టీడీపీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది: ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ | Ysrcp Mla Vasantha Krishna Prasad Slams Tdp Leader Devineni Uma | Sakshi
Sakshi News home page

టీడీపీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది: ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌

Published Mon, Aug 2 2021 3:31 PM | Last Updated on Mon, Aug 2 2021 3:50 PM

Ysrcp Mla Vasantha Krishna Prasad Slams Tdp Leader Devineni Uma - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ.. తెలుగు దొంగల పార్టీగా మారిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ధ్వజమెత్తారు . కొండపల్లి మైనింగ్‌పై టీడీపీ నేత పట్టాభి ఆరోపణలను ఆయన ఖండించారు. సోమవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాలను నిజం చేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 1993లో ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా 143 సర్వే నెంబర్‌పై లీజును మైనింగ్‌ శాఖ అధికారులు మంజూరు చేశారన్నారు.

1943-44లో రూపొందించిన ఆర్‌ఎస్‌ఆర్‌ రికార్డులోనూ 143 సర్వే నెంబర్‌ ఉందని,  ఎప్పటినుంచో ఉందనడానికి ఆధారాలు కూడా ఉన్నట్లు తెలిపారు. 45 ఏళ్లుగా ఆ ప్రాంతంలో మైనింగ్‌ జరుగుతుంటే, వైఎస్‌ హయాంలో 143 సర్వే నెంబర్‌ సృష్టించారని పట్టాభి ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడించారు. దేవినేని ఉమా ఏడాదిన్నరగా నాపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement