ఉండి: పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్‌బాడీ పార్శిల్‌గా రావడం తీవ్ర కలకలం రేపింది. ఓ మహిళకు వచ్చిన పార్శిల్‌ను తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించింది. దీంతో గుండె జారినంత పనైన సదరు మహిళ.. ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో పాటు పోలీసులకు సమాచారం అందించింది.
ఉండి మండలం యండగండికి చెందిన తులసి సాగి అనే మహిళకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. అయితే ఆ ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయంలో భాగంగా రాజమండ్రి(రాజమహేంద్రవరం) క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువుల్ని పార్శిల్ ద్వారి ఆ సంస్థ పంపిస్తోంది. దీనిలో భాగంగా తొలి విడతో టైల్స్ పంపించగా, రెండో విడతలో విద్యుత్ సామాగ్రి పంపిస్తున్నామని చెప్పారు. అయితే ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. రెండో విడతలో రావాల్సిన విద్యుత్ సామాగ్రి స్థానంలో ఒక మృతదేహం పార్శిల్‌గా వచ్చింది.
ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చిన ఆ పార్శిల్‌ను ఓపెన్ చేసి చూడగా అందులో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. దాంతో పాటు కోటి రూపాయలకు పైగా తమకు చెల్లించాలనే లెటర్ కూడా ఆ పార్శిల్‌లో ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పార్శిల్ ప్యాకింగ్ దగ్గర్నుంచి పార్శిల్ తీసుకొచ్చిన వ్యక్తి వరకూ అందర్నీ పిలిచి ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment