తాడేపల్లిగూడెం : దాళ్వా పంటను రక్షించుకునేందుకు అవసరమైతే సీలేరులో విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేసి నీటిని గోదావరి డెల్టాకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రైతులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాళ్వా పంట ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని సాగుకు నీరందించేందుకు సీలేరు నీటిని గోదావరికి మళ్లించడం జరుగుతుందన్నారు.
గోదావరిలో నీటి లభ్యత తగ్గిపోతున్న దృష్ట్యా మార్చి ఒకటో తేదీకల్లా దాళ్వా సాగు ముగించేలా రైతులు సన్నద్ధం కావాలని మంత్రి కోరారు. ఈ నెలాఖరు నాటికి నారుమడులను పూర్తి చేసుకోవాలని సూచించారు. వంతుల వారీ విధానంలో దాళ్వా పంట చేలకు సాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. స్లూయిస్‌లు, షట్టర్లు మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. జల వనరుల శాఖ ఎస్‌ఈ బాబు, ఈఈ శ్రీనివాస్,పెంటపాడు వాటర్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ బూరుగుపల్లి త్రినాథరావు, రావిపాడు సొసైటీ అధ్యక్షుడు ములగాల బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
అవసరమైతే సీలేరు జలాలు
Published Fri, Nov 6 2015 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement