సాక్షి, తాడేపల్లి : టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నల మాదిరిగా తాము సంస్కార హీనంగా మాట్లాడలేమని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక టీడీపీ నేతలు వెకిలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
స్థానిక సంస్థల్లో గెలవలేమని అర్థమయిన టీడీపీ నేతలు ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దేవినేని ఉమా పిచ్చి ఆస్పత్రిలో చేరుతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమాను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. తాము టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై విమర్శలు చేయగలమని.. కానీ తమకు సంస్కారం ఉందని పేర్కొన్నారు. గౌరవం, మర్యాద అనేది దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుంటుం సొంతమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment