సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మైలవరం టీడీపీ సీటుపై సందిగ్ధత వీడలేదు. ఉమా సైలెంట్ అయినా.. టిక్కెట్ కోసం బొమ్మసాని సుబ్బారావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికలు చాలా కీలకమని, టీడీపీకి చావు బతుకుల సమస్య అంటూ కార్యకర్తల సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘నేనే మైలవరం అభ్యర్ధి అనుకోవద్దు. నాకు మద్దతివ్వండి.. నాకు టిక్కెట్ ఇస్తేనే సహకరించండని నేను అనడం లేదు. నేను, దేవినేని ఉమా కాకుండా మూడో వ్యక్తి వచ్చినా అంతా కలిసి పనిచేద్దాం. అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా రేపు ప్రచార వాహనంపై అంతే ధీటుగా పని చేస్తా. నాకు, దేవినేని ఉమాకు మధ్య 20 సంవత్సరాల నుంచి రాజకీయ విభేదాలు ఉన్నాయి. టీడీపీకి చావు బతుకుల సమస్య’’ అంటూ వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, స్థానికులకే సీటు కేటాయించాలంటూ మైలవరం తెలుగు తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. వసంత కృష్ణప్రసాద్‌కు టీడీపీ శ్రేణులు మైలవరం టిక్కెట్ ఇవ్వొద్దంటున్నాయి. స్థానికుడినైన తనకే టిక్కెట్ ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు అంటున్నారు. వరుస బలప్రదర్శనలతో చంద్రబాబును బొమ్మసాని కలవరపెడుతున్నారు.
ఇదీ చదవండి: ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు
Comments
Please login to add a commentAdd a comment