ఉద్యాన విత్తనం వ్యవసాయ క్షేత్రాల్లో సిరులు పండిస్తోంది.. రైతును రాజును చేస్తూ వారి గోతాల్లో విత్తం నింపుతోంది.. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో 2007లో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూతన వంగడాలకు ఊపిరి పోస్తోంది. రాష్ట్రంలోని ఉద్యాన రైతులకే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులకు లాభాల పంట పండించేందుకు ఈ వంగడాలు ఉపయోగపడుతున్నాయి.
తాడేపల్లిగూడెం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటుచేసిన వెంకట్రా మన్నగూడెంలోని ఉద్యాన వర్సిటీ దేశంలోనే రెండోది కావడం గమనార్హం. ఉద్యాన రైతులకు జవసత్వాలు నింపుతూ చీడపీడలను తట్టుకుని, అధిక దిగుబడులు ఇచ్చేలా విత్తనాలను ఇక్కడ రూపొందిస్తున్నారు. వర్సిటీ పరిధిలోని 20 పరిశోధనా స్థానా ల్లో చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
రైతుల మేలు కోసం
నేలసారానికి అనుగుణంగా మొలకెత్తడం, తెగుళ్లను తట్టుకోవడం, వాతావరణ ప్రతికూల ప్రభావాలను తట్టుకోవడం, టిష్యూ కల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్‌కు అనువుగా ఉండేలా విత్తనాలను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకూ 14 రకాల ఉద్యాన పంటలకు సంబంధించి విడుదల చేసిన 23 వంగడాలు దేశంలో, రా ష్ట్రంలో రైతులకు లాభాల పంటను పండిస్తున్నాయి. ఉద్యాన వర్సిటీ వంగడాలను అందించడంతో పాటు ఆగ్రోటెక్నిక్స్, ప్లాంట్ ప్రొటెక్షన్, పోస్టు హార్వెస్టు టెక్నాలజీ పద్ధతులను రైతులకు చేరువ చేస్తోంది. 2017లో అధికారికంగా బయట ప్రపంచంలోకి వచ్చి న ఉద్యాన వంగడాలు ఐదేళ్లుగా రైతులకు ఎనలేని ప్రయోజనాలు కలిగిస్తున్నాయి.
ఉద్యాన విద్యకు పెద్దపీట
రాష్ట్రంలో 20 ఉద్యాన పరిశోధనా స్థానాలు కలిగి ఉన్న వర్సిటీలో ఉద్యాన విద్యకు పెద్దపీట వేస్తు న్నారు. నాలుగు ఉద్యాన కళాశాలలు, నాలుగు ప్రైవే ట్ ఉద్యాన కళాశాలలు, నాలుగు ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్‌లు, నాలుగు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా విద్యకు ఉపకరించే అంశాలను బోధిస్తున్నారు. బీఎస్సీ హానర్స్ హార్టీకల్చర్, ఎమ్మెస్సీ హార్టీకల్చర్, పీహెచ్‌డీలో ప్రత్యేకంగా ఫ్రూట్ సైన్స్, విజిటబుల్ సైన్స్, ప్లాంటేషన్ స్పైసెస్, మెడిసినల్ క్రాప్స్, ఫ్టోరీకల్చర్ లాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్, పోస్టు హా ర్వెస్టు టెక్నాలజీ, ప్లాంట్ పాథాలజీ, ఎంటమాలజీ కోర్సులను అందిస్తున్నారు.
13 రకాలు నోటిఫై
ఉద్యాన వర్సిటీ ఊపిరిపోసిన 23 రకాల వంగడాల్లో 13 రకాలు నోటిఫై అయ్యాయి. వీటిని దేశవ్యాప్తంగా రైతులు వినియోగించవచ్చు. ఈ వంగడాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా వస్తాయి. నిరంతరం వంగడాల పరిశోధనలు సాగుతున్నాయి. ఒక కొత్త వంగడం విడుదల చేయాలంటే బహు వార్షిక పంటలకు 15 ఏళ్లు, ఏక వార్షిక పంటకు 8 ఏళ్లు పడుతుంది. కొబ్బరిలో నాలుగు, కర్ర పెండలం, ధనియాలు, పసుపు, చేమ, మిరపలో 620, 625, 111 మొదలైన 13 రకాలు నోటిఫై అయ్యాయి.
– ఆర్‌వీఎస్‌కే రెడ్డి. ఉద్యాన వర్సిటీ పరిశోధన సంచాలకులు
నిరంతర కృషి
ఉద్యాన వర్సిటీ నుంచి నూతన వంగడాల విడుదలకు నిత్యం కృషి జరుగు తోంది. రాబోయే వంగడాలలో క్వాలిటీ డిసీజ్ ఫ్రీ ప్లాంటు మెటీరియల్, న్యూట్రిషన్ క్వాలిటీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కొబ్బరి విషయంలో అంబాజీపేటతో విజయరాయిలో కూడా సీడ్ లింక్స్ తయారు చేస్తున్నాం.
– డాక్టర్ తోలేటి జానకిరామ్, ఉద్యానవర్సిటీ వీసీ
Comments
Please login to add a commentAdd a comment