tadepalligudem
-
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..
తాడేపల్లిగూడెం(ప.గో.జిల్లా): పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం కంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై పనులు చేస్తున్న వాహనాన్ని శాంట్రో కారు ఢీకొట్టింది. ఏలూరు నుంచి తణుకు వైపుకు వెళుతుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.భోగెళ్ల వెంకల సత్య సురేన్, భార్య నవ్య అక్కడక్కడే మృతి చెందగా, వారి కుమార్తె వాసవి(4) తన/కు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్న క్రమంలో మృత్యువాత పడింది. మరొకవైపు అదే కారులో ప్రయాణిస్తున్న ఉప్పులూరి శ్రీరమ్య పరిస్థితి విషమంగా ఉంది, ఆమెను రాజమండ్రి ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా హైదరాబాద్ నుండి మండపేటలోని ఏడిదకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. -
కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పింది: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు కేఎస్ఎన్ కాలనీ వద్ద రూ. 22 కోట్ల 44 లక్షల రూపాయల నిధులతో 30 గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి అప్పటి మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న(బుధవారం) రాత్రి సమయంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు జేసీబీతో శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.ధ్వంసం అయిన శిలాఫలకాన్ని మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ. పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ.. శిలాఫలకాన్ని జేసీబీతో కూల్చడం హేయమైన చర్య అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పి, అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? అంటూ ప్రశ్నించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను శిక్షించాలని.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కొట్టు సత్యనారాయణ అన్నారు. -
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అమానుష ఘటన
-
వైరల్: కోడిపందాల్లో లేడీ బౌన్సర్లు
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఇటీవల కాలంలో బౌన్సర్ల ఏర్పాటు సాధారణంగా మారింది. అయితే, తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్వాహకులు ఓ అడుగు ముందుకేశారు. పందెం బరుల వద్ద లేడీ బౌన్సర్ల(Lady Bouncers)ను ఏర్పాటు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గూడెంలో కోడిపందాలు(Cockfighting) జోరుగా సాగుతుండగా, రద్దీని కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కాగా, సంక్రాంతి సంబరాల ముసుగులో కూటమి నేతలు బరితెగించారు. భీమవరంలో పందెం బరి వద్ద మూడు రోజుల నుంచి క్యాసినో నిర్వహిస్తున్నారు. సినిమా సెట్టింగ్‌ల మాదిరిగా షెడ్లు వేసి జూద క్రీడలను నిర్వహిస్తున్నారు. పందెం రాయుళ్లును ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మహిళా నిర్వాహకులను కూడా కూటమి నేతలు రప్పించారు. పోలీసులు మాత్రం అటువైపు తొంగిచూడటం లేదు. యథేచ్ఛగా కాసులు వేట సాగిస్తూ సామాన్యులు జేబులు గుల్ల చేస్తున్నారు.మరో వైపు, కోడి పందెం బరిలో ఏకంగా కోటీ 25 లక్షల పందెం కాయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు విజేతగా నిలిచింది. ఈ పందెనికి బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలు వేసుకున్నారు. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య కోడి పందెల బరిలో కోటి 25 లక్షల రూపాయలు పందెం కాయడం చర్చనీయాంశంగా మారింది.కుక్కుట శాస్త్ర ప్రకారం కోటి రూపాయల పందేనికి ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు ఈ బరిలోకి దిగాయి. కోటి 25 లక్షలతో రెండు పుంజులను పందెంలోకి దింపారు నిర్వాహకులు. ఇక, కోటి రూపాయల పందెం వీక్షించడానికి ప్రజలు, పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు. ఈ పందేనికి భారీగా బెట్టింగులు కాసిన పందెం రాయుళ్లు. బరిలో హోరాహోరీగా సాగిన బరిలో గుడివాడ ప్రభాకర్ (నెమలి పుంజు)విజేతగా నిలిచింది. దీంతో, గెలిచిన వారు సంబరాలు చేసుకున్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
నెమలి ‘పుంజు’ తడాఖా.. పందెంలో ‘కోటి’ గెలిచిన కోడి
సాక్షి, పశ్చిమగోదావరి: ఏపీలో కూటమి పాలనలో కోడి పందెం బెట్టింగ్ చర్చనీయాంశంగా మారింది. కోడి పందెం బరిలో ఏకంగా కోటీ 25 లక్షల పందెం కాయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు విజేతగా నిలిచింది. ఈ పందెనికి బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలు వేసుకున్నారు.తాడేపల్లిగూడెం పట్టణంలోని పైబోయిన వెంకట్రామయ్య కోడి పందెల బరిలో కోటి 25 లక్షల రూపాయలు పందెం కాయడం చర్చనీయాంశంగా మారింది. కుక్కుట శాస్త్ర ప్రకారం కోటి రూపాయల పందేనికి ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు ఈ బరిలోకి దిగాయి. కోటి 25 లక్షలతో రెండు పుంజులను పందెంలోకి దింపారు నిర్వాహకులు. ఇక, కోటి రూపాయల పందెం వీక్షించడానికి ప్రజలు, పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు. ఈ పందేనికి భారీగా బెట్టింగులు కాసిన పందెం రాయుళ్లు. బరిలో హోరాహోరీగా సాగిన బరిలో గుడివాడ ప్రభాకర్ (నెమలి పుంజు)విజేతగా నిలిచింది. దీంతో, గెలిచిన వారు సంబరాలు చేసుకున్నారు. విజయవాడ.. ఇదిలా ఉండగా.. సాంప్రదాయ సంబరాల ముసుగులో యధేచ్ఛగా జూద క్రీడలను కూటమి నేతలు ప్రోత్సహిస్తున్నారు. కోడి పందెం బరులను ఆదాయ వనరులుగా మార్చేసుకున్నారు కూటమి నేతలు. కూటమి ఎమ్మెల్యేలకు కోడి పందెం బరుల్లో వాటాలు ఉన్నాయి. అక్కడ ఎమ్మెల్యే అనుచరులే హవా కొనసాగిస్తున్నారు. ఎన్నడూ లేనంతగా ఇష్టానుసారంగా బరులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కోడి పందెం బరుల్లో జూద క్రీడలకు స్పెషల్ ఏర్పాట్లు చేశారు. జూద క్రీడలకు తోడు మద్యం ఏరులై పారుతోంది. మద్యం కోసం ప్రత్యేకంగా మినీ బార్లు, బెల్టు షాపులు ఏర్పాటు చేసుకున్నారు. తొలి రెండు రోజుల్లోనే చేతులు మారిన వందల కోట్ల రూపాయలు. జూదం, మద్యం ద్వారా భారీగా సంపాదించాలని పక్కా ప్రణాళిక వేసుకున్న కూటమి నేతలు. అందుకు తగినట్టుగానే భారీగా డబ్బులు వసూలు. అయితే, పండుగ ముందు పోలీసులు.. కోడి పందేలు, పేకాట, గుండాటలు ఆడితే తాటతీస్తామని హెచ్చరించారు. తీరా పండుగ వచ్చాక మాత్రం.. పోలీసులు కనిపించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో కూటమి నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శలు వస్తున్నాయి. -
చెన్నై షాపింగ్ మాల్ లో మీనాక్షి చౌదరి సందడి
-
ప్రభుత్వం అండతో అంబేద్కర్ విగ్రహంపై దాడి..
-
2 రూపాయలకే బిర్యానీ.. రండి బాబు రండి..
-
రచ్చ శ్రీను కేరాఫ్ తాడేపల్లిగూడెం
‘నేను నిజాయతీపరుడిని.. నాకు పక్కవాడిది రూపాయి కూడా అక్కర్లేదు.. కష్టపడి సంపాదించి ఈ స్థాయికి చేరాను..’ ఇవీ తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో రోజూ చెబుతున్న మాటలు. అయితే ఆయన అసలు స్వరూపం మరోలా ఉంది. బొలిశెట్టి శ్రీనుకు నియోజకవర్గంలో మరో పేరు ఉంది.. అదే రచ్చ శీను. దుందుడుకు స్వభావంతో ఇతరులను దబాయించడం, తీవ్రస్థాయిలో భయాందోళనలకు గురిచేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందారు. లారీ ఫీల్డ్‌తో మొదలుపెట్టి 30 ఏళ్లలో తాడేపల్లిగూడెంలో సంపన్నుడిగా మారారు. సెటిల్మెంట్లతో ప్రారంభమైన ప్రస్థానం రాజకీయ పార్టీ అభ్యర్థి వరకు సాగిందిలా..సాక్షి ప్రతినిధి, ఏలూరు: బొలిశెట్టి శ్రీనివాస్‌ను తాడేపల్లిగూడెంలో రచ్చ శీనుగా పిలుచుకుంటారు. 30 ఏళ్లలో కోట్ల సంపద సృష్టించారనేది ప్రచారం. వాస్తవంలో మాత్రం భూ సెటిల్మెంట్లతో మొదలుకొని అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల వరకు దండుకుని ఎదిగారనేది అందరికీ తెలిసిన సత్యం. వీటన్నింటితో పాటు జూద కళల్లో ప్రావీణ్యం కూడా ఉందనేది గూడెం ఎరిగిన నిజం. 1981లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, 1999లో మున్సిపల్ కౌన్సిలర్‌గా, ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఆ తరువాత 2014లో టీడీపీలో చేరి మున్సిపల్ చైర్మన్‌గా ఐదేళ్ల పాటు పనిచేసి 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బియ్యం అక్రమ రవాణా : సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బొలిశెట్టి క్లాస్ వన్ కాంట్రాక్టర్ అని చెప్పుకుంటారు. కౌన్సిలర్‌గా ప్రారంభమైన నాటి నుంచే భూ సెటిల్మెంట్లలో అందె వేసిన చేయి. లెక్కకు మించి భూ సెటిల్మెంట్లు, చౌకగా భూములు కొనడం, భారీగా అమ్మడంతో ఆర్థికంగా ఎదిగారు. అక్కడి నుంచి సివిల్ సప్లయీస్‌కు లారీల కాంట్రా క్టర్‌గా, గన్నీ బ్యాగ్ సప్లయర్‌గా, కందిపప్పు సప్లయర్‌గా మారి భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. బియ్యం అక్రమ రవాణా, కందిపప్పు కల్తీలో సిద్ధహస్తుడిగా పేరొందారు. కట్ చేస్తే.. ఒకే లారీకి నంబర్ ప్లేట్లు మార్చి రవాణా చేయడం, అక్రమ బియ్యం సరఫరా వ్యవహారంలో కత్తిపూడి వద్ద లారీలను పట్టుకోగా కేసు నమోదైనట్టు సమాచారం. ఈ పరిణా మాల క్రమంలో ఆయన లైసెన్స్‌లను బ్లాక్ లిస్టులో పెట్టడంతో బావమరిది పేరుతో మరో లైసెన్స్ సృష్టించి దానిపై ఇదే వ్యాపారాన్ని నిరాటంకంగా కొన సాగించారు. ఈ పరిణామ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కేసు కూడా నమోదై ముగిసిపోయింది. బినామీ కాంట్రాక్టర్లతో భారీగా దండుకొని.. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నిధులతో పార్కుల నిర్వహణ, డ్రెయిన్ల పూడికతీత, ఇతర అభివృద్ధి పనులన్నీ బినామీ కాంట్రాక్టర్లతో చేయించి భారీగా దండుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీలో ఎల్ఈడీ లైట్ల కొనుగోలు టెండర్లో రూ.5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అప్పట్లో పట్టణమంతా చర్చ సాగింది. 20 ఎకరాల లేఅవుట్లో పది శాతం కమీషన్, పట్టణంలోని అనధికారిక లేఅవుట్లో 25 శాతం వాటాలు, దళితులకు చెందిన అసైన్డ్ భూమి స్వాహా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చంపేస్తామని మహిళకు బెదిరింపులు స్థలం అమ్మకపోతే చంపేస్తామని మహిళను బెదిరించిన కేసు కూడా 692/2021గా బొలిశెట్టిపై నమోదైంది. కొయ్యలగూడేనికి చెందిన మార్ని ప్రవీణ అనే మహిళకు గూడెంలోని మోర్ సూపర్‌బజార్ ఎదురుగా స్థలం ఉంది. బొలిశెట్టి దానిని తమకు విక్రయించమని కోరితే ఆమె నిరాకరించడంతో రాత్రికి రాత్రే కుర్రాళ్లను పెట్టి సరిహద్దు గోడను పగులగొట్టించి స్థలం అమ్మకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ సంఘటనలో బొలిశెట్టి శ్రీనివాస్ మూడో నిందితుడిగా, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జీని 4వ నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. పేకాటలో సిద్ధహస్తుడు బొలిశెట్టికి ప్రవృత్తి రీత్యా ఇష్టమైన క్రీడ పేకాట. 2010లో పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొద్దిరోజులు పేకాట క్లబ్‌లు నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. పేకాటకు సంబంధించిన కేసు విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో ఆయనే ధ్రువీకరించారు. 2010లో క్రైమ్ నం.169 పట్టణంలోని ఒక రెసిడెన్సీలో పేకాడుతుండగా పోలీసులు దాడి చేసి రూ.26,565 స్వా«దీనం చేసుకుని బొలిశెట్టి శ్రీనును ఏ1గా చేర్చారు. 2020లో ఎస్సై, కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించి.. అరెస్టయిన వ్యక్తిని స్టేషన్ నుంచి తీసుకువెళ్లడమే కాకుండా 20 మంది కుర్రాళ్లను పంపి అందరి సంగతీ తేలుస్తానని పోలీసులను బెదిరించిన ఘటనలో క్రైమ్ నం.42తో కేసు నమోదైంది. తాడేపల్లిగూడెం అభివృద్ధికి మోకాలడ్డు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పారీ్టలో చేరిన క్రమంలో 2014లో తాడేపల్లిగూడెం నుంచి కౌన్సిలర్‌గా గెలిచి బొలిశెట్టి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు (బీజేపీ) మంత్రి అయ్యారు. కట్ చేస్తే.. మాణిక్యాలరావుకు చుక్కలు చూపించి ఆయన్ను మించి సంపాదించడంతో పాటు ఏ ఒక్క అభివృద్ధి పనీ ముందుకు సాగకుండా ఐదేళ్ల పాటు చేయడంలో బొలిశెట్టి సూపర్ సక్సెస్ అయ్యారు. మంత్రి మాణిక్యాలరావు మంజూరు చేయించిన పనులన్నింటినీ కౌన్సిలర్ తీర్మానం పేరుతో అడ్డుకుని పట్టణ అభివృద్ధిని ఐదేళ్లు వెనక్కి నెట్టారు. ప్రధానంగా మోడల్ ప్రాజెక్ట్‌గా ఏసీ రైతు బజారును మంత్రి మాణిక్యాలరావు గూడెంకు మంజూరు చేయించారు. ఏసీ ఫిష్, నాన్‌వెజ్ మార్కెట్, కూరగాయల మార్కెట్ అన్ని మున్సిపాలిటీలోని ప్రధాన ప్రాంతంలో ఉన్న ఎకరా స్థలంలో ఏర్పాటు చేయడానికి వీలుగా రూ.9 కోట్ల ప్రాజెక్టు మంజూరైంది. మాణిక్యాలరావుతో ఆధిపత్య పోరు ఉన్న క్రమంలో కౌన్సిల్లో తీర్మానం చేసి స్థలం మంజూరు చేయకుండా రూ.9 కోట్ల ప్రాజెక్టును గూడెంకు రాకుండా చేయడంలో బొలిశెట్టి సఫలీకృతులయ్యారు. అలాగే దాదాపు రూ.10 కోట్ల విలువైన రహదారుల పనులకు తీ ర్మానాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. తాడేపల్లిగూ డెం, పెంటపాడు మండలాల్లో మంత్రి పనులన్నింటికీ అడ్డంకొట్టి తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో మాత్రం తన స్నేహితుడి దగ్గర పర్సంటేజ్ తీ సుకుని పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. -
సీఎం జగన్‌కు అభివాదం చేసిన సతీమణి వైఎస్ భారతీ
-
కూటమి ఆశలు పటాపంచలు
సాక్షి, అమరావతి: టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఆశలు పగటి కలలే అని తేలిపోయింది. వారి పొత్తులకు ప్రజా స్పందన కరవైంది. ఈ పొత్తులు మూడు పార్టీల ముఖ్యమైన నేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ఇష్టపడటంలేదు. నియోజకవర్గాల్లో పార్టీల నేతలు, కార్యకర్తలు ఉప్పు, నిప్పులానే ఘర్షణ పడుతున్నారు. ప్రజా స్పందన అయితే శూన్యం. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తుకు ముందు 20 రోజుల క్రితం కాపు సామాజికవర్గం బాగా బలంగా ఉండే తాడేపల్లిగూడెం ప్రాంతంలో టీడీపీ – జనసేన ‘జెండా’ సభ నిర్వహించాయి. అది అట్టర్ ఫ్లాప్ అయింది. బీజేపీతో పొత్తు తర్వాత ఆదివారం కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉండే చిలకలూరిపేట ప్రాంతంలోని బొప్పూడిలో సభ పెట్టారు. ప్రధాని మోదీ కూడా పాల్గొన్న ఈ సభపై చంద్రబాబు, పవన్ సహా కూటమి నేతలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సభకూ ప్రజల నుంచి స్పందన లేక అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో మూడు పార్టీల నాయకులు, శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్న ఈ సభకు ప్రజాస్పందన మొదలు సభ జరిగిన తీరు, నాయకుల ప్రసంగాలు అన్నింటిపై మూడు పార్టీల సీనియర్ నేతలు సైతం పెదవి విరుస్తున్నారు. కార్లు అడ్డుపెట్టి.. ట్రాఫిక్ జామ్ చేసి చిలకలూరిపేట సభకు భారీగా జనసమీకరణ చేయడం కోసం టీడీపీ నాయకులు మొదట దాదాపు 2500 బస్సులు కావాలని ఆర్టీసీ అధికారులను కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజా స్పందన వ్యతిరేకంగా ఉందని తెలిసిపోవడంతో ఆఖరి నిమిషంలో 1540 బస్సులను క్యాన్సిల్ చేసి, 960 బస్సులను మాత్రమే తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని ప్రైవేట్ స్కూళ్ల బస్సులనూ తీసుకున్నారు. వీటిలో ఏ బస్సుల్లోనూ సగం కూడా నిండలేదు. ఏ ఒక్క బస్సూ నిండుగా సభకు రాలేదని స్థానికులు చెప్పారు. ఏలూరు లోక్‌సభ ప్రాంతం మొదలు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాంతం మధ్య దాదాపు సగం రాష్ట్రం నుంచి ఈ సభ కోసం మూడు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని 10 లక్షలకు తక్కువ కాకుండా జనసమీకరణ చేయాలని భావించాయి. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పటికీ, పదో వంతు కూడా జనాలు సభలో కనిపించలేదు. చివరకు సభకు ఎక్కువ మంది జనాలు వచ్చారని చూపించుకోవడానికి టీడీపీ నాయకులే జాతీయ రహదారిపై కార్లు అడ్డంగా పెట్టి రెండు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేసి వాటినే డ్రోన్లతో చిత్రీకరించి చూపించేందుకు ప్రయత్నించారు. వారు కార్లు అడ్డం పెట్టడం సహా పూర్తి వాస్తవ చిత్రం వారి చిత్రాల్లోనే కనిపించేస్తోంది. సభలో వైఫల్యాలను పోలీసులపై రుద్దే యత్నం బీజేపీతో అధికారికంగా పొత్తు ఖరారు కాకముందే మార్చి తొలివారంలోనే టీడీపీ జనసేన పార్టీలు చిలకలూరిపేట సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. మూడు పార్టీల పొత్తు ఖరారైన తర్వాత ప్రధాని మోదీని కూడ ఈ సభకు ఆహ్వానించారు. అయితే, ఈ సభకు జనసమీకరణ పూర్తిగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోనే కొనసాగింది. సభ నిర్వహణను ఆఖరి నిమిషంలో బీజేపీ నాయకులకు అప్పగించారు. సభలో ప్రధాని స్థాయిలో ఉన్న మోదీని అవమానించారు. ప్రధాని వేదికపైకి వచ్చిన తర్వాత బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు సభ నిర్వహణ చేపట్టారు. వేదికపైకి వచ్చిన ప్రధాని మోదీకి శాలువా కప్పి సన్మానించాలని చంద్రబాబును, పుష్పగుచ్ఛం అందించాలని పవన్‌ను కోరారు. అయితే, చంద్రబాబు, పవన్ వద్ద కనీసం ఓ పూల బొకే కూడా లేకపోవడంతో ప్రధాని అలానే కొద్దిసేపు నిలబడ్డారు. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన వద్ద ఉన్న వినాయకుని ప్రతిమను ప్రధానికి బహూకరించి, సన్మాన కార్యక్రమం మ మ అనిపించారు. ఆ తర్వాత ప్రధాని ప్రసంగించే సమయంలో మైకులు మూడు సార్లు మూగబోయాయి. అంతకు ముందే సభలో జనం పలుచగా ఉండటంతో ఎక్కువ మంది వచ్చారన్నట్లుగా చూపించడానికి టీడీపీ నేతల ఆదేశాల మేరకు పలువురు కార్యకర్తలు సౌండ్ బాక్స్‌లు, ఫ్లడ్ లైట్ల టవర్ల పైకి ఎక్కారు. అది ప్రమాదమని తెలిసినా, చంద్రబాబు, ఆ సమయంలో ప్రసంగిస్తున్న పవన్ వారిని వారించలేదు. ఇది గమనించి ప్రధానే స్వయంగా పవన్‌ను ప్రసంగం ఆపమని చెప్పి, తాను మైకు ముందుకు వచ్చి వారందరినీ కిందికి దిగాలని కోరాల్సివచ్చింది. ఇలా అన్ని అంశాల్లో సభ నిర్వహణలో తెలుగుదేశం పార్టీ నాయకుల లోపాలు స్పష్టంగా కనపడుతున్నా, ఆ లోపాలను పోలీసులు, అధికారులపైనా నెట్టేందుకు టీడీపీ, జనసేన నాయకులు పూనుకున్నారు. కూటమి రాజకీయ నినాదంపైనా అస్పష్టతే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ, వారికి ఉమ్మడి రాజకీయ విధానం లేదన్న విషయం వారి ప్రసంగాలే తేల్చేశాయి. రాష్ట్రానికి వచ్చే ఐదేళ్లూ వారు ఏం చేస్తామన్నది కూడా చెప్పకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా కేవలం సీఎం జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత, రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారు. తాడేపల్లిగూడెం సభలో పూర్తిగా సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారు. చిలకలూరిపేట సభలో ఓ పక్క మోదీపై ప్రశంసలు కురిపిస్తూ, జగన్‌పై అవే విమర్శలను కొనసాగించారు. ప్రస్తుత పీసీసీ (రాష్ట్ర కాంగ్రెస్ ) అధ్యక్షురాలుగా కొనసాగుతున్న షర్మిల సొంత చెల్లెలు అయి ఉండి కూడా సీఎం జగన్‌ని నమ్మడంలేదని బాబు, పవన్ విమర్శిస్తే.. అదే సభలో ప్రధాని మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటేనని, ఒకే కుటుంబానికి చెందిన షర్మిల, వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే ఇలా రెండు పార్టీల్లో ఉన్నారని విమర్శలు చేయడం గమనార్హం. కీలకమైన రాజకీయ విధానంలో మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదనడానికి ఇదే ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకు విడిపోయారో, మళ్లీ ఎందుకు కలిశారో చెప్పకుండా.. 2014 ఎన్నికలప్పుడు ఈ మూడు పార్టీలే ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వందల హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఏ హామీ అమలుచేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ పేరిట రైతులు, మహిళలను వంచించారు. ఐదేళ్లు తిరగకుండానే మూడు పార్టీలు విడిపోయి, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకొన్నాయి. 2019లో వేర్వేరుగా పోటీ చేశాయి. మళ్లీ ఇప్పుడు ఆ మూడు పార్టీలే కూటమి కట్టాయి. అప్పుడు ఎందుకు విడిపోయారు, తిరిగి మళ్లీ ఎందుకు కలిశారో వారే చెప్పలేకపోతున్నారు. దీంతో వారి కార్యకర్తలే వారిని నమ్మడంలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం పేరే ఎత్తని ప్రధాని మోదీ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని స్థానంలో ఉన్న నరేంద్ర మోదీపై వ్యక్తిగతంగా, రాజకీయంగానూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తే టీడీపీ నాయకులు గో బ్యాక్ నినాదాలతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ప్రధాని పాల్గొనే సభలకు సమీపంలో నల్ల బెలూన్లు సైతం ఎగరవేశారు. ఆదివారం చిలకలూరిపేట సభలో చంద్రబాబు, మోదీ ఇరువురు పక్క పక్కనే కూర్చున్నా, ప్రధాని మోదీ గత ఐదేళ్లనాటి చేదు సంఘటనలు ఇంకా మరిచిపోలేదేమో అన్నట్టుగా ముభావంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఐదేళ్ల కిత్రం మోదీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబే ఈ సభలో హిందీలో, తెలుగు భాషలో పొగడ్తల వర్షం కురిపించారు. అయితే, ప్రధాని మోదీ తన ప్రసంగంలో తెలుగుదేశం పార్టీ పేరును ఒక్కసారి కూడా ఉచ్ఛరించలేదు. కేవలం ఎన్డీఏ పేరుతో ప్రజలను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. చంద్రబాబు పేరును కేవలం ఒక్కసారి మాత్రమే పలికారు. -
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఈలి నాని
తాడేపల్లి: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని(వెంకట మధుసూదనరావు) వైఎస్సార్సీపీలో చేరారు. ఈలి నాని.. ఈరోజు(గురువారం) వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు ఈలి నానికి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. 2009లో తాడేపల్లిగూడెం నుంచి ప్రజారాజ్యం(పీఆర్పీ) తరఫున పోటీ చేసి గెలుపొందిన ఈలి నాని.. ఆపై టీడీపీలో చేరిపోయారు ఈలి నాని. ఈ క్రమంలోనే తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జ్‌గా కూడా ఈలి నాని పని చేశారు. -
తాడేపల్లిగూడెం: టీడీపీ-జనసేన పొత్తులో ముసలం
సాక్షి, పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉమ్మడి పొత్తులో ముసలం ఏర్పడింది. పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం సీటు జనసేనకే కేటాయిస్తున్నట్లు టీడీపీ ప్రకటించడంతో తాడేపల్లిగూడెం పట్టణంలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోయారు. నియోజకవర్గ ఇంచార్జి వలవల మల్లిఖార్జున రావు(బాబ్జి) మాట్లాడుతూ, తాడేపల్లిగూడెం సీటు లేదని అధిష్టానం పొత్తుకు ముందే చెప్తే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో నాకు నియోజకవర్గ ఇంచార్జి ఇచ్చినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేశానని, విలువ లేకుండా చేశారన్నారు. క్రమశిక్షణ ఎక్కువ ఉన్న నియోజకవర్గం మనది. అందుకే మనల్ని లోకువగా చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదీ చదవండి: రఘురామా.. ప్లీజ్ గెటవుట్! -
ఏంటి పవన్ ఇది.. ప్రతీసారి ఇలా దొరికేస్తే ఎలా?
టీడీపీ-జనసేనల తాడేపల్లిగూడెం సభతో ఒక్క విషయంపై అయితే క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఊగిపోతూ చేసిన ప్రసంగం తర్వాత.. రాష్ట్ర ప్రజానీకానికి, ఆయన అభిమానులకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక ‘మనం’ అనుకునే పవన్ కల్యాణ్ మనవాడు కాదు.. చంద్రబాబు వాడే అని తేటతెల్లమైపోయింది. జనసేన పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా.. ఆ పార్టీ చంద్రబాబు కోసమే పెట్టిందని, పుట్టిందనే విషయం పవన్ కల్యాణ్ మాటల ద్వారా తేలిపోయింది. తాడేపల్లిగూడెంలో సభలో "మనం ఏమీ చేయలేం, ఏమీ చేయలేం అంటూ 24 సీట్లతోనే" సరిపెట్టేసుకున్నట్లు కనిపించిన పవన్ కల్యాణ్.. చంద్రబాబు పన్నిన వలలో ఎలా చిక్కాడో అశేష రాష్ట్ర ప్రజానికానికి అర్థమైపోయింది. ఆవేశం తప్ప, పసలేని పవన్ కల్యాణ్ ప్రసంగంపై సామాన్యుడు ‘ఇదేంట్రా నాయనా’ అనుకుంటుంటే, నెటిజన్లు మాత్రం సోషల్ మీడియాలో ఆట ఆడేసుకుంటుకున్నారు. అందులో కొన్ని ఒక్కసారి చూద్దాం. ►వీరుడు ఉద్దండుడు అయిన బాబును 53 రోజులు జైల్లో పెడితే బాధేసింది : పవన్ కళ్యాణ్ చంద్రబాబు లక్ష కోట్లు దోచుకున్నాడు అని చెప్పిందే నువ్వు కదా పవన్ పైగా అమరావతి కాంట్రాక్టర్ల నుంచి బాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి ముడుపులు తీసుకొని బాబుకు ఇచ్చాను అని దర్యాప్తులో ఒప్పుకున్నాడు. అందుకే కదా కేంద్ర ఇన్కమ్ టాక్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు కదా.! మరి ఈ విషయాన్నీ నీకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పలేదా పవన్ కళ్యాణ్.? ►యుద్ధం అంటే ఏంటో నేను చూపిస్తా : పవన్ కళ్యాణ్ ఎందుకీ భారీ సినిమా డైలాగులు.? (2019లో కూడ రాసి పెట్టుకోండి జగన్ ఎప్పటికీ సీఎం కాడు అన్నావుగా.!) ►అమరావతే ఏపీ రాజధాని : పవన్ కళ్యాణ్ అబ్బో ఆ రోజు ఏం చెప్పావు.? అమరావతి ఒక కుల రాజధాని అని అన్నావ్ కదా.! బాబు నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి .. ఆయన అనుభవం కావాలి అని పొత్తుపెట్టుకున్నామరి అంత అనుభవం ఉన్న బాబుకు వ్యతిరేకంగా 2009 లో ప్రజారాజ్యం తరపున , 2009 లో నీవు ఎందుకు పోటీ చేసావ్.? హైటెక్ సిటీలో బాబు దోచుకున్నాడు అని నీవు చెప్పిన వీడియోలు యూట్యూబ్‌లో భద్రంగా ఉన్నాయి కదా.! ►నేను మీ కోసం సినిమా సంపాదన వదులుకొని వచ్చా : పవన్ కళ్యాణ్ సినిమాలలో ఓ వైపు నటిస్తూనే ఉన్నావు, పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేస్తూ నీతులెందుకు చెబుతావ్.? (బ్రో, భీమ్లా నాయక్, వకీల్ సాబ్, అజ్ఞాతవాసి, కాటంరాయుడు .. ఇవన్నీ కొంపదీసి నీ తరపున డూప్ నటించాడా ఏంటి ?) ►24 యేనా ఇంతేనా అంటున్నారు ప్రత్యర్ధులు: పవన్ కళ్యాణ్ అబ్బబ్బ.. జనసేన మీద నీకెంత ప్రేమ.? ఈ 24 లో కూడా కనీసం 10 -15 మంది టీడీపీ వాళ్లే పోటీ చేస్తారుగా.! ►వ్యూహం నాకొదిలేయండి, నాకు సలహాలు ఇచ్చే వాళ్ళు అక్కరలేదు, కొంతమంది నా నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు, నాతో నడిచేవాడే నావాళ్లు, పవన్ తో స్నేహమంటే సచ్చేదాకా, పవన్ తో పగ అంటే సచ్చేదాకా : పవన్ కళ్యాణ్ (ఇంతకుముందు బాబును కూడా చాల తిట్టావ్ కదా, మా అమ్మను తిట్టించిన బాబును వదలను అన్నావు కదా, మరి ఇప్పుడెందుకు మోస్తున్నావ్.!) ►విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్లింది 24తోనే. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అందుకే 24 సీట్లకు ఒప్పుకున్నా: పవన్ కళ్యాణ్ ఒకవేళ చంద్రబాబు... 10 సీట్లు ఇస్తే... దశావతారాలు. 9 సీట్లు ఇస్తే నవగ్రహాలు. 8 సీట్లు అష్ట దిక్పాలకులు. 7 సీట్లు ఇస్తే సప్త ఋషులు. 6 సీట్లు ఇస్తే షట్చక్రవర్తులు 5 సీట్లు ఇస్తే పంచభూతాలు 4 సీట్లు ఇస్తే నాలుగు దిక్కులు 3 సీట్లు ఇస్తే త్రిమూర్తులు 2 సీట్లు నర నారాయణులు. 1 సీటు ఇస్తే ఏక లింగేశ్వరుడు అని కలరింగ్ ఇచ్చేవాడివా పవన్ కళ్యాణ్.? ►నాకు ప్రశ్నలు వేసే అభిమానులు కాదు, నన్ను విమర్శించే నాయకులు వద్దు : పవన్ కళ్యాణ్ నాకు జెండా కూలీలు కావాలి నేను తీసుకున్న ప్యాకేజీకి మీరు జై కొట్టాలి.. ఇదేనా మీ అర్థం పవన్.? -
జనాలేరయ్యా?.. చంద్రబాబు తీవ్ర అసహనం
సాక్షి, పశ్చిమ గోదావరి: పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే. వైఎస్సార్సీపీ సిద్ధం సభలకు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజాస్పందనను చూస్తూ.. ప్రతిపక్ష కూటమి తమ సభలకు జనాలను బలవంతంగా అయినా తరలించే యత్నం బెడిసి కొట్టింది. 99 మంది అభ్యర్థులను ప్రకటించాక ఉమ్మడిగా తొలి సభను నిర్వహించుకుంటున్నాయి. అయితే.. తమ పరువు కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆఖరికి.. ‘సూపర్ సిక్స్’ కూడా జనాల్ని రప్పించలేకపోయింది. సీట్ల పంపకం తర్వాత రగిలిన అసంతృప్త జ్వాలలను కప్పిపుచ్చుకునేందుకు ఆ రెండు పార్టీలు బాగానే ట్రై చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడిగా ఉన్నామనే సంకేతాలు పంపేందుకు జెండా పేరుతో తాడేపల్లి గూడెంలో సభను నిర్వహిస్తున్నాయి. అయితే ఈ సభ వేదికగానే.. తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు ఇరు పార్టీల కేడర్లు. అదే సమయంలో జనాలు సైతం ఈ సభను పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. టీడీపీ-జనసేన ఉమ్మడి సభ జనం లేక వెలవెలబోతోంది. చంద్రబాబు అసహనం జెండా సభకు జనం భారీగా వస్తారనుకుంటే.. ప్రతిపక్షాలకు పెద్ద షాకే తగిలింది. జనాలు తరలించడంలో అటు టీడీపీ-ఇటు జనసేన నేతలు ఘోరంగా విఫలం అయ్యారు. కుర్చీలన్నీ ఖాళీగా కనిపించడంతో చంద్రబాబు అసహనానికి గురయ్యారు. జనాలు ఎక్కడయ్యా? అంటూ పక్కనే ఉన్న బాలయ్యను చూస్తూ అసహనం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సభాస్థలికి వెళ్లకుండా కార్వాన్లోనే కాసేపు కూర్చుకున్నారు. కాసేపు ఆగితే ఇంకాస్త జనం ఎక్కువ అవుతారేమో అనే ఆశతో.. బాబు, పవన్, బాలయ్య ముగ్గురూ అక్కడే ఉండిపోయారు. సిద్ధంతో పోలిస్తే.. తమ ఉమ్మడి సభకు 6 లక్షల మంది దాకా వస్తారంటూ ఇరు పార్టీలు ప్రకటించుకున్నాయి. కానీ, 60 వేల మందికి మాత్రమే సరిపడా ఏర్పాట్లు చేశారు. పోనీ.. అంత మంది వచ్చారా? అంటే.. అంత లేదు. కుర్చీలు కూడా 8 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సభ 21 ఎకరాల్లో అని ప్రకటించుకున్న ఇరు పార్టీలు.. 13 ఎకరాల్లోనే గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కముక్కలో చెప్పాలంటే సిద్ధం సభల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం అంతకూడా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం.. దాని మిత్రపక్షం నిర్వహించే సభకు సమానంగా ఉందంటే అతిశయోక్తి కాదు. సూపర్ సిక్స్ పంచినా.. తాడేపల్లిగూడెం సభ కోసం టీడీపీ గిఫ్ట్‌లు పంచినా ఫలితం లేకుండా పోయింది. ఓ బాక్స్‌లో ఐదు వేల నగదు.. క్వార్టర్ బాటిల్.. మందులోకి మంచిగ్ కోసం స్టఫ్.. సిగరెట్లు.. కొన్ని స్వీట్లు.. కండోమ్ ప్యాకెట్.. లను ఉంచి ఉమ్మడి సభకు తరలించేందుకు జనాలకు తాయిలంగా ఇచ్చే యత్నం చేశారు. అయితే వాటిని కూడా కొందరు ఛీ కొట్టి సభకు వచ్చేందుకు విముఖత చూపించడం గమనార్హం. కొసమెరుపు.. తాడేపల్లిగూడెం జెండా సభలో దృశ్యం ఒకటి.. నెట్టింట ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. సభ ఆరంభంలో టీడీపీ జెండాను పవన్.. జనసేన జెండాను చంద్రబాబు మోశారు. అది చూసి కొందరు.. ‘పవన్ ఇంతకాలంగా చేస్తోంది అదే కదా’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. -
సమన్వయం లేనిచోటే సమన్వయ సభ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయంటే.. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ధర్మం ఒకటి ఉంటుంది. ఏ పనైనా కలిసికట్టుగా చేయాలన్న ఓ కట్టుబాటు ఉంటుంది. తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేనల మధ్య ఇదే కొరవడింది. సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాట్లు దీనికో తాజా ఉదాహరణ. ఈ నెల 28న టీడీపీ, జనసేన సంయుక్తంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. దీనిలో భాగంగా ఏర్పాట్ల పరిశీలనకు రెండు పార్టీల నాయకులతో కమిటీలు వేస్తామని ప్రకటించారు. కానీ.. జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నేతలు 100 మందితో సభ జరిగే ప్రత్తిపాడు ప్రాంగణాన్ని శుక్రవారం ఉదయం పరిశీలించి వెళ్లిపోయారు. అంతకు ముందు గురువారం సాయంత్రమే టీడీపీ నాయకులు కూడా సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. పరిశీలన సమయంలో వీరు వారిని, వారు వీరిని పిలవలేదు. నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం పరిశీలించారని తెలియగానే ఆ సాయంత్రమే టీడీపీ జోన్–2 కోఆర్డినేటర్ నేతృత్వంలో తాడేపల్లిగూడెంలో హడావుడిగా సమావేశం పెట్టారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జి, కొందరు మాజీ ఎమ్మెల్యేలు హడావుడిగా ఏర్పాట్లు పరిశీలించి అంతా టీడీపీయే చేస్తోందని, జనసేనది ఏమీ లేదన్నట్టు వ్యవహరించారు. మరోవైపు సభా ప్రాంగణాన్ని తానే మాట్లాడి సెట్ చేశానని, అంతా తామే చేస్తున్నామని జనసేన ఇన్చార్జి మౌత్ పబ్లిసిటీ ప్రారంభించారు. ఇలా ఎవరికి వారుగా పనిచేస్తుండటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కొనసాగుతున్న మాటల యుద్ధం తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా వలవల బాబ్జి, జనసేన ఇన్చార్జిగా బొలిశెట్టి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తూ బరిలో ఉన్నారు. ఇద్దరూ టికెట్ మాదంటే మాదంటూ వారి స్థాయికి మించి భారీగా ప్రకటనలు చేసుకుంటున్నారు. జనసేన మొదట ప్రకటించే సీటు తాడేపల్లిగూడెమేనని బొలిశెట్టి శ్రీనివాస్, 20 ఏళ్ల తరువాత టీడీపీ గెలిచే సీటు తాడేపల్లిగూడేమని వలవల బాబ్జీ ప్రకటించడంతో మాటల యుద్ధం ప్రారంభమైంది. ఒకరి సమావేశాలకు మరొకరు వెళ్లకుండా అదే రోజు కౌంటర్ ప్రోగ్రామ్‌లు నిర్వహించే స్థాయికి ఇది చేరింది. పార్టీలు రెండు దారుల్లో వెళ్తున్న ప్రాంతంలో సభ నిర్వహించనుండటంతో కొత్త చిచ్చు మొదలైందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇక టీడీపీ, జనసేన తొలి జాబితాలో మొదటి సీటు తాడేపల్లిగూడెం ఉంటుందని నానా హడావుడి చేశారు. తొలి జాబితాను శనివారం ప్రకటించినప్పటికీ, బహిరంగ సభ నేపథ్యంలో వివాదం జరగకుండా టికెట్‌ను పెండింగ్‌లో ఉంచారని తెలుస్తోంది. -
సీఎం జగన్ మార్గదర్శకత్వంలో ప్రవాసాంధ్రులకు మెరుగైన సేవలు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగసంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకత్వంలో పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏపీ రాష్ట్రవాసులకు అనేక ఉచిత సేవలు అందిస్తూ, వారికోసం నిరంతరాయంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి, సీఈఓ పి. హేమలత రాణి .. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో “మీట్ ది ప్రెస్” చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకట్ ఎస్. మేడపాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్టులకు వివరించారు.మేడపాటి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, అభివృద్ది ధ్యేయంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకత్వంలో ముందుకేల్తోందని అన్నారు. ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్, ప్రవాసాంధ్ర భరోసా బీమా, ఉచిత అంబులెన్సు సర్వీస్, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా, అడ్వాన్స్డ్ ఐటి కోర్సులలో శిక్షణ, అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, స్థానిక, విదేశీ కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పించడం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాసాంధ్రులకు తగు సలహాలు, సూచనలు అందించడం, ఏపీ పోలీస్ఎన్నారై సెల్ ద్వారా ప్రవాసాంధ్రులకు స్వరాష్ట్రంలో స్థిర, చర ఆస్తి వివాదాలు, వివాహ సమస్యలు-మోసాలు పరిష్కరించడం, అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఎంబసీలతో సమన్వయం చేస్తూ వ్యక్తులను స్వదేశం తీసుకురావడం, ఆయా దేశాలు ఆమ్నెస్టీ ప్రకటించినప్పుడు రాష్ట్రవాసులను ఉచితంగా స్వస్థలాలకు తీసుకురావడం వంటి అనేక సేవలను అందిస్తోంది. విద్యావాహిని ద్వారా విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఉచిత కౌన్సెలింగ్ & జగనన్న విదేశీ విద్యా దీవెన (JVVD) గురించి వివరించడం, ఏపీఎన్ఆర్టీ ట్రస్ట్ ద్వారా ప్రవాసాంధ్రులు వారి గ్రామాలు, పట్టణాలలో పాఠశాలల్లో విద్యార్థుల కొరకు లైబ్రరీలు ఏర్పాటు చేయడం, ప్రవాసాంధ్రుల పల్లెలలో వారు కోరిన “నాడు-నేడు” లో పొందుపరచని అవసరాలను పాఠశాలల్లో సమకూర్చడం, ఆసుపత్రులు, అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలు చేయడం వాటిని ఏపీఎన్ఆర్టీ ట్రస్ట్ సంబంధిత శాఖలు, అధికారులతో సమన్వయము చేయడం, పాస్‌పోర్ట్, పిసిసి లలో డాక్యుమెంటేషన్ సహాయం, పోగొట్టుకున్న పత్రాలను తిరిగి పొందడంలో సహాయం, రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలలో విఐపీ దర్శనం తదితర సేవలను కూడా ఏపీఎన్ఆర్టీఎస్ అందిస్తోంది. అంతేకాకుండా ఉపాధి, ఉద్యోగ నిమిత్తం ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారికోసం సక్రమ వలసల పై పలు జిల్లాల్లో ముందస్తు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరూ ఏపీఎన్ఆర్టీఎస్ లో రిజిస్టర్ చేసుకొని, ప్రవాసాంధ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీఎన్ఆర్టీఎస్ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఏపీఎన్ఆర్టీఎస్ ప్రాంతీయ కార్యాలయమైన రాజంపేటలోని వైఎస్సార్ ప్రవాసాంధ్ర సేవా కేంద్రం ద్వారా చుట్టుపక్కల ఉన్న వారు నేరుగా వెళ్లి విదేశీ వలస గురించి, అక్కడ జీవన విధానం గురించి సమాచారాన్ని తెలుసుకొని, వారికున్న సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. గత నాలుగున్నర సంవత్సరాలలో ఏపీఎన్ఆర్టీఎస్ అందించిన సేవలు, ఎంతమంది లబ్ది పొందారో వారి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయని శ్రీ వెంకట్ మేడపాటి పేర్కొన్నారు. # ఏపిఎన్‌ఆర్‌టి సొసైటీలో రిజిస్టర్ చేసుకున్న సభ్యుల సంఖ్య: 2,20,000 కి పైగా # ఏపిఎన్ఆర్టిఎస్ అందిస్తున్న వివిధ సేవలు: 28 కి పైగా # ఏపిఎన్‌ఆర్‌టి సొసైటీ ద్వారా లబ్ది పొందిన వారి సంఖ్య: 2,55,000 కి పైగా # వివిధ దేశాలలో కో ఆర్డినేటర్లు: 200 మంది పైగా # వివిధ దేశాలలో సమన్వయము చేసుకుంటున్న ఎంబసీ, సిజిఐలు : 30 కి పైగా # ప్రవాసాంధ్రుల నుండి 24/7 హెల్ప్ లైన్ రిసీవ్ చేసుకున్న,చేసిన కాల్స్: 2,02,093 # విదేశాల్లో మరణించిన ప్రవాసాంధ్రుడి పై ఆధారపడిన కుటుంబానికి ఆర్ధిక ఆసరాగా ఇస్తున్న ఎక్స్ గ్రేషియా పొందిన వారి సంఖ్య: 489, విడుదల చేసిన మొత్తం: రూ. 2 కోట్ల 44 లక్షలు # విదేశాల్లో మరణించిన వారి భౌతికకాయాల్ని విమానాశ్రయాల నుండి వారి స్వగ్రామాలకు తరలించడానికి ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్సుల సంఖ్య: 1,077, ఖర్చు: రూ. 1 కోటి 93 లక్షలు # కువైట్, ఉక్రెయిన్, సుడాన్ & ఇజ్రాయిల్ దేశాలలో నెలకొన్న గడ్డు పరిస్థితులలో ఉద్యోగులు, విద్యార్థులు, వలసకార్మికులు, పర్యటనలకు వెళ్ళిన వారిని స్వదేశానికి తీసుకువచ్చిన (రీపాట్రియేషన్) వారి సంఖ్య: 3,610 # టెంపుల్ ట్రావెల్ సేవ ద్వారా దేవాలయాలలో దర్శనాలు చేసుకున్న ప్రవాసాంధ్రుల సంఖ్య: 6,169 # ఏపీ పోలీస్ ఎన్నారై సెల్ & మైగ్రంట్ రిసోర్స్ సెంటర్ (ఎమ్ఆర్సీ సెల్) ద్వారా పరిష్కరించిన గ్రీవెన్స్ లు: 1739 # వివిధ కారణాలతో విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకొచ్చిన వారి సంఖ్య: 900 మందికి పైగా # మృతదేహాల రవాణాకు సంబంధించిన ఖర్చు: రూ. 33 లక్షలు # అమ్నెస్టీ, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రవాసాంధ్రులను స్వదేశానికి తీసుకురావటానికి (రీపాట్రియేషన్) అయిన ఖర్చు: రూ. 1 కోటి 10 లక్షలు పైగా # అడ్వాన్స్డ్ ఐటీ కోర్సులలో శిక్షణ పొందిన వారి సంఖ్య: 876 # ప్రవాసాంధ్ర భరోసా బీమా తీసుకున్న వారి సంఖ్య: 33,596, క్లెయిమ్స్ విడుదల: రూ. 44,05,604, పురోగతిలో ఉన్న క్లెయిమ్స్ : రూ. 25,53,700 ఈ బీమాకు సంబంధించి ఏపీఎన్ఆర్టీఎస్ కొద్దిరోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. 3 సంవత్సరాలకు ఉద్యోగులు కడుతున్నరూ. 550 ల ప్రీమియంలో 50%, ఒక సంవత్సరానికి విద్యార్థులు కడుతున్న రూ. 180 ప్రీమియం పూర్తిగా రాయితీ కల్పించింది. దీని ద్వారా 3232 మంది ఉద్యోగులు, 516 మంది విద్యార్థులకు లబ్ది కలిగింది. వీరి తరఫున ఏపీఎన్ఆర్టీఎస్ మొత్తం రూ. 9,80,662 ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టింది. # విద్యావాహిని సేవను వినియోగించుకున్న విద్యార్ధుల సంఖ్య: 3,118 # వివిధ దేశాలలో ఉన్న 130 కి పైగా తెలుగు సంఘాలతో సమన్వయము # టిటిడి సహకారంతో, ఏపిఎన్ఆర్టిఎస్ సమన్వయము చేసి వివిధ దేశాలలోని పలు నగరాల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణాలు: 46 # ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ డాక్టర్లతో నిర్వహించిన “Exam Stress Management” ఆన్ లైన్ శిక్షణకు కు హాజరైన లెక్చరర్ల సంఖ్య: 6,800 # ఏపిఎన్‌ఆర్‌టి సొసైటీ ద్వారా ఉద్యోగ లభ్ది పొందిన వారి సంఖ్య (దేశ, విదేశాల్లో): 1,218 # సక్రమ వలసలపై నిర్వహించిన అవగాహన సదస్సులు: 14 (పశ్చిమ గోదావరి - 4, కోనసీమ - 3, తూర్పు గోదావరి - 2, కడప - 2, శ్రీకాకుళం -1, కాకినాడ - 1, అన్నమయ్య – 1) # “ప్రశిక్షణ, శిక్షణ” కార్యక్రమం ద్వారా కమ్యూనికేషన్ లో శిక్షణ పొందిన టీచర్ల సంఖ్య: 210, విద్యార్ధుల సంఖ్య: 170 #ఏపీఎన్ఆర్టీ ట్రస్ట్ కు ధన, వస్తువు రూపేణా వచ్చిన విరాళం దాదాపు రూ. 7 కోట్లు 14 ప్రభుత్వ పాఠశాలలకు సహాయం పాఠశాలల్లో ఆట స్థలాల అభివృద్ధి అదనపు తరగతి గదులు సైకిల్ షెడ్లు, భోజనశాలలు (డైనింగ్ హాల్స్) తదితర అభివృద్ధి పనులు # వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన బాలల గ్రంథాలయాలు: 61, అయిన ఖర్చు: రూ. 17,30,000 కోవిడ్ సమయం లో వివిధ దేశాలలో ఉన్న ఏపీ వారికోసం ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ నంబర్లను అత్యవసర నంబర్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది హైదరాబాద్, విజయవాడ, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు విమానాశ్రయాలకు వెళ్లి మనవారిని రిసీవ్ చేసుకొని జిల్లా పరిపాలన అధికారులతో సమన్వయము చేసుకుంటూ ప్రభుత్వ బస్సుల్లో 44,000 మందికి పైగా వారి ఊర్లకు చేర్చడం జరిగింది. అనంతరం జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు, సందేహాలను నివృత్తి చేసారు. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు, విదేశాల్లో ఉన్నవారు ఏపీఎన్ఆర్టీఎస్ లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా, ఏదేని సహాయం కొరకు ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678 వాట్సాప్: 85000 27678 ను ఎల్లవేళలా సంప్రదించగలరు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీఎన్ఆర్టి సొసైటీ -
తాడేపల్లిగూడెంలో ఏడీజే కోర్టు ప్రారంభం
తాడేపల్లిగూడెం (టీఓసీ): న్యాయవాదుల చిరకాల కోరిక అయిన ఏడీజే కోర్టును పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రారంభించామని, కోర్టును గౌరవప్రదంగా నిర్వహించుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. నూతనంగా మంజూరైన 11వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి (ఏడీజే) కోర్టును తాడేపల్లిగూడెం కోర్టు సముదాయం భవనాల్లోని ఒక బిల్డింగ్‌లో ఆదివారం ఉదయం జస్టిస్ కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ నైనాల జైసూర్య, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వి.గోపాలకృష్ణారావు, జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి సి.పురుషోత్తం కుమార్, ఏడీజే కోర్టు ఇన్చార్జి జడ్జి బి.సత్యవతి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం న్యాయవాదుల చిరకాల వాంఛ అయిన ఏడీజే కోర్టు కల నెరవేరిందన్నారు. జూనియర్ న్యాయవాదులకు ఇది చక్కని అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోర్టు పరిధిలోని ప్రజలకు ఏడీజే కోర్టు రావడం వల్ల వ్యయప్రయాసలు తగ్గుతాయన్నారు. బార్ అసోసియేషన్‌కు, న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి మాట్లాడుతూ ఇది రెండు దశాబ్దాల కల సాకారమైన రోజని అన్నారు. జస్టిస్ నైనాల జైసూర్య మాట్లాడుతూ యువ న్యాయవాదులు ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ఏడీజే కోర్టు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏడీజే కోర్టు కల సాకరమైనందుకు తాడేపల్లిగూడెం వాసిగా గర్వపడుతున్నానని చెప్పారు. కార్యక్రమంలో పలువురు న్యాయాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
తాడేపల్లి గూడెంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్
సాక్షి, పశ్చిమ గోదావరి: తాడేపల్లి గూడెంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. పోలీసులు అనుమతి లేకుండా టీడీపీ శ్రేణులు తాడేపల్లిగూడెంలో పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. టీడీపీ శ్రేణులు చేపట్టిన పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో, వారు మరింత రెచ్చిపోయారు. వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెంలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. అనుమతి లేకుండా పాదయాత్ర చేపట్టడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా పోలీసులు.. జిల్లాలో సెక్షన్30 పోలీసు యాక్ట్ అమలులో ఉందని, సెక్షన్ 144 అమలులో ఉండటంతో పాదయాత్రను నిరాకరించినట్టు తెలిపారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు వినిపించుకోకుండా ఓవరాక్షన్ చేశారు. -
స్టేజీల మీద, లారీల మీద రంకెలా? పవన్‌కు డిప్యూటీ సీఎం కొట్టు స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, తాడేపల్లిగూడెం: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే కాపు సామాజిక వర్గం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో స్నేహం కారణంగా పవన్ మతిపోయిందని, టీడీపీ వాళ్లు రాసి ఇచ్చిన డైలాగులు, కిరాయి ఇచ్చిన వాళ్ళ స్క్రిప్ట్‌లు రెచ్చగొట్టే రీతిలో చదివేస్తే కుదరదని స్పష్టం చేశారు కొట్టు సత్యనారాయణ. పవన్ ను చూస్తే జాలేస్తుందని, కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడను పవన్ అగౌరవపరిచాడన్నారు. "హలో ఏపీ అంటే వీళ్లు తెలంగాణలో ఉన్నారు కాబట్టి బైబై చెప్పినట్టా? - బాబు, పవన్ తెలంగాణ వెళ్లిపోతున్నామని బైబై చెప్పినట్టు ఉంది. నిన్న అమలాపురంలో కిరాయి తీసుకున్న వ్యక్తి, కిరాయి ఇచ్చిన వ్యక్తి చెప్పిన మాటలు సినీ ఫక్కీలో చెప్పారు. ప్రజలు నవ్వుకుంటున్నారు. సిగ్గు శరం వదిలేసారా? ఏది పడితే అది మాట్లాడేస్తారా.." అంటూ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు మంత్రి కొట్టు సత్యనారాయణ చంద్రబాబు ఈ శతాబ్ధపు డర్టీ పొలిటీషియన్‌గా అభివర్ణించిన మంత్రి కొట్టు.. హరిరామ జోగయ్య వయసు మీద పడి మాట్లాడుతున్నారన్నారు. నాలుగు దశాబ్దాల నుంచి చంద్రబాబు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాడని, కేవలం తన వర్గ ప్రయోజనాల కోసమే చంద్రబాబు పనిచేస్తాడన్నారు. వెన్నుపోటు, మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. చంద్రబాబుని ప్రజలు రాజకీయ సమాధి చేసినా.. పైకి కనబడే ఆ తలతోనే, పచ్చ మీడియా సపోర్ట్‌తో ఈ నాలుగేళ్లుగా దుష్ప్రచారం చేస్తూ రచ్చ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: కాకినాడ, పిఠాపురం.. పోటీకి సిద్ధమా? పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా.. అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి లిస్టు ప్రకారం వారి దగ్గర చదివి ఇంకా ఏమైనా ఫిర్యాదులు ఉంటే తీసుకుని పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, మండలానికి సంబంధించి 2 టీమ్‌లు, పట్టణానికి సంబంధించి 3 టీమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, 30 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి 7 రోజులు ఫిర్యాదులు సేకరించడం జరుగుతుందని, క్షేత్ర స్థాయిలో ఏదేని కారణం చేత ప్రజలకు సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సీఎం జగన్ పరిపాలనలో రూ. 2,16,000 వేల కోట్ల డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సక్షన్ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందచేశామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. -
చంద్రబాబు యాత్రకు కొనసాగుతున్న నిరసనలు
-
బాణసంచా పేలి ముగ్గురు మృతి
తాడేపల్లిగూడెం/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మరణించాడు. 80 శాతం గాయాలపాలైన మరొక వ్యక్తిని మెరుగైన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. గ్రామంలోని రాజం చెరువు సమీపంలో ఉన్న ఈ కేంద్రంలో బాణసంచాను ఓ వాహనంలోకి లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో ఒక మహిళ వంట చేసుకోవడానికి ఇంటికి వెళ్లడంతో.. అలాగే మరొకతను టిఫిన్ తేవడానికి వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు.ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల శరీర భాగాలు తునాతునకలై చెల్లాచెదురయ్యాయి. వీరి వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్ర గాయాలపాలైన ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన యాళ్ల ప్రసాద్(28), అనంతపల్లి గ్రామానికి చెందిన ఆరేపల్లి సోలోమన్రాజులను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే యాళ్ల ప్రసాద్ చనిపోయాడు. సోలోమన్‌రాజు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరానికి తరలించారు. గూడెం పరిసర ప్రాంతాల్లోని అనంతపల్లి, జగ్గన్నపేట, అల్లంపురం, కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఈ బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేయడానికి వస్తున్నారు. తయారీ కేంద్ర నిర్వాహకుడుగా చెబుతున్న పండూరి అన్నవరం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనా స్థలాన్ని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, ఏలూరు ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఘటనా స్థలాన్ని సందర్శించారు సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇది దురదృష్టకరమైన సంఘటన అని చెప్పారు. తాను గడపగడపకు కార్యక్రమంలో ఉండగా సమాచారం తెలిసిందని.. వెంటనే అధికారులను హుటాహుటిన ఘటనాస్థలానికి పంపించి సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని.. క్షతగాత్రులకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. పరిమితికి మించి బాణసంచాను నిల్వ చేయడమే భారీ పేలుడుకు కారణమైందా అనే కోణంలో కేసును విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: ('చంద్రబాబు దోచుకున్న వాటితో పోలిస్తే ఇవి చాలా తక్కువే') -
బ్లాక్ రైస్ సాగులో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. యువరైతు సక్సెస్ ఫార్ములా ఇదే!
నేటి యువతరం కంప్యూటర్ కోర్సులు నేర్చుకుని ఉన్నతమైన ఉద్యోగం, వేతనాలతో ఆధునిక జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. అదేబాటలో పయనిస్తూ ఫైన్ ఆర్ట్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడిన యువ రైతు విష్ణుమూడి శశికాంత్ కోవిడ్ వల్ల వచ్చిన స్వల్ప విరామం సమయంలో వ్యవసాయంపై ఆసక్తి చూపారు. బ్లాక్ రైస్, సుగర్ ఫ్రీ రైస్, బాస్మతీ రకాలను తనకున్న సొంత క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడమే కాక అధిక దిగుబడులను సాధించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. తాడేపల్లిగూడెం రూరల్: కోవిడ్ మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెనుమార్పులను తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ వైరస్ బారిన పడ్డ వారు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెం గ్రామానికి చెందిన విష్ణుమూడి శశికాంత్ కుటుంబీకులు కోవిడ్ బారిన కోలుకోవడంతో వైద్యుల సూచన పోషకాలతో కూడిన ఆహారంపై దృష్టి సారించారు. శశికాంత్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా, కోవిడ్ సంక్షోభంలో సాఫ్ట్వేర్ రంగంలో కొంత విరామం రావడం వంటి కారణాలతో తనకున్న భూమిలోనే ప్రయోగాత్మకంగా పోషకాలతో కూడిన బ్లాక్ రైస్ సాగుపై మక్కువ చూపారు. బ్లాక్ రైస్‌లో ప్రోటీన్లు 8.16 శాతం, కొవ్వు శాతం 0.07 శాతం, బార్లీ, గోధుమల్లో లభించే గ్లూటన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని అందించడంలో ఎంతగానో ఉపకరిస్తాయి. వీటన్నింటిని గ్రహించిన శశికాంత్ బ్లాక్ రైస్ సీడ్‌ను వరంగల్ నుంచి తీసుకువచ్చి తనకున్న ఐదెకరాల విస్తీర్ణంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా బ్లాక్ రైస్ సాగు చేపట్టారు. అందులో పురుగుమందులు వినియోగించుకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడమే కాక ఎకరాకు 25 నుంచి 30 బస్తాల వరకు నాణ్యమైన దిగుబడి సాధించారు. ప్రస్తుతం ఎకరం విస్తీర్ణంలో బ్లాక్‌రైస్‌ను సాగు చేస్తున్నారు. వీటితో పాటు బాస్మతీ రైస్, సుగర్ ఫ్రీ (బీపీటీ 5420) రైస్‌ను అరెకరం చొప్పున విస్తీర్ణంలో సాగు చేశారు. బాస్మతీ రైస్ 20 బస్తాలు, సుగర్ ఫ్రీ రైస్ 25 బస్తాలు దిగుబడి లభించాయి. పశువుల వ్యర్థాలే ఎరువు పశువుల, జీవాల విసర్జిత మల, మూత్రం, వేప పొడి వంటి వాటితో ఎరువును తయారు చేసి చేనుకు అందించడం ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించారు. తద్వారా ఎరువుల ఖర్చులను దాదాపు తగ్గించుకున్నారు. రైతుకు ప్రధానంగా నష్టం చేకూర్చేది తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు. అటువంటి వాటిని సైతం దీటుగా ఎదుర్కొని నిలబడగలిగే వరి వంగడంగా ఆయన పేర్కొన్నారు. బ్లాక్ రైస్ సాగు చేపట్టిన రైతు గుండెలపై చేయి వేసుకుని ప్రశాంతంగా ఉండవచ్చని భరోసానిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు ఆదాయం బ్లాక్ రైస్‌ను తమ ఇంటి అవసరాలకు, బంధువులకు సరఫరా చేయగా, మిగిలిన వాటిని 25 కిలోల బస్తాకు రూ.3 వేలు, సుగర్ ఫ్రీ రైస్ బస్తాకు రూ.1500లకు విక్రయించారు. ఒక పక్క ఆరోగ్యం, మరో పక్క ఆదాయం కూడా బాగుందని శశికాంత్ చెబుతున్నారు. ఒత్తిడి లేని వ్యవసాయమే లక్ష్యం ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయం చేయడం అంటే ఇష్టం. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల బెడద లేకుండా ఎటువంటి ఒత్తిడి లేని వ్యవసాయాన్ని రైతుకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. వ్యవసాయ యంత్ర పరికరాలను తయారు చేసుకోవాలని భావిస్తున్నా. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో 680 రకాల రైస్ బ్రాండ్స్ ఉన్నాయి. వాటిలో మేలైన రకాలు సాగు చేపట్టి సత్ఫలితాలు సాధించాలన్నదే నా లక్ష్యం. – విష్ణుమూడి శశికాంత్, యువ రైతు, మెట్ట ఉప్పరగూడెం, తాడేపల్లిగూడెం మండలం -
ఫేక్ పాదయాత్రపై తాడేపల్లిగూడెం వాసుల ఆగ్రహం
-
NIT Tadepalligudem: క్యాంపస్ ప్లేస్మెంట్లో నిట్ విద్యార్థుల సత్తా
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): క్యాంపస్ ప్లేస్మెంట్లలో నిట్ 2018–22 బ్యాచ్ విద్యార్థుల్లో 97.19 శాతం మంది ఉద్యోగాలు సాధించారు. సీఎస్ఈ విద్యార్థిని సూరపరాజు సాయి కీర్తన అమెజాన్‌లో రూ. 47.3 లక్షల వేతనం పొందగా.. ఈఈఈ విద్యార్థిని ఊర్వశి డాంగ్ అమెజాన్‌లో రూ. 47.3 లక్షల వేతనం అందుకోనున్నారు. సీఎస్ఈ విద్యార్థి కేతన్ బన్సాల్ స్కైలార్క్ ల్యాబ్స్‌లో రూ. 37.8 లక్షల వేతనం, అదే గ్రూపునకు చెందిన గాదె అశ్రితరెడ్డి అమెజాన్‌లో రూ.37 లక్షల వేతనంతో ఉద్యోగం పొందారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ప్రత్యేక కృషితో మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించారు. దేశంలోని 31 నిట్‌లలో క్యాంపస్ ప్లేస్మెంట్ విషయంలో ఏపీ నిట్ సత్తా చాటింది. ఈ బ్యాచ్‌లో 511 మంది 262 కంపెనీలు జరిపిన ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు పొందారు. (క్లిక్ చేయండి: ఒకేసారి డబుల్ డిగ్రీలు.. యూజీసీ మార్గదర్శకాలు ఇవే..) -
అమరావతి రైతుల పాదయాత్రకు తాడేపల్లిగూడెంలో నిరసన సెగ
-
పాదయాత్రకు నిరసన సెగ.. ఫేక్ యాత్రికులారా గో బ్యాక్..
సాక్షి, పశ్చిమగోదావరి: అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. తాడేపల్లిగూడెంలో పాదయాత్రను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. గో బ్యాక్ ఫేక్ యాత్రికులంటూ ఫ్లైక్సీలు ఏర్పాటయ్యాయి. రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్రా స్టేట్ ముద్దు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. బ్లాక్ బెలూన్స్ కూడా ఎగరవేశారు. చదవండి: ‘దుష్ట చతుష్టయం కోసం.. రియల్ ఎస్టేటే చంద్రబాబు ఆలోచన’ సీఎం జగన్‌ది స్టేట్ గురించి ఆలోచన.. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ గురించి ఆలోచన అంటూ ఫ్లైక్సీలపై స్లోగన్స్ ఉన్నాయి. సీఎం జగన్‌ది అభివృద్ధి మంత్రం, చంద్రబాబుది రాజకీయ కుతంత్రం. రాష్ట్రం కోసం సీఎం జగన్ ఆరాటం. 26 గ్రామాల కోసం బాబు నకిలీ పోరాటమంటూ ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. -
ద్వారకాతిరుమల కొండపై టోల్ మాయాజాలం!
ద్వారకాతిరుమల: చినవెంకన్న కొండపైకి వెళ్లే దేవస్థానం టోల్ గేట్ రుసుం కాంట్రాక్టర్ అవసరాలకు అనుగుణంగా మారిపోతోంది. దాంతో క్షేత్రానికి వివిధ వాహనాలపై వచ్చే భక్తులు అయోమయానికి గురవుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఉన్న అధిక ధరలు.. ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గిపోయాయి. ఈ మార్పు వెనుక అసలు నిజాలు తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ద్వారకాతిరుమల క్షేత్రంలో టోల్ రుసుం వసూల్లో అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. భక్తుల వాహనాల నుంచి టోల్ రుసుం వసూలు చేసుకునే హక్కుకు దేవస్థానం 2020 జనవరి 27న బహిరంగ వేలంపాట, సీల్డ్ టెండర్ నిర్వహించింది. బహిరంగ వేలంలో 9 మంది టెండర్‌దారులు పాల్గొనగా, సీల్డ్ టెండర్ ద్వారా వచ్చిన రూ. 1,30,56,777ల హెచ్చుపాటను అధికారులు ఆమోదించారు. అసలు షరతులు ఇవీ.. టెండర్ షరతుల ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్ లారీ, బస్సు, ఇతర భారీ వాహనాలకు రూ.150, మినీ బస్సు, 407 వ్యాన్ స్వరాజ్, మజ్దూర్‌కు రూ.100, ట్రాక్టరు ట్రక్కుతో రూ. 50, ట్రక్కు ఆటో, తుఫాన్, టాటా ఏస్‌కు రూ.50, ట్రాక్టరు ఇంజనుకు రూ.50, కారు, జీపు, వ్యాన్‌కు రూ.30, స్కూటర్, మోటారు సైకిల్‌కు రూ.10, పాసింజర్ ఆటోకు రూ.10 వసూలు చేసుకోవాల్సి ఉంది. సదరు కాంట్రాక్టర్ కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో టోల్గేట్ నిర్వహణను వెంటనే చేపట్టలేదు. టోల్ వసూలు బాధ్యతను వెంటనే చేపట్టకపోవడంతో 2021 అక్టోబర్ 14 వరకు దేవస్థానమే సొంతంగా టోల్ వసూలు చేసింది. మధ్యలో 2021 ఆగస్టు 14న కారు, జీపు, వ్యాను ధరను రూ. 30 నుంచి రూ. 50, ఆటో ధరను రూ. 10 నుంచి రూ. 25కు పెంచుతూ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానం దేవస్థానం వరకూ మాత్రమే వర్తిస్తుంది. మధ్యలో టోల్ రుసుం వసూలు బాధ్యతను 2021 అక్టోబర్ 15న మళ్లీ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అతను పాట సందర్భంగా ఇచ్చిన ధరలకే వసూలు చేయాలని అయితే ఈ ఏడాది కాలంగా పెంచిన ధరలను వసూలు చేస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టరుతో అప్పటి అధికారులు, కొందరు సిబ్బంది కుమ్మకై ధర్మకర్తల మండలి సమావేశంలో చేసిన తీర్మానాన్ని అనుకూలంగా మార్చుకుని, సొమ్ము చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా తగ్గిన టోల్ ధరలు టోల్ వ్యవహారం ముదరడంతో దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు దానిపై దృష్టి సారించారు. దాంతో సంబంధిత కాంట్రాక్టర్ పెంచిన ధరలను తగ్గించి, టెండర్ షరతుల్లోని టోల్ ధరలనే వసూలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాన టోల్ గేటు వద్ద ఉన్న ధరల పట్టికను మార్పు చేసిన సిబ్బంది, దొరసానిపాడు, శివాలయం రోడ్లలోని టోల్గేట్లు వద్ద ఉన్న ధరల పట్టికలను మాత్రం మార్చలేదు. అయితే సుమారు ఏడాది పాటు వసూలు చేసిన అధిక ధరల సంగతేంటి.? వాటిని కాంట్రాక్టరు నుంచి రికవరీ చేస్తారా.? అలాగే కాంట్రాక్టరుకు లబ్ది చేకూర్చేలా, శ్రీవారి ఆదాయానికి గండిపడేలా చేసిన సంబంధిత అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు చేపడతారా.? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టరుకి నోటీసులిచ్చాం దీనిపై ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు వివరణ ఇస్తూ తీర్మానాన్ని అడ్డంపెట్టుకుని కాంట్రాక్టర్ ఇప్పటి వరకు భక్తుల నుంచి అధిక ధరలను వసూలు చేసినట్టు గుర్తించామన్నారు. ఇలా వసూలు చేసిన అదనపు సొమ్ము రూ. 27 లక్షలను తిరిగి దేవస్థానానికి చెల్లించాలని సంబంధిత కాంట్రాక్టరుకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు ఈఓ తెలిపారు. ఈ వ్యవహారంలో సంబంధిత ఉద్యోగులపై సైతం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కుమ్మక్కయ్యారు బహిరంగ వేలం పాట, సీల్ టెండర్ నిర్వహించిన సమయంలో టోల్ వసూల ధరలు తక్కువగా ఉన్నాయి. అందుకే ఎక్కువ ధరకు పాడలేకపోయాం. ఇలా ధరలను పెంచి ఇస్తామని ముందే చెబితే ఎక్కువ ధరకు పాడేవాళ్లం. స్వామివారికి ఆదాయం కూడా మరింత పెరిగేది. కాంట్రాక్టరుతో అధికారులు కుమ్మకై ఇష్టానుసారం ధరలు పెంచి, భక్తుల జేబులకు చిల్లు పెట్టారు. ఇది చాలా దారుణం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. – జంగా వెంకట కృష్ణారెడ్డి, వ్యాపారి ,ద్వారకాతిరుమల, -
భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉంటా..
తాడేపల్లిగూడెం: భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉంటా.. పదవికి వన్నె తెస్తానని డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా బుధవారం ఆయన పట్టణానికి వచ్చారు. నియోజకవర్గంలో అభిమానులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లిగూడెంలోని పోలీసు ఐలాండ్ సెంటర్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై అభిమానం, తనపై నమ్మకంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురుతర బాధ్యత అప్పగించారని, పారదర్శకంగా పనిచేసి పదవికి వన్నె తెస్తానన్నారు. ఆలయాల్లో రాజకీయాలు చేసే పార్టీలకు గుణపాఠం చెప్పడంతో పాటు ధర్మాన్ని కాపాడాలన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం ఆలయాల్లో రాజకీయాలు చేస్తున్నాయని ఇది దుర్మార్గం అని అన్నారు. హిందూ ధర్మంపై విశ్వాసం పెంచేలా.. ప్రతిఒక్కరిలో దైవభక్తి, హిందూధర్మంపై విశ్వాసం పెంచేలా కృషిచేస్తానని డిప్యూటీ సీఎం కొట్టు అన్నారు. దేవుడిని ప్రజలకు దగ్గర చేయాలనే ప్రభుత్వ ఉద్దేశా న్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తానన్నారు. దేవదాయ శాఖను అత్యంత విశ్వసనీయ శాఖగా మారుస్తానన్నారు. మంత్రివర్గంలో స్థానంతో పాటు తనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన గౌరవంగా భావించాలన్నారు. కాపులకు సముచిత స్థానం కాపు సామాజికవర్గానికి ముఖ్యమంత్రి సముచిత స్థానం ఇస్తున్నారని, దీనిని అందరూ గమనించాలని డిప్యూటీ సీఎం కొట్టు అన్నారు. కాపులకు గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల దుష్ప్రచారం, దుర్మార్గపు ఆలోచనలు ప్రజలు గుర్తించాలని కోరారు. పేదలకు న్యాయం చేస్తామని చెప్పిన కమ్యూనిస్టు పార్టీలు సైతం ప్రజాద్వేషానికి గురవుతున్నాయన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో తాడేపల్లిగూడెం ప్రాంత అభివృద్ధికి కృషిచేశారని, ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి కూడా ఇక్కడి వారిపై ప్రేమ చూపించడం ఆనందంగా ఉందన్నారు. 2024 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీని గెలిపించి ముఖ్యమంత్రికి కా నుకగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అపూర్వ స్వాగతం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విజయవాడ నుంచి ఉంగుటూరు మండలం పట్టంపాడులోని ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేసిన అనంతరం ఊరేగింపుగా బయలుదేరారు. తాడేపల్లిగూడెం మండలం ముత్యాలంబపురంలోని ము త్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం భారీ ర్యాలీతో పట్టణ వీధుల్లో ఊరేగారు. కార్యకర్తలు, అభిమానులు క్రేన్ సాయంతో గజమాల వేసి అభిమానం చాటుకున్నారు. -
ఎలాంటి బాధా లేకుండా చనిపోవడం ఎలా అని చర్చ..?.. అంతలోనే
సాక్షి, తాడేపల్లిగూడెం: మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య పశ్చిమగోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో గల ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో గత నెల 18న అల్లంశెట్టి రవితేజ (19) మెకానికల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరాడు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయునిపాలేనికి చెందిన రవితేజ టెక్కలిలో డిప్లొమా పూర్తి చేశాడు. ఇటీవల సంక్రాంతి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లిన రవితేజ వారం రోజుల క్రితం కళాశాలకు వచ్చాడు. అప్పటి నుంచి ఎలాంటి బాధా లేకుండా చనిపోవడం ఎలా అంటూ సహచర విద్యార్థులతో చర్చించాడు. సోమవారం ఉదయం నలతగా ఉండటంతో తల్లి అనుమతి మేరకు కళాశాల హాస్టల్లోనే ఉండిపోయాడు. అదే రూమ్‌లో ఉంటున్న నితిన్, వీరాస్వామి తమ రోజువారీ తరగతులకు హాజరయ్యారు. మధ్యాహ్నం 11.50 గంటల ప్రాంతంలో సహచర మిత్రుడు వీరాస్వామితో పాటు మరో నలుగురి సెల్ఫోన్లకు ‘మీకు సర్ప్రైజ్ ఇస్తున్నా.. నేను చనిపోవాలనుకుంటున్నా..’ అంటూ టెక్ట్స్ మెసేజ్‌ను రవితేజ పోస్టు చేశాడు. దీంతో వీరాస్వామి అతని తల్లికి ఫోన్‌చేసి మాట్లాడగా, సెలవు పెట్టి రూమ్‌లోనే ఉన్నాడని చెప్పారు. అనంతరం సహచర విద్యార్థులు, సీనియర్లతో కలిసి రవితేజ ఉన్న రూమ్ వద్దకు వెళ్లి చూశారు. చదవండి: (‘నాన్న, చెల్లి శ్రావణి నన్ను క్షమించండి.. భరించడం నా వల్ల అవ్వట్లేదు’) రెండు వైపులా తలుపులు వేసి ఉండటంతో విద్యార్థులు రూమ్ బద్దలుకొట్టి లోనికి ప్రవేశించారు. అప్పటికే ఫ్యాన్‌కు నైలాన్ తాడుతో ఉరివేసుకుని వేలాడుతున్న రవితేజను సహచర విద్యార్థులు, సిబ్బంది సహకారంతో తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రూరల్ సీఐ వి.రవికుమార్, ఎస్సై ఎన్.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సహచర విద్యార్థులు స్పందిస్తూ బాధ లేకుండా చనిపోవడం ఎలా అనే విషయమై చర్చిస్తే తాము సాధారణంగా తీసుకున్నామని, ఇలా ప్రాణాలు తీసుకుంటాడనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేశవరాయునిపాలెంలో విషాదం ►గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు లావేరు: కేశవరాయునిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి అల్లంశెట్టి రవితేజ (19) పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు అక్కడ నుంచి సమాచారం రావడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. చదవండి: (ఒకరు బీటెక్, మరొకరు బీఎస్సీ.. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. ఏ కష్టమొచ్చిందో.!) కుటుంబ నేపథ్యం.. రేషన్ డిపో డీలరైన అల్లంశెట్టి సూరిబాబు, రాణిప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయితేజ రాజాంలోని జీఎంఆర్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతుండగా.. చిన్న కుమారుడైన రవితేజ తాడేపల్లిగూడేంలోని ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ద్వితీయ సంవత్సరం చదువుతూ అక్కడే వసతి గృహంలో ఉంటున్నాడు. సంక్రాంతి పండగకు స్వగ్రామానికి వచ్చిన రవితేజ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులుతో సరదాగా గడిపి.. తిరిగి జనవరి 18వ తేదీన తాడేపల్లిగూడేం వెళ్లిపోయాడు. రోజూ రెండుసార్లు తమకు ఫోన్ చేసి సరదాగా మాట్లాడేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. సోమవారం ఉదయం తల్లి రాణిప్రమీలకు ఫోన్ చేసి ఒంట్లో నీరసంగా ఉందని కాలేజీకి వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోతున్నానని రవితేజ చెప్పాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కాలేజీ యాజమాన్యం నుంచి రవితేజ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి రాణిప్రమీలాకు ఫోన్ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. కొద్దిసేపటి తరువాత కోలుకున్న తల్లిదండ్రులు సూరిబాబు, రాణీప్రమీల, కుటుంబ సభ్యులు, కొందరు గ్రామస్తులు బయలుదేరి తాడేపల్లిగూడేం వెళ్లారు. చిన్నతనం నుంచి రవితేజ బాగా చదివేవాడని స్థానికులు చెబుతున్నారు. అందరితో ఎంతో సన్నిహితంగా ఉండేవాడంటున్నారు. లావేరు మండల వైస్ ఎంపీపీ అలుపున రమణమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు నాయని మోహనరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలుపున గోవిందరెడ్డి, సర్పంచ్ యాగాటి ఆదినారాయణ, మాజీ సర్పంచ్ నాయని వెంకటేష్ తదితరులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
కన్న తండ్రి పైశాచికత్వం! కూతురిపై లైంగికదాడి.. అడ్డొచ్చినవారిని సైతం
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): తండ్రే కామాంధుడై తన కన్న కూతురిపై లైంగికదాడి చేస్తూ అడ్డువచ్చిన వారిని చితకబాదిన సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ నుంచి 12 సంవత్సరాల కిందట వలస వచ్చిన ఓ కుటుంబం తాడేపల్లి మహానాడు ప్రాంతంలో నివాసముంటుంది. బాలిక తండ్రి సీలింగ్ పనిచేస్తుండగా తల్లి తన ఐదురుగు పిల్లల ఆలనా పాలనా చూస్తూ ఇంట్లోనే నివాసముంటోంది. మద్యానికి బానిసైన ఆ తండ్రి సంవత్సర కాలం కిందట తన రెండవ సంతానమైన 11 సంవత్సరాల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కన్న కూతురు తన తండ్రి చేసిన పనిని తల్లికి చెప్పుకోవడంతో ఆమె బంధువులతో కలసి అతడ్ని నిలదీసింది. బంధువుల సమక్షంలో భార్య కాళ్లు పట్టుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తిరిగి బుధవారం ఆ కామంధుడు తన కూతురుపై లైంగికదాడి చేయడంతో ఆ తల్లి తన ఐదుగురు సంతానాన్ని తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు కృష్ణానదికి వెళ్లింది. బంధువులు ఆమె ప్రయత్నాన్ని ఆపి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అత్యాచారం చేసిన అనంతరం ఆ కామాంధుడు పారిపోయాడు. కామాంధుడు గతంలో తన తల్లిపై కూడా లైంగికదాడికి యత్నించినట్లు తెలిసింది. చదవండి: బాబోయ్ ప్రైవేట్ ట్రావెల్స్.. అడ్డంగా దోచేస్తున్నారు -
AP: 13 వరకు ఇంటర్ పరీక్ష ఫీజు గడువు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ మార్చి–2022 పబ్లిక్ పరీక్షలకు ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలై మళ్లీ పరీక్షలకు హాజరవ్వాలనుకొనే విద్యార్థులు డిసెంబర్ 13వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరి బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఫీజుల వివరాలతో మంగళవారం బోర్డు ప్రకటన జారీ చేసింది. ఆలస్య రుసుములతో 2022 జనవరి 20 వరకు గడువు ఉందని పేర్కొంది. ఆలస్య రుసుము రూ.120తో డిసెంబర్ 23, రూ.500తో డిసెంబర్ 30, రూ.1,000తో 2022 జనవరి 4, రూ.2 వేలతో జనవరి 10, రూ.3 వేలతో జనవరి 17, రూ.5 వేలతో జనవరి 20 వరకు పరీక్ష ఫీజులను చెల్లించవచ్చునని వివరించింది. దరఖాస్తు రుసుము, పరీక్షలకు సంబంధించి ఫీజులను (పేపర్ల వారీగా, సంవత్సరాల వారీగా), ఇతర అంశాలను సర్క్యులర్‌లో పొందుపరిచింది. (చదవండి: ఏపీ నీట్ ర్యాంక్‌లు విడుదల) పీహెచ్డీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం సాక్షి, తాడేపల్లిగూడెం: పీహెచ్డీ పార్ట్‌టైం, ఫుల్‌టైం కోర్సులు, ఎంఎస్ (బై రీసెర్చ్) కోర్సుల్లో చేరడానికి ఏపీ నిట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 2021 సెషన్‌కు సంబంధించి అర్హులైన వారిని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులకు డిసెంబర్ 4 వరకు గడువు ఉన్నట్లు నిట్ అధికారులు మంగళవారం తెలిపారు. పార్ట్‌టైం కోర్సులో 148 సీట్లు, ఫుల్‌టైం కోర్సులో 144 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారిని రాతపరీక్ష, ఇంటర్వ్యూ పద్ధతుల్లో ఎంపిక చేయనున్నారు. మరిన్ని వివరాలు www.nitandhra.ac.in/main/లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. -
గేటు దాటకుండానే ఆఫర్ లెటర్లు.. అమెజాన్‌లో ముగ్గురికి రూ.32 లక్షల జీతం
సాక్షి, తాడేపల్లిగూడెం: నిట్ విద్యార్థులు జాక్‌పాట్ కొట్టారు. మల్టీ నేషనల్ కంపెనీల్లో లక్షల్లో వేతనాలతో లక్కీచాన్స్ కొట్టేశారు. ఇంకా నిట్ గేటు దాటకుండానే ఆఫర్లు లెటర్లు అరచేతిలోకి వస్తున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలు(ఎంఎన్సీ) ఏపీ నిట్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి క్యూ కడుతున్నాయి. 2018–22 బ్యాచ్‌లో అప్పుడే 170 మందికి ఆఫర్ లెటర్లు వచ్చాయి. ఏడాది వేతనం కనిష్టగా 7.8 లక్షలు కాగా.. గరిష్టంగా రూ.26 లక్షలు పొందారు. 2017–21 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు అమెజాన్ కంపెనీలో ఏడాదికి రూ. 32 లక్షల ప్యాకేజీతో అదుర్స్ అనిపించారు. దీంతో ఆరేళ్ల క్రితం నిట్ ఏర్పాటైప్పుడు ఎంఎన్సీలకు నిట్‌పై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. కొత్త నిట్‌లో ల్యాబ్‌లు సరిగా ఉండవు, విద్యా బోధన ఎలా ఉంటుందో అన్న అనుమానంతో క్యాంపస్ ఇంటర్వూ్యలపై వెనకడుగు వేశారు. అయితే ఏపి నిట్ విద్యార్థులు తమ టాలెంట్‌తో ఆ సందిగ్ధతకు చెక్ పెట్టారు. 80 శాతానికి పైగా విద్యార్థులకు ఆఫర్ లెటర్లు ఏడాది వేతనంగా కనీసం రూ.3.5 లక్షలు, గరిష్టంగా రూ.6 లక్షల ప్యాకేజ్ పొందడమంటే జాక్‌పాట్‌గా విద్యార్థులు భావించేవారు. ఇప్పుడు భారీ వేతనాల తో ఆఫర్లు రావడంతో నిట్‌లో చదివేందుకు క్రేజ్ పెరగుతోంది. నిట్‌లో ప్లేస్‌మెంటు, ట్రైనింగ్ సెల్ శిక్షణ ఫలవంతమైంది. నిట్ డైరెక్టర్ అండ్ టీమ్ కృషి ఫలి తాలనిస్తుంది. బయటకు వచ్చే బ్యాచ్‌ల్లోని విద్యార్థుల్లో అర్హత సాధించిన వారిలో దాదాపు 80 శాతానికి పైగా విద్యార్థులకు ఆఫర్ లెటర్లు వస్తున్నాయి. వేతనాలు కూడా ఊహించని రీతిలో ఉన్నాయి. నిట్ నుంచి ఇంతవరకూ మూడు బ్యాచ్‌ల విద్యార్థులు బయటకు వచ్చారు. వారిలో 895 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2015–21 విద్యా సంవత్సరం వరకు మూడు బ్యాచ్‌లు బయటకు వచ్చాయి. చదవండి: (Rakesh Jhunjhunwala: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..) క్యూ కడుతున్న కంపెనీలు తాడేపల్లిగూడెం నిట్‌లో క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించేందుకు ఎంఎన్సీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇన్ఫోసిస్, అడట్రాన్, ఫానాటిక్స్, ఫ్యాక్ట్‌సెట్, టీసీఎస్, ఎల్అండ్టీ, మోడక్ ఎనలిటిక్స్, ఇన్ఫో ఎడ్జ్, కిక్ డ్రమ్, కాగ్నిజెంట్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహిస్తున్నాయి. ►2015–19 బ్యాచ్‌లో ఉద్యోగాలు పొందినవారు –282 ►2016–20 బ్యాచ్‌లో ఉద్యోగాలు పొందినవారు –303 ►2017–21– బ్యాచ్‌లో ఉద్యోగాలు పొందినవారు –310 ►2018–22 బ్యాచ్‌లో 170 మందికి ఇంతవరకూ ఆఫర్ లెటర్లు వచ్చాయి. -
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రెండో విడత ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది జనవరి 9వ తేదీన తొలి విడత జగనన్న అమ్మ ఒడి పథకం అమలు చేశారు. వరుసగా రెండో విడత మళ్లీ వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన జగనన్న అమ్మ ఒడి పథకం కింద అర్హులైన తల్లులకు రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గ సమావేశంలో అమోదించనున్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించడంతో పాటు.. పేద వర్గాల పిల్లలను పనులకు పంపకుండా బడికి పంపేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే సంక్రాంతికి ముందే వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ఆర్థిక సాయం అందించడంపై మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తారు. నియోజవర్గాల్లో పశువుల ఆరోగ్య పరీక్షల ల్యాబ్‌లు ఏర్పాటుతో పాటు పలు అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములిచ్చిన వారిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. ఆమోదించనున్న అంశాలు: ►ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీని ఆమోదించనున్న కేబినెట్ ►6 జిల్లాల్లో వాటర్షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు ఆమోదం తెలపనున్న కేబినెట్ ►ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్ ►సర్వే అండ్ బౌండరీ చట్ట సవరణకు ఆమోదం తెలపనున్న కేబినెట్ ►రైతు భరోసా మరో విడత చెల్లింపులపై చర్చించే అవకాశం ఉంది. -
మాట వినడం లేదని అత్తను హత్యచేసిన అల్లుడు
సాక్షి, తాడేపల్లిగూడెం అర్బన్: తన మాట వినడం లేదని అత్తను అల్లుడే హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 1న తాడేపల్లిగూడెం 11వ వార్డు చెట్లరోడ్డులో మహిళ మృతి చెందిన సంఘటనపై పోలీసుల దర్యాప్తుతో ఈ విషయం వెలుగుచూసింది. తాడేపల్లిగూడెం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. షేక్ ఉస్మాన్ బాషా తాడేపల్లిగూడెంలో అంబులెన్సులు నడిపేవాడు. అతని అత్త రఫీ ఉన్సీసా ఇద్దరు కుమారులతో తాడేపల్లిగూడెం పట్టణంలోని 8వవార్డులో ఉంటుంది. ఇద్దరు కుమారులు వ్యసనాలకు బానిసలై తల్లిని పట్టించుకునేవారు కాదు. అత్తకున్న ఆస్తిలో కొంత పొలాన్ని అమ్మి డబ్బులిస్తే ఇల్లు కట్టిస్తానని అల్లుడు బాషా తరచూ చెప్పేవాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. తన మాట వినడంలేదని కోపంతో ఆమెను హత్య చేయాలని పథకం వేశాడు. నవంబరు 30న ఆమె చిన్నకొడుకుకు నాటు మందు ఇప్పిస్తానని నమ్మించి అత్త ఉన్నీసాను కారులో ఎక్కించుకుని అనంతపల్లికి తీసుకెళ్లాడు. తిరిగి వెంకట్రామన్నగూడెం తీసుకువచ్చి ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆమెను వదిలి నాటు మందు తీసుకొస్తానని వెళ్లాడు. చీకటిపడే వేళకు వచ్చి అత్తపై స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె మృతి చెందకపోవడంతో ఉన్నీసా ధరించిన చీరను మెడకు బిగించి హత్యచేశాడు. మృతదేహాన్ని కారులోకి చేర్చి తాడేపల్లిగూడెంలోని ఆమె ఉంటున్న ఇంటికి తీసుకొచ్చాడు. చదవండి: ('నన్ను వెతకకండి.. నేను చనిపోతున్నా..’) పోలీసులకు వీఆర్వో సమాచారం తర్వాత రోజు ఉదయం పెద్దకుమారుడు వచ్చి చూసేసరికి తల్లి మృతిచెంది ఉండడాన్ని గమనించాడు. అతను బాషాకు సమాచారం అందించగా.. విషయం పోలీసులకు చెప్పవద్దని కేసు, పోస్టుమార్టం అంటూ ఇబ్బంది పెడతారంటూ ఇద్దరు కుమారులను అంత్యక్రియలకు ఒప్పించాడు. అక్కడి నుంచి అత్త మృతదేహాన్ని తాను అద్దెకుంటున్న ఇంటికి చేర్చాడు. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా విషయం తెలుసుకున్న వీఆర్వో వచ్చి పరిశీలించాడు. హత్య చేసినట్లు ఉందని పోలీసులకు సమాచారం అందించాడు. ఈలోగా బాషా తన కారుతో పరారయ్యాడు. అనుమానం వచ్చిన పోలీసులు బాషా కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ నెల 4న వెంకట్రామన్నగూడెం అడ్డరోడ్డులో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అత్త ఉన్నీసాను తానే హత్యచేసినట్లు అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్లు సీఐ ఆకుల రఘు తెలిపారు. చదవండి: (అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి) -
కొత్త నాటకానికి తెర తీసిన చంద్రబాబు టీమ్
సాక్షి, పశ్చిమగోదావరి : అమరావతి ఉద్యమానికి 200 రోజులు అంటూ చంద్రబాబు నాయుడు టీమ్ కొత్త నాటకానికి తెర తీశారని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నం కార్యానిర్వాహాక రాజధానిగా చేస్తే అభ్యంతరాలు చంద్రబాబు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. శనివారం తాడేపల్లిగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ జరిగితే ప్రజలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చేస్తున్నారన్నారు. గడిచిన 13 నెలల కాలంలో రైతులకు పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ప్రశంసించారు. (చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే) ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ముంగిటకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దత్తు ధరకు ధాన్యాన్ని అమ్ముతున్నది ఒక్క వైఎస్ జగన్ హయాంలోనేనని కొనియాడారు. 50 వేల కుటుంబాలకు అమరావతిలో ఇళ్ళ పట్టాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ సిద్దం చేస్తుందని తెలిపారు. గడిచిన 13 నెలల కాలంలో రాష్ట్రంలో 20లక్షల అదనపు పెన్షన్లు అందించామని, రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అమరావతి ఉద్యమం పెయిడ్ అర్టిస్టులతో నడుస్తున్న ఉద్యమమని, అమరావతి నగర నిర్మాణం రియల్ ఎస్టేట్ కుంభకోణమని వర్ణించారు. (మోకా హత్య కేసు: విస్తుగొలిపే నిజాలు ) రాష్ట్ర ప్రజలందరూ మూడు రాజధానులు కోరుకుంటున్నారని, మూడు రాజధానుల ఏర్పాటు వలన చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. అమరావతి శంఖుస్థాపనకు 400 కోట్లు ఈవెంట్ మెనేజ్మెంట్కు ఇచ్చారని, అమరావతి నగర నిర్మాణం రియల్ ఎస్టేట్ కుంభకోణమని వర్ణించారు. అమరావతి నగర డిజైన్లు పేరిట 700కోట్లు దుర్వినియోగం జరుగుతుందన్నారు. ఎల్లో మీడియా పూర్తిగా పత్రిక విలువులకు తిలోధకాలు ఇచ్చిందని దుయ్యబట్టారు. చంద్రబాబు తన వ్యక్తిగత స్వలాభం కోసం అమరావతి ఉద్యమం పేరిట ప్రజలు భావోద్వేగాలతో చేలగాటం అడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగింపు దశకు చేరుకుందని అన్నారు. (కాపు రిజర్వేషన్లపై సీఎంకు ముద్రగడ లేఖ) -
‘పరోక్షంగా తప్పు ఒప్పుకున్న నిమ్మగడ్డ’
సాక్షి, అమరావతి : ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు ప్రాణ భయం ఉందని కేంద్రానికి లేఖ రాశారంటే తప్పు చేసినట్లు పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొంతమంది ప్రోద్బలంతో ఈసీ కరోనా వైరస్ కారణం చూపించి ఎన్నికలు వాయిదా వేసినా.. సుప్రీంకోర్టు న్యాయబద్దంగా ఎన్నికల కోడ్ ఎత్తివేయడం హర్షణీయమన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి పశ్చిమ గోదావరి జిల్లా తెదేపా మాజీ జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రికి ఏ సామాజిక వర్గం నుంచి కూడా వ్యతిరేఖత లేదని స్పష్టం చేశారు. (సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం ) గడిచిన ప్రభుత్వం హాయాంలో ఒక్క ఎస్టీ వర్గానికి చెందిన మంత్రిని కాని, మైనారిటీ వర్గానికి చెందిన మంత్రిని చేయకుండా ఉన్న పార్టీ తెలుగుదేశం కాదా అని ప్రశ్నించారు. మద్యం సిండికేటు ద్వారా ముళ్ళపూడి బాపిరాజు కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. గ్రామాలను సర్వనాశనం చేశారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పేరుతో ఏర్పాటు చేసి కోట్లాది రూపాయిలు దోచేశారని మండిపడ్డారు. టీడీపికి దమ్ము ధైర్యం ఉంటే ఏ ఒక్క గ్రామంలో అయినా అండర్ గ్రౌండ్ పని చేస్తుందో లేదో చూపించగలరా అని సవాల్ విసిరారు. సంక్షేమ పథకాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొందరికి మింగుడు పడటం లేదని దుయ్యబట్టారు. ‘నిమ్మగడ్డకు ఈసీగా కొనసాగే అర్హత లేదు’ ‘బాపిరాజు గతంలో పోటీ చేసిన మండలంలోనే మరోసారి ఓసీ రిజర్వు అయ్యింది. ఆయన పోటీ చేయాల్సింది. మీ బలమెంతో తెలిసేది కదా. మరెందుకు నామినేషన్ వెయ్యలేదు? ఉగాది నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టాలను అందించేందుకు కృషి చేస్తున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించడం, అవగాహనా ద్వారా వైరస్ భారిన పడకుండా ఉండవచ్చు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. మున్సిపాలిటీ పరిధిలో పరిసర ప్రాంతలు పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపాలిటీ అధికారులు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు పూర్తిగా సహకరించాలి’ అని కొట్టు సత్యానారాయణ పేర్కొన్నారు. (‘రౌడీయిజం చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే ఇంతే’) -
నాపై చేసిన ఆరోపణలు అవాస్తవం: నిట్ డైరెక్టర్
సాక్షి, అమరావతి : మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సి. సూర్య ప్రకాష్ రావు స్పష్టం చేశారు. యూట్యూబ్‌లో వచ్చిన ఫేక్ వీడియో ఆధారంగా పీహెచ్డీ పట్టాలకు అయిదు లక్షలు డిమాండ్ చేసినట్లు, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆదివారం పైడికొండల మాణిక్యాల రావు ఆరోపణలు చేశారు. సోమవారం తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో విలేకరుల సమావేశంలో ఈ విషయంపై సూర్యప్రకాశ్ మాట్లాడుతూ..తమ వాళ్లకు ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇవ్వడం లేదనే దురుద్ధేశంతోని తనను ఉద్యోగం నుంచి తప్పించడానికి బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఓ వీడియోను పూర్తిగా ట్యాపింగ్ చేసి, మాటలను ఎడిట్ చేసి యూట్యూబ్‌లో పెట్టారని విమర్శించారు. ఎవరో చెప్పిన మాటలను, ఎడిట్ చేసిన వీడియోలను నమ్మి మాజీ మంత్రి పైడి కొండల ఇలా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. మీమీద విమర్శలు వస్తున్నాయని తనను పిలిచి అడిగి ఉంటే బాగుండేదన్నారు. ఒకవేళ తన మీద వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే పదవి నుంచి వైదులుగుతానని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్డీకి లేఖ రాశానని తెలిపారు. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఈ వీడియో పంపిస్తున్నట్లు, దీనిపై సైబర్ కక్రైం కేసు పెట్టనున్నట్లు వెల్లడించారు -
వికేంద్రీకరణకు మద్దతుగా మహిళల రిలే నిరాహార దీక్షలు
-
మీడియా ముసుగులో మాఫియా దందా
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : మీడియా ముసుగులో మాఫియా దందా చేస్తున్న నలుగురు జర్నలిస్టులపై తాడేపల్లిగూడెం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ చానళ్లలో జర్నలిస్టులుగా చలామణీ అవుతూ బ్లాక్ మెయిల్, దందాలకు పాల్పడుతున్నారని క్వారీ వ్యాపారి గోపొసెట్టి రమేష్ ఇటీవల తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మైనింగ్ స్క్వాడ్ ఏలూరు నుంచి వచ్చింది. వారంతా ఓ హోటల్లో ఉన్నారు’అంటూ బెదిరించి నగదు వసూళ్లు చేశారని రమేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తమ్మిసెట్టి రంగసురేష్(స్టూడియో.ఎన్), వానపల్లి పుండరీకాక్షుడు(స్టూడియో.ఎన్), మెర్జా. రమేష్(టీవీ9), పెర్దోజు మురళి(ఎన్ టీవీ)లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ రూ.75 వేలకే..
తాడేపల్లిరూరల్: పట్టణ పరిధిలో నివాసం ఉండే ఓ యువకుడు ఓఎల్ఎక్స్ యాప్‌ను నమ్ముకొని నిండా మునిగి లబోదిబోమంటూ ఆదివారం తాడేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి కథనం మేరకు... మహానాడులో నివాసం ఉండే నాగం వెంకటేశ్వరరావు అనే యువకుడు ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్రవాహనం అమ్మకానికి రావడంతో దాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఫొటోతో పాటు అమ్మకందారుని ఫోన్ నెంబర్ 8168232398 కలిగి ఉంది. ఆ వ్యక్తికి ఫోన్ చేయగా తాను ఆర్మీలో విశాఖపట్నంలో పనిచేస్తానని చెప్పాడు. ఇక్కడ నుంచి జమ్మూకాశ్మీర్‌కు బదిలీ అయిందని, అందుకే రూ.2 లక్షల వాహనాన్ని రూ.75 వేలకే అమ్ముతున్నానని నమ్మబలికాడు. మొదట గూగుల్‌పే ద్వారా రూ.5 వేలు నగదు చెల్లించి, విశాఖ వచ్చి వాహనాన్ని చూసుకోవచ్చని చెప్పాడు. నగదు చెల్లించిన తర్వాత ద్విచక్రవాహనం విలువ రూ.89 వేలు ఇస్తే ఇస్తానంటూ చెప్పడంతో, వెంకటేశ్వరరావు నమ్మి మిగతా నగదును కూడా నాలుగు సార్లు గూగుల్‌పేలో చెల్లించాడు. ద్విచక్ర వాహనాన్ని ట్రాన్స్‌పోర్ట్‌లో పంపిస్తానని చెప్పి వారం అవుతున్నా పంపించలేదని, ఆర్మీ అతను ఓఎల్ఎక్స్లో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన లేదని వాపోయాడు. జరిగిన ఘటనపై తాడేపల్లి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, సైబర్‌క్రైమ్ విభాగానికి కేసు అప్పగించారు. -
‘అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి’
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అప్పుడే నగరాలకు వలస వచ్చే వారి సంఖ్య తగ్గుతుంది. ఇటు గ్రామాలు, అటు పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. నేను రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. కేవలం అభివృద్ధి గురించే మాట్లాడుతున్నాను’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నేటి నగరాలకు వలసలు ఎక్కువై మురికివాడలను తలపిస్తున్నాయి అన్నారు. నగరాల అభివృద్ధిలో భాగంగా మురికివాడల్లోని ప్రజలకు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించాలని కోరారు. రాజకీయ వ్యవస్థలో అన్నీ ఉచితంగా ఇస్తామనడం పరిపాటిగా మారిందని, ఇలాంటి పథకాలతో జనాలకు మేలు జరగదన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం యువత కొత్త ఆవిష్కరణలు చేయాలని, వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. నదులకు కూడా మహిళల పేర్లు పెట్టి పూజించే మన దేశంలో నేడు అత్యాచారాలు, హింస వంటివి చోటుచేసుకోవడం శోచనీయమన్నారు. వీటిని అరికట్టేందుకు చట్టాలు తెచ్చినా జనాల మనస్తత్వం మారదన్నారు. ప్రజా జీవనంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచంలో మూడవ బలీయమైన ఆర్థిక శక్తిగా నిలవనుందని ఇటీవల ఆసియా అభివృద్ధి బ్యాంకు చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. ఇంజనీరింగ్ పట్టాలు పొందిన యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లకుండా దేశంలోనే ఉండాలన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త పరిశోధనలకు, ఆవిష్కరణలకు యువత కృషి చేయాలన్నారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఏపీ నిట్‌లో ఇది మర్చిపోలేని రోజన్నారు. చదువును పూర్తిచేసుకుని బయటకు వెళుతున్న విధ్యార్థులు రాష్ట్ర గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటేలా కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఏపీ నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు, రిజిస్ట్రార్ జి.అంబాప్రసాద్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య, గవర్నర్ హరిచందన్ -
‘టెక్నాలజీ పేరుతో అప్పుల భారం మోపారు’
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల పేరుతో దోచుకున్నారని తాడేపల్లి గూడెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. తాడేపల్లి గూడెంలోనూ టీట్కో హౌసింగ్ కట్టించారని.. 300 చదరపు అడుగల ఇంటికోసం ఆరున్నర లక్షలు వసూలు చేశారని ధ్వజమెత్తారు. మూడున్నర లక్షలకు పైగా పేదలను అప్పుల పాలు చేశారన్నారు. చదరపు అడుగు నిర్మాణానికి ఎక్కడైనా వెయ్యి నుంచి 1200 వందలే ఉంటుందన్నారు. టీట్కో హౌసింగ్ లబ్ధిదారులను ఇష్టానుసారంగా ఎంపిక చేశారన్నారు. ఇంటర్నేషనల్ టెక్నాలజీతో నిర్మాణం అన్నారని.. కానీ నిర్మాణంలో అన్నీ అవకతవకలే జరిగాయన్నారు. ప్రతి ఇంటి స్లాబు లీక్ అవుతోందన్నారు. ఇంటర్నేషనల్ టెక్నాలజీ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఆ ఇళ్లలో మురుగు నీరు బయటకు వెళ్లే సదుపాయం కూడా లేదన్నారు. ఇటర్నేషనల్ టెక్నాలజీ పేరుతో పేదలపై అప్పుల భారం మోపారని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో జిల్లా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఉన్న ఏరియా ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లా ఆసుపత్రి ఏర్పాటుతో ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
‘అది మీ తెలివి తక్కువతనం పవన్ కల్యాణ్’
సాక్షి, పశ్చిమగోదావరి: జనసేన.. తెలుగుదేశం పార్టీకి బినామి పార్టీగా మారిందని ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిగూడెంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలందరు సంతోషంగా ఉంటే రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత అయిదేళ్లలో టీడీపీ చేసిన అవినీతి పవన్ కల్యాణ్‌కు కనిపించలేదని, టీడీపీని రక్షించడం కోసం ఆయన పోరాటం చేస్తున్నారే తప్ప కార్మికుల కోసం కాదని వ్యాఖ్యానించారు. రూ. 200 కోట్ల రూపాయిల కార్మికుల నిధిని స్వాహా చేసిన మంత్రిని పక్కన పెట్టుకున్న పవన్.. కార్మికుల కోసం లాంగ్ మార్చ్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ‘ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని వ్యతిరేకించే వ్యక్తులకు అసలు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పడే అవస్థలు తెలుసా? పోటీ పరీక్షలకు తెలుగు విద్యార్థులు పడుతున్న అవస్థలు తెలుసా? కాయకష్టం చేసుకొనే కార్మికులు సైతం తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనే తాపత్రయపడుతున్నారు. మూడేసి పెళ్ళిల్లు చేసు కోవాలని ప్రజలను ఉసిగొలుపుతున్నారా పవన్ కళ్యాణ్?.. జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు చట్ట పరిధిలోకి లోబడి లేకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు సినిమాలో చెప్పినట్టు.. పులి పడుకుంది కదా అని పక్కన నుంచోని ఫోటో తీయడానికి ప్రయత్నించకండి. ఎన్ని చెప్పినా, ఏం అన్నా సీఎం వైఎస్ జగన్ ఊరుకుంటారులే అనుకుంటే అది మీ తెలివి తక్కువతనం పవన్ నాయుడు’ అని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ నిప్పులు చెరిగారు. -
వృద్ధ తల్లిదండ్రులను రాడ్‌తో కొట్టిచంపాడు!
సాక్షి, తాడేపల్లిగూడెం: కన్నకొడుకే యముడయ్యాడు. తల్లిదండ్రులను దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. తాడేపల్లిగూడెం మండలం కడియం గ్రామానికి చెందిన రమేష్.. తల్లిదండ్రులపై దాడి చేశారు. రాడ్డుతో కొట్టి హతమార్చాడు. స్థానికులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ కోసం గాలిస్తున్నారు. కడియం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు-మార్తమ్మ దంపతులకు వీరికి నలుగురు సంతానం. మూడో కుమారుడు రమేష్‌కు 28ఏళ్లు. పెయింటిగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఇతని మానసికపరిస్థితి సరిగా లేకపోవడంతో... పెళ్లి చేస్తే మార్పు వస్తుందని భావించారు. మూకవోలు గ్రామానికి చెందిన మహిళతో ఏడాది క్రితం వివాహం చేశారు. కానీ రమేష్‌లో ఏ మార్పు రాలేదు. దీంతో అతని భార్య వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి తల్లిదండ్రులతోనే ఉంటున్న రమేష్... తరచూ వారితో గొడవపడేవాడని స్థానికులు చెప్తున్నారు. ఈ తెల్లవారుజామున ఇంట్లో నుంచి గట్టిగా కేకలు వినపడడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూశారు. అప్పటికే రమేష్ ఇనుపరాడ్డుతో తల్లిదండ్రుల తలపై గట్టిగా కొట్టేశాడని చెప్తున్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతిచెందారని అంటున్నారు. జనాలను చూసి రమేష్ పరారయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తాడేపల్లిగూడెంలో దారుణం
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని తాడేపల్లిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంటి గోడలు కూల్చివేసిన దుండగులు.. బంగారం, నగదు, విలువైన పత్రాలను దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెం పాత ప్రభుత్వ ఆస్పత్రి సందులోని ఓ ఇంట్లో విజయలక్ష్మి అనే మహిళ అద్దెకు ఉంటున్నారు. శుక్రవారం ఆ ఇంటిపై దుండగులు జేసీబీతో దాడి చేశారు. బిల్డింగ్ ప్రహరీ, ఇంటి లోపలి గోడలు కూల్చివేసిన దుండగలు.. విజయలక్ష్మిని చీరతో కట్టి నిర్బంధించారు. ఇంట్లోని మోటార్, విద్యుత్ మీటర్లను ధ్వంసం చేశారు. ఇంట్లోని బంగారం, నగదుతోపాటు విలువైన పత్రాలు తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై విజయలక్ష్మి తన కూతురు సురేఖతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘మేము 25 ఏళ్లకు పైగా ఈ ఇంట్లో అద్దెకు ఉంటున్నాం. ప్రకాశ్, అవినాశ్‌ల అనుచరులు గురువారం తమ ఇంటిని కూల్చేందుకు యత్నించారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు ప్రకాశ్, అవినాశ్‌లు మళ్లీ వారి అనుచరులను మా ఇంటిపై దాడికి పంపారు. సుమారు నలభై మంది జేసీబీ, కత్తులు, గునపాలు, రాడ్లతో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డార’ని తెలిపారు. అలాగే తాము నివాసం ఉంటున్న ఇంటిని బలవంతంగా అక్రమించుకునే ఉద్దేశంతోనే వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. -
ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి
-
ఆయన వల్లే నటుడిని అయ్యా: చిరంజీవి
సాక్షి, తాడేపల్లిగూడెం : మహానటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఎస్వీఆర్ వంటి గొప్ప నటుడు తెలుగువారు కావడం మన అదృష్టమని, ఆయన నటనే తనకు ప్రేరణ అని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు సెంటర్లో నెలకొల్పిన ఎస్వీ రంగారావు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....‘ నా అభిమాన నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఏడాది క్రితం నన్ను కోరారు. అయితే సైరా సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండటంతో కుదరలేదు. ఇన్నాళ్లకు ఆ అవకాశం లభించింది. ఎస్వీ రంగారావుగారిని చూసే నేను నటుడిని అవ్వాలని మద్రాస్ వెళ్లాను. ఈ రోజు మీ ముందు ఇలా నిలబడగలిగాను. విగ్రహావిష్కరణకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని, చొరవ తీసుకున్న ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు నా ప్రత్యేక ధన్యవాదాలు. నా జిల్లాకు వచ్చిన నన్ను అక్కున చేర్చుకున్న అందరికీ కృతజ్ఞతలు. అలాగే సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఎస్వీ రంగారావుగారి ఆశీస్సులు ఎప్పటికీ నాకు ఉంటాయి.’ అని అన్నారు. నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ సంవత్సర కాలంగా చిరంజీవితో ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించాలని చూశాం. ఈ విగ్రమం సైరా నరసింహారెడ్డి విజయోత్సహం తర్వాత ఆవిష్కరిస్తానని చెప్పారు. అదేవిధంగా చిరంజీవి మాట నిలబెట్టుకున్నారు. చలన చిత్రరంగం ఉన్నంతవరకూ చిరంజీవి స్థానం ఎప్పటికీ చిరంజీవిలానే ఉంటుందన్నారు. ఎస్వీఆర్ నటించిన రెండు సినిమాల్లో చిరంజీవి తండ్రి కూడా నటించారని ఎంపీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. -
ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి
-
చోద్యం చూశారే తప్ప.. ప్రశ్నించారా..!
సాక్షి, తాడేపల్లిగూడెం: బీజేపీలో గుర్తింపు కోసమే మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..తాడేపల్లిగూడెంలో దేవాదాయ భూములను విచ్చలవిడిగా ఆక్రమించుకుని అమ్ముకున్న మాణిక్యాలరావు.. వాటాలు తీసుకోవడం మినహా ఆ శాఖ అభివృద్ధికి చేసింది శూన్యం అన్నారు. దేవాదాయ శాఖ భూములను ప్రజలకు పంపిణీ చేస్తామని ఎక్కడ ప్రభుత్వం చెప్పలేదని స్పష్టం చేశారు. బీజేపీ.. టీడీపీ ఎజెండాను మోస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి ఐవైఆర్ కృష్ణారావు చెబుతుంటే.. మాణిక్యాల రావు మాత్రం గుర్తింపు కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. చోద్యం చూశారే తప్ప.. ప్రశ్నించారా..! వైఎస్ జగన్ పరిపాలన దేశానికి ఆదర్శంగా ఉందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు కితాబునిస్తుంటే.. మాణిక్యాలరావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని భూములపై చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి ట్రేడింగ్ వ్యవహారానికి తెర లేపితే చోద్యం చూశారే తప్ప.. ప్రశ్నించారా అని నిప్పులు చెరిగారు. జన్మభూమి కమిటీలు, వాలంటీర్ల వ్యవస్థ ఒక్కటేనంటూ అహగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాణిక్యాలరావును విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో అందించే వాలంటరీ వ్యవస్థ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఆక్షేపించారు. అవినీతికి కేరాఫ్ అడ్రసుగా మారిపోయిన టీడీపీ ఎంపీలను బీజేపీలో సభ్యులుగా చేర్చుకొని రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎరువుల మాఫియాకు, దొంగనోట్లు మార్చే వ్యక్తులకు మాత్రమే మాణిక్యాలరావు న్యాయం చేశారని ఎమ్మెల్యే సత్యనారాయణ ఎద్దేవా చేశారు. -
అందుకే నాకు ఈ శాఖ ఇచ్చారేమో..
సాక్షి, తాడేపల్లిగూడెం : రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని పేదలందరికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. ఇంట్లో ఉండే మహిళల పేరు మీద పట్టాలను ఇస్తామని తెలిపారు. తక్కువ వడ్డీకే హౌసింగ్ లోన్స్ ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. ‘నాకెంతో ఇష్టమైన గృహనిర్మాణ శాఖను నామీద నమ్మకంతో అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. గతంలో అత్తిలి ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆ నియోజవకర్గంలో 300 ఎకరాల్లో 3000 మందికి పైగా ఇళ్లు కట్టించాను. నేను చేసిన హౌసింగ్ అభివృద్ధి చూసి వైఎస్ జగన్ నిన్ను ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. అందుకే నాకు గృహనిర్మాణ శాఖ ఇచ్చారని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి నవరత్నాలలో ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా పాటిస్తామ’ని వెల్లడించారు. -
పశ్చిమ గోదావరిలో వింత ఘటన
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెంలో వింత ఘటన చోటుచేసుకుంది. నల్లజర్ల మండలం చీపురుగూడెంకు చెందిన చెల్లు నాగ సూర్యకుమారి అనే గర్భిణీ మహిళకు సీరియస్‌గా ఉండటంతో మదర్ వన్నిని హాస్పిటల్‌కు తరలించారు. మహిళ పరిస్థితి దృష్ట్యా అక్కడి వైద్యులు ఆమెకు ఆరో నెలలోనే ప్రసవం చేశారు. అయితే గుండె బయటి వైపు ఉండేలా పాప జన్మించింది. గుండె బయటకు కనబడేలాగా కొట్టుకోవడంతో ఆస్పత్రి వైద్యులు ఆందోళన చెందారు. శిశువు ఆరోగ్యంగానే ఉందని తెలిపిన వైద్యులు.. సర్జరీ చేసేందుకు మెరుగైన ఆస్పత్రికి పంపించేందుకు సన్నాహాలు చేశారు. అయితే ఆ పాప పుట్టిన 30 నిమిషాల తర్వాత మృతి చెందడంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది. -
జనసేన పార్టీలో ముసలం
సాక్షి, తాడేపల్లిగూడెం: పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో ముసలం మొదలైంది. పశ్చిమ గోదావరి జల్లా జనసేన కో-కన్వీనర్ యర్రా నవీన్ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కనీసం తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా తాడేపల్లిగూడెం అభ్యర్థిని ప్రకటించారన్న మనస్తాపంతో రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని, కానీ అలా జరగలేదని వాపోయారు. పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఇతర పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడిన వారికి టికెట్ ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కనీసం జనసేన పార్టీ కార్యాలయంలో అప్లికేషన్ కూడా పెట్టలేదని వెల్లడించారు. దరఖాస్తులు చాలా వచ్చాయని చెప్పుకోవడం కాదు. అప్లికేషన్ పెట్టిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా కష్టపడిన వారికి ఇచ్చి ఉంటే చాలా సంతోషించేవాడినని అన్నారు. ‘పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చే పార్టలోకి వచ్చా. జనసేన పార్టీ అన్ని పార్టీల లాంటిది కాదని అనుకున్నా. కానీ ఇది కూడా స్వార్ధ రాజకీయ పార్టీనేనని తేలిపోయింది. నా రాజీనామాతో అయినా మళ్లీ ఇటువంటి పొరపాటు జరగకుండా చూస్తారనే రాజీనామా చేస్తున్నా. అభిమానుల అభిప్రాయంతో తదుపరి కార్యాచరణ రెండురోజుల్లో ప్రకటిస్తాన’ని యర్రా నవీన్ తెలిపారు. (చదవండి: జనసేన అభ్యర్థులు వీరే) -
బొలిశెట్టి వర్సెస్ మాణిక్యాలరావు.. రసాభాస
సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసతో అర్థాంతరంగా ముగిసింది. మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు ప్రసంగాన్ని కౌన్సిల్ సభ్యులు అడ్డుకోవడం గందరగోళానికి దారితీసింది. కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం, బీజేపీ నాయకులు పరస్పరం దూషించుకున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే మాణిక్యాలరావు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యంతో కౌన్సిల్ సమావేశం అర్థాంతరంగా ముగిసింది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాణిక్యాలరావు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నంచేశారు. దీంతో ఆయన కౌన్సిల్ సమావేశానికి హాజరవుతున్నారన్న సమాచారంతో.. మున్సిపల్ కార్యాలయం వద్ద ముందస్తుగా పోలీసులను మోహరించారు. -
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో దూషించుకున్న టీడీపీ, బీజేపీ శ్రేణులు
-
రెండోరోజుకు చేరుకున్న మాణిక్యాలరావు దీక్ష
-
రెండోరోజుకు చేరుకున్న మాణిక్యాలరావు దీక్ష
సాక్షి, తాడేపల్లిగూడెం: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఎన్నికల వేళ చంద్రబాబు బూటకపు హామీలతో ప్రజలను వంచించారని మాణిక్యాలరావు ఆరోపించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు తాను నిరాహార దీక్ష విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన దీక్షకు పలువురు బీజేపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. వైద్యులు మాణిక్యాలరావుకు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. ఆయన పల్స్రేట్, షుగర్ లెవల్స్ నార్మల్‌గా ఉన్నాయని వైద్యులు తెలిపారు. నిరాహార దీక్ష కారణంగా కొంత నీరసంగా ఉన్నా.. యోగాసనాలు వేస్తూ.. ధ్యానం చేస్తూ మాణిక్యాలరావు ఉల్లాసంగా గడిపారు. -
తాడేపల్లిగూడెంలో మళ్లీ ఉద్రిక్తత
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న(గురువారం) మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు గృహ నిర్బంధాన్ని, పోలీసుల వైఖరిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు శుక్రవారం ర్యాలీ నిర్వహించాయి. తహశీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు మళ్లీ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపించడంతో భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. తాడేపల్లిగూడెం అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు పరస్పరం సవాళ్లు విసురుకున్న సంగతి తెల్సిందే. -
ఉద్యమం.. ఉద్రిక్తం
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): మునిసిపల్ కాంట్రాక్ట్ పారి శుధ్య కార్మికుల సమ్మె తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తతకు దారితీసింది. 279 జీఓను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్ట ణాలలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురపాలక సంఘం అధికారులు గురువారం కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో వేరే వారితో స్థానిక వీకర్స్ కాలనీ తదితర ప్రాంతాలలో పారిశుధ్య పనులు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలిసి సమ్మెలో ఉన్న కార్మికులు అక్కడికి చేరుకుని ప్రైవేట్ వ్యక్తులను పనులు చేయవద్దని కోరారు. తాము సమ్మెలో ఉన్నామని, సహకరించాలని కోరారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని సమ్మెలో ఉన్న కార్మికులను బలవంతంగా జీపులోకి ఎక్కించడం మొదలుపెట్టారు. దాంతో కార్మికులకు, పోలీస్‌లకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ముగ్గురు మహిళా కార్మికులు మర్రి చంద్రకళ, మండెల్లి జుయసుధ, కూనుపాముల దయామణి స్పృహ తప్పారు. వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు జీపులోకి మహిళా కార్మికులను ఎక్కించి వెనుక డోర్ వేయకుండానే వాహనాన్ని పోనివ్వడంతో కొంతమంది కార్మికులు కింద పడిపోయారు. వారికి తీవ్రగాయాలు కాగా హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహిళా కార్మికులు తాటికొండ మిరియ, ముత్యాలమహాలక్ష్మి లకు తలకు, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. గోసాల రవి అనే కార్మికుడి చేయి బెణికింది. తరువాత స్థానిక ఏరియా ఆసుపత్రి అత్యవసర విభాగం వద్దకు పారిశుధ్య కార్మికులు చేరుకుని ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికులపై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న కార్మిక నేతలు కర్రి నాగేశ్వరరావు, డి.సోమసుందర్, మండల నాగేశ్వరరావు, సిరపరపు రంగారావు, గుంపుల సత్యకృష్ణ, జనసేన నాయకులు నీలపాల దినేష్, సీఐ మూర్తి, ఎస్సైలు, ట్రాఫిక్ పోలీసులు ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. సీఐ మూర్తి ఆధ్వర్యంలో కార్మిక నాయకులతో చర్చలు జరిగాయి. ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం ఆగదు ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం ఆగదని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు డి.సోమసుందర్, కర్రి నాగేశ్వరరావులు హెచ్చరించారు. ఓ వైపు కార్మికులు సమ్మె చేస్తుండగా పోటీగా కూలీ లను తీసుకువచ్చి పారిశుధ్య పనులు చేయించడం సరికాదన్నారు. 279 జీవో విధానం అంతా లోపభూయిష్టమన్నారు. ఎన్నో ఉద్యమాలు చూశామని పోలీసులు దౌర్జన్యం చేసినా, పోటీ కార్మికులను దింపినా ఉద్యమం తీవ్రతరం అవుతుందన్నారు. రానున్న ఎన్నికలలో సత్తా చూపించండి ప్రభుత్వం పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులపై కక్షసాధింపులు చేస్తున్నందున, కార్మికులు రానున్న ఎన్నికలలో తమ సత్తా చాటాలని ఓట్లు రూపంలో ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని ఏఐటీయూసీ నాయకులు డి.సోమసుందర్ కార్మికులకు పిలుపునిచ్చారు. రక్తం కారుతున్నప్పటికి సమ్మె వీడవద్దన్నారు. ఉద్యమాలు తీవ్రతరం చేద్దాం అన్నారు. ప్రజా ప్రతినిధులు తమ, తమ ఇళ్ళు వద్ద ఆయా సందర్భాలలో పారిశుధ్య కార్మికులచే పనులు చేయించుకుంటున్నారని, వీరికి కాంట్రాక్ట్ కార్మికులు అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. అధికారులకు సైతం పారిశుధ్య కార్మికుల సంక్షేమం పట్టడం లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలి: సీఐ మూర్తి పారిశుధ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో సమ్మె చేస్తున్న కార్మికుల స్థానంలో ప్రభుత్వం వేరే కార్మికులతో పనులు చేయిస్తుందని, వారిని అడ్డుకోవడం తగదని సీఐ మూర్తి అన్నారు. పోలీసులు డ్యూటీలు చేస్తున్నారే తప్ప కార్మికులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని వివరించారు. 8వ రోజుకు సమ్మె పారిశుధ్య కార్మికుల సమ్మె గురువారం నాటికి 8వ రోజుకు చేరింది. పురపాలక సంఘం శిబిరం వద్ద కార్మికులు వంట వార్పు కార్యక్రమం చేయడం ద్వారా తమ నిరసనను ప్రభుత్వానికి తెలిపారు. పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు. -
‘చెన్నారెడ్డినే తరిమిన ఘనత మాది’
సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. విమానాశ్రయ భూముల నిర్వాసితులకు పట్టాలు ఇవ్వడంలో టీడీపీ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. వారికి మద్దతుగా తాడేపల్లి గూడెంలో శుక్రవారం ఆయన నిరసన దీక్ష చేపట్టారు. భూ నిర్వాసితులకు పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని చంద్రబాబు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను రెచ్చగొడితే తిరగబడతామని హెచ్చరించారు. అవసరమైతే కర్రలు చేతబట్టి ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు. ‘మర్రి చెన్నారెడ్డినే తరిమిన ఘనత మాది. ఆఫ్ట్రాల్ చంద్రబాబును తరిమికొట్టడం పెద్ద కష్టం కాదు. దమ్ముంటే మా నిరసన దీక్షని అడ్డుకోండి’ అని సవాల్ చేశారు. నిట్ ప్రారంభోత్సవంలో బాబు ఇచ్చిన 56 హామీలకు కూడా అతీగతీ లేదని మండిపడ్డారు. -
ప్రజలను, సహజ వనరులను దోపిడీ చేస్తున్న ఘనుడు చంద్రబాబు
-
చంద్రబాబు గొప్ప దోపిడీ ట్రైనర్!
సాక్షి, తాడేపల్లిగూడెం: గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించినందుకు ప్రతిగా.. ప్రజలను, సహజ వనరులను దోపిడీ చేస్తున్న ఘనుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దోపిడీలకు పాల్పడటమేకాక.. టీడీపీ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జన్మభూమి కమిటీలకూ ఎలా దోచుకోవాలో చంద్రబాబు ట్రైనింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఇసుక నుంచి పోలవరం కాంట్రాక్టుల దాకా అన్నింటా దోపిడీల పర్వం కొనసాగుతున్నదని వివరించారు. 167వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం మార్కెట్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాడేపల్లిగూడేనికి ఏమిచ్చాడు?: ‘‘2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు టీడీపీకే అన్ని సీట్లూ ఇచ్చారు. మరి ఈ నాలుగేళ్ల పాలనలో సీఎం చంద్రబాబు ఈ జిల్లాకు ఏమిచ్చారు? మరీ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఏం చేశారు? తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు కడతామన్నారు.. కనీసం రోడ్డైనా వేయలేదు! నల్లజర్ల నుంచి తాడేపల్లి, తాడేపల్లి-భీమవరం, కైకలూరు-ఏలూరు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తున్నాం. నాలుగేళ్లలో ఇక్కడ ఒక్క కాలేజీ కూడా కట్టలేని ఆయన.. కేంద్రం ఇచ్చిన ఎన్ఐటీకి కనీసం కాంపౌండ్ వాల్ కూడా కట్టలేదు. వైఎస్సార్ హయాంలో మంజూరైన తాడేపల్లిగూడెం అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తిచేయలేని అసమర్థుడు బాబు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నవైనం జిల్లా వాసులుగా మీకు తెలిసిందే. ప్రజలకు అవసరమైన పనులు చేయకపోగా, బాబు తన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇస్తాడు.. రౌడీయిజం, అధికారులపై దౌర్జన్యం, ఆడవాళ్లను జుట్టుపట్టి ఈడ్చడం, మట్టిని, ఇసుకను అక్రమంగా తొవ్వుకోవడం, కాంట్రాక్టర్ల దగ్గర్నుంచి కమిషన్లు లాగడం లాంటివి ట్రైనింగ్ ఇస్తాడు. టీడీపీ ఎమ్మెల్యేలు, వాళ్ల కింద జన్మభూమి కమిటీలు ఆ ట్రైనింగ్ ప్రకారమే జనాన్ని దోచుకుతింటున్నారు. ఇక్కడి టీడీపీ నేతలు పేకాట రాయుళ్ల దేవుడు: తాడేపల్లిగూడెం టీడీపీ నాయకుడు, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు.. ఇసుక, మట్టి దోపిడీలే కాదు మరో కథనూ నడిపిస్తాడని జనం చెబుతున్నారు. భారీ ఎత్తున పేకాడేవాళ్లు ఈ ఎమ్మెల్యేకు నెలకు రూ.30 లక్షలు చెల్లించుకోవాలట! ఈ అక్రమ వ్యవహారాలన్నీ చూసి ఓ సీఐ చర్యలు తీసుకుంటే.. మరుసటిరోజే ఆయనను పక్కనపెట్టేశారు. ఇక్కడి కలెక్టర్.. టీచర్లను నడుస్తున్న శవాలంటూ దారుణంగా తిట్టాడు. ఆయనపై చర్యలులేవు. నాలుగేళ్లవుతున్నా ఆయనకు బదిలీ ఉండదు. తన పాలనలో ఒక్కటంటే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధరను కల్పించలేని చంద్రబాబు.. తన హెరిటేజ్ సంస్థ కోసం రైతుల పంటల్ని తక్కువ ధరకు కొని, నాలుగింతలు ఎక్కువ లాభాలు సొమ్ముచేసుకుంటున్నాడు. అందుకే ప్రతి సోమవారం పోలవరానికి పరుగులు: ఈ మధ్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాడు.. పోలవరం పనులు 50 శాతం పూర్తయ్యాయని! నిజమే, ఆ 50 శాతంలో 70 శాతం పనులు దివంగత నేత వైఎస్సార్ హయాంలో జరిగినవే. అసలు రాష్ట్రానికి వరదాయిని అయిన పోలవరం గురించి పట్టించుకున్నది, పనులు ప్రారంభించింది వైఎస్సార్సే అన్న సంగతి అందరికీ తెలిసిందే. నాలుగేళ్లుగా పోలవరం పేరుతో జరుగుతోన్న దోపిడీ అంతాఇంతా కాదు. రాష్ట్రం విడిపోయినప్పుడు పోలవరాన్ని తామే కడతామని కేంద్రం అంటే.. వద్దూ నేనే కడతానని బాబు ముందుకొచ్చాడు. కేవలం కమిషన్ల కోసమే ఆయన పోలవరం కడతానన్నాడు. ఆ వెంటనే రేట్లను విపరీతంగా పెంచుతూపోతుపోయాడు. తన బినామీనకు నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టులు ఇప్పించాడు. 36 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరగాల్సిఉంటే.. ఈ నాలుగేళ్లలో కేవలం 6 లక్షల క్యూబిక్ మీటర్ల పనే జరిగింది. ప్రతిసోమవారం చంద్రబాబు పోలవరానికి పోయేది పనులు ఎలా జరుగుతున్నాయో చూడటానికో, పనుల వేగం పెంచడానికోకాదు.. కాంట్రాక్టర్ల నుంచి రావాల్సిన కమిషన్ల వసూలుకే సోమవారం పోలవరానికి వెళతాడు మోసగాళ్లను ఇంకా నమ్ముదామా?: గడిచిన నాలుగేళ్లుగా చంద్రబాబు చేతిలో మోసపోనివారంటూలేరు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి, కాపులకు రిజర్వేషన్.. అంటూ వందలకొద్దీ హామీలిచ్చారు. వాటిలో ఏఒక్కటీ నెరవేర్చకుండా మోసం చేశాడు. నాకు అలా చేయడంరాదు. చేయగలినిన పనైతే తప్పకుండా మాటిస్తా. కాకపోతే ప్రయత్నిస్తానని మాత్రమే అంటాను. కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు ఇస్తున్న నిధుల కంటే నాలుగింతలు ఎక్కువ ఇస్తామని మాటిస్తున్నా. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు అంటున్నాడు. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా.. మోసాలు చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు మీకు నాయకుడుగా కావాలా? ఇన్నాళ్లూ మోసం చేసిన చంద్రబాబును పొరపాటున కూడా క్షమిస్తే, కొత్త ఎత్తులతో జనం దగ్గరికొస్తాడు. ఇంటికి కేజీ బంగారం, బెంజికారు ఇస్తానంటాడు. అందుకే ఈ దుర్మార్గ వ్యవస్థలో మార్పులు రావాలి. చెప్పినమాట నిలబెట్టుకోలేనప్పుడు రాజకీయ నాయకుడు రాజీనామా చేసి వెళ్లిపోయే పరిస్థితి రావాలి. అది జగన్ ఒక్కడితోనే సాధ్యంకాదు. మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే మన ప్రభుత్వంలో ప్రజలకు చేయబోయే మేళ్లను నవరత్నాల ద్వారా వివరించాం. ఇవాళ ఆరోగ్యశ్రీ గురించి మరోసారి చెప్పుకుందాం.. ఆరోగ్యశ్రీలో మెరుగైన మార్పులు చేస్తాం: ఇవాళ వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళితే ఆరోగ్యశ్రీ అక్కడ వర్తించదట! గుండె, మెదడుకు సంబంధించిన పెద్ద ఆపరేషన్లు చేయించాలంటే మంచి ఆసుపత్రులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు 8 నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు. పాత రేట్లు మార్చలేదు. దీంతో డాక్టర్లు ఆపరేషన్లు చేయడం లేదు. మనం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని సమూలంగా మార్పు చేస్తాం. ఈ పథకం కింద ఏ పేదవాడికైనా వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే దాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువస్తాం. ఏ ఆపరేషన్‌కైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. ఉచితంగానే ఆపరేషన్ చేయిస్తాం. ఆ తర్వాత రోగి విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా డబ్బులు అందిస్తాం. దీర్ఘకాలంగా డయాలసిస్ చేయించుకునే కిడ్నీ పేషెంట్లకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తాం. ఏడాది ఓపిక పట్టండి దేశంలో ఎక్కడికి వెళ్లి వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. -
నిట్‌లో ర్యాగింగ్ కలకలం
సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాల తాడేపల్లిగూడెం నిట్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం రేగింది. బిహార్‌కు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. దీంతో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో జూనియర్ విద్యార్థిని సీనియర్లు చితకబాదారు. ఈ ఘటనపై జూనియర్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేసిన కళాశాల అధికారులు ర్యాగింగ్ కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. మరో 15 మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగడంతో ఎలాంటి ఘటనలు జరగకుండా తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షించారు. -
కన్నాలేసేవాడే సిగ్గుపడాలి
-
కన్నాలేసేవాడే సిగ్గుపడాలి: మంత్రి
సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు మద్దతుగా తనపై విమర్శలు చేసిన మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్‌పై మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. తాను నిరంతర శ్రామికుడినని, అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చానని చెప్పుకొచ్చారు. ‘నన్ను ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అని మున్సిపల్ చైర్మన్ కామెంట్ చేశాడు. అవును నేను ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్‌నే. నేను ఈరోజుకీ ఫోటోగ్రాఫర్‌ననే అందరికీ చెప్తా. 24 గంటల్లో 18 గంటలు పనిచేసే నిరంతర శ్రామికుడిని. కష్టపడ్డావోడు సిగ్గుపడక్కర్లేదు, కన్నాలేసేవాడే సిగ్గుపడాలి. నాపై కామెంట్లు చేస్తున్న నీవు నీ చరిత్ర ఏంటో తెలిసుకో, నేను నీ చరిత్ర బయటకు తీయడానికి క్షణం పట్టదు. నీకు దమ్ముంటే నా చరిత్ర గురించి తెలుసుకో. నువ్వెంత వెతికినా నా వెనుక నా కష్టమే కనపడుద్ది. నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఫోటోగ్రాఫర్‌గా పనిచేసి అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చా. నేను ఫొటోగ్రాఫర్‌కు ఫొటోగ్రాఫర్‌ని, ఆటోడ్రైవర్‌కు ఆటో డ్రైవర్, కూలీకి కూలీని. నేనెప్పుడూ కష్టపడే జీవినే, నిరంతర శ్రామికుడినని గర్వంగా చెబుతాన’ని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. -
నా జోలికొస్తే ఖబడ్దార్, మీకు ఆ ధైర్యం ఉందా?
సాక్షి, తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, బీజేపీ మధ్య పంచాయితీ తెగడం లేదు. మంత్రి మాణిక్యాలరావును లక్ష్యంగా చేసుకుని మిత్రపక్షానికి చెందిన తెలుగుదేశం నాయకులు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం లేదు. దీంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకే వేదికపై ఇరువర్గాలు ఆరోపణలు గుప్పించుకుని రోడ్డున పడుతున్నారు. ఒకే జన్మభూమి సభకు ఒకరి తర్వాత ఒకరు వెళ్లి విమర్శలు చేసుకోవడం చూసి జనం అసహ్యించుకుంటున్నారు. మంత్రిపై వ్యంగ్య వాగ్బాణాలు : ఈనెల 2 నుంచి జన్మభూమి – మా ఊరు కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో మంత్రి మాణిక్యాలరావు చురుకుగా పాల్గొంటున్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కూడా ఇదే నియోజకవర్గాన్ని లక్ష్యం చేసుకుని మంత్రికి సమాచారం ఇవ్వకుండా రోజూ జన్మభూమి సభల్లో పాల్గొంటున్నారు. మంగళవారం వెంకట్రామన్నగూడెం సభలో మంత్రి పాల్గొనాల్సి ఉండగా ఆయన రావడం ఆలస్యంకావడంతో అప్పటికే ఈ సభకు హాజరైన బాపిరాజు మంత్రిని ఉద్దేశించి వ్యంగ్య వాగ్బాణాలు విసిరారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సహకరించడం లేదంటూ వ్యాఖ్యానించారు. తర్వాత సభకు హాజరైన మంత్రిమాణిక్యాలరావుకు జెడ్పీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలతో చిర్రెత్తుకొచ్చింది. దీంతో మంత్రి కూడా తన హద్దులు దాటేసి జెడ్పీ చైర్మన్‌పై విరుచుకుపడ్డారు. ‘నా కంటే ముందు ఈ వేదికపైకి వచ్చి వెళ్లిన ఒకటో కృష్ణుడు నేను తప్ప ఇంకొకడు అభివృద్ధి చేయలేడని అన్నారంట. నేను కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే, పంచాయతీరాజ్ విభాగం ద్వారా జిల్లా పరిషత్ ఖర్చుపెట్టే పరిస్థితి. నేను అక్కడ నిధులు ఆపితే ఇక్కడ విలవిల్లాడతారు. స్పష్టంగా చెబుతున్నా, ఒక రాష్ట్ర మంత్రిగా , క్యాబినెట్లో భాగస్వామిగా ఉన్న వ్యక్తిని గురించి ఇదే వేదికపై చులకనగా మాట్లాడటం అనేది తీవ్రమైన విషయం. చాలా కాలంగా చూసీచూడనట్టు పోయా. ఖబడ్దార్’ అని హెచ్చరించారు. అభివృద్ధి కోసం, నిధులు తేవడం కోసం తాను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల చుట్టూ తిరుగుతుంటే, జెడ్పీ చైర్మన్ మాత్రం బోడిగుండులా ఇక్కడే గుండ్రంగా తిరుగుతూ రాజకీయం చేస్తున్నారంటూ మంత్రి విమర్శలు గుప్పించారు. దీనిపై టీడీపీ నేతలూ ఘాటుగానే స్పందించారు. టీడీపీ భిక్షతోనే నెగ్గారనే విషయాన్ని మర్చిపోవద్దని, జెడ్పీ చైర్మన్ తప్పుగా మాట్లాడారని నిరూపించకపోతే ఊళ్లో తిరగనివ్వబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. నా జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టను.. దీనిపైనా మంత్రి స్పందిస్తూ మళ్లీ నిన్న (బుధవావరం) జెడ్పీ చైర్మన్‌పై విరుచుకుపడ్డారు. తాడేపల్లిగూడెంలో జెడ్పీ తరఫున చేసిన పనులు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో తనను అంటరానివాడిగా చూస్తున్నారని మూడున్నరేళ్లలో రామన్నగూడెంలో ఏ ప్రారంభోత్సవానికైనా పిలిచారా? అని మంత్రి ప్రశ్నించారు. ‘ ఏ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం లేదు? ఎందుకీ శత్రుత్వ ధోరణి? నా జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టను. నన్ను నిలదీయాలని చూస్తే...ప్రభుత్వాన్నే నిలదీస్తా. నేను మంత్రిని...నన్నే పట్టించుకోరా? అని ప్రశ్నలు సంధించారు. మాణిక్యాలరావుకు అంత ధైర్యముందా? ప్రతిగా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు కూడా మరోసారి మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ...‘ మంత్రి అందరినీ చులకనగా చూస్తారు. అసలు మర్యాద ఇవ్వరు. అందుకే మా మధ్య గొడవలు. జెడ్పీ చైర్మన్ బాపిరాజు ఇప్పుడు రాజీనామా చేస్తే మేం మళ్లీ గెలిపించుకోగలం. మీకు ఆ ధైర్యం ఉందా?. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా, ఆంధ్రప్రదేశ్ ను కట్ చేస్తా అని చేసిన అభ్యంతర వ్యాఖ్యల విషయంలో మంత్రి మాణిక్యాలరావు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని’ అని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బాపిరాజు స్పందిస్తూ తన ఎదుగుదలను చూసి మంత్రి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. మరోవైపు ఇద్దరూ తగదా పడుతూ ఒకరి అవినీతిని మరొకరు బయట పెడుతున్న వైనం తాడేపల్లిగూడెంలో చర్చనీయాంశంగా మారింది. -
నన్ను నిలదీయాలని చూస్తే... ప్రభుత్వాన్నే నిలదీస్తా..
-
ఆశగా వెళ్లి.. బిక్కమొహంతో వెనక్కి
జంగారెడ్డిగూడెంకు చెందిన ఎన్.వెంకటేశ్వరరావు హోటల్లో పనిచేస్తారు. రేషన్‌కార్డు లేదు. జన్మభూమి సందర్భంగా ఇస్తారంటే దరఖాస్తు చేసుకున్నారు. కానీ రేషన్‌కార్డు మంజూరు కాలేదు. ఏం జరిగింది అని ఆరా తీస్తే ఈయనకు నాలుగు చక్రాల వాహనం ఉందంట. అందుకని రేషన్‌కార్డు ఇవ్వలేదు. ప్రజాసాధికార సర్వేలో ఈయనకు నాలుగు చక్రాల వాహనం ఉన్నట్లు నమోదు కావడంతో రేషన్‌కార్డు తిరస్కరించారు. ఆయనకు కనీసం ద్విచక్ర వాహనం కూడా లేదు. ఇదేంటని అధికారులను అడిగితే మాకేం తెలియదని సమాధానం చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం: ఏ ఒక్క పేద కుటుంబం రేషన్‌కార్డు లేకుండా ఉండకూడదు. 5వ విడత జన్మభూమిలో రేషన్‌కార్డు లేని కుటుంబాలు అన్నింటికీ కార్డులు ఇస్తాం. ఇదీ ప్రభుత్వ ప్రకటన. అయితే ఆచరణలో మాత్రం కానరావడం లేదు. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా తమకు కార్డులు వస్తాయని ఆశగా జన్మభూమి సభలకు వెళితే, అక్కడ తమకు కార్డు రాలేదని అధికారులు వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు బిక్కమొహంతో వెనుదిరుగుతున్నారు. రేషన్‌కార్డు అనేది ప్రస్తుతం అందరికీ అవసరమే. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాలకు, గుర్తింపు కార్డులుగా కూడా ఉపయోగపడుతోంది. దీంతో సగటు మనిషి రేషన్ కార్డు కోసం కాళ్ళరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ దరఖాస్తులు చేస్తూనే ఉన్నాడు. ప్రభుత్వ పథకాలు గతంలో ఏడాదిలో ఎప్పుడైనా అందించే వారు. కాని ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువగా ప్రభుత్వ పథకాలను జన్మభూమి మా ఊరు గ్రామసభలు నిర్వహించి అందులో మాత్రమే అందిస్తుంది. దీంతో గ్రామసభలు జరిగిన ప్రతీసారి రేషన్‌కార్డులు కోసం ఎదరుచూడటం, అదే గ్రామసభల్లో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవడం పరిపాటిగా మారింది. అయితే కార్డుల కోసం డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం మంజూరు చేసే సమయంలో కొర్రీలు వేసి ఇవ్వడం లేదు. రేషన్‌కార్డు దరఖాస్తును ప్రభుత్వం ఆన్లైన్లో ప్రజాసాధికార సర్వేను ఆనుసంధానం చేసింది. దీంతో 70శాతం మంది అనర్హులుగా గుర్తించింది. ప్రజాసాధికార సర్వే సక్రమంగా జరగకపోవడంతో అర్హులకు రేషన్‌కార్డు మంజూరు భ్రమే అని తేలిపోయింది. ఇల్లున్నా, వాహనం ఉన్నా కార్డు ఇవ్వరట ప్రజా సాధికార సర్వే ప్రకారం రేషన్‌కార్డు దరఖాస్తు దారుడికి ఇల్లు ఉన్నా రేషన్‌కార్డు మంజూరుకాదట. అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నా రేషన్‌కార్డు దరఖాస్తు ఆన్లైన్లో తిరస్కరణకు గురవుతోంది. ఉపాధి కోసం నాలుగు చక్రాల వాహనం తిప్పుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారికి రేషన్‌కార్డులు మంజూరుకావడం లేదు. ప్రజాసాధికార సర్వేలో పలు ఆప్షన్లను రేషన్‌కార్డు దరఖాస్తుకు అనుసంధానం చేయడంతో తిరస్కరణకు గురైన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. ఇలా ప్రజాసాధికార సర్వే ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తుచేస్తే చేసిన చాలా మందికి రేషన్‌కార్డు మంజూరు కాలేదు. ప్రజాసాధికార సర్వే సరిగా జరగకపోవడంతో అర్హులైన వారు కూడా రేషన్‌కార్డులు మంజూరు కాలేదు. ఇల్లు లేని వారికి ఇల్లు ఉన్నట్లు, వాహనం లేని వారికి వాహనం ఉన్నట్లు ప్రజా సాధికార సర్వేలో నమోదు కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో జన్మభూమి సభల్లో రేషన్‌కార్డు కోసం వెళ్లి, అది మంజూరు కాక బేలగా వెనుదిరుగుతూ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. జిల్లాలో ఇవీ వివరాలు జిల్లాలో సుమారు 34వేల మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, వీటిలో 11 వేల మందికి మాత్రమే రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. మిగిలిన దరఖాస్తులన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ప్రతీ మండలంలోను వేలాది కార్డులు ప్రజాసాధికార సర్వే ప్రకారం తిరస్కరణకు గురయ్యాయి. ఉదాహరణకు జంగారెడ్డిగూడెం మండలంలో సుమారు 6వేల మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 259 మందికి మాత్రమే రేషన్‌కార్డులు మంజూరు అయ్యాయి. మిగిలిన వారందరికీ మంజూరు కాలేదు. ఇలా ప్రతీ మండలంలోను వేలాది మంది దరఖాస్తు చేసుకుంటే వందల్లో మంజూరయ్యాయి. తాడేపల్లిగూడెంకు చెందిన కె.హరిబాబుకు మూడేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి కార్డు కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ రాలేదు. ఈసారి జన్మభూమిలో వస్తుందేమో అని మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దఫా కూడా జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. చేసేది చిరుద్యోగం. ఉన్న కొద్దిపాటి సంపాదనతో బయట నిత్యావసరాలు కొనుక్కోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. రేషన్‌కార్డు వస్తే నిత్యావసరాలు ఆసరాగా వస్తాయని ఆశ. కాని రేషన్‌కార్డు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. -
భర్త నచ్చలేదు.. కట్నం వెనక్కి తీసుకోండి
సాక్షి, తాడేపల్లిగూడెం: సెల్ఫీ తీసుకుని ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. పట్టణంలోని కొండయ్య చెరువు వద్ద గల తిరుమల అపార్టుమెంట్స్‌లో ఉంటున్న మౌనిక(24) అనే మూడు నెలల గర్భిణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఉరి వేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నది. ఆగస్టులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ నరేంద్రతో వివాహం అయింది. అమ్మానాన్న నన్ను క్షమించండి.. భర్త నచ్చలేదు.. కట్నం వెనక్కి తీసుకోండి అని ఆ వీడియోలో తల్లిదండ్రులను కోరింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో!
సాక్షి, తాడేపల్లిగూడెం రూరల్: పెళ్లైన నాలుగు నెలలకే ఓ నవవధువు, గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. భర్తంటే ఇష్టంలేకనే చనిపోతున్నట్టు సెల్ఫీ వీడియో తీయడం కలకలం రేగింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం 30వ వార్డు కొండయ్య చెరువు పరంజ్యోతి స్కూలు సమీపంలోని తిరుమల ఎన్‌క్లేవ్‌లో రైల్వే పార్శిల్ సర్వీస్ ఉద్యోగి ఉద్దండి వీరవెంకటనాగేశ్వరరావు ఉంటున్నారు. ఆయన తన కుమార్తె మౌనిక (24)ను ఆగస్టులో ఒంగోలుకు చెందిన తిరుమలశెట్టి నరేంద్రకు ఇచ్చి పెళ్లిచేశారు. అతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మౌనిక మూడవ నెల గర్భిణి. దీంతో నెల క్రితం బెంగళూరు నుంచి పుట్టింటికి వచ్చింది. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు రాజమండ్రి వెళ్లిన సమయంలో మౌనిక ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యను ముందుగా సెల్ఫీవీడియో తీసింది. భర్తంటే ఇష్టం లేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో పేర్కొన్నట్టు సమాచారం. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
టీడీపీ వక్రభాష్యం
సాక్షి, తాడేపల్లిగూడెం: టీడీపీ చేయాల్సింది ట్రేడింగ్ కాదు రూలింగ్ అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి మిత్రపక్షంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక, ఎన్ఆర్జీఎస్, ఎర్ర చందనం, గ్రానైట్ నిధులు ఎక్కడికి పోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపునకు టీడీపీ వక్రభాష్యం చెబుతోందని వాపోయారు. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ, బీజేపీకి కేటాయించిన సీట్లకు పోటీ చేసిందని తెలిపారు. తమ పార్టీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కనీస గౌరవం ఇవ్వటంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో తమ పార్టీ బలోపేతం అవుతుంటే టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని వీర్రాజు మంగళవారం వ్యాఖ్యానించారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా తమ పార్టీ మోసపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు పగలి కలలు కనడం మానుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. -
ఆ పాస్టర్‌ను కఠినంగా శిక్షించండి
-
ఆ పాస్టర్‌ను కఠినంగా శిక్షించండి
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి): మాయమాటలతో మహిళలను మోసం చేస్తున్న పాస్టర్ ఎబినైజర్ను కఠినంగా శిక్షించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పోలీసు అధికారులను కోరారు. తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం గ్రామంలో బుధవారం రాజకుమారి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మద్దూరులో నివాసం ఉంటున్న ఎబినైజర్ ను తక్షణమే అరెస్ట్ చేసి అతని దగ్గర బందీలుగా ఉన్న మహిళలను విడిపించాలని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ను ఫోన్లో ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చిన అనంతరం ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం చేస్తానన్నారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎబినైజర్ పరారీలో ఉన్నాడు. -
సీఎం చెంతకు ‘గూడెం’ పంచాయితీ
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగు తమ్ముళ్ల పంచాయితీ సీఎం చంద్రబాబు చెంతకు చేరింది. బుధవారం సాయంత్రం చంద్రబాబుతో సమావేశమయ్యేందుకు తాడేపల్లిగూడెం టీడీపీ నేతలకు అపాయింట్ మెంట్ లభించింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో మిత్రపక్షాల విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంత్రి మాణిక్యాలరావు తమను లెక్కచేయట్లేదంటూ తాడేపల్లిగూడెం మున్సిపల్ టీడీపీ కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విమానాశ్రయ భూముల క్రమబద్ధీకరణ విషయంలో మంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మూడేళ్లగా టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళుతున్నాపట్టించుకోవటం లేదంటూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సొంత పార్టీపైనే తిరుగుబాటు ధోరణితో ఉన్నారు. స్థానికంగా జరుగుతున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి టీడీపీ కౌన్సిలర్లు మూడు రోజులుగా దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు కలుగుజేసుకుని వారితో మాట్లాడనున్నారు. -
మంత్రితో వేగలేం
తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లను జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కలిసి పోగొడతారేమోనన్న అనుమానం వస్తోందని తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు 15వ వార్డులో టీడీపీ అధికారిక కౌన్సిలర్‌ను కాదని ప్రతిపక్ష పార్టీవారికి ప్రాధాన్యత ఇస్తున్నందుకు నిరసనగా పదవికి రాజీనామా చేస్తున్నట్టు చుక్కా కన్నమనాయుడు రాజీనామా పత్రాన్ని మున్సి పల్ చైర్మన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 15వ వార్డులో మంత్రి మాణిక్యాలరావు ఓటమికి పనిచేసిన వారికి మంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ కౌన్సిలర్ రాజీనామా చేస్తున్నారన్నారు. కౌన్సిలర్‌కు తెలియకుండా మంత్రి అనుచరులు ప్రతిపక్ష పార్టీ వ్యక్తి ద్వారా అధికారులను వెంటబెట్టుకుని ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఇది ఎంత వరకు సమంజసమన్నారు. కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి వరకు ఎన్నిక విధానం ఒకటేనన్నారు. ఎవ్వరికైనా ప్రజలు ఓట్లేసి నెగ్గించాలి్సందేనన్నారు. ఎంపీ సీట్లో మంత్రి కూర్చోలేరు. మంత్రి సీట్లో ఎంపీ కూర్చోలేరు. నా సీట్లో ఎమ్మెల్యే వచ్చి కూర్చోలేరని బొలిశెట్టి అన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలన్నారు. మంత్రిని గౌరవిస్తూ వస్తున్నామన్నారు. ప్రతీ అభివృద్ధి పనికి మంత్రి మాణిక్యాలరావుకు సహకరిస్తున్నామని ఆయన అన్నారు. కౌన్సిలర్లు కలిసిఉండటం మంత్రికి ఇష్టంలేదన్నారు. గతంలో నలుగురు బీజేపి కౌన్సిలర్లకు 40 లక్షల రూపాయల నిధులు ఇచ్చారు. ఇటీవల సీఎం ఇచ్చిన కోటి రూపాయల నిధులను ఆరుగురు కౌన్సిలర్లకు మంత్రి ఇచ్చారన్నారు. కనీసం మునిసిపల్ చైర్మన్‌కు, అధికారులకు తెలియకుండా మంత్రి ఇలా నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. మంత్రి ఈ విధంగా పంచుకుంటూ వెళితే మిగిలిన కౌన్సిలర్లకు ఏం సమాధానం చెప్పాలన్నారు. సీఎం గూడెంకు సంబంధించిన పనులు, నిధులు నాకు అప్పగిస్తే మంత్రి ఎలా ఫీలవుతారో.. తనకు తెలియకుండా మున్సిపాలిటీలో నిధులు, పనులు చేస్తే తాను కూడా అదేవిధంగా ఫీలవుతానన్నారు. అవసరమైతే సామూహిక రాజీనామా మంత్రి మాణిక్యాలరావు వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే తేల్చుకుంటామని బొలిశెట్టి చెప్పారు. ఈ మేరకు కౌన్సిలర్లతో కలిసి విజయవాడ బయలుదేరి వెళ్లారు. సీఎం కనుక మాణిక్యాలరావు కరెక్టు అని చెబితే ఆయన చేతికే రాజీనామా సమర్పించి వస్తానని చైర్మన్ స్పష్టం చేశారు. మంత్రి వైఖరికి నొచ్చుకొని రాజీనామా చేసిన చుక్కా కన్నమనాయుడు రాజీనామాను ఆమోదిస్తే. ఆయనకు మద్దతుగా సామూహిక రాజీనామా చేస్తామని బొలిశెట్టి చెప్పారు. సమావేశంలో వైస్‌చైర్మన్ కిల్లాడి ప్రసాద్ , టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
‘చంద్రబాబుదే ఆ ఘనత’
తాడేపల్లిగూడెం: టీడీపీ నేతలు పంచభూతాలను కూడా పంచుకుని తింటున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. అసెంబ్లీ భవనంలో వర్షపు నీరు లీకైతే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం జరిగిన వైఎస్సార్ సీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని, శాంతిభద్రతలు అదుపులో లేవని ధ్వజమెత్తారు. బయటకు వెళ్లినవారు క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక నగరంగా అభివృద్ధి చేస్తామన్న విశాఖను భూకబ్జాలమయంగా మార్చేశారని తెలిపారు. ప్రత్యేకహోదాను సైతం నీరుగార్చిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చారని పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల నాని తెలిపారు. 600లకుపైగా హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చని ఘనత చంద్రబాబుదే అన్నారు. ఓటుకు కోట్లు కేసు వల్లే ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారని ఆరోపించారు. -
నిజంగా.. వానేనా
తాడేపల్లిగూడెం రూరల్ : మండే ఎండలు, ఊపిరిసల్పని ఉక్కపోతలు. ఇలాంటి సమయంలో చల్లని గాలి.. హాయిగొలిపే చినుకు.. ఇంతకన్నా ఏముంది ఓదార్పు. గురువారం రాత్రి ఒక్కసారిగా వర్షం పడి ప్రజలను సేదతీర్చింది. జిల్లాలోని తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పలకరించింది. రాత్రి 7.15 గంటలకు ప్రారంభమైన వర్షం 8 గంటల వరకు పడింది. ఆకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు. -
మట్టి మాఫియా కట్టడికి టాస్క్‌ఫోర్స్
తాడేపల్లిగూడెం : మట్టి, ఇసుక మాఫియా కట్టడికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. క్యాంప్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చాలా కాలంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల మాఫియా చెలరేగిపోతుందన్నారు. మట్టి వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగుతోందన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రెవెన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ భాస్కర్ దృష్టిలో ఉంచి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. మట్టి మాఫియా ఆగడాలపై ఇటీవల ఇరిగేషన్ డీఈ మట్టిని చేరవేస్తున్న వాహనాల నంబర్లతో సహా రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా సదరు పోలీస్ అ««ధికారి ఇరిగేషన్ అధికారి పట్ల అనుచితంగా వ్యవహరించడంతో పాటు ఆ వాహనాలు పట్టుకుని తమకు అప్పగిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారి తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. సంబంధిత పోలీస్ అధికారిపై చర్యలు తీసుకునే విషయంలో సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళుతున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ఎక్సైజ్ అధికారుల లొసుగుల కారణంగా మద్యం బెల్టు దుకాణాలు ఇంకా నియోజకవర్గంలో నడుస్తున్నాయని తెలిపారు. వీటిని కట్టడి చేయడానికి సొంతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధికి రూ.30 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నిట్ భవనాల సమస్య పరిష్కారానికి ఢిల్లీ వెళుతున్నట్టు మంత్రి తెలిపారు. బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, పోతుల అన్నవరం, మున్సిపల్ వైస్ చైర్మన్ కిల్లాడి ప్రసాద్ పాల్గొన్నారు. -
ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను వేగవంతం చేయాలి
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్‌సెంటర్) : ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు అన్నారు. గురువారం పట్టణానికి విచ్చేసిన ఆయన జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భర్తీ కాకుండా ఉన్న పోస్టులు ఎంఈఓ, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, డెప్యూటీ డీఈఓలు, డైట్ అధ్యాపకులు పోస్టులను అర్హత, తగ్గ సీనియార్టీలతో ప్రభుత్వ, జెడ్పీ తేడాలు లేకుండా భర్తీ చేయాలన్నారు. సీఎం, విద్యాశాఖ మంత్రి సహకారంతో ఢిల్లీ వరకు ఫైల్‌ను నడిపించామన్నారు. తుదిదశకు చేరిందని, అతికొద్దికాలంలో సవరణలతో రాష్ట్రపతి ఆమోదం పొందుతుందన్నారు. ఇరు రాష్ట్రాలకు నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఇప్పటికే ఎంఈఓలను రెగ్యులర్ చేయించామని చెప్పారు. 2004 తరువాత ఎవరైతే ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో వారికి సంబంధించి రిటైర్మెంట్ అయినా, మధ్యలో చనిపోయినా వారు అనేక విధలుగా నష్టపోతున్నారని, మానవత దృక్పథంతో పరిశీలించాలని కోరామన్నారు. సీపీఎస్ విధానం రద్దుకు కేంద్రం పునరాలోచన చేస్తుందన్నారు. పీఆర్టీయూ సర్వీస్ రూల్స్‌ను సాధ్యం చేయడం, సీపీఎస్ విధానంను అంతం చేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీగా తన వంతు సహాయ సహకారాలు ఉపాధ్యాయులకు ఉంటాయని ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్రంలో సర్వీస్ రూల్స్ తుది దశకు చేరుతున్నందున పీఆర్టీయూ తొలుత పదోన్నతులు కల్పించడం ద్వారా బదిలీలు చేపట్టాలని చెబుతుందన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కమలాకర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు, జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కేవీవీ సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు డీఏలు చెల్లించాల్సి ఉందన్నారు. 10 నెలలుగా పీఆర్సీ ఏరియర్స్, హాఫ్ లీవ్ ఎన్‌కేష్‌మెంట్ ఇవ్వాల్సి ఉందన్నారు. 398 నోషనల్ ఇంక్రిమెంట్లు తదితర డిమాండ్లను నెరవేర్చాలన్నారు. నిరంతర సమగ్ర మూల్యంకనం విధానం రద్దు చేయాలని, కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని, నాన్ టీచింగ్ సిబ్బందిని నియామకాలు చేపట్టాలన్నారు. పీఈటీ, గ్రేడ్ పండిట్లను నూటికి నూరుశాతం భర్తీ చేయాలన్నారు. -
నూతన విధానంలో డీసెట్ నిర్వహించాలి
తాడేపల్లిగూడెం : రాష్ట్రంలో నూతన విధానంలో నిర్వహిస్తున్న సెట్స్ మాదిరిగా డీఈడీ కళాశాలలో ప్రవేశాలకు డీసెట్ నిర్వహించాలని ప్రైవేటు డీఈడీ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.తిరుపతయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం స్థానిక ధనలక్ష్మీ డీఈడీ కళాశాలలో నిర్వహించిన జిల్లా అసోసియేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు ఎంఎల్‌ఎస్‌ఎన్ రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో తిరుపతయ్య మాట్లాడుతూ మేనేజ్మెంటు కోటాలో డీఈడీ కళాశాలల్లో చేరే విద్యార్థులకు సెట్ లేకుండా చూడాలన్నారు. కళాశాల యాజమాన్యాలే సీట్లను భర్తీ చేసుకొనే విధంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలను సమావేశంలో తీర్మానించి ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.జనార్దనరావు, జిల్లా సెక్రటరీ రాంప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ, కన్వీనర్ రాజా పాల్గొన్నారు. -
ఉగాది ఉత్సవాలు ప్రారంభం
తాడేపల్లిగూడెం: ప్రజల ఇలవేల్పు, వరాలిచ్చే దేవత బలుసులమ్మ ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రజక ఆసాదులతో గరగల సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం గోదావరి ఏలూరు కాలువ వద్ద ఉన్న పెద్ద శివాలయం వద్ద నుంచి గరగలను బలుసులమ్మ ఆలయం వద్దకు తీసుకొచ్చారు. ఆలయం వద్ద డాక్టర్ శశి కుమార్, డాక్టర్ శైలజ దంపతులతో కలశస్థాపన చేయించారు. అనంతరం గోపూజ జరిగింది. భీమవరం మావుళ్లమ్మ దేవాలయ పండితుడు ఘనాపాటి పరిమెళ్ల వాస్తవ్యులు బాదంపూడి ఫణిశర్మ, బలుసులమ్మ ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్‌శర్మ, గోపీనా«థ్ శర్మ ల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఉగాది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు మాట్లాడుతూ పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఉగాది ఉత్సవాల తర్వాత నూతన ఆలయంలో అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగనుండటం శుభసూచకంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శ్రీరంగం అంజి, బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు, టీడీపీ నాయకులు వలవల సూరిబాబు, మునిసిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ , కల్యాణం రామచంద్రరావు, పాలడుగుల అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. -
‘నిట్’కు త్వరలో శాశ్వత డైరెక్టర్
తాడేపల్లిగూడెం : ఏపీ నిట్‌కు త్వరలో శాశ్వత డైరెక్టర్ నియామకం కానున్నారని, ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. శనివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వరంగల్ నుంచి వచ్చే అడ్‌హక్ ఫ్యాకల్టీల రాకలో ఇబ్బందులు, బోర్డు ఆఫ్ గవర్నెన్స్ తదితర సమస్యలపై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిశానన్నారు. నిట్‌కు సంబంధించిన అన్ని సమస్యలను ఆయనకు వివరించానని చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి శుక్రవారం స్పందించారని, నిట్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారన్నారు. నిట్ కార్యకలాపాల కోసం త్వరలో శాశ్వత కమిటీని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. డైరెక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చారని, 30 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందన్నారు. రాబోయే విద్యాసంవత్సరానికి రెండు వేల మంది విద్యార్థులకు సరిపడే బస, భోజన సదుపాయాల కోసం నిట్ ప్రాంగణంలో తాత్కాలిక నిర్మాణాలు పూర్తికానున్నాయన్నారు. ఆటోనగర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణానికి స్థలం కేటాయింపు ప్రక్రియ పూరై్తందని మంత్రి చెప్పారు. -
‘నిట్’కు త్వరలో శాశ్వత డైరెక్టర్
తాడేపల్లిగూడెం : ఏపీ నిట్‌కు త్వరలో శాశ్వత డైరెక్టర్ నియామకం కానున్నారని, ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. శనివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వరంగల్ నుంచి వచ్చే అడ్‌హక్ ఫ్యాకల్టీల రాకలో ఇబ్బందులు, బోర్డు ఆఫ్ గవర్నెన్స్ తదితర సమస్యలపై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిశానన్నారు. నిట్‌కు సంబంధించిన అన్ని సమస్యలను ఆయనకు వివరించానని చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి శుక్రవారం స్పందించారని, నిట్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారన్నారు. నిట్ కార్యకలాపాల కోసం త్వరలో శాశ్వత కమిటీని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. డైరెక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చారని, 30 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందన్నారు. రాబోయే విద్యాసంవత్సరానికి రెండు వేల మంది విద్యార్థులకు సరిపడే బస, భోజన సదుపాయాల కోసం నిట్ ప్రాంగణంలో తాత్కాలిక నిర్మాణాలు పూర్తికానున్నాయన్నారు. ఆటోనగర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణానికి స్థలం కేటాయింపు ప్రక్రియ పూరై్తందని మంత్రి చెప్పారు. -
యద్దనపూడి జీవితం నేటి తరం పాత్రికేయులకు స్ఫూర్తిదాయకం
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్): సీనియర్ పాత్రికేయులు యద్దనపూడి సూర్యనారాయణమూర్తి జీవితం నేటి తరం పాత్రికేయులకు స్ఫూర్తిదాయకమని సాక్షి సీనియర్ న్యూస్ ఎడిటర్ గురునాథ్ అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమావేశం హాలులో సీనియర్ జర్నలిస్ట్ యద్దనపూడి 6వ వర్ధంతి సభ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అడపా మాణిక్యాలరావు అధ్యక్షతన నిర్వహించారు. తొలుత సూర్యనారాయణ మూర్తి విగ్రహానికి స్వాంతంత్ర సమరయోధులు ప్రత్తి శేషయ్య, పాత్రికేయులు పూలమాలలు వేసి నివాళ్ళుర్పించారు. సభ కార్యక్రమంలో సాక్షి సీనియర్ న్యూస్ ఎడిటర్ గురునాథ్ మాట్లాడుతూ జర్నలిస్ట్ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు సూర్యనారాయణమూర్తి జ్ఞాపకాలు పచ్చగానే ఉన్నాయన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు యద్దనపూడిని ఆదర్శంగా తీసుకుని వృత్తి నిబధతతో పనిచేయాలని సూచించారు. ప్రత్తి శేషయ్య మాట్లాడుతూ యద్దనపూడితో ఉన్న తన అనుబంధాన్ని గుర్తుకు తెచ్చారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పూర్వ అధ్యక్షులు దూసనపూడి సోమసుందర్ మాట్లాడుతూ నిబద్ధత కలిగిన పాత్రికేయునిగా యద్దనపూడి సమాజానికి సేవలందించారన్నారు. విద్యుత్, టెలికాం, రైల్వే, బస్ సౌకర్యాలు కోసం పోరాటాలు చేసి ప్రజలకు వాటి సేవలనందించారన్నారు. జిల్లా అధ్యక్షులు జీవీఎస్ రాజు మాట్లాడుతూ మంచి కుటుంబాన్ని సమాజానికి అందజేసిన మహానీయుడు సూర్యనారాయణ మూర్తి అన్నారు. జిల్లా తొలి సమావేశపు ప్రాంగణ వేదికకు యద్దనపూడి పేరు పెడతామన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వానపల్లి సుబ్బారావు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టులకు సన్మానం: యద్దనపూడి స్మారక అవార్డులో భాగంగా సీనియర్ పాత్రికేయులైన శర్మ, ఐవీ సుబ్బారావు, వాసా సత్యనారాయణలను ఘనంగా సన్మానించారు. అంతేగాక గురునాథ్ ను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో 2016 విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన మల్లేశ్వరపు స్వాతికి రూ 5, 116 లు, దుస్తులను కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పైలు శ్రీనివాస్, తేతలి గంగాధర రెడ్డి, చిట్యాల రాంబాబు, పాత్రికేయులు, కుటుంబ సభ్యులు యద్దనపూడి బాల త్రిపుర సుందరి, వైబిఆర్ లక్ష్మి, అన్నపూర్ణ, పద్మావతి, సుబ్బారావు, అనంత లక్ష్మి తదితరులు ఉన్నారు. -
వ్యక్తి సజీవ దహనం
తాడేపల్లిగూడెం రూరల్ : అగ్నిప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. ఈ దుర్ఘటన ఆదివారంరాత్రి జువ్వలపాలెంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని జువ్వలపాలెం శివాలయం ఎదురుగా కాలువ గట్టుపై పాక వేసుకుని బాదపతి చిట్టిరాజు (70) నివాసముంటున్నాడు. అనారోగ్యంతో కొంతకాలంగా మంచాన పడ్డాడు. ఇతని యోగక్షేమాలను సోదరుడు బాదపతి రాము చూస్తున్నాడు. చిట్టిరాజుకు చుట్ట కాల్చే అలవాటు ఉండటంతో రోజులానే ఆదివారం రాత్రి చుట్ట అంటించుకుని ఆ తర్వాత ఆర్పకుండా మంచం పక్కన పెట్టేశాడు. దీంతో పాకకు నిప్పు అంటుకుని దగ్ధమైంది. ఫలితంగా చిట్టిరాజు సజీవ దహనమయ్యాడు. మృతుని సోదరుడు రాము ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై ఎం.సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
తాడేపల్లిగూడెం రూరల్ : యువకుడి హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలి పారు. శనివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని కడకట్ల కొత్త బ్రిడ్జి వద్ద నివాసముం టున్న ముప్పిన చిరంజీవి అలియాస్ లడ్డూ (26) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని బ్రిడ్జి దిగువన పడేశారన్నారు. ఈ మేరకు మృతుని తండ్రి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ మూర్తి కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దీనికి సంబంధించి నిపుణులు సేకరించిన ఆధారాలతో దొమ్మర్ల కాలనీకి చెందిన పాత నేరస్తుడు కొమ్మిరెడ్డి నాగు అలియాస్ గణేష్ హత్యకు పాల్ప డినట్టు విచారణలో తేలిందన్నారు. పలు పోలీస్స్టేషన్లలో ఇతనిపై కేసులు ఉన్నాయని చెప్పారు. సమాచారం మేరకు నిందితుడు గణేష్ అతని ఇంటి వద్ద ఉండగా సీఐ మూర్తి అరెస్టు చేశారని పేర్కొన్నారు. దర్యాప్తులో సీఐకు సహకరించిన పట్టణ ఎస్ఐలు ఎం.సూర్యభగవాన్, ఐ.వీర్రాజు, పో లీస్ సిబ్బందిని ఎస్పీ భాస్కర్‌భూషణ్, డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు అభినందించారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
తాడేపల్లిగూడెం రూరల్ : యువకుడి హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలి పారు. శనివారం స్థానిక పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని కడకట్ల కొత్త బ్రిడ్జి వద్ద నివాసముం టున్న ముప్పిన చిరంజీవి అలియాస్ లడ్డూ (26) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని బ్రిడ్జి దిగువన పడేశారన్నారు. ఈ మేరకు మృతుని తండ్రి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ మూర్తి కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దీనికి సంబంధించి నిపుణులు సేకరించిన ఆధారాలతో దొమ్మర్ల కాలనీకి చెందిన పాత నేరస్తుడు కొమ్మిరెడ్డి నాగు అలియాస్ గణేష్ హత్యకు పాల్ప డినట్టు విచారణలో తేలిందన్నారు. పలు పోలీస్‌స్టేçÙన్లలో ఇతనిపై కేసులు ఉన్నాయని చెప్పారు. సమాచారం మేరకు నిందితుడు గణేష్ అతని ఇంటి వద్ద ఉండగా సీఐ మూర్తి అరెస్టు చేశారని పేర్కొన్నారు. దర్యాప్తులో సీఐకు సహకరించిన పట్టణ ఎస్ఐలు ఎం.సూర్యభగవాన్, ఐ.వీర్రాజు, పో లీస్ సిబ్బందిని ఎస్పీ భాస్కర్‌భూషణ్, డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు అభినందించారు. -
ప్రియురాలిపై చాకుతో దాడి
తాడేపల్లిగూడెం రూరల్ : ప్రియురాలు మాట్లాడటం లేదనే ఆక్రోశంతో ఆమెపై దాడికి తెగబడిన ఓ ప్రేమోన్మాది తెగబడ్డాడు. ఈ ఘటన తాడేపల్లిగూడెం పట్టణం విమానాశ్రయ రన్‌వే ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బూర్గుంపాడుకు చెందిన 28ఏళ్ల మురికి సంజీవ్‌కుమార్ స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్నాడు. అతను ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంటెక్ చదువుతూ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ప్రమోటర్‌గా పనిచేస్తున్నాడు. సంజీవ్ తన ఇంటికి ఎదురుగా నివాసముంటున్న యువతిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి ఇంటిలో తెలియడంతో మందలించారు. దీంతో సంజీవ్‌కు ఆమె దూరంగా ఉంటోంది. నాలుగు రోజులుగా ఆమె మాట్లాడకపోవడంతో ఆగ్రహించిన సంజీవ్ చాకు కొని ఆమెను ఎయిర్ డ్రమ్ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశాడు. అనంతరం అదే చాకుతో తన కాలిపైనా గాయం చేసుకున్నాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వీరిని స్థానికులు 108 వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై ఐ.వీర్రాజు ఇద్దరి నుంచి స్టేట్మెంట్లు నమోదు చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 3.36 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం
-
రూ. 3.36 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం సాయంత్రం తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ యువకుడి వద్ద పెద్ద ఎత్తున కొత్త కరెన్సీ నోట్లను గుర్తించారు. రూ. 3.36 లక్షల విలువైన రెండు వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నగదు మార్పిడి కోసం తరలిస్తున్నాడని గుర్తించిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
పెద్ద నోట్ల రద్దు వల్ల ధరలు తగ్గుతాయి
-
మోదీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు
తాడేపల్లిగూడెం: యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా ప్రధాని నరేంద్ర మోదీ పటిష్ట చర్యలు తీసుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన రైతు మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. రైతులను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న భూమి చాలా సారవంతమైనదని అమిత్ షా చెప్పారు. రెండున్నరేళ్ల పాలనలో మోదీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రైతులకు భూసార కార్డులు అందిస్తున్నామని, ఈ-మార్కెట్ ద్వారా రైతులకు మంచి మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. ఈ సభలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర మంత్రులు, పలువురు నేతలు పాల్గొన్నారు. -
మోదీ ధర్మయుద్ధం చేస్తున్నారు.. సహకరించండి
తాడేపల్లిగూడెం: ప్రధాని నరేంద్ర మోదీ ధర్మయుద్ధం చేస్తున్నారని, అందరూ సహకరించాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు చేయడం వల్ల ఆర్థిక ప్రక్షాళన జరిగిందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన రైతు మహాసభలో వెంకయ్య మాట్లాడారు. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర మంత్రులు, పలువురు నేతలు పాల్గొన్నారు. కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని వెంకయ్య విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ధరలు తగ్గుతాయని, అవినీతి తగ్గుతుందని చెప్పారు. కమ్యూనిజంలో నిజం లేదని, వారి మాటలను కార్మికులు నమ్మరని, కమ్యూనిస్టుల బంద్‌కు ప్రజలు సహకరించరని వెంకయ్య అన్నారు. ఈ సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. పామాయిల్ సాగులో ఏపీ అగ్రగామిగా ఉందని అన్నారు. పామాయిల్‌కు త్వరలో మంచి ధర వస్తుందని, దేశ వ్యాప్తంగా రైతులకు బీమా వర్తింపజేస్తామని చెప్పారు. -
మంత్రి ఫ్లెక్సీలకు పోలీసుల కాపలా!
తాడేపల్లిగూడెం: మంత్రులకు పోలీసులు భద్రత కల్పించడం సాధారణ విషయం. ఇందుకు భిన్నంగా దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తన పేరిట అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు పోలీసు కాపలా పెట్టించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బస్టాండ్ ఎదుట వీధిలో నివాసం ఉంటున్న మంత్రి.. తన ఇంటికి వెళ్లే మార్గంలో గల ఫ్లెక్సీలకు నలుగురు పోలీసులను కాపలా ఉంచారు. రెండు షిఫ్టుల్లో మొత్తం 8 మంది పోలీసులు ఆ ఫ్లెక్సీల వద్ద డ్యూటీ చేస్తున్నారు. అదే వీధిలో నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయబోగా.. మంత్రి, ఆయన అనుచరులు అడ్డుకున్నారు. ప్రతిష్ట కోసమో లేక మరేదైనా కారణమో తెలియదు గానీ.. తన పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ఇలా పోలీసు కాపలా ఏర్పాటు చేసుకున్నారు. ఇది చూసిన వారంతా ‘మంత్రా.. మజాకా’ అనుకుంటున్నారు. -
ఉత్కంఠగా జూనియర్ కళాశాలల క్రీడా పోటీలు
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్) :జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూనియర్ కళాశాలల అండర్–19 క్రీడా పోటీలు బుధవారం తాడేపల్లిగూడెం మండలంలోని భారతీయ విద్యా భవన్స్‌లో నిర్వహించారు. తొలుత ఈ పోటీలను ప్రిన్సిపాల్ రాజీవ్ కుమార్ శర్మ ప్రారంభించారు. పీడీలు ఆదిరెడ్డి సత్యనారాయణ, బీహెచ్ఎన్ తిలక్, భాస్కరరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతల వివరాలను ఫిజికల్ డైరెక్టర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.ఐజక్ ప్రకటించారు. విజేతల వివరాలు బాలికల విభాగం 200 మీటర్ల పరుగు పందెంలో యు.సింధు(కొవ్వూరు), ఎన్.అమృత(తణుకు), టి.తులసి(ఏలూరు) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. హై జంప్‌లో ఎం.అమృత(తణుకు), జి.మానస(దూబచర్ల), యు.సింధు(కొవ్వూరు), జావాలిన్ త్రోలో ఎస్.శ్రీలత( దూబచర్ల) వై.నాగాంజలి(నిడదవోలు), బి.దీప్తి (కొవ్వురు), వ్యక్తిగత చాంపియన్స్‌గా యు.సింధు (కొవ్వూరు), వై.నాగాంజలి(నిడదవోలు), ఎం.అమృత(తణుకు) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలు సాధించారు. 4 ఇన్‌టూ 100 మీటర్స్ రిలేలో సెయింట్ థెరిసా(ఏలూరు), ఎస్‌కేఎస్‌డీ(తణుకు), ఎంఆర్ జీజేసీ(నిడదవోలు)ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచారు. బాలుర విభాగం : 100, 200 మీటర్లు పరుగు పందెంలో టి.చిన్నబాబు(ఏలూరు), కె.సందీప్(ఏలూరు), డి.సాయికృష్ణ(పెదవేగి), 400 మీటర్లు పరుగు పందెంలో కె.సందీప్(ఏలూరు), కె.సాయికుమార్(ఏలూరు), బి.చంద్రశేఖర్(ఏలూరు), 800 మీటర్ల విభాగంలో జె.శంకరరావు, పి.సోమేశ్వరరావు(ఏలూరు), ఎస్.అనిల్‌కుమార్ (నల్లజర్ల), 1,500 మీటర్లు విభాగంలో బి.మోహన్‌రావు(ఏలూరు), టి.నవీన్(ఆరుగొలను), కె.ఎస్.ఎస్.హనుమాన్(పెనుగొండ), 3,000 మీటర్లు విభాగంలో ఆర్.కృష్ణ చావన్ (నరస్పాపురం), సీహెచ్ తవిటరాజు(ఏలూరు), ఐ.నికిలేష్(ఏలూరు) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. లాంగ్ జంప్‌లో టి.చిన్నబాబు (ఏలూరు), కె.ప్రమోద్‌కుమార్(నారాయణపురం), బి.ఆశోక్‌రావు(ఏలూరు), హై జంప్‌లో కె.శ్రీను (భీమడోలు), కె.ప్రమోద్‌కుమార్ (నరసాపురం), ఎం.నవీన్ (కె.ఆర్.పురం), ట్రిపుల్‌జంప్‌లో బి.ఆశోక్‌రావు(ఏలూరు), బి.చంద్రశేఖర్(ఏలూరు), షార్ట్పుట్లో డి.విద్యాసాగర్ (ఏలూరు), సీహెచ్ ఏసుదాసు(నరసాపురం), ఇ.ఎస్.రాజు (పెదవేగి), జావాలిన్త్రోలో డి.సుధీర్, ఎల్.కుమార్(దూబచర్ల), ఎస్.రాజశేఖర్‌రెడ్డి(కె.ఆర్.పురం), డిస్కస్‌త్రోలో సీహెచ్ ఏసుదాసు (నరసాపురం), డి.విద్యాసాగర్(ఏలూరు), డి.సుధీర్(పెదవేగి) విజయం సాధించారు. వ్యక్తిగత చాంపియన్స్‌గా టి.చిన్నబాబు, కె.శంకర్, సీహెచ్ ఏసుదాసు, డి.విద్యాసాగర్ నిలిచారు. అలాగే 4 ఇన్ టూ 100 రిలేలో ఎన్‌ఎస్‌ఆర్‌కే జూనియర్ కాలేజీ(ఏలూరు), ఏపీఎస్‌డబ్ల్యూఆర్(పెదవేగి), ఎస్‌పీడీబీటీ(ఏలూరు)జట్లు నిలిచాయి. 4 ఇన్ టూ 400 రిలేలో ఎన్‌ఎస్‌ఆర్‌కే జూనియర్ కాలేజీ(ఏలూరు), ఏపీఎస్‌డబ్ల్యూఆర్(పెదవేగి), ఎస్వీజేసీ(భీమడోలు) విజేతలుగా నిలిచాయి. -
కట్న రక్కసికి వివాహిత బలి
తాడేపల్లిగూడెం రూరల్ : అదనపు కట్నం కోసం ఓ వివాహితను ఆమె భర్త హత్యచేశాడంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. తాడేపల్లిగూడెం కొబ్బరితోట ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని కొబ్బరితోట కాశీవిశ్వేశ్వరస్వామి వీధిలో నివాసముంటున్న ఉర్రింకల గంగాధరరావుకు కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన జానకి (32)కి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో రెండెకరాల పొలం, లాంఛనాలు అందజేశారు. గంగాధరరావు ఓ ప్రైవేట్ సంస్థలో అటెం డర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్లపాటు వీరి సంసారం సజావుగా సాగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నా రు. మూడేళ్లుగా అదనపు కట్నం కోసం జానకిని గంగాధరరావు వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె పుట్టింట్లో నే ఉంటోంది. ఇటీవల పెద్దల సమక్షంలో వీరు గొడవ లు సర్దుబాటు చేసుకున్నారు. శనివారం సాయంత్రం జానకిని పుట్టింటి నుంచి తాడేపల్లిగూడెంలోని తన ఇం టికి గంగాధరరావు తీసుకువచ్చాడు. తర్వాత జానకి తల్లి పరమేశ్వరి కుమార్తె క్షేమ సమాచారం కోసం గంగాధరరావుకు ఫోన్ చేయగా స్విచాఫ్ చేసి ఉంది. దీంతో కంగారుపడిన ఆమె ఆదివారం ఉదయం తాడేపల్లిగూడెం చేరుకుంది. అప్పటికే జానకి మృతి చెంది ఉండటా న్ని చూసి తట్టుకోలేకపోయింది. అదనపు కట్నం కోసం తన కుమార్తెను గంగాధరరావు హత్య చేసి ఉంటాడని ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు సీఐ మూర్తి, ఎ స్సై ఎం.సూర్యభగవాన్ మృతదేహాన్ని పరిశీలించి పో స్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొబ్బరిపాకలో దారుణం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొబ్బరిపాకలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీంతో భర్తే చంపాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. దాంతో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుని మృతదేహం లభ్యం
తాడేపల్లిగూడెం రూరల్ : ఏలూరు కాలువలో ప్రమాదవశాత్తు పడి గల్లంతైన మారిశెట్టి గోవిందరావు (28) మృతదేహం గురువారం సాయంత్రం లభ్యమైంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆదేశాల మేరకు అధికారులు ఏలూరు కాలువలో ముమ్మరంగా గాలించారు. పడాల మార్కెట్ యార్డు సమీపంలో గురువారం గోవిందరావు మృతదేహాన్ని అగ్నిమాపకశాఖ సిబ్బంది గుర్తించి బయటకు తీశారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది మృతదేహానికి పంచనామా నిర్వహించి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విధి మిగిల్చిన విషాదం స్నేహితులతో కలిసి తెలియని వ్యక్తి కర్మకాండలకు వెళ్లి విధి వంచించడంతో గోవిందరావు బలైపోయాడు. అందరికీ తలలో నాలుకలా ఉండే గోవిందరావు ఇక లేడనే విషయం కుటుంబ సభ్యులు, స్నేహితులకు మింగుడు పడటం లేదు. మృతుని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చేతికొచ్చిన బిడ్డ ఇలా ఎర్ర నీటికి బలైపోతాడని అనుకోలేదని.. రేపో.. మాపో పెళ్లి చేద్దామనుకుంటున్న తరుణంలో ఇలా చేసేవేంటి భగవంతుడా అంటూ తండ్రి సత్యనారాయణ బోరున విలపించారు. 12 రోజుల వ్యవధిలో ఇదే కాలువలో ఇద్దరు దుర్మరణం చెందడం పట్టణ ప్రజల్ని నిర్వేదానికి గురిచేస్తోంది. -
ఏలూరు కాలువలో యువకుడి గల్లంతు
తాడేపల్లిగూడెం రూరల్ : స్థానిక ఏలూరు కాలువలో బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు గల్లంతయ్యాడు. కడకట్లకుS చెందిన మారిశెట్టి గోవిందరావు (28) పట్టణానికి చెందిన ఓ ప్రముఖుని బంధువు మృతి చెందడంతో దహన కార్యక్రమాలకు వెళ్లాడు. యాగర్లపల్లి కొత్త బ్రిడ్జి ఇటుకల బట్టీ సమీపంలో ఆ కార్యక్రమాలన్నీ ముగించుకుని ఆ పక్కనే ఉన్న ఏలూరు కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోయాడు. దీంతో బంధువులు, మిత్రులు ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించారు. ఇంకా ఆచూకీ కానరాలేదు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గోవిందరావు వెల్డింగ్ పనిచేస్తూ కడకట్లలో నివాసముంటున్నాడు. తల్లి మృతి చెందగా.. తండ్రి ఒడిశాలో వెల్డింగ్ పనిచేస్తుంటాడు. మృతునికి ఇద్దరు అక్కలు. వీరిద్దరికీ వివాహాలయ్యాయి. ఇదిలా ఉంటే ఘటనా స్థలాన్ని తహసీల్దార్ పాశం నాగమణి సందర్శించారు. చీకటి పడటంతో గాలింపును ఆపేశారు. తిరిగి గురువారం ఉదయం గాలింపు చేపట్టనున్నట్టు తహసీల్దార్ తెలిపారు. గజ ఈతగాళ్లను కూడా రప్పించాలని ఫైర్ సిబ్బందిని ఆదేశించారు. పెళ్లి చేద్దామనుకుంటుండగానే ఇలా.. గోవిందరావుకు వివాహం కాలేదు. తండ్రి వేరే రాష్ట్రంలో పనిచేస్తుంటాడు. తాడేపల్లిగూడెం కడకట్ల ప్రాంతంలో గోవిందరావు ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో అతనికి పెళ్లి చేయాలని బంధువులు నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం అతని మావయ్య పోలయ్య తదితరులు పెళ్ళిసంబంధాల గురించి మాట్లాడుతుండగానే ఈ ఘటన జరగడం వారిని హతాశులను చేసింది. పడాల అయ్యప్పస్వామి గుడి రేవులో అల్లుడి కోసం పోలయ్య ఆశగా ఎదురు చూడటం పలువురిని కంటతడి పెట్టించింది. పన్నెండు రోజుల వ్యవధిలో ఇద్దరు! ఏలూరు కాలువలో పన్నెండు రోజుల వ్యవధిలో ఇద్దరు గల్లంతయ్యారు. గత నెల 29న ఇంజనీరింగ్ విద్యార్థి మాకా ఫణికుమార్ ఈతకు వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మరుసటి రోజు ఉదయం అతని మృతదేహం యాగర్లపల్లి బ్రిడ్జి సమీపంలో లభ్యమైంది. ఆ ఘటన మరువక ముందే గోవిందరావు గల్లంతు కావడం స్థానికులతోపాటు పట్టణ వాసులను కలవరపరుస్తోంది. కాలువ వెంబడి ఉన్న రేవుల్లో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు గోదావరికి చేరడంతో ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇది కూడా ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. -
పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యార్థి గురువారం రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. కళాశాల భవనంపై నుంచి కిందకి దూకాడు. దీంతో అతడు రక్తపు మడుగులో పడిపోయాడు. సహచర విద్యార్థులు వెంటనే స్పందించి... కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడిని విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా శుక్రవారం ఉదయం కళాశాలలోని విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. -
28న జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): తాడేపల్లిగూడెం కళాపరిషత్ ఆధ్వర్యంలో పద్మశ్రీ రేలంగి అండ్ టీఆర్ త్యాగరాజు స్మారక జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు ఈ నెల 28న ఆదివారం నిర్వహించనున్నట్టు పరిషత్ వ్యవస్థాపకుడు కోపల్లె శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోటీలు తాడేపల్లిగూడెంలోని బీవీఆర్ కళాకేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీలోపు వచ్చిన పౌరాణిక–జానపద విభాగంలో 15 ఎంట్రీలు, చారిత్రక–సాంఘిక విభాగంలో 10 ఎంట్రీలు స్వీకరిస్తామని తెలిపారు. వివరాలకు పరిషత్ వ్యవస్థాపకుడు కోపల్లె శ్రీనివాస్, ఎస్వీవీ నికేతన్, కె.పెంటపాడు, తాడేపల్లిగూడెం, సెల్ 92474 51856 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
తాడేపల్లిగూడెంలో బాంబు కలకలం
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో మంగళవారం ఉదయం బాంబు కలకలం రేగింది. స్టేషన్లో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రయాణికుల వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీ నిట్‌లో 24 నుంచి కౌన్సెలింగ్
తాడేపల్లిగూడెం : జాతీయ సాంకేతిక విద్యా సంస్థల(నిట్)లో సీట్లకోసం కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించే సంయుక్త సీట్ల కేటాయింపు అథారిటీ(జోసా-2016) ప్రకారం జేఈఈ -2016 మెయిన్స్ ర్యాంకులను జూన్ 23న ప్రకటిస్తారని నిట్ ఏపీ రెసిడెంటు కో ఆర్డినేటర్ డాక్టర్ టి.రమేష్ శనివారం తెలిపారు. ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులు తమ పేర్లను జోసాలో ఆన్లైన్లో నమోదు చేసుకొని దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలలో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. జూన్ 24వ తేదీ ఉదయం పది గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు తమ ఐచ్ఛికాలను(ఆప్షన్స్) ఇవ్వవచ్చన్నారు. తొలి విడత సీట్ల కేటాయింపు జూన్ 30వ తేదీ ఉదయం పది గంటలకు ఉంటుందన్నారు. తర్వాత క్రమంలో మూడు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మొదటి విడతలో ఎన్ఐటీలలో సీటు పొందిన అభ్యర్థులు రీజినల్ రిపోర్టింగ్ సెంటరైన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల విజయవాడలో రిపోర్టు చేయాలన్నారు. తాడేపల్లిగూడెంలో శ్రీ వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న ఏపీ నిట్‌లో సీటు పొందిన వారికి ఇది ప్రాంతీయ కేంద్రం కాదన్నారు. ఇక్కడ సీటు పొందిన వారు కూడా విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో మాత్రమే రిపోర్టు చేయాలన్నారు. నాలుగు రౌండ్లుగా కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత ఎన్ఐటీ ఏపీలో సీటు పొందిన అభ్యర్థులు ఫిజికల్ రిపోర్టింగ్ కోసం తాడేపల్లిగూడెంలోని శ్రీ వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలోని ఏపీ నిట్ ప్రాంగణానికి రావాలన్నారు. ఫిజికల్ రిపోర్టింగ్ షెడ్యూలు, మొదటి సంవత్సర తరగతుల ప్రారంభానికి సంబంధించిన సమాచారం తర్వాత ప్రకటిస్తామన్నారు. దీనిపై వివరాల కోసం ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్ఐటీఏఎన్డీహెచ్ఆర్ఏ.ఏసీ.ఇన్ను చూడాలన్నారు. సీట్ల కేటాయింపు ప్రక్రియ, అప్‌గ్రెడేషన్, రిపోర్టింగ్ వివరాలకోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. జేఓఎస్ఏఏ.ఎన్ఐసీ.ఇన్ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు. -
రేషన్‌షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
తాడేపల్లిగూడెం: పలు రేషన్ షాపులపై విజిలెన్స్ అధికారులు శనివారం దాడి చేశారు. సరుకులను సీజ్ చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని షాపు నంబర్ 30, 57, 58, 79 ల్లో దాడులు చేశారు.రికార్డుల్లో భారీగా అవకతవకలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఆయా షాపుల వద్ద మొత్తం రూ.24,138 విలువైన సరుకులను స్వాధీనం చేసుకుని, పక్క షాపులకు అప్పగించినట్లు విజిలెన్స్ ఎస్ఐ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. -
తైక్వాండో సమరం
-తాడేపల్లిగూడెంలో రాష్ట్రస్థాయి టోర్నమెంట్ -నేటి నుంచి పోటీలు తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తైక్వాండో చాంపియన్‌షిప్-2016 పోటీలు గురువారం సాయంత్రం స్థానిక డీఆర్ గోయంకా మహిళా కళాశాలలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల తర్వాత తొలిసారిగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 13 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు తరలివచ్చారు. సబ్ జూనియర్ (అండర్-12), క్యాడెట్ (అండర్-14), జూనియర్ (అండర్-17), సీనియర్ (17+) విభాగాల్లో, బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం అధికారికంగా పోటీలు ప్రారంభమవుతాయి. తొలిరోజు పూమ్సే (విన్యాసాలు), రెండో రోజు కురోగి (యుద్ధ విన్యాసాలు) విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ఏఆర్‌కే వర్మ, కైండ్ నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావు విలేకరులకు తెలిపారు. ప్రధాన రిఫరీగా అసోసియేషన్ కార్యదర్శి గుణ్ణం కృష్ణమోహన్ వ్యవహరిస్తారు. ప్రతి కోర్టుకు ముగ్గురు కార్నర్ రిఫరీలు, ఒకరు సెంట్రల్ రిఫరీ ఉంటారని వివరించారు. -
ఏపీ నిట్ ఫస్టియర్ ఫలితాలు విడుదల
తాడేపల్లిగూడెం : ఏపీ నిట్ ఫస్టియర్ రెండో సెమిస్టర్ ఫలితాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. రెండు సెమిస్టర్లలో 9.87 గ్రేడ్ పాయింట్లతో బెంగళూరుకు చెందిన శ్రేయ శశిధర్ కుడారి ప్రథమ స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన సత్యవిజయ వాగ్దేవి ద్వితీయ స్థొనం పొందింది. మొత్తం 416 మంది విద్యార్థులు నిట్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 327 మంది అన్ని సబ్జెక్ట్‌ల్లో ఉత్తీర్ణత సాధించారు. పరీక్షా ఫలితాలను వైబ్సైట్లో ఉంచామని, విద్యార్థులు తమ లాగిన్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని ప్రొఫెసర్ రమేష్ పేర్కొన్నారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో హాజరు తగ్గిన 42 మంది విద్యార్థులను డిటెయిన్ చేశామని, వారితోపాటు సెమిస్టర్ తప్పిన విద్యార్థులకు ఈనెల 30 నుంచి సమ్మర్ క్వార్టర్ నిర్వహిస్తామని తెలిపారు. వారికి జూలైలో తిరిగి పరీక్షలు ఉంటాయన్నారు. -
నిట్ భవన నిర్మాణాలకు లైన్‌క్లియర్
తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) శాశ్వత భవనాల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఇక్కడ విమానాశ్రయ భూములలో నిట్ నిర్మాణం కోసం 172.80 ఎకరాల భూమిని కేటాయించారు. గత ఏడాది ఆగస్టు 20న నిట్ శాశ్వత భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నిబంధనల ప్రకారం ఈ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి నిట్‌కు దఖలు పర్చాలి. ఎలినేషన్ ప్రక్రియగా పేర్కొనే ఈ తతంగం పూర్తికావడానికి దాదాపు ఎనిమిదినెలలు పట్టింది. ఈ భూములను నిట్‌కు దఖలు పరుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూశాఖ ద్వారా అడ్వాన్సు పొజిషన్ ఇచ్చింది, సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షణలో భూముల చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టింది. ఈ పనులు దాదాపుగా పూర్తికావస్తున్నాయి. నిట్ భూములకు సంబంధించి ఎలినేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. దీని వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. అధికారికంగా మరో రెండు రోజుల్లో ఏపీ నిట్ అధికారులకు చేరనున్నాయి. ఆరునెలల్లో డీపీఆర్ నిట్ శాశ్వత భవనాల నిర్మాణానికి ఆరు నెలల్లో డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు కానుంది. డీపీఆర్ తయారీకి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మానవనరుల మంత్రిత్వశాఖకు తెలియచేశారు. శాశ్వత భవనాల కోసం ఏమేరకు నిధులు కావాలి, ఎంత విస్తీర్ణంలో భవనాలను నిర్మించుకోవాలనుకుంటున్నారు, ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు అనే విషయాలు కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ద్వారా కేంద్ర క్యాబినెట్‌కు వెళతాయి, క్యాబినెట్ అప్రూవల్ తర్వాత శాశ్వత భవనాల నిర్మాణ పనులు మొదలవుతాయి. ఆరు నెలలో వ్యవధిలో ఈ పనులు పూర్తికాగలవని ఏపీ నిట్ రెసిడెంటు కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ టి.రమేష్ తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యత ఏపీ నిట్‌కే నిట్ శాశ్వత భవనాల నిర్మాణాల కోసం ఢిల్లీలోని ఎడ్యూసెల్ మాస్టర్‌ప్లాన్ తయారుచేయాలి. ఈ ప్లాన్‌తోపాటు, ఇక్కడి పరిస్థితులకనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసుకునే వెసులుబాటును ఏపీ నిట్‌కు కల్పించారు. డీపీఆర్, మాస్టర్ ప్లాన్ తయారీలో ఐఐటీ ప్రొఫెసర్లు, ఇతర నిపుణులను తీసుకోనున్నారు. ఈ బృందం తయారు చేసిన డీపీఆర్ ఆధారంగా వచ్చే విద్యాసంవత్సరం ముగిసేలోగా నిట్‌కు శాశ్వత భవనాలు సిద్ధం కానున్నాయి. కొత్త హాస్టల్ భవనాలు సిద్ధం నిట్ తొలి ఏడాది విద్యార్థులలో బాలికల కోసం తాత్కాలిక క్యాంపస్‌లో హాస్టల్ వసతి కల్పించారు. బాలుర కోసం నల్లజర్లలో హాస్టల్ ఏర్పాటుచేశారు. రెండో సంవత్సరం వచ్చే బాలుర కోసం పెదతాడేపల్లిలో, బాలికలకు వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలోని మరో కొత్త భవనాన్ని సిద్ధం చేశారు. రెండు నెలల ఆలస్యంగా నిట్ తొలి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో వారానికి ఐదు రోజులపాటు తరగతులకు బదులు, ఆరు రోజులు నిర్వహించారు. దీంతో మే పదో తేదీ నాటికి సెకండ్ సెమిస్టర్ పరీక్షలు పూర్తవుతాయి. దీంతో నిట్ తొలి ఏడాది తరగతులు పూర్తవుతాయి. మే పదో తేదీ నుంచి సెలవులు ఇస్తున్నారు. జులై 25, 26 తేదీలలో సెలవులు పూర్తవుతాయని ఏపీ నిట్ రెసిడెంటు కో- ఆర్డినేటర్ ప్రొఫెసర్ రమేష్ తెలిపారు. -
ఆటో, బస్సు ఢీ..10 మందికి గాయాలు
పెంటపాడు మండలం ముదునూరు వద్ద తాడేపల్లిగూడెం - భీమవరం రోడ్డుపై ఆటోను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
యానాదుల అభివృద్ధికి కృషి
తాడేపల్లిగూడెం రూరల్ : యానాదుల సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతోపాటు వారి అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. మండలంలోని పడాల మార్కెట్ యార్డులో శనివారం జరిగిన యానాదుల ఐక్యగర్జన మహాసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్రిటిష్ తరహా విధానాలను అనుసరించడం వల్ల పేదలంతా పేదలుగానే మిగిలిపోయారన్నారు. యానాదుల జాతి గుర్తింపునకు, రక్షణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. పేదలు ఉన్నత విద్యావంతులైనప్పుడే అసమానతలు తొలగుతాయని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. యానాదుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఇళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ యానాదులు రాజకీయంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని చెప్పారు. బీసీ జాబితాలోని ఉపకులాలను ఎస్సీ జాబితాలో చేర్చడం వల్ల ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందన్నారు. తొలుత గొల్లగూడెం సెంటర్ నుంచి యానాదులు ర్యాలీగా పడాల మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అనంతరం సంఘ జిల్లా అధ్యక్షుడు మేకల ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన మహాసభలో గ్రేహౌండ్స్ ఎస్పీ వెంకటేశ్వర్లు, యానాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి శ్రీనివాస్, మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, పడాల మార్కెట్ కమిటీ చైర్మన్ పాతూరి రామ్‌ప్రసాద్‌చౌదరి, సినీ కళాకారుడు పి.ఆంజనేయులు తదితరులు మాట్లాడారు. -
పోయింది గోరంత.. బొక్కింది కొండంత
తాడేపల్లిగూడెంలోని ఓ సిగరెట్ల వ్యాపారి గోడౌన్ అది. అందులోకి ఓ చిల్లర దొంగ చొరబడ్డాడు. క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.3 వేలను దొంగిలించాడు. ఇదే అదునుగా సదరు వ్యాపారి భారీ మోసానికి తెగబడ్డాడు. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అక్షరాల రూ.45 లక్షల్ని పరిహారంగా పట్టేశాడు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, పోలీసుల చేతులు తడిపాడు. కొన్ని నెలల తరువాత ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అసలు కథ బయటకు పొక్కింది. అవాక్కైన సదరు వ్యాపారి, పోలీసులు కలసి వాస్తవాలను బయటపెట్టిన ఇద్దరు కార్మికులపై కేసు పెట్టారు. అసలు కేసును తిరగదోడాలని అధికారి ఆదేశించినా.. పోలీసులు మాత్రం ఆ కేసును మరుగున పడేశారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : కేవలం రూ.మూడు వేలు చోరీ కాగా.. ఓ సిగరెట్ల గోడౌన్ యజమాని, ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లు, పోలీసులు కుమ్మక్కై రూ.45 లక్షలను అడ్డంగా నొక్కేసిన వైనం తాడేపల్లిగూడెంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణం పూర్వాపరాలిలా ఉన్నాయి. గత ఏడాది మే నెలలో తాడేపల్లిగూడెంలోని ఓ ప్రముఖ సిగరెట్ కంపెనీ డీలర్‌కు చెందిన గోడౌన్లో సుమారు రూ.50 లక్షల విలువైన సిగరెట్లు చోరీ అయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణ చేపట్టిన పోలీసులు రాజస్థాన్‌కు చెందిన ఓ దొంగ ఈ చోరీకి పాల్పడ్డాడని నిర్ధారించి అరెస్ట్ చేశారు. కానీ.. రికవరీ చూపించలేదు. చోరీ జరిగిందని కేసు నమోదైంది. దొంగ కూడా దొరికాడు. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ పంపించారు. దీంతో సదరు కంపెనీ ప్రతినిధులు విచారణకు వచ్చారు. ఆనక అక్షరాలా రూ.45 లక్షల పరిహారం విడుదల చేశారు. ఇక్కడివరకు అంతాసాఫీగానే సాగింది. ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. ఒక్క ప్యాకెట్ కూడా పోలేదట ఆ తర్వాత కొద్దినెలలకు అదే సిగరెట్ కంపెనీ గోడౌన్ యజమానికి, అందులో పనిచేసే ఇద్దరు కార్మికులకు మధ్య వివాదం చెలరేగింది. యువకులైన ఆ ఇద్దరు కార్మికులు పోలీసులను ఆశ్రయించారు. తమ యజమానికి చెందిన గోడౌన్లో సిగరెట్ బండిళ్ల దొంగతనమే జరగలేదని, అందరూ కుమ్మక్కై రూ.45 లక్షలు దోచేశారని ఫిర్యాదు చేశారు. వాస్తవానికి క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.3 వేలు మాత్రమే చోరీ అయ్యాయని స్పష్టం చేశారు. కానీ.. తమ యజమాని అదే అదనుగా అప్పటికే గోడౌన్లో ఉన్న సిగరెట్ బండిళ్లను వేరే చోటకు ఆటోల్లో తరలించి భారీ చోరీ జరిగిందంటూ తప్పుడు ఫిర్యాదు చేశారని వివరించారు. రూ.3 వేల నగదు తప్ప ఒక్స సిగరెట్ ప్యాకెట్ కూడా పోలేదని చెప్పుకొచ్చారు. తమ యజమాని, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, పోలీసులు కుమ్మక్కై తప్పుడు కేసు కట్టి రూ.లక్షలు పంచుకున్నారని ఆరోపించారు. రూ.45లక్షల్లో రూ.35 లక్షలను గోడౌన్ యజమాని తీసుకోగా, మిగిలిన రూ.10 లక్షలను ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లు, కొంతమంది పోలీసులు నొక్కేశారని చెప్పుకొచ్చారు. బండారం బయటపెట్టిన వారిపైనే కేసులు గోడౌన్ యజమాని ఒత్తిళ్ల మేరకు పోలీసులు సదరు యువకుల ఫిర్యాదును పట్టించుకోకుండా తిరిగి వారిద్దరిపైనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీంతో ఆ ఇద్దరూ ఓ పోలీసు అధికారిని కలిసి మొత్తం కుంభకోణాన్ని వివరించి ఫిర్యాదు చేశారు. స్పందించిన సదరు అధికారి విచారణ చేపట్టగా అందరూ కుమ్మక్కై తప్పుడు కేసు కట్టి రూ.లక్షలు కొట్టేశారని ప్రాథమికంగా రుజువైంది. పక్కా ఆధారాలతో కేసును తిరగదోడాలని ఆయన కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ.. ఆ కేసును పక్కనపడేశారు. సామాజికవర్గ కోణంలో ఆ కుంభకోణానికి సహకరించిన పోలీసులను కాపాడాలనే యత్నంలో భాగంగానే కేసును నిర్వీర్యం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
ఒంటిపై కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్య
తాడేపల్లిగూడెం రూరల్ : వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పట్టింపాలెంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టింపాలెంకు చెందిన కిక్కిరిశెట్టి గణేష్‌కు పెంటపాడు మండలం చింతపల్లికి చెందిన సత్యవేణిలకు 2011 ఫిబ్రవరి 12న వివాహమైంది. వివాహ సమయంలో గణేష్‌కు రూ.5 లక్షల కట్నం, లాంఛనాలు అందజేశారు. కొంతకాలం వీరి సంసారం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు గ్రీష్మ లక్ష్మీ దుర్గ(3), కుసుమ (8 నెలలు) కలిగారు. ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో అధిక కట్నం కోసం అత్తవారు వేధించడంతో ప్రారంభించారు. ఈ క్రమంలో వేధింపులు తాళలేక సత్యవేణి శనివారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి పోతుల మణి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని తాడేపల్లిగూడెం రూరల్ సీఐ గుమ్మళ్ల మధుబాబు, మండల మేజిస్ట్రేట్ పాశం నాగమణి, ఎస్సై వి.చంద్రశేఖర్ పరిశీలించారు. వరకట్న వేధింపుల కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మతురాలు అత్త లక్ష్మీ నర్సమ్మ, భర్త గణేష్, ఆడపడుచు దుర్గా భవానీలను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా సత్యవేణి మతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యో పాపం పిల్లలు.. ‘ఇద్దరు ఆడపిల్లలను తల్లి ఒంటరి చేసి పోయిందే’ అని సత్యవేణి బంధువులు రోదిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది. ఐదేళ్ల, ఎనిమిది నెలల కుమార్తెలు ఇద్దరికీ తమ తల్లి ఏమైపోయిందో తెలియక రోదిస్తుంటే చూపరులు చలించిపోయారు. సత్యవేణి మతితో ఇటు పట్టింపాలెంలోను, అటు చింతపల్లిలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఏటీఎం.. ఎనీ టైం మూత
ఏటీఎంలలో ఉంచేందుకు బ్యాంకులకు నగదు కొరత ఆర్బీఐ నుంచి తగ్గిన నగదు విడుదల కాల్‌మనీ ఘటనా ఓ కారణం! సొమ్ము డ్రా చేసుకునేందకు ఖాతాదారుల అవస్థలు తాడేపల్లిగూడెం : ఏటీఎంలకు వాడుకలో ఉన్న పేరు ఎనీ టైం మనీ అని. వాస్తవానికి ఏటీఎం అంటే ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్. ప్రస్తుతం ఏటీఎంల పరిస్థితి ఎనీ టైం మూత అన్న విధంగా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపు కావటంతో రిజర్వ్ బ్యాంక్ నుంచి ఈ త్రైమాసకానికి(జనవరి నుంచి మార్చి వరకు) బ్యాంకులకు విడుదల చేసే నగదుపై నియంత్రణ విధించారు. ఫలితంగా బ్యాంకుల్లో లిక్విడ్ క్యాష్ నిల్వలు తగ్గాయి. ఆ ప్రభావం ఏటీఎంలపై పడింది. ఆయా బ్యాంకులు రోజు వారీ లావాదేవీలకు అనుగుణంగా ఏటీఏంలలో నగదును ఉంచుతాయి. బ్యాంకులకు వరుసగా సెలవులు ఉన్నట్టయితే ఏటీఎంలనుంచి నగదు విత్ డ్రా చేసుకునేవారికి అసౌకర్యం కలగకుండా ముందు పనిదినాన ఎక్కువ సొమ్మును ఏటీఎంలలో ఉంచుతారు. సుమారు 15 రోజులుగా చాలా ఏటీఎంలలో సంబంధిత బ్యాంకులు నగదు పెట్టలేక వాటికి తాళాలు వేసి ఉంచుతున్నాయి. జిల్లాలో సుమారు 440 బ్యాంకు శాఖల ద్వారా రోజుకు వెయ్యి కోట్ల రూపాయల వరకు నగదు లావాదేవీలు జరుగుతున్నట్టు అంచనా. సంబంధిత బ్యాంకు బ్రాంచి ఉన్న పట్టణాలు అయితే ఆ బ్యాంకుకు చెందిన ఒకటి నుంచి నాలుగు వరకు ఏటీఎంలు ఉంటున్నాయి. బ్యాంకు బ్రాంచిలు లేని గ్రామాలు, పట్టణాల్లో కూడా ఏటీఎంలు ఉన్నాయి. ఇప్పుడు గ్రామాల్లో కూడా ఆర్థిక లావాదే వీలకు ఏటీఎంలపై ఆధారపడటం ఎక్కువైంది. ఎవ్వరికైనా సొమ్ములు ఇవ్వాలంటే ఏటీఎం దగ్గరకు రా.. డ్రా చేసి ఇస్తాను అనే పరిస్థితి ఉంది. ఆర్బీఐ నుంచి తగ్గిన నగదు కేటాయింపులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల లావాదేవీలకు నుగుణంగా రిజర్వుబ్యాంకు నుంచి నగదును సంబంధిత బ్యాంకులకు కేటాయిస్తారని బ్యాంకు అధికారులు తెలిపారు. ఆర్థిక సంవత్సరాంతం వచ్చే సరికి ఈ కేటాయింపులను రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది. దీంతో ఆర్థిక సంవత్సరంలో చివరి నెల అయిన మార్చిలో బ్యాంకులకు నగదు కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. దీంతో అన్ని ఏటీఎంలలో సొమ్ములు ఉంచలేని పరిస్థితి కొన్ని రోజులుగా జిల్లాలో ఏర్పడింది. ఈ కారణంగా కొన్ని ఏటీఎంలను చాలా రోజలపాటు మూసేస్తున్నారు కూడా. -
'ఫిరాయింపులను ప్రోత్సహించడం నీచమైన చర్య'
తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) : ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడం సహేతుకచర్య కాదని వైసీపీ నేత, అమలాపురం నిమోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జీ అన్నారు. నర్సాపురం పార్లమెంట్ వైసీపీ ఇన్చార్జ్ వంక రవీంద్రతో కలసి శనివారం తాడేపల్లిగూడెంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ పాలన సరిగ్గా సాగాలంటే ప్రతిపక్షాలు బలంగా ఉండాలన్నారు. ప్రజల్లో జగన్‌పై అభిమానం ఉందని, టీడీపీ ఎన్నికలకు వస్తే అది రుజువు అవుతుందని వ్యాఖ్యానించారు. -
ఈలి నానికి మంత్రి పైడికొండల సవాల్
తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) : మాజీ ఎమ్మెల్యే ఈలి నాని తనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సవాల్ విసిరారు. మంత్రి శనివారం తాడేపల్లిగూడెంలో విలేకరులతో మాట్లాడుతూ.. తాడేపల్లి నుంచి న్యూఢిల్లీ వరకు ఎక్కడైనా తాను కేసులు పెట్టించినట్లు నాని నిరూపించగలడా అని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టించినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. ఈలి నానిపై తాను తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నానని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంత్రి పైడికొండల మాణిక్యాల్‌రావు స్పందించారు. నాని నిరూపించలేని పక్షంలో ఏం చేస్తాడో ఆయన విజ్ఞతకే వదిలేస్తానని అన్నారు. -
ఇసుక ఉచిత సరఫరాపై త్వరలో స్పష్టత
తాడేపల్లిగూడెం : ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని రంగాల నుంచి మద్దతు లభిస్తుందని గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. పట్టణంలో 15వ వార్డులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇసుక ఉచితంగా సరఫరా చేసే విధానానికి సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల నిర్మాణరంగ అభివృద్ధికి చేయూత నిచ్చినట్టేనన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. పర్యావరణ పరిరక్షణ, ర్యాంపుల నిర్వహణ తదితర అంశాలపై పరిశీలన చేసిన అనంతరం ఇసుక సరఫరా విషయంలో స్పష్టమైన విధానం ప్రకటిస్తారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మరో ముఖ్యఅతిథి దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ అమృత్ పథకానికి సంబంధించి రానున్న రాష్ట్ర బడ్జెట్లో మ్యాచింగ్ గ్రాంటుగా 50 శాతం నిధులను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అమృత్ ద్వారా పట్టణాలలో మౌలికవసతుల కల్పన జరుగుతుందన్నారు. మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే బడ్జెట్లో జిల్లాకు జీరో
రైల్వే బడ్జెట్లో ఒరిగిందేమీలేదు తాడేపల్లిగూడెం :ఊరింపులు.. నిరీక్షణలు.. చివరకు ఉసూరుమనిపించాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ జిల్లా ప్రజల ఆశలను నీరుగార్చింది. ప్రజల చిరకాల వాంఛ అయిన కోటిపల్లి-నరసాపురం, కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్ల నిర్మాణ ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌కు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో పేర్కొన్నా.. ఆ నిధులు సర్వే పనులకు సైతం సరిపోవు. ఈ లైన్ ప్రతిపాదనను బతికించడానికి చేసిన కేటాయింపులే తప్ప ఎందుకూ అక్కరకు రావన్న విషయం తెలిసి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. మరోవైపు జిల్లా మీదుగా కొత్త రైళ్లు నడిపే ప్రకటనలేవీ లేకపోగా.. కనీసం హాల్టులు కూడా కల్పించలేదు. ‘కోటి’పల్లి ఆశలపై నీళ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం.. ఆ పార్టీ ఎంపీ ఒకరు జిల్లాలో ఉండటం.. అభివృద్ది విషయంలో తరచూ ఢిల్లీ వెళ్లి వినతులు సమర్పించే రాష్ట దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జిల్లాలో బీజేపీ ఆశాజ్యోతిగా ఉండటంతో.. ఈసారి తప్పకుండా రైల్వే పరంగా ఎంతోకొంత ప్రయోజనం కలుగుతుందని అంతా భావించారు. అయినా.. కేంద్రమంత్రి సురేష్‌ప్రభు ఎప్పటిలా మన జిల్లాను చిన్నచూపు చూశారు. నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్ ఈసారి సాకారం అవుతుందని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఆశించారు. ఈ లైన్ నిర్మాణం కోసం అటు కోనసీమ, ఇటు నరసాపురంలో ఆందోళనలు సైతం జరిగాయి. కేవలం 60 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మిస్తే ఉభయ గోదావరి జిల్లాలకు ప్రయోజనం కలగటంతోపాటు అవసరమైనప్పుడు రైళ్ల దారి మళ్లింపు, దూరప్రాంత రైళ్ల పెంపు సాధ్యమవుతుంది. సుమారు రూ.3 వేల కోట్లు కేటాయిస్తే తప్ప ఆచరణకు నోచుకోని ఈ లైన్ కోసం రూ.200 కోట్లు విదిల్చి చేతులు దులిపేసుకోవడం చర్చనీయాంశమైంది. మూడో లైన్ ముచ్చట లేదు విజయవాడ నుంచి విశాఖై వెపు గల మార్గంలో రైళ్ల ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. కొత్తగా నడుపుతున్న సూపర్ ఫాస్ట్ రైళ్లకు ప్రధాన స్టేషన్లలో కూడా హాల్టు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ట్రాక్ సామర్థ్యానికి మించి రైళ్లను నడుపుతున్నామని.. ఇకపై కొత్త రైళ్లు నడపలేమని, కొత్త హాల్టులు గాని ఇవ్వలేమని రైల్వే ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మూడో లైన్ నిర్మాణమే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన రైల్వే లైన్ మీదుగా మూడో లైన్ అందుబాటులోకి వస్తుందని ఇటీవల ఏలూరులో దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం చెప్పారు. ఖాజీపేట నుంచి విజయవాడ వరకు మూడోలైన్ నిర్మాణం కోసం బడ్జెట్లో రూ.114 కోట్లను కేటాయించారు. ఇదే లైన్‌ను విశాఖ వరకు విస్తరించి ఉంటే జిల్లాకు ప్రయోజనం కలిగేది. -
బీజేపీ vs టీడీపీ...ఓ మొక్క కేసు
► కేసు విషయంలో మంత్రి పైడికొండల జోక్యం ! ► ఆయన మాట వినొద్దంటున్న టీడీపీ నేతలు ► ఇరకాటంలో ‘గూడెం’ ఖాకీలు సాక్షి ప్రతినిధి, ఏలూరు :తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో ఇరుగు పొరుగు వారిమధ్య చోటుచేసుకున్న వివాదంలో నిందితుల తరఫున దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వకాల్తా పుచ్చుకోవడం వివాదాస్పదమవుతోంది. నిందితులపై కేసు కట్టకుండా వదిలేయాలంటూ ఆయన ఒత్తిడి తేవడం, పదేపదే ఆ కేసులో జోక్యం చేసుకోవడం పోలీసు అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. ఇదే సందర్భంలో మంత్రి మాణిక్యాలరావుతో పొసగని తెలుగుదేశం పార్టీ నేతలు రంగంలోకి దిగి.. ‘ఏం ఫరవాలేదు. ఆయన చెప్పినట్టు వినకున్నా మేం చూసుకుంటాం’ అంటూ పోలీసులకు భరోసా ఇవ్వడం ఖాకీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన పుల్లా శ్రీనివాస్ భార్య వెంకట సత్యవతి, ముగ్గురు కుమారులతో కలిసి వ్యవ సాయం చేసుకుంటున్నారు. ఈనెల 7న అదే గ్రామానికి చెందిన తమ్మాబత్తుల ధనరాజు, తమ్మాబత్తుల నాగేశ్వరరావు ఎవరూ లేని సమయం చూసి శ్రీనివాస్ ఇంటి ముందున్న ఓ మొక్కను పీకివేశారు. సాయంత్రం పొలం నుంచి తిరిగి వచ్చిన వెంకట సత్యవతి ఈ విషయం తెలుసుకుని ధనరాజు, నాగేశ్వరరావులను ప్రశ్నించింది. ఇందుకు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆ మొక్కను పీకేశాం. నీ దిక్కున్న చోట చెప్పుకో’ అని దుర్భాషలాడారు. ఆమెపై దౌర్జన్యానికి దిగారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ భార్య ద్వారా విషయం తెలుసుకుని వాళ్లను అడిగేందుకు వెళ్లగా, అతనిపైనా దాడి చేశారు. శ్రీనివాస్‌కు గాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకుని గూడెం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వి.చంద్రశేఖర్ ఐపీసీ 324, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడి నుంచి పోలీసులపై మంత్రి మాణిక్యాలరావు ఒత్తిళ్లు మొదలయ్యాయి. తమ్మాబత్తుల ధనరాజు, నాగేశ్వరరావుపై కేసుల్లేకుండా చూడాలని ఆదేశించారు. అదే సందర్భంలో ధనరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుల్లా శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. ఆధారాలున్నాయని చెబుతున్నా... ఆ కేసులో ధనరాజు, నాగేశ్వరరావు దౌర్జన్యం చేసినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, పుల్లా శ్రీనివాస్ దాడి చేసినట్టు ఆధారాల్లేవని పోలీసులు మొత్తుకుంటున్నా మంత్రి మాత్రం వారిద్దరిపై కేసులు తొలగించాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. పుల్లా శ్రీనివాస్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఓ దశలో ‘నేను చెప్పింది చేస్తావా.. చెయ్యవా.. లేదంటే చెప్పండి. ఎస్పీ, డీఐజీలతో మాట్లాడతా’ అని మంత్రి హెచ్చరించడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక ఖాకీలు తల్లడిల్లిపోతున్నారట. ఇటీవల కాల్‌మనీ కేసులో నిందితుడిగా వార్తల్లోకి ఎక్కిన చేడూరి విశ్వేశ్వరరావు బావమరిది ధనరాజుపై కేసుల్లేకుండా చూడటం కోసం స్వయంగా మంత్రి రంగంలోకి దిగడం చర్చనీయాంశమవుతోంది. మంత్రికి వ్యతిరేకంగా రంగంలోకి టీడీపీ నేతలు ‘మంత్రి మాణిక్యాలరావు చెప్పినట్టు వినకండి. మీరేం చేయాలో అదే చేయండి. మీకేం కాకుండా మేం చేసుకుంటాం’ అంటూ టీడీపీ నేతలు పోలీసుల తరఫున మాట్లాడుతున్నట్టు సమాచారం. పోలీసులపై ప్రేమ కంటే మాణిక్యాలరావుతో ఉన్న వర్గపోరు నేపథ్యంలో టీడీపీ నేతలు ఖాకీలకు మద్దతు ప్రకటిస్తున్నారనేది బహిరంగ ర హస్యం. ఈ విషయమై టీడీపీ నేతలు తమతో మాట్లాడుతున్నారని తెలిస్తే మాణిక్యాలరావుకు కోపం తారస్థాయికి చేరుతుందని పోలీసు వర్గాలు భయపడిపోతున్నాయి. మొత్తంగా అటు మాణిక్యాలరావు ఒత్తిళ్లు.. ఇటు టీడీపీ నేతల ‘కోరుకోని’ మద్దతు మధ్య నలిగిపోతున్న పోలీసులు చివరకు ఆ కేసు విచారణలో ఎలా వ్యవహరిస్తారో చూడాల్సిందే. -
విద్యార్థి అనుమానాస్పద మృతి
కర్నూలు సమీపంలోని రైలు ట్రాక్ పై సూర్యసాయిహరిరావు(22) అనే డిగ్రీ విద్యార్థి ఆదివారం ఉదయం అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. తల ఒక చోట, మొండెం ఒక చోట పడి ఉండడంతో పోలీసులు అనుమానాస్పగద మృతిగా పరిగణిస్తున్నారు. మృతుడు తాడేపల్లిగూడెంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో బీఎస్సీ ఎంపీఐసీ గ్రూపు ఫైనలియర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలియదు. ఎవరో అతణ్ణి చంపి తల ఒకచోట, మొండెం ఒక చోట పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసి నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పరంజా పైనుంచి పడి తాపీ మేస్త్రి మృతి
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్) : స్థానిక పాతూరులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం 20 అడుగుల ఎత్తు పరంజా పైనుంచి భవన నిర్మాణ కార్మికుడు పడటంతో అక్కడిక్కకడే మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక డీఎస్ చెరువు ప్రాంత నివాసి పంజా వెంకట్రావు (46) తాపీ మేస్త్రి. పాతూరులోని కోడేవారి వీధిలో ఓ భవన నిర్మాణంలో అతను పని చేస్తున్నాడు. రోడ్డు వైపు భవనం గోడ నిర్మాణానికిగాను పరంజ ఏర్పాటు చేశారు. భవనం పక్క నుంచి విద్యుత్ తీగలు వెళుతున్నాయి. ఈ విద్యుత్ వైర్లు తగలకుండాను, పైన ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు సున్నం రోడ్డుపై పడకుండాను భారీ బరకం ఏర్పాటు చేశారు. పరంజాపై ఉన్న వెంకట్రావు భవనంపై ఉన్న బరకాన్ని లాగుతుండగా జారి రోడ్డుపై పడిపోయాడు. అతని తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకట్రావుకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఎస్సై సూర్యభగవాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎంతటి దా‘రుణం’
తాడేపల్లిగూడెం : కాల్‌మనీ వేధింపులకు తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు శివారు కేఎస్ఎన్ కాలనీలో వీరమళ్ల కనకదుర్గ బలి కావడంతో మిగిలిన బాధితుల్లో చలనం వచ్చింది. వడ్డీ వ్యాపారుల దారుణాలపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. ఒక్క గురువారం నాడే సుమారు 30 మంది రూరల్ పోలీసులను ఆశ్రయించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ కాలనీ బాధితుల మయం తామర తంపరలుగా వస్తున్న ఈ ఫిర్యాదులపై వాస్తవ సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో సేకరించేందుకు రూరల్ ఏఎస్సై కమ్ముల వెంకటేశ్వరరావు కేఎస్ఎన్ కాలనీకి వెళ్లారు. బాధితుల నుంచి సంపూర్ణ సమాచారాన్ని లిఖితపూర్వకంగా సేకరించారు. ఈ కాలనీలో సుమారు 300కు పైగా ఇళ్లున్నాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకుని ఉన్న వారిని ఖాళీ చేయించి.. వారికి పునరావాసంగా ఈ కాలనీలో ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉండగా జాతీయ రహదారి బైపాస్ పక్కన ఇక్కడ స్థిరపడ్డారు. వీరంతా అవసరార్థం అప్పులు చేసి వడ్డీ వ్యాపారుల ఉచ్చులో చిక్కుకున్నారు. పదేళ్ల క్రితం ఇక్కడ చిరు వ్యాపారంగా రూపుదిద్దుకున్న వడ్డీ దందా నేడు మహా రక్కసిగా మారి పచ్చని కుటుంబాల్లో విషం చిమ్ముతోంది. తాడేపల్లిగూడెం, పెంటపాడు ప్రాంతంలోని చాలామంది వడ్డీ వ్యాపారులకు కేఎస్ఎన్ కాలనీ వడ్డీల వర్షం కురిపించే కల్పవల్లిగా మారింది. పెద్దల ముసుగులో ఉన్న కొందరు ఈ దందాకు సహకారం అందిస్తున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. వంద ఇళ్లు వడ్డీ వ్యాపారుల పాలు రూ.వెయ్యి అప్పు ఇచ్చి.. రూ.లక్ష ఆస్తిని స్వాధీనం చేసుకున్నారని కొందరు, బెదిరించి ఆస్తిని తనఖా చేయించుకున్నారని మరికొందరు.. ఇలా ఒక్కొక్కరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గురువారం రావడం కనిపించింది. పదేళ్లుగా ఈ కాలనీలోని సుమారు వంద గృహాలు వడ్డీ వ్యాపారుల సొంతమైనట్టు సమాచారం. అక్కడి నుంచి అనేక చేతులు మారినట్టు తెలిసింది. పట్టణంలోని ప్రధాన కూడలికి సమీపంలో ఒక మహిళ నూటికి ఆరు రూపాయల వడ్డీపై కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో బాధితులు రుణవిముక్తి పొందలేక.. వ్యాపారుల వేధింపులు తాళలేక చావే శరణ్యమనే స్థితికి వచ్చినట్టు తెలిసింది. కనకదుర్గ ఉదంతం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. పోలీసులు లోతైన దర్యాప్తుచేసి వడ్డీ జలగల పీచమణచాలని బాధిత కుటుంబాలు ప్రాథేయపడుతున్నాయి. -
ఉసురు తీసిన కాల్‌మనీ
-
ఉసురు తీసిన కాల్‌మనీ
వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక మహిళ మృతి తాడేపల్లిగూడెంలో వెలుగు చూసిన కాల్‌మనీ కేసు పోలీస్ స్టేషన్ ఎదుట క్యూ కడుతున్న బాధితులు ముగ్గురు మహిళలదే అక్కడ దందా తాడేపల్లిగూడెం : కాల్‌మనీ వ్యాపారం మన జిల్లాలోనూ ఓ మహిళ ఉసురు తీసింది. అప్పు తీసుకున్న పాపానికి ఒక మహిళను మరో మహిళ వేధించింది. తట్టుకోలేని బాధితురాలు మంగళవారం రాత్రి ప్రాణాలు వదిలింది. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు శివారు కేఎస్ఎన్ కాలనీలో బుధవారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కేఎస్ఎన్ కాలనీలో చిన్నపాటి కిరాణా కొట్టు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరమళ్ల కనకదుర్గ (43) అదే కాలనీకి చెందిన కర్రి రాజేశ్వరి నుంచి కుటుంబ అవసరాలు, బిడ్డల వివాహాల నిమిత్తం 2013-14 సంవత్సరాల మధ్య దఫదఫాలుగా మొత్తం రూ.10 లక్షలు అప్పు తీసుకుంది. ఇందుకోసం ఉంగుటూరు మండలం బాదంపూడి, తాడేపల్లిగూడెం పట్టణం, కొండ్రుప్రోలులోని కేఎస్ఎన్ కాలనీలో తనకు గల ఇళ్ల స్థలాలు, ఇళ్లను కనకదుర్గ తనఖా పెట్టింది. నెలనెలా రూ.40 వేల చొప్పున వడ్డీ రూపంలో రూ.7 లక్షల వరకు రాజేశ్వరికి చెల్లించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో కొంతకాలంగా కనకదుర్గ వడ్డీ కట్టలేని స్థితికి చేరింది. దీంతో అప్పు ఇచ్చిన రాజేశ్వరి, ఆమెకు సోదరుడి వరుసయ్యే సుబ్బిరెడ్డి (అత్తిలి మండలం మంచిలి) వేధించడం మొదలు పెట్టారని మృతురాలు కనకదుర్గ కుమారుడు సత్యనారాయణ రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రూ.10 లక్షల రుణానికి రూ.7 లక్షలు వడ్డీగా చెల్లించినా వారు తీవ్రంగా వేధించడంతో తన తల్లి మృత్యువాత పడిందని ఆరోపించాడు. కాల్‌మనీ కేసులెన్నో.. మృతురాలు కనకదుర్గ కుమారుడు సత్యనారాయణ పోలీసులకిచ్చిన ఫిర్యాదు అనంతరం ఈ ప్రాంతంలో సాగుతున్న వడ్డీ దందాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. కాల్‌మనీ వ్యాపారులు తమను వేధిస్తున్నారంటూ కేఎస్ఎన్ కాలనీకి చెందిన పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కాల్‌మనీ బాధితులతో రూరల్ పోలీస్ స్టేషన్ కిటకిటలాడుతోంది. ఆ ముగ్గురుదే హవా పదేళ్ల క్రితం కేఎస్ఎన్ కాలనీకి వలస వచ్చిన లక్ష్మి, రాజేశ్వరి, సుబ్బిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు కలసి వడ్డీ వ్యాపారం చేస్తూ అక్కడి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఇదే కాలనీకి చెం దిన రవికుమార్ అనే వ్యక్తి విలేకరులకు తెలిపాడు. వాళ్లు రూ.1,000 నుంచి రూ.లక్షల వరకు రుణంగా ఇస్తుంటారని చెప్పాడు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించని పరిస్థితులు కల్పించి రుణగ్రస్తుల పేరిట ఉన్న ఆస్తులను ఈ ముగ్గురు కబ్జా చేస్తుంటారని కాలనీవాసులు చెబుతున్నారు. నూటికి రూ.3 వడ్డీగా ప్రారంభమయ్యే రుణాన్ని కాల క్రమేణా రూ.7, రూ.10 వరకు పెంచుకుంటూ వెళ్తారని అంటున్నారు. ఈ ముగ్గురితోపాటు పెంటపాడు, తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన మరి కొందరు వడ్డీ వ్యాపారం పేరిట కాలనీ వాసుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వాళ్ల వేధింపులే అమ్మ ప్రాణం తీశాయి తీసుకున్న రుణంతోపాటు వడ్డీ మొత్తాన్ని బుధవారం సాయంత్రంలోగా చెల్లించకపోతే మంచిలి నుంచి తన తమ్ముడు వచ్చి సంగతి తేలుస్తాడని రాజేశ్వరి హెచ్చరించడం వల్లే తన తల్లి కనకదుర్గ మృత్యువాత పడిందని కుమారుడు సత్యనారాయణ తెలిపాడు. ప్రైవేట్ టెలికాం కంపెనీలో పనిచేస్తున్న సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. రాజేశ్వరి హెచ్చరించి వెళ్లిన తరువాత స్నానానికని వెళ్లిన తన తల్లి కనకదుర్గ బాత్రూమ్లోనే తనువు చాలించిందని తెలిపాడు. ఆమె బాత్రూమ్లోంచి ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి తాను తలుపు తట్టినా ఎలాంటి అలికిడి లేదన్నారు. దీంతో బాత్రూమ్ పైభాగంలో ఉన్న సిమెంట్ పలకలను తొలగించి చూడగా, తన తల్లి శవమై పడి ఉందన్నారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినప్పటికీ బంధువులు వచ్చే వరకు వేచిచూసి బుధవారం ఉదయం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం కనకదుర్గ మృతదేహానికి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. రూరల్ సీఐ గుమ్మళ్ల మధుబాబు పర్యవేక్షణలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. -
కస్టమ్ మిల్లింగ్‌లో మెలికలు.. అలకలు
ప్రజాప్రతినిధుల జోక్యంతో ఇబ్బందులు ఐకేపీ ధాన్యం కొనబోమని అల్టిమేటం అధికారి దిగిరావడంతో వెనక్కి తగ్గిన వైనం రెండేళ్లుగా ఇదే తరహా తంతు తాడేపల్లిగూడెం : భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ధాన్యం కొనుగోలు నుంచి తప్పుకున్నప్పటి నుంచి జిల్లాలో అనేక చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల అలసత్వం.. మిల్లర్ల అలకలు.. ఉన్నతాధికారుల జోక్యం.. తాత్కాలికంగా సమస్యకు వాణిజ్య ప్రకటనల విరామం మాదిరి గ్యాప్. మళ్లీ నిబంధనల ఉల్లంఘనలు, అలకలు, అల్టిమేటమ్‌లు మామూలే.. రెండేళ్లుగా సాగుతున్న తంతు ఇది. ఐకేపీ ధాన్యం తరలింపు వ్యవహారంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో ఆ కేంద్రాల నిర్వాహకులు రబ్బర్ స్టాంపుగా మారారు. గతంలో మాదిరి రైతు ధాన్యం ఐకేపీ కేంద్రానికి తీసుకెళ్లడం, తేమ శాతం చూసి, అవసరమైతే అక్కడే ధాన్యం ఒకటిరెండు రోజులు నిల్వ చేసి మిల్లర్లకు పంపించడం వంటివి జరిగే వి. ప్రస్తుతం మార్చిన విధానంలో ల్యాండ్టు మిల్ ప్రాతిపదికన ధాన్యం రైతుల నుంచి ఐకేపీ కేంద్ర నిర్వాహకుల కాగితాల అనుమతి పత్రాల ద్వారా మిల్లులకు వెళుతోంది. అక్కడి నుంచి సీఎంఆర్ ( కస్టమ్ మిల్లింగ్ రైస్) రూపంలో బియ్యం ఎఫ్‌సీఐకి చేరుతున్నాయి. జిల్లాలో సుమారు 400 మిల్లులు ఉన్నాయి. వీటిలో 330 మిల్లులు పనిచేస్తున్నాయి. ఐకేపీ ద్వారా మిల్లులకు సీఎంఆర్ నిమిత్తం ధాన్యం పంపేందుకు ఆయా మిల్లుల మర ఆడింపు స్థాయి. గతంలో వారిచ్చిన సీఎంఆర్‌ను ఆధారంగా చేసుకున్నారు. ఈసారి కూడా ఆయా మిల్లులకు లక్ష్యాలను నిర్ణయించారు. దీనికనుగుణంగా ఆయా మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలను ప్రభుత్వానికి చూపించాలి. ఇటీవలి కాలం వరకు ఈ వ్యవహారం సాఫీగానే సాగింది. ఒక ప్రజాప్రతినిధి స్నేహితునిగా చెబుతున్న ఓ వ్యక్తికి ఏలూరు సమీపంలో ఒక మిల్లు ఉంది. ఆ మిల్లుకు అసోసియేషన్ తరఫున కేటాయించిన సీఎంఆర్ లక్ష్యానికంటే అధికంగా ఐకేపీ నుంచి ధాన్యం తోలే విధంగా ఏర్పాటు జరిగింది. అదనంగా తోలుకొనే ధాన్యానికి ఎలాంటి బ్యాంకు గ్యారంటీ చూపించలేదు. సదరు మిల్లర్ అదనంగా తోలుకున్న ధాన్యం వ్యవహారం ఇప్పుడు తలనొప్పిగా మారడంతో ఐకేపీ కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం దింపుకోబోమని మిల్లర్ల ప్రముఖులు అధికారులకు అల్టిమేటం ఇచ్చినట్టు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారి ఒకరు ఏలూరు సమీపంలోని మిల్లుకు కేటాయించిన మేరకే ధాన్యం దింపుకొనేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మిల్లర్లు వెనక్కి తగ్గినట్టు తెలిసింది. సకాలంలో స్పందించి కేంద్ర ఆహార శాఖా మంత్రిని ఒప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో ఎఫ్‌సీఐ లెవీ సేకరణ ప్రక్రియ నుంచి తప్పుకొంది. అప్పటి నుంచి ఇలాంటి అలకలు, సముదాయింపులు షరా మామూలుగా సాగుతున్నాయి. -
అక్కడ ఆమెదే అరాచకం
► టీడీపీ నేత స్నేహితురాలి ‘ఎస్టీడీ’ దందా ► అప్పు తీసుకుంటే అంతేసంగతులు ► సొమ్మంతా ఆ నాయకుడిదే ► అయినా పట్టించుకోని పోలీసులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : విజయవాడ కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కుంభకోణంతోపాటు ఎస్టీడీ వడ్డీ వ్యాపారుల బాధితుల్లో ఎక్కువమంది మహిళలే ఉండగా.. తాడేపల్లిగూడెంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. ఇక్కడ ఓ మహిళే కాల్‌మనీ, ఎస్టీడీ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను పీల్చిపిప్పి చేస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకుడి స్నేహితురాలిగా అందరికీ సుపరిచితమైన ఆమె జోలికి వెళ్లాలంటే ఖాకీలకూ భయమే. రౌడీయిజమే నేపథ్యంగా రాజకీయాల్లో చెలామణీ అవుతున్న ఆ నాయకుడు ప్రస్తుతం పట్టణ తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నాడు. ఆ నాయకుడి దన్నుతోనే ఆ మహిళ ఇష్టారాజ్యంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తోంది. రూ.6 నుంచి రూ.10 వడ్డీతోపాటు తనఖా రిజిస్ట్రేషన్లు చేయించుకుని అప్పులు ఇవ్వడం ఆ మహిళ ప్రత్యేకత. వడ్డీ చెల్లించడం నాలుగైదు రోజులు ఆలస్యమైనా అంతే సంగతులు. ఇళ్ల మీద పడి గొడవలు చేయడం, ఎవరైనా ఒకింత ఎదురుతిరిగితే ఆ నాయకుడు రంగ ప్రవేశం చేసి నరకం చూపించడం షరామామూలుగా సాగిపోతుంటాయి. అప్పు తిరిగి చెల్లించే సందర్భంలో వాళ్లు ఎంత అంటే అంత ముట్టజెప్పాల్సిందే. ముందుగా అనుకున్న వడ్డీ రేటుతో సంబంధం లేదు. అప్పు క్లోజ్ చేసేప్పుడు వడ్డీ రేటు ఎక్కువ చేస్తూ చుక్కలు చూపిస్తుంటారు. ఆమె బాధితుల్లో రిటైర్డ్ పోస్ట్‌మాస్టర్ కుమారుడితోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ కూడా ఉన్నారు. అయితే ఆమెకు అండగా ఉన్న ఆ నాయకుడు ప్రస్తుతం పవర్లో ఉండటం వల్ల ఎవరూ బయటకు వచ్చి చెప్పే సాహసం చేయడం లేదు. వాస్తవానికి ఆమె వడ్డీలకు తిప్పుతున్న డబ్బంతా ఆ నాయకుడిదేనన్న వాదనలూ ఉన్నాయి. ఎక్కడా ఫైనాన్స్ కంపెనీ పేరు లేకుండా ఓ బ్యూటీపార్లర్‌ను అడ్డాగా చేసుకుని ఆమె ఈ దందాకు పాల్పడుతున్నారనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం రాష్ట్రమంతటా జరుగుతున్న వడ్డీ వ్యాపారులపై దాడుల నేపథ్యంలోనూ ఆమె దందా వైపు కన్నెత్తి చూసే సాహసం పోలీసులు చేయడం లేదు. -
మన్యం దరి..జాతీయ రహదారి
భీమవరం-విజయనగరం మధ్య హైవే రూ.5,150 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు తాడేపల్లిగూడెం : భీమవరం రుచుల్ని ఆస్వాదించి.. తాడేపల్లిగూడెంలో అపరాల సువాసనల్ని ఆఘ్రాణించి.. ఉభయగోదావరి జిల్లాల నడుమ గోదారమ్మ పరవళ్లను వీక్షించి.. రాజమహేంద్రవరాన్ని పలకరించి.. రంపచోడవరం, చింతపల్లి, అరకులోయ నడుమ మన్యం అందాలతో కనువిందు చేసుకుంటూ రయ్యిరయ్యిన విజయనగరం చేరుకునే అవకాశం కలగబోతోంది. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం, రంపచోడవరం మీదుగా విజయనగరం వరకూ 515 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని 1,350 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 7 రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ సర్కారు ఇప్పటికే అంగీకారం తెలిపింది. వీటిలో భీమవరం-విజయనగరం జాతీయ రహదారి ఒకటి. కిలోమీటరుకు రూ.10 కోట్లు 515 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణానికి కిలోమీటరుకు రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.5,150 వెచ్చించనున్నారు. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వన్‌టౌన్‌లోని కేఎన్ రోడ్డు (కోడేరు నల్లజర్ల రోడ్డు), తణుకు రోడ్డు మీదుగా నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి మీదుగా విజయనగరం వరకు జాతీయ రహదారి నిర్మిస్తారు. తాడేపల్లిగూడెం నుంచి పిప్పర వరకు ఇప్పటికే నాలుగు వరుసల రోడ్డుగా విస్తరించారు. పుష్కర నిధులతో ఇటీవల తాడేపల్లిగూడెం-భీమవరం రహదారిని మెరుగుపర్చారు. భీమవరం నుంచి చిలకంపాడు లాకుల వరకు గూడెం వచ్చే రోడ్డులో కుడివైపున కాలువ ఉన్న దృష్ట్యా ఎడమ వైపున వ్యవసాయ క్షేత్రాల వరకు రోడ్డును విస్తరిం చాల్సి ఉంది. అక్కడి నుంచి తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ వరకు రెండు పక్కలా కేఎన్రోడ్డులో రోడ్డును విస్తరించుకోవచ్చు. నిడదవోలు మార్గంలో కుడివైపు మాత్రమే రహదారిని విస్తరించాల్సి ఉంటుంది. ఎడమ పక్కన గోదావరి- ఏలూరు కాలువ ఉన్న కారణంగా ఒకపక్క మాత్రమే రోడ్డును విస్తరించే అవకాశం ఉంది. నిడదవోలు రైల్వేగేటు సమీపంలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించుకోవాల్సి ఉంటుంది. సమిశ్రగూడెం నుంచి విజ్జేశ్వరం వరకు కుడి వైపున, విజ్జేశ్వరం నుంచి కొవ్వూరు మార్గంలో కుడి వైపున రోడ్డు విస్తరించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కొవ్వూరు- రాజమండ్రి వంతెన లేదా బైపాస్ మార్గంలో రాజమండ్రి మీదుగా రంపచోడవరం, చింతపల్లి, అరకు, విజయనగరం వరకు ఈ రహదారి నిర్మిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా శాఖకు 2016 డిసెంబరు నెలాఖరులోగా డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) అందజేయడంతోపాటు, అనంతరం సకాలంలో భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయగలిగితే నిర్మాణానికి నిధులు విడుదలవుతాయి. ఈ కొత్త జాతీయ రహదారి నిర్మాణం భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాలకు ప్రయోజనకరమే. భీమవరం నుంచి ఆక్వా ఉత్పత్తులు, తాడేపల్లిగూడెం నుంచి ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, అపరాలు, నూనెలు, ధాన్యం వంటి సరుకుల్ని ఉత్తరాంధ్రకు సులభంగా రవాణా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ రహదారిని ఆనుకుని వ్యాపారాలు విస్తరించే అవకాశాలు మెరుగవుతాయి. -
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి
-
‘గూడెం’ అంబాసిడర్‌గా కృష్ణవంశీ
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు సినీ దర్శకుడు కృష్ణవంశీ అంగీకరించారు. ఆయనతో కలసి తాడేపల్లిగూడెం అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు సినీ హీరో సుమన్ ప్రతినిధితో ఎస్పీ మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. ప్రజలకు పోలీసు శాఖ ద్వారా అందే సేవలు, ట్రాఫిక్ సమస్యలు, నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, చోరీలు, ఘోరాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి ఎఫ్ఎం రేడియో ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పారు. జిల్లాకు వచ్చే వీఐపీల వివరాలు, వారి సందేశాలను కూడా ఎఫ్ఎం రేడియో ద్వారా లైవ్ అప్డేట్స్ అందిస్తామన్నారు. ఇందు కోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, త్వరలోనే ఈ సేవలు వినియోగంలోకి వస్తాయని ఎస్పీ వివరించారు. -
అవినీతి ప్రభుత్వం నుంచి వైదొలగండి
తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్ సెంటర్) : చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారని, అటువంటప్పుడు ఆయన ప్రభుత్వంలో కొనసాగడం ఎందుకుని, వెంటనే వైదొలగాలని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు వలవల బాబ్జి హితవు పలికారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నేతలు కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, డ్వాక్రా మహిళలను అడ్డం పెట్టుకుని మంత్రులు, ఎమ్మెల్యే ఇసుక కుంభకోణాలకు పాల్పడుతూ దోచుకుంటున్నారని ఆరోపణలు చేసిన విషయూన్ని ఆయన గుర్తుచేశారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ, టీడీపీ కలిసి డ్రామాలాడుతున్నాయని ఆయన విమర్శించారు. -
అవసరమైతే సీలేరు జలాలు
తాడేపల్లిగూడెం : దాళ్వా పంటను రక్షించుకునేందుకు అవసరమైతే సీలేరులో విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేసి నీటిని గోదావరి డెల్టాకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రైతులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాళ్వా పంట ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని సాగుకు నీరందించేందుకు సీలేరు నీటిని గోదావరికి మళ్లించడం జరుగుతుందన్నారు. గోదావరిలో నీటి లభ్యత తగ్గిపోతున్న దృష్ట్యా మార్చి ఒకటో తేదీకల్లా దాళ్వా సాగు ముగించేలా రైతులు సన్నద్ధం కావాలని మంత్రి కోరారు. ఈ నెలాఖరు నాటికి నారుమడులను పూర్తి చేసుకోవాలని సూచించారు. వంతుల వారీ విధానంలో దాళ్వా పంట చేలకు సాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. స్లూయిస్‌లు, షట్టర్లు మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. జల వనరుల శాఖ ఎస్ఈ బాబు, ఈఈ శ్రీనివాస్,పెంటపాడు వాటర్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ బూరుగుపల్లి త్రినాథరావు, రావిపాడు సొసైటీ అధ్యక్షుడు ములగాల బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
కిరాణా దుకాణంపై విజిలెన్స్ దాడులు
తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : అక్రమంగా నిల్వ చేసిన పప్పు ధాన్యాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన తాడేపల్లిగూడెంలో శుక్రవారం జరిగింది. తాడేపల్లిగూడెంకు చెందిన ఓ కిరాణ షాపులో కంది పప్పు, మినపప్పు అక్రమంగా నిల్వ చేశారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ షాపుపై దాడి చేసి 23లక్షల 15వేల 700 ల రూపాయల విలువ చేసే కంది పప్పు, మినపప్పు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డీఎస్పీ అనిల్, సీఐ వెంకటేశ్వరరావు, ఏజీపీవో సత్యనారాయణ, డీసీపీ శేషుకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమంగా ఆహారధాన్యాలు నిలువ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
గుర్తు తెలియని వ్యక్తి హత్య
గుర్తుతెలియన వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం చినతాడేపల్లి రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగింది. బుధవారం ఉదయం చినతాడేపల్లిలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ వ్యక్తిని హత్య చేసి పెట్రోల్‌తో తగలబెట్టారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
తాడేపల్లిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం యాదర్లపల్లి శివారులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అనుమతి ఉన్న ఈ కేంద్రంలో కార్మికులు బాణసంచా తయారీలో ఉండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో పేలుడు చోటుచేసుకుంది. నైచర్ల మంగమ్మ, రాజేశ్వరి అనే మహిళలకు తీవ్రగాయాలు కాగా... వీరిని హుటాహుటిన తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంగమ్మకు 80 శాతం కాలిన గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
'రాయితీపై రైతులకు ఆవులు'
తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు రాయితీపై ఆవులను అందజేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఆయన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పలాల వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. -
'ఇక బీజేపీతో కలిసి ఉండలేం'
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ శ్రేణులు గొడవకు దిగాయి. మున్సిపల్ సమావేశంలో టీడీపీ, బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన విషయంలో టీడీపీ, బీజేపీల మధ్య వివాదం చెలరేగింది. మున్సిపల్ సమావేశంలో ఇరు పార్టీల కౌన్సిలర్లు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఇకపై బీజేపీతో కలసి ఉండలేమని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. -
గూ గూడెంలో విజిలెన్స్ దాడులు
తాడేపల్లిగూడెం : పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ఆకస్మికంగా అపరాల దుకాణాలపై దాడులు నిర్వహించారు. సుమారు 11 గంటలపాటు సాగిన ఈ దాడులలో నాలుగు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. రికార్డులలో పేర్కొన్నదానికంటే సరుకులు ఎక్కువుగా ఉండటంతో సీజ్ చేశారు. రికార్డులకు , వాస్తవ స్టాకునకు అదనంగా ఉన్న సుమారు రూ.కోటి మూడు లక్షల విలువైన పప్పులు, నూనెలు స్వాధీనం చేసుకొన్నారు. దుకాణదారులపై నిత్యావసరాల చట్టంలోని 6ఏ ప్రకారం కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సురేష్‌బాబు ఆదేశాల మేరకు పట్టణంలో ఈ దాడులు గురువారం ఉదయం డీఎస్పీ కె.అనిల్‌కుమార్ పర్యవేక్షణలో మొదలయ్యాయి. తొలుత భీమవరం రోడ్డులోని వెంకటేశ్వర డిపార్డుమెంటల్ స్టోర్సులో సోదాలు సాగాయి. ఈ సంస్థకు సంబంధించి రెండో దుకాణంలో కొన్ని సరుకులు రికార్డులకు అనుగుణంగా ఉన్నాయి. పెసలు వంటి వాటిలో వ్యత్యాసాలు ఉండటంతో సుమారు 23 లక్షల63 వేల 625 రూపాయల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. కేఎన్ఆర్ అండ్‌కో లో సోదాలు చేసి రెండు లక్షల 36 వేల , 547 రూపాయల విలువైన సరుకులను సీజ్ చేశారు. మహాలక్ష్మి అండ్‌కోలో చేసిన సోదాలలో కందిపప్పు, శనగపప్పు, వేరుశనగ పప్పు, మినపగుళ్లు, పెసర పప్పులలో తేడాలు ఉండటంతో 42 లక్షల 10 వేల 620 రూపాయల సరుకును సీజ్ చేశారు. అప్పిరెడ్డి అండ్ కంపెనీలో వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలో 34 లక్షల రూపాయల విలువైన సరుకులను సీజ్ చేశారు. ఈ దాడులలో సీఐ వెంకటేశ్వరరావు, తహసిల్దార్ శైలజ, ఏజీపీఓ .ఆర్.సత్యనారాయణరాజు, ఏఓ ఎం.శ్రీనివాసకుమార్‌లు పాల్గొన్నారు. మధ్యవర్తి రిపోర్టులను వీఆర్వోలు కృష్ణస్వామి, వినోద్‌లు రాశారు. రాత్రి 9.30 గంటల వరకు సోదాలు ముగిశాయి. -
మళ్లీ రెచ్చిపోయిన సిరంజీ సైకో
-
దిగిరావే ఉల్లి
తాడేపల్లిగూడెం : నెల రోజులుగా ఆకాశ యానం చేస్తున్న ఉల్లి ధరలు దిగిరాకపోగా.. మరింత ప్రియం అవుతున్నాయి. పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఎగబాకుతున్నాయి. శనివారం తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్లో కనీవినీ ఎరుగని రీతిలో కర్నూలు రకం ఉల్లి క్వింటాల్ రూ.6 వేలకు చేరింది. మహారాష్ట్ర ఉల్లి క్వింటాల్ రూ.6,500కు పెరిగింది. నాసిరకం ఉల్లి సైతం క్వింటాల్ రూ.5వేలు పలికింది. ఈ ప్రభావంతో రిటైల్ మార్కెట్లో కర్నూలు ఉల్లి కిలో రూ.65, మహారాష్ట్ర రకం రూ.70 అమ్ముతున్నారు. ప్రతి శనివారం కర్నూలు నుంచి తాడేపల్లిగూడెం మార్కెట్‌కు 150 నుంచి 250 లారీల ఉల్లి వస్తుంది. ఈ శనివారం కేవలం 50 లారీల సరుకు మాత్రమే వచ్చింది. ఉల్లి ధరలు సంక్రాంతి వరకు తగ్గే సూచనలు కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్నూలులో దిగుబడులు తగ్గటమే దీనికి కారణమని చెబుతున్నాయి. ఎకరానికి 10 టన్నుల ఉల్లిపాయల దిగుబడి రావాల్సి ఉండగా, కేవలం నాలుగు టన్నులు మాత్రమే రావడంతో ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. మహారాష్ట్రలో ఉల్లి పంటపై వానల ప్రభావం పడటంతో అక్కడా దిగుబడులు పడిపోయాయి. దీనికి తోడు వర్షానికి చేతికొచ్చిన పంట కుళ్ళిపోవడంతో మహారాష్ట్ర మండీలలో సైతం గుత్తగా క్వింటాల్ రూ.6 వేలకు కొనే పరిస్థితి వచ్చింది. -
ఢిల్లీలో ఎవరిని కలిసేందుకు వచ్చినా ...
ఏలూరు : ఒకే పార్టీలో పుట్టాను... అదే పార్టీలో పెరిగాను... చివరి వరకు అక్కడే ఉంటానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎన్.ఐ.టి సంస్థకి మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం ఏడు విద్యా సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయని తెలిపారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ తప్పక వస్తుందన్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్ వేగాన్ని కూడా తప్పకుండా పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. భుమి లేకుండా విద్యా సంస్థలు, ఇళ్లు, రైళ్లు వస్తాయా అంటూ భూ సేకరణను అడ్డుకుంటున్నా వారిని పరోక్షంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను ముందు చూపు లేకుండా విభజించిన వారు నన్ను విమర్శిస్తున్నారని వెంకయ్య ఆరోపించారు. మన ప్రధాని దుబాయి పర్యటన సందర్భంగా అక్కడి యువరాజు ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి మరీ మోదీని కలిశారని గుర్తు చేశారు. రాజకీయాల్లో వారసత్వం కాదు... జవసత్వం కావాలన్నారు. రాష్ట్ర నాయకుల గురించి ప్రస్తావిస్తూ ఢిల్లీలో ఎవరిని కలిసేందుకు వచ్చినా ముందే నా వద్దకే వస్తారన్నాని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. -
నిట్ ఏర్పాటు చారిత్రక పరిణామం: సుజనా
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయడం ఓ చారిత్రక పరిణామం అని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. గురువారం తాడేపల్లిగూడెంలో నిట్ విద్యా కేంద్రానికి కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్యనాయుడులు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ... దేశంలో ఎక్కడైనా నిట్ ఏర్పాటు చేస్తే 120 సీట్లే ఇస్తారని... కానీ తాడేపల్లిగూడెంలో నిట్ విద్యా సంస్థకు 420 సీట్లు వచ్చాయని తెలిపారు. తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటుకు స్థలం ఏర్పాటులో కొంత జాప్యం జరిగిందని ఈ సందర్భంగా సుజనా చౌదరి గుర్తు చేశారు. ఏలూరులో కూడా విద్యా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. -
'సీఎం చేతుల్లో భద్రంగా విద్యార్థుల భవిష్యత్'
తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ లో ర్యాంగింగ్ నిరోధానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల్లో విద్యార్థుల భవిష్యత్ భద్రంగా ఉందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విభజన చట్టం ప్రకారం 7 విద్యాసంస్థలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. ఈ నెల 30 నుంచి నిట్ లో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రాన్ని విద్యా కేంద్రంగా తయారు చేయాలని చంద్రబాబు కోరుకుంటున్నారని అన్నారు. బడ్జెట్ లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించామని తెలిపారు. నిట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతీ ఇరాని, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, పీతల సుజాత పాల్గొన్నారు. -
మా తరం కాదు..
సాక్షి, విశాఖపట్నం: ఉల్లి పేరు చేబితే ఇటు జనం..అటు అధికార గణం వామ్మో.! అంటున్నారు. ఉల్లి దిగుబడి తగ్గడం వల్ల ఏర్పడిన కొరత జిల్లా వాసులను కలవరపెడుతోంది. ప్రభుత్వం రైతు బజార్లలో విక్రయిస్తున్నా ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో జనం అధిక ధరలకు బయట మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. కేజీకి రూ.40 నుంచి రూ.50 వరకూ చెల్లిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే నెలాఖరు వరకూ ఉల్లిపాయల కొరత తప్పదని తెలుస్తోంది. అప్పటికైనా ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో వచ్చిన దిగుబడిని మనకు దిగుమతి చేస్తేనే గట్టెక్కగలమని అధికారులు భావిస్తున్నారు. తగ్గిన దిగుబడి..పెరిగిన దిగుమతి: తాడేపల్లిగూడెం, రాజమండ్రి మార్కెట్ల నుంచి విశాఖకు ఉల్లి పాయలు సరఫరా అవుతుంటాయి. ఇప్పుడు అక్కడ దిగుమతి గణనీయంగా పడిపోవడంతో కర్నూలు నుంచి తెప్పిస్తున్నారు. ఇప్పటి వరకూ జిల్లాకు 9వేల క్వింటాళ్ల ఉల్లిని కర్నూలు నుంచి దిగుమతి చేశారు. రోజుకి సగటున 60 టన్నుల ఉల్లిని అక్కడి నుంచి తీసుకువస్తున్నారు. అక్కడ కేజీకి రూ.34 నుంచి రూ.38 వరకూ చెల్లిస్తున్నారు. రవాణా ఖర్చులు కలిపి కేజీ ఉల్లి రూ.42 వరకూ పడుతోంది. రైతు బజార్లలో రూ.20కే అందిస్తున్నారు. అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. కర్నూలులో కూడా నిల్వలు నిండుకుంటే మహారాష్ట్ర ఉల్లి ఆదుకోవాలి. కానీ నాసిక్, షిరిడీ పరిసర ప్రాంతాల్లో ఏ ఏడాది ఉల్లి దిగుబడి తగ్గినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ అక్కడి నుంచి తెచ్చేందుకు నాణ్యత పరిశీలన చేయడానికి అధికారుల బృందం అక్కడికి వెళ్లింది. నెలాఖరు నాటికి గానీ అవి అందుబాటులోకిరావు. కడప జిల్లా నుంచి కూడా ఉల్లి తెప్పించే పనిలో ఉన్నారు. అంతవరకూ జిల్లా వాసులకు ఉల్లి కష్టాలు తప్పవు. రెండురోజుల వరకూ రాకండి రైతు బజార్లలో ఓ కుటుంబానికి కేజీ రూ.20 చొప్పున ఇచ్చే 2కేజీల ఉల్లి రెండు, మూడు రోజులకు సరిపోతాయని, ఒకసారి తీసుకున్న వారు రెండు రోజుల వరకూ రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కొక్కరూ నాలుగు నుంచి పది కేజీలు ప్రతి రోజూ తీసుకువెళుతున్నారు. తోపుడు బళ్లపై అల్పాహారం విక్రయించేవారు, హాస్టళ్లు, మెస్‌లు నిర్వహించేవారు ఎక్కువ కేజీల ఉల్లిపాయలు తీసుకుపోతున్నారు. ఒకే రోజు వేరు వేరు కౌంటర్లలో ఉల్లి కొనుగోలు చేసి వాటిని బయట ఎక్కువ రేటుకి విక్రయిస్తున్న వారిని అధికారులు గుర్తించారు. దీనిని పరిష్కరించేందుకంటూ ఉల్లి కావాలంటే ఆధార్, రేషన్ కార్టు తీసుకురావాలని నిబంధన విధించారు. ఒక సారి ఉల్లి తీసుకుంటే ఆధార్ కార్డుపై నెంబర్ వేస్తున్నారు. దానిపైనా వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులతో వాగ్వావాదాలకు దిగుతున్నారు. ఉల్లి లేక వెళ్లిపోతున్నాం... సబ్సిడీపై రైతు బజార్లలో కేజీ రూ.20 చొప్పున విక్రయించడం వరకూ బాగానే ఉంది. రెండు రోజులుగా ఉల్లిని మార్కెటింగ్ శాఖ దిగుమతి చేయడం లేదని తెలిసింది. రోజూ రైతు బజారుకు వచ్చి నిరాశతో ఇంటికి వెళ్లిపోతున్నా. అధికారులు బహిరంగ మార్కెట్లో ఉల్లిధర తగ్గినంతవరకూ సబ్సిడీపై ఉల్లి అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన సరిగ్గా అమలు కావడం లేదు. తక్షణమే స్పందించి ఉల్లిపాయలు అందేలా చూడాలి - డి.లలిత, ఎంవీపీకాలనీ(విశాఖ) -
అయ్యో.. బియ్యం
తాడేపల్లిగూడెం : బియ్యం మార్కెట్ డీలా పడింది. బొండాలు, ఎంటీయూ-1010 రకాల బియ్యానికి డిమాండ్ పడిపోయింది. బొండాలు రకం బియ్యానికి కేరళలో అధిక డిమాండ్ ఉన్నప్పటికీ అక్కడి మార్కెట్లో కొనుగోళ్లు మందగిం చాయి. మరోవైపు దక్షిణాఫ్రికాకు 1010 రకం ఎగుమతులు నిలిచిపోయాయి. ఉభయగోదావరి జిల్లాల నుంచి కాకినాడ పోర్టు ద్వారా ఓడల్లో 1010 రకం బియ్యాన్ని కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికాకు ఎగుమతి చేస్తున్నారు. మూడేళ్లుగా ఇదేరకం బియ్యాన్ని పాకిస్తాన్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు తక్కువ ధరకే దక్షిణాఫ్రికాకు ఎగుమతి చేస్తున్నా యి. దీంతో ఎగుమతులు క్రమంగా క్షీణించాయి. తొలి ఏడాది ఆ మూడు దేశాల నుంచి నామమాత్రంగానే పోటీ ఉండేది. ఇప్పుడు అది కాస్తా పెరిగి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం 1010 రకం బియ్యం కాకినాడ పోర్టుకు చేరా క్వింటాల్ ధర రూ.1,950 రూ.2 వేల వరకు ఉంది. ఇదే బియ్యాన్ని పాకిస్తాన్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు రూ.150 తక్కువకే ఎగుమతి చేస్తున్నాయి. ఆ దేశాల్లో సాగు ఖర్చులు తక్కువగా ఉండటంతో క్వింటాల్ బియ్యాన్ని రూ.1,800 నుంచి రూ.1,850కి ఇస్తున్నాయని కలసి వస్తున్నాయని బియ్యం ఎగుమతిదారు బి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పేరుకుపోతున్న బొండాలు నిల్వలు ముందెన్నడూ లేనివిధంగా జిల్లాలో బొండాలు బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. వ్యాపారులు ఊహించని విధంగా కేరళలో ఈ బియ్యం కొనుగోళ్లు తగ్గిపోయాయి. మరోవైపు ఏదోరకంగా బియ్యాన్ని ఎగుమతి చేసినా అక్కడి వ్యాపారులు సొమ్ములు చెల్లిం చడం లేదు. అక్కడ సరుకు అమ్ముడుకాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా గత ఏడాది ఇదే సీజన్లో బొండాలు రకం బియ్యం క్వింటాల్ ధర రూ.1,300 పలికితే.. ప్రస్తుతం ఆ ధర రూ.1,030కి పడిపోయింది. జిల్లాలో ఈసారి 20 శాతం పంట విస్తీర్ణంలో బొండాలు రకం వరిని రైతులు సాగు చేస్తున్నారు. మిగిలిన విస్తీర్ణంలో 1010 రకం పండిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే 80 శాతం విస్తీర్ణంలో బొండాలు రకం, 20 శాతం విస్తీర్ణంలో 1010 రకం వరి సాగు చేసే పరిస్థితి ఉంది. ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్లో బొండాలు, 1010 రకాలకు డిమాండ్ తగ్గడంతో వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. -
మిత్రుడి ప్రాణాలు రక్షించబోయి.. మృత్యు కౌగిలికి
తాడేపల్లిగూడెం : పాఠశాలకు సెలవు దినం కావడంతో సరదాగా మిత్రులతో కలిసి కాలువలోకి స్నానానికి వెళ్లి, ప్రమాదవశాత్తు మునిగిపోతున్న మిత్రుని రక్షించే క్రమంలో అదే కాలువలో మునిగి విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మంగళవారం తాడేపల్లిగూడెంలో జరిగింది. స్థానిక శివాలయం వీధిలో రామాలయం రేవు వద్ద నివాసం ఉంటున్న వర్మ తన ముగ్గురు మిత్రులతో కలిసి చిన్న బలుసులమ్మ ఆలయం వద్ద ఉన్న కాలువలో ఈత కొట్డడానికి దిగాడు. సరదాగా ఈత కొడుతుండగా ముగ్గురు మిత్రులలో ఒకరికి ఈత రాకపోవడంతో కాలువలో మునిగిపోతూ రక్షించమంటూ చేతులు పెకైత్తి కేకలు వేశాడు. మిత్రుడిని రక్షించేందుకు ఈత వచ్చిన వర్మ వెళ్లాడు. మిత్రుడిని రక్షించి గట్టు పైకి తీసుకువచ్చే క్రమంలో వర్మ మునిగిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వర్మ కాపాడిన మిత్రుడు, మిగిలిన ఇద్దరూ సంఘటనా స్థలం నుంచి ఉడాయించారు. కాలువలో వర్మ మునిగిపోయిన విషయం బయటకు రావడంతో అదే ప్రాంతానికి చెందిన 20 మంది యువకులు జట్టుగా శివాలయం దగ్గర నుంచి జువ్వలపాలెం కాలిబాట వంతెన వరకు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపకదళాధికారి వి.సుబ్బారావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వర్మ మునిగిపోయిన ప్రాంతంగా చెబుతున్న ఏరియాలో సిబ్బంది వై.ఉమామహేశ్వరరావు, వి.భాస్కరరాజు ద్వారా యువకుల సాయంతో గాలించారు. అదే ప్రాంతంలో వర్మ దొరికాడు. అతనికి ప్రాణం ఉందని భావించిన యువకులు వర్మ సపర్యలు చేశారు. కొన వూపిరితో వర్మ ఉన్నట్టు భావించి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వర్మ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సుమారు మూడు గంటలకు పైగా వర్మ కాలువలో ఉండిపోయి ఊపిరి అందక మరణించి ఉంటాడని చెబుతున్నారు. యువకులు మూడు గంటలకు గాలింపు చేపట్టి వర్మను రక్షించామని అనుకున్నారు. వర్మ తల్లితండ్రులు తమ బిడ్డకు జీవం ఉందనుకున్నారు. తీరా ఆసుపత్రికి వెళ్లాక వైద్యులు చెప్పిన విషయం విని వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చిన్నోడా వెళ్లిపోయావా.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే పాలెపు నర్సింహమూర్తి, ధనావతి దంపతులకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు ధనుంజయవర్మ (15) పట్టణంలోని ఒక ప్రయివేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ప్రత్యేక హోదా కోసం బంద్ పాటించడంతో పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఈ క్రమంలో మిత్రులతో కలిసి కాలువకు స్నానానికి వెళ్లాడు. మిత్రుడిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయాడు. చిన్నోడా వెళ్లిపోయావా అంటూ అతని తల్లి ఆక్రందనలు చూపరులను కలిచివేశాయి. ఇదే కుటుంబంలో వర్మ సోదరునికి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాడు. ఇటీవలే అతను కోలుకున్నాడు. బిడ్డ బాగున్నాడని ఆ కుటుంబం సంతోషించే లోగా మరో బిడ్డ మృత్యువాతపడటం ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. 13 వ వార్డు కౌన్సిలర్ దొడ్డిగర్ల కృష్ణ బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు . -
వచ్చే నెల చివరిలో నిట్ తరగతులు
తాడేపల్లిగూడెం : వచ్చేనెల ఆఖరి వారంలో నిట్ తరగతులను తాడేపల్లిగూడెంలో ప్రారంభించనున్నట్టు రాష్ట్ర మానవ వనరులు, విద్యా శాఖమంత్రి గంటాశ్రీనివాసరావు చెప్పారు. నిట్ ప్రతిపాదిత భూములు, నిట్ తాత్కాలిక తరగతులు నిర్వహించే భవనాలను పరిశీలించేందుకు శనివారం వచ్చిన ఆయన పెదతాడేపల్లిలోని వాసవి ఇంజినీరింగ్‌కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయనున్న నిట్‌లో ఇప్పటికే 395 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. నిట్ శాశ్వత భవనాల నిర్మాణం కోసం 172 ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి నిట్ తాత్కాలిక తరగతులు నిర్వహించేందుకు సౌకర్యాలు కల్పించామన్నారు. తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయూలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కోరడంతో ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తంచేశారన్నారు. దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖకు ప్రతిపాదనలు పంపించారన్నారు. బుధవారం లోపు స్పష్టమైన ఆదేశాలు రానున్నాయని మంత్రి గంటా తెలిపారు. దేశంలో ఏ నిట్‌లోనూ లేని విధంగా ఇక్కడ ఏర్పాటు చేయబోయే నిట్‌కు 450 సీట్లు మంజూరు చేశారని, మరో 60 సీట్లను సూపర్ న్యూమరరీగా ఇచ్చారని, దీంతో 540 సీట్లు కేటాయించినట్లయిందన్నారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ నిట్‌ను తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసేందుకు స్థలానికి సంబంధించి ఎదురైన సాంకేతిక ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. విమానాశ్రయ భూముల్లోని 172 ఎకరాల్లో శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు. స్థలం లేని కారణంగా నిట్ తాడేపల్లిగూడెం నుంచి వేరే ప్రాంతానికి తరలిపోతుందన్న సమయంలో ఈ ప్రాంత రైతులు 300 ఎకరాల భూమిని అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వడానికి ముందుకొచ్చారన్నారు. నిట్ తాత్కాలిక తరగతులకు, వసతి సౌకర్యం ఇస్తున్న వాసవి ఇంజినీరింగ్ కళాశాల పాలకవర్గ సభ్యులను అభినందించారు. ముందుగా మంత్రులు నిట్ ప్రతిపాదిన భూములను అధికారులతో కలిసి పరిశీలించారు. ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్, వాసవి ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి చలంచర్ల సుబ్బారావు, ప్రిన్సిపాల్ జె.శ్రీహరి, తహసిల్దార్ పాశం నాగమణి, సర్వేయర్ రౌతు రామకృష్ణ తదితరులు వారి వెంట ఉన్నారు. ర్యాగింగ్‌పై ఉక్కుపాదం కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ర్యాగింగ్ నిరోధానికి, కళాశాలల్లో బయట వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసేందుకు ప్రతి విద్యార్థికి బార్ కోడింగ్ గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. కుల, మత సంఘాలకు సంబంధించి ఎటువంటి ప్రచార బోర్డులను అనుమతించేది లేదన్నారు. గతంలో విద్యాభివృద్ధికి 10 శాతంకు మించి బడ్జెట్ ఉండేది కాదని, ప్రస్తుత ప్రభుత్వం దానిని 17 శాతానికి పెంచి రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు. విద్యతోపాటు పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు బివీ పట్టాభిరామ్, చాగంటి కోటేశ్వరరావు వంటి వారితో విద్యాసంస్థల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని కళాశాలల్లో వైఫై సౌకర్యంతోపాటు బయోమెట్రిక్ పద్ధతి, సీసీ కెమెరాలు వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తామన్నారు. -
ఉల్లి.. ధర పేలి
తాడేపల్లిగూడెం : వంటింట్లో మరోసారి ఉల్లి బాంబు పేలుతోంది. డిమాండ్‌కు తగినట్టుగా సరఫరా లేకపోవడంతో శుక్రవారం ఒక్కసారిగా ధరలు పెరిగాయి. తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్లో ఆదివారం క్వింటాల్ రూ.2,300 పలికిన ఉల్లి ధర శుక్రవారం అమాంతం రూ.3,300కు ఎగబాకింది. గుత్త మార్కెట్లోనే కిలోకు రూ.10 పెరగటంతో వ్యాపారులు ఠారెత్తిపోయారు. ఒకేసారి కిలోకు రూ.10 పెరగటం గడచిన పదేళ్లలో ఎప్పుడూ లేదు. రిటైల్ మార్కెట్లో నాణ్యత గల ఉల్లిపాయల ధర కిలో రూ.40 దాటింది. ఒక్కసారిగా ధర పెరగడంతో చిల్లర బేరం తగ్గిం ది. శుక్రవారం తాడేపల్లిగూడెం మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి రెండు లారీలు, కర్నూలు నుంచి 15 లారీల ఉల్లిపాయలు మాత్రమే వచ్చాయి. సాధారణంగా ఈ సీజన్లో కర్నూలు నుంచి 200-300 లారీల ఉల్లిపాయలు వచ్చేవి. అనూహ్యంగా దిగుమతులు తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే సూచనలు ఉన్నా యని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఉల్లి అవసరాలను తీర్చే మహా రాష్ట్ర మార్కెట్ నుంచి సరఫరా తగ్గిపోయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడి ఉల్లి పంటకు వైరస్ సోకింది. మరోవైపు రైతులు గోదాములలో నిల్వ చేసిన ఉల్లిని మార్కెట్లకు తీసుకురావడం లేదు. నాఫెడ్‌తో ఒప్పం దం చేసుకున్న కొన్ని కంపెనీలు ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ గతంలో ఎన్నడూ లేనివిధంగా జూలై నెలలో ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నాసిరకం ఉల్లికి డిమాండ్ కర్నూలు నుంచి వచ్చే ఉల్లిపాయలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కర్నూలు ఉల్లి సాధారణంగా క్వింటాల్ రూ.1,700 నుంచి రూ.2 వేల వరకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం వీటిధర క్వింటాల్ రూ.2,700కు చేరుకుంది. -
చెట్టును ఢీకొన్న కారు : ముగ్గురి మృతి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని పొండ్రిపల్లు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. పుష్కరాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాద వీచిక
నీళ్లిచ్చి ప్రాణాలు నిలిపే గోదారమ్మ ఒడిలో ఘోరం జరిగింది. పొరుగునే ఉన్న రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద మృత్యుదేవత వికటాట్టహాసం చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారితోపాటు మన జిల్లాకు చెందిన ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. ఈ ఘోర దుర్ఘటన ‘పశ్చిమ’లో కలకలం రేపింది. ‘అయ్యో.. మన గోదారమ్మ ఒడ్డున ఇంత ఘోరం జరిగిందేమిటా’ని ప్రతి మనసు కలవరపడింది. ఉండి/తాడేపల్లిగూడెం : ‘అమ్మా.. చిన్నత్తయ్య వాళ్లు పుష్కర స్నానానికి రమ్మని పిలిచారు. నేను, మీ కోడలు హైదరాబాద్ నుంచి నేరుగా రాజమండ్రి వచ్చేస్తాం. నువ్వు కూడా వచ్చెయ్. మనమంతా కలిసి పుష్కర స్నానం చేసొద్దాం’ అని యండగండి గ్రామానికి చెందిన బుద్దర్రాజు లక్ష్మి (50)కి హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె కొడుకు సత్యనారాయణరాజు (సతీష్) ఫోన్ చేశాడు. సాధారణంగానే భక్తి భావంతో ఉండే లక్ష్మి తన కొడుకు, కోడలు పుష్కర స్నానానికి రమ్మని పిలవడంతో ఉప్పొంగిపోయింది. సోమవారం ఉదయం 9గంటలకు యండగండిలో బస్సెక్కింది. ఆ సమయంలో ‘నా కొడుకు, కోడలు రమ్మన్నా రు. పుష్కరాలకు వెళుతున్నా. మీరంతా జాగ్రత్త’ అని చుట్టపక్కల వారికి చెప్పిన మాటలే చివరి మాటలయ్యాయి. రాజ మండ్రి చేరుకున్న లక్ష్మి పెద్దకొడుకు, కోడలితో కలిసి సోమవారం బంధువుల ఇంట బసచేసింది. పుష్కరాల ప్రారంభ సమయంలోనే స్నానాలు చేయాలనే ఉద్దేశంతో మంగళవారం వేకువజామునే ఘాట్‌కు చేరుకున్న లక్ష్మి పుష్కర ఘడియ కోసం ఎదురు చూసింది. అక్కడ జరిగిన తొక్కిసలాట ఆమెను బలిగొంది. కళ్లముందే ఇదంతా జరుగుతున్నా తల్లిని కాపాడుకోలేకపోయానని లక్ష్మి కుమారుడు సత్యనారాయణరాజు సోదరుడు సూర్యనారాయణరాజుకు, బంధువులకు ఫోన్లో చెప్పి బావురుమన్నాడు. ఆమె మరణంతో యండగండిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విష యం తెలిసిన వెంటనే లక్ష్మి చిన్న కుమారుడు సురేష్, బంధువులు రాజమండ్రికి తరలివెళ్లారు. అందరినీ పిలిచి.. కానరాని లోకాలకు రాజమండ్రిలో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారిలో తాడేపల్లిగూడెంకు చెందిన మైగాపుల లక్ష్మణరావు (65) ఉన్నారు. పట్టణంలోని డీఎస్ చెరువు సమీపంలో పొట్టి శ్రీరాములు వీధికి చెందిన లక్ష్మణరావు భార్య లక్ష్మితో కలిసి సోమవారం సాయంత్రం రాజమండ్రి వెళ్లారు. మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. లారీ డ్రైవర్‌గా జీవితం ప్రారంభించిన లక్ష్మణరావు స్వయంకృషితో లారీ యజమానిగా ఎదిగాడు. ఆయనకు ముగ్గురు కుమారులు వీరిలో ఒక కుమారుడు రవి గత పుష్కరాల సమయంలో రాజమండ్రిలో ఐస్‌క్రీం పార్లర్ ఏర్పాటు చేశాడు. తండ్రి లక్ష్మణరావు అతనికి తోడుగా ఉంటున్నారు. తాడేపల్లిగూడెం నుంచి తరచూ రాజమండ్రి వెళ్లి వస్తుంటారు. తన కుమారుని వ్యాపార ఉన్నతికి సహకరించిన కుటుంబాల వారిని, బంధువులను పుష్క ర స్నానానికి రాజమండ్రి రావాల్సిందిగా లక్ష్మణరావు దంపతులు సోమవారం ఆహ్వానించి సోమవారం రాజమండ్రి బయలుదేరారు. ఇదే సందర్భంలో కాకినాడలో ఉంటున్న లక్ష్మణరావు మరో కుమారుడు తన భార్యాబిడ్డలతో రాజమండ్రి వచ్చాడు. వీరంతా కలిసి మంగళవారం ఉద యం పుష్కర స్నానానికి వెళ్లగా.. తొక్కిసలాటలో లక్ష్మణరావు మృత్యువాతపడ్డారు. ఆ కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది. లక్ష్మణరావు నుంచి పుష్కరాలకు పిలుపునందుకున్న బంధువులు, స్నేహితులు అతడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసి ఘొల్లుమన్నారు. ముమ్మాటికీ ఇది ప్రభుత్వ వైఫల్యమే ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. పుష్కరాలకు విపరీత ప్రచారం చేశారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. పుష్కరాల్లో అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ప్రగల్భాలు పలికిన ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారు? ఏమైపోయారు? ఈ ఘటనకు ఎవరు భాధ్యత వహిస్తారు? ప్రభుత్వ పెద్దలు, పై అధికారులు ప్రచార ఆర్భాటాలు చేశారే తప్ప ఒక్క ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయారు. మృతుల కుటుంబాలకు వచ్చిన విషాదాన్ని ఎవరు తీరుస్తారు?. - బుద్దర్రాజు లక్ష్మీపతిరాజు, మృతురాలి మరిది కొడుకు, యండగండి. వీఐపీలకేనా.. సామాన్యులకు భద్రత లేదా పుష్కరాల్లో వీఐపీలకే భద్రత కల్పిస్తారా. సామాన్యులకు లేదా. ఇదేనా ప్రభుత్వ తీరు. ముఖ్యమంత్రి పుష్కర స్నానం కోసం ఇంతమందిని బలి తీసుకుంటారా. ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని లేదా. అధికారుల తీరు చాలా చిత్రంగా వుంది. ముఖ్యమంత్రి స్నానం చేసి వెళ్లిపోతే ప్రజల భద్రత గాలికొదిలేస్తారా. అలా చేయడం మూలంగానే భక్తుల్లో తొక్కిసలాట జరిగింది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.వీఐపీల భద్రత ఎంత ముఖ్యమో.. ప్రజలు కూడా అంతే ముఖ్యం అన్న సంగతి మరచిపోకూడదు. - బుద్దర్రాజు లీలావతి. మృతురాలి తోటి కోడలు, యండగండి. -
ఆ పట్టణాలిక ‘అమృత’ధామాలు
తాడేపల్లిగూడెం : కేంద్ర ప్రభుత్వం ‘అమృత్’ పేరిట కొత్తగా ప్రకటించిన అటల్ పట్టణ రూపాంతరీకరణ, పునరుజ్జీవన పథకానికి ఏలూరు నగరం, భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాలు ఎంపికయ్యాయి. హడ్కో ఆధ్వర్యంలో అటల్ మిషన్ ఫర్ రీ జువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ (అమృత్) పేరిట దేశంలోని ముఖ్య పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గురువారం శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ పథకం కింద రాష్ట్రంలో 31 పట్టణాలను అభివృద్ధి చేయనుండగా, వాటిలో ఏలూరు నగరం, సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీలైన తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాలకు స్థానం దక్కింది. పట్టణ పేదలకు గృహాలు, పట్టణంలో ప్రధాన మౌలిక సదుపాయా లు, సుందరీకరణ, రవాణా, సమాచార వ్యవస్థలతోపాటు పచ్చదనం అభివృద్ధి తదితర కార్యక్రమాలను అమృత్ పథకం కింద చేపడతారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఇప్పటికే అమలులో ఉన్న అందరికీ ఇల్లు పథకాన్ని కూడా ఇందులో చేర్చారు. తద్వారా పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.లక్ష నుంచి రూ.2.30 లక్షల వరకు నిధులిస్తారని సమాచారం. అభివృద్ధికి అవకాశం అమృత్ పథకం కింద ఒక్కొక్క పట్టణానికి కనీసం రూ.100 కోట్ల వరకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నిధులు అభివృద్ధి పనులు చేపట్టడానికి అక్కరకు వస్తాయని భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో మోటారు వాహనాల వినియోగం తగ్గించి సైకిళ్ల వినియోగాన్ని పెంచుతారు. ఇందుకు వీలుగా సైకిల్ ట్రాక్‌లు, ఆరోగ్యం కోసం నడక నడవటానికి వీలుగా వాకింగ్ ట్రాక్‌లు, వీటితోపాటు సాయంత్రం, ఉదయం వేల ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు వీలుగా సుందరీకరణ పేరిట పార్కులు వంటివి అమృత్ పథకం కింద సమకూరతాయని పురపాలకులు ఆశిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాల్సి ఉంది. పట్టణాలకు వరమే మునిసిపాలిటీల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకంలో జిల్లాలోని మూడు పట్టణాలకు చోటు దక్కడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవకాశాలు మెరుగవుతాయని పురపాలకలు సంబరపడుతున్నారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయమంతా ఖర్చులకే సరిపోతోంది. ఆర్థిక సంఘం నిధులిస్తున్నా.. అప్పులు, వేరే ఖాతాలకు మళ్లిపోతున్నాయి. చిన్నపాటి పని చేయాలన్నా ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే అన్నవిధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘అమృత్’ పథకానికి ఎంపికైన మూడు పట్టణాలకు ఎంతోకొంత మేలు జరుగుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీకాకుళం రైతులకు ఉద్యాన పాఠాలు
తాడేపల్లిగూడెం : ఉద్యాన వనంలో రకరకాల మొక్కలను చూసి ఆ రైతులంతా పులకించారు. కొత్తరకాల మొక్కలను తాకి ఆనందం పొందారు. శాస్త్రవేత్తలు చెప్పిన పాఠాలను ఆసక్తిగా విన్నారు. తమకు తెలియని విషయాలను శ్రద్ధగా అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం, లావేరు, నరసన్నపేట, పాలకొండ, వీరఘట్టం, పాతపట్నం, బూర్జ, ఆముదాలవలస మండలాలకు చెందిన 160 మంది రైతులు బుధ, గురువారాలలో తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఇ.కరుణశ్రీ, ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రవీం ద్రబాబు, శాస్త్రవేత్త రమేష్‌బాబు ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీహెచ్.చంద్రశేఖరరావు, ఉద్యాన అధికారి టి.అమరేశ్వరి, జి.జ్యోత్స్న, కేవీకే శాస్త్రవేత్త సీహెచ్.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
పెళ్లికి లగ్గం.. 8 నెలలు విఘ్నం
తాడేపల్లిగూడెం : గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో పెళ్లి బాజాలకు విరామం ఏర్పడనుంది. పుష్కరాల సమయంలో పెళ్లిళ్లు చేయకూడదని పండితులు చెబుతున్న నేపథ్యంలో శనివారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 వరకూ వివాహాలకు విరామం ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 12 శుక్రవారం అర్ధరాత్రి 12.42 గంటల ముహూర్తమే వివాహాలకు చివరి ముహూర్తమని చెబుతున్నారు. పశ్చిమగోదావరి మొదలుకుని.. ఉత్తరాంధ్ర జిల్లాల వరకూ పుష్కర సమయంలో వివాహాలు చేయరు. వేరే జిల్లాల్లో వివాహాలు చేసుకోవచ్చులే అనుకునే వారు మాత్రం చివరి ముహూర్తమైన శుక్రవారం నాడు నిశ్చితార్థ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. గురు, శుక్రవారాలలో ముహూర్తాలు నిర్ణయించిన వివాహాలు చేయడంలో పెళ్లి బృందాలు ఊపిరాడకుండా ఉన్నాయి. దీంతో ఎక్కడ చూసినా పెళ్లి బాజాల సందడి మిన్నంటింది. ఎందుకు వివాహాలు చేసుకోకూడదు సింహరాశిలో గురుడు ప్రవేశించే సమయంలో గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. సింహరాశి అంటే మఖ నక్షత్రంలో నాలుగు పాదాలు, పుబ్బ నక్షత్రంలో నాలుగు పాదాలు, ఉత్తర నక్షత్రంలో ఒకటవ పాదం కలిపి మొత్తం తొమ్మిది పాదాలలో ఉంటుంది. సింహరాశిలో గురుడు ఒకటవ పాదంలో ప్రవేశించగానే గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అధికమాసం.. గురు, శుక్ర మూఢాలలో శుభకార్యాలు ఏ విధంగా జరపకూడదో, అదేవిధంగా గురుడు సింహరాశిలో ఉండగా శుభకార్యాలు జరపకూడదనేది నియమం. సింహరాశిలో గురుడు రమారమి సంవత్సర కాలం ఉంటాడు. అధిక మాసం. గురు. శుక్ర మూఢమిలలో దేశమంతా శుభాకార్యాలు నిషిద్ధం. గురు గ్రహ సంచారం. దేశభేదం, రవిగ్రహ సంచారాన్ని అనుసరించి కొన్ని సడలింపులు ఉంటాయి. గురుడు కన్యారాశిలో ప్రవేశించే వరకు మెద క్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, గుంటూరు, కృష్ణా, మహబూబ్‌నగర్ , ప్రకాశం, కర్నూలు, అనంతపుం, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వారు యథావిధిగా వివాహ శుభకార్యాలు జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. పుష్కరాల సమయంలో తూర్పు, పశ్చిమ, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల వారు మాత్రం వివాహాలు చేసుకూడదంటున్నారు. అనుకోని పరిస్థితుల్లో వివాహాలు చేయాల్సి వస్తే మిగిలిన జిల్లాలకు వెళ్లి చేసుకోవచ్చు. కొత్త కోడల్ని మాత్రం కాపురానికి తీసుకురాకూడదు. వరుడు వేరే జిల్లాల్లో ఉద్యోగ రీత్యా ఉన్నప్పటికీ కాపురానికి ఆ ప్రాంతానికి పంపకూడదు. ఫిబ్రవరి 11 నుంచి పునఃప్రారంభం ఈ ఏడాది వరుసగా రెండు నెలలు ఆధిక ఆషాఢం, నిజ ఆషాఢం ఉన్నాయి. ఆషాఢమాసాలు శుభకార్యాలకు మంచివి కాదనే అభిప్రాయం ఉంది. అందువల్ల ఆ నెలల్లో వివాహాలు జరుగవు. సాధారణంగా శ్రావణం, ఆశ్వియుజ, కార్తీకం మాసాలలో వివాహాలు జరుగుతాయి. పుష్కరాల వల్ల ఈ సారి ఆ నెలల్లో వివాహాలు జరిగే అవకాశం లేదు. వివాహాలు తిరిగి మాఘ మాసంలో ఫిబ్రవరి 11 నుంచి పునఃప్రారంభమవుతాయని పండితులు చెబుతున్నారు. అప్పటివరకూ వివాహాలు జరిగే అవకాశం లేదని అంటున్నారు. అంటే ఎనిమిది నెలలపాటు వివాహాలు జరగవన్న మాట. ఇదిలావుంటే వివాహాలపై ఆధారపడిన పురోహితులు, క్యాటరింగ్, సన్నాయిమేళం తదితర వర్గాల వారు ఈ ఎనిమిది నెలలు ఏం చేయాలోనని ఆందోళన చెందుతున్నారు.