తాడేపల్లిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం యాదర్లపల్లి శివారులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అనుమతి ఉన్న ఈ కేంద్రంలో కార్మికులు బాణసంచా తయారీలో ఉండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో పేలుడు చోటుచేసుకుంది.
నైచర్ల మంగమ్మ, రాజేశ్వరి అనే మహిళలకు తీవ్రగాయాలు కాగా... వీరిని హుటాహుటిన తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంగమ్మకు 80 శాతం కాలిన గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
Published Tue, Oct 20 2015 3:39 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM
Advertisement
Advertisement