నూతన విధానంలో డీసెట్‌ నిర్వహించాలి | in the new approach to manage diset | Sakshi
Sakshi News home page

నూతన విధానంలో డీసెట్‌ నిర్వహించాలి

Published Wed, Mar 22 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

నూతన విధానంలో డీసెట్‌ నిర్వహించాలి

నూతన విధానంలో డీసెట్‌ నిర్వహించాలి

 తాడేపల్లిగూడెం : రాష్ట్రంలో నూతన విధానంలో నిర్వహిస్తున్న సెట్స్‌ మాదిరిగా డీఈడీ కళాశాలలో ప్రవేశాలకు డీసెట్‌ నిర్వహించాలని ప్రైవేటు డీఈడీ కళాశాలల అసోసియేషన్‌  రాష్ట్ర అధ్యక్షుడు కె.తిరుపతయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం స్థానిక ధనలక్ష్మీ డీఈడీ కళాశాలలో నిర్వహించిన జిల్లా అసోసియేషన్‌  సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు ఎంఎల్‌ఎస్‌ఎన్‌  రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో తిరుపతయ్య మాట్లాడుతూ మేనేజ్‌మెంటు కోటాలో డీఈడీ కళాశాలల్లో చేరే విద్యార్థులకు సెట్‌ లేకుండా చూడాలన్నారు. కళాశాల యాజమాన్యాలే సీట్లను భర్తీ చేసుకొనే విధంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలను సమావేశంలో తీర్మానించి ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.జనార్దనరావు, జిల్లా సెక్రటరీ రాంప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ, కన్వీనర్‌ రాజా పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement