోసం 10 అడుగుల లోతులో గోతులు తవ్వి వాటికి ఆర్సీసీ కాంక్రీట్, ఫైల్ క్యాప్ వేస్తారు. ఆర్సీసీ ప్లి్లంత్ బీమ్‌తో కలిసి 4 అడుగుల ఎత్తు సిమెంట్ రాయి కట్టుడు బేస్మెంట్, బేస్మెంట్ను ఇసుకతో నింపడం, రూఫ్ బీమ్, 4 అంగుళాల స్లాబ్ వంటి పనులు చేస్తారు. యంత్రాల వినియోగం కాంట్రాక్టర్లు నిర్మాణ పనులకు యంత్రాలు వినియోగిస్తున్నారు. ట్రాక్టర్‌కు డిగ్గర్‌ను అమర్చి పిల్లర్లకు గోతులు తవ్వుతున్నారు. దీంతో పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. అలాగే కాంక్రీట్ కలపడానికి మిక్చర్ యంత్రం, శ్లాబ్‌కు లిఫ్ట్ మెషీన్‌ను వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులతో ఒప్పందం ఇంటిని నిర్మించుకోవడానికి కాంట్రాక్టర్లతో లబ్ధిదారులు స్వచ్ఛందంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనుము కాంట్రాక్టర్లకు అందుబాటులో ఉంచుతున్నాం. దీనిలో భాగంగానే 20 వేల టన్నుల ఇసుక నిల్వ చేస్తున్నాం. వచ్చే జూన్ నాటికి నిర్మాణ పనులు పూర్తిచేసేలా కృషిచేస్తున్నాం. –ఎ.శివరామరాజు, హౌసింగ్ పీడీ, భీమవరం భీమవరంలో 3 వేల ఇళ్లు భీమవరంలోని విస్సాకోడేరు జగనన్న కాలనీలో 3 వేల ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే 1,200 మందికి పైగా లబ్ధిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. కాలనీలో ఆర్సీసీ కాంక్రీట్, ఫైల్‌క్యాప్ వేసే పనులు చేపట్టాం. పనులు చూసిన మిగిలిన లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకుంటున్నారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి గృహప్రవేశాలు చేయిస్తాం. – పళ్ల ఏసుబాబు, కాంట్రాక్టర్, భీమవరం ఇళ్ల నిర్మాణం ఇలా.. జిల్లాలో పెద్ద కాలనీలు ఉన్న ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు, తాపీమేస్త్రీలతో ఇళ్లు నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. భీమవరంలో 3 వేలు, పాలకొల్లులో 3,500, తణుకులో 5,500, ఆకివీడులో 2,700 ఇళ్లను కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. అలాగే నరసాపురం, తాడేపల్లిగూడెంలో నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నిర్మాణాలకు కొరత లేకుండా అధికారులు 20 వేల టన్నుల ఇసుకను నిల్వ చేశారు. కాంట్రాక్టర్లకు అవసరమైన సిమెంట్, ఇనుమును ముందుగానే అందిస్తున్నారు. నిర్మాణానికి రూ.3.30 లక్షలు ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.3.30 లక్షల ఖర్చవుతుండగా ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేస్తుంది. అలాగే డ్వాక్రా మహిళలకు రూ.35 వేలు బ్యాంకు రుణం ఇస్తున్నారు. మిగిలిన రూ.1.15 లక్షలను లబ్ధిదారులు చెల్లిస్తే సరిపోతుంది. -
వైద్య సిబ్బందికి ముఖ ఆధారిత హాజరు
భీమవరం(ప్రకాశం చౌక్): పేద, మధ్యతరగతి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత పారదర్శక సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా ఫేస్ రికగ్నేషన్ (ముఖ ఆధారిత) యాప్ ద్వారా హాజరు వేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. గురువారం (డిసెంబర్ 1) నుంచి జిల్లావ్యాప్తంగా ఈ విధానం అమలులోకి రానుంది. ఆయా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది అందరూ ఈ విధానంలోనే హాజరు వేయాల్సి ఉంటుంది. దీనిద్వారా వారు పనిచేస్తున్న ప్రాంతంలోనే నిర్దేశించిన సమయంలోనే హాజరు వేయాల్సి ఉండటంతో విధులకు డుమ్మా కొట్టే అవకాశం ఉండదు. డ్యూటీ సమయంలో వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఆస్పత్రిలోనే ఉండి సేవలు అందించేలా ఈ కొత్త యాప్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది. రోజుకు మూడు సార్లు చొప్పున.. వైద్యులు, సిబ్బంది రోజుకు మూడుసార్లు ఆస్పత్రిలో ముఖ ఆధారిత యాప్ ద్వారా హాజరు వేయాలి. ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 4 గంటలకు హజరు వేయాల్సి ఉంటుంది. రోజుకు మూడుసార్లు కచ్చితంగా హాజరు వేయాల్సిందే. జిల్లాలో 1,212 మంది.. జిల్లాలో ఏరియా ఆస్పత్రుల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వైద్యులు, అన్నిరకాల సిబ్బంది కలిపి మొత్తం 1,212 మంది ఉన్నారు. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో 500 మంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 712 మంది ఉన్నారు. 99 శాతం మేర ఫేస్ రికగ్నేషన్ యాప్‌లో నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. నేటి నుంచి అమలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది అంతా ప్రభుత్వ నూతనంగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా బయోమెట్రిక్ వేయాలి. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలోని అన్ని ఆస్పత్రుల నుంచి సుమారు 1,212 వైద్య సిబ్బందికి సంబంధించి ప్రక్రియ చేపట్టగా 98 శాతం మేర నమోదు కార్యక్రమం పూర్తి చేశారు. రోజుకు మూడుసార్లు వైద్య సిబ్బంది యాప్ ద్వారా బయోమెట్రిక్ వేస్తారు. –మహేశ్వరరావు, డీఎంహెచ్ఓ, పశ్చిమగోదావరి జిల్లా -
16 గ్రామాల్లో రీ సర్వే పూర్తి.. రైతులకు పత్రాల పంపిణీ!
భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకంలో భాగంగా భూముల రీ సర్వేను మూడు ఫేజ్‌ల్లో చేపట్టగా ఫేజ్ 1లో 98 గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. అందులో పైలెట్ ప్రాజెక్టుగా 16 మండలాల్లోని 16 గ్రామాల్లో రీ సర్వే పనులు పూర్తి చేశారు. ప్రతి గ్రామంలో ఉండే వ్యవసాయ, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల ను రీ సర్వే చేసి నూతన రికార్డుల్లో పొందుపరిచారు. సర్వే పూర్తి చేసిన గ్రామాలకు సంబంధించి రైతులకు జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం పత్రాలను అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి 23న ప్రారంభించారు. అందులో భాగంగా జిల్లాలో సర్వేపూర్తి చేసిన 16 గ్రామాలల్లో కూడా భూ పత్రాల పంపిణీకి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ పత్రాల్ని అందిస్తారు. 16 గ్రామాలకు కలిపి మొత్తం 6,187 మంది రైతుల 5,656 పత్రాలు పంపిణీ చేస్తారు. 98 ఏళ్ల తర్వాత రీ సర్వే 98 ఏళ్ల క్రితం నాటి బ్రిటిష్ పాలకులు భూముల సర్వే చేసి వ్యవసాయ, గ్రామ కంఠం, ప్రభుత్వ భూములుగా విభజించి వాటిని రికార్డుల్లో ఎక్కించారు. అప్పటి నుంచి భూముల రీ సర్వే చేయలేదు. ఏళ్ల తరబడి ఉన్న రికార్డులు పాడువడం, భూముల మాయం, కచ్చితమై విస్తీర్ణం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. దీనిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి భూముల రీ సర్వే కోసం ప్రత్యేకమైన పథకం ప్రవేశపెట్టి ఉచితంగా రీ సర్వే చేయిస్తున్నారు. భూముల సర్వే చేయించి కొలతల ప్రకారం భూమి చుట్టూ సర్వే రాళ్లు వేయిస్తున్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో వెంటనే భూ హక్కు, రక్షణ పత్రాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అధునిక పరికరాలతో రీ సర్వే భూముల రీ సర్వే కోసం అధికారులు అధునిక పరికరాలను ఉపయోగించి సర్వే పనులు చేస్తున్నారు. మండల సర్వేయర్, విలేజ్ సర్వేయర్, ఇతర సిబ్బంది కలిసి ఒక టీంగా ఏర్పడి సర్వే చేసి వివరాలను ఆన్లైన్ చేస్తున్నారు. భూముల రీసర్వే పనులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ల్యాండ్ అండ్ సర్వే శాఖ జిల్లా అధికారి పర్యవేక్షిస్తున్నారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న సర్వే పనులు ఎప్పటికప్పుడు పరిశీలిన చేసి సర్వేపై సూచనలు, సలహాలు ఇస్తు పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు ప్రభుత్వం గ్రామాల్లోని వ్యవసాయ, గ్రామ కంఠం, ప్రైవేట్ భూములను ఉచితంగా రీ సర్వే చేసి, కచ్చితమైన విస్తరణతో భూములను చూపించి వాటికి సంబంధించి భూహక్కు, రక్షణ పత్రాలను అందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూముల రీ సర్వే ద్వారా భూ సమస్యలు, గొడవలకు చెక్ పెట్టేలా సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఈ పథకం రైతులకు ఎంతో మేలు చేస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. 16 గ్రామాల రైతులకు పత్రాల పంపిణీ రీసర్వేకు సంబంధించి ఫేజ్ 1లో 98 గ్రామాల్లో పనులు చేపట్టాం. పైలెట్ ప్రాజెక్టుగా 16 గ్రామాల్లో పూర్తి చేశాం. ఈ గ్రామాలకు సంబంధించి 6,187 రైతులకు 5,656 జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షణ పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టాం. భూహక్కు రక్షణ పత్రాలు అందుకున్న రైతులు వాటిలో తప్పులుంటే మండలంలో మొబైల్ మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకుంటే సమస్య పరిష్కరిస్తాం. మిగిలిన గ్రామాల్లో సర్వే పనులు వేగంగా చేయించి మూడు ఫేజ్‌ల్లో భూముల రీ సర్వే పనులు పూర్తి చేస్తాం. – పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్ -
సృజనకు సాన.. వైజ్ఞానిక ప్రదర్శన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంచి.. వారి ఆలోచనలకు సానపెట్టి నూతన ఆవిష్కరణలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజ్ఞాన శాస్త్రం, గణితం, పర్యావరణాన్ని ముడి సరుకులుగా వినియోగించి సృ‘జన’హితమైన ఆవిష్కరణలు తీసుకువచ్చేలా విద్యార్థులను ఉపాధ్యాయులు సమాయత్తం చేస్తున్నారు. విజ్ఞాన ప్రదర్శనల ద్వారా చిన్నతనం నుంచే ఆవిష్కరణల ఆలోచనలు పెంచేలా మార్గదర్శకం చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా పాఠశాల స్థాయిలో సైన్స్ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. తొలుత పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనల్లో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి వాటిని మండల స్థాయికి పంపుతారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనల్లో తమ నైపుణ్యాన్ని రంగరించి మండల స్థాయి అక్కడి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయికి తమ ఆవిష్కరణలు వెళ్లాలనే ఆసక్తి విద్యార్థుల్లో కనిపిస్తోంది. వారికి గైడ్ టీచర్లు సూచనలిస్తూ మరింత పదును పెడుతూ ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే ప్రదర్శనలు విద్యార్థుల్లో సహజంగా ఉండే బెరుకును పోగొట్టడానికి తొలుత వారి ఆవిష్కరణలను తమతో ఎప్పుడూ తిరిగే, తాము రోజూ చూసే సహ విద్యార్థుల మధ్యనే ఈ ప్రదర్శనలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో మొదటగా వారు చదివే పాఠశాలలోనే విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించే ఏర్పాటుచేసింది. దీని ద్వారా తోటి విద్యార్థుల నుంచి వెల్లడయ్యే అభిప్రాయాలు, వారి నుంచి అందుకునే అభినందనలు విద్యార్థులకు సగం బలాన్నిస్తాయనేది ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లాలో ఈనెల 22, 23 తేదీల్లో పాఠశాల స్థాయిలో విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించారు. ఆవిష్కరణలకు మార్గనిర్దేశనం విద్యార్థులు ఆవిష్కరణలు చేయడానికి తగిన అంశాలను వెతుక్కోవాల్సిన పనిలేకుండా ప్రభుత్వమే కొన్ని అంశాలను సూచించింది. ఈ మేరకు విద్యార్థు లు పర్యావరణ అనుకూల పదార్థాలపై, ఆరోగ్యం, పరిశుభ్రతపై, సాఫ్ట్వేర్–యాప్స్ అభివృద్ధి, పర్యావరణం–వాతావరణ మార్పులు, గణిత నమూనాలు అనే అంశాలపై తమ ప్రాజెక్టులను సిద్ధం చేశారు. ఆయా ప్రాజెక్టులను పాఠశాల స్థాయిలో మంగళ, బుధవారాల్లో ప్రదర్శించారు. మండల స్థాయికి ఐదు చొప్పున.. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన వాటిలో ఉత్తమమైన ఐదు ప్రాజెక్టులను ఎంపిక చేసి మండల స్థాయి ప్రదర్శనలకు పంపనున్నారు. ఇలా ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు మండల స్థాయిలో ప్రదర్శనకు వెళ్లనున్న నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉంది. వచ్చేనెల 12, 13వ తేదీల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో మండల స్థాయి ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. సృజనాత్మకతకు పెంచేలా.. విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తికి పదును పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే పాఠశాల స్థాయి ప్రదర్శనలు పూర్తయ్యాయి. కేవలం ప్రాజెక్టులు రూపొందించేలా ప్రోత్సహించడంతో పాటు ఆయా ప్రాజెక్టులను చూసి ఇతర విద్యార్థులు స్ఫూర్తి పొందడం ప్రదర్శనల ఉద్దేశం. అలాగే ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని మిగిలిన పిల్లలు ఇటుగా ఆలోచించేలా కృషిచేస్తున్నాం. అందుకే పాఠశాల స్థాయిలో నిర్వహించిన ప్రదర్శనలకు సమీపంలోని ఇతర పాఠశాలల విద్యార్థులను కూడా తీసుకువెళ్లి వారికి ప్రాజెక్టులను పరిచయం చేయాలని సంబంధిత స్కూళ్ల ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం. – ఆర్ఎస్ గంగాభవాని, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు -
సీఎం జగన్ నరసాపురం పర్యటన షెడ్యూల్ ఇదే..
తాడేపల్లి : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈమేరకు రేపటి సీఎం జగన్ నరసాపురం పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10.50 గంటలకు సీఎం జగన్ నరసాపురం చేరుకోనున్నారు. ఉదయం గం. 11:15ని.ల నుంచి గం. 12.50ని.లవరకు వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనున్నారు. అనంతరం మధ్యాహ్నం గం. 1.15ని.లకు బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం జగన్. -
నరసాపురం నవశకం.. ఉమ్మడి పశ్చిమలో సరికొత్త రికార్డు
సాక్షిప్రతినిధి, ఏలూరు: ఫిషింగ్ హార్బర్.. ఆక్వా యూనివర్సిటీ.. ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణం.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి 12 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగనున్నాయి. రికార్డు స్థాయిలో రూ.3,300 కోట్లకుపైగా వ్యయంతో నిర్వహించే పనులకు అన్ని అనుమతులు పూర్తయ్యాయి. అది కూడా మొత్తం ఒకే నియోజకవర్గంలో జరిగే పనులు కావడం విశేషం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా నరసాపురం నియోజకవర్గంలో రూ.3,300 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఈనెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నరసాపురం వస్తున్న ఆయనకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అపూర్వ స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రిటిష్ హయాంలోనే వెలుగు వెలిగి తర్వాత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన చారిత్రక నేపథ్యం ఉన్న పట్టణం నరసాపురం. ఇన్నేళ్ల తర్వాత పూర్వవైభవాన్ని తెచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు హయాంలో వేల కోట్ల అభివృద్ధి పనులకు ఒకే రోజు బీజం పడనుంది. పక్కా జీఓలు, సాంకేతిక, ఆర్థికశాఖ అనుమతులతో పనులకు శ్రీకారం చుట్టడం జిల్లా చరిత్రలోనే ప్రథమం. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన పలువురు ఉద్దండులైన నేతల నిలయం నరసాపురం. అయినా వశిష్ట వంతెన, హార్బర్ వంటి దీర్ఘకాల ప్రాజెక్ట్‌లకు మోక్షం కలగలేదు. 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం, అపార మత్స్యసంపద ఉన్న ఈ ప్రాంత అభివృద్ధిపై ఏ నాయకుడు గతంలో దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఎన్నికల వాగ్దానాలతో సరిపెట్టడం తప్ప. అయితే జగన్ ప్రభుత్వం నవ చరిత్రకు, తీర ప్రాంత సమగ్ర అభివృద్ధికి ముందడుగు వేసింది. అభివృద్ధి పనులు రుస్తుంబాధలో రూ.13 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అధునాతన వసతులతో నిర్మించారు. దీనిని సీఎం జగన్ ప్రారంభిస్తారు. రూ.4.80 కోట్లతో నరసాపురంలో పునర్మించిన బస్టాండ్ ప్రారంభోత్సవం. 2 వేల మంది రైతులకు ఉపయోగడేలా 1921 నుంచి ఉన్న దర్భరేవు కంపెనీ భూముల సమస్యను కొత్త జీవోతో తీర్చి తరతరాల నుంచి అనుభవిస్తున్న రైతులకు పట్టాల పంపిణీ. బ్రిటిష్ హయాం నుంచి సమస్యగా ఉన్న మొగల్తూరు మండలం కాళీపట్నం జమిందారీ భూముల పంపిణీ. శంకుస్థాపనలు ఇలా.. రూ.1,400 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన. గోదావరి ఏటిగట్లు పటిష్టం, స్లూయిజ్ పనులకు రూ.35 కోట్లు మంజూరు. రూ.429.43 కోట్లతో బియ్యపుతిప్ప, వేములదీవి వద్ద ఫిషింగ్‌హార్బర్, కార్గోపోర్టు నిర్మాణం. రూ.332 కోట్లతో సరిపల్లిలో దేశంలోనే నాల్గో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతుల నిర్వహణ. రూ.133 కోట్లతో నరసాపురంలోని రుస్తుంబాధలో 10 ఎకరాల స్థలంలో 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం. పట్టణంలో రూ.220 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనే జీ వ్యవస్థ నిర్మాణంలో భాగంగా మొదటి ఫేజ్‌లో ప్రభుత్వం విడుదల చేసిన రూ.87 కోట్లతో చేపట్టే పనులు ప్రారంభం. రూ.61.81 కోట్లతో మున్సిపల్ వాటర్ ప్రాజెక్టు. రూ.180.50 కోట్లతో మొగల్తూరు మండలం మోళ్లపర్రులో ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణం. రూ.70 కోట్లతో కోతకు గురవుతున్న గోదావరి ఏటిగట్లు పటిష్ట పరిచే పనులు. రూ.31 కోట్లతో శేషావతారం వియర్ఛానల్ అభివృద్ధి పనులు. రూ.490 కోట్లతో నిర్మించనున్న గోదావరి జిల్లాల వాసుల చిరకాల కల వశిష్ట వారధిపై ప్రకటన. నియోజకవర్గంలో రూ.75 కోట్లతో 9 ప్రధాన రహదారుల నిర్మాణం, మరమ్మతులకు శంకుస్థాపన. రూ.8.80 కోట్లతో స్లూయిజ్ గేట్ల మరమ్మతులు, ఇతర పనులు. రూ.26.32 కోట్లతో నరసాపురంలో వశిష్ట రైట్ బ్యాంక్ నుంచి బుడ్డిగవానిరేవు వరకు రహదారి నిర్మాణ పనులు. ముమ్మర ఏర్పాట్లు నరసాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నరసాపురంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. హెలీప్యాడ్, 25వ వార్డులో సభావేదిక వద్ద పనులు దాదాపు పూర్తయ్యాయి. చినమామిడిపల్లిలో హెలీప్యాడ్ నుంచి స్టీమర్‌రోడ్డు మీదుగా సభాస్థలికి ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటుచేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు, కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పరిశీలించారు. సభా వేదిక వద్ద తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. పర్యటనలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న ఉన్నారు. నూతన అధ్యాయం నరసాపురం చరిత్రలో నూతన అధ్యాయానికి సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ దక్కని అవకాశం మాకు దక్కింది. రూ.3,300 కోట్ల విలువైన పనులు ఏకకాలంలో శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రజల చిరకాలవాంఛగా ఉన్న వశిష్ట వారధి నిర్మాణం ప్రకటనతో సహా పలు కీలక పనులకు నాంది పలకనున్నారు. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ ఇక్కడ కూడా చదవండి: సీఎం జగన్ నరసాపురం పర్యటన షెడ్యూల్ ఇదే.. -
జనసేనపై ఆగ్రహం: ప్రభుత్వ సంక్షేమాన్ని చూసి ఓర్వలేకపోతున్నారా?
పెంటపాడు(ప.గో. జిల్లా): జగనన్న కాలనీలో జనసేన జెండాల ప్రదర్శన తగదు.. మమ్ములను సంప్రదించకుండా కాలనీలోకి రావడం సహించబోం.. మాకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయి.. జనసేన పార్టీ వాళ్లు వచ్చి ఇక్కడ కిరికిరిలు పెట్టొద్దు.. జగనన్న ప్రభు త్వం మాకెంతో మేలు చేస్తోంది.. గతంలో ఏ ప్ర భుత్వం మాకు ఇళ్లు ఇవ్వలేదు.. ఇంతకాలానికి జ గనన్న ప్రభుత్వం ఇళ్లు అందించింది.. అంటూ పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపర్రు శివారు బిళ్లగుంట జగనన్న కాలనీవాసులు జనసేన నాయకులకు అడ్డుతగిలారు. ఆదివారం జనసేన గోబ్యాక్ అంటూ ఏపూరి నాగలక్ష్మి తదితర మహిళలు నినదించారు. ఆదివారం జనసేన నాయకులు, కార్యకర్తలు సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా జెండాలతో బిళ్లగుంట జగనన్న కాలనీలోకి ప్రవేశిస్తుండగా ఇళ్ల లబ్ధిదారులు వారిని అడ్డుకున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తాము ఇళ్ల నిర్మాణాలను ము మ్మరం చేస్తున్నామని, ఈలోపు సౌకర్యాలు కల్పించడం లేదంటూ జనసైనికులు రావడం కుదరదన్నారు. జనసేన నాయకులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా లబ్ధిదారులకు వారికి మధ్య వాగ్వాదం జరిగింది. మాకు సీఎం జగనన్న, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నిరకాలుగా అండగా నిలుస్తుంటే ఓర్వలేకపోతున్నారా అని లబ్ధిదారులు ప్రశ్నించారు. దీంతో జనసైనికులు తాము తెచ్చిన జెండాలను ముడిచి వెనుదిరిగారు. అప్రతిష్టపాలు చేసేలా.. ప్రభుత్వం లక్షల ఖర్చులతో స్థలాలు కొని ఇచ్చింది. ఇంటి నిర్మాణం పూర్తిచేసుకుంటు న్నాం. ఇళ్లు ఇచ్చిన ప్రభుత్వం రోడ్లు పోయకుండా ఉంటుందా.. అయితే జనసేన పార్టీ వాళ్లు కాలనీలోకి ఎందుకు వస్తున్నారో అర్థం కావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇటువంటి చర్యలు తగదు. – ఏపూరి నాగ విజయలక్ష్మి, దర్శిపర్రు ప్రభ్వుత సాయంతో నిర్మాణం గతంలో ఏ పార్టీ వాళ్లూ మాకు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు జగనన్న స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు సొమ్ములు కూడా ఇస్తున్నారు. అధిక వర్షాలతో ఇళ్ల నిర్మాణం ఆలస్యమవుతోంది. ఇప్పుడిప్పుడే పనులు మళ్లీ మొదలెడుతున్నాం. ఈలోపు జనసేన పార్టీ వాళ్లు కాలనీలోకి వచ్చి ఏం చేస్తారో తెలియడం లేదు. –కలగంటి శేషవేణి, దర్శిపర్రు -
సీఎం జగన్ హామీ.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, గణపవరం/ భీమవరం(పశ్చిమ గోదావరి): గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోకి చేరుస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గణపవరం మండలాన్ని ఏలూరు రెవెన్యూ డివిజన్ నుంచి భీమవరం రెవెన్యూ డివిజన్‌లోకి మారుస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ పేరుమీద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే 30 రోజుల్లోపు కలెక్టర్‌కు సమర్పించాలని సూచించారు. ఈ ఏడాది మే నెలలో గణపవరంలో జరిగిన రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు గణపవరం మండలాన్ని భీమవరం రెవెన్యూ డివిజన్లో కలిపేందుకు సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో కలుపుతామని సభాముఖంగా ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. 20 మండలాలతో జిల్లా జిల్లాల పునర్విభజనతో పశ్చిమగోదావరి జిల్లా 19 మండలాలు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు మున్సిపాలిటీలతో ఏర్పడింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో 2,178 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17.80 లక్షల జనాభా కలిగి ఉంది. ఇదిలా ఉండగా ఏలూరు జిల్లాలోని గణపవరం మండలాన్ని పశ్చిమలో విలీనం చేయడంతో మండలాల సంఖ్య 20కి చేరనుంది. అలాగే 100 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం, 65 వేల మంది జనాభా పెరగనుంది. -
కొల్లేరు గ్రామాల్లో సరికొత్త మార్పు..
కైకలూరు: కొల్లేరు గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతోంది. గతంలో ఇక్కడి ప్రజల అమయాకత్వాన్ని ఆసరా చేసుకుని టీడీపీ నాయకులు అభయారణ్యాన్ని అందినకాడికి దోచుకున్నారు. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. దీంతో కొల్లేరు లంక గ్రామాలు సంపూర్ణ వైఎస్సార్ జగనన్న గ్రామాలుగా ప్రకటించుకుని కృతజ్ఞత తెలుపుతున్నాయి. భారీ ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారు. రాష్ట్రంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. దాదాపు మూడున్నర లక్షల మంది జీవిస్తున్నారు. కొల్లేరు అభయారణ్యంగా 5 కాంటూరు వరకు 77,138 ఎకరాలు గుర్తించారు. వీటి పరిధిలో 122 పరివాహక గ్రామాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో కొల్లేరు గ్రామాలన్నీ ఏలూరు జిల్లా గూటికి చేరాయి. కొల్లేరు ప్రజలు ముఖ్యమంత్రి జగన్ మూడేళ్ళ పాలన చూసి తమ గ్రామాలను సంపూర్ణ వైఎస్సార్ జగనన్న గ్రామాలుగా ప్రకటించుకుంటున్నాయి. ఇందుకు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నాంది పలికింది. కైకలూరు మండలం శృంగవరప్పాడు, చటాకాయి, పందిరిపల్లిగూడెం, మండవల్లి మండలం కొవ్వాడలంక, చింతపాడు, పులపర్రు గ్రామాలు జగనన్న గ్రామాలుగా మారాయి. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)కు గ్రామంలో ఘన స్వాగతం పలికి, ముకుమ్మడిగా వైఎస్సార్సీపీలో చేరారు. ఇటీవల జరిగిన నియోజకవర్గ ప్లీనరీకి కూడా వేలాదిగా కొల్లేరు ప్రజలు హాజరవడం విశేషం. గడప గడపకు కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. కొల్లేరు ప్రజలకు మేలు ఇలా.. స్వచ్ఛ కొల్లేరు సాకారంలో భాగంగా ఉప్పుటేరుపై రూ.412 కోట్లతో మూడు రెగ్యులేటర్లు నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. ఇదే జరిగితే సముద్రపు ఉప్పునీరుని అరికట్టడంతో పాటు కొల్లేరులో నిత్యం నీరు ఉంటూ చేపల వేటకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వడ్డీలు వెల్ఫేర్ డెవలప్మెంటు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్‌పర్సన్‌గా సైదు గాయత్రీ సంతోషికి అవకాశం కల్పించారు. రూ.4 కోట్లతో కొల్లేరు రీ సర్వేకు సిద్ధం చేశారు. కొల్లేరు కాంటూరు వారిగా సర్వే పూర్తయితే 70 వేల ఎకరాలు మిగులు భూమిగా వెల్లడవుతుంది. ఇక బాహ్యప్రపంచానికి కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేసే కొల్లేటికోట పెద్దింట్లమ్మ వారధిని రూ.14.70 కోట్లతో చేపట్టారు. కులమతాలకు అతీతంగా పథకాల లబ్ధి పార్టీలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను కొల్లేరు లంక గ్రామాల్లో అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వాలు కొల్లేరు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. కొల్లేరుకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ మోసం చేశాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారు. సంపూర్ణ వైఎస్సార్ జగనన్న గ్రామాలుగా మరిన్ని మారడానికి సిద్ధంగా ఉన్నాయి. – దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) ఎమ్మెల్యే కొల్లేరుకు న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యం కొల్లేరు ప్రాంత ప్రజలకు నిజమైన న్యాయం ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుంది. ఒక మహిళగా నాకు రాష్ట్ర వడ్డీలు కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. గతంలో ఈ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యే మా సామాజికవర్గం అయినా కనీసం గ్రామాలను పట్టించుకోలేదు. రానున్న రోజుల్లో అన్ని కొల్లేరు గ్రామాలు జగనన్న గ్రామాలుగా మారతాయి. – సైదు గాయత్రీ సంతోషి, రాష్ట్ర వడ్డీలు వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ వైఎస్సార్సీపీపై పూర్తి నమ్మకం ఉంది సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కొల్లేరు గ్రామాల్లో పర్యటించి మా సమస్యలు తెలుసుకుంటున్నారు. మా గ్రామల్లో అందరికి పథకాలు చేరుతున్నాయి. ఇటీవల కొల్లేరులో వేటకు కొత్త లైసెన్సు ఇచ్చారు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించారు. వైఎస్సార్సీపీపై పూర్తి నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నాం. – జయమంగళ తిరుపతి వెంకన్న, సర్పంచ్, కొవ్వాడలంక, మండవల్లి మండలం -
గోరుముద్దకు మరింత అండ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బడిలో మధ్యాహ్న భోజనం మానేసిన రోజుల నుంచి ఎప్పుడెప్పుడు భోజనం టైమవుతుందా.. ఈ రోజు కిచిడీ లేదా ఫ్రైడ్‌రైస్ తినొచ్చు అంటూ విద్యార్థులు ఎదురు చూసే రోజులు వచ్చాయి. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు తీసుకున్న నాటి విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. కేవలం అమ్మ ఒడి, నాడు – నేడు వంటి పథకాలు మాత్రమే విద్యార్థులకు కడుపు నింపవని గుర్తించిన ముఖ్యమంత్రి విద్యార్థులు ఇష్టంగా భోజనం చేసేలా ఏర్పాటు చేయాలని భావించారు. గత ప్రభుత్వాలు కేవలం పప్పు, సాంబారులతో సరిపెట్టారు. చిన్నారుల ఆకలిబాధను గుర్తించిన జగన్ మామ వారందరికీ శుభవార్త చెప్పారు. దాని ఫలితమే కిచిడీ, ఫ్రైడ్ రైస్, పులిహోర వంటి వాటితో పాటు కోడిగడ్లు, చిక్కీలు మెనూలో చేరాయి. దీనితో గతంలో బడిలో మధ్యాహ్న భోజనం మానివేసిన విద్యార్థులు సైతం ఇప్పుడు ఇష్టంగా తింటున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నిధుల పెంపు విద్యార్థులకు రుచి, శుచికరమైన ఆహారం అందించడానికి నాణ్యమైన నిత్యావసరాలు, బియ్యం వంటివి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నాణ్యమైన వస్తువులు కొనాలంటే కుక్, హెల్పర్లకు ప్రస్తుతం ఇస్తున్న నిర్వహణ నిధులు సరిపోవడం లేదని ముఖ్యమంత్రి గ్రహించారు. కుక్, హెల్పర్లు మనస్ఫూర్తిగా పని చేయాలంటే వారికి తగిన ఆదాయం కల్పించాల్సి ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి వారికి నిర్వహణ నిధులు పెంచుతూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. పెరుగుతున్న కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు, కోడిగుడ్ల ధరలను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేలా నిధులు పెంచారు. అదనంగా నెలకు రూ.76.93 లక్షలు చెల్లింపు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే కుక్, హెల్పర్లు దాదాపు 6 వేల మంది వరకూ ఉన్నారు. ఏలూరు జిల్లాలో 1824 పాఠశాలలు ఉండగా 1,50,654 మందికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1413 పాఠశాలలు ఉండగా 1,09,153 మంది విద్యార్థులకు వండి వడ్డిస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు ప్రభుత్వం కుక్, హెల్పర్లకు గతంలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ. 4.97 చెల్లించేది. ప్రస్తుతం ఆ ధరను రూ.5.88కి పెంచింది. అంటే ఒక్కొక్క విద్యార్థికి 91 పైసలు పెంచింది. ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులకు రూ.7.45 చెల్లించేది. ప్రస్తుతం ఆ ధరను రూ. 8.57కు పెంచడంతో ఒక్కొక్క విద్యార్థిపై కుక్, హెల్పర్లకు రూ.1.12 లబ్ది చేకూరుతోంది. ఈ మేరకు ఏలూరు జిల్లాలోని అందరు విద్యార్థులపై రోజుకు రూ. 1,48,857 అదనంగా లభిస్తుండగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రూ. 1,07,599 లభిస్తోంది. అంటే నెలకు రూ. 76.93 లక్షలను ప్రభుత్వం కుక్, హెల్పర్లకు అదనంగా చెల్లిస్తోంది. మధ్యాహ్న భోజనం మెనూ ఇలా.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఏ పదార్థాలు వడ్డించాలో ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు సోమవారం అన్నం, కోడిగుడ్డు కూర, పప్పుచారు, చిక్కీ, మంగళవారం పులిహోర, టమోట పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, బుధవారం వెజిటబుల్ రైస్(ఫ్రైడ్‌రైస్), ఆలూ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ, గురువారం కిచిడీ, టమాటా చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, శనివారం అన్నం, సాంబారు, తీపి పొంగలి వడ్డిస్తున్నారు. సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం కుక్, హెల్పర్లకు నిర్వహణ నిధులను పెంచడంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన పదార్థాలను, రుచి, శుచికరంగా వండి వడ్డిస్తున్నారు. ప్రతి పాఠశాలలో మా అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు మధ్యాహ్న భోజనం జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. ఏజెన్సీలకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటుండడంతో వారికి ఆర్థికంగా ఉపయోగకరంగా ఉంటోంది. -ఆర్ఎస్ గంగాభవాని, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు జిల్లా -
రాష్ట్రాభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం
ఉండి (పశ్చిమగోదావరి జిల్లా): రాష్ట్ర ప్రజలంతా అన్ని విధాల అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లక్ష్యమని మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆయన స్వగ్రామం ఉండి మండలం యండగండిలో సోమవారం 21 మంది అర్హులైన లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ గోగులమండ చినకృష్ణకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఇంటి పట్టాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా రంగనాథరాజు మాట్లాడుతూ నిరుపేదలకు అండగా నిలిచి వారి కలలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనకు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన జగన్మోహన్రెడ్డికి ముందు ఆ తరువాత అన్నట్లుగా మారిపోయిందని అన్నారు. సొంత ఇల్లు లేని ప్రజలను గమనించి ఎంత ఖర్చయినా ఇంటి స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. జగనన్న లేఅవుట్లలో రోడ్లు, విద్యుత్, నీరు, తక్కువ ధరకే మెటీరియల్ వంటి సదుపాయాలు కల్పించి ప్రజాభివృద్ధి కోసం కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్రెడ్డి అని అన్నారు. -
పంచారామాలు... ప్రసిద్ధ క్షేత్రాలు
భీమవరం(ప్రకాశం చౌక్)/పాలకొల్లు సెంట్రల్: కార్తీకమాసం తొలి సోమవారానికి పశ్చిమగోదావరి జిల్లాలోని పంచారామక్షేత్రాలైన భీమవరం గునుపూడి లోని ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆల యం (సోమారామం), పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం (క్షీరారామం) ముస్తాబయ్యాయి. భీమవరంలో క్షేత్రానికి వేకువజాము నుంచి భక్తుల తాకిడి ఉంటుందని, సుమారు 50 వేల మంది భక్తులు వస్తా రనే అంచనాతో ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈఓ ఎం.అరుణ్‌కుమార్ తెలిపారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశామని, ఉచిత దర్శనంతో పాటు రూ. 50, రూ.100 ప్రత్యేక దర్శనా లు కల్పిస్తామన్నారు. ఆలయం వెనుక వైపు స్వామికి అభిషేకాలు, కార్తీక నోములు నోచు కునే ఏర్పాట్లు చేశామన్నారు. అన్నదాన కమి టీ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తామని, పోలీసు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఆదివారం అధిక సంఖ్యలో.. ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. క్షీరారామం.. శోభాయమానం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ట్రస్ట్‌బోర్డ్ చైర్మన్ కోరాడ శ్రీనివాసరావు, ఈఓ యాళ్ల సూర్యనారాయణ ఆదివారం ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం వెలుపల ప్రాకారం లోపల ఉన్న గోశాల వద్ద కార్తీక దీపాలు వెలిగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనం టికెట్ కౌంటర్లు ఆంజనేయస్వామి ఆలయం పక్కన, సర్వదర్శనం క్యూలైన్లు దేవస్థానం కార్యాలయం పక్కనున్న మండపం వద్ద కేటాయించారు. ప్రసాదం విక్రయాలను ప్రత్యేక క్యూలైన్ పక్కన అలాగే సేవా సంస్థలు, దాతలు పా లు, ప్రసాదాలను ఆలయం బయట ఉత్తరం గేటు వద్ద భక్తులకు అందించేలా చర్యలు తీసుకున్నారు. వేకువజామున కార్తీక దీపాలు వెలిగించడంతో పాటు దీప, ఉసిరి, సాలగ్రామ, వస్త్ర, గోదానాలు ఇచ్చే భక్తుల కోసం ఆలయ ఉత్తర భాగంలో గోశాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. పంచారామ యాత్రికుల వాహనాల పార్కింగ్‌కు బస్టాండ్ వెనుక సంత మార్కెట్ రోడ్డు, మార్కెటింగ్ యార్డు రోడ్డు వద్ద స్థలాలను కేటాయించారు. క్షేత్రంలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లను చేసినట్టు ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. -
అరటికి అందలం..ఇయర్ ఆఫ్ బనానాగా ప్రకటన
తాడేపల్లిగూడెం: మూడేళ్ల నుంచి ఉద్యాన పంటల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకట్రామన్నగూడెం వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఈ ఏడాదిని (2022–23) అరటి సంవత్సరం (ఇయర్ ఆఫ్ బనానా)గా ప్రకటించింది. ఈ మేరకు కరపత్రాలు, అధికారిక లోగోను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు కార్యరూపం ఇస్తూ విశేష కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోన్న ఉద్యాన వర్సిటీ ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల బలోపేతంలో క్రియాశీలక భూమిక పోషిస్తుంది. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ జానకీరాం వినూత్న ఆలోచనలతో 2020 నుంచి ఒక్కో ఏడాది ఒక్కో పంటను ఎంచుకొని పంటల నామ సంవత్సరాన్ని ప్రకటిస్తున్నారు. 2022–23ని ఇయర్ ఆఫ్ బనానాగా ప్రకటించారు. ఎంపిక చేసిన పంటకు సంబంధించి ఏడాది పొడవునా ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన, రాష్ట్ర ప్రభుత్వ శాఖల, జాతీయ సంస్థల సమన్వయంతో, దేశంలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో అత్యంత ప్రాధాన్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నారు. రైతులు, ఉద్యాన శాఖ, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల సంయుక్త కృషితో చేసిన కార్యక్రమాలు సామాన్య ప్రజలకు కూడా ఎంతో అవగాహన కలుగుతోంది. 2020–21ని అంబాజీపేట పరిశోధనస్థానం ద్వారా ఇయర్ ఆఫ్ కోకోనట్‌గా ప్రకటించారు. 2021–22ని పెట్లూరు నిమ్మ పరిశోధన స్థానం ద్వారా నిమ్మ, నారింజ, బత్తాయిల కోసం ఇయర్ ఆఫ్ సిట్రస్‌గా ప్రకటించారు. దేశంలో విశ్వవిద్యాలయాలకు ఈ పద్ధతి నమూనాగా మారింది. పరిశోధనల్లో వర్సిటీ మేటి మహారాష్ట్ర, గుజరాత్లో పండించే గ్రాండ్‌నెస్ (పెద్దపచ్చఅరటి)కు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇక్కడ పండించే కర్పూర, చక్కెరకేళీ, తెల్ల చక్కెరకేళీ, మార్టమస్, ఎర్ర చక్కెరకేళీ రకాలు దేశవాళీ రకాలుగా ప్రాచుర్యం పొందాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని అరటి పరిశోధన స్థానం విడుదల చేసిన కొవ్వూరు బొంత, గోదావరి బొంత అరటి వంటి కూర రకాలు కూడా ఉన్నాయి. టిష్యూ కల్చర్, బిందుసేద్య పద్ధతుల ద్వారా అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో అరటి విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయి. మూడు, నాలుగేళ్లుగా అరటి రైతులు ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా గ్రాండ్‌నెస్ అరటి రకాన్ని సాగు చేస్తున్నారు. ఉద్యాన వర్సిటీ పరిధిలో పనిచేస్తోన్న ఉద్యాన పరిశోధన స్థానం (కొవ్వూరు) కృషి ఫలితంగా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. విత్తన, పిలక ఎంపిక, టిçష్యూకల్చర్ అరటి, సాగు, బిందు సేద్య విధానం, గెలల యాజమాన్యం, ఎరువులు, తెగుళ్ల యాజమాన్యం, కోత ముందు తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి జాగ్రత్తలు వివరిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో అరటిసాగు పెరగడం వల్ల కొత్త రకాలు, ఆయా ప్రాంతాలకు అనువైన సేద్య పద్ధతులను అందుబాటులోకి తెస్తున్నారు. 2019లో ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా పులివెందులలో కొత్తగా 70 ఎకరాల విస్తీర్ణంలో అరటి పరిశోధనా స్థానాన్ని ఏర్పాటు చేసింది. -
ఇక విద్యుత్ రైళ్ల పరుగు..వేగంగా గమ్యానికి!
భీమవరం (ప్రకాశంచౌక్) : దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన డబుల్‌లైన్, విద్యుదీకరణ పనులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పూర్తయ్యాయి. పూర్తిస్థాయిలో డబుల్‌లైన్, విద్యుదీకరణ అందుబాటులోకి వచ్చింది. కరెంటు ఇంజన్లు పరుగులు తీయనున్నాయి. దీంతో వేగంగా గమ్యానికి చేరుకోవచ్చు. జిల్లావాసుల ఏళ్ల నాటి కల సాకారమైంది. చివరగా 32.8 కిలోమీటర్లు ఆరవల్లి–నిడదవోలు మధ్య 32.8 కిలోమీటర్లు మేర డబుల్ లైన్ ట్రాక్ వేయడంతో పాటు విద్యుత్దీకరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. దీంతో ఈనెల 14న ఆరవల్లి–నిడదవోలు విద్యుత్ లైన్‌ను రైల్వే అధికారులు ప్రారంభించారు. దీంతో ప్రాజెక్టు పనులు అన్నిదశల్లోనూ పూర్తయినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి పశ్చిమలో.. భీమవరం–నరసాపురం మధ్య 31 కిలోమీటర్లు మేర డబుల్ లైన్, విద్యుత్ లైన్ పనులు పూర్తికాగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ లైనులో రైళ్లు నడుపుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో భీమవరం–నరసాపురం, ఆరవల్లి–నిడదవోలు లైన్లలో మొత్తం 63.8 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ల పనులు పూర్తయ్యాయి. 221 కిలోమీటర్ల మేర.. దక్షిణ మధ్య రైల్వే (రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్) ద్వారా విజయవాడ–గుడివాడ–భీమవరం–నరసా పురం, మచిలీపట్నం–గుడివాడ–భీమవరం–నిడదవోలు మధ్య మొత్తం 221 కిలోమీటర్ల మేర డబ్లింగ్, విద్యుదీకరణ పనులను రూ.3 వేల కోట్లతో ఐదు దశల్లో చేపట్టారు. 2012లో పనులు ప్రారంభమ య్యాయి. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్‌లో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా ఇది నిలిచింది. దీని వల్ల ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లనుంది. ప్రాజెక్టుతో లాభాలెన్నో.. మౌలిక సదుపాయాల బలోపేతంతో పాటు సరు కు, ప్రయాణికుల రవాణా అభివృద్ధికి దోహదం. కొత్త డబుల్ లైన్ రైలు మార్గం రవాణా వ్యవస్థ మెరుగుదలతో పాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చనుంది. అధిక సంఖ్యలో ప్యాసింజర్ రైళ్ల సేవలను ప్రారంభించడానికి అవకాశం ఉంది. నౌకాశ్రయ / నదీ తీర ప్రాంతాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం, ఆక్వా ఉత్పత్తుల రవాణాలో ప్రోత్సాహంతో ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుంది. విద్యుదీకరణ పనుల వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్‌ను తగ్గించడం, ఇంధన ఆదాతో పాటు వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. విజయవాడ–విశాఖపట్నం మధ్య కోస్టల్ రైలు కారిడార్‌కు ఇది ప్రత్యామ్నాయ రైలు మార్గంగా మారనుంది. క్లిష్టమైన ప్రాజెక్టు అత్యంత క్లిష్టతరమైన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఇన్చార్జి అరుణ్‌కుమార్‌జైన్ సంతృప్తి వ్యక్తం చేశారని రైల్వే అధికారులు తెలిపారు. పనులు చిత్తశుద్ధితో, అంకితభావంతో పూర్తిచేసినందుకు జోనల్ హెడ్ క్వార్టర్స్ బృందం, విజయవాడ డివిజన్–ఆర్వీఎన్ఎల్ అధికారులను ప్రత్యేకంగా అభినందించినట్టు చెప్పారు. -
ట్రిపుల్ ఐటీ సీట్లలో అగ్రభాగంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యల్పంగా విద్యార్థులు ఎంపికయ్యారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4,400 సీట్లు ఉండగా, వీటిలో 400 సీట్లు ఈడబ్ల్యూఎస్ సీట్లు కాగా, ప్రత్యేక కేటగిరి కింద 280 సీట్లు మినహా 4,120 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేశారు. వీటిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 463 మంది, గుంటూరులో 434 మంది, నెల్లూరులో 393 మంది, పశ్చిమ గోదావరిలో 128 మంది, శ్రీకాకుళంలో 391 మంది, విజయనగరంలో 337 మంది, విశాఖలో 244 మంది, తూర్పు గోదావరిలో 275 మంది, కృష్ణాలో 269 మంది, కడపలో 231 మంది, కర్నూలో 260 మంది, చిత్తూరులో 357 మంది, అనంతపురంలో 232 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో బాలికలే అధికం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారిలో బాలికలే అధికంగా ఉన్నారు. బాలికలు 2,721 మంది ఎంపికవ్వగా, బాలురు 1,399 మంది మాత్రమే ఎంపికయ్యారు. మొత్తం సీట్లలో ఎంపికైన బాలికల శాతం 66.04, బాలుర శాతం 33.96గా ఉంది. బాలికలు నూజివీడు ట్రిపుల్ ఐటీకి 677 మంది, ఇడుపులపాయకు 676 మంది, ఒంగోలుకు 680 మంది, శ్రీకాకుళానికి 688 మంది ఎంపికయ్యారు. ఏపీ నుంచి 4,014 మంది, తెలంగాణ నుంచి 106 మంది ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారిలో ఉన్నారు. (క్లిక్ చేయండి: అక్టోబర్ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ సేవలు..) ముగిసిన ట్రిపుల్ ఐటీ ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్ల పరిశీలన నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తోన్న అడ్మిషన్లలో భాగంగా సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించిన ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారంతో ముగిసింది. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి దివ్యాంగులకు 120 సీట్లు, సైనికోద్యోగుల పిల్లలకు 80, ఎన్సీసీ 40, స్పోర్ట్స్ కోటా 20, స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 20 సీట్లు ఉన్నాయి. ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్.ఎస్.ఎస్.వి.గోపాలరాజు పర్యవేక్షణలో నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించారు. క్రీడా కోటాకు 622 మంది, ఎన్సీసీ కోటాకు 1,267 మంది, సైనికోద్యోగుల పిల్లల కోటాకు 272 మంది, వికలాంగుల కోటాకు 198 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాకు 63 మంది అభ్యర్థులు హాజరయ్యారు. -
ఏలూరులో భారీ వర్షం..నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు (ఫొటోలు)
-
ఎదురీదుతున్న వనామీ.. భారీ వర్షాలతో వైరస్ల ముప్పు
భీమవరం అర్బన్: ఈ ఏడాది వనామీ రొయ్య గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. జూన్ నెల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో రొయ్యల పెంపకం రైతుకు కత్తిమీద సాములా మారింది. చెరువులలో వనామీ రొయ్య పిల్లలు వదిలిన 15 రోజుల నుంచి నెల రోజుల లోపే వైట్ స్పాట్, విబ్రియో వంటి వైరస్లు సోకి చనిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, కాళ్ల, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురం, ఆచంట, పాలకోడేరు తదితర మండలాల్లో సుమారు 75 వేల ఎకరాలలో వనామీ రొయ్యల పెంపకం చేస్తున్నారు. ఏడాదికి జిల్లా నుంచి 2 లక్షలకు పైగా టన్నులు చైనా, సింగపూర్, దక్షిణకొరియా, అమెరికా తదితర దేశాలకు ఎగుమతవుతున్నాయి. రూ.7 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని మత్స్యశాఖ అధికారుల అంచనా. వనామీ రొయ్యలు 2 నుంచి 3 నెలలు మధ్య పట్టుబడికి వస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎక్కువ మంది రైతులు ఈ రొయ్యలను పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధిక వర్షాలతో వైరస్ల ముప్పు జూన్ నుంచి ఎడతెరిపి లేని వర్షాలతో వనామీ రొయ్యల పిల్లలకు వైట్‌స్పాట్, విబ్రియో వంటి వైరస్లు సోకడంతో నెల రోజులు లోపే మృత్యువాత పడుతున్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు చెబుతున్నారు. కొంతమంది రైతులు ప్రత్నామ్నాయ మార్గాలైన పండుగొప్ప, శీలావతి చేపలు పెంచుతున్నారు. (క్లిక్ చేయండి: అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయ్!) భారీగా పెరిగిన రొయ్య ధరలు గత మూడు నెలలుగా జిల్లాలో పట్టుబడికి వచ్చిన కౌంట్ రొయ్యలు తక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రొయ్యలకు ఆర్డర్లు రావడంతో రొయ్య ధరకు రెక్కలు వచ్చాయి. 100 కౌంట్ రూ.280, 90 కౌంట్ రూ.290, 80 కౌంట్ రూ.310, 70 కౌంట్ రూ.330, 60 కౌంట్ రూ. 340, 50 కౌంట్ రూ.360, 45 కౌంట్ రూ.370, 40 కౌంట్ రూ.400, 30 కౌంట్ రూ. 450, 25 కౌంట్ రూ.540 ధర పలుకుతుంది. రొయ్యల వ్యాపారస్తులు దూరం, టన్నుల మేరకు ధరలు మారుతున్నారు. వర్షాలతో రొయ్యకు వైరస్ అధిక వర్షాల కారణంగా వనామీ రొయ్యకు వైట్‌స్పాట్, విబ్రియో వైరస్లు సోకడంతో సీడ్ దశలోనే మృత్యువాత పడుతున్నాయి. కౌంట్‌కు వచ్చిన రొయ్యలు పట్టుబడులు లేకపోవడంతో రొయ్యల ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. – ఎల్ఎల్ఎన్ రాజు, ఏడీ, మత్స్యశాఖ, భీమవరం ధరలు ఒకేలా ఉండేలా చూడాలి రొయ్యలకు వేసే 25 కేజీల మేత రూ.2500 అయింది. ఎండాకాలంలో రొయ్యల ధరలు అమాంతం తగ్గిస్తున్నారు. అన్ సీజన్లో రొయ్యల ధరలు పెంచుతున్నారు. వనామీ పెంపకంలో ఎక్కువ నష్టాలు వస్తున్నాయి. సన్న, చిన్నకారు రైతులు చేపల పెంపకం చేస్తున్నారు. ఎప్పుడూ రొయ్యల ధరలు ఒకేలా ఉండేలా చూసి రైతులను ఆదుకోవాలి. – జడ్డు రమేష్ కుమార్, రైతు, గూట్లపాడురేవు -
బంగారం ధగధగ: ఉమ్మడి పశ్చిమ గోదావరిలో రూ.800 కోట్ల విక్రయాలు
నరసాపురం: కనకం మోత మోగిస్తోంది.. అమ్మకాలలో భళా అనిపిస్తోంది.. నెల రోజుల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ఎన్నడూ లేనివిధంగా రూ.800 కోట్ల అమ్మకాల టర్నోవర్ సాగినట్టు బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీటిలో రూ.500 కోట్ల వరకూ కేవలం ఆభరణాలు వంటి రిటైల్ వ్యాపారమే జరిగిందని చెబుతున్నారు. సాధారణంగా పండుగల సీజన్లలో బంగారం వ్యాపారం జోరుగా ఉంటుంది. ప్రస్తుతం శ్రావణమాసంలో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. అయినా రికార్డుస్థాయి అమ్మకాలు నమోదవుతున్నాయి. జిల్లాలోని నరసాపురం, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు లాంటి ప్రధాన పట్టణాల్లో బంగారం షాపులు కళకళలాడుతున్నాయి. ధర పెరుగుతున్నా.. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగాయి. మూడు రోజుల నుంచి మాత్రం స్వల్పంగా తగ్గినా అదీ నామామాత్రమే. ముంబై ధరలను అనుసరించి వ్యాపారం సాగే నరసాపురం బులియన్ మార్కెట్లో గురువారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,500, 22 క్యారెట్ల 916 ఆభరణాల బంగారం ధర రూ.49,750గా ట్రేడయ్యింది. ఈలెక్కన కాసు (8 గ్రాములు) ధర రూ.39,800గా ఉంది. మూడు రోజుల నుంచి గ్రాముకు రూ.70 మాత్రమే ధర తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మకాలు పెరగడంపై బులియన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. సాధారణంగా శ్రావణ మాసంలో కొంత మేర అమ్మకాలు పెరుగుతాయి. అయితే ఈ స్థాయిలో ఎన్నడూ పెరగలేదు. ప్రతి దుకాణంలో మూడు రెట్ల వరకూ అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇదే కారణం కావచ్చు.. కరోనా సెకండ్‌వేవ్ తర్వాత రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో బంగారం ధరల పెరుగుదలలో భారీగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. మరో పక్క డాలర్‌తో రూపాయి మారకపు విలువ కూడా భారీ హెచ్చుతగ్గులను చూస్తుంది. ప్రస్తుతం డాలర్ విలువ రూ.80కు చేరింది. మరో పక్క షేర్ మార్కెట్ ఒడిదుడుకుల్లో సాగుతోంది. ఈనేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలతో బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది మక్కువ చూపడంతో బిస్కెట్ అమ్మకాలు పెరిగినట్టుగా భావిస్తున్నారు. దీంతోపాటు చాలాకాలం నుంచి బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్న వారు ఒక్కసారిగా ఆసక్తి చూపడంతో ఆభరణాల అమ్మకాల జోరు పెరిగినట్టు చెబుతున్నారు. నెలరోజుల్లో జిల్లాలో హోల్‌సేల్ వ్యాపారం ఎక్కువ జరిగే నరసాపురంలో అత్యధికంగా, తర్వాత స్థానంలో భీమవరంలోను పెద్ద ఎత్తుల అమ్మకాలు సాగాయని అంచనా. మూడురెట్లు పెరిగాయి నెల రోజుల నుంచి బంగారం షాపులు ఖాళీ ఉండటం లేదు. ఆభరణాల అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. గత నెల చివరి నుంచి అమ్మకాల విషయంలో తేడా కనిపిస్తోంది. దాదాపుగా ప్రతి షాపులో మూడురెట్లు అమ్మకాలు పెరిగాయి. కరోనా తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు సాగడం ఇదే. బంగారం ధరలు తగ్గితే రాబోయే రోజుల్లో కూడా ఇదేజోరు కొనసాగుతుంది. దసరా, దీపావళి లాంటి పండుగలు ముందున్నాయి. – వినోద్‌కుమార్‌జైన్, నరసాపురం బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఫిష్ ఆంధ్రా.. ఫిట్ ఆంధ్రా..
సాక్షి, పశ్చిమగోదావరి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మత్స్య, ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) పథకాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందులో ఆక్వా రైతులు, ఔత్సాహికులకు సబ్సిడీ అందిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మత్స్యశాఖ అధికారులు ఈ పథకంపై మత్స్యకార సొసైటీలు, రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. మొత్తం 14 రకాల ఆక్వా సంబంధిత ఉత్పత్తులకు ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయి. చేపలు, రొయ్యల వినియోగాన్ని మరింత పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2,50,045 ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ప్రతి ఏటా 17,15,362 టన్నుల ఆక్వా ఉత్పత్తి జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2024 వరకు ఐదేళ్ల కాలానికి గాను రూ.20,050 కోట్లు పీఎంఎంఎస్వై పథకానికి కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.9407 కోట్లు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.4880 కోట్లు, లబ్ధిదారుల వాటా రూ.5763 కోట్లుగా ఉంది. ప్రోత్సాహకాలు ఇలా.. పీఎంఎంఎస్వై పథకంలో 14 అంశాలకు సంబంధించిన వివిధ పథకాలు ఉన్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఎంచుకున్న యూనిట్లకు కేంద్రం 36 శాతం, రాష్ట్రం 24 శాతం కలిపి 60 శాతం సబ్సిడీని అందిస్తున్నాయి. లబ్ధిదారులు 40 శాతం చెల్లించాలి. ఇతరులకు కేంద్రం 24 శాతం, రాష్ట్రం 16 శాతం కలిపి మొత్తం 40 శాతం సబ్సిడీ అందిస్తున్నాయి. లబ్ధిదారులు 60 శాతం నగదు చెల్లించాలి. యూనిట్ల విషయానికి వస్తే చేప, రొయ్య పిల్లల నర్సరీకి రూ.7 లక్షలు, రిజర్వాయర్లలో కేజ్ కల్చర్‌కు రూ.3 లక్షలు, ఆక్వా ల్యాబ్ ఏర్పాటుకు రూ.25 లక్షలు, బతికిన చేపల అమ్మకాల యూనిట్‌కు రూ.20 లక్షలు, చేపల రవాణా రిఫ్రిజిరేటెడ్ వాహనానికి రూ.25 లక్షలు, ఫిష్ కియోస్క్ యూనిట్‌కు రూ.10 లక్షలు, రోజుకు 20 టన్నుల ఆక్వా ఉత్పత్తులు చేసే కర్మాగారానికి రూ.2 కోట్లు సైతం అందించనున్నారు. ఫలిస్తున్న సీఎం జగన్ కల.. ప్రపంచంలోనే చేపల ఉత్పత్తిలో మన దేశం రెండో స్థానంలో ఉంది. సింహభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సరఫరా అవుతోంది. మత్స్యరంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేసి ఫిష్ ఆంధ్రా పేరుతో తాజా చేపలు, పీతలు, రొయ్యలను విక్రయించడానికి ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లాలో మొత్తం 101 వివిధ యూనిట్లకు గాను మొత్తం రూ.327.60 లక్షలు మంజూరయ్యాయి. వీటిలో రాష్ట్ర వాటా రూ.131.04 లక్షలు, కేంద్ర వాటా రూ.196.56 లక్షలుగా ఉంది. ఈ పథకం ద్వారా మంజూరైన వాహనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పథకంపై అవగాహన కలిగిస్తున్నాం... పీఎంఎంఎస్వై పథకంపై రైతులకు మత్స్య శాఖ ద్వారా అవగాహన కలిగిస్తున్నాం. ఈ పథకాలకు భూమి వివరాలు, ఆధార్ కార్డు, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు, రుణ మంజూరుకు బ్యాంకు నుంచి జారీ చేసిన పత్రం, లబ్ధిదారుని వాటా భరించు డిక్లరేషన్ పత్రం ఉండాలి. మరిన్ని వివరాలకు కావాల్సినవారు స్థానిక మత్స్యశాఖ కార్యాలయాల్లో సంప్రదించాలి. – ఈశ్వర చంద్ర విద్యాసాగర్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, ఏలూరు -
అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు.. నిషేధిత భూములనూ వదలని వైనం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అడ్డుగోలుగా రిజిస్ట్రేషన్ల దందా సాగించారు. నిబంధనలతో నిమిత్తం లేదు. ఫీజు టూ ఫీజ్ చెల్లించి ఆపైన భారీగా ముట్టచెప్పితే చాలు ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్ల చేస్తా రు. రెడ్‌మార్క్‌లో ఉన్నా, నిషేధిత భూములైనా, నాన్ లేఅవుట్ అయినా ఇలా ఏ భూమి అయినా కా సులు ఇస్తే ఉమ్మడి పశ్చిమగోదావరిలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. జిల్లాలోని 9 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గడిచిన మూడేళ్లలో 500కుపైగా ఈ తరహా రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖపై వరుస ఫిర్యాదులు అందుతుండటంతో ప్రభు త్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిలో భాగంగా విజి లెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమగ్ర దర్యాప్తు నిర్వహించగా ప్రతి సబ్ రిజిస్ట్రా్టర్ కార్యాలయాల్లో పదుల సంఖ్యలో అడ్డగోలు రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అవినీతికి చిరునామాగా.. జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతికి చిరు నామాగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉండే భూములకు డాక్యుమెంట్లు సృష్టించి మరీ రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ప్రభుత్వం 22ఏ, రెడ్‌మార్క్, నిషేధిత భూములు, నాన్ లేఅవుట్ సర్వే నంబర్లు అ న్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపి ఆ రిజిస్ట్రేషన్లను చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది. నిషేధిత భూములు, 22ఏ భూములు కలెక్టర్ అనుమతితో నిషేధిత జాబితా నుంచి తొలిగించిన తరువాత మాత్రమే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించాలి. అయితే జిల్లాలో భిన్నంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రధానంగా ఏలూరు, పాలకోడేరు, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, అత్తిలి, భీమవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పదుల సంఖ్యలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా నిర్ధారించారు. మరీ ముఖ్యంగా కోర్టు వివాదాల్లో ఉన్న భూములను కూడా రిజిస్ట్రేషన్లు చేశారు. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ 2019 నుంచి 2022 వరకు పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించింది. దీనిలో భాగంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిషేధిత భూముల జాబితాను తీసుకుని ఆ జాబితాలోని నంబర్లతో జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. దాదాపు మూడు నెలలకుపైగా విజిలెన్స్ అధికారులు శ్రమించి పూర్తిస్థాయిలో రికార్డులు పరిశీలించారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనేక అక్రమాలు జరిగినట్లు తేలింది. సగటున 30కి పైగా.. ప్రధానంగా నాన్‌లేఅవుట్ భూముల్లో ప్లాట్ల కొనుగోలుపై ప్రభుత్వం నిషేధం విధించింది. నాన్‌లేఅవుట్‌ను ముందుగా ల్యాండ్ కన్వర్షన్ చేసి సంబంధిత రుసుం చెల్లించి డీటీసీపీ నుంచి అనుమతి తీసుకుని అప్రూవ్ లేఅవుట్‌గా మార్చి విక్రయాలు చేయాలి. అయితే దీనికి విరుద్ధంగా నాన్ లేఅవుట్లల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిషేధిత భూములు, నాన్‌లేవుట్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా మొగల్తూరు, నరసాపురం, అత్తిలి, భీమవరం, ఏలూరులో అత్యధికంగా జరిగాయి. ఈ ఐదు కార్యాలయాల్లో సగటున 30కుపైగా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నిర్ధారించారు. మొత్తంగా 9 కార్యాలయాల్లో 500లకుపైగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయగా, భీమవరంలోనే ఎక్కువగా జరిగినట్టు సమాచారం. భారీ గోల్మాల్ ఏలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అయితే వట్లూరు గ్రామంలో ఒక ఎన్ఆర్ఐకు చెందిన 8 ఎకరాల భూమి విషయంలో భారీ గోల్మాల్ జరిగినట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా ఎకరా నుంచి 5 ఎకరాలలోపు నాన్‌లేఅవుట్లు వేసి పదుల సంఖ్యలో వ్యక్తులకు విక్రయించి రిజిస్ట్రేషన్లు చేయించేశారు. దీనిపై ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రత్యక్షంగా గండికొట్టారు. 500లకుపైగా డాక్యుమెంట్లల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమగ్ర విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు సమాచారం. అలాగే కొందరు సబ్రిజిస్ట్రార్లు, కొన్ని కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లపైనా చర్యలకు సిఫార్సు చేశారు. (క్లిక్: ఏలూరులో ఏసీబీ సోదాలు.. రికార్డుల తనిఖీ) -
ముంపు ప్రాంతాల్లో విశేష సేవలందించిన వాలంటీర్లు
-
నరసపురం వద్ద ప్రమాదకరంగా గోదావరి ఉధృతి
-
జలదిగ్బంధంలో యలమంచిలి
-
ఏపీలో ప్రధాని పర్యటన 2–3 గంటలే
సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): ఈ నెల నాలుగో తేదీన ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన కేవలం 2–3 గంటలు ఉంటుందని బీజేపీ రాష్ట్ర వర్గాలు వెల్లడించాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా.. స్వాతంత్య్ర పోరాట విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగే కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. సాంస్కృతిక పర్యాటక శాఖ ఏర్పాటు చేసే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి, అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు. ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమమని, రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతోను ప్రధాని ఎయిర్‌పోర్టులోనే కొద్దిసేపు ముచ్చటించే అవకాశమే ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని పర్యటనకు సంబంధించి మినిట్–టు–మినిట్ కార్యక్రమ వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇప్పటికి ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకుల వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న మోదీ.. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 – 10.40 గంటల మధ్య గన్నవరం ఎయిర్‌పోర్టుకు వస్తారు. ఎయిర్‌పోర్టులో ప్రధానికి స్వాగతం పలికే కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, పలువురు మంత్రులు, అధికారులు, కొద్దిమంది బీజేపీ నాయకులు పాల్గొంటారు. తర్వాత ప్రధాని, ముఖ్యమంత్రి కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి భీమవరం చేరుకుంటారు. అల్లూరి విగ్రహావిష్కరణ అనంతరం బహిరంగసభలో ప్రధాని దాదాపు 50 నిమిషాలపాటు ప్రసంగించే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు వెల్లడించారు. ఆ సభలో ప్రధానితోపాటు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాత్రమే ప్రసంగించే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు రెండుగంటల పాటు ప్రధాని భీమవరంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ నుంచి ఢిల్లీ వెళతారని చెప్పారు. భారీ వర్షం కురిస్తే.. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. రానున్న రెండు రోజుల్లో భీమవరంలో భారీవర్షం కురిసిన పక్షంలో ప్రధాని రాష్ట్ర పర్యటన కొనసాగే అంశంలో సందేహాలున్నట్టు బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలు చెప్పారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ అధికారులు ప్రస్తుతం భీమవరంలోనే ఉన్నారు. విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్ల పరిశీలన ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్లను శుక్రవారం కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ పి.జాషువా పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాని పర్యటన సందర్భంగా విధులు కేటాయించిన అధికారులు, సిబ్బందికి ఫొటో గుర్తింపు కార్డులు జారీచేయాలని ఆదేశించారు. ఈ విధుల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలన్నారు. తొలుత విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్, ఇమ్మిగ్రేషన్, భద్రత తనిఖీ విభాగాలను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. వారి వెంట జాయింట్ కలెక్టర్ రావిరాల మహేష్‌కుమార్ తదితరులున్నారు. మరోవైపు ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎస్పీజీ దళాలతో పాటు కాన్వాయ్ వాహనాలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. ప్రధాని భద్రత ఏర్పాట్లను ఎస్పీజీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. -
మా జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వారి 23 ఏళ్ల ఎదురు చూపులు ఫలించనున్నాయి. వారంతా డీఎస్సీలో అర్హత సాధించినా.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇంతవరకూ కొలువులు దక్కలేదు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుతూ వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపారు. దీంతో 1998 డీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుంటూ తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. పాదయాత్రలో మొరపెట్టుకున్న అభ్యర్థులు 1998లో అప్పటి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించి అర్హుల జాబితా సిద్ధం చేసింది. వారిలో కొంతమందికి మాత్రమే ఉద్యోగాలిచ్చి మరికొంతమంది భవిష్యత్తును గాలికొదిలేసింది. ఆ తరువాత 2000, 2001, 2002, 2003, 2006, 2008, 2012, 2016, 2018 సంవత్సరాల్లో సైతం డీఎస్సీలు నిర్వహించి వారికి ఉద్యోగాలిచ్చినా 1998లో అర్హత సాధించిన వారి భవితను త్రిశంకు స్వర్గంలో ఉంచారు. అప్పటి నుంచి వారు అనేక పోరాటాలు చేసినా వారి గోడును ఆలకించలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాదయాత్రలో 1998 డీఎస్సీ అర్హులు కలిసి మొరపెట్టుకున్నారు. తాను అధికారంలోకి వస్తే వారికి న్యాయం చేస్తానని జగన్ అభయహస్తం ఇచ్చారు. మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేయగా.. సుప్రీంకోర్టులోవేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అడ్డంకిగా మారింది. సాంకేతికంగా ఏర్పడిన ఇబ్బందిని అనంతర కాలంలో అధిగమించడంతో ఇప్పుడు సీఎం జగన్ తన హామీని నెరవేర్చడానికి అనుకూల పరిస్థితి ఏర్పడింది. దీంతో వారికి కూడా ఉద్యోగాలిచ్చే ఫైలులో కదలికలు వచ్చాయి. ప్రస్తుతం 1998 డీఎస్సీ అర్హులైన అభ్యర్థులు జిల్లాలో సుమారు 450 మంది ఉండగా వారిలో మెరిట్ ప్రాతిపదికన అప్పటి డీఎస్సీలో ప్రకటించిన మేరకు సమారు 275 మందికి ఉద్యోగాలొచ్చే అవకాశం కలిగింది. దీనిపై అభ్యర్థులు స్పందిస్తూ జగనన్న నిజంగానే మాటతప్పని, మడమ తిప్పని నాయకుడని మరోసారి నిరూపించుకున్నా రని కృతజ్ఞతలు తెలిపారు. చాలీచాలని జీతాలతో నెట్టుకొచ్చాం ఇంతవరకూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చాలీచాలని జీతాలతో దుర్భరంగా నెట్టుకొస్తున్నాం. మా తరువాత ఎన్నో డీఎస్సీలు జరిగి మాకంటే జూనియర్లు ఉద్యోగాల్లో స్థిరపడగా మేం మాత్రం ఉద్యోగం కోసం పోరాటాలు చేస్తూనే ఉండాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ మా ఆవేదనను అర్థం చేసుకున్నారు. మాకు ఉద్యోగాలివ్వడానికి ముందుకు రావడం నిజంగా మా అదృష్టం. ముఖ్యమంత్రి పెద్ద మనసుకు కృతజ్ఞులమై ఉంటాం. – రామబ్రహ్మ పతంజలి, 1998 డీఎస్సీ అభ్యర్థి 23 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం 23 ఏళ్లుగా ఎంతో వేదనాభరిత జీవితం అనుభవించాం. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా సమస్యకు పరిష్కారం లభించలేదు. ముఖ్యమంత్రి జగన్‌ను పాదయాత్రలో కలిసి మా సమస్య చెప్పుకున్నాం. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన అన్ని వర్గాలకూ న్యాయం చేశారు. మాకూ న్యాయం చేస్తారనే ధీమాతోనే ఉన్నాం. మా నమ్మకం నిజమైంది. దీనిని మేము పండుగలా చేసుకుంటాం. ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలుపుతూ విజయోత్సవ సభను జిల్లాస్థాయిలో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం. – వై.సుబ్బారాయుడు, 1998 డీఎస్సీ అర్హుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆశయాలను కొనసాగిస్తాం బీఎస్సీ, బీఈడీ అర్హత ఉంది. డీఎస్సీకి అర్హులమయ్యాం. కానీ ఉద్యోగం మాత్రం కలగానే మిగిలిపోయింది. అర్హతకు తగిన ఉద్యోగం కాకపోయినా కుటుంబ పోషణకు తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేట్ విద్యాసంస్థలో ఉద్యోగం చేస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని జగన్ చేశారు. మా ఆవేదనను అర్థం చేసుకుని మాకు ఉద్యోగాలివ్వడానికి పచ్చజెండా ఊపిన ముఖ్యమంత్రిని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తాం. – పి.బెనర్జీ, 1998 డీఎస్సీ అర్హుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరిస్తున్న నర్సరీలు
మల్లెలు, జాజుల గుబాళింపుతో నర్సరీలు స్వాగతం పలుకుతాయి. లిల్లీ, గులాబీల అందాలు రా..రమ్మని ఆహ్వానిస్తాయి. కనకాంబరాలు కలరింగ్‌తో పడేస్తాయి. హెల్కోనియా హ్యాంగింగ్స్ అబ్బుర పరుస్తాయి. గ్లాడియోలస్ అందాలు బాగున్నారా అంటూ పలుకరిస్తున్నట్టుగా అనిపిస్తూ ఆకర్షిస్తాయి. ఆర్కిడ్స్ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెడతాయి. అలహాబాద్ సఫేదీ, తైవాన్ జామ నర్సరీలు, కొబ్బరి నర్సరీలు రైతులకు దిగుబడుల లాభాలను పంచుతామంటూ ముందుకు వస్తాయి. సరిగ్గా దృష్టి సారిస్తే కడియం, కడియపు లంక మాదిరి పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా కూడా నర్సరీల జిల్లాగా రూపాంతరం చెందేందుకు మార్గాలు అనేకం ఉన్నాయి. తాడేపల్లిగూడెం : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాగా ఉన్న సమయంలోనే నర్సరీలు, ఫ్లోరీ కల్చర్, కొబ్బరి, జామ నర్సరీల అభివృద్ధికి పశ్చిమగోదావరిలో కృషి జరిగింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం జిల్లాలోకి వెళ్లిన పెరవలి మండలం కాకరపర్రు పువ్వుల పల్లెగా పరిఢవిల్లింది. మెట్ట ప్రాంతాల్లో కూడా నర్సరీల పెంపకం పెరిగింది. విధానపరమైన నిర్ణయాలతో జిల్లా వేరువేరు ప్రాంతాలుగా విడిపోకముందు నర్సరీల అభివృద్ధిపై ఉద్యాన శాఖ క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాల్లో ఉన్న నర్సరీల సమాచారం సేకరించింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం నర్సరీలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని నర్సరీల వివరాలను తీసుకుంది. నర్సరీలకు జిల్లా అనుకూలం తైవాన్, అలహాబాద్ సఫేది రకాలకు చెందిన జామ నర్సరీలు తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో ఉన్నాయి. జిల్లాలోని తణుకు మండలం రేలంగి గ్రామంలో నర్సరీలను వృద్ధి చేస్తున్నారు. పాలకొల్లు మండలం అడవిపాలెంలో కొబ్బరి నర్సరీలను రైతులు పెంచుతున్నారు. తాడేపల్లిగూడెం మండలం ఇటుకలగుంటలో ఈస్టుకోస్టు హైబ్రీడ్ కోకోనట్ సెంటర్లో కొబ్బరి నర్సరీలను పెంచుతున్నారు. ఇక్కడే హెల్కోనియా హ్యాంగింగ్స్ వంటి అలంకరణ పుష్పాల మొక్కలను పెంచుతున్నారు. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా థాయిలాండ్‌లోని నాంగ్నూచ్ గ్రామంలో ఏటా డిసెంబర్లో జరిగే కింగ్ షోకు వచ్చిన కొత్త విదేశీ రకాల మొక్కలను ఇక్కడికి తీసుకువచ్చి అభివృద్ధి చేసి విక్రయిస్తున్నారు. బంతి తోటల పెంపకం ఇటీవల కాలంలో జిల్లాలో ఊపందుకుంది. గోదావరి పరీవాహకంలో లంక ప్రాంతాలు ఉండటంతో ఈ మొక్కల పెంపకానికి, ఫ్లోరీకల్చర్ అభివృద్ధికి అవకాశాలు ఏర్పడ్డాయి. విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెట్టే పలు రకాల ఆర్కిడ్స్‌ను ఫ్లోరల్ ఎసెన్సు ఫారమ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆర్కిడ్స్ ఫార్మ్ తణుకులో పెంచుతున్నారు. డి.1075, ఎం.ఎల్లో, డి.997, వి.స్పాటెడ్ ఎల్లో, డి.999 వంటి ఆర్కిడ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆర్కిడ్స్తో పాటు అరుదైన పుష్ప రకాల పెంపకం విషయంలో రైతులకు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అటవీ, క్లైమేట్ ఛేంజ్ డెక్కన్ రీజియన్ హైద్రాబాద్ వారు మార్గదర్శనం చేస్తున్నారు. జిల్లా ఉద్యాన శాఖ కూడా నర్సరీల ప్రోత్సాహానికి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణతో ముందుకు సాగుతోంది. నర్సరీలకు అక్రిడేషన్ జిల్లాలో ఏ రకం నర్సరీలను ఎక్కడెక్కడ రైతులు పెంచుతున్నారు.. ఏ ప్రామాణికాలు పాటిస్తున్నారనే విషయాలను అంచనా వేస్తూ, వాటికి చట్టబద్ధత కోసం ఉద్యాన శాఖ ద్వారా ఉమ్మడి జిల్లాలో అక్రిడేషన్ కోసం సమాచారం సేకరించారు. ఉద్యాన వర్సిటీ పరిధిలో ఉన్న నర్సరీల వివరాలు, విశిష్ట రక్షిత సాగు పద్ధతిలో పెంచుతున్న నర్సరీల వివరాలను తీసుకున్నారు. 2010లో నర్సరీ యాక్ట్‌కు అనుగుణంగా నర్సరీల పెంపకాన్ని గమనించడానికి వీలుగా సమాచారం తీసుకున్నారు. చట్టానికి లోబడి వచ్చిన నర్సరీల వివరాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. (క్లిక్: కొల్లేరుకు మహర్దశ.. ఉప్పుటేరుపై మూడు రెగ్యులేటర్లు) మేలైన మొక్కల కోసమే పశ్చిమ గోదావరి జిల్లా నర్సరీలకు అనువైన ప్రాంతం. పూల తోటలకు అనుకూలం. పండ్ల, కొబ్బరి, జామ నర్సరీలు ఇక్కడ ఊపందుకుంటున్నాయి. నర్సరీలకు కేరాఫ్‌గా ఉన్న కడియం, కడియపు లంక మాదిరంత కాకున్నా, ఇక్కడ నర్సరీలను పెంచవచ్చు. నర్సరీల ద్వారా పెంచే మొక్కల్లో నాణ్యత పాటించడానికి వీలుగా రూపొందించిన నర్సరీ చట్టాన్ని అనుసరించి వాటికి అక్రిడేషన్ ఇవ్వడానికి సమాచారం తీసుకున్నాం. దీనివల్ల నర్సరీలు పెంచే వారి బాధ్యత మరింత పెరిగి వినియోగదారులకు మంచి మొక్కలను అందించగలుగుతారు. – ఎ.దుర్గేష్ , జిల్లా ఉద్యాన అధికారి, పశ్చిమగోదావరి జిల్లా -
టీడీపీకి జనసేన ఝలక్!
పెనుగొండ: ఆచంట మండలంలో మిత్రులుగా కొనసాగుతున్న జనసేన, టీడీపీ మధ్య విభేదాలు మండల పరిషత్ సమావేశం వేదికపై బహిర్గతమయ్యాయి. శనివారం ఆచంట మండలపరిషత్ సమావేశం ఎంపీపీ దిగమర్తి సూర్యకుమారి అధ్యక్షతన జరిగింది. గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి మండలపరిషత్‌ను కైవసం చేసుకున్నాయి. ఒప్పందంలో భాగంగా జనసేనకు ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. అయితే కొంత కాలంగా ఆయా పార్టీల మధ్య కొనసాగుతున్న అభిప్రాయ భేదాలు మండలపరిషత్ సమావేశంలో బయటపడ్డాయి. టీడీపీ తమను చిన్న చూపు చూస్తుందని జనసేన సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైస్ ఎంపీపీ ఎర్రగొప్పుల నాగరాజు సమావేశంలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అభివృద్ధి పనుల్లో కూడా తమను సంప్రదించడం లేదని, సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించగా.. ఆయనతోపాటు పెదమల్లం జనసేన ఎంపీటీసీ సభ్యుడు ప్రసాద్ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో టీడీపీ సభ్యులు కంగుతిన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షుడు సుంకర సీతారామ్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నారని అయితే టీడీపీ పాలకవర్గం లేనిపోని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మండలంలో నిధుల కేటాయింపుల్లో టీడీపీ పాలకవర్గం ఇ ష్టారాజ్యంగా వ్యవహరిస్తోందంటూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు వాకౌట్ చేశారు. -
తొలకరి పులకించె.. భూతల్లి మురిసె
సాక్షి, భీమవరం: తొలకరి పలకరింపుతో వాతావరణం చల్లబడింది. నిన్నటి వరకూ వేడిగాలులు, ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు జల్లులతో సేదతీరారు. సోమవారం వేకువజాము నుంచి ఉమ్మ డి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఖరీఫ్‌కు ఊరట ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. దాళ్వాలో ఆశాజనకమైన పంట చేతికి రావడం.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ముమ్మరంగా ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులు సార్వా సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు పొలాల్లో పశువుల ఎరువు వేసే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఉపాధి హామీ పథకంలో పంట కాలువలు, బోదెల్లో పూడికతీత పనులు జరుగుతుండటంతో సార్వా నారుమడులు వేయడానికి రైతులు కసరత్తు ప్రారంభించారు. 4.50 లక్షల ఎకరాల్లో.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 4.50 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా నూతన పశ్చిమగోదావరి జిల్లాలో 2.55 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. సార్వా సీజన్‌కు ఎంటీయూ 1061, 1064, 7029, 1121 వంగడాలు అనువుగా ఉంటాయని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ఈ మేరకు రైతులు విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు సిద్ధం సార్వా వరి విత్తనాల్లో దాదాపు 90 శాతానికిపైగా పైగా రైతులు సమకూర్చుకోనుండగా మిగిలిన విత్తనాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పశ్చి మగోదావరి జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా 351 కింట్వాళ్ల విత్తనాలను విక్రయానికి సిద్ధం చేశా రు. సార్వా పంటకు సుమారు 68 వేల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటిని రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో రైతులు ఉత్సాహంగా మందస్తు సాగుకు సిద్ధమవుతున్నారు. త్వరితగతిన నారుమడులు వర్షాలు ప్రారంభమైనందున రైతులు సార్వా నారుమడులు సిద్ధం చేసుకోవాలి. ఇప్పటికే కాలువలకు కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేశారు. వెంటనే సాగు ప్రారంభిస్తే మూడో పంటగా అపరాల సాగుకు వీలుంటుంది. శివారు భూములకు నీరు అందడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో రైతులు విత్తనాలు సిద్ధం చేసుకోవాలి. – పి.ఉషారాజకుమారి, ఏడీఏ, భీమవరం -
టిడ్కో ఇళ్లకు లైన్ క్లియర్
పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారు. ఒకపక్క ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు అవకాశాలు కల్పిస్తూనే.. మరోపక్క టిడ్కోలో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ రెండేళ్ల పాటు కోవిడ్ కేర్ సెంటర్లుగా ఉపయోగించడం వల్ల వాటిని లబ్ధిదారులకు అప్పగించడంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి మెరుగుగా ఉండడంతో వేగంగా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భీమవరం(ప్రకాశం చౌక్): ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శుక్రవారం టిడ్కో అధికారులు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులతో టిడ్కో ఇళ్లపై నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాలతో అధికారులు రిజిస్ట్రేషన్ల పనులు ముమ్మరం చేశారు. ప్లాట్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. 300 చదరపు అడుగుల ఇళ్లు ఉచితం... నూతన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు పట్టణాల్లో 20,784 టిడ్కో ఇళ్లు నిర్మించారు. ఏ కేటగిరీలో 300, బీ కేటగిరీలో 365, సీ కేటగిరీలో 430 చదరపు అడుగుల ఇళ్లు నిర్మించగా, ఇవన్నీ కలిపి 20,784 ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇందులో నాలుగు పట్టణాల్లో కలిపి 300 చదరపు అడుగుల ఇళ్లు 6944 నిర్మించగా, ప్రభుత్వం వీటిని లబ్ధిదారులకు ఉచితంగా అందించనుంది. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలకు సంబంధించి 6048 ఇళ్లను ఫేజ్–1లో లబ్ధిదారులకు ఈ నెల 15 నుంచి అప్పగించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్లు వేగవంతం జిల్లాలో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల్లోని టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్లాట్లను లబ్ధిదారుల పేరిట ఉచిత రిజస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మెప్మా విభాగం అధికారులు ఆయా పట్టణాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు లబ్ధిదారులను తీసుకువెళ్లి ప్లాట్లను రిజస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఈ నెల 15 నుంచి ఇళ్లు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించడంతో రిజస్ట్రేషన్ ప్రక్రియ మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఉచితంగా రిజస్ట్రేషన్ చేసి ప్లాట్లు అప్పగించడంపై లబ్దిదారులు సంతోషంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు ఇలా... ఇప్పటివరకు జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలకు సంబంధించి 3758 మందికి ప్లాట్లు రిజస్ట్రేషన్ చేశారు. అందులో భీమవరంలో 900, పాలకొల్లులో 1458, తాడేపల్లిగూడెంలో 1400 చొప్పున ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేపట్టారు. మూడు పట్టణాల్లోని ఫేజ్–1 లబ్ధిదారుల్లో 2577 మంది రూ.68.39 కోట్ల బ్యాంకు రుణాలు పొందారు. ఫేజ్–1 కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జిల్లాలో ఫేజ్–1లో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలకు సంబంధించి 6048 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మూడు కేటగిరీల ఇళ్లూ ఈ ఫేజ్‌లో ఉన్నాయి. – ఎం.స్వామినాయుడు, టిడ్కో ప్రాజెక్టు ఆఫీసర్ -
మా జెండా.. అజెండా.. ప్రజా సంక్షేమమే
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ ఏలూరు టౌన్: దుష్ట పాలనకు చరమగీతం పాడేందుకు.. జనం కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు ఆనాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు. ప్రజాభీష్టంతో విజయభేరి మోగించి అధికారం చేపట్టారు. చరిత్ర సృష్టిస్తూ ఏకంగా 151 సీట్లు కైవసం చేసుకుని విజయగర్జనతో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేశారు. పాలన తొలిరోజు నుంచే ప్రజా సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ నూరుశాతం అమలుకు శ్రమిస్తున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 130కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సంక్షేమ పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మూడు వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో వాడవాడలా వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, శ్రేణులు అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు దుస్తుల పంపిణీ, రోగులకు పండ్ల పంపిణీతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్లతో వేడుకలు జరుపుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇలా.. నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్థానిక పార్టీ కార్యాయంలో ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ వేసి వేడుకలు నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వీరవాసరం మండలంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పాలకొల్లు నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, నాయకులు గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ, చెల్లెం ఆనంద ప్రకాష్ పాల్గొని కేక్ కట్ చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉండి నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, నియోజకవర్గ ఇన్చార్జి గోకరాజు రామరాజు కాళ్ల మండలం పెద అమిరం గ్రామంలో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఆచంట నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ సుంకర ఇందిర, పెనుగొండ సర్పంచ్ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి, నాయకులు చిన్నం రామిరెడ్డి, దంపనబోయిన బాబూరావు తదితరులు కేక్ కట్ చేశారు. తణుకు నియోజకవర్గంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. వృద్ధాశ్రమంలో భోజన వసతి కల్పించారు. పేదలకు పండ్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు ప్రాంతాల్లో స్థానిక నేతలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కార్యదర్శి నల్లమిల్లి విజయానందరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో ఇలా.. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కొయ్యలగూడెం మండలంలో మూడేళ్ల పండుగ చేసుకున్నారు. అన్ని మండలాల్లో మండల కన్వీనర్లు, నేతలు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు సంత మార్కెట్ వద్ద భారీ కేక్ కట్ చేశారు. దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చింతలపూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఘనంగా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. నాలుగు మండలాల్లోనూ స్థానిక నేతలు కేక్ కటింగ్‌లు చేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ స్థానిక నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పట్టణంలో చినగాంధీ బొమ్మ సెంటరులో కేక్ కట్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ, వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, పార్టీ నేతలు హాజరయ్యారు. ద్వారకాతిరుమల మండలం నారాయణపురంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. ఎంపీపీ బొండాడ మోహిని, జెడ్పీటీసీ చిగురుపల్లి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక నేతలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. 44వ డివిజన్లో ఎస్సీ, ఎస్టీ జాతీయ నాయకుడు పొలిమేర హరికృష్ణ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. -
దొడ్డిగట్టు.. కాసులు పట్టు!
ఏలూరు రూరల్ : కొల్లేరు దొడ్డిగట్లు.. అక్రమ చెరువులకు అడ్డాగా మారాయి. కొల్లేరులోని నీటికుంటను మత్స్యకారులు దొడ్డిగట్టుగా పిలు స్తారు. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా మ త్స్యకారులు చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నా రు. ఇందుకు అటవీశాఖ అధికారులకు సొమ్ము లు ముట్టజెబుతున్నారు. సెక్షన్ ఆఫీసర్ నుంచి గార్డు వరకూ దొడ్డిగట్ల ద్వారా ఏడాదికి రూ.కోటికిపైగా మామూళ్లు అందుతున్నట్టు అంచనా. సుమారు 30 వేల ఎకరాల్లో.. 2007లో అధికారులు కొల్లేరు ప్రక్షాళన చేపట్టిన సమయంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 75 వేల ఎకరాల విస్తీర్ణంలో వందలాది చెరువు గట్లను ధ్వంసం చేశారు. కాలక్రమేణ వరదలు, వర్షాలకు ఈ చెరువు గట్లు కుంగి దొడ్డిగట్లుగా మారాయి. వీటిని పటిష్టపరిచి కొందరు చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అభయారణ్యంలో సుమారు 30 వేల ఎకరాల్లో దొడ్డిగట్లు వెలిశాయి. ఎకరానికి రూ.3 వేల వరకూ.. దొడ్డిగట్లలో చేపల సాగును సెక్షన్ ఆఫీసర్లు, గా ర్డులు అడ్డుకుంటున్నారు. కేసులు పెడతామని, గట్లు కొట్టేస్తామని మత్స్యకారులను బెదిరిస్తున్నారు. దీంతో మత్స్యకారులు అధికారులకు సొమ్ములు ముట్టజెబుతున్నారు. ఇదే అదనుగా సెక్షన్ ఆఫీసర్లు, గార్డులు కలిసి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పెదపాడు సెక్షన్ పరిధిలో శ్రీపర్రు, కలకుర్రు, మానూరులో దొడ్డిగట్లలో సాగు చేస్తున్న మత్స్యకారుల నుంచి ఎకరాకు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సెక్షన్ పరిధిలో సుమారు 6 వేల ఎకరాల్లో చేపల సాగు ఉంది. అలాగే నిడమర్రు, ఏలూరు, భీమడోలు పరిధిలో సుమారు 24 వేల ఎకరాల దొడ్డిగట్లలో సాగు చేస్తున్న మత్స్యకారుల నుంచి అధికారులు సుమారు రూ.కోటి వరకూ వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో కొంత మొత్తం ఉన్నతాధికారులకు సైతం చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దొడ్డిగట్లు కొట్టేస్తాం దొడ్డిగట్లలో చేపల సాగు ను అడ్డుకుంటాం. ఏలూ రు మండలం కొక్కిరాయిలంక వెనక అక్రమ చెరు వు తవ్వకాలను అడ్డుకున్నాం. ఈ ప్రాంతంలో దొడ్డిగట్లను చేపల చెరువులుగా మార్చి సాగు చేస్తున్నట్టు గుర్తించాం. వెంటనే పూర్తిస్థాయిలో ధ్వంసం చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు రేంజర్లు, సెక్షన్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఏలూరు, కైకలూరు రేంజర్ల పర్యవేక్షణలో దొడ్డిగట్లను ధ్వంసం చేయిస్తాం. –సెల్వం, డీఎఫ్ఓ హక్కులు కాపాడాలి కొల్లేరులో సహజ సిద్ధంగా ఏర్పడ్డ దొడ్డిగట్లలో చేపలు పట్టుకునే హక్కు మత్స్యకారులకు ఉంది. వేసవిలో వీటిని పట్టుకుని అమ్ముకుంటారు. దొడ్డిగట్లలో చేపల సాగు చాలా కష్టం. కొల్లేరుకు వరద వస్తే దొడ్డిగట్లు మునిగి మత్స్యకారులు నష్టపోతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెగ్యులేటర్ల నిర్మాణం పూర్తి చేయగానే కొల్లేరు మొత్తం నిండుకుండలా మారిపోతుంది. అప్పుడు మ త్స్యకారులు సంప్రదాయ చేపల వేటతో జీవనం సాగించవచ్చు. –పెన్మెత్స శ్రీనివాసరాజు, ఎంపీపీ, ఏలూరు -
మూడో రోజు వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర ప్రారంభం
-
భీమవరానికి కొత్త శోభ.. 2 కోట్లతో సుందరీకరణ పనులు
భీమవరం(ప్రకాశం చౌక్): నూతన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం కొత్త శోభ సంతరించుకోనుంది. పట్టణ సుందరీకరణ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఇటీవల పట్టణ సుందరీకరణపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వ హించారు. మున్సిపల్ అధికారులకు సృష్టమైన ఆదేశాలు జారీచేశారు. దాంతో పట్టణ సుందరీకణ పనులపై ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులకు సంబంధించి డ్రాయింగ్స్, నమూనాలు, నిధులు, అంచనాలు తదితర వాటితో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే భీమవరంలో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, హోటల్స్, పెద్ద పెద్ద బట్టల దుకాణాలు, బంగారం షాపులు ఉన్నాయి. అలాగే ఆకర్షణీయమైన లైటింగ్స్, డైకరేషన్‌తో భీమవరం కళకళలాడుతోంది. చిన్న సైజు నగరాన్ని తలపిస్తోంది. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా చేసేందుకు వాటర్ ఫౌంటెన్లు, వాల్ బ్యాక్‌గ్రౌండ్ ఫౌంటెన్స్, పచ్చదనం, వెల్కమ్ ఆర్చ్‌లు ఏర్పాటు చేసి మరింత అందంగా తీర్చిదిద్దనున్నారు. వాటర్ ఫౌంటెన్లకు రూ. 45 లక్షల ఖర్చు పట్టణ సుందరీకరణ పనులకు పలు రకాల నిధులు వాడేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మున్సిపల్ సాధారణ నిధులు, సీడిఎంఏ, సీఎస్ఆర్ నిధులు ఉపయోగించుకుని అభివృద్ధి పనులు చేస్తారు. పట్టణంలోని ప్రకాశం చౌక్ సెంటర్, పోట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్, బీవీ రాజు విగ్రహం సెంటర్లలో లైటింగ్ విత్ వాటర్ ఫౌంటెన్లును ఏర్పాటు చేస్తారు. ఇందుకు సీఎస్ఆర్ నిధులు రూ.45 లక్షలు వెచ్చిస్తారు. ఒక్కొక్క ఫౌంటెన్‌కు రూ.15 లక్షలు ఖర్చు చేయనున్నారు. త్వరలోనే ఈ పనులు చేపడతారు. 6 చోట్ల స్వాగత ఆర్చ్‌లు భీమవరం పట్టణానికి ఇతర ప్రాంతాల నుంచి ప్రవేశించే ప్రధాన రోడ్లపై ఆర్చ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఉండి రోడ్డు, బీవీ రాజు రోడ్డు, గొల్లవానితిప్ప, పాలకొల్లు, జువ్వలపాలెం రోడ్డు, తణుకు రోడ్డులో ఈ ఆర్చ్‌లు ఏర్పాటు చేస్తుండగా.. వాటి నిర్మాణం కోసం మున్సి పల్ నిధులు రూ.90 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఒక్కొక్క ఆర్చ్‌కు రూ.15 లక్షలు ఖర్చు చేస్తారు. పచ్చదనం కోసం రూ. 54 లక్షలు పట్టణంలో పచ్చదనం (గ్రీనరీ) కోసం సీడీఎంఏ నిధులు రూ.54 లక్షలు ఉపయోగించుకోనున్నారు. పట్టణంలో ప్రధాన రహదారుల వెంట ప్రత్యేకమైన, అందమైన మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతు న్నారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో యమనదుర్రు వంతెనకు అనుకుని గోడకు అందమైన చిత్రాలు వేయనున్నారు. అలాగే వాల్ ఫౌంటెన్ లేదా లైటింగ్ విత్ భీమవరం అని బోర్డు ఏర్పాటు చేస్తారు. ఇందుకు రూ.20 లక్షలు మున్సిపల్ నిధులు ఖర్చు చేస్తారు. స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్ నుంచి పోలీసు బొమ్మ సెంటర్ వరకు పీపీ రోడ్డు మధ్యలో రూ.15 లక్షల ఖర్చుతో డివైడర్ నిర్మించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటారు. ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు ప్రకాశం చౌక్ సెంటర్, అంబేద్కర్ సెంటర్లో భీమవరానికి సంబంధించి విషయాలు తెలియచెప్పేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలు ఖర్చు చేస్తారు. (క్లిక్: పోలీసుల అదుపులో కోనసీమ అల్లర్ల కేసు అనుమానితుడు?) సుందరీకరణ పనులకు ప్రతిపాదనలు పంపాం కలెక్టర్ అదేశాలతో భీమవరం పట్టణం సుందరీకరణ పనులకు సంబంధించి అన్నీ సిద్ధం చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు, భీమవరం ప్రత్యేక అధికారికి పంపాం. పట్టణంలో మూడు చోట్ల ఫౌంటెన్స్ నిర్మాణం పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నాం. మిగిలిన పనులకు సంబంధించి ప్రణాళికలను రూపొందించి వాటి నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటాము. – పి.శ్రీకాంత్, భీమవరం మున్సిపల్ ఇంజనీర్ -
వంగడాలకు ఊపిరి..
ఉద్యాన విత్తనం వ్యవసాయ క్షేత్రాల్లో సిరులు పండిస్తోంది.. రైతును రాజును చేస్తూ వారి గోతాల్లో విత్తం నింపుతోంది.. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో 2007లో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూతన వంగడాలకు ఊపిరి పోస్తోంది. రాష్ట్రంలోని ఉద్యాన రైతులకే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులకు లాభాల పంట పండించేందుకు ఈ వంగడాలు ఉపయోగపడుతున్నాయి. తాడేపల్లిగూడెం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటుచేసిన వెంకట్రా మన్నగూడెంలోని ఉద్యాన వర్సిటీ దేశంలోనే రెండోది కావడం గమనార్హం. ఉద్యాన రైతులకు జవసత్వాలు నింపుతూ చీడపీడలను తట్టుకుని, అధిక దిగుబడులు ఇచ్చేలా విత్తనాలను ఇక్కడ రూపొందిస్తున్నారు. వర్సిటీ పరిధిలోని 20 పరిశోధనా స్థానా ల్లో చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైతుల మేలు కోసం నేలసారానికి అనుగుణంగా మొలకెత్తడం, తెగుళ్లను తట్టుకోవడం, వాతావరణ ప్రతికూల ప్రభావాలను తట్టుకోవడం, టిష్యూ కల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్‌కు అనువుగా ఉండేలా విత్తనాలను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకూ 14 రకాల ఉద్యాన పంటలకు సంబంధించి విడుదల చేసిన 23 వంగడాలు దేశంలో, రా ష్ట్రంలో రైతులకు లాభాల పంటను పండిస్తున్నాయి. ఉద్యాన వర్సిటీ వంగడాలను అందించడంతో పాటు ఆగ్రోటెక్నిక్స్, ప్లాంట్ ప్రొటెక్షన్, పోస్టు హార్వెస్టు టెక్నాలజీ పద్ధతులను రైతులకు చేరువ చేస్తోంది. 2017లో అధికారికంగా బయట ప్రపంచంలోకి వచ్చి న ఉద్యాన వంగడాలు ఐదేళ్లుగా రైతులకు ఎనలేని ప్రయోజనాలు కలిగిస్తున్నాయి. ఉద్యాన విద్యకు పెద్దపీట రాష్ట్రంలో 20 ఉద్యాన పరిశోధనా స్థానాలు కలిగి ఉన్న వర్సిటీలో ఉద్యాన విద్యకు పెద్దపీట వేస్తు న్నారు. నాలుగు ఉద్యాన కళాశాలలు, నాలుగు ప్రైవే ట్ ఉద్యాన కళాశాలలు, నాలుగు ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్‌లు, నాలుగు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా విద్యకు ఉపకరించే అంశాలను బోధిస్తున్నారు. బీఎస్సీ హానర్స్ హార్టీకల్చర్, ఎమ్మెస్సీ హార్టీకల్చర్, పీహెచ్‌డీలో ప్రత్యేకంగా ఫ్రూట్ సైన్స్, విజిటబుల్ సైన్స్, ప్లాంటేషన్ స్పైసెస్, మెడిసినల్ క్రాప్స్, ఫ్టోరీకల్చర్ లాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్, పోస్టు హా ర్వెస్టు టెక్నాలజీ, ప్లాంట్ పాథాలజీ, ఎంటమాలజీ కోర్సులను అందిస్తున్నారు. 13 రకాలు నోటిఫై ఉద్యాన వర్సిటీ ఊపిరిపోసిన 23 రకాల వంగడాల్లో 13 రకాలు నోటిఫై అయ్యాయి. వీటిని దేశవ్యాప్తంగా రైతులు వినియోగించవచ్చు. ఈ వంగడాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా వస్తాయి. నిరంతరం వంగడాల పరిశోధనలు సాగుతున్నాయి. ఒక కొత్త వంగడం విడుదల చేయాలంటే బహు వార్షిక పంటలకు 15 ఏళ్లు, ఏక వార్షిక పంటకు 8 ఏళ్లు పడుతుంది. కొబ్బరిలో నాలుగు, కర్ర పెండలం, ధనియాలు, పసుపు, చేమ, మిరపలో 620, 625, 111 మొదలైన 13 రకాలు నోటిఫై అయ్యాయి. – ఆర్వీఎస్కే రెడ్డి. ఉద్యాన వర్సిటీ పరిశోధన సంచాలకులు నిరంతర కృషి ఉద్యాన వర్సిటీ నుంచి నూతన వంగడాల విడుదలకు నిత్యం కృషి జరుగు తోంది. రాబోయే వంగడాలలో క్వాలిటీ డిసీజ్ ఫ్రీ ప్లాంటు మెటీరియల్, న్యూట్రిషన్ క్వాలిటీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కొబ్బరి విషయంలో అంబాజీపేటతో విజయరాయిలో కూడా సీడ్ లింక్స్ తయారు చేస్తున్నాం. – డాక్టర్ తోలేటి జానకిరామ్, ఉద్యానవర్సిటీ వీసీ -
ఏపీ: ఈ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం: ఐఎండీ
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను సహాయక చర్యల కోసం నేవీ సిద్ధమైంది. 19 వరద సహాయక బృందాలతో పాటు 6 డైవింగ్ బృందాలు సిద్ధమయ్యాయి. తుపాను ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం: ఐఎండీ బాపట్ల జిల్లా సముద్ర తీరం ప్రాంతాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. నిజాంపట్నం హార్బర్లో8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ తుపాను ప్రభావం కృష్ణా, కాకినాడ, తూ.గో, ప.గో జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రాలో 75-95 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీనిలో భాగంగా తుఫాన్ ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, సహాయక చర్యలకు సన్నద్ధం కావాలని అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సఖినేటిపల్లి - ఐ. పోలవరం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచిస్తోందని కలెక్టర్ తెలిపారు. మరొకవైపు కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో నెల్లూరు, కడప జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. రేపు(బుధవారం) సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షలు వాయిదా బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేశారు. తుపాను కారణంగా పరీక్షను ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. వాయిదా వేసిన ఇంటర్ పరీక్షను ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నారు. కంట్రోల్ రూమ్ నంబర్లు మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్లు 99086 64635, 08672 25257 మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08672252486 కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 18004253077 కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 0884-2368100 ఏలూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 18002331077