
తాడేపల్లిగూడెం(ప.గో.జిల్లా): పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం కంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై పనులు చేస్తున్న వాహనాన్ని శాంట్రో కారు ఢీకొట్టింది. ఏలూరు నుంచి తణుకు వైపుకు వెళుతుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
భోగెళ్ల వెంకల సత్య సురేన్, భార్య నవ్య అక్కడక్కడే మృతి చెందగా, వారి కుమార్తె వాసవి(4) తన/కు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్న క్రమంలో మృత్యువాత పడింది. మరొకవైపు అదే కారులో ప్రయాణిస్తున్న ఉప్పులూరి శ్రీరమ్య పరిస్థితి విషమంగా ఉంది, ఆమెను రాజమండ్రి ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా హైదరాబాద్ నుండి మండపేటలోని ఏడిదకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment