MYLAVARAM
-
వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం వీరప్పన్: జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: దొంగకోళ్లు పట్టేవాడికి, టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌కు తేడా లేదని.. మైలవరం నియోజకవర్గంలో సహజ వనరుల్ని లూటీ చేస్తున్నాడంటూ మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వసంతకృష్ణ ప్రసాద్‌ను మైలవరం వీరప్పన్‌గా అభివర్ణించారు. మైలవరంలో బ్రాందీ షాపులు పెట్టుకున్నా వసంత కృష్ణప్రసాద్‌కు కమీషన్లు ఇవ్వాలి’’ అంటూ దుయ్యబట్టారు.‘‘గతంలో కృష్ణప్రసాద్ ఏడుస్తున్నాడనే నేను మైలవరానికి ఏనాడూ రాలేదు. వసంత కృష్ణప్రసాద్‌కు మీడియా సమక్షంలో నాతో చర్చకు వచ్చే దమ్ముందా? అంటూ జోగి రమేష్ సవాల్ విసిరారు. ‘‘పర్వతనేని ఇంటి ముందు సీటు కోసం అబ్బా కొడుకులు తిట్టుకుని, కొట్టుకున్నారు. ఎన్ని పుస్తకాలు రాసినా మీ చరిత్రకి సరిపోవు. సిగ్గుమాలిన, సంస్కారం లేని కుటుంబం మీది. వసంత కృష్ణప్రసాద్ బూడిద అక్రమాలపై పోరాడతాం’’ అని జోగి రమేష్ హెచ్చరించారు.జగన్, జోగి రమేష్ ఫోటోలు చూస్తే భయమా? బ్యానర్లు తీసేయమని అధికారులకు చెబుతున్నారు. నేను మా పార్టీ అధ్యక్షుడిని ఒప్పిస్తా.. నువ్వు కూటమికి రాజీనామా చెయ్యి. పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా మైలవరంలో పోటీచేద్దాం... సిద్ధమా?. రాబోయే ఎన్నికల్లో మైలవరం నుంచి వైఎస్సార్సీపీఅభ్యర్థిగా పోటీ చేస్తున్నా. 2027 తర్వాత కృష్ణ ప్రసాద్ చాప, దిండు సర్దుకుని వెళ్లిపోతాడు’’ అంటూ జోగి రమేష్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: YSRCP సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ -
వారిని వదిలిపెట్టను.. జోగి రమేష్ వార్నింగ్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కేసులకు భయపడను.. నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఇబ్రహీంపట్నం గడ్డమీదే ఉన్నా.. నా మీదకు రాకుండా.. నా కుమారుడిపై కేసు పెట్టారు. ఈ రోజుతో అయిపోదని గుర్తు పెట్టుకోండి’’ మాజీ మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు. బుధవారం.. మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో.. మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరమని గుర్తుంచుకోండి. నా జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టనని తేల్చి చెప్పారు.మంచి మనసున్న నేత వైఎస్ జగన్. ఆయన చెప్పాడనే 2019లో నేను మైలవరం నుంచి పక్కకు వెళ్లా.. ఈ క్యాండెట్ చివరి వరకూ ఉండడని జగనన్నతో ఆరోజే నేను చెప్పా.. ఆయనను నమ్మించి మోసం చేసి ఎన్నికల ముందు గోడ దూకేశాడు. రావాల్సిన బిల్లులన్నీ రాగానే పార్టీ మారిపోయాడు’’ అంటూ మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై జోగి రమేష్ మండిపడ్డారు.‘‘నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్సీపీలో ఉండండి. ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదు. మా మోచేతి నీళ్లు తాగి.. ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే కారు కూతలు కూస్తున్నాడు. ఇక పై జగనన్న గురించి మాట్లాడితే తాటతీస్తాం. కేసులకు మేం భయపడం.. మా వాళ్లజోలికి వస్తే చూస్తూ ఊరుకోం’’ అని జోగి రమేష్ చెప్పారు.‘‘జనవరిలో మైలవరంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించుకుందాం. కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటా. ఈ రోజు ఓడిపోయాం.. కానీ మళ్లీ వైఎస్ జగన్‌ని సీఎంగా చేసుకుందాం. ఐదు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత వచ్చింది. 2027లో ఎన్నికలు రాబోతున్నాయ్.. మళ్లీ గెలిచేది మనమే’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
రెండు నియోజకవర్గాలకు వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్‌ల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు నియామకాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రెండు నియోజకవర్గాలకు వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్‌ల నియామకం జరిగింది.వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేష్, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిలను నియమించారు.కాగా, ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా, అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. -
Political Corridor: ఇక జనంతో పనిలేదు.. ఓన్లీ దోచుకోవడమే..
-
AP: చెలరేగిపోతున్న పచ్చ మూకలు.. లారీలు ధ్వంసం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో పచ్చమూకలు చెలరేగిపోతున్నారు. టీడీపీ నేతల విధ్వంసాలు ఆగడం లేదు. తాజాగా, వైఎస్సార్ జిల్లా మైలవరం మండలంలో టీడీపీ నేతలు దాడులకు దిగారు. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద 18 లారీలను ధ్వంసం చేశారు. కప్పం కట్టలేదని లారీలను టీడీపీ నేతలు ధ్వసం చేశారు. కప్పం కట్టకుంటే లారీలను తిరగనివ్వమని బెదిరింపులకు దిగారు.కాగా, పలుచోట్ల టీడీపీ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం ఈ విధ్వంసకాండ కొనసాగింది. పల్నా డు జిల్లా దుర్గిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దుర్గి బస్టాండ్ సెంటర్లోని ఈ విగ్రహాన్ని టీడీపీ కార్యకర్త ఇనుపరాడ్డుతో కొట్టి ధ్వంసం చేశాడు. స్థానికులు అతడిని అడ్డుకున్నారు. మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ వెలి దండి గోపాల్ నేతృత్వంలో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.వెలిదండి గోపాల్ మాట్లాడుతూ ఇటువంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఆవేశాలకు లోనుకాకుండా శాంతి యుతంగా నిరసన తెలుపుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సర్పంచ్ రాయపాటి మాణిక్యం, వైఎస్సార్సీపీ మండల యూత్ కన్వీనర్ యకటీల బుచ్చిబాబు, నాయకులు తోటకూర వెంకటేశ్వర్లు, చెన్నుపాటి సీతారామయ్య, జంగా కొండలు, వెలిదండి జ్యోతి, శెట్టిపల్లి కోటేశ్వరరావు, చింతా రామకృష్ణ, చింతా నరసింహారావు, తోట మూర్తి, బత్తుల శ్రీనివాసరావు, యకటీల శ్రీను, తురక శ్రీను తదితరులున్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని ద్రోణాదుల గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంతకుముందు గ్రామంలోని రెండు సచివాలయాల్లో శిలాఫలకాలను పగులగొట్టారు. గ్రామంలో విధ్వంసాలను అధికారులు అడ్డుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు కోరుతున్నారు. బాపట్ల జిల్లా జువ్వలపాలెం పాత ఎస్సీ కాలనీలోని డాక్టరు బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద గతంలో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా అప్పటి మంత్రి మేరుగ నాగార్జున ఆవిష్కరించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. జువ్వలపాలెం సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి పసుపు రంగులు పూశారు. సచివాలయ భవనంపై టీడీపీ నాయకుల చిత్రాలతో ప్లెక్సీలు ఉంచారు. ఈ ఘటనల్ని స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
మైలవరంలో ఫ్లెక్సీ వార్.. కొట్టుకున్న టీడీపీ నేతలు
-
పచ్చి బూతులతో.. టీడీపీ స్ట్రీట్ ఫైట్
-
నేనే మంత్రి
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రాష్ట్రంలో జయకేతనం ఎగరేసింది. ఇప్పుడు కేబినెట్లో స్థానం కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి కొందరు ఆశావహులు రేసులో ఉన్నారు. మంత్రివర్గం ఎలా ఉండబోతోందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ స్థానాలపై కూటమిలో పార్టీల ప్రాతినిధ్యాలపై నేతలు చర్చించుకుంటున్నారు. సామాజిక వర్గాలతో పాటు, సీనియార్టీ ప్రకారం చూసినా ‘అమాత్యయోగం’ దక్కుతుందని ఆశలు పెట్టుకున్న వారి జాబితా అధికంగానే ఉంది. ఈ సారి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని ఉమ్మడి కృష్ణాలోని పలువురు సీనియర్లు ఆశిస్తున్నారు.సాక్షి, విజయవాడ ప్రతినిధి, అవనిగడ్డ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఏపీలో ‘ఎన్టీఏ కూటమి’ ప్రభుత్వం త్వరలో కొలువుదీరనుంది. అయితే రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పలువురు ఆశావహులు ఉన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు నుంచి మూడు మంత్రి పదవులు ఇచ్చేవారు. గతంలో వారికి ఇచ్చిన హామీలు, సామాజిక కోటాల పేరుతో మంత్రి పదవులు దక్కేవి. ఎన్డీఏ కూటమిలో టీడీపీతోపాటు బీజేపీ, జనసేన నుంచి ఆశావహులు ఉన్నారు. బీసీ కోటాలో.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నుంచి సీనియర్ నేతలు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి విజయం సాధించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరూ గతంలో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. కొల్లు రవీంద్ర చంద్రబాబు మంత్రి వర్గంలో, పార్థసారథి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. మంత్రి పదవి హామీతో వైఎస్సార్ సీపీ నుంచి పార్థసారథి టీడీపీలో చేరారు. తనకు మంత్రి పదవి వస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన రవీంద్రకు మంత్రి పదవి వరించే అవకాశముంది. ఎస్సీ, మహిళా కోటాలో.. నందిగామ నుంచి విజయం సాధించిన తంగిరాల సౌమ్య ఎస్సీ, మహిళా కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. రెండోసారి గెలుపొందిన ఆమెకు మంత్రిగా అవకాశం రావచ్చని తెలుస్తోంది. మారిన కోటాలో.. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు పార్టీ మారి పోటీ చేసి విజయం సాధించారు. గతంలో వైఎస్సార్ సీపీలో ఉన్న వీరిద్దరూ పారీ్టలు మారడం.. ఆ నియోజకవర్గాల నుంచి గెలుపొందడంతో మంత్రి పదవుల రేసులో ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ గతంలో ఎమ్మెల్యేగా పని చేయడం కలిసొచ్చే అంశం. పోటా పోటీ.. ఉమ్మడి కృష్ణాలో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి గెలుపొందిన సుజనాచౌదరికి చంద్రబాబు ఆశీస్సులు ఉండటంతో మంత్రి వర్గం రేసులో ముందున్నారని తెలుస్తోంది. కైకలూరు నుంచి గెలుపొందిన కామినేని శ్రీనివాస్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన నుంచి ఏకైక అభ్యరి్థగా గెలిచిన మండలి బుద్ధప్రసాద్ మంత్రి పదవి రేసులో ముందున్నారు. గతంలో రెండు సార్లు మంత్రిగా పనిచేయడం, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం కాపు సామాజిక వర్గం కావడంతో కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఉన్నారు.పోటీలో గద్దె, బొండా, శ్రీరాంవిజయవాడ తూర్పు నుంచి గెలుపొందిన గద్దె రామ్మోహనరావు సీనియర్ కోటాలో, సెంట్రల్ నుంచి బొండా ఉమా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం, జగ్గయ్యపేట నుంచి ఇప్పటికే రెండుసార్లు గెలుపొందిన శ్రీరాం తాతయ్య వైశ్య సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవుల రేసులో ఉన్నారు. గుడివాడ నుంచి మాజీ మంత్రి కొడాలి నానిపై గెలుపొందిన వెనిగండ్ల రాము మంత్రి పదవి ఆశిస్తున్నారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో నూతన మంత్రి వర్గం కొలువు తీరనున్న నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయో తెలియాలంటే వేచిచూడాల్సిందే. -
ప్రలోభాల పన్నాగం
జి.కొండూరు: టీడీపీ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికే నాయకులను తన వైపు తిప్పుకునేందుకు తాయిలాలు ఎరవేస్తున్న వసంత, ఓటర్లను సైతం ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియలో డబ్బు పంపిణీ చేసేందుకు 2వేల మంది తన కంపెనీలలో పని చేసే ఉద్యోగులను రంగంలోకి దింపిన వసంత, ఇప్పుడు మద్యాన్ని సైతం పంపిణీ చేసేందుకు తన అనుచరులు, కార్యకర్తలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే ఎన్నికలలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తెలంగాణ నుంచి మైలవరం నియోజకవర్గంలోకి మద్యం బాటిళ్లను రవాణా చేస్తూ వసంత వెంకటకృష్ణప్రసాద్ అనుచరులు ఐదుగురు ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు పట్టుబడ్డారు.దొరికారు ఇలా..మైలవరం నియోజకవర్గంలోకి భారీగా తెలంగాణ మద్యం సరఫరా అవుతోందని ఉన్నతాధికారుల సమాచారం మేరకు మైలవరం డివిజన్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సి. భార్గవ నేతృత్వంలో ఎస్ఈబీ సీఐ నాగవవల్లి, మైలవరం డీటీపీ ఎస్ఐ ఎల్. రమాదేవి, ఎస్ఐ సుబ్బిరెడ్డి తమ సిబ్బందితో కలిసి మైలవరం మండల పరిధి అనంతవరం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వసంత వెంకటకృష్ణప్రసాద్ ప్రధాన అనుచరుడు రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డిగుంటకు చెందిన చేబ్రోలు రాజు, అదే మండల పరిధి ముచ్చనపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త కారంకుల కేశవ, శ్రీరాంపురానికి చెందిన టీడీపీ కార్యకర్తలు విసనపల్లి రాంబాబు, పొట్లపు అంజిబాబు, చిన్ని దుర్గారావులు మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కారు. ఈ ఐదుగురు నిందితుల నుంచి ఒక కారు, ఒక ట్రక్కు వాహనంలో తెలంగాణ నుంచి మైలవరం నియోజకవర్గంలోకి తరలిస్తున్న 150కేస్ల మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.రెడ్డిగుంటలో భారీ డంపు స్వాధీనం..ఈ ఐదుగురు నిందితులను విచారించిన అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డిగుంటలోని చేబ్రోలు కృపారాజుకి చెందిన మామిడితోటలో భారీగా డంపు చేసిన 250కేస్ల మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మామిడితోట యజమాని చేబ్రోలు కృపారాజు సైతం వసంతకు ప్రధాన అనుచరుడు కావడంతో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడు చేబ్రోలు రాజుకి బంధువు కావడం గమనార్హం.అన్న క్యాంటీన్ నడుపుతున్న నిందితుడు..ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన ఐదుగురు టీడీపీ కార్యకర్తలలో ఒకడైన చేబ్రోలు రాజు రెండేళ్లుగా మైలవరంలో అన్న క్యాంటీన్‌ను నిర్వహిస్తున్నాడు. గతంలో దేవినేని ఉమామహేశ్వరరావుకి ప్రధాన అనుచరుడిగా ఉన్న రాజు, వసంత వెంకటకృష్ణప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఆయన పంచన చేరి మద్యం సరఫరా బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మద్యం బాటిళ్లను డంపు చేసిన మామిడితోట సైతం రాజు బంధువు చేబ్రోలు కృపారాజుకు చెందినది కావడం, ఆయన కూడా వసంతకు ప్రధాన అనుచరుడు కావడం, పట్టబడిన మిగిలిన నలుగురు నిందితులు కూడా టీడీపీ కార్యకర్తలు కావడంతో వసంత వెంకటకృష్ణ ప్రసాదే ఈ మద్యంను డంపు చేయిస్తున్నారు అనడానికి బలం చేకూరింది.మద్యం విలువ రూ.30లక్షలు..పట్టుబడిన మద్యం విలువ రూ.30లక్షలు ఉంటుందని మైలవరం డివిజన్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సి. భార్గవ విలేకరుల సమావేశంలో తెలిపారు. మద్యం రవాణా చేస్తున్న రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డిగుంటకు చెందిన చేబ్రోలు రాజు, అదే మండల పరిధి ముచ్చనపల్లికి చెందిన కారంకుల కేశవ, శ్రీరాంపురానికి చెందిన విసనపల్లి రాంబాబు, పొట్లపు అంజిబాబు, చిన్ని దుర్గారావులను ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి ఒక కారు, ఒక ట్రక్కు వాహనం, 150కేస్లు మద్యం బాటిళ్లు, డంపు చేసిన మరో 250కేస్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎన్నికలలో ఈ మద్యం బాటిళ్లను పంపిణీ చేసేందుకే తెలంగాణ నుంచి నియోజకవర్గంలోకి తీసుకొస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు. -
వసంతకు భారీ షాక్..!
-
గోడ దూకితే సీటు..!
-
‘ఈ ఎన్నికలు.. టీడీపీకి చావుబతుకుల సమస్య’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మైలవరం టీడీపీ సీటుపై సందిగ్ధత వీడలేదు. ఉమా సైలెంట్ అయినా.. టిక్కెట్ కోసం బొమ్మసాని సుబ్బారావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికలు చాలా కీలకమని, టీడీపీకి చావు బతుకుల సమస్య అంటూ కార్యకర్తల సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనే మైలవరం అభ్యర్ధి అనుకోవద్దు. నాకు మద్దతివ్వండి.. నాకు టిక్కెట్ ఇస్తేనే సహకరించండని నేను అనడం లేదు. నేను, దేవినేని ఉమా కాకుండా మూడో వ్యక్తి వచ్చినా అంతా కలిసి పనిచేద్దాం. అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా రేపు ప్రచార వాహనంపై అంతే ధీటుగా పని చేస్తా. నాకు, దేవినేని ఉమాకు మధ్య 20 సంవత్సరాల నుంచి రాజకీయ విభేదాలు ఉన్నాయి. టీడీపీకి చావు బతుకుల సమస్య’’ అంటూ వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. మరోవైపు, స్థానికులకే సీటు కేటాయించాలంటూ మైలవరం తెలుగు తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. వసంత కృష్ణప్రసాద్‌కు టీడీపీ శ్రేణులు మైలవరం టిక్కెట్ ఇవ్వొద్దంటున్నాయి. స్థానికుడినైన తనకే టిక్కెట్ ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు అంటున్నారు. వరుస బలప్రదర్శనలతో చంద్రబాబును బొమ్మసాని కలవరపెడుతున్నారు. ఇదీ చదవండి: ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు -
మైలవరం టీడీపీలో రచ్చ రచ్చ.. బొమ్మసాని బల ప్రదర్శన
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మైలవరం టీడీపీలో లోకల్ ఫైట్ ముదురుతోంది. స్థానికులకే సీటు కేటాయించాలంటూ మైలవరం తెలుగు తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. వసంత కృష్ణప్రసాద్‌కు టీడీపీ శ్రేణులు మైలవరం టిక్కెట్ ఇవ్వొద్దంటున్నాయి. స్థానికుడినైన తనకే టిక్కెట్ ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు అంటున్నారు. వరుస బలప్రదర్శనలతో చంద్రబాబును బొమ్మసాని కలవరపెడుతున్నారు. నిన్న ఇబ్రహీంపట్నంలో బొమ్మసానికి టిక్కెట్ ఇవ్వాలంటూ ప్రజా పాదయాత్ర నిర్వహించగా, నేడు గొల్లపూడిలో బొమ్మసానికి మద్దతుగా మైనార్టీలు ర్యాలీ చేపట్టారు. నాన్ లోకల్ వద్దు.. లోకల్ ముద్దంటూ నినాదాలు చేశారు. ప్రజల మద్దతు తనకే ఉందంటూ చంద్రబాబుపై బొమ్మసాని ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ రాకను వ్యతిరేకిస్తూ మైలవరం టీడీపీలోని అసమ్మతి నాయకులందరూ ఒకటవుతున్నారు. గతంలో దేవినేని ఉమాకు వ్యతిరేకంగా బొమ్మసాని సుబ్బారావు టికెట్ తనకే కావాలంటూ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి హడావిడి చేసిన సంగతి తెలిసిందే. తనకే టికెట్టు ఇవ్వాలంటూ పలుమార్లు అధిష్టానాన్ని కోరారు. దేవినేని ఉమాతో కలవకుండా ప్రత్యేక వర్గంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే వసంతకృష్ణ ప్రసాద్ పార్టీలో చేరడం, టికెట్టు హామీ దక్కడంతో, ఈ రెండు వర్గాలు ఒక్కటై కలిసి కట్టుగా పనిచేయాలని నిర్ణయించాయి. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను జయప్రదం చేసే విధంగా పనిచేస్తామని ప్రకటించారు. వసంత కృష్ణ ప్రసాద్‌కు సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. -
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మూడు ముక్కలైన టీడీపీ
-
సీఎం వైఎస్ జగన్ నియమించిన తిరుపతిరావే మైలవరం అభ్యర్థి
-
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వసంతకు ఎదురుదెబ్బ
-
టీడీపీకి నే‘తలనొప్పి’
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీలో ఇంటిపోరు రోడ్డున పడుతోంది. జనసేనతో టికెట్ల పంచాయితీ తేలక ముందే తెలుగు తమ్ముళ్లు రచ్చకెక్కుతున్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా అంతర్గత విభేదాలను తట్టుకొలేక పార్టీ నాయకత్వంపై పరోక్షంగా ధ్వజమెత్తారు. పార్టీలో కొత్త వారి చేరికలను వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఆదివారం జరిగిన ‘టౌన్ హాల్ మీటింగ్ విత్ లీడర్’ అనే కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అసమ్మతి గళానికి అద్దం పట్టాయి. మైలవరం నుంచి దేవినేని ఉమాకు టికెట్ లేదని ఇప్పటికే చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దానిని బలపరుస్తూ తాజా రాజకీయ పరిణామాలు జోరందుకున్నాయి. అవమాన భారంతో.. మైలవరం నుంచే పోటీ చేస్తానని ఉమా చెబుతున్నా శ్రేణులు, అధిష్టానం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఉంటే ఉండు.. పోతే పో.. అన్న రీతిలో పార్టీ పెద్దలు వ్యవహరిస్తుండటంతో ఉమాలో అసహనం పెరిగిపోతోంది. ఫలితంగా అవమానభారంతో ఉమా అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరికలు చేస్తూ గుంటుపల్లి సమావేశంలో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ‘వందల కోట్ల రూపాయలు ఇస్తాం అని వస్తున్న రాజకీయ వ్యభిచారులను తరిమికొట్టాలి’ అని ఆయన పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపుతోంది. ‘పసుపు కండువా కప్పుకొని చచ్చిపోతాను తప్ప పార్టీని వీడను. ఫిబ్రవరి రెండో వారంలో అన్నేరావుపేట నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తా’ అని ఉమా చెప్పడంతో పరోక్షంగా చంద్రబాబు, చినబాబుకే హెచ్చరికలు జారీ చేస్తున్నారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు ‘పార్టీలో నేను పెద్దతోపును. తనది రెండో స్థానం. నేను తలచుకొంటే ఎవరికైనా టికెట్ ఇప్పిస్తాను’ అని గొప్పలు చెప్పుకొనే ఉమాకు పట్టిన దుస్థితి చూసి పలువురు నేతలు నవ్వుకొంటున్నారు. తాను తలుచుకొంటే మైలవరంతోపాటు, నందిగామ నియోజకవర్గంలో పార్టీని దెబ్బ తీయగలనని ఆయన అధిష్టానానికి సంకేతాలు పంపినట్టు చర్చ జరుగుతోంది. అయితే ఉమా వ్యవహారశైలిని అధిష్టానం లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయనపైన ప్రతిదాడి చేయాలని కొందరు నేతలకు ఇప్పటికే సూచించినట్లు పార్టీ వర్గాల్లో∙చర్చ సాగుతోంది. ముద్దరబోయిన అసంతృప్తి నూజివీడు టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఈసారి టికెట్ లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. దీనిపై బాబును కలిసి మాట్లాడేందుకు ముద్దరబోయిన యత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన తన వర్గీయులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోసారి అధిష్టానంతో మాట్లాడి ఫలితం లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. విజయవాడ వెస్ట్‌లో తాప‘త్రయం’ విజయవాడ వెస్ట్‌లో టికెట్ కోసం మూడు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. పేపరు పులిగా పేరొందిన బుద్దా వెంకన్న ర్యాలీలు చేస్తూ తనకు టీడీపీ టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విజయవాడ వెస్ట్ టికెట్ తనదేనని ఇప్పటికే ప్రకటించుకున్నారు. ‘అందరూ టికెట్ అడుగుతారు కానీ గెలిచే స్తోమత ఉండాలి. మంచి విలువలు ఉండాలి. నాకు సీటు ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరివేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేనే ఎమ్మెల్యే అభ్యర్థినవుతా’ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. జనసేన మాత్రం పొత్తులో భాగంగా సీటు తమకే వస్తుందని చెబుతోంది. ఆ పార్టీ నేత పోతిన మహేష్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. జనసేన, టీడీపీ సీట్లు సర్దుబాటు కాకముందే ఇక్కడ ఆ పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. -
ప్రజలకు నాణ్యమైన కరెంట్ అందుతుంది: మంత్రి పెద్దిరెడ్డి
-
‘దేవినేని ఉమాను నేనే గెలిపించాను’
ఎన్టీఆర్ జిల్లా: మైలవరం టీడీపీ మళ్లీ విభేదాలు రాజుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమాను ఉద్దేశించి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు చేసిన కామెంట్ ఇప్పుడు స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారాయి. మైలవరం టీడీపీ టికెట్ తనకే ఇవ్వాలని బొమ్మసాని పట్టుబడుతున్నారు. గత ఎన్నికల్లో పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన దేవినేని ఉమాను తానే గెలిపించానని, ఈసారి టికెట్ మాత్రం తనకే కావాలని బొమ్మసాని జిల్లా టీడీపీలో కొత్త చర్చకు తెరలేపారు. ‘గత ఎన్నికల్లో ఉమా కోసం పెద్ద పాలేరుగా పని చేశాను. పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన దేవినేని ఉమను గతంలో మైలవరంలో గెలిపించాను. ఈసారి మైలవరం టికెట్ నాకే ఇవ్వాలి. నేను సీటు అడగడంలో న్యాయం ఉంది’ అని పేర్కొన్నారు. -
వైద్యుల నిర్వాకం.. పేషెంట్ కడుపులో సర్జికల్ క్లాత్ మరిచి..
మైలవరం(ఎన్టీఆర్ జిల్లా): ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. గర్భసంచి తొలగించేందుకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు కడుపులోనే సర్జికల్ క్లాత్ వదిలేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన కొరివిడి శివపార్వతి తరచూ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేది. ఆమె ఆరు నెలల కిందట ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని అను హాస్పటల్‌కు వెళ్లింది. ఆమెకు వైద్యులు గర్భసంచి తొలగించాలని చెప్పి ఆపరేషన్ చేశారు. అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో మళ్లీ పలుమార్లు అను ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. చివరికి 20 రోజుల కిందట విజయవాడలోని హరిణి ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు స్కానింగ్ చేసి కడుపులో గుడ్డ వంటి పదార్థం ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ చేయగా బాధితురాలి కడుపులో సర్జికల్ క్లాత్ ఉండటంతో తొలగించారు. శివపార్వతి డిశ్చార్జి అయిన అనంతరం మంగళవారం ఈ విషయంపై మాట్లాడేందుకు మైలవరంలోని అస్పత్రికి వచ్చి ఆమె బంధువులు... వైద్యులు సరిగా స్పందించలేదని ఆందోళన చేశారు. చదవండి: డేటా కేబుల్‌తో ప్రియురాలిని చంపి.. అదే రోజు మరో అమ్మాయితో పెళ్లి! -
సొంతపార్టీ వాళ్లకే చెమటలు పట్టించిన ఉమా! మాకొద్దు బాబోయ్ అంటున్న తమ్ముళ్లు
ఎన్టీఆర్ జిల్లా: తెలుగుదేశం పార్టీలో జనం నెత్తిన చేతులు పెట్టే నేతలకు కరువేమీ లేదు. అదే కోవలోకి వస్తారు మాజీ మంత్రి..సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు. ఇప్పుడాయన పేరు చెబితే పార్టీలోను, మైలవరం నియోజకవర్గంలోనూ అందరూ మండిపడుతున్నారట. నోటి దురుసు, అహంభావానికి కేరాఫ్ అడ్రస్ అయిన దేవినేని వ్యవహారంతో కార్యకర్తలు ఎప్పట్నుంచో విసిగిపోయి ఉన్నారట. ఇటీవల ఉమా తీరు మరింత వరస్ట్‌గా మారడంతో క్యాడర్ కు అస్సలు రుచించడం లేదని టాక్. దీంతో అతనికి వ్యతిరేకంగా మైలవరంలో గ్రూపులు మొదలయ్యాయట. దేవినేని ఉమా తాజాగా వెలగబెట్టిన నిర్వాకం కారణంగా సైకిల్ పార్టీ శ్రేణులు ఉమా అంటే ఆమడ దూరంలో ఉంటున్నారట. గొల్లపూడి వన్ సెంటర్ లో ఆలూరి చిన్నారావుకు చెందిన స్థలంలో కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ స్థలం ఆలూరి చిన్నారావుకు అతని తల్లి శేషారత్నం గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారు. ఆ స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో తన ఆస్థిని కాపాడుకునేందుకు శేషారత్నం జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించారు. ఏడాది పాటు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు కలెక్టర్ గిఫ్ట్ డీడ్ రద్దుచేసి ఆ స్థలాన్ని ఆమెకు ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. ఆలూరి శేషారత్నం ఆ స్థలంపై కన్నేశారు కలెక్టర్ ఆదేశాలతో శేషారత్నంకు స్థలం అప్పగించేందుకు అధికారులు అక్కడకు వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో దేవినేని ఉమా జోక్యం చేసుకుని కుటుంబ వ్యవహారాన్ని రాజకీయంగా మార్చేశారని టాక్. వాస్తవానికి టీడీపీ కార్యాలయం పేరిట ఆ స్థలాన్ని పర్మినెంట్ గా కొట్టేయాలనేది దేవినేని ఉమా ప్లాన్ అని చెబుతున్నారు. ఇందులో భాగంగానే దేవినేని ఉమా ఓ రేంజ్ లో డ్రామా నడిపించాడు. కానీ అతని బెదిరింపులకు వెరవకుండా శేషారత్నం ధైర్యంగా నిలబడ్డారు. తల్లీ కొడుకుల మధ్య ఉమా చిచ్చు పెట్టాలని ఎంత ప్రయత్నించినా వ్యూహం ఫలించలేదట. దీంతో అధికారులు ఎట్టకేలకు ఆ స్థలాన్ని ఆమెకు ఇప్పించడంతో పాటు అక్కడున్న టీడీపీ కార్యాలయాన్ని కూడా తరలించారు. ఐతే పార్టీ కార్యాలయం ముసుగులో శేషారత్నం స్థలం కొట్టేయాలన్న దేవినేని ప్లాన్ దారుణంగా ఫెయిలవ్వడంతో పాటు పార్టీకి తీరని నష్టం వాటిల్లేలా చేసిందట. పార్టీ కార్యకర్తకే వెన్నుపోటా? శేషారత్నం కుటుంబం అంతా టీడీపీ పార్టీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రస్తుతం వివాదానికి కారణమైన స్థలానికి నెలకు లక్షరూపాయలు అద్దె వస్తుందని తెలిసినా పార్టీ కోసమే అయాచితంగా ఇచ్చేశారు. ఇలాంటి సమయంలో దేవినేని పన్నాగం తెలుసుకుని స్థలాన్ని కాపాడుకునేందుకు శేషారత్నం తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. సొంత పార్టీకి చెందిన వారి స్థలాన్నే కబ్జా చేయాలని దేవినేని ఉమా వేసిన ప్లాన్ సక్సెస్ కాకపోగా...రచ్చ రచ్చగా మారి పచ్చ పార్టీ అభాసుపాలైందట. దీంతో ఈ వ్యవహారాన్ని పార్టీ అధినాయకత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుందట. అసలే మైలవరం టీడీపీలో లోకల్ నాన్ లోకల్ వార్ నడుస్తున్న సమయంలో ఈ పంచాయతీ ఏంటంటూ మండిపడుతున్నారట చినబాబు, చంద్రబాబు. ఇప్పటికే వేరుకుంపటి పెట్టుకున్న మైలవరం తమ్ముళ్లంతా..అదే అదనుగా కట్టకట్టుకుని ఉమాపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేశారట. ఈసారి ఉమా మాకొద్దంటున్నాం కాబట్టి... ఈసారి ఆ సీటేదో మాకే ఇచ్చేయండి బాబు అంటూ అధినేత ముందు క్యూ కట్టేస్తున్నారట. మాకొద్దు బాబు.. మీకో దండం మైలవరం నుంచి దేవినేని ఉమాను బయటికి పంపించేయాలనుకుంటున్న బొమ్మసాని సుబ్బారావు, జంపాల సీత రామయ్య, కాజా రాజ్ కుమార్, జువ్వ రాంబాబు తదితర ఆశావాహులంతా హై కమాండ్ వద్ద ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారట. ఈ మొత్తం వ్యవహారాన్ని బయటి నుంచి గమనిస్తున్న క్యాడర్ మాత్రం 2024లో ఉమాకు మైలవరం టిక్కెట్టు ఇస్తే పార్టీ మూసేసుకోవడం ఖాయమని బాహాటంగానే చర్చించుకుంటున్నారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మైలవరానికి దేవినేని ఉమా చేసింది శూన్యం : ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
-
దేవినేని వారి పబ్లిసిటీ స్టంట్స్.. అరెరే.. డ్రామా చేస్తే నమ్మాలి కదా..!
చంద్రబాబు హయాంలో ఆయన రేంజే వేరు. బాస్ తర్వాతే తానే అన్నట్లుగా బిల్డప్‌లు ఇచ్చేవారు. శిలాఫలకాలు, శంకుస్థాపనలు మినహా నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. గత ఎన్నికల్లో జనం తుక్కు కింద ఓడించేశారు. ఇక కేడర్, ప్రజలు పట్టించుకోవడం మానేశారు. అయితే ఇప్పుడా నేత సానుభూతి రాజకీయాలకు తెరదీస్తున్నాడు. ప్రజల కోసం తానేదో చేస్తున్నట్లు పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు. మైలవరం గుర్తుకొచ్చింది.! దేవినేని ఉమామహేశ్వరరావు.. తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకుల్లో తానే పెద్ద సూపర్ స్టార్ అని ఓవర్ బిల్డప్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. తనంత గొప్పోడు లేడంటూ.. ప్రజలకు దూరంగా ఉంచుతూ.. కనీసం నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోకుండా లెవెల్ చూపించే ఉమకు గత ఎన్నికల్లో ప్రజలు ఆయన అసలు స్థానం ఏంటో చూపించారు. ఓడాక ఆయన్ను కేడర్ పట్టించుకోవడంలేదు. ప్రజలు అసలే మర్చిపోయారు. గతంలో పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో తళుక్కున మెరిసి మాయమైపోయే దేవినేని ఇప్పుడు మైలవరంలో అసలు కనిపించడమే మానేశారట. మరోవైపు ఆయన వ్యతిరేక వర్గం వేరు కుంపటి పెట్టడంతో ఇన్నాళ్లు మైలవరం నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యాడట దేవినేని. ఇప్పుడు హఠాత్తుగా ఆయనకు మళ్లీ మైలవరం గుర్తుకొచ్చింది. డ్రామా@టిడ్కో పార్టీలో, ప్రజల్లో తన మైలేజ్ పడిపోతుందని భావించిన దేవినేని ఉమ.. ఇప్పుడు కొత్తగా ప్రజాసమస్యలన్నీ తన భుజాన వేసుకున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారట. తాజాగా మైలవరం నియోజకవర్గం పరిధిలోని జక్కంపూడి కాలనీలో నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాల వద్ద నిరసన దీక్ష పేరుతో ఓ కొత్త డ్రామాకు తెరతీశారు దేవినేని ఉమ. నివాసయోగ్యమైన గృహాలను పేదలకు కేటాయించినందుకుగాను నిరసన తెలియచేస్తున్నా.. జగన్ ప్రభుత్వం కళ్లు తెరిపిస్తా అంటూ వీరావేశంలో స్పీచ్‌లు ఇచ్చారట. అయితే క్షేత్రస్థాయిలో ఉమాతో పాటు నిరసనలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని ముక్కున వేలేసుకోవాల్సి వచ్చిందట. ఇల్లు ఇస్తే ఎంత ఇస్తావు..? గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2018లో జక్కంపూడి కాలనీలో కొన్ని ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో టిడ్కో ఇల్లు కావాలంటే 25 వేలు కట్టాలంటూ లబ్ధిదారుల నుంచి వీఎంసీ ద్వారా రూ.15కోట్ల 90 లక్షలు వసూలు చేశారు. ఇవి కాకుండా అనధికారికంగా టీడీపీ నేతలు అందిన కాడికి లబ్ధిదారుల నుంచి దోచుకున్నారు. ప్రభుత్వం దిగిపోయే సరికి రూ.90 కోట్లు ఖర్చుచేసి 20 శాతం మాత్రమే ఇళ్లు పూర్తి చేసి.. రూ.69 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో జరిగిన పనులతో కలిపి ప్రస్తుతం 67 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. గతంలో టీడీపీ ఎగ్గొట్టిన 21 కోట్లతో పాటు ఇప్పటి వరకూ జరిగిన పనులకు రూ.270 కోట్లు వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. ఇక టీడీపీ హయాంలో లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులో 10 కోట్లను ఇప్పటికే వీఎంసీకీ తిరిగి ప్రభుత్వం చెల్లించేసింది. మిగిలిన రూ. 5కోట్ల 90 లక్షలు త్వరలో చెల్లించనుంది. అలాగే జక్కంపూడి లే అవుట్ లో 423 కోట్లతో హౌసింగ్, 139 కోట్లతో మౌలిక సదుపాయాలు మొత్తం 570 కోట్ల రూపాయలతో మార్చి నాటికి నిర్మాణాలన్నింటినీ పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని సీఎం జగన్ ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉంది. ఈ వాస్తవాలన్నింటినీ పక్కన పెట్టేసి పబ్లిసిటీ కోసం దేవినేని ఉమ టిడ్కో ఇళ్ల వద్ద నిరసన దీక్ష పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు . డ్రామా చేస్తే నమ్మాలి కదా..! తమ ప్రభుత్వంలోనే ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయిందని.. ఈ ప్రభుత్వం మూడేళ్లైనా ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వడంలో జాప్యం చేస్తోందని బురద జల్లే ప్రయత్నం చేశారు పచ్చ పార్టీ నేత దేవినేని ఉమ. ప్రభుత్వం చెబుతున్నట్లుగా అక్కడ పనులు జరుగుతుంటే.. ఇళ్లు పూర్తైనా ఇవ్వడం లేదంటూ ఈయన నిరసన చేపట్టడం వింతగా ఉందంటూ నిరసనలో పాల్గొనేందుకు వెళ్ళినవారు బాహాటంగానే చర్చించుకున్నారట. తన ఉనికిని కాపాడుకునేందుకు దేవినేని చేస్తున్న ప్రయత్నాలు చూసి సైకిల్ పార్టీ శ్రేణులు తల బాదుకుంటున్నారట. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పొలిటికల్ కారిడార్: దేవినేని ఉమాను మర్చిపోయిన క్యాడర్, ప్రజలు
-
లోకల్లో నాన్ లోకల్.. నాటి కుట్ర.. నేడు మెడకు.!
ఆ మాజీమంత్రి ఓ నియోజకవర్గానికి వలస నేత. అయినా పచ్చ పార్టీ బాస్ ఆదేశాల మేరకు అక్కడి కేడర్ వలస నేతను నెత్తిన పెట్టుకున్నారు. అయితే రెండు సార్లు గెలిపించినా.. మూడో సారి ఓడేసరికి కేడర్‌ను పట్టించుకోవడంలేదట ఆ వలస నాయకుడు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈయన మాకొద్దంటూ అక్కడి కార్యకర్తలు బాస్‌కు తేల్చి చెప్పేశారట. లోకల్, నాన్ లోకల్ పంచాయతీ పచ్చ పార్టీ బాస్‌కు తలనొప్పిగా మారిందట. పేరుకే సీనియర్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా చెప్పుకునే దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇప్పుడు మైలవరం తమ్ముళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారట. గత కొంత కాలంగా ఉమాతో టచ్ మీ నాట్ అనేలా వ్యవహరిస్తున్న క్యాడర్ ఇప్పుడు ఏకంగా ఆయనకు వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేసుకోవడమే ఇందుకు కారణమని టాక్. నియోజకవర్గాల పునర్విభజనలో నందిగామ నియోజకవర్గానికి చెందిన దేవినేని ఉమ... మైలవరంకు మారాల్సి వచ్చింది. పట్టించుకోకపోతే దించేస్తాం కొత్త నియోజకవర్గంలో సామాజికవర్గ సమీకరణాలు బాగా కలిసిరావడంతో స్థానికేతరుడే అయినప్పటికీ పార్టీ క్యాడర్, ప్రజలు ఉమాకు పట్టం కట్టారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ఇంత వరకూ బాగానే ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో కొంత కాలంగా దేవినేని ఉమ క్యాడర్ ను అసలు పట్టించుకోవడంలేదట. ఎక్కడా కలుపుకెళ్లకపోవడంతో మైలవరం తమ్ముళ్ళు ఉమాపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఉమా వైఖరితో విసిగిపోయిన క్యాడర్, ఆయన కారణంగా నష్టపోయిన నేతలు ఉమాకు వ్యతిరేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారట. తెరపైకి బొమ్మ తమ మధ్య ఉంటూ తమకోసం పనిచేసే నాయకుడు, తమ నియోజకవర్గానికి చెందిన నేత కావాలంటూ మైలవరం కేడర్ తమ పార్టీ బాస్‌ను డిమాండ్ చేస్తున్నారట. లోకల్, నాన్ లోకల్ అంశం తెరపైకి రావడంతో పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఉమాతో నిమిత్తం లేకుండా బొమ్మసాని సుబ్బారావు నాయకత్వంలో పనిచేయాలని గొల్లపూడిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మైలవరంకు చెందిన నేతలు, కార్యకర్తలు ఓ నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది. దేవినేని ఉమా ఫోటో కూడా లేకుండా ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమావేశం వేదికగా 2024లో మైలవరం టిక్కెట్టు బొమ్మసానికి ఇస్తేనే పార్టీ కోసం పనిచేస్తామని, అభ్యర్థిని గెలిపిస్తామని నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. నాటి కుట్ర.. నేడు మెడకు.! స్థానికత అంశాన్ని తెరమీదకు తెస్తూ మైలవరం టీడీపీ శ్రేణులు ఏకం కావడం పార్టీ అధిష్టానానికి, దేవినేని ఉమాకు షాకిచ్చిందట. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మైలవరం టీడీపీలో లోకల్ నినాదం తెరపైకి రావడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో మైలవరం వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన జోగిరమేష్‌ను దెబ్బ కొట్టడానికి అప్పుడు వైసీపీలో ఉన్న బొమ్మసాని సుబ్బారావును దేవినేని ఉమా ఇండిపెండెంట్ గా బరిలోకి దించాడు . తన గెలుపునకు సహకరిస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం, పదవులు కట్టబెడతానని మాటిచ్చాడు. 2014 ఎన్నికల్లో దేవినేని విజయం సాధించడం మంత్రి అవ్వడం చకచకా జరిగిపోయాయి. కట్ చేస్తే గెలిచిన తర్వాత దేవినేని విజయానికి కారణమైన బొమ్మసానిని పట్టించుకోవడం మానేశాడట. కాలం కలిసిరాలేదని ఊరుకున్న బొమ్మసాని..2024 మైలవరంలో టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని ఆరాటపడుతున్నారని సమాచారం. అందులో భాగంగానే ఆత్మీయ సమావేశం పెట్టుకుని తనకు జరిగిన అన్యాయాన్ని బొమ్మసాని బయపెట్టేశారని చర్చ నడుస్తోంది. ఎసరు పెట్టేందుకు నాని రెడీ ఇదంతా పైకి కనిపించే విషయాలే కాగా...అసలు స్థానికత తెరమీదకు రావడం వెనుక ఎంపీ కేశినేని నాని హస్తం కూడా ఉందన్న ప్రచారం మైలవరంలో జోరుగా సాగుతోంది. కేశినేని నాని అంటే దేవినేని ఉమాకు పడదు. ఈ ఇద్దరు నేతలూ ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగానే ఉంటారు. ఇటీవల టీడీపీలో కేశినేని నాని సోదరుడు చిన్ని యాక్టివ్ రోల్ పోషించడానికి దేవినేని ఉమానే కారణమట. నానిపై ఉన్న కోపంతో చిన్నిని చంద్రబాబు సాయంతో బెజవాడ రాజకీయాల్లో బిజీ చేసేశారట దేవినేని ఉమ. ఈ విషయంపై గత కొంత కాలంగా రగిలిపోతున్న కేశినేని నాని...సమయం చూసి ఇప్పుడు మైలవరంలో దేవినేనికి ఎసరు పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్నారని వినికిడి. అందుకే బొమ్మసాని రూపంలో లోకల్ నినాదాన్ని రాజేసినట్లు టాక్. బాబు బంతాట బొమ్మసాని సుబ్బారావుకి కేశినేని నాని సన్నిహితుడైన కాజ రాజ్ కుమార్ బహిరంగంగానే మద్దతిస్తున్నారు. అందుకే ఉమాకు ఇప్పుడు అసలైన టెన్షన్ మొదలైందట. మైలవరం నియోజకవర్గం అంతటా...బొమ్మసాని సుబ్బారావుకి, కాజ రాజ్ కుమార్ కు టీడీపీ క్యాడర్ లో మంచి పట్టు ఉండటంతో ఉమాకు దిక్కు తోచడంలేదని తెలుగు తమ్ముళ్ళు సంతోషంగా చెబుతున్నారు. మైలవరం ఆత్మీయ సమావేశం వేదికగా ఉమాపై వెల్లువెత్తిన అసమ్మతిపై ఇప్పటికే చంద్రబాబు ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారని తెలుస్తోంది. మైలవరంలో తలెత్తిన లోకల్, నాన్ లోకల్ పంచాయతీలో అధిష్టానం ఎవరివైపు నిలబడుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారట. -
టీడీపీలో అసమ్మతి సెగ.. దేవినేని ఉమకు షాక్!
సాక్షి, ఎన్టీఆర్: మైలవరం టీడీపీలో అసమ్మతి సెగ బయటకు వచ్చింది. మాజీ మంత్రి దేవినేని ఉమాపై అసమ్మతి వర్గం భగ్గుమంది. టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు నిర్వహించిన సభలో దేవినేని వద్దు బొమ్మసాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఆత్మీయ సమావేశం బ్యానర్లో దేవినేని ఉమ ఫొటోకు చోటు దక్కకపోవడం విశేషం. ఈ క్రమంలో మైలవరం టికెట్ సుబ్బారావుకే ఇవ్వాలని స్థానిక టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. ‘మీటింగ్ పెడితే కొందరు కంగారు పడుతున్నారు. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి తప్పు చేశాను. అప్పుడు లబ్ధి పొందినవారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 20న మెగా జాబ్‌మేళా.. పూర్తి వివరాలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీ శనివారం మైలవరంలోని డాక్టర్ లక్కిరెడ్డి హానిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నామని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఉపాధి శాఖాధికారి డాక్టర్ పీవీ రమేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. చదవండి: కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు ఈ మేళాలో 16 ప్రైవేటు సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరై వారి కంపెనీల్లోని వివిధ విభాగాల్లో 1,900 పోస్టులను భర్తీ చేస్తారని పేర్కొన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీతో పాటుగా ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్ విద్యార్హతలు ఉన్న వారు ఈ మేళాలో పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 20వ తేదీలోగా ఆన్లైన్లో గాని 86888 42879, 99660 90377 నంబర్లలో కాని పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన తెలిపారు. పేర్లు నమోదు చేసుకోలేకపోయిన వారు శనివారం జాబ్ మేళా జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు. -
రైతుల మేలుకోరి.. ముందడుగు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు వీలుగా విద్యుత్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి, వారిలో ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేశారు. ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరం గ్రామాన్ని ఎంచుకొని, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను బిగించి పరిశీలించారు. బెంగళూరులోని ప్రయోగశాల నుంచి వీటిని పరీక్షించారు. సానుకూల ఫలితాలు రావడంతో ఉమ్మడి జిల్లాలోని 1,08,859 వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు వీలుగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి గానూ అర్హత పొందిన ఏజెన్సీలు మీటర్లను దశల వారీగా సరఫరా చేయనున్నాయి. సంబంధిత ఏజెన్సీ బిల్లులు తయారు చేసి డిస్కంలకు అందజేయనున్నాయి. వీటి ఆధారంగా ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ప్రస్తుతం నగదు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. దీంతో పాటు రైతుల నుంచి డెబిట్ మ్యాన్‌డేట్ ఫారాలను సేకరిస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వం జమ చేసే బిల్లు మొత్తం సంబంధిత డిస్కంకు బదిలీ అయ్యేందుకు ఆమోదం తెలిపినట్లవుతుంది. బ్యాంకు ఖాతాల సేకరణ ఇలా.. విజయవాడ సర్కిల్ పరిధిలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 1,08,859 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటీకి సంబంధించి డిస్కంల వద్ద ఉన్న రికార్డుల వివరాలను పోల్చుకొని, అప్డేట్ చేస్తున్నారు. అప్డేట్ కాని చోట్ల రికార్డుల్లో మార్పులు చేస్తున్నారు. పాస్ పుస్తకం, భూ యజమాన్య హక్కు పత్రం ఆధారంగా కనెక్షన్లను, ప్రస్తుతం ఉన్న హక్కుదారుడి పేరిట నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి డిస్కంల వద్ద 55,610 ఖాతాలుండగా, తాజాగా మరో 11,415 ఖాతాలను రైతుల ద్వారా ఓపెన్ చేయించారు. మిగిలిన 41,834 వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి, రైతులతో ఖాతాలు తెరిచే పనిలో విద్యుత్ సిబ్బంది నిమగ్నం అయ్యింది. ప్రధానంగా వ్యవసాయ కనెక్షన్లు అధికంగా ఉన్న నూజివీడు, విజయవాడ రూరల్, ఉయ్యూరు డివిజన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అపోహలను తొలగిస్తున్నాం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను బిగించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ విధానంపై రైతుల్లో నెలకొన్న అపొహలను తొలగిస్తున్నాం. వారి ఖాతాల్లో బిల్లుకు సంబంధించిన నగదును జమ చేసేందుకు వీలుగా బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నాం. రైతుల నుంచి డెబిట్ మ్యాన్‌డేట్ ఫారాలను సేకరిస్తున్నాం. – శివప్రసాద్‌రెడ్డి, ఎస్ఈ, విజయవాడ సర్కిల్ -
శభాష్.. సుప్రియ
మైలవరం: (జమ్మలమడుగు రూరల్): తొమ్మిదేళ్ల వయసులోనే తల్లిని, పన్నెండేళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన ఆ బాలిక పట్టుదలతో చదువును కొనసాగించి పద్దెనిమిదేళ్ల వయసులోనే పోస్టల్‌శాఖలో ఉద్యోగం సాధించి అందరిచేత శభాష్ అనిపించుకుంది. మైలవరం మండలం వద్దిరాల గ్రామానికి చెందిన గడ్డం సుమలత, మద్దిరాల ప్రసాద్‌ల ఏకైక కుమార్తె సుప్రియ. దురదృష్టవశాత్తు 2013లో మిద్దె కూలి తల్లి సుమలత మరణించగా 2016లో తండ్రి ప్రసాద్ గుండెపోటుతో చనిపోయాడు. తల్లిదండ్రులిద్దరూ కానరాని లోకాలకు వెళ్లిపోయినా సుప్రియ మాత్రం ఆత్మస్థైర్యంతో చదువును కొనసాగించింది. మేనమామ గడ్డం ఓబులేసు సంరక్షణలో ఉంటూ రాజుపాలెం మండలం వెల్లాల గురుకుల పాఠశాలలో 10 వ తరగతి వరకు చదివింది. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 600కు 594 మార్కులు సాధించి ఔరా అనిపించింది. సుప్రియ ఇంటర్మీడియట్ రెండేళ్లు కర్నూలు జిల్లా బనగానపల్లెలోని కంకర గురివిరెడ్డి జూనియర్ కళాశాలలో చదివింది. అక్కడ బైపీసీ గ్రూపు తీసుకొని 1000 మార్కులకు 952 మార్కులు తెచ్చుకొని అందరి మన్ననలు పొందింది. కాగా ఈ ఏడాది జూన్ నెలలో పోస్టల్‌శాఖ విడుదల చేసిన ఫలితాల్లో సుప్రియ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఈమెను నంద్యాల పోస్టల్ డివిజన్లోని బురుజుపల్లె పోస్టాఫీసులో బీపీఎంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. మూడేళ్లుగా అమ్మ ఒడికి దూరం.. చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన సుప్రియ జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని అందుకోలేకపోయింది. వాస్తవానికి సుప్రియ తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు బతికి ఉన్నా ఆమెకు అమ్మ ఒడి వర్తించేది. ఇద్దరూ చనిపోవడంతో సుప్రియ మేనమామ గడ్డం ఓబులేసు ఆమెకు సంరక్షకుడిగా ఉన్నారు. అయితే ఓబులేసుకు కూడా 3వ తరగతి చదివే కుమారుడు ఉండడంతో ఆ అబ్బాయికి అమ్మఒడి వర్తించింది. ఒక కుటుంబంలో ఒక్కరికే అమ్మఒడి అనే నిబంధన ఉండడంతో సుప్రియకు అమ్మ ఒడి వర్తించలేదు. తల్లిదంద్రలు ఇరువురూ చనిపోయిన పిల్లలకు అమ్మఒడి డబ్బులను సంరక్షకుల పేరు మీద కాకుండా విద్యార్థుల బ్యాంకు ఖాతాలో పడేలా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సవరిస్తే తనలాంటి వారికి ఎందరికో మేలు జరుగుతుందని సుప్రియ అంటున్నారు. -
సంక్షేమ పథకాలు జగనన్నతోనే సాధ్యం
మైలవరం (జమ్మలమడుగు రూరల్): రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే జగనన్నతోనే సాధ్యమవుతుందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం మైలవరం మండలంలోని వేపరాలలో ఎంపీటీసీ–2 ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రతి ఒక్కరినీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులుగా ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందజేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వారి కార్యకర్తలకే పథకాలు లభించేవని విమర్శించారు. అంతే కాకుండ తెదేపా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చెనేతలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందన్నారు. జగనన్న చెనేతల కష్టాలను గుర్తించి అర్హులైన ప్రతి చెనేతకు ప్రతి ఏడాది రూ.24 వేలు వారి ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి చైర్మన్ బడిగించల విజయలక్ష్మీ, ఎంపీటీసీలు నారే రాము, కుమారస్వామి, బడిగించల చంద్రమౌళి, ఎంపీడీఓ వై.రామచంద్రారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ ధన్నవాడ మహేశ్వర్‌రెడ్డి, స్థానిక నాయకులు బాలక్రిష్ణ, నాగేంద్ర, శంకర్, శ్రీనివాసులురెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదు: ఎమ్మెల్యే వసంత
సాక్షి, మైలవరం: వర్షాలు ఆగగానే రోడ్ల మరమ్మతులు, నిర్మాణం చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా పనీపాటా లేని టీడీపీ నాయకులు మాట్లాడడం తగదని మైలవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. టీడీపీ జూలో రకరకాల జంతువులతో ఏదేదో మాట్లాడిస్తున్నాడు అని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఓ పందికొక్కు విమర్శలు చేస్తోందని ఎద్దేవా చేశారు. ఈ రెండేళ్లలో 1,883 కిలోమీటర్ల తారు రోడ్ల నిర్మాణం జరిగిందని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తెలిపారు. టెండర్లు పూర్తయ్యాయని.. అయితే వర్షాకాలంతో పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. టీడీపీ హయాంలో రోడ్లు వేసి ఉంటే ఈ రెండున్నర ఏళ్లలోనే ఇంత పెద్ద గుంతలు పడ్డాయా? అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి స్థాయి ఏమిటో మీ నాయకుడికి బాగా తెలుసు ఆయన గురించి మాట్లాడే స్థాయి, అర్హత టీడీపీలోని వారెవ్వరికీ లేదని స్పష్టం చేశారు. అలా మాట్లాడిస్తే నీ స్థాయే దిగజారుతుందనేది చంద్రబాబు గుర్తించాలని హితవు పలికారు. రోడ్లు బాగున్నాయని మేము చెప్పడం లేదు.. కానీ కరోనాతో టెండర్లు సకాలంలో పూర్తి కాలేదని తెలిపారు. దీంతోపాటు వర్షాకాలంతో పనులు ప్రారంభం కాలేదని వివరించారు. రూ.7,500 కోట్లతో రహదారులను ఏడాదిలో పూర్తి చేస్తామని అప్పటి పంచాయతీరాజ్ మంత్రిగా చెందిన ప్రబుద్ధుడి వల్లే ఈ గోతులు పడ్డాయని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ చెప్పారు. -
ఎన్ని సోడాలు కొట్టి ఎమ్మెల్యే అయ్యావో చెప్పు ఉమా..?
సాక్షి, మైలవరం: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మైలవరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేవినేని ఉమాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయాల్లోకి రాకూడదంటూ ఉమా చేసిన వ్యాఖ్యలకు కౌంటరిస్తూ.. గతంలో రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్కి, నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యకు టీడీపీ ఎందుకు టికెట్ ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నోటికి అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడుతున్న ఉమా.. ఎన్ని సోడాలు కొట్టి ఎమ్మెల్యే అయ్యాడో చెప్పాలని నిలదీశారు. నీ వదిన చావుకు కారణం నువ్వే అని ప్రజలందరూ అనుకుంటున్నారు, దీనికి సమాధానం ఏంటి. చెరువు మాధవరంలో సొంత పార్టీ కార్యకర్తనే ఆదుకోలేని నువ్వు, రాజకీయాలు చేయడం మానుకుంటే మంచిదని వసంతకృష్ణప్రసాద్ హితవుపలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విమర్శించడం నీలాంటి పనీ పాటా లేని వాళ్లకు అలవాటైపోయిందని ఆయన మండిపడ్డారు. కోవిడ్ పరీక్షల విషయంలో కానీ.. కోవిడ్ నియంత్రణలో కానీ.. తమ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. గొల్లపూడిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా దిశా యాప్ ఆవిష్కరణ చేయడం ఆనందకరమని, మహిళలంతా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. -
మాజీ మంత్రి ఉమా ప్లాన్ రివర్స్
మైలవరం: మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావుకు మైలవరంలో ఘోర పరాభవం ఎదురైంది. చాలా కాలం తర్వాత పార్టీ నాయకులతో కలసి బుధవారం ఉమా ఇక్కడికి వచ్చారు. స్థానిక దళితవాడ నుంచి నలుగురు మహిళలను వెంటబెట్టుకుని అయ్యప్పనగర్‌లో పేదల కోసం ఏర్పాటు చేసిన ప్లాట్లలోకి వెళ్లారు. నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన ఆ ప్లాట్లను వారికి ఇవ్వలేకపోతున్నారని ఆరోపిస్తూ సీఎం వైఎస్ జగన్‌ను, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ను ఆ మహిళలతో తిట్టించే ప్రయత్నం చేశారు. అయితే ఈ పథకం బెడిసి కొట్టింది. గతంలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ఇప్పుడు సరిహద్దు రాళ్లు కూడా పీకేశారని గ్రామానికి చెందిన పచ్చిగోళ్ల మరియమ్మ మాట్లాడుతూ.. ఆ రాళ్లు పీకేయించిన ఉమాని బట్టలూడదీసి కొట్టాలని అనడంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. వెంటనే ఉమాతో సహా పార్టీ నాయకులు అక్కడి నుంచి జారుకున్నారు. -
మైలవరం: టీడీపీ నేత దేవినేని ఉమాకు చేదు అనుభవం
సాక్షి, కృష్ణా: మైలవరంలో టీడీపీ నేత దేవినేని ఉమాకు చేదు అనుభవం ఎదురైంది. ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వంపై బురదజల్లే యత్నంలో దేవినేని ఉమా భంగపాటుకు గురయ్యారు. ఇళ్ల స్థలాల వద్దకు దళిత మహిళలను దేవినేని ఉమా తీసుకెళ్లగా.. ఆయనపై దళిత మహిళలు తిరగబడ్డారు. దేవినేని ఉమా అండ్ కోపై తిట్ల పురాణంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని పరిణామం ఎదురు కావడంతో దేవినేని ఉమా, అతని సభ్యులు అక్కడి నుంచి జారుకున్నారు. -
లక్ష కావాలని ట్రంకు పెట్టె తెరిచి చూస్తే షాక్!
సాక్షి, మైలవరం : కష్టపడి సంపాదించిన రూపాయి రూపాయినీ కూడబెట్టాడు. అలా ఐదు లక్షలు జమచేశాడు. బ్యాంకు ఖాతా లేదు.. ఇంట్లో వాళ్ల మీద నమ్మకంలేదు.. ఇక ఎక్కడ దాచుకోవాలో తెలీక ఇంట్లో మూలనున్న ట్రంకు పెట్టెలోనే భద్రం చేశాడు. అదే అతనికి చేటు చేసింది. కష్టార్జితం అంతా చెదల పాలైంది. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్లంతా లబోదిబోమంటున్నారు. కృష్ణాజిల్లా మైలవరంలో వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలివీ.. మైలవరం–విజయవాడ రోడ్డులోని వాటర్ ట్యాంక్ వద్ద ఉంటున్న బిజిలీ జమలయ్య పందుల వ్యాపారి. తనకొచ్చే ఆదాయాన్ని కొద్దికొద్దిగా కూడబెడుతూ వచ్చాడు. బ్యాంకు ఖాతా లేకపోవడం.. ఇంట్లో వారి మీద నమ్మకం లేకపోవడంతో దాచుకుంటున్న సొమ్మును ఇంట్లోని ఓ ట్రంకు పెట్టెలో భద్రపరిచాడు. అలా రూ.5లక్షలు పోగుచేశాడు. ఇంకో ఐదు లక్షలు కలిపి సొంతిల్లు కట్టుకుందామనుకున్నాడు. ఇంతలో లక్ష రూపాయల అవసరం ఏర్పడింది. దీంతో ట్రంకు పెట్టె తెరిచి షాకయ్యాడు. ఎంతో భద్రంగా దాచుకున్న నోట్లకు చెదలు పట్టడం చూసి సొమ్మసిల్లి పడిపోయాడు. ఉదయాన్నే కుటుంబ సభ్యులు నోట్ల కట్టలు తీసి మంచంపై వేసి లెక్కపెట్టడం ప్రారంభించారు. ఈ విషయం బయటికి పొక్కడంతో పోలీసులు రంగంలోకి దిగి జమలయ్య ఇంటికి వెళ్లి అంత సొమ్ము ఎలా వచ్చిందంటూ ఆరా తీశారు. పోలీసులను చూడగానే కుటుంబ సభ్యులు బావురుమంటూ తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. -
తాళం పగలగొట్టి.. క్వారంటైన్ నుంచి పరారీ
సాక్షి, మైలవరం: కృష్ణా జిల్లా మైలవరంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం నుంచి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడకి చెందిన మక్కా వెంకటేశ్వరరావు(33), నరసమ్మ (30) అనే మహిళ నాలుగు రోజుల క్రితం మైలవరం బంధువులు ఇంటికి రాగా.. స్థానికులు సమాచారం ఇవ్వడంతో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించి ముందు జాగ్రత చర్యల్లో భాగంగా అధికారులు వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. (ఏపీలో కొత్తగా మరో 80 కరోనా కేసులు) గురువారం తెల్లవారు జామున క్వారంటైన్ కేంద్రం వెనుక గేట్ తాళం పగలకొట్టి ఇద్దరు పరారైనట్లు సిబ్బంది గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేస్తున్నారు. పరారైన ఇద్దరు కోదాడ పట్టణానికి చేరినట్లు సమాచారం. వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
కూతురిని చూసుకునేందుకు వస్తూ..
సాక్షి, ఇబ్రహీంపట్నం(విజయవాడ) : వారం రోజల క్రితం భార్య పండంటి ఆడపిల్లకు జన్మనివ్వడంతో, కూతురును తొలిసారిగా చూసుకునేందుకు ఆతృతగా వస్తున్న ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తాను డ్రైవ్ చేసుకుంటూ వస్తూ వేరే వాహనాన్ని ఢీకొని కారు పల్టీకొట్టడంతో దుర్మరణం పాలయ్యాడు. ఇబ్రహీంపట్నం వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌లోని కర్ణాటక బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న భవానీపురానికి చెందిన ఒమ్మి హరి ఉదయప్రసాద్ యాదవ్ (28) చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. బ్యాంకుకు శని, ఆదివారం సెలవులు రావటంతో ఉదయప్రసాద్ యాదవ్ తన కారులో శుక్రవారం ఇంటికి బయలు దేరాడు. మార్గమధ్యలో ముగ్గురు ప్రయాణికులను కూడా కారులో ఎక్కించుకున్నాడు. ఇబ్రహీంపట్నం సమీపంలోకి వచ్చే సమయానికి కారు గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి రోడ్డుపక్కన పల్టీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవింగ్ సీట్లో ఉన్న ఉదయప్రసాద్ యాదవ్ తీవ్ర రక్తస్రావానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పక్క సీట్లో ఉన్న విశాఖపట్నంకు చెందిన కొడగల మునీంద్ర తలకు బలమైన గాయమైంది. వెనక సీట్లో కూర్చున్న అక్కిరెడ్డి శేఖర్ (విశాఖపట్నం), బెజ్జం నాగరాజు (గుంటూరు)కు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం విజయవాడ వైద్యశాలకు తరలించారు. మృతుడికి ఏడాది క్రితం వివాహమైంది. భార్య వారం రోజుల క్రితం ఆడ పిల్లకు జన్మనిచ్చింది. భార్య, కుమార్తెను చూసేందుకు వస్తుండగా ఉదయప్రసాద్ యాదవ్ మృత్యువాతకు గురి కావటంతో ఆ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా ఏ కొండూరు వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకొంది. గణపతి బప్పా మోరియా అంటూ వినాయకుడ్ని నిమజ్జనం చేసేందుకు తండాలోని చెరువులో దిగిన ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. అందరూ చూస్తుండగానే వాళ్లంతా జలసమాధి అయ్యారు . చెరువులో నిమజ్జన చేసే ప్రదేశం లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి ఊపిరి ఆడక ముగ్గురు యువకులు ప్రాణాలు వదిలారు. మృతులు బాణవతు గోపాలరావు,భూక్యా శంకర్, భూక్యా చంటిగా గుర్తించారు. మరోవైపు సంఘటన స్థలానికి చేరుకున్న ఏ-కొండూరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చెసి అతికష్టం మీద మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ఆసుపత్రికి తరలించారు. అప్పటివరకూ ఎంతో సరదాగా గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న యువకులు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. -
కృష్ణా జిల్లాలో ఐదు పంచాయతీలకు పట్టణ హోదా
సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో కొత్తగా మరో ఐదు నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. 20వేల జనాభాకు పైబడిన మేజర్ పంచాయతీలు త్వరలో నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. నెలాఖరులోగా ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ప్రస్తుతం మూడుగా ఉన్న నగర పంచాయతీల సంఖ్య ఎనిమిదికి చేరుతుంది. జిల్లాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, పెడన మున్సిపాలిటీలుండేవి. ఆ తర్వాత ఉయ్యూరు, తిరువూరు, నందిగామ పంచాయతీలను 2011లో నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేశారు. కాగా ఇటీవలే మచిలీపట్నం మున్సిపాలిటీని జూలై 3వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జిల్లాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలున్నాయి. తాజాగా 20వేల జనాభా కల్గిన మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో కొత్తగా మరో ఐదు మేజర్ పంచాయతీలు గ్రేడ్–3 మున్సిపాల్టీలు(నగర పంచాయతీలు) ఏర్పాటు కాబోతున్నాయి. దశాబ్దకాలంగా పెండింగ్.. దశాబ్దకాలంగా ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. 2015 మేలో అప్పటి ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు కోరినా నగర పంచాయతీల ఏర్పాటు మాత్రం కార్యరూపం దాల్చలేదు. కాగా 500 జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామన్న ప్రభుత్వం అదే దిశగా 20వేల జనాభాకు పైబడిన మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలు అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించింది. ప్రకటనలతో సరిపెట్టకుండా వెంటనే కార్యచరణలో పెట్టింది. ఐదు పంచాయతీలు ఇవే.. జిల్లాలోని అవనిగడ్డ, కైకలూరు, మైలవరం, పామర్రు, విస్సన్నపేట పంచాయతీలు నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. 2019 ప్రొజెక్టడ్ జనాభా లెక్కల ప్రకారం అవనిగడ్డ పంచాయతీ జనాభా 27,298, కైకలూరులో 24,486, మైలవరంలో 25027, పామర్రులో 24,604, విస్సన్నపేటలో 20,530 మంది జనాభా ఉన్నారు. ఈ లెక్కన చుట్టుపక్కల పంచాయతీలు, గ్రామాలను విలీనం చేయకుండానే ఈ ఐదు పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసే వీలుంది. అయితే అవనిగడ్డ నగర పంచాయతీలోకి పులిగడ్డ, రామకోటిపురం పంచాయతీలతో పాటు వేకనూరు పంచాయతీ పరిధిలోని గుడివాకవారిపాలెంలను విలీనం చేయాలని ప్రతిపాదన ఉంది. అలాగే మైలవరం నగర పంచాయతీలోకి వేల్వాడు, పామర్రు నగర పంచాయతీలోకి కనువూరు, కురుమద్దాలి, విస్సన్నపేట నగర పంచాయతీలోకి చండ్రుపట్ల, పాతగుంట్ల పంచాయతీలు విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉంది. చుట్టుపక్కల పంచాయతీలు, గ్రామాల విలీనం చేసినా చేయకున్నా ప్రతిపాదిత ఐదు మేజర్ పంచాయతీలకు పట్టణ హోదా పొందనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ప్రతిపాదనలు రాగానే వాటిని కేబినెట్లో పెట్టి ఆమోద ముద్ర వేయడం.. నగర పంచాయతీల ప్రకటించడం లాంఛనమే కానుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు జూలై 31వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ పరిపాలనా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఐదు మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపిస్తున్నాం. – జి.రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి -
హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి.. వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి.. క్షణికావేశం బంధాలకు దూరం చేస్తున్నాయి.. ఆవేశంలో చిన్నారుల ముందే దారుణాలకు పాల్పడుతున్నారు.. భర్త వివాహేతర సంబంధాని ప్రశ్నించడంతో వేధింపులకు గురిచేశారు.. చివరికి పక్కా ప్రణాళికతో దారుణానికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటనే దొనబండలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సాక్షి, ఇబ్రహీంపట్నం(కృష్ణా) : మహిళను బంధువులే దారుణంగా హత్య చేసిన ఘటన మండలంలోని దొనబండ బీసీ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన గుంజా లక్ష్మమ్మ(28)ను అదే గ్రామానికి చెందిన ఏడుకొండలు పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. లారీ డ్రైవర్‌గా పనిచేసే ఏడుకొండలు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏడాది క్రితం ఆ మహిళతో హైదరాబాద్‌కు వెళ్లి వేరే కాపురం పెట్టాడు. దీంతో న్యాయం చేయాలని లక్ష్మమ్మ పోలీసులను ఆశ్రయించింది. స్థానికులతో కలసి 65 నంబర్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగింది. హైవేపై ధర్నా చేసినందుకు కొంతమంది గ్రామస్తులతో పాటు లక్ష్మమ్మపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు భర్త ఫోన్ నంబర్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి అతడిని రప్పించారు. కోర్టులో కేసు నడుస్తోంది. ఏడాదిగా భర్తతో పాటు అత్తామామలు ఆమెతో ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. బుధవారం కోర్టు వాయిదా ఉండడంతో వివాదం చోటుచేసుకుంది. ఎలాగైనా వదిలించుకోవాలకుని శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మమ్మను అత్తామామలు గుంజా దుర్గ, ఆర్ముగం, బావ మునియప్ప కలసి దారుణంగా హత్య చేసినట్లు సమాచారం. తల్లిని చంపారంటూ.. తల్లి లక్ష్మమ్మను బంధువులు ఏ విధంగా చేసింది చిన్నకుమార్తె(6) స్థానికులకు, బంధువులకు చెబుతోంది. హత్యచేసిన అనంతరం ముగ్గురు గ్రామం విడిచి పారిపోయారు. లారీ డ్రైవర్‌గా డ్యూటీలో ఉన్న భర్త ఏడుకొండలు ఈ హత్యకు పక్కా ప్రణాళిక రచించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న ఇబ్రహీంపట్నం సీఐ శ్రీధర్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి జరిగిన విషయాన్ని బంధువుల నుంచి సేకరించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. -
జీతాలు చెల్లించండి బాబోయ్
సాక్షి, మైలవరం(కృష్ణా) : గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో పేదలు నరకయాతన పడుతున్నారు. ఉపాధి కోసం స్కూళ్లలో చేరిన పారిశుద్ధ్య కార్మికులను రెండేళ్లుగా జీతాలు చెల్లించకుండా ఆటలాడుకుంటున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం 2014లో స్వీపర్లును నియమించింది. నెలకు రూ.1500 చెల్లించే విధంగా చర్యలు తీసుకుంది. తొలి ఏడాది అరకొరగా జీతాలు చెల్లించి తరువాత రెండు, మూడు నెలలకు ఒకసారి ఒక నెల జీతం చెల్లిస్తూ కాలయాపన చేశారు. దీంతో స్వీపర్లు సంక్షోభంలో పడ్డారు. ప్రస్తుతం జీతాలు లేక పాఠశాల ప్రధానోపాధ్యాయుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 4500 పాఠశాలలు ఉండగా 1200 పాఠశాలల్లోనే స్వీపర్లును నియమించారు. కొన్ని పాఠశాలల్లో గతం నుంచి పనిచేస్తున్న అటెండర్లతోనే ఇతర పనులు కూడా చేయిస్తున్నారు. 23 నెలలుగా వారికి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. స్వీపర్లు అనేక సార్లు వేతనాలు చెల్లించాలని పలు మార్లు నిరసన తెలిపినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. మైలవరం నియోజకవర్గంలో 120 మంది స్వీపర్లు పనిచేస్తున్నారు. నందిగామ మండలంలో జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు 56వరకు ఉన్నాయి. నూజివీడు మండలంలో 85 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. తిరువూరు మండలంలో 61 జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. జగ్గయ్యపేట మండలంలో 59 పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని 4,500 పాఠశాలల్లో కేవలం 1200 పాఠశాలల్లో మాత్రమే స్వీపర్ల నియామకం జరిగింది. మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కాని పట్టించుకున్న నాథుడే లేడు. -
డిగ్రీ ఫైనలియర్‌లోనే ఐదు ఉద్యోగాలు!
సాక్షి, జమ్మలమడుగు: పెద్ద పెద్ద చదువులు చదివి ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అనుకునే వారికి ఈ పేదింటి బిడ్డ ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగం పొందడానికి మరీ ఉన్నత చదువులే అక్కరలేదని నిరూపించి శభాష్ అనిపించుకుందీ అమ్మాయి. ఈమె ప్రతిభకు ఉద్యోగావకాశాలు దాసోహామయ్యాయి. ఒకటా రెండా ఏకంగా అయిదు సంస్థల్లో ఉద్యోగాలు ఈమె తలుపు తట్టాయి. చిన్నప్పటి నుంచి పట్టుదలగా చదివి రాణించడమే ఇందుకు కారణం. వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం వేపరాలలో చేనేత కుటుంబానికి చెందిన బడిగించల క్రిష్టమూర్తి, రుణ్మికీల కుమార్తె భాగ్యలక్ష్మి. 10వ తరగతి వరకు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. జమ్మలమడుగులోని ఎస్పీ జూనియర్, డీగ్రీకాలేజీలో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ చేసింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో 9.5 శాతం, రెండో సంవత్సరంలో 9.3 శాతం మార్కులు సాధించింది. ప్రస్తుతం మూడో సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం నిరీక్షిస్తోంది. చదువు సాగిస్తూనే తల్లితండ్రులకు ఆసరాగా ఉండాలని ఇంట్లో దుస్తులు కుడుతోంది. బాల్యం నుంచి పట్టుదల మెండుగా ఉన్న భాగ్యలక్ష్మి ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం అలవాటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి తిరుపతిలో విప్రో, టీసీఎస్.. కాకినాడలో క్యాప్ జెమినీ, హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ కంపెనీలు సెలెక్షన్లు నిర్వహించాయి. రాసిన ప్రతి పరీక్షలోనూ ఈమెను విజయం వరించింది. ఉద్యోగవకాశాలు తలుపు తట్టాయి. కంపెనీలు ఆఫర్ లెటర్లు పంపాయి. ఏకంగా ఐదు ఉద్యోగాలకు అర్హత సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. భాగ్యలక్ష్మి ప్రతిభకు వేపరాల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ ఫలితాలు వచ్చాక ఇందులో మంచి ఆఫర్‌ను ఎంపిక చేసుకుని చేరతానని భాగ్యలక్ష్మి ‘సాక్షి’తో చెప్పింది. చదువుతోపాటే భవిష్యత్‌కు బాటవేసుకోవాలని... ప్రతిభను చాటుకుంటే కచ్చితంగా ఉద్యోగావకాశాలు వస్తాయని జమ్మలమడుగుకు చెందిన విద్యావేత్త పి.నాగేశ్వరరెడ్డి చెప్పారు. -
రాక్షస పాలన అంతం చేయండి
పప్పు.. గన్నేరు పప్పు! ‘‘ఇవాళ ఉదయం ఓ అన్న నాతో చెప్పాడు... నారా లోకేష్ పప్పు అయితే ఆయన తండ్రి చంద్రబాబునాయుడు గన్నేరు పప్పు అట. ఈ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రమాదకరమే. రాష్ట్రాన్ని లూటీ చేశారు. నారారూప రాక్షసుల పాలనను అంతమొందించండి’’ – ఇబ్రహీంపట్నం సభలో... పొరపాటున కూడా నమ్మొద్దు ‘‘2014 ఎన్నికలకు ముందు హోదా అన్నావ్.. తర్వాత బీజేపీతో కుమ్మౖక్కై ప్యాకేజీకి ఒప్పుకున్నావ్.. మళ్లీ హోదా అంటున్నావ్. రోజుకో మాట, పూటకో వేషం. ఆయన్ను నమ్మి మళ్లీ మోసపోతే రాష్ట్రం అంధకారమే’’ ఈ అన్న అప్పుడు ఏమయ్యాడు? ‘‘చంద్రబాబు కొత్తగా ఆడపడుచులకు అన్ననని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ రౌడీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లినప్పుడు ఈ అన్న ఎక్కడకు వెళ్లాడు? అంగన్వాడీ కార్యకర్తలను లాఠీలతో చితకబాదితే ఎటు పోయాడు? రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడితే ఏమయ్యాడు? విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ కుంభకోణం నడిచింది ఈ అన్న కనుసన్నల్లో కాదా? భవానీనగర్‌లో పాఠశాల వద్ద మద్యం దుకాణం తొలగించాలని మహిళలు ధర్నా చేస్తే లాఠీలతో కొట్టించి జైలుకు పంపింది ఈ అన్న కాదా? ఇటువంటి వ్యక్తిని నమ్మి మోసపోవద్దని అక్కచెల్లెమ్మలను హెచ్చరిస్తున్నా’’ – విజయవాడ పంజాసెంటర్ సాక్షి, అమరావతి బ్యూరో: అవినీతి, అబద్ధాలు, అరాచకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మారుపేరని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. చంద్రబాబు అవినీతిని ఆయన ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లాం కూడా నిర్ధారించారని గుర్తు చేశారు. ‘ఐదేళ్ల బాబు పాలనలో గత 40 ఏళ్లలో చేయనన్ని అప్పులు చేశారని మాజీ సీఎస్‌లు చెబుతున్నారు. తండ్రీ కొడుకులు కలసి రాష్ట్రాన్ని లూటీ చేశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు’ అని షర్మిల మండిపడ్డారు. రోడ్‌షో, బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం విజయవాడ, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేటలో జరిగిన సభల్లో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. కాపీ కొట్టి హామీలిస్తున్నారు.. ‘‘వైఎస్సార్ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు భరోసాగా జీవించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను దగా చేశారు. పసుపు–కుంకుమ పేరిట ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నారు. ఆ డబ్బులు డ్వాక్రా రుణాల వడ్డీకి కూడా సరిపోవు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ నుంచి కార్పొరేట్ ఆస్పత్రులను తొలగించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆస్పత్రికెళ్లి వైద్యం చేయించుకుంటారా? గత ఎన్నికల్లో 600కిపైగా హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను కాపీ కొట్టి కొత్త హామీలిస్తున్నాడు. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ తిరుగుతున్న దొంగబాబును ఇంటికి పంపండి. ఐదేళ్ల పాలన గురించి ప్రజలకు చెప్పి ఓట్లడిగే ధైర్యం చంద్రబాబుకు లేదు. హైదరాబాద్ అంతా నేనే కట్టానంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుని సీఎం అయ్యాడు చంద్రబాబు. అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇస్తే ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదు. కనీసం ఓ ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేదు. ఆ డబ్బంతా మింగేశారు. ఆయన కోసం మాత్రం హైదరాబాద్‌లో ఒక పర్మినెంట్ బిల్డింగ్ కట్టుకున్నాడు. ఓటు అడిగితే తక్షణమే బకాయిలివ్వమనండి బాబొచ్చాక ఆయన కుమారుడికి తప్పితే జాబులు ఎవరికి వచ్చాయి? జయంతి, వర్థంతికి కూడా తేడా తెలియని పప్పుగారిని ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారు. యువతకు మాత్రం ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు. టీడీపీ నేతలు ఓట్ల కోసం వస్తే గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల బకాయిలను వడ్డీతో సహా తక్షణమే చెల్లించమని నిలదీయండి. అది మీ హక్కు. కేసీఆర్‌తో చంద్రబాబు కాళ్ల బేరం! ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తుంది. టీడీపీకి ఓటమి తప్పదు. ఇదే విషయాన్ని పలు జాతీయ సర్వే సంస్థలు కూడా తేల్చి చెప్పాయి. చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు మాకు ఎవరితోనూ పొత్తులు లేవు. వైఎస్సార్సీపీకి ఆ అవసరం కూడా లేదు. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు జనసేన, కాంగ్రెస్‌లతో కలసి తోడుగా వస్తున్నారు. హరికృష్ణ మృతదేహం సాక్షిగా కనీస ఇంగితం కూడా లేకుండా కేసీఆర్‌తో పొత్తుల కోసం వెంపర్లాడింది చంద్రబాబే. టీఆర్ఎస్తో పొత్తు కోసం కేసీఆర్ కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు బాబు. ధర్మాన్ని గెలిపించండి.. పౌరుషం, రోషం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. తండ్రి లాంటి పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి కుర్చీని, పార్టీని లాక్కున్నాడు. ఒకవైపు సొంత మామనే మోసగించిన చంద్రబాబు, మరోవైపు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్‌ను వీడి ఒంటరిగా బయటకు వచ్చిన జగనన్న మన ముందు ఉన్నారు. మంచికి, చెడుకు మధ్య యుద్ధం జరుగుతోంది. ధర్మం, అధర్మానికి మధ్య పోరాటం జరుగుతోంది. విశ్వసనీయత, వెన్నుపోటుకు మధ్య జరుగుతున్న యుద్ధంలో న్యాయం వైపు నిలిచి జగనన్నను గెలిపించండి. జగనన్న తొమ్మిదేళ్లుగా నీతివంతమైన రాజకీయాలు చేశారు. ప్రతి కష్టంలోనూ ప్రజల పక్షాన నిలిచారు. 3,648 కి.మీ పాదయాత్ర చేసి సమస్యలను దగ్గరగా చూశారు. అధికారం కోసం నిలబెట్టుకోలేని హామీలను జగనన్న ఎప్పుడూ ఇవ్వలేదు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేదు. ఈ అవినీతి పాలన అంతం చేయండి. అంతా బైబై బాబు.. అని ప్రజాతీర్పు చెప్పండి’’ -
మైలవరం బహిరంగ సభలో వైఎస్ జగన్
-
బాబు వస్తే గవర్నమెంటు స్కూళ్లుండవ్: వైఎస్ జగన్
సాక్షి, మైలవరం : మైలవరంలో దౌర్జన్యాలు, గూండాయిజం, రౌడీయిజం టీడీపీ హయాంలో బాగా పెరిగిపోయాయని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసగించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇదే మైలవరం నియోజకవర్గం నుంచి తన సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేశానని గుర్తు చేశారు. ఇక్కడి పోలీసులు టీడీపీకి ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక డీఎస్పీ నాగేశ్వరరావు వైఎస్సార్సీపీ బహిరంగ సభలకు ఆటంకాలు కల్పిస్తున్నారని, సభ సజావుగా సాగకుండా ఉండేందుకు లారీలను రోడ్డుకు అడ్డంపెట్టి ఆటంకాలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఇసుకను ఇక్కడి మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఏవిధంగా దోచుకుంటున్నాడో ప్రజలు ఒక్కసారి గమనించాలన్నారు. ప్రభుత్వమేమో ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నామని ప్రచారం చేసుకుంటుంది..కానీ లారీ ఇసుక మార్కెట్లో రూ.40 వేలకు అమ్ముతున్నారు.. ఇసుక మీకు ఉచితంగా ఇస్తున్నారా అని ప్రజల్ని ప్రశ్నించారు. పుష్కరాల ఘాట్లు ఏమయ్యాయ్ ఇదే నియోజకవర్గంలో కృష్ణా పుష్కరాల సమయంలో వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఘాట్లు, రోడ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అనుమతి లేని కంకర క్వారీలు నిర్వహిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మైలవరంలో టీడీపీ నాయకులు మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారని ఆరోపణలు గుప్పించారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దేవినేని ఉమ జలవనరుల శాఖా మంత్రిగా ఉన్నా కూడా ఇక్కడి పంట పొలాలకు నీటి సౌకర్యం కల్పించలేని అసమర్ధుడన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఏ మాత్రం నీళ్లు తీసుకురాగలిగాడని ప్రశ్నించారు. బుడమేరుపై తారకరామ ఎత్తిపోతల పథకం ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. పోలవరం కుడి కాలువ పొడవు 174 కిలోమీటర్లు.. వైఎస్ హయాంలో 145 కిలోమీటర్లు పూర్తి చేశారు. చంద్రబాబు కేవలం రెండు కిలోమీటర్లు కాలువ తవ్వి అంతా మేమే పూర్తి చేశామని డబ్బా కొట్టుకుంటున్నాడు.. ఇలాంటి నాయకుల్ని ఏమనాలని ప్రశ్నించారు. మైలవరంలో ప్రజలు తాగునీటికి కూడా అల్లాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. మామిడి రైతుకు దక్కని గిట్టుబాటు ధర మామిడి రైతులకు బంగినపల్లి టన్ను రూ.35 వేల ధర ఉంటే కానీ గిట్టుబాటు కానీ పరిస్థితి ఉందని, కానీ ప్రస్తుతం టన్నుకు రూ.8 వేలకు కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉందని అన్నారు. బాబు హయాంలో పంటలకు మద్ధతు ధర లభించే పరిస్థితి లేదన్నారు. బాబు వస్తే గవర్నమెంటు స్కూళ్లుండవ్! పొరపాటున మళ్లీ గనక బాబు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లు ఉండవన్నారు. ఇప్పటికే 6 వేల ప్రభుత్వ స్కూళ్లు అకారణంగా మూసేశారని ఆరోపించారు. స్కూళ్లలో టీచర్లను భర్తీ చేయరు..విద్యార్థులకు పుస్తకాలు అందించరు..మధ్యాహ్నా భోజన బిల్లులు సకాలంలో చెల్లించరు..బాబు పాలన ఈవిధంగా ఉందని ఎద్దేవా చేశారు. బాబు పాలనలో ప్రభుత్వ స్కూళ్లు మూసేసి నారాయణ స్కూళ్లు తెరుస్తారని ఆరోపించారు. నారాయణ స్కూళ్లల్లో సంవత్సరానికి ఎల్కేజీ చదవాలంటే ప్రస్తుతం రూ.25 వేలు అవుతోందని, పొరపాటున బాబొస్తే ఫీజు లక్ష రూపాయలకు చేరుతుందని చెప్పారు. ఇంజనీరింగ్ చదవాలన్నా ప్రస్తుతం రూ.లక్ష అవుతోందని, బాబొస్తే గనక ఈసారి రూ.5 లక్షలకు పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. చార్జీలు బాదుడే బాదుడు.. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఆర్టీసీ, కరెంటు చార్జీలు ఎలా పెంచాడో అందరికీ తెలుసునని, ఇంటిపన్నులు, కుళాయి పన్నులు, పెట్రోలు, డీజీల్ రేట్లు ఎలా పెరిగాయో అందరూ చూశారు..మళ్లీ గనక బాబొస్తే ఇక వీరబాదుడేనని వ్యాఖ్యానించారు. బాబు అధికారంలోకి రాకముందు 46 లక్షల పెన్షన్ కార్డులు ఉండేవని, అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పెన్షన్ కార్డులు తొలగించాడని ఆరోపించారు. చంద్రబాబు భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారని, ఆయన గనక మళ్లీ అధికారంలోకి వస్తే పేదల భూములకు రక్షణ ఉండదని అన్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను ఏర్పాటు చేశారని, ఊర్లో పేదలకు ఏమి ఇవ్వాలన్నా కూడా వారు మీది ఏపార్టీ అని అడుగుతారని అన్నారు. మీరు ఏ సినిమా, టీవీ, పత్రిక చూడాలో కూడా వారే నిర్ణయిస్తారని చెప్పారు. చంద్రబాబు ప్రధాన పాత్రలో ఈ నడుమ మహానాయకుడనే ఒక సినిమా వచ్చింది.. చాలా బాగుందట..అందరూ చూడాలట.. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం చూడకూడదట.. పరిస్థితి ఇది.. మీరు ఏ సినిమా చూడాలో ఏ సినిమా చూడకూడదో వారే నిర్ణయిస్తారు.. ఒకసారి గమనించాలని కోరారు. బాబు వస్తే ఉచిత విద్యుత్ ఉండదు పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌కు బాబు మంగళం పాడతారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. రూ.1000 పైన ఖర్చు అయ్యే ప్రతి జబ్బును కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. గ్రామానికి 10 ఇళ్లు కూడా బాబు హయాంలో నిర్మించలేదని తెలిపారు. జన్మభూమి కమిటీ సభ్యులకు లంచాలు ఇస్తే గానీ పనులు కావటం లేదన్నారు. బాబు గతాన్ని ఒక్కసారి పరిశీలించండి.. 1994 సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి రావడానికి సంపూర్ణ మద్యనిషేదం, కిలో 2 రూపాయలకే బియ్యం పథకాలు పెట్టింది.. అధికారంలోకి రాగానే చంద్రబాబు, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నాడు.. కిలో బియ్యాన్ని 2 నుంచి ఐదున్నర రూపాయలకు పెంచాడు. మద్యపాన నిషేదాన్ని ఎత్తేశాడు. మాట తప్పడం చంద్రబాబు నైజమని ప్రజలు ఒక్కసారి గుర్తుచేసుకోవాలని కోరారు. బాబు గనక పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే తనను వ్యతిరేకించే ఎవ్వరినీ బతకనీయడని ఆరోపించారు. రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు తనకు నచ్చిన పోలీసులను పెట్టుకుని, సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలను ఏపీలోకి రానీయకుండా జీవోలు జారీ చేశాడని చెప్పారు. మనుషుల్ని చంపించి వాళ్ల బంధువులే చంపారని చిత్రీకరిస్తాడని, టీడీపీ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ అరాచకాలను చూయించవని వెల్లడించారు. బీసీలు జడ్జి పోస్టులకు పనికిరారని కొలీజియానికి చంద్రబాబు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టో నెరవేర్చకపోతే రాజీనామా చేసే పరిస్థితికి తీసుకురావాలని ప్రజల్ని కోరారు. 20 రోజులుగా చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టీవీ9, టీవీ5 ఛానళ్లు రోజుకొక పుకారు పుట్టించి చర్చ జరుపుతున్నాయని అన్నారు. డబ్బుల మూటలతో వస్తారు.. జాగ్రత్త ఎన్నికలకు ఒక రోజు ముందు ప్రతిగ్రామానికి డబ్బుల మూటలతో వస్తారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. బాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని ప్రతి ఒక్కరినీ కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పొదుపు సంఘాల మహిళల రుణాలన్నీ నాలుగు దఫాల్లో పూర్తిగా చెల్లిస్తామన్నారు. అలాగే సున్నావడ్డీకే మళ్లీ రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏడాది మే నెలలో రూ.12,500 పెట్టుబడి సహాయం అందిస్తామని వెల్లడించారు. 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ.75 వేలు చెల్లిస్తామన్నారు. పిల్లలను బడులకు పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ. 15వేలు అందిస్తామని చెప్పారు. అవ్వా, తాతలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామన్నారు. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తామని, నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. మైలవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్, విజయవాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వర ప్రసాద్‌లను ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పోస్టల్ ఓట్లకు నోట్ల గాలం!
సాక్షి, అమరావతి బ్యూరో/మైలవరం : జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఓటర్లను విపరీతమైన ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో గెలుపోటములను నిర్దేశించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అధికార టీడీపీ నేతలు గురిపెట్టారు. ఓటుకు రూ. వేయి, రెండు, మూడు వేలు ఇచ్చయినా పోస్టల్ బ్యాలెట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం మైలవరంలోని డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నాయకులు పైరవీలు చేస్తూ కనిపించడమే ఇందుకు నిదర్శనం. శిక్షణా శిబిరం వద్దే ప్రలోభాల పర్వం రెండు రోజులుగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ అధికారులకు, సహాయకులకు ఈవీఎమ్‌లు, వీవీ ప్యాట్ల వినియోగంపై శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 1200 మంది హాజరయ్యారు. వీరు ఈ నెల 11న జరిగే ఎన్నికల విధులకు హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారికి ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను అందజేశారు. దీంతో వారు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు శిక్షణా కేంద్రం వద్దకు చేరుకుని బ్యాలెట్ బాక్స్ వద్ద ఉండి మరీ ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేశారు. తపాలా ఓట్లపై నోట్ల వర్షం.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 వేల మంది ఉద్యోగుల కోసం జిల్లా వ్యాప్తంగా తపాలా బ్యాలెట్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటు జయాపజయాలను నిర్ణయించేది కావడంతో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ముందుగానే ప్రలోభాలకు తెర తీశారు. వారం, పది రోజుల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లోని ఉద్యోగుల వివరాలు సేకరించారు. తరువాత బేరాలకు దిగారు. నేరుగా ఉద్యోగులను, లేదా ఉద్యోగుల బృందాలను, సంఘాల నేతలను కలవడం, డబ్బు గుమ్మరించడం చేశారు. ఓటుకు రూ. వేయి నుంచి రూ. 3,000 వరకు ముట్టజెప్పినట్లు సమాచారం. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే తంతు కొనసాగింది. అలాగే పోలీసుల ఓట్లు తమ పార్టీకి అనుకూలంగా వేయించేలా నియోజకవర్గానికి ఓ డీఎస్పీని నియమించి బ్యాలెట్ పత్రాలు ఆ ఉన్నతాధికారికే ఇవ్వాలని పోలీసులపై ఒత్తిడి చేస్తుండటం తెలిసిందే. రహస్యం కాస్త బహిరంగం రహస్యంగా జరగాల్సిన పోస్టల్ బ్యాలెట్ ఎటువంటి రక్షణ లేకుండా బహిరంగంగా నిర్వహించడంపై ఎన్నికల అధికారులపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు దగ్గర ఉండి ఆంగన్వాడీ కార్యకర్తలను, ఆశా వర్కర్లను ప్రలోభాలకు గురిచేస్తుండటం పట్ల ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. చివరకు మీడియాకు విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శిక్షణా శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా టీడీపీ నాయకులను బయటకు పంపి చేతులు దులుపుకున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. -
వివాదస్పదంగా రిటర్నింగ్ అధికారి నిర్ణయం
సాక్షి, కృష్ణా : నామినేషన్ల పరిశీలన సందర్భంగా కృష్ణాజిల్లా మైలవరంలో హైడ్రామా నెలకొంది. నిబంధనల ప్రకారం ఒకరి నామినేషన్‌ను రద్దు చేయాల్సింది ఉండగా మరొకరి నామినేషన్ రద్దు చేశారు రిటర్నింగ్ అధికారి. వివరాల్లోకి వెళితే.. ప్రజాశాంతి పార్టీ తరపున మైలవరంలో షేక్ షరీఫ్, బోగోలు వెంకట కృష్ణారావు నామినేషన్లు దాఖలు చేశారు. తరువాత బోగోలు వెంకట కృష్ణారావు బీఫారం రద్దుచేస్తూ షరీఫ్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అధికారిక లేఖను ఇచ్చారు. ఈ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి షరీప్ సమర్పించారు. నిబంధనల ప్రకారం వెంకటకృష్ణారావు భీఫారంను రద్దుచేయాల్సిన రిటర్నింగ్ అధికారి.. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిళ్లతో షరిఫ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు. వెంకట కృష్ణారావు బీ ఫారంని కొనసాగించాలంటూ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిడితో షరీఫ్‌ను భీఫారంను రద్దు చేసినట్లు సమాచారం. మొదట ఎలాంటి నిర్ణయం తీసుకొని సదరు అధికారి.. బయటకు వెళ్లిపోయి కాసేపటికి తిరిగి వచ్చి వెంకట కృష్ణారావును ప్రజాశాంతి అభ్యర్థిగా గుర్తించినట్లు ప్రకటించారు. దీంతో షరీఫ్ వర్గీయులు ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ అధికారి వైఖరిని నిరసిస్తూ ఎండీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మంత్రి దేవినేని ఆదేశాలతోనే రిటర్నింగ్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. కాగా ఓట్లను చీల్చేందుకై వైఎస్సార్సీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లున్న వ్యక్తులను ప్రజాశాంతి పార్టీ తమ అభ్యర్థులుగా పోటీలోకి దించిన విషయం తెలిసిందే. నామినేషన్ల పర్వం చివరి రోజున ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఇలాంటి తిరకాసుకు పాల్పడ్డారు. మైలవరంలో కూడా వెస్సార్సీపీ అభ్యర్థి వెంకటకృష్ణ ప్రసాద్ పేరును పోలీఉన్న వ్యక్తి వెంకట కృష్ణారావుతో నామినేషన్ వేయించారు. ఈ తతంగం చూస్తే తెలుగుదేశం పార్టీ, ప్రజాశాంతి పార్టీల మధ్య అంతర్గత బంధం ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తును తీసుకుంది. హెలికాప్టర్ రెక్కలు వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తును పోలి ఉన్నాయి. ఇక ఆ పార్టీ జెండా రంగుల విషయానికొస్తే వైఎస్సార్సీపీ జెండా రంగులను పోలి ఉండటం గమనార్హం. -
డబ్బులు చూసి షాక్ అయిన కస్టమర్..!
సాక్షి, మైలవరం/విజయవాడ : ఏటీఎం నుంచి నగదు డ్రా చేసిన ఓ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. అతను డ్రా చేసిన సొమ్ములో చిరిగిపోయిన రెండువేల నోట్లు రావడమే దీనికి కారణం. ఈ ఘటన మైలవరంలో వెలుగుచూసింది. నారాయణ థియేటర్ కాంప్లెక్స్‌లో గల స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో మద్దాలి గణేష్ అనే స్థానికుడు రూ.30 వేలు డ్రా చేయగా.. అందులో10 రెండువేల రూపాయల నోట్లు చినిగిపోయినవి రావడంతో అతను నిర్ఘాంతపోయాడు. ముప్పయి వేలలో ఇరవై వేలు చిరిగిపోయినవి వచ్చాయని వాపోయాడు. ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్యాంకులు సైతం ఇలా వినియోగదారులను మోసం చేస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలా చాలాసార్లు చిరిగిన నోట్లు పెట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. -
కోటిన్నర కరెన్సీతో ‘ధన గణపతి’
మంగళగిరి టౌన్/మైలవరం: వినాయక నవరాత్రులను పురస్కరించుకొని గుంటూరు జిల్లా మంగళగిరి పూలమార్కెట్ సెంటర్లో సంకా బాలాజీగుప్తా బ్రదర్స్, వర్తక వ్యాపారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడికి మంగళవారం రూ.కోటిన్నర కరెన్సీ నోట్లతో ధనగణపతిగా అలంకరించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ధనగణపతిని వీక్షించడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. కాగా, కృష్ణా జిల్లా, మైలవరం 3వ వార్డులో శ్రీబాల గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రూ.లక్షతో కరెన్సీ గణపతిగా అలంకరించారు. -
‘దేవినేని నీచరాజకీయాలు చేస్తున్నారు’
-
‘వ్యక్తిగత చనువుతోనే ఆయనతో రాజకీయాలు మాట్లాడాను’
సాక్షి, అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలియడంతోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ హోంమంత్రి, వైఎస్సార్సీపీ నేత వసంత నాగేశ్వరరావు విమర్శించారు. వ్యక్తిగత పరిచయంతోనే గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నర్సింహారావుతో రాజకీయాలు మాట్లాడానని, అంతే కానీ ఎటువంటి బెదిరింపులకు పాల్పడలేదన్నారు. అధికార బలంతో బెదిరించి గుంటుపల్లి ఈఓ చేత నాపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నర్సింహారావు మా సొంత గ్రామంలో పనిచేశారు. ఆయనతో నాకు చాలా చనువు ఉంది. గుంటుపల్లిలో వైఎస్సార్సీపీ బ్యానర్లను, జెండాలను ఏకపక్షంగా తొలగిస్తున్నారని గ్రామస్తుల నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో ఈఓ నర్సింహారావు అక్కడే ఉన్నట్లు తెలియడంతో ఆయనకు ఫోన్ చేశా. పాత పరిచయం ఉండటంతో రాజకీయాలు మాట్లాడాను. అదే చనువుతో ఆయన కుటుంబం, పిల్లల గురించి అడిగాను. దానిని ఇంత నీచంగా చిత్రీకరిస్తారా? నోను ఫోన్లో బెదిరింపులకు పాల్పడినట్లు కాల్ రికార్డింగ్‌ను వక్రీకరించారు. నా అనుమతి లేకుండా కాల్ రికార్డు చేయడం ఎంత వరకు సమంజసం‘ అని వసంత నాగేశ్వరరావు ప్రశ్నించారు. మైలవరం నియోజక వర్గంలో వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజామద్దతు దేవినేని తట్టుకోలేకనే ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ జెండాలు తీయించడం, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని మండి పడ్డారు. మంత్రి దేవినేని అవినీతిని తన కుమారుడు కృష్ణ ప్రసాద్ ప్రజల్లో ఎండగడుతున్నారని నాగేశ్వరరావు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో బ్యానర్ల విషయంపై మాట్లాడటానికి ఫోన్ చేసిన నాగేశ్వరరావు, ఈవోని బెదిరించాడని టీడీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నాగేశ్వరరావుపై కేసు కూడా పెట్టారు. -
దేవినేని అరాచకాలు సాగనివ్వం: వైవీ
కృష్ణా జిల్లా: మైలవరం నియోజకవర్గంలో ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అరాచకాలను సాగనివ్వబోమని ఒంగోలు మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. మైలవరంలో వైవీ విలేకరులతో మాట్లాడుతూ..ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలను మంత్రి ఉమ గాలికి వదిలేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి భజన కార్యక్రమాలకే దేవినేని పరిమితమయ్యారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే మైలవరానికి వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ని తీసుకురావడం జరిగిందన్నారు. మంత్రి ఉమాకి ప్రజలు త్వరలోనే ఓటమి రుచి చూపించడం ఖాయమన్నారు. 250 మంది టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక అంతకు ముందు కొండపల్లి గ్రామంలో వైవీ సుబ్బా రెడ్డి వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కొండపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు బైక్ ర్యాలీ తీశారు. ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు వెంకటేశ్వరరావు కల్యాణ మండపంలో మైలవరం నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. టీడీపీ నుంచి సుమారు 250 మంది వైఎస్సార్సీపీలో చేరారు. చేరిన వారిలో కొండపల్లి మాజీ సర్పంచ్ గురవయ్య, చండ్రగూడెం మాజీ సర్పంచ్ దేవరకొండ ఆంజనేయులు, మాజీ ఉప సర్పంచ్ శీలం అనిమి రెడ్డి, గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు వేమిరెడ్డి సంజీవ రెడ్డిలు ఉన్నారు. -
దేవినేని ఉమ చిత్తుగా ఓడిపోవడానికి రెడీగా ఉండు..
సాక్షి, నందిగామ: ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...‘దేవినేని ఉమ నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు. హత్యా రాజకీయాలు, ఆర్థిక నేరాలు చేసింది నీవే. వంగవీటి మోహనరంగా హత్యకేసులో మీ అన్న దేవినేని వెంకట రమణ ముద్దాయి కాదా?. నీ గురించి నీ అన్న గురించి ప్రజలకు తెలుసు. 2019 ఎన్నికలలో మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణప్రసాద్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. నీ వదిన ప్రణీతను చంపి నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలుసు. జలవనరుల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నదేవినేని ఉమా కనీసం తన ప్రాంత ప్రజలకు సాగునీటిని కూడా అందించలేకపోతున్నారు. ’ అంటూ ధ్వజమెత్తారు. -
139వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, మైలవరం : వైఎస్ జగన్మోహన్ రెడ్డి 139వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. బుధవారం ఉదయం ఆయన కృష్ణాజిల్లా మైలవరం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ అక్కడ నుంచి చిన్న నందిగాం క్రాస్, వెల్వడం, గణపవరం అడ్డరోడ్, గణపవరం మీదగా నూజివీడు నియోజకవర్గంలోని శోభనాపురం క్రాస్ చేరుకుని అక్కడ ప్రజలతో మమేకం అవుతారు. ఇప్పటివరకూ ఆయన 1,794.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. -
ముత్యాలంపాడు నుంచి ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, మైలవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 138వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ఆయన కృష్ణాజిల్లా ముత్యాలంపాడు శివారు నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, స్థానికులు పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఆత్కూరు మీదుగా చెవుటూరు చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను తెలసుకుంటూ ముందుకు సాగనున్నారు. కుంటముక్కల క్రాస్, గుర్రాజు పాలెం మీదుగా మైలవరం చేరుకొని బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. -
ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్
జి.కొండూరు (మైలవరం) : వాహనాల వేగాన్ని నియంత్రించి రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకరే ఓ మహిళ పాలిట యమపాశమైంది. జి.కొండూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతి చెందిన వియ్యంకురాలి దహన సంస్కారాలకు హాజరయ్యేందుకు విసన్నపేట గ్రామానికి చెందిన పెండెం భావనారాయణ, తన భార్య సత్యవతితో కలిసి శుక్రవారం నందిగామ మండలం చందర్లపాడు గ్రామానికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం స్వగ్రామానికి రాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. జి.కొండూరు సమీపంలోకి రాగానే చీకట్లో అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్ కనిపించలేదు. దీంతో వేగంగా వస్తున్న బైక్ వెనుక కూర్చున్న సత్యవతి (56) ఎగిరి కిందపడింది. ఆమె తలకు బలమైన గాయమై ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. -
కూతురి చెంతకే కన్నతల్లి
జి.కొండూరు (మైలవరం): మైలవరం శివారులోని దర్గా సమీపంలో జాతీయరహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సేగిరెడ్డిపాడు గ్రామానికి చెందిన మందా రాజేశ్వరి (19) అక్కడికక్కడే మృతి చెందగా ఆమె తల్లి మందా రూతమ్మ (40) విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచింది. తల్లీకూతురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యుల వేదనలు మిన్నంటాయి. మృతదేహాలు సందర్శించిన గ్రామస్థులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. రూతమ్మ, రాజేశ్వరి మృతదేహాలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. మండల పరిషత్ అధ్యక్షుడు వేములకొండ తిరుపతిరావు, పార్టీ మండల కన్వీనర్ మందా జక్రధరరావు (జక్రి), తదితర నాయకులు నివాళులర్పించారు. -
కన్నీటి ప్రార్థన
మైలవరం: ప్రతివారం లాగే ఈ శనివారం కూడా వారు ఆనందంగా ప్రభువు ప్రార్థనలకు బయల్దేరారు. కుటుంబమంతా ఆనందంగా కలిసి వెళ్లేందుకు సొంత ఆటో కూడా కొన్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వారిని ఒక్కసారిగా చీకటి ఆవహించింది. కాసేపటికి హాహాకారాలు.. ఆర్తనాదాలు.. నిర్జీవంగా కొందరు.. హతాశులై మరికొందరు. మైలవరం జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం వద్ద కనిపించిన భీతాకర దృశ్యాలివి. అంతా ఒకే కుటుంబం మైలవరం నుంచి మండలంలోని పుల్లూరు చర్చిలో ప్రార్థనకు వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన 11మంది ప్రయాణిస్తున్న ఆటోను జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారు మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో సగ్గుర్తి లత, ఆమె సోదరి గరికపాటి నాగమణి, సోదరుడు గరికపాటి నాగేశ్వరరావు, ఇంటర్ విద్యార్థిని మందా రాజేశ్వరి మృతిచెందారు. కాగా, మందా రూత మ్మ, పల్లెపోగు కన్యాకుమారి, పల్లెపోగు జన్ని, గరికపాటి యశస్విని, సగ్గుర్తి సుశీల, కటారపు రాణి, పల్లెపోగు జెస్సీ గాయాలపాలై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దైవ ప్రార్థనకు వెళ్తూ. మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ సగ్గుర్తి రాజు కుటుంబం కొన్నేళ్లుగా మైలవరం రామకృష్ణ కాలనీలో ఉంటోంది. ప్రతి ఆదివారం వీరు మైలవరం నుంచి స్వగ్రామమైన పుల్లూరు చర్చికి ప్రార్థనల కోసం వెళ్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లేందుకు సొంత ఆటో కొన్నారు. ఎప్పటిలాగే శనివారం మధ్యాహ్నం 11మంది కుటుంబ సభ్యులు బయల్దేరారు. విధినిర్వహణలో ఉన్న రాజు ప్రార్థనలకు వెళ్లలేదు. మైలవరం శివారులోని దర్గా వద్దకు రాగానే మృత్యురూపంలో వస్తున్న కారు వీరి ఆటోను ఢీకొంది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టి రోడ్డు పక్కకు పడిపోయింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆటోలో ప్రయాణిస్తున్న 11 మందిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోడ్రైవర్ నాగేశ్వరరావును అంబులెన్స్‌లో విజయవాడ తరలిస్తుండగా మృతిచెందాడు. మరో ఆరుగురికి గాయాలు కాగా, వారికి ప్రాథమిక చికిత్స అందించారు. వారితో పాటు కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం మత్తులోనే.. మైలవరం సమీపంలో 30వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందడానికి కారణం మద్యం మత్తులో యువకులు అతివేగంగా కారు నడపడమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు షేక్ రసూల్ పాషా, లావూడియా మనోహర్, ముత్యాల సతీష్, డి.రాహుల్, బుద్దా ప్రవీణ్‌లు తమ స్నేహితుడు బెంగళూరు వెళ్తున్న సందర్భంగా బాపట్ల బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్తున్నారు. మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతున్న వీరు ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి రాంగ్రూట్లో కుడి వైపునకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. జోగి రమేష్ పరామర్శ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి జోగి రమేష్ సందర్శించి మృతుల కుటుంబీకులను పరామర్శించారు. జోగి రమేష్‌తో పాటు పార్టీ మైలవరం మండలం అధ్యక్షుడు పామర్తి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు షేక్ కరీమ్, ఏఎంసీ మాజీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణరెడ్డి, పుల్లూరు పీఎసీఎస్ అధ్యక్షుడు సీహెచ్ రామిరెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు. మైలవరం ఎంపీపీ బి.లక్ష్మి, నాయకులు కోమటి సుధాకరరావు, మల్లెల రాధాకృష్ణ, దూరు బాలకృష్ణ కూడా పరామర్శించారు. -
ఆటోను ఢీకొన్న కారు : ముగ్గురు మృతి
-
కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
మైలవరం: కృష్ణాజిల్లా మైలవరం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందడంతో పాటు ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. మైలవరం నుంచి ఆటోలో 11 మంది వ్యక్తులు పుల్లూరు చర్చిలో ప్రార్థనలో పాల్గొనేందుకు వెళుతుండగా భద్రాచలం నుంచి మైలవరం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా ఆటో డ్రైవర్‌ను విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మైలవరం నుంచి సొంత ఆటోలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మండలంలోని పుల్లూరు గ్రామంలో ప్రార్థనలో పాల్గొనేందుకు 30వ నంబర్ జాతీయ రహదారిపై వెళుతుండగా వేగంగా వస్తున్న కారు స్థానిక దర్గా సమీపంలో ఆటోను ఢీకొట్టింది. ఆటో ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి రోడ్డు మధ్యకు రావడంతో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టిందని ప్రమాద స్థలంలో ఉన్న వారు తెలిపారు. మృతి చెందిన వారు మైలవరానికి చెందిన సగ్గుర్తి లత (40), గరికపాటి నాగమణి (25), మందా రాజేశ్వరి (17), గరికపాటి నాగేశ్వరరావు (34) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో మందా రూతమ్మ, పల్లెపోగు కన్యాకుమారి, పల్లెపోగు జన్ని, గరికపాటి యశస్విని, సగ్గుర్తి సుశీల, కటారపు రాణి, పల్లెపోగు జెస్సి ఉన్నారు. స్వల్పంగా గాయపడిన వారిలో కారులో ప్రయాణిస్తున్న షేక్ రసూల్, లావూడియా మనోహర్, ముత్యాల సతీష్, డి. రాహుల్, బుద్దా ప్రవీణ్ ఉన్నారు. కాగా పాల్వంచ నుంచి ఐదుగురు వ్యక్తులు గన్నవరం విమానాశ్రయానికి వారి బంధువును తీసుకువచ్చేందుకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. -
గెస్టు లెక్చరర్ పోస్టులకు ఆహ్వానం
మైలవరం : మైలవరం వీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లిష్, కామర్స్ (వృత్తి విద్యా కోర్సు ఒఎ) నందు అధ్యాపక పోస్టులలో గెస్టు ఫాకల్టీగా పనిచేడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్. శ్రీరామమూర్తి శుక్రవారం తెలిపారు. గెస్టు ఫాకల్టీలకు గంటకు రూ.150 చొప్పున గరిష్టంగా నెలకు రూ. 10 వేలు గౌరవ వేతనం చెల్లించబడుతుందన్నారు. ఔత్సాహికులు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలు లోగా దరఖాస్తులు కళాశాల కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తుదారులు 20వ తేదీ 10గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావాలని లె లిపారు. విశ్రాంత అధ్యాపకులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మైలవరం: అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్సార్ జిల్లా మైలవరం మండలపరి«ధిలోని ముర్రపంది పంచాయతీ నక్కవానిపల్లెలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నక్క రాంమోహన్ (28) అను రైతు తనకున్న రెండు ఎకరాలతో పాటు గుత్తకు 3 ఎకరాల భూమి తీసుకుని సాగు చేస్తున్నాడు. పంట చేతికి అందకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. పంటల సాగు కోసం దాదాపు రూ.6 లక్షల దాక అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక జీవితంపై విరక్తి చెంది పంట చేను దగ్గరే రామోహన్ పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతనిని చికిత్స కోసం జమ్మలమడుగు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. మైలవరం ఎస్ఐ అమర్నాథ్రెడ్డి కేసు నమోదు చేశారు. -
సినీ ఫక్కీలో రూ.5.35 ల క్షల చోరీ
మైలవరం : సిని ఫక్కీలో వ్యక్తి నుంచి భారీ మొత్తంలో నగదు చోరీ చేసిన సంఘటన మైలవరం బస్‌స్టాండ్‌లో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగురిపాడు గ్రామానికి చెందిన చింతా వెంకటేశ్వర్లు మిర్చి వ్యాపారి(దళారి). ఇటీవల ఖమ్మం జిల్లా తల్లాడలోని రైతు వద్ద మిర్చి కొనుగోలు చేసి గుంటూరులో విక్రయించారు. మిర్చి అమ్మిన సొమ్ము రూ. 5.35లక్షలతో పాటు పాత బాకీ రూ. లక్ష వసూలు చేసుకుని మొత్తం రెండు ప్యాకెట్లుగా కట్టి బ్యాగులో వేసుకుని రైతుకు సొమ్ము చెల్లించేందుకు తిరుపతి-మణుగూరు బస్సులో గుంటూరు నుంచి బయలుదేరాడు. మైలవరంలో మధ్యాహ్నం భోజన విరామం కోసం బస్‌స్టాండ్‌లో బస్సు ఆపడంతో అతడు దిగి టాయిలెట్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బాధితుడి వద్దకు వచ్చి బస్‌స్టాండ్‌లో దొంగతనం జరిగింది బ్యాగ్ సోదా చేయాలని చెప్పారు. బాధితుడు తన బ్యాగ్‌ను చూపించగా అందులో ఉన్న రూ. 5.35లక్షల నగదును తస్కరించి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టు పైనుంచి పడి యువకుడి మృతి
మైలవరం (కృష్ణా జిల్లా) : మైలవరం మండలం చంద్రాల గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. తాటి ముంజల కోసం తాటి చెట్టు ఎక్కిన సత్యాల గోపాలరావు(27) అనే యువకుడు ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. -
ఎంసీఏ విద్యార్థిని ఆత్మహత్య
మైలవరం (కృష్ణా జిల్లా) : మైలవరంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో కె.చంద్రిక(20) అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. చంద్రిక స్థానికంగా ఉన్న లక్కిరెడ్డి బాల్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసీఏ సెకండియర్ చదువుతోంది. చంద్రిక స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట మండల ముప్పాళ్ల గ్రామం. ఘటనాస్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో తాత,మనవడు మృతి
మైలవరం (కృష్ణా జిల్లా) : మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత, మనవడు మృతిచెందారు. బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ఘటనలో తాత కొమ్మినేని వెంకటేశ్వరరావు(70) ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. మనవడు కొమ్మినేని సుధాకర్(15)ను మైలవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రియుడిని రోకలిబండతో అంతం చేసింది
మైలవరం (కృష్ణా జిల్లా) : సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ రోకలిబండతో హత్య చేసింది. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చెనపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన శాంతకుమార్ (30) అనే మహిళ జి.కొండూరు మండలానికి చెందిన పొనుసూరి బాబూ రాజేంద్ర ప్రసంగి (38) అనే వ్యక్తితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. జి.కొండూరు వెళ్లిపోదామని ప్రసంగి ఒత్తిడి తేవడంతో ఆగ్రహించిన శాంతకుమార్ మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి వద్దే ప్రియుడి తలపై రోకలి బండతో రెండు సార్లు మోదింది. తీవ్రంగా గాయపడిన ప్రసంగి అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన తర్వాత శాంతకుమార్ రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. -
బాలింత పట్ల కామాంధుడి అసభ్య ప్రవర్తన
మైలవరం (కృష్ణా జిల్లా) : ఆస్పత్రిలో ప్రసవమై వైద్య చికిత్సలో ఉన్న బాలింత పట్ల ఓ కామాంధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మైలవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... రెడ్డిగూడెం మండలం నాగులూరుకు చెందిన ఓ మహిళ మూడు రోజుల క్రితం మైలవరంలోని విజయవాడ బస్టాప్ వెనుక గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవించింది. కాగా తారకరామ నగర్‌కు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంటాడు. శనివారం సాయంత్రం రామకృష్ణ ఆస్పత్రిలోకి ప్రవేశించి సదరు బాలింత బెడ్ దగ్గరకు వెళ్లాడు. డాక్టర్ గారు పంపారు, వైద్య పరీక్షలు చేయాలంటూ అక్కడున్న అటెండెంట్‌ను బయటకు పంపించాడు. తర్వాత బాలింత శరీరాన్ని చేతులతో తడుముతూ అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు తన సెల్ఫోన్లో ఫొటోలు కూడా తీశాడు. ఆస్పత్రి సిబ్బంది గమనించేసరికి పారిపోయే ప్రయత్నం చేశాడు. రోగి బంధువులు రామకృష్ణను పట్టుకుని చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. -
మైలవరానికి మరో టీఎంసీ నీరు
ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరు తాగునీటి అవసరాల కొరకు మరో టీఎంసీ నీటిని అవుకు జలాశయం నుంచి మైలవరానికి విడుదల చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి భారీ నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమను కలిసి విన్నవించారు. మంగళవారం హైదరాబాదులో మంత్రిని కలిసిన ఆయన గతంలో తాగునీటి అవసరాల గురించి అవుకు రిజర్వాయరు నుంచి 2 టీఎంసీలు మైలవరానికి వదిలి అక్కడి నుంచి ప్రొద్దుటూరుకు నీరు వదలాలని కోరినట్లు వివరించారు. ఈ మేరకు ఇప్పటివరకు అవుకు నుంచి మైలవరానికి 1 టీఎంసీ నీరు విడుదల చేశారని తెలిపారు. ఇందులో 0.60 టీఎంసీల నీరు వచ్చినట్లు తెలిపారు. కాగా 0.30 టీఎంసీల నీరు మైలవరం దక్షిణ కాలువ ద్వారా ప్రొద్దుటూరుకు వదులుతున్నారని వివరించారు. మరో టీఎంసీ నీటిని విడుదల చేయాలని కోరారు. దీనిపై కర్నూలు సీఈని మరొక టీఎంసీ నీరు విడుదలచేయాలని మంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ఇందులో 0.80 టీఎంసీల నీటిని ప్రొద్దుటూరు తాగునీటి అవసరాల కొరకు నిల్వ ఉంచాలని తెలిపారు. ఈ నీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వదలాలని సీఈని మంత్రి ఆదేశించినట్లు లింగారెడ్డి తెలిపారు. -
లడ్డూ కపుల్...
మైలవరం : ఏమిటీ ఈ చిత్రం విచిత్రంగా ఉంది కదూ.. భారీ స్థూలకాయులను పెళ్లి దుస్తుల్లో చూసి ఆశ్చర్యపోతున్నారా... ఇదేదో ఫేస్బుక్ ఫన్ పిక్ అనుకుంటే పొరపాటే... మైలవరంలో గురువారం ఈ భారీ స్థూలకాయులిద్దరూ ఒకటయ్యారు. ఈ అపూర్వ, అరుదైన కల్యాణాన్ని తిలకించేందుకు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి నూతన జంటపై ఆశీస్సుల అక్షింతలు కురిపించారు. అబ్బాయి బాగోలేదనో... అమ్మాయి లావుగా ఉందనో చిన్నచిన్న కారణాలతో పెళ్లిల్లు రద్దు చేసుకుంటున్న ఈ రోజుల్లో 125 కేజీల బరువున్న యువతికి 130 కేజీల బరువు ఉన్న యువకుడితో జరిగిన ఈ పెళ్లి పట్టణంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మైలవరం సుగాలి తండాకు చెందిన సబావతు రామారావు కుమార్తె నాగమణి(20)కి ఎ.కొండూరు మండలం రేపూడి తండాకు చెందిన బాణావతు నాని(22)తో పొందుగల రోడ్డులోని బెరియన్ ఫెలోషిప్ చర్చిలో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజల సమక్షంలో కల్యాణం జరిగింది. వివాహం చేసుకోవడానికి మంచి మనసు ఉంటే చాలు.. రూపం ప్రధానం కాదని నిరూపించింది ఈ జంట. చిన్నతనంలో వెన్నులోకి నీరు వెళ్లడంతో ఊబకాయం వచ్చిందని భారీ కాయంవల్ల ఎటువంటి ఇబ్బందులు పడలేదని అన్ని పనులు చక్కగా చేసుకుంటున్నానని నాని తెలిపారు. పెద్దలు కుదిర్చిన వివాహమని ఇద్దరం ఒకరికి ఒకరం అన్యోన్యంగా కలిసిమెలసి ఉంటామంటున్న లడ్డూబాబు జంటకు ‘విష్ యూ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ చెప్పేద్దామా...! -
భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలి ఆరుగురు మృతి
-
భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలి ఆరుగురు మృతి
కడప: నిన్న రాత్రి ఎడితెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని మైలవరం మండలం నవాబుపేటలో విషాదం అలుముకుంది. సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో మట్టి మిద్దె కూలి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 15 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా భారీ పంట నష్టం కూడా వాటిల్లింది. మూడు రోజులుగా పెనుగాలులు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. గాలి బీభత్సానికి చాలాచోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. ఉద్యాన పంటలు నేలమట్టం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు, టవర్లు నేల కొరిగాయి. దీంతో ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఉద్యాన పంటలకు సంబంధించి తీరా పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి అన్నదాతపై కక్ష కట్టడంతో రైతన్నలు విలవిల్లాడుతున్నారు. సుడిగాలుల నేపథ్యంలో విద్యుత్‌స్తంభాలు విరిగిపడుతుండటంతో రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల్లోని పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. -
వైఎస్ఆర్ సిపి నాయకుల ప్రచారం
-
వైఎస్ఆర్ జనభేరి సభలు
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ప్రభంజనం
-
'నిజాయితీ ఓ వైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు'
మైలవరం: ఏ నాయకుడైతే పేదవాడి కష్టాలను తెలుసుకుంటాడో ఆ నాయకుడినే మన నేతగా ఎన్నుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్ షోలో జగన్ ప్రసంగించారు. విశ్వసనీయత, నిజాయతీ ఓ వైపు ఉంటే కుళ్లు, కుతంత్రాలు మరోవైపు ఉన్నాయని అన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే 5 సంతకాలతో పాటు మరో 6 పనులు చేస్తానని ఆయన హామియిచ్చారు. అమ్మఒడి పథకం అమలుపై తొలి సంతకం చేస్తానని చెప్పారు. అవ్వాతాతల కోసం రెండో సంతకం చేస్తానని వెల్లడించారు. రైతన్నకు భరోసా ఇస్తూ మూడో సంతకం పెడతానని అన్నారు. వ్యవసాయరంగంలో గొప్ప మార్పులు తెస్తానని చెప్పారు. అక్కా, చెల్లెళ్ల కళ్లల్లో సంతోషం కోసం నాలుగో సంతకం చేస్తానని అన్నారు. ఇల్లు, కార్డులేని నిరుపేదల కోసం 5వ సంతకం పెడతానని హామీయిచ్చారు. ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులు తెస్తానని, ఏ గ్రామంలో కూడా బెల్టుషాపు లేకుండా చేస్తానని వైఎస్ జగన్ హామీయిచ్చారు. -
విశ్వసనీయతే జగన్ ఆయుధం
మైలవరం,న్యూస్‌లైన్,విలువలకు, విశ్వసనీయతకు, ఇచ్చినమాటకు కట్టుబడే వ్యక్తి జగన్ అని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పేర్కొన్నారు. జయభేరిలో భాగంగా దొమ్మరనంద్యాల నుంచి వేపరాల వరకు శుక్రవారం సాయంత్రం రోడ్‌షో జరిగింది. ఈ సందర్భంగా దొమ్మరనంద్యాల గ్రామ చావిడి దగ్గర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామంలో అధిక శాతం ఉన్న చేనేత కార్మికులను రాబోయే తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. జనతావస్త్రాలను పునరుధ్ధరీకరించి, సబ్సిడీపై చేనేతలకు నూలును అందించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. నేతన్నల అత్మహత్యలకు అడ్డుకట్ట వేసి అన్నివిధాల ఆదుకుంటామన్నారు. చేనేత కార్మికులకు వడ్డీలేని రుణాలను ఇస్తామన్నారు. గతంలో చేనేతలు తీసుకున్న రుణాలు పూర్తిస్తాయిలో రుణమాఫీ కాలేదని బడ్జెట్లో రూ. 316 కోట్లు కేటాయించగా అందులో రూ. 96 కోట్లతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ సరిపెట్టిందన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్ ఆశయాలు జగన్‌తోనే సాధ్యమన్నారు. సభలో కడప ఎంపీ అభ్యర్ధి అవినాష్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బిరామిరెడ్డి(భూపేష్) తదితరులు పాల్గొన్నారు. అనంతరం వేపరాల వరకు రోడ్‌షో జరిగింది. -
మైలవరానికి 2 టీఎంసీల నీరు
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని మైలవరం డ్యామ్‌కు అవుకు రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి. అరవిందరెడ్డి మెమో నెంబర్ 25789/డబ్ల్యుఆర్జి/2013 ద్వారా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మైలవరం జలాశయానికి నీటిని విడుదల చేయాలని త ద్వారా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీరు, ఆర్టిపిపి నీటి అవసరాలు తీర్చాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నవంబర్ 21న విన్నవించారు. ఆ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వం 2 టీఎంసీలు నీటి విడుదలకు ఆమోదం తెలిపింది. ఇదే విషయమై ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో పాటు, రాష్ట్ర యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.