
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సత్యవతి
జి.కొండూరు (మైలవరం) : వాహనాల వేగాన్ని నియంత్రించి రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకరే ఓ మహిళ పాలిట యమపాశమైంది. జి.కొండూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతి చెందిన వియ్యంకురాలి దహన సంస్కారాలకు హాజరయ్యేందుకు విసన్నపేట గ్రామానికి చెందిన పెండెం భావనారాయణ, తన భార్య సత్యవతితో కలిసి శుక్రవారం నందిగామ మండలం చందర్లపాడు గ్రామానికి వెళ్లారు.
కార్యక్రమం అనంతరం స్వగ్రామానికి రాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. జి.కొండూరు సమీపంలోకి రాగానే చీకట్లో అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్ కనిపించలేదు. దీంతో వేగంగా వస్తున్న బైక్ వెనుక కూర్చున్న సత్యవతి (56) ఎగిరి కిందపడింది. ఆమె తలకు బలమైన గాయమై ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment