Devineni Uma Maheswara Rao
-
‘దేవినేని ఉమాను నేనే గెలిపించాను’
ఎన్టీఆర్ జిల్లా: మైలవరం టీడీపీ మళ్లీ విభేదాలు రాజుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమాను ఉద్దేశించి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు చేసిన కామెంట్ ఇప్పుడు స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారాయి. మైలవరం టీడీపీ టికెట్ తనకే ఇవ్వాలని బొమ్మసాని పట్టుబడుతున్నారు. గత ఎన్నికల్లో పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన దేవినేని ఉమాను తానే గెలిపించానని, ఈసారి టికెట్ మాత్రం తనకే కావాలని బొమ్మసాని జిల్లా టీడీపీలో కొత్త చర్చకు తెరలేపారు. ‘గత ఎన్నికల్లో ఉమా కోసం పెద్ద పాలేరుగా పని చేశాను. పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన దేవినేని ఉమను గతంలో మైలవరంలో గెలిపించాను. ఈసారి మైలవరం టికెట్ నాకే ఇవ్వాలి. నేను సీటు అడగడంలో న్యాయం ఉంది’ అని పేర్కొన్నారు. -
ఎప్పటికీ జగన్ వెంటే ఉంటా
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): తాను ఎప్పటికీ సీఎం వైఎస్ జగన్ వెంటే ఉంటానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టంచేశారు. అనివార్య కారణాలవల్ల నియోజకవర్గంలో తాను కొంతకాలంగా చురుగ్గా లేనని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేశారన్నారు. తన మనసు సహకరించకపోతే తన పని తాను చేసుకుంటూ పోతానే తప్ప పార్టీ మారబోనన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తనను పిలిపించి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై తనకు స్పష్టతనిచ్చారన్నారు. మరో వారం రోజుల్లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తానన్నారు. టీడీపీకి లోకేశ్ పెనుభారం లోకేశ్ పాదయాత్ర టీడీపీకి పెనుభారమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. ఇక ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు టీడీపీని ఏ విధంగా దొంగిలించాడో అదే రీతిలో మాజీమంత్రి దేవినేని ఉమా కబ్జాల సంస్కృతి నేర్చుకున్నాడని వసంత ఆరోపించారు. పార్టీ కార్యాలయం కోసం వృద్ధ మహిళ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన ఉమా.. రూ.300 కోట్లపై చిలుకు ఇరిగేషన్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని ఖమ్మం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.20 కోట్లు తీసుకుని ఎన్నికల్లో ఖర్చుచేశాడన్నారు. గుంటుపల్లికి చెందిన ఒక నాయకుడి వద్ద రూ.7 కోట్లు, కొండపల్లికి చెందిన మరో వ్యక్తి వద్ద రూ.5 కోట్లు, మూర్తి అనే కాంట్రాక్టర్ వద్ద రూ.3 కోట్లు తీసుకున్నాడని, మరో ఇద్దరి వద్ద రూ.50లక్షల చొప్పున తీసుకుని తిరిగి చెల్లించలేదని, పైగా వాళ్ల ఫోన్లు కూడా ఎత్తడంలేదని వసంత చెప్పారు. -
లోకల్లో నాన్ లోకల్.. నాటి కుట్ర.. నేడు మెడకు.!
ఆ మాజీమంత్రి ఓ నియోజకవర్గానికి వలస నేత. అయినా పచ్చ పార్టీ బాస్ ఆదేశాల మేరకు అక్కడి కేడర్ వలస నేతను నెత్తిన పెట్టుకున్నారు. అయితే రెండు సార్లు గెలిపించినా.. మూడో సారి ఓడేసరికి కేడర్‌ను పట్టించుకోవడంలేదట ఆ వలస నాయకుడు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈయన మాకొద్దంటూ అక్కడి కార్యకర్తలు బాస్‌కు తేల్చి చెప్పేశారట. లోకల్, నాన్ లోకల్ పంచాయతీ పచ్చ పార్టీ బాస్‌కు తలనొప్పిగా మారిందట. పేరుకే సీనియర్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా చెప్పుకునే దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇప్పుడు మైలవరం తమ్ముళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారట. గత కొంత కాలంగా ఉమాతో టచ్ మీ నాట్ అనేలా వ్యవహరిస్తున్న క్యాడర్ ఇప్పుడు ఏకంగా ఆయనకు వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేసుకోవడమే ఇందుకు కారణమని టాక్. నియోజకవర్గాల పునర్విభజనలో నందిగామ నియోజకవర్గానికి చెందిన దేవినేని ఉమ... మైలవరంకు మారాల్సి వచ్చింది. పట్టించుకోకపోతే దించేస్తాం కొత్త నియోజకవర్గంలో సామాజికవర్గ సమీకరణాలు బాగా కలిసిరావడంతో స్థానికేతరుడే అయినప్పటికీ పార్టీ క్యాడర్, ప్రజలు ఉమాకు పట్టం కట్టారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ఇంత వరకూ బాగానే ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో కొంత కాలంగా దేవినేని ఉమ క్యాడర్ ను అసలు పట్టించుకోవడంలేదట. ఎక్కడా కలుపుకెళ్లకపోవడంతో మైలవరం తమ్ముళ్ళు ఉమాపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఉమా వైఖరితో విసిగిపోయిన క్యాడర్, ఆయన కారణంగా నష్టపోయిన నేతలు ఉమాకు వ్యతిరేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారట. తెరపైకి బొమ్మ తమ మధ్య ఉంటూ తమకోసం పనిచేసే నాయకుడు, తమ నియోజకవర్గానికి చెందిన నేత కావాలంటూ మైలవరం కేడర్ తమ పార్టీ బాస్‌ను డిమాండ్ చేస్తున్నారట. లోకల్, నాన్ లోకల్ అంశం తెరపైకి రావడంతో పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఉమాతో నిమిత్తం లేకుండా బొమ్మసాని సుబ్బారావు నాయకత్వంలో పనిచేయాలని గొల్లపూడిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మైలవరంకు చెందిన నేతలు, కార్యకర్తలు ఓ నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది. దేవినేని ఉమా ఫోటో కూడా లేకుండా ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమావేశం వేదికగా 2024లో మైలవరం టిక్కెట్టు బొమ్మసానికి ఇస్తేనే పార్టీ కోసం పనిచేస్తామని, అభ్యర్థిని గెలిపిస్తామని నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. నాటి కుట్ర.. నేడు మెడకు.! స్థానికత అంశాన్ని తెరమీదకు తెస్తూ మైలవరం టీడీపీ శ్రేణులు ఏకం కావడం పార్టీ అధిష్టానానికి, దేవినేని ఉమాకు షాకిచ్చిందట. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మైలవరం టీడీపీలో లోకల్ నినాదం తెరపైకి రావడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో మైలవరం వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన జోగిరమేష్‌ను దెబ్బ కొట్టడానికి అప్పుడు వైసీపీలో ఉన్న బొమ్మసాని సుబ్బారావును దేవినేని ఉమా ఇండిపెండెంట్ గా బరిలోకి దించాడు . తన గెలుపునకు సహకరిస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం, పదవులు కట్టబెడతానని మాటిచ్చాడు. 2014 ఎన్నికల్లో దేవినేని విజయం సాధించడం మంత్రి అవ్వడం చకచకా జరిగిపోయాయి. కట్ చేస్తే గెలిచిన తర్వాత దేవినేని విజయానికి కారణమైన బొమ్మసానిని పట్టించుకోవడం మానేశాడట. కాలం కలిసిరాలేదని ఊరుకున్న బొమ్మసాని..2024 మైలవరంలో టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని ఆరాటపడుతున్నారని సమాచారం. అందులో భాగంగానే ఆత్మీయ సమావేశం పెట్టుకుని తనకు జరిగిన అన్యాయాన్ని బొమ్మసాని బయపెట్టేశారని చర్చ నడుస్తోంది. ఎసరు పెట్టేందుకు నాని రెడీ ఇదంతా పైకి కనిపించే విషయాలే కాగా...అసలు స్థానికత తెరమీదకు రావడం వెనుక ఎంపీ కేశినేని నాని హస్తం కూడా ఉందన్న ప్రచారం మైలవరంలో జోరుగా సాగుతోంది. కేశినేని నాని అంటే దేవినేని ఉమాకు పడదు. ఈ ఇద్దరు నేతలూ ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగానే ఉంటారు. ఇటీవల టీడీపీలో కేశినేని నాని సోదరుడు చిన్ని యాక్టివ్ రోల్ పోషించడానికి దేవినేని ఉమానే కారణమట. నానిపై ఉన్న కోపంతో చిన్నిని చంద్రబాబు సాయంతో బెజవాడ రాజకీయాల్లో బిజీ చేసేశారట దేవినేని ఉమ. ఈ విషయంపై గత కొంత కాలంగా రగిలిపోతున్న కేశినేని నాని...సమయం చూసి ఇప్పుడు మైలవరంలో దేవినేనికి ఎసరు పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్నారని వినికిడి. అందుకే బొమ్మసాని రూపంలో లోకల్ నినాదాన్ని రాజేసినట్లు టాక్. బాబు బంతాట బొమ్మసాని సుబ్బారావుకి కేశినేని నాని సన్నిహితుడైన కాజ రాజ్ కుమార్ బహిరంగంగానే మద్దతిస్తున్నారు. అందుకే ఉమాకు ఇప్పుడు అసలైన టెన్షన్ మొదలైందట. మైలవరం నియోజకవర్గం అంతటా...బొమ్మసాని సుబ్బారావుకి, కాజ రాజ్ కుమార్ కు టీడీపీ క్యాడర్ లో మంచి పట్టు ఉండటంతో ఉమాకు దిక్కు తోచడంలేదని తెలుగు తమ్ముళ్ళు సంతోషంగా చెబుతున్నారు. మైలవరం ఆత్మీయ సమావేశం వేదికగా ఉమాపై వెల్లువెత్తిన అసమ్మతిపై ఇప్పటికే చంద్రబాబు ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారని తెలుస్తోంది. మైలవరంలో తలెత్తిన లోకల్, నాన్ లోకల్ పంచాయతీలో అధిష్టానం ఎవరివైపు నిలబడుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారట. -
చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ఒక పగటి వేషగాడు, పిట్టలదొర అంటూ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆదివారం గొల్లపూడిలో నిర్వహించిన 'వైఎస్సార్ ఆసరా' కార్యక్రమం సంబరాలకు మంత్రి కొడాలి నాని ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాలను తనే ప్రవేశపెట్టానని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నాడు. 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్నాడు. డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు. దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను మోసం చేసిన వాడిగా చంద్రబాబు పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. చంద్రబాబు సారధ్యంలో కొందరు దొంగలు ఇప్పటికే పర్యటనలు మొదలు పెట్టారు. దేవినేని ఉమా సొల్లు కబుర్లు చెబుతుంటాడు. నేను, వంశీ ఫోన్లు చేసినా ఎత్తడు. మా ఫోన్లు బ్లాక్‌లో పెట్టేశాడు. దేవినేని ఉమా ఓ చవటదద్దమ్మ. ఉమా పకోడీ బెదురింపులకు అధికారులెవరూ భయపడొద్దు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే కేసులు పెట్టండి. మీకు అండగా మేమున్నాం. చదవండి: (ఈ పాపం టీడీపీదే) చాలా మంది తెలుగుదేశం సన్నాసులకు ఓ విషయం తెలియదు. వైఎస్సార్సీపీ అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు. వైఎస్సార్సీపీ అంటే టీడీపీ కంటే బలమైన మాస్ ఇమేజ్ ఉన్న శక్తివంతమైన పార్టీ. గుడివాడైనా, మైలవరమైనా.. మరెక్కడైనా వైఎస్సార్సీపీ జెండానే ఎగురుతుంది' అని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్ కుమార్, సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు. చదవండి: (కుట్రపూరితంగా టీడీపీ దుష్ర్పచారం: మంత్రి బాలినేని) -
ఉమా అనుచరులే వైఎస్సార్ సీపీ నేత కారు అద్దాలు పగలగొట్టారు
-
దేవినేని ఉమాను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
-
మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగు జగనన్న కాలనీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏపీ ప్రభుత్వం పేదలకు గడ్డమణుగులో ఇళ్ళ స్థలాలను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా అక్కడ మెరకను చదును చేసే పనులు కొనసాగిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన దేవినేని ఉమా అటవీ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ అసత్యపు ప్రచారం సాగించారు. 50 మందికి పైగా తన అనుచరులతో ఇళ్ల స్థలాల వద్దకు చేరుకున్న ఉమా.. నియోజకవర్గ ఎమ్మెల్యేపై బురదజల్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి ఉమాని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఉమా తనపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ అసత్యపు ఆరోపణలు చేస్తూ కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఇరువర్గాలు స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే గతంలో అదే అటవీ ప్రాంతంలో ఉమా అక్రమ మైనింగ్ చేశాడని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అర్ధరాత్రిదాకా కొనసాగిన ఉద్రిక్తత జీ.కొండూరులో అర్ధరాత్రి ఒంటిగంట దాకా ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఉమ ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున గ్రామానికి తరలిరాగా పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దేవినేని ఉమ అరెస్ట్ దేవినేని ఉమను అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తిరువూరు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. జీ.కొండూరు వివాదానికి మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రదాన కారణమని ఏలూరు రేంజ్ డిఐజి మోహన రావు, కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌లు తెలిపారు. దేవినేని ఉమ దురుద్దేశపూర్వకంగా.. ముందస్తు ప్లాన్‌లో భాగంగానే జి.కొండూరు వెళ్లినట్లు తెలుస్తోందన్నారు. శాంతి భద్రతలకి విఘాతం కలిగించినందున మాజీ మంత్రి దేవినేని ఉమపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసుని పూర్తి పారదర్శకంగా విచారణ చేస్తున్నామన్నారు. దేవినేని ఉమపై పోలీసులకి ఫిర్యాదు కూడా అందిందన్నారు. దేవినేని అబద్దపు ప్రచారాలు బట్టబయలు జి.కొండూరు వివాదంలో దేవినేని అబద్దపు ప్రచారాలు బట్టబయలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ దాడి విజువల్స్‌ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బయటపెట్టారు. జి.కొండూరుకి చెందిన వైఎస్సార్సీపీ నేత పాలడగు దుర్గా ప్రసాద్ కారును, మరో దళిత కార్యకర్త సురేష్ పైనా టీడీపీ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో రాళ్లు, కర్రలతో కొట్టాలంటూ దగ్గరుండి టిడిపి కార్యకర్తలని దేవినేని ఉమా రెచ్చగొట్టారు. రెండుసార్లు టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి ప్రయత్నించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ తనపైనే దాడి జరిగిందంటూ పచ్చమీడియా సహకారంతో దేవినేని ఉమ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పచ్చమీడియాలో చూపిన కారు తమదేనని.. తమపైన దాడి విజువల్స్‌ని దేవినేనిపై దాడిగా చూపించారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మాజీ మంత్రి ఉమా ప్లాన్ రివర్స్
మైలవరం: మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావుకు మైలవరంలో ఘోర పరాభవం ఎదురైంది. చాలా కాలం తర్వాత పార్టీ నాయకులతో కలసి బుధవారం ఉమా ఇక్కడికి వచ్చారు. స్థానిక దళితవాడ నుంచి నలుగురు మహిళలను వెంటబెట్టుకుని అయ్యప్పనగర్‌లో పేదల కోసం ఏర్పాటు చేసిన ప్లాట్లలోకి వెళ్లారు. నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన ఆ ప్లాట్లను వారికి ఇవ్వలేకపోతున్నారని ఆరోపిస్తూ సీఎం వైఎస్ జగన్‌ను, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ను ఆ మహిళలతో తిట్టించే ప్రయత్నం చేశారు. అయితే ఈ పథకం బెడిసి కొట్టింది. గతంలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ఇప్పుడు సరిహద్దు రాళ్లు కూడా పీకేశారని గ్రామానికి చెందిన పచ్చిగోళ్ల మరియమ్మ మాట్లాడుతూ.. ఆ రాళ్లు పీకేయించిన ఉమాని బట్టలూడదీసి కొట్టాలని అనడంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. వెంటనే ఉమాతో సహా పార్టీ నాయకులు అక్కడి నుంచి జారుకున్నారు. -
దేవినేని ఉమాపై సీఐడీ కేసు
సాక్షి, కర్నూలు : సీఎం వైఎస్ జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు శనివారం కర్నూలు జిల్లా లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు ఎన్.నారాయణరెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు. దేవినేని ఉమా ఈ నెల 7న తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి సీఎం జగన్‌కు తిరుపతి అంటే ఇష్టం లేదనే విధంగా మాట్లాడడంతోపాటు నకిలీ వీడియోను ప్రదర్శించారని.. దాన్ని తన ట్విట్టర్లోనూ పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం అనని మాటలను అన్నట్లు మార్ఫింగ్ చేసి బురద చల్లే ప్రయత్నం చేసిన ఉమాపై చట్టప్రకారం చర్య తీసుకోవాలని కోరారు. చదవండి: (పరారీలో టీడీపీ నేత కూన రవికుమార్) -
మార్ఫింగ్‌తోనే ఉమా ట్వీట్.. వాస్తవాల నిగ్గు తేల్చిన ‘ఫ్యాక్ట్ చెక్’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలను వక్రీకరిస్తూ మార్ఫింగ్ వీడియోతో తిరుపతి ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పన్నిన కుట్ర బూమరాంగ్ అయింది. ఆయన దురుద్దేశాలను పటాపంచలు చేస్తూ ఫ్యాక్ట్ చెక్ టీమ్ అసలు వాస్తవాలను నిగ్గుతేల్చి గురువారం వాటిని వెల్లడించింది. ఆ వివరాలు.. ‘‘ఎవరైనా తిరుపతిలో వచ్చి ఉండండి అంటే ఎవరూ రారు. ఏ వ్యక్తి కూడా ఒడిశాలో ఉండడానికో.. బీహార్‌లో ఉండడానికో.. తిరుపతిలో ఉండడానికో ఇష్టపడడు.. అంటూ గతంలో తిరుపతిని కించపరిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తిరుపతి పార్లమెంటులో ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిది?’’ అంటూ సీఎం వైఎస్ జగన్ మార్ఫింగ్ వీడియోతో ఉమా బుధవారం ట్వీట్ చేశారు. ఫ్యాక్ట్ చెక్ టీమ్ రంగంలోకి దిగి ఇందుకు సంబంధించిన వాస్తవాలను వెల్లడించింది. ఆరేళ్ల కాలంలో వేర్వేరు సందర్భాల్లో సీఎం వైఎస్ జగన్ మాట్లాడిన వీడియోలను మార్ఫింగ్ చేసి ఉమా ట్వీట్ చేశారని నిర్ధారించింది. మార్ఫింగ్ వీడియోకు ఆడియో కూడా సరిపోకపోవడంతో ఇది ఉద్దేశపూర్వంగా చేసినదేనని పేర్కొంది. 2014 ఏప్రిల్ 13న వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంలోను, 2019 మే 26న ఢిల్లీ పర్యటన సందర్భంలోను సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన మీడియా సమావేశాల వీడియో క్లిప్‌లను కావాల్సిన మేరకు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి వ్యతిరేక భావన వచ్చేలా రూపొందించినట్లు తేలింది. వాస్తవానికి ఆయా మీడియా సమావేశాల్లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోనున్న చర్యలు, వైద్య ఆరోగ్య విభాగంలో ఎక్కడైనా సరే మౌలిక వసతులు ఏర్పాటుచేయకుండా వైద్య నిపుణులు తిరుపతి, ఒడిశా, బిహార్‌లో ఉండటానికి ఇష్టపడరనే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఆయా వీడియోలను ఉమా ‘స్మార్ట్ ఎడిటర్’తో మార్ఫింగ్ చేశారని, వాటిలోని దృశ్యానికి ఆడియో అనుసంధానం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఫ్యాక్ట్ చెక్ తేల్చింది. ఈ తేడాలను అందరూ గమనించేలా ఒరిజినల్ ఆడియోతో ఉన్న ఒరిజినల్ వీడియోను, ఉమా మార్ఫింగ్ వీడియో క్లిప్‌లను కూడా ఊ్చఛ్టిఇజ్ఛిఛిజు.అ్క.ఎౌఠి.జీn వెబ్సైట్లో ఉంచారు. తిరుపతి ఉపఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేయడానికి, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఉమా మార్ఫింగ్ వీడియోతో చేసిన ట్వీట్‌పై చట్టపరమైన చర్యలకు ఫ్యాక్ట్ చెక్ తగిన ఆధారాలతో సంబంధిత అధికారులకు సిఫారసు చేసింది. -
నిరసన దీక్ష పేరుతో హైడ్రామా
భవానీపురం(విజయవాడ పశ్చిమ): మంత్రి కొడాలి నాని తననుద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ నిరసన దీక్ష పేరుతో హైడ్రామాకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెరలేపారు. మంగళవారం ఉదయం గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం తననెవరూ గుర్తుపట్టకుండా నెత్తిన టోపీ, ముఖానికి మాస్క్ ధరించి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడ మోహరించి ఉన్న పోలీసులు ఉమాను అరెస్టు చేసి పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, వల్లభనేని వంశీలు వైఎస్సార్సీపీ శ్రేణులతో అక్కడకు వచ్చారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ శ్రేణులు, నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశారు. కాగా, దేవినేని ఉమాను మంగళవారం సాయంత్రం పమిడిముక్కల పోలీసులు విడుదల చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం ఉమా హైడ్రామా నేపథ్యంలో మంగళవారం ఉదయం గొల్లపూడిలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేత తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, వల్లభనేని వంశీ, ఎంపీ నందిగం సురేష్‌లు అక్కడినుంచి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి చివరికి చంపేసిన చంద్రబాబు, వదినను చంపేసిన ఉమా ఆయన విగ్రహానికి దండేసి ఆత్మక్షోభకు గురిచేసినందుకు నిరసనగా క్షీరాభిõÙకం చేశామన్నారు. -
దేవినేని ఉమపై సోదరుడు చంద్రశేఖర్ వ్యంగ్యస్త్రాలు
సాక్షి, కృష్ణా : టీడీపీ నేత దేవినేని ఉమాపై ఆయన సోదరుడు చంద్రశేఖర్ విమర్శనాస్త్రాలు సంధించారు. తన సోదరుడు ఉమాకు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదని దేవినేని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో మంగళవారం మాట్లాడుతూ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ ఉంపుడుగత్తెలా వ్యవహరస్తున్నాడని నిప్పులు చెరిగారు. టీడీపీ ఇచ్చిన 650 హామీల్లో అయిదు హామీలు కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక 18 నెలల్లోనే అన్ని వర్గాలకు సంక్షేమం అందించారన్నారు. చదవండి: వల్లభనేని సవాల్.. దేవినేని ఉమ హైడ్రామా సంక్షేమాన్ని అడ్డుకునేందుకే టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీనియర్ రాజకీయ నాయకులని భుజాలు చరుచుకునే చంద్రబాబు.. పేదలకు ఎన్ని పట్టాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు ఒకేసారి లక్షలాది మందికి పట్టాలు ఇస్తుంటే కన్నుకుట్టి రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతల ఉత్తర ప్రగల్బాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఎం విచారణ జరిపించాలని దేవినేని చంద్రశేఖర్ కోరారు. చదవండి: ‘ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించబోతున్నాం’ టీడీపీ నేత దేవినేని ఉమా పెద్ద డ్రామా ఆర్టిస్టు అని ప్రజలందరికీ తెలుసు అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును చూసి తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతుందన్నారు. పోలీసులు ఎలాగూ ధర్నా చేయనివ్వరని తెలిసి గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వచ్చి దేవినేని ఉమా డ్రామాలాడుతున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి పతకం అమలువుతున్నప్పుడు వెంటనే ప్రభుత్వం బురదజల్లడానికి తెలుగుదేశం పార్టీ తయారవుతుందని ధ్వజమెత్తారు. గొల్లపూడిలో నిన్న 3648 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. చూసి ఓర్వలేక దేవినేని ఉమ నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. దేవినేని ఉమకు చిత్తశుద్ధి ఉంటే.. పత్రికా ముఖంగానైనా లేదా ఒక టీవీ స్టూడియోకి వస్తే చర్చకు రావాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సవాల్ విసిరారు. పోలీసులు ఎలాగూ అడ్డుకుంటారని తెలిసి తెలిసి రోడ్ల మీదకు వచ్చి డ్రామాలు చేయడం కరెక్ట్ కాదన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో గొల్లపూడిలో ఒక్క పట్టా కూడా ఇవ్వలేదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అవకతవకలు జరిగాయని దేవినేని ఉమా మాట్లాడుతున్నారని, ‘ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం, గొల్లపూడి లబ్ధిదారులను పిలిపించి సమావేశం పెడదాం.. మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమా..’ అని దేవినేని ఉమాకు సవాల్ విసిరారు. -
దేవినేని ఉమాపై కేసు నమోదు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, కొంతమంది టీడీపీ నేతలు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని షాబాద్, జక్కంపూడి గ్రామస్తులు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు దేవినేని ఉమా, టీడీపీ నాయకులపై బుధవారం కేసు నమోదు చేశారు. షాబాద్ గ్రామంలోని కొండ ప్రాంతం వద్ద ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తుంది. ఆ ఇళ్లను టీడీపీ నేతలు పరిశీలించేందుకు వచ్చి ఏమీ లేని క్వారీలో ఫొటోలు తీశారు. గతంలోనూ ఇదే తరహాలో టీడీపీ నేతలు వ్యవహరించడంతో రెండు గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోవడంతో పాటు గొడవలకు దిగారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో గ్రామాల్లో టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడసాగారు. దీంతో ఇరు గ్రామాల పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
దేవినేని ఉమకు షాకిచ్చిన జక్కంపూడి గ్రామస్తులు..
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమకు జక్కంపూడి - షాబాద్ గ్రామస్తులు షాకిచ్చారు. ఎప్పటిలానే మాజీ మంత్రి ఉమ తనదైన శైలిలో నలుగురిని వెంటేసుకొని గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా ఉన్న ఇళ్ల వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో గ్రామస్తులు అక్కడకు చేరుకొని మాజీ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఎదురుతిరిగి ప్రశ్నించడంతో దేవినేని ఉమ, అతని అనుచరులు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. (ఏబీ వెంకటేశ్వరరావు కేసులో కీలక పరిణామం) ఈ సందర్భంగా గ్రామస్తులు.. మా పేదల దగ్గర నుండి భూములు తీసుకున్న మీరు మాకు ఇళ్లు ఇవ్వకుండా ఎక్కడో విజయవాడలో ఉండే వాళ్ళకు ఎందుకు ఇచ్చారు..?. మాకు న్యాయం చేస్తామని చెప్పి మాటిచ్చి భూములు తీసుకుని మమ్మల్ని మోసం చేశారంటూ స్థానికులు ఎదురుతిరగి ప్రశ్నించడంతో మాజీ మంత్రి అక్కడ నుండి తోకముడిచి పారిపోయారు. -
అలా ‘బుక్’ అయ్యారు..!
సాక్షి, అమరావతి : పాఠ్య పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోలు ముద్రించారని, న్యాయస్థానం ఆదేశాలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అభాసుపాలయ్యారు. ఉమా శనివారం మీడియా సమావేశంలో పాఠ్య పుస్తకమంటూ ఓ పుస్తకాన్ని చూపించారు. వాస్తవానికది పాఠ్యపుస్తకం కాదు. విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ‘వారధి’ పేరుతో బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో దూరదర్శన్ సప్తగిరి చానెల్లో బ్రిడ్జి కోర్సు వీడియోలను ఈనెల 10వ తేదీనుంచి ప్రసారం చేస్తున్నారు. బ్రిడ్జి కోర్సు మెటీరియల్‌కు సంబంధించి ఒక పుస్తకం అట్టపై ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఉండటాన్ని ప్రస్తావిస్తూ దేవినేని ఉమా విమర్శలు చేశారు. (అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం) అయితే ఆయన చూపించిన బ్రిడ్జి కోర్సు పుస్తకంపైనే వారధి అని స్పష్టంగా ఉండటం గమనార్హం. కాగా బ్రిడ్జి కోర్సులు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన మెటీరియల్‌పై సీఎం ఫొటోలు ఉండటం ఇప్పుడేమీ కొత్తకాదు. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రతి పుస్తకంపైనా ఇలాంటి ఫొటోలు ముద్రించుకున్నారు. ‘అభ్యసన ఫలితాలు (లెర్నింగ్ అవుట్ కమ్స్ క్లాస్ 1 – 8) పేరిట సర్వశిక్ష అభియాన్ ద్వారా రూపొందించిన పుస్తకంపై చంద్రబాబు తదితరులతో పాటు నారా లోకేష్ ఫొటోను కూడా ముద్రించారు. -
'ఆ విషయం కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసు'
సాక్షి, నెల్లూరు: పోతిరెడ్డిపాడుపై టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఆదివారం రోజున నెల్లూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మాట్లాడేది టీడీపీ నేతలే. చంద్రబాబు ఎక్కడున్నా పోతిరెడ్డిపాడుపై ఆయన వైఖరేంటో స్పష్టం చేయాలి. దేవినేని ఉమాతో పాటు టీడీపీ నేతలు పోతిరెడ్డిపాడుపై ఎందుకు మాట్లాడటం లేదు. టీడీపీ మౌనం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో మొట్టమొదటిసారిగా సోమశిల జలాశయంలో 78 టీఎంసీల నీరు నిల్వ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది. ఈ సారి 9 లక్షల ఎకరాలకు మొదటి పంటకు నీరు ఇచ్చాం. 2 లక్షల 70వేల ఎకరాలకు రెండో పంటకు నీరు ఇస్తున్నాం. అందులో అనుమానాలు ఉంటే నెల్లూరు జిల్లాలోని టీడీపీ నేతలను అడిగి తెలుసుకోండి. చదవండి: బాబు వాడకం ఎలా ఉంటుందంటే..! పోలవరం విషయంలో తప్పుడు లెక్కలు మాట్లాడవద్దు. పోలవరం అంటే ప్రాజెక్ట్‌తో పాటు పునరావాసం కూడా ఉంది. వైఎస్సార్ హయాంలోనే పోలవరం ప్రారంభమైంది. టీడీపీ హయాంలో కాంట్రాక్లర్ల నుంచి ఎంత వసూలు చేశారో అందరికీ తెలుసు. ఐదేళ్లు కూడా ఉమా కాంట్రాక్టర్లను, అధికారులను అడ్డగోలుగా వాడుకున్నారు. నేను ఏ కాంట్రాక్టర్‌ను కూడా కలవలేదు. పదవుల కోసం నీవు ఎవరిని చంపావనే విషయం కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసు' అంటూ మంత్రి అనిల్ దేవినేని ఉమాపై ధ్వజమెత్తారు. చదవండి: డాక్టర్ సుధాకర్ టీడీపీ మనిషి: ఎంపీ సురేష్ -
‘ఆయన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వ్యాపిస్తున్న కరోనాను ఐక్యమత్యంతో ఎదుర్కోవాల్సిన సమయంలో దేవినేని ఉమా రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మైలవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. సోమవారం ఎమ్మెల్యే తాడేపల్లిలో మాట్లాడుతూ.. రాష్ట్రం విపత్తులో ఉన్న సమయంలో చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటుంటే టీడీపీ నేతలు ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ రోజు అయినా ఉమా ప్రజలు గురించి ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. (టీవీ ప్రసారాలకు అంతరాయం కలిగించొద్దు.. ) టీడీపీ నేతలు ప్రజలను కరోనాపై భయాందోళనకు గురిచేస్తున్నారని, ప్రజలకు కావాల్సింది విమర్శలు కాదు భరోసా అని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కరోనా పోరాటంలో కలిసి రాకపోగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, ప్రజలకు ధైర్యం చెప్పకపోగా వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పదవి పోయి దేవినేని ఉమాకు పిచ్చి పట్టిందని ఎద్దేవా చేశారు. మంత్రిగా ఉమా జిల్లాకు ఏం చేశారని నిలదీశారు. కొడాలి నాని గురించి మాట్లాడుతున్న ఉమాకు ఏ అర్హత ఉందని ఇరిగేషన్ మంత్రి చేశారని ప్రశ్నించారు. (మీరెవరో మీకైనా తెలుసా: ప్రధానిపై ఫైర్! ) ‘మరొక ఏడాదిలో మళ్ళీ నేను మంత్రి అవుతానని దేవినేని ఉమా అందరికి చెపుతున్నాడంటా. ఆయనను పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలి. దేవినేని నెహ్రూ ఇంట్లో కాపీలు మోసుకుంటూ పీఏ గా పని చేసిన వ్యక్తి ఉమా. మంగళగిరి పేరు పలకని వ్యక్తి లోకేష్‌ను ఐటీ మంత్రిగా చంద్రబాబు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడాలనేది టీడీపీ ఉద్దేశ్యం. ప్రజలు ఇబ్బంది పడితే రాజకీయాలు చేయాలన్నదే టీడీపీ లక్ష్యం. కరోనా విషయంలో సీఎం జగన్ సూచనలను ప్రధాని మోదీ పరిగణలోకి తీసుకొనే అవకాశం ఉంది’. అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. (‘దేవినేని ఉమాకు మతి భ్రమించింది’) -
‘దేవినేని ఉమాకు మతి భ్రమించింది’
సాక్షి, తాడేపల్లి : టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నల మాదిరిగా తాము సంస్కార హీనంగా మాట్లాడలేమని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక టీడీపీ నేతలు వెకిలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల్లో గెలవలేమని అర్థమయిన టీడీపీ నేతలు ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దేవినేని ఉమా పిచ్చి ఆస్పత్రిలో చేరుతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమాను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. తాము టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై విమర్శలు చేయగలమని.. కానీ తమకు సంస్కారం ఉందని పేర్కొన్నారు. గౌరవం, మర్యాద అనేది దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుంటుం సొంతమని తెలిపారు. -
‘ఆయన ఇంటికి ఎవరూ వెళ్లరు’
సాక్షి, కృష్ణా: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమపై మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. మూడు రాజధానులకు మద్దతు తెలిపినందుకు దేవినేని ఉమ.. వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్‌పై విమర్శలు గుప్పించారు. వీటిపై సోమవారం ఆయన స్పందిస్తూ.. అన్నయ్య పేరు చెప్పుకుని బతికే ఆయన కృష్ణ ప్రసాద్‌ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం అన్నయ్య పేరు చెప్పుకుని రాజకీయంగా ఎదిగి.. నేడు అన్నయ్య కూతుర్లను సరిగ్గా చూసుకోలేని అసమర్థుడని విమర్శించారు. ప్రజల సొమ్ముతో బతికే అతనికి నీతినిజాయితీలు లేవని.. అందుకే ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ అతని ఇంటికి వెళ్లరని ఎద్దేవా చేశారు. ‘నువ్వు ఐదుసార్లు ఎన్నికల్లో పోటీ చేశావు.. మరి నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల విలువ ఎంత? ఎందుకని నువ్వు ఆస్తి వివరాలు ప్రకటించడం లేదు?’ అంటూ ఆయన వరుస ప్రశ్నలు సంధించారు. ‘పోలవరంలో నువ్వు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. త్వరలోనే నువ్వు జైలుకు వెళ్లడం ఖాయం. డబ్బులు ఉంటే ఇబ్బంది అవుతుంది అని తెలిసి వజ్రాలు కొని దాచుకుంటున్నావు. నువ్వు ఎంత నీతిమంతుడివో నీ ఇంట్లో సూట్‌కేస్ తెరిస్తే అర్థమవుతుంది. దాదాపు సగం మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి సొమ్ము మొత్తం వజ్రాల రూపంలో మీ ఇంట్లోనే ఉంది’ అని వసంత నాగేశ్వరరావు విమర్శించారు.(ఎంపీ సురేష్‌పై టీడీపీ నేతల దాడి) -
వెన్నులో వణుకు పుడుతుందా ఉమా?
సాక్షి, అమరావతి : సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అక్రమాలపై గత టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిలదీశారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ప్రాజెక్టుల పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ అమల్లోకి వస్తుందనగానే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు, దేవినేని ఉమాకు వెన్నులో వణకు పుడుతుందా అని ప్రశ్నించారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో దోచుకున్న ప్రతి రూపాయిని కక్కిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కుల, వర్గ బలహీనతలు లేవని తెలిపారు. కాగా, పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం వైఎస్ జగన్ ప్రాజక్టుల పనుల్లో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అందులోనూ తొలిగా పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రివర్స్ టెండరింగ్‌కు జలవనరుల శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. రివర్స్ టెండరింగ్‌తో భారీ మొత్తంలో ప్రజాధనం ఆదా అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రాజెక్టుల పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే మీకు, మీ అధినేతకు వెన్నులో వణుకు పుడుతుందా ఉమా? పోలవరంలో మీరు దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తాం. మీలాగా కుల, వర్గ బలహీనతలు సీఎం జగన్ గారికి లేవు. చూస్తారుగా తొందరెందుకు? — Vijayasai Reddy V (@VSReddy_MP) August 1, 2019 బాబు అలా అనడంలో వింతేమీ లేదు.. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీకి కొత్త ఇమేజీ తీసుకొస్తానని సీఎం వైఎస్ జగన్ చెబుతుంటే.. రాష్ట్రానికి పరిశ్రమలు రావని పచ్చపార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఐటీ, ఈడీ దాడులు జరిగినప్పుడు కూడా ఇలానే మాట్లాడారని గుర్తుచేశారు. అవినీతిని వ్యవస్థీకృతం చేసిన చంద్రబాబు.. అది లేకుండా పనులెలా జరుగుతాయనడంలో వింతేమీ లేదని ఎద్దేవా చేశారు. -
అమాత్యుని లయ.. అంతా మాయ!
చీమలు పెట్టిన పుట్టల్ని పాములు ఆక్రమించుకున్నట్టు చిరుదోగ్యులు తమ ఇళ్ల కోసం కొనుక్కున్న భూమిని ప్రభుత్వ పెద్దలు బినామీ పేర్లతో కబ్జా చేశారు. బాధితులకు అండగా నిలవాల్సిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన సీఆర్డీఏ కబ్జాదారుల క్రయవిక్రయాలకు అనుమతిచ్చేసింది. ప్రజలకు సహకరించాల్సిన సహకార శాఖ అక్రమార్కులకు అండగా నిలుస్తోంది. ఫలితంగా విజయవాడ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (వీఆర్‌టీఏ)కు చెందిన దాదాపు రూ.100 కోట్ల విలువైన తొమ్మిదెకరాల భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఇది రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇలాకా అయిన మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో ఈ భూ దోపిడీ యథేచ్చగా సాగుతోంది. నిజమైన సభ్యులకు చెందాల్సిన ప్లాట్లతో కబ్జాకోరులు రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. ఈ దందాను చూసీ చూడనట్లు వదిలేస్తున్న ప్రభుత్వ శాఖల తీరును గమనిస్తే దీని వెనుక మంత్రి ఉమా అండ దండలున్నాయనేది స్పష్టమవుతోందని బాధిత సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, అమరావతి తప్పుదోవ పట్టించే నివేదికలు విజయవాడ కేంద్రంగా ప్రైవేటు లారీ ఆఫీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులతో 1970లో విజయవాడ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(వీఆర్‌టీఏ) ఏర్పడింది. విజయవాడ వన్‌టౌన్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుని దాదాపు 400 మంది చిరుద్యోగులు ఈ అసోసియేషన్‌లో చేరారు. సొంతింటి స్థలం పొందాలనే ఆశయంతో 1980లో ఇబ్రహీంపట్నంలో 9 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇందుకు లారీ యజమానులు, సంఘ సభ్యులు విరాళాలు అందించారు. అప్పట్లో దాని విలువ రూ.3.50 లక్షలు. ప్రస్తుతం మార్కెట్లో దాదాపు రూ.వంద కోట్లు ఉంటుంది. వీఆర్టీఏలో సభ్యులకు స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించుకునేలా 1980 డిసెంబర్లో కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. సొసైటీ పేరుతో ఆ భూమిని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు. ఎంఐజీ, ఎల్ఐజీ పేరుతో 250, 150 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించి సభ్యులకు కేటాయించాలని నిర్ణయించారు. 1981లో కొత్త కార్యవర్గం ఏర్పడటంతో సమస్యలు మొదలయ్యాయి. విజయవాడ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(వీఆర్‌టీఏ) పేరును 1997లో విజయవాడ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(వీజీటీఏ)గా మార్పు చేశారు. మళ్లీ 2000లో దాన్ని ‘ది విజయవాడ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్’గా పేరు మార్చారు. విలువైన భూమిపై కన్నేసిన కొందరు ఆ తర్వాత వీఆర్‌టీఏ హౌసింగ్ సొసైటీని కూడా మూసేస్తూ దాని పేరిట ఎలాంటి భూమి లేదని ప్రకటించారు. గతంలో సొసైటీ బాధ్యుడిగా ఉన్న వ్యక్తి దగ్గర పని చేసిన ఉద్యోగి ఇదే భూమిలో రెండంతస్తుల భవనం కట్టి, అక్కడ ప్లాట్ల క్రయవిక్రయాలను పర్యవేక్షిస్తున్నాడు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వ అధికారులు.. మంత్రి జోక్యంతో తప్పుదోవ పట్టించే నివేదికలతో నిజమైన సభ్యులకు అన్యాయం చేస్తున్నారు. ఈ అక్రమాలకు ప్రభుత్వానికి చెందిన సీఆర్డీఏ, కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ తదితర శాఖలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వాస్తవంగా వీఆర్‌టీఏ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన సభ్యులకు దక్కాల్సిన ప్లాట్లు కబ్జా కోరల్లో చిక్కుకుపోయాయి. దీంతో కబ్జాకోరులు ప్రభుత్వ శాఖల సహకారంతో ఇబ్రహీంపట్నంలో అతి విలువైన ఈ ప్లాట్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశారు. సర్వే నంబర్లు 214/2ఏ, 3ఏలలో 2.13 ఎకరాలు, 207/2లో 4సెంట్లు, 214/2ఏ, 2బీలలో 2.12 ఎకరాలు, 214/2బీ,3బీలలో 4.48 ఎకరాలు చొప్పున సుమారు 9 ఎకరాలు ఉండాలి. కానీ అందులో 214/2ఏ, 2బీలలో 2.12 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని గతంలోనే ప్రకటించగా, మిగిలిన మూడు సర్వే నంబర్లలో 139 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ప్రతిపాదిత 318 ప్లాట్ల లేఔట్లో 179 ప్లాట్లు అన్యాక్రాంతమయ్యాయి. వాస్తవంగా సభ్యులైన 20 మందికి మాత్రమే ప్లాట్లు కేటాయించగా మిగిలినవి బినామీ పేర్లతో బయటి వ్యక్తులకు కట్టబెట్టారు. కబ్జాదారులు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను తొలుత సేల్‌డీడ్‌గా జరిపించి ఆ దస్తావేజులను ఎవరికీ చూపొద్దని చెబుతున్నట్టు సమాచారం. స్థానిక సబ్ రిజిస్టార్ ఆఫీసును ప్రలోభపెట్టి కొన్నేళ్లుగా ప్లాట్ల వివరాలు బయటకు పొక్కకుండా చూశారు. హౌసింగ్ సొసైటీలో సభ్యులు కాని ఆనేక మందికి ఇష్టారాజ్యంగా ప్లాట్లను అమ్ముకున్నారు. దీంతో ఆ ప్లాట్లలో 27 పక్కా భవనాలు కూడా వెలిశాయి. మిగతావన్నీ ఖాళీ ప్లాట్లుగా ఉన్నప్పటికీ, ఒక్కో ప్లాటును ఇద్దరు, ముగ్గురుకి విక్రయించారని సమాచారం. కొన్న వారు తమదంటే తమదని స్థలం వద్ద తరచూ ఘర్షణలకు దిగుతున్నారు. ఈ 9 ఎకరాలకు సంబంధించిన దస్తావేజులను కూడా విజయవాడలోని ఒక బ్యాంకులో మార్ట్‌గేజ్‌లో పెట్టినట్టు తెలిసింది. న్యాయం జరిగే వరకు పోరాడతాం భూ కుంభకోణంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి అర్హులకు న్యాయం చేయాలని కోరుతూ కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాం. రికార్డులు తారుమారు చేసి ప్లాట్లను అన్యాక్రాంతం చేస్తున్న కబ్జాదారులకు కొన్ని ప్రభుత్వ శాఖలు సహకరిస్తున్నాయి. దీనిపై హైదరాబాద్‌లో లోకాయుక్తాకు ఫిర్యాదు చేశాం. న్యాయం చేయాలని లోకాయుక్త ఆదేశించినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలు శాఖల అధికారులకు, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదులు చేశాం. ఆ భూమిని కబ్జా కోరల నుంచి కాపాడి నిజమైన సొసైటీ సభ్యులకు అందే వరకు పోరాటం సాగిస్తాం. – బొజ్జా రాఘవరావు,వీఆర్‌టీఏ మాజీ కార్యదర్శి -
మంత్రి దేవినేని అనుచరుడి బూతు పురాణం
సాక్షి, విజయవాడ: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరుల ఆగడాలకు ఐదేళ్లుగా అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో తమ మాట వినని వారిని బెదిరించి దాడులు చేయడానికి సైతం తెగబడుతున్నారు. మంత్రి ఉమాకు కుడిభుజంగా ఉండే జంపాన సీతారామయ్య ఆర్యవైశ్య వర్గానికి చెందిన కుటుంబరావు అనే వ్యాపారిని పచ్చిబూతులు తిడుతూ, బెదిరించిన ఆడియో ఇప్పుడు నియోజకవర్గంలో వైరల్ అవుతోంది. ఒక రోడ్డు నిర్మాణ విషయంలో స్థానికులతో కలిసి కుటుంబరావు తన ఆస్తిని కాపాడుకోవాలనుకోవడమే ఆయన చేసిన తప్పు. జంపాన సీతారామయ్య.. కుటుంబరావు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ యథాతథంగా.. కుటుంబరావు: హలో మీరు ఎవరో మీ నంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చినట్లు నా ఫోన్లో ఉంది. జంపాన సీతారామయ్య: నువ్వు ఎక్కడ ఉన్నావో చెబితే నేనే మీ వద్దకు వద్దామని... కుటుంబరావు: సార్ ఎవరు మీరు? జంపాన: నేను సీతారామయ్యనయ్యా, నువ్వు రమ్మంటే రావడం కుదరడం లేదు. అందుకే నువ్వు ఎక్కడ ఉన్నావో చెబితే అక్కడకు నేనే వద్దామని. కుటుంబరావు: పనేంటో చెప్పండి జంపాన: పని చెబితేనే వస్తావా? ఏంటీ? (స్వరం పెంచి) కుటుంబరావు: అవునండి.. పనేంటో ఫోన్లో చెప్పండి.. జంపాన: అంటే.. చెబితేనే వస్తావా? కుటుంబరావు: ఫోన్లో చెప్పండి.. నాతో మీకు పనేముంటుంది? జంపాన: వెర్రి పూ... గు... తంతా... వెర్రి పూ.. ఏమీటి మాట్లాడుతున్నావు(రెచ్చిపోతూ బూతులు తిడుతూ) కుటుంబరావు: మీరేమి మాట్లాడుతున్నారు.. నేనేమి మాట్లాడుతున్నాను.. జంపాన: వెరి పూ.. కుటుంబరావు: నేనేమి మాట్లాడుతున్నాను.. మీరేమి మాట్లాడుతున్నారు.. జంపాన: వెరి పూ..అక్కడ నుంచి తన్నుకుంటూ తీసుకొస్తాను. రమ్మంటే తమాషాలు దెం... కుటుంబరావు : రండి.. తన్నుకుంటూ తీసుకువెళ్లుదురుగాని.. తంతే ఏమౌతుంది? జంపాన: వెరి పూ... నన్నే ఎందుకు? ఏమీటంటూ ఎదురు క్వచ్ఛన్ చేస్తావా? ఎక్కువ మాట్లాడేవంటే తన్నుకుంటూ తీసుకొస్తా.. కుటుంబరావు: నాకు పనులు ఉంటాయి? నా పనులు మానుకుని మీవద్దకు రావాల్సిన అవసరం నాకు ఏమీ ఉంటుంది? జంపాన: ఏమీటీ? ఏమీ మాట్లాడుతున్నావ్ కుటుంబరావు : నాకు కంపెనీ మీటింగ్‌లు జరుగుతున్నాయి. మీకు ఈ విషయం చెప్పాను. జంపాన: ఎన్నిరోజులు జరుగుతాయి? నాతో ఐదు నిముషాలు మాట్లాడి వెళ్లడానికి కుదరడం లేదా? కుటుంబరావు: 15వ తేదీ వరకు జరుగుతాయి. అర్జెంట్ అయితే చెప్పండి వచ్చి మాట్లాడతాను.. అర్జంట్ కాదు కదా? జంపాన: ఎక్కువ మాట్లాడితే ఇబ్బంది పడతావ్ ఇబ్బంది పడతావ్ (గట్టిగా అరూస్తూ, బెదిరిస్తూ) కుటుంబరావు: నేనేమి ఎక్కువ మాట్లాడలేదు. మీకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా. జంపాన: వచ్చి నాతో మాట్లాడి వెళ్లమంటే నన్నే ప్రశ్నిస్తావా? గుర్తుంచుకో. కుటుంబరావు : పనేంటో చెప్పండి సార్ జంపాన: చెబితేనే వచ్చి మాట్లాడి వెళ్లతావా? కుటుంబరావు : చెబితే సెలవు పెట్టుకుని వచ్చి మాట్లాడివెళ్లతా.. పనిఏమీటో చెప్పండి? బూతులు మాట్లాడతారు ఎందుకు జంపాన: మళ్లీ పచ్చి బూతులు.. (ఆగ్రహంతో) నాకే ఎదురు చెబుతావా? వచ్చి మాట్లాడి వెళ్లమన్నా.. అంతే వచ్చి వెళ్లాలి. కుటుంబరావు: నాతో మీకు పని ఉండదు కదా? జంపాన: పని ఉంది కాబట్టే రమ్మన్నా.. ఫోన్లో చెప్పాలా? నువ్వు ఆలోచించుకో.. ఇబ్బంది పడతావ్ (తీవ్రంగా హెచ్చరికలు చేస్తూ) కుటుంబరావు: నేనేమి ఇబ్బందులు పడను. పడ్డా మీరే తీర్చేది. జంపాన: లం... కో.. తమాషాలు దెం... కుటుంబరావు: లం ... అంటూ మాట్లాడవద్దు..నేను మీకు చాలా గౌరవం ఇచ్చాను. జంపాన: లం .. జాగ్రత్తగా వుండు... రమ్మనగానే రా కుటుంబరావు: గౌరవంగా మాట్లాడండి చాలు ఇలా సాగింది వారి సంభాషణ. కాగా, జంపాన సీతారామయ్య కాకితో కబురు పెట్టినా సరే వారు వెంటనే ఆయన వద్ద హాజరు కావాల్సిందే. లేకపోతే ఈ విధంగా భయపెడుతూ బూతులు లంకించుకుంటారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు.. కొండపల్లి బీ కాలనీ సెంటర్ గతంలో వీటీపీఎస్ ఉద్యోగస్తులు బస్సుస్టాప్, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణలో ఈ రెండు తొలగించారు. ఇటీవల తిరిగి ఉద్యోగస్తులు వాటిని పునఃనిర్మించారు. దీనికి మంత్రి ఉమాను పిలిచారు. అయితే ఆహ్వాన పత్రంలో జంపాన సీతారామయ్య పేరు వేయలేదు. దీంతో సీతారామయ్యకు ఆవేశం కట్టలు తెంచుకుంది. వెంటనే ఉద్యోగస్తులకు ఫోన్ చేసి వారిపై బూతు పురాణం లంకించుకున్నారు. స్థానిక నేతల పేర్లు వేయకుండానే కార్యక్రమం చేద్దామనుకుంటున్నారా? మంత్రి వద్ద పెద్దవాళ్లు అయిపోదామను కుంటున్నారా? మీ సంగతి తేలుస్తా.. నాతో పెట్టుకోకండంటూ తిట్టడంతో ఉద్యోగస్తులు నొచ్చుకున్నారు. ఇలా ఉండగా..జంపాన వంటి వ్యక్తులను వెనకేసుకుని తిరిగే వారిని ఈ ఎన్నికల్లో ఓడించాలని నియోజకవర్గ ఓటర్లు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. -
దేవినేని ఉమ అసలు బండారం బట్టబయలు..
-
దేవినేని ఉమ బండారం బట్టబయలు..
సాక్షి, మైలవరం : నిత్యం నీతులు చెప్పే ఏపీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమా అసలు బండారం బట్టబయలు అయిందని వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ...ఎన్నికలు సమీపిస్తుండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పేదలను మభ్యపెట్టేందుకు తోపుడు బళ్లు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోయారన్నారు. అర్థరాత్రి సమయంలో లారీల్లో తోపుడు బళ్లు తీసుకొచ్చి పంపిణీ చేస్తుండగా వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నించారని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. సమాధానం చెప్పలేక టీడీపీ నాయకులు జారుకున్నారని ఆయన పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న దేవినేని ఉమ చేసేవి మాత్రం పనికిమాలిన పనులు...చెప్పేవి శ్రీరంగనీతులు అని ఎద్దేవా చేశారు. కాగా ఎన్నికల కోడ్‌ను లెక్క చేయకుండా టీడీపీ నేతలు అర్థరాత్రి తోపుడు బండ్లు పంపిణీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ మంత్రి దేవినేని ఉమ అండతో టీడీపీ నేతలు ఆదివారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నంలోని కొండపల్లిలో టీడీపీ వార్డ్ మెంబర్ మల్లెంపూడి శ్రీను ఆధ్వర్యంలో తోపుడు బండ్ల పంపిణీ చేశారు. గత వారం వైఎస్సార్సీపీ నాయకుడు బొమ్మసాని చలపతి రావు ఇంట్లో ఎన్నికల కోడ్ కంటే ముందే కొనుగోలు చేసిన క్రికెట్, వాలీబాల్ కిట్లను పోలీసులు సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అయితే సాక్షాత్తూ మంత్రి అండతో కోడ్ ఉల్లంఘించి, తోపుడు బళ్లు పంపిణీచేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. -
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన దేవినేని ఉమా
-
మంత్రి అండతో టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన
సాక్షి, కృష్ణా: ఎన్నికల కోడ్‌ను లెక్క చేయకుండా టీడీపీ నేతలు అర్థరాత్రి తోపుడు బండ్లు పంపిణీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ మంత్రి దేవినేని ఉమ అండతో టీడీపీ నేతలు ఆదివారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి గ్రామంలో టీడీపీ వార్డ్ మెంబర్ మల్లెంపూడి శ్రీను ఆధ్వర్యంలో తోపుడు బండ్ల పంపిణీ చేశారు. గత వారం వైఎస్సార్సీపీ నాయకుడు బొమ్మసాని చలపతి రావు ఇంట్లో ఎన్నికల కోడ్ కంటే ముందే కొనుగోలు చేసిన క్రికెట్, వాలీబాల్ కిట్ లను పోలీసులు సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు మాత్రం మంత్రి అండ అర్థరాత్రి తోపుడు బండ్లును పంపిణీ చేయడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఇంత చేస్తున్నా పోలీసులు పట్టించుకొవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
‘అందుకే నన్ను అరెస్ట్ చేయించాడు’
-
‘అందుకే నన్ను అరెస్ట్ చేయించాడు’
సాక్షి, విజయవాడ : టీడీపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు తప్పు ఎత్తి చూపినందుకే తమ పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి ఉమా మహేశ్వర రావు మైలవరం నియోజకవర్గ ప్రజలను మోసగిస్తున్నారని మండి పడ్డారు. జల వనరుల శాఖ స్థలాన్ని కన్వర్షన్ చేయకుండా పేదలకు దొంగ పట్టాలిచ్చారని ఆరోపించారు. పట్టాల స్థానంలో జవాబుపత్రం అనే పనికిరాని కాగితాలను ఇచ్చి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారంటూ మండి పడ్డారు. ఉమ తప్పు ఎత్తి చూపినందుకే జన్మభూమి సమావేశంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేయడమే కాన తనను అరెస్ట్ చేశారని తెలిపారు. ఉమా మహేశ్వర రావు అబద్దాలు, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మైలవరం నియోజకవర్గంలోని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. -
బినామీకి 'బడా నజరానా'
సాక్షి, అమరావతి: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తన బినామీకి బడా నజరానా ఇచ్చారు. పోలవరం జలాశయం నుంచి ఎడమ కాలువకు నీటిని సరఫరా చేసే పనుల్లో (లెప్ట్ సైడ్ కనెక్టివిటీ) మిగిలిపోయిన రూ.90.01 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ.285.92 కోట్లకు పెంచేసి, వాటిని సూర్య కన్స్ట్రక్షన్స్కు నోటిమాటపై కట్టబెట్టేశారు. దీని ద్వారా రూ.195.91 కోట్ల లబ్ధికి ఎత్తులు వేసినట్లు స్పష్టమవుతోంది. సర్కార్ నుంచి ఎలాంటి అనుమతి లేకున్నా మంత్రి దేవినేని దన్నుతో కాంట్రాక్టర్ పనులు కూడా ప్రారంభించేయడం గమనార్హం..! ఈ వ్యవహారంలో మంత్రి దేవినేనికి భారీ ప్రయోజనం చేకూరినట్లు అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. పోలవరం జలాశయం నుంచి ఎడమ కాలువను అనుసంధానం చేస్తూ నీటిని సరఫరా చేసే పనులను (65వ ప్యాకేజీ) 2005లో రూ.103.91 కోట్లకు యూనిటీ ఇన్ఫ్రా అనే సంస్థ దక్కించుకుంది. ఇందులో రూ.13.92 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దాంతో ఆంధ్రప్రదేశ్ డీటైల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్‌లో ఆ సంస్థపై వేటు వేయాలన్న పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ప్రతిపాదనపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది. నిబంధనల ప్రకారం మిగిలిపోయిన పనులను టెండర్లు ద్వారా కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలి. అంచనా పెంచేసి.. నోటిమాటపై.. లెఫ్ట్ సైడ్ కనెక్టివిటీ పనుల్లో మిగిలిపోయిన 90.01 కోట్ల విలువైన పనులను తమకు అప్పగిస్తే.. పాత ధరలకే పూర్తి చేస్తామని ఆర్ఎస్సార్ ఇన్ఫ్రా, సూర్య కన్స్ట్రక్షన్స్ ముందుకొచ్చాయని పోలవరం చీఫ్ ఇంజనీర్ జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఇదే సమయంలో ఆ పనులు తన బినామీకి చెందిన సూర్య కన్స్ట్రక్షన్కు నామినేషన్ పద్దతిలో అప్పగించాలని మంత్రి దేవినేని ఒత్తిడి తెచ్చినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. పైగా అంచనా వ్యయాన్ని పెంచేయాలని ఒత్తిడి తెచ్చారు. జీవో 22 ప్రకారం ధరల సర్దుబాటును వర్తింపజేస్తే మిగిలిపోయిన పనుల విలువ రూ.126.38 కోట్లకు మించదని అధికారవర్గాలు తేల్చాయి. అయితే అంచనా వ్యయాన్ని పెంచాలంటూ మంత్రి ఒత్తిడి తెచ్చారు. దాంతో పోలవరం అధికారులు 2017–18 (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం రూ.285.92 కోట్లకు పెంచేశారు. వాటికి పాత ధరల ముసుగేసి తన బినామీకి నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని మంత్రి దేవినేని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం అవి ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. అయితే దన్నుతో సూర్య కన్స్ట్రక్షన్స్ సంస్థ వారం క్రితమే పనులను ప్రారంభించేసింది. కేబినెట్ తీర్మానంతో సక్రమం..: నామినేషన్ పద్ధతిలో రూ.285.92 కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి ఆర్థిక శాఖ అంగీకరించే అవకాశాలు లేవు. దాంతో అక్రమంగా అప్పగించిన ఈ పనులను యథాప్రకారం కేబినెట్లో తీర్మానం ద్వారా సక్రమం చేసుకునేందుకు మంత్రి దేవినేని ఇప్పటికే వ్యూహం సిద్ధం చేశారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఇదే కాంట్రాక్టర్‌కు రూ.52.47 కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై అప్పగించి.. కేబినెట్‌తో ఆమోదముద్ర వేయించుకున్నారు. పోలవరం ఎడమ కాలువలో ఒకటో ప్యాకేజీ కింద రూ.92.14 కోట్ల విలువైన పనులను ఇదే రీతిలో కట్టబెట్టారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ నిధులు రూ.42.97 కోట్లు మళ్లించి విజయవాడలో తన క్యాంపు కార్యాలయం పనులను నామినేషన్‌పై అదే కాంట్రాక్టర్‌కు అప్పగించడం గమనార్హం. -
దేవినేని ఉమ జైలుకు వెళ్లడం ఖాయం
సాక్షి, విజయవాడ : పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతిపై కాగ్ నివేదిక నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం సమన్వయకర్త వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన... ప్రతీ విషయానికి స్పందించే ఉమా కాగ్ నివేదికపై ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణలో హరీశ్ రావు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఉమా మాత్రం హడావుడి చేస్తూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రతీ సోమవారం పోలవరం వెళ్లి కమీషన్లు తీసుకోవడమే ఉమా లక్ష్యమని ఆరోపించారు. అసమర్థ సాగునీటి మంత్రి ఉమా అని.. కమీషన్ల కోసం తాపత్రయపడటమే ఆయన పని అంటూ కృష్ణ ప్రసాద్ విమర్శించారు. రమేశ్‌బాబుకు ఎలా ఇచ్చారు? పోలవరం సీఈ రమేశ్ బాబు తెలంగాణ వ్యక్తి అని, ఏమాత్రం అనుభవం లేని అటువంటి వ్యక్తికి ఇంతపెద్ద ప్రాజెక్టు ఎలా అప్పజెప్పారని కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. రమేశ్ బాబు, ఉమా మధ్య ఉన్న బంధం ఏమిటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పోలవరం అవినీతిపై వచ్చే వారం లీగల్ ఒపీనియన్ తీసుకుని సోమవారం లేదా మంగళవారం ఉమా అవినీతిపై ఫిర్యాదు చేస్తానన్నారు. ఉమా అవినీతిపై పూర్తి ఆధారాలున్నాయని, అవన్నీ సీబీఐకి అప్పగిస్తానని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై సమగ్ర విచారణ జరిగితే దేవినేని ఉమ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. -
చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
-
చంద్రబాబుకు అరెస్టు వారెంట్ జారీ
సాక్షి, హైదరాబాద్ : మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సాగునీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావులకు అరెస్టు వారెంట్ జారీచేసింది. 2010లో అనుమతి లేకుండా బాబ్లీ ప్రాజెక్టును సందర్శించిన కేసులో చంద్రబాబు సహా మరో 15 మంది తెలుగుదేశం పార్టీ నేతలకు శుక్రవారం అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. వీరిలో తెలంగాణ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు కూడా ఉన్నారు. కాగా, కోర్టు ఉత్తర్వులపై కౌంటర్ దాఖలు చేయాలని టీడీపీ నాయకులు భావిస్తున్నట్టు సమాచారం. కాగా మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు విషయమై మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్(అవిభక్త) రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2010లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు.. టీడీపీ నేతలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బాబ్లీ ప్రాజెక్టును సందర్శించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసు అప్పటి నుంచి విచారణలో ఉంది. Arrest warrant has been issued by Maharashtra's Dharmabad Court against Andhra Pradesh CM N Chandrababu Naidu, AP irrigation minister and 14 others in connection with an agitation held by TDP in 2010 against the Maharashtra govt opposing the construction of Babhali project. — ANI (@ANI) September 14, 2018 -
‘దేవినేని నీచరాజకీయాలు చేస్తున్నారు’
-
‘వ్యక్తిగత చనువుతోనే ఆయనతో రాజకీయాలు మాట్లాడాను’
సాక్షి, అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలియడంతోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ హోంమంత్రి, వైఎస్సార్సీపీ నేత వసంత నాగేశ్వరరావు విమర్శించారు. వ్యక్తిగత పరిచయంతోనే గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నర్సింహారావుతో రాజకీయాలు మాట్లాడానని, అంతే కానీ ఎటువంటి బెదిరింపులకు పాల్పడలేదన్నారు. అధికార బలంతో బెదిరించి గుంటుపల్లి ఈఓ చేత నాపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నర్సింహారావు మా సొంత గ్రామంలో పనిచేశారు. ఆయనతో నాకు చాలా చనువు ఉంది. గుంటుపల్లిలో వైఎస్సార్సీపీ బ్యానర్లను, జెండాలను ఏకపక్షంగా తొలగిస్తున్నారని గ్రామస్తుల నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో ఈఓ నర్సింహారావు అక్కడే ఉన్నట్లు తెలియడంతో ఆయనకు ఫోన్ చేశా. పాత పరిచయం ఉండటంతో రాజకీయాలు మాట్లాడాను. అదే చనువుతో ఆయన కుటుంబం, పిల్లల గురించి అడిగాను. దానిని ఇంత నీచంగా చిత్రీకరిస్తారా? నోను ఫోన్లో బెదిరింపులకు పాల్పడినట్లు కాల్ రికార్డింగ్‌ను వక్రీకరించారు. నా అనుమతి లేకుండా కాల్ రికార్డు చేయడం ఎంత వరకు సమంజసం‘ అని వసంత నాగేశ్వరరావు ప్రశ్నించారు. మైలవరం నియోజక వర్గంలో వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజామద్దతు దేవినేని తట్టుకోలేకనే ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ జెండాలు తీయించడం, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని మండి పడ్డారు. మంత్రి దేవినేని అవినీతిని తన కుమారుడు కృష్ణ ప్రసాద్ ప్రజల్లో ఎండగడుతున్నారని నాగేశ్వరరావు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో బ్యానర్ల విషయంపై మాట్లాడటానికి ఫోన్ చేసిన నాగేశ్వరరావు, ఈవోని బెదిరించాడని టీడీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నాగేశ్వరరావుపై కేసు కూడా పెట్టారు. -
నాకు తెలియకుండా రుణాలిస్తావా..
సాక్షి, అమరావతి బ్యూరో : కంచికచర్ల మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకులో జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు గద్దె వీరభద్రరావు శుక్రవారం తప్పతాగి వీరంగం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ‘నాకు తెలియకుండా రుణాలు మంజూరు ఎలా చేస్తావు..’ అంటూ బ్యాంకు మేనేజర్‌పై చిందులు తొక్కాడు. ఇక్కడ అంతా మా రాజ్యమని, మా పర్మిషన్ తీసుకోకుండా రుణాలు ఇవ్వకూడదని బ్యాంకులో నానా హంగామా సృష్టించాడు. మంత్రి సోదరుడి హల్చల్తో బ్యాంకు సిబ్బందితోపాటు ఖాతాదారులు హడలిపోయారు. కాపు రుణాలు మంజూరు చేశారని.. స్థానిక కేడీసీసీ బ్యాంకుకు 32 కాపు రుణాలు మంజూరయ్యాయి. ఆ రుణాల కోసం స్థానిక ప్రజా ప్రతినిధి, టీడీపీ జిల్లాస్థాయి నాయకుడు కలిసి లబ్ధిదారులను బ్యాంకుకు ప్రపోజల్స్ పంపారు. మండలంలోని సొసైటీ కార్యదర్శిగా పని చేస్తున్న మంత్రి సోదరుడు వీరభద్రరావు విషయం తెలిసి రెచ్చిపోయాడు.. ఫూట్‌గా మద్యం సేవించిన భద్రయ్య కేడీసీసీ బ్యాంకుకు వెళ్లి మేనేజర్ సోమయ్యతో వాగ్వాదానికి దిగాడు. నాకు తెలియకుండా రుణాలు మంజూరు చేస్తావా.. అంటూ మేనేజర్‌ను నానా దుర్భాషలాడాడు. ఒకటిన్నర దశాబ్ధాల కాలంగా నా అనుమతి లేకుండా రుణాలు మంజూరు చేయలేదని, అలాంటిది నీవెలా మంజూరు చేస్తావంటూ రెచ్చిపోయాడు. తాను సూచించిన లబ్ధిదారులకే బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని, లేకపోతే నీ ఉద్యోగం పీకేయిస్తానంటూ.. పెద్దగా కేకలు వేస్తూ హంగామా చేశాడు. దీంతో భయాందోళనకు గురైన మేనేజర్ సెలవు పెట్టి ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకుని సోదరుడికి వత్తాసు పుచ్చుకొని కేడీసీసీ బ్యాంకు ఉన్నతస్థాయి అధికారిని ఇంటికి పిలిపించి వెంటనే సర్దుబాటు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉన్నతస్థాయి అధికారి.. మేనేజర్‌ను బ్యాంకుకు రమ్మని విధుల్లో చేరాలని ఆదేశించినట్లు సమాచారం. తనకు మంత్రి సోదరుడు క్షమాపణ చెప్పే వరకు బ్యాంకుకు రానని మేనేజర్ సోమయ్య తెగేసి చెప్పినట్లు తెలిసింది. మంత్రి సోదరుడితో క్షమాపణ చెప్పిస్తానంటూ ఉన్నతాధికారి మేనేజర్‌ను తృప్తిపరిచేందుకు మంతనాలు జరిపినా ఫలించలేదు. తన మనస్సు గాయపడిందని, కొన్ని రోజుల పాటు సెలవుపై వెళ్తానంటూ మేనేజర్ చెప్పడంతో సదరు అధికారి ఎలాగోలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. హేయమైన చర్య.. సాక్షాత్తు మంత్రి సోదరుడు బ్యాంకు మేనేజర్‌పై అమానుషంగా ప్రవర్తించి దుర్భాషలాడటం హేయమైన చర్య. మేనేజర్ నిజాయితీగా పని చేస్తున్నాడు. అందరి ఖాతాదారులకు అందుబాటులో ఉంటున్నాడు. అటువంటి మేనేజర్‌ను ఇష్టమొచ్చినట్లు తప్పతాగి దుర్భాషలాడటం సిగ్గు చేటు. – బండి జానకీరామయ్య, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్, మోగులూరు -
పట్టిసీమపై మంత్రి దేవినేని అసత్య ప్రచారం
-
చంద్రబాబు 420-1, ఆ మంత్రి 420-2
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీరుపై వైస్సార్ సీపీ అధికార ప్రతినిధి, సీనియర్ నేత జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు 420-1 అయితే దేవినేని 420-2 అని మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టుపై మంత్రి దేవినేని అసత్య ప్రచారాలకు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. పట్టిసీమ ద్వారా రైతులు లబ్ది పొందారని చెప్పడం అంతా అబద్ధం అని, దీనిపై దమ్ముంటే చర్చలకు సిద్ధమవ్వాలని సవాల్ విసిరారు. సోమవారం ఉదయం 10 గంటలకు మంత్రి బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. పదవుల కోసం దేవినేని ఉమ, తల్లిలాంటి వదినను పొట్టన పెట్టుకున్నారంటూ ఆరోపించారు. మైలవరంలో మహిళలకు గుక్కెడు మంచినీరు ఇవ్వలేని దద్దమ్మ మంత్రి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవినేని మంత్రి కాదని, ముఖ్యమంత్రికి, లోకేష్‌కు, అవినీతిపరలకు మద్య బ్రోకర్ పనులు చేస్తున్నారంటూ విమర్శించారు. దేవినేని నోరు అదుపులో ఉంచుకోవాలని, లేకపోతే ప్రజలు తోలు తీస్తారని హెచ్చరించారు. నాలుగు ఏళ్లుగా గాలి జనార్థన్ రెడ్డితో సింగపూర్‌లో చంద్రబాబు కలుస్తున్నారని ఆరోపించారు. గాలి జనార్దన రెడ్డి, చంద్రాబాబు నాయుడు పాస్‌పోర్టులు ప్రజలకు చూపించగలరా అని ఆయన నిలదీశారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను తుంగలో తొక్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ దీక్షలు చేస్తున్నారని జోగి రమేష్ విమర్శించారు. చేపలను మభ్యపెట్టడానికి కొంగ దీక్షలు చేపట్టే విధంగా సీఎం కూడా దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని, అందుకే ఆయన చేపట్టిన దీక్షలకు ప్రజలు మొహం చాటుతున్నారని అన్నారు. బాబు దీక్షలకు బస్సులు పెట్టి ప్రజలను తరలిస్తున్నారని మండిపడ్డారు. కేసుల నుంచి బయట పడటానికి చంద్రబాబు గంటన్నర పాటు గవర్నర్ కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. -
మంత్రి కోసం ట్రాఫిక్ బంద్
వెలగలేరు (జి.కొండూరు) : అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం అధికారులు చేసే హడావుడి చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. వెలగలేరులో ఆదివారం ఇంటింటికి తెలుగదేశం కార్యక్రమంలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరవ్వడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో జి.కొండూరు నుంచి కొండపల్లి ఐడీఏ, జి.కొండూరు నుంచి చెవుటూరు, వెలగలేరు నుంచి కొత్తూరు తాడేపల్లి వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు, వెలగలేరు మీదుగా ట్రాఫిక్ మళ్లింపు తెలిసిన విషయమే అయినప్పటకీ పోలీసులుప్రత్యామ్నాయ మార్గం చూపకుండా ఆంక్షలు పెట్టడంతో వాహనాలు నిలిపోయాయి. ఒక పార్టీ కార్యక్రమం కోసం గంటల కొద్దీ వాహనాలను నిలిపివేయడం, ప్రయాణి కులను ఇబ్బందులు పెట్టడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. -
నీళ్లు నమిలిన మంత్రి దేవినేని
సాక్షి, విజయవాడ: కృష్ణా నదిలో, కరకట్ట (గట్టు) లోపల అక్రమ నిర్మాణాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నీళ్లు నమిలారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందంటూ సమాధానం దాటవేశారు. ఆక్రమణదారులకు తక్షణం నోటీసులు జారీ చేసి.. వాటిని పూర్తి స్థాయిలో తొలగించేలా చర్యలు తీసుకోవాలని, నివేదిక కూడా సమర్పించాలని గతంలో ఆయన డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేయగా.. జవాబు చెప్పకుండా విలేకరుల సమావేశం ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, 2014 డిసెంబర్ 31న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా నదిలో పరిశీలనకు బోటులో వెళ్లి.. నదికి ఇరువైపులా కరకట్టల లోపల ఆక్రమణలు ఉన్నాయని, చివరకు కృష్ణమ్మను కూడా వదల్లేదని, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా అని మీడియా ఎదుట తారస్థాయిలో ఏకరువు పెట్టారు. ఆ మరుసటి రోజు (2015 జనవరి 1న) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. కృష్ణా నదిలో ఆక్రమణలు దారుణమని, కాంగ్రెస్ వాళ్లు దేన్నీ వదిలిపెట్టరని, ఆక్రమణదారులను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. తర్వాత ఆయనే ఉండవల్లిలోని కృష్ణానది ఒడ్డున ఉన్న లింగమనేని ఎస్టేట్‌లో మకాం పెట్టారు. ఈ నేపథ్యంలో కృష్ణా నది కరకట్ట లోపలవున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై మంగళవారం విచారణ జరిపిన ఉమ్మడి హైకోర్టు 57 మందికి నోటీసులు జారీ చేసింది. -
దేవినేని తీరుతో విస్తుపోయిన ఢిల్లీ మీడియా
న్యూఢిల్లీ: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీరు చూసి ఢిల్లీ మీడియా ముక్కున వేలేసుకుంది. దేశంలో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) పథకం కింద చేపడుతున్న ప్రాజెక్టులు, నదుల అనుసంధానంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన నిన్న (శుక్రవారం) నిర్వహించిన మేథోమథనంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వచ్చారు. పంజాబ్, యూపీ, హరియాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ భేటీ అనంతరం మంత్రి ఉమా ఏపీ భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రితో సమావేశం వివరాలను వెల్లడిస్తారని ఎదురుచూసిన మీడియా యావత్తూ.. ఆయన ఏకబిగిన 33 నిమిషాల పాటు మాట్లాడింది విని విస్తుపోయింది. విలేకరుల సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం సమయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడానికే కేటాయించారు. ‘రాష్ట్రంలో 420 పాలన అని జగన్ చెబుతుంటే అందరూ నవ్వుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న వ్యక్తి జగన్. గత మూడేళ్ల కాలంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక్క సలహా కూడా ఇవ్వలేదు’ అంటూ విమర్శించారు. అసలు విషయం చెప్పకుండానే సమావేశాన్ని ముగించి బయలుదేరారు. దీంతో అసలు ఢిల్లీ వచ్చిందెందుకో చెప్పాలంటూ మంత్రిని మీడియా ప్రతినిధులు కోరారు. అప్పుడు మళ్లీ కుర్చీలో కూర్చున్న దేవినేని.. జలమంథన్–4 సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చానని, ఈ సమావేశంలో పీఎంకేఎస్‌వై, నాబార్డు కింద చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిపై, నదులు అనుసంధానంపై చర్చించినట్టు చెప్పి వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఎక్కడ, ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్టుని మరిచి ప్రతిపక్ష నేతపై ఆరోపణలు గుప్పించడమే పనిగా పెట్టుకునే మంత్రి దేవినేని.. ఢిల్లీలో సైతం ఆదే తీరును ప్రదర్శించడం విమర్శలకు తావిచ్చింది. -
‘మంత్రి దేవినేని ఉమ బ్రోకర్’
విజయవాడ: ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంటాక్టర్ల నుంచి డబ్బులు గుంజుతూ కమిషన్ ఏజెంట్లా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత టీడీపీ నాయకులకు లేదని అన్నారు. ‘దేవినేని ఉమ ఓ పిట్టలదొర. ఇరిగేషన్ మంత్రిగా పనికిరారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. వైఎస్ జగన్ ప్రజల తరపు పోరాడే వ్యక్తి. ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మైలవరానికి తాగునీళ్లు ఇవ్వలేని నువ్వు సొల్లుకబుర్లు చెబుతున్నావు. మంచినీళ్లు ఇవ్వలేని దద్దమ్మవు సిగ్గులేకుండా మాట్లాడుతున్నావు. పెదబాబుకు ఇంత, చినబాబుకు ఇంత, నీకు ఇంత అని కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు దండుకునే బ్రోకర్‌వి. పోలవరం ప్రాజెక్టుపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. చంద్రబాబు మనసులో వైఎస్ రాజశేఖరరెడ్డిని తలచుకుంటే చేసిన పాపాలు సగమైనా పోతాయ’ని జోగి రమేశ్ అన్నారు. -
పున్నమిఘాట్లో ప్రముఖుల పుష్కర స్నానం
విజయవాడ: కృష్ణా పుష్కరాలు మంగళవారం ముగుస్తుండటంతో పుష్కరఘాట్ల వద్ద భక్తుల తాకిడి ఎక్కువైంది. మంగళవారం చివరి రోజున ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దంపతులు, మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి, నటుడు సాయికుమార్, సినీ నిర్మాత అశోక్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పున్నమిఘాట్లో పుణ్యస్నానమాచరించారు. -
వాళ్లది మొండివైఖరి.. వితండవాదన: హరీశ్
జల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి వైఖరితో ఉందని, కేంద్రం చేసిన సూచనలను అసలు పట్టించుకోలేదని.. వితండ వాదన చేస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. కృష్ణా జలాల పంపిణీపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదని, చర్చలు అసంపూర్తిగానే మిగిలాయని చెప్పక తప్పదని అన్నారు. ట్రిబ్యునల్ ఇప్పటికే స్పష్టంగా అవార్డు ఇచ్చిందని, అయినా వాళ్లు పట్టించుకోవడం లేదని తెలిపారు. పై రాష్ట్రాలకు హక్కులుంటాయి కాబట్టే తమకు రావల్సిన 90 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని తెలంగాణ చెప్పిందని తెలిపారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు జూలై మొదటివారంలో అధికారులను నియమిస్తామని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్రం చెబితే తాము ఒప్పుకొన్నామని.. కానీ ఏపీ ప్రభుత్వం మొండి, విచిత్రవైఖరి అనుసరించడం వల్ల చర్చ అసంపూర్తిగా ముగిసిందని హరీశ్ రావు చెప్పారు. అయితే, అసలు తాము చెప్పిన తర్వాత మాత్రమే కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు పరిస్థితిపై అవగాహన వచ్చిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. రాయలసీమ నాలుగు జిల్లాలు కరువులో ఉన్నాయని, వాళ్లకు తాగునీరు కూడా ఇవ్వకుండా ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సమాచారం ఇవ్వకుండా.. కృష్ణామేనేజిమెంటు బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి నీళ్లు ఎలా ఇచ్చారని అడిగితే కేంద్ర అధికారులు ఆశ్చర్యపోయారని అన్నారు. తాము అడిగేసరికి వాళ్లు సమాధానం చెప్పలేకపోయారని, వాస్తవాలను కేంద్రం అర్థం చేసుకుందని చెప్పారు. 3 రోజుల చర్చల్లో విభజన చట్టంలో నీళ్ల కేటాయింపు అంశం గురించి తాము చెప్పిన తర్వాతే కేంద్ర జలనవరుల అధికారులకు అవగాహన వచ్చిందని ఉమా అన్నారు. -
'కృష్ణా' వివాద పరిష్కారంపై భేటీకి సన్నాహాలు
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల వివాద పరిష్కారానికి కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఇరురాష్ట్రాల మంత్రులతో భేటీకానున్నారు. త్వరలో కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి సమక్షంలో ఈ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఉమాభారతి మంత్రులతో భేటీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భేటీలో ఇరురాష్ట్రాల నుంచి తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఏపీ సాగునీటి శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరుకానున్నారు. -
'2018 కల్లా పోలవరం పూర్తి చేస్తాం'
రాజమండ్రి: 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని ఏపీ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రిలో ఆనం కళాకేంద్రంలో సర్ ఆర్థర్ కాటన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు ఏపీ ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నరాజప్ప మాట్లాడుతూ.. సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. -
అశోక్‌ను పరామర్శించిన మంత్రి దేవినేని
విజయనగరం క్రైం: కేంద్ర పౌరవిమానయానశాఖా మంత్రి పూససాటి అశోక్‌గజపతిరాజును రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. బుధవారం ఆనందగజపతిరాజు బంగ్లాకు చేరుకున్న ఆయన ఆనందగజపతిరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజును కలిసి సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ గోకరాజు గంగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, గజపతినగరం ఎమ్మెల్యే కేఏనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, టీడీపీ రాష్ట్ర నాయకుడు ఎస్‌ఎన్‌ఎంరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు ఎస్ఈఈ డోల తిరుమలప్రసాద్తో ప్రాజెక్టు గురించి మంత్రి దేవినేని చర్చించారు. ‘తారకరామ’ను సందర్శించిన మంత్రి దేవినేని సారిపల్లి(నెల్లిమర్ల రూరల్): మండలంలోని సారిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరావు బుధవారం సందర్శించారు. ముందుగా సారిపల్లిలో ప్రాజెక్టు పనులు చేపడుతున్న ప్రదేశానికి చేరుకుని నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను, పనులు ఏ స్థాయిలో ఉన్నాయోనని సంబంధిత అధికారులను అడిగి తె లుసుకున్నారు. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ రామతీర్థ సాగర్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, తోటపల్లి ప్రాజెక్టును ఏ విధంగా పూర్తి చేశామో రామతీర్థసాగర్ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలనే దృధసంకల్పంతో ముందుకు వెళ్తోందన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు మాట్లాడుతూ రిజర్వాయర్ వల్ల నష్టపోయిన వారికి ఆధారం లేదని, చుట్టూ సముద్రం మధ్యలో నీళ్లు అన్నట్లు ఉన్నారని, కాబట్టి వారందరికీ సముచిత న్యాయం చేసి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మంత్రి ఎదుట నిర్వాసితుల ఆవేదన పంటపొలాలన్నీ ముంపునకు గురవుతున్నాయని ఎలా బతకాలని,ఎక్కడ నివసించాలని, పలువురు రైతులు మంత్రి దేవినేని ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు, సుమారు 11వందల ఎకరాల పల్లం భూమి ఏడాదికి రెండుపంటలు పండే భూమిని ప్రాజెక్టు పేరుతో 2007లో మా వద్ద నుంచి అతి తక్కువ ధర చెల్లించి భూమిని తీసుకున్నారని ఆందోళన వెలిబుచ్చారు. మంత్రి స్పందించి పునరావాస ప్యాకేజీని సక్రమంగా అందించాలని కోరారు. సారిపల్లి గ్రామ సర్పంచ్ రాయి విభీషణరావు ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజి, జీవనభృతి గురించి మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేఏ నాయుడు, పతివాడ నారాయణస్వామినాయుడు,విజయనగరం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ,ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్, ఎస్ఈ డోల తిరుములరావు, ఉత్తరాంధ్ర సీఈ శివరామ ప్రసాద్ , ఈఈ ఢిల్లీశ్వరావు,ఎమ్.వి రమణ తదితరులు పాల్గొన్నారు. పరిహారం పెంచాలి పూసపాటిరేగ: రామతీర్థసాగర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన రైతుల భూములకు పరిహారం పెంచాలని కుమిలి సర్పంచ్ దల్లి ముత్యాలురెడ్డితో పాటు పలువురు రైతులు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావును కోరారు. బుధవారం ఆయన మండలంలోని కుమిలిలో గల రామతీర్థసాగర్ రిజర్వాయర్ ట్యాంకును పరిశీలించారు.ఈసందర్భంగా రైతులు పలుసమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. -
దేవినేని వైఖరిపై గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు
-
అవసరమైతే సీలేరు జలాలు
తాడేపల్లిగూడెం : దాళ్వా పంటను రక్షించుకునేందుకు అవసరమైతే సీలేరులో విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేసి నీటిని గోదావరి డెల్టాకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రైతులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాళ్వా పంట ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని సాగుకు నీరందించేందుకు సీలేరు నీటిని గోదావరికి మళ్లించడం జరుగుతుందన్నారు. గోదావరిలో నీటి లభ్యత తగ్గిపోతున్న దృష్ట్యా మార్చి ఒకటో తేదీకల్లా దాళ్వా సాగు ముగించేలా రైతులు సన్నద్ధం కావాలని మంత్రి కోరారు. ఈ నెలాఖరు నాటికి నారుమడులను పూర్తి చేసుకోవాలని సూచించారు. వంతుల వారీ విధానంలో దాళ్వా పంట చేలకు సాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. స్లూయిస్‌లు, షట్టర్లు మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. జల వనరుల శాఖ ఎస్ఈ బాబు, ఈఈ శ్రీనివాస్,పెంటపాడు వాటర్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ బూరుగుపల్లి త్రినాథరావు, రావిపాడు సొసైటీ అధ్యక్షుడు ములగాల బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
ఉమా రాజీనామా చేయాల్సిందే
పోలవరం కుడికాల్వకు గండిపడిన వైనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. ఈ ఘటనకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావే బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క పంపుతోనే గండిపడితే.. ఇక 12 పంపులు పూర్తిగా నిర్మించిన తర్వాత పరిస్థితి ఏంటని సుబ్బారాయుడు ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టులో పూర్తిగా అవినీతి జరిగిందనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని ఆయన చెప్పారు. -
'ఏపీకి పట్టిన దరిద్రం ఆ మంత్రే'
విజయవాడ: తెలుగువారి హక్కులను ఢిల్లీకి తాకట్టుపెట్టిన ఘనుడు చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ నాయకుడు కె పార్ధసారథి విమర్శించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు టీడీపీ నాయకులకు లేదని అన్నారు. కొత్తమాజేరు విషజ్వర బాధితులు, రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ధర్నా చేసిన వైఎస్ జగన్ పై విమర్శలు చేయడం తగదన్నారు. ఏపీకి పట్టిన దరిద్రం మంత్రి దేవినేని ఉమా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలని జోగి రమేశ్ సూచించారు. మంత్రి పదవిలో ఉండి సంస్కారహీనుడిగా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో దద్దమ్మ ప్రభుత్వం కొనసాగుతోందని ఆయన దుయ్యబట్టారు. -
'రౌడీలా మాట్లాడుతున్న మంత్రి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతపు భూసేకరణ తప్పు అయినందునే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నాచేశారని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కృష్ణా జిల్లాలో జగన్ చేపట్టిన రెండు ధర్నాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఏమైనా సంజీవనా అని చంద్రబాబు వ్యాఖ్యానించటం తగదన్నారు. ప్రత్యేక హోదా అంటూ ప్రగల్బాలు పలికి.. నేడు చంద్రబాబు తోక ముడిచారని వ్యాఖ్యానించారు. తాట తీస్తామంటూ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు వీధి రౌడీలలా మాట్లాడుతున్నారు. మీ తాట తీస్తాం అంటూ కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి మాట్లాడారు. ఇది సబబేనా? మంత్రిగా ఉన్న నాయకుడు ఇలాంటి భాష మాట్లాడటడమేంటి. చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. డబ్బులిచ్చి పోలవరాన్ని వైఎస్ జగన్ నిలిపి వేయించారంటూ అన్యాయంగా ఆరోపణలు చేస్తున్న మంత్రులు ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. ఆడలేక మద్దెల ఓడు చందంగా మంత్రులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టమని ప్రజలు మీకు అధికారాన్ని ఇవ్వలేదు. ఒక్కోపూట ఒక్కో మాట మాట్లాడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎలా నమ్ముతారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిని అమలు చేయని మీపై ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలో చెప్పాలి' అని బొత్స డిమాండ్ చేశారు. 'రాష్ట్రంలో ఎవరైనా రాజద్రోహానికి పాల్పడితే ఉపేక్షించం అంటున్నారు.. ఎవరండి ద్రోహానికి పాల్పడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించినట్లుగా రాజద్రోహానికి పాల్పడింది టీడీపీ వాళ్లు కాదా. గతంలో ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనను గద్దె దింపింది మీరు కాదా? కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలద్రోసే యత్నం చేయడం రాజద్రోహం కాదా' అని బొత్స ప్రశ్నించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాడే హక్కు ప్రతిపక్ష పార్టీకి ఉంటుందన్నారు. అధికార పార్టీ నేతల్ని ప్రజల మధ్యన నిలబెట్టి వారి తప్పుల్ని ఎత్తిచూపుతామని చెప్పారు. -
దేవినేని ని కలిసిన ఎన్జీవో నేతలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో నేతలు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును బుధవారం ఉదయం కలిశారు. ఉద్యోగుల బదిలీలపై నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారంటూ వారు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగులకు అన్యాయం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
తెగ తవ్వేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అక్రమార్జనకు.. అడ్డగోలు దోపిడీకి అడ్డాగా మారిన నీరు-చెట్టు పథకం గడువు ముగిసినా టీడీపీ నేతలు తవ్వకాలను ఇంకా కొనసాగిస్తున్నారు. అందినకాడికి దోచుకుంటూనే ఉన్నారు. ఈ పథకం కింద చెరువుల తవ్వకాల పనుల గడువు ఈ నెల 10వ తేదీతోనే ముగిసింది. సకాలంలో వర్షాలు పడుతుండటంతో నీరు-చెట్టు పనులను ముగించాలని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ఎట్టిపరిస్థితుల్లో తవ్వకాలను పదో తేదీకే నిలిపివేయాలని ఉత్తుర్వులు జారీ చేశారు. అయినా సరే.. అక్రమార్కులు తవ్వకాలను ఆపలేదు. ప్రజాప్రతినిధుల అండతో క్వారీల మాదిరిగా ఇష్టారాజ్యంగా చెరువుల తవ్వకాలు చేసేస్తున్నారు కైకరంలో ఓ ప్రజాప్రతినిధి అండతో.. నీరు-చెట్టు పథకంలో భాగంగా ఉంగుటూరు మండలం కైకరంలో కొత్త చెరువును తవ్వేందుకు మే 3న భూమి పూజ చేశారు. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును అప్పటి నుంచి నేటివరకు నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతూనే ఉన్నారు. ఓ ప్రజాప్రతినిధి అండదండలతో అడ్డూ అదుపూ లేకుండా నాలుగు పొక్లెయిన్లతో చెరువును తవ్వి గ్రావెల్‌ను విక్రయిస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున రేటుకట్టి నిత్యం వందలాది ట్రాక్టర్ల మట్టి, గ్రావెల్‌ను భీమవరం, కైకలూరు మండలాలకు తరలిస్తున్నారు. 70శాతం వాటా ఆ నేతకే తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన నిధులతో పాటు మట్టి, గ్రావెల్ విక్రయాల్లో 70శాతం వరకు ఆ ప్రజాప్రతినిది వాటా తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చెరువు తవ్వకానికి ప్రభుత్వం సుమారు రూ.20 లక్షలు కేటాయించింది. నెల రోజులకుపైగా తవ్విన మట్టి, గ్రావెల్‌ను విక్రయిం చగా వచ్చిన కోట్లాది రూపాయలను సదరు నేత దండుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి నీరు-చెట్టు పథకంలో చెరువును తవ్వగా వచ్చిన మట్టితో గట్టును పటిష్ట పర్చాలి. మిగిలిన మట్టిని చుట్టుపక్కల రైతులకు ఉచితంగా అందజేయాలి. గ్రావెల్ వస్తే మైనింగ్ శాఖ అనుమతి తీసుకునిక్యూబిక్ మీటరుకు నిర్ధేశించిన మొత్తంలో సొమ్ము చెల్లించి తవ్వకాలు చేపట్టాలి. కానీ ఈ చెరువు తవ్వకాలకు సంబంధించి ఎక్కడా ఎవరి అనుమతి తీసుకోలేదు. ప్రమాదం పొంచి ఉన్నా ఆగని తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా కొత్త చెరువు తవ్వకాలు ఎక్కువ లోతున సాగిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చెరువు దగ్గరలోనే రైల్వే ట్రాక్ ఉండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఉప్పందించినా... నిబంధనలకు విరుద్ధంగా చెరువు తవ్వుతున్నారని కైకరం గ్రామానికి చెందిన జుత్తుక పరమానందం ఆధ్వర్యంలో పలువురు ‘మీ కోసం’ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. తవ్వకాలకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని స్థానికులు ఉంగుటూరు తహసిల్దార్ ఆకుల కృష్ణ జ్యోతి దృష్టికి తీసుకువెళ్లగా.. ‘నాకు సంబంధం లేదు. మైనింగ్ అధికారులకు చెప్పండి’ అని సమాధానమిచ్చారు. దీనిపై మైనింగ్ ఏడీకి చిట్టిబాబుకు ‘సాక్షి’ ఫోన్ చేయగా, నీరు-చెట్టు కింద తవ్వకాలకు సీనరేజ్‌ను మినహాయించామని చెప్పుకొచ్చారు. గడువు ముగిసినా తవ్వకాలు చేస్తున్నా మీ పరిధిలోకి రాదా అని ప్రశ్నించగా.. ‘ఏమో మరి నాకు తెలీదు. ఇరిగేషన్ వాళ్లను అడగండి’ అని సమాధానమిచ్చారు. పొద్దుపోయాక ఆపించాం ఇదే విషయాన్ని ఏలూరు ఇరిగేషన్ డీఈ అప్పారావు దృష్టికి సాక్షి తీసుకువెళ్లగా.. ‘సాయంత్రం తర్వాతే నా దృష్టికి వచ్చింది. వెంటనే సిబ్బందిని పంపించి తవ్వకాలు నిలుపుదల చేయించాం. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. -
'2019 నాటికి పోలవరం పూర్తీకి బాబు సంకల్పం'
అన్నవరం (తూర్పుగోదావరి జిల్లా) : పోలవరం ప్రాజెక్ట్‌ను 2019 కల్లా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, తూర్పు గోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అన్నవరంలో ఆదివారం జరిగిన టీడీపీ తూర్పు గోదావరి జిల్లా మినీ మహానాడులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.వంద కోట్లు మాత్రమే కేటాయించిన కేంద్రం సీఎం పట్టుదలతో మరో రూ.900 కోట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వలన రాయలసీమకు నీరందుతుందని, అది ఇష్టం లేని కొందరు ఈ పథకం వలన ఉభయ గోదావరి జిల్లాలు ఎడారిగా మారుతాయంటూ రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. -
ఆధునికీకరణపై దృష్టి పెట్టండి
ఏలూరు :డెల్టా ఆధునికీకరణ పనులపై దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల పనులను పరుగులెత్తించాలని కోరారు. జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జిల్లా నీటిపారుదల సల హా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలువలకు జూన్ 10న నీటిని విడుదల చేయాలని సమావేశం నిర్ణయించింది. నీటిని విడుదల చేయడం వల్ల డెల్టా ఆధునికీకరణ పనులకు ఆటంకం కలిగే పరిస్థితులు ఉంటే అడ్డుకట్టలు వేయాలని తీర్మానిం చారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ కాలువలకు నీటిని విడుదల చేసేలోగా ఎంతమేర ఆధునికీకరణ పనులు చేయగలిగితే అంతవరకు చేపట్టాలన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంతోపాటు చింతలపూడి, తాడిపూడి పథకాల పనులను పరుగులెత్తించాలని సూచించారు. రైతుల అవసరాలకు తగ్గట్టుగా పనులు పూర్తి చేయిస్తామని, ఇందుకు అవసరమైన నిధులు కూడా విడుదల చేయిస్తామని చెప్పారు. జిల్లాకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు అదనంగా నిధులు వెచ్చించేం దుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రాజెక్ట్‌లకు అవసరమైన భూసేకరణ, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు అంశాలపై కలెక్టర్, చీఫ్ ఇంజినీర్, ఎస్ఈ, ప్రజాప్రతినిధులు చర్చించుకోవాలని మంత్రి సూచించారు. నీరు- చెట్టు పథకంపై సమీక్షిస్తూ పనులు ప్రారంభించని 187 చెరువుల అభివృద్ధికి అవసరమైతే పొక్లెయిన్లు ఉపయోగించాలని కలెక్టర్ కె.భాస్కర్‌ను ఆదేశించారు. ఇంజినీర్లూ.. పనితీరు మార్చుకోండి నీటిపారుదల శాఖ ఇంజినీర్లు పనితీరు మార్చుకోవాలని, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ.. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని మంత్రి కోరారు. ఇంజినీర్లు ఏదైనా పని అప్పగిస్తే సకాలంలో పూర్తి చేయగలమన్న నమ్మకాన్ని కల్పిం చాలే తప్ప కుంటిసాకులు చెప్పి తప్పించుకోవడం తగద న్నారు. కృష్ణా కాలు పరిధిలో ఆధునికీకరణ పనుల విషయాన్ని మూడు నెలల క్రితం ప్రస్తావించినా ఇంతవరకు ఏ పనీ చేయలేదని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సమావేశం దృష్టికి తీసుకురాగా, మంత్రి తీవ్రంగా స్పందించారు. కుంటిసాకులతో కాలక్షేపం చేయొద్దని కృష్ణా కెనాల్ ఈఈ, డీఈ, ఏలూరు ఈఈపై మండిపడ్డారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లకన్నా సివిల్ ఇంజినీర్లకే ఎక్కువ వేతనాలు ఇస్తున్నా బ్రిటిష్ సంస్కృతిని అంటిపెట్టుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించటం తగదన్నారు. ఎమ్మెల్యేలు కూడా అధికారులను వెంటపెట్టుకుని వెళ్లాలని, మాట వినని అధికారులు ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే బదిలీ చేయిస్తానని అన్నారు. కచ్చితంగా పనిచేసే వారిని నెత్తిమీద పెట్టుకుని గౌరవిస్తామని పేర్కొన్నారు. కొద్దిరోజుల్లో ఇంజినీర్లకు పని సామర్థ్యం పెంపుపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే.. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ యనమదుర్రు డ్రెయిన్, ఎర్ర కాలువ, గిరమ్మ చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇవ్వకపోవడంతో రైతులు తమను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాల న్నారు. ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ నరసాపురం నియోజకవర్గంలో నీటి పారుదలకు చర్యలు తీసుకుంటే జిల్లా అంతా సుభి క్షంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మాట్లాడుతూ కాకరపర్రు చానల్ అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవాలన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ లస్కర్లు, ఏఈల కొరత తీర్చకపోతే నియోజకవర్గాల్లో సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ గుండుగొలను నుంచి మల్లవరం వరకు 14 కిలోమీటర్ల కొల్లేరు ప్రాంతంలో మంచినీటి కాలువ తవ్వకానికి అటవీ శాఖ అధికారుల ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ ఏలూరు రైల్వే స్టేషన్ ప్రాంతంలో రోడ్డును వెడల్పు చేయాలని కోరారు. తమ్మిలేరు రివిట్‌మెంట్‌తో పాటు ఏటిగట్టు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో గ్రోయిన్స్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ఇంజినీరింగ్ అధికారులు జవాబుదారీతనంతో పనిచేసి అన్నివర్గాల ప్రజలకు దగ్గర కావాలన్నారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ కాలువల ఆధునికీకరణ పనులను జూన్ 10 నాటికి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి నిలుపుదల చేస్తామన్నారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ హరిబాబు, ఎస్ఈ ఎన్.వెంకటరమణ, ఈఈ శ్రీనివాస్, సతీష్‌కుమార్, ఆర్డీవోలు డి.పుష్పమణి, బి.శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి పాల్గొన్నారు. -
'హామీ మేరకే రైతులు పంటలు వేశారు'
నెల్లూరు: నెల్లూరు జిల్లా రైతులను ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తప్పుదోవ పట్టిస్తున్నారని కావలి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. ఎకరా కూడా ఎండనివ్వమని చెబుతున్న మంత్రి ఉమాకు కావలిలో ఎండిన పంటలు కనబడలేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఐఏడీఏలో ఇచ్చిన హామీ మేరకే రైతులు పంటలు వేశారని ఆయన అన్నారు. నీరు ఇవ్వకపోవడంతో రైతులు అన్ని విధాలా నష్టపోయారని రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమతో రైతులను మోసం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించారు. -
కృష్ణలో వరద ఉంటే లిఫ్టు వాడం
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ సాక్షి, హైదరాబాద్: గోదావరిలో వరద ఉన్నప్పుడు కృష్ణలో కూడా వరద ఉంటే పట్టిసీమ లిఫ్టును వినియోగించుకోమని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. కృష్ణా డెల్టాకు అవసరమైనప్పుడు మాత్రమే లిఫ్టు ద్వారా నీటిని తరలిస్తామన్నారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమ లిఫ్టు వల్ల ఉపయోగం లేదని, జేబులు నింపుకోవడానికే ప్రభుత్వం ఈ పథకాన్ని చేపడుతోందంటూ ‘సాక్షి’లో శుక్రవారం ‘పట్టిసీమలో పరమ రహస్యం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల మట్టం వరకు నీటిని నిల్వ ఉంచుతామని, ఆమేరకే గోదావరి నుంచి నీటిని తీసుకొస్తామన్నారు. గోదావరి లిఫ్టు ద్వారా మళ్లించే నీటితో కృష్ణా డెల్టాను కాపాడితే, ఆ మేరకు మిగిలే నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు వాడుకుంటామన్నారు. 70 టీఎంసీల కృష్ణా నీటిని రాయలసీమ ప్రాజెక్టుల్లో నిల్వ ఉంచుతామన్నారు. పట్టిసీమ లిఫ్టుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 1లో ఎక్కడా.. గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు వాడతామని పేర్కొనలేదని, మరి కృష్ణా డెల్టాకు వాడే కృష్ణా జలాలను మిగిల్చి రాయలసీమకు ఎలా ఇస్తారు? అని అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. -
తన్నుకుంటున్న తమ్ముళ్లు
* అధికార పార్టీలో బయటపడుతున్న లుకలుకలు * ఎక్కడికక్కడ వర్గాలుగా విడిపోతున్న టీడీపీ నేతలు * పలుచోట్ల పరస్పర ఆరోపణలతో వీధికెక్కుతున్న వైనం * కొన్నిచోట్ల అంతర్గతంగా రగులుతూనే ఉన్న గొడవలు * కొన్ని జిల్లాల్లో రాష్ట్ర మంత్రుల మధ్యే పంచాయతీలు సాక్షి నెట్వర్క్: అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు దాటాయో లేదో తెలుగుదేశం పార్టీలో గూడుకట్టుకున్న గ్రూపు తగాదాలు బట్టబయలవుతున్నాయి. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య ఆర్డీవో బదిలీ వ్యవహారంలో సచివాలయం సాక్షిగా సాగిన చిచ్చు.. శుక్రవారం కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేసినేని నాని మధ్య ఆధిపత్య పోరు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. రాజధాని సలహా కమిటీలో కొనసాగడానికి విముఖత చూపిన ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి తన మనసులోని అసంతృప్తిని ఇటీవలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాహాటంగానే వ్యక్తం చేశారు.ఆయన పరోక్షంగా ముఖ్యమంత్రి వ్యవహార శైలినే తప్పుబట్టారు. మిగిలిన వారిని డమ్మీలుగా చేస్తున్నారు... అధికారం చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు కొందరికే ప్రాధాన్యతనిస్తూ మిగిలిన వారిని డమ్మీగా చేయడాన్ని చాలా మంది మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.సీఎం కొందరికే ప్రాధాన్యతనిస్తున్నందున జిల్లాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవుతోంది. సిక్కోలులో అలకలు, విభేదాలు... శ్రీకాకుళం జిల్లా పార్టీలో వర్గ విభేదాలు ఎక్కువగానే ఉన్నాయి. సీనియర్ ఎమ్మెల్యే శ్యామసుం దర శివాజీ స్వపక్షంలో విపక్షంలా అధికారులు, టీడీపీ నేతలపైనే ప్రశ్నల వర్షం కురిపిస్తూ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. తనను గౌరవించడం లేదని తాజాగా శుక్రవారం జడ్పీ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. విప్ రవికుమార్, మంత్రి అచ్చెన్నాయుడిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కళా వెంకట్రావు కూడా మౌనంగా ఉంటున్నారు. మంత్రి అచ్చెన్న, ఎంపీ రామ్మోహన్నాయుడు (బాబాయ్, అబ్బాయ్) మధ్య కూడా పొసగడం లేదన్నది పార్టీలో ప్రచారం. విజయనగరంలో మంత్రితో పొసగదు... విజయనగరం జిల్లాలో మంత్రి కిమిడి మృణాళినితో పార్టీ ఎమ్మెల్యేలకు, జిల్లా పార్టీ అధ్యక్షునికి ఏమాత్రం పొసగడంలేదు. మంత్రి తీరును శాసనసభ్యులు కొండపల్లి అప్పలనాయుడు, పతివాడ నారాయణస్వామినాయుడు, మీసాల గీత, జడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ విభేదిస్తున్నారు. విశాఖలో మంత్రుల మధ్యే చిచ్చు... విశాఖ ఆర్డీవో బదిలీ వ్యవహారంలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య రచ్చ అధికారులను ఇరుకున పడేసింది. చివరకు ఈ విషయంపై సీఎం వద్ద పంచాయతీ సాగింది. జిల్లాలోని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా నిలువునా చీలిపోయారు.దీంతో జీవీఎం సీ పరిధి వరకు గంటా, రూరల్ జిల్లా అయ్యన్న చూసుకోవాలని బాబు చెప్పారు. కృష్ణాలో భగ్గుమన్న విభేదాలు... విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) శుక్రవారం ఇద్దరు మంత్రుల సమక్షంలో చేసిన బహిరంగ విమర్శలు జిల్లా పార్టీలో కలకలం రేపాయి. శనివారం మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌పై విమర్శలు గుప్పించడంతో గ్రూపు తగాదాలు ముదిరి పాకాన పడ్డట్లయింది. కాగిత వెంకట్రావు, వంశీ, మండలి బుద్ధప్రసాద్ కూడా మంత్రి ఉమకు చాలా దూరంగా ఉన్నారు. స్పీకర్ - మంత్రి చెరో దారి... గుంటూరు జిల్లాలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, స్పీకర్ కోడెల శివప్రసాద్ మధ్య విబేధాలు ఎన్నికల సమయం నుంచి కొనసాగుతున్నాయి. మంత్రి పదవి రాకపోయినప్పటికీ కోడెల జిల్లా రాజకీయాలపై పట్టు కొనసాగిస్తున్నారు. సీఐల బదిలీల్లో కోడెల వర్గం మాట చెల్లుబాటైంది. దీంతో నామినేటెడ్ పోస్టులు ఆశించే నేతలు మంత్రి కంటే స్పీకర్‌ను కలుస్తున్నారు. పుల్లారావు మాటలను అధికారులు పట్టించుకోకపోవడంతో నాయకులు మరో మంత్రి రావెల కిషోర్‌ను కలుస్తున్నారు. గుంటూ రు ఎంపీ గల్లా జయదేవ్‌తో సీనియర్ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్ర, ధూళిపాళ్ల నరేంద్రలకు ఎన్నికలప్పటి విభేదాలు కొనసాగుతున్నాయి. ‘గోదావరి’లో అంతర్గత భుగభుగలు... పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. తాడేపల్లిగూడెం నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కొట్టు సత్యనారాయణ, మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొట్టు సత్యనారాయణను పార్టీలో చేర్చుకుంటే తామంతా బయటకు వెళ్లిపోతామని నాయకులు ఈ నెల 12న ఉంగుటూరు మండలం కైకరంలో జరిగిన రైతు సాధికారిక సదస్సులో చంద్రబాబు ముందే హెచ్చరించారు. దీంతో ఆయన చేరిక వాయిదా పడింది. తూర్పుగోదావరి జిల్లానుంచి హోంశాఖ మంత్రిగా చినరాజప్ప ఉన్నప్పటికీ తమకు ఎలాంటి పనులు కావడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. అంతా సీఎం చూసుకుంటున్నారని మంత్రి చేతులెత్తయడంతో పార్టీ నేతలకు పెద్దదిక్కు లేకుండా పోయారు. అనంతలో తారాస్థాయికి: అనంతపురంలో మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. సునీత వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబుకు కేశవ్ ఈ నెల 25న ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది. కేశవ్‌కు మంత్రి పదవి ఇచ్చి సునీతను తప్పిస్తారంటూ జిల్లాలో సాగుతున్న ప్రచారంతో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కర్నూలులో కేఈ - టీజీల కయ్యం... కర్నూలులో ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తికి, మాజీ మంత్రి టి.జివెంకటేశ్కు ఏమాత్రం పొసగడంలేదు. జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల మధ్య కూడా విబేధాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలో పార్టీ నేతలు రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్.వి.సతీష్‌రెడ్డిల మధ్య ఏమాత్రం పొసగడం లేదు. ఉమపై బాబుకు మూకుమ్మడి ఫిర్యాదు! సాక్షి, విజయవాడ బ్యూరో: మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై కృష్ణా జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల్లో ఎంతో కాలంగా గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తిని ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని శుక్రవారం బహిర్గతం చేయడంతో ఆయనకు పార్టీలోని ఉమ వ్యతిరేకుల నుంచి మద్దతు లభిస్తోంది. ఉమ తీరు మార్చుకోక పోతే పార్టీ బతకడం కష్టమేనని సీఎం చంద్రబాబుకు మూకుమ్మడిగా ఫిర్యాదు చేయాలన్న ఆలోచనకు వచ్చా రు. డ్వాక్రా సంఘాల ముసుగులో ఉమ ఇసుక మాఫియాను నిర్వహిస్తున్నారనీ, ఇటీవల జరిగిన బదిలీల్లో భారీ ఎత్తున లబ్ధి పొందారనే వివరాలను చంద్రబాబుకు అందించాలని వారు తీర్మానించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉమపై తన విమర్శలు, ఆరోపణలు నూరు శాతం నిజమేనని శనివారం బాబుతో భేటీ సందర్భంగా కూడా కేశినేని చెప్పినట్లు సమాచారం. జిల్లా బాధ్యత మొత్తం ఉమ చేతిలో పెడితే పార్టీకి, ప్రభుత్వానికి త్వరలోనే చెడ్డపేరు ఖాయమని వివరించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. సీఎం మందలించారు: కేశినేని హైదరాబాద్: పార్టీ అంతర్గత సమస్యలపై బహిరంగంగా మాట్లాడినందుకు సీఎం చంద్రబాబు తనను మందలించారని, తన తప్పును సరిదిద్దుకుంటానని ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో పార్టీపైన, ప్రభుత్వంపైన తాను చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధినేతకు వివరణ ఇచ్చేందుకు ఆయన శనివారం హైదరాబాద్ వచ్చారు. నాని సచివాలయానికి చేరుకొని చంద్రబాబుని కలిసేందుకు మూడు గంటల పాటు నిరీక్షించారు. సచివాలయంలో సంక్షేమ పథకాలపై మంత్రులతో సమీక్షలో ఉన్న చంద్రబాబు తన కోసం వేచి ఉన్న నానిని తన కాన్వాయ్‌లో ఇంటికి తీసుకువెళ్లారు. చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ.. తనను మందలించారని చెప్పారు. ఏడు నెలలుగా అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేదని, అధికారుల పనితీరు మారాలనే అలా మాట్లాడానని వివరించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో లోపాలను సరిచేస్తానని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారన్నారు. ఇదిలావుటే.. మంత్రి ఉమకు, ఎంపీ నానికి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని బాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలియవచ్చింది. నెల్లూరులో నారాయణపై అసంతృప్తి ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి నారాయణ తీరుపై నెల్లూరు జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. చంద్రబాబు దగ్గర ఉన్న పలుకుబడితో నారాయణ తమను ఖాతరు చేయడంలేదని జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు గుర్రుగా ఉన్నారు. నారాయణకు మంత్రి పదవి ఇవ్వడాన్ని జిల్లా పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా మంత్రి నారాయణపై అసంతృప్తితో ఉన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, పరసా రత్నం తదితరులు కూడా అసంతృప్తితో ఉన్నారు. -
రైతు సాధికారత సదస్సుకు చంద్రబాబు!
విజయవాడ : జిల్లాలో జరగనున్న రైతు సాధికారత సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర సాగునీటి పారుదల, జలవనరుల నిర్వహణ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులతో మాట్లాడుతూ 16వ తేదీలోపు ఒకరోజు జిల్లాలో జరిగే సాధికారత సదస్సుకు ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఆయన పర్యటన తేదీ త్వరలో ఖరారు అవుతుందని మంత్రి ఉమా వివరించారు. అధికారులు అప్రమత్తతతో సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. -
ఉమా.. ఏమి డ్రామా!..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెట్ట పొలాలు లాక్కుని రైతుల పొట్టకొట్టొద్దని రోడ్డెక్కారు. పరిశ్రమలు రాకుండా అడ్డుకుని పశ్చిమ కృష్ణాలో ఉపాధి అవకాశాలను దెబ్బతీశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. నాడు పొలాలు ఇవ్వొద్దని ధైర్యం చెప్పిన నాలుకతోనే నేడు పచ్చని పొలాలు ఇవ్వాల్సిందేనని రాజధాని జోన్ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆయనే నాటి నందిగామ ఎమ్మెల్యే.. నేటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఎనిమిదేళ్ల వ్యవధిలో ఆయనలో వచ్చిన మార్పును చూసి సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ⇒ నాడు మెట్ట భూములు కూడా తీసుకోవద్దని రైతుల తరఫున ఆందోళనలు ⇒ సొంత నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనను సైతం అడ్డుకున్న వైనం ⇒ కంచికచర్ల మండలంలో ఉపాధి అవకాశాలపై ప్రభావం ⇒ నేడు పచ్చని పంటపొలాలు ఇవ్వాలని రైతన్నలపై ఒత్తిడి ⇒ ఎనిమిదేళ్లలో దేవినేని ఉమాలో ఎంత మార్పు ! సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘కంచికచర్ల మండలంలో పరిశ్రమల స్థాపన కోసం రైతుల భూములను తీసుకుంటే ఊరుకోం. బాధిత రైతులకు అండగా ఉంటాం. ఆందోళనలు చేస్తాం...’ అంటూ 2006 అక్టోబర్‌లో అప్పటి నందిగామ ఎమ్మెల్యేగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. రైతులతో ఆమరణ దీక్షలు చేయించారు. దీంతో పరిశ్రమలు ఇతర జిల్లాలకు వెళ్లిపోయాయి. ఇప్పుడు దేవినేని ఉమా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన పదవిలోనే కాదు తీరులోనూ మార్పు వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చినా అడ్డుకున్న ఉమా... ఇప్పుడు అధికార పక్షంలో ఉండటంతో రాజధాని కోసం పచ్చని పొలాలను ఇవ్వాలని పొరుగు జిల్లాకు సైతం వెళ్లి రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. ఎనిమిదేళ్లలో ఉమాలో ఎంత మార్పు వచ్చిందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. రాస్తారోకో చేశారు... పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా కంచికచర్ల మండలంలోని బత్తినపాడు, పరిటాల, నక్కలంపేట గ్రామాల పరిధిలో రైతుల నుంచి 1,632 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూముల్లో టెక్స్టైల్ పార్క్, అపెరల్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్లో నందిగామ ఎమ్మెల్యేగా ఉన్న దేవినేని ఉమా ఈ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల భూములను ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులతో ఆమరణ దీక్షలు చేయించారు. గుంటూరు జిల్లాకు చెందిన అప్పటి తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. రైతుల పక్షాన కంచికచర్లలో రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆయనపై 2006, అక్టోబరు 15న పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ గొడవల నేపథ్యంలో ఏపీఐఐసీ వారు ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటును విరమించుకున్నారు. ఆ పార్క్‌ను నెల్లూరు జిల్లాకు తరలించారు. నాడు ముంపు భూములపై రాద్ధాంతం! కంచికచర్ల మండలంలో ఏపీఐఐసీ సేకరించాలనుకున్న 1,632 ఎకరాలు ఆహార పంటలు పండేవి కాదు. సుబాబుల్ మాత్రమే సాగుచేసేవారు. కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగితే ఈ భూములు ముంపునకు గురవుతాయి. అటువంటి భూముల్లో పరిశ్రమల ఏర్పాటును అప్పట్లో ఉమా తీవ్రంగా వ్యతిరేకించారు. నేడు పచ్చని పంట పొలాలు ఇవ్వాలని ఒత్తిడి ప్రస్తుతం ఉమా తీరులో పెనుమార్పు వచ్చింది. రాజధాని నిర్మించనున్న తుళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆరుగాలం పంటలు పండించే భూములను రాజధానికి ఇవ్వాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. నెలరోజుల నుంచి ఖాళీ దొరికితే ఆయా గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడుతున్నారు. సభల్లో పాల్గొంటున్నారు. ఇటీవల కొందరు రైతులను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి హైదరాబాద్‌కు తీసుకెళ్లి తమ భూములు తప్పకుండా ఇస్తామని చెప్పించారు. కొందరు తమ ఇష్టానుసారమే భూములు ఇస్తామని చెప్పినప్పటికీ, మరికొందరు మాత్రం మంత్రి బలవంతం కారణంగానే భూములిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం 70శాతం మంది రైతులు తమ భూములు రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు వ్యతిరేకంగా ఉన్నారు. రాయపూడి గ్రామంలో రైతులంతా తమ భూములు ఇచ్చేంది లేదంటూ అధికారులను సైతం నిలదీస్తున్నారు. మంత్రులను అడ్డుకుంటున్నారు. అయినా, వారి భూములు తీసుకునేందుకు సామ దాన భేద దండోపాయాలు రైతులపై మంత్రి ఉపయోగిస్తున్నారు. ఉపాధి అవకాశాలపై దెబ్బ అప్పట్లో కంచికచర్ల మండలంలో టైక్స్‌టైల్ పార్క్‌ను నిర్మించి ఉంటే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించేవి. ఇప్పుడు ఆ పార్క్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేది. ఉపాధి అవకాశాలు కూడా పెరిగేవి. అప్పట్లో ఉమా ప్రతిపక్షంలో ఉన్నందున తాను రైతుల పక్షాన ఉన్నానని చెప్పేందుకు ఆ విధంగా చేశారు. అయితే నేడు ఆ నీతి ఏమైందని రైతులు ప్రశ్నిస్తున్నారు. -
తప్పులుంటే విపక్షనేత ఎత్తిచూపాలి: దేవినేని
సాక్షి ప్రతినిధి, విజయవాడ: శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాముల్లో 126 టీఎంసీల నీరు ఉన్నా రాష్ట్రంలో సాగునీటి అవసరాల కోసం ఇంకా 54 టీఎంసీల నీరు అవసరమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. బుధవారం ఇక్కడి ఇరిగేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. తప్పులుంటే ఎత్తిచూపాలి గానీ విపక్ష నేతగా ప్రజలిచ్చిన బాధ్యతను ఆయన మరిచిపోయారన్నారు. ‘‘రూ.వెయ్యి పెన్షన్ ఇస్తుంటే మమ్మల్ని రాళ్లతో కొట్టిస్తావా? సీఎం మీద రాళ్లు వేయిస్తావా? మీవి విపక్ష నేత మాట్లాడే మాటలేనా? భవిష్యత్ తరాలకు మనం నేర్పే భాషేనా ఇది? ఎర్రచందనాన్ని దోచుకుంటుంటే అధికారంలో ఉన్నపుడు ఎందుకు అరికట్టలేకపోయారో రఘువీరారెడ్డి సమాధానం చెప్పాలి’’ అన్నారు. విదేశీ పర్యటనలకు చంద్రబాబు ప్రత్యేక విమానంలో వెళ్లడాన్ని ఉమా సమర్థించుకున్నారు. సాక్షి మీడియా, చానల్ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. భేటీలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. -
ఇకపై ఎక్కడివి అక్కడే!
బొబ్బిలి : దశాబ్దాల చరిత్ర కలిగిన బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఇకపై రెండుగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం గతంలో బొబ్బిలిలో సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యాలయాన్ని శ్రీకాకుళం జిల్లాకు తరలించేందుకు అక్కడి టీడీపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో ఇక్కడి రైతులతో పాటు అధికారుల్లో వ్యతిరేకత వచ్చింది. ఇటీవల తుపాను తరువాత రెండు జిల్లాల్లోనూ పర్యటించిన రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు దృష్టికి కూడా రెండు జిల్లాల నాయకులు ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సర్కిల్ కార్యాలయాన్ని తరలించడం కంటే ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే ఏర్పాటు చేసుకుంటే మంచిదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడంతో అధికారు లు ఆ దిశగా చర్యలు మొదలు పెట్టారు. బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయాన్ని ఈ ప్రాంతానికి చెందిన వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు అప్పట్లో మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేయించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జంఝావతి జలాశయానికి వాసిరెడ్డి పేరు పెట్టారు. ఈ సర్కిల్ పరిధిలో శ్రీకాకుళం జిల్లాలోని నారాయణపురం ఆనకట్ట, తోటపల్లి రిజర్వాయర్, మడ్డువలస ప్రాజెక్టులుండగా, విజయనగరం జిల్లాలో వెంగళరాయసాగర్, జంఝావతి, పెదంకలాం, ఒట్టిగెడ్డ, పెద్ద గెడ్డ రిజర్వాయర్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం ఇరి గేషన్ డివిజన్, స్పెషల్ కనస్ట్రక్షను డివిజన్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్, స్పెషల్ మైనర్ ఇరిగేషన్ డివిజన్లు ఉన్నాయి. అలాగే విజయగనరం జిల్లాలో జంఝావతి డివిజన్, పార్వతీపురం డివిజన్ ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్లో నాలుగేసి సబ్ డివిజన్లున్నాయి. ప్రస్తుతం బొబ్బిలి సర్కిల్ అధికారులు ఈ రెండు జిల్లాల జలాశయాల పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం డీఈ, ఏఈల కొరత కూడా తీవ్రంగా ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొ ని ఏ జిల్లాలో ఉన్న జలాశయాలకు సంబంధించి ఆ జిల్లాలో సర్కిల్ కార్యాలయంలో పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. విజయనగరం జిల్లాకు సంబంధిం చిన విజయనగరం డివిజన్ ప్రస్తుతం వైజాగ్ సర్కిల్లో ఉంది. దాన్ని బొబ్బిలి సర్కిల్ పరిధిలో కలపాల్సి ఉంది. ఈ సర్కిల్ కార్యాలయాల ఏర్పాటు గురి ంచి ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని, దాని ద్వారా శ్రీకాకుళం జిల్లా నాయకులు కోరిక కూడా తీరుతుందని ఇరిగేషన్ అధి కారులు చెబుతున్నారు. -
మహనీయుల స్ఫూర్తితో ముందడుగు
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి బందరు పోర్టు నిర్మిస్తాం స్వాతంత్య్ర దిన వేడుకల్లో మంత్రి ఉమా మచిలీపట్నం : జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సంఘటితంగా కృషి చేద్దామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేద్దామని ఆయన పిలుపునిచ్చారు. 68వ స్వాతంత్ర దిన వేడుకలను జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను మంత్రి ఉమా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం, స్వేచ్ఛా వాయువుల కోసం ఎందరో త్యాగమూర్తులు ప్రాణాలర్పించారని కొనియాడారు. జిల్లాలో కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, తోట నరసయ్య, త్రిపురనేని రామస్వామిచౌదరి, గొట్టిపాటి బ్రహ్మయ్య, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య తదితరులు స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేశారన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన నందమూరి తారకరామారావు మన జిల్లా వాసే కావటం గర్వకారణమన్నారు. శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన జరగకపోవడంతో నూతన ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణబద్ధులై ఉన్నారన్నారు. స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, గెలుపొందిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గ్రామ, మండల, జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు బందరు పోర్టు పనులను ప్రారంభించి, ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాం. జిల్లాను ప్రగతి బాటలో పయనింపజేస్తాం. పులిచింతల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చి దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతుల కలలను సాకారం చేస్తాం. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి కృష్ణాడెల్టాను స్థిరీకరించి మెట్ట ప్రాంత భూములను వ్యవసాయ యోగ్యంగా మారుస్తాం. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాం కొల్లేరు సరస్సును అభివృద్ధి చేస్తాం. విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఫ్లై ఓవర్ నిర్మిస్తాం. కృష్ణా యూనివర్సిటీని అన్ని వసతులతో అభివృద్ధి చేయటంతోపాటు వైద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తాం. కృష్ణా కరకట్టలు, డెల్టా ఆధునికీకరణ పనులు, బుడమేరు ముంపు నివారణ, తారకరామ ఎత్తిపోతల పథకం, కొండపల్లి-ఇబ్రహీంపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, విజయవాడ మెట్రో సిటీ, మెట్రో రైలు, విజయవాడ అవుటర్ రింగ్ రోడ్, కొండపల్లి ఖిల్లా అభివృద్ధి, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలపై దృష్టిసారిస్తాం. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలతోపాటు గృహాలు నిర్మించి ఇస్తాం. రేషన్‌కార్డులు, వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు అందజేస్తాం. చేనేత కార్మికులకు చేయూతనివ్వటంతోపాటు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పిస్తాం. మామడి, మిర్చి, పత్తి, టమోటా తదితర పంటల కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేస్తాం. పంటలను నిల్వ ఉంచుకునేందుకు గిడ్డంగులను నిర్మిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం. వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తాం. జిల్లాలో రుణమాఫీ ద్వారా 4.50 లక్షల మంది రైతులకు రూ.1,600 కోట్ల రుణమాఫీ చేస్తాం. 65 వేల డ్వాక్రా గ్రూపులకు రూ. 650 కోట్లు రుణమాఫీ చేస్తాం. అక్టోబరు 2వ తేదీ నుంచి పరిశ్రమలకు, గృహ వినియోగానికి 24 గంటలూ విద్యుత్ ఇస్తాం. వ్యవసాయ కనెక్షన్లకు 9 గంటల పాటు కరెంటు ఇస్తాం. రూ.200 ఉన్న పింఛను రూ.1,000 చేస్తాం. వికలాంగులకు రూ.1,500లు పింఛను ఇస్తాం. ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అక్టోబరు నుంచి 20 లీటర్ల మినరల్ వాటర్‌ను రూ.2కే అందిస్తాం. విద్యా, క్రీడారంగాలను అభివృద్ధి చేస్తాం. విద్యార్థుల్లో నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం, విలువలు పెంపొందింపజేసేలా విద్యాబోధన చేయిస్తాం. క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. 2017 నేషనల్ గేమ్స్‌ను రాష్ట్రంలోనే నిర్వహించేందుకు ఇప్పటికే మంత్రి మండలి తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి ‘2029 నవ్యాంధ్ర’ విజన్‌లో ఏడు అంశాలను ప్రవేశపెట్టారు. ప్రాథమిక రంగ మిషన్‌లో వర్షాభావం, కరువు పరిస్థితుల తీవ్రతను తగ్గిస్తాం. సామాజిక సాధికారిత మిషన్‌లో విద్య, ఆరోగ్యం, సేవల నాణ్యత, ప్రమాణాలను పెంపొందింప జేస్తాం. నైపుణ్యవృద్ధి మిషన్‌లో ఉపాధి అవకాశాల కల్పన, పరిశ్రమల అనుసంధానం, ఉద్యోగాన్వేషణలో అన్ని వర్గాల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేస్తాం. పట్టణాభివృద్ధి రంగ మిషన్‌లో ప్రైవేటీకరణ, అర్బన్ ప్లానింగ్, గ్రామాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపడతాం. ఉత్పత్తి రంగ మిషన్‌లో రాష్ట్రస్థాయిలో జీఎస్డీపీని గరిష్ఠ స్థాయిలో పెంచుతాం. మౌలిక వసతులు రంగ మిషన్‌లో సముద్రతీర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో వినియోగించటం ద్వారా పోర్టుల అభివృద్ధి, వాణిజ్యాన్ని సులభతరం చేయటంతోపాటు జిల్లాల మధ్య నాలుగు లేన్ల రహదారుల నిర్మాణం, ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తాం. సేవా రంగ మిషన్‌లో ఉపాధి అవకాశాలను పెంపొందింపజేస్తూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తాం. జెడ్పీ కార్యాలయంలో.. చిలకలపూడి (మచిలీపట్నం) : జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్ పర్సన్ గద్దె అనూరాధ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెడ్పీ సీఈవో సుదర్శనం, డెప్యూటీ సీఈవో పి.కృష్ణమోహన్, ఏవో అనూరాధ, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో.. కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ జె.మురళి జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎ.ప్రభావతి, కలెక్టరేట్ ఏవో సీతారామయ్య, బి.సెక్షన్ సూపరింటెండెంట్ అనిల్ జెన్నీసన్ పాల్గొన్నారు. సమరయోధులకు సన్మానం వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులు మేక నరసయ్య, కొండపల్లి పాండురంగారావు, సమ్మెట ఆంజనేయమ్మలను మంత్రులు ఉమా, కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, కలెక్టర్ రఘునందన్‌రావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ శేషగిరిరావు, ఎస్పీ జి.విజయకుమార్, జేసీ జె.మురళీ, ఏజేసీ బీఎల్, చెన్నకేవరావు, డీఆర్వో బి.ప్రభావతి, కృష్ణా వర్సిటీ వీసీ వున్నం వెంకయ్య, మునిసిపల్ చైర్మన్ మోట మర్రి బాబాప్రసాద్ పాల్గొన్నారు. మంత్రి ఉమాకు సంఘసేవకుడు నిడుమోలు వెంకటే శ్వరప్రసాద్ శాలువా కప్పి అభినందించారు. -
సంప్రదింపులతో జలవివాదాల పరిష్కారం : మంత్రి ఉమ
నూజివీడు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలను సంప్రదింపులతో పరిష్కరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సన్నాహాలు చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఆలోచనారహితంగా విభజించడం వల్ల రాజధాని సమస్యతో పాటు సాగు, తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలను మెరుగుపర్చడానికి, నదుల్లోని నీరు సముద్రంలో కలవకుండా ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కృష్ణాడెల్టాలో సాగు, మంచినీటి కొరతను ఎదుర్కొనేందుకు గాను ప్రస్తుతం రోజుకు ఆరువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆందోళనతో నీటి విడుదలను ఆపేశారని, దీనిపై కేంద్ర జలసంఘం చైర్మన్ పాండ్యాతో సంప్రదింపులు జరిపి నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
తంగిరాల నిస్వార్థ నేత
సంతాపసభలో పలువురు వక్తలు నందిగామ : తంగిరాల ప్రభాకరరావు పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎనలేని సేవ చేశారని ఆయన నిస్వార్థ ప్రజా జీవితాన్ని, నిబద్ధతను మరువలేమని భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక కేవీఆర్ కళాశాలలో తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అర్జునుడు అధ్యక్షతన ఆదివారం సంతాప సభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ తంగిరాల తన కుడిభుజం లాంటివాడని, ఆయన మరణం తెలుగుదేశం పార్టీకే కాక నందిగామ నియోజకవర్గానికి తీరని లోటన్నారు. నియోజకవర్గంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న నిస్వార్థ ప్రజానాయకుడని కొనియాడారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అవినీతిని అంతం చేయాలనే తపన కలిగిన మహా నాయకుడు తంగిరాల అని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ల కిషోర్ మాట్లాడుతూ తంగిరాల ఆదర్శవంతమైన నాయకుడన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు తంగిరాలను ఆదర్శంగా తీసు కోవాలని చెప్పారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ తంగిరాల ఈ ప్రాంతానికి చేసిన సేవలు మరువరానివని మరొక సారి ఆయన కుటుంబాన్ని ఆదరించాలని కోరారు. ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, వల్లనేని వంశీమోహన్, శ్రీరాంరాజగోపాల్ (తాతయ్య), ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, వైవీపీ రాజేంద్రప్రసాద్, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు పద్మజ్యోతి, దాసరి బాలవర్థనరావు, మాజీ మంత్రి నెట్టెం రాఘురాం, తెలుగుదేశం నాయకులు వర్ల రామయ్య, స్వామిదాసు, సుధారాణి, కడియాల రాఘవారావు, బుద్ద వెంకన్న, కన్నెకంటి జీవరత్నం, కోట వీరబాబు, కేవి.సాంబశివరావు, సూర్యదేవర నాగేశ్వరరావు, గద్దె అనురాధ, కోగంటి బాబు, ఉన్నం నరసింహారావు, అయ్యదేవర కన్నబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామినేని కృష్ణప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల్పించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. నిబద్ధత కలిగిన నేత : మొండితోక జగన్మోహనరావు ఎంతో అనుభవం ఉన్న నిబద్ధత కలిగిన రాజకీయనాయకుడు తంగిరాల అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు. సంతాప సభలో ఆయనమాట్లాడుతూ ఆయనపై పోటీ చేయటం గర్వంగా ఉందని చెప్పారు. జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు శ్రీ బొగ్గవరపు శ్రీ శైల వాసు, మండల కన్వీనర్ నెలకుదిటి శివనాగేశ్వరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మంగునూరి కొండారెడ్డి, మండల సేవాదళ్ కన్వీనర్ పరిమి కిశోర్ పాల్గొన్నారు. తంగిరాలను టీడీపీ ఎమ్మెల్యేగా చూడలేదు : మాజీ ఎంపీ లగడపాటి తంగిరాల ప్రభాకరరావును పార్టీలకతీతంగా సేవాభావం కలిగిన ఎమ్మెల్యేగానే చూశామే తప్పా ఏనాడు టీడీపీ ఎమ్మెల్యేగా భావించలేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయనతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలేటి సతీష్, జిల్లా నాయకుడు రేపాల మోహనరావు, కేడీసీసీ డెరైక్టర్ కొమ్మినేని రవిశంకర్, పోపూరి సంగీతరావు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణానదిపై బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు
కంచికచర్ల రూరల్ : కృష్ణానదీపై ఆరు ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. కంచికచర్లలో ఓ కార్యక్రమానికి ఆదివారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపేందుకు చెవిటికల్లు, అమరావతి మధ్యన నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. బందర్ పోర్టు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. పశ్చిమ కృష్ణాలో పరిశ్రమలు, కళాశాలల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడను తీర్చిదిద్దేందుకు అవసరమైన మేరకు కృషి చేస్తున్నామని చెప్పారు. కంచిచర్లలో తాగునీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వివాదాలకు పోకుండా ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు నాయకులు కృషి చేయాలన్నారు. కంచికచర్ల సమీపంలో హత్యకు గురైన యార్లగడ్డ విజయ్ కేసులో నిందితుల్ని గుర్తించి తక్షణమే అదుపులోకి తీసుకోవాలని నందిగామ డీఎస్పీ హుస్సేన్‌ను ఫోన్లో మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కోగంటి వెంకటసత్యనారాయణ, నాయకులు ఎన్. నరసింహారావు, లక్ష్మీనారాయణ, గుత్తా వెంకటరత్నం, వేమా వెంకట్రావ్ పాల్గొన్నారు. పరామర్శ కంచికచర్లలో సీపీఎం సీనియర్ నాయకుడు దొడ్డపనేని రామారావు సతీమణి కమల (76) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె భౌతికకాయాన్ని మంత్రి సందర్శించి నివాళులర్పించారు. హత్యకు గురైన తెలుగుదేశం కార్యకర్త యార్లగడ్డ విజయ్ తల్లిదండ్రులు సాంబశివరావు, ప్రభావతిలను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. -
దుర్గగుడి అభివృద్ధి పనులపై ఉమా దృష్టి
ఇంజినీర్లపై ప్రశ్నల వర్షం భక్తులకు అసౌకర్యం కలిగించొద్దంటూ సూచన వ్యక్తిగతంగా పరిశీలిస్తానంటూ హెచ్చరిక సాక్షి కథనాలపై స్పందన సాక్షి,విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలపై తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టిపెట్టారు. సోమవారం ఉదయం తనను కలవడానికి వచ్చిన దేవస్థానం ఇంజినీర్లు, ఇతర అధికారులను దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రశ్నించారు. ఘాట్‌రోడ్డులో అభివృద్ధి పనులపై ఆయన ప్రశ్నిస్తూ రిటైనింగ్‌వాల్ నిర్మాణం పూర్తయిన తరువాత ప్రతి ఏడాది మరమ్మతులు ఎందుకు చేయించాల్సి వస్తోందని, దాని కాంట్రాక్టర్ నుంచి డబ్బు రాబట్టకుండా దేవస్థానం నిధుల నుంచి ఎందుకు ఖర్చు చేస్తున్నారని ఇంజినీర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే కొండపై నుంచి తరుచుగా కొండరాళ్లు పడుతూ ఉండటాయని, వాటి వల్ల భక్తులకు ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. వేసవిలో భక్తుల రద్దీ పెరుగుతున్నందున భక్తులకు కావాల్సిన ప్రసాదాలు అందుబాటులో ఉంచుకోవాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రసాదాలు అందక నిరాశతో తిరిగి వెళ్లకుండా చూడాలని చెప్పారు. ఎండవేడిమి వల్ల భక్తులు ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్రంలో రెండవ అతిపెద్దదేవాలయం కావడంతో అందరి దృష్టి దేవాలయంపై ఉంటుందని, అందువల్ల దేవాలయ ప్రతిష్ట కాపాడాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో తాను దేవాలయానికి వ్యక్తిగతంగా వచ్చి అభివృద్ధి పనుల్ని పరిశీలిస్తానని చెప్పారు. అభివృద్ధి పనుల విషయంలో నాణ్యత,ప్రమాణాలను పాటించడంలో రాజీ పడితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
సార్వత్రిక పోరులోవిజేతలు వీరే
మోడీ ప్రభావంతో జిల్లాలో సైకిల్ జోరు తొలిసారి పోటీచేసినా వైఎస్సార్సీపీ హోరాహోరీ పోరు టీడీపీకి 10,వైఎస్సార్ సీపీకి 5, బీజేపీకి ఒక స్థానం సాక్షి ప్రతినిధి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ హవా నడిచింది. పది స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయబావుటా ఎగరేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తరహాలోనే టీడీపీ మెరుగైన ఫలితాలు సాధించింది. వరుస విజయాలతో తెలుగు తమ్ముళ్లు ఖుషీ అయ్యారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, పెనమలూరు, గన్నవరం, విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి టీడీపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది. పెనమలూరు, విజయవాడ సెంట్రల్, మచిలీపట్నం, పెడన, గన్నవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు బోడె ప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కాగిత వెంకట్రావ్, వల్లభనేని వంశీ మంచి మెజార్టీలతో గెలుపొందారు. మైలవరం అభ్యర్థి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు 7,588 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నందిగామలో తంగిరాల ప్రభాకర్ వరుసగా రెండోసారి విజయాన్ని సాధించారు. చివరి నిమిషంలో పార్టీ మారిన మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డలో హోరాహోరీ పోరులో గెలుపొంది పరువు కాపాడుకున్నారు. జగ్గయ్యపేటలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది. 1,840 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య రెండోసారి విజయం సాధించారు. పోరాడి గెలిచారు... గుడివాడ, నూజివీడు, పామర్రు, తిరువూరు, విజయవాడ పశ్చిమ నియోజక వర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయభేరి మోగించారు. గుడివాడలో కొడాలి నాని 11 వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో ఘనవిజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై ఆధిక్యత చాటారు. నూజివీడులో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 10,700 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి మేకా ‘ప్రతాపం’ చూపారు. పామర్రులో ఉప్పులేటి కల్పన సత్తా చాటారు. టీడీపీ బలమైన వాగ్ధాటి గల నేతగా పేరొందిన వర్ల రామయ్యకు ముచ్చెమటలు పట్టించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి వర్లపై కల్పన స్వల్ప ఆధిక్యత కొనసాగిస్తూ వచ్చారు. 1,069 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెండుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి అపజయం పాలైన కల్పన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగి తొలిసారి విజయాన్ని నమోదు చేసుకున్నారు. తిరువూరు నుంచి బరిలో దిగిన రక్షణనిధి నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో టీడీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ తిరువూరులో హ్యాట్రిక్ అపజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచి ఓడారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చివరి మూడు రౌండ్లలో వెల్లంపల్లి ‘సీన్’ మారింది. అప్పటివరకు సుమారు 7,200 ఓట్ల మెజార్టీలో ఉన్న వెల్లంపల్లి జాతకం ఒక్కసారిగా తిరగబడింది. తుది లెక్కింపులో పుంజుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జలీల్‌ఖాన్ వెల్లంపల్లిపై 3,409 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వికసించిన కమలం... టీడీపీతో పొత్తులో భాగంగా జిల్లాలో రెండు స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కైకలూరులో గెలుపొంది జిల్లాలో ఖాతా తెరిచింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన కామినేని శ్రీనివాస్ ఈ దఫా బీజేపీ నుంచి రంగంలోకి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఉప్పాల రాంప్రసాద్ స్థానికేతరుడు కావడం కామినేనికి బాగా లాభించింది. గత ఎన్నికల్లో ఓడిపోయారనే సానుభూతి కూడా తోడైంది. సామాజిక, ఆర్థిక ఆంశాలను శ్రీనివాస్ బాగా వినియోగించారు. దీంతో 21,580 ఓట్ల మెజార్టీతో కామినేని విజయం సాధించారు. -
సేవతోనే ప్రజలకు చేరువ : బాలకృష్ణ
నిమ్మకూరు(గుడివాడ), న్యూస్‌లైన్ : సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవుతానని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ చైర్మన్, సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా రూ.3లక్షల వ్యయంతో నిర్మించిన మంచినీటి ఆర్వో ప్లాంటును ఆయన శనివారం ప్రారంభించారు. శుక్రవారం రాత్రి స్వగ్రామం నిమ్మకూరు చేరుకున్నారు. ఆయన బంధువు గ్రామ ఉపసర్పంచి నందమూరి శివరామకృష్ణ ఇంట్లో ఉన్నారు. శనివారం ఉదయం 8గంటల సమయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గ్రామంలో శ్రీపద్మావతి,గోదాదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో ఆయన పూజలు నిర్వహించారు. బాలకృష్ణ తల్లిదండ్రులు, ఆయన భార్యతోపాటు కుమారుడు మోక్షజ్ఞ తారకరామతేజ, అల్లుళ్లు- కూతుర్లు లోకేష్, బ్రాహ్మణి, శ్రీభరత్, తేజశ్వినీ, బావ చంద్రబాబునాయుడు, భువనేశ్వరీ పేర్లతో పూజలు జరిపారు. ఎన్టీఆర్, బసవతారకంల విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. రానున్న కాలంలో అభిమానులను సేవా కార్యక్రమాల్లో నిమగ్నం చేసేందుకు గానూ తన ఆధ్వర్యంలో ఎన్బీకే ట్రస్టును ప్రారంభించనున్నట్లు వివరించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి వీ రామయ్య, ఎన్టీఆర్ ట్రస్టు సీఈఓ చల్లా కొండయ్య, విజయవాడ టీడీపీ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు, బందరు మున్సిపల్ మాజీ చైర్మన్ బచ్చుల అర్జునుడు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పొట్లూరి కృష్ణబాబు, గుడివాడ టీడీపీ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు, టీడీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకటగురుమూర్తి, తెలుగు రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, నాయకులు మండపాక శంకరబాబు, గొట్టిపాటి లక్ష్మీదాసు, ఈడ్పుగంటి వెంకట్రామయ్య, నందమూరి శివరామకృష్ణ. గ్రామసర్పంచి జంపాని వెంకటేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పామర్రు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుత్తికొండ పద్మ, కుదరవల్లి ప్రవీణ్‌కుమార్, జిల్లా బీసీ నాయకులు పొనిపిరెడ్డి శ్రీహరి, పామర్తి విజయశేఖర్, ఎన్.కిరణ్‌కుమార్, అనగాని మురళి పాల్గొన్నారు. -
పెనంలూరు అగ్గికి... ఉమా ఆజ్యం!
విజయవాడ : పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య ఏర్పడ్డ విభేదాలు ఆ పార్టీని కుదిపేస్తున్నాయి. పార్టీ అధికార ప్రతినిధి వైవీబీ రాజేంద్రప్రసాద్, దివంగత చలసాని పండు వర్గానికి చెందిన బోడే ప్రసాద్‌ల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరడం అధినేత చంద్రబాబునే అసహనానికి గురిచేస్తోంది. వీటిని పరిష్కరించేందుకు పార్టీ పరిశీలకుడు సుజనాచౌదరి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ప్రస్తుతం స్థానిక ఎంపీ కొనకళ్ల నారాయణ ఇరు వర్గాల మధ్య విభేదాలను చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్య నేతలు చెప్పారు కాబట్టి సరే అంటారు తప్ప... వాస్తవంగా రాబోయే రోజుల్లో ఈ రెండు గ్రూపులు కలిసే పరిస్థితి లేదని సీనియర్ నేతలు ఇప్పటికే చంద్రబాబునాయుడుకు ఒక నివేదిక పంపినట్లు సమాచారం. పండు, వైవీబీ వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడానికి కారణం ఏమిటనే అంశంపై కూడా పార్టీ వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తోంది. అగ్నికి ఆజ్యం పోస్తున్న ఉమా! పెనమలూరు నియోజకవర్గానికి ఇన్చార్జి లేరు. ఈ నియోజకవర్గంపై మొదటి నుంచి కన్నేసిన జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఇక్కడ ఇన్చార్జిని నియమించకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. దీనికి తోడు రెండు వర్గాలను సమానంగా పెంచి పోషిస్తూ వస్తున్నారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అటు వైవీబీ వర్గం.. ఇటు బోడె వర్గం సీటు కోసం పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు చంద్రబాబు ఎదురుగానే తలపడ్డాయి. వారి మధ్య విభేదాలు మరింత తీవ్రస్థాయికి చేరితే మాధ్యేమార్గంగా తాను ఇక్కడ నుంచి రంగంలోకి దిగాలని దేవినేని ఉమామహేశ్వరరావు ఆలోచిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని)తో కూడా దేవినేని ఉమాకు పొసగడం లేదు. దీనికితోడు మైలవరం నియోజకవర్గ ప్రజలు కూడా ఉమా మాటలు నమ్మి ఈసారి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తనకు సురక్షితంగా ఉండే పెనమలూరు నియోజకవర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు దేవినేని ఉమా కొద్ది నెలలు తనదైన శైలిలో పావులు కదుపుతూ ఇరువర్గాల మధ్య విభేదాలు కొనసాగేలా చూశారని అంటున్నారు. ఇదే విషయం చంద్రబాబు వద్ద చర్చకు వచ్చిందని, విభేదాలు తీవ్రస్థాయికి వెళ్లేవరకు జిల్లా పార్టీ ఏంచేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేవినేని చందు కన్ను? పెనమలూరు నియోజకవర్గం తనకు దక్కకపోతే తన కుటుంబానికి చెందినవారికి దక్కేవిధంగా చూడాలని దేవినేని ఉమా పథకం రచిస్తున్నట్లు సమాచారం. గతంలో కేశినేని నానిని అంటిపెట్టుకుని ఉన్న అర్బన్ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చంద్రశేఖర్ పెనమలూరులో సొంతగా కార్యాలయం పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వైవీబీ వర్గానికి, బోడె వర్గానికి మధ్య విభేదాలు ఉన్నందున తనకు అవకాశం కల్పించాలంటూ చివరి నిమిషంలో చందు కూడా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెనమలూరు నియోజకవర్గంలో ఏర్పడ్డ విభేదాలు ‘దేశం’ సీనియర్ నేతలకు తలనొప్పిగా మారాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే సామాజిక వర్గం ఓట్లు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నప్పటికీ నేతల మధ్య ఐక్యత లేని కారణంగా ఈసారి కూడా పరాజయం తప్పదనే భావన వారిలో వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వర్గం వారికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తే, రెండో వర్గం తప్పనిసరిగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుందని అంటున్నారు. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు సరిగా జరగకపోవడంతో క్యాడర్ కూడా వేరే పార్టీల వైపు చూస్తోంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో పార్టీని చక్కదిద్దడం అంటే తలకు మించిన భారంగానే పార్టీ నేతలు భావిస్తున్నారు. -
అశోక్‌బాబు, దేవినేనిపై కేసులు పెట్టాలి: గుత్తా
నల్లగొండ: సీఎం రచ్చబండ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర సభగా మారుస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. సీమాంధ్రలో సీఎం చాంపియన్ కావాలని చూస్తున్నారని ఆరోపించారు. విద్వేషాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న అశోక్‌బాబు, దేవినేని ఉమలపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరి వెల్లడించాలన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. అసెంబ్లీకి వచ్చే ముసాయిదా బిల్లుపై అభిప్రాయం మాత్రమే ఉంటుందని, ఓటింగ్‌కు అవకాశం కూడా ఉండదని గుత్తా సుఖేందర్ రెడ్డి అంతకుముందు అన్నారు.